‘పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు డ్రెస్సింగ్ కూడా ఉపయోగపడుతుంది’ అంటారు హైదరాబాద్ వాసి, ఫౌంటెడ్ హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ కాలేజీ నిర్వాహకురాలు, టీచర్ మేఘన ముసునూరి. గ్లోబల్ టీచర్ అవార్డు గ్రహీత అయిన మేఘన ముసునూరి వార్డ్ రోబ్ గురించి చెప్పిన విషయాలు..‘‘ప్రైమరీ స్కూల్ పిల్లలకు క్లాస్ తీసుకునేటప్పుడు కలర్‌ఫుల్‌గా డ్రెస్ చేసుకుంటాను. చిన్నపిల్లలకు బ్రైట్ కలర్స్ అంటే ఇష్టం. మనం చెప్పినవి చక్కగా వినడానికి ఈ రంగులు దోహదం చేస్తాయి.
పిల్లలు డ్రెస్ ఒకటే చూడరు. చెవులకు, చేతులకు, మెడలో ఏం వేసుకున్నారు.. అని కూడా చూస్తారు. వాళ్లకి ఆసక్తి కలిగించేది ఏదైనా ఉంటే, ఇదేమిటి? నేనెప్పుడూ చూడలేదు... అని కూడా అడుగుతారు. అలా ఒకరోజు నా దగ్గర వడ్లు, మినుములు... మొదలైన గింజలతో తయారు చేసిన బ్రేస్‌లెట్‌ని వేసుకెళ్లాను. ఆ రోజు దాని గురించి వారు ఎన్నోప్రశ్నలు వేశారు. అంటే, ఆ బ్రేస్‌లెట్ వారిలో ఎంతో ఆసక్తిని కలిగించిందనేగా!
నైటీతో కనిపించను
ఎదుటివారిని చూడగానే 6 నుంచి 12 సెకన్లలో ఆæవ్యక్తిని మనం సీరియస్‌గా తీసుకోవచ్చా లేదా అనేది బ్రెయిన్ ఒక ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసుకుంటుంది. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్లు నా మాట వినని సందర్భాలు దాదాపుగా లేవు. ఎందుకంటే, వాళ్లు నన్ను నైటీలో ఎప్పుడూ చూడరు. సౌకర్యం కోసం రాత్రి సమయంలో వేసుకునే నైటీలోనే స్కూల్‌లో పిల్లలను దింపడానికి వచ్చే తల్లులు ఉన్నారు. చాలా మంది తల్లులు నా దగ్గర ‘తమ పిల్లలు మాట వినడం లేదు’ అని చెబుతుంటారు.
అప్పుడు వాళ్లతో ‘ఎప్పుడైనా టీచర్‌ని మీరు నైట్‌డ్రెస్‌లో చూశారా’ అని అడుగుతాను. అంతేకాదు ‘మన డ్రెస్ వల్ల కూడా పిల్లలు మన మాట వింటారు’ అని చెబుతాను. ఒకప్పుడు మా ఇంటికి టీచర్ వస్తున్నారంటే మా తాతగారు తప్పనిసరిగా భుజంపైన కండువా వేసుకొని, బయటకు వచ్చేవారు. గౌరవం అంటే నమస్కారం ఒక్కటే కాదు. మన డ్రెస్సింగ్ కూడా.
నా సొంత డిజైన్స్
బైక్ రైడ్‌కి వెళ్లేటప్పుడు జీన్స్ వేసుకుంటాను. మీటింగ్స్, కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు చీరలు కట్టుకుంటాను. 2–3 రోజుల మీటింగ్స్ అయితే బ్లేజర్స్, ఫ్రాక్స్ కూడా వేసుకుంటాను. చీర అయితే, బ్లౌజ్ ట్రెండీగా ఉండేలా ఎంచుకుంటాను. వెస్ట్రన్ టాప్ వేసుకొని చీర కట్టుకుంటాను. కొన్నిసార్లు టాప్ టు బాటమ్ ఒకే కలర్, కొన్నిసార్లు కాంట్రాస్ట్ వేసుకుంటాను. ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. అలాంటప్పుడు డైనమిజాన్ని చూపేలా డ్రెస్ చేసుకుంటాను.
జ్ఞాపకాలు బాగుండాలంటే...
జ్ఞాపకాలలో మన డ్రెస్సింగ్ కూడా బాగుండాలి. ఒకప్పుడు ఆకులు పచ్చగానే ఉన్నట్టు డ్రాయింగ్‌లో చూపేవారు. కానీ, ప్రకృతిలో ఆకులు చాలా రంగుల్లో ఉన్నాయి. అందుకని, మనం వేసుకునే డ్రెస్, జ్యువెలరీ కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలి. బంగారు ఆభరణాలే వేసుకోవాలని అనుకోను. తక్కువ ఖర్చుతో లభించే క్రియేటివ్ జ్యువెలరీ ఏదైనా ఎంపిక చేసుకుంటాను.
టీచర్ అంటే సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. పిల్లల్లో ఇంట్రెస్ట్, కాన్ఫిడెంట్ బిల్డ్ చేసేలా ఉండాలి. నేను రకరకాల బ్రోచెస్ పెట్టుకుంటాను. మా స్కూల్‌లో ఒక పిల్లవాడు వాళ్ల అమ్మకు ఒక బ్రోచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడంట. ‘ఎందుకు?’ అని అడిగితే ‘మా టీచర్ పెట్టుకుంటుంది, చాలా బాగుంటుంది’ అని చెప్పాడంట. పిల్లల నుంచి ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు నాకున్నాయి. ఇదే ఫ్యాషన్ అని, ఎవరి లాగానో ఉండాలని కాకుండా సమాజంలో మనదైన ఒక గుర్తింపు డ్రెస్సింగ్ ద్వారా చూడాలి. పవర్ డ్రెస్సింగ్ వల్ల ఎదుటివారు మనతో ప్రవర్తించే తీరులో కూడా మార్పు వస్తుంది.
(చదవండి: అలియా భట్‌కి ఏడీహెచ్‌డీ డిజార్డర్..అందువల్లే పెళ్లిలో..!)
Comments
Please login to add a commentAdd a comment