Kareena Kapoor: ఏంటీ ఆ పీలిక‌ల డ్రెస్ ధ‌ర 70 వేలా? ఎందుకిలా? | Kareena Kapoor in Rs 70k Floral Set Breezy Summer Look | Sakshi
Sakshi News home page

Kareena Kapoor: ఏంటీ ఆ పీలిక‌ల డ్రెస్ ధ‌ర 70 వేలా? ఎందుకిలా?

Published Sat, Mar 5 2022 4:26 PM | Last Updated on Sat, Mar 5 2022 5:00 PM

Kareena Kapoor in Rs 70k Floral Set Breezy Summer Look - Sakshi

ల‌క్ష్మీ లెహ‌ర్.. బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు అత్యంత ఇష్ట‌మైన స్టైలిస్ట్. టాప్ హీరోలు, హీరోయిన్లు ఆమె క‌స్ట‌మ‌ర్ల జాబితాలో ఉంటారు. క‌రీనా క‌పూర్‌, సారా అలీ ఖాన్‌, అలియా భట్‌, క‌త్రినా కైఫ్, జాన్వీ క‌పూర్, కియారా అద్వానీ, అన‌న్య పాండే స‌హా హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీఖాన్ వంటి స్టార్లు లక్ష్మీతో స్టైలింగ్ చేయించుకున్న వాళ్లే!. బాలీవుడ్ ఫ్యాష‌న్ ఐకాన్ క‌రీనా క‌పూర్ న్యూ లుక్ కోసం రంగంలోకి దిగిందామె!

ఎల్లో క‌ల‌ర్‌ కో- ఆర్డ్(పై నుంచి కింది దాకా ఒకే ర‌క‌మైన ఫ్యాబ్రిక్‌, క‌ల‌ర్‌తో ఉండే కో ఆర్డినేట్ డ్రెస్‌) సెట్లో మెరిసేలా చేసింది!.  ఫ్లోర‌ల్ ప్రింట్‌తో ఉండే ఈ బీచ్ వేర్‌కు చిక్ బెల్ట్ జ‌త  చేసింది. సింపుల్ ఇయ‌ర్ రింగ్స్, చైన్‌తో స‌రిపెట్టేసింది. అన్న‌ట్లు క‌రీనా ధ‌రించిన‌ ఈ బ‌స్టియ‌ర్ టాప్ ధ‌ర 30, 599 రూపాయలు కాగా.. న‌డుము పై భాగం వ‌ర‌కు ఉన్న షార్ట్స్ ధ‌ర రూ. 39,599. ఈ డ్రెస్ ధ‌రించిన బెబో ఫొటోను ల‌క్ష్మి త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో స‌మ్మ‌ర్ రెడీ అన్న క్యాప్ష‌న్‌తో  షేర్ చేసింది.

అయితే, నెటిజ‌న్లు ఈ ఫొటోపై మిశ్ర‌మంగా స్పందిస్తున్నారు. కొంత‌మంది డ్రెస్ బాగుందంటూ పొగ‌డ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం.. 70 వేలు పోసి ఈ పీలిక‌ల డ్రెస్ కొనాలా? అయినా క‌రీనా అంటే ఈ మాత్రం ఉంటుందిలే! ఏదేమైనా ఆమె టేస్టుకు స‌రిగ్గా స‌రిపోయిందంటూ సెటైరిక‌ల్ కామెంట్ల‌తో ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement