వింటర్‌లో వైబ్రెంట్‌గా | bright colors look fine in winter | Sakshi
Sakshi News home page

వింటర్‌లో వైబ్రెంట్‌గా

Published Thu, Nov 28 2013 1:20 AM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM

bright colors look fine in winter

చలిని తట్టుకోవడానికి స్వెటర్స్, శాలువా, స్కార్ఫ్ వంటివి వాడటం మామూలే! మరి కాస్తంత స్టైల్‌గా ఉండాలంటే ఏం చేయాలి?!
 
 చలికాలంలో బ్రైట్‌కలర్ దుస్తులు ధరిస్తే లుక్ బాగుంటుంది.
 
 ఫ్లోరల్ ప్ల్రింట్స్, ఎక్కువ లేయర్స్ ఉండేలా ఓవర్ కోట్స్, హెవీకాలర్స్, లాంగ్ కోట్స్, ఫ్యాబ్రిక్ డిజైన్స్ హెవీగా ఉన్నవి వాడితే బాగుంటుంది.
 
 నీ లెంగ్త్, లాంగ్ లెంగ్త్ బ్లేజర్స్ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు  పాదాలను కవర్ చేసేలా షూస్, కొన్ని నీ లెంగ్స్, యాంకిల్ లెంగ్స్, మిడ్ లెగ్ లెంగ్త్ షూస్, బూట్లు ధరిస్తే చలికి తట్టుకోవచ్చు. స్టైల్‌గానూ ఉంటారు.
     
 ఈ కాలం ఏ లోహమైనా చర్మానికి  పెద్దగా హాని కలిగించదు. అందుకని ఏ మెటల్స్‌తో తయారైన ఆభరణాలైనా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. మెటల్ జ్యూయలరీ ఏదైనా కాంతిమంతంగా ఉన్నవి ఎంచుకుంటే బాగుంటాయి.
 
 బ్యాగ్స్‌కు ఉపయోగించే ఏ మెటీరియల్ అయినా ఈ కాలం సౌకర్యవంతంగా ఉంటుంది. పెద్ద పెద్ద లెదర్ బ్యాగ్స్, ఎక్కువ డిజైన్ ఉన్నవి బాగుంటాయి.
 
 మేకప్ కూడా డార్క్ కలర్ లిపిస్టిక్స్, మంచి షిమ్మర్స్, ఐ షేడ్స్ నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement