Fashion collection
-
రిలయన్స్ ‘యూస్టా’ స్టోర్ ప్రారంభం
రిలయన్స్ రిటైల్ తన వినియోగదారులకు మరిన్ని బ్రాండ్లను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సమీపంలో నాగోల్-అల్కపురి క్రాస్ రోడ్ వద్ద కొత్తగా ‘యూస్టా’ ఫ్యాషన్ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ స్టోర్లు ఉన్నాయని కంపెనీ అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశంలో మరింతగా తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.దేశంలోని యువత అధికంగా ఇష్టపడే స్టైల్స్‌లో విభిన్న మోడల్స్‌ను యూస్టా అందిస్తోందన్నారు. ప్రస్తుతం యూస్టా స్టోర్స్ మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో విస్తరించినట్లు చెప్పారు. ప్రీమియం మోడల్స్‌తోపాటు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఫ్యాషన్ ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..యువతను ఆకర్షించేలా చాలా ఫ్యాషన్ రిటైల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అందుబాటు దరల్లోనే తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. గార్మెంట్ పరిశ్రమ కూడా స్థానికంగా ఎంతో వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ఇతర దేశాలకు చేసే ఎగుమతులు అధికమవుతున్నాయి. స్థానికంగా మంచి ఉత్పత్తులు అందిస్తే సంస్థల బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. -
విజయవాడ : హై లైఫ్ ఎగ్జిబిషన్లో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
విజయవాడలో సందడి చేసిన సినీ నటి తేజస్వి మదివాడ (ఫొటోలు)
-
ఫ్యాషన్ ఎగ్జిబిషన్ మెరిసిన సీరత్ కపూర్, సాన్వే మేఘనా (ఫొటోలు)
-
ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో మెరిసిన నటి దివి, దీక్షా పంత్ (ఫొటోలు)
-
ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ , ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో నటించిన షాలిని పాసి లేటెస్ట్ సెన్సేషన్. ఢిల్లీకి చెందిన ఈమె సోషల్ యాక్టివిస్ట్, ఆర్టిస్ట్ కూడా. ఫ్యాషన్‌కు మారు పేరు. మరోవిధంగా చెప్పాలంటే వాకింగ్ ఫ్యాషన్ఎగ్జిబిషన్. అదిరిపోయే డ్రెస్‌లు, అద్భుతమైన హెడ్‌పీస్‌లు, ఆకట్టుకునే బ్యాగ్‌లు ఇలా షాలిని స్టైల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె బ్యాగులు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి.ఆమె బ్యాగుల కలెక్షన్ చాలా స్పెషల్మాత్రమేకాదు, ధర కూడా కళ్లు చెదిరే రేంజ్‌లోనే. పావురాలు, చిలుకలు, పాత కెమెరాలు ఇలా రకరకాల షేపుల్లో ఆమె బ్యాగులు మెస్మరైజింగ్‌గా ఉంటాయి.ఒక ఎపిసోడ్లో, షాలిని క్లాసిక్ క్లిక్ కెమెరాను పోలి ఉండే క్లచ్‌తో కనిపించింది. పాతకాలపు కెమెరా ఆకారంలో క్రిస్టల్-స్టడెడ్ హ్యాండ్‌బ్యాగ్ ధర సుమారు 5 లక్షల రూపాయలు. మరో ఎపిసోడ్లో ఆమె చేతిలో మెరిసిన ఫ్లెమింగో క్లచ్ ధర అక్షరాలా రూ. 5,400,000.బ్రిక్ ఫోన్ బ్యాగ్ ధర రూ. 600,000, ఇంకా 8 లక్షల, 30వేల విలువ చేసే టీవీ టెస్ట్ స్క్రీన్ బ్యాగ్, దాదాపు రూ. 3 లక్షల విలువ చేసే క్రిస్టల్ హార్ప్ క్లచ్‌తో ఆకర్షణీయమైన లుక్‌లో ఆకట్టుకుంటోంది. ఇవి కాకుండా, షాలిని జెల్లీ ఫిష్, టెడ్డీ బేర్స్, చిలుకలు, గులాబీలు, కుక్కలు , ఇతర ఫన్నీ బ్యాగ్స్కూడా ఆమె సొంతం.కాగా షాలిని పాసి భర్త బిలియనీర్,పాస్కో గ్రూప్ ఛైర్మన్ సంజయ్ పాసి. ఈ దంపతుల రాబిన్ రాబిన్ . ఇక ఈ సిరీస్‌లో మహీప్ కపూర్, నీలం కొఠారి, భావన పాండే, రిద్ధిమా కపూర్ సాహ్ని, సీమా సజ్దేహ్ మరియు కళ్యాణి సాహా చావ్లా కూడా నటించారు -
రిలయన్స్ రిటైల్ విస్తరణ
రిలయన్స్ రిటైల్ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. యువతకు ఫ్యాషన్ ఉత్పత్తులను అందించే ‘అజార్ట్’ బ్రాండ్ స్టోర్లను పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో 12 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు తెలిపింది. జైపూర్, ఉదయపూర్, రాయ్‌పూర్, దెహ్రాదూన్, గోరఖ్‌పూర్, రాంచీ, బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.ఇప్పటికే బెంగళూరులో అజార్ట్ బ్రాండ్ పేరుతో స్టోర్లను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్ వీటి సంఖ్యను ఐదుకు పెంచింది. ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ సీఈఓ అఖిలేష్ ప్రసాద్ మాట్లాడుతూ..‘అజార్ట్ బ్రాండ్‌ను 2022లో స్థాపించాం. క్రమంగా బ్రాండ్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాం. యువత నుంచి ఈ బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతోంది. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఈ బ్రాండ్ యువతకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. వినియోగదారుల జీవనశైలిని ప్రతిబింబించేలా, మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించేలా కంపెనీ పనిచేస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్‌ల ఆడిట్పండగ సీజన్లో చాలా కంపెనీలు తమ వ్యాపారాలు విస్తరించాలని యోచిస్తుంటాయి. ఫెస్టివల్ నేపథ్యంలో తమ బ్రాండ్ ఉత్పత్తులకు ఆదరణ ఉంటుందని నమ్ముతాయి. కంపెనీ ఉత్పత్తులు వినియోగదారులకు నచ్చితే తదుపరి గిరాకీ ఏర్పడుతుందని భావిస్తాయి. -
ఫెస్టివ్ లుక్.. ఫ్యాషన్ క్లిక్..
వరుసగా రెండు పెద్ద పండుగలు వచ్చేస్తున్నాయి. పుట్టినరోజులు, నైట్ పార్టిలు, వార్షికోత్సవాలు తదితర సందర్భాల్లో ధరించే దుస్తులతో నగరవాసులు అత్యాధునిక ఫ్యాషన్‌కు కేరాఫ్ అ‘డ్రెస్’లా మారిపోతారు. అయితే పండుగల సందర్భం మాత్రం పూర్తిగా విభిన్నం. తమ ఫెస్టివల్ లుక్ మోడ్రన్‌గా మెరిపించడంతో పాటు ట్రెడిషన్‌కు కేరాఫ్‌గా కూడా చూపించాలని తపిస్తారు. అలాంటి ఫ్యాషన్ ప్లస్ ట్రెడిషన్ ప్రియులైన నగర యువత కోసం నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ పలు సూచనలు అందిస్తోంది. ఇటీవల గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్ ద్వారా శారీ డ్రేపింగ్ స్టైల్స్ ప్రభావితమవుతున్నాయి. ముందుగా కుట్టిన చీరలు, ధోతీ స్టైల్ ప్యాంట్ తరహా చీరలు, కేప్ స్టైల్ డ్రేప్స్.. వంటి వినూత్న పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ స్టైల్స్‌లో అసిమెట్రికల్ కట్స్, స్ట్రక్చర్డ్ సిల్హౌట్‌లతో సహా పాశ్చాత్య ఫ్యాషన్ మేళవింపులతో విభిన్న రకాల మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇవి సంప్రదాయ చీరల్ని అత్యాధునికంగా మారుస్తాయి. వీటితోపాటు అనేక రకల సంప్రదాయ దుస్తులు ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి..డిజైనర్స్ సూచనలు.. పండుగ సీజన్లో స్టైలి‹Ùగా, సౌకర్యవంతంగా ఉండటానికి లైమ్ గోటా పట్టి ఉన్న చందేరి కార్డ్ సూట్ సెట్‌ను ఎంచుకోవచ్చు. ఇది మోనోక్రోమాటిక్ లుక్స్‌కి రంగురంగుల వైబ్స్‌ని జోడిస్తుంది. ఎంబ్రాయిడరీ చేసిన ఐవరీ కో–ఆర్డ్ షరారా పండుగ దుస్తులకు పర్ఫెక్ట్ క్లాసిక్ చిక్ రూపాన్ని అందిస్తుంది. బ్లేజర్లు కార్పొరేట్ స్టైల్‌కి మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ, ఇటీవల ఆల్–టైమ్ ఫేవరెట్‌గా మారాయి. ఒక ఎంబ్రాయిడరీ బ్లేజర్‌ను డ్రేప్డ్ స్కర్ట్ లేదా ధోతీ ప్యాంట్‌తో మేళవించాలి. నడుముకు బెల్ట్‌తో ఏ సమయంలోనైనా ఈ డ్రెస్ బెస్ట్ ఎంపికగా నిలుస్తుంది. ఈ నవరాత్రి రోజుల్లో మస్టర్డ్ షరారా చీర ధరిస్తే చాలా స్టైలి‹Ùగా, తేలికగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది. డ్రేప్డ్ బాటమ్తో సెట్ చేసే డ్రెస్సులు ఇటీవల ట్రెండ్‌లో ఉన్నాయి. పర్ఫెక్ట్ ఈవెనింగ్ వేర్ కోసం డ్రేప్డ్ స్కర్ట్, ఎంబ్రాయిడరీ క్రేప్‌తో జత చేయాలి. అదనపు డోస్ కోసం సీక్వెన్స్ జుతీస్ బెస్ట్. పేస్టెల్, బ్రైట్ కలర్స్‌తో ఓ సరికొత్త చిక్ కాంబినేషన్. ఈ ఆఫ్–వైట్– పింక్ కేడియా టాప్, షెల్– మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన షార్ట్ అవుట్‌ఫిట్‌తో ప్రకాశవంతమైన పసుపు ధోతీతో జతగా ధరించవచ్చు. ఆధునిక– సంప్రదాయాల సమ్మేళనంతో డిజైన్ చేసిన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఉన్న స్కార్లెట్ సిల్క్ లెహెంగా పలాజో సెట్ ధరిస్తే..కలల రూపం సొంతమవుతుంది.. సల్వార్ కమీజ్ అందంగానూ, సౌకర్యవంతంగానూ ఉంటుంది. ప్రకాశవంతమైన రంగులతో కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్నవి ఎంచుకోవచ్చు. వివాహాలు, పండుగలు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో చనియా చోళీ ధరిస్తారు. వీటికి ఆధునిక ఉపకరణాలు, ఆభరణాలను జత చేస్తున్నారు. పిల్లల కోసమైతే తక్కువ బరువున్న ఆభరణాలను ఎంచుకోవాలి. పిల్లల దుస్తులను సొంతంగా లేదా ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవచ్చు. పిల్లలతో సరిపోలే దుస్తులను ధరించడం వల్ల యూనిక్ ఫ్యామిలీ అనిపించుకోవచ్చు. పిల్లల దుస్తులు సౌకర్యంతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పండుగ వేడుకల్లో డ్యాన్స్ చేసేటప్పుడు జారిపడకుండా ఉండేలా పొడవును, సౌకర్యాన్ని నిర్ధారించుకోవాలి. ప్రమాదాన్ని కలిగించేలా పదునైన ఉపకరణాలు, ఆభరణాలకు దూరంగా పెట్టాలి. పురుషుల కోసం.. ఎతి్నక్వేర్తో పండుగ లుక్‌ను మార్చుకోవాలని భావిస్తే.. కుర్తా కరెక్ట్. ఏ సందర్భానికైనా నప్పే కాలాతీత ఫ్యాషన్‌గా కుర్తాను ఎంచుకోవచ్చు. సరైన రీతిలో ఫిట్ అయ్యే కుర్తా–పైజామా ఎల్లప్పుడూ స్టైలిష్ లుక్‌ని అందిస్తాయి. ఇంకొంచెం కొత్తగా కనిపించాలంటే.. కుర్తాకి నెహ్రూ జాకెట్‌ని జత చేయవచ్చు. మొత్తంగా మెరిపించే సత్తా ఈ కాంబినేషన్‌కి ఉంది. అదే విధంగా షేర్వానీలు కూడా వేడుకలకు నప్పే ఎంపికలు. పండుగలకు ఇవి సరైన ఛాయిస్. అలాగే దీపావళి పారీ్టలకు కూడా కరెక్ట్‌గా నప్పుతాయి. ఎరుపు రంగు షేడ్.. సంప్రదాయ పండుగల్లో చాలా అర్థవంతమైన వర్ణంగా పేర్కొంటారు. నేవీబ్లూ, బ్లాక్, వైట్, ప్లమ్, ఆలివ్ గ్రీన్.. కూడా నప్పే ఎంపికలే. యాక్సెసరీస్... భారీ ఆభరణాలను ఉపయోగించే బదులు బ్యాంగిల్స్, జూకాలు (చెవిపోగులు), బిందీలు, హెయిర్‌పిన్ వంటి తక్కువ బరువున్న వాటిని యాక్సెసరీస్‌గా ఎంచుకోవాలి. -
Fashion: మై వార్డ్రోబ్: క్రియేటివ్‌గా.. హుందాగా..!
మైండ్, బాడీ ఫిట్‌గా ఉంటే డ్రెస్సింగ్ కూడా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. ‘జిమ్‌లో వర్కవుట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే, మన వార్డ్రోబ్ మైండ్ ఎక్సర్సైజ్’ అంటున్నారు హైదరాబాద్ వాసి ఫిట్నెస్ ట్రైనర్ అనుప్రసాద్. జిమ్వేర్తో పాటు రెగ్యులర్, పార్టీవేర్ విషయంలో తీసుకునే స్పెషల్ కేర్ గురించి అనుప్రసాద్ మాటల్లో...‘‘ఉదయం ఏ డ్రెస్ వేసుకోవాలనేది ప్రతిరోజూ ఆలోచించేలా చేస్తుంది. అందుకే, క్యాజువల్ వేర్‌గా కొన్ని, సందర్భానుసారంగా వార్డ్రోబ్ను సెట్ చేసుకుంటాను. సాధారణంగా తక్కువ డబ్బులతో డ్రెస్ ఎంపిక చేసుకొని, రిచ్‌గా ఉండేలా కనిపించడానికి ప్లాన్ చేస్తుంటాను. ఇండోవెస్ట్రన్ డ్రెస్‌తోనూ హుందాతనాన్ని, మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ స్టైల్‌గా కనిపించవచ్చు. పెయింటింగ్స్ వేస్తుంటాను కాబట్టి కలర్ కాంబినేషన్స్ విషయంలో అవగాహన ఉంది. చాలా వరకు మ్యాచింగ్ గురించి ఆలోచన చేయను. శారీస్ మీదకు కాంట్రాస్ట్, క్రాప్‌టాప్స్, ష్రగ్స్ కూడా సెట్ చేస్తాను. కాటన్స్కి ఎక్కువ ్రపాధాన్యత ఇస్తాను. బెస్ట్ డ్రెస్డ్ అవార్డ్..మిసెస్ ఇండియా తెలంగాణ బెస్ట్ డ్రెస్డ్ ఈవెంట్ (2019)కి క్రియేటివ్‌గా ఆలోచించాలనుకున్నాను. శారీ, బ్లౌజ్‌కి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు.. మొదలైనవాటితో నేనే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేశాను. ఆ శారీనే కట్టుకున్నాను. రెండు వేల రూపాయల్లో ఆ శారీని తయారుచేసి, ప్రదర్శించి, అవార్డు దక్కించుకున్నాను.పూసలు గుచ్చి..లంగా ఓణీ, పట్టు చీరలు సంప్రదాయ వేడుకల సందర్భాలలో కట్టుకుంటాను. దీంట్లోనే ప్రత్యేకంగా కనిపించాలంటే బ్లౌజ్ సింగిల్ హ్యాండ్‌కి పూసల హారాలు లేయర్లు గుచ్చి, నాట్ చేస్తాను. దాదాపు నెలకు మూడు, నాలుగు ఈవెంట్లకు హాజరవుతుంటాను. అందుకు కొత్తదనం, నిండుదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.జిమ్ టీ షర్ట్స్..శారీస్‌కు సాధారణ బ్లౌజులే కాదు జిమ్‌కు వేసుకునే టీ షర్ట్స్ కూడా వాడతాను. బ్లాక్ క్రాప్‌టాప్ కాటన్ శారీకి వాడతాను. మంచి కలర్ కాంబినేషన్స్ ఉండేలా, సింపుల్ లుక్‌ని క్రియేట్ చేస్తాను. జిమ్‌లో మన కదలికలకు తగ్గినట్టు ఫ్లెక్సిబుల్ డ్రెస్ ఉండాలి. క్వాలిటీ కూడా చూడాలి. క్యాజువల్ వేర్‌గా జీన్స్, టీషర్ట్స్ మాత్రమే కాదు లాంగ్ స్కర్ట్స్ కూడా ఉపయోగిస్తాను.టై అండ్ డై చేస్తాను..వైట్ కాటన్ మెటీరియల్ తెప్పించుకొని, టై అండ్ డై టెక్నిక్‌తో కొత్త డిజైన్స్ సృష్టిస్తుంటాను. ఒక శారీకైతే వేరుశనగ గింజలను ముడివేసి, పెయింట్ చేశాను. త్రీడీ పెయింటింగ్స్ చేస్తుంటాను. ఏ వేస్ట్ మెటీరియల్ ఉన్నా దానిని అందంగా క్రియేట్ చేస్తాను. ఇండిపెండెంట్స్ డే వంటి అకేషన్స్‌కి ఎంచుకున్న శారీకి క్రాప్‌టాప్‌తో మ్యాచ్ చేశాను.జ్యువెలరీ తయారీ..తక్కువ ధరలో జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. కొంచెం సమయం కేటాయిస్తే చాలు అలాంటి ఫ్యాషన్ జ్యువెలరీని మనమే ఇంకా తక్కువ ధరలో తయారుచేసుకోవచ్చు. బెల్ట్‌తో మరో స్టైలిష్ లుక్ వచ్చేలా చూసుకుంటాను. అలా.. క్లే జ్యువెలరీ, థ్రెడ్ జ్యువెలరీ నేనే తయారు చేసుకుంటాను’’ అని వివరించారు ఈ ఫిట్నెస్ ట్రైనర్.ఇవి చదవండి: 'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది! -
ఎన్నెన్నో వర్ణాలున్నా కానీ.. నలుపు, తెలుపు రంగులకున్నంత క్రేజ్..
ఎన్నెన్నో వర్ణాలు.. కానీ నలుపు, తెలుపు రంగులకున్నంత క్రేజ్ ఇంకే కలర్‌కూ ఉండదు! ఆ రెండిటినీ కలిపితే కనిపించే రిచ్‌నెస్‌ని చూస్తూండిపోవలసిందే! అదో క్లాసిక్ కాంబినేషన్! దాన్ని ఇంటికీ అద్దితే.. ఆ అభిరుచిని మెచ్చుకోని అతిథి ఉండరు! ఓనర్స్ ప్రైడ్.. నెయిబర్స్ ఎన్వీగా ఫీలయ్యేలా బ్లాక్ అండ్ వైట్‌ని ఇంటి అలంకరణలో మిళితం చేయాలంటే ఈ కింది చిట్కాలను ఫాలో అయితే సరి..!గోడలు, ఫర్నిచర్, ఆర్ట్.. ఎందులోనైనా తెలుపు రంగును డామినేట్ చేస్తూ ఒక వంతు నలుపు రంగు ఉండేలా చూసుకోవాలి. మన కళ్లు సహజంగా నల్లటి వస్తువులను ఆకర్షిస్తాయి. అందుకే వాటిని తక్కువగా ఉపయోగించాలి.ఏ స్థలానికి లేదా గదికి ఎంతమేర బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అవసరమో స్కేల్ సాయంతో సెలెక్ట్ చేసుకోవాలి. అంత కచ్చితత్వాన్ని పాటిస్తేనే ఈ డిజైన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.నలుపు– తెలుపు కాంబినేషన్లో చెక్స్ డిజైన్ని జోడించవచ్చు.అలంకరణలో తెల్లని గోడపైన నల్ల రంగులో సంగీత పరికరాలు, ప్యాటర్న్ ఫ్రేమ్‌లు, ఐరన్ లైట్స్ వంటివి వాడుకోవచ్చు.నలుపు– తెలుపు డిజైన్లలో కూడా ఇతర షేడ్స్ ఉంటాయి. కలర్స్‌ని న్యూట్రల్‌గా ఉపయోగించడం వలన డిజైన్లలో రిచ్‌లుక్ వస్తుంది.గది అంతా వైట్ పెయింట్ ఉండి మిగతా అలంకరణకు చాకోలెట్, నలుపు రంగులో ఉండే పెయింట్స్, వుడెన్ షో పీసెస్, కుండలు, కుండీలు, బుక్ ర్యాక్స్ వంటివీ అలంకరణకు ఉపయోగించవచ్చు.బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ని ఎంచుకుంటే.. దాన్ని మనకు నచ్చినట్టు సులభంగా మార్చుకునే వీలుంటుంది. -
Kalpana Shah: 'The Whole 9 Yards' దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది..
చీర.. సంప్రదాయ కట్టే! కానీ ఆధునికంగానూ ఆకట్టుకుంటోంది! క్యాజువల్, కార్పొరేట్ నుంచి రెడ్ కార్పెట్ వాక్, స్పెషల్ సెలబ్రేషన్స్ దాకా సందర్భానికి తగ్గ కట్టుతో ‘శారీ’ వెరీ కన్వీనియెంట్ కట్టుగా మారింది! అలా ఆ ఆరు గజాల అంబరాన్ని పాపులర్ చేసిన క్రెడిట్ శారీ డ్రేపర్స్కే దక్కుతుంది! ఆ లిస్ట్‌లో కల్పన షాహ్.. ఫస్ట్ పర్సన్!కల్పనా షాహ్ ముంబై వాసి. ఆమెకిప్పుడు 75 ఏళ్లు. 1980ల్లో బ్యుటీషియన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ సమయంలోనే ఒకసారి తన కమ్యూనిటీలో జరిగిన ఓ ఫంక్షన్‌కి ఆమె హాజరైంది. అప్పుడు ఆ హోస్ట్‌కి చీర కట్టడంలో సాయపడింది. ఆ కట్టు ఆ వేడుకకు హాజరైన ఆడవాళ్లందరికీ నచ్చి కల్పనను ప్రశంసల్లో ముంచెత్తింది. అప్పటి నుంచి ఆమె చీర కట్టునూ తన ప్రొఫైల్‌లో చేర్చింది. అలా 1980ల్లోనే ‘శారీ డ్రేపర్’ అనే ప్రొఫెషన్ని క్రియేట్ చేసింది కల్పన. అది మొదలు ఆమె పేరు సామాన్యుల నుంచి సెలబ్రిటీల స్థాయికి చేరింది. ముంబై ఫ్యాషన్ ప్రపంచమూ కల్పన గురించి విన్నది.ప్రముఖ డిజైనర్స్ అంతా తమ ఫ్యాషన్ షోలకు ఆమెను ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఘాఘ్రా నుంచి దుపట్టాతో డిజైన్ అయిన ప్రతి డిజైనర్ వేర్కి .. మోడల్స్‌ని ముస్తాబు చేయాల్సిందిగా కోరసాగారు. ఆ వర్క్ కల్పనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చీర, చున్నీలను అందంగానే కాదు సౌకర్యంగానూ ఎన్నిరకాలుగా చుట్టొచ్చో.. ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసి మరీ ఎక్స్పర్టీజ్ తెచ్చుకుంది. దాంతో ఆమె నైపుణ్యం ఫ్యాషన్ రంగంలోనే కాదు బాలీవుడ్లో, ఇండస్ట్రియలిస్ట్‌ల క్లోజ్ ఈవెంట్లలోనూ కనిపించి.. అతి తక్కువ కాలంలోనే ఆమెను సెలబ్రిటీ శారీ డ్రేపర్‌గా మార్చింది.ఒకప్పటి టాప్ మోడల్ మధు సప్రే నుంచి బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ వహీదా రహమాన్, అంట్రప్రెన్యూర్స్ నీతా అంబానీ, శోభనా కామినేని, నేటితరం బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోణ్, ఆలియా, కరీనా కపూర్, రశ్మికా మందన్నా, యామీ గౌతమ్, తమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది. వాళ్లందరికీ కల్పనా ఫేవరెట్ శారీ డ్రేపర్. అంతెందుకు మొన్న అంబానీ ఇంట జరిగిన అనంత్, రాధికల పెళ్లి వేడుకల్లో కూడా కల్పన పాల్గొంది.. రాధికా మర్చంట్ ఆత్మీయంగా పిలుచుకున్న శారీ డ్రేపర్‌గా. ఒకట్రెండు వేడుకల్లో రాధికా.. కల్పనచేతే చీర కట్టించుకుని మురిసిపోయింది.ఆథర్‌గా.. చీర కట్టును ప్రమోట్ చేయడానికి కల్పన 2012లో ’The Whole 9 Yards’ పేరుతో ఒక పుస్తకం రాసింది. చీర కట్టుకు సంబంధించి దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది. అంతేకాదు దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా కల్పన.. 24 గంటల మారథాన్ శారీ డ్రేపింగ్‌తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ తన పేరు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 226 రకాల చీర కట్టులను ప్రదర్శించింది. ఆమె మొత్తం 300 రకాలుగా చీరను కట్టగలదు. శారీ డ్రేపింగ్‌లో ‘కల్పన కట్టు’ అనే ప్రత్యేకతను సాధించి.. ఫ్యాషన్ వరల్డ్‌లో చీరకు సెలబ్రిటీ హోదా కల్పించిన కల్పన షాహ్.. నేటికీ శారీ డ్రేపింగ్ మీద శిక్షణా తరగతులు, వర్క్ షాప్స్ నిర్వహిస్తూ చురుగ్గా ఉంటోంది! -
మై వార్డ్రోబ్! టీనేజర్‌కు బెస్ట్ 5 ఇవే..!
‘అమ్మా!, ఈ డ్రెస్ సరిగా లేదు, ఈ డిజైన్ ఓల్డ్.. అందరిలోనూ డల్‌గా కనిపిస్తాను, అందుకే నేను ఫంక్షన్‌కు రాను’ అనే మాటలు టీనేజ్ అమ్మాయిలు ఉన్న ఇంట్లో తరచూ వినిపిస్తుంటాయి. ఎంపిక చేసిన డ్రెస్ సరిగా లేదనో, మ్యాచింగ్ కుదరలేదనో ... చెప్పే మాటలు అమ్మలకు పెద్ద సవాల్‌గా ఉంటాయి. ‘‘మరో అకేషన్‌కి బెస్ట్ది సెలక్ట్ చేద్దాం. ఇప్పటికి ఇలా రెడీ అయి పో’’ అని కూతుళ్లకు సర్దిచెబుతూ ఉంటారు అమ్మలు. ‘ఇలాంటి ఇబ్బందికర సందర్భాలు ఎదురవకుండా సందర్భానికి తగినట్టు రెడీ అవడానికి మా అమ్మాయి విషయంలో సింపుల్‌గా అనిపించే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతుంటాను’ అని చెబుతున్నారు సంయుక్తా మరపడగ. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గానూ రాణిస్తున్న సంయుక్త చెబుతున్న విశేషాలు.‘సాధారణంగా అమ్మాయిల డ్రెస్సింగ్ కోసం తరచూ షాపింగ్ చేస్తుంటాం. బాగున్నవీ, బాగోలేనివీ వార్డ్‌రోబ్‌లో చాలా డ్రెస్సులు వచ్చి చేరుతుంటాయి. ప్రతీసారీ కొత్తగా అనిపించేలా డ్రెస్సింగ్ ఉండేలా చూసుకోవడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ప్రతీ ఈవెంట్‌కి సందర్భానికి తగినట్టు డ్రెస్సింగ్ అవడం తప్పనిసరి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటాను.బెస్ట్ ఆఫ్ 5..క్యాజువల్‌గా బయటకు, రోజూ కాలేజీకి, పండగలు, గెట్ టు గెదర్స్, పెళ్ళిళ్లు.. ఇలా సందర్భాలను బట్టి మన డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. వాటిలో బెస్ట్ 5 అనేవి ఎంపిక చేసుకోవాలి. 1. సాధారణంగా బయటకు వెళ్లినప్పడు ఫంకీ స్టైల్ ఉంటే బాగుంటుంది. అందుకు మోడర్న్ వేర్ని ఎంపిక చేసుకోవచ్చు. వీటిలోనే స్ట్రీట్ స్టైల్ మిక్స్ అండ్ మ్యాచ్ డ్రెసింగ్ అయితే బాగుంటుంది. 2. పండగలకు, ఎంగేజ్మెంట్స్కి సంప్రదాయ లుక్‌లో కనిపించాలి. ఇందుకు ఫ్యాన్సీ టచ్ ను మిక్సప్ చేయచ్చు. ఇండోవెస్ట్రన్ డ్రెస్సింగ్ కూడా ఈ సందర్భాలలో బాగుంటుంది.3. కాలేజీలో ప్రత్యేకమైన ఈవెంట్స్ ఉన్నా ఫంకీ లుక్‌తో ఉండే ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి. వీటిలోనే ముదురు, లేత రంగుల కాంబినేషన్స్ ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో డార్క్ కలర్ టాప్స్, లైట్ షేడ్స్ స్కర్ట్స్‌ని వార్డ్‌రోబ్‌లోకి చేర్చుకోవచ్చు. పూర్తి వెస్ట్రన్ స్టైల్స్ కూడా కాలేజీ ఈవెంట్స్‌కు బాగుంటాయి. 4. వివాహ వేడుకలకు బెనారస్, పైథానీ, ఇకత్, పట్టుతో తయారైన ఏ ఫ్యాబ్రిక్‌తో అయినా లెహంగా, శారీ, చుడీదార్ డిజైన్స్.. ఎంపిక చేసుకోవచ్చు. వీటిలోనూ జాకెట్స్, టాప్స్.. వెస్ట్రన్ స్టైల్లో డిజైన్ చేయించుకోవచ్చు. 5. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో స్టైల్లో కనిపించేలా కనీసం 5 నుంచి 6 డ్రెస్‌లు సిద్ధంగా ఉంటే వాటినే మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. లెహంగా ప్లెయిన్ ఉంటే డార్క్ బ్లౌజ్ క్రాప్ టాప్స్, వెస్ట్రన్ టాప్స్‌తో మిక్సప్ చేయచ్చు."మా అమ్మాయి వార్డ్‌రోబ్‌లో ఇలా సందర్భానికి తగినట్టు డ్రెస్సులు ఉండేలా చూసుకోవడం వల్ల ఎంత పెద్ద అకేషన్ వచ్చినా పెద్దగా ఇబ్బందిగా అనిపించదు. దీనివల్ల టైమ్ ఆదా అవుతుంది. అనవసర షాపింగ్కూడా తగ్గుతుంది.’’ – నిర్మలారెడ్డి"ఆభరణాల ఎంపిక కాలేజీ ఈవెంట్స్‌కి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ముదురు రంగు డ్రెస్సుల మీదకు ముత్యాలు లేదా పెండెంట్ ఉండే సన్నని చెయిన్ ధరిస్తే చాలు. ఫ్యాన్సీ డ్రెస్సింగ్ అయితే ఇయర్ రింగ్స్‌తో మేనేజ్ చేయచ్చు. పూర్తి సంప్రదాయ లుక్ అయితే సందర్భాన్ని బట్టి టెంపుల్ జ్యువెలరీని ఎంపిక చేసుకుంటే చాలు." – సంయుక్త మరపడగఇవి చదవండి: Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో.. -
ఇండియా కోచర్ వీక్ 2024లో హొయలొలికించిన భామలు (ఫొటోలు)
-
ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మ వామికా గబ్బి.. ఇండియా కౌచర్ వీక్ ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
బ్రైడల్ కలెక్షన్స్ తో గ్రాండ్ గా ఎక్స్ ఫో...సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)
-
సూత్ర ఎగ్జిబిషన్లో సందడి చేసిన మిస్ గ్రాండ్ ఇండియా ప్రాచీ నాగ్‌పాల్
-
వర్షంలోనూ ఫ్యాషన్ సాధ్యమే
వాన రాకడ ఫ్యాషన్ పోకడ.. రెండూ అనూహ్యమే. ఎప్పుడు కురుస్తుందో.. ఎప్పుడు మెరుస్తుందో.. తెలియని పరిస్థితుల్లో.. సిటీలోని ఫ్యాషన్ లవర్స్ ఎలాంటి ఫ్యాషన్ అనుసరించాలో తెలియక సిటీలోని ఫ్యాషన్ లవర్స్‌ని అయోమయపు మబ్బులు కమ్మేస్తుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నగరవాసుల కోసం మాన్సూన్ ఫ్యాషన్ తొలకరి చినుకులు కురిపిస్తోంది.. ⇒ సీజన్‌కు అనుగుణంగా మార్పు చేర్పులు⇒ అందుబాటులో వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్⇒ తేమను విడగొట్టే పాలియెస్టర్ బ్లెండ్స్⇒ జాయ్‌ఫుల్‌గా ఉంచే బ్రైట్‌కలర్స్⇒ ఫుట్ వేర్ కూడా ఫ్యాషనబుల్‌గా మహిళలు వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవాలి. నైలాన్, పాలియెస్టర్ మేళవింపు ఫ్యాబ్రిక్స్, అలాగే ట్రీటెడ్ కాటన్..వంటివి బెస్ట్. అనుకోని వర్షం కలిగించే ఇబ్బందులను తగ్గిస్తూ మనల్ని పొడిగా ఉంచుతాయి. లైట్ వెయిట్‌తో, గాలి పీల్చుకోవడానికి అనువుగా ఉండే లినెన్ లేదా కాటన్ అయితే త్వరగా పొడిగా మారతాయి. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను స్వీకరించేందుకు లేయరింగ్ స్టైల్ (ఒక దాని మీద మరొకటి ధరించడం) ఉపకరిస్తుంది. బ్రైట్కలర్స్తో ప్రయోగాలు చేయాలి. ఎల్లో, గ్రీన్, బ్లూ కలర్స్ మబ్బు పట్టిన వాతావరణంలో సైతం మూడ్స్‌ని జాయ్‌ఫుల్‌గా ఉంచుతాయి. అలాగే ట్రెంచ్ కోట్స్, పార్కాస్, స్టైలిష్ వాటర్ ప్రూఫ్ జాకెట్స్. వంటి.స్టైలిష్ రెయిన్ వేర్ వినియోగించాలి. ఠిమగవాళ్లు బోర్ కొట్టించే రెయిన్ కోట్స్‌ను విడిచిపెట్టి లైట్ వెయిట్ వాటర్ ప్రూఫ్ జాకెట్స్, హుడీస్ – విండ్ బ్రేకర్స్ వినియోగించాలి. తేలికపాటి డిజైన్స్‌ను ఎంచుకోవాలి. తేమను విడగొట్టే పాలియెస్టర్ బ్లెండ్స్ లాంటి ఫ్యాబ్రిక్స్‌ను వినియోగించాలి. ఇవి త్వరగా పొడిగా మారతాయి. రోజంతా సౌకర్యవంతంగా ఉంచుతాయి. నేవీ, చార్కోల్, ఆలివ్ రంగులు వంటివి నప్పుతాయి. ఇవి మరకలి్న, బురద తుంపర్లని దాచే వీలు కలి్పస్తాయి. ట్రౌజర్స్, షర్ట్స్, అవుటర్ వేర్లో ఈ షేడ్స్ పాలిషి లుక్ అందిస్తాయి. చినోస్, జీన్స్ క్యాజువల్ ట్రౌజర్స్‌ను లైట్ వెయిట్ స్వెటర్స్, గాలి బాగా తగిలేలా చేసే షర్ట్స్‌తో కాంబినేషన్‌గా వాడవచ్చు. ఇవి అటు కంఫర్ట్ ను, ఇటు స్టైల్‌నూ అందిస్తాయి. పాదరక్షలిలా... మహిళలు పాదాలను పొడిగా ఉంచుతూనే ఫ్యాషనబుల్‌గా ఉండేలా ఫుట్ వేర్‌ను ఎంచుకోవాలి. రబ్బర్ బూట్స్, వాటర్ ప్రూఫ్ స్నీకర్స్, డ్యూరబుల్ ఫ్లాట్స్.. వంటివి బెస్ట్. మగవాళ్లు మంచి మెటీరియల్‌తో తయారైన వాటర్ ప్రూఫ్ బూట్స్, స్టర్డీ లోఫర్స్ ఫుట్‌వేర్‌గా ఎంచుకోవాలి. కాన్వాస్ షూస్, స్యూడ్లు వాడవద్దు.. యాక్సెసరీస్ ఇలా.. ఠిమహిళలు కనీసస్థాయికి జ్యుయలరీ తగ్గించి, వాటర్ ప్రూఫ్ యాక్సెసరీస్ వినియోగించాలి. వాటర్ ప్రూఫ్, స్లీక్గా ఉండే బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ క్యారీ చేస్తే మొబైల్స్ వంటి ముఖ్యమైనవి భధ్రపరచుకోవచ్చు. మగవాళ్లు.. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్స్ ఉన్న యాక్సెసరీస్ బెస్ట్. లెదర్, సింథటిక్ల కలయికతో రూపొందిన వాచ్‌లు, బ్యాగ్స్ వాడాలి. ⇒ తడిసిన పరిస్థితిలో సైతం మ్యానేజ్ చేయగలిగేలా హెయిర్‌స్టైల్ మార్చుకోవాలి. జుట్టు బిగుసుకుపోకుండా నియంత్రించే యాంటీ ఫ్రీజ్ ఉత్పత్తులు వాడాలి లేదా జుట్టును పూర్తిగా వెనక్కి సెట్ చేసి ఉంచాలి. ⇒ కలర్ఫుల్గా ఉండే నాణ్యమైన బ్రాండెడ్ గొడుగును వెంట తీసుకెళ్లాలి. వర్షాకాలంలో వాన నుంచి రక్షణగా మాత్రమే కాదు మన స్టైల్‌కి చిహ్నంగా కూడా కనిపించాలి. రెయిన్లోనూ ఫ్యాషైన్ సాధ్యమే.. వానలు పడుతున్నంత మాత్రాన ఫ్యాషన్స్‌ను విడిచిపెట్టనక్కర్లేదు. అయితే సీజన్‌కి అనుగుణంగా కొన్ని మార్పు చేర్పులు తప్పనిసరి. వాటర్ ప్రూఫ్ అనేది దుస్తులకైనా యాక్సెసరీస్కైనా ఒక రూల్‌గా పెట్టుకోవాలి. ఇదే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రెయినీ సీజన్‌ను స్టైల్‌గా ఎంజాయ్ చేయవచ్చు... –చారోల్, హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్. -
Fashion: స్కర్టే.. సూపర్ స్టయిల్!
అమ్మాయిల సంప్రదాయ అలంకరణలో స్కర్ట్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకేతరహా ఫ్యాబ్రిక్‌తో స్కర్ట్ సాదాసీదాగా కనిపించేది. దీనికి అదనపు హంగుగా కుచ్చులు జత చేసి, ఒకవైపు నుంచి మరోవైపుకు సెట్ చేస్తే.. వచ్చిన స్టైల్ డ్రేప్డ్ స్కర్ట్. షార్ట్ కుర్తీ, ట్యునిక్, ఖఫ్తాన్ వంటి టాప్స్ ఎంపిక ఏదైనా డ్రేప్డ్ స్కర్ట్‌కి జత చేస్తే ఆ స్టైల్ అదుర్సే మరి.ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్‌గా ఆకట్టుకునే డ్రేప్డ్ స్కర్ట్ వెస్ట్రన్ స్టైల్లోనూ యంగ్‌స్టర్స్‌ని ఆకట్టుకుంటుంది. ఫ్లోరల్ ప్రింట్లు, ఎంబ్రాయిడరీ వర్క్‌తో మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుంది.డ్రేప్డ్ స్కర్ట్ అంచులు ఎగుడు దిగుడుగా ఉండటమే దీని ప్రత్యేకత. అందుకే ఎక్కువ భాగం ఈ స్కర్ట్‌కి ఎంబ్రాయిడరీ వంటి హంగులు అవసరం లేదు. టాప్‌గా ఎంచుకునే కుర్తీ, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్, ఖఫ్తాన్, ట్యునిక్స్ని ఎంబ్రాయిడరీ లేదా ఫ్లోర ల్ వర్క్‌తో రిచ్లుక్ని తీసుకురావచ్చు.ప్లెయిన్ శాటిన్, సిల్క్ మెటీరియల్‌తో విరివిగా కనిపించే డ్రేప్డ్ స్కర్ట్ సెట్స్ ఇండోవెస్ట్రన్ లుక్‌ని సొంతం చేస్తుంది. అందుకే ఈ స్టైల్ యూత్‌ని అట్రాక్ట్ చేస్తుంది.టాప్ టు బాటమ్ ఒకే రంగులో ప్లెయిన్‌గా ఉండే డ్రేప్డ్ స్కర్ట్ సెట్స్ ఫ్యామిలీ గెట్ టు గెదర్ వేడుకలకు ప్రత్యేకంగా నిలిస్తే, పట్టు, ఫ్లోరల్, జరీ వర్క్‌తో డిజైన్ చేసినవి వివాహ వేడుకలలోనూ గ్రాండ్‌గా కనిపిస్తాయి.ఇవి చదవండి: Priya Sisters: ఆదాయం కన్నా.. అభిరుచిగానే మిన్న! -
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ స్టైలిష్ లుక్..గజగామిని మాదిరి..!
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ లుక్ ఓ రేంజ్లో ఉంది. ఆమె స్టైలిష్ లుక్ ఆహుతులని మైమరిచిపోయేలా చేసింది. ముఖ్యంగా ఆ డిజైనర్ దుస్తుల్లో నడిచి వచ్చే విధానం హాట్‌టాపిక్‌గా మారింది. పారిస్ హాట్ కోచర్ వీక్ 2024లో ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రాకు మద్దతు ఇచ్చేందుకు జాన్వీ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది. ఆరా బ్రాండ్ హోలోగ్రాఫిక్ టోన్ డిజైనర్ వేర్‌తో పారిస్ ఫ్యాషన్ వేదికపైకి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది జాన్వీ. ఈడ్రెస్ ముదురు బ్లాక్క లర్‌లో అల్లికలతో డిజైన్ చేసిన మెర్మైడ్ స్కర్ట్‌లా ఉంది. అందుకు తగ్గట్లు స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌తో జత చేయడం ఆమె లుక్‌ని ఓ రేంజ్‌కి తీసుకుకెళ్లింది. దీనికి తగ్గట్టు ఆమె మేకప్, కేశాలంకరణ చాలా ఆకర్షణీయంగా ఉంది. చెప్పాలంటే అక్కడ ఉన్న వారందరీ చూపు అటెన్షన్‌తో జాన్వీపైనే దృష్టి సారించేలా ఆమె రూపు ఉంది. ఇక్కడ జాన్వీ వేదికపై ఓ మత్సకన్యా మాదిరిగా ఆమె స్టన్నింగ్ లుక్ ఉండటం విశేషం. నిజంగానే మత్స్య కన్యేనా అని భ్రమింప చేసేలా ఉంది జాన్వీ లుక్. ముఖ్యంగా ఆ వేదికపై నడిచి వచ్చిన విధానం మరింత ఆసక్తిని రేకెత్తించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు జాన్వీ స్టైలిష్ లుక్‌కి ఫిదా అవ్వతూ ఆమె నడిచే వచ్చే తీరు హీరామండి మూవీలో ది డైమండ్ బజార్ నుంచి గజగామినిలా నటించిన అదితి రావ్ హైదరీ నడకలా ఉందని ఒకరూ, 'ధితామ్ ధితామ్ ధిన్'లా నాట్యం చేసేందుకు వెళ్తున్నట్లుగా ఉందని మెచ్చకుంటూ పోస్టులు పెట్టారు. ఇక ఫ్యాషన్ వీక్‌లో రాహుల్ మిశ్రాకు మద్దతుగా బాలీవుడ్ ప్రముఖ నటులు పాల్గొన్నారు. ఇంతకు మునుపు రాహుల్ మిశ్రాకు సపోర్ట్ చేస్తూ..బాలీవుడ్ నటి అనన్ యపాండే రంగురంగుల సీక్వెన్ డ్రెస్‌తో సీతాకోక చిలుక మాదిరిగా ఈఫ్యాషన్ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఎవరీ రాహుల్ మిశ్రా.. రాహుల్ మిశ్రా ఢిల్లీకి చెందిన ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్. పారిస్‌లోని హాట్ కోచర్ వీక్‌లో ప్రదర్శనకు ఆహ్వానం దక్కించుకున్న తొలి భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా. ఆయన 2014లో మిలన్ ఫ్యాషన్ వీక్‌లో అంతర్జాతీయ వూల్మార్క్ బహుమతిని గెలుచుకున్నాడు. ఆయనకు మద్దతిచ్చేలా ఇలా బాలీవుడ్ ముద్దుగుమ్ములు అతడి డిజైనర్ కలెక్షన్లతో ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై సందడి చేశారు. మరీ ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ షోలో జాన్వీ తదుపరి ముద్దుగుమ్మ ఎవరో వేచి చూడాల్సిందే. ఇక ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ షో జూన్ 24 నుంచి జూన్ 27 వరకు పారిస్‌లో ఘనంగా జరుగుతాయి. View this post on Instagram A post shared by DietSabya® (@dietsabya) (చదవండి: ఏడు పదుల వయసులో అందాల పోటీలో పాల్గొన్న మహిళగా రికార్డు!) -
ఆహా.. అనిపించేలా నేహా లుక్స్ (ఫొటోలు)
-
అవకాశాలను సృష్టించుకోవాలి!
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆరుషి ఢిల్లీ వాసి. కాలేజీ రోజుల నుంచే ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారాఫ్యాషన్ డ్రెస్సులు, జ్యువెలరీ అమ్మకాలు చేపట్టింది. ఏడేళ్ల క్రితం 30 వేల రూపాయతో విష్’ పేరుతో సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసి, విదేశాలకూ తన ఉత్పత్తులను సర ఫరా చేస్తోంది. ;పాతికమందికి పైగా మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించింది. దేశంలో గ్రామీణ మహిళా కళాకారులను గుర్తించి, వారితో నెట్వర్కింగ్ ఏర్పాటుచేసి, ఉపాల్పిస్తోంది. ‘అవకాశాలను వెతకడం కాదు, మనమే సృష్టించుకోవాలి’ అంటున్న ఆరుషి నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ‘‘నేను ఫ్యాషన్ డ్రెస్సులు, కస్టమైజ్డ్ జ్యువెలరీ, డెకరేటివ్ వస్తువులు, పిల్లల బట్టలు, ఇతర ఉపకరణాలను ఎగుమతి చేస్తుంటాను. నాకు మొదటి నుంచి బిజినెస్ అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో అమ్మతో కలిసి అనేక ఈ–కామర్స్ సైట్లలో చీరలు, సూట్లు అమ్మేదానిని. కానీ, చాలా పోటీ అనిపించేది. ఏదైనా సరే భిన్నంగా చేయాలనే కోరిక ఉండేది. కానీ, సరైన మార్గం దొరికేది కాదు. కాలేజీలో చదువుతూనే ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాను. కానీ, నాకు నేనుగా నిరూపించుకునే పనిచేయాలనుకునేదాన్ని. దీంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని వ్యా΄ారానికి కేటాయించాలనుకున్నాను. ఉద్యోగం ద్వారా సంపాదించిన మొత్తంతో సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాను. 30 వేల రూ΄ాయలతో ‘లావిష్’ అనే పేరుతో కంపెనీని రిజిస్టర్ చేయించాను. అమెజాన్‌తో కలిసి చీరలు, ఫ్యాషన్ జ్యువెలరీ వంటివి అమ్మడం మొదలుపెట్టాను. రెండేళ్లు ఈ పనులు ఇలాగే కొనసాగాయి. అంతర్జాతీయంగా.. అమ్మే ఉత్పత్తులకు నా సొంత ఆలోచనను జోడించాను. సొంతంగా డిజైన్లు చేయడంతో ΄పాటు కొనుగోలుదార్లు అడిగే డిజైన్లపైనా పనిచేయడం మొదలుపెట్టాను. కస్టమైజ్డ్ డిజైన్లు అవడంతో ఆర్డర్లు విరివిగా రావడం మొదలయ్యాయి. దేశంలోనే కాదు అంతర్జాతీయంగానూ కొనుగోలుదార్లు పెరిగారు. పాతికలక్షలకు పైగా టర్నోవర్ సాధిస్తున్నాను. మహిళలు మాత్రమే నా కంపెనీలో మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. దేశంలోని గ్రామాల నుండి కళాకారుల సమాచారం సేకరిస్తాను. వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తాను. అక్కడ ఉత్పత్తులను తయారు చేయించి, వాటిని విక్రయిస్తాను. మహిళలు మాతో కనెక్ట్ అవడానికి ప్రత్యేక ప్రయోజనం కూడా ఉంది. తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయనవసరం లేదు. అమ్ముకోవడం కోసం బయటికి వెళ్లనక్కరలేదు. ఇంట్లో కూర్చొని ఉపాధి ΄పోందవచ్చు. అంతేకాదు, వారి నైపుణ్యాలను ప్రపంచం గుర్తిస్తుంది. దీనిద్వారా ఎంతోమంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. మన హస్తకళలకు ముఖ్యంగా ఆభరణాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. విదేశీ మహిళలకు రాజస్థానీ వస్త్రధారణ, బంజారా నగలు అంటే పిచ్చి. వారు భారతీయ సంస్కృతిని చాలా ఇష్టపడతారు. దీని కారణంగానే వారు భారతీయ డ్రెస్సులు, ఆభరణాలవైపు ఆకర్షితులవుతారు. ఒంటరి తల్లి నా సక్సెస్ వెనక మా అమ్మ మద్దతు చాలా ఉంది. నేను ముందడుగు వేయడంలో అమ్మ ఎప్పుడూ ్రపోత్సహిస్తుంటుంది. మా చెల్లినీ, నన్ను అమ్మ ఒంటరిగా చాలా కష్టపడి పెంచింది. ఆ కష్టంలో... నేను నా మార్గం కనుక్కోవడానికి ధైర్యాన్ని కూడా ఇచ్చింది. అందుకే ఈ రోజు వరకు 12 దేశాలకు ఒంటరిగా వెళ్లి, సందర్శించగలిగాను. ఇంటి పేరుకు నో! నా పేరుకు ఇంటిపేరు జోడించకూడదని నా సొంత నిర్ణయం. అందుకే, నా పేరుకు ముందు సర్నేమ్ ఉండదు. ఒక వ్యక్తి చేసే పనే వారి గుర్తింపు అవుతుంది. అందుకే, ఇంటి పేరును జత చేసుకోవాల్సిన అవసరం లేదని నేను భావించాను. అందుకు మా అమ్మ కూడా మద్దతు తెలిపింది. కానీ, ముఖ్యమైన పేపర్లలో సర్నేమ్ లేకుండా ఇవ్వలేమనే నిబంధనలతో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్కూల్లో, కాలేజీలో ప్రతిచోటా ఈ సమస్య ఎదురైంది. కానీ, నా నిర్ణయాన్ని మార్చకోలేనని స్పష్టంగా చె΄్పాను. అందుకు, చట్టపరంగానూ, న్యాయసలహాలు తీసుకున్నాను. దీంతో నా సర్టిఫికెట్లన్నింటిలోనూ నా పేరు మాత్రమే ఉంటుంది. ఒంటరి యాత్రికురాలిని నాకు ప్రయాణాలు అంటే ఇష్టం. ప్రకృతి అందమైన ప్రపంచాన్ని మన ముందుంచింది. దానిని ఆస్వాదించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అనుకుంటాను. స్వదేశంలో లేదా విదేశంలో ఎక్కడ సందర్శనకు వెళ్లినా ప్రతిచోటా వారి సంస్కృతి, కళల గురించి తెలుసుకుంటాను. గ్రామాల్లో దాగి ఉన్న సాంస్కృతిక, కళాత్మక ప్రతిభను తెలుసుకొని, నైపుణ్యాలను మెరుగుపరిచి, ప్రపంచం ముందుకు తీసుకువస్తుంటాను’’ అని తన విజయపథాన్ని వివరించింది ఆరుషి. -
ఈ సమ్మర్లో ఎనీ టైమ్.. ఎనీ వేర్.. అనిపించే డ్రెస్సులు ఇవే
ఎండలు రోజు రోజూ తమ ప్రతాపాన్ని పెంచుతూనే ఉన్నాయి. రానున్న రోజులను ఎలా తట్టుకోవాలా అని ఆలోచించే వారు తమ డ్రెస్సింగ్‌లో మార్పులు చేసుకుంటూనే ఉన్నారు. క్యాజువల్ వేర్‌గా రోజంతా సౌకర్యంగా ఉండేలా సరైన డ్రెస్ ఎంపికగా ఈ కో–ఆర్డ్ సెట్స్ బాగా సూటవుతాయి. ఈ సమ్మర్లో కూల్ అండ్ కంఫర్ట్‌తో పాటు ఎనీ టైమ్ ఎనీ వేర్ అనిపించే ఈ డ్రెస్సులు బాగా నప్పుతాయి. టాప్ డిజైన్స్‌లో మార్పులు ఈ డ్రెస్ సెట్లో టాప్–బాటమ్ రెండూ ఒకే ప్రింట్, ఒకే కలర్‌తో ఉంటాయి. అయితే, టాప్‌గా షార్ట్ కుర్తీ, పెప్లమ్, జాకెట్ స్టైల్.. ఇలా డిజైన్స్‌లో మార్పులు చేయించుకోవచ్చు. లేదా అలాంటివి మార్కెట్లో రెడీమేడ్‌గా ఉన్నవి ఎంచుకోవచ్చు. డిజైన్స్ కూడా సులువే! టాప్ అండ్ బాటమ్ ఒకే మెటీరియల్‌తో డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి, బడ్జెట్‌కు తగినవిధంగా మెటీరియల్‌ను ఎంచుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఈ వేసవిని ఎదుర్కోవడానికి కూల్‌గా.. కంఫర్ట్‌గా.. సొగసుగా రెడీ అయి పోవచ్చు. కాటన్ ఫ్యాబ్రిక్ కో–ఆర్డ్ సెట్స్‌లో ఈ కాలం కాటన్ మెటీరియల్‌కే మొదటి ్రపాధాన్యత. వీటిలో ఖాదీ, ఇక్కత్, ప్రింటెడ్ కాటన్స్ని ఎంచుకోవచ్చు. ఆహ్లాదకరమైన రంగులు ముదురు, లేత రంగుల్లోనే కాదు డిజైన్స్‌లో ఆహ్లాదకరంగా అనిపించేవి ఎంచుకోవాలి. వేసవి వేడి నుంచి మన కంటికి హాయిగొలిపే డిజైన్స్, రంగులపై దృష్టి పెట్టడం మంచిది. -
టేప్ రోల్ మాదిరి బ్రాస్లెట్..ఖరీదు ఏకంగా..!
కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఉత్పత్తి చేసే ప్రొడక్ట్‌లు చాలా లగ్జరియస్‌గా ఉంటాయి. వాటి ధరలు చూస్తే కళ్లు చెదిరిపోతాయి. అయితే ఒక్కోసారి అంత ప్రముఖ బ్రాండ్లు కూడా ఎంత విచిత్రాతి విచిత్రమైన ప్రొడక్ట్‌లను ఉత్పత్తి చేస్తాయో చూస్తే మాత్రం ఇదేంటీ? అనిపిస్తుంది. అలాంటి మాదిరి ప్రొడక్టనే మార్కెట్లోకి విడుదల చేసంది ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ. అయితే ప్రొడక్ట్‌ని చూసిన జనం మండిపడుతున్నారు. ఎందుకంటే.. హై ఎండ్ ఫ్యాషన్ బ్రాండ్లకు పేరుగాంచిన బాలెన్సీగా ఓ విచిత్రమైన ప్రొడక్టను విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో పారిస్ ఫ్యాషన్ వీక్ ఫాల్/వింటర్ 2024 సందర్భంగా సరికొత్త ఫ్యాషన్ బ్రాసెలెట్ని మార్కెట్లోకి విడుదల చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో బ్రాస్లెట్ చూడటానికి ఎలా ఉందంటే.. టేప్రోల్ మాదిరిగి ఉండటంతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇదేం బ్రాస్లెట్ అని సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఇంత లగ్జరియస్ బ్రాండ్ మరీ ఇంత చీఫ్‌గా ఇలాంటి ప్రొడక్ట్‌లను తీసుకొస్తుందా అని మండిపడ్డారు. పైగా ఆ బ్రాస్‌లెట్‌పై బ్రాండ్ లోగో క్లియర్‌గా ఉంది. కాబట్టి ఆ ఫ్యాషన్ కంపెనీ ప్రొడక్టే అని క్లియర్‌గా తెలుస్తుంది. ధర ఏకంగా రూ. 3 లక్షలకు పైగా పలకడం మరింత చర్చలకు దారితీసింది. నిజంగా ఈ బ్రాస్లెట్ స్పష్టమైన టేప్ రోల్‌ని పోలి ఉంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఇదేం ఫ్యాషన్ అంటూ తిట్టిపసోస్తున్నారు. మరీ ఇంత చెత్త ప్రొడక్ట్లనా ఆ బ్రాండ్ తీసుకొచ్చేది. ఇదేం బ్రాండ్ అంటూ విమర్శలు చేస్తూ కామెంట్లు పెట్టారు. ఇంతకు ముందు కూడా ఈ బాలెన్సీగా ఇలానే ఓ చెత్త బ్యాగ్‌లా కనిపించే లెదర్ పర్సుని తీసుకొచ్చింది. పైగా దాని ధర కూడా లక్షల్లోనే పలకడం విశేషం. ఏదీఏమైన ఒక్కొసారి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లు కూడా లేటెస్ట్ ఫ్యాషన్ తీసుకురావడంలో చతకిలపడతాయోమో కదూ..! This Balenciaga Tape bracelet costs an absurd $4400!!😂😂 pic.twitter.com/GUaMMJlL2S — Rosy (@rose_k01) March 25, 2024 (చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!) -
సూత్ర ఎగ్జిబిషన్లో మెరిసిన ముద్దుగుమ్మలు
-
వింటర్ సీజన్‌కి ప్రత్యేకంగా స్టైలింగ్.. వివాహ వేడుకల్లో అట్రాక్షన్
వివాహ వేడుకలలో కట్టే చీరలే దివ్యంగా వెలిగిపోతుంటాయి. ఇక వాటికి అదనంగా మరో స్టయిల్‌ను కూడా జోడిస్తే.. ఆ వెలుగులు రెట్టింపు అవుతాయి. పట్టు, వెల్వెట్, ఎంబ్రాయిడరీ దుపట్టా చీర మీదకు ధరించినా, డ్రేపింగ్‌లో జత చేసినా ఆ స్టైల్ హుందాగా కనిపిస్తుంది. ఈ వింటర్ సీజన్‌కి ప్రత్యేకంగా ఉండటమే కాదు చలి నుంచి రక్షణను కూడా ఇస్తుంది. ఎవర్‌గ్రీన్‌గా ఉండే శారీ కట్టుకి మహారాణి కళను లె చ్చే దుపట్టా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. కాంట్రాస్ట్ శారీ కలర్, దుపట్టా కలరా పూర్తి కాంట్రాస్ట్ ఉన్నది ఎంచుకోవాలి. దీనివల్ల రెండూ భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. శాలువా స్టైల్ చీర మీదకు దుపట్టాను శాలువా మాదిరి కప్పుకున్నా ఈ సీజన్‌కి వెచ్చగా, బ్రైట్‌గా ఉంటుంది. అయితే, దుపట్టా గ్రాండ్‌గా ఉన్నది ఎంచుకోవాలి. ఇందుకు పట్టు, బ్రొకేడ్, ఎంబ్రాయిడరీ దుపట్టాలను చీరలను ఎంపికను బట్టి తీసుకోవాలి. డ్రేపింగ్ దుపట్టా చీరకట్టులో భాగంగా దుపట్టాను జత చేర్చి కట్టడం ఒక స్టైల్. ఈ కట్టును నిపుణుల ఆధ్యర్యంలో సెట్ చేయించుకోవాలి. ఈ కట్టుకు కూడా కాంట్రాస్ట్ కలర్స్ ఉండేలా చూసుకోవాలి. రంగు ఒకటే... డిజైన్ వేరు సేమ్ కలర్ శారీ దుపట్టాను ఎంచుకున్నా ఎంబ్రాయిడరీ డిజైన్‌లో కాంబినేషన్స్ చూసుకోవాలి. చీర డిజైన్ హెవీగా ఉంటే, దుపట్టా డిజైన్ బ్రైట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. పట్టు శారీ మీదకు డిజైనర్ దుపట్టాను ఎంచుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.