Fashion
-
అందాల ఆతిథ్యం..! విశ్వసుందరి జన్మించిన నగరంలో పోటీలు..
నగరంలో ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచం సరికొత్త సందడి పులుముకుంది. ఈవెంట్స్ రంగం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ణంలోని హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించడమే ఈ సందడికి కారణం. ప్రపంచస్థాయి అందాల పోటీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం భాగ్యనగరంలోని ఫ్యాషన్ రంగానికి చెందిన ఔత్సాహికులకు కలర్ ఫుల్ కలలకు ఊతమిస్తోంది. ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం నగరానికి మరింత గ్లోబల్ లుక్ తెచి్చపెడుతోంది. మొత్తం 120 దేశాలు పాల్గొనే ఈ అతిపెద్ద ఈవెంట్ దాదాపు నెల రోజుల పాటు నగర కేంద్రంగా జరగడం వల్ల అంతర్జాతీయంగా ఖ్యాతి పొందనుంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ జరగని స్థాయిలో అంతర్జాతీయ ఫ్యాషన్, మోడలింగ్ రంగాలను నగరం ఆకర్షిస్తోంది. తద్వారా నగరంలో ఔత్సాహిక యువతకు అవకాశాలు విస్తరిస్తాయి. అదే విధంగా నగరం, చుట్టుపక్కల చారిత్రక ప్రదేశాలు, సంప్రదాయ హస్తకళలు ప్రపంచం దృష్టికి రానున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న నగరం టాలీవుడ్ పరిశ్రమకు సైతం మరింత ఊపునివ్వనుంది. గొప్ప విశేషం.. ఎందరో యువత కల.. హైదరాబాద్ దేశంలోనే ఓ గొప్ప నగరంగా ఎదుగుతోంది. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటివెన్నో నిర్వహించగల సామర్థ్యం నగరానికి ఉంది. ఒకనాటి బ్యూటీ కాంటెస్ట్ విజేతగా.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అందమైన యువతులకు మన నగరం వేదిక కావడాన్ని చూసే రోజు కోసం ఎంతో ఉది్వగ్నంగా ఎదురుచూస్తున్నాను. – శిల్పారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా బ్యూటీ ఈవెంట్స్ కేంద్రంగా.. గత కొంత కాలంగా బ్యూటీ క్వీన్స్‌కు మాత్రమే కాదు బ్యూటీ ఈవెంట్స్‌కు సైతం చిరునామాగా మారుతోంది. నగరానికి చెందిన శిల్పారెడ్డి మొదలుకుని గత ఏడాది సుష్మ తొండేటి వరకూ మిసెస్ ఇండియా కిరీటాన్ని నగరవాసులు ఎందరో గెలుచుకున్నారు. ఇక మానసా వారణాసి వంటివారు మిస్ ఇండియా కిరీటాలను తీసుకొచ్చారు. పూనమ్ కౌర్, మధుశాలిని వంటి మిస్ హైదరాబాద్‌లు అనంతరం సినీతారలుగా రాణించారు. నగరంలోని కళాశాలల నుంచి క్లబ్స్ వరకూ బ్యూటీ కాంటెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి.ఈ తరహా ఈవెంట్లకు మరింత ప్రొఫెషనలిజాన్ని మిస్ వరల్డ్ అందించడం తధ్యం. ఏదేమైనా విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌కు ప్రపంచ సుందరి పోటీలు రావడం సమయోచితం అని చెప్పాలి. (చదవండి: ఆరోగ్య ప్రయోజనాలందించే బెస్ట్ చట్నీలివే..!) -
Pragya Nagra: ఓ ముద్దుగుమ్మ.. అద్దంలో చూసుకుంది చాల్లేవమ్మా! (ఫోటోలు)
-
మెహిందీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ : మెరిసిపోయిన అందాల భామ
పాకిస్తానీ హీరోయిన్ మావ్రా హొకేన్(Mawra Hocane) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తొలుత బుల్లితెరపై కనిపించిన మావ్రా ఆ తరువాత హీరోయిన్గా రాణించింది. ఇప్పటికే తన డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలతో ఇంటర్నెట్లో సందడి చేసిన ఈ అమ్మడు తాజాగా తన మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఆమె ఫ్యాషన్ శైలికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అమీర్ గిలానీ(Ameer Gilani)ని ఇటీవల(ఫిబ్రవరి 5న) రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు హాజరైన వివాహానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు మెహిందీ లగాకే రఖ్లీ అంటూ, మెహందీ వేడుక నుండి అనేక చిత్రాలను పోస్ట్ చేసింది. ఇందులో అప్సరసలా మెరిసిపోయింది. View this post on Instagram A post shared by MAWRA (@mawrellous) గోల్డెన్ టోన్ ఎంబ్రాయిడరీ మస్టర్డ్ ఎల్లో -టోన్ ఘరారా సెట్‌ను ధరించింది.. దీనికి చిన్న ఫ్రాక్-శైలి కుర్తాతో పాటు ఫ్లేర్డ్ ఘరారాను జత చేసింది. అంతేకాదు డబుల్-దుపట్టా లుక్ లేటెస్ట్ ట్రెండ్‌కు అద్దం పడింది. మెజెంటా దుపట్టా , ఇంకోటి పర్పుల్ అండ్ బంగారు రంగు దుపట్టాను లుక్‌ను జత చేసింది. ఇక దీనికి జతగా బంగారు ఆభరణాలు, సింపుల్ మేకప్ లుక్తోతన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది మావ్రా. మావ్రా హొకేన్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో ఎంబ్రాయిడరీ చేసిన సేజ్ గ్రీన్ షరారా సెట్లో అందంగా మెరిసింది.కాగా మావ్రా 2011లో ఈ అమ్మడు ‘కిచారి సాల్స’(Kichari Salsa) బాలీవుడ్ రొమాంటిక్ మూవీతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తరువత 2016లో ‘సనమ్ తేరీ కసమ్’ (Sanam Teri Kasam)తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
ఫ్యాషన్ స్ట్రీట్‌కు నయా లుక్
దాదర్: దక్షిణ ముంబైలోని ప్రముఖ ఫ్యాషన్ స్ట్రీట్‌కు కొత్త లుక్ ఇవ్వాలని బహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన నూతన ప్రణాళిక రూపొందించి సిద్ధంగా ఉంచింది. సలహాదారుల కమిటీ సమరి్పంచిన నివేదిక ప్రకారం ఈ ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దే పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని బీఎంసీ అదనపు కమిషనర్ (సిటీ) అశ్వినీ జోసీ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ప్రత్యక్షంగా పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. నగరంలో ప్రధాన రైల్వే స్టేషన్లైన చర్చిగేట్–చత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ) మధ్య ఈ ఫ్యాషన్ స్ట్రీట్ ఉంది. దీనికి కూత వేటు దూరంలో ఆజాద్ మైదానం ఉంది. ఇక్కడ నేటి యువతను ఆకర్శించే అనేక కొత్త డిజైన్లతో కూడిన దుస్తులు, డ్రెస్ మెటీరియల్స్ లభిస్తాయి. దీంతో ఈ మార్కెట్ నగరంతోపాటు పశి్చమ, తూర్పు ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో ఎంతో గుర్తింపు పొందింది. ఇక్కడ రకరకాల దుస్తులతోపాటు, చేతి గడియారాలు, హ్యాండ్ బ్యాగులు, లగేజీ బ్యాగులు, బెల్టులు, బూట్లు తదితర ఫ్యాషనబుల్ వస్తువులు చౌక ధరకే లభించడంతో నిత్యం వేల సంఖ్యలో జనాలు వస్తుంటారు. అంతేగాకుండా దేశ నలుమూలలు, వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచి్చన పర్యాటకులు ఫ్యాషన్ స్ట్రీట్‌ను తప్పకుండా సందర్శిస్తారు. వివిధ పనుల నిమిత్తం ముంబైకి వచి్చన వారు కూడా ఇక్కడికి వచ్చి తమకు నచ్చిన దుస్తులు, సామాగ్రి కొనుగోలు చేస్తారు. అన్ని రకాల, ఆధునిక ఫ్యాషన్ దుస్తులు లభించడంతో ఇక్కడికి పేదలతోపాటు, మధ్యతరగతి, ధనిక అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లరు. ముఖ్యంగా నేటి యువత ఆధునిక ఏసీ షాపింగ్ మాల్స్‌ల కంటే ఫుట్‌పాత్‌పై వెలసిన ఈ ఫ్యాషన్ స్ట్రీట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.లైసెన్సులు లేకుండానే వ్యాపారం..ప్రస్తుతం ఇక్కడ 6/8 లేదా 8/8 చదరపుటడుగులతో కూడిన చిన్న చిన్న టేలాలు, షాపులు ఇలా 250–300 వరకు ఉన్నాయి. ఇందులో లైసెన్స్‌గల షాపులు 112 ఉన్నాయి. మిగతా దుకాణాలన్నీ టెంపరరీ కావడంతో షట్టర్లు, డోర్లు, విద్యుత్ దీపాలు లేవు. చార్జింగ్ లైట్లతోనే వ్యాపారాలు కొనసాగిస్తారు. ఇక్కడ నిత్యం లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. రాత్రుల్లు దొంగల నుంచి తమ వస్తువులను కాపాడుకునేందుకు అందులో పనిచేసే వారు లేదా యజమానులు అక్కడే నిద్రపోతుంటారు. ఇలాంటి చరిత్రగల ఫ్యాషన్ స్ట్రీట్ త్వరలో సింగపూర్, యూరోప్ దేశాల తరహాలో కొత్త హంగులు, విద్యుత్ దీపాలతో దర్శనమివ్వనుంది. షాపింగ్‌లకు వచ్చే కస్టమర్లకు ఇక్కడ తాగునీరు, మరుగుడొడ్లు లేవు. దీంతో షాపింగ్‌కు వచి్చన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే ఆధునీకీకరించే ఈ ప్రాజెక్టులో కస్టమర్లకు అవసరమైన కనీస వసతులు, అల్పాహార స్టాళ్లు, సేదతీరేందుకు బెంచీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అధునిక సీసీ కెమెరాలతో భద్రతకు సైతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు. -
స్టైల్గానే కాదు అందంగా నాజుగ్గా కనపడాలంటే..!
ఆహార పథ్యాలు, వ్యాయామాలతోనే కాకుండా కొన్ని రకాల చిట్కాలని అనుసరించడం ద్వారా కూడా సన్నగా, నాజూకుగా కనపడవచ్చు. అదెలాగంటే ఫ్యాషన్ అనేది స్టైల్’గా మాత్రమే కాకుండా నాజూగ్గా... అందంగా కనపడేలా కూడా చేస్తుంది. ఇందుకోసం చేయవలసిందల్లా శరీరంలో మీకు సమస్యగా అనిపించే ప్రాంతాలను గుర్తించడమే– అది మీ నడుము భాగమా లేదా మీ తొడలలో లేదా మీ పిరుదులలో సమస్యగా ఉందా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం మీ గదిలో ఏకాంతంగా అద్దం ముందు నిల్చుని ప్రతి శరీర భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని, లోపాలను దాచి పెట్టుకోటానికి ప్రయత్నించాలి. లేదంటే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం తీసుకోవడంలో తప్పు లేదు. శరీరంలోని ఈ భాగాలు శరీరం కన్నా పెద్దగా కనపడకుండా చూసుకోవాలి.మనం తీసుకునే ఆహారం శారీరక ఎదుగుదలకే కాదు, మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు మనసును నిరుత్సాహంగా మార్చితే, కొన్నిరకాల ఆహారాలు మనసును ఉత్తేజపరుస్తాయి. కార్బోహైడ్రేట్లు సెరోటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది ఫీల్‌గుడ్ హార్మోన్. అందుకే మన రోజువారీ ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే మితిమీరిన చక్కెర స్థాయులు లేని కార్బోహైడ్రేట్లను తీసుకోవడం మంచిది. తిన్న తర్వాత త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయులను పెంచే ఆహారానికి బదులుగా కూరగాయలు, బీన్స్, పొట్టు తీయని ధాన్యాలను తీసుకోవాలి.క్యారట్ శరీరంలో రక్తాన్నే కాదు... ఆ రక్తంలో ప్లేట్లెట్ కౌంట్‌ని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందారని సర్వేలో తేలింది. క్యారెట్‌ని నేరుగానైనా, సలాడ్ రూపంలోనైనా ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది.ఆయుర్వేదం ప్రకారం భోజనం చివరిలో నెయ్యి, బెల్లం మిశ్రమాన్ని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ సవ్యంగా సాగుతుంది. శరీరంలోని వ్యర్ధాలన్నీ బయటకు పోయి ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా జీవశక్తి పెరుగుతుంది. నెయ్యి, బెల్లం రెండిట్లోనూ పోషక ప్రయోజనాలు ఎక్కువే. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఎముకల ఆరోగ్యాన్ని పెంచి, రోగనిరోధక శక్తిని కూడగడితే, బెల్లంలో మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల భోజనానంతరం నెయ్యి, బెల్లం తినడం వల్ల శరీరానికి కావలసిన ఇతర ΄ోషకాలు పుష్కలంగా అందుతాయి. ΄ోషకాహార లోపం రాకుండా శరీరం సవ్యంగా పనిచేస్తుంది. అయితే, తినమన్నారు కదా అని పెద్ద పెద్ద ముక్కలు తినేయకూడదు. చిన్న ముక్క తింటే చాలు. (చదవండి: సిట్ రైట్: సరిగ్గా కూర్చుందాం ఇలా..!) -
స్నేహితులతో ఫ్యాషన్ ఈవెంట్లో నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)
-
Fashion going back to the root మూలాల్లోకి ఫ్యాషన్ ప్రయాణం
సాక్షి, సిటీబ్యూరో: కొన్నేళ్ల క్రితం ఫ్యాషన్ ఔత్సాహికులు అత్యాధునిక డిజైన్ల వైపు మొగ్గు చూపేవారని, కానీ ప్రస్తుతం మళ్లీ పాత రోజుల్లోకి వెళ్తున్నారని, ఆనాటి డిజైన్లకు మళ్లీ ఆదరణ పెరుగుతోందని ప్రముఖ జువెల్లరీ డిజైనర్, విభ జ్యూవెలరీ వ్యవస్థాపకురాలు అనీషారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా సాధారణ స్థాయి మొదలు విలాసవంతమైన జీవితం గడుపుతున్న మహిళల వరకు ఆభరణాల ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని.. దీనికి అనుగుణంగా రూపొందిస్తున్న కలెక్షన్లకు మాత్రమే మార్కెట్లో ఆదరణ పెరుగుతోందని అన్నారు. మణికొండ వేదికగా నూతనంగా రూపొందించిన వింటెరా కలెక్షన్‌ను బుధవారం ఆవిష్కరించారు. అంతరంగమే.. ప్రేరణ అందించేలా..మన ఆలోచనల్లోని మార్పులు, చేర్పులు, ఆచరణాత్మక దృక్పథాలే మన విజయాలు, గమ్యాన్ని నిర్ణయిస్తాయని విద్యావేత్తలు, ప్రముఖులు స్పష్టం చేశారు. నగరంలోని వోక్స్సెన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన టెడ్ ఎక్స్ టాక్స్‌లో పలువురు ప్రముఖులు పాల్గొని యువతకు విజయాల సాధనలో దిశానిర్ధేశం చేశారు. ఇంటర్నేషనల్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల రచయిత, ఆరి్టస్ట్, ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ మయూర్ కల్బాగ్ స్వీయ–ఆవిష్కరణ పరివర్తనపై తన దృక్పథాలతో ఆకట్టుకున్నారు. అఘోరి – యాన్ అన్‌టోల్డ్ స్టోరీ, స్మైల్ ఎట్ స్ట్రెస్, రైజింగ్ వాటర్‌ఫాల్ అడ్వెంచర్స్ ఆఫ్ పూర్ణ వంటి విజయవంతమైన పుస్తకాలకు ప్రసిద్ధి చెందిన కల్బాగ్ తన ప్రసంగంలో వృద్ధికి ఉ్రత్పేరకంగా ఆంతరంగిక భావనను చూపారు. ఎర్టెన్ ట్యూన్స్ సహవ్యవస్థాపకుడు అసోసియేట్ డీన్ సంతోష్ కొచెర్లకోట, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత చింతకింది మల్లేశం, చుర్రోల్టో హైదరాబాద్ – జాసా మీడియా వ్యవస్థాపకుడు నీహర్ బిసాబతిని పాల్గొన్నారు. మలేషియా రెగట్టాలోలో సిటీ సెయిలర్స్ మలేషియాలోని పెర్దానాలో జరగనున్న 21వ లంకావై అంతర్జాతీయ రెగట్టాకు మన రాష్ట్రానికి చెందిన 11 మంది సెయిలర్స్ ఎంపికయ్యారు. ముంబైలో ఇటీవల జరిగిన సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం గెలుచుకున్న ప్రీతి కొంగర, జోగులాంబ గద్వాల్‌కు చెందిన చాకలి కార్తీక్‌తో కలిసి 470 మిక్స్డ్ క్లాస్ సీనియర్స్ విభాగంలో పోటీపడనున్నారు. పలు జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలు సాధించిన నగరానికి చెందిన వైష్ణవి వీరవంశం, నల్గొండ జిల్లాకు చెందిన యువ గిరిజన బాలుడు శ్రావణ్ కాత్రవత్తో 420 మిక్స్డ్ క్లాస్ జూనియర్స్‌లో పోటీ పడుతున్నారు. వీరు ప్రస్తుతం భారత్‌లో నంబర్–1 ర్యాంక్‌లో ఉన్నారు. రిజ్వాన్ మొహమ్మద్, రసూల్‌పురాకు చెందిన లాహిరి కొమరవెల్లి, వినోద్ దండు, చంద్రలేఖ, భానుచంద్ర, రవికుమార్, బద్రీనాథ్ కూడా పోటీ పడుతున్నారని తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుహీమ్ షేక్ తెలిపారు. -
కుంభమేళాలో ఆకర్షించిన ప్రధాని వస్త్రధారణ
ప్రయాగ్‌రాజ్:ప్రధాని మోదీ తాను ధరించే దుస్తుల ప్రత్యేకత గురించి వేరే చెప్పనవసరం లేదు. దుస్తుల విషయంలో ఆయన ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్‌ను అనుసరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించే సందర్భం ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదాయానికి తగట్టు వ్యవహరిస్తూనే ఫ్యాషన్‌ను ఫాలో అవుతుంటారు.బుధవారం(ఫిబ్రవరి5) ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఏకంగా మూడు రకాల దుస్తులు ధరించారు. అరాలీ ఘాట్ నుంచి త్రివేణి సంగమానికి బోట్లో వెళుతున్న సమయంలో సంప్రదాయ కుర్తా,పైజామా పైన నెహ్రూ జాకెట్ ధరించారు.ఇక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించే సమయంలో మాత్రం ప్రధాని సంప్రదాయానికి భిన్నంగా అథ్లీజర్ దుస్తులను ధరించారు. మెడలో నీలిరంగు స్కార్ఫ్ వేసుకుని మణికట్టుకు రుద్రాక్ష మాల చుట్టుకున్నారు.స్నానం పూర్తయి హారతి ఇచ్చే సమయంలో కుర్తా,చుడీదార్ పైజామా వేసుకున్నప్పటికీ కుర్తాపై పఫ్ఫర్ జాకెట్ ధరించారు.తలపై రంగురంగుల పహారీ టోపీ ధరించారు. ప్రధాని కుంభమేళా పర్యటన సమయంలో ధరించిన దుస్తుల విషయంలో సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. -
‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సిందులో మరోసారి తన ఎటైర్‌తో అందర్నీ ఆకర్షించింది. సింధు కోర్టులో మెరుపు షాట్లతో అబ్బుర పర్చడంమాత్రమే కాదు, తనదైన శైలి ఫ్యాషన్‌తో అందమైన చీర కట్టుతో ఆకట్టుకుంది. ‘మీ అండ్ మైన్’ అంటూ ఇన్‌స్టాలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులను ఆమె లుక్‌కి ఫిదా అవుతూ కామెంట్స్పెట్టారు.ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన పీవీ సింధు క్లాసిక్ ఇండియన్ కాంజీవరం చీరలో అద్భుతంగా కనిపించింది. అందమైన బిగ్ జరీ బోర్డ్ పట్టుచీరలో నవ్వుతూ యువరాణిలా కనిపించింది. చీర అంతా తెల్లటి ఎంబ్రాయిడరీ అందంగా కనిపిస్తోంది. దీనికి జతగా మల్టీ లేయర్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులతో తన లుక్ ను మరింత ఎలివేట్ చేసుకుంది. మృదువైన కర్ల్స్లో స్టైల్ చేసి అలా వదిలేసింది. ఇదీ చదవండి: ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్వెంకట దత్త సాయి విషయానికొస్తే, అతను తెల్లటి కుర్తా-పైజామా సెట్లో ఎప్పటిలాగానే మెరిసిపోయాడు. తన లుక్‌ను మరింతగా పెంచుతూ,పీచ్-హ్యూడ్ఎంబ్రాయిడరీ జాకెట్ ధరించాడు. ఇంకా గోల్డెన్ ఎంబ్రాయిడరీ, బటన్స్ జాకెట్‌కు ట్రెండీ స్టైల్‌ను జోడించాయి. View this post on Instagram A post shared by PV Sindhu (@pvsindhu1) కాగా రెండుసార్లు ఒలింపియన్ అయిన సింధు గత సంవత్సరం డిసెంబర్లో వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రతీది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెహిందీ, సంగీత్ వేడుకల్లో అందంగాముస్తాబై, ఫ్యాషన్ ప్రియులు కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. సమయానికి తగ్గట్టుఅద్భుతమైన సాంప్రదాయ దుస్తులతో ఈ జంట అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. మ్యాచింగ్ డైమండ్ ఆభరణాలతో పీవీ సింధు కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది.ఇదీ చదవండి: తెల్లవెంట్రుకలను చూసి చింతించాల్సిన అవసరం లేదు! ఇంట్రస్టింగ్ స్టోరీ -
ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్
ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్,సంజనా బాత్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. ఇండియాలో సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సంజనా బాత్రా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాదాపు పెళ్లైన అయిదేళ్ల తరువాత తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సంజన బాత్రా , అవ్రాల్ బెరి దంపతులకు అభినందనలు తెలిపారు.గర్భధారణను అత్యంత హృద్యంగాసంజన ,ఆమె భర్త అవ్రాల్ బెరి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో ఒక అద్భుతమైన రీల్‌ను పంచుకున్నారు. ఇందులో వారి పెట్ డాగ్స్‌తో పాటు తాము తల్లిదండ్రులను కాబోతు న్నామనే విషానే అందంగా ప్రకటించారు. అవర్ ప్యాక్ ఈజ్ గ్రోయింగ్ అనే క్యాప్షన్‌తో తమ కుటుంబంలోకి మరో ప్రాణం రాబోతోందనే విషయాన్ని వెల్లడించారు. సంజన ఒక ఫ్లోవీ గౌనులో మెరుస్తూ, తన బేబీ బంప్‌ను అప్యాయంగా పట్టుకుంది. తీగలపై వేలాడుతున్న బేబీ దుస్తులు మరింత అద్భుతంగా కనిపించాయి. సెలబ్రిటీలు,అభిమానులు కాబోయే తల్లిదండ్రులపై ప్రేమను కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Sanjana Batra (@sanjanabatra) ముందుగా అభినందనలు తెలిపినవారిలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఒకరు. ఆమె "అభినందనలు బాచీ" కామెంట్ చేసింది. ఇంకా హీరోయిన్ శిల్పా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇషితా మంగళ్ , ఫ్యాషన్ కన్సల్టెంట్ స్టైలిస్ట్ స్మృతి సిబల్ ,ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ సాక్షి సింధ్వాని తదితరులు లవ్ ఎమోజీలతో తమ సంతోషాన్ని ప్రకటించారు. ముంబైకి చెందిన సంజనా యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది. క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన ఆమెను ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించేలా చేసింది. బ్యూటీ అండ్ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్‌గా పనిచేస్తున్న సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాకు పనిచేసింది. అలా ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులకు ప్రముఖులకు స్టైలింగ్ చేసింది. అలాగే పద్మావత్, గల్లీ బాయ్ వంటి చిత్రాలలో ఆమె చేసిన కృషికి ఆమె ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. వోగ్ ఇండియా, హార్పర్స్ బజార్ ఇండియా, ఎల్లే ఇండియాతో సహా అనేక మ్యాగజైన్లలో స్టైల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంజన బాత్రా , కెన్నెల్ కిచెన్ ఫౌండర్ అవ్రాల్ బెరి పదేళ్ల పరిచయం తరువాత2020లో పెళ్లి చేసుకున్నారు. -
ఫ్యాషన్‌తో కల సాకారం చేసుకున్న తాన్యా
అప్పటి వరకు అమ్మనాన్న, కుటుంబ సంరక్షణలో సాఫీగా సాగిపోయే జీవితం ఒక్కసారిగా తలకిందులైతే..! 16 ఏళ్ళ వయసులో తాన్యా జీవితం అలాగే అయ్యింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, తండ్రి వదిలేసి వెళ్లటంతో తల్లి దేవేశ్వరి నాయల్ తాన్యాను, ఆమె తమ్ముడిని పెంచటానికి అనేక ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొంది. ఆ సమయంలో కూలిపోతున్న కలల ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి తాన్యా తల్లికి చేదోడుగా ఉండి, తను కూడా సొంతకాళ్లపై నిలబడింది. ఫ్యాషన్ డిజైనర్‌గా, విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది.జీవితంలోని ఏదో ఒక దశలో చీకటి క్షణాలు కమ్ముకుంటాయి. ఇలాంటప్పుడు కూడగట్టుకున్న ధైర్యం నిలిచిన విధానం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తనను తాను నిలదొక్కుకోవడమే కాకుండా తల్లికి చేదోడుగా ఉంటూ ఎదిగిన తాన్యా యువతకు స్ఫూర్తిగా నిలిచే ఓ పాఠం.ముంచెత్తే సవాళ్లుపదహారేళ్ల వయసు అంటే ఎన్నో కలలతో కూడుకున్నది. కుటుంబం నుంచి భద్రతను కోరుకునే కాలం. అలాంటి సమయంలో ఇల్లు అభద్రతలో కూరుకు΄ోయింది. వయసులో ఉండటం కారణంగా చుట్టూ నిండా ముంచెత్తే సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం, అచంచలమైన స్ఫూర్తితో, ఆమె తన పరిస్థితుల సంక్లిష్టతలను బ్యాలెన్స్ చేసుకోగలిగింది. సరైన చదువు లేకపోవడంతో తగిన ఉపాధి దొరకక దేవేశ్వరినాయల్ చాలా కష్టపడేది. దీంతో కుటుంబ ఆర్థిక ఒత్తిడి ఆమె తట్టుకోలేకపోయేది. ఈ క్లిష్ట సమయంలో తాన్య ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అభ్యసిస్తూనే చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పే బాధ్యతను తీసుకుంది. ఇంతలో, కొత్త అవకాశాల కోసం తమ ఇంటిని వదిలిపెట్టారు. తాన్య నాటి రోజులను గుర్తుచేసుకుంటూ–‘పరిచయస్తుల ద్వారా మా అమ్మతో కలిసి రాష్ట్ర దూరదర్శన్ కేంద్రానికి చేరుకున్నాను. అక్కడ, గిరిజనుల దుస్తులను డిజైన్ చేయడానికి నాకు ఆఫర్ వచ్చింది. అప్పటి సెంటర్ డైరెక్టర్ అనుపమ్ జైన్, ఆమె తల్లి మధ్య జరిగిన సంభాషణలో నాకో మార్గం కనిపించింది. దూరదర్శన్ సిబ్బందికి ఒక సాధారణ టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని జైన్ మాతో చెప్పింది. ఇది మా జీవితాలకు ఒక మలుపుగా మారింది’ అంటుంది తాన్యా.అంకిత భావందేవేశ్వరి గర్వాలీ, హిందీ భాష రెండింటిలోనూ నిష్ణాతులు. ఆమె భాషా ప్రావీణ్యం దూరదర్శన్ లోని ఒక అధికారి దృష్టిని ఆకర్షించింది. మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది స్థానిక కళాకారులు హిందీ రాకపోవడంతో ఇబ్బంది పడుతుండేవారు. వారి ఆలోచనలను హిందీలోకి అనువదించడం ద్వారా దేవేశ్వరి భాషా అంతరాన్ని తగ్గించేవారు. అలా దేవేశ్వరి, తాన్య స్థిరమైన ఆదాయం పొందడం అక్కడ నుంచే మొదలైంది. తాన్య అంకితభావం, నైపుణ్యం దూరదర్శన్ కేంద్రంలో కళాకారుల కోసం దుస్తులను రూపొందించే అవకాశాన్ని కూడా సంపాదించిపెట్టింది. కుటుంబం ప్రధాన జీవనోపాధిగా ఆమె పాత్రను మరింత పటిష్టం చేసింది. ఎంతోమందికి ఇబ్బంది అనిపించే బాధ్యతను తాన్యా అతి చిన్న వయసులోనే అలా తీసుకుంది. (కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్)సామాజికంగా ఉన్నతంగా!చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నప్పుడు, దేవేశ్వరి గుండెలో ఆమె మాజీ భర్త పట్ల ద్వేషం ఉండేది. ఆమె తన గౌరవాన్ని తిరిగి పొందాలని చదువుతో తన పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురావాలనుకుంది. నిశ్శబ్ద ప్రతీకారంతోనే సామాజికంగా ఉన్నతంగా నిలబడాలని ఆశించింది. వివిధ మార్గాల్లో ఆదాయ వనరులతో ఆమె తాన్య, తరుణ్‌ను మర్చంట్ నేవీలోకి పంపగలిగింది. పోరాటం నుండి విజయం వరకు తాన్య ప్రయాణం అనేక మైలురాళ్లతో సాగింది. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె పేరు పొందుపరచడం. (Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!)నేడు, తాన్య తన స్వంత సంస్థ అయిన ‘తంతి’ వ్యవస్థాపకురాలు. ఈ పదం సంస్కృతం నుండి తీసుకున్నది. ఒక చిన్న వెంచర్‌గా ప్రారంభమైన ‘తంతి’ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న వ్యాపారం. డిజైనర్లు, టైలర్లు, మహిళలతో సహా 53 మందికి వ్యాపారం ద్వారా ఉపాధి కల్పిస్తోంది. ఉత్తరాఖండ్‌లో తాన్యా నాయల్ పేరు ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆ పేరు ఒక్కటి చాలు, ఆమె స్థాయి ఏంటో ఇట్టే చెప్పేస్తారు. -
Paris Fashion Week 2025: ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా కలెక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్
-
కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్
మహానటి ఫేం కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంథోనీ తట్టిల్‌తో గత ఏడాది ఏడు అడుగులు వేసింది. పదిహేనేళ్ల డేటింగ్ను అత్యంత గోప్యంగా ఉంచి ఉన్నట్టుండి ఆంటోనీని వివాహ మాడి అభిమానులు సర్ప్రైజ్ చేసింది. తాజాగా తమ మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలును సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. ముఖ్యంగా కీర్తి సురేష్ ధరించిన లేత గులాబీరంగు లెహంగా విశేషాలు ఆసక్తికరంగా మారాయి. మరి ఆవివరాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తి సురేష్ వైబ్రంట్ లెహంగాతో అందంగా మెరిసిపోయింది. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో భర్త ఆంథోనీతో తన మెహందీ వేడుక ఫోటోలతోపాటు, పింక్ వైబ్రంట్ లెహంగా ఫోటోలను షేర్ చేసింది.కీర్తి, ఆంథోనీ ఇద్దరూ మ్యాచింగ్ దుస్తుల్లో అసలైన పెళ్లికళతో అందంగా కనిపించారు. చక్కటి ఎంబ్రాయిడరీ చేసిన గులాబీ రంగు కలిసిన బహుళ వర్ణ లెహెంగాలో కీర్తి మురిపించింది. దీనికి మిర్రర్ వర్క్, మోటిఫ్‌లు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఇంకా పాస్టెల్-హ్యూడ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, లేత వంకాయ గులాబీ రంగు కలగలిసిన దుపట్టా మరింత ఎట్రాక్టివ్‌గా అమరాయి. ఇక తమిళ అక్షరాలతో రూపొందిన చెవిరింగులు భలే ఉన్నాయ్! చాలా సాధారణమైన మేకప్, తేలికపాటి ఆభరణాలను ఎంచుకుంది. మరికొన్ని ఫోటోలలో సన్ గ్లాసెస్ పెట్టుకుని చలాకీగా చిలిపిగా కనిపించింది. మరోవైపు, ఆంథోనీ మ్యాచింగ్ కుర్తా-పైజామా ధరించాడు. ప్రకాశవంతమైన-నీలం రంగు కుర్తా, గులాబీ జాకెట్‌తో కీర్తి లుక్కు అద్దినట్టు సరిపోయాడు.కాగా కీర్తి సురేష, ఆంథోనీ వివాహం గ్రాండ్‌గా గోవాలో (2024, డిసెంబర్ 12) జరిగింది. తొలుత తమిళ బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం మూడుముళ్లు వేయించుకుంది. అలాగే మలయాళీ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే పసుపు తాడుతో తన లేటెస్ట్ మూవీ బేబీజాన్ ప్రమోషన్స్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్య పర్చింది. -
వివాహ వేడుకలో.. కాంట్రాస్ట్... కలర్ ఫుల్!
వివాహ వేడుక అనగానే ఆ సందడి, ఆ వైభవం మన కళ్ల ముందు ఇట్టే నిలుస్తుంది. వేదికపై వధూవరులిద్దరూ ప్రత్యేక అందంతో వెలిగిపోతుంటారు.అందుకు, వారి డ్రెస్ డిజైన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ‘ఈ వెడ్డింగ్ సీజన్‌కి కాంట్రాస్ట్ కలర్స్, కాన్సెప్ట్ థీమ్స్నితమ డ్రెస్సుల్లో ఉండేలా కోరుకుంటున్నారు’ అంటూ ప్రస్తుత ట్రెండ్‌ను పరిచయం చేస్తున్నారు హైదరాబాద్ వాసి సెలబ్రిటీ, బ్రైడల్ అండ్ గ్రూమ్ ఫ్యాషన్ డిజైనర్ అమూల్య క్రిష్ణ కొచర్. ‘‘వెడ్డింగ్‌తో తోపాటు ప్రతి ఈవెంట్‌కి స్పెషల్‌గా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో రీసెర్చ్ చేస్తుంటాం. ఆ డిజైన్స్ కస్టమర్ల ముందు పెడుతుంటాం. వారు ఏయే స్టైల్స్, కలర్ కాంబినేషన్స్ కోరుకుంటున్నారో దానిని బట్టి ప్రస్తుతం వేటిని ఇష్టపడుతున్నారో అర్ధమైపోతుంది. కాంట్రాస్ట్ కలర్ ట్రెండ్కిందటేడాది వరకు వధూవరులిద్దరికీ ఒకే కలర్ డ్రెస్సింగ్ ఎంపిక ట్రెండ్‌లో ఉండేది. ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్ ట్రెండ్ అయ్యింది. ఉదాహరణకు.. అబ్బాయి గోల్డెన్ కలర్ కుర్తా పైజామా దానికి కాంట్రాస్ట్‌గా అమ్మాయి లావెండర్ లేదా, రెడ్, గ్రీన్‌లో గోల్డెన్ కలర్ కాంబినేషన్ ఉండేలా ఎంచుకుంటున్నారు. అబ్బాయి సూట్‌కి తగినట్టు అమ్మాయి లెహంగా బార్డర్లోనో, ఎంబ్రాయిడరీలోనో చిన్న మార్పు కోరుకుంటున్నారు కానీ ఒకే కలర్లో కాదు. దీంతో ఇద్దరి డ్రెస్సింగ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రతీ వెడ్డింగ్ సీజన్‌కి కలర్ కాంబినేషన్స్‌లో మార్పులు వస్తుంటాయి.రీ యూజబుల్ కాన్సెప్ట్పెళ్లికి చాలా ఖర్చు పెట్టి ఒక డ్రెస్‌ని డిజైన్ చేసుకుంటారు. తిరిగి దానిని మళ్లీ ఎప్పుడూ ధరించరు. ఇది ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు మాత్రం పెళ్లి, సంగీత్, రిసెప్షన్ డ్రెస్సులను చిన్న చిన్న మార్పులతో మళ్లీ మళ్లీ ధరించేలా కాన్సెప్ట్స్‌ని ఇష్టపడుతున్నారు. దీంతో ఒక ట్రెడిషనల్ డ్రెస్‌ను వెస్ట్రన్ స్టైల్‌తో ఎన్ని విధాలుగా మార్చులు చేసి ధరించవచ్చో స్టైలింగ్ చేసి చూపిస్తాం. పెళ్లికే కాకుండా ఇతర ఫంక్షన్స్‌కు కూడా అదే డ్రెస్‌ను మళ్లీ ధరించవచ్చు. ప్రతిసారి ఆ డ్రెస్ కొత్త స్టైల్‌తో ఆకట్టుకుంటుంది.సంప్రదాయ చేనేత–ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్సాధారణంగా పెళ్లికి మన చేనేతలనే ఇష్టపడతారు. వాటిలో కంచిపట్టుదే ప్రథమ స్థానం. పట్టు బ్లౌజ్‌కే కాదు చీరకూ ఎంబ్రాయిడరీని ఇష్టపడేవారున్నారు. పూర్తి సంప్రదాయబద్దమైన చీరకట్టు అయినా డ్రేపింగ్‌లో మార్పులు ఉన్నాయి. రిసెప్షన్ ఇతర వెస్ట్రన్ స్టైల్స్‌కి మాత్రం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్‌కి ప్రాముఖ్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ఇటలీ ఫ్యాబ్రిక్‌ని వెస్ట్రన్స్టైల్స్కి ఉపయోగిస్తున్నాం. మన డిజైన్స్ ఇంటర్నేషనల్ టెక్నిక్స్పెళ్లి అనగానే మనదైన సంప్రదాయ కళ ఉట్టిపడేలా ఏనుగులు, మామిడిపిందెలు. పల్లకి.. కాన్సెప్ట్ డిజైన్స్ ఉంటాయి. ఇవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ డిజైన్స్. ఈ డిజైన్స్‌కి ఇంటర్నేషనల్ ఎంబ్రాయిడరీ టెక్నిక్స్ ఉపయోగిస్తుంటాం. వర్క్ నీటుగా, ఆకర్షణీయంగా, కోరుకున్న కాన్సెప్ట్ ఉండటంతో ఈ టెక్నిక్స్‌ను ఇష్టపడుతున్నారు’’ అని వివరించారు అమూల్య క్రిష్ణ కొచర్. (చదవండి: ఇంట్లోనే ఇన్స్టంట్ గ్లో..!) -
తెల్ల గులాబీలా హీరోయిన్.. వాచ్ ధర అన్ని లక్షలా?!
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అహుజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్లో ఆమె ఒకరు. నేషనల్ ఫీల్మ్ అవార్డుతో సహా పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నటి. అలాగే ఫోర్బ్స్ మ్యాగ్జైన్లో 2012, 2016లలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. అంతేగాదు ఆమె ఇల్లు కూడా భారతీయ వారసత్వ కళకు అద్దం పట్టేలా అత్యంత అందంగా ఉంటుంది. ఫ్యాషన్ పరంగా కూడా సోనమ్‌కి సాటి లేరెవ్వరూ. అంతలా ఆమె ఫ్యాషన్ వార్డ్ రోబ్‌లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కలెక్షన్ భారీగానే ఉంటుంది. సందర్భానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ అందుకు తగ్గ యాక్సెసరీలు ధరిస్తారామె. తాజాగా ఆమె ధరించి వాచ్ చూస్తే కళ్లు చెదిరిపోతాయి. దాని ధర కూడా అంతేస్థాయిలో అవాక్కయ్యేలా ఉంటుంది. మరీ ఆ వాచ్ విశేషాలేంటో సవివరంగా చూద్దామా..!.సోనమ్ కపూర్(Sonam Kapoor) ఇటీవల పారిస్ ఫ్యాషన్ వీక్(Paris Fashion Week)లో జరిగిన ఎలీ సాబ్ హాట్ కోచర్ షో(Elie Saab haute couture show)కు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం ఆమె ఉల్లాసభరితమైన ఆల్-వైట్ లుక్‌లో మైమరిపించింది. ఆమె పీస్ఫుల్ డ్రెస్సింగ్ వేర్ మనసుకు ఆహ్లాదంగా కనుచూపుని తిప్పుకోని విధంగా ఉంది. ముఖ్యంగా ఆమె చేతికి ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. నటి హై-ఎండ్ వాచ్ - పియాజెట్ లైమ్లైట్ గాలా ప్రెషియస్ రెయిన్‌బోని ధరించింది. దీన్ని పూర్తిగా విలువైన రంగు రాళ్లతో డిజైన్ చేశారు. అచ్చం రెయిన్ బో కలర్స్ మాదిరిగా ధగ ధగ మెరుస్తూ ఉంటుంది ఈ వాచ్. బ్రాస్లెట్ మాదిరిగా ఉన్న ఈ వాచ్ ధర దగ్గర దగ్గర రూ. 94 లక్షలు పైనే అంటే.. రూ. 1 కోటి పలుకుతుందట. 1973ల నాటి వింటేజ్ పీస్ అయినా ఈ వాచ్ మరోసారి ఫ్యాషన్ ప్రియుల మనుసుని దోచుకునేలా హైలెట్‌గా నిలిచింది. ఇక సోనమ్ తన సోదరి, స్టైలిస్ట్ చిత్ర నిర్మాత రియా కపూర్ డిజైన్ చేసిన డ్రెస్‌ని ధరించారు. ఆ డ్రస్‌కి తగ్గట్టు సన్‌గ్లాసెస్, గులాబీ ఆకారపు చెవిపోగులు, స్టేట్మెంట్ రింగులు, ఈ లగ్జరీ వాచ్‌తో రాయల్టీగా కనిపించారు సోనమ్. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) (చదవండి: 61 ఏళ్ల వయసులో బరువు తగ్గిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. జస్ట్ ఐదు నెలల్లోనే..) -
ఫ్యాషన్ రంగంలో పాపులర్‌గా : సెల‘ప్రెట్టీ’ లుక్
ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ షోలో సోనమ్ కపూర్ ర్యాంప్‌వాక్ చేశారు. వావ్.. డ్రెస్.. హూ ఈజ్ ద డిజైనర్? ఇలా ప్రశ్నలకు ఓహ్.. షీ ఈజ్ జయంతిరెడ్డి ఫ్రమ్ హైదరాబాద్.. ఇలాంటి సమాధానాలలో నగరం పేరు వినిపించడం ముంబయి, ఢిల్లీ, చెన్నై, గోవా, బెంగళూరు.. తదితర చోట్ల సర్వసాధారణంగా మారుతోంది. ఒకప్పుడు సెలిబ్రిటీలు తమ ఫ్యాషన్ డిజైనర్ అనగానే ముంబయి డిజైనర్ పేరు చెప్పేవారు. ఇప్పుడు నగరంలో టాప్ డిజైనర్లు సెలిబ్రిటీ డిజైనర్లుగా పేరొందారు. – సాక్షి, సిటీబ్యూరోనగర డిజైనర్ల విజయాలు ఔత్సాహిక డిజైనర్లకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు గెలుపు పాఠాలను వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీలు నగరానికి చెందిన పలువురు టాప్ సెలిబ్రిటీ డిజైనర్ల గురించిన విశేషాలను అందిస్తున్నారు. ‘సోమ్’.. ఫేమ్.. నగరానికి చెందిన డిజైనర్ శ్రియా సోమ్ ఆధునిక మహిళ డ్రీమ్ డ్రెస్సింగ్‌ను అందిస్తారు. సున్నితమైన హస్తకళ, క్లిష్టమైన అలంకారాలు, సొగసైన ఛాయాచిత్రాలకు ఆమె లేబుల్ శ్రియా సోమ్ ప్రసిద్ధి చెందింది. పీవీ సింధు, జాన్వీ కపూర్, లీసా హేడన్ తదితరులు ఆమె జాబితాలో ఉన్న కొందరు సెలిబ్రిటీలు.. అంతేకాక ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అందానికి వన్నెలు.. అనుశ్రీ.. క్లిష్టమైన పనితనం, ఆకర్షణీయమైన సిల్హౌట్‌లు ఉన్న ఎథెరియల్ లెహంగాలకు అనుశ్రీ రెడ్డి లేబుల్ పర్యాయపదంగా మారింది. లెహంగా సిల్హౌట్‌లు వాటి డీప్ కట్‌వర్క్ నెక్‌లైన్‌లు, ఎంబ్రాయిడరీ కట్‌వర్క్ అంచులతో ఉన్న దుపట్టాలకు ఆమె హాఫ్ శారీస్ ప్రసిద్ధి చెందాయి. అందమైన గులాబీలు, పాస్టెల్ల నుంచి రాయల్ వైలెట్లు, బంగారు పసుపు వరకూ రంగుల మిశ్రమాన్ని ఆమె చాకచక్యంగా ఉపయోగిస్తారు. ఇటీవలి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆమె కలెక్షన్స్.. అందమైన ఆర్గాన్జా, పూల ఎంబ్రాయిడరీ కట్‌వర్క్, తక్కువ చతురస్రాకార నెక్‌లైన్‌లు అన్ని షేడ్స్ న్యూడ్‌లు పింక్లతో మెరిపించాయి. ఆమె వర్క్ చేసిన సెలిబ్రిటీలలో అలియాభట్, కత్రినాకైఫ్, తాప్సీ పన్ను.. తదితరులు ఉన్నారు. ఆకా‘సమంత’.. అర్చన.. ఇటీవల నగరం నుంచి జాతీయస్థాయికి ఎదిగిన డిజైనర్లలో అర్చనరావు ముందు వరుసలో ఉన్నారు. 2012లో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తన లేబుల్‌ను ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదే ‘వోగ్ ఇండియన్ ఫ్యాషన్ ఫండ్’ను గెలుచుకున్నారు. ఇటీవల విడుదలైన ప్రభాస్ కల్కి సినిమాకు ఆమె చేసిన వర్క్ ప్రశంసలకు నోచుకుంది. బాలీవుడ్ బాద్‘షా’.. నగరం నుంచి బాలీవుడ్ తారలకు డిజైన్లు అందించిన ఘనతను గౌరంగ్ షా సొంతం చేసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేత కార్మికుల పనితనానికి పట్టం కడుతూ చేతితో నేసిన చీరలకు ప్రసిద్ధి చెందాడు. విద్యాబాలన్, సోనమ్ కపూర్, అదితీరావ్ హైదరీ సహా మరెందరో ఆయన డిజైన్లకు జై కొట్టారు. మహానటి సినిమా ద్వారా జాతీయ పురస్కారం అందుకున్నారు. మనదే ‘జయం’.. జయంతి రెడ్డి డిజైన్లు రాయల్ అద్భుత కథల వైబ్‌లను అందించడం ఖాయం. ఆమె డిజైన్Œలు సంప్రదాయ స్కర్ట్లు/లెహెంగాలతో జత చేసిన ఆధునిక క్రాప్–టాప్ సిల్హౌట్‌లు ఆసక్తికరమైన మిక్స్. గోల్డెన్, సిల్వర్జరీతో కూడిన ఆమె ఎంబ్రోయిడరీ వర్క్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్. అర్చనరావు డిజైన్ చేసిన న్యూడ్ కలర్ లేత గోధుమరంగు చీరకు బేబీ పింక్ కట్ వర్క్ బోట్ నెక్ బ్లౌజ్ మెటాలిక్ సిల్వర్ బెల్ట్‌తో జత చేసి, నటి సమంతా మెరిశారు. ఫెమినా వెడ్డింగ్ టైమ్స్‌లో ప్రదర్శించబడిన టూ–టోన్డ్ కార్సెట్ రఫిల్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ మెరిశారు. స్టార్ ప్లేయర్ పీవీ సింధు, డిజైనర్ శ్రియా సోమ్ మొదటి సోలో షో కోసం ర్యాంప్ వాక్ చేసింది. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో షో స్టాపర్‌గా లీసా హేడన్ డిజైనర్ శ్రియా సోమ్ మెరిసే, పొడవాటి చేతుల చోళీ అద్భుతమైన లెహంగా ధరించి.. అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల సోనమ్ కపూర్ గౌరంగ్ షా డిజైన్ చేసిన పసుపు రంగు కుర్తా లెహంగా స్కర్ట్‌తో మ్యాచింగ్ దుపట్టా ధరించి ఒక ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉత్సవాల్లో, బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన్ డిజైనర్ గౌరంగ్‌షా తీర్చిదిద్దిన ఆల్ ఇన్ ఆల్ అనార్కలీ సూట్ ధరించారు. ఓ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ ఈవెంట్‌కి రకుల్ ప్రీత్ సింగ్ అర్చనారావు డిజైన్లు ధరించి హాజరై అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇదీ చదవండి: మూడే మూడు చిట్కాలతో మిరాకిల్ : దెబ్బకు 8 కిలోలు తగ్గింది! -
ఏసీపీ అనితా: పట్టుదలలోనే కాదు ఫ్యాషన్‌లోనూ తగ్గేదెలే!( ఫోటోలు)
-
చిరకాల ప్రియుడ్ని పెళ్లాడిన ‘కర్లీ గర్ల్’, యువరాణిలా..ఫోటోలు వైరల్
ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ తన చిరకాల ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. 'కర్ల్ గర్ల్' అనే ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో ప్రసిద్ధి చెందిన రూపాలీ హసీజా, బాక్సర్, హెల్త్ కోచ్ విజయ్కాంబ్లీని పెళ్లాడింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.దీంతో కొత్త జంటకు అభినందనల వెల్లువ కురుస్తోంది.పెళ్లికూతురు ముస్తాబులో రూపాలీ యువరాణిలా మెరిసిపోయింది. తెలుపు , గోధుమ రంగు మేళవించిన పువ్వులు, న్యూడ్-టోన్డ్ షీర్ చీరను ధరించింది. దానికి సరిపోయే దుపట్టాతో స్టైల్ చేసింది. రూపాలీ లుక్‌లో మరో హైలైట్ ఆమె ఆభరణాల ఎంపిక. వివాహ వేడుకను దృష్టిలో ఉంచుకుని, డైమండ్ నెక్‌పీస్, మ్యాచింగ్ కుందన్ మాంగ్ టీకా,మ్యాచింగ్ స్టడ్ చెవిపోగులు భలే అందంగా అమరాయి. చదవండి: పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్ సింగర్మరోవైపు, రూపాలి భర్త విజయ్ కాంబ్లీ ఆలివ్ రంగు కుర్తా-పైజామా ధరించాడు. అలాగే దానికి మ్యాచింగ్ తలపాతో పెళ్లి కొడుకు ముస్తాబులో రాజాలా ఉన్నాడు. తిలకం దిద్దడం, ముద్దు పెట్టుకోవడం లాంటి అందమైన ఫోటోను స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉన్నాయి. ఆచారాన్నిజనవరి 24న పెళ్లకున్నట్టు తెలిపింది. 10.1 లక్షలకుపైగా ఫాలోయర్లున్న రూపాలి తన స్పెషల్ డేగురించి ఇలా పోస్ట్ చేసింది. నేను నీ రాణిని, నువ్వు నా రాజావి."మై రాణి హన్ తేరే, తు రాజా మేరా వే మై హీర్ తేరే సజ్నా, తు రంఝా మేరా వే) అంటూ పేర్కొంది. (అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!) View this post on Instagram A post shared by R U P A L I H A S I J A (@curlgirlofficial)ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్గా పాపులర అయిన రూపాలీ ఎట్టకేలకు తన చిరకాల ప్రియుడిని వివాహం చేసుకుంది, అతనితో మూడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో ప్రపోజల్ ఫోటోలను షేర్ చేసింది. బీచ్‌లో అందమైన తమ డ్రీమ్ ప్రపోజల్ ఫోటోలను తమ బంధాన్ని అభిమానులకు తెలిపిన సంగతి తెలిసిందే.గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ : శారీ స్నీకర్స్
రెట్రో స్టైల్ ఎప్పుడూ బెస్ట్‌గా మార్కులు కొట్టేస్తూ ఉంటుంది.ఫుట్వేర్లోనూ కంఫర్ట్ మిస్ కాకుండా కలరఫుల్గా ఆకట్టుకుంటుంది. జిమ్, ఆఫీస్, క్యాజువల్ వేర్‌గా పేరున్న స్నీకర్స్ ఈ ఏడాది ఫుట్‌వేర్ ట్రెండ్‌లో ముందుండబోతున్నాయి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ కోరుకునే ఈ స్నీకర్స్ బ్రైడల్ వేర్‌గానూ పర్ఫెక్ట్ ఛాయిస్గానూ నిలుస్తున్నాయి. తమ ప్రత్యేక రోజును మరింత చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకునే వధువులకు స్నీకర్స్ సరైన ఎంపిక అవుతున్నాయి. ఈ స్టైలిష్ కిక్స్ సంప్రదాయ హైహీల్స్‌కు సౌకర్యవంతమైన, ఫ్యాషన్‌ని అందిస్తున్నాయి. పెళ్లి వేడుక అనగానే సంగీత్, రిసెప్షన్ హంగామాలు కళ్లముందు కదలాడతాయి. హుషారెత్తించే డ్యాన్సులు, డీజే సాంగ్స్‌తో యువత ఆటాపాటల్లో మునిగితేలుతుంటారు. వీరి స్పీడ్ చిందులకు స్నీకర్స్ బెస్ట్ ఎంపిక. కాక్టెయిల్ పార్టీకి సంగీత్కి జిగేల్మనిపించే డ్రెస్సులే కాదు వాటికి ΄ోటీగా నిలిచే హ్యాండీక్రాఫ్టెడ్ స్నీకర్స్ కలర్ఫుల్గా ఆకట్టుకుంటున్నాయి. కస్టమైజ్డ్హీల్స్ను వదులుకుని ఫ్యాషన్ కంటే సౌకర్యాన్ని ఎంచుకుంటున్నారు ఈ తరం వధువులు. దీంతో ట్రెండ్‌ను తామే కొత్తగా సెట్ చేస్తున్నారు. దీంతో ఫుట్‌వేర్ నిపుణులు, డిజైనర్లు కలిసి అందరి దృష్టిని ఆకర్షించేలా స్నీకర్లు అదంగా తయారుచేస్తున్నారు. క్లాసిక్ వైట్ స్నీకర్స్‌తో కాకుండా అద్భుతమైన సాంప్రదాయ డిజైనర్ స్నీకర్లను అందిస్తున్నారు. హీల్స్ నుంచి ప్లాట్ లెహెంగా స్నీకర్, శారీ స్నీకర్ .. అంటూ ఫ్యాబ్రిక్ మోడల్‌కు తగిన విధంగానే కాదు పూర్తి భిన్నమైన రంగులను ఫన్ ఇష్టపడే వధువులు ఎంచుకుంటున్నారు. హల్దీ, సంగీత్, బ్యాచిలర్ పార్టీలకు తగిన విధంగా తమ పాదరక్షలను కూడా ఎంచుకుంటున్నారు. ఎత్తున్న హీల్స్ నుంచి ఫ్లాట్‌గా ఉండే స్నీకర్స్‌ను ధరించడం వల్ల మడమల నొప్పి లేకుండా రెచ్చి΄ోయి డ్యాన్స్ చేయవచ్చు అనేది నవతరం ఆలోచన. వీటిలో గోటా ఎంబ్రాయిడరీ స్నీకర్స్. స్టైప్ స్నీకర్స్, కాన్వాస్ స్నీకర్స్...గా అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ డిజైనింగ్‌కి ఆర్డర్ఏ బ్రాండ్ స్నీకర్ అయినా వాటిని ప్రింటెడ్, లేస్, స్వరోస్కి, పూసలు, అద్దాలు, కుందన్స్‌తో అందంగా తీర్చిదిద్దుతున్నారు. సోషల్‌మీడియా వేదికగానూ కస్టమైజ్డ్ షూ/స్నీకర్స్ డిజైనింగ్‌కి ఆర్డర్ మీద అందంగా తయారు చేసి ఇస్తున్నారు. -
సృజనకు పెన్నిధి
క్రియేటివ్ జీల్‌కి నిలువెత్తు నిదర్శనం స్టయిలిస్ట్ నిధి జెస్వానీ! అవుట్ డేటెడ్ అనే మాటను దరిదాపుల్లోకి కూడా రానీయదు. డిజైన్స్‌లో కానీ.. స్టయిలింగ్‌లో కానీ కాలమే ఆమెతో పోటీ పడాలి!నిధి జెస్వానీ.. పుట్టి, పెరిగింది ముంబైలో! మాస్ మీడియాలో డిగ్రీ, అడ్వర్టయిజింగ్‌లో మాస్టర్స్ చేసింది. చదువైపోయాక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్ తాన్యా ఘావ్రీ దగ్గర ఇంటర్న్‌గా చేరింది. ఎన్నో ఫ్యాషన్ షోలకు అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది. వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు సెలబ్రిటీల వివాహాది శుభకార్యాల్లో వారి కుటుంబ సభ్యులకు స్టయిలింగ్ చేసింది. తను స్టయిల్ చేసే ప్రతివ్యక్తి ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే లేటెస్ట్ ఫ్యాషన్‌ను అనుసరిస్తూ వాళ్లను అందంగా, ఎలిగెంట్‌గా ప్రెజెంట్ చేసి, అతిథుల ఫేవరిట్ స్టయిలిస్ట్‌గా మారింది. క్రియేటివిటీ హై లెవెల్లో ఉండే తన డిజైన్స్‌తో బాలీవుడ్ అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాలకు ఆమెను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పెట్టుకున్నారు. ఆధునిక డిజైన్స్‌కు సంప్రదాయ టచ్నిచ్చి, చాలా త్వరగా నిధి బాలీవుడ్లో తన ప్రత్యేకతను చాటింది. అది సెలబ్రిటీలే ఆమెను సంప్రదించేలా చేసింది. మీరా కపూర్, నుస్రత్ భరూచా, శ్రద్ధా శ్రీకాంత్, భూమి పెడ్నేకర్, కృతి శెట్టి, రకుల్‌ప్రీత్ సింగ్, మృణాల్ ఠాకూర్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, కృతి సనన్‌లకు స్టయిలిస్ట్‌గా పనిచేసింది. -
డైమండ్ ఆభరణాలతో మహారాణిలా సితార, ‘తండ్రికి తగ్గ బిడ్డ’ అంటూ ప్రశంసలు
-
వెడ్డింగ్ అయినా, ఈవినింగ్ పార్టీ అయినా.. ఆల్‌టైమ్ అట్రాక్షన్ షావల్ టాప్స్
ఇండో–వెస్ట్రన్ స్టైల్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండేదే. బ్రైడల్ అయినా క్యాజువల్ అయినా ప్రత్యేక సందర్భం అయినా మీ డ్రెస్‌ని కేప్/షావల్/ జాకెట్‌గా పేరున్న ఒకే ఒక టాప్‌తో లుక్‌ని పూర్తిగా మార్చేయవచ్చు. మెడ నుంచి భుజాల మీదుగా చేతులను కప్పుతూ ఉంటుంది కాబట్టి దీనిని షావల్ టాప్ అంటుంటారు. ఈ టాప్ లుక్ మోడల్ని స్టైల్‌కి తగినట్టు మార్చుకోవచ్చు. ట్రెండ్‌లో ఉన్న ఈ మోడల్ జాకెట్స్ హుందాతనం, రిచ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. వివాహ వేడుకల్లో గ్రాండ్‌గా వెలిగిపోవాలంటే ఎంబ్రాయిడరీ చేసిన కేప్‌ని ఎంచుకోవచ్చు. గెట్ టు గెదర్ వంటి ఈవెనింగ్ పార్టీలకు లేస్తో డిజైన్ చేసిన టాప్‌తో స్టైల్ చేయచ్చు. శారీ గౌన్స్ మీదకు మాత్రమే అచ్చమైన పట్టు చీరలకు కూడా ఈ సింగిల్ పీస్తో స్పెషల్ అట్రాక్షన్‌ను తీసుకురావచ్చు. లెహంగా బ్లౌజ్ మీదకు దుపట్టా ప్లేస్ షాల్ జాకెట్ మరింత ప్రత్యేకతను తీసుకు వస్తుంది. థ్రెడ్ వర్క్, ప్రింటెడ్ షావల్ జాకెట్స్ ఇండో వెస్ట్రన్ డ్రెస్సులకు స్పెషల్ లుక్‌ని జత చేస్తాయి.సందర్భాన్ని బట్టి ఒక డ్రెస్‌ను గ్రాండ్‌గా ధరించవచ్చు అదే మోడల్ని సింపుల్‌గానూ అలంకరించవచ్చు. -
New Year 2025 : నీతా అంబానీ న్యూ ఇయర్ లుక్, ధర ఎంతో తెలుసా?
అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగానే కాదు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా అందరికి సుపరిచితమే. నీతా అంబానీ ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ ఓనర్ కూడా. అలాగే నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటి ఆధ్వర్యంలో ప్రాచీన కళలకు, సంస్కృతులకు పెద్ద పీట వేస్తున్నారు. అనేక మంది కళాకారులను ఎన్ఎంఏసీసీ ద్వారా ఆదరిస్తున్నారు. అయితే నీతా అంబానీ ఫ్యాషన్ ఐకాన్ కూడా. చేనేత చీరలు, ఖరీదైన పట్టుచీరలు, విలువైన డైమండ్ ఆభరణాలు, లగ్జరీ బ్యాగులు, లగ్జరీ పాదరక్షలు, ఇలా ఒకటనేమిటి ప్రతీ విషయంలోనూ తనదైన శైలితో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో మరోసారి ప్రత్యేకంగా నిలిచారు. గోల్డెన్ కఫ్తాన్ గౌనులో నీతా అంబానీ గ్లామ్ న్యూ ఇయర్ లుక్ అభిమానులు, ఫ్యాషన్ ప్రియుల దృష్టిలో పడ్డారు. దాని ధర ఎంత అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Ritika kadam (@ritikahairstylist)సన్నిహితులు ,కుటుంబ సభ్యుల మధ్య 2025 ఏడాదికి స్వాగతం పలికారు నీతా అంబానీ. కొత్త కోడలు అనంత్ అంబానీ భార్య రాధిక మర్చెంట్‌కు ఇది మొదటి న్యూఇయర్ కావడం మరో విశేషం. న్యూ ఇయర్ సందర్భంగా అనంత్, ఆకాష్ అంబానీ జంట అందంగా కనిపించారు. ఇక నీతా అంబానీ 60 ఏళ్ల వయసులో కూడా డిజైనర్ ఆస్కార్ డి లా రెంటా కలెక్షన్, మౌస్లైన్ ఫాబ్రిక్‌తో రూపొందించిన ముదురు బంగారు కఫ్తాన్ గౌనులో అప్పరసలా మెరిసిపోయారు. నెక్లైన్ క్రిస్టల్ లీవ్స్, లాంగ్ కేప్ స్లీవ్స్, అందమైన కఫ్తాన్ సిల్హౌట్, వీటన్నింటికీ మించి ఫ్లోర్-స్వీపింగ్ హెమ్‌లైన్ మరింత ఆకర్షణీయంగా నిలిచారు. ఇంతకీ ఈ లగ్జరీ గౌన్ ధర ఎంతో తెలుసా? దీని ధర సుమారు రూ. 1.54 లక్షలు. -
హిస్టరీ రిపీట్స్ : 2025 ఫ్యా‘షైన్’
ఆధునికత మనకు ఎన్నింటినో పరిచయం చేస్తుంది.కానీ, ఫ్యాషన్‌లో మాత్రం రాబోయే రోజుల్లో హిస్టరీ రిపీట్ కాబోతోంది. వింటేజ్ హుందాగా విచ్చేస్తోందిముదురు రంగులు విదిల్చికొని లేత రంగులు కొత్త భాష్యం చెబుతున్నాయి. పవర్‌లూమ్స్ ఎంత పెరిగినా హ్యాండ్లూమ్స్ అందించే సౌకర్యానికి నవతరం పెద్ద పీట వేస్తోంది. 2025 ఫ్యాషన్ రంగంలో ప్రధానంగా కనిపించే పాత– కొత్తల కలయిక. ఫ్యాబ్రిక్ అనేది మన మనస్తత్వాన్ని ఎదుటివారికి పరిచయం చేస్తుంది. డిగ్నిఫైడ్ లుక్‌తో ΄ాటు మేనికి సౌకర్యాన్నిచ్చే సస్టెయినబుల్ ఫ్యాబ్రిక్‌ని నిన్నటి తరమే కాదు నేటి తరమూ ఆసక్తి చూపుతుంది. సస్టెయినబిలిటీ ఫ్యాబ్రిక్, పేస్టల్ కలర్స్, హెరిటేజ్ డిజైన్స్ ముందు వరసలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్త ఫ్యాషన్ షోలలోనూ వీటి హవానే కనిపిస్తోంది. హైదరాబాద్ వాసి, ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరి ఈ విషయం గురించి మరిన్ని వివరాలు ఇలా మన ముందుంచారు.నాణ్యమైన ఫ్యాబ్రిక్ మెటీరియల్ నాణ్యత పెరిగేకొద్దీ ధర కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అయినా మేనికి హాయినిచ్చే ఫ్యాబ్రిక్‌నే ప్రపంచమంతా ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు.. కలంకారీ డిజైన్స్ తీసుకుందాం. ఈ డిజైన్స్‌లో చాలా రెప్లికాస్ వచ్చాయి. ఔట్‌లైన్ కలంకారీ అయినా, డిజైన్ మొత్తం కెమికల్ ప్రింట్ ఇస్తున్నారు. ఇలాంటప్పుడు ఖర్చు తగ్గవచ్చు. కానీ, ఒరిజనల కలంకారీ ఫాబ్రిక్కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక .. కంచి, గద్వాల్, పైథానీ వంటి హ్యాండ్లూమ్స్లోనూ ఇమిటేషన్ పవర్‌లూమ్స్ వచ్చి, ఖర్చు తగ్గవచ్చు. కానీ, ఒరిజనల్ హ్యాండ్లూమ్ వైభవం ఎప్పటికీ తగ్గదు. పైగా, అలాంటి వాటిని తమ వార్డ్‌రోబ్‌లోకి తెచ్చుకోవడానికి మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ కలర్స్ ఇష్టపడుతున్నారు. మన దేశీయ ఉత్పత్తుల తయారీని ప్రొత్సహించడం, పెంచడం వంటి వాటి వల్ల ధరల్లోనూ మార్పులు వస్తాయి. డిమాండ్ పెరుగుతుంటే ఉత్పత్తి కూడా పెరుగుతుంది.లేలేత రంగులుఫ్యాబ్రిక్పై వాడే రసాయనాల ముదురు రంగులు తగ్గిపోనున్నాయి. ఇప్పటికే చాలా పెళ్ళిళ్లలోనూ చూస్తుంటాం. లేత రంగులు, నేచురల్ కలర్స్‌కి వచ్చేశారు. పేస్టల్ కలర్స్‌లో ఉండే గొప్పతనం ‘రిచ్’గా, ప్రత్యేకంగా చూపుతుంది. అందుకే నవతరం పేస్టెల్ కలర్స్వైపు మొగ్గుచూపుతుంది. ఈ ఆలోచనలు నిన్నటితరాన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో లేత రంగులు గొప్పగా వెలిగి΄ోనున్నాయి.హ్యాండ్ ఎంబ్రాయిడరీబామ్మలనాటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ వర్క్స్ మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. అంతేకాదు హ్యాండ్ పెయింట్, గాడీగా లేని ఎంబ్రాయిడరీని ఇష్టపడుతున్నారు. కొన్ని రకాల ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌ను కూడా తమ డ్రెస్ డిజైన్స్లలో చూపుతున్నారు. తేలికగా ఉండేలా..ఏ డ్రెస్ అయినా సరే కంఫర్టబుల్‌గా, సులువుగా ధరించే వీలు ఉండే డ్రెస్‌ల మీద ఫోకస్ పెరుగుతోంది. పెళ్లి వంటి గ్రాండ్ అకేషన్స్ అయినా లైట్వెయిట్ను ఇష్టపడతున్నారు. ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకున్నా సపై్టయినబుల్ ఫ్యాబ్రిక్‌ని ఇష్టపడుతున్నారు. వింటేజ్ స్టైల్రిసెప్షన్, ఫ్యాషన్ షో వంటి వేడుకలలో హైలైట్ కావడానికి డ్రెస్సుల ‘కట్స్’ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దీని వల్ల జ్యువెలరీ తక్కువ వాడుతున్నారు. ఇందులో భాగంగా హెరిటేజ్ కాన్పెప్ట్, రెట్రో స్టైయిల్ ముందుకు వస్తోంది. మెరుస్తున్న ఐవరీ చందేరీపై అప్లిక్ పూల వర్క్‌తో ప్రిన్సెస్ డయానా డ్రెస్‌లో నాటి రోజులను ముందుకు తీసుకువస్తుంది. ఆర్గానిక్ ముల్ చందేరి ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్ రొమాంటిక్ ఫినిషింగ్ టచ్‌ను జోడిస్తుంది. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన మందార పువ్వులు, మిర్రర్ వర్క్‌లతో నిండిన ముల్ చందేరీ డ్రెస్, ఫెదర్‌లైట్ వైట్ కేప్ మొత్తం రూపాన్ని అందంగా మార్చేస్తుంది. కాలం పరుగులు తీస్తూనే ఉంది.చేతితో ఎంబ్రాయిడరీ చేసిన మందార పువ్వులు, మిర్రర్ వర్క్‌లతో నిండిన ముల్ చందేరీ డ్రెస్, ఫెదర్‌లైట్ వైట్ కేప్ మొత్తం రూపాన్ని అందంగా మార్చేస్తుంది. -
షహర్ కా షాన్ షేర్వానీ
నవాబుల కాలం నుంచి ఇప్పటి దాకా షేర్వానీకి ఏమాత్రం క్రేజ్ తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు రాజ కుటుంబీకులు, సంపన్నవర్గాలకే షేర్వానీ పరిమితమయ్యేది. రానురాను పేద, ధనిక అందరూ షేర్వానీ అంటే ఆసక్తి కనబరుస్తున్నారు. పెళ్లిళ్లు, పేరంటాల్లో కుటుంబ సభ్యులంతా చిన్నాపెద్దా తేడా లేకుండా షేర్వానీ ధరించాల్సిందే.. బ్రాండెడ్ దుస్తులు మార్కెట్‌ను రాజ్యమేలుతున్నా.. రాజుల కాలం నాటి షేర్వానీలు పండగలు, శుభకార్యాలకు సరికొత్త శోభను తీసుకువస్తున్నాయి. ఇదే ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది. అభిరుచులకు అనుగుణంగా షేర్వానీ డిజైన్లలోనూ మార్పులొచ్చాయి. రాకుమారులు.. సినీహీరోలు.. రాజకీయ నాయకులు ఇలా సెలబ్రెటీలంతా భారతీయ సంస్కృతికి అద్దంపట్టేలా షేర్వానీని ధరించేందుకు మొగ్గు చూపుతున్నారు. కేవలం మన సంస్కృతే కాదు.. పాశ్చాత్య డిజైన్ల సమ్మేళనంగా సరికొత్త షేర్వానీలు మార్కెట్లో ఆదరణ పొందుతున్నాయి. హైదరాబాద్‌లో కేవలం నిజాం నవాబులు, ముస్లిం, మార్వాడీ సమాజంలోనే షేర్వానీ ఆహార్యం కనిపించేంది. ఇప్పుడు ఈ ఫ్యాషన్ అందరి ఒంటి మీదకు చేరింది. మొదట్లో కేవలం పెళ్లి కుమారుడే షేర్వానీతో ఊరేగేవాడు.. ఇప్పుడు వరుడే కాదు.. పెళ్లి బరాత్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఈ డ్రెస్ వేర్‌ను వాడటం పరిపాటిగా మారింది. విభిన్న రకాలతో షేర్వానీలతో బరాత్కే కొత్త అందం వస్తుందనే ప్రచారంతో వివాహంలో షేర్వానీ డ్రెస్ కోడ్‌గా మారింది. షేర్వానీ అంటే మక్కువ ఇండో వెస్టన్ డిజైన్స్‌తో వినియోగదారులకు నచ్చే విధంగా షేర్వానీలు తయారు చేస్తున్నాం. నేటి యువత మాములు డిజైన్ షేర్వానీలకు కాకుండా స్టైయిలి‹Ùగా కనబడటానికి కొత్త డిజైన్స్‌ను ఫాలో అవుతున్నారు. మారుతున్న డిజైన్స్‌కు అనుగుణంగా మా వద్ద షేర్వానీలు తయారవుతాయి. ప్రస్తుతం అన్ని మతాలు, వర్గాల వారు వీటిని ధరిస్తున్నారు. వారి వారి సంప్రదాయల డిజైన్లలో తయారు చేస్తున్నాం. షేర్మానీలు ధరించి శుభకార్యాలకు వెళితే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. శుభకార్యాలు పెళ్లిళ్లు విందుల్లో షేర్వాణి ధరించి వెళ్లే వారివైపే అందరి చూపు ఉంటుంది. నేటి యువత వీటిని ధరించడానికి మక్కువ చూపుతున్నారు. – ఇబ్రాహీమ్ బుఖారీ, జహాపనా డిజైనర్స్ వ్యవస్థాపకుడు బనారస్ పట్టుతో తయారీ షేర్వానీల తయారీలో బనారస్ పట్టుదే పైచేయి. ఈ పట్టుతోనే వీటిని ఉత్పత్తి చేసే అవకాశమున్నందున.. ఫ్యాషన్‌లో బనారస్ షేర్వానీలదే హవా. పురుషులు వ్రస్తాలలో పట్టుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. కేవలం షేర్వానీలలో మాత్రం ఈ పట్టుకే పట్టం కడుతున్నారు. ఇలా వస్త్ర నాణ్యతకు అనుగుణంగా వీటి ధరల్లో హెచ్చు తగ్గులున్నాయి. రూ.2వేల నుంచి రూ.2 లక్షల వరకు షేర్వానీలు లభ్యమవుతున్నాయంటే వీటికి మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. వీటికి ఉన్న ఆదరణ దష్ట్యా షేర్వానీ ప్రియులు కస్టమైజ్డ్ డిజైన్లు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా డిజైనర్లు సైతం పుట్టుకొచ్చారు. నగరంలో బుఖారీ ఫ్యామిలీ జహాపనా డిజైనర్స్ పేరుతో షేర్వానీ రంగంలో విప్లం తీసుకొచి్చంది. యుత్‌కు నచ్చే స్టయిల్స్‌తో పాటు అన్ని కట్స్‌లో షేర్వానీలు తయారవుతున్నాయి. -
పీవీ సింధు పెళ్లి సందడి: పాపులర్ డిజైనర్లు, స్పెషల్ మేలిముసుగు
బాడ్మింటర్ స్టార్ పీసీ సింధు తన కలల రాకుమారుడితో ఏడడుగులు వేసింది. ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో దత్త సాయితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్బంగా పీవీ సింధు వెడ్డింగ్ ఔట్ ఫిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అంతేకాదు, మొత్తం పెళ్లి వేడుకల్లో ప్రఖ్యాత డిజైనర్లకు సంబంధించిన అందమైన దుస్తులను ఎంపిక చేసుకోవడం విశేషం. సబ్యసాచి ముఖర్జీ నుంచిమనీష్ మల్హోత్రా వరకు, తన ప్రతీ బ్రైడల్ లుక్‌లోనూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది .డిజైనర్ మనీష్ మల్హోత్రా పీవీ సిందు ఐవరీ-టోన్డ్ బ్రైడల్ చీర వివరాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు.పెళ్లి ముహూర్తానికిబంగారు, వెండి జరీతో చేతితో నేసిన చీరను ముహూర్తానికి కట్టుకుంది. ఈ చారలో బద్లా జర్దోజీ ఎంబ్రాయిడరీ దీనికి స్పెషల్ ఎట్రాక్షన్. ఆమెధరించిన మేలి ముసుగులో పీవీ సింధు, వెంకటదత్తసాయి పేర్లు రాసి ఉండడం మరో ఎట్రాక్షన్.సింధుతో తన వివాహానికి మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఐవరీ కలర్ బ్రోకేడ్ షేర్వానీలో అందంగా కనిపించాడు వెంకట దత్త సాయి. దీనికి సింధుతో కలిసి మ్యాచింగ్ అన్‌కట్ డైమండ్ ఆభరణాలను ఎంచుకున్నాడు. బంగారు, వెండితో తయారుచేసిన స్టోల్,షాఫా జతచేసి తన వెడ్డింగ్ లుక్‌కి సరైన న్యాయం చేశాడు.వరమాల వేడుకకు సబ్యసాచి ముఖర్జీవరమాల వేడుక కోసం సింధు , వెంకట దత్త సాయి ఇద్దరూ సబ్యసాచి ముఖర్జీ దుస్తులను ఎంచుకున్నారు. గోల్డెన్ అండ్ రోజ్ కలర్ ఎంబ్రాయిడరీ రెడ్ లెహంగా ,ఫుల్ స్లీవ్ చోలీతో, షీర్ దుపట్టా ధరించింది. వరుడు వెంకట సాయి గోల్డెన్ వర్క్, లేత గోధుమరంగు రంగు షేర్వానీలో అందంగా కనిపించాడు. ఈ ఔట్‌ఫిట్‌కి పగిడి(తలపాగా), ముత్యాల హారం మరింత లుక్ తెచ్చిపెట్టాయి. రిసెప్షన్ లుక్ ఈ జంట ఫల్గుణి షేన్ పీకాక్ స్టైలిష్ ఔట్ఫిట్ లెహెంగాలో పెళ్లి కళ ఉట్టి పడుతూ కనిపించింది సింధు. స్వరోవ్స్కీ, సీక్విన్ క్రిస్టల్ వర్క్‌ను కలిగి ఉన్న ఐవరీ టల్లే లెహెంగా ఆమె రూపానికి మరింత గ్లామర్ అందించింది. డైమండ్-లేయర్డ్ నెక్లెస్, పచ్చల పెండెంట్, మ్యాచింగ్ చెవిపోగులతో పాటు, ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్‌ను కూడా ధరించింది.మరోవైపు, వెంకట దత్త సాయి టోనల్ సిల్క్ ఎంబ్రాయిడరీ , సీక్విన్ డిటైలింగ్‌తో సొగసైన భారీ ఎంబ్రాయిడరీ బ్లేజర్, బ్లాక్ వెల్వెట్ బంద్ గాలా ధరించారు. సంగీత్, హల్దీకిఇక సంగీత్, హల్దీ వేడుకల్లో అబు జానీ సందీప్ కోశ్లా డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిసిపోయారు సింధు, సాయి దంపతులు. -
రిలయన్స్ ‘యూస్టా’ స్టోర్ ప్రారంభం
రిలయన్స్ రిటైల్ తన వినియోగదారులకు మరిన్ని బ్రాండ్లను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సమీపంలో నాగోల్-అల్కపురి క్రాస్ రోడ్ వద్ద కొత్తగా ‘యూస్టా’ ఫ్యాషన్ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ స్టోర్లు ఉన్నాయని కంపెనీ అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశంలో మరింతగా తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.దేశంలోని యువత అధికంగా ఇష్టపడే స్టైల్స్‌లో విభిన్న మోడల్స్‌ను యూస్టా అందిస్తోందన్నారు. ప్రస్తుతం యూస్టా స్టోర్స్ మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో విస్తరించినట్లు చెప్పారు. ప్రీమియం మోడల్స్‌తోపాటు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఫ్యాషన్ ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..యువతను ఆకర్షించేలా చాలా ఫ్యాషన్ రిటైల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అందుబాటు దరల్లోనే తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. గార్మెంట్ పరిశ్రమ కూడా స్థానికంగా ఎంతో వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ఇతర దేశాలకు చేసే ఎగుమతులు అధికమవుతున్నాయి. స్థానికంగా మంచి ఉత్పత్తులు అందిస్తే సంస్థల బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. -
మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..
మేకప్ అందంగా కనిపించడానికే కాదు ఆత్మవిశ్వాసాన్నీ కలిగిస్తుంది. అయితే, మేకప్ ఉత్పత్తుల ఎంపికలోనూ, వాడకంలోనూ సాధారణంగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటిని నివారించడానికి సరైన అవగాహన ఉండాలి. వాతావరణానికి తగిన విధంగా మేకప్ ఉత్పత్తులు సీజన్‌ని బట్టి వాడేవి ఉంటాయి. అందుకని, బ్రాండ్ అని కాకుండా ప్రొడక్ట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. వేడి, చలి వాతావరణానికి తగిన నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవాలి. దీంతో పాటు అవి తమ చర్మ తత్త్వానికి ఎలా ఉపయోగపడతాయో చెక్ చేసుకోవాలి. అందుకు ప్రొడక్ట్స్ అమ్మేవారే స్కిన్ టెస్ట్‌కి అవకాశం ఇస్తారు. శుభ్రత ముఖ్యంమేకప్ వేసుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. కానీ, అప్పటికే చర్మంపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము కణాలు చేరుతాయి. ముఖం శుభ్రం చేయకుండా మేకప్ వేసుకుంటే బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి చెందుతుంది. దీనివల్ల కూడా ముఖ చర్మం త్వరగా పాడవుతుంది. సాధారణ అవగాహన లైనర్, ఫౌండేషన్, కాజల్.. ఇలా ఏ మేకప్ ప్రొడక్ట్ ఉపయోగించినా కొన్ని మిస్టేక్స్ సహజంగా జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు మేకప్ పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఫౌండేషన్ అయితే బ్లెండింగ్ బాగా చేయాలి. ఎంత బాగా బ్లెండ్ చేస్తే లుక్ అంత బాగా వస్తుంది. బ్యూటీ ప్రొడక్ట్ ఎంత అవసరమో అంతే వాడాలి. లేదంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. మేకప్‌లో ఫేస్ షేప్, స్కిన్ టోన్, బాడీకి తగినట్టు కూడా మేకప్ ఉంటుంది. ఇందుకు ముందుగా నిపుణుల సూచనలు తీసుకోవచ్చు.మరికొన్ని...నాణ్యమైనవి, ఖరీదైనవి అని కాకుండా తమ స్కిన్ టోన్‌కి తగిన మేకప్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవాలి. మేకప్‌కి ఒకరు వాడిన టవల్, బ్రష్, స్పాంజ్ వంటివి మరొకరు ఉపయోగించకూడదు. వాటిని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతనే తిరిగి వాడాలి. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించాలి. లేక;yతే స్వేదరంధ్రాలు మూసుకు;yయి, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. ఫౌండేషన్‌ని ఒకసారి ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే హెవీగా కనిపిస్తుంది. తక్కువ మొత్తాన్ని అప్లై చేసి, పూర్తిగా బ్లెండ్ చేయాలి.మేకప్ ట్రెండ్స్‌ని అనుసరించడం కన్నా, తమ ముఖానికి నప్పే అలంకరణను ఎంచుకోవడం మేలు. రోజంతా ఉన్న మేకప్ పైన మరొకసారి టచప్ చేయకపోవడమే మంచిది. మస్కారా వంటివి మరొక కోట్ వేయకుండా బ్రష్‌ను తడిపి, కనురెప్పలపై అద్దవచ్చు. లిప్‌స్టిక్‌ను ఉపయోగించే ముందు లిప్ బ్రష్‌ను వాడితే, అలంకరణ నీటుగా వస్తుంది. – శ్రీలేఖ, మేకప్ ఆర్టిస్ట్ -
ముత్యాలే డ్రెస్సులుగా!
ముత్యాల ఆభరణాలు మనసును ఆహ్లాదంగా మార్చేస్తాయి. ముత్యాల వరసలతో చేసిన డ్రెస్సులు వేసుకుంటే.. వేడుకలలో హైలైట్‌గా నిలుస్తున్న ఈ స్టైలిష్ డ్రెస్సులను సెలబ్రిటీలే కాదు నవతరమూ కోరుకుంటోంది.వెస్ట్రన్, ఇండియన్ పార్టీ ఏదైనా ముత్యాల డిజైనరీ డ్రెస్సులను ధరిస్తున్నారు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.సాధారణంగా ఆభరణాలలో చూసే ముత్యాలను డ్రెస్ డిజైనింగ్‌లో విరివిగా ఉపయోగిస్తున్నారు. అందుకే, ముత్యాలు ఇటీవల ఫ్యాషన్‌లో కీలకమైన అంశంగా మారాయి. తెలుపు, సిల్వర్, వైట్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్న మెటీరియల్పైన తెల్లని ముత్యాలను మరింత ఆకర్షణీయమైన ఎంపికగా డిజైనర్లు ఎంచుకుంటున్నారు. ఈ తరహా దుస్తులు స్వచ్ఛతకు, క్లాసీ లుక్కు ఉదాహరణగా నిలుస్తున్నాయి. శారీస్, స్కర్ట్స్ మీదకు టాప్స్‌గా ఉపయోగించే వాటిలో కోర్ జాకెట్స్, ష్రగ్స్, బ్లౌజ్ బ్యాక్ డిజైన్‌కి ఎక్కువ శాతం ముత్యాల వరసలను ఎంచుకుంటున్నారు. లెహంగా, శారీ ఎంబ్రాయిడరీలోనూ జర్దోసీ, సీక్వెన్స్‌తోపాటు కాంబినేషన్‌గా ముత్యాల వరసలు విరివిగా కనిపిస్తున్నాయి. వింటర్–సమ్మర్ పార్టీవేర్‌కి, ఇండోవెస్ట్రన్ స్టైల్స్‌కి చిన్న, పెద్ద ముత్యాలను ఉపయోగిస్తూ చేసే డ్రెస్ డిజైన్స్ ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ముత్యాలతో చేసే డిజైన్స్ ఖరీదులో ఘనంగా ఉంటే వాటి స్థానంలో ఉపయోగించే వైట్ బీడ్స్‌తో రెప్లికా డిజైన్లు యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీనితో తక్కువ ఖరీదులోనూ ఈ తరహా డిజైన్స్ లభిస్తున్నాయి. ఈ డిజైనరీ డ్రెస్సులే ఓ పెద్ద అట్రాక్షన్ కావడంతో మరే ఇతర ఆభరణాలు, హంగుల అవసరం ఉండదు. (చదవండి: కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..) -
ఫ్యాషన్ టైకూన్ ఇసాక్ ఆండిక్ కన్నుమూత
ఫ్యాషన్ సామ్రాజ్యం ‘మ్యాంగో’ వ్యవస్థాపకుడు, అధినేత ఇసాక్ ఆండిక్ కన్నుమూశారు. శనివారం ఆయన పర్వత ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆండిక్ వయసు 71 ఏళ్లు. బార్సిలోనా సమీపంలోని మోంట్సెరాట్ గుహలలో బంధువులతో హైకింగ్ చేస్తుండగా కొండపై నుండి 100 మీటర్లకు పైగా జారి పడిపోయాడని పోలీసు ప్రతినిధి తెలిపారు."మాంగో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు ఇసాక్ ఆండిక్ ఆకస్మికంగా మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని కంపెనీ సీఈవో టోని రూయిజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన నిష్క్రమణ భారీ శూన్యతను మిగిల్చిందని, ఆయన కంపెనీ కోసం జీవితాన్ని అంకితం చేశారని, వ్యూహాత్మక దృష్టి, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంతో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.ఇస్తాంబుల్‌లో జన్మించిన ఆండిక్ 1960లలో ఈశాన్య స్పానిష్ ప్రాంతమైన కాటలోనియాకు వలస వెళ్లి 1984లో ఫ్యాషన్ బ్రాండ్ మ్యాంగోను స్థాపించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్‌వర్త్ 4.5 బిలియన్ డాలర్లు. ఆయన ప్రస్తుతం కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ ఫ్యాషన్ రిటైలర్ అయిన ఇండిటెక్స్ అధినేత అమాన్సియో ఒర్టెగాను ఢీకొట్టిన వ్యాపారవేత్త ఆండిక్.తిరుగులేని బ్రాండ్దాదాపు 2,800 స్టోర్లతో యూరప్‌లోని అతిపెద్ద ఫ్యాషన్ గ్రూపులలో మ్యాంగో ఒకటిగా ఉంది. దాని వెబ్సైట్ ప్రకారం మ్యాంగో గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 120 కంటే ఎక్కువ దేశాలలో వ్యాపారాలు నిర్వహిస్తోంది. 15,500 మంది ఉద్యోగులతో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ గ్రూపులలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2023లో కంపెనీ టర్నోవర్ 3.1 బిలియన్ యూరోలు. -
ధర్మాటిక్ ఫ్యాషన్ ఫండ్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
సులోచనం.. నవ సౌందర్య బంధం
సాక్షి, అమరావతి: దేశీయ నేత్ర రక్షణ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. గతంలో కేవలం చూపు కోసమే వినియోగించిన కళ్లజోళ్లు ఇప్పుడు ట్రెండీ ఫ్యాషనబుల్ ఐటమ్స్‌గా మారిపోయాయి. యువత వస్త్రధారణకు అనుగుణంగా సరికొత్త డిజైన్లతో ఉన్న కళ్లజోళ్లను వినియోగిస్తోంది. బరువు తక్కువగా ఉండి.. విభిన్న రంగుల్లో పెద్ద ఫ్రేమ్‌లున్న కళ్లజోళ్లను వినియోగించడం ఇప్పుడు ట్రెండీగా మారింది. మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ వినియోగించిన భారీ కళ్లజోడు అందరినీ ఆకర్షించింది. సినీనటుల నుంచి గ్రామీణ యువత వరకు కళ్లజోడు ఫ్యాషన్ వస్తువుగా మారింది. ప్రస్తుతం దేశీయ కళ్లజోళ్ల మార్కెట్ రూ.54,863 కోట్లు ఉండగా.. అది 2032 నాటికి ఏటా 12 శాతంపైగా వృద్ధి సాధిస్తూ రూ.1,53,384 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో 30 కోట్ల మంది దృష్టి మెరుగుదల కోసం కళ్లజోళ్లను వాడాల్సి ఉండగా.. కేవలం 12 కోట్ల మందే వినియోగిస్తుండటంతో ఈ మార్కెట్‌పై కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. ఇప్పుడు అత్యధికులు కంప్యూటర్లు, ఫోన్లతో ఎక్కువ సమయం గడిపేస్తుండటంతో నేత్ర సంబంధ సమస్యలు తలెత్తడం అత్యంత సహజమైన పరిమాణంగా మారిపోయింది. దీంతో ప్రతి ఒక్కరికీ కళ్లజోడు తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడుతోంది. ఇటు ఫ్యాషన్‌తోపాటు చూపు కోసం కళ్లజోళ్ల మార్కెట్‌కు డిమాండ్ అధికంగా ఉండటంతో రిటైల్ చైన్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నాయి. లెన్సుల మార్కెట్టే ప్రధానం మొత్తం దేశీయ ఐకేర్ మార్కెట్ రూ.54,863 కోట్లు ఉండగా.. అందులో ఒక్క లెన్సుల మార్కెట్ పరిమాణమే రూ.22,908 కోట్లు ఉంటుందని అంచనా. కాంటాక్ట్ లెన్స్‌లతో పాటు కాస్మొటిక్ లెన్స్‌లు ముఖ్యంగా బ్లూలైట్ లెన్స్‌ల వినియోగం భారీగా పెరుగుతోంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ స్మార్ట్ గ్లాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే కళ్లజోళ్లు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఒక వ్యక్తి సొంత అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు కావాల్సిన విధంగా మారే ప్రోగ్రాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసేలా వీటిని రూపొందిస్తున్నారు. భారత్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇటలీ, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీనికి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్లో వివిధ దేశాల నుంచి 1,500కుపైగా విదేశీ బ్రాండ్స్ పాల్గొనడమే నిదర్శనమంటున్నారు. -
రిహాన్నా నుంచి అమీ జాక్సన్ దాకాముద్దుగుమ్మల సందడి మామూలుగా లేదుగా (ఫోటోలు)
-
హైదరాబాద్ : ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన..రెజీనా..ఈషారెబ్బా.. (ఫొటోలు)
-
తమన్నా రెట్రో ఫ్యాషన్ : బ్లాక్ కోర్సెట్ డ్రెస్, కిల్లింగ్ లుక్స్ (ఫోటోలు)
-
ఫ్యాషన్ ఎగ్జిబిషన్ మెరిసిన సీరత్ కపూర్, సాన్వే మేఘనా (ఫొటోలు)
-
గ్లామర్‌లో వేరే లెవల్.. సైనా నెహ్వాల్‌ను ఇలా ఎపుడైనా చూశారా? (ఫొటోలు)
-
ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో మెరిసిన నటి దివి, దీక్షా పంత్ (ఫొటోలు)
-
Archa Mehta: ఎక్స్పరిమెంటలిస్ట్
సంజయ్ లీలా భన్సాలీ సినిమా అంటే ఫ్యాషన్ డిజైనర్లందరికీ పండుగ! ఆయన సినిమా విడుదల తర్వాత చిన్న చిన్న బోటీక్ ఓనర్స్ నుంచి టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ దాకా అందరూ ఆ చిత్రం రిఫరెన్స్‌తో కొత్త కలెక్షన్స్‌ను విడుదల చేస్తారు. అలాంటిది కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా తొలి అవకాశమే సంజయ్ లీలా భన్సాలీ మూవీలో వస్తే.. అదృష్టమే అనుకుంటారు! అలాంటి చాన్స్ దక్కించుకున్న అదృష్టవంతురాలే ఇక్కడ పరిచయమవుతున్న స్టయిలిస్ట్ అర్చా మెహతా!అర్చా మెహతా స్వస్థలం ఢిల్లీ. కెరీర్ విషయంలో తండ్రి ఏం చెప్తే అదే అనుకొని, ఇంటర్ అయిపోగానే ఇంజినీరింగ్ కాలేజీలో చేరింది. కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో భాగమైన ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నది. అప్పుడు గ్రహించింది తన అసలు ప్యాషన్ ఫ్యాషనే అని! ఆ విషయాన్ని తండ్రితోనూ చెప్పింది. కూతురి ఇష్టాన్ని గుర్తిస్తూ ఆయన వెంటనే అర్చాను ఇంజినీరింగ్ మాన్పించి, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం లండన్ పంపించాడు. అక్కడ ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌తో పాటు స్టయిలింగ్ గురించి కూడా తెలుసుకుంది. కోర్స్ పూర్తవగానే అక్కడే సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది. తర్వాత ముంబై చేరింది. వెంటనే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘గోలియోంకీ రాస్లీలా రామ్‌లీలా’కి అసిస్టెంట్ స్టయిలిస్ట్, అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసే అవకాశం దొరికింది. అది పనిలో అనుభవాన్నే కాదు.. టాలీవుడ్లో ఎంట్రీనీ కల్పించింది. ‘హార్ట్ ఎటాక్’ మూవీలో అగ్రతారలకు స్టయిలిస్ట్‌గా! అందులో ఆమె కేవలం కాస్ట్యూమ్స్ మీదే కాదు స్కార్ఫ్‌లు, యాక్ససరీస్, ఆఖరకు పచ్చబొట్టు లాంటి వాటిపైనా దృష్టి పెట్టి స్టయిలింగ్ చేసింది. తక్కువ ఎక్స్‌పోజింగ్‌తో ట్రెండీ లుక్ ఇచ్చినందుకు హీరోయిన్స్ ఆదా శర్మ మెప్పును కూడా పొందింది. అప్పటి నుంచి అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఆ స్కిల్‌కి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది ఫిదా అయ్యారు. ఆ జాబితాలో కీర్తీ సురేశ్, మృణాల్ ఠాకుర్, కృతీ శెట్టీ, రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్, సంయుక్తా మీనన్, కళ్యాణీ ప్రియదర్శన్, కేథరిన్ త్రెసా, హన్సిక, మెహ్రీన్, ప్రణీత, దిశా పాట్నీ, నుస్రత్ భరూచా ఎట్సెట్రా ఉన్నారు. వాళ్లంతా అర్చాను తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. ఈ హీరోయిన్స్‌కే కాదు శర్వానంద్, నితిన్ లాంటి హీరోలకూ ఆమె స్టయిలింగ్ చేస్తోంది. ∙దీపిక కొండి -
ఇండియన్ ట్రెడిషన్..ఫ్యాషన్ వాక్..
భారతీయ సంస్కృతికి అద్దం పట్టే రీతిలో సాగిన ఫ్యాషన్ వాక్ ఔరా అనిపించింది. ఆయా రాష్ట్రాల వస్త్రధారణతో సాగిన క్యాట్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోదీ భావజాలమైన వారసత్వ చేనేత వ్రస్తాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన అవతరణ్–2024లో భాగంగా బుధవారం ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. ఎఫ్‌డీడీఐ(ఫుట్‌వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్)లోని ఫ్యాషన్ డిజైన్ విభాగం రెండో సంవత్సరం విద్యార్థులు ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలిచే చీర కట్టు, పంచెకట్టుతో ర్యాంప్‌పై విద్యార్థులు మెరిశారు. యువతులు వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. సాంఘిక సంస్కరణల చుట్టూ ఉండే సంప్రదాయ కథలలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో వ్రస్తాలను డిజైన్ చేశారని ఎఫ్‌డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.తేజ్ లోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. నిఫ్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ మధుప్రియ ఝా ఠాకూర్, ఎల్జీఏడీ సీనియర్ ఫ్యాకల్లీ సి.వేణుగోపాల్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బెస్ట్ డిజైనర్, బెస్ట్ మోడల్‌ను ఎంపిక చేయనున్నారు. (చదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!) -
#Shalini Passi లేటెస్ట్ సిరీస్‌తో ఫ్యాషన్ ఐకాన్‌గా సెన్సేషన్ (ఫోటోలు)
-
ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ , ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో నటించిన షాలిని పాసి లేటెస్ట్ సెన్సేషన్. ఢిల్లీకి చెందిన ఈమె సోషల్ యాక్టివిస్ట్, ఆర్టిస్ట్ కూడా. ఫ్యాషన్‌కు మారు పేరు. మరోవిధంగా చెప్పాలంటే వాకింగ్ ఫ్యాషన్ఎగ్జిబిషన్. అదిరిపోయే డ్రెస్‌లు, అద్భుతమైన హెడ్‌పీస్‌లు, ఆకట్టుకునే బ్యాగ్‌లు ఇలా షాలిని స్టైల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె బ్యాగులు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి.ఆమె బ్యాగుల కలెక్షన్ చాలా స్పెషల్మాత్రమేకాదు, ధర కూడా కళ్లు చెదిరే రేంజ్‌లోనే. పావురాలు, చిలుకలు, పాత కెమెరాలు ఇలా రకరకాల షేపుల్లో ఆమె బ్యాగులు మెస్మరైజింగ్‌గా ఉంటాయి.ఒక ఎపిసోడ్లో, షాలిని క్లాసిక్ క్లిక్ కెమెరాను పోలి ఉండే క్లచ్‌తో కనిపించింది. పాతకాలపు కెమెరా ఆకారంలో క్రిస్టల్-స్టడెడ్ హ్యాండ్‌బ్యాగ్ ధర సుమారు 5 లక్షల రూపాయలు. మరో ఎపిసోడ్లో ఆమె చేతిలో మెరిసిన ఫ్లెమింగో క్లచ్ ధర అక్షరాలా రూ. 5,400,000.బ్రిక్ ఫోన్ బ్యాగ్ ధర రూ. 600,000, ఇంకా 8 లక్షల, 30వేల విలువ చేసే టీవీ టెస్ట్ స్క్రీన్ బ్యాగ్, దాదాపు రూ. 3 లక్షల విలువ చేసే క్రిస్టల్ హార్ప్ క్లచ్‌తో ఆకర్షణీయమైన లుక్‌లో ఆకట్టుకుంటోంది. ఇవి కాకుండా, షాలిని జెల్లీ ఫిష్, టెడ్డీ బేర్స్, చిలుకలు, గులాబీలు, కుక్కలు , ఇతర ఫన్నీ బ్యాగ్స్కూడా ఆమె సొంతం.కాగా షాలిని పాసి భర్త బిలియనీర్,పాస్కో గ్రూప్ ఛైర్మన్ సంజయ్ పాసి. ఈ దంపతుల రాబిన్ రాబిన్ . ఇక ఈ సిరీస్‌లో మహీప్ కపూర్, నీలం కొఠారి, భావన పాండే, రిద్ధిమా కపూర్ సాహ్ని, సీమా సజ్దేహ్ మరియు కళ్యాణి సాహా చావ్లా కూడా నటించారు -
ఏం ఉందబ్బా హ్యాండ్‌బ్యాగ్ డిజైన్..! అచ్చం ఆకుకూరలా..
ఎన్నో రకాల బ్రాండెడ్ హ్యాండ్‌బ్యాగ్‌లు చూసుంటారు. అందాల భామలు, సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించే అత్యంత లగ్జరియస్ బ్యాగ్‌లను ఎన్నో రకాలు చూశాం. అయితే వాటన్నింటిని తలదన్నేలా అత్యంత వెరైటీ బ్యాగ్‌ని రూపొందించింది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ మోస్చినో. ఇటీవల కొన్ని ప్రముఖ బ్రాండ్లు అత్యంత హాస్యస్పదమైన రీతిలో బ్యాగ్‌లు డిజైన్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి ఈ లగ్జరీ బ్రాండ్ మోస్చినో కూడా చేరిపోయిందా అనిపిస్తుంది ఈ బ్యాగ్ డిజైన్ చూస్తే..ఎలా ఉందంటే..మోస్చినో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ హ్యండ్ బ్యాగ్ అచ్చం కొత్తిమీర కట్టలా కనిపిస్తుంది. అలా రూపొందించాలనే క్రియేటివిటీని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అచ్చం ఆకుకూర మాదిరిగా చక్కగా డిజైన్ చేశారు. ఇది డిజిటల్ ప్రింట్‌తో కూడిన కొత్తిమీర ఆకృతిలో ఉన్న పర్సు. ఇది త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్‌తో కనిపిస్తుంది. ఆ పర్సుపై కనిపించే ఆకులు కూడా సహజత్వం ఉట్టిపడేలా చాలా అద్భతంగా డిజైన్ చేశారు. దీని ధర వింటే మాత్రం అంత ఖరీదు అవసరమా అనే ఫీల్ తప్పక వస్తుంది. కొత్తిమీర ఆకృతిలో ఉన్న ఈ హ్యండ్‌బ్యాగ్ ధర అక్షరాల రూ. 3 లక్షలు పైనే ఉంటుందట. హైరేంజ్ ఫ్యాషన్ అంటే ఇదేనేమో. ఏం బ్రాండ్‌లో ఏమో..! క్రియేటివిటీలో మేటర్ నిల్ ధరలు మాత్రం వామ్మో.. అనేలా ఉన్నాయి కదూ..!.(చదవండి: సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!) -
హైలైఫ్ బ్రైడల్ ఎగ్జిబిషన్లో అషురెడ్డి , మోడల్స్ సందడి (ఫొటోలు)
-
సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్: ఆ హెయిర్ ట్రీట్మెంట్లు వద్దు..!
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, కియారా అద్వానీ నుంచి నీతా అంబానీ వంటి ప్రముఖులందిరికీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్. సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అమిత్ మాత్రం కురుల అందం కోసం హెయిర్ బోటాక్స్, కెరాటిన్ వంటి ట్రీట్మెంట్లు అస్సలు తీసుకోవద్దని చెబుతున్నారు. తాను తన క్లయింట్లకు కూడా అస్సలు సూచించని అన్నారు. అసలు ఇవెందుకు మంచివి కావు అనేది అమిత్ మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..!.ఈ రోజుల్లో జుట్టుకి సంబంధించిన హెయిర్ ట్రీట్మెంట్లు సర్వసాధారణం. అయినప్పటికీ అందమైన శిరోజాల కోసం ఈ ట్రీట్మెంట్లు మాత్రం తీసుకోవద్దని హెయిర్ స్టైలిస్ట్ అమిత్ అంటున్నారు. తన క్లయింట్లకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్లను సూచించని అన్నారు. ఈ రోజుల్లో కురుల కోసం అందరూ చేయించుకునే హెయిర్ బోటాక్స్ లేదా కెరాటిన్ వంటి వాటికి తాను ప్రాధాన్యత ఇవ్వనని అన్నారు. తాను బాలీవుడ్ హీరోయిన్లకు, ప్రముఖులకు ఇలాంటి హెయిర్ ట్రీట్మెంట్లు అస్సలు సిఫార్సు చేయనని అన్నారు. ప్రస్తుత రోజుల్లో ఈ ట్రీట్మెంట్లు సర్వసాధారణమే అయినప్పటికీ.. ఇవి మంచివి కావని వాటి గురించి వివరించారు అమిత్. ఎందుకు మంచివి కావంటే..హెయిర్ బోటాక్స్ అనేది ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్. ఇది తాత్కాలిక చికిత్స. ఇది సాధారణంగా రెండు నుంచి నాలుగు నెలలు పడుతుంది. ఇక కెరాటిన్ చికిత్స అంటే.. ఇది జుట్టులో సహజంగా ఉండే ప్రోటీన్. ఈ చికిత్సలో ఫార్మాల్డిహైడ్ వంటి కొన్ని రసాయనాలు ఉంటాయి. వాస్తవానికి దీన్ని చాలా దేశాల్లో నిషేధించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఇది కేన్సర్ కారకమైనదని అన్నారు అమిత్. ఈ రెండు చికిత్సల ప్రాథమిక స్వభావమే తాను ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు అమిత్. హెయిర్ బోటాక్స్ జుట్టుని మంచిగా ఉంచినప్పటికీ..జుట్టులోని సహజ పోషకాలను కోల్పోయేలా చేస్తాయి. పైగా ఇది అధిక వేడిని కలుగజేస్తుంది. దీని వల్ల జుట్టులో ఉండే సహజ ప్రోటీన్ల నిర్మాణం ప్రాథమికంగా మారిపోతుంది. ఇవి స్వల్పకాలిక చికిత్సలే తప్ప ఏ మాత్రం సత్ఫలితాలనివ్వదు. పైగా దీర్ఘకాలంలో జుట్టుకి ఎక్కువ హానిని చేకూరుస్తాయి. పదేపదే ఈ ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల పలు దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అదీగాక తాను సహజమైన జుట్టు ఆకృతికే ప్రాధాన్యత ఇస్తానని, అలాగే దీర్ఘకాలంలో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి అలవాట్లకే తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు అమిత్. ఆ దిశగానే తన కస్టమర్లను కూడా ప్రోత్సహిస్తానని అన్నారు. View this post on Instagram A post shared by Amit Thakur (@amitthakur_hair) (చదవండి: శ్రద్ధా కపూర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..! ఇష్టంగా పోహా..!) -
బెట్టీ ద ఫ్యాషన్ క్వీన్
శ్వేతా శర్మది సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. విజయగాథలు వింటూ పెరిగింది. అవన్నీ ఆమెలో ఏదో సాధించాలనే తపనను రగిలించాయి. వివిధ రంగాల పట్ల ఆసక్తిని కలిగించాయి. వాటిల్లో ఒకటే ఫ్యాషన్ డిజైనింగ్. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. ‘బెట్టీ ఆఫ్ ఎల్’ పోటీలో గెలిచి, ‘ఎల్ ఇండియా’లో ఇంటర్న్‌గా చేరింది. అప్పుడే తన పేరును శ్వేతా బెట్టీగా మార్చుకుంది. ఆ సమయంలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల దగ్గర పనిచేసే చాన్స్‌ను అందుకుంది. స్టయిలింగ్‌పై పట్టు సాధించింది. తర్వాత టీఎల్సీ చానల్లో ఫ్యాషన్ ఎడిటర్‌గా చేరింది. కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చేసింది. ఆ వర్కే ఆమెకు బాలీవుడ్లో ఎంట్రన్స్ కల్పించింది. అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అఖ్తర్లాంటి ఉద్దండులు నటించిన ‘వజీర్’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం ఇస్తూ! ఆ తర్వాత ఆమె వెనక్కి మళ్లే అవసరమే రాలేదు. ఆమె ఈస్తటిక్ సెన్స్‌కి ముచ్చటపడిన రాధికా ఆప్టే.. తనకు స్టయిలింగ్ చేయమని కోరింది. యెస్ చెప్పింది శ్వేతా. మూవీ ఈవెంట్స్‌లో రాధికా స్టయిల్, గ్రేస్ చూసిన బాలీవుడ్ దివాస్ అంతా శ్వేతా స్టయిలింగ్కి క్యూ కట్టారు. సోనమ్ కపూర్, రియా కపూర్, అదితీ రావ్ హైదరీ, ట్వింకిల్ ఖన్నా, లీసా రే, కృతి సనన్, కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కరిశ్మా కపూర్, యామీ గౌతమ్, సోనాక్షీ సిన్హా.. ఆ వరుసలోని వాళ్లే! నటీమణులే కాదు ఇంటర్నేషనల్ మోడల్స్ కూడా ఆమె స్టయిలింగ్కి ఫ్యాన్స్ అయిపోయారు. తమ స్టయిలిస్ట్‌గా ఆమెను అపాయింట్ చేసుకున్నారు. అలా తన ఫ్యాషన్ సెన్స్‌తో సెలబ్రిటీలకు మెరుగులు దిద్దుతూనే సెంట్రల్ సెయింట్ మార్టిన్స్ (యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లండన్) కాలేజ్‌లో కాంటెంపరరీ ఫైన్ ఆర్ట్స్‌లో కోర్స్ చేసింది. ఫొటోగ్రఫీ నేర్చుకుని, మహిళా క్రికెటర్స్‌తో ఫొటో సిరీస్ కూడా చేసింది. ఫ్యాషన్ కంటెంట్‌తో శ్వేతా.. బ్లాగ్నూ నిర్వహిస్తోంది. ఆమె ఇన్‌స్టా హ్యాండిల్కూ క్రేజీ ఫాలోయింగ్ ఉంది. అలాగే స్టయిలింగ్ అనేది నా దృష్టిలో మన పర్సనాలిటీని వ్యక్తపరచే ఒక మీడియం లాంటిది. వార్డ్రోబ్ మన స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేసే అద్దం లాంటిదని అంటోంది శ్వేతా.– శ్వేతా బెట్టీ. (చదవండి: లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ) -
ఫెమినా మిస్ ఇండియా 2024 విజేత నికితా పోర్వాల్ (ఫొటోలు)
-
ఫ్యాషన్ స్టైలిష్ట్ మెటర్నిటీ ఫోటో షూట్స్.. అర్థవంతంగా, అద్బుతంగా!
న్యూఢిల్లీకి చెందిన లండన్ ఫ్యాషన్ స్టైలిస్ట్ ప్రేరణ చాబ్రామరికొద్ది రోజుల్లో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఫ్యాషన్ డిజైనర్‌గా, యూట్యూబర్‌గా అభిమానులకు దగ్గరైన ఆమె ఈ సందర్భాన్ని సంతోషాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. అంతేకాదు తన భర్తను కూడా తన ఫాలోవర్లకు పరిచయం చేసింది. అలాగే తను ఎందుకు మెటర్నిటీ ఫోటో షూట్ చేసుకున్నదీ వివరించింది.అసలు మెటర్నీటి ఫోటో షూట్ అవసరమా అని ఆలోచించి చివరికి రెండు రకాలు ఫోటోషూట్ చేసుకున్నాను అంటూ ఇన్‌స్టాలో అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. ఫ్యాషన్ డిజైనర్‌ను కాబట్టి క్రియేటివ్‌గా ఉంటాను, కనుక మెటర్నిటీ ఫోటోషూట్కూడా విభిన్నంగా ఉండాలని ఆలోచించానని ఆమె తెలిపారు. (పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్ అండ్ టిప్స్)‘‘మొదటి ఫోటో షూట్ కోసం పర్పుల్ అండ్ పింక్ కలర్ డ్రెస్ ఎంచుకున్నా..దీన్నే ది పెర్ల్స్ ఆఫ్ జాయ్ అంటాం. త్వరలోనే తల్లికాబోతుండటం ఆనందాన్ని తీసుకొచ్చింది. ఇపుడు అమ్మగామారబోతున్నాను.. దాదాపు కలలో జీవిస్తున్నాను. స్వేచ్ఛకు ప్రతీక అయిన పసుపు రంగులో రెండో ఫోటోషూట్ చేశాను. దీన్ని గోల్డెన్ బ్లూమ్ అంటాం. ఈ సందర్భంగా అమ్మ నాతో ఉండటం ఇంకా సంతోషం’’ అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో ప్రేరణ వెల్లడించింది. -
పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్ అండ్ టిప్స్
వినాయక చవితి, దసరా, బతుకమ్మ సంబరాలు ముగిసాయి. ఇక దీపావళి సందడి షురూ కానుంది. ఏ పండగఅయినా భక్తి, ముక్తితోపాటు కొత్తబట్టలు, అందంగా ముస్తాబు కావడం ఈ హడావిడి ఉండనే ఉంటుంది. ముఖ్యంగా వెలుగుల పండుగ దీపావళికి ఆరడుగల అందగాళ్లు, చందమామ లాంటి ముద్దుగుమ్మలు ట్రెండీగా, ఫ్యాషన్‌గా మెరిసిపోవాలని ఆరాటపడతారు. ఆరడుగులు అంటే గుర్తొచ్చింది.. పొట్టిగా ఉన్నామని..లావుగా ఉన్నామని తమకు ఏ డ్రెస్ సూట్ కాదు అని చాలామంది అమ్మాయిలు దిగులు పడుతూ ఉంటారు. పొట్టిగా ఉండటం మన తప్పు కాదు. కానీ మన శరీరారినిక తగ్గట్టు దుస్తులను ఎంచుకుంటే స్పెషల్ బ్యూటీగా మెరిసిపోవడం ఖాయం. అదెలాగో చూసేద్దామా! ఫ్యాషన్ ట్రిక్స్పొడవుగా మారడానికి మ్యాజిక్ సొల్యూషన్ ఏమీ లేదు, కానీ పొడుగ్గా కనిపించేలా కొన్ని ఫ్యాషన్ ట్రిక్స్ ఉన్నాయి. ఫ్యాషన్‌కి స్లైల్కి ఖచ్చితమైన నియమాలేవీ లేవు. శరీర రంగును బట్టి, బాడీకి తగ్గట్టుగా కలర్‌ను ఎంచుకుంటే చాలు. చక్కని ఫిట్టింగ్, డ్రెస్సింగ్ స్టైల్లో ఒక చిన్న మార్పు ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది.జీన్స్, టీషర్ట్ ఎలాంటి వారికైనా ఇట్టే నప్పుతాయి. మ్యాచింగ్ కలర్స్ చాలా ముఖ్యం. మాక్సీ స్కర్ట్స్ లేదా డ్రెస్‌లు పొడవాటి అమ్మాయిలకు మాత్రమే బాగుంటాయి అనే అపోహను నమ్మవద్దు. మల్టిపుల్ లేయర్డ్ స్కర్ట్స్ కాకుండా మంచి కట్ స్కర్టులు ఎంచుకోండి. పొడవు స్కర్ అయితే టక్-ఇన్ టీ-షర్టుతో, కట్ జాకెట్‌తో ,హై హీల్డ్ షూ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.నిలువుగీతలు ఉన్న డ్రెస్‌లు పొడవుగా కనిపించేలా చేస్తాయి.కుర్తా లేదా చీర ధరించినపుడు సౌకర్యవంతమైన హైహీల్స్ వాడండి. అంతేకాదు డ్రెస్‌కు తగ్గట్టు , స్టైలింగ్ టిప్స్ పాటించాలి. ఉదాహరణకు క్లచ్‌లు, క్రాస్ బాడీ పర్సులు , చిన్న బ్యాగ్‌లు బెస్ట్ ఆప్షన్. మరీ పెద్దబ్యాగుల జోలికి అస్సలు వెళ్లవద్దుకుర్తీలకు, లేదా చీరల బ్లౌజ్లకు హైనెక్, రౌండ్ నెక్ కాకుండా, వీ నెక్, డీప్ నెక్, డీప్ రౌండ్ నెక్ లాంటివి ఎంచుకోండి. వర్టికల్ అప్పీల్‌కోసం ప్లంగింగ్ v-నెక్లైన్ టాప్‌లను ధరించండి. దీంతో పొడవుగా కనిపించడమే కాదు, సన్నగా కూడా కనిపిస్తారు.చిన్న ప్రింట్లు, సింపుల్ ఎంబ్రాయిడరీ ఔట్ ఫిట్ చూడడానికి బావుంటాయి. భారీ ఎంబ్రాయిడరీ, చీర పెద్ద పెద్ద అంచులున్న చీరలు అన్ని అకేషన్స్‌కు నప్పవు.ఎథ్నిక్ వేర్ కోసం పొడవాటి జాకెట్ స్టైల్ లెహెంగా లేదా సల్వార్ సూట్లకు దూరంగా ఉండండి. ఇదీ చదవండి : ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్‌కార్లు, అంతేనా?! -
కరణ్ జోహార్ 'టై' అంత ఖరీదా..? దేనితో డిజైన్ చేశారంటే..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహోర్ ఎన్నో విలక్షణమైన సినిమాలను నిర్మించి మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు. దర్శకుడిగా, నిర్మాతగా తానెంటో చూపించడమే గాక బుల్లి తెరపై కూడా వ్యాఖ్యతగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడూ లగ్జరీ ఫ్యాషన్ ట్రెండ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. అందుకు తగ్గట్లుగా ఉండే ఆయన ఆహార్యం ఫ్యాషన్‌కే ఐకానిక్‌గా నిలిచేలా ఉంటుంది. ఎప్పుడు అత్యంత లగ్జరియస్ బ్రాండ్ వేర్లతో కనిపించే కరణ్ తాజాగా ఈసారి అత్యంత ఖరీదైన టైతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సాధారణం 'టై' అత్యంత ఖరీదైనదైన వేలకు మించి పలకదు ధర. కానీ కరణ్ ధరించిన 'టై' అత్యంత విలక్షణమైనది, అత్యంత ఖరీదైనది కూడా. ఇటీవల ముంబైలో జరగిన జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్లో షియపరెల్లి బ్రాండ్‌కి చెందిన లేత గోధమ కలర్ కోట్తో వెరైటీ టైతో కనిపించారు.ఈ 'టై'ని హెయిర్‌తో రూపొందిచడం విశేషం. ఆ కోట్కి తగ్గ కలర్లో ఇంగీష్ వాళ జట్టుమాదిరిగా ఉంటుంది. చెప్పాలంటే ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ల దృష్టి అంతా ఆ 'టై' పైనే ఉంది. ఇంతకీ అదెంత ఖరీదు తెలిస్తే కంగుతింటారు. దీని ధర సుమారు రూ. 1.93 లక్షలు.. అంటే దగ్గర దగ్గర రెండు లక్షలు పలుకుతోంది.(చదవండి: 'ఆభరణాల గౌను'లో సారా అలీఖాన్ రాయల్ లుక్..!) -
'ఆభరణాల గౌను'లో సారా అలీఖాన్ రాయల్ లుక్..!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు తండ్రికి తగ్గ తనయ అనేలా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన అందం అభినయంతో వేలాది అభిమానుల మనుసులను గెలుచుకుంది. అంతేగాదు తన విలక్షణమైన నటనతో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకుంది. ఎప్పటికప్పుడూ తన బ్యూటీఫుల్ ఫోటోలను షేర్చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా తాజాగా సరికొత్త రాయల్టీ లుక్‌లో మెస్మరైజ్ చేసింది. ఈ స్టైలిష్ లుక్ ఆమె ఫ్యాషన్ శైలి ఏంటో చెప్పకనే చెబుతోంది. ఏస్ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా ఈ గోల్డ్ జ్యువెలరీ గౌనుని రూపొందించారు.రకరకాల వజ్రాలు, కెంపులు, వైఢ్యూర్యాలతో పొదిగిన గౌను అది. ఎంత అద్భుతంగా ఉందంటే..ఆ డిజైనర్‌వేర్‌లో సారా దేవతలా ధగధగ మెరిసిపోతోంది. మల్టీకలర్ రాళ్లు, పూసలుతో.. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన గౌను ఇది. ఈ గౌనుని సాంప్రదాయ మేళవింపుతో కూడిని ఆధునిక డిజైనర్‌వేర్‌లా తీర్చిదిద్దారు డిజైనర్లు.ఆ ఆభరణాల గౌనులో సారా లుక్ నాటి రాజుల దర్పాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లుగా ఉంది. అందుకు తగ్గట్లు జుట్టుని చక్కగా హెయిర్ బన్ మాదిరిగా వేసిన తీరు, సింపుల్ మేకప్ లుక్ సారా అందాన్ని రెట్టింపు చేశాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరీ..!. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95)(చదవండి: ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!) -
తొమ్మిదిరోజులూ, తొమ్మిది రకాలు, ఇండో వెస్ట్రన్ మెరుపుల కళ
నవరాత్రులలో దాండియా ఆటలు ప్రత్యేకమైనవి. ఉత్సాహపరిచే ట్యూన్స్‌కి అనుగుణంగా నృత్యం చేయడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఇలాంటప్పుడు ధరించే డ్రెస్ కూడా అడుగుల కదలికలకు తగినట్టుకదులుతున్న మెరుపులా నవరాత్రులకు ఆకర్షణీయమైన హంగుగా అమరాలి. నవరాత్రులలో దాండియా నృత్యాలు అనగానే మనకు పెద్ద పెద్ద అద్దాలతో ఎంబ్రాయిడరీ చేసిన సంప్రదాయ లెహంగా– చోలీలు గుర్తుకు వస్తాయి. ఎప్పుడూ ఒకే తరహా కాకుండా ఈసారి దాండియా డ్రెస్సులకు కొంత ఫ్యూజన్ ని జత చేసి, కొత్తగా మెరిపిద్దాం. అందుకు, మీ వార్డ్‌రోబ్‌ని పండగ స్పెషల్‌గా మార్చేయండి. వార్డ్‌రోబ్‌లో ఉన్న డ్రెస్సులతోనే నవరాత్రుల్లో న్యూ లుక్‌తో ఆకట్టుకునే తొమ్మిది ఐడియాలు.. దాండియా రాత్రిలో అబ్బురపరచడానికి మరో అందమైన ఆలోచన చీరకట్టు. వేరే డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం లేదు, చీరతో దాండియాలో పాల్గొనాలంటే స్టైలిష్ బ్లౌజ్ బదులుగా సంప్రదాయ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్‌ను ఎంచుకోవాలి. పెద్ద పెద్ద చెవిపోగులు, పాపిట బిళ్లను జత చేయండి. శారీ గౌన్ లేదా మల్టీకలర్ ప్లెయిన్ షిఫాన్, బనారస్, ఇకత్ శారీస్... కలంకారీ, జైపూర్ ప్రింట్స్ ఈ వేడుకకు బాగా నప్పుతాయి. వీటిమీదకు ఇండోవెస్ట్రన్ క్రాప్ టాప్ బ్లౌజ్‌లు, సిల్వర్/ఆక్సిడైజ్డ్ ఆభరణాలు ధరిస్తే ఎందరిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తాయ్. టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు లైట్ వెయిట్‌తో డ్రెసప్ అవాలనుకుంటారు. ఇలాంటప్పడు ఫ్లోరల్ పింట్స్, బ్రొకేడ్ స్కర్ట్ లేదా పలాజో ధరించి, టాప్‌కి తెల్లటి షర్ట్ జత చేయండి. దీనికి ఆక్సిడైజ్డ్ హారాలను అలంకారానికి ఉపయోగించండి. మోకాళ్ల కింది వరకు ఉండే గాగ్రాలు, ధోతీ ΄్యాంట్ల మీదకు స్టైలిష్ క్రాప్ టాప్‌లు వేసుకోవచ్చు. ధోతీ ప్యాంట్లను హారమ్ ప్యాంట్స్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి పండగల సీజన్లో ఈ ప్యాంట్స్ మంచి లుక్‌ని ఇస్తాయి. వీటిమీదకు ఎంబ్రాయిడరీ జాకెట్స్ లేదా సింపుల్ క్రాప్‌టాప్స్ ధరించినా చాలు దాండియా హుషారు వెంటనే పలకరిస్తుంది. ప్రతిరోజూ కొత్తదనం నింపుకోవడం ఎలా అని ఆలోచనలో పడినట్లైతే దుపట్టాతో లుక్‌ని ఇట్టే మార్చేయవచ్చు. బాందినీ దుపట్టాలు నవరాత్రి కళను ఇట్టే సృష్టిస్తాయి. సల్వార్ కమీజ్ వేసుకున్నా బాందినీ దుపట్టాలను భుజం మీద నుంచి నడుము వరకు తీసుకువచ్చి, వెడల్పాటి ఎంబ్రాయిడరీ బెల్ట్‌ను పెట్టేస్తే ఆకట్టుకునే లుక్‌తో మెరిసి΄ోతారు. ఆక్సిడైజ్డ్ జూకాలు, హారాలు వేసుకుంటే చాలు. సిల్వర్/ఆక్సిడైజ్డ్ హారాలు, చైన్లు, థ్రెడ్ జ్యువెలరీ నవరాత్రి డ్రెస్సుల మీదకు ఆకర్షణీయంగా అమరుతాయి. ఆడ–మగ వాళ్లు కూడా ఈ జ్యువెలరీని హెవీ డిజైన్ ధోతీ ప్యాంట్ల మీదకు ధరించవచ్చు. -
ఫ్యాషన్ రిటైలర్స్ 15% ఆదాయ వృద్ధి
న్యూఢిల్లీ: ఫ్యాషన్ రిటైలర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వరకు ఆదాయ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. నెట్వర్క్ విస్తరణ ఇందుకు కారణమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. ‘ద్రవ్యోల్బణం ఎదురుగాలులు ఉన్నప్పటికీ ఫ్యాషన్ రిటైలర్ల నెట్వర్క్ విస్తరణ 2024–25లో రాబడి పెరుగుదలకు తోడ్పడుతుంది. సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్–జూన్‌లో ఫ్యాషన్ రిటైలర్లు స్టోర్ నెట్వర్క్ విస్తరణ, కొత్త ఉత్పత్తుల శ్రేణిని ప్రవేశపెట్టడం ద్వారా 18 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో ఈ రంగ కంపెనీలు మోస్తరు వృద్ధి నమోదు చేస్తాయి. పండుగ సీజన్లో ఆదాయ వృద్ధి పుంజుకునే అవకాశం ఉంది. దీని ఫలితంగా అంత క్రితంతో పోలిస్తే 2024–25లో ఆదాయం 14–15 శాతం పెరుగుతుందని అంచనా’ అని ఇక్రా తెలిపింది.పరిమితంగానే డిస్కౌంట్లు.. ‘చదరపు అడుగుకు సగటు అమ్మకాల్లో జూన్ త్రైమాసికంలో ప్రీమియం సెగ్మెంట్ 3 శాతం క్షీణించింది. అయినప్పటికీ వాల్యూ ఫ్యాషన్ విభాగాలు కొంత సానుకూల ప్రభావాన్ని చూపించాయి. ఈ విభాగం మహమ్మారి ముందస్తు స్థాయిని మొదటిసారి తాకింది. కొత్త స్టోర్స్ రాక, ప్రారంభించిన నూతన కేటగిరీల కోసం పెరిగిన ప్రకటనలు, ప్రమోషనల్ ఖర్చుల కారణంగా తగిన రాబడి కంటే తక్కువగా గతేడాదితో పోలిస్తే ఫ్యాషన్ రిటైలర్ల మార్జిన్లు స్థిరంగా ఉన్నాయి. 2023–24 రెండవ త్రైమాసికం నుండి డిస్కౌంట్లు పరిమితంగానే ఉన్నాయి. ఎందుకంటే కంపెనీలు తమ స్థూల మార్జిన్లను రక్షించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సీజన్‌తో ప్రకటనలు, ప్రమోషన్లపై రిటైలర్లు దూకుడుగా ఖర్చు చేస్తూనే ఉన్నారు’ అని ఇక్రా నివేదిక వెల్లడించింది. -
Masaba Gupta: మసాబా.. మసాబా..
మసాబా గుప్తా.. ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక వైబ్రెంట్ వేవ్! ఆమె రాకముందు మన ఫ్యాషన్‌లో బిగ్ అండ్ బోల్డ్ ప్రింట్స్ అంతగాలేవు! ఇప్పుడవి చాలామంది సెలబ్రిటీస్‌కి మోస్ట్‌వాంటెడ్ క్యాజువల్స్‌గా మారి, వాళ్ల స్టయిలింగ్ వార్డ్రోబ్స్కి చేరిపోతున్నాయి. క్రెడిట్ గోస్ టు ‘హౌస్ ఆఫ్ మసాబా!’ కుడోస్ టు క్రియేటర్ మసాబా గుప్తా!నా స్కిన్ కలర్, నా జుట్టు తీరుతో చాలా అవమానాలు ఎదుర్కొన్నా! అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఏ రంగంలో అయినా ప్రతికూలతలు ఉంటాయి. వాటిని మనకు అనుకూలంగా మలచుకోగలగడమే సక్సెస్! అంటుంది మసాబా గుప్తా.మసాబా గుప్తా ఎవరో సినీ,క్రికెట్ ప్రియులు చాలామందికి తెలిసే ఉంటుంది. నటి నీనా గుప్తా, క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ కూతురు. చిన్నప్పుడెప్పుడూ ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలకనలేదు ఆమె. తండ్రిలా ఆటల మీదే ఆసక్తి చూపింది. టెన్నిస్ ప్లేయర్ కావాలని కష్టపడింది. తనకు పదహారేళ్లు వచ్చేటప్పటికి ఆ ఆసక్తి, ప్రయత్నం మ్యూజిక్, డాన్స్ మీదకు మళ్లాయి. లండన్‌లో ఆ రెండిటిలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఒంటరిగా ఉండలేక వాటిని మధ్యలోనే వదిలేసి ముంబై చేరుకుంది.వచ్చాక, యాక్టింగ్ ఫీల్డ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించింది. అది గమనించిన నీనా గుప్తా, ‘ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసే సంప్రదాయ సౌందర్య ప్రమాణాలు వేరు. నువ్వు అందులో సెట్ కావు. సో.. ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేయ్’ అంటూ బిడ్డను వెనక్కి లాగింది. ఏమాత్రం నిరుత్సాహపడక, తన క్రియేటివిటీని తన కాలేజ్ ఈవెంట్స్‌లో ప్రదర్శించసాగింది మసాబా. ఆ సమయంలోనే ఆమెలోని ఈస్తటిక్ సెన్స్, ఫ్యాషన్ స్పృహను కనిపెట్టిన ఫ్యాషన్ డిజైనర్, ఆథర్.. వెండెల్ రోడ్రిక్స్ ఆమెను ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ప్రోత్సహించాడు. దాంతో మసాబా.. ముంబై, ఎస్ఎన్డీటీ యూనివర్సిటీ(శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాక్రసే మహిళా విశ్వవిద్యాలయ్)లో అపరెల్ మాన్యుఫాక్చర్ అండ్ డిజైన్‌ను అభ్యసించింది.తను పూర్తిస్థాయిలో ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టే టైమ్‌కి.. పెద్ద ప్రింట్లు, డార్క్ కలర్ల జాడ అంతగా కనపడలేదు ఆమెకు. దాంతో ఆ రెండిటినే తన యూఎస్పీగా మార్చుకుని ‘హౌస్ ఆఫ్ మసాబా’ లేబుల్‌ని ఆవిష్కరించింది. ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనం. లేత రంగులు, ప్లెయిన్, చిన్న చిన్న డిజైన్స్‌నే ఎంచుకుంటున్న సెలబ్రిటీలకు మసాబా ప్రింట్స్æ వైబ్రెంట్‌గా తోచాయి. ఆ లేబుల్‌కి మారారు. ఆ అవుట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల అపియరెన్స్ రేడియెంట్గా కనిపించసాగింది.ప్రత్యేక స్టయిల్‌గా గుర్తింపురాసాగింది. అంతే ‘హౌస్ ఆఫ్ మసాబా’ బాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరెట్ బ్రాండ్ అయిపోయింది. ఇంట్లో వేసుకోవడానికి మొదలు బీచ్‌లో వ్యాహ్యాళి, ప్రయాణాలు, సినిమాలు, పార్టీలు, ఫంక్షన్లు, అవార్డ్ ఈవెంట్స్ దాకా దేనికైనా మసాబా డిజైనర్ వేర్ కావాల్సిందే అని కోరుకునే స్థాయికి చేరుకుంది ఆ డిమాండ్! ఆ లిస్ట్‌లో సోనమ్ కపూర్, ప్రియంకా చోప్రా, కరీనా కపూర్ ఖాన్, కరిశ్మా కపూర్, కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, విద్యా బాలన్, సొనాక్షీ సిన్హా, మీరా రాజ్‌పుత్ కపూర్, మౌనీ రాయ్, కరణ్ జోహార్ లాంటి మహామహులంతా ఉన్నారు. ‘హౌస్ ఆఫ్ మసాబా’ వెడ్డింగ్, రిసార్ట్ వేర్‌లోనూ సిగ్నేచర్ డిజైనింగ్‌ను మొదలుపెట్టింది. అంతేకాదు స్విమ్ వేర్, మెన్స్ వేర్, ఫ్యాషన్ జ్యూల్రీలోనూ తన నైపుణ్యాన్ని చూపిస్తోంది.ఇవి చదవండి: Elnaaz Norouzi: పర్షయన్ ప్రజ్ఞ! -
Elnaaz Norouzi: పర్షయన్ ప్రజ్ఞ!
ఎల్నాజ్ నౌరోజీ.. గ్లామర్, టాలెంట్ రెండూ ఉన్న నటి. ఇరాన్లో పుట్టింది. జర్మనీలో పెరిగింది. కెరీర్ వెదుక్కుంటూ భారత్‌కు చేరింది. సినిమా, సిరీస్‌లతో తగిన గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది! జర్మన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ, పంజాబీ, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది.మోడలింగ్ అన్నా, యాక్టింగ్ అన్నా ఎల్నాజ్కు చిన్నప్పటి నుంచీ ఆసక్తి. అందుకే తన పద్నాలుగో ఏటనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ట్వల్త్ క్లాస్ పాస్ అయ్యాక, ఓ ఏడాది పాటు థియేటర్లో ట్రెయినింగ్ తీసుకుంది. పర్షియన్ డాన్స్, హిప్ హాప్, కథక్‌లోనూ శిక్షణ పొందింది.మోడలింగ్‌లో కొనసాగుతూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మోడలింగ్‌లో భాగంగా ఆసియా, యూరప్ దేశాలు చుట్టొచ్చింది. ఇండియాలో జరిగిన ఎన్నో యాక్టింగ్ వర్క్‌షాప్స్‌కి హాజరైంది. తనకు ఈ దేశం నచ్చడంతో ఇక్కడే స్థిరపడింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ లాంటి బాలీవుడ్ ఉద్దండులతో కలసి ఎన్నో టీవీ కమర్షియల్స్‌లో నటించింది.‘మాన్ జావో నా’ అనే పాకిస్తానీ మూవీలో, ‘ఖిదో ఖుండీ’ అనే పంజాబీ చిత్రంలో, పంజాబీ మ్యూజిక్ సెన్సేషన్ గురు రంధావా ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. కానీ ఎల్నాజ్ను దేశమంతటికీ పరిచయం చేసింది మాత్రం నెట్‌ఫ్లిక్స్ ‘సేక్రడ్ గేమ్స్’ సిరీసే! తర్వాత జీ5లో స్ట్రీమ్ అయిన ‘అభయ్’సిరీస్‌లోనూ నటించింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తాజా సిరీస్ ‘రణ్నీతి: బాలాకోట్ అండ్ బియాండ్’ జియోసినిమాలో స్ట్రీమ్ అవుతోంది.‘జన గణ మన’ అనే చిత్రంతో కోలీవుడ్‌లోకీ అడుగుపెట్టింది ఎల్నాజ్. ఇరానియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచీ ఆమెకు ఆఫర్లు వచ్చాయి. కానీ అక్కడున్న ఆంక్షల వల్ల వాటిని తిరస్కరించినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. "నాకు కొత్తకొత్త విషయాలను నేర్చుకోవడం చాలా ఇష్టం. అలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకొనే అవకాశం దొరుకుతూనే ఉంది ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో!" – ఎల్నాజ్ నౌరోజీఇవి చదవండి: పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’ -
ఇవి.. సహజసిద్ధ'మండి'!
బంజారాహిల్స్: రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా లభించే వనరులతో చేతితో తయారు చేసిన దుస్తులు, కళాకృతుల ప్రదర్శన ‘మండి’ పేరుతో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ భవన్లో గురువారం ప్రారంభమైంది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను సినీ నటి, యాంకర్ ఝాన్సీ ప్రారంభించారు.దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. పూర్తిగా చేతితో తయారు చేసిన ఈ ఆకృతులు నగర మహిళలను ఆకట్టుకున్నాయి. ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధంగా వినియోగించిన సామాగ్రితోనే అల్లిన బుట్టలు, నేసిన దుస్తులు, తయారుచేసిన పర్ఫ్యూమ్లో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేశారు.ముఖ్యంగా ఎకోఫ్రెండ్లీ బ్యాగులు, దుస్తులు, ఇతర వస్తువులు ఇక్కడ ఆకట్టుకుంటున్నాయి. ఎంబ్రాయిడరీ వర్క్ మరో ఆకర్షణగా నిలిచింది. సెరామిక్ జ్యువెలరీ, జూట్ బ్యాగులు, కేరళ మురల్ ఆర్ట్, హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్, రస్టిక్ సెరమిక్ పీసెస్, పామ్ లీఫ్ ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించారు. పర్యావరాణానికి పెద్దపీట వేస్తూ హస్తకళాకారులు తీర్చిదిద్దిన ఈ ఆకృతులను సదరు కళాకారులు ఒక వైపు ఆన్లైన్లో విక్రయిస్తూనే మరోవైపు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నారు.ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తులకు హైదరాబాద్ బ్రాండ్‌గా మారిందని ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తెలిపారు. ప్రదర్శనలో సీసీటీ చైర్పర్సన్ అనురాధ బిష్ణోయ్ కూడా పాల్గొన్నారు.ఇవి చదవండి: ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు! -
Fashion: లైట్ కలర్స్‌తో.. లగ్జరీ లుక్!
తమ క్రియేటివ్ డిజైన్స్‌తో ఇతరులను అందంగా చూపే ఫ్యాషన్ డిజైనర్లు తమ కోసం వార్డ్ రోబ్‌ను ఎంత ఘనంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ విషయమై హైదరాబాద్‌లో మోడల్స్‌కి, ఫ్యాషన్ షోల కోసం డిజైన్స్ క్రియేట్ చేసే హేమంత్ సిరి ‘లెస్ ఈజ్ క్లాసీ’ అంటూ సింపుల్‌గా ఉండే తన వార్డ్ రోబ్‌ను పరిచయం చేస్తున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి చేనేతలు అంటే బాగా ఇష్టం ఉండేది. దీంతో మా అమ్మ, అమ్మమ్మల చీరలను నాకు అనువుగా డిజైన్ చేసుకునేదాన్ని. నేను డిజైన్ చేసిన దుస్తులను వేసుకున్నవారు అందంగా కనిపించాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. అయితే, నన్ను నేను కూడా బెస్ట్‌గా చూసుకోవాలి. నా విషయానికి వచ్చేసరికి కొన్ని ఎక్స్పర్మెంట్స్తో ΄ాటు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటాను. మోడల్స్‌కి, ఫ్యాషన్ షోస్ కోసం డిజైన్ చేయడంలో ఫ్యాబ్రిక్, కలర్స్ మీద ప్రత్యేక దృష్టి పెడతాను. నాకోసం అయితే ఇండోవెస్ట్రన్ లుక్ ఉండేలా చూసుకుంటాను. కొంచెం ్ర΄÷ఫెషనల్గా ఉండాలి అనుకుంటే హ్యాండ్లూమ్ శారీస్ ఎంచుకుంటాను.లెస్ ఈజ్ క్లాసీ..ఏదైనా ఈవెంట్‌కి వెళ్లాలి అనుకుంటే ముందు నన్ను నేను తెలుపు, క్రీమ్ కలర్ డ్రెస్‌లో ఊహించుకుంటాను. అంతేకాదు, ఆర్గానిక్ కలర్స్, ఆర్గానిక్ ఫ్యాబిక్స్ర్తో సింపుల్‌గా ఫార్మల్ లుక్‌ని ఇష్టపడతాను. హెవీ శారీస్ అయినా సరే సింపుల్‌గా ఉండే బ్లౌజ్‌నే ఉపయోగిస్తుంటాను. లెస్ ఈజ్ క్లాసీ అనిపించేలా ఉంటాను.లగ్జరీ కలర్స్..పేస్టల్ కలర్స్‌లో లైట్ క్రీమ్, పింక్, గోల్డ్.. ఇష్టపడతాను. ఈ రంగులు ఒక లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటాయి. క్రీమ్ లేదా ఐవరీ అంటేనే లగ్జరీ కలర్స్. లైట్ బ్లూ, లైట్ గ్రీన్.. వంటివి డే ఫంక్షన్స్‌కి, లైట్ సిల్వర్, లైట్ క్రీమ్ డ్రెస్సులు, శారీస్ నైట్ ఈవెంట్స్‌కి వాడతాను.ప్రయాణాల్లో సౌకర్యం..ఖ΄్తాన్స్ ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. పలాజోలు, జీన్స్, లైట్, ఫ్లోరల్ కలర్ నీ లెంగ్త్ ఫ్రాక్స్ని ఉపయోగిస్తాను.బొట్టుతో గుర్తింపు..నా పర్సనల్ స్టైలింగ్‌లో బొట్టు సిగ్నేచర్ అయిపోయింది. ముందు స్టికర్స్ వాడేదాన్ని. ఆర్గానిక్ కలర్స్పైన గ్రిప్ వచ్చాక కుంకుమ తయారు చేసుకుని, వాడుతున్నాను. వివాహవేడుకల వంటి ఎంత పెద్ద ఈవెంట్ అయినా సింపుల్ జ్యువెలరీనే ఉపయోగిస్తాను’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్! అన్ని కోట్లా..!
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ మెరిసింది. ఈ ఫ్యాషన్ షోలో టైటిల్ కోసం పోటీదారులు వినూత్న లగర్జీ ఫ్యాషన్లతో మోడల్స్ గట్టి పోటీస్తున్నారు. ఇక ఈ హ్యాండ్ బ్యాగ్ణి ఫ్రెంచ్ బ్రాండ్ రాబన్నే రూపొందించింది. దాదాపు 18 క్యారెట్ల బంగారంతో రూపొందించడం. అందువల్ల ఇదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా హ్యాండ్ బ్యాండ్‌గా నిలిచింది. ఫ్రాన్స్‌కి సంబంధించిన 1969 నాటి దివంగత గాయని ఫ్రాంకోయిస్ హార్టీ మినీడ్రెస్ గౌరవార్థం ఆమెకు నివాళిగా ఈ బ్యాగ్‌ని రూపొందించినట్లు బ్రాండ్ వ్యవస్థాపకులు చెబుతున్నారు. లెజెండ్ హార్డీ కోసం ప్రత్యేకంగా ఓ మినీడ్రెస్ని రూపొందించారు. అది వెయ్యి బంగారు ఫలకాలతో దాదాపు 300 క్యారెట్ల వజ్రాలతో డిజైన్‌తో రూపొందించారు. ఆ రోజుల్లో ఇది అత్యంత ఖరీదైన డ్రెస్‌గా వార్తల్లో నిలిచింది. దాని లగ్జరీకి తగ్గ రేంజ్లో ఈ హ్యాండ్ బ్యాగ్‌ని డిజైన్ చేశారు. అంతేగాదు జ్యువెలరీతో కూడిన ఈ లగ్జరీ డ్రెస్‌ని ధరించినప్పుడూ హార్డీని సెక్యూరిటీ గార్డుతో కూడిన సాయుధ వాహనంలో తీసుకు రావాల్సి వచ్చేదట. అయితే తాజాగా రూపొందించిన బంగారపు హ్యాండ్ బ్యాగ్‌ని మైసన్ రాబన్నే, ఆభరణాల వ్యాపారి ఆర్థస్ బెర్ట్రాండ్ల సహకారంతో రూపొందించారు. ఇది ఏకంగా రూ. 2.32 కోట్లు విలువ చేస్తుందట. ఈ హ్యాండ్ బ్యాగ్‌కి చైన్లను అనుసంధానించడానికి కూడా బంగారపు డిస్క్‌లనే అనుసంధానించడనే వాడటం విశేషం. దీన్ని రూపొందించడానికి హ్యాండ్క్రాప్ కళాకారులకు వంద గంటలపైనే సమయం తీసుకుందట. ఈ రాబన్నే బ్రాండ్ 1966లో ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి ప్లాస్టిక్ వంటి సంప్రదాయేతర పదార్థాలను ఉపయోగించి ఫ్యాషన్ ప్రపంచమే ఆశ్చర్యపోయే డిజైన్ వేర్లను తీసుకొచ్చింది. అలా ఇది వినూత్న దుస్తుల ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందిందిగా పేరుగాంచింది. అంతేగాదు కాంటెంపరరీ మెటీరియల్స్(గ్లాస్, సిరామిక్, వుడ్, వజ్రాలు, బంగారం, ప్లాస్టిక్)తో ధరించడానికి వీలుకాని 12 దుస్తులను డిజైన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు ఈ 1969 ప్యారిస్ ఫ్యాషన్ షోలో చాలా విభిన్న ఉపకరణాలతో రూపొందించిన ఫ్యాషన్ వస్తువులను పరిచయం చేసింది. అవి వరుసగా.. గ్లాస్ బ్యాగ్-దీన్ని ఇటాలియన్ గ్లాస్ మేకర్ వెనిని గ్లాస్ పాస్టిల్స్తో రూపొందించారు, సిరామిక్ బ్యాగ్, పర్షియన్ వర్క్‌షాప్ ఆస్టియర్ డి విల్లట్టే చిన్న క్లే డిస్క్‌లతో తయారు చేశారు. View this post on Instagram A post shared by Arthus Bertrand (@arthusbertrand) (చదవండి: పాలనురుగు చీరలో పాలరాతి శిల్పం!..మూత్యాల బ్లౌజ్ ధర ఏకంగా..!) -
పండగ వేళ: ఫ్యాషన్ అండ్ బ్యూటీ క్వీన్‌లా మెరవాలంటే..!
పండుగ సీజన్ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేసింది. వినాయక చవితి తరువాత వరుసగా వచ్చే పండుగల సందడి మామూలుగా ఉండదు. ఇంటిని అందంగా అలంకరించుకోవడం, పిండి వంటలు మాత్రమే కాదు, పండుగకు అందంగా తయారు కావడం, స్పెషల్ ముస్తాబుతో మురిసిపోవడం చాలా సాధారణం. అందుకే ఫెస్టివల్ లుక్‌లో ఎలా మెరిసి పోవాలో చూద్దాం.శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటేనే మెరుస్తూ ఉంటుంది. ఇందుకోసం తగినన్ని నీళ్లు తాగాలి. అలాగే ఫ్యాటీఫుడ్స్కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం, ఆకుకూరలు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపవాసాల సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పల్చటి మజ్జిగ, పండ్ల రసాలు మెనూలో చేర్చుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే ఫేస్‌లో చక్కటి గ్లో వస్తుంది. అలాగే ముఖానికి ఇంట్లోనే తయారు చేసుకునేలా ఫేస్ ప్యాక్, జుట్టు అందం కోసం ప్యాక్‌లు వేసుకోవడం మర్చిపోవద్దు. ఫేస్ ప్యాక్బంగాళాదుంపను మిక్సిలో వేసి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇందులో కొద్దిగా శనగపిండి, నాలుగు చుక్కల బాదం నూనె, కొద్దిగా తేనె వేసి బాగా కలపండి. ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకున్న తరువాత దీన్ని అప్లయ్ చేసి, పూర్తిగా ఆరడానికి 10-15 నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత సబ్బు, ఫేస్ వాష్ లాంటివి వాడకండి. మీ ఫేస్‌లోని మెరుపు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ మిశ్రమాన్ని శుభ్రపర్చిన గాజు సీసాలో దాచుకోవచ్చు. చర్మం ముడతలు లేకుండా,కాంతిమంతంగా ఉండాలంటే..: టేబుల్ స్పూన్ మినప్పప్పు, 6 బాదాంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటినీ మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది.∙టేబుల్ స్పూన్ చొప్పున ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం తీసుకొని కప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి.జుట్టుకు బలమైన చూర్ణంఅరకప్పు డ్రైఫ్రూట్స్... బాదం, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్స్; అరకప్పు ఓట్స్, పచ్చి శనగపప్పు, పెసరపప్పు కలిపి అరకప్పు, సబ్జా గింజలు అరకప్పు, అవిసె గింజలు అరకప్పు చొప్పున తీసుకుని దోరగా వేయించి చూర్ణం చేసుకుని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ పొడిని టేబుల్ స్పూన్ తీసుకుని టీ లేదా స్మూతీలో వేసుకుని తాగాలి. టీ అలవాటు లేని వాళ్లు వేడినీళ్లలో కలుపుకొని రోజూ ఉదయాన్నే తాగితే రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ పొడి జుట్టు సంరక్షణకే గాక ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుంది.ఫ్యాషన్ అండ్ మ్యాజిక్మంచి కలర్‌ఫుల్ డ్రెస్‌లను ఎంచుకోండి. పండుగ సీజన్లో ప్యాషన్ ,లేదా సంప్రదాయ దుస్తులు ఏదైనా సరే మన శరీరానికి నప్పేలా ఉండాలి. డ్రెస్‌కు సరిపడా సింపుల్, లేదా హెవీ జ్యుయలరీ ఉంటే అద్భుతమైన ఫెస్టివ్ లుక్ మీసొంతం అవుతుంది. -
ఇదేం బ్యాగ్ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!
కొన్ని ప్రముఖ లగ్జరీయస్ ప్యాషన్ బ్రాండ్లు మార్కెట్లోకి రీలిజ్ చేసే కొత్త వస్తువులు చాలా విలక్షణంగా ఆకర్షణీయంగా ఉంటాయి.పైగా వాటికో స్పెషాలిటీ తప్పక ఉంటుంది. ఆ ఫేమస్ బ్రాండ్లు రిలీజ్ చేసే వస్తువులపై క్రేజ్ మాములుగా ఉంటుంది. అందరూ అటెన్షన్ ఆ వస్తువు పైనే ఉంటుంది. అంతలా ఫ్యాషన్ ప్రపంచంలో వాటికి క్రేజ్ ఉంటుంది. అయితే ఫ్యాషన్‌కే ఐకానిక్ సింబల్‌గా ఉన్న ఈ లగ్జరీ బ్రాండ్ బ్యాగ్ చూస్తే మాత్రం ఇదేం బ్యాగ్ రా బాబు అంటూ ముఖం చిట్లించేస్తారు. ప్రస్తుతం నెట్టింట ఈ బ్యాగ్‌పై సర్వత్ర విమర్శలు, జోక్‌లు వినిపిస్తున్నాయి. ప్రాడ్ అనే ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ఈ మెటాలిక్ టోట్ బ్యాగ్‌ని లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ మరింత వినూత్నంగా ఈ బ్యాగ్‌ని రూపొందించింది. పురుషులకు ఇలా డిజైన్ చేయడం మరింత విస్మయానికి గురిచేసింది. ఇది మన బస్సుల్లోనూ, రైల్వే టాయిలెట్లలోనూ ఫ్లోర్ మాదిరిగా ఈ మెటాలిక్ బ్యాగ్ ఉంది. చూసిన వాళ్ల అంతా భయనాకంగా ఉందంటూ ఘెరంగా పోలికలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో కనిపించే ప్లోర్ మాదిరిగా బ్యాగ్‌ని డిజైన్ చేయడం ఏమిటి. ఇది ఫ్యాషన్-ఫార్వర్డ్ స్టేట్మెంట్ లేదా విచిత్రమైన డిజైన్ అని ప్రశ్నలు లేవెనెత్తారు. సర్వత్రా ఈ బ్యాగ్ డిజైన్‌పై విమర్శలు వెల్లవెత్తాయి. ఇదేం డిజైన్ అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే ఇంతలా విమర్శలు వస్తున్న ఈ బ్యాగ్ ధర వింటే కచ్చితంగా షాకవ్వుతారు. ఏకంగా రూ. 2.73 లక్షలు పలుకుతుందట. పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ బ్యాగ్ డిజైన్ పరంగానే కాకుండా ధర పరంగానూ క్లిక్ అయ్యేలా లేదు కదూ..!.(చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!) -
గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్లో 24 క్యారెట్ల బంగారపు డ్రెస్‌లో ఊర్వశి రౌతేలా!
ఇటీవల జరిగిన గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్లో నటి, మోడల్ ఊర్వశి రౌతేలా వేదిక మీద నడుస్తూ ఉంటే దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె ధరించిన అచ్చమైన బంగారంతో రూపొందించిన మణిపూర్ సంప్రదాయ బ్రైడల్ డ్రెస్ స్పెషాలిటీని చూపుతిప్పుకోనివ్వలేదు. ఈ ఏడాది జరిగిన గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో డిజైన్ చేసిన పాట్లోయ్ డ్రెస్‌లో నటి, మోడల్ ఊర్వశి రౌతేలా మెరిసిపోయింది. ఈ ప్రత్యేక సందర్భం కోసం ఆమె బంగారు జరీ దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు పాట్లోయ్ను ధరించింది. సాధారణంగా వధువులు ధరించే సంప్రదాయ దుస్తుల మధ్య ఊర్వశి అద్భుతంగా మెరిసిపోయింది. ప్రఖ్యాత మణిపురి డిజైనర్ రాబర్ట్ నౌరెమ్ రూపొదించిన ఈ దుస్తులలో మణిపూర్‌లోని మెయిటీ కమ్యూనిటీ సాంస్కృతిక గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సాధారణంగా మణిపూర్ వధువులు ఈ దుస్తులను ధరిస్తారు. పాట్లోయ్ అనేది వారి సంప్రదాయంలోని ప్రత్యేకమైన, ఐకానిక్ డ్రెస్.క్లిష్టమైన వర్క్స్థూపం, డ్రమ్ ఆకారపు స్కర్ట్‌ని పాట్లోయ్ అంటారు. మణిపురి బ్రైడల్ని ప్రత్యేకంగా చూపే వాటిలో ఇది అత్యంత ముఖ్యమైనది. మందపాటి ఫైబర్, వెదురుతో డ్రమ్ ఆకారం చేసి, శాటిన్ క్లాత్‌ని చుడతారు. దానిని థ్రెడ్‌వర్క్, సీక్విన్స్, అద్దాలతో భారీగా అలంకరిస్తారు. స్కర్ట్పైన చేసే వారి హస్తకళ చాలా క్లిష్టమైనది. ఒక పాట్లోయ్ని పూర్తి చేయడానికి కొన్ని రోజుల పాటు కృషి చేస్తారు. దీనికి అలంకరణగా నడుము పట్టీ, వధువు తలమీదుగా కప్పే షీర్ వీల్, మోచేతులవరకు ఉండే జాకెట్టుతో ఈ డ్రెస్‌కు పూర్తి లుక్ వస్తుంది. ఇతర అలంకరణలో లేయర్డ్ నెక్లెస్‌లు, కోక్గీ లీటెంగ్గా పిలిచే కేశాలంకరణ ఆభరణాలు ప్రత్యేకమైనవి.పాట్లోయ్ చరిత్రపాట్లోయ్ మూలాలు మెయిడింగు భాగ్యచంద్ర మహారాజ్ (1763–1798) పాలనలో గుర్తించినట్టు చారిత్ర ఆధారాల ద్వారా తెలుస్తోంది. అతను శాస్త్రీయ రాస్–లీలా నృత్యానికి ఈ దుస్తులను పరిచయం చేశాడు. కాలక్రమేణా ఇది మెయిటీ వధువుల సంప్రదాయ వివాహ దుస్తులలో భాగమైంది. దీంతో వీరికి పాట్లోయిస్ సృష్టించే కళ తరతరాలుగా సంక్రమించింది. అధికారిక సంస్థల కంటే కుటుంబాలలో నేర్చిన నైపుణ్యాలతో పాట్లోయ్ను రూపొందించడం అనేది శ్రమతో కూడుకున్న ప్రక్రియ. దీని తయారీలో చాలా మంది కళాకారులు పాల్గొంటారు. అందుకే, దీనిని సామూహిక సమాజ ప్రయత్నంగా చెబుతారు. తన వేషధారణ ఎంపిక ద్వారా, ఊర్వశి ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రమే కాకుండా మణిపూర్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకురావడంలో సహాయపడింది.డిజైనర్ రాబర్ట్రాబర్ట్ నౌరెమ్ ఈశాన్య భారతదేశంలోని సాంప్రదాయ ఫ్యాషన్‌ను హైలైట్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. అతను గతంలో సుస్మితా సేన్, హర్నాజ్ కౌర్ సంధు, లారా దత్తా వంటి ప్రముఖ వ్యక్తులకు ఇన్నాఫీ, ఫనెక్ వంటి సాంప్రదాయ మణిపురి దుస్తులలో మెరిపించాడు. ఇన్నాఫీ అనేది బ్లౌజ్‌పై ధరించే తేలికపాటి మస్లిన్ శాలువా. ఫనెక్ అనేది మణిపురి మహిళలు సాధారణంగా ధరించే చారలతో కూడిన చీరలాంటి వస్త్రం. ఈ ఏడాది గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్లో మొదటిసారిగా ఊర్వశి రౌతేలా చేత మణిపురి బ్రైడల్ డ్రెస్‌ను ధరింపజేసి అంతర్జాతీయ ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. (చదవండి: అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత చార్జ్ చేస్తాడంటే..?) -
బాలీవుడ్ సెలబ్రిటీల మోస్ట్ వాంటెడ్ వెడ్డింగ్ డ్రెస్ డిజైనర్!
ఒకప్పుడు కటిక దారిద్యంతో చాలా తిప్పలు పడ్డాడు. కాలేజీ పీజులు చెల్లించడానికి పుస్తకాలు అమ్మాడు. నేడు ప్రపంచమే ఆశ్చర్యపోయే రేంజ్లో ఫ్యాషన్ ప్రపంచానికి ఐకానిక్ డిజైనర్‌గా ఎదిగాడు. అతడి బ్రాండే భారదేశంలోని అతిపెద్ద లగ్జరీ బ్రాండ్‌గా కితాబులందుకుంది. అంతేగాదు బాలీవుడ్ సెలబ్రిటీల మోస్ట్ వాంటెడ్ వెడ్డింగ్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ అతడెవరంటే..ఫ్యాషన్ ప్రపంచానికి అలానాటి సంప్రదాయ దుస్తులతో కొంత హంగులు తీసుకొచ్చి ప్రపంచమే కళ్లప్పగించి భారత్ ఫ్యాషన్ వైపు చూసేలా చేశాడు. అతడే సబ్యసాచి ముఖర్జీ. అద్భుతమైన హస్తకళకు, అచంచలమైన నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఈ కాస్ట్యూమ్ డిజైనర్. సబ్యసాచి బ్రాండ్ ఓ డిజైన్ మాస్ట్రో పీస్‌గా ఫ్యాషన్ పరిశ్రమలో నీరాజనాలు అందుకుంటోంది. అయితే అతడి జీవితమేమి గోల్డెన్ స్పూన్ బేబీలా సాగలేదు.సబ్యసాచి ఫిబ్రవరి 23, 1974లో పశ్చిమబెంగాల్లోని మానిక్తలాలో జన్మించాడు. భారతీయ బ్రాండ్ 'సబ్యసాచి' వ్యవస్థాపకుడు. అంతేగాదు ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో బోర్డు సభ్యుడైన అతిపిన్న వయస్కుడు. అయితే అతడి బాల్యంలో దుర్భరమైన జీవితాన్ని గడిపాడు. ఆయన తన ప్రాథమిక విద్యను అరబిందో విద్యామందిర్లోనూ, మాధ్యమిక విద్యను కోల్‌కతా సెయింట్ జేవియర్ కళాశాలలోనూ పూర్తి చేశాడు. అతడి ఎన్నుకున్న ఫ్యాషన్ కెరీర్‌ని కుటుంబ సభ్యులంతా వ్యతిరేకించారు. ఓ పక్క ఇంట్లో కటిక దారిద్యం మరోవైపు ఊహకందని ప్యాషన్ ప్రపంచం..అయినా సరే తన లక్ష్యాన్ని, కోరికను వదిలిపెట్టలేదు. కాలేజీ ఫీజల కోసం పుస్తకాలు అమ్ముతూ నానాపాట్లు పడి చదువు పూర్తి చేశాడు. తాను ఫ్యాషన్ రంగంలో నిలదొక్కుకునేంత వరకు రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సని ఏదోలా పూర్తి చేసి, వెంటనే తన సొంత లేబుల్‌ని ప్రారంభించాడు. అందులో తన డిజైన్ చేసిన దుస్తులను విక్రయించే యత్నం చేశాడు. అయితే ఆ క్రమంలో చాలా ఇబ్బందులు పడేవాడు. చివరికీ తన డిజైన్లు ఎవరైన కొంటారా? అనే అనుమానం ఎదురయ్యేంతకు చేరిపోయాడు. అలాంటి సమయంలో సరిగ్గా 2001లో లాక్మే ఫ్యాషన్ వీక్ అతడి పాలిట వరంలా వచ్చింది. అందులో తన కలెక్షన్స్‌ని ప్రదర్శించి చూశాడు. అది మొదలు ఇక వెను తిరిగి చూసే అవకాశం లేకుండా అచంచలంగా ఎదుగుతూ..ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నాడు సబ్యసాచి ముఖర్జీ. బ్రాండ్ విశిష్టత..సబ్యసాచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన వస్త్రాలు, సాంస్కృతిక సంప్రదాయాలు వంటి మూలాలను ఆధారం చేసుకుని డిజైనర్ వేర్లను రూపొందించడం ఈ బ్రాండ్ విశిష్టత. అతని డిజైన్లు నిగూఢమైన అర్థాన్ని, కాలనుగుణ ఫ్యాషన్‌కి సరిపోయేలా వివరణను ఇచ్చేలా ఉండేవి. అతడి క్రియేటివిటీకి "ఫెమినా బ్రిటిష్ కౌన్సిల్"కి "ది మోస్ట్ ఔట్‌స్టాండింగ్ అండ్ యంగ్ డిజైనర్ ఆఫ్ ఇండియా అవార్డు వంటి ఎన్నో అవార్డులు ప్రశంసలు వచ్చాయి. పైగా అంతర్జాతీయ ఖ్యాతీని తెచ్చిపెట్టాయి. అంతేగాదు బాలీవుడ్ దిగ్గజ తార వివాహ డ్రెస్‌లను రూపొందించే డిజైనర్‌గా పేరుతెచ్చుకున్నారు. అతడి డిజైన్లు రెడ్ కార్పెట్పైనే గాక మ్యాగజైన్ కవర్లపై కూడా మెరిశాయి. ఇక సబ్యసాచి బ్రాండ్ నికర విలువ దాదాపు రూ. 114 కోట్లు ఉంటుందని అంచనా. ఇది భారతదేశపు అత్యంత అద్భుతమైన లగ్జరీ డిజైనర్ బ్రాండ్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఈ బ్రాండ్ కాలిఫోర్నియా, అట్లాంటా, లండన్,దుబాయ్ వంటి దేశాల్లో కూడా స్టోర్లను కలిగి ఉంది.(చదవండి: జస్ట్ రెండు కుట్టు మిషన్లతో.. ఏకంగా వెయ్యి కోట్ల సామ్రాజ్యం!) -
ఫ్యాషన్ బ్లాగ్‌తో ..ఏకంగా రూ. 40 కోట్లు..!
ఇటీవల యువత కంటెంట్ క్రియేటర్లుగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సత్తా చాటుతున్నారు. తమ టాలెంట్ ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నారు. చిన్నగా బ్లాగర్‌గా మొదలుపెట్టి ఊహించని స్థాయిలో కోట్లు ఆర్జిస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ కోమల్ పాండే. ఫ్యాషన్ బ్లాగర్, కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. దేన్నయినా కామెడీ టచ్‌తో క్యాచీగా చెప్పడం ఆమె ప్రత్యేకత. ఢిల్లీలో పుట్టిపెరిగిన కోమల్ పాండే బీకామ్ గ్రాడ్యుయేట్. ఆమె ఫ్యాషన్ సెన్స్ చూసి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడంతో 2012లో ది కాలేజ్ ఆప్ కౌచర్’ పేరుతో ఫ్యాషన్ బ్లాగ్ స్టార్ట్ చేసింది. ఫ్యాషన్‌కి సంబంధించిన అన్ని విషయాలూ డిస్కస్ చేసే ఆమె బ్లాగ్ షార్ట్ టైమ్‌లోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఆ తర్వాత ఆమె యూట్యూబ్ చానల్‌నూ మొదలుపెట్టింది. పదిలక్షల సబ్‌స్క్రైబర్స్‌కి రీచై, యూట్యూబ్ గోల్డ్ బటన్‌ను అందుకుంది. దేశంలోనే టాప్ 7 డిజిటల్ స్టార్స్ లిస్ట్‌లో చేరి, ఫోర్బ్స్ మేగజీన్ కవర్ మీద మెరిసింది. దాదాపు 40 కోట్ల నెట్ వర్త్తో రిచెస్ట్ యూట్యూబర్స్లో ఒకరిగా ఉంది.(చదవండి: ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!) -
ఆర్గానిక్ అ'డ్రెస్'!
సాక్షి, సిటీబ్యూరో: తినే తిండిలో మాత్రమే కాదు మనం ధరించే దుస్తుల్లోనూ రసాయనాల వినియోగం మితిమీరుతోంది. స్వచ్ఛంగా మెరిసిపోయే తెల్లని కాటన్ వస్త్రం తయారీలో కూడా ఆ రంగు కోసం కెమికల్స్ వాడతారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఆహారం తరహాలోనే ఆహార్యంపై కూడా పెరుగుతున్న శ్రద్ధ.. నగరవాసుల్లో ఆర్గానిక్ దుస్తుల పట్ల ఆసక్తికి కారణమవుతోంది.తిరిగే ప్రదేశం సహజమైన ప్రకృతి అందాలతో ఉండాలి తినే తిండి కూడా సహజమైనదే అయి ఉండాలి.. ధరించే దుస్తులు కూడా సహజసిద్ధమైన రీతిలో రూపొందించినవి కావాలి. లేకపోతే అనారోగ్యాలు ఎటు నుంచి దాడిచేస్తాయో తెలీదు.. ఈ స్పహ ఆధునికుల్లో పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని బ్రాండెడ్ దుస్తులు మార్కెట్లో కనిపిస్తుండగా.. ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగాæ డిజైనర్లు కూడా ఆర్గానిక్ దుస్తులకు అడ్రస్‌గా మారుతున్నారు. అలాంటివారిలో సిటీ డిజైనర్ సంతోష్ ఒకరు. గతంలో పూణె ఫ్యాషన్ వీక్‌లో వీటిని ప్రదర్శించారాయన.కాస్ట్ లీ కాదు.. ధనవంతులు మాత్రమే సస్టెయినబుల్ ఫ్యాషన్ ను కొనుగోలు చేయగలరని అభిప్రాయం ఏర్పడింది. అయితే తెలివిగా షాపింగ్ చేయాలనుకునే ఎవరికైనా ఈ తరహా దుస్తులు అందుబాటులోనే ఉంటాయని అంటున్నారు డిజైనర్లు. ‘అందరూ అనుకున్నట్టు ఆర్గానిక్ ఫ్యాషన్ దుస్తులు మరీ ఖరీదైనవి ఏమీ కాదు. ఉత్పత్తి వ్యయం కూడా మీటర్‌కి రూ.వెయ్యిలోపే అవుతుంది. అయితే వీటి వాడకంపై ఫ్యాషన్ ప్రియుల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది’ అంటూ చెప్పారు నగరానికి చెందిన డిజైనర్ నయన్. సేంద్రియ పద్ధతిలో తయారు.. ఆధునిక వినియోగదారులు పర్యావరణ అనుకూల డిజైన్ ట్రెండ్లను అనుసరిస్తుండటంతో హానికరమైన రసాయనాలు, పురుగు మందులు లేకుండా ఉంటాయి సేంద్రియ పద్ధతిలో తయారైన వ్రస్తాలకు డిమాండ్ విస్తరిస్తోంది. ఉత్పత్తిదారులు సరళమైన, తటస్థ–రంగు దుస్తులు రూపొందిస్తున్నారు. వీటిలో తెలుపు, నలుపు క్రీం రంగులు కీలకమైనవి. కార్క్, వెదురు, జనపనార, ఆర్గానిక్ కాటన్, రీసైకిల్ కాటన్ లినెన్ సస్టెయినబుల్ ఫ్యాషన్ ఉత్పత్తిలో కీలకమైన ముడి పదార్థాలుగా మారాయి. సేంద్రియ పద్ధతిలో పత్తి లేదా జనపనార వంటి పర్యావరణ అనుకూల పదార్థాలతో రూపొందించిన జీన్స్ దుస్తులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించే స్వెటర్ల కోసం, ఉన్ని లేదా అల్పాకాతో తయారు చేసినవి అందుబాటులోకి వచ్చాయి.వ్యర్థాల రీసైక్లింగ్.. ఫ్యాషన్ పరిశ్రమలో వ్యర్థాలను తగ్గించడానికి అప్‌సైక్లింగ్ రీసైక్లింగ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. డిజైనర్లు కొత్త ప్రత్యేకమైన దుస్తుల వెరైటీల సృష్టి కోసం పాత వ్రస్తాలు, స్క్రాప్లు, దుస్తుల తయారీలో వాడగా మిగిలిపోయిన వాటిని సృజనాత్మకంగా పునర్నిరి్మస్తున్నారు. ఇది వ్రస్తాల జీవితచక్రాన్ని పొడిగించడంలో, వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతోంది. అలాగే స్లో ఫ్యాషన్ మూవ్మెంట్.. స్లో ఫ్యాషన్ అనే భావన పెరిగింది. వినియోగదారులు తమ ఫ్యాషన్ ఎంపికల విషయంలో కంటికి ఇంపుగా ఉండే దుస్తుల కన్నా ఒంటికి మేలు చేసేవే మిన్న అనే భావనకు వస్తున్నారు. ఎక్కువ కాలం ధరించగలిగే శాశ్వతమైన, మన్నికైన దుస్తులను ఎంచుకుంటున్నారు. మరో వైపు ఇది సంప్రదాయ హస్తకళ స్థానిక కళాకారులకు ఇది ఊతమిస్తోంది. సంప్రదాయ నేయడం, అద్దకం, ఎంబ్రాయిడరీ పద్ధతులను సంరక్షించడానికి ప్రోత్సహించడానికి బ్రాండ్లు కళాకారులతో కలిసి పనిచేస్తున్నాయి. ఇది సంప్రదాయ కళలను పునరుజ్జీవింపజేయడమే కాకుండా హస్తకళాకారుల పురోభివృద్ధి అవకాశాలను కూడా పెంచుతోంది."రసాయన రహితంగా పూర్తి ఆర్గానిక్ దుస్తుల తయారీ అనేది ఇప్పటికీ కొంత సాహసంతో కూడిన ప్రయోగమే అని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్, డైతో తయారు చేసినవి తక్కువ షేడ్స్‌లో మాత్రమే లభ్యమవుతాయి. దేశంలో ఇప్పటికే కొన్ని బ్రాండ్స్ నాచురల్ డైస్‌తో చేసిన దుస్తులు విక్రయిస్తున్నప్పటికీ.. అవి కూడా పూర్తిగా 100శాతం ఆర్గానిక్ అని చెప్పలేం. ఆర్గానిక్ దుస్తులకు కాటన్, లినెన్, పట్టు.. ఫ్యాబ్రిక్స్ మాత్రమే నప్పుతాయి. అలాగే ఈ దుస్తుల తయారీకి మిగిలిన వాటి తయారీతో పోలిస్తే పట్టే సమయం కూడా బాగా ఎక్కువ. ‘నేను రూపొందించిన ఆర్గానిక్ దుస్తుల తయారీలో ఫ్యాబ్రిక్ మొత్తం చేనేతలనే వినియోగించాను. సిద్ధిపేటలోని ఆదర్శ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ సునంద ఈ ఫ్యాబ్రిక్స్ తయారీ చేయించారు. అదేవిధంగా ఉల్లిపాయ, పసుపు వంటి దినుసులతో పాటు చెట్ల ఆకులు, కాండం, వేర్లు.. వీటిని ఉపయోగించి ఆకుపచ్చ, విభిన్న రకాల బ్లూషేడ్స్, ఎల్లో, బ్రిక్ షేడ్స్‌తో కలర్స్ సృష్టించాం. కొంచెం డల్ ఫినిష్ ఉండే ఫ్యాబ్రిక్‌కి అత్యాధునిక డిజైనింగ్ వర్క్ జత చేసి ఆకట్టుకునేలా డ్రెసెస్ క్రియేట్ చేశాం. మొత్తం 20 డ్రెస్సెస్ క్రియేట్ చేస్తే.. 16 రకాల డిజైన్లను ఈ షోలో ప్రజెంట్ చేశాను’ అంటూ చెప్పారు సిటీ డిజైనర్ సంతోష్."నేచురల్ డై తయారీ యూనిట్ స్థాపించి..సింథటిక్ వంటి వ్రస్తాలు ఎంచుకుంటే అది పర్యావరణానికి హానికరమని, మన ఆరోగ్యానికి కూడా చేటు చేస్తుందనే స్పృహ నగరవాసుల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. అలాగే దుస్తుల తయారీలో వాడే కొన్ని మెటీరియల్స్ ఆక్సిజన్ నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కెమికల్ డైలను నివారించాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల ఆకులు తదితర సహజోత్పత్తుల ద్వారా తయారైన రంగుల వినియోగం పెంచాలి. నేచురల్ డైతో తయారైన.. పూర్తి సహజసిద్ధమైన ఫ్యాబ్రిక్‌ను అందించేందుకు సిటీ శివార్లలో మా సొంత డైయింగ్ యూనిట్‌ను ప్రారంభించాం. – మమత తుళ్లూరి, డిజైనర్ఇవి చదవండి: ఇది.. మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ డివైస్! -
Annu Patel: అన్నూస్ క్రియేషన్!
అన్నూ పటేల్.. ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్పెషల్ స్టయిల్ ఆమెది! ఆ స్పెషాలిటీకి బాలీవుడ్ ఫిదా అయింది! అటు ఫ్యాషన్‌లో.. ఇటు స్టార్స్ స్టయిలింగ్‌లో సీనియర్స్‌తో ఇన్స్పైర్ అవుతూ, తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతున్న ఆమె గురించి నాలుగు మాటలు ..అన్నూ పటేల్ స్వస్థలం గుజరాత్‌లోని వడోదర. ఫ్యాషన్‌గా ఉండటం, రకరకాల కలర్ కాంబినేషన్స్‌లో బట్టలు కుట్టించుకోవడమంటే ఆమెకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. కనుకే, ఫిజియోథెరపీలో చేరిన కొన్నాళ్లకే అది తన కప్ ఆఫ్ టీ కాదన్న విషయాన్ని గ్రహించింది. ఫ్యాషన్ మీదే మనసు పారేసుకుంది. ఆలస్యం చేయక, వడోదరలోని ఐఎన్ఐఎఫ్డీ (ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్)లో చేరింది. గ్రాడ్యుయేషన్ ఫస్టియర్‌లోనే ఆమె ఫ్యాషన్ ఐడియాస్కి ముచ్చటపడిన ఇన్స్టిట్యూట్ ఆమెకు ‘ద మోస్ట్ ఇన్నోవేటివ్ కలెక్షన్’ అవార్డ్నిచ్చింది. సెకండియర్‌లో ఉన్నప్పుడు ‘అన్నూస్ క్రియేషన్’ లేబుల్‌ను స్టార్ట్ చేసింది.ఆ చిన్న పట్టణంలో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది కానీ.. డిజైనర్ వేర్కి డిమాండ్ ఎక్కడ? అందుకే మొదట్లో తను డిజైన్ చేసిన దుస్తులను ఇంటింటికీ వెళ్లి అమ్మి, డిజైనర్ వేర్ పట్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి మోజు కలిగేలా చేసింది. ఆ ప్రయత్నం.. ఆమె చదువైపోయేలోపు ఫ్యాషన్ మార్కెట్లో ‘అన్నూ క్రియేషన్’కి స్పేస్‌ని క్రియేట్ చేసింది. దాన్ని స్థిరపరచు కోవాలంటే తన లేబుల్‌కు ఒక స్పెషాలిటీ ఉండాలని ఆలోచించింది అన్నూ. ఈ దేశంలో పెళ్లికిచ్చే ప్రాధాన్యం స్ఫురణకు వచ్చింది.బ్రైడల్ వేర్ డిజైన్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటే తన మార్కెట్ ఎక్కడికీ పోదని తెలుసుకుంది. తన ఐడియాను అర్థం చేసుకునే టీమ్‌ని ఎంచుకుని డిజైనింగ్ మొదలుపెట్టింది. తొలుత సామాన్యులకే బ్రైడల్ వేర్ ఇచ్చింది. అవి అసామాన్యుల మనసునూ దోచాయి. దాంతో అన్నూ క్రియేషన్ సెలబ్రిటీల స్థాయికి చేరింది. బ్రైడల్ వేర్ చేస్తున్నప్పుడే అన్నూకి ఫ్యాషన్ మార్కెట్లో ఎత్నిక్ వేర్కీ స్పేస్ కనపడింది. ముందు తనకు, తన టీమ్‌కి క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్ చేసి, వాటిని ధరించి.. ఫొటో షూట్ చేయించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయసాగింది. అవీ సెలబ్రిటీల దృష్టిలో పడి అన్నూ బ్రాండ్‌కి క్యూ కట్టసాగారు.ఆ డిమాండ్‌ను చూసి ‘ఎఫ్ అండ్ ఎఫ్ (ఫ్రిల్ అండ్ ఫ్లేర్)’ పేరుతో క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్‌ను స్టార్ట్ చేసింది. ‘ఎఫ్ అండ్ ఎఫ్’ అంటే కుర్తీలు, ఇండో– వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌కి పర్ఫెక్ట్ బ్రాండ్ అనే ఫేమ్‌ని సంపాదించింది. తనే కొత్త అవుట్‌ఫిట్‌ని డిజైన్ చేసినా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అన్నూ అలవాటు. అలా ఆమె డిజైన్స్ అన్నిటినీ ఫాలో అయిన కొందరు బాలీవుడ్ సెలబ్స్.. తమకు స్టయిలింగ్ చేయమని ఆమెను కోరారు. తొలుత అప్రోచ్ అయింది మలైకా అరోరా! ఆ తర్వాత కృతి ఖర్బందా, సోఫీ చౌధరీ, తారా సుతారియా, మౌనీ రాయ్, జాన్వీ కపూర్, హెజల్ కీచ్ వంటి వాళ్లంతా అన్నూ పటేల్ స్టయిలింగ్ క్లయింట్ల లిస్ట్‌లో చేరిపోయారు. ‘సామాన్యులకు డిజైన్ చేస్తున్నా, సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నా.. ఆయా స్థాయిల్లో అంతే ఎఫర్ట్స్ పెడతాను, అంతే కమిట్మెంట్తో ఉంటాను. నా డిజైనర్ వేర్ని.. నా స్టయిలింగ్‌ని కోరుకుంటున్న వాళ్ల సంతోషమే నాకు ముఖ్యం. అది నాకు కోటి అవార్డులతో సమానం!’ అంటుంది అన్నూ పటేల్.ఇవి చదవండి: Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా! -
Fashion: మై వార్డ్రోబ్: క్రియేటివ్‌గా.. హుందాగా..!
మైండ్, బాడీ ఫిట్‌గా ఉంటే డ్రెస్సింగ్ కూడా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. ‘జిమ్‌లో వర్కవుట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే, మన వార్డ్రోబ్ మైండ్ ఎక్సర్సైజ్’ అంటున్నారు హైదరాబాద్ వాసి ఫిట్నెస్ ట్రైనర్ అనుప్రసాద్. జిమ్వేర్తో పాటు రెగ్యులర్, పార్టీవేర్ విషయంలో తీసుకునే స్పెషల్ కేర్ గురించి అనుప్రసాద్ మాటల్లో...‘‘ఉదయం ఏ డ్రెస్ వేసుకోవాలనేది ప్రతిరోజూ ఆలోచించేలా చేస్తుంది. అందుకే, క్యాజువల్ వేర్‌గా కొన్ని, సందర్భానుసారంగా వార్డ్రోబ్ను సెట్ చేసుకుంటాను. సాధారణంగా తక్కువ డబ్బులతో డ్రెస్ ఎంపిక చేసుకొని, రిచ్‌గా ఉండేలా కనిపించడానికి ప్లాన్ చేస్తుంటాను. ఇండోవెస్ట్రన్ డ్రెస్‌తోనూ హుందాతనాన్ని, మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ స్టైల్‌గా కనిపించవచ్చు. పెయింటింగ్స్ వేస్తుంటాను కాబట్టి కలర్ కాంబినేషన్స్ విషయంలో అవగాహన ఉంది. చాలా వరకు మ్యాచింగ్ గురించి ఆలోచన చేయను. శారీస్ మీదకు కాంట్రాస్ట్, క్రాప్‌టాప్స్, ష్రగ్స్ కూడా సెట్ చేస్తాను. కాటన్స్కి ఎక్కువ ్రపాధాన్యత ఇస్తాను. బెస్ట్ డ్రెస్డ్ అవార్డ్..మిసెస్ ఇండియా తెలంగాణ బెస్ట్ డ్రెస్డ్ ఈవెంట్ (2019)కి క్రియేటివ్‌గా ఆలోచించాలనుకున్నాను. శారీ, బ్లౌజ్‌కి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు.. మొదలైనవాటితో నేనే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేశాను. ఆ శారీనే కట్టుకున్నాను. రెండు వేల రూపాయల్లో ఆ శారీని తయారుచేసి, ప్రదర్శించి, అవార్డు దక్కించుకున్నాను.పూసలు గుచ్చి..లంగా ఓణీ, పట్టు చీరలు సంప్రదాయ వేడుకల సందర్భాలలో కట్టుకుంటాను. దీంట్లోనే ప్రత్యేకంగా కనిపించాలంటే బ్లౌజ్ సింగిల్ హ్యాండ్‌కి పూసల హారాలు లేయర్లు గుచ్చి, నాట్ చేస్తాను. దాదాపు నెలకు మూడు, నాలుగు ఈవెంట్లకు హాజరవుతుంటాను. అందుకు కొత్తదనం, నిండుదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.జిమ్ టీ షర్ట్స్..శారీస్‌కు సాధారణ బ్లౌజులే కాదు జిమ్‌కు వేసుకునే టీ షర్ట్స్ కూడా వాడతాను. బ్లాక్ క్రాప్‌టాప్ కాటన్ శారీకి వాడతాను. మంచి కలర్ కాంబినేషన్స్ ఉండేలా, సింపుల్ లుక్‌ని క్రియేట్ చేస్తాను. జిమ్‌లో మన కదలికలకు తగ్గినట్టు ఫ్లెక్సిబుల్ డ్రెస్ ఉండాలి. క్వాలిటీ కూడా చూడాలి. క్యాజువల్ వేర్‌గా జీన్స్, టీషర్ట్స్ మాత్రమే కాదు లాంగ్ స్కర్ట్స్ కూడా ఉపయోగిస్తాను.టై అండ్ డై చేస్తాను..వైట్ కాటన్ మెటీరియల్ తెప్పించుకొని, టై అండ్ డై టెక్నిక్‌తో కొత్త డిజైన్స్ సృష్టిస్తుంటాను. ఒక శారీకైతే వేరుశనగ గింజలను ముడివేసి, పెయింట్ చేశాను. త్రీడీ పెయింటింగ్స్ చేస్తుంటాను. ఏ వేస్ట్ మెటీరియల్ ఉన్నా దానిని అందంగా క్రియేట్ చేస్తాను. ఇండిపెండెంట్స్ డే వంటి అకేషన్స్‌కి ఎంచుకున్న శారీకి క్రాప్‌టాప్‌తో మ్యాచ్ చేశాను.జ్యువెలరీ తయారీ..తక్కువ ధరలో జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. కొంచెం సమయం కేటాయిస్తే చాలు అలాంటి ఫ్యాషన్ జ్యువెలరీని మనమే ఇంకా తక్కువ ధరలో తయారుచేసుకోవచ్చు. బెల్ట్‌తో మరో స్టైలిష్ లుక్ వచ్చేలా చూసుకుంటాను. అలా.. క్లే జ్యువెలరీ, థ్రెడ్ జ్యువెలరీ నేనే తయారు చేసుకుంటాను’’ అని వివరించారు ఈ ఫిట్నెస్ ట్రైనర్.ఇవి చదవండి: 'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది! -
నటుడు కమలహాసన్ సరికొత్త బ్రాండ్! జీరో వేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్!
న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ ఔత్సాహికులను పర్యావరణ స్ప్రుహ వైపుకు అడుగులు వేసేలా సృజనాత్మకతకు పెద్దపీట వేస్తోంది. ఆ వేదికపై టాప్ డిజైనర్ క్రియేషన్‌ని మొత్తం పర్యావరణహిత ఫ్యాషన్‌తోనే నింపేసింది. ఆ అద్భుతమైన ఫ్యాషన్ బ్రాండ్స్ ప్రదర్శనల్లో కమలహాసన్ లేబుల్ హౌస్ ఆప్ ఖద్ధర్‌ను సుతారా కలెక్షన్స్ ఆవిష్కరించింది. ఇక్కడ కోలీవుడ్ నటుడు కమలహాసన్ ఖాదర్ ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా ఈ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇది వంద శాతం ఎకో బ్రాండ్. నేత కార్మికుడు నుంచి నేరుగా ఈ ఫాబ్రిక్ను తీసుకుని రూపొందిస్తారు. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం సేంద్రీయ రంగులతోనే తయారు చేయడం విశేషం. సుతారా కలెక్షన్స్ సినిమా, కళలను స్ఫూర్తిగా తీసుకుని స్థిరమైన ఫ్యాషన్ దృక్పథాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సరికొత్త ఫ్యాషన్ కలెక్షన్‌తో ముందుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే టొమాటో లెదర్, ఖద్దర్ డెనిమ్ పిక్ నిట్, మస్లిన్ ఖాదీ, వృత్తాకార మెష్ ఫ్యాబ్రిక్‌తో సహా పర్యావరణ అనుకూల పదార్థాలతో ఫ్యాషన్‌ని ఆకట్టుకునే యత్నం చేస్తోంది. ఇది హస్తకళాకారుల నైపుణ్యాన్ని నొక్కి చెబుతోంది. అదీగాక సెలబ్రిటీలు, ప్రముఖులు, డిజైనర్లు పర్యావరణ అనూకూల ఫ్యాషన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతరు సారా అలీఖాన్ 60ల నాటి రెట్రో చీరలతో రూపొందించిన లెహంగాతో మెరిసిన సంగతి తెలిసిందే. జీరో కార్బన్‌కి ప్రాధాన్యత ఇచ్చేలా పాత వస్త్రాలను రీసైక్లింగ్ చేసి పొదుపు షాపింగ్‌కి ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అందులోనూ ప్రముఖ లగ్జరీ బ్రాండ్లే జీరోవేస్ట్ డిజైన్‌కి ప్రాముఖ్యత ఇచ్చి..సరికొత్త డిజైనర్‌వేర్‌లను క్రియేట్ చేస్తుండటం మరింత విశేషం. ఈ ఫ్యాషన్ ట్రెండ్‌కి అత్యంత విశేష ప్రజాదరణ లభించడమే గాక పర్యావరణ అనుకూల ఫ్యాషన్‌కి పెరుగుతున్న క్రేజ్‌ని ప్రతిబింబిస్తోంది. (చదవండి: 60ల నాటి చీరలతో రూపొందించిన లెహంగాలో సారా అలీఖాన్ స్టన్నింగ్ లుక్..!) -
‘రెట్రో’ చీరలతో లెహంగా.. సారా అలీఖాన్ స్టన్నింగ్ లుక్..!
ప్రముఖులు, సెలబ్రిటీలు ట్రెండ్‌కి తగ్గట్టు లగ్జరీయస్ దుస్తులు ధరిస్తారు. ముఖ్యంగా ప్రముఖ బ్రాండెడ్ దుస్తులతో ఫ్యాషన్ ప్రపంచానికి ఐకానిక్‌గా ఉంటుంది వారి డ్రెస్సింగ్ స్టైల్. అలాంటిది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ మాత్రం ఫ్యాషన్‌కే సరికొత్త అర్థం ఇచ్చే డిజైనర్ వేర్లో తళుక్కుమంది. ఈ ముద్దుగుమ్మ దుస్తుల వేస్ట్‌కి అడ్డుకట్ట వేసేలా పర్యావరణ హిత ఫ్యాషన్ శైలిని తీసుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎలాంటి ఫ్యాబ్రిక్ డ్రెస్ ధరించింది అనే కదా సందేహం..!అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలో ఓ రేంజ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో బాలీవుడ్ అగ్ర తారలంతా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సారా ప్రత్యేకమైన దుస్తులను ఎంచుకుంది. డిజైనర్ మయ్యూర్ గిరోత్రా కోచర్ రూపొందించిన అందమైన లెహెంగాలో ఈ బుట్టబొమ్మ మెరిసింది. అయితే ఈ లెహంగాని డిజైనర్ 50, 60ల నాటి పాత చీరలను రీసైక్లింగ్ చేసి రూపొందిచారు. చూడటానికి ఈ లెహంగా వివిధ రంగుల చీరల కలయికతో అందంగా ఉంది. ఈ లెహంగాలో సారా స్టన్నింగ్ లుక్ చూపురులను తిప్పుకోని విధంగా ఆకర్షణీయంగా కనిపించింది. చెప్పాలంటే సారా ఎంచుకున్న డిజైనర్ వేర్ దుస్తుల వేస్ట్‌ని అరికట్టేలే ఫ్యాషన్ ట్రెండ్‌ని సరికొత్త విధంగా సెట్ చెయ్యొచ్చు అని ప్రేరణ కలిగించేలా ఉంది ఆమె మెస్మరైజ్ లుక్. ఈ మిక్స్డ్ కలర్ లెహంగాకి సారా పర్పుల్ కలర్ బ్లౌజ్‌ని జత చేసింది. ఈ బ్లౌజ్‌కి డోరీ టైస్ , గోల్డ్ బ్రోకెడ్ ఎంబ్రాయిడరీ, గొట్టా పట్టీ బార్డర్లు ఉన్నాయి. అలాగే ఈ లెహంగాకి మ్యాచ్ అయ్యేలా రాగి కలర్‌తో కలగలసిన బంగారు టిష్యు సిల్క్ దుప్పట గ్రాడ్ లుక్‌ని తెచ్చిపెట్టింది. అందుకు తగ్గట్టు మంచి ఐషాడో, మిరుమెట్లుగొలిపే ఐలైనర్, న్యూడ్ లిప్షేడ్తో చాలా సింపుల్ మేకప్‌లో మెరిసింది. హెయిర్‌ని కూడా టై చేసి వదిలేసింది. అంతేగాదు తన లెహంగాకి మ్యాచింగ్ అయ్యేలా తలలో ఊదారంగు పూలను ధరించింది. అలాగే చెవులకు జుమ్మీలు, మెడకు పోల్కీ చోకర్ నెక్లస్‌తో గ్రాండ్‌గా కనిపించింది సారా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Mayyur Girotra Official (@mayyurgirotracouture) (చదవండి: కివీ కర్రీ..శ్రీలంక ఫేమస్ రెసిపీ..!) -
Kadali: మై వార్డ్రోబ్.. కలర్ఫుల్గా.. కడలి అలలా!
‘కొత్త డ్రెస్ వేసుకుంటే ఆ రోజంతా హుషారుగా అనిపిస్తుంటుంది. అందుకే ఉదయం లేస్తూనే ఆ రోజు వేసుకోదగిన డ్రెస్ గురించి ప్లానింగ్ చేసుకుంటాను’ అంటోంది రచయిత్రి, సాంగ్ రైటర్ కడలి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి సాహిత్యం, సినిమాల్లో కృషి చేస్తున్న కడలి పాఠకులకు పరిచితమే. ‘రైటర్ అంటే కాటన్స్ మాత్రమే వేసుకోవాలనేం ఉండదు. కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులు ఏవైనా వేసుకోవచ్చు. అందుకే నా వార్డ్‌రోబ్‌లో అన్నీ మోడ్రన్, కలర్‌ఫుల్ డ్రెస్సులు ఉంటాయి’ అంటోంది కడలి.‘‘మన వార్డ్రోబ్ మనకు ఒక అద్దం లాంటిది. ఈ విషయం చెప్పడానికి నేను రాసిన ఒక కథను పరిచయం చేయాలి. ఆ కథలో ఒక యంగ్ అమ్మాయి హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. కానీ చుట్టూ రకరకాల మాటలతో డిప్రెస్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. రైలు పట్టాల దగ్గరకు వెళ్లి అక్కడ జరిగిన ఒక సంఘటనతో ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అద్దంలో తన ముఖం చూసుకొని అందంగా తయారవ్వాలనుకుని కళ్లకు కాటుక పెట్టుకుంటుంది. తర్వాత జీవితంపై ఆశతో స్వీయప్రేరణతో తనను మెరుగు చేసుకుంటుంది ఆ కథలో. అంటే మనం ఎలా ఉండాలో మన చుట్టూ ఉన్నవారు డిసైడ్ చేయరు. మనకు మనమే నిర్ణయించుకోవాలి.నాకు నేను ప్రేరణగా!నేను షార్ట్స్ కూడా వేసుకుంటాను. బట్టలను బట్టి ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఎలా జడ్జ్ చేస్తారో ఇప్పటికీ అర్ధం కాదు. అందుకే కొన్ని సభలకు టీ షర్ట్స్, జీన్స్ వేసుకెళతాను. ఈ అమ్మాయా రైటర్ రా?! అని ఆశ్చర్యపోయేవారున్నారు. ఏది సౌకర్యంగా ఉంటుందో అది వేసుకున్నంత మాత్రాన వ్యక్తిత్వానికి మార్కులు వేయకూడదు. ఎవరైనా అలా అన్నా నేను పట్టించుకోను. మీటింగ్ సందర్భాలలో కుర్తీస్ వేసుకుంటాను. రెడీ అవ్వాలి అనిపిస్తే మాత్రం ఏ మాత్రం రాజీ పడను. కాన్ఫిడెంట్‌గా ఉండాలి..నా మనసుకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను కాబట్టి కాన్ఫిడెంట్‌గా కూడా ఉంటాను. నా స్నేహితుల జాబితాలో ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు. వారి డిజైన్స్ నాతో ట్రై చేస్తుంటారు. వాటిలో నచ్చినవి తీసుకుంటాను.అమ్మ చీరలను కొత్తగా!అమ్మ కట్టుకునే చీరలు చూసి నాకూ అలా చీరలు కట్టుకోవాలనిపిస్తుంది. మా అమ్మకు మూడు బీరువాల చీరలున్నాయి. రెగ్యులర్ చీరలు తప్ప వాటిని కట్టుకోదు. దీంతో అమ్మ చీరలను నేను కట్టుకుంటుంటాను. ‘అంచు చీరలు నీవేం కట్టుకుంటావు, పెద్దదానిలా’ అంటుంది. కానీ, బ్లౌజ్ డిజైన్‌తో స్టైలిష్ లుక్ తీసుకువస్తాను. దీంతో అమ్మ కూడా ఆశ్చర్యపోతూ ‘చాలా బాగుంది’ అని కితాబు ఇచ్చేస్తుంది. పండగలు, కుటుంబ ఫంక్షన్లు, వేడుకలకు సందర్భానికి తగినట్టు లంగాఓణీలు, పట్టుచీరలు అన్నీ ప్రయత్నిస్తాను.భిన్నంగా ఉండాలని..రచయిత్రి అనగానే ముతక చీరలు, కళ్లద్దాలు ఉండాలని చాలా మంది అనుకునేవారు. కానీ, నా వార్డ్రోబ్ మాత్రం వాటన్నింటికన్నా భిన్నం. రచయిత్రులు అంటే ఇలాగే ఉండాలి అనే ఆలోచనల్లోనుంచి ఒక మార్పు తీసుకురావాలని బుక్ లాంచింగ్ వంటి కార్యక్రమాలకు జీన్స్, టాప్స్ ట్రై చేస్తుంటాను. ప్రతీ రోజూ కొత్తగా ఉండాలనుకుంటాను. ఏ డ్రెస్ వేసుకొని రెడీ అవుతామో ఆ రోజు ఆ డ్రెస్ ప్రభావం మన మీద ఉంటుంది.ఫ్యాషన్ షోలు..దేశ, విదేశాల్లోనూ ఫ్యాషన్ షోలు నడుస్తుంటాయి. వాటిలో ప్రసిద్ధ డిజైనర్లు సీజన్‌ని బట్టి కలర్, డిజైన్ థీమ్‌ని పరిచయం చేస్తుంటారు. వాటి కోసం ఆన్లైన్ సెర్చింగ్‌తో పాటు, ఫ్యాషన్ మ్యాగజీన్స్ కూడా చూస్తుంటాను. ఆ కలర్ డ్రెస్ కాంబినేషన్స్ నేనూ ప్రయత్నిస్తుంటాను. ఎక్కువగా మాత్రం బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఇష్టపడతాను. ఆ కాంబినేషన్ డ్రెస్సులు కూడా చాలానే ఉన్నాయి నా దగ్గర’’ అంటూ వార్డ్రోబ్ విశేషాలను షేర్ చేసుకుంది. – నిర్మలారెడ్డి -
హైలైఫ్ ఎగ్జిబిషన్లో సందడి చేసిన నటి సీరత్ కపూర్, మోడల్స్..(ఫొటోలు)
-
Fashion: ఫ్యాషన్ ఇలాకా.. ట్రిపుల్ ధమాకా..
సాక్షి, సిటీబ్యూరో: ఒకేరోజున ముగ్గురు ఆల్ ఇండియా టాప్ క్లాస్ ఫ్యాషన్ డిజైనర్లు తమ డిజైన్లతో నగరాన్ని పలకరించారు. తమదైన శైలికి చెందిన అంతర్జాతీయ దుస్తుల శ్రేణిని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే అగ్రగామి డిజైనర్లుగా పేరొందిన ఢిల్లీకి చెందిన అబ్రహమ్, ఠాకూర్ ద్వయంతో పాటు రాహుల్ మిశ్రాలు హాజరయ్యారు.అదే విధంగా ప్రముఖ డిజైనర్ దుస్తుల బ్రాండ్ సత్యపాల్.. బంజారాహిల్స్ రోడ్ నెం1లో ఉన్న సత్వా సిగ్నేచర్ టవర్‌లో వరుసగా తమ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఒకేరోజున వాటిని ప్రారంభించారు. సిటీ ఫ్యాషన్ సర్కిల్లో సందడి నింపిన ఈ అత్యాధునిక దుస్తుల స్టోర్ల ప్రారం¿ోత్సవం, లాంచింగ్ పారీ్టలకు సినీనటులు తమన్నా, నిహారికా, శోభితా దూళిపాళ్ల, సిరత్ కపూర్‌తో పాటు నగరంలోని పలువురు సెలబ్రిటీలు హాజరై డిజైనర్లకు అభినంధనలు తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులతో డిజైనర్లు తమ కలెక్షన్స్ గురించిన విశేషాలను పంచుకున్నారు. -
ఒకప్పుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్..నేడు మోడల్‌గా..!
ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ స్థాయి నుంచి మోడల్‌గా ఎదిగి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. తన కలను సాకారంచేసుకునేందుకు అతను పడిన కష్టాలు, అవమానాలు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అతనెవరు? ఎలా తన కలను సాకారం చేసుకున్నాడంటే..ముంబైకి చెందిన సాహిల్ సింగ్ మోడల్‌గా తన సక్సెస్ జర్నీ ఎలా సాగిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను రెండేళ్లు స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత బర్గర్ కింగ్‌లో ఒక ఏడాది చెఫ్ పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తన తొలి మోడలింగ్ ప్రదర్శనకు ముందు ఎనిమిది నెలలు పాటు మ్యాంగో మార్ట్‌లో పనిచేసినట్లు వివరించాడు. అంతేగాదు పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత నుంచే పలు రకాల ఉద్యోగాలు చేసినట్లు తెలిపాడు. అయితే స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా నెలకు రూ. 18,000 నుంచి రూ. 22,000 సంపాదించినట్లు తెలిపాడు. 2009లో ఓ మోడల్ పోస్టర్ చూసిన తర్వాత తాను ఏం చేయాలనేది తెలిసిందన్నాడు. ఆ తర్వాత మోడల్ అయ్యేందుకు కావాల్సిన పరిజ్ఞానంపై దృష్టిసారించినట్లు తెలిపాడు. అందుకోసం రోడ్డుపక్కనే వాలెట్లు వంటివి అమ్మేవాడినని కూడా చెప్పుకొచ్చాడు. అంతేగాదు దాదాపు 200 ఆడిషన్స్ చేసినట్లు తెలిపాడు. అలా ఈ ఏడాది చివరికి ర్యాంప్‌పై నడిచే అవకాశాన్ని దక్కించుకోగలిగాని ఆనందంగా చెప్పాడు. తనను మోడల్‌గా స్ట్రీక్స్ అనే ఫ్యాషన్ సంస్థ ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. తనలోని లోపాలను గురించి కూడా నిజాయితీగా వివరించాడు. తన ఎత్తు కేవలం 5 అడుగుల 10 అంగుళాలని, ఇది బెస్ట్ మోడల్‌గా ఎంపికయ్యేందుకు కావాల్సిన అర్హత కాదని చెప్పాడు. తాను ర్యాంప్‌పై నడిచేలా అనుమతించమని పదేపదే అభ్యర్థించాల్సి వచ్చేదని అన్నారు. అయితే స్ట్రీక్స్ తనను హీల్స్ ధరించాలనే షరతుపై వారు అందుకు అంగీకరించినట్లు తెలిపారు. అంతేగాదు మోడల్ అయ్యేందుకు ఎలాంటి టెక్నీక్స్ ఫాలో అవ్వాలో సూచించాడు. అంతేగాదు ఈ ఫీల్డ్‌లోకి కొత్తగా వెళ్తున్నవారికి మార్గదర్శకత్వం వహించేలా ఇన్‌స్టాగ్రాంలో కొత్త సిరిస్ ప్రారంభించాడు. అలాగే మోడలింగ్ రంగంలో రాణించాలంటే ఫోటోగ్రాఫర్లు, స్టైలిస్ట్‌లు, డిజైనర్లు, మంచి స్టూడియో వ్యక్తులు వంటి నెట్వర్క్ ఉండాలి. అప్పుడే ఈజీగా మోడల్ అవ్వగలరని చెబుతున్నాడు. ఈ నెట్వర్క్ కోసం సోషల్ మీడియా వంటి సాయంతో అలాంటి వ్యక్తులకు టచ్‌లో ఉండేలా నేరుగా మెసేజ్‌లు పెట్టడం, ఇమెయిల్స్ పంపడం వంటివి చేయాలని సూచించాడు. నిజంగా ఇతడి కథ ఎందరికో స్పూర్తి కదూ..!. View this post on Instagram A post shared by Sahil Singh | fashion & grooming tips | (@fashiontipssahil) (చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!) -
ఈ డాన్సింగ్ కుషన్స్‌ని ఎప్పుడైనా చూశారా!?
సోఫా, బెడ్‌పైకి రకరకాల మోడల్స్‌లో కుషన్స్ కనపడుతుంటాయి. వాటిల్లో డాన్సింగ్ కుషన్స్‌ని చూశారా? ఎంబ్రాయిడరీ, ప్యాచ్‌వర్క్, పెయింటింగ్ కాంబినేషన్స్‌తో రూపుదిద్దుకునే ఈ కుషన్ డిజైన్స్ సృజనాత్మకతకు అద్దంపడతాయి. లివింగ్ రూమ్, బెడ్ రూమ్, కిడ్స్ రూమ్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.పిల్లల ఫ్రాక్స్ను పోలిన నెటెడ్ మెటీరియల్‌తో డిజైన్ చేసి, అటాచ్ చేసిన డాన్సింగ్ డాల్స్‌ని కుషన్ కవర్స్‌కి జతచేసినా.. డోర్స్‌కి హ్యాంగ్ చేసినా అదనపు హంగునిస్తాయి. ఈ డెకరేటివ్ కుషన్స్‌ని వివాహ వేడుకలు, పిల్లల పుట్టినరోజు పార్టీల కోసం కూడా డిజైన్ చేస్తున్నారు క్రియేటర్స్. వీటిలో నెటెడ్, లేస్, ముత్యాలు, కలర్ రిబ్బన్స్ వంటి వాటì నీ ఉపయోగిస్తున్నారు. -
Santoshi Shetty: బెస్ట్ ఫ్యాషన్ బ్లాగర్‌గా..
ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ బ్లాగర్. ‘The Style Edge’ ఫౌండర్. సోషల్ మీడియా స్టార్. ఇన్‌స్టాలో ఆమెకు ఏడు లక్షలకు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. సొంతూరు ముంబై. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ చేసింది.కాలేజీ రోజుల్లోనే తన పేరు మీదే యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది. డార్క్ స్కిన్ వల్ల తను ఎదుర్కొన్న వివక్షను వివరిస్తూ చేసిన వీడియోతో పాపులర్ అయింది. అది ఆమెకు మోడలింగ్ చాన్స్‌నిచ్చింది. ర్యాంప్ మీద షో స్టాపర్‌గా నిలిచింది. ‘Grazia India’ లాంటి ఫ్యాషన్ మ్యాగజీన్లు ఆమె ఫొటోతో కవర్ పేజ్ని మేకప్ చేసుకున్నాయి. బెస్ట్ ఫ్యాషన్ బ్లాగర్‌గా ఎన్నో అవార్డులూ అందుకుంది సంతోషి శెట్టి.ఇవి చదవండి: హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి -
Nitasha Gaurav: న్యూ గ్రామర్ అండ్ గ్లామర్!
రంగుల్లో పింక్‌తో, కాస్ట్యూమ్స్‌లో స్కర్ట్‌తో మగవాళ్లకు స్టయిలింగ్ చేసి.. ఫ్యాషన్‌కి ముఖ్యంగా డ్రెసింగ్‌కి, కలర్స్‌కి జెండర్ లేదు.. కంఫర్టే ముఖ్యం అంటూ దేశంలో మెన్ ఫ్యాషన్ గ్రామర్ని, గ్లామర్‌ని మార్చేసిన స్టయిలిస్ట్.. నితాశా గౌరవ్! రణ్వీర్ సింగ్ పర్సనల్ స్టయిలిస్ట్!‘న్యూస్ పేపర్స్, అన్నిరకాల మ్యాగజీన్స్, బుక్స్, ఆర్ట్, ట్రావెల్, నేచర్, మ్యూజిక్.. ఇవన్నీ నాకు ఇన్స్పిరేషనే! స్టయిల్ అండ్ ఫ్యాషన్‌కి మినిమలిజం, మాగ్జిమలిజం రెండూ అవసరమే! ఈ రంగంలో రాణించాలంటే ఫ్యాషన్‌కి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. పనిని ప్రేమించాలి’ అని చెబుతుంది నితాశా గౌరవ్. నితాశా.. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్, న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్యాషన్‌కి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్‌ని పూర్తిచేసింది. ఇండియాకు తిరిగి రాగానే ఫెమినా ఇండియాలో ఉద్యోగంతో ఫ్యాషన్ కెరీర్‌ని మొదలుపెట్టింది. ఫెమినాలో నాలుగేళ్ల కొలువు తర్వాత నిఫ్ట్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో చేరింది. అందులో కొన్నాళ్లు చేశాక.. ఇండిపెండెంట్‌గా ఏదైనా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడే కొన్ని ఫ్యాషన్ షోస్‌కి, షూట్స్‌లో మోడల్స్‌కి స్టయిలింగ్ చేసే చాన్స్ రావడంతో ఆ పనిలో పడిపోయింది.అలాంటి ఒకానొక సందర్భంలో ఫిల్మ్‌ఫేర్ షూట్‌కి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌కి స్టయిలింగ్ చేసే అవకాశం దొరికింది. ఆ క్రమంలో నితాశా ఆలోచనలు, పని విధానం రణ్‌వీర్‌కి నచ్చాయి. ముఖ్యంగా ఫెమినైన్ అనుకునే కలర్స్, డ్రెసెస్‌తో ఆమె తనకు స్టయిలింగ్ చేస్తున్న తీరు మరీ నచ్చింది. దాంతో. తర్వాత కూడా చాలా ఈవెంట్స్కీ వాళ్ల అసోసియేషన్ కొనసాగింది. అలా రణ్‌వీర్‌కి ఆమె ఇచ్చిన కొత్త లుక్.. టాక్ ఆఫ్ ద కంట్రీ అవడంతో సెకండ్ థాట్ లేకుండా నితాశాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నాడు రణ్వీర్. అది ఆమె ఊహించనిది. మనసులో సంతోషం కుదిపేస్తున్న బాధ్యత ఆమెను స్టడీగా నిలబెట్టింది.రణ్‌వీర్‌కి పర్సనల్ స్టయిలిస్ట్ అంటే ఆమె క్రియేటివిటీకీ అతనికున్నంత దూకుడు, ఎనర్జీ ఉండాలి! ‘యెస్..’ అనుకుంటూ ఆ జాబ్‌ని చాలెంజింగ్‌గా తీసుకుంది. నిలబెట్టుకుంది. స్టయిలిస్ట్‌గా తనను ఎంచుకోవడంలో రణవీర్ తీసుకున్న నిర్ణయానికి అతన్ని గర్వపడేలా చేసిందే తప్ప‘ఇట్ హ్యాపెన్స్’ అని సర్దుకుపోయేలా చేయలేదు. గల్లీ బాయ్, బేఫిక్రే లాంటి సినిమాలే అందుకు దృష్టాంతాలు. ఆమె అనుష్కాకూ పనిచేసింది స్టయిలిస్ట్‌గా ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమాలో!ఫ్యాషన్ రూల్ బుక్‌ని అన్‌ఫాలో కావడమే ఆమె ప్రత్యేకత. డిఫరెంట్ స్టయిల్స్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ చేయడంలో దిట్ట ఆమె! ఆ స్పెషాలిటీ, ఆ ఫ్యూజన్‌కి ధనుష్, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, అభయ్ డియోల్లూ ముచ్చటపడి.. వాళ్లూ ఆమెను పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు.ఇవి చదవండి: ‘పంచాయతీ’ రిజర్వేషన్లు మారుతాయి -
Fashion: కొన్ని మార్పులే.. కొత్తగా!
‘మనం ఎలా ఉంటున్నామో మన వార్డ్రోబ్ మనకే పరిచయం చేస్తుంది అందుకే, పర్ఫెక్ట్ ప్లాన్ కంపల్సరీగా ఉండాల్సిందే. అలాగని ఎప్పుడూ షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటినే కొద్దిపాటి మార్పులతో మనదైన బడ్జెట్లో స్టయిలిష్ లుక్‌తో మార్కులు కొట్టేసేలా డిజైన్ చేసుకోవాలి. సందర్భానుసారమే కాదు సీజన్‌ని బట్టి కూడా ఎంపిక ఉండాలి..’ అంటూ తన వార్డ్రోబ్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటున్న సుమిత కందిమళ్ల.కొన్ని మార్పులే.. కొత్తగా!ఓల్డ్ శారీస్‌తో న్యూ లుక్ ఈ రోజుల్లో ఒక మంచి డిజైన్ ఘాగ్రా కొనాలంటే చాలా ఖర్చు. అందుకని, అదే మోడల్స్‌లో అంతే లుక్‌తో ఉండే తక్కువ రేట్ లెహంగాలు ఆన్లైన్ వేదికలపై వెతికి తీసుకుంటాను. పాతికేళ్ల క్రితం ఉన్న చీరలను రీయూజ్ చేయాలనే ఆలోచనతో చుడీదార్స్, లెహంగాలను డిజైన్ చేయిస్తుంటాను. చేనేతలకు పేరొందిన ్రపాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి స్థానిక మార్కెట్లో షాపింగ్ చేస్తాను. దీని వల్ల తక్కువ బడ్జెట్లో అనుకున్నవి లభిస్తాయి.డిజైన్స్‌కి ముందుగా డ్రాయింగ్..శారీస్‌ను బట్టి బ్లౌజ్ డిజైన్స్ నాకేవి బాగుంటాయో ఒక పేపర్ మీద డ్రా చేసుకుంటాను. ఆ తర్వాత ఎప్పుడూ కుట్టించే టైలర్ దగ్గర ఇస్తాను. మనం ఉండే ప్లేస్, వాతావరణాన్ని బట్టి కూడా స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. నైట్ పార్టీ అయితే షిమ్మర్, గ్లిట్టర్ లైట్ వెయిట్ డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను. వేసవిలో కంచిపట్టు కాకుండా బెనారస్, షిఫాన్స్ని ఎంపిక చేసుకుంటాను. పూజలు అంటే పట్టు చీరలు సహజమే. పెళ్లి, రిసెప్షన్ వంటివాటికి చీరలు కట్టినా హెయిర్‌స్టైల్స్‌లో మార్పులు చేసుకుంటాను. జ్యువెలరీని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటాను. వీటికి తగినట్లుగా డిజైనర్ బ్యాగ్స్, సన్‌గ్లాసెస్, వాచీ కలెక్షన్స్ యూజ్ చేస్తాను.కలర్స్.. కాంట్రాస్ట్..ఎప్పుడూ ఒకే తరహా వేస్తే డ్రెస్సింగ్ అయినా, కలర్ కాంబినేషన్స్ అయినా బోర్‌గా అనిపిస్తుంది. కొన్నిసార్లు గ్రీన్ షేడ్స్‌లో కావాలనుకుంటే మోనోక్రోమ్ లుక్‌లో ప్లాన్ చేసుకుంటాను. ఒక్కోసారి పూర్తిగా కాంట్రాస్ట్ వేసుకుంటాను. నా డ్రెస్సింగ్ లేదా మేకప్‌లో ఏమైనా చేంజెస్ కోసం మా అమ్మాయిల సూచనలూ తీసుకుంటాను. బర్త్ డే పార్టీలకు పూర్తిగా వెస్ట్రన్ వేర్, డే టైమ్ అయితే నీ లెంగ్త్, ఈవెనింగ్ అయితే షార్ట్స్ కూడా ప్లాన్ చేసుకుంటాను. కొన్నింటిని డెనిమ్, లెదర్ జాకెట్స్‌తో కవర్ చేసేవీ ఉంటాయి.ముగ్గురం... డిఫరెంట్‌గా!నాకు ఇద్దరూ అమ్మాయిలే కాబట్టి నాతోపాటు వారికీ అన్నీ సెట్ చేయాల్సిందే. చాలావరకు ఫ్యామిలీ కాంబినేషన్ సేమ్ కలర్ థీమ్ అంటుంటారు. కానీ, ఒక్కొక్కరు ఒక్కో స్కిన్ టోన్‌లో ఉంటారు. వారికి నచ్చిన కలర్ కాంబినేషన్స్ తీసుకొని ప్లాన్ చేస్తాను. ఒకరిని ట్రెడిషనల్‌గా, మరొకరిని ఫ్యాన్సీగా తయారు చేస్తాను. నేను వారికి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.ఒకరికి బ్రేస్లెట్స్ ఇష్టం, మరొకరికి రింగ్స్ ఇష్టం. నాకు గాజులు బాగా ఇష్టం. ఒకరు బ్రేస్లెట్ ధరిస్తే, మరొకరు పది, పదకొండు రింగ్స్ పెట్టుకుంటారు. ఇంకొకరు బ్యాంగిల్స్ ఎక్కువగా వేసుకుంటారు.తిరుపతికి వెళితే అక్కడి నుంచి రకరకాల గాజులు కొనుక్కొస్తాను. డ్రెస్‌కు తగినట్టు గాజులు అలా సెట్ చేస్తాను. ప్రతి ఫంక్షన్స్‌కి 2–3 రోజుల ముందే ప్రతిదీ సెట్ చేసి ఉంచుతాను.ఆల్‌టైమ్ ఫేవరెట్..మగ్గం వర్క్‌లో థ్రెడ్ వర్క్ కన్నా జర్దోసి వర్క్ చాలా ఇష్టం. అందుకే, వెల్వెట్ మీద హెవీ వర్క్ చేయించాను. ఇది ఎప్పటికీ ట్రెండ్‌లో ఉంటుంది. వెల్వెట్ లెహంగాకి ఎంబ్రాయిడరీ చేయించాను. దానికి బ్లౌజ్ మారుస్తుంటాను. మగ్గం వర్క్‌లో క్వాలిటీ మాత్రం మిస్ కాకూడదు.పాతదైనా ప్రత్యేకమే..మా అమ్మమ్మ చీరల్లో నుంచి నా దగ్గరకు ఒక గద్వాల కాటన్ శారీ వచ్చింది. అప్పటి నేత ఇప్పటికీ బాగుంటుంది. దానిని కూడా డిజైనర్ బ్లౌజ్‌తో ఫంక్షన్స్‌కి కట్టుకుంటాను. ఏ చీర కొన్నా నా తర్వాత నా పిల్లలకు ఆ చీరలు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటాను. నా పెళ్లప్పుడు కొన్న కోటా చీర ఇప్పటికీ కట్టుకుంటాను. -
Prakruthi Kambam: ఈ తెలంగాణ మిస్ డ్రీమ్.. 'మిస్ ఇండియా'!
సాక్షి, సిటీబ్యూరో: ఫెమినా మిస్ ఇండియా..! ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మంది ఫ్యాషన్ ఔత్సాహికుల చిరకాల కోరిక. సౌందర్య రంగంలో అత్యున్నత స్థానమైన ఫెమినా మిస్ ఇండియాగా నిలవాలంటే దేహ సౌందర్యమే కాదు.. ఆత్మ సౌందర్యం, విజ్ఞాన కౌశలం, సేవా తత్పరత అన్నింటికీ మించి ఆత్మస్థైర్యం కూడా ఉండాలంటున్నారు ఫెమినా మిస్ తెలంగాణ ప్రకృతి కంబం. ఈ సారి ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకృతి కంబం ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ముంబై వేదికగా జరిగిన ప్రీ ఫెమినా మిస్ ఇండియా పేజెంట్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుని ఫెమినా మిస్ తెలంగాణ–2024గా నిలిచారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో దేశవ్యాప్తంగా పాల్గొనే 30 మంది అందాల ముద్దుగుమ్మల్లో తానూ ఒకరు. ఈ నేపథ్యంలో తన ప్రయాణంలోని అనుభవాలు, అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..ఫైనల్స్‌లో తెలుగమ్మాయి..ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడం నా చిరకాల స్వప్నం. గతంలో జరిగిన సౌందర్య పోటీల్లో పాల్గొని టాప్ 5 స్థానంలో నిలిచి ఆ కిరీటాన్ని అందుకోలేకపోయాను. కానీ ఈ సారి ఫెమినా మిస్ ఇండియా క్రౌన్ గెలిచి హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించాలన్నా కూడా ఫెమినా మిస్ ఇండియా కిరీటమే ప్రామాణికం. ఫైనలిస్టుగా ఎంపిక చేయడానికి బెంగళూరులో జరిగిన ఆడిషన్స్‌లో ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు రెండు వందల మంది ష్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో ఎంపిక చేసిన కొద్ది మందితో ముంబైలో మరో పేజెంట్ నిర్వహించగా.. అందులో ఫెమినా మిస్ తెలంగాణగా నేను నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది.జీవితం నేర్పిన పాఠాలు..నా జీవితంలో స్వతహాగా ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు, అడ్డంకులే నన్ను ఈ స్థాయికి చేర్చాయని అనుకుంటాను. ప్రతి సమస్య నుంచీ, ప్రతి సందర్భం నుంచీ జీవిత పాఠాలను నేర్చుకున్నాను. సౌందర్య రంగం అంటే అందంగా ఉంటే సరిపోతుందిని అంతా అనుకుంటారు. కానీ.. అందంతో పాటు ఆలోచనలు, అభిరుచులు, సంపూర్ణమైన వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత–అవగాహన ఇలా పలు అంశాలను పరిశీలించాకే, పరీక్షించాకే ఆ గౌరవమైన స్థానానికి ఎంపిక చేస్తారు. మల్టీ క్వీన్...నాకు 5 భాషల్లో ప్రావీణ్యముంది. ఫ్యాషన్‌తో పాటు థ్రోబాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, క్యారమ్ వంటి క్రీడల్లో ఛాంపియన్ని. పలు ఈవెంట్లలో ట్రాక్ ఫీల్డ్ అథ్లెట్‌గా విజేతగా నిలిచాను. డ్యాన్స్–కొరియోగ్రఫీలో మంచి ప్రావీణ్యముంది. బాలీవుడ్, జాజ్, బ్యాలే, ఫోక్, సౌత్ స్టైల్స్ ఇలా అన్ని స్టెప్పుల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించగలను. క్విల్లింగ్, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, మండాల ఆర్ట్స్ వంటి పలు కళల్లో మంచి పట్టు ఉంది. సమర్థవంతమైన అమ్మాయిగా నిలవడంలో ఈ అంశాలన్నీ దోహదపడ్డాయి. ఫ్యాషన్ రంగానికి సంబంధించి గతంలో మిస్ గ్రాండ్ కర్ణాటక, టైమ్స్ ఫ్రెస్ ఫేస్‌తో పాటు పలు పేజెంట్లలో విజేతగా నిలిచాను. యాక్టింగ్ పై మక్కువతో టాలీవుడ్ వేదికగా ఒక సినిమాలో నటించాను. మరికొద్ది రోజుల్లో వెండి తెరపైన విడుదల కానుంది. ఇవన్నీ చేయగలడంలో నా టైమ్ మేనేజ్మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది.25 ఏళ్ల వయసులో..ఈ పోటీలకు అర్హత వయస్సు 25 ఏళ్లు మాత్రమే.. ఇంత చిన్న వయసులో సామాజికంగా, మానసికంగా, మోడలింగ్‌లో ఉన్నత భావజాలం ఉండాలంటే జీవితాన్ని అంకితం చేయాలి. నడక, నడవడిక, అందం, ఆలోచనలు, డ్రెస్సింగ్, మోడ్రన్ ట్రెండ్స్ ఇలా ప్రతీ విషయంలో ఉన్నతంగా ఉంటేనే ఈ పోటీల్లో రాణించగలం. అక్క దగ్గర మోడలింగ్, అమ్మా–నాన్నల దగ్గర సామాజిక అంశాల పైన అవగాహన పొందాను. బాక్స్ ఆఫ్ స్మైల్ పేరుతో అమ్మా నాన్నలు పేద విద్యార్థులకు చేసే సేవా కార్యక్రమాలు నాలో సామాజిక స్పృహను పెంచాయి. -
అదిరే హెచ్ అండ్ ఎం లిమిటెడ్ ఫ్యాషన్ కలెక్షన్ (ఫొటోలు)
-
డయానాలా కనిపించే ప్రముఖ ప్యాషన్ ఐకాన్ ఆమె..!
కొన్ని రకాల నైపుణ్యాలు, తెలివితేటల జీన్స్ రీత్యా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి. ఆ కుటుంబంలో అత్యంత ప్రతిభావంతుడు ఉంటే. ఆ పరంపర అతని తర్వాత తరంలో ఎవరో ఒకరు కొనసాగిస్తుంటారు. వెంటనే అతన్ని అంతకు ముందు జనరేషన్ వ్యక్తితో పోల్చుకుంటూ..ఆ వ్యక్తి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం సహజం. అలానే ఓ ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్ని చూడగానే నాటి అందాల యువ రాణి దివంగత డయానాని గుర్తు తెచ్చుకుంటారు అంతా. ఇంతకీ ఎవరా మోడల్ అంటే..?ఆ మోడల్ పేరు కేథరిన్ కిట్టి ఎలియనోర్ స్పెన్సర్. ఆమె గ్లామర్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. చూడటానికి దివంగత యువరాణి డయానాలా అందంగా ఉంటుంది. కిట్టి ఎర్ల్ స్పెన్సర్-విక్టోరియా ఐట్కెన్ల పెద్ద కుమార్తె. ఇక్కడ కిట్టి తండ్రికి స్వయనా అక్కే వేల్స్ దివంగత యవరాణి డయానా. అంటే కిట్టి స్వయానా.. డయాన మేనగోడలు. బహుశా ఆ జీన్స్ ఆమెలో కూడా ఉంటాయి కాబట్టి కిట్టి డయానాలా ఉండి ఉండొచ్చు. ఇక కిట్టీ 2015 నుంచి మోడల్‌గా మారింది. ఎస్టీ లాడర్, బల్గారి, వోగ్, రాల్ఫ్ లారెన్, జిమ్మెర్మాన్లతో సహా ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక బ్రాండ్లతో కలిసి పనిచేశారామె. ప్రిన్స్ హ్యారీ- మేఘన్ మార్క్లేల వివాహంలో తొలిసారిగా కిట్టీ పేరు మారు మ్రోగిపోయింది. మరో డయానాలా ఉందే అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత టాట్లర్ కవర్‌పై మోడల్‌గా కనిపించిన ఆమెనే కిట్టి అని ప్రపంచమంతా గుర్తించడం ప్రారంభించింది. ఈ గుర్తింపే కిట్టిని ఫ్యాషన్ కెరియర్ మకుటం లేని రాణిని చేసింది. అయితే కిట్టీ తల్లి విక్టోరియా ఐట్కెన్ కూడా మాజీ బ్రిటిష్ మోడలే కావడం విశేషం. ఇక కిట్టి మోడలింగ్ ఏజెన్సీ స్టార్మ్ మేనేజ్మెంట్కు సంతకం చేయడమే గాక ఇటాలియన్ లగ్జరీ పవర్‌హౌస్ డోల్స్ అండ్ గబ్బానాకు గ్లోబల్ అంబాసిడర్‌గా కూడా ఉంది.వ్యక్తిగత జీవితం..బిలియనీర్ మైఖేల్ లూయిస్‌ని పరిణయమాడింది. అంతేగాదు తన వివాహ సమయంలో లగ్జరీ బ్రాండ్ ఫ్యాషన్ హౌస్ నుంచి డికాడెంట్ గౌనుని ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక కెరీర్ పరంగా.. ఆమె లండన్ రీజెంట్స్ యూనివర్శిటీలో లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్లో ప్రత్యేకత కలిగిన యూరోపియన్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. కాగా, 33 ఏళ్ల కిట్టి ఇటీవలే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నాలుగు నెలల తర్వాత తన బిడ్డ పేరుని, ఫోటోని షేర్ చేసుకుంది.(చదవండి: హృదయాన్ని కదిలించే ఘటన: 19 ఏళ్ల తర్వాత భారత్‌లో తండ్రిని..!) -
అంతర్జాతీయ బ్రాండ్‌తో చేతులు కలిపిన స్వదేశ్.. లిమిటెడ్ ఎడిషన్!
హైదరాబాద్: భారతీయ కళానైపుణ్యాన్ని ప్రోత్సహించే స్వదేశ్ బ్రాండ్, అంతర్జాతీయ వస్త్ర తయారీదారులు ఫాల్గుణి షేన్ పీకాక్‌తో కలిసి హైదరాబాద్‌లో స్వదేశ్ ఫ్లాగ్ షిప్ స్టోర్‌లో ప్రత్యేక ప్రదర్శనను ప్రకటించారు. ఫాల్గుణి షేన్ పీకాక్ 20వ వార్షికోత్సవంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంప్రదాయ పద్ధతులను అత్యాధునిక ఫ్యాషన్ డిజైన్ తో మేళవించారు. కాంచీవరం సిల్క్స్, చికంకారీ ఎంబ్రాయిడరీ, బనారసి బ్రోకేడ్స్ వంటి ఐకానిక్ భారతీయ హస్తకళలు ఉన్నాయి.స్వదేశ్లో ప్రత్యేకంగా లభించే ఈ లిమిటెడ్ ఎడిషన్ కోచర్.. భారతీయ హస్తకళా వారసత్వాన్ని పునఃసమీక్షిస్తుంది. వినూత్న డిజైన్‌తో పాటు అద్భుతమైన కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఫాల్గుణి షేన్ పీకాక్ 20 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ లగ్జరీ కోచర్ డిజైనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సంప్రదాయ కళానైపుణ్యాన్ని జోడిస్తూ, రంగులతో ప్రయోగాలు చేస్తూ సరిహద్దులను విస్తరించింది. వర్చువల్ స్టైలింగ్ వంటి మార్గదర్శక ఫీచర్ల ద్వారా టెక్నాలజీ పరంగా బ్రాండ్ అభివృద్ధి చెందింది. అందుకే ఇది సెలబ్రిటీలకు సైతం నచ్చేసింది.రెండు దశాబ్దాల ఫ్యాషన్ ఆవిష్కరణను ప్రతిబింబిస్తూ, ఫాల్గుణి షేన్ పీకాక్ సహ వ్యవస్థాపకుడు షేన్ పీకాక్ ఇలా పేర్కొన్నాడు, "స్వదేశ్‌తో కలిసి నడవడం స్పెషల్‌గా అనిపిస్తోంది. ఎందుకంటే మా డిజైన్లకు భారతీయ హస్తకళ తోడవటంతో ఫ్యాషన్‌లో కొత్త కోణాలను అన్వేషించేందుకు ఉపయోగపడుతుంది. మొట్టమొదటిసారిగా భారత్‌తో పనిచేసి ఇక్కడి వారసత్వం, సంస్కృతి నుంచి ప్రేరణ పొందే ఆకృతులను తయారు చేశాం. ఈ లిమిటెడ్ ఎడిషన్ సేకరణలో క్లిష్టమైన జరీ వర్క్ తో బెస్పోక్ చీరలు ఉన్నాయి. హైదరాబాద్ లోని స్వదేశ్ స్టోర్‌ను సందర్శించేందుకు వస్త్రప్రియులను ఆహ్వానిస్తున్నాము" అని చెప్పారు.