
పాల మీగడను తలపించే లేత పసుపు రంగువసంతకాలాన్ని మరింత కళగా మార్చేస్తుంది. కాంతిమంతమైన రంగులను వెనక్కి నెట్టేస్తూ ఇండో– వెస్ట్రన్ స్టైల్ అయినా, సంప్రదాయ వేషధారణ అయినా ఈ స్ప్రింగ్ సీజన్‌లో బటర్ ఎల్లో స్పెషల్ మార్క్ వేస్తోంది.. పాజిటివ్ ఎనర్జీని చుట్టూ నింపడంలోనూ ప్రకృతిలో కొలువుండే ఆహ్లాదాన్ని కళ్లకు కడుతూ మదిని దోచేస్తోంది. రెట్రో స్టైల్‌కి సరైన ఎంపికగా నిలుస్తోంది. కార్పోరేట్ సంస్కృతికి కొత్త అర్ధం చెబుతూ మెట్రో స్టైల్‌తో బెస్ట్ మార్కులు కొట్టేస్తుంది.
ఈ వసంత కాలంలోనే కాదు రాబోయే వేసవిలోనూ హాయిగొలిపే రంగుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది బటర్ ఎల్లో. ఈ లేత పసుపు రంగు షేడ్స్ సంప్రదాయ క్లాసిక్ వేర్‌లోనే కాదు బోల్డ్ కాంట్రాస్ట్ కలర్స్‌తోనూ జత కలుస్తుంది. మృదువైన, ప్రకాశవంతమైన రంగుల ఎంపికలో బటర్ ఎల్లో ముందువరసలో ఉంది.
లాంగ్ గౌన్లు, స్టైలిష్ కార్పొరేట్ వేర్‌గానే కాదు ఫ్యాషన్ వేదికలపైనా లేత పసుపు రంగు తనదైన ముద్ర వేస్తోంది. చందేరీ, షిఫాన్, జార్జెట్ ఫ్యాబ్రిక్‌లలో బటర్ ఎల్లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటే కాటన్, పట్టులలో రిచ్ లుక్‌తో అబ్బురపరుస్తుంది.
కాంట్రాస్ట్ కలర్ ఆలోచనకు ఈ షేడ్‌ను దూరంగా పెట్టవచ్చు. సేమ్‌కలర్ ఎంబ్రాయిడరీ వర్క్, ఫ్లోరల్ ప్రింట్స్‌లో తెలుపు, గాఢమైన పసుపు రంగు మోటిఫ్స్, పోల్కా డాట్స్ బటర్ ఎల్లోను మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి.
ఇటీవల బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ ముంబైలోని ఫ్యాషన్ ఈవెంట్ బీవోఎఫ్ గాలాలో డిజైనర్ జార్జ్ స్టావ్‌పోలోస్ రూపొదించిన లేత పసుపు షిఫాన్ గౌను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ లుక్ 1970ల నాటి వింటేజ్ గ్లామర్‌ను తన డ్రెస్సింగ్ ద్వారా చూపింది.. ప్రాచీన అందాన్ని ఆధునికతతో మేళవించినట్టుగా తన డ్రెస్సింగ్ ద్వారా చూపుతూ ఈ సీజన్‌కు తప్పనిసరిగా ఉండవలసిన బటర్ ఎల్లో ప్రాముఖ్యతను చాటింది.
(చదవండి: పువ్వులు పంచే అందం..!)
Comments
Please login to add a commentAdd a comment