dressing
-
ట్రంప్ క్యాబినెట్ విందులో స్టైలిష్‌గా ఉషా వాన్స్ దంపతులు..!
అమెరికా 47వ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ జనవరి 19న క్యాబినెట్(cabinet ) కోసం క్యాండిల్ లైట్ ప్రైవేట్ డిన్నర్(private dinner)ని ఏర్పాటు చేశారు. ఈ విందుకి ఎందరెందరో అతిరథ మహారథులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో అమెరికా(United States) ఉపాధ్యాక్షుడు(Vice-President) జేడీ వాన్స్(JD Vance), ఆయన భార్య ఉషా చిలుకూరి(Usha Chilukuri )స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారిద్దరూ స్టైలిష్ డిజైనర్‌వేర్‌లో మెరిశారు. ఫ్యాషన్‌కే ఐకానిక్‌గా నిలిచి ఈ విందులో సందడి చేశారు. ఉషా ఈ డిన్నర్ పార్టీ కోసం అమెరికా ప్రసిద్ధ డిజైనర్ ఆస్కార్ డి లా రెంటా కలెక్షన్ వేర్ గౌనులో ఉషా మెరిశారు. అందుకు తగ్గట్టుగా కురులను బన్ మాదిరిగా స్టైలిష్‌గా వేసుకున్నారు. ఆ లుక్‌లో ఉషా అదిరిపోయింది. ఇక వైస్ ప్రెసిడెంట్ జేడీ ఆన్స్ సంప్రదాయ వేషధారణకు ప్రాధాన్యతమిచ్చేలా తరుచుగా సింగిల్-బ్రెస్ట్ సూట్లలో కనిపిస్తాడు. ఆ సూట్‌కి సరిపోయేలా సిన్సినాటిలోని ఇటాలియన్ దర్జీ వద్ద కొనుగోలు చేసే నెక్ టెక్లను ధరిస్తాడు. ఆయన ఎక్కువగా నేవీ లేదా గ్రే కలర్ సూట్లనే ధరిస్తారు. ఉపాధ్యక్షుడిగా మారాక వాన్స్ డ్రెస్సింగ్ స్టైల్ మరింతగ మారడమే గాక బరువు కూడా తగ్గడం విశేషం. కాగా, ట్రంప్ క్యాండిల్‌లైట్ డిన్నర్లో ఇవాంకా ట్రంప్ కూడా ఆస్కార్ డి లా రెంటా కలెక్షన్‌కి సంబంధించిన మరో గౌనులో తళుక్కుమంది. ఇవాంక స్టమ్ ఆఫ్-షోల్డర్, క్రిస్టల్, పెర్ల్-ఎంబ్రాయిడరీడ్ ఎంపైర్ వెయిస్ట్ గౌనులో మెరిసింది. సింపుల్‌గా వజ్రపు చెవిపోగులను ధరించింది. View this post on Instagram A post shared by Oscar de la Renta (@oscardelarenta) (చదవండి: ‘పుష్ప-2’విలన్‌కి ఆ సమస్య..భార్య ఏం చేసిందో తెలుసా?) -
దీపావళి వేళ సంప్రదాయబద్ధంగా కనిపించేలా స్టైలింగ్ చిట్కాలు..
అమావాస్య నాడు జరుపుకునే ఈ వెలుగుల పండుగ అంటే అందరికి ఇష్టం. అన్ని మతాల వారు జరుపుకునే గొప్ప పండుగా. ముఖ్యంగా ఈ దీపాల వెలుగులో అద్భతంగా కనిపించేలా ముస్తాబవ్వాలని మగువలు భావిస్తారు. అందుకోసం స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూనే సంప్రదాయబద్ధంగా హుందాగా ఉండాలంటే ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరి..దీపావళి అంటే దీపాల వెలుగులు, రుచికరమైన స్వీట్లు మాత్రమే కాదు. పండుగ వాతావరణాన్ని ఉట్టిపడేలా చేయడంలో దుస్తులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వేడుకలో ఆకర్షణీయంగా స్టైలిష్ లుక్‌లో కనిపించాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి..రిచ్ లుక్ చీర..దీపావళి వెలుగులు విరజిమ్మిలే కనిపించేందుకు రిచ్ లుక్ ఉన్న శారీని ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యం. బంగారు పసుపు, ఎరుపు, నారింజ, ఊదా రంగులు పండుగ వాతావరణాన్ని తలిపించేలా చేయడంలో కీలకంగా ఉంటాయి. అలాగే ట్రెండింగ్‌లో ఉన్న సీక్విన్ చీరలను ఎంచుకుంటే స్టైలిష్‌గా ఉంటారు. అనార్కలి గౌనుగ్రాండ్గా కనిపించేలా డ్రెస్ ధరించాలంటే మాత్రం అనార్కలీని ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ పొడవాటి గౌన్లు మొత్తం రూపాన్ని కొత్తగా కనిపించేలా చేయడమే గాక వేడుకకే ఓ లుక్ వస్తుంది. .లెహంగాస్లెహంగాలు సాంప్రదాయ ఆధునిక సౌందర్యాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. క్లాసిక్ చోలిస్ నుండి ట్రెండీ క్రాప్ టాప్స్ వరకు విభిన్న బ్లౌజ్ స్టైల్స్‌తో జత చేస్తే ఆ లుక్కే వేరు. అందుకోసం క్లిష్టమైన ఎంబ్రాయిడరీ లేదా మిర్రర్ వర్క్‌తో అలంకరించిన గ్రాండెడ్ కలర్ లెహంగాలు ఎంచుకోండిచీరకట్టు స్టైల్ డిజైర్వేర్..గ్రాండెడ్ చీరతో డిఫెరెంట్ లుక్‌లో కనిపించాలనుకుంటే..రెడీమేడ్ డ్రెస్డ్ స్కర్ట్‌లను ఎంచుకోండి. వాటిని అద్భుతమైన బ్లౌజ్‌లతో జత చేయండి. సల్వార్ సూట్పండుగలకు ఇష్టమైన, సల్వార్ సూట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. వాటికి సరైన ఆభరణాలను జోడిస్తే మరింత అందంగా కనిపిస్తాయి. మార్కెట్లో వివిధ రకాల సల్వార్లు దర్శనమిస్తున్నాయి. మంచి కలర్‌తో కూడిన సల్వార్ సూట్లు వేడుకలను మరింత కలర్‌ఫుల్ మయం చేస్తాయి.(చదవండి: ఆంధ్రదేశంలో ఆది వైద్యుడి ఆలయం..!) -
మనం ధరించే డ్రెస్‌కి ఇంత పవర్ ఉంటుందా..?
‘పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు డ్రెస్సింగ్ కూడా ఉపయోగపడుతుంది’ అంటారు హైదరాబాద్ వాసి, ఫౌంటెడ్ హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ కాలేజీ నిర్వాహకురాలు, టీచర్ మేఘన ముసునూరి. గ్లోబల్ టీచర్ అవార్డు గ్రహీత అయిన మేఘన ముసునూరి వార్డ్ రోబ్ గురించి చెప్పిన విషయాలు..‘‘ప్రైమరీ స్కూల్ పిల్లలకు క్లాస్ తీసుకునేటప్పుడు కలర్ఫుల్గా డ్రెస్ చేసుకుంటాను. చిన్నపిల్లలకు బ్రైట్ కలర్స్ అంటే ఇష్టం. మనం చెప్పినవి చక్కగా వినడానికి ఈ రంగులు దోహదం చేస్తాయి. పిల్లలు డ్రెస్ ఒకటే చూడరు. చెవులకు, చేతులకు, మెడలో ఏం వేసుకున్నారు.. అని కూడా చూస్తారు. వాళ్లకి ఆసక్తి కలిగించేది ఏదైనా ఉంటే, ఇదేమిటి? నేనెప్పుడూ చూడలేదు... అని కూడా అడుగుతారు. అలా ఒకరోజు నా దగ్గర వడ్లు, మినుములు... మొదలైన గింజలతో తయారు చేసిన బ్రేస్‌లెట్‌ని వేసుకెళ్లాను. ఆ రోజు దాని గురించి వారు ఎన్నోప్రశ్నలు వేశారు. అంటే, ఆ బ్రేస్లెట్ వారిలో ఎంతో ఆసక్తిని కలిగించిందనేగా! నైటీతో కనిపించనుఎదుటివారిని చూడగానే 6 నుంచి 12 సెకన్లలో ఆæవ్యక్తిని మనం సీరియస్‌గా తీసుకోవచ్చా లేదా అనేది బ్రెయిన్ ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకుంటుంది. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్లు నా మాట వినని సందర్భాలు దాదాపుగా లేవు. ఎందుకంటే, వాళ్లు నన్ను నైటీలో ఎప్పుడూ చూడరు. సౌకర్యం కోసం రాత్రి సమయంలో వేసుకునే నైటీలోనే స్కూల్లో పిల్లలను దింపడానికి వచ్చే తల్లులు ఉన్నారు. చాలా మంది తల్లులు నా దగ్గర ‘తమ పిల్లలు మాట వినడం లేదు’ అని చెబుతుంటారు. అప్పుడు వాళ్లతో ‘ఎప్పుడైనా టీచర్ని మీరు నైట్డ్రెస్లో చూశారా’ అని అడుగుతాను. అంతేకాదు ‘మన డ్రెస్ వల్ల కూడా పిల్లలు మన మాట వింటారు’ అని చెబుతాను. ఒకప్పుడు మా ఇంటికి టీచర్ వస్తున్నారంటే మా తాతగారు తప్పనిసరిగా భుజంపైన కండువా వేసుకొని, బయటకు వచ్చేవారు. గౌరవం అంటే నమస్కారం ఒక్కటే కాదు. మన డ్రెస్సింగ్ కూడా. నా సొంత డిజైన్స్బైక్ రైడ్‌కి వెళ్లేటప్పుడు జీన్స్ వేసుకుంటాను. మీటింగ్స్, కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు చీరలు కట్టుకుంటాను. 2–3 రోజుల మీటింగ్స్ అయితే బ్లేజర్స్, ఫ్రాక్స్ కూడా వేసుకుంటాను. చీర అయితే, బ్లౌజ్ ట్రెండీగా ఉండేలా ఎంచుకుంటాను. వెస్ట్రన్ టాప్ వేసుకొని చీర కట్టుకుంటాను. కొన్నిసార్లు టాప్ టు బాటమ్ ఒకే కలర్, కొన్నిసార్లు కాంట్రాస్ట్ వేసుకుంటాను. ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. అలాంటప్పుడు డైనమిజాన్ని చూపేలా డ్రెస్ చేసుకుంటాను. జ్ఞాపకాలు బాగుండాలంటే...జ్ఞాపకాలలో మన డ్రెస్సింగ్ కూడా బాగుండాలి. ఒకప్పుడు ఆకులు పచ్చగానే ఉన్నట్టు డ్రాయింగ్‌లో చూపేవారు. కానీ, ప్రకృతిలో ఆకులు చాలా రంగుల్లో ఉన్నాయి. అందుకని, మనం వేసుకునే డ్రెస్, జ్యువెలరీ కూడా కలర్ఫుల్గా ఉండాలి. బంగారు ఆభరణాలే వేసుకోవాలని అనుకోను. తక్కువ ఖర్చుతో లభించే క్రియేటివ్ జ్యువెలరీ ఏదైనా ఎంపిక చేసుకుంటాను. టీచర్ అంటే సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. పిల్లల్లో ఇంట్రెస్ట్, కాన్ఫిడెంట్ బిల్డ్ చేసేలా ఉండాలి. నేను రకరకాల బ్రోచెస్ పెట్టుకుంటాను. మా స్కూల్లో ఒక పిల్లవాడు వాళ్ల అమ్మకు ఒక బ్రోచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడంట. ‘ఎందుకు?’ అని అడిగితే ‘మా టీచర్ పెట్టుకుంటుంది, చాలా బాగుంటుంది’ అని చెప్పాడంట. పిల్లల నుంచి ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు నాకున్నాయి. ఇదే ఫ్యాషన్ అని, ఎవరి లాగానో ఉండాలని కాకుండా సమాజంలో మనదైన ఒక గుర్తింపు డ్రెస్సింగ్ ద్వారా చూడాలి. పవర్ డ్రెస్సింగ్ వల్ల ఎదుటివారు మనతో ప్రవర్తించే తీరులో కూడా మార్పు వస్తుంది. (చదవండి: అలియా భట్‌కి ఏడీహెచ్‌డీ డిజార్డర్..అందువల్లే పెళ్లిలో..!) -
Fashion: లైట్ కలర్స్‌తో.. లగ్జరీ లుక్!
తమ క్రియేటివ్ డిజైన్స్‌తో ఇతరులను అందంగా చూపే ఫ్యాషన్ డిజైనర్లు తమ కోసం వార్డ్ రోబ్‌ను ఎంత ఘనంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ విషయమై హైదరాబాద్‌లో మోడల్స్‌కి, ఫ్యాషన్ షోల కోసం డిజైన్స్ క్రియేట్ చేసే హేమంత్ సిరి ‘లెస్ ఈజ్ క్లాసీ’ అంటూ సింపుల్‌గా ఉండే తన వార్డ్ రోబ్‌ను పరిచయం చేస్తున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి చేనేతలు అంటే బాగా ఇష్టం ఉండేది. దీంతో మా అమ్మ, అమ్మమ్మల చీరలను నాకు అనువుగా డిజైన్ చేసుకునేదాన్ని. నేను డిజైన్ చేసిన దుస్తులను వేసుకున్నవారు అందంగా కనిపించాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. అయితే, నన్ను నేను కూడా బెస్ట్‌గా చూసుకోవాలి. నా విషయానికి వచ్చేసరికి కొన్ని ఎక్స్పర్మెంట్స్తో ΄ాటు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటాను. మోడల్స్‌కి, ఫ్యాషన్ షోస్ కోసం డిజైన్ చేయడంలో ఫ్యాబ్రిక్, కలర్స్ మీద ప్రత్యేక దృష్టి పెడతాను. నాకోసం అయితే ఇండోవెస్ట్రన్ లుక్ ఉండేలా చూసుకుంటాను. కొంచెం ్ర΄÷ఫెషనల్గా ఉండాలి అనుకుంటే హ్యాండ్లూమ్ శారీస్ ఎంచుకుంటాను.లెస్ ఈజ్ క్లాసీ..ఏదైనా ఈవెంట్‌కి వెళ్లాలి అనుకుంటే ముందు నన్ను నేను తెలుపు, క్రీమ్ కలర్ డ్రెస్‌లో ఊహించుకుంటాను. అంతేకాదు, ఆర్గానిక్ కలర్స్, ఆర్గానిక్ ఫ్యాబిక్స్ర్తో సింపుల్‌గా ఫార్మల్ లుక్‌ని ఇష్టపడతాను. హెవీ శారీస్ అయినా సరే సింపుల్‌గా ఉండే బ్లౌజ్‌నే ఉపయోగిస్తుంటాను. లెస్ ఈజ్ క్లాసీ అనిపించేలా ఉంటాను.లగ్జరీ కలర్స్..పేస్టల్ కలర్స్‌లో లైట్ క్రీమ్, పింక్, గోల్డ్.. ఇష్టపడతాను. ఈ రంగులు ఒక లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటాయి. క్రీమ్ లేదా ఐవరీ అంటేనే లగ్జరీ కలర్స్. లైట్ బ్లూ, లైట్ గ్రీన్.. వంటివి డే ఫంక్షన్స్‌కి, లైట్ సిల్వర్, లైట్ క్రీమ్ డ్రెస్సులు, శారీస్ నైట్ ఈవెంట్స్‌కి వాడతాను.ప్రయాణాల్లో సౌకర్యం..ఖ΄్తాన్స్ ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. పలాజోలు, జీన్స్, లైట్, ఫ్లోరల్ కలర్ నీ లెంగ్త్ ఫ్రాక్స్ని ఉపయోగిస్తాను.బొట్టుతో గుర్తింపు..నా పర్సనల్ స్టైలింగ్‌లో బొట్టు సిగ్నేచర్ అయిపోయింది. ముందు స్టికర్స్ వాడేదాన్ని. ఆర్గానిక్ కలర్స్పైన గ్రిప్ వచ్చాక కుంకుమ తయారు చేసుకుని, వాడుతున్నాను. వివాహవేడుకల వంటి ఎంత పెద్ద ఈవెంట్ అయినా సింపుల్ జ్యువెలరీనే ఉపయోగిస్తాను’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
Fashion: ఫ్యాషన్ ఇలాకా.. ట్రిపుల్ ధమాకా..
సాక్షి, సిటీబ్యూరో: ఒకేరోజున ముగ్గురు ఆల్ ఇండియా టాప్ క్లాస్ ఫ్యాషన్ డిజైనర్లు తమ డిజైన్లతో నగరాన్ని పలకరించారు. తమదైన శైలికి చెందిన అంతర్జాతీయ దుస్తుల శ్రేణిని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే అగ్రగామి డిజైనర్లుగా పేరొందిన ఢిల్లీకి చెందిన అబ్రహమ్, ఠాకూర్ ద్వయంతో పాటు రాహుల్ మిశ్రాలు హాజరయ్యారు.అదే విధంగా ప్రముఖ డిజైనర్ దుస్తుల బ్రాండ్ సత్యపాల్.. బంజారాహిల్స్ రోడ్ నెం1లో ఉన్న సత్వా సిగ్నేచర్ టవర్‌లో వరుసగా తమ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఒకేరోజున వాటిని ప్రారంభించారు. సిటీ ఫ్యాషన్ సర్కిల్లో సందడి నింపిన ఈ అత్యాధునిక దుస్తుల స్టోర్ల ప్రారం¿ోత్సవం, లాంచింగ్ పారీ్టలకు సినీనటులు తమన్నా, నిహారికా, శోభితా దూళిపాళ్ల, సిరత్ కపూర్‌తో పాటు నగరంలోని పలువురు సెలబ్రిటీలు హాజరై డిజైనర్లకు అభినంధనలు తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులతో డిజైనర్లు తమ కలెక్షన్స్ గురించిన విశేషాలను పంచుకున్నారు. -
Nitasha Gaurav: న్యూ గ్రామర్ అండ్ గ్లామర్!
రంగుల్లో పింక్‌తో, కాస్ట్యూమ్స్‌లో స్కర్ట్‌తో మగవాళ్లకు స్టయిలింగ్ చేసి.. ఫ్యాషన్‌కి ముఖ్యంగా డ్రెసింగ్‌కి, కలర్స్‌కి జెండర్ లేదు.. కంఫర్టే ముఖ్యం అంటూ దేశంలో మెన్ ఫ్యాషన్ గ్రామర్ని, గ్లామర్‌ని మార్చేసిన స్టయిలిస్ట్.. నితాశా గౌరవ్! రణ్వీర్ సింగ్ పర్సనల్ స్టయిలిస్ట్!‘న్యూస్ పేపర్స్, అన్నిరకాల మ్యాగజీన్స్, బుక్స్, ఆర్ట్, ట్రావెల్, నేచర్, మ్యూజిక్.. ఇవన్నీ నాకు ఇన్స్పిరేషనే! స్టయిల్ అండ్ ఫ్యాషన్‌కి మినిమలిజం, మాగ్జిమలిజం రెండూ అవసరమే! ఈ రంగంలో రాణించాలంటే ఫ్యాషన్‌కి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. పనిని ప్రేమించాలి’ అని చెబుతుంది నితాశా గౌరవ్. నితాశా.. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్, న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్యాషన్‌కి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్‌ని పూర్తిచేసింది. ఇండియాకు తిరిగి రాగానే ఫెమినా ఇండియాలో ఉద్యోగంతో ఫ్యాషన్ కెరీర్‌ని మొదలుపెట్టింది. ఫెమినాలో నాలుగేళ్ల కొలువు తర్వాత నిఫ్ట్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో చేరింది. అందులో కొన్నాళ్లు చేశాక.. ఇండిపెండెంట్‌గా ఏదైనా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడే కొన్ని ఫ్యాషన్ షోస్‌కి, షూట్స్‌లో మోడల్స్‌కి స్టయిలింగ్ చేసే చాన్స్ రావడంతో ఆ పనిలో పడిపోయింది.అలాంటి ఒకానొక సందర్భంలో ఫిల్మ్‌ఫేర్ షూట్‌కి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌కి స్టయిలింగ్ చేసే అవకాశం దొరికింది. ఆ క్రమంలో నితాశా ఆలోచనలు, పని విధానం రణ్‌వీర్‌కి నచ్చాయి. ముఖ్యంగా ఫెమినైన్ అనుకునే కలర్స్, డ్రెసెస్‌తో ఆమె తనకు స్టయిలింగ్ చేస్తున్న తీరు మరీ నచ్చింది. దాంతో. తర్వాత కూడా చాలా ఈవెంట్స్కీ వాళ్ల అసోసియేషన్ కొనసాగింది. అలా రణ్‌వీర్‌కి ఆమె ఇచ్చిన కొత్త లుక్.. టాక్ ఆఫ్ ద కంట్రీ అవడంతో సెకండ్ థాట్ లేకుండా నితాశాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నాడు రణ్వీర్. అది ఆమె ఊహించనిది. మనసులో సంతోషం కుదిపేస్తున్న బాధ్యత ఆమెను స్టడీగా నిలబెట్టింది.రణ్‌వీర్‌కి పర్సనల్ స్టయిలిస్ట్ అంటే ఆమె క్రియేటివిటీకీ అతనికున్నంత దూకుడు, ఎనర్జీ ఉండాలి! ‘యెస్..’ అనుకుంటూ ఆ జాబ్‌ని చాలెంజింగ్‌గా తీసుకుంది. నిలబెట్టుకుంది. స్టయిలిస్ట్‌గా తనను ఎంచుకోవడంలో రణవీర్ తీసుకున్న నిర్ణయానికి అతన్ని గర్వపడేలా చేసిందే తప్ప‘ఇట్ హ్యాపెన్స్’ అని సర్దుకుపోయేలా చేయలేదు. గల్లీ బాయ్, బేఫిక్రే లాంటి సినిమాలే అందుకు దృష్టాంతాలు. ఆమె అనుష్కాకూ పనిచేసింది స్టయిలిస్ట్‌గా ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమాలో!ఫ్యాషన్ రూల్ బుక్‌ని అన్‌ఫాలో కావడమే ఆమె ప్రత్యేకత. డిఫరెంట్ స్టయిల్స్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ చేయడంలో దిట్ట ఆమె! ఆ స్పెషాలిటీ, ఆ ఫ్యూజన్‌కి ధనుష్, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, అభయ్ డియోల్లూ ముచ్చటపడి.. వాళ్లూ ఆమెను పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు.ఇవి చదవండి: ‘పంచాయతీ’ రిజర్వేషన్లు మారుతాయి -
ఇండియన్ కుర్తీ వెస్ట్రన్ కట్స్..
అమ్మాయిలు కోరుకునే సౌకర్యవంతమైన డ్రెస్ కుర్తీ ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా భిన్నమైన వెస్ట్రన్ కట్స్‌తో లేయర్డ్ టాప్స్‌గా పేరు మార్చుకొని మరీ ట్రెండ్‌లో ఉంటున్నాయి. అసమానంగా ఉండటమే ప్రత్యేకతగా ఇండో–వెస్ట్రన్ స్టైల్లో ఆకట్టుకునే ఈ డ్రెస్ డిజైన్స్ యువతను మరింత మోడరన్‌గా మార్చేస్తాయి. అటు క్యాజువల్ వేర్‌గానూ, ఇటు పార్టీవేర్‌గానూ కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి.టు లేయర్స్‌గా ఉండే ఖఫ్తాన్ స్టైల్ కుర్తీ సెట్ కలర్ కాంబినేషన్‌తో సరైన ఎంపిక అవ్వాలి.నెటెడ్, చందేరీ ఫ్యాబ్రిక్ లేయర్స్‌తో ఉండే అసిమెట్రిక్ కుర్తీ ప్రత్యేక సందర్భాలలోనూ స్టైల్‌గా కనిపిస్తుంది.ధోతీ ప్యాంట్‌కు అసిమెట్రికల్ కట్‌తో ఉండే కుర్తీ, దానిపైకి ఎంబ్రాయిడరీ చేసిన వెస్ట్రన్ టాప్ ఇండోవెస్ట్రన్ స్టైల్‌తో ఆకట్టుకుంటుంది. -
పెళ్లి వేడుకల్లో సోనాక్షి డ్రెస్సింగ్ స్టైల్ వేరేలెవెల్!..పూజకు అందరిలా..!
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకుంది. పైగా ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న నటుడు జహీర్ ఇక్బాల్‌ని వివాహం చేసుకుంది. అందిరిలా హంగు ఆర్భాటంగా కాకుండా చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంది. పెళ్లి కూతురు ముస్తాబులో సోనాక్షి ఎలా ఉంటుందా అని అభిమానులంతా ఎదురు చూడగా తన స్టైల్ వేరేలెవెల్ అన్నట్లుగా ఢిఫరెంట్ లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) పెళ్లి తంతుకి ముందు జరిగే పూజా కార్యక్రమం, సింధూర ధారణ, రిసెప్టన్ వరకు ప్రతి ఘట్టంలో అంచనాలకు అందని విధంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఉంది. ఈ గ్రాండ్ వివాహ వేడుకలో సోనాక్షి ఎలాంటి చీరలు, డ్రెస్‌లు ధరించిందంటే..గత కొన్ని రోజులుగా వాళ్ల పెళ్లికి సంబంధించిన పుకార్లకు చెక్‌పెట్టి మరీ ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లికి ముందు సోనాక్షి సిన్హా కుటుంబం తమ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ వేడుక అనంతరం నీలిరంగు డ్రెస్సులో కనిపించింది. ఆమె ధరించిన నీలి రంగు డ్రెస్సు చాలా అందంగా ఉంది. పెళ్లి అనగానే కేవలం లెహెంగాలు, చీరలు మాత్రమే కాదు, ఇలా డ్రెస్సులో కూడా అందంగా ఉండొచ్చని సోనాక్షి నిరుపించింది. అలాగే పెళ్లి సమయంలో ఐవరీ చీరలో అద్భుతంగా కనిపించింది. వివాహ వేడుకకు లేటెస్ట్ డిజైన్‌తో చీరను ఎంచుకోవడానికి బదులుగా తన తల్లి పూనమ్ సిన్హా పెళ్లి చీరను ఎంచుకుంది. అలాగే శిల్పాశెట్టి రెస్టారెంట్లో జరిగిన రిసెప్టన్లో సంప్రదాయ ఆభరణాలతో అద్భుతమైన బనారసీ చీరలో గ్లామరస్‌గా కనిపించింది. ఇక ఆమె భర్త ఇక్బాల్ బార్యకు అనుబంధంగా తెల్లటి కుర్తా ట్వీట్ జాకెట్, ప్యాంటుని ధరించారు. "సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున మనం కలుసుకున్నాం. ఎన్నో సవాళ్లు, విజయాల తర్వాత తల్లిదండ్రలు, దేవుడి ఆశీర్వాదంతో భార్యభర్తలయ్యాం అంటూ భావోద్వేగంగా ఇన్‌స్టాగ్రాంలో పోస్టు పెట్టింది సోనాక్షి సిన్హా. View this post on Instagram A post shared by Zoom TV (@zoomtv) (చదవండి: మన దేశంలో ఈ నగరాల్లో ఎట్టిపరిస్థితుల్లో మాంసాహారం దొరకదట..!) -
హాట్‌టాపిక్‌గా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ డ్రెస్సింగ్ స్టైల్..!
రోమ్‌లోని గార్మెటెల్లా జన్మించిన జార్జియా ఇటలి తొలి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. మహిళల్లో స్ఫూర్తినింపేలా ఆమె కెరీర్ సాగింది. ఆమె పవర్ఫుల్ ప్రధానిగా బాధ్యతల నిర్వర్తించడమే గాక చాకచక్యమైన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ ఆమె దేశ ప్రధానిగా హుందాగా ఉంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని సెట్ చేశారు. ప్రధాని అంటే ఇది డ్రెస్సింగ్ స్టైల్ అనేలా ఉంటుంది ఆమె ఆహార్యం..!ప్రపంచవ్యాప్తంగా జార్జియా మెలోని డ్రెస్సింగ్ స్టైల్ హాట్‌టాపిక్‌గా ఉంది. ఆ ధరించే ఫ్యాట్ అంటూ సూట్ ఓ ప్రత్యేకతను ఆకర్షణగా హైలెట్‌గా నిలుస్తాయి. జార్జియా ధరించే అర్మానీ బ్రాండ్ సూట్ ఆమె అధికార దర్పాన్ని చూపించేలా ఉంటాయి. ఒక శక్తిమంతమైన మహిళ అనేలా ఆమె ఆహర్యం కనిపిస్తుంది. మంత్రలతో సమావేశం అయ్యేటప్పుడూ అర్మానీ నల్ల చొక్కా మారిది సూట్‌ని ధరిం చింది. ఆ తర్వాత హ్యాండ్ఓవర్ మీటింగ్ కోసం అర్మానీ బ్రాండ్ ముదురు చొక్కా సూట్‌ని ఎంచుకుంది. వీటితోపాటు మధ్య మధ్యలో నేవీ బ్లూ అర్మానీ కూడా ధరిస్తుంది. చెప్పాలంటే అదొక ఆఫీస్ యూనివఫాంలా ఉండి తన చుట్టు ఉన్నవారిని అలర్ట్ చేసేలా ఉంటుంది జార్జియా ఫ్యాషన్. ఆ డ్రెస్సింగ్ శైలి అధికారులు తమ పనిలో అలర్ట్‌గా వ్యవహరించేలా, వినేలా చెలాయస్తున్నట్లుగా ఉంటుందని చెబుతుంటారు అధికారులు. ఆమె దుస్తులు నుంచి జుట్టు వరకు ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇటాలియన్ ఫ్యాషన్‌కు ఐకాన్‌గా ఉంటారు జార్జియా. ఆమె అర్మానీ సూట్లు మేడ్ ఇన్ ఇటలీ అని చెబుతున్నట్లు కనిపిస్తాయి. రాజకీయనాయకులు డ్రెస్సింగ్ శైలీ విభిన్నంగా ఉంటుదని తెలిసిందే. కానీ ఇక్కడ జార్జియా మాత్రం తప డ్రెస్సింగ్ స్టైల్‌తోనే తన పవర్ ఏంటన్నది చూపిస్తుంది. ఇక జార్జియా కేవలం 15 ఏళ్ల వయసులో ఇటాలియన్ సోషల్ మూవ్మెంట్ యువజన విభాగంలో రిజస్టర్ అయ్యి చురుగ్గా పాల్గొనేది. అంతేగాదు సోషల్ మీడియాలో ఆమె క్లిష్ట పరిస్థితులను అవలీలగా ఎదర్కొనే శక్తిమంతమైన మహిళగా మంచి ఫ్యాన్ ఫోలోయింగ్ ఉది ఆమెకు. (చదవండి: ఒకప్పుడు నాన్న అంటే హడల్..కానీ ఇప్పుడు..!) -
లెహంగా లుక్కే వేరు! ధరిస్తే ఏ వేడుకైనా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే!
టాప్ వేడుకలలో ప్రత్యేకంగా వెలిగిపోవాలన్నా.. యంగ్లుక్తో మెరిసిపోవాలన్నా.. ఆధునికతతో జోడీ కట్టాలన్నా.. సంప్రదాయంతో జత చేరాలన్నా ..అన్నింటికీ ఒకే ఆన్సర్‌గా సమాధానం లెహంగా టాప్ అనేది నవతరం మాట. దానికి తగ్గట్టు ఇండోవెస్ట్రన్ లుక్‌తో మెరిసిపోయే ఈ డిజైన్స్ రానున్న పెళ్లిళ్ల సీజన్‌కు మరింత వైవిధ్యంగా ముస్తాబై రానున్నాయి. ఏ పట్టు, జార్జెట్, బ్రొకేడ్... మెటీరియల్ ఏదైనా లెహంగా గ్రాండ్‌గా వెలిగిపోతుంది. దానిమీదకు ధరించే టాప్ మాత్రం కాలర్టైప్, పెప్లమ్, సింగిల్ షోల్డర్ .. వంటి డిజైన్స్ అయితే మోడర్న్‌గా ఆకట్టుకోవచ్చు. సంప్రదాయ వేడుకలకు ప్రత్యేక కళను తీసుకురావచ్చు. ఏ లెహంగా టాప్ ఒకే కలర్లో ఎంచుకున్నప్పుడు దానికి తగిన ఎంబ్రాయిడరీ లేదా ప్రింట్, మెటీరియల్‌ను బట్టి స్పెషల్‌గా క్రియేట్ చేయచ్చు. ఏ ప్లెయిన్ కాలర్ నెక్ టాప్ ఎంచుకున్నప్పుడు కొద్దిపాటి ఎంబ్రాయిడరీ డిజైన్‌తో మెరిపించవచ్చు. దీనికి ప్లెయిన్ లెహంగా లేదా ప్రింటెడ్ లెహంగా సరైన కాంబినేషన్ అవుతుంది. ఏ గ్రాండ్‌గా ఉన్న లెహంగాకి సింగిల్ షోల్డర్ కేప్ స్టైల్ టాప్ ప్రత్యేకతను తీసుకువస్తుంది. (చదవండి: పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!) -
బాక్టిరియాతో డ్రెస్సింగ్.. గాయలను త్వరగా తగ్గిస్తుంది!
మన శరీరంలో ఎప్పుడైనా దెబ్బలు తగిలితే బ్యాండేజీ వేసుకుంటాం. ఇక గాయం మానడానికి చాలా రోజులే పడుతుంది. ఈ క్రమంలో బాక్టీరియా చేరకుండా వైద్యుల సూచనతో డ్రెస్సింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ కొత్తరకమైన డ్రెస్సింగ్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది ఏకంగా గాయాన్ని మాయం చేస్తుందట. దీర్ఘకాలిక గాయాలకు చికిత్స చేస్తున్నప్పుడు వాటికి బాక్టీరియా దరిచేరకుండా నిత్యం డ్రెస్సింగ్ చేయడం మనకు తెలిసిందే. అయితే ప్రతిసారి డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు పేషెంట్స్‌కి నొప్పి కలగడం సహజమే. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్తరకం డ్రెస్సింగ్ గాయాలను త్వరగా మానేలా చేస్తుందట. గాయపడిన ప్రాంతంలో నొప్పి కలిగించే బయోఫిల్మ్‌లను నాశనం చేసేలా MIT, స్విట్జర్లాండ్‌కు చెందిన డాక్టర్. కున్ రెన్ నేతృత్వంలోని సైంటిస్టులు బయో-కె+ అనే అక్వాసెల్ను కనుగొన్నారు. ఇందులో మూడు రకాల లాక్టోబాసిల్లి ప్రోబయోటిక్ అనే బాక్టిరియా ఉంటుందట. ఇది బయోఫిల్మ్ pH స్థాయిపై దాడిచేసి దానిని నాశనం చేస్తుందట. ఈ కొత్తరకమైన డ్రెస్సింగ్ టెక్నాలజీతో 99.999% వ్యాధికారకాలను చంపేసి గాయం తాలూకూ నొప్పిని తగ్గించిందని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఇందులోని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా..గాయాన్ని త్వరగా మానేలా చేయడమే కాకుండా కొత్త చర్మం రావడానికి సహాయపడిందని సైంటిస్టులు తెలిపారు. -
చీరకట్టు.. ఇలా స్టైల్ చేసుకుంటే పార్టీలో హైలైట్ అవ్వాల్సిందే
ఎవర్గ్రీన్ డ్రెస్‌గా ఎప్పటికీ శారీ ముందు వరసలో ఉంటుందని తెలిసిందే. అయితే, చీరకట్టు అందం గురించి రొటీన్ మాటలు కాదు..ఇంకాస్త సృజనను జోడించి స్టైలిష్ లుక్ తీసుకురావాల్సిందే అనుకునేవారిని ఇట్టే ఆకట్టుకుంటోంది శారీ ఓవర్ కోట్. పట్టు చీరల మీదకు ఎంబ్రాయిడరీ లాంగ్ జాకెట్స్ ధరించడం తెలిసిందే. కానీ, అవి సంప్రదాయ వేడుకలకే పరిమితం. వెస్ట్రన్ పార్టీలకూ శారీ స్టైల్‌ను పరిచయం చేయాలనుకుంటే ఈ ఇండోవెస్ట్రన్ స్టైల్‌ని హ్యాపీగా ట్రై చేయచ్చు. శారీ మీదకు ఓవర్‌కోట్‌ను ధరించి కాన్ఫిడెంట్ లుక్స్‌తో కలర్ఫుల్గా వెలిగిపోవచ్చు. సేమ్ టు సేమ్ శారీ–ఓవర్ కోట్ ఒకే కలర్ ప్యాటర్న్‌లో ఉంటే ఆ స్టైల్ సూపర్బ్ అనిపించకుండా ఉండదు. ఆభరణాల జిలుగులు అవసరం లేని ఈ ప్యాటర్న్ స్టైల్ పార్టీలో ప్రత్యేకంగా వెలిగిపోతుంది. ధోతీ శారీ సాధారణంగానే ధోతీ శారీ ఓ ప్రత్యేకమైన లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక దాని మీదకు ఫ్లోరల్ ఓవర్ కోట్ ధరిస్తే ఎక్కడ ఉన్నా మరింత స్పెషల్‌గా కనిపిస్తారు. ఎంబ్రాయిడరీ కోట్స్ సిల్క్ ప్లెయిన్ శారీస్‌కి ఎంబ్రాయిడరీ ఓవర్ కోట్ హుందాతనాన్ని తీసుకువస్తుంది. ఈ స్టైల్ ధోతీ శారీస్‌కు కూడా వర్తిస్తుంది. నీ లెంగ్త్ కోట్స్ మోకాళ్ల దిగువ భాగం వరకు ఉండే ట్రాన్స్పరెంట్ ఓవర్ కోట్స్ లేదా కేప్స్ నేటి యువతరపు మదిని మరింత ఆత్మవిశ్వాసంగా మార్చేస్తుంది. -
కాలం కార్ఖానా
కాలం ఒక కార్ఖానా. మనం నేల మీద పడిన క్షణం నుంచి కాలం కార్ఖానాలో మన కోసం ఉత్పత్తి మొదలైపోతుంది. ఆ ఉత్పత్తులలో మనకు కావలసిన రకరకాల ఆహార్యాలు, ఆలోచనలు, రుచులు, అభిరుచులు, అలవాట్లే కాదు; వాటిని నియంత్రించే హద్దులూ ఏర్పడిపోతాయి. పుట్టిన మరుక్షణం నుంచి కాలం మనకు తెలియకుండానే మనతో కలసి నడుస్తుంది, మనల్ని నడుపుతుంది. కానీ మనం ఆ సంగతి గుర్తించం, మనల్ని మనమే నడుపుకుంటున్నామనుకుంటాం. అంతా మన ప్రయోజకత్వమేననుకుని విర్రవీగుతాం. కాలాన్ని కేలండర్‌గా మార్చి గోడకూ; గడి యారంగా మార్చి మణికట్టుకూ బంధించామనుకుంటాం. కానీ గుప్పిట్లో నీళ్ళు వేళ్ళ సందుల్లోంచి జారిపోయినట్టుగా కాలం కూడా ఏ బంధనాలకూ లొంగకుండా జారుకుంటూనే ఉంటుందన్న వాస్తవం మన తెలివిని నిరంతరం వెక్కిరిస్తూనే ఉంటుంది. కాలంలో ఒకానొకనాడు మనిషి నగ్నత్వాన్నే ఒంటికి చుట్టుకున్నాడు. తర్వాత తర్వాత ఒళ్ళంతా వస్త్రంతో కప్పుకోవడమే సంస్కారంగా, నాగరికతగా మారింది. మొన్నటికి మొన్న, తగినంత తిండికీ, చాలినంత ఆచ్ఛాదనకూ నోచుకోని ఈ దేశంలోని కోట్లాది నిరుపేదల బతుకు టద్దంగా మారుతూ మోకాళ్ళు దాటని అంగవస్త్రాన్ని మొలకు చుట్టుకోవడం ఆదర్శం కాదు, అవసరమనుకున్నాడు మహాత్మా గాంధీ. ఆ తర్వాత స్త్రీ పురుష వస్త్రధారణ అనేకానేక మార్పుల మలుపులు తిరుగుతూ ఒంటినిండా కప్పుకోవడమనేది ‘అనాగరికం’గా మారి గాంధీగారి అంగవస్త్రంలా మోకాళ్ళు దాటని షార్ట్స్ ధరించడం అతి నవీనమైన పోకడగా మారింది. కాలం చేసే చిత్రాలు అలా ఉంటాయి. అది మన పట్టు తప్పించుకుంటూ ముందుకే కాదు, వెనక్కీ, పక్కలకీ కూడా పరుగులెడుతూ మనతో ఆడుకోగలదు. కాలం అఖండంగా ఉంటూనే నిన్న, నేడు, రేపు రూపంలో ఖండితంగానూ ఉంటుంది. కానీ మన ఊహాపోహలకు, జీవనగమనానికి మేకులు దిగేసి వర్తమానమనే కట్టుకొయ్యకు బంధించి ఉంచుతుంది. కవి ఎంత క్రాంతదర్శి అయినా ఆ మేకుబందీ నుంచి పూర్తిగా తప్పుకోలేడు. రేపటి కాలంలో పోస్ట్ మ్యాన్ ఆరోవేలుగా మారబోతున్నాడని తెలిసి ఉంటే దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రసిద్ధ కవిత ‘తపాలా బంట్రోతు’ ఏ రూపం దిద్దుకొని ఉండేదో! ‘దేశాంతరగతుడైన ప్రియుడి వార్త’ మొబైల్ రూపంలో అరచేతి దూరంలో ఉన్న ఈ రోజున, ఏ అమ్మాయీ ‘పద్దెని మిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్లెరంలో పెట్టి ప్రాణనాథుడి కందించా’లనే ఆశతో, ‘చూపులు తుమ్మెద బారులు కట్టి’ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరమే లేదు. చిరునవ్వుతోనే కబురు లేదని చెప్పి వెళ్లిపోతున్న తపాలా బంట్రోతు వెనుక ఆ కళ్ళు ‘విచ్చిన రెండు కల్హార సరస్సులు’ కావలసిన అవసరమూ లేదు. అలాగని ప్రియుడి వార్త కోసం పడుచు దనం పడే ఆరాటం కాలభేదాలకు అతీతంగా నిత్యనూతనమూ అవుతుంది కనుక ఒక అపురూప భావస్పందన కలిగించే కవితగా అది భవిష్యత్తులోకి తన అస్తిత్వాన్ని పొడిగించుకుంటూనే ఉంటుంది. మరోపక్క గతకాలపు చరిత్ర శకలంగానూ మారుతుంది. గతంపై మసక తెర కప్పి మాయ చేయడం కాల స్వభావాలలో ఒకటి. మన పాదముద్రలు గతంలోకి వ్యాపించి ఉన్నాయన్న ఎరుక తప్పి, మన నడక వర్తమానంలోనే మొదలైందని అపోహ పడతాం. నేడు మన కళ్ళముందు ఉన్నవే నిత్యాసత్యాలు కావనీ, మొదటి నుంచీ ఈ ప్రపంచం ఇలాగే లేదనీ కొంత తెలిసినా కొంత తెలియనట్టే భ్రమావలయంలో గడుపుతూ ఉంటాం. ఎన్నో రకాల నియంతృత్వాలను దాటి ప్రజాస్వామ్యంలోకి వచ్చామనీ, అది కూడా ఇంకా ప్రయోగ దశలోనే ఉంది తప్ప పూర్తిగా పాదుకోలేదనీ, నేటి మన అనేకానేక సమస్యలు, సంక్షోభాల మూలాలు గతంలో ఉన్నాయనీ, వాటి పరిష్కారాల వెతుకులాటలో వందలు, వేల సంవత్సరాల గతంలోకి మన చూపుల నిడివి పెంచుకోవాలనే ఊహ రాకుండా మన బుద్ధికి కాలం దడి కడుతుంది. వర్తమానాన్ని ఒక మత్తుమందులా అలవాటు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాఙ్మయ పరిణామ క్రమాన్నే కనుక చూస్తే, క్రతు సంబంధమైన తంతు నుంచి మూకాభినయమూ, దాని నుంచి నాట్యమూ, నాట్యం నుంచి నాటకమూ ఎలా అభివృద్ధి చెందాయో; క్రతు సందర్భ గానం నుంచే పాట పుట్టి కావ్యస్థాయికి ఎలా పెరిగిందో; అనేకమంది అజ్ఞాతకర్తలు కలిగిన మౌఖిక సంప్రదాయం నుంచి, ఏక కర్తృకమైన లేఖన సంప్రదాయానికి వాఙ్మయం ఎలా పరివర్తన చెందిందో చెప్పే ఆసక్తికరమైన అధ్యయనాలు ఈరోజున అందు బాటులో ఉన్నాయి. అయినాసరే, నాట్యం, నాటకం, పాట, పద్యం, వచనపద్యం, గద్యం, కథ, నవల వంటి వివిధ ప్రక్రియలను పరస్పర సంబంధం లేని భిన్న రూపాలుగా విడదీసి చూడడాన్ని కాలం మనకు అలవాటు చేసింది. మౌఖిక సంప్రదాయానికి, అనేక కర్తృకానికి చెందినవాటిని కూడా లిఖిత సంప్రదాయం నుంచీ, ఒక్కరే రచించారన్న భావన నుంచీ చూడడం కూడా కాలం మప్పిన అలవాటే. కాలం పోయే చిత్రగతులు మనిషిని మొదటినుంచీ తికమకపెడుతూ ఆలోచనకు లోనుచేస్తూనే ఉన్నాయి. మహాభారత కథకుడు కాలానికి చెప్పిన భాష్యంలో అసాధారణమైన లోచూపు కనిపించి ఆశ్చర్యచకితం చేస్తుంది. భూత, భవిష్యత్, వర్తమానాలకు చెందిన అన్ని భావాలూ కాలనిర్మితాలేనంటాడు. భావాలు మనిషివే కనుక మనిషీ కాలనిర్మితుడే నన్నమాట. కాలం గురించిన తెలివిడితోనే దాని మాయాజాలం నుంచి ఏ కొంచెమైనా తప్పించుకోగలం. -
అదిరేటి డ్రెస్సు.. యూనిక్ డ్రెస్సింగ్ స్టైల్
-
ఫ్యాషన్ టాక్: స్టైలు మారింది, డిజైన్ అదిరింది
డ్రెస్సింగ్‌లో ఎప్పుడూ యునిక్‌గా ఉండాలనే ఆలోచన నేటి యూత్‌ది. వారి అభిరుచికి తగినట్టుగా అందుబాటులోకి వచ్చింది. వన్‌సైడ్ లాంగ్ స్టయిల్. టాప్ లేదా కుర్తీ ఒక వైపు పొడవుగా, మరోవైపు పొట్టిగా ఉండటం ఈ స్టయిల్ ప్రత్యేకత. రెండు రంగులు భిన్నం కావచ్చు. రెండు ఫ్యాబ్రిక్స్ కూడా వేర్వేరువి అయి ఉండవచ్చు. కుర్తా లేదా టాప్ డిజైన్‌లో ప్రత్యేకత కనిపించాలంటే ఓ చిన్న మార్పు తీసుకురావాలి. డిజైనర్స్ చేసిన ఓ చిన్న ఆలోచన యూత్‌ని మరింతగా ఆకట్టుకుంటుంది. వెస్ట్రన్ నుంచి ఇండియన్ వేర్‌లోకి ఈ డిజైన్ కొత్తగా ఆకట్టుకుంటోంది. వెస్ట్రన్ పార్టీలో ప్రత్యేకతను చాటడమే కాదు, స్ట్రీట్ స్టయిల్గానూ మార్కులు కొట్టేస్తోంది ఈ డిజైన్. -
శ్రీరంగ సూక్తులు పలుకుతున్న భజ్రంగీ భాయిజాన్
-
అమ్మాయిల దుస్తులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఇండోర్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేత వివాదంలో చిక్కుకున్నారు. అసభ్యకరమైన బట్టలు(డర్టీ క్లాత్స్) ధరించే అమ్మాయిలు రామాయణంలో శూర్పణఖ మాదిరి కనిపిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో మహవీర్ జయంతి సందర్భంగా జైన సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను ఆయన తప్పుపట్టారు. రాత్రిపూట బయటకు వెళ్లినప్పుడు మద్యం మత్తులో డాన్స్ చేస్తున్న యువతీ యువకులు కనిపిస్తుంటారని.. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను.. వారిని చూస్తుంటే గట్టిగా చెప్పుతో కొట్టాలన్నంత కోపం వస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలను మనం దేవతలా ఆరాధిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అసభ్యకరంగా దుస్తులు ధరించిన కొంతమంది ఆడవాళ్లను చూస్తుంటే శూర్పణఖలా కనిపిస్తారు. దేవుడు మీకు మంచి శరీరాన్ని ఇచ్చాడు. మంచి దుస్తులు వేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్దులు నేర్పాలి’ అని సూచించారు. అయితే విజయ్‌వర్గియా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళల పట్ల ద్వేషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలతో పురుషాధిక్యత, పితృస్వామ్య భావజాలన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయ నేతలు ఇలా మాట్లాడటం సరికాదని.. బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కైలాష్ విజయవర్గియా ఇంలాటి వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన వివాదంలో ఇరుకున్నారు. చదవండి: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి తృటిలో తప్పిన ప్రమాదం.. BJP Leader @KailashOnline says girls dress badly & look like ‘Shurpanakha’. This is a reprehensible & demeaning insult to every woman of this country Where is @smritiirani now? Does she condone this disgusting statement? Or does she only find her voice to attack @RahulGandhi! pic.twitter.com/hzoxrnZpl1 — Dr. Shama Mohamed (@drshamamohd) April 8, 2023 -
FIFA WC: అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన.. చిక్కుల్లో సుందరి
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ చూడడానికి వచ్చే అభిమానులకు కఠినమైన కండీషన్స్ పెట్టారు నిర్వాహకులు. మాములుగా ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగితే యువతుల గ్లామర్ షో ఎక్కువగా ఉండడం సహజం. మందు, విందు, చిందు కూడా కామన్‌గా కనిపిస్తాయి. ఫిఫా లాంటి మెగా టోర్నీలో అయితే ఇక చెప్పనవసరం లేదు. పొట్టి దుస్తులు ధరించి క్లీవేజ్ షో చేస్తూ తమ అంద చందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. కానీ అరబ్ దేశమైన ఖతర్‌లో ఇలాంటివి నిషేధం. ఇస్లాం మతం ఎక్కువగా ఆచరించే దేశంలో మహిళలు అసభ్యకర దుస్తులు ధరించడానికి వీల్లేదు. అందుకే ఫిఫా వరల్డ్‌కప్‌కు వచ్చే యువతులు, మహిళలలు ఎట్టి పరిస్థితుల్లోనూ కురచ దుస్తులు వేసుకొని రావొద్దని.. అనవసరంగా క్లీవేజ్ షో చేసి జైలుపాలు కావొద్దని ముందే హెచ్చరించింది. అంతేకాదు మ్యాచ్ చూడడానికి వచ్చే మహిళా అభిమానులు ఫుల్ డ్రెస్ వేసుకొని రావాలని.. తప్పనిసరిగా మెడచుట్టు స్కార్ఫ్ వాడాల్సిందేనని పేర్కొన్నారు. అయితే క్రొయేషియాకు చెందిన మోడల్ ఇవానా నోల్ మాత్రం తనకు ఈ నిబంధనలు ఏ మాత్రం వర్తించవని ధైర్యంగా పేర్కొంది. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో హాటెస్ట్ ఫ్యాన్‌గా ముద్రపడిన ఇవానా నోల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అందాల ప్రదర్శన చేయడం సంచలనం కలిగించింది. క్రొయేషియా, బెల్జియం మ్యాచ్‌కు హాజరైన ఇవానా నోల్.. స్టేడియంలోకి సాధారణంగానే ఎంట్రీ ఇచ్చింది. మ్యాచ్ జరుగుతుండగానే ఇవానా నోల్ తాను వేసుకున్న డ్రెస్ పైపార్ట్ తొలగించి క్లీవేజ్ షో చేసింది. ఫిఫా నిర్వాహకుల సంగతి ఏమో తెలియదు కానీ మ్యాచ్‌కు వచ్చిన అభిమానులు మాత్రం ఆమె అందాల ప్రదర్శనను బాగా ఎంజాయ్ చేశారు. అయితే తన అందాల ప్రదర్శనే ఇప్పుడు ఇవానా నోల్కు సమస్యను తెచ్చిపెట్టింది. ఖతర్ వీధుల్లో ఇవానా నోల్ ఫోటోలను దగ్దం చేసిన స్థానిక యువకులు వెంటనే ఆమెను దేశం నుంచి బహిష్కరించాలని లేదా జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఇవానా నోల్ మాత్రం తన అంద చందాలతో ఖతర్‌లో సెగలు పుట్టించింది. చదవండి: నాలుగుసార్లు ఛాంపియన్.. ఇదంతా గతం; మాకు జరగాల్సిందే View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) -
డ్రెస్సింగ్‌పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు
సోషల్ మీడియాలో తనపై నెగిటివ్ కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది బిగ్‌బాస్ శివంగి బిందు మాధవి. అవకాయా బిర్యానీ, బంపర్ ఆఫర్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది బిందు. తెలుగు అమ్మాయి అయిన బిందు ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓటీటీ కంటెస్టెంట్‌గా దర్శనం ఇచ్చింది. హౌజ్‌లో తనదైన ఆట, యాటిటూడ్, మాటలతో గట్టి పోటి ఇస్తూ చివరికి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ గెలిచింది. చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే.. అంతేకాదు సంప్రాదాయమైన దుస్తులనే ధరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిందుమాధవి తన తాజా పోస్ట్‌లో కాస్తా ట్రెండి డ్రెస్‌లో కనిపించింది. ఈ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేయగా ఓ నెటిజన్ తన డ్రెస్సింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్‌లో హౌజ్‌లో అందరు శరీరం కరిపించేలా డ్రెస్స్‌లు వేసుకుంటే.. తను మాత్రం కేవలం సంప్రదాయమైన అలంకరణకే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో బిందు మాధవి అంటే రెస్పాక్ట్ పెరిగింది. కానీ ఇప్పుడు అది పోయింది. అందరి దగ్గర మార్కులు కొట్టాలనే ఉద్దేశంతోనే తను హౌజ్‌లో అలా ఉంది’ అంటూ విమర్శించారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! Why this narrow minded people judge a women by her dressing they like a women by her clothes and not by her character. In telugu der is a saying "ఆడదానికీ ఆడదే శత్రువు" this is apt 4 dis girl🤨 Bindu gave slipper shot answer 👏 you go girl more power to you 🔥#BinduMadhavi pic.twitter.com/78NhUznHO3 — SiriKota (@SiriKota_04) August 2, 2022 దీంతో సదరు నెటిజన్ కామెంట్స్ బిందు స్పందించి తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘హో.. మనం ధరించే దుస్తులను బట్టే వ్యక్తికి గౌరవం ఇస్తారంటే.. అలాంటి గౌరవం నాకు వద్దు’ అంటూ నెటిజన్ నోరు మూయించింది ఈ ఆడపులి. ప్రస్తుతం బిందు మాధవి సమాధానం నెట్టింట చర్చనీయాంశమైంది. బిందు ఇచ్చిన రిప్లైకు ఓ నెటిజన్ ఫిదా అయ్యాడు. ఈ కామెంట్సకు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేస్తూ బిందుకు మద్దుతు తెలిపాడు. -
అదేం డ్రెస్సింగు? ఐఏఎస్‌కు మందలింపు
పాట్నా: ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, కోర్టు ప్రోటోకాల్ ఫాలో కాక జడ్జి చేతిలో తిట్లు తిన్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. బీహార్ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు ఆనంద్ కిశోర్. సీఎం నితీశ్ కుమార్ ఆయన దగ్గర కూడా. ఓ కేసులో ఈమధ్యే ఆయన పాట్నా హైకోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన వేసుకున్న దుస్తులు జడ్జి పీబీ భజంత్రీకి చిరాకు తెప్పించాయి. ‘‘ఇదేమైనా సినిమాహాల్ అనుకుంటున్నారా? సాధారణ డ్రెస్సింగ్‌లో రావడానికి!. సివిల్స్ సర్వెంట్లు ఎలాంటి డ్రెస్‌లో కోర్టుకు రావాలో మీకు తెలియదా? ఎక్కడ శిక్షణ తీసుకున్నారు మీరు? ముస్సోరీ ట్రైనింగ్‌లో ఈ విషయాలేవీ మీకు చెప్పలేదా? మెడ కనిపించకుండా కాలర్ బటన్స్ పెట్టుకోవాలని, కనీసం మీద కోట్ అయినా ధరించాలి అని తెలియదా? అంటూ ఆ సీనియర్ అధికారిపై జడ్జి అసహనంగా వ్యక్తం చేశారు. -
‘అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): ‘అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’ అంటూ అమ్మాయిలు పాడటం ఇప్పుడు కొత్త కాదు. అందం, ఆకట్టుకునే లుక్కు, డ్రెస్సింగ్ వంటి విషయాల్లో మగువలతో మగమహారాజులూ పోటీ పడుతున్నారు. ఒకప్పుడు దసరా బుల్లోడు డ్రెస్సు వేస్తే గొప్ప. తరువాత ఎన్టీ రామారావు బెల్‌బాటమ్ ఫ్యాంట్.. దానికి అడుగున జిప్పులో ఒక భాగం కుట్టడం ప్యాషన్. కొంతమంది శోభన్‌బాబు స్టైల్లో తలలో ఓ పాయ తీసి నుదుటి మీదకు రింగులా పెట్టుకొని మురిసిపోయేవారు. ఆ తరువాత చిరంజీవి స్టెప్పు కటింగ్, బ్యాగీ ఫ్యాంట్లు, జర్కిన్లు.. పంక్ హెయిర్ స్టైల్.. ఇలా ఎన్నో.. 1996లో వచ్చిన ప్రేమదేశం సినిమా యువతను ఉర్రూతలూగించింది. చదవండి: సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి కొత్త ఫ్యాషన్ వైపు పరుగు తీయించింది. ఆ సినిమాలో హీరో అబ్బాస్ తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్‌తో యువతను మెప్పించాడు. యువకుల దృష్టిని సౌందర్యం వైపు మళ్లించాడు. యువత ఆహార్యంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐదేళ్లుగా వస్తున్న మార్పులు అన్నీ ఇన్నీ కావు. రకరకాల హెయిర్ స్టైల్స్.. జుట్టుకు రంగులు.. ఫేస్ ప్యాక్‌లు అన్నీ ఇన్నీ కావు. పనిలో పనిగా నాజూకైన శరీరాకృతి కోసం కొందరు.. సల్మాన్‌ఖాన్‌లా కండలు పెంచేందుకు మరికొందరు.. ఇలా యువత మంచి లుక్కు కోసం సమయం, ధనం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లంటే కేవలం మహిళల కోసమే. కానీ ఇప్పుడు పురుషుల బ్యూటీ పార్లర్లకు సైతం ఆదరణ పెరిగింది. నగరాలు, పట్టణాలే కాదు.. చివరకు ఒక మోస్తరు పల్లెల్లో సైతం మెన్స్ బ్యూటీ పార్లర్లు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి పట్టణాలతో పాటు రావులపాలెం, కొత్తపేట, మలికిపురం, రాజోలు, తాటిపాక, అంబాజీపేట, పి.గన్నవరం వంటి గ్రామాల్లో కూడా ఇటువంటి బ్యూటీ పార్లర్లకు డిమాండ్ ఏర్పడింది. హెయిర్ స్టైల్‌కే తొలి ప్రాధాన్యం యువకులు హెయిర్ స్టైల్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు సెలూన్‌కు వెళ్తే రెండు రకాల స్టైల్స్‌లో హెయిర్ కటింగ్ చేయించుకోవడం, గెడ్డం గీయించుకోవడం లేదా ట్రిమ్మింగ్‌తో సరి. ఇప్పుడలా కాదు. పార్లర్లలో మూడు నాలుగు గంటలు పైగా గడుపుతున్నారు. రకరకాల హెయిర్ స్టైల్స్.. అందుకు తగినట్టుగా రంగులు వేయిస్తున్నారు. వారం వారం ఫ్యాషన్ మారిపోతోంది. పాశ్చాత్య దేశాలను అనుకరిస్తున్నారు. చేతిలో సెల్‌ఫోన్.. గూగుల్‌లో వెతికితే ఎన్నో ఫొటోలు, ఇంకెన్నో వీడియోలు. ఇంకేముంది! పుర్రెకో బుద్ధి అన్నట్టు యువత చెలరేగిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా 210 పాపులర్ హెయిర్ స్టైల్స్ ఉండగా, వీటిలో సుమారు 35కు పైగా మన వద్ద ఆదరణ ఉందని బ్యూటీ పార్లర్ల యజమానులు చెబుతున్నారు. రంగుల విషయానికి వస్తే పల్పీ, ఫ్రంక్ కలర్స్‌కు ఆదరణ ఎక్కువగా ఉంది. పనిలో పనిగా ఫేస్‌ప్యాక్, ఫేషియల్‌ను కూడా వదలడం లేదు. ఒక్కో ఫేషియల్కు రకాన్ని బట్టి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక మొత్తం బాడీ న్యూలుక్ కోసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ఖర్చవుతోందంటే వీటికి ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిమ్‌లకు పెరుగుతున్న ఆదరణ మరోవైపు జిమ్‌లకు సైతం యువకులు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు కేవలం బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేవారు మాత్రమే ఎక్కువగా జిమ్‌లకు వచ్చేవారు. కరోనా తరువాత ఆరోగ్య స్పృహ పెరగడంతో పాటు అందమైన ఆకృతి కోసం జిమ్‌లకు వస్తున్నారు. పెద్దపెద్ద బరువులు ఎత్తి, సిక్స్‌ప్యాక్, ఎయిట్ ప్యాక్‌ల కోసం ప్రయాసపడే వారి కన్నా అందమైన బాడీ షేప్‌లకు వచ్చేవారే ఎక్కువగా ఉంటున్నారు. 60లో 20ల్లా ఉండాలని.. నడియవస్సు వారు సైతం యువకుల్లా కనిపించేందుకు తాపత్రయపడుతున్నారు. జట్టుకు, మీసాలకు రంగులు వేయించడం ఒక్కటే కాదు.. రకరకాల హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు. ఫేస్‌ప్యాక్‌ల విషయంలో కూడా రాజీ పడటం లేదు. శుభకార్యానికి వెళ్లాల్సి ఉంటే ముందుగా బ్యూటీ పార్లర్లు, సెలూన్ల వైపు పరుగు తీస్తున్నారు. నడివయస్సులో జిమ్‌లకు వెళ్లే వారు తక్కువే అయినా ఉదయం నడక, చిన్నచిన్న కసరత్తులతో నాజూకుగా మారిపోతున్నారు. విభిన్నంగా ఉంటేనే గుర్తింపు విభిన్నంగా ఉంటేనే మమ్మల్ని నలుగురూ గుర్తిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకే హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఐటీ సెక్టార్లో అవకాశాలు పెరిగాక, చాలామంది యువత అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ వల్ల కూడా మాకు ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి. – గాదిరాజు హరీష్‌వర్మ, అంబాజీపేట కొత్త ఫ్యాషన్ నేర్చుకుంటున్నాం మా పెద్దలు సెలూన్లు నిర్వహించేటప్పుడు కటింగ్, గెడ్డం గీయడంతో సరిపోయేది. మహా అయితే ట్రిమ్మింగ్ చేసి, రంగు వేసేవారు. ఇప్పుడు సెలూన్ల నిర్వహణ మొ త్తం మారిపోయింది. కొత్త ఫ్యాషన్లకు అనుగుణంగా హెయిర్ కటింగ్ స్టైల్స్ నేర్చుకుంటున్నాం. ఫేషియల్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. ఒక్కోసారి హైదరాబాద్ వెళ్లి శిక్షణ పొందుతున్నాం. షాపుల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. – అనిల్‌కుమార్, సెలూన్ యజమాని, అమలాపురం నాజూకుతనానికి.. ఒకప్పుడు జిమ్‌లకు ఎక్కువగా బాడీ బిల్డర్లు వచ్చేవారు. కానీ ఇప్పుడు నాజూకుతనం కోసం ఎక్కువ మంది వస్తున్నారు. మజిల్స్, బాడీ కటింగ్ కోసం చిన్నచిన్న కసరత్తులు ఎక్కువగా చేస్తున్నారు. కరోనా తరువాత, యువతలో వస్తున్న ఫ్యాషన్ మార్పుల కారణంగా జిమ్‌కు వచ్చేవారి సంఖ్య పెరిగింది. – కంకిపాటి వెంకటేశ్వరరావు, హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ కోచ్, అమలాపురం -
పుతిన్-జెలెన్స్కీ.. వాటి వెనుక బోలెడంత కథ!
దేశం కోసం అంటూ ఒకరు, తన సరిహద్దుల్లో నాటో వద్దంటూ మరొకరు.. విరామం లేకుండా యుద్ధంలో మునిగిపోయారు. ఉన్నబలగానికి ధైర్యం ఇస్తూ ఒకరు.. బలమైన బలగాలకు అధ్యక్ష భవనం నుంచే ఆదేశిస్తూ మరొకరు మొత్తం ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేశారు. ఇక్కడ తప్పొప్పులు ఎవరివి? నష్టం ఎటువైపు ఎక్కువ ఉంటోంది అనే విషయాలను పక్కనపెడితే.. వాళ్ల ఆటిట్యూడ్‌కు సంబంధించిన విషయం ఒకటి ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. అదే వాళ్ల డ్రెస్సింగ్.. మామూలురోజుల్లో సూట్ బూట్లో సందడి చేసే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. ఈ నెలరోజుల యుద్ధంలో కనిపించిన ప్రతీసారి సాదాసీదాగా గ్రీన్‌కలర్ టీషర్టులో కనిపిస్తున్నాడు. తద్వారా దేశంతో సమానమైన బాధను పంచుకుంటున్నాననే సందేశాన్ని పంపిస్తున్నాడాయన. ఫ్యాషన్ హిస్టారియన్స్ అంచనా ప్రకారం.. పిరికితనానికి ఎరుపు, తెలుపు, నీలం దుస్తులను ప్రతీకగా భావిస్తారు. కానీ, ఒలివ్, గ్రీన్ కలర్ టీషర్టుల్లోనే జెలెన్స్కీ ఎక్కువ దర్శనమిస్తున్నాడు. ఇవి యుద్ధ క్షేత్రంలో పాల్గొంటున్న సైన్యానికి సంకేతం. కీవ్ నుంచి పారిపోనంటూ ఇచ్చిన ప్రకటన.. ఉక్రెయిన్ ప్రజల తెగువ, పోరాట పటిమకు నిదర్శనం. అందుకే ప్రపంచానికి అర్థమయ్యేలా సాదాసీదా దుస్తుల్లోనే దర్శనమిస్తున్నాడు. తన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నాడు. పలు దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. పుతిన్ సంగతికొస్తే.. రష్యా మిలిటరీ చర్య మొదలైన తర్వాత.. పోయిన వారం ఓ పబ్లిక్ ఈవెంట్లో హాజరైన పుతిన్ ఓ ఫ్యాషనబుల్ కోట్లో దర్శనమిచ్చాడు. ఇటలీ నుంచి దిగుమతి అయిన ఆ కోట్ ఖరీదు సుమారు 14 వేల డాలర్లు. అంటే.. మన కరెన్సీలో అది 10 లక్షల రూపాయలకు పైనే. తద్వారా ప్రపంచానికి తన దర్శం, యుద్ధ కాంక్షను, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని పుతిన్ భావించాడు. అయితే ఇక్కడే బెడిసి కొట్టిందేమో అనే చర్చ మొదలైంది?. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన నేతల్లో పుతిన్ ఒకరు. విలాసాలతో పాటు దానగుణంలోనూ ఆయనకు ఆయనే సాటి. కానీ, ఉక్రెయిన్ పరిణామాలు ఆ పరిస్థితుల్ని మార్చేశాయి. రష్యా ఆర్థిక పతనం తర్వాత.. రూబుల్స్(కరెన్సీ)విలువ దారుణంగా పతనం అయ్యింది. దీంతో అధ్యక్షుడిగా పుతిన్‌కు అందుతున్న జీతంలోనూ కోత పడింది. పైగా రష్యా సైన్యానికి ఆర్థిక తోడ్పాటు కష్టంగా అందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ధనికదేశమనే సంకేతాలు ప్రపంచానికి పంపడం సరికాదనేది విశ్లేషకుల మాట. డ్రెస్సులోనే అంత ఉంది పరిస్థితులకు తగ్గట్లు వస్త్రధారణ ఉండాలనేది కొత్త విషయం ఏం కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. యూకే అధ్యక్షుడు విన్స్టన్ చర్చిల్ సైరన్ సూట్‌ను ధరించేవాడు. వైమానిక దాడి జరిగినప్పుడు మీరు త్వరగా తప్పించుకునేందుక వీలుగా అది. ►ఇక అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్.. మిలిటరీ దుస్తుల్లో సైన్యానికి సపోర్ట్‌గా కనిపించేవారు. ►ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ది ఈ విషయంలో మరో తరహా వైఖరి. తానొక నియంత అని చెప్పుకోవడానికి వీలుగా.. తనలాంటి జాకెట్లు మరెవరూ ధరించకూడదన్న ఉద్దేశంతో నిషేధాజ్ఞలు, ధరించిన వాళ్లకు శిక్షలు అమలు చేయించాడు. ►ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్.. ఎయిర్‌ఫోర్స్ హూడీ ద్వారా సాదాసీదాను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏప్రిల్‌లో ఎన్నికలు ఉండడంతోనే.. జెలెన్స్కీని కాపీ కొడుతూ.. ఇలా సింప్లిసిటీ డ్రామాలు ఆడుతున్నాడంటూ సోషల్ మీడియాలో మాక్రోన్‌పై ట్రోలింగ్ నడుస్తోంది. -
దీపిక డ్రెస్సింగ్‌పై ట్రోల్స్.. 'రణ్వీర్ డిజైన్ చేసాడేమో'..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె డ్రెస్సింగ్‌పై ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ ఎక్కువవుతుంది. తాజాగా తన తర్వాతి సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన దీపిక బిగుతైన రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించింది. క్యాప్, హ్యాండ్‌బ్యాగ్ కూడా ఎరుపు రంగులో ఉన్నాయి. దీనికి తోడు హై హీల్స్ వేసుకుంది. అవి కూడా రెడ్ కలర్లోనే ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు దీపికాను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అచ్చం జొమాటో డెలివరీ గర్ల్‌లా ఉందని, ఎప్పటిలాగే ఆమె డ్రెస్సింగ్ స్టైల్లో విఫలమైందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో రణ్వీర్ సింగ్ వింత ఫ్యాషన్ దీపిక పాటిస్తుందని, ఈ డ్రెస్ కూడా రణ్వీర్ డిజైన్ చేసి ఉండొచ్చని ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్గా గెహ్రియాన్తో హిట్ అందుకున్న దీపిక ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన 'ప్రాజెక్ట్ కే' లో నటిస్తుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక అలా కనిపించేసరికి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
Rashmika Mandanna Spotted In Airport, Fans Trolls On Her Dress Sense: ఛలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భావ రష్మిక మందన్నా. ఆ తర్వాత గీత గోవిందంతో గుర్తింపు పొందిన ఈ భామ సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. రీసెంట్గా వచ్చిన పుష్పతో మరో బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకొని సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించింది. అయితే ఆమె వేసుకున్న డెనిమ్ షార్ట్ మరీ పొట్టిగా ఉండటంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. రష్మిక డ్రెస్సింగ్ మరీ ఓవర్‌గా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తూ.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? ఇంక నువ్వు బట్టలు వేసుకోవడం దేనికి అంటూ ఈ అమ్మడిపై ఫైర్ అవుతున్నారు.స్కిన్ షో చేయొచ్చు కానీ, ఇది టూ మచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. #RashmikaMandanna #DilKoKaraarAaya 💕🤩🔥#Rashmika #Rash #Mumbai #Srivalli #cutenessoverloaded pic.twitter.com/EEo9koiIPE — team_rashmika_mandanna (@MandannaTeam) January 24, 2022 -
అది నా వ్యక్తిగతం..ఆ హక్కు ఎవరికీ లేదు: స్టార్ హీరోయిన్ ఫైర్
I am not stupid, cannot live according to people: బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా ఆమె సుపరిచితమే. 48 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఆమె ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. ఆమె ధరించే దుస్తులు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఈ భామ సినిమాల కంటే డ్రెస్సింగ్ విషయంలోనే ఎక్కువగా ట్రోల్ అవుతుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డ్రెస్సింగ్ తనపై వచ్చిన విమర్శలపై స్పదించింది. ‘ఒక స్త్రీని ఎల్లప్పుడూ ఆమె ధరించే స్కర్ట్ పొడవు లేదా ఆమె నెక్‌లైన్‌ని బట్టి అంచనా వేస్తారు. జనాల అభిప్రాయాలకు అనుగుణంగా నా జీవితాన్ని గడపలేను. ఎందుకంటే డ్రెస్సింగ్ అనేది నా వ్యక్తిగత ఎంపిక. మీరు ఒక నిర్దిష్ట విధానంలో ఆలోచించవచ్చు కానీ అది నా కోసం కాకపోవచ్చు. కాబట్టి నేను ఎవరికీ అలాంటి విషయాల గురించి చెప్పను. నాకు నా సొంతంగా ఆలోచనలు, ఎంపికలు ఉంటాయి. అందుకే నేను ఎవరి డ్రెస్సింగ్ గురించి మాట్లాడను. నేను ఎలాంటి దుస్తులు ధరించాలి? ఏ డ్రెస్ సెట్ అవుతుందో, ఏది బాగోదో నాకు బాగా తెలుసు. రేపు ఇది బాలేదు అని నాకు అనిపిస్తే నేను అది చేయను. కానీ అప్పుడూ కూడా అది నా ఎంపిక. కాబట్టి దాని గురించి నాకు చెప్పే హక్కు ఎవరికీ లేదు. ప్రస్తుతం నా వయసుకి, నేను ధరించే దుస్తుల పట్ల నాకు సౌకర్యంగానే ఉంది. నేను తెలివితక్కువదానిని కాదు. ఎలా ఉండాలో, ఏం చేయాలో నాకు తెలుసు. నాకు నచ్చినట్లుగా నేను ఉంటా’అంటూ మలైకా చెప్పుకొచ్చింది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో మలైకా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత వీరికి కొడుకు పుట్టాడు. కానీ మనస్పర్థల కారణంగా 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. కాగా ప్రస్తుతం మలైకా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉంది. ఈ ఏడాది పెళ్లి చేసుకోవచ్చనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.