బాలీవుడ్ నటి అలియా భట్ గ్లామర్‌కి నటనకి నూటికి నూరు మార్కులు పడతాయి. అంతలా ప్రేక్షకుల మనుసులను గెలుచుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి దటీజ్ అలియా అని ప్రూవ్ చేసింది. ఫిట్‌నెస్ పరంగా గ్లామర్ పరంగా ఎంతో కేర్ తీసుకునే ఆమె ఏడీహెచ్‌డీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అందువల్లో తన పెళ్లిలో ఆ సమస్య దృష్ట్యా ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. ఏంటా సమస్య? ఎందువల్ల వస్తుంది?
అలియా ఏడీహెచ్‌డీ లేదా టెన్షన్-డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. బాల్యం నుంచే తాను ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్లు తెలిపింది. దీని కారణంగా ఏ విషయంపై గంటల కొద్ది దృష్టిపెట్టి పనిచేయలేను అని చెబుతోంది. ఈ ఇబ్బంది వల్లే స్కూల్లో కూడా ఒకదానిపై ఫోకస్ పెట్టలేకపోయేదాన్ని అని తెలిపింది. ఈ సమస్యకు భయపడే పెళ్లిలో కూడా మేకప్ అరగంటకి మించి ఎక్కువ తీసుకోవద్దని ముందుగానే మేకప్ మ్యాన్‌లకు చెప్పారట. ఆఖరికి షూటింగ్‌లలో కూడా ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటానని అంటోంది అలియా
ఏడీహెచ్‌డీ అంటే..
చాలా సాధారణమైన న్యూరో డెవలప్‌మెంట్ డిజార్డర్‌లలో ఒకటి. ఇది సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ పెద్దలల్లో కూడా నిర్ధారణ అవుతుంది. ఈ రుగ్మత ఉన్నవారి మెదడులోని నరాల నెట్‌వర్క్‌లు, న్యూరోట్రాన్స్‌మిటర్‌లలో తేడాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
దీని కారణంగా ఆయా వ్యక్తులు ఏ పని మీద ఒక అరగంటకు మించి అటెన్షన్ ఉంచలేరు. వెంటనే చికాకు, ఒత్తడికి గురవ్వుతారు. అంతేగాదు దీని వల్ల శ్రద్ధ వహించడం, ఎక్కువ సేపు చురుకుగా ఉండటం వంటి వాటిల్లో సమస్యలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
లక్షణాలు..
అజాగ్రత్త
ఒక దానిపై దృష్టి నిలపడంలో ఇబ్బంది
ఆర్గనైజ్ చేసి పనిలో ఉండలేకపోవడం
ఎక్కువ సేపు వింటూ కూర్చోవాలన్న ఇబ్బంది పడటం.
మానసిక శ్రమతో కూడిన పనులకు
రోజువారీ పనుల్లో మతిమరుపు
ఎందువల్ల వస్తుందంటే..
ఏడీహెచ్‌డీతో బాధపుడుతున్న వ్యక్తుల్లో మెదడు నిర్మాణం, కార్యచరణలో తేడాలు ఉన్నట్లు మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లలో పూర్తి పరిక్వతతో మెదడు ఉండకుండా నెమ్మదిగా ఉంటుందట. వీళ్లలో నిర్దేశిత శ్రద్ధే ఉంటుందట.
వీరి మెదడులో ఆటోమేటిక్ అటెన్షన్ నెట్‌వర్క్ అనేది డిఫాల్ట్ మోడ్‌లో ఉంటుందట. అందువల్ల ఇలా జరుగుతుందని అన్నారు. అయితే ఈ రుగ్మత ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరావాల్సి ఉంది. దీనిపై అధ్యయనాలు జరుగుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ డిజార్డర్ కుటుంబ వారసత్వంగా వస్తుందని అన్నారు.
(చదవండి: లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ)
Comments
Please login to add a commentAdd a comment