alia bhatt
-
నా ఇంటి గేటుని ఆమె పెళ్లి చేసుకుంది: 'యానిమల్' హీరో
రణబీర్ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ 'యానిమల్' సినిమా వల్ల మనోళ్లకు కూడా తెగ నచ్చేశాడు. ఇతడి భార్య ఆలియా భట్.. తెలుగులో 'ఆర్ఆర్ఆర్' మూవీలో హీరోయిన్ గానూ చేసింది.ఇకపోతే వీళ్లిద్దరూ 2022 ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లది ప్రేమ వివాహం. అదే ఏడాది నవంబరులో వీళ్లకు కూతురు కూడా పుట్టింది. సరే ఇదంతా పక్కనబెడితే ఆలియా తన మొదటి భార్య కాదని, గతంలో ఓ క్రేజీ అనుభవం ఉందని రణబీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)'హీరోగా నేను నటిస్తున్న తొలినాళ్లలో ఓ అమ్మాయి.. ఏకంగా పెళ్లి కూతురిలా రెడీ అయి నా ఇంటి దగ్గరకొచ్చింది. కూడా పురోహితుడు ఉన్నాడు. ఆ సమయానికి నేను వేరే దేశంలో ఉన్నాను. దీంతో నా ఇంటి గేటుకి బొట్టు పెట్టి ఆమె పెళ్లి చేసుకుంది. తిరిగొచ్చి మా వాచ్ మన్ ద్వారా జరిగిందంతా తెలుసుకుని.. ఇదేదో క్రేజీగా ఉందే అనుకున్నాను. ఇప్పటివరకైతే నా తొలి భార్యని కలుసుకోలేకపోయాను. ఏదో రోజు కచ్చితంగా కలుస్తానని అనుకుంటున్నాను' అని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు.మరి రణబీర్ అన్నట్లు అప్పుడెప్పుడో ఇతడి ఇంటి గేటుని పెళ్లి చేసుకున్న ఆ వీరాభిమాని ఎక్కడుందో? మరి ఇప్పుడు రణబీర్ చెప్పిన మాటలకు స్పందిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: కాలమే సమాధానం.. పోలీసు విచారణ తర్వాత విష్ణుప్రియ) -
అమ్మా... నాన్నా... ఒక రాహా!
‘అమ్మాయి పుట్టాక మా ఆయనలో పూర్తిగా మార్పు వచ్చింది’ అనే మాట అక్కడక్కడా వింటుంటాం. అంటే... ఎప్పుడూ ఫైర్‌బ్రాండ్‌లా ఉండే భర్త శాంతమూర్తిగా మారిపోతాడు. వ్యసనాల బారిన పడిన భర్త ఆ చీకటి నుంచి బయటికి వస్తాడు.ఒక్క ముక్కలో చెప్పాలంటే... పిల్లలకు ఉండే పవర్ అదే! తాజా విషయానికి వస్తే... ఒక ఇంటర్వ్యూలో భర్త రణ్‌బీర్ కపూర్ గురించి చెప్పారు ఆలియా.‘రాహా పుట్టిన తరువాత రణ్‌బీర్ మారిపోయాడు’ అనడమే కాదు ‘రాహాను ఎంటర్టైన్ చేయడానికి చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తాడు’ అని ప్రశంసలు కురిపించారు ఆలియా.మరి ముద్దుల కూతురు మాటేమిటి? ‘రాహా కూడా రణ్‌బీర్‌ను బాగా ఎంటర్టైన్ చేస్తుంది’ అని చెప్పారామె. ‘వారిద్దరూ మాట్లాడుకుంటుంటే తండ్రీ కూతుళ్లు మాట్లాడుకున్నట్లుగా కాకుండా ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది’ అని మురిసిపోతారు ఆలియా. ‘వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన వీడియోలు నాకు భవిష్యత్ కాలంలో అపూర్వమైన నిధులు’ అని కూడా అంటారామె.ఇంతకీ రాహా వల్ల రణ్‌బీర్‌లో వచ్చిన మార్పు ఏమిటి? ఆలియా సూటిగా చెప్పకపోయినా ఆమె మాటలను బట్టి అర్థమయ్యేదేమిటంటే.... ‘మునుపటితో పోల్చితే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు’ ‘ఇతరులతో మాట్లాడే విధానంలో మార్పు వచ్చింది’ మార్పు... మంచిదే కదా! థ్యాంక్స్.... రాహా! రాహా అంటే స్వాహిలీ భాషలో ‘సంతోషం’ అని అర్థం. -
Birthday Special: అలియా భట్ 32వ బర్త్‌డే వేడుకలో స్పెషల్ ఫొటోస్
-
కాన్స్ కాలింగ్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాలంటూ ఆలియా భట్(Alia Bhatt)కు కాల్ వచ్చింది. ఈ ఏడాది మే 13 నుంచి మే 24 వరకు ఫ్రాన్స్‌లో 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ చిత్రోత్సవాలకు ఆలియా భట్ హాజరు కానున్నారు. ఈ బ్యూటీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇక తాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొననున్న విషయాన్ని ఆలియా భట్ ధృవీకరించారు. ఈ నెల 15న ఆమె బర్త్ డే సందర్భంగా ముంబైలో గురువారం జరిగిన ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలియా భట్ మాట్లాడుతూ– ‘‘నేను తొలిసారిగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా కాస్ట్యూమ్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయమని నా సిబ్బందికి చెప్పాను’’ అన్నారు. -
కూతురి ఫోటోల్ని డిలీట్ చేసిన ఆలియా భట్! ఆ కారణం వల్లే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt)లాగే ఆమె కూతురు రాహా (Raha) కూడా అంతే అందంగా, క్యూట్‌గా ఉంటుంది. కూతురి ఫోటోల్ని, తనతో గడిపే సంతోకర క్షణాలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఆలియా. అయితే సడన్‌గా ఆ ఫోటోలన్నింటినీ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన పలువురూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కూతురి ముఖం కనిపించేలా ఉన్న ఫోటోలను హీరోయిన్ తొలగించిందని పేర్కొంటున్నారు. రాహా ముఖం కనిపించకుండా ఉన్న ఒకటీ రెండు పిక్స్ మాత్రం అలాగే ఉంచిందని చెప్తున్నారు. అయితే ఇందుకుగల కారణం మాత్రం తెలియాల్సి ఉంది.ఇదే మంచి పని!పిల్లల ప్రైవసీ కాపాడేందుకే ఇలా చేసి ఉంటుందని టాక్! 'అయినా పేరెంట్స్‌గా ఏం చేయాలన్నది వారిష్టం.. నిజం చెప్పాలంటే ఇది మంచి నిర్ణయమే.. రాహాను ఈ పబ్లిసిటీకి దూరంగా ఉంచడం చాలా మంచి పని..', 'ఈ పిచ్చి జనాలు రాహా నిష్కల్మషమైన నవ్వును, తను అందరికీ హాయ్ చెప్పడాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆమెకు అటెన్షన్ డిజార్డ్ ఉందని ఏవేవో వ్యాధులు అంటగడుతున్నారు. ఇలాంటివాటి నుంచి ఆమెను కాపాడటం చాలా అవసరం' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆలియా భట్ - రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) దంపతులకు 2022 నవంబర్‌లో రాహా జన్మించింది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) చదవండి: సౌత్‌లో ఇదే పెద్ద సమస్య.. ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి: జ్యోతిక -
వరుడి ముద్దు : రెడ్ లెహెంగాలో సిగ్గుల మొగ్గైన పెళ్లికూతురు
బాలీవుడ్ లెజెండ్రీ నటుడు రాజ్ కపూర్ మనవడు, నటుడు అదార్ జైన్, అలేఖా అద్వానీని హిందు సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి 12న గోవాలో గోవాలో పెళ్లి చేసుకున్న ఈ జంట మరోసారి(ఫిబ్రవరి 21, శుక్రవారం) హిందూ వివాహంతో తమ ప్రేమను చాటుకున్నారు. ఈ గ్రాండ్ వేడుకకు పలువురు బాలీవుడ్ స్టార్లు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రణ్‌బీర్ కపూర్ అలియా, సైఫ్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా, నీతూ కపూర్‌తో పాటు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులు, అనిల్ అంబానీ, టీనాజంట, సీనియర్ నటి రేఖ, అగస్త్య నందా వేదిక సందడి చేశారు.వధువు అలేఖా అద్వానీ ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ తయారు చేసిన ఎథ్నిక్ మాస్టర్ పీస్‌లో అందంగా ముస్తాబైంది. రెడ్ వెల్వెట్ లెహెంగాపై వాటర్‌ఫాల్ స్టైల్ గిల్డెడ్ డబ్కా ఎంబ్రాయిడరీతో రూపొందించారు. దీనికి జతగా గోల్డ్ జర్దోజీ ఎంబ్రాయిడరీతో హాఫ్-స్లీవ్డ్ వెలోర్ క్రాప్డ్ బ్లౌజ్ మంచి ఎలిగెంట్ లుక్ ఇచ్చింది. అలాగే లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా డబుల్ మ్యాచింగ్ క్రిమ్సన్ ఆర్గాన్జా దుపట్టాలో అలేఖా అందంగా మెరిసింది. ఇంకా పర్ఫెక్ట్ మ్యాచింగ్‌గా పోల్కి కుందన్స్ పచ్చలు పొదిగిన నెక్లెస్ మాంగ్ టీకా ఆభరణాలను ధరించింది. వరుడు ఆదర్ జైన్ ఐవరీకలర్ షేర్వానీ, ఎటాచ్డ్ దుపట్టా, క్లాసిక్ వైట్ స్ట్రెయిట్ ఎథ్నిక్ ప్యాంటు, తలపాగా ధరించారు. ఇక ఆభరణాల విషయానికి వస్తే, పచ్చల లేయర్డ్ నెక్లెస్ ,తలపాగామీద ఎమరాల్డ్ స్టేట్మెంట్ గోల్డ్ నగలతో రాజసంగా కనిపించాడు. కుటుంబ సభ్యులు , స్నేహితుల సమక్షంలో వివాహ వేడుక తర్వాత ఆదర్ తన భార్య అలేఖ అద్వానీ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు.దీంతో అలేఖా సిగ్గుల మొగ్గే అయింది. దీంతో కొత్తగా పెళ్లైన జంటను ఆశీర్వదించారు. -
ప్రభాస్ 'ఫౌజీ'లో బ్రిటిష్ రాణి గా అలియా భట్
-
ప్రభాస్ ఫౌజిలో యువరాణి?
ప్రభాస్(Prabhas) హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) ఓ కీలక పాత్రలో అతిథిగా మెరవనున్నారనే టాక్ వినిపిస్తోంది.పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా ఓ యువరాణి పాత్ర చేయనున్నారని భోగట్టా. సినిమాలో కీలకంగా ఉండే ఈ పాత్ర కోసం చిత్రయూనిట్ ఆమెను సంప్రదించగా, ఆమె కూడా పచ్చజెండా ఊపారని బాలీవుడ్ టాక్. మరి ‘ఫౌజి’లో ఆలియా భట్ అతిథి పాత్రలో నటిస్తారా? లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (2022) చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక జయప్రద, మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఫౌజి’కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. -
బ్లాక్ చీరలో 'అలియా భట్' స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
ప్యార్ మే పడిపోయామే...
బాలీవుడ్లో కొందరు యంగ్ హీరోలు, హీరోయిన్లు ఉల్లాసంగా,ఉత్సాహంగా ప్రేమలో పడుతున్నారు. ప్యార్ మే పడిపోయామే... అంటూ సినిమా సెట్స్‌లో లవ్ సాంగ్స్, డైలాగ్స్ చెబుతున్నారు. సిల్వర్ స్క్రీన్ కోసం ఈ ప్యార్ ప్రపంచంలో మునిగి తేలుతున్న ఆ జంటల గురించి తెలుసుకుందాం...ముక్కోణపు ప్రేమ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం తొలిసారి కలిసి పని చేశారు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్. ఈ సినిమా ప్రయాణంలోనే రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ ప్రేమలో పడ్డారు. ఈ సినిమాలోని తొలిపార్టు ‘బ్రహ్మాస్త్ర:పార్టు 1 శివ’ 2022 సెప్టెంబరులో విడుదలైంది. కానీ అంతకు ముందే... అంటే 2022 ఏప్రిల్‌లోనే రణ్‌బీర్, ఆలియా పెళ్లి చేసుకున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందనున్న మూవీ ‘లవ్ అండ్ వార్’. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరో లీడ్ రోల్ చేయనుండగా, సంజయ్ లీలా భాన్సాలీ డైరెక్షన్ చేయనున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిల మధ్య సాగే ముక్కోణపు లవ్‌స్టోరీగా ఈ మూవీ ఉంటుందని సమాచారం.ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీని ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రీ ప్రోడక్షన్‌కు ఎక్కువ సమయం పట్టడం, హిందీ ‘రామాయణ’ మూవీతో రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ‘లవ్ అండ్ వార్’ మూవీని 2026 మార్చిలో రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించారు.దక్షిణాది అమ్మాయి... ఉత్తరాది అబ్బాయిదక్షిణాది అమ్మాయి, ఉత్తరాది అబ్బాయి లవ్ చేసుకుంటే ఏలా ఉంటుంది? వారి కుటుంబాలను ఒప్పించడం కోసం ఈ అబ్బాయి, అమ్మాయిలు ఏ విధంగా కష్టపడ్డారు? పెళ్లి తర్వాత వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే అంశాలతో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘పరమ్ సుందరి’. ఈ చిత్రో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కేరళలో జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాల్లో కనిపించే అథిరిపిల్లి వాటర్ ఫాల్స్ లోకేషన్స్లోనూ (ఇరువర్, రావన్, దిల్ సే.. వంటి సినిమాల్లో కనిపిస్తాయి) ‘పరమ్ సుందరి’ సినిమా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ఈ చిత్రంలో నార్త్ అబ్బాయి పరమ్గా సిద్ధార్థ్ మల్హోత్రా, దక్షిణాది అమ్మాయి సుందరిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది.రెండు ప్రేమకథలుతులసీ ప్రేమ కోసం సన్నీ ఎన్నో సాహసాలు చేశాడు. ఈ సాహసాలను ఈ ఏడాది వెండితెరపై చూడొచ్చు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా శశాంక్ ఖైతాన్ డైరెక్షన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. కరణ్ జోహర్ ఈ సినిమాకు నిర్మాత. ఈ మూవీ చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఈ చిత్రంలో సన్నీగా వరుణ్ ధావన్, కుమారిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా ‘బవాల్ (2023)’ అనే ఓ హిందీ చిత్రంలో వరుణ్ ధావన్, జానీ ్వకపూర్ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇక ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’యే కాకుండా తన తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్షన్లో వరుణ్ ధావన్ ఓ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో నటించనున్నారు. ఈ మూవీలోని హీరోయిన్స్‌గా మృణాళ్ ఠాకూర్, పూజా హెగ్డేల పేర్లు తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఫిల్మ్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇలా రెండు ప్రేమకథలతో వరుణ్ ధావన్ ఫుల్ బిజీ.ఏక్ దిన్ లవ్‌స్టోరీ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హిందీలో ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే లవ్‌స్టోరీ మూవీ చేస్తున్నారు. సునీల్‌పాండే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ‘ఏక్ దిన్’ రిలీజ్ కావొచ్చు. ఈ చిత్రంలో జునైద్ ఖాన్పోలీస్ ఆఫీసర్‌పాత్రలో నటిస్తున్నారని బాలీవుడ్ టాక్. ఈపోలీస్ ఆఫీసర్‌కు ఓ రోజు ఒక అమ్మాయి పరిచయం అవు తుంది. కానీ ఆ అమ్మాయి నెక్ట్స్ డే ఆ అబ్బాయిని గుర్తుపట్టలేకపోతుంది. అసలు వారిద్దరి మధ్య ఒక్క రోజులో ఏం జరిగింది? అన్నదే ‘ఏక్ దిన్’ కథాంశమని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. అలాగే జునైద్ ఖాన్ హిందీలో ‘లవ్యాపా’ అనే లవ్‌స్టోరీ ఫిల్మ్ కూడా చేశారు. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా చేశారు. అద్వైత్ చందన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్, తమిళ దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాను నిర్మించారు. ప్రదీప్ రంగనాథన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తమిళ హిట్ ఫిల్మ్ ‘లవ్ టుడే’కు, హిందీ రీమేక్‌గా ‘లవ్యాపా’ రూపొందినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఖుషీ కపూర్ హీరోయిన్గా చేసిన మరో లవ్‌స్టోరీ మూవీ ‘నాదానియన్’. ఇందులో ఇబ్రహాం అలీ ఖాన్ హీరోగా చేస్తున్నారు.ధడక్ సీక్వెల్లో...జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘ధడక్’. ఇందులో ఇషాన్ కట్టర్ హీరోగా నటించారు. ఇప్పుడు ‘ధడక్’కు సీక్వెల్‌గా ‘ధడక్ 2’ రూపొందుతోంది. కానీ సీక్వెల్లో ఇషాన్, జాన్వీలు హీరోయిన్లుగా నటించడం లేదు. వీరి ప్లేస్‌లో సిద్ధాంత్ చతుర్వేది, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ నటిస్తున్నారు. షాజియా డైరెక్షన్లో జీ స్టూడియోస్, ధర్మప్రోడక్షన్స్, క్లౌడ్ 9 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అలాగే ‘దిల్ కా దర్వాజా ఖోల్నా డార్లింగ్’ అనే రొమాంటిక్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు సిద్దాంత్ చతుర్వేది. వామికా గబ్బి హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో జయా బచ్చన్ ఓ లీడ్ రోల్లో చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.చాంద్ మేరా దిల్లక్ష్య, అనన్యాపాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాదే మొదలైందని బాలీవుడ్ సమాచారం. వివేక్ సోని దర్శకత్వంలో ఈ మూవీని కరణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.హీరోయిన్ ఎవరు?∙బాలీవుడ్ లవ్‌స్టోరీ ఫ్రాంచైజీలో ‘ఆషికీ’కి మంచి క్రేజ్ ఉంది. దీంతో ‘ఆషికీ 3’ని రెండు సంవత్సరాల క్రితం ప్రకటించారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో. అనురాగ్ బసు దర్శకుడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ల లేదు. అయితే ‘ఆషికీ 3’ షూటింగ్ విషయంలో అన్ని సమస్యలు చక్కబడ్డాయని, ఈ మూవీ ఈ ఏడాది సెట్స్‌కు వెళ్లనుందని సమాచారం. అయితే ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ, శర్వారీ వంటి కథనాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా ‘ఆషికీ 3’ కోసం కార్తీక్ ప్రేమలో పడే హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయ క తప్పదు. ⇒ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్‌తో హిందీలో ‘రాంఝాణా, అత్రంగి రే’ వంటి సినిమాలు చేశారు హీరో ధనుష్. వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ‘తేరే ఇష్క్ మే’ అనే లవ్‌స్టోరీ మూవీ రానుంది. 2023లో ఈ సినిమాను ప్రకటించారు. కానీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ధనుష్ ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. అయితే ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని ఆనంద్ .ఎల్ రాయ్ భావిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ, త్రిప్తీ దిమ్రీ, కృతీసనన్ వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ధనుష్ సరసన ఎవరు హీరోయిన్గా నటిస్తారో చూడాలి.⇒ తెలుగు సూపర్‌హిట్ లవ్‌స్టోరీ ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో నటించి, సాయిరాజేష్ దర్శకత్వం వహించిన ‘బేబీ’ మూవీ 2023లో విడుదలై, సూపర్‌హిట్ సాధించింది. ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని తెలుస్తోంది. తెలుగు ‘బేబీ’కి దర్శకత్వం వహించిన సాయిరాజేష్నే హిందీ ‘బేబీ’కి రీమేక్ వహించనున్నట్లుగా తెలిసింది. అయితే బేబీ సినిమా నటీనటుల విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇషాన్ కట్టర్, ఆగస్త్య నంద, బాబిల్ ఖాన్ వంటి బాలీవుడ్ కుర్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరోయిన్పాత్ర కోసం ఖుషీ కపూర్, కృతీ శెట్టి వంటి తారల పేర్లు బీటౌన్‌లో వినిపిస్తున్నాయి. మరి..ఫైనల్‌గా హిందీ ‘బేబీ’లో ఎవరు యాక్ట్ నటించనున్నారో తెలియా లంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. – ముసిమి శివాంజనేయులు -
కిక్ బాక్సింగ్‌తో రష్మిక...ఫ్లెక్సిబులిటీ కోసం జాన్వీ...!
బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సినీ తారలంతా ఇప్పుడు వర్కవుట్స్ మీద దృష్టి పెడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్‌గా కనిపిస్తున్నారు. తారలే స్వయంగా ఇంటర్వ్యూల్లో వెల్లడించిన ప్రకారం... కొందరు తారల గ్లామర్–ఫిట్నెస్ రొటీన్ ఇదీ...ఫ్లెక్సిబులిటీ కోసం ఈ బ్యూటీ... చుట్టమల్లే చుట్టేత్తాంది తుంటరి చూపు అంటూ టాలీవుడ్ దేవరను ప్రేక్షకుల్ని ఒకేసారి కవ్వించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ తెరపై గ్లామర్ డోస్‌ని విజృంభించి పంచే హీరోయిన్స్‌లో టాప్‌లో ఉంటుంది. తన తల్లి శ్రీదేవిలా కాకుండా పూర్తిగా అందాల ఆరబోతనే నమ్ముకున్న ఈ క్యూటీ...దీని కోసం ఫిజిక్ ను తీరైన రీతిలో ఉంచుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది. తన శరీరపు ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి స్ట్రెచింగ్, ట్రెడ్మిల్ లపై దృష్టి పెడుతుంది. తన ఫిట్నెస్ రొటీన్లో బెంచ్ ప్రెస్‌లు, డెడ్‌లిఫ్ట్‌లు, స్క్వాట్లు, షోల్డర్ ప్రెస్‌లు పుల్–అప్ల ద్వారా బాడీ షేప్‌ని తీర్చిదిద్దుకుంటుంది. టిని ఆమె రోజువారీ వ్యాయామాలు ఆమె టోన్డ్ ఫిజిక్‌ను నిర్వహించడానికి మాత్రమే కాదు ఆమె కండరాలలో బలాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.‘కిక్’ ఇచ్చేంత అందం...వత్తుండాయి పీలింగ్సూ, వచ్చి వచ్చి చంపేత్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సూ... అంటూ పుష్పరాజ్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం తనను చూసి పిచ్చెత్తిపోవాలంటే ఏం చేయాలో రష్మికకు తెలుసు. అందుకే వారానికి 4–5 సార్లు జిమ్‌కి వెళుతుందామె. ఆమె ఫిట్నెస్ రొటీన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, కార్డియోతో పాటు ముఖ్యంగా నడుం దగ్గర ఫ్యాట్‌ని పెంచనీయని, అదే సమయంలో క్లిష్టమైన డ్యాన్స్ మూమెంట్స్‌కి ఉపకరించే కోర్ వర్కౌట్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఫిట్‌గా ఉండటానికి ఇంట్లో పవర్ యోగా, స్విమ్మింగ్ చేస్తుంది. ఇటీవలే రష్మిక తన ఫిట్నెస్ మెనూలో అధిక–తీవ్రత గల కిక్‌బాక్సింగ్ సెషన్లను కూడా చేర్చుకుంది, ఇది తన ఒత్తిడిని తగ్గించడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ఆమె జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.దీపికా...అందం వెనుక...జవాన్ సినిమాలో దీపికా పదుకొణెను చూసినవాళ్లు తెరపై నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టం. పెళ్లయిన తర్వాత ఈ ఇంతి ఇంతింతై అన్నట్టుగా మరింతగా గ్లామర్ హీట్‌ను పుట్టిస్తోంది. ఇంతగా తన అందాన్ని తెరపై పండించడానికి తీరైన ఆకృతి చాలా అవసరమని తెలిసిన దీపిక.. దీని కోసం బ్లెండింగ్ యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కార్డియోను సాధన చేస్తుంది. అవే కాదు... స్విమ్మింగ్, పిలాటిస్, వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తుంది, ఆమె శారీరక థృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తూ తన వర్కవుట్ రొటీన్‌ను డిజైన్ చేసుకుంటుంది.కార్డియో...ఆలియా...ఆర్ఆర్ఆర్ సినిమాలో మెరిసిన బ్యూటీ క్వీన్ అలియా భట్ తాజాగా జిగ్రా మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ రెండింటినీ పండించే ఈ థర్టీ ప్లస్ హీరోయిన్.. ఫిట్‌గా ఉండటానికి కార్డియో అవసరమని అర్థం చేసుకుంది. అది ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నా లేదా స్పిన్నింగ్ చేసినా, ఆమె స్టామినాను పెంచుకోవడంపైనే దృష్టి పెడుతుంది వర్కవుట్స్‌లో ఆటల్ని కూడా మిళితం చేసే అలియా తాజాగా పికిల్ బాల్ ఫ్యాన్ క్లబ్‌లోని సెలబ్రిటీస్ లిస్ట్‌లో తానూ చేరింది.కత్తిలా..కత్రినా..తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన కనిపించిన మల్లీశ్వరి కత్రినా కైఫ్...నాజూకు తానికి మరోపేరులా కనిపిస్తుంది. మైనేమ్ ఈజ్ షీలా, చికినీ చమేలీ వంటి పాటల్లో కళ్లు తిరిగే స్టెప్స్‌తో అదరగొట్టిన కత్రినా.. తన వ్యాయామాల్లో డ్యాన్స్, పిలాటì స్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ల సమ్మేళనాన్ని పొందుపరిచింది. అందమైన ఆ‘కృతి’...ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన సీత...కృతి సనన్ అంతకు ముందు దోచెయ్ సినిమా ద్వారానూ తెలుగు తెరకు చిరపరిచితమే. అద్భుతమైన షేప్‌కి కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే ఈ పొడగరి... తన శరీరాన్ని సన్నగా బలంగా ఉంచుకోవడానికి పిలాటిస్, కోర్ వర్కౌట్లతో శ్రమిస్తుంటుంది. వ్యాయామాల ద్వారా తన పోస్చర్‌ను మెరుగుపరచడానికి కూడా ఈమె తగు ప్రాధాన్యత ఇస్తుంది. -
కూతురు రాహాతో స్టార్ జంట రణ్‌బీర్ - ఆలియా వెకేషన్ (ఫోటోలు)
-
ఫ్యాన్స్‌పై లవ్.. అలియా భట్‌ను మించిపోతున్న కూతురు రాహా (ఫోటోలు)
-
ముగ్గురు స్టార్స్, పరమ చెత్త సినిమాగా రికార్డ్.. థియేటర్లలో నో రిలీజ్!
కొన్ని సినిమాలు అద్భుతంగా ఆడతాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాప్‌గా నిలుస్తాయి. భారీ తారాగణం, భారీ బడ్జెట్ ఉన్నా సరే కంటెంట్‌లో దమ్ము లేకపోతే ప్రేక్షకులను మెప్పించడం కష్టం. ఇప్పుడు చెప్పుకునే సినిమా అదే కోవలోకి వస్తుంది. సడక్.. 1991వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇదీ ఒకటి. మహేశ్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంజయ్‌దత్, పూజా భట్ ప్రధానపాత్రల్లో నటించారు. రెండు దశాబ్దాలకు సీక్వెల్ఐదింతలు లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాకు రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ ప్రకటించారు. సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్.. ఇలా బడా స్టార్స్‌తో 2020లో సీక్వెల్ తీసుకొచ్చారు. అయితే సడక్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో సడక్ 2 మూవీని అంతే స్థాయిలో తిప్పికొట్టారు. యూట్యూబ్‌లో ట్రైలర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 70 లక్షలమంది డిస్లైక్ కొట్టారు.నేరుగా ఓటీటీలో రిలీజ్తీరా సినిమాకు థియేటర్లు దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి ఐఎమ్‌డీబీలోనూ అత్యంత దారుణమైన రేటింగ్స్ ఉన్నాయి. కేవలం 1.2 రేటింగ్ ఉంది. అంతేకాదు, ఓటీటీలో రిలీజైన రెండు రోజులకే సడక్ 2 వంద అత్యంత చెత్త చిత్రాల్లో ఒకటిగా చేరిపోవడం గమనార్హం.ముఖ్య కారణం!కాగా సడక్ 2పై అంత వ్యతిరేకత రావడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఈ మూవీ రిలీజైన ఏడాదే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాలీవుడ్‌లోని నెపోటిజమే అతడి ప్రాణాలు తీసిందని జనాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ కారణం వల్లే బాలీవుడ్ బడా స్టార్స్ కలిసి నటించిన సడక్ 2 సినిమాకు యూట్యూబ్‌లో లక్షల్లో వచ్చిపడ్డాయి. చదవండి: Pushpa 2 Movie: నార్త్‌లో పుష్ప 2 దూకుడుకు బ్రేక్? -
రాజ్ కపూర్ 100వ జన్మదినోత్సవం కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
తెల్లని రోజా పువ్వులా ఆలియా భట్.. అస్సలు తగ్గేదే లే! (ఫొటోలు)
-
ఓటీటీలో 'జిగ్రా' స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన
ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. అయితే, ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం ఈ చిత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాలో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్‌లో మెప్పించినప్పటికీ కథలో పెద్దగా బలం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టాలను మిగిల్చింది. ఆలియా భట్ తమ్ముడి పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు.అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు చాలారోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే, డిసెంబర్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్‌లలో ఆమె భాగం కానుంది. -
హారర్ సినిమాకు ఓకే
లవ్ స్టోరీ, యాక్షన్, ఫ్యామిలీ, కమర్షియల్... ఇలా డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేశారు ఆలియా భట్. అయితే తొలిసారిగా ఆలియా భట్ ఓ పూర్తి స్థాయి హారర్ ఫిల్మ్ చేసేందుకు రెడీ అవుతున్నారని బాలీవుడ్ సమాచారం. హిందీలో ‘స్త్రీ, స్త్రీ 2, భేడియా, ముంజ్య’ వంటి హారర్ సినిమాల నిర్మాణంలో భాగమైన నిర్మాత దినేష్ విజన్‌తో ఆలియా భట్ ఇటీవల భేటీ అయ్యారట.వీరి సమావేశం ఓ హారర్ ఫిల్మ్ కోసం అని, ఈ విషయమై త్వరలో స్పష్టత రానుందని భోగట్టా. ఇటీవలే యాక్షన్ ఫిల్మ్ ‘ఆల్ఫా’ను పూర్తి చేసిన ఆలియా త్వరలోనే ‘లవ్ అండ్ వార్’ సినిమా చిత్రీకరణతో బిజీ కానున్నారు. అయితే ఈ రెండు చిత్రాల విడుదల తర్వాతే ఆలియా హారర్ సినిమా మొదలవుతుందని ఊహించవచ్చు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అలియా భట్' యాక్షన్ మూవీ
ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలోకి రానుంది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. ఇందులో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్‌లో దుమ్మురేపింది. అంకుర్ పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఈ చిత్రం మెప్పించలేదు.అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్‌లలో ఆమె భాగం కానుంది. -
ఆలియా భట్‌తో నాగ్ అశ్విన్ సినిమా.. ఆయన ఏమన్నారంటే?
ఈ ఏడాది కల్కి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ మూవీ సక్సెస్ తర్వాత నాగ్ అశ్విన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మహానటితో సూపర్ హిట్ కొట్టిన నాగ్.. మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.దీని కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాను ప్రస్తుతం కల్కి-2 మూవీతోనే బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరక్కిక్కిస్తున్నారనే వార్తలకు తెరపడింది.కాగా.. నాగ్ అశ్విన్ గతంలో కీర్తి సురేశ్ లీడ్ రోల్లో మహానటి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. అలనాటి సీనియర్ నటి సావిత్రి జీవితం అధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్‌లో ఆర్ఆర్ఆర్ హీరోయిన్.. ఆ పవర్ఫుల్ రోల్ కోసమేనా?
ఈ ఏడాది కల్కి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు.అయితే ఈ మూవీ సక్సెస్ తర్వాత నాగ్ అశ్విన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మహానటితో సూపర్ హిట్ కొట్టిన నాగ్.. మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ పాత్రకు ఆలియానే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారని లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.అయితే ఆలియా భట్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత మరో భారీ పాన్-ఇండియా చిత్రంలో కనిపించనుంది. బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ రోల్స్‌కు ఆలియా భట్ పేరుగాంచింది. ఇటీవలే ఆమె లీడ్ రోల్లో నటించిన జిగ్రా మూవీ థియేటర్లలో సందడి చేసింది.అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మూవీని వైజయంతీ ఫిల్మ్స్ బ్యానర్లోనే తెరకెక్కించనున్నారు. 2025 మధ్యలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా.. అలియా భట్ ప్రస్తుతం శర్వాయ్ వాఘ్‌తో కలిసి ఆల్ఫా చిత్రంలో నటిస్తోంది. -
ఆలియా భట్ ఆరోగ్య వంటకాలు, తినరా మైమరిచి అంటారు!
ఆలియా భట్ కేవలం నటి మాత్రమే కాదు. ఫిట్నెస్, పోషకాహారానికి సంబంధించిన వెల్నెస్ ఐకాన్ కూడా. ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలితో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుంది. 2020లో సోషల్‌మీడియా ద్వారా అలియా తన వంటగదిలోకి అభిమానులను తీసుకు వెళ్లింది. శరీరానికి ఇంధనంగా, ఫిట్‌గా ఉండేలా సులభమైన, పోషకాహార వంటకాలను ఎంచుకుంటుంది. వాటిలో బీట్రూట్ సలాడ్, సొరకాయ సబ్జీ, చియా పుడ్డింగ్.. పరిచయం చేస్తోంది. బీట్రూట్ సలాడ్కావలసినవి: తురిమిన బీట్రూట్, పెరుగు, నల్ల మిరియాలు, చాట్ మసాలా, కొత్తిమీర, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర. తయారీ: ఒక గిన్నెలో పై పదార్థాలన్నీ వేసి కలపాలి. మూకుడులో టీ స్పూన్ నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీనిని బీట్రూట్ మిశ్రమంలో వేసి కలిపి, సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: బీట్రూట్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. జీర్ణక్రియను, మెదడు, ఎముక, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే బరువు నిర్వహణలో కూడా సహాయపడతాయి.సొరకాయ సబ్జీకావలసినవి: సొరకాయ, నూనె, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి సోపు పొడి ఆమ్చూర్ పొడి, ధనియాలు, తురిమిన కొబ్బరి.తయారీ: మూకుడులో టేబుల్‌స్పూన్ నూనె వేడి చేసి ఇంగువ, కరివేపాకు, కారం వేసి పోపు సిద్ధం చేయాలి. అందులో తురిమిన సొరకాయ, ఉప్పు వేసి కలపాలి. n 2–3 నిమిషాలు అలాగే ఉంచి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ ΄పొడి సోపు పొడి వేసి కలపాలి. n చివరిగా కొబ్బరి తురుము, తాజా కొత్తిమీర ఆకులు చల్లాలి. వేడి వేడిగా వడ్డించాలి.ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, పటిష్టమైన రోగనిరోధక వ్యవస్థ, బరువు నిర్వహణకు మద్దతు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చియా పుడ్డింగ్ కావలసినవి: చియా గింజలు, పాలు, ప్రొటీన్ , పౌడర్, రుచికి స్టేవియా. తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, పాలు, ప్రొటీన్ , పౌడర్ కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్ ΄ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.కావలసినవి: చియా గింజలు, పాలు, ప్రొటీన్ ΄ పౌడర్, రుచికి స్టేవియా. తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, ΄ పాలు, ప్రొటీన్ ΄పౌడర్, కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. -
డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది
‘ఆలియా భట్ నటి మాత్రమే కాదు, ఎంటర్ప్రెన్యూర్ కూడా’... ఈ వాక్యానికి కొనసాగింపుగా ‘చక్కని స్టోరీ టెల్లర్’ అనే ప్రశంసను కూడా చేర్చవచ్చు. ఎందుకంటే ఆలియా ప్రతి రాత్రి తన కూతురు రాహాకు ఏదో ఒక పిల్లల పుస్తకం చదివి వినిపిస్తుంది. రాహా ‘ఆహా’ అంటూ వింటుంది.‘తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పుస్తకాలు చదవడం అనేది వారి భవిష్యత్‌కు పెట్టుబడి పెట్టడంలాంటిది’ అంటుది ఆలియాభట్. ‘ఎడ్–ఏ–మమ్మా’ అనే చిల్డ్రన్ బ్రాండ్ (ప్లేవేర్, స్టోరీ బుక్స్, టాయ్స్ అండ్ మోర్) వోనర్ అయినా ఆలియా తన బ్రాండ్‌లో కొత్త చిల్డ్రన్ బుక్ సిరీస్‌ను లాంచ్ చేసింది. ‘పిల్లల కోసం తల్లులు స్టోరీ టెల్లింగ్ సెషన్లు నిర్వహించడం అనేది మంచి విధానం’ అంటున్నారు మానసిక నిపుణులు. ‘బెడ్ మీద పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడం అనేది వారి మానసిక వికాసంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉచ్చారణలను, కొత్త పదాలను నేర్చుకుంటారు. పిల్లలకు కొత్త విషయాలు తెలియజేయడానికి ఇదొక అద్భుత సాధనం. ఇది పిల్లలతో తల్లిదండ్రుల భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది. పిల్లల ఏకాగ్రతను పెంచుతుంది. రోజువారీ షెడ్యూల్లో ప్రతి రాత్రి పుస్తక పఠనాన్ని తప్పనిసరి చేయడం పిల్లల్లో క్రమశిక్షణను పెంచుతుంది’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ శృతి వస్త. -
నా నవ్వు వంకరగా ఉందా? నాకు పక్షవాతమా?: ఆలియా ఫైర్
హీరోయిన్ల ముఖంలో, శరీరంలో ఏమాత్రం తేడా వచ్చినా సర్జరీ చేయించుకుంది కాబోలు అని ప్రచారం చేస్తుంటారు. అంతకుముందే బాగుండేది, ఈ శస్త్ర చికిత్స తర్వాత మరింత అధ్వాన్నంగా తయారైందని తిడుతుంటారు కొందరు. ఇప్పుడు ఇంకా అందంగా మారిందని మెచ్చుకునేవాళ్లు మరికొందరు. కానీ సర్జరీ అని నింద వేసేస్తుంటారు.డాక్టర్‌పై ఆలియా ఫైర్బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా సర్జరీ చేయించుకుందని అంటున్నాడో కాస్మొటాలజిస్ట్. సర్జరీ వికటించిందని, దానివల్ల ఆమె నవ్వు కూడా వంకరగా ఉంటోందని నానా మాటలన్నాడు. దీనిపై ఆలియా స్పందించింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియో చూస్తే హాస్యాస్పదంగా ఉంది. నా గురించేమన్నారు.. నా నవ్వు వంకరగా, మాట్లాడే విధానం భిన్నంగా ఉంటుందా! అక్కడితోనే ఆగిపోలేదు.. ఒకవైపు పక్షవాతం వచ్చిందన్నారు. తమాషాగా ఉందా?ఏంటి? తమాషా చేస్తున్నారా? సాక్ష్యం లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం నేరమని తెలియదా? మీ అసత్యాలతో ఎంతోమంది యువత మెదడును కలుషితం చేస్తున్నారు. వ్యూస్ కోసం, అటెన్షన్ కోసం ఇదంతా చేస్తున్నారా? ఇలాంటి పిచ్చి వాగుడు వాగేవాళ్లలో ఆడవాళ్లు కూడా ఉండటం సిగ్గుచేటు. ఇలాంటి ధోరణి ఎప్పటికైనా ప్రమాదకరమే.. అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా ఆలియా ఇటీవలే.. జిగ్రా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.చదవండి: బాలీవుడ్ వ్యక్తి నుంచి సలహా.. నా నామస్మరణ అక్కర్లేదు -
రణబీర్, అలియా కొత్త ఇల్లు రూ. 250 కోట్లు.. వారిద్దరి పేరుతో రిజిస్ట్రేషన్
జీవితంలో ప్రతి ఒక్కరూ సొంతింటి కోసం చాలా కలలు కంటారు. ఈ విషయంలో సినిమా సెలబ్రిటీలు కూడా ఇంకాస్త ఎక్కువగానే ఆలోచిస్తారు. బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ల ఇల్లు ఎట్టకేలకు పూర్తి అయింది. సుమారు రెండేళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వారు షిఫ్ట్ కానున్నారు. సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తన కూతురు రాహా కపూర్ పేరుతో పాటు ఆయన అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది.బాలీవుడ్ నివేదికల ప్రకారం రణబీర్, అలియా నవంబర్ నెలలో కొత్త ఇంటిలోకి షిఫ్ట్ కానున్నారని తెలుస్తోంది. అదే నెలలో తమ కుమార్తె రెండో పుట్టినరోజు జరుపుకోనుంది. ఆ వేడుకలు అక్కడే జరుపుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఆరు అంతస్తులు ఉన్న ఆ భవనంలో ఎంతో ఖరీదైన ఫర్నీచర్‌తో పాటు ఇండోర్ స్విమ్మింగ్ పూల్, జిమ్ అందుకు ఉన్నాయట. రణబీర్, అలియా భట్, నీతూ కపూర్ గత కొన్ని నెలలుగా భవన నిర్మాణ స్థలంలో తరచుగా కనిపించారు.ఇప్పటికే అలియా పేరు మీద మూడు విల్లాలు ఉన్నాయి. అవి కూడా దాదాపు రూ. 100 కోట్లు విలువ చేస్తాయని తెలుస్తోంది. అయితే, రణబీర్ కపూర్‌కు వారసత్వంగా వచ్చిన ఆస్తి ఎక్కువగా తన తల్లి నీతూ కపూర్ పేరు మీదే ఉంది. ఆమె భర్త దివంగత రిషి కపూర్ తన ఆస్తులన్నింటికి సగం యజమానిగా ఆమెను నియమించారు. దీంతో రణబీర్ కూడా రూ. 250 కోట్ల తన కొత్త ఇంటిని కూతరు రాహా, నీతూ కపూర్ పేరు మీద రిజస్టర్ చేయించారు.యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ భారీ విజయం అందుకున్నారు. తన కొత్త సినిమా 'రామాయణ' కోసం ఆయన కసరత్తులు ప్రారంభించారు. మూడు భాగాలుగా దీన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తొలి పార్ట్‌ను 2025 దీపావళికి తీసుకురానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జిగ్రాలో కనిపించిన అలియా భట్ తన రాబోయే చిత్రం సంజయ్ లీలా బన్సాలీ 'లవ్ అండ్ వార్'లో విక్కీ కౌశల్ సరసన నటించడానికి సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అతుకులే అదుర్స్! ఏకంగా 180 క్లాత్ ప్యాచ్‌లు..
నటి ఆలియా భట్ 180 ఫ్యాబ్రిక్ ప్యాచ్‌లతో రూపొందించిన లెహంగాను ధరించి అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం రాత్రి ముంబైలో డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి బాష్‌కు హాజరైన నటి ఆలియా భట్ తన కస్టమ్ మేడ్ వెడ్డింగ్ సంగీత్ లెహంగాను తిరిగి ధరించి మళ్లీ స్థిరమైన ఫ్యాషన్‌ను ప్రోత్సహించింది. సస్టెయినబులిటీ ప్రాముఖ్యతను పదే పదే తెలియజేయడమే కాకుండా, అలాంటి డ్రెస్సులను ధరిస్తూ తనే ఒక ఉదాహరణగా నిలుస్తోంది.మనీష్ ఏర్పాటు చేసిన స్టార్–స్టడెడ్ దీపావళి బాష్ కోసం వచ్చిన వారిలో ఆలియాభట్ కూడా ఉంది. ఏప్రిల్ 2022లో రణబీర్‌తో పెళ్లికి ముందు ఈ నటి తన సంగీత్ వేడుక కోసం మనీష్ స్వయంగా డిజైన్ చేసిన లెహంగాను ఇప్పుడు మళ్లీ ధరించి, మరింత అందంగా కనిపించింది. ఈ అందమైన డ్రెస్‌ను తయారు చేయడానికి దాదాపు 180 క్లాత్ ప్యాచ్‌లను కలిపి కుట్టారు. జాకెట్టుకు అచ్చమైన బంగారం, వెండి నక్షి, కోరా పువ్వులు, పాతకాలపు గోల్డ్ మెటల్ సీకెన్స్లతో అలంకరించారు. అలియా తన పెళ్లినాటి దుస్తులను తిరిగి ధరించడం, దానికి భిన్నమైన హెయిర్‌స్టైల్‌తో పాటు చమ్కీ చాంద్బాలిస్తో స్టైల్ చేసి, మరో తాజా రూపాన్ని ఇచ్చింది. ఈ గంగూబాయి కథియావాడి నటి తన వివాహ దుస్తులను రీసైకిల్ చేయడం ఇదే మొదటిసారి కాదు. కిందటేడాది ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నప్పుడు, ఆమె తన పెళ్లినాటి చీరను ధరించడానికి ఎంచుకుంది. అయినప్పటికీ ఆమె క్లాసీ ఆభరణాలు, చక్కని బన్నుతో విభిన్నంగా స్టైల్ చేసింది. అలియా ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘ఆల్ఫా‘ కోసం పని చేస్తోంది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) (చదవండి: ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!) -
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
అలియా లాంటి మెరిసే చర్మం కోసం..!
బాలీవుడ్ నటి అలియా భట్ ఎంత గ్లామరస్‌గా కనిపిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. మచ్చలేని చందమామలా ఉండే అలియా సౌందర్యాన్ని ఇష్టపడని వారుండదరు. అలాంటి మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ ఫాలో అయితే చాలంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అలియా కాశ్మీర్లో ఉంది. త్వరలో ప్రేక్షకుల మందుకు రానున్న అల్ఫా మూవీ చిత్రీకరణలతో బిజీగా ఉంది. అక్కడ నో మేకప్ లుక్‌లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. సూర్యుడే దిగి వచ్చి ముద్దాడేలా క్యూట్‌గా ఉన్న ఆమె ముఖ కాంతికి ఫిదా కాకుండా ఉండలేం. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) అంతటి చలిలో కూడా చక్కగా గ్లామర్ మెయింటైన్ చేస్తూ..అలియాలా అందంగా కనిపించాలంటే నిపుణులు ఈ చిన్నపాటి చిట్కాలను ఫాలోకండి అని చెబతున్నారు. శీతాకాలంలో సైతం చర్మం పాడవ్వకుండా అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు బ్యూటీ టెక్నిక్స్ ఫాలో అవ్వాలని తెలిపారు బ్రైన్ మావర్ డెర్మటాలజిస్ట్, డాక్టర్ హుసింజాద్తరుచుగా మాయిశ్చరైజర్ చేయడం..సెరామైడ్లు, హైలురోనిక్ యాసిడ్, పెట్రోలియం జెల్లీ కలిగిన మాయిశ్చరైజర్లు చర్మంలోని తేమని నిలుపుకోవడంలో సహాయపడతాయి. తేలికపాటి లోషన్ల కంటే చిక్కటి క్రీములు ఎంచుకోండి. శీతాకాలంలో ఇలాంటి మాయిశ్చరైజర్లు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి.హైడ్రేటింగ్ క్లెన్సర్లకు మారండిచలికాలంలో, ముఖంపై కఠినమైన క్లెన్సర్లను నివారించండి. అంటే బాగా గాఢత గల ఫేస్‌వాష్‌లను నివారించండి. ముఖం తేమతో ఉండేలా చేసి, శుభ్రపరిచే మంచి ఫేస్‌వాష్‌ని ఉపయోగించండి.వేడి నీళ్లు ఎక్కువగా ఉపయోగించొద్దు..శీతాకాలం సాధారణంగా వేడినీళ్లు ముఖంపై జల్లుకునేందుకు ఇష్టపడతాం. కానీ నిపుణులు అభిప్రాయం ప్రకారం..ఇలా అస్సలు వద్దని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిని ఉపయోగించమని సూచిస్తున్నారు. బాగా వేడి నీళ్లు ఉపయోగిస్తే చర్మం పొడిగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులుకఠినమైన స్క్రబ్‌లు,సువాసనగల ఉత్పత్తులను నివారించండికఠినమైన స్క్రబ్‌లు,సువాసనగల ఉత్పత్తులు పొడి చర్మంపై చికాకుని తెప్పిస్తాయి. మంటకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఆరోగ్యకరమైన చర్మం కోసం శీతాకాలంలో వీటిని నివారించండి. పొడిచర్మం కలవాళ్లు గాఢమైన సువాసనలేని సబ్బులు, బాడీ వాష్‌లు ఉపయోగించండి.హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి..శరీరంలో నీటి శాతాన్ని పెంచడానికి శీతాకాలంలో హైడ్రేషన్ అవసరం. చలికాలంలో పానీయాలు , ఆల్కహాల్ వినియోగం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే శీతాకాలంలో సైతం ఆరోగ్యకరమైన మెరిసే చర్మం మన సొంతం అని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: మానసిక ఆరోగ్యం కోసం 'టిబెటన్ సింగింగ్ బౌల్స్'! ఎలా ఉపయోగపడతాయంటే..) -
ఆలియా భట్ సినిమా డిజాస్టర్.. డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం జిగ్రా. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ బాలీవుడ్ నిర్మాత భార్య దివ్య ఖోస్లా సైతం తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఫేక్ కలెక్షన్స్ ఎలా ప్రకటిస్తున్నారంటూ మేకర్స్‌ను నిలదీసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాజ్‌కుమార్ రావ్, ట్రిప్తి డిమ్రీ నటించిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో పోటీపడింది.అయితే జిగ్రా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోయింది. మ్మిది రోజుల్లో కేవలం రూ.25.35 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. సినిమా ఫ్లాఫ్ కావడంతో డైరెక్టర్ వాసన్ బాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ట్విటర్ ఖాతాను ఆయన డిలీట్ చేశారు. ప్రస్తుతం ఆయన అకౌంట్ సెర్చ్ చేస్తే ట్విటర్లో కనిపించడం లేదు. జిగ్రా ఫెయిల్యూర్‌తోనే ఆయన ఈ పని చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.కాగా.. కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఆలియా భట్.. రక్షిత అక్క పాత్రలో కనిపించింది. ఆమె సోదరుడిగా బాలీవుడ్ నటుడు వేదాంగ్ నటించాడు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. -
అలియా భట్‌కి ఏడీహెచ్‌డీ డిజార్డర్..అందువల్లే పెళ్లిలో..!
బాలీవుడ్ నటి అలియా భట్ గ్లామర్‌కి నటనకి నూటికి నూరు మార్కులు పడతాయి. అంతలా ప్రేక్షకుల మనుసులను గెలుచుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి దటీజ్ అలియా అని ప్రూవ్ చేసింది. ఫిట్నెస్ పరంగా గ్లామర్ పరంగా ఎంతో కేర్ తీసుకునే ఆమె ఏడీహెచ్‌డీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అందువల్లో తన పెళ్లిలో ఆ సమస్య దృష్ట్యా ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. ఏంటా సమస్య? ఎందువల్ల వస్తుంది?అలియా ఏడీహెచ్‌డీ లేదా టెన్షన్-డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. బాల్యం నుంచే తాను ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్లు తెలిపింది. దీని కారణంగా ఏ విషయంపై గంటల కొద్ది దృష్టిపెట్టి పనిచేయలేను అని చెబుతోంది. ఈ ఇబ్బంది వల్లే స్కూల్లో కూడా ఒకదానిపై ఫోకస్ పెట్టలేకపోయేదాన్ని అని తెలిపింది. ఈ సమస్యకు భయపడే పెళ్లిలో కూడా మేకప్ అరగంటకి మించి ఎక్కువ తీసుకోవద్దని ముందుగానే మేకప్ మ్యాన్లకు చెప్పారట. ఆఖరికి షూటింగ్లలో కూడా ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటానని అంటోంది అలియాఏడీహెచ్డీ అంటే..చాలా సాధారణమైన న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్లలో ఒకటి. ఇది సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ పెద్దలల్లో కూడా నిర్ధారణ అవుతుంది. ఈ రుగ్మత ఉన్నవారి మెదడులోని నరాల నెట్‌వర్క్‌లు, న్యూరోట్రాన్స్మిటర్లలో తేడాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.దీని కారణంగా ఆయా వ్యక్తులు ఏ పని మీద ఒక అరగంటకు మించి అటెన్షన్ ఉంచలేరు. వెంటనే చికాకు, ఒత్తడికి గురవ్వుతారు. అంతేగాదు దీని వల్ల శ్రద్ధ వహించడం, ఎక్కువ సేపు చురుకుగా ఉండటం వంటి వాటిల్లో సమస్యలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..అజాగ్రత్తఒక దానిపై దృష్టి నిలపడంలో ఇబ్బందిఆర్గనైజ్ చేసి పనిలో ఉండలేకపోవడంఎక్కువ సేపు వింటూ కూర్చోవాలన్న ఇబ్బంది పడటం.మానసిక శ్రమతో కూడిన పనులకు రోజువారీ పనుల్లో మతిమరుపుఎందువల్ల వస్తుందంటే..ఏడీహెచ్‌డీతో బాధపుడుతున్న వ్యక్తుల్లో మెదడు నిర్మాణం, కార్యచరణలో తేడాలు ఉన్నట్లు మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లలో పూర్తి పరిక్వతతో మెదడు ఉండకుండా నెమ్మదిగా ఉంటుందట. వీళ్లలో నిర్దేశిత శ్రద్ధే ఉంటుందట. వీరి మెదడులో ఆటోమేటిక్ అటెన్షన్ నెట్వర్క్ అనేది డిఫాల్ట్ మోడ్‌లో ఉంటుందట. అందువల్ల ఇలా జరుగుతుందని అన్నారు. అయితే ఈ రుగ్మత ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరావాల్సి ఉంది. దీనిపై అధ్యయనాలు జరుగుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ డిజార్డర్ కుటుంబ వారసత్వంగా వస్తుందని అన్నారు. (చదవండి: లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ) -
బరిలోకి మహేశ్, చరణ్, సమంత.. అయినా ఫ్లాప్ తప్పలేదు!
సినీ ప్రేక్షకుడు మారాడు. ఒకప్పుడు తన అభిమాన నటీనటుల సినిమా ఎలా ఉన్నా సరే థియేటర్‌కి వెళ్లి చూసేవాడు. కానీ ఇప్పుడు హీరోహీరోయిన్ల మొఖం చూడట్లేదు. కథలో దమ్ముంటేనే సినిమా చూస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయినా సరే.. టికెట్ తెగాలంటే మంచి కంటెంట్ ఉండాల్సిందే. లేదంటే అపజయం తప్పదు. దీనికి ఇటీవల విడుదలైన ‘జిగ్రా’ సినిమానే మంచి ఉదాహరణ.బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జిగ్రా’. వేదాంగ్ రైనా, మనోజ్ పవా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలై తొలి రోజే ఫ్లాప్ టాక్ని మూటగట్టుకుంది. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వీకెండ్ మొత్తంలో రూ. 20 కోట్ల కలెక్షన్స్‌ని కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారం మొత్తంలో హిందీలోనే కేవలం రూ. 18 కోట్ల మాత్రమే వసూలు చేసిందంటే..ఇక మిగతా భాషల్లో కలెక్షన్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.అపజయాన్ని ఆపలేకపోయినా స్టార్స్ఆలియా భట్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేశారు. తెలుగులో హీరో రానా రిలీజ్ చేశాడు. వాస్తవానికి హిందీ తర్వాత ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది తెలుగులోనే అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశాడు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా తన మద్దతును ప్రకటించాడు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కి స్టార్ హీరోయిన్ సమంత, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై.. తన వంతు సాయం అందించారు. ఇలా స్టార్స్ అంతా తమకు తోచిన సహాయం అందించినా.. జిగ్రాకు విజయం అందించలేకపోయారు. తెలుగులో మూడు రోజుల్లో కేవలం 18 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. యావరేజ్ టాక్ వచ్చిన ఓ చిన్న సినిమాకు కూడా ఇంతకంటే ఎక్కువే వస్తాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే కథలో దమ్ము లేనప్పడు ఏ హీరో అయినా ఏం చేయగలడు? కాస్త బాగున్న సినిమాను ప్రచారం చేస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ కంటెంట్‌లేని సినిమాకు ఎంత ప్రచారం చేసిన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. విషయం వీక్‌గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందనడానికి ‘జీగ్రా’ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. -
జిగ్రా విమర్శలపై కరణ్ జోహార్ పోస్ట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన నటి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన తాజా చిత్రం జిగ్రా. వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలైంది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. ఇదే రోజు విక్కీ కౌశల్, తృప్తి డిమ్రీల సినిమా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' రిలీజైంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.అయితే జిగ్రా కలెక్షన్లపై ప్రముఖ నిర్మాత భార్య, నటి దివ్య ఖోస్లా విమర్శలు చేసింది. ఎందుకు ఫేక్ వసూళ్లు ప్రకటిస్తున్నారని మండిపడింది. తాను జిగ్రా థియేటర్‌కు వెళ్తే అంతా ఖాళీగా కనిపించిందని పోస్ట్ చేసింది. అయితే నటి దివ్య ఖోస్లా కామెంట్స్‌పై నిర్మాత కరణ్ జోహార్ రియాక్ట్ అయ్యారు. నిశ్శబ్దమే మూర్ఖులకు సరైన సమాధానమంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు.తాజాగా కరణ్ జోహార్ కామెంట్స్‌పై నటి దివ్య రియాక్ట్ అయింది. కరణ్ పేరు ప్రస్తావించనప్పటికీ అతని పోస్ట్‌పైనే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దివ్య కాస్తా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. మీకు సిగ్గు లేకుండా ఇతరులకు చెందిన వాటిని దొంగిలించడం అలవాటు.. మీరు ఎల్లప్పుడూ మౌనంగానే ఆశ్రయం పొందుతారు. మీకు వెన్నెముకే కాదు.. అలాగే వాయిస్ కూడా లేదంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రస్తావించింది.జనాన్ని పిచ్చోళ్లను చేయొద్దుకాగా.. అంతకుముందు ఆడియన్స్‌ను ఫూల్ చేయొద్దు అంటూనే దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టుకు తను థియేటర్లో జిగ్రా సినిమా చూస్తున్న ఫోటోను జత చేసింది. అందులో థియేటర్ హాల్ అంతా ఖాళీగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆలియాపై దివ్య ఖోస్లా విరుచుకుపడటానికి రెండు కారణాలున్నాయి. ఆలియా 'జిగ్రా'.. దివ్య నటించిన 'సవి' సినిమాను పోలి ఉంది. దీంతో సవి మూవీని ఆలియా కాపీ కొట్టిందన్న కామెంట్లు వినిపించాయి. మరొకటి... శుక్రవారం నాడు జిగ్రాతో పాటు 'విక్కీ విద్యా కో వో వాలా వీడియో' సినిమా రిలీజైంది. ఈ మూవీకి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు. బహుశా ఈ కోపంతోనే తను అలా విరుచుకుపడి ఉండవచ్చని పలువురూ భావిస్తున్నారు. -
జనాల్ని పిచ్చోళ్లను చేయొద్దు.. ఆలియా భట్‌పై నటి ఫైర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జిగ్రా. వేదాంగ్ రైనా మరో లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలైంది. ప్రమోషన్స్‌లో చాలా కష్టపడ్డారు కానీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంటోంది. ఇదే రోజు విక్కీ కౌశల్, తృప్తిల సినిమా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' రిలీజైంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అయితే ఈ పోటీని తట్టుకుని జిగ్రా అదరగొడుతోందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. సినిమా అద్భుతంగా ఆడుతుందన్న ప్రచారమూ జరుగుతోంది.థియేటర్ ఖాళీ..దీనిపై ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ భార్య, నటి దివ్య ఖోస్లా కుమార్ స్పందించింది. జిగ్రా చూద్దామని పీవీఆర్ మాల్‌కు వెళ్లాను. థియేటర్ అంతా ఖాళీ.. ప్రతిచోటా ఇదే పరిస్థితి.. అయినా ఆలియా భట్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. అన్ని టికెట్లు తనే కొనేసినందుకు లేదా ఫేక్ కలెక్షన్స్ ప్రకటించినందుకు! పెయిడ్ మీడియా ఎందుకు సైలెంట్‌గా ఉందో అర్థమవట్లేదు. జనాన్ని పిచ్చోళ్లను చేయొద్దుఏదేమైనా మనం ఆడియన్స్‌ను ఫూల్ చేయొద్దు అంటూనే దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టుకు తను థియేటర్లో జిగ్రా సినిమా చూస్తున్న ఫోటోను జత చేసింది. అందులో థియేటర్ హాల్ అంతా ఖాళీగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆలియాపై దివ్య ఖోస్లా విరుచుకుపడటానికి రెండు కారణాలున్నాయి. అందుకే ఈ కోపం?ఆలియా 'జిగ్రా'.. దివ్య నటించిన 'సవి' సినిమాను పోలి ఉంది. దీంతో సవి మూవీని ఆలియా కాపీ కొట్టిందన్న కామెంట్లు వినిపించాయి. మరొకటి... శుక్రవారం నాడు జిగ్రాతో పాటు 'విక్కీ విద్యా కో వో వాలా వీడియో' సినిమా రిలీజైంది. ఈ మూవీకి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు. బహుశా ఈ కోపంతోనే తను అలా విరుచుకుపడి ఉండవచ్చని పలువురూ భావిస్తున్నారు.చదవండి: కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సోనియా.. అక్కడ కూడా.. -
'జిగ్రా' కోసం ఆలియాకి మహేశ్ బాబు విషెస్
పేరుకే స్టార్ హీరో కానీ కొత్త సినిమా రిలీజైతే చాలు హీరో మహేశ్ బాబు చూస్తుంటాడు. కచ్చితంగా ట్వీట్ పెట్టి మూవీ ఎలా ఉందో చెప్పేస్తుంటాడు. ఈసారి అలానే రిలీజ్‌కి ముందే ఆలియా భట్ 'జిగ్రా' మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేశాడు.(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)బాలీవుడ్ బ్యూటీ ఆలియా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జిగ్రా'. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. హిందీతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 11నే థియేటర్లలో రిలీజ్ చేశారు.ఇదే కాదు తెలుగులో ఈసారి దసరాకు 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక' చిత్రాలు ప్రేక్షకుల పలకరించాయి. 'వేట్టయన్', 'మార్టిన్', 'జిగ్రా' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా ఇదే పండక్కి థియేటర్లలోకి వచ్చాయి. మరి వీటిలో ఏది హిట్ అయిందో లేదో తెలియాలంటే ఈ వీకెండ్ పూర్తవ్వాల్సిందే.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
హైదరాబాద్ : ఆలియా భట్ 'జిగ్రా'మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహిళలందరూ హీరోలే: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మహిళలందరూ ఎప్పటికీ హీరోలే. మహిళలు లేకుండా తర్వాతి తరాలు లేవు. మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శక్తి అంటేనే స్త్రీ కదా. ఈ తొమ్మిది రోజులు (దసరా నవరాత్రులు) ఈ విషయాన్నే మనం ప్రపంచం అంతా చెబుతున్నాం. వీలుంటే మమ్మల్ని (పురుషులు) కొంచెం ఎంపవర్ చేయండి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో, వేదాంగ్ రైనా మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.‘జిగ్రా’ తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దగ్గుబాటి రానా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఆర్ఆర్’తో ఆలియా మన ఇళ్లల్లోకి వచ్చారు. ఈ విజయదశమికి ఆమెకు విజయాన్ని కానుకగా ఇచ్చి, మన ఇంటి అడపడుచులా పంపుదాం. తెలుగు, తమిళ, మలయాళం... ఇలా అన్ని చోట్ల ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ నాకు తెలిసి ఒకరు రజనీకాంత్‌గారు... తర్వాత సమంతగారే అనుకుంటున్నాను. సమంతగారూ ముంబైలోనే కాదు... అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వస్తుండండి. సినిమాలు చేయాలి’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఎదిగాను. తెలుగు ప్రేక్షకులే నా ఫ్యామిలీ. హీరోయిన్లుగా మా సినిమాలు చూస్తున్న అమ్మాయిలకు వాళ్ల కథలో వాళ్లే హీరోలు అని గుర్తు చేసే బాధ్యత మా మీద ఉంది. మా కథల్లో మేమే హీరో అని ఆలియా భట్ తన వర్క్‌తో గుర్తు చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం రానా ఓ ఫిమేల్ మూవీని (35: చిన్న కథ కాదు’ సినిమాను ఉద్దేశించి కావొచ్చు) ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ‘జిగ్రా’ను రిలీజ్ చేస్తున్నారు.ప్రతి అమ్మాయికి రానాలాంటి బ్రదర్ ఉండాలేమో ’’ అని మాట్లాడారు. ఆలియా భట్ మాట్లాడుతూ– ‘‘సమంతకు, నాకు కలిపి త్రివిక్రమ్‌గారు ఓ కథ రాయాలని కోరుకుంటున్నాను. పురుషాధిక్య ప్రపంచంలో స్ట్రాంగ్‌గా నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌లో కూడా సమంత హీరోనే. తెలుగు ప్రేక్షకుల ప్రేమ ‘జిగ్రా’ పై కూడా ఉండాలి’’ అని తెలిపారు. ‘‘జిగ్రా’ అంటే ధైర్యం. యాక్టింగ్ అంటే ఆలియా’’ అని చెప్పారు వాసన్ బాల. ‘‘సినిమా ప్రమోషన్ విషయంలో ఆలియా అంకితభావం చూస్తుంటే ఇక్కడ ఉన్న యాక్టర్స్‌కు కొంత నేర్పాలని అనుకుంటాను’’ అని రానా అన్నారు. ఈ వేడుకలో జాన్వీ నారంగ్, సిమ్రాన్ నారంగ్ పాల్గొన్నారు. -
సమంత-త్రివిక్రమ్‌తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక
చాలారోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన సమంతని త్రివిక్రమ్, ఆలియా భట్ ఆకాశానికెత్తేశారు. హైదరాబాద్‌లో జరిగిన 'జిగ్రా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదంతా జరిగింది. కొత్త మూవీ ప్రమోషన్ కోసం భాగ్యనగరానికి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. సినిమా గురించి చెప్పడం కంటే సమంతకి ఎలివేషన్స్ ఇచ్చింది. త్రివిక్రమ్‌తో మూవీ చేయాలని ఉందనే కోరిక బయటపెట్టింది.(ఇదీ చదవండి: సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)సమంత గురించి మాట్లాడిన ఆలియా భట్.. తెరపైనే కాదు తెరముందు కూడా హీరోనే అని సామ్‌ని ఆకాశానికెత్తింది. పురుషాధిక్య ప్రపంచంలో సమంత ప్రయాణం చాలా స్ఫూర్తి దాయకమని, అలాంటి ఆమె తన సినిమాని ప్రొత్సహించేందుకు ముందుకు రావడం చాలా ఆనందం ఉందని చెప్పింది. మంచి సినిమాలను ప్రేమించడంలో తెలుగువారి తర్వాతే ఎవరైనా అని మనోళ్ల ప్రేమ గురించి పొగిడింది. తమ ఇంటికి తెలుగుతో ఎంతో అనుబంధం ఏర్పడిందని, తన కూతురు.. నాటునాటు పాట వినని రోజే ఉండదని ఆలియా చెప్పింది.అలానే సమంత, తనని లీడ్ రోల్స్‌లో ఓ సినిమా తీయాలని ఇదే వేడుకకు అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్‌ని ఆలియా భట్ కోరింది. అయితే ఇదేమంత పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్.. త్వరలో అల్లు అర్జున్‌తో మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గురూజీ అనుకుంటే బన్నీ సరసన సమంత, ఆలియా భట్ని పెడితే పాన్ ఇండియా తగ్గట్లు సరిపోతుంది. మరి ఆలియా కోరిక త్వరలో తీరుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా) -
నవరాత్రుల్లో ముద్దుగుమ్మల స్టన్నింగ్ ట్రెడిషనల్ లుక్స్..! (ఫొటోలు)
-
బిగ్‌బాస్ విన్నర్‌గా కంటెంట్ క్రియేటర్.. ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలంటే?
ప్రస్తుతం బిగ్‌బాస్ రియాలిటీ షో సినీ ప్రియులను అలరిస్తోంది. ఇప్పటికే బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షో తాజాగా తమిళంలో సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. తాజాగా బిగ్‌బాస్ మరాఠీ సీజన్-5 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరిగింది. ఈ రియాలిటీ షో విజేతగా కంటెంట్ క్రియేటర్ సూరజ్ చవాన్ నిలిచారు. బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు రూ.14.6 లక్షలు ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. ఈ సీజన్లో రన్నరప్ అభిజీత్ సావంత్ నిలిచాడు. మూడో స్థానంలో నటి నిక్కీ తంబోలి నిలిచింది.ఈ గ్రాండ్ ఫీనాలేలో జిగ్రా మువీ టీమ్ సందడి చేసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో ఆలియా భట్, వేదాంగ్ రైనా, దర్శకుడు వాసన్ బాలా ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ మరాఠీ సీజన్- 5 విజేత సూరజ్ చవాన్‌కు ట్రోఫీని అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. మరాఠీ సీజన్-5కు జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ హోస్ట్‌గా వ్యవహరించారు. విన్నర్‌తో దిగిన ఫోటోలను రితేశ్ దేశ్‌ముఖ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. View this post on Instagram A post shared by Riteish Deshmukh (@riteishd) -
నీడల్లే నేను తోడు ఉండనా...
‘అంకుర్ నువ్వు ఏమన్నా చేశావా? నువ్వు ఏదన్నా టచ్ చేశావా? ఏదన్నా తిన్నావా ఓకే... కబీర్ నీ ఫోన్‌తో ఏమైనా కాల్స్ చేశాడా? లేదుగా? బ్లడ్ శాంపిల్స్ తీస్తే క్లీన్ వస్తుంది కదా... నువ్వేం భయపడకు... నీకేం కానివ్వను’ అని ఆలియా భట్ పలికే సంభాషణలతో ‘జిగ్రా’ సినిమా తెలుగు ట్రైలర్ విడుదల అయింది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘జిగ్రా’. అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ చిత్రంలో సత్య పాత్రలో ఆలియా, అంకుర్ పాత్రలో వేదాంగ్ నటించారు. కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా హీరో రానా విడుదల చేస్తున్నారు. ఆదివారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ షేర్ చేశారు. ఇంకా ఈ ట్రైలర్లో ‘దారే లేకున్నా... నీ వెంట నీడల్లే నేను తోడు ఉండనా... ఏమైనా కానీ... ఏ పిడుగే రానీ నేను తోడు ఉండనా...’ అనే పాట కూడా వినిపిస్తుంది. -
స్టార్ హీరోయిన్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్!
బాలీవుడ్ భామ అలియా భట్ నటించిన తాజా చిత్రం జిగ్రా. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. ఈనెల 27న విడుదల కావాల్సిన జిగ్రా.. దేవర ఎంట్రీతో బాక్సాఫీస్ నుంచి తప్పుకుంది. ఈ చిత్రంలో వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వాసన్ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షహీన్ భట్, సౌమెన్ మిశ్రాతో పాటు ఆలియా భట్ కూడా నిర్మాత వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. జిగ్రా తెలుగు వర్షన్ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. అక్టోబర్ 11న దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా.. సినిమాలో భారీ యాక్షన్‌తో కూడిన స్టంట్స్ కూడా ఆలియా భట్ చేశారు. తన తమ్ముడిని రక్షించుకునేందుకు ఆమె చేసిన సాహసం ఎలాంటిదో ఈ చిత్రంలో దర్శకుడు చూపించారు. ఇప్పటికే విడుదలైన హిందీ ట్రైలర్‌పై చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. The #Jigra trailer looks absolutely amazing… taking you on an emotional rollercoaster! Best wishes to Alia and the entire team for a blockbuster release on October 11th! ❤️🔥Here's the Telugu trailer!https://t.co/a5AabB24uZ#JigraTelugu #KaranJohar @apoorvamehta18 @aliaa08… pic.twitter.com/oXeWCs4U7V— Ram Charan (@AlwaysRamCharan) September 29, 2024 -
అలియా భట్ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ప్రముఖ నిర్మాత
బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నటించిన జిగ్రా సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. ఈమేరకు తాజాగా ప్రకటన వెలువడింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వాసన్ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షహీన్ భట్, సౌమెన్ మిశ్రాతో పాటు ఆలియా భట్ కూడా పెట్టుబడులు పెట్టారు.జిగ్రా ట్రైలర్‌కు మంచి ఆధరణ రావడంతో తెలుగు నిర్మాతలు కూడా ఈ సినిమాపై మక్కువ చూపారని తెలుస్తోంది. ఈ క్రమంలో జిగ్రా తెలుగు వర్షన్ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. అక్టోబర్ 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వారు విడుదల చేయనున్నారు. టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న దగ్గుబాటి సురేశ్, సునీల్ నారంగ్‌లకు చెందిన సంస్థ నుంచి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తుండడంతో మూవీపై ఆసక్తి పెరిగింది. నేడు సెప్టెంబర్ 29న తెలుగు ట్రైలర్ విడుదల కానుంది.జిగ్రా సినిమాలో భారీ యాక్షన్‌తో కూడిన స్టంట్స్ కూడా ఆలియా భట్ చేశారు. తన తమ్ముడిని రక్షించుకునేందుకు ఆమే చేసిన సాహసం ఎలాంటిదో ఈ చిత్రంలో దర్శకుడు చూపించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌పై చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. -
Jigra Trailer: యాక్షన్‌తో అదరగొట్టిన ఆలియా
ఆలియా భట్ ప్రధాన పాత్రధారిగా, వేదంగ్ రైనా మరో కీలక పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘జిగ్రా’. ‘మౌనిక ఓ మై డార్లింగ్, పెడ్లర్స్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వాసన్ బాల ‘జిగ్రా’ చిత్రాన్ని తెరకెక్కించారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సత్యా ఆనంద్ పాత్రలో ఆలియా భట్, అంకుర్ ఆనంద్ పాత్రలో వేదంగ్ రైనా నటించారు. మరణ శిక్ష విధించబడి, జైల్లో మూడు నెలల్లో మరణించనున్న తన తమ్ముణ్ణి ఓ అక్క ఏ విధంగా కాపాడుకుంది? అనే కోణంలో ‘జిగ్రా’ కథ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘నన్ను నేను ఓ ఎథికల్ పర్సన్‌గా ఎప్పుడూ అనుకోలేదు. అంకుర్‌కి సిస్టర్‌గానే అనుకున్నాను, లోపల ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా?, అంత ధైర్యం ఎవరికి ఉంది? నువ్వు నా సిస్టర్‌గా ఉన్నప్పుడు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ట్రైలర్లో ఆలియా యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. -
'జిగ్రా' ట్రైలర్.. రూమర్ బాయ్‌ఫ్రెండ్‌పై అక్కాచెల్లెళ్ల ప్రశంసలు
బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నటించిన జిగ్రా సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు. వాస్తవంగా ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కావాల్సింది. అయితే, అదే రోజు ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల కానున్నడంతో జిగ్రా సినిమా రిలిజ్ను రెండు వారాల పాటు వాయిదా వేశారు. దీంతో అక్టోబర్ 11న జిగ్రా విడుదల కానుంది.తమ్ముడు కోసం అక్క చేసే పోరాట కథనంతో ‘జిగ్రా’ సినిమా ఉండనుంది. మహిళా ప్రాధాన్యతను తెలిపేలా ఈ ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తమ్ముడు ఒక ప్రమాదంలో చిక్కుకుంటే తన అక్క చేసే పోరాటం ఏ రేంజ్లో ఉంటుందో చిత్ర దర్శకుడు సినిమా రూపంలో చూపించాడు.ట్రైలర్‌పై ఖుషి కపూర్ కామెంట్అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ జిగ్రా ట్రైలర్ గురించి కామెంట్ చేసింది. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన నటుడు వేదాంగ్ రైనాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రైలర్‌ను పంచుకుంది. హార్ట్ సింబల్‌తో పాటు ఎమోషనల్ ఫేస్ ఎమోజీలను కూడా ఖుషి కపూర్ షేర్ చేసింది.జాన్వీ కపూర్ కూడా జిగ్రా ట్రైలర్‌పై పోస్ట్ చేశారు. ఇందులో వేదాంగ్ నటన చూసి తాను చాలా ఎమోషనల్ అయినట్లు పంచుకుంది. తన హృదయం కూడా బరువెక్కిందని పేర్కొంది. ట్రైలర్‌కే తాను ఇలా అయితే, సినిమా చూసిన తర్వాత తాను ఏవిధంగా ఫీలవుతానో అర్థంకావడం లేదంటూ రాసుకొచ్చింది. లేడీ బచ్చన్ అలియాభట్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని తెలిపిందని జాన్వీ పేర్కొంది. -
ఆలియా కూతురి విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక!
ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. రీసెంట్గా అమెరికా వెళ్లాడు. అక్కడే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొనడంతో పాటు ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ కూడా చూస్తాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఆలియా భట్ కూతురి గురించి తారక్ అనుకున్న ఓ విషయం బయటపడింది.'దేవర'ని బాలీవుడ్లో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరణ్.. ఆలియా-ఎన్టీఆర్‌ని కలిపి ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అయితే ఆలియా చెప్పిన విషయం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.(ఇదీ చదవండి: అత్యాచార కేసులో ప్రముఖ నటుడికి అరెస్ట్ వారెంట్)'బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వస్తే.. రాత్రి మా ఇంట్లోనే డిన్నర్ చేయాలని తారక్ చెప్పాడు. దీంతో అతడి ఇంటికి వెళ్లాం. ఆ రోజు సాయంత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటికే నాకు 9వ నెల. దీంతో పుట్టబోయే బిడ్డకి పేరు ఏం పెట్టాలా అని డిస్కస్ చేసుకున్నాం. అబ్బాయి పుడితే ఇది, అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టాలని రణ్‌బీర్ చెప్పాడు' అని ఆలియా అప్పటి విషయాన్ని గుర్తుచేసుకోగా.. తారక్ మాట్లాడుతూ.. 'రాహ పేరు పెట్టాలని నేను కోరుకున్నా. అది కాస్త నిజమైంది' అని నవ్వేశాడు.అంటే ఆలియా భట్ కూతురికి పేరు పెట్టే విషయంలో ఎన్టీఆర్ కోరిక నెరవేరిందనమాట. ఇదలా ఉండితే 'దేవర'.. ఈ శుక్రవారం (సెప్టెంబరు 27న) థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ తెరవగా.. పెట్టిన నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ తొలిరోజు వసూళ్లలో రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ అనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
Paris Fashion Week 2024: ఐశ్వర్య కిల్లింగ్ లుక్స్, తొలిసారి అలియా అదుర్స్
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పారిస్ ఫ్యాషన్ వీక్ 2024లో అందంగా మెరిసిపోయింది. ఆమె లేని ర్యాంప్‌వాక్ ఊహించలేం అన్నట్టుగా ఎర్రని దుస్తుల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. గత కొన్నేళ్లుగా లోరియల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఐష్ గ్రాండ్ ఫ్యాషన్ గాలాలో ఎప్పటిలాగానే తన లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. తనదైన స్టయిల్లో ఫ్లయింగ్ కిస్, నమస్తేతో ర్యాంప్ వాక్ అదుర్స్ అనిపించింది. View this post on Instagram A post shared by L'Oréal Paris Official (@lorealparis) పారిస్‌లోని పలైస్ గార్నియర్ ఒపెరా హౌస్‌లో ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఉమెన్ రెడీ-టు-వేర్ స్ప్రింగ్-సమ్మర్ 2025 సేకరణలో భాగంగా లోరియల్ పారిస్ షో "వాక్ యువర్ వర్త్" పేరుతో అందాల రాణులు, సెలబ్రిటీలు సందడి చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ కూడా ర్యాంప్ వ్యాక్ చేశారు. ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్‌లో అలియా మెరవడం ఇదే తొలిసారి. -
పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పెళ్లి అయిన ఇన్నాళ్లకి తన ఇంటి పేరును మార్చుకుంది. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో వివాహం తర్వాత తన ఇంటిపేరును మార్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఇటీవల అలియా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. జిగ్రా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె తన పేరు పక్కన ‘కపూర్’ను చేర్చుకున్నట్లు తెలిపింది. అంతేకాదు జిగ్రా టైటిల్స్ లో కూడా తన పేరు అలానే ఉంటుందని గందరగోళం వద్దని కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రమోషన్స్ భాగంగా శనివారం ‘‘గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్-2’’ లో జిగ్రా టీమ్‌తో పాల్గొంది. ఈ సమయంలో ఒక అభిమాని హాయ్ అలియా భట్ అని సంబోధించగా, ‘‘నేనిపుడు అలియా భట్ కపూర్ అంటూ స్పందించింది అలియా దీంతో అభిమానులలో ఆనందం , ఆశ్చర్యం రెండింటినీ రేకెత్తించింది. మన భారత దేశంలో ప్రాంతాలను బట్టి, వివాహం జరిగిన తరువాత భార్యకు భర్త ఇంటి పేరు వర్తిస్తుంది. ఇంటి పేరు మార్చుకోవాలా? వద్దా? అనేది ఇది వారి వారి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)కాగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత 2022లో బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గంగూబాయి కతియావాడి, బ్రహ్మాస్త్రం, సడక్-2 లాంటి టాప్ మూవీలతోపాటు తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకుంది. రణ్‌బీర్, అలియాకు రాహా అనే కూతురు ఉంది. వాసన్ బాలా దర్శకత్వంలో అలియా నటించిన లేటెస్ట్ మూవీ జిగ్రా అక్టోబర్ 11న థియేటర్స్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి! -
అక్కా తమ్ముడి కథతో ఆలియా భట్ 'జిగ్రా'
ఆలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఈమెకు తెలుగులోనూ బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇందుకు తగ్గట్లే రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'లోనూ యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్, చరణ్ కొత్త సినిమాల్లో హీరోయిన్ అంటూ రూమర్స్ వచ్చాయి. సరే ఇవన్నీ పక్కనబెడితే 'జిగ్రా' అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ఆలియా చేసింది. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆలియా యాక్షన్ సీన్స్ గట్టిగానే చేసినట్లుంది.(ఇదీ చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)ట్రైలర్ విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలైన అక్కా తమ్ముడు. ఒకరంటే ఒకరికి ప్రాణం. బంధువుల దగ్గర పెరుగుతారు. పెద్దయిన తర్వాత తమ్ముడు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుని జైలుకెళ్తాడు. అక్కకేమో తమ్మడంటే పంచ ప్రాణాలు. కానీ అతడిని ఉరి తీయడానికి పోలీసులు సిద్ధమవుతారు. మరి చివరకు అక్కాతమ్ముడు కలిశారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం జనాలు ఆదరిస్తున్నారు. ఆలియా భట్ 'జిగ్రా' ట్రైలర్ చూస్తే హిట్ కళ కనిపిస్తుంది. లెక్క ప్రకారం 'దేవర'తో పాటే రిలీజ్ కావాలి. కానీ రెండు వారాలు వెనక్కి జరిగి అక్టోబరు 11న థియేటర్లలోకి రానుంది. హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మరి ఆలియా 'జిగ్రా'తో ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్) -
షూటింగ్ ప్రారంభానికి ముందే రిలీజ్ డేట్.. చివరికి వాయిదా!
ఈ మధ్య కొన్ని పెద్ద సినిమాలు ప్రకటన రోజే రిలీజ్ డేట్‌ని వెల్లడిస్తున్నాయి. తీరా షూటింగ్ అయ్యేసరికి విడుదలను వాయిదా వేస్తున్నారు. తాజాగా అలా వాయిదా పడిన చిత్రమే ‘లవ్ అండ్ వార్’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లీడ్ రోల్స్‌లో నటించనున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘లవ్ అండ్ వార్’ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించి, 2025 క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. (చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆలియా భట్‌తో సినిమా!)ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. కానీ ‘లవ్ అండ్ వార్’ రిలీజ్‌ను మాత్రం వాయిదా వేశారు. 2026 మార్చి 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఇదో పీరియాడికల్ ఫిల్మ్ అని, ముక్కోణపు ప్రేమకథగా ఉంటుందని సమాచారం. అలాగే వివాహం తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించనున్న చిత్రం కావడంతో ‘లవ్ అండ్ వార్’ పై అంచనాలు ఉన్నాయి. -
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆలియా భట్‌తో సినిమా!
హీరోయిన్ ఆలియా భట్, నటుడు–గాయకుడు–నిర్మాత దిల్జీత్ సింగ్ ఎనిమిదేళ్ల తర్వాత కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో వేదంగ్ రైనా మరో లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వంలో కరణ్ జోహార్, ఆలియా భట్, అపూర్వ మెహతా, షాహీన్ భట్, సౌమెన్ మిశ్రా నిర్మిస్తున్నారు. (చదవండి: పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. హాజరైన సీఎం!)ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 11న విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు దిల్జీత్ సింగ్ వర్క్ చేస్తున్నట్లుగా ఇన్‌స్టా వేదికగా ఆలియా భట్ పేర్కొన్నారు. అయితే దిల్జీత్ సింగ్ ఓ పాట పాడనున్నారా లేక పాటతో పాటు గెస్ట్ రోల్ కూడా చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక 2016లో వచ్చిన ‘ఉడ్తా పంజాబ్’ సినిమాలో ఆలియా భట్, దిల్జీత్ సింగ్ లీడ్ రోల్స్‌లో నటించగా, షాహిద్ కపూర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఆలియా భట్ లేటేస్ట్ మూవీ.. టీజర్ వచ్చేసింది!
బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జిగ్రా. ఈ సినిమాకు వాసన్ బాలా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్18 స్టూడియోస్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు.ఈ మూవీ నిర్మాతల్లో ఆలియా భట్ ఒకరిగా ఉన్నారు. అలియా భట్ తొలిసారిగా 2022లో డార్లింగ్స్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆమె తన ప్రొడక్షన్ హౌస్ ఎటర్నల్ సన్‌షైన్ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం అక్టోబర్ 11 దసరాకు విడుదల కానుంది. మొదట ఈ మూవీని ఈనెల 27న రిలీజ్ చేయాలని భావించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ విడుదల ఉండడంతో నిర్మాతలు వాయిదా వేయాలని నిర్ణయించారు. దీంతో విజయదశమికి జిగ్రా థియేటర్లలో సందడి చేయనుంది. -
అలియా-రణబీర్ ఇష్టపడే వంటకాలివే..!
బాలీవుడ్ బ్యూటిఫుల్ స్టార్ జంట అలియా రణబీర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఏ ఈవెంట్లో సందడి చేసిన ఫోటోగ్రాఫర్లకు తమ కెమెరాలని క్లిక్‌మనిపించకుండా ఉండరు. అలాగే ఆ వేడుకలు కూడా మరింత అందంగా కోలహాలంగా మారిపోతుంది. అంతలా ఈ జంట వేడుకల్లో ఎంజాయ్ చేస్తూ..కొత్త సందడిని తీసుకొస్తారు. వీరిద్దరూ తమ గ్లామర్, అభినయంతో వేలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే డైట్ పరంగా ఇద్దరు చాలా స్ట్రిట్. ఇరువురు ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. అయితే ఈ అందమైన జంట ఇష్టంగా వంటకాల గురించి వారి వ్యక్తిగత చెఫ్ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీ జంట వ్యక్తిగత చెప్ సూర్యన్ష్ సింగ్ కున్వర్ అలియా-రణబీర్‌లు ఇష్టమైన వంటకాల గురించి ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. వీడియోలో వాళ్లు కూడా మనలాగానే దోస, ఆమ్లెట్, గుడ్డు అప్పం, హమ్ముస్, మీట్ బాల్స్, స్పెఘెట్టి, ఫ్రైడ్ రైస్, సిన్నమోన్ టోస్ట్, కొబ్బరి చట్నీ, తదితరాలనే ఇష్టంగా తింటారని వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. వీరిద్దరు రుచికరంగా ఉండే పోషకాహారానికి ప్రాధ్యాన్యత ఇస్తారని తెలిపాడు. అంతేగాదు అలియా, రణబీర్ గ్రిల్డ్ సాల్మన్, డ్రైఫూట్స్‌తో నింపిన సూప్, బ్లాక్ బీన్ సాస్ తోకూడిన టోపు, టోర్టెల్లిని పాస్తా, కలమారి, కుడుములు, ఖీర్, కస్టర్డ్ వంటి ఆకర్ణణీయమెన డెజర్ట్ ఇష్టంగా తింటారని చెప్పారు. అంతేగాదు గత కొద్ది రోజులగా తాను వాళ్ల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తున్నట్లు తెలిపాడు. ఈ అందమైన జంట కోసం వడంటం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ వంటకాలను ఆహారప్రియులు కూడా తమ మెనూలో చేర్చుకోవచ్చనేలా ఉన్నాయి ఆ రెసిపీలు. కాగా, అలియా భట్ రణబీర్ కపూర్లు తమ డైట్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటారు. షూటింగ్, సినిమాల మధ్య కూడా, రణబీర్ తన డైట్ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. View this post on Instagram A post shared by Suryansh Singh Kanwar (@suryansh.singh.kanwar) (చదవండి: స్ట్రీట్ ఫుడ్ విక్రేతగా పీహెచ్డీ విద్యార్థి..నెటిజన్లు ఫిదా!) -
ఏం చేస్తున్నారో అర్థమవుతోందా? మండిపడ్డ ఆలియా భట్
బాలీవుడ్లో పాపరాజి కల్చర్ ఎక్కువగా ఉంటుంది. సెలబబ్రిటీలు గడప దాటి అడుగు బయటపెడ్తే చాలు వాళ్ల వెనకాలే కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు నీడలా ఫాలో అయిపోతుంటారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అన్నీ ఆరా తీస్తారు. అన్నింటినీ కెమెరాల్లో బంధిస్తుంటారు. వారికంటూ పర్సనల్ స్పేస్ ఇవ్వరు. కొన్నిసార్లు ఇది మితిమీరిపోతూ ఉంటుంది.రావొద్దని వారిస్తున్నా..తాజాగా అదే జరిగింది. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కారు దిగి తన అపార్ట్మెంట్లోకి వెళ్తుంటే .. ఆలియా మేడం, ఒక్క నిమిషం.. అంటూ ఫోటోల కోసం అర్థించారు. ఆ అభ్యర్థనను పట్టించుకోకుండా ఆమె తన బిల్డింగ్‌లోకి వెళ్లిపోయింది. అది ప్రైవేట్ బిల్డింగ్, ఎవరూ రాకూడదు అని ఆలియా టీమ్ సభ్యులు చెప్తున్నా వినిపించుకోకుండా కొందరు ఫోటోగ్రాఫర్లు వెనకాలే వెళ్లారు. మండిపడ్డ ఆలియాఅది చూసిన ఆలియాకు చిర్రెత్తిపోయింది. ఏం చేస్తున్నారో తెలుస్తోందా? ఇది ప్రైవేట్ భవంతి.. అని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోటోగ్రాఫర్లు ఆలియా వెంటపడటం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో ఏకంగా ఆమె ఇంట్లో ఉన్న ఫోటోలను సైతం దొంగచాటుగా తీసి నెట్టింట వదిలారు. అప్పుడు కూడా ఆలియా చాలా సీరియస్ అయింది.గతంలోనూ ఇలాగే..పక్క బిల్డింగ్ టెర్రస్‌మీద నుంచి ఇద్దరు నన్ను ఫోటోలు తీశారు. ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నామా? ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుంది. కాని దాన్ని కూడా చెరిపేస్తున్నారు. అని ఆగ్రహించింది. ఇకపోతే ఆలియా భట్ ప్రస్తుతం జిగ్రా అనే సినిమా చేస్తోంది. ఈ మూవీ వచ్చే నెల విడుదల కానుంది. View this post on Instagram A post shared by Mixes Singh (@mi_xes1234) చదవండి: ఓటీటీలో 'మిస్టర్ బచ్చన్' స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన -
అక్టోబరులో ఆరంభం
అక్టోబరులో లవ్ అండ్ వార్ అంటున్నారట రణ్‌బీర్ కపూర్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటించనున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ చిత్రీకరణ ప్రారంభం కాలేదు. అయితే ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను సెప్టెంబరు లోపు పూర్తి చేసి, అక్టోబరు మొదటి వారంలో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట భన్సాలీ.ముందుగా అక్టోబరులో రణ్‌బీర్ కపూర్ సోలో సీన్స్‌తో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుందట. ఆ తర్వాత రణ్‌బీర్ – విక్కీ కౌశల్‌ల కాంబినేషన్లోని ఫ్రెండ్షిప్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ – ఆలియా – విక్కీ కౌశల్ కాంబినేషన్లోని సన్నివేశాలను షూట్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ సమాచారం. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ‘లవ్ అండ్ వార్’ని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా 2025 క్రిస్మస్కి రిలీజ్ కానుంది. -
బిడ్డకు తల్లయినా అంతే గ్లామర్‌గా ఆలియా! ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి ఆలియా భట్ ఎంత గ్లామరస్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా అంతే అందం, పిట్‌నెస్‌తో తీగలా ఉంది. ఆమె తన అందం, నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. నిజానికి అమ్మగా మారే తరుణంలో స్త్రీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో అందరికీ తెలిసిందే. అంత ఈజీగా సాధారణ స్థితికి రావడం కుదరదు. అలాంటిది ఆలియా మాత్రం అంతకుముందు ఎలా ఉందో అలానే ఉండటమే గాక మరింత అందంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆమె అంతలా బాడీ ఫిట్‌గా ఉండేందుకు ఏం చేస్తుందంటే..ఆలియా శరీరం ఆకట్టుకునేలా ఉండేందుకు ర్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, పైలేట్స్ వంటి వర్కౌట్స్ చేస్తుంది. అలియా తన ఫిట్నెస్ రొటీన్లో కార్డియో కచ్చితంగా ఉంటుంది. ఈ వర్కౌట్తోనే ఆరునెల్లలోనే తన తొలి చిత్రం "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" కోసం ఏకంగా 20 కిలోలు తగ్గింది. అప్పటి నుంచే హృదయ ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిచ్చేలా బరువు తగ్గించే ఈ కార్డియో వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా కనీసం 30 నిమిషాలు చేయగలిగితే ఫిట్‌గానే గాక ఆరోగ్యంగా ఉండగలుగుతారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఆలియా వర్కౌట్ రొటీన్లో మరొక అంశం. ఇటీవల, ఆమె ఒక బార్‌బెల్‌తో బరువున్న హిప్ థ్రస్ట్‌లను ప్రదర్శించే వీడియోను షేర్ చేసింది. ఇది మన శరీరాకృతిని అందంగా కనిపించేలా చేసే మంచి వ్యాయామం. పైగా ఇది కండరాలు, వీపుకి సంబంధించిన సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది.అలాగే ఆలియా ఫిట్‌నెస్‌లో పైలేట్స్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మొత్తం శరీర అమరిక, కండరాల స్థాయిని మెరుగుపరచడానికి పైలేట్స్ ఒక అద్భుతమైన మార్గం.మన మనస్సు, శరీరాన్ని అనుసంధానించడానికి యోగా చక్కగా పనిచేస్తుంది. ఇది శారీరక ఆరోగ్యం తోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇది విశ్రాంతిని, ఒత్తిడిని అందించి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇక్కడ ఆలియా చేసే వ్యాయామాలన్ని దైనందిన జీవితానికి అవసరమయ్యే రిలాక్సేషన్ టెక్నీక్లను ఏకీకృతం చేసేవే గాక, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.ఇవన్నీ పాటించాలంటే..ఆలియా భట్ మాదిరిగానే ఫిట్నెస్ స్థాయిని సాధించడానికి, స్థిరత్వం, వైవిధ్యం కీలకం. మన దినచర్యను సమతుల్యంగా, ఆసక్తికరంగా ఉంచడానికి కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వంటి వ్యాయామాలు చేయాలి. అనింటి కంటే ముఖ్యం క్రమం తప్పకుండా చేయడం. అలాగే వారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ లేదా 75 నిమిషాల తీవ్రమైన యాక్టివిటీని లక్ష్యంగా పెట్టుకోవాలి.శరీరం సంకేతాలపై శ్రద్ధ వహించి, అధిక శ్రమను నివారించండి. View this post on Instagram A post shared by alia💓shukria (@aliabhatt_love28) (చదవండి: అమెరికన్ గాయకుడికి టైప్ 1.5 డయాబెటీస్: ఎలా గుర్తిస్తారంటే..?) -
ఆలియా పెద్ద గొంతుతో అరిచేది.. పెళ్లయ్యాక..: రణ్‌బీర్
ఆలియా భట్‌ది పెద్ద గొంతు.. పెళ్లికి ముందు వరకు ఎలా ఉన్నా తర్వాత మాత్రం తన కోసం టోన్ మార్చుకుంది అంటున్నాడు స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్. తాజాగా రణ్‌బీర్.. యూట్యూబర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'మా నాన్న గొంతుకు నేను భయపడేవాడిని. చిన్నప్పుడు ఆయన గట్టిగా మాట్లాడితే వణికిపోయేవాడిని. నా భార్య ఆలియా స్వరం కూడా పెద్దదే! నేను కూడా అలా చేయాల్సిందికానీ నాకోసం దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించింది. 30 ఏళ్లుగా ఉన్న టోన్‌ను మార్చుకోవాలంటే అంత ఈజీ కాదు. రాహా(కూతురు) కిందపడగానే వెంటనే రియాక్ట్ అయిపోతుంది. కానీ నా మనసు ఎక్కడా బాధపడకుండా చెప్తోంది. ఎల్లప్పుడూ నన్ను ప్రశాంతంగా ఉంచాలనే ట్రై చేస్తోంది. నేను కూడా ఆమెను ప్రశాంతంగా ఉంచితే బాగుండేది. కానీ అందుకోసం పెద్దగా కృషి చేయడం లేదనుకుంటా!తనతో కలిసుండటం ఇష్టంఆలియా నా జీవితంలో చాలా స్పెషల్. తనపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఎప్పుడూ నన్ను నవ్విస్తూ ఉంటుంది. తనతో కలిసి హాలీడేకు వెళ్లడమన్నా, కలిసి ఇంటికి వెళ్లడమన్నా ఇష్టం. ఆమె చాలా తెలివైనది. పని పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తుంది' అని తెలిపాడు. కాగా రణ్‌బీర్- ఆలియా.. కొంతకాలం డేటింగ్ తర్వాత 2022లో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. గతేడాది వీరికి రాహా అనే కూతురు పుట్టింది. వీళ్లిద్దరూ ప్రస్తుతం లవ్ అండ్ వార్ అనే సినిమాలో నటిస్తున్నారు.చదవండి: చిన్న పిల్లలతో లిప్ కిస్‌లా.. యాంకర్‌పై చిన్మయి ఫైర్! -
కృతి శెట్టి స్టైలిష్.. షాలినీ పాండే బ్లాక్ బస్టర్.. అలియా కూల్ లుక్
పెళ్లి ఫోటోలు అభిమానులతో పంచుకున్న వరలక్ష్మీ శరత్కుమార్స్టన్నింగ్ ఫోజులు ఇచ్చిన షాలినీ పాండేమీలోని అంతర్గత బలాన్ని స్వీకరించాలని కోరుతున్న కృతి శెట్టియాడ్ షూట్ కోసం బ్లాక్ డ్రెస్‌లో దుమ్మురేపిన అనన్య నాగళ్ల'పసుపు' ఇష్టమైన రంగు అంటూ ఇలా వివరణ ఇచ్చిన రష్మిక 'సూర్యరశ్మి, సన్ ఫ్లవర్స్, చిరునవ్వులు, ఆనందం వంటి దయ, సంతోషకరమైన అన్ని విషయాలను పసుపు రంగు సూచిస్తుంది.' View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ruhii Siingh (@ruhisingh12) -
ఆలియా లుక్ చూశారా? వావ్ అనాల్సిందే! (ఫోటోలు)
-
అనంత్ అంబానీతో స్టెప్పులేసిన బాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకలు ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన సంగీత్ ఫంక్షన్‌కు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ సంగీత్‌లో అంబానీ ఫ్యామిలీ డ్యాన్స్ చేయడం అన్నింటికన్నా హైలైట్‌గా నిలిచింది. సినిమా తారలు తగ్గేదేలే అంటూ స్టేజీని రఫ్ఫాడించారు.బాలీవుడ్ జంట ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా వారితో కలిసి స్టెప్పులేశాడు. అటు సల్మాన్ ఖాన్, అనంత్‌తో కలిసి హిందీ పాటకు చిందేశాడు. లవ్ బర్డ్స్ జాన్వీ కపూర్-శిఖర్ పహారియా, మానుషి చిల్లర్, వీర్ పహారియా కలిసి డ్యాన్స్ చేశారు. పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తన గాత్రంతో అదరగొట్టాడు. బేబీ, పీచెస్, లవ్ యువర్సెల్ఫ్ వంటి సాంగ్స్ ఆలపించాడు.ఈ ఫంక్షన్‌కు విక్కీ కౌశల్, మాధురి దీక్షిత్, అనన్య పాండే, సల్మాన్ ఖాన్, జెనీలియా దేశ్‌ముఖ్, రితేశ్ దేశ్‌ముఖ్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు హాజరయ్యారు. ఇకపోతే అనంత్ అంబానీ పెళ్లి జూలై 12న ముంబైలో ఘనంగా జరగనుంది. జూలై 14న రిసెప్షన్ జరగనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) Ranbir and Alia dancing along with Akash and shloka Ambani on “Show me the thumka” 🔥#RanbirKapoor #AliaBhatt pic.twitter.com/MiJsXO5cxI— ritika ❤️🔥 | L&W ERA (@ritikatweetssx) July 6, 2024 చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్ -
పఠాన్, టైగర్ టీమ్ లోకి ఆలియా భట్.
-
భర్తతో హీరోయిన్ ఆలియా భట్ క్యూట్ (ఫొటోలు)
-
పిల్లల్ని ప్రేమించేవారు.. కథలనూ ప్రేమిస్తారు
బాల్యంలో తమకు ఇష్టమైనవి తమ పిల్లలకు దక్కాలనుకుంటారు తల్లిదండ్రులు. నటి ఆలియా భట్ తన తాతగారి నుంచి చాలా కథలు వినేది. కుమార్తె పుట్టాక ఆ పాపకు కథలు చెప్పాలనిపించింది. తన పాపకే ఏమిటి అందరు పిల్లలకూ కథలు చెప్తానని ఏకంగా కథల పుస్తకం రాసింది. ‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’ దాని పేరు. సాహస బాలిక తన శునకంతో ఎన్ని అద్భుతాలు చేసిందనేదే కథ. పిల్లలకు అవసరమైన కథా ప్రపంచం గురించి ఆలియా మాటలు.....‘ఒకమ్మాయికి ప్రకృతితో మాట్లాడే శక్తి వస్తే? చెట్లతో పుట్లతో పిట్టలతో జంతువులతో మాట్లాడే శక్తీ వాటి మాటలను అర్థం చేసుకునే శక్తి వస్తే? వాటి సమస్యలు తెలుసుకొని భూమిని, పర్యావరణాన్ని కాపాడాలని అనుకుంటే ఎంత బాగుంటుంది. అదే నా తొలి పుస్తకం కథ’ అని చెప్పింది నటి ఆలియా భట్. ఆమె రాసిన మొదటి పుస్తకం ‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’... పెంగ్విన్ సంస్థ ఉప విభాగం పఫిన్ ద్వారా మార్కెట్లో విడుదలైంది. బాలీవుడ్లో సూపర్‌స్టార్ అయిన ఆలియా భట్ తనకు కూతురు పుట్టాక ఈ పుస్తకాన్ని విడుదల చేయడం వల్ల పిల్లల పుస్తకాల అవసరం, వాటి ఉద్దేశ్యం గురించి నేడు మళ్లీ బాలల సాహిత్య ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు.కరుణ, పర్యావరణ ప్రేమ‘పిల్లల పుస్తకాలు పిల్లల్లో కరుణని పెంచాలి. పర్యావరణ స్పృహను కలిగించాలి. పిల్లలకు తన ఇంటి బయట ఉండే ప్రకృతి పరిసరాలు, దూరాన కొండల్లో ఉండే పక్షులు, పులులు, ఏనుగులు... ఇవి ఎంతో ఇష్టం. వాటిని పాత్రలుగా చేసుకుని కథలు చెప్తే వారు వింటారు’ అంటుంది ఆలియా. వివేక్ కామత్, తన సోదరి షబ్నమ్ మిన్వాలాల సహాయంతో ఆలియా ‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’ పుస్తకం రాసింది. ఇందులో చిన్నారి అమ్మాయి పేరును ఆలియా అనే పెట్టింది. మరో ముఖ్యపాత్రైన కుక్కపిల్లకు ‘ఎడ్’ అనే పేరు పెట్టింది. ఇది ఆలియాకు ఉన్న మూడు పిల్లుల్లో ఒకదాని పేరు ఎడ్వర్డ్ నుంచి తీసుకుంది. ‘ఎవరూ పట్టించుకోకుండా వదిలేయడంతో దిక్కుతోచక తిరుగుతున్న కుక్కపిల్లను ఆలియా అనే చిన్నారి చేరదీస్తుంది. వీరితోపాటు ఒక మాట్లాడే కాకి, మాట్లాడే కొబ్బరి చెట్టు ఈ కథలో పాత్రలుగా ఉంటాయి. మొదటి భాగంలో వీరంతా పరిచయం అవుతారు. తర్వాతి భాగాల్లో భూమి కాపాడే సాహసాలు ఉంటాయి. ఆలియా, ఎడ్లను ప్రధాన పాత్రలుగా చేసుకుని వరుసగా కథల పుస్తకాలు తెస్తాను. వీటిని యానిమేషన్ సిరీస్‌గా కూడా వెలువరిస్తాను. నా మొదటి పుస్తకం కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పేపర్ మీదే అచ్చయ్యింది’ అని తెలియచేసింది ఆలియా.పిల్లలకు కథలు అవసరం‘నా చిన్నప్పుడు మా తాత (తల్లి సోనీ రాజ్దాన్ తండ్రి నరేంద్రనాథ్ రాజ్దాన్) నాకు చాలా కథలు చెప్పేవారు. ముఖ్యంగా చున్ను, మున్ను, గున్ను అనే మూడు పాత్రలతో ఆయన చెప్పే కథలు నాకు భలే నచ్చేవి. ఆ మూడు పాత్రలు మనుషులో చీమలో ఎలుకలో కూడా తెలియదు. ఇక మా అక్క షాహీన్ పుస్తకాల పురుగు. నాకు కథలు చదివి వినిపించేది. మా అమ్మాయి రాహా పుట్టాక పిల్లల కథల గురించి మళ్లీ ఆలోచన వచ్చింది. ఇప్పుడు దానికి 19 నెలలు. రోజూ నేను దానికి నిద్రపోయే ముందు కనీసం మూడు కథల పుస్తకాలు చదివి వినిపిస్తాను. రకరకాల గొంతులతో పాత్రలను చదువుతాను. చాలా ఆసక్తిగా వింటుంది. తర్వాత ఆ పుస్తకాలను కౌగిలించుకుని నిద్రపోతుంది. నా పుస్తకంలోని కథ కూడా వినిపించాను. అయితే కథ కంటే కూడా దానికి పుస్తకంలోని బొమ్మలు బాగా నచ్చాయి’ అని నవ్వింది ఆలియా.పుస్తకాలు, బొమ్మలు‘పిల్లల పుస్తకాలే కాదు పిల్లల బొమ్మలు కూడా బోధనాత్మకంగా ఉండాలి. బొమ్మలు విజ్ఞానం పంచేలా ఉండాలి. అలాగే పర్యావరణహితంగా తయారవ్వాలి. ఇలాంటి పనులన్నింటిలో నేను నిమగ్నం కావాలని కోరుకుంటున్నాను. నేను రచయితను కాను. స్టోరీటెల్లర్ని. మనందరం కథలు రాయలేకపోయినా చెప్పగలం. పిల్లలకు కథలు చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలను కథల ప్రపంచానికి దూరం చేయవద్దు. వారికి ఆ ప్రపంచం చాలా ముఖ్యం’ అంటోంది ఆలియా. -
పిల్లల కోసం నటి ఆలియా భట్ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్ (ఫొటోలు)
-
ఆలియా డ్రీమ్ : సరికొత్తగా మరో ఘనత తన ఖాతాలో
నటిగా, భార్యగా, తల్లిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. గ్లామర్ లుక్, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆలియా తాజాగా రచయిత్రిగా తొలి పుస్తకాన్ని ఆవిష్కరించింది. దివంగత తాతయ్య నరేంద్రనాథ్ రజ్దాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్(‘Ed Finds a Home)'ను ఆదివారం తీసుకొచ్చింది. పిల్లల కోసం స్పెషల్‌గా పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాకు చెందిన పఫిన్ భాగస్వామ్యంతో పిల్లల కథల పుస్తకాన్ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆలియా పిల్లలతో ముచ్చటించింది. అలాగే ఆలియా కుమార్తె రాహాకపూర్ కోసం చిన్నారులు తీసుకొచ్చిన బహుమతులను స్వీకరించింది. ఈ లాంచింగ్‌కు ఆలియా తల్లి సోనీ రజ్దాన్ సోదరి షాహీన్ భట్ హాజరయ్యారు. ముంబైలోని స్టోరీవర్స్ చిల్డ్రన్స్ లిటరరి ఫెస్ట్‌లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తన బాల్యం నుంచీ తన జీవితం కథలు, స్టోరీ టెల్లింగ్ చుట్టూ అల్లుకొని ఉందని, తన బాల్యాన్ని, పిల్లలకోసం వెలికి తీయాలని కలలు కన్నాననీ, ఇది ప్రారంభం మాత్రమే..ఈ బుక్ సిరీస్‌గా ఉండబోతోందని ఆలియా ఇన్‌స్టాలో వెల్లడించింది. ఈ సందర్బంగా ఆలియా బటర్ ఎల్లో ఫ్లోరల్ ప్రింటెడ్ గౌనులో ఆకట్టుకుంది. సీబీ బ్రాండ్‌కు చెందిన లోలిత పేరుతో ఉన్న ఈ ఎల్లో కలర్ పూల గౌను ధర రూ. 17,901 లట. ఇప్పటికే ‘ఎడ్-ఎ-మమ్మా’ పేరుతో కిడ్స్ వేర్ బ్రాండ్‌ను నడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా కరణ్ జోహార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్‌తో కలిసి రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ మూవీలో నటించిన ఆలియా ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే బ్రహ్మాస్త్ర-2లో కూడా కనిపించనుంది. ది ఆర్చీస్ ఫేమ్ వేదాంగ్ రైనాతో కలిసి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'జిగ్రా' ఈ అక్టోబర్‌లో విడుదల కానుంది -
చిన్న వయసులోనే స్టార్డమ్, నేషనల్ అవార్డ్.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈమె స్టార్ హీరోయిన్. టీనేజీలోనే హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ మూవీ హిట్. ఆ తర్వాత అద్భుతమైన నటనతో చాలా మూవీస్‌తో హిట్స్ కొట్టింది. తనకంటూ సెపరేట్ బ్రాండ్ సృష్టించుకుంది. పాన్ ఇండియా లెవల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న బూరె బుగ్గల చిన్నారి పేరు ఆలియా భట్. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో సీతగా నటించి, దక్షిణాదిలోనూ అభిమానుల్ని సొంతం చేసుకుంది. తండ్రి మహేశ్ భట్ ప్రముఖ దర్శకుడు. తల్లిది బ్రిటన్. ఈమె నటి కూడా. ఫ్యామిలీది మూవీ బ్యాక్ గ్రౌండే కాబట్టి 19 ఏళ్లకే 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటిస్తూ హీరోయిన్గా అద్భుతమైన గుర్తింపు సంపాదించింది. 'గంగూబాయ్' సినిమాలో యాక్టింగ్ దెబ్బకు ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. ఇక ఆస్కార్ తెచ్చిపెట్టిన 'ఆర్ఆర్ఆర్'లోనూ చిన్న పాత్రలో కనిపించింది. ఇకపోతే ఫాదర్స్ డే సందర్భంగా తండ్రితో తాను చిన్నప్పుడు ఉన్న ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. ఇందులో ఆలియాని చూసి ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఆలియా ఫ్యామిలీ విషయానికొస్తే.. హీరోయిన్గా ఫామ్‌లో ఉండగానే హీరో రణ్‌బీర్ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు రహ అనే కూతురు కూడా ఉంది. ఇలా ఓ వైపు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో) -
దీపికా పదుకొణె, అలియా భట్ల బ్యూటీ సీక్రెట్ ఇదే..!
సినీ తారలు ఎంతలా గ్లామర్ మెయింటెయిన్ చేస్తారో మనకు తెలిసిందే. మూడు పదుల వయసులో వన్నె తరగని అందం, గ్లామర్ వారి సొంత. ముఖ్యంగా వయసు పైనబడినట్లు కనిపించకుండా యవ్వనపు మేని ఛాయాలా కనిపించేందుకు ఏం చేస్తారో తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటారు అభిమానులు. వారిలా ఉండేలా రకరకలుగా అందానికి సంబంధించిన ప్రయోగాలు చేస్తుంటారు. ఇంతకీ అందాల భామలు బ్యూటీ రహస్యం ఏంటంటే..బాలీవుడ్ అగ్ర తారలు దీపకా పదుకొణె దగ్గర నుంచి అలియా భట్ వరకు అంతా ఐస్ ఫేషియల్‌కి ప్రాధాన్య ఇస్తారు. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందట. ముఖం తాజాగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ముడతలను మాయం చేస్తుందట. ఉబ్బిన కళ్లకు మంచి ఫలితం ఉటుందట. కళ్లు చుట్టూతా ఉన్న ఉబ్బిన భాగ్నాన్ని నార్మల్‌గా మారుస్తుందట. ఇదెలాగంటే..ఏం లేదు ఉదయాన్నే చక్కగా ముఖాన్ని ఫేస్‌వాష్ లేదా సబ్బుతో క్లీన్ చేసుకుని చక్కగా ఫ్రీజ్‌లోని ఐస్ క్యూబ్లతో థెరఫీ చేయించుకుంటారు. ఇది కళ్ల చుట్టు ఉన్న వలయాన్ని, ఉబ్బిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది. క్యూబ్ చేతితో పట్టుకుని ముఖంపై అప్లై చేసుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఐస్నిఒక పల్చటి క్లాత్‌లో చుట్టి ముఖంపై అప్లై చెయ్యొచ్చు. ఈ థెరపీ ముఖంపై రంధ్రాలను దగ్గర చేసి, మృదువుగా మారుస్తుంది. అలాగే ముఖంపై ఉండే మంట, ఇరిటేషన్ల నుంచి కూడా మంచి ఉపశమనం ఇస్తుంది.అలాగే ముఖమంతా రక్తప్రసరణ జరిగి..చర్మానికి సహజమైన మెరుపుని ఇస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్యను నివారిస్తుందిగ్రీన్ టీ, దోసకాయ రసం వంటి వాటిని ఐస్ క్యూబ్లకు జోడించి అప్లై చేస్తే చర్మానికి అవసరమయ్యే యాంటిఆక్సిడెంట్లు అందుతాయి. అబ్బా చలి..చలిగా.. ఉండి ముఖంపై పెట్టేకునేందుకు వామ్మో..! అనిపించేలా ఉన్నా..ఈ కోల్డ్ థెరపీ చర్మ సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. (చదవండి: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్: నీతా అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా..!) -
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ల పెళ్లి ముచ్చట మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని, ప్రీ వెడ్డింగ్ బాష్‌ను ఘనంగా నిర్వహించుకున్న లవ్‌బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఛలో ఇటలీ..ఈ ఏడాది మార్చిలో జామ్‌నగర్‌లో వారి గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల తర్వాత, అనంత్ -రాధిక మర్చంట్ ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు ప్రయాణించే క్రూజ్‌లో మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా మరో ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించుకునేందుకు రడీగా ఉన్నారు. ఈ వేడుక కోసం బాలీవుడ్, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖులు ఇటలీకి పయనమయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీతోపాటు,అనిల్ అంబానీ , కాబోయే వధువు రాధిక తండ్రితో కలిసి వెళ్లారు. ( ఇదీ చదవండి: అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ బాష్ : 800 మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?)అలాగే రాధిక-అనంత్‌కు మంచి స్నేహితులు బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ తన ముద్దుల తనయ రాహాలతో కలిసి బయలుదేరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి, పాపతో కలిసి ఎయిర్ పోర్ట్‌లో దర్శనిచ్చారు. అంతేనా సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ ఇంకా బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. (చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్ : రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా)కాగా అనంత్-రాధిక రెండవ ప్రీ వెడ్డింగ్ బాష్ మే 28వ తేదీనుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్ తీరంలో క్రూయిజ్ షిప్లో జరుగుతందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి, 2365 నాటికల్ మైళ్లు (4380 కిమీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న వేదికకు చేరుకుంటుంది. -
ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
సినిమా ఇండస్ట్రీ వాళ్లను డీప్ ఫేక్ వదలడం లేదు. రష్మిక డీప్ ఫేక్ వీడియో అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ మరోసారి డీప్‌ఫేక్ బాధితురాలిగా మారింది. అలియా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియో మరో నటి వామికా గబ్బికి సంబంధించినదిగా తెలుస్తోంది.గత నెలలో 27న వామిక గబ్బి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎర్రటి చీరను ధరించి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కనిపించింది. తాజాగా ఆ వీడియోలో ఆలియా భట్ ఫేస్‌ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ డీప్‌ఫేక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.కాగా.. అలియా డీప్‌ఫేక్ ముప్పు బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్‌లో ఆమె ఫేస్‌ను మార్ఫ్ చేసిన వీడియో వైరలైంది. అంతుకుముందే రష్మిక మందన్న, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ లాంటి ప్రముఖ తారలు డీప్ ఫేక్ బారిన పడ్డారు. View this post on Instagram A post shared by Unfixface (@unfixface) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) -
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
-
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మెరిసింది. ప్రత్యేకంగా రూపొందించిన శారీలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గతేడాదే తొలిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై కనిపించిన ఆలియా.. ఈ ఏడాదిలో తళుక్కున మెరిసింది. అయితే ఈవెంట్లో ఆలియా ధరించిన శారీపైన బీటౌన్‌లో పెద్ద చర్చ మొదలైంది. తన స్టైలిశ్ లుక్‌తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆలియా ధరించిన శారీ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.ఆలియా భట్ ధరించిన ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్‌కు సరిపోయేలా ఈ గ్రీన్ శారీ.. దానికి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా షోలో ప్రత్యేకంగా నిలిచింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన పూల చీరలో అలియా స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. దీంతో ఆమె రెడ్ కార్పెట్ పైకి రాగానే కెమెరాల కళ్లన్నీ ఆలియావైపై ఉన్నాయి. అయితే ఈ చీర రూపొందించడంలో పెద్ద కథ ఉందనే విషయం బయటకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ఆలియా భట్ మాట్లాడింది. ఆలియా చీర వెనుక కథమెట్ గాలా ఈవెంట్లో ప్రపంచ వేదికపై మనదేశ మూలాలను చాటి చెప్పేందుకు భారతీయత ఉట్టిపడేలా శారీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ శారీ కోసం దాదాపు 1965 గంటలు అంటే దాదాపు 80 రోజులు పట్టిందని డిజైనర్ వెల్లడించారు. ఆలియా చీరను రూపొందించేందుకు 163 మంది హస్తకళాకారులు అవిశ్రాంతంగా పనిచేసినట్లు తెలిపారు. అయితే ఈ చీరను ఇటలీలో తయారు చేయడం విశేషం. ఇందులో పాల్గొన్న కళాకారులను తాను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలియా చెప్పింది. ఆరు గజాల చీరతో ఆకట్టుకోవడమే కాదు.. తన మాటలతోనే ఆలియా అక్కడి వాళ్ల మనసులు గెలుచుకుంది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
మెట్ గాలాలో అలియా చీరపైనే అందరి అటెన్షన్! ఏకంగా 163 మంది..
మెట్ గాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఏటా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో రెండోసారి బాలీవుడ్ భామ అలియా భట్ రెడ్‌కార్పెట్‌పై మెరిసింది. భారతీయ సంస్కృతిని చాటేలా ప్రత్యేకమైన సబ్యసాచీ చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా కెమెరాల అటెన్షన్ ఆమె ధరించిన చీరవైపే దృష్టిసారించాయి. ఈ చీరను గ్లాస్ బీడింగ్, రత్నాలతో చేతి ఎంబ్రాయిడరీతో డిజైన చేశారు. పుదీనా ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ చీరలో అలియా అందర్నీ మిస్మరైజ్ చేసింది. ముఖ్యంగా పొడవాటి కొంగు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.ఎవరు డిజైన్ చేశారంటే..అలియా భట్ కట్టుకున్న ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేశాడు. ఈ ఏడాది మెట్ గాలా 2024 "గార్డెన్ ఆఫ్ టైమ్" అనే థీమ్‌కు సరిపోయేలా భారతీయ సంస్కృతిని చాటేలా అలియా చీరను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ప్రముఖ మ్యాగజైన్ వోగ్ (Vogue)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది. పైగా చీర కంటే గొప్ప డిజైనర్‌వేర్ లేదని తన వేషధారణతో చెప్పకనే చెప్పింది. అంతేగాదు ఈ శారీకి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా ఉండటమే గాక, మొత్తం షోలో ప్రత్యేకంగా నిలిచింది.alia bhatt wearing a custom sabyasachi saree for the met gala 2024 — it is detailed with florals delicately hand embroidered! 💕 pic.twitter.com/zhvM2RdgKV— ☁️ (@softiealiaa) May 7, 2024ఈ చీరను ఏకంగా 163 మంది..అలియా భట్ కట్టుకున్న చీర కొంగు మొత్తం రెడ్ కార్పెట్‌ను కవర్ చేసిందంటే..ఈ చీర ఎంత పెద్దగా ఉందో చెప్పొచ్చు. ఈ ఈవెంట్లో మిగిలిన వాళ్లంతా మోడర్న్ డ్రెస్‌లలో కనిపిస్తే.. అలియా మాత్రం ఇలా చీరలో కళ్లు చెదిరే అందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యాయి. అభిమానులు సైతం అద్భుతంగా ఉన్నావంటూ పోస్టులు పెట్టారు. అయితే ఈ చీర వెనుక ఏకంగా163 మంది చేతి కళాకారుల శ్రమ ఉంది. వాళ్లంతా దాదాపు గంటలు శ్రమించి ఆ చీరను ఇంత అందంగా ఆ వేడకలోని థీమ్‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. దీన్ని ఇటలీలో తయారు చేశారట. ఈ మెగా మెట్ గాలా ఈవెంట్లో ఆరుగజాల అందమైన చీరతో అక్కడున్నవారందరీ మనుసులను గెలుచుకుంది అలియా. you are KIDDING me ALIA BHATT!!!!! pic.twitter.com/UNGe9Wu4Gd— kp (@earthlykisssed) May 7, 2024(చదవండి: సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి! -
మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
-
‘శ్రీ రాముడి’ కోసం రణ్‌బీర్ దిమ్మదిరిగే వర్కవుట్..వైరల్ వీడియో
చాక్లెట్ బాయ్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టి.. నటుడుగా తానేంటో నిరూపించుకున్నాడు హీరో రణ్‌బీర్ కపూర్. ‘యానిమల్ మూవీతో టాలెండెట్ హీరోగా తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. తాజాగా రానున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’ కోసం రణ్‌బీర్ కపూర్ తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. శ్రీరాముడి పాత్ర కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్ పెర్సనల్ ట్రైనర్ నామ్ వర్కౌట్ వీడియోను షేర్ చేశాడు. స్విమ్మింగ్ రన్నింగ్, బైక్ రైడింగ్.. జిమ్ బాల్, కెటిల్‌బెల్స్, జిమ్ రోప్‌లతో వర్క్అవుట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రశాంతంగా గ్రామీణ ప్రాంతంలో ట్రెక్కింగ్, బైక్ రైడింగ్, బరువులు ఎత్తడం లాంటి కీలకమైన ఎక్సర్సైజ్లు చేస్తుండటం గమనార్హం. రణ్‌బీర్ సతీమణి, హీరోయిన్ అలియా భట్, కూతురు రాహా కూడా ఉందంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Training With Nam (@trainingwithnam) ఏ ప్రాతకోసమైనా పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయేలా తీవ్ర కసరత్తులు చేయడం రణబీర్‌కు అలవాటు. అలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత దగ్గర య్యాడు. తాజా ఆయన వర్కవుట్స్ చూసి ఆయనఅంకితభావం అలాంటిది అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంతో రానున్న 'రామాయణం' మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా అలరించ నున్నాడు. గత ఏడాది రికార్డు కలెక్షన్స్ రాబట్టిన యానిమల్ మూవీ కోసం కూడా రణ్‌బీర్ భారీగా కండలు పెండిన సంగతి తెలిసిందే. -
అలియా భట్, మృణాల్ ఠాకూర్ ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కేది ఎవరికి..?
ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దళపతి విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసి, పార్టీని కూడా స్థాపించారు. 2026లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరొక చిత్రం మాత్రమే చేయనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అది ఆయన నటించే 169వ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి పలువురు ప్రముఖ దర్శకుల పేర్లు వినిపించినా, చివరికి హెచ్.వినోద్ పేరు ఖరారైనట్లు టాక్ వైరల్ అవుతోంది. ఈయన ఇంతకు ముందు ఖాకీ, తెగింపు, వలిమై వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ తరువాత కమలహాసన్ కథానాయకుడిగా చిత్రం చేయాల్సింది. దానికి సంబంధించిన కథా చర్చలు కూడా జరిగాయి. అయితే కారణాలేమైనా ఆ చిత్రం డ్రాప్ అయ్యింది. తాజాగా విజయ్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈయన చెప్పిన కథకు విజయ్ చాలా ఇంప్రెస్ అయ్యారని సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. రూ.10 కోట్ల పారితోషికం తీసుకునే రేంజ్ హీరోయిన్ను ఎంపిక చేయాలని యూనిట్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లిస్ట్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార లేదట. ఇకపోతే బాలీవుడ్ భామ అలియా భట్, మృణాళ్ ఠాకూర్, త్రిష, సమంతలలో ఒకరిని ఎంపిక చేయడానికి వారితో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. త్రిష, సమంత ఇప్పటికే విజయ్ సరసన నటించారు. కాబట్టి ఇప్పటి వరకూ విజయ్‌తో జతకట్టని నటిని ఇందులో నటింపజేసే ఆలోచనలో యూనిట్ వర్గాలు ఉన్నట్లు సమాచారం. నటి అలియాభట్, మృణాళ్ఠాకూర్ ఇప్పటి వరకూ నేరుగా తమిళ చిత్రాల్లో నటించలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అలియాభట్, సీతారామం మృణాళ్ ఠాకూర్‌లో తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ రెండు అనువాద చిత్రాలేనన్నది గమనార్హం. దీంతో బాలీవుడ్ భామ అలియాభట్ గానీ, మృణాళ్ ఠాకూర్ గానీ విజయ్ 69వ చిత్రంలో నటించే చాన్స్ ఎక్కువగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. వీరిలో ఆ అదృష్టం ఎవరికి లభిస్తుందన్నదే తాజాగా జరుగుతున్న చర్చ. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన మేలో వెలువడే అవకాశం ఉంది. -
‘లవ్ అండ్ వార్’లో గాయనిగా ఆలియా భట్
‘హైవే’, ‘హంప్టీ శర్మకీ దుల్హనియా’ సినిమాల్లో హీరోయిన్గా నటించడంతో పాటు గాయకురాలిగా పాటలు పాడారు ఆలియా భట్. ఇలా గాయకురాలిగా కాస్త అనుభవం ఉన్నా కూడా స్వరాలాపనలో మరింత పట్టు సాధించేందుకు ఆలియా భట్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. ఎందుకంటే తన తాజా చిత్రం ‘లవ్ అండ్ వార్’లో ఆలియా భట్ పూర్తి స్థాయి గాయకురాలి పాత్రలో కనిపిస్తారట. పాత్ర దృష్ట్యా కథలో చాలా పాటలు పాడతారట ఆలియా భట్. ఈ చిత్రం కోసమే ఆమె స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించనున్న ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ఆరంభం కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. పెళ్లి తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. -
ఆలియాకు విలన్‌గా...?
ఆలియా భట్, షార్వరి లీడ్ రోల్స్‌లో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజు ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందట. శివ్ రావైల్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించనున్నారు. గతంలో ‘రాజీ’ సినిమాలో స్పై పాత్రలో నటించిన ఆలియా భట్ మళ్లీ ఈ సినిమాలో ఆ తరహా పాత్రను ఓకే చేయడం విశేషం. ఇక ‘యానిమల్’లో విలన్ రోల్లో బాబీ డియోల్ విజృంభించిన విషయం తెలిసిందే. మరి.. యశ్ రాజ్ ఫిలింస్ తాజా చిత్రంలో విలన్‌గా సై అంటే... మరోసారి బాబీ నెగటివ్ పెర్ఫార్మెన్స్ని చూసే వీలు దక్కుతుంది. -
అలియా చీర స్పెషల్ ఎట్రాక్షన్: విషయం తెలిస్తే మీరూ షాకవుతారు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ హోప్ గాలా 2024 ఈవెంట్లో అందరి చూపులను తన వైపునకు తిప్పుకుంది. ఇటీవల తన తొలి హోప్ గాలాను లండన్‌లో నిర్వహించింది. ఈసందర్భంగా 30 ఏళ్ల నాటి వింటేజ్ సారీని కొత్తగా డిజైన్ చేయించుని మరీ ధరించింది. ఇవరీ రేషమ్ సారీలో తన స్టయిలిష్లుక్తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. దీనికి జతగా టోర్టటైజ్ నెక్లైన్ క్రిస్టల్-ఎంబెడెడ్, వెనుక ముత్యాల లైన్లతో తీర్చిదిద్దిన బ్లౌజ్ మరింత అందంగా నప్పింది. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!) హోప్ గాలా 2024 ఈవెంట్కోసం ఈ చీరను ప్రముఖ డిజైనర్లు అబుజానీ, సందీప్ ఖోస్లా స్పెషల్‌గా డిజైన్ చేశారట. వీరు దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆకులు,పువ్వుల డిజైన్లతో పట్టు దారాలతో ఎంబ్రాయిడరీ చేసినట్టు తెలిపారు. అంతేకాదుఈ చీర వాస్తవానికి 1994లో తయారు చేసిందట. 30 ఏళ్లనాటి ఈ చీరను మళ్లీ కొత్తగా సిద్ధం చేయడానికి 3500 గంటలు పట్టిందని తెలిపారు. ఇదే ఈవెంట్లో పర్పుల్ కలర్ డ్రెస్‌తో మెరిసింది అలియా. (ముఖేష్ సర్ప్రైజ్ గిఫ్ట్ : ఆనంద్ మహీంద్ర ఫిదా!) 2023లోఅలియా మెట్ గాలా అరంగేట్రంలో లక్ష ముత్యాలతో చేసిన గౌనుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన అలియా సక్సెస్‌పుల్ హీరోయిన్గా దూసుకు పోతోంది. బాలీవుడ్ స్టార్హీరో ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ని పెళ్లాడింది. పెళ్లి తరువాత ఇద్దరూ వరుస హిట్లతో దుమ్ము రేపుతున్నారు.అలాగే జాతీయ,అంతర్జాతీయబ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. అంతేనా ఒక దుస్తుల బ్రాండ్‌కు సీఈవో వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుకుంటోంది. ఈ స్వీట్ కపుల్‌కు రాహా కపూర్ అనే ముద్దుల కూతురుకూడా ఉన్న సంగతి తెలిసిందే. (మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!) View this post on Instagram A post shared by Mandarin Oriental (@mo_hotels) View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) -
బాలీవుడ్లో రిచెస్ట్ స్టార్ కిడ్.. ఏకంగా షారుక్, అమితాబ్‌ను మించి!
గతేడాది యానిమల్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన హీరో రణ్‌బీర్ కపూర్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. అయితే రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు రాహా కపూర్ అనే ముద్దుల కూతుకు కూడా ఉన్నారు. అయితే ఈ జంట తమ ముద్దుల కూతురి ఖరీదైన గిఫ్ట్‌ను ఇచ్చినట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఓ నివేదిక ప్రకారం లగ్జరీ బంగ్లాను నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారం. అది పూర్తయితే ముంబైలోనే అత్యంత ఖరీదైన బంగ్లాగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ బంగ్లా నిర్మాణానికి దాదాపు రూ.250 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నారు. ఇది పూర్తయితే షారుక్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లాలతో పోలిస్తే అత్యంత ఖరీదైన సౌధంగా నిలవనుంది. రిచెస్ట్ స్టార్ కిడ్.. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఓ బంగ్లాలో బాలీవుడ్ జంట రణ్ బీర్ కపూర్, అలియా భట్‌తోపాటు నీతూ కపూర్ కలిసి కనిపించారు. ఆ బంగ్లాకు రణ్ బీర్ తన కుమార్తె రాహా కపూర్ పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఏడాది వయసులోనే రాహా కపూర్ బాలీవుడ్లో అత్యంత పిన్న వయసులో ధనవంతురాలిగా గుర్తింపు దక్కించుకోనుంది. రణ్‌బీర్, ఆలియా తమ కూతురి కోసం సమానంగా పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు వీరికి ముంబైలో నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి. వాటి విలువ రూ. 60 కోట్లకు పైగానే ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ బంగ్లాకు రాహా నానమ్మ నీతూ కపూర్ సహ-యజమానిగా ఉంటారని తెలుస్తోంది. ఆమె ఇటీవల బాంద్రా ప్రాంతంలోనే రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. బంగ్లా పూర్తయిన తరువాత నీతూ కపూర్‌తో సహా ఫ్యామిలీ మొత్తం ఇదే బంగ్లాలో ఉండనున్నారని సమాచారం. అలియా, రణ్ బీర్, రాహా ప్రస్తుతం వస్తు అనే ప్రాంతంలో ఉంటున్నారు. -
Alia Bhatt Latest Photos: తల్లయినా తగ్గని అందం.. ఎంతైనా ఆమె రేంజే వేరు (ఫోటోలు)
-
రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్
హీరోయిన్ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు హిందీ మూవీస్ చేసిన ఈమె.. 'ఆర్ఆర్ఆర్'లోనూ ఓ పాత్ర చేసి ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే అలియా-రాజమౌళికి గొడవైందని ఏవేవో అన్నారు. అయితే వాటిలో నిజానిజాలు పక్కనబెడితే.. తనకు రాజమౌళి ఇచ్చిన సలహాని ఇప్పటికీ పాటిస్తున్నానని అలియా చెప్పుకొచ్చింది. అలా తన పద్ధతి పూర్తిగా మారిపోయిందని పేర్కొంది. (ఇదీ చదవండి: బాధతో ఆ విషయం ఒప్పుకొంటున్నా: డైరెక్టర్ రాజమౌళి) 'సినిమాలని ఎంచుకునే విషయంలో మొదటి నుంచి ఒత్తిడికి గురవుతూ ఉండేదాన్ని. అదే విషయం రాజమౌళికి చెప్పాను. 'ఏది చేసినా సరే ప్రేమతో చేయండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు మీ యాక్టింగ్‌ని మెచ్చుకుంటారు. మీకు కనెక్ట్ అవుతారు. ఈ ప్రపంచంలోనే ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏదీ లేదు' అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి నేను అదే పాటిస్తున్నాను' 'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా దగ్గరకు వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పేసేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు సహనం తక్కువ. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఎంత కష్టమైనా పాత్రనైనా సరే ఓకే చెప్పాలని డిసైడ్ అయ్యాను' అని అలియా భట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె హిందీలో 'జిగ్రా' అనే సినిమా చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 27న ఇది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: మహేశ్ -రాజమౌళి సినిమా కథేంటో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్) -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆలియా చాలారోజుల తర్వాత అలా.. హీట్ పెంచుతున్న సీరత్!
చాలా ఏళ్ల తర్వాత క్లాసికల్ డ్యాన్స్.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్ అంబానీ పెళ్లి వేడుకలో మెరిసిపోతున్న ఆలియా భట్ చీరకట్టులో మరింత క్యూట్‌గా ముద్దుగుమ్మ ప్రియమణి కలర్‌ఫుల్ సీతాకోకచిలుకలా కనిపిస్తున్న సీరత్ కపూర్ మేకప్ లేకపోయినా సరే అందంగానే మీనాక్షి చౌదరి ఎక్సర్సైజ్ చేస్తూ ఫొటోలు పోస్ట్ చేసిన మంచు లక్ష్మి భర్తతో కలిసి హీరోయిన్ దీపికా పదుకొణె క్యూట్ పోజులు రోజురోజుకీ మరింత హాట్‌గా సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్ View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Musskan Sethi Adlakha (@musskansethi9) -
వారికి అసలు మానవత్వం లేదా?: మహేశ్ బాబు పోస్ట్ వైరల్!
కొత్త ఏడాదిలో గుంటూరు కారంతో ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇక మహేశ్ బాబు తదుపరి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవలే బాలీవుడ్ భామ నిర్మాతగా వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పోచర్ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ వీక్షించిన మహేశ్ బాబు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఎలా ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. వారికి మానవత్వం లేదా? అలాంటి పనులు చేసేటప్పుడు వారి చేతులు వణకవా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోచర్ వెబ్ సిరీస్ చూశాక తన మైండ్‌లో ఇలాంటి ప్రశ్నలే తిరుగుతున్నాయని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇలాంటి సున్నితమైన దిగ్గజాలను రక్షించమని కోరుతూ ఈ వెబ్ సిరీస్ ద్వారా పిలుపునిచ్చారని మహేశ్ బాబు పోస్ట్ చేశారు. కాగా.. ఎమ్మీ అవార్డు విన్నర్, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన మలయాళ ఫారెస్ట్ క్రైమ్ సిరీస్ పోచర్. ఏనుగు దంతాల స్మగ్లింగ్‌తో పాటు, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. కేరళ అడవుల్లో జరిగిన ఒక రియల్ స్టోరీని ఆధారంగా తీసుకోని ఈ చిత్రాన్ని రూపొందించారు. పోచర్‌లో నిమేషా సజయన్, రోషన్ మాథ్యూ కీలకపాత్రలు పోషించారు. కేరళ అడవుల్లో ఉన్న ఏనుగులను చంపి వాటి దంతాలతో కొందరు నేరస్థులు వ్యాపారం చేస్తుంటారు. అలాంటి నేరస్థుల ముఠాని పట్టుకోవడానికి కేరళ పోలీసులు, కొందరు ఎన్జీఓలో చేసిన ప్లానింగ్‌నే సిరీస్‌గా రూపొందించారు. ఈ సిరీస్‌కు అలియా భట్ నిర్మాతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
మిమిక్రీ శాయవలే... ముంబైలో ఫ్లాట్ కొనవలే!
ఆలియా భట్ గొంతును అనుకరిస్తూ బోలెడు పాపులారిటీ సంపాదించింది 24 సంవత్సరాల కంటెంట్ క్రియేటర్ చాందిని భాబ్డా. ఈ పాపులారిటీనే ఆమెను ముంబైలో ఒక ఫ్లాట్‌కు ఓనర్‌ను చేసింది. సంప్రదాయ రీతిలో గృహప్రవేశంతో తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది చాందిని. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 2022లో ఆన్–పాయింట్ మిమిక్రీ క్లిప్స్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది చాందిని. సొంత ఇంటి కలతో మిమిక్రీ కళను నమ్ముకొని డబ్బులను పొదుపు చేసేది. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఈ ఫ్లాట్ కొనడానికి ఎన్నో ఇష్టాలను వదులుకొని, ఎలా డబ్బు పొదుపు చేసిందీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివరించింది చాందిని. ‘ఫ్రెండ్స్ విదేశాలకు వెళుతున్నప్పుడు నాకు కూడా వెళ్లాలనిపించేది. బర్త్‌డే ఫంక్షన్‌ను ఘనంగా జరుపుకోవాలనుకునేదాన్ని... ఇలాంటి ఎన్నో సందర్భాలలో ఇంటికల గుర్తుచ్చేది. పొదుపు చేయడం ఎప్పుడూ మానలేదు’ అని రాసింది చాందిని. -
అదిరిపోయే పవర్ సూట్లో అలియా భట్! దాని ఖరీదే ఏకంగా..!
బాలీవుడ్ నటి అలియా భట్ ప్యాషన్‌కి ఐకాన్‌లా తనదైన శైలిలో ఉంటుంది. ఏ వేడుకకు తగ్గ ట్రెండీ డ్రస్‌తో అందర్నీ మిస్మరైజ్ చేస్తుంటుంది. ఎప్పటి కప్పుడూ ఓ ట్రెండీ లుక్‌తో వస్తూ.. సరికొత్త డ్రస్సింగ్ స్టయిల్ని పరిచేయం చేస్తుంది అలియా. అందుకు నిదర్శనం ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న ఘటన, అయోధ్య వేడుకలే. జాతీయ అవార్డుల ఫంక్షన్ తగ్గట్టుగా హుందాగా స్టన్నింగ్ శారీతో మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఆ తర్వాత ఇటీవల అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో చీరపై రామాయాణ ఇతిహాస చిత్రాలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పడూ కొంగొత్త స్టయిలిష్ డ్రస్‌లతో వార్తల్లో నిలుస్తుంటారు అలియా. మళ్లీ ఈ పవర్ ఫుల్ పవర్ సూట్‌తో సరికొత్త ట్రెండ్‌ని సెట్ చేసి హాట్‌టాపిక్‌గా మారారు. ఈ మేరకు అలియా గురువారం తన రాబోయే సిరీస్ పోచర్ ట్రైలర్ లాంచర్ కోసం అలియా ఓంబ్రే పవర్ సూట్‌ని ధరించారు. ఈ లుక్‌లో ఆమె పవర్ ఫుల్ విమెన్లా ఉంది. అందరీ కళ్లు ఆమె డ్రస్ పైనే ఉన్నాయి. ఆ సూట్‌కి తగ్గ హైహిల్స్, చెవిపోగులు, లైట్ మేకప్‌తో కళ్లు తిప్పుకోలేనంత కలర్ఫుల్గా కనిపించింది అలియా. ఇంతకీ ఆ సూట్ ధర ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోతాయి. ఆ ఓంబ్రే ప్యాంట్ సూట్ ధర ఏకంగా రూ. 3.15 లక్షలు/- (చదవండి: మిస్ వరల్డ్ 2023 పోటీల్లో భారత్ తరఫున సినీ శెట్టి ప్రాతినిధ్యం!!) -
స్టార్ హీరో ఫ్లాట్ కొనుక్కున్న మిమిక్రీ క్వీన్, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు!
బాలీవుడ్ స్టార్హీరోయిన్ అలియాభట్‌ను అనుకరించి పాపులర్ ముద్దుగుమ్మ చాందినీ భబ్దా గుర్తుందా? ఇపుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌తో వార్తల్లో నిలిచింది. విషయం ఏమిటంటే...! కంటెంట్ క్రియేటర్, చాందినీ భాబ్దా తన మిమిక్రీతో సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఫాలోవర్ల సంఖ్య 4.5 లక్షల కంటే ఎక్కువే. తాజాగా తన లైఫ్‌లో ఒకముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. చాందినీ ముంబైలో ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ని కొనుగోలు చేసింది. అదీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందట. ఈఎంఐ అయినా.. 25ఏళ్ల లోపే సొంత ఇల్లు అంటూ ఆనందంలో మునిగి తేలుతూ సంబంధించిన సమాచారాన్ని ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశ పూజాకార్యాక్రమాలను నిర్వహించింది. అంతేకాదు తనదైన స్టయిల్లో రెన్నోవేషన్ కూడా చేయనుందట త్వరలోనే. యాక్టింగ్‌పై కూడా అభిరుచి ఉన్న ఈ అమ్మడు ‘కానిస్టేబుల్ గిరాప్డే’ అనే కామెడీ టీవీషోలో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్లో అవకాశకాశాల కోసం ఎదురు చూస్తోంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన చాందినీ భబ్దా అలియాతో పాటు హీరోయిన్లు అనన్య పాండే, కంగనా రనౌత్ వాయిస్‌లను కూడా బాగా అనుకరిస్తుంది. అయితే తన వాయస్‌ను అనుకరించడంపై స్పందించిన అలియా చాందినినీ ప్రశంసల్లో ముచెత్తడం,దీనికి చాందినీ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవడం తెలిసిందే. View this post on Instagram A post shared by Chandni Bhabhda 🧿 (@chandnimimic) -
అలియా భట్ నిర్మాత.. ఓటీటీలో చూడాల్సిన క్రైమ్ వెబ్ సిరీస్
ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పోచర్' వెబ్ సిరీస్ విడుదల ప్రకటన వచ్చేసింది. క్రైమ్ సిరీస్‌లను ఇష్టపడే వారందరికి ఇదొక గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. ఈ సిరీస్‌ను ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ క్యూసీ ఎంటర్టైన్మెంట్ నిర్మించగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా మరో నిర్మాతగా ఉంది. రిచీ మెహతా దీనికి రచన, దర్శకత్వం వహించారు. ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎమీ అవార్డును గతంలో ఆయన అందుకున్నారు. మలయాళ ప్రముఖ నటి నిమిషా సజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు కన్నడ,మలయాళం,హిందీ,తమిళ్లో అందుబాటులో ఉండనుంది. పోచర్ వెబ్ సిరీస్‌లో 8 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఇటీవల సుడాన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్లో ఈ సిరీస్‌ను ప్రదర్శించారు. విమర్శకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అడవుల్లో వణ్య ప్రాణులు ముఖ్యంగా ఏనుగులపై జరిగిన దాడుల గురించి ప్రధానంగా ఈ పోచర్ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు. ఎక్కువగా అడవుల్లోనే షూటింగ్ జరిగింది. కేరళలోని రియల్ లైఫ్ లొకేషన్లలో చిత్రీకరణ జరిగింది. భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఏనుగు దంతాల నెట్వర్క్ గుట్టు రట్టు చేసేందుకు కృషి చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులతో పాటు భారత వణ్యప్రాణుల ట్రస్ట్ ఎన్జీవో వర్కర్లు, పోలీసులు ఇలా ఎందరో కృషి పోచర్ వెబ్ సిరీస్‌లో కనిపిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్ కోసం సుమారు నాలుగు సంవత్సరాల పాటు పరిశోధన చేసినట్లు దర్శకుడు రిచీ మహతా చెప్పారు. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్‌కు కూడా గతంలో రిచీ మెహతా దర్శకత్వం వహించారు. ఇదీ కూడా 2012 ఢిల్లీ గ్యాంప్ రేప్ కేసు ఆధారంగానే ఆయన డైరెక్ట్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఢిల్లీ క్రైమ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. beneath the silence, the forest reveals a deadly conspiracy... and the hunt for the Poacher begins! Alia Bhatt comes on board as #ExecutiveProducer on #PoacherOnPrime, a new Amazon Original Crime series, Feb 23@aliaa08 #RichieMehta @_QCEnt @NimishaSajayan @roshanmathew22… pic.twitter.com/B8RmMPMtRK — prime video IN (@PrimeVideoIN) February 6, 2024 -
Filmfare Awards 2024: దుమ్ము రేపిన బాలీవుడ్ కపుల్, స్వీట్ కిస్, పిక్స్ వైరల్
ప్రతిష్టాత్మక 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోబాలీవుడ్ జంట రణబీర్ కపూర్-అలియాభట్ దుమ్ము రేపారు. అలియా, రణబీర్ ఇద్దరూ ఉత్తమ నటీ, ఉత్తన నటుడు అవార్డులను గెల్చుకుని రీల్ లైఫ్‌లో కూడా బెస్ట్ కపుల్‌గా నిలిచారు. రణబీర్ చిత్రం యానిమల్లోని జమాల్ కుడు అనే పాటకు ఇద్దరూ స్టెప్స్ వేయడం అక్కడున్న వారందరిన్నీ ఉత్సాహపరిచింది. ఈ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు ఆఖరులో రణ్‌బీర్ అలియాను ముద్దుపెట్టుకోవడం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలియా భట్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీకిగాను ఉత్తమ నటి అవార్డును అందుకోగా, ఆమె భర్త రణబీర్ కపూర్ యానిమల్‌లో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' మూవీ ఏకంగా ఆరు అవార్డులను కైవసం చేసుకుంది. అంతేకాదు ఓటీటీ రికార్డుల మోత మోగించిన '12 త్ ఫెయిల్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ వేదికగా అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో 2023 లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భార్యతో స్టార్ హీరో డ్యాన్స్..
-
భార్యతో స్టార్ హీరో డ్యాన్స్.. తలపై గ్లాసు పెట్టుకుని..
బాలీవుడ్ పవర్ఫుల్ కపుల్ రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ అరుదైన ఘనత సాధించారు. 69వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఇద్దరూ ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్లుగా పురస్కారాలు అందుకున్నారు. దీంతో సంతోషంలో మునిగి తేలుతోందీ జంట. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ దంపతులు డ్యాన్స్‌తో కనువిందు చేశారు. అంతేనా.. యానిమల్ సినిమాలో హైలెట్ అయిన 'జమల్ కుదు' హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేశాడు రణ్‌బీర్. స్టేడియం ముందు వరుసలో ఉన్న భార్య దగ్గరకు వచ్చి చిందులేశాడు. తలపై గ్లాసు పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. దీంతో ఆలియా కూడా భర్తతో కలిసి పాదం కదిపింది. ఈ జోష్‌లో భార్యను ఆప్యాయంగా ముద్దాడాడు హీరో. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మీ జంటను చూస్తే ముచ్చటేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. కాగా 'యానిమల్' సినిమాకుగానూ రణ్‌బీర్ ఉత్తమ నటుడిగా, 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' చిత్రానికిగానూ ఆలియా భట్ ఉత్త నటిగా అవార్డులు అందుకున్నారు. #RanbirKapoor comes in all guns blazing at the 69th #HyundaiFilmfareAwards2024 with #GujaratTourism.@GujaratTourism @HyundaiIndia @VimalElaichi pic.twitter.com/N3ULAMvTsw — Filmfare (@filmfare) January 28, 2024 ఫిలింఫేర్ అవార్డులు ఏయే సినిమాలకు వచ్చాయో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
ఆలియా భట్, రామ్ చరణ్ జోడీ రిపీట్?
రాజమౌళి దర్శకత్వంలోని ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం) సినిమాలో రామ్‌చరణ్, ఆలియా భట్ ఓ జంటగా నటించి మెప్పించారు. ఈ ఇద్దరూ మళ్లీ జోడీ కట్టనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. మరి.. రామ్‌చరణ్, ఆలియా భట్ జోడీ రిపీట్ అవుతుందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుందని తెలిసింది. రామ్‌చరణ్ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమన్ స్వరకర్త. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్లతో కలిసి వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. -
అలియా భట్ ప్రొత్సాహంతోనే ఆ సన్నివేశాల్లో నటించా : రణ్‌బీర్ కపూర్
ఈ మధ్య కాలంలో సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు కామన్ అయిపోయాయి. ముద్దు సీన్స్ లేని సినిమాలు చాలా అంటే చాలా రేర్‌గా వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కథ డిమాండ్ మేరకు అలాంటి సన్నివేశాలను పెడితే..మరికొన్ని సినిమాల్లో మసాల యాడ్ చేస్తేనే టికెట్లు తెగుతాయనే ఉద్దేశంతో శృంగార సన్నివేశాలను ఇరికిస్తున్నారు. ప్రేక్షకులు అయితే ఇంటిమేట్ సన్నివేశాలను లైట్ తీసుకొని, సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. (చదవండి: ఆ హీరో సడన్‌గా దగ్గరకు వచ్చి వింతగా ప్రవర్తించాడు: భాగ్యశ్రీ) ఇటీవల ఇంటిమేట్ సన్నివేశాలపై చర్చ జరిగిన ఏకైక సినిమా యానిమల్ మాత్రమే. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మోతాదుకు మించిన ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నప్పటికీ..అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. అలాంటి సన్నివేశాలే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి కూడా. అయితే ఇంటిమేట్, హింసాత్మక సన్నివేశాల్లో నటించినప్పుడు హీరో రణ్‌బీర్ కపూర్ చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట. కెరీర్ పరంగా చెడ్డ పేరు వస్తుందని భయపడ్డాడట. కానీ భార్య అలియా భట్ మాత్రం చాలా ఎంకరేజ్ చేసిందట. ఆమె ప్రోత్సాహంతోనే ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించానని రణ్‌బీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. (చదవండి: ‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?) ‘ఒక నటుడిగా నాకుంటూ కొన్ని హద్దులు ఉన్నాయి. వాటిని దాటాలని ఎప్పుడూ అనుకోలేదు. దర్శకుడు సందీప్ వంగా యానిమల్ కథ చెబుతూ.. ఇంటిమేట్, హింసాత్మక సన్నివేశాలు ఇలా ఉంటాయని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. కొన్ని సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు ఇలా చేయాలా? వద్దా? అనే డైలమాలో పడేవాడిని. కానీ నా భార్య అలియా భట్ చాలా సపోర్ట్‌గా నిలిచింది. ‘సినిమా కోసమే చేస్తున్నావు. ఇది కేవలం పాత్ర మాత్రమే’ అంటూ ధైర్యం చెప్పింది. సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ఆమెతో చర్చించేవాడిని. ఈ సినిమా విషయంలో తను నాకెంతో అండగా నిలిచింది’అని రణ్‌బీర్ చెప్పారు. యానిమల్ విషయానికొస్తే.. ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్ వంగా తెరకెక్కించిన మూడో చిత్రమిది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1న విడుదలై ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..రణ్‌బీర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీనికి కొనసాగింపుగా ‘యానిమల్ పార్క్’ రానుంది. -
ఆలియా అవుట్..జాన్వీ ఇన్?
హిందీలో ‘దుల్హనియా’ ఫ్రాంచైజీలో వచ్చిన ‘హంప్టీ శర్మా కీ దుల్హనియా’, ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’ చిత్రాల్లో వరుణ్ ధావన్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాలకు శశాంక్ కేతన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ ఫ్రాంచైజీలో మూడో భాగానికి కేతన్ ప్రయత్నాలు మొదలు పెట్టారని బాలీవుడ్ సమాచారం. వరుణ్ ధావన్, ఆలియా భట్లను కూడా సంప్రదించారట. అయితే వరుణ్ ధావన్ సుముఖంగానే ఉన్నా, ఇప్పటికే అంగీకరించిన చిత్రాల కారణంగా ఆలియా మాత్రం ఈ సినిమాలో నటించలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో ఈ చాన్స్ జాన్వీ కపూర్‌కు వెళ్లిందట. ఈ సినిమాకు జాన్వీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ ఊపందుకున్నాయని టాక్. వేసవిలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. -
యానిమల్ సక్సెస్ మీట్లో అలియా ధరించిన డ్రస్ ధర ఎంతంటే..?
సెలబ్రెటీలు ధరించిన డ్రస్‌లు ఎప్పడూ అత్యంత ఖరీదులోనే ఉంటాయి. వాటికి గోల్స్ అంచు లేదా డైమండ్లు పొదగబడి ఉండటం వంటివి జరుగుతాయి కూడా. అయితే కొన్ని ఖరీదైన డ్రస్‌లు చూస్తే ఏముంది ఇందుల? ఎందుకింత ఖరీదు? అనిపిస్తుంది. అలాంటి డ్రస్ అలియా వేసుకొచ్చింది. అదికూడా తన భర్త నటించిన యానిమల్ మూవీ సక్సెస్ మీట్‌కి. ఆమె భర్త రణబీర్ కపూర్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఒకరకంగా చాలా రోజుల తర్వాత బాలీవుడ్ మూవీ ఈరేంజ్‌లో దూసుకుపోతున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. అదిగాక ఈ మూవీలో "జమల్ జమలు కుదు" పాట ఎంతలా వైరల్ అవుతోందో చెప్పాల్సివసరం లేదు. ఈ మేరకే ఈ సినిమా బృందం తమ మూవీ విజయోత్సవాన్ని జరుపుకుంది. ఈ వేడుకకు అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ మూవీ సక్సస్‌ని పంచుకునేందుకు మంచి గ్రాండ్ లుక్‌తో వచ్చారు. ఈ వేడుకలో ఆమె నీలిరంగు దుస్తుల్లో స్టన్నింగ్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ శాటిన్ కటౌట్ డ్రస్‌లో చాలా గ్లామరస్‌గా కనిపించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సంస్థ రసారియో కలక్షన్స్ ఈ డ్రెస్‌ని డిజైన్ చేసింది. దీని ధర ఏకంగా రూ. 1.5 లక్షలు. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ రణబీర్, అలియా జంట, రణబీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీడియోల్, అనిల్‌కపూర్, డైరెక్టర్లు,తదితర బాలివుడ్ తారాగణమంతా హాజరయ్యారు. (చదవండి: జమల్ జమలు కుదు... యానిమలు!) -
Alia Ranbir Daughter Raha Photos: ఏడాది తర్వాత కూతురి ముఖం చూపించిన రణ్‌బీర్-ఆలియా (ఫోటోలు)
-
Alia-Ranbir: ముద్దుల కూతురిని పరిచయం చేసిన స్టార్ కపుల్!
బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్, రణ్‌బీర్‌కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. బ్రహ్మాస్త్ర చిత్రంలో జంటగా కనిపించిన వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్ 14న పెళ్లిబంధంతో ఒక్కటైన ఈ స్టార్ కపుల్‌కు రాహా అనే కూతురు జన్మించింది. అయితే ఇప్పటివరకు తమ గారాల పట్టి మొహాన్ని అభిమానులకు పరిచయం లేదు. తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఈ జంట ఎట్టకేలకు తమ కూతురి మొహాన్ని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. తమ ఇంటి వద్దకు విచ్చేసిన మీడియా ప్రతినిధులకను పలకరిస్తూ కుమార్తెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాహా చాలా క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ అచ్చం రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ లానే ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. రణ్‌బీర్ కపూర్ ఇటీవలే యానిమల్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మరోవైపు అలియాభట్ రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. Rishi kapoor + Raj kapoor + Ranbir kapoor genes won for me😭♥️ https://t.co/0mX7C4xwAL — Susmita✨ (@SSusmita0319) December 25, 2023 Raha baby dito assemble of rishi kapoor 💏 God bless her#RanbirKapoor pic.twitter.com/Q0gY0AQ14S — r (@rajkbest) December 25, 2023 Raha is so beautiful , so elegant just looking like a Wow❤️🔥 Glimpse of Rishi Kapoor😍#AliaBhatt#RanbirKapoor#rahakapoorpic.twitter.com/ZxXiEKARwe — India's Elon Musk (@EshhanMusk) December 25, 2023 -
100 కోట్లు కొల్లగొడుతున్న భార్య,భర్తలు
-
బాలీవుడ్లో టాప్ 15 అత్యంత అందమైన నటీమణులు వీరే (ఫొటోలు)
-
పూజాహెగ్డే మాములుగా లేదు.. ఆలియా అయితే ఇక చెప్పనక్కర్లేదు!
పిచ్చెక్కించే లుక్స్‌లో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ కంటే అందంగా అల్లు వారి కోడలు బ్లాక్ డ్రస్‌లో మెరిసిపోతున్న మాళవిక మోహనన్ రాయ్ లక్ష్మీ అందాల విందు చేస్తూ మాములుగా లేదు వెనిస్లో దివి.. అదీ తెలుగు సంప్రదాయ దుస్తుల్లో వావ్ అనిపిస్తున్న హాట్ బ్యూటీ నోరా ఫతేహి తల్లి అయినా సరే ఆలియా భట్ అస్సలు తగ్గట్లేదుగా గోల్డెన్ డ్రస్‌లో ధగధగా మెరిసిపోతున్న మలైకా అరోరా View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
నా పెళ్లి జీవితంపై అలాంటి రూమర్స్: ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్
బాలీవుడ్ భామ ఆలియా భట్ పరిచయం అక్కర్లేనిపేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ అనే చిత్రంతో అభిమానులను పలకరించింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు మరో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌తో పాటు హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తన పెళ్లి జీవితంపై వచ్చిన రూమర్స్‌పై అలియా భట్ క్లారిటీ ఇచ్చింది. ఆలియా మాట్లాడుతూ.. 'ఇప్పుడున్నదంతా సోషల్ మీడియా, ఇంటర్నెట్ కాలం. ప్రతి రోజు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. నేను సన్నగా మారడానికి.. అంతే కాకుండా తెల్లగా అయ్యేందుకు సర్జరీలు చేయించుకున్నట్లు ప్రచారం చేశారు. అలాగే మ్యారేజ్ లైఫ్‌పై రూమర్స్ వచ్చాయి. నేను గతంలో రణ్‌బీర్‌కు లిప్‌స్టిక్ నచ్చదని.. వేసుకున్న వెంటనే తీసేయాలంటాడని చెప్పాను. అయితే ఈ విషయాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను వేధిస్తున్నాడంటూ రాశారు. రణ్‌బీర్ మంచి వ్యక్తి. ఇలాంటి విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయడం బాధ కలిగిస్తుంది. కానీ అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. అందుకే వాటిని నేను పట్టించుకోను. ' అని అన్నారు. -
నయన్, అలియా, కత్రినాలకు ఝలక్: అరంగేట్రంలోనే వందల కోట్లతో అదరగొడుతున్న అమ్మడు
2023లో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. అలా అడుగుపెట్టిందో లేదో ఇలా బాక్సాఫీసు వసూళ్లతో దూసుకు పోతోంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, నయనతార, అలియా భట్లను వెనక్కి నెట్టేసింది. డెబ్యూలోనే షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో చాన్స్ దక్కించుకొని.. నెక్ట్స్ ఎవరితో అనే ఆసక్తికర చర్చకు తెర లేపింది. ఇంతకీ ఎవరా నటి? ఈ కథనంలో తెలుసుకుందాం! ఆమె ఎవ్వరో కాదు స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌తో పెంపుడు తల్లిగా నటించి అందరి దృష్టినీ ఆకర్షించిన రిధి డోగ్రా. 2007 నుండి నటిస్తోంది. తొలుత టీవీ తెరపై వెలిగిపోయింది. ఇటీవల ఓటీటీ స్టార్‌గా రాణిస్తోంది. కానీ దాదాపు 16 సంవత్సరాల తర్వాత అట్లీ దర్శకత్వంతో వచ్చిన జవాన్ మూవీతో బాలీవుడ్ భారీ బేక్ బ్రేక్ వచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ.1150 కోట్ల కలెక్షన్లతో సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో షారూక్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. దీనికి తోడు ఇటీవల విడుదలైన టైగర్-3 సక్సెస్ ఆమెకు మరింత స్టార్డమ్ తెచ్చిపెట్టింది. మనీష్ శర్మ దర్వకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ , ఇమ్రాన్ హష్మీ లాంటి టాప్ స్టార్ల సరసన స్పై థ్రిల్లర్ టైగర్ 3లో నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 10న సినిమా థియేటర్లలో విడుదలై ఈ మూవీ తొలివారంలోప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకుపైగా వసూలు చేసిందని టాక్.దీంతో తొలి ఏడాదిలోను 1500 కోట్ల క్లబ్లో చేరిందీ అమ్మడు. మరో వెయ్యికోట్లపై కన్ను ఈ ఏడాదికి ఇంతకుముందెన్నడూ చేయలేదు అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని ట్విటర్లో షేర్ చేసింది రిధి. జవాన్ మూవీ కలెక్షన్లు వెయ్యి కోట్లను దాటి నందుకు కృతజ్ఞతగా, అలాగే టైగర్ -3 కూడా వెయ్యి కోట్ల మార్క్‌కు చేరాలని ప్రార్థిస్తూ ఈ దీపావళికి వెయ్యి దీపాలు వెలిగించింది. With a heart full of gratitude and joy this diwali I decided to do something I had never done before coz what’s happened has never happened before !! 🤩🤩🤩🤩 Lit a 1000 🪔 for 1000 crore on #jawan whilst praying for a 1000 crore for #tiger3 pic.twitter.com/8b3MP5wD7q — Ridhi Dogra (@iRidhiDogra) November 14, 2023 ఎవరీ రిధి డోగ్రా 1984 సెప్టెంబర్ 22న పుట్టింది. న్యూ ఢిల్లీలోని షేక్ సరాయ్‌లోని అపీజే స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి కమలా నెహ్రూ కాలేజీ నుండి సైకాలజీ పట్టా అందుకుంది. ఝూమ్ జియా రేతో తన టీవీ అరంగేట్రం. హిందీ హై హమ్ (2009), YRF టెలివిజన్ రిష్తా డాట్ కామ్,సెవెన్ (2010), లాగీ తుజ్సే లగన్ (2010), మర్యాద…లేకిన్ కబ్ తక్? (2010-12), సావిత్రి (2013), యే హై ఆషికీ (2014), దియా ఔర్ బాతీ హమ్ (2015), వో అప్నా సా (2017-18), ఖయామత్ కీ రాత్ (2018) లతో ఆకట్టుకుంది. 2013లొ డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే 6, ఖత్రోన్ కే ఖిలాడి 6 (2014) తో పాపులర్ అయింది. వెబ్‌లో సంచలనం సైకలాజికల్ థ్రిల్లర్ అసూర్తో రిధి ఓటీటీ అరంగేట్రం చేసింది. ఈ షో స్ట్రీమింగ్ ఇటీవలే దాని రెండవ సీజన్ కూడా సక్సెస్‌పుల్‌గా ముగిసింది. ముంబై డైరీస్, బద్దమీజ్ దిల్ , వెల్కమ్ టు యువర్ డార్క్ సైడ్ అండ్ ది మ్యారీడ్ వుమన్ అనే వెబ్ సిరీస్‌లలో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఉత్తమనటిగా అవార్డు కొట్టేసింది. దీపికాకు దీటుగా 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ దీపికా పదుకొనే. ఆమె నటించిన పఠాన్ , జవాన్ రెండు చిత్రాలు ఏకంగా రూ.2200 కోట్లు రాబట్టాయి. దీపికా తరువాత రిధి డోగ్రా నిలుస్తోంది. నయనతార (రూ. 1150 కోట్లు), త్రిష కృష్ణన్ (రూ. 962 కోట్లు), అమీషా పటేల్ (రూ. 691 కోట్లు), రమ్య కృష్ణన్ (రూ. 610 కోట్లు), అలియా భట్ , కత్రినా కైఫ్ (ఇద్దరూ రూ. 350 కోట్లు) స్టార్లను దాటి పైకి ఎగబాకింది రిధి. 2011లో నటుడు రాకేశ్ బాపట్‌ను పెళ్లాడింది. కానీ మనస్పర్థల కారణంగా 2019లో భర్త నుంచి విడిపోయింది. -
69th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అలియా,రణబీర్ సందడి (ఫొటోలు)
-
స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!
న్యూఢిల్లీ: ముంబైలో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లో బాలీవుడ్ లవబుల్ కపుల్ సందడి చేశారు. బ్రహ్మాస్త్ర జంట అలియా భట్, రణబీర్ కపూర్ తళుక్కున మెరిసారు. అదీ ISLని నిర్వహించే ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్పర్సన్ నీతా అంబానీతో కలిసి ఆదివారం సందడి చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ముంబై సిటీ FC vs కేరళ బ్లాస్టర్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు బాలీవుడ్ తారలతో పాటు, నీతా అంబానీ ,అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అలియా, రణబీర్ జంటను నీతా ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ముంబై సిటీ FC సహ-యజమాని ఏ దిల్ హై ముష్కిల్ హీరో రణబీర్ తన జట్టుకు మద్దతుగా స్పోర్ట్స్ ఈవెంట్లో, ఇనీషియల్స్‌తో పాటు వెనుక ఎనిమిది నంబర్ ప్రింట్ చేసిన బ్లాక్ జెర్సీలో బ్యూటిఫుల్‌గా ఫ్యాన్స్‌ను అలరించాడు. బ్లాక్ కార్గో-స్టైల్ ప్యాంటు,మ్యాచింగ్ బ్లాక్ క్యాప్‌ను ధరించగా, ప్లస్ వన్ బ్లూ జెర్సీలో అలియా చేతులు పట్టుకుని స్టేడియంలోకి ప్రవేసించారు. అక్కడ ఫ్యాన్స్‌తో, సెల్పీలకు పోజులిచ్చారు. ఈ క్రమంలో ఒలింపిక్ అధ్యక్షురాలు నీతి అంబానీతో కలిసి పోజులివ్వడం విశేషంగా నిలిచింది. రణబీర్, అలియా జంట క్రీడాభిమాన్లు. గత నెలలో న్యూయార్క్‌లో విహారయాత్ర చేస్తున్నప్పుడు, ఈ జంట యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో కూడా మెరిసిన సంగతి తెలిసిందే . కాగా అంబానీ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు గత నెలలో, అలియా, బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి హాజరయ్యారు. అయితే ఈ వేడుకుకు భర్త రణ్‌బీర్ ఈవెంట్‌కు మిస్సయ్యాడు. ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే నేషనల్ అవార్డు విన్నర్ అలియాస్వయంగా నిర్మిస్తున్న జిగ్రా అనే యాక్షన్ చిత్రంలోనూ నటిస్తూ, నిర్మిస్తోంది. రణవీర్ సింగ్‌తో కలిసి బైజు బావ్రా అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తోంది. అలాగే రణబీర్ కపూర్ యానిమల్ కోసం సిద్ధమవుతున్నాడు. బాబీ డియోల్, అనిల్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. -
ఆ కారణంతో నాన్న మద్యానికి బానిసయ్యారు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ భామ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవలే రాకీ ఔర్ రాణీకి ప్రేమ కహానీ చిత్రంలో నటించిన ముద్దుగుమ్మ.. బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్ కూతురిగానే ఇండస్ట్రీకి పరిచయమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భామ.. తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. (ఇది చదవండి: నా ఎఫైర్స్ గురించి పిల్లలకు చెప్పేశా.. ఎందుకంటే?: రవీనా టండన్ ) అలియా భట్ మాట్లాడుతూ.. 'గతంలో నాన్న చాలా సినిమాలు తెరకెక్కించారు. పలు సినిమాలు వరుసగా ఫ్లాప్ల్స్గా నిలిచాయి. దీంతో నాన్న మద్యానికి బానిసయ్యారు. అదే సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ కొద్ది రోజుల తర్వాత మద్యం మానేశారు. ఆ తర్వాత అమ్మా, నాన్న చాలా ఇబ్బందులు పడ్డారు. అన్ని ఒడుదొడుకులు అధిగమించి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు.' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా చేసిన కామెంట్స్ బీటౌన్‌లో వైరల్‌గా మారాయి. అంతే కాకుండా తన తల్లి సోనీ రజ్దాన్ గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అమ్మ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఎవరు తెలియదని చెప్పింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందని పేర్కొంది. థియేటర్స్, సినిమాలు, టీవీలతో పాటు చాలా చోట్ల ఆడిషన్స్ ఇచ్చేదని తెలిపింది. సినిమాల కోసం కష్టపడటం అనే విషయాన్ని అమ్మ దగ్గరే నేర్చుకున్నా అని ఆలియా వెల్లడించింది. (ఇది చదవండి: నడిరోడ్డుపై జరిగే అత్యాచారానికి ఇదేమీ తక్కువ కాదు: నటి) -
పెళ్లిలో ఆలియా భట్‌ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను పరిణీతి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా కాసేపటికే ఫోటోలు వైరల్‌గా మారాయి. 'మేము మొదటి సారి బ్రేక్‌ఫాస్ట్ కోసం కలిసి కూర్చున్నప్పుడే మా హృదయాలు కలిశాయి. ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. ఎట్టకేలకు అందరి ఆశీర్వాదంతో మేము ఒక్కటయ్యాం. మేము ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేము' అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. దీంతో పరిణీతి-రాఘవ్‌ల దంపతులకు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరి జోడి చూడచక్కగా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలో పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహెంగాలో మెరిసిపోగా, పవన్ సచ్‌దేవా డిజైన్ చేసిన డిజైనర్ అవుట్‌ఫిట్‌లో రాఘవ్ చద్దా కనిపించారు. ఈ ఇద్దరూ పేస్టల్ కలర్ దుస్తుల్లో అందంగా కనిపించారు. ఈమధ్య కాలంలో పేస్టల్ కలర్స్, న్యూడ్ మేకప్ ట్రెండ్ బాగా వినిపిస్తోంది. ఆలియా భట్ నుంచి ఇప్పుడు పరిణీతి చోప్రా వరకు.. సింపుల్‌గా, పేస్టల్ కలర్స్‌లో నేచురల్‌గా కనిపించేందుకే సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు పెళ్లంటే రెడ్, ఎల్లో, గ్రీన్ వంటి సాంప్రదాయ కలర్స్ దుస్తుల్లోనే వధూవరులు కనిపించేవారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు హెవీ లెహంగాలు, భారీ నగలు, హెవీ మేకప్ వరకు.. అంతా భారీగా ఉండాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హెవీ అండ్ కాస్ట్లీ దగ్గర్నుంచి ఇప్పుడు సింపుల్ అండ్ క్లాసిక్ అనే ట్రెండ్ నడుస్తోంది. దీనికి తగ్గట్లే న్యూడ్ మేకప్ విత్ పేస్టల్ కలర్స్ అంటూ మరో అద్భుతమైన ట్రెండ్ సెట్ చేశారు మన బాలీవుడ్ ముద్దుగుమ్మలు. ఇక మరో విశేషం ఏమిటంటే.. పరిణీతి చోప్రా ఆలియా భట్‌ను ఫాలో అయ్యిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆలియా కూడా తన పెళ్లికి క్రీం పేస్టల్ కలర్ అవుట్‌ఫిట్‌లో అందంగా ముస్తాబైంది. అంతేకాకుండా మెహందీ ఫంక్షన్లోనూ చాలా సింపుల్ మెహందీలో దర్శనమిచ్చింది. ఇప్పుడు పరిణీతి కూడా అచ్చంగా ఆలియాలానే క్రీం కలర్ పేస్టల్ లెహంగా, చాలా సింపుల్ మెహందీలో కనిపించింది. దీంతో వీరిద్దరి లుక్‌ని పోలుస్తూ పలు ఫోటోలు ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. -
ట్రంప్ టవర్స్‌లోకి రణబీర్ అండ్ అలియా: అద్దె ఎంతో తెలిస్తే షాక్‌వుతారు
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ అలియా భట్ పూణెలోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారన్న వార్తలు మీడియాలో సందడి చేస్తున్నాయి. పూణేలోని ట్రంప్ టవర్స్‌లోని దాదాపు 7,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు వార్షిక అద్దెగా రూ. 48 లక్షలకు లీజుకు తీసుకున్నారని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో కలిసి ఇటీవల న్యూయార్క్ నుండి తిరిగి వచ్చిన రణబీర్ ఈ అపార్ట్మెంట్ లీజ్‌కు తీసుకోవడం వార్తల్లో నిలిచింది. (ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!) పూణేలోని కళ్యాణి నగర్‌లోని ట్రంప్ టవర్స్‌లోని 10వ అంతస్థులో ఉన్న రెసిడెన్షియల్ యూనిట్‌ని మూడు సంవత్సరాల పాటు నెలవారీ అద్దెకు రూ. 4 లక్షలు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం, అపార్ట్‌మెంట్‌ను పూణేకు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ వెహికల్ కాంపోనెంట్ పరిశ్రమలోని ప్రముఖ తయారీదారు డ్యూరోషాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అద్దెకు తీసుకున్నారు. లీజు అండ్ లైసెన్స్ ఒప్పందంపై సెప్టెంబర్ 15, 2023న సంతకం చేసినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా రూ. 24 లక్షల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌కూడా చెల్లించారు. మొదటి ఏడాది రూ.4 లక్షలు, రెండో ఏడాది రూ.4.2 లక్షలు, మూడో ఏడాది నెలకు రూ.4.41 లక్షలు నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. (పరిణీతి-రాఘవ్ చద్దా వెడ్డింగ్: ఒక్క నైట్‌కి హోటల్ సూట్ ఖర్చు ఎంతంటే?) మరోవైపు రణబీర్ అప్‌కమింగ్ మూవీ యానిమల్ డిసెంబరు 1న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు రణబీర్. ఈ సినిమాలో రష్మిక మందన్న, బాబీ డియోల్ , అనిల్ కపూర్ కూడా నటించారు. గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న రణబీర్ ,అలియా భట్ రాహా అనే కుమార్తె ఉంది. కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో నెలకు దాదాపు రూ. 1.5 లక్షల అద్దెకు మూడేళ్లపాటు ఒక ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నాడు. పూణేలోని ఈ జంట టవర్లు ఇండియాలో తొలి ట్రంప్ టవర్స్. 23 అంతస్తుల ఈ ట్రంప్ టవర్లను అతుల్ చోర్డియా నేతృత్వంలోని పంచశిల్ రియాల్టీ అభివృద్ధి చేసింది. -
ఓటీటీలో సూపర్‌హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!
రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. అయితే ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా ఉచితంగా చూసేందుకు మేకర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూలై 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకుముందు ఈ చిత్రం చూడాలంటే రూ.349 చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడు ఫ్రీగా చూసేయొచ్చు. కాగా.. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ, తోట రాయ్ చౌదరి, ఆమీర్ బషీర్, చుర్ని గంగూలీ, అంజలి ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించారు. ఓటీటీలో రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీలోని డిలీటెడ్ సన్నివేశాలను జోడించి మరి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీ రన్ టైమ్ పది నిమిషాలకు పెరిగింది. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకంపై హిరో జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి సంయుక్తంగా నిర్మించారు. -
ఓటీటీలో రిలీజైన సూపర్‌హిట్ సినిమా.. కానీ?
ఇది సూపర్‌హిట్ సినిమా. స్టార్స్ అయిన రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా లాంగ్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఎందులో స్ట్రీమింగ్ అవుతోందో తెలుసా? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 23 సినిమాలు) కథేంటి? దిల్లీలో స్వీట్స్ బిజినెస్ చేసే పంజాబీ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు రాకీ రాంధ్వా (రణ్వీర్). తాత కన్వల్ (ధర్మేంద్ర), అమ్మమ్మ ధనలక్ష్మి (జయా బచ్చన్)తో కలిసి ఉంటాడు. అయితే కన్వల్.. తన ఫ్రెండ్ జామినీ ఛటర్జీ(షబానా అజ్మీ)ని కలవాలని ప్రయత్నిస్తుంటాడు. వాళ్లిద్దరినీ కలిపేందుకు రాకీ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే జామిని మనవరాలు రాణీ (అలియాభట్)తో ప్రేమలో పడతాడు. మరి చివరకు ఏమైందనేదే 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ' స్టోరీ. ఆ ఓటీటీలోనే జూలై 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. మంచి టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అలాంటి ఇప్పుడు ఈ చిత్రాన్ని.. రెంట్(అద్దె) విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఈ చిత్రం చూడాలంటే రూ.349 కట్టాల్సి ఉంటుంది. అలా కాదంటే కొన్నిరోజులు ఆగితే ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. అది ఎప్పుడనేది ఇంకా ప్రకటించలేదు. ఇకపోతే ఈ మధ్య 'ఓ ఝమ్కా' అనే పాట తెగ ట్రెండ్ అయింది కదా. అది ఈ సినిమాలోనిదే. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా!?) -
ఇషా అంబానీతో జతకట్టిన అలియాభట్! ఇక దూకుడే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt), రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ( Isha Ambani) జతకట్టారు. ఎడ్-ఎ-మమ్మా అనే వ్యాపార సంస్థతో బిజినెస్ రంగంలోనూ పేరుగాంచిన అలియాభట్, రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్‌తో చేతులు కలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు అలియాభట్. ఇషా అంబానీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘బూట్స్ట్రాప్డ్ వెంచర్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma), భారతదేశపు అతిపెద్ద రిటైలర్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd) సంస్థలు చేతులు కలిపాయి. ఇక రెండూ కలిసి వ్యాపారం సాగిస్తాయి’ అని అలియాభట్ పేర్కొన్నారు. ఇద్దరు తల్లులమైన తాము ఇలా చేతులు కలపడం మరింత ప్రత్యేకమైందని వివరించారు. (తండ్రికి తగ్గ తనయ.. ఆకట్టుకున్న ఇషా అంబానీ మాటలు!) ఎడ్-ఎ-మమ్మా కంపెనీని 2020లో ఏర్పాటు చేశారు అలియా భట్. ఇది ప్రత్యేకంగా పిల్లలు, టీనేజనర్ల దుస్తులు, ప్రసూతి తల్లులకు సంబంధించిన దస్తులు విక్రయించే ఆన్లైన్ షాపింగ్ సంస్థ. ఇక అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ, జిమ్మీ చూ వంటి ప్రముఖ బ్రాండ్ల సహకారంతో రిలయన్స్ రిటైల్ భారతదేశంలో అతిపెద్ద రిటైలర్లలో ఒకటిగా ఉంది. దీనికి డైరెక్టర్‌గా ఉన్న ఇషా అంబానీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఆమె ఒక స్టార్ హీరోయిన్.. వామ్మో ఇన్ని కోట్ల ఆస్తులా?
సినీ ఇండస్ట్రీలో తారల ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక స్టార్స్‌గా ఎదిగినా వారికైతే కోట్లలో పారితోషికాలు ఇచ్చుకోవాల్సిందే. సినిమాలే కాకుండా ఇంకా ప్రకటనల్లో నటిస్తూ కోట్లలోనే గడిస్తూ ఉంటారు. అది సినీ ఇండస్ట్రీలోని స్టార్ ముద్ర వేసుకున్న నటీనటుల రేంజ్. సాధారణంగా హీరోయిన్ల కంటే.. హీరోల రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే పారితోషికం విషయానికి వచ్చేసరికి కాస్తా తక్కువే. అయితే కేవలం వాటితోనే కాకుండా బిజినెస్‌లోనూ కోట్లు గడించేవారు ఉన్నారు. అలాంటి వారిలో ముందువరుసలో వినిపించే పేరు ఆలియా భట్. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆదాయం హీరోలకు ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. అసలు ఆ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: హీరోయిన్‌కు ముద్దు.. ఘాటుగానే స్పందించిన డైరెక్టర్!) రూ.560 కోట్ల ఆస్తులు బాలీవుడ్ భామ హీరోయిన్ మాత్రమే కాదు. మంచి బిజినెస్ ఉమెన్ కూడా. ఆమెకు దాదాపు రూ.150 కోట్ల రూపాయల విలువైన 'యాడ్-ఎ-మామా' అనే ప్రసిద్ధ దుస్తుల బ్రాండ్‌ను కలిగి ఉంది. ఈ బిజినెస్ ద్వారా అలియా భట్ విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అలియా భట్ ఇప్పటికే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. గతేడాది బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న అలియా భట్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 560 కోట్ల విలువతో భారతదేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన హీరోయిన్గా నిలిచింది. ఆలియా భట్ ఆస్తులు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ విలాసవంతమైన మూడు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. లండన్‌లో ఒకటి ఉండగా.. ముంబైలోని జుహు, బాంద్రాలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ప్రస్తుతానికి అలియా సోదరి షాహీన్ జుహూ ఇంట్లో ఉంటోంది. అలియా మొదటిసారి ఇంటిని ఇండియాలో కాకుండా లండన్‌లోనే కొనుగోలు చేసిందట. గతంలో లండన్‌లో సొంతిల్లు ఉండాలనేది తన కల అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అలియా భట్ లండన్ ఇంటి విలువ రూ.25 కోట్ కాగా.. అది కోవెంట్ గార్డెన్లో ఉంది. 2020లో అలియా భట్ బాంద్రాలో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. వాస్తు పాలి హిల్స్ కాంప్లెక్స్ ఐదో అంతస్తులో ఉన్న ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ.40 కోట్లు కాగా.. అదే బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని ఏడో అంతస్తులో రణబీర్ కపూర్‌కు కూడా ఓ ఇల్లు ఉంది. బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారు రూ. 2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్‌తో పాటు అలియా భట్‌కు ఇంకా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆమె వద్ద ప్రస్తుతం 3 ఆడి కార్లు ఉన్నాయి. (ఇది చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) రూ.150 కోట్ల బిజినెస్ అలియా భట్ తాన సొంతంగా 'యాడ్-ఎ-మామా' పేరుతో దుస్తుల బ్రాండ్ 2020లో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఇప్పుడు రూ. 150 కోట్లకు చేరుకుంది. ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ అలియా భట్ కంపెనీని రూ. 300-350 కోట్లకు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అంతే కాకుండా అలియా భట్ ఒక ప్రొడక్షన్ హౌస్‌కు యజమాని కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె 2019లో ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ పేరుతో దీన్ని లాంఛ్ చేసింది. ప్రొడక్షన్ హౌస్ పేరుతో ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో 38 కోట్ల రూపాయల విలువైన అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసింది బాలీవుడ్ భామ. ఒకవైపు నటనతో పాటు.. మరోవైపు బిజినెస్‌లోనూ సక్సెస్ సాధిస్తూ కోట్లు గడిస్తున్న హీరోయిన్లలో టాప్ ప్లేస్‌లో ఆలియా భట్ కొనసాగుతోంది. ఈ రేంజ్లో సంపాదిస్తున్న ఇప్పటి స్టార్ హీరోయిన్లు నయనతార, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యరాయ్, సమంత కూడా ఆలియాకు పోటీనిచ్చే స్థాయిలో లేరని తెలుస్తోంది. -
దేశాలు వేరైనా డ్యాన్స్ నీదేనయా!
టాంజానియాలో కంటెంట్ క్రియేటర్ కలీపాల్ తన సోదరి నీల్పాల్తో కలిసి చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’ సినిమాలోని ‘ఝుమ్ఖా’ పాటకు కలీపాల్, నీమ్పాల్లు స్టెప్పులు వేశారు. తమ సంప్రదాయ దుస్తులు ధరించి చేసిన ఈ డ్యాన్స్ వీడియో 1.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ► ఏ దేశమేగినా గానం నుంచి నృత్యం వరకు ఏదో ఒక రూపంలో దేశం మనతో ఉంటుంది. తాజాగా ఐకానిక్ వాషింగ్టన్ మాన్యుమెంట్ (యూఎస్) బ్యాక్‌గ్రౌండ్‌గా స్వాతి జయశంకర్ భరతనాట్యం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్ బ్యూటిఫుల్ డ్యాన్స్’ అంటూ కామెంట్ సెక్షన్ ప్రశంసలతో నిండిపోయింది. -
రణ్వీర్ సింగ్ రీల్ లగ్జరీ బంగ్లా: రియల్ ఓనర్ ఎవరో తెలిస్తే షాకవుతారు
Rocky RandhawaParadise: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ,స్టార్ హీరోయిన్ అలియా భట్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ హిట్‌టాక్ సొంతం చేసుకుంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ మూవీలో ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ లాంటి బి-టౌన్‌కు చెందిన ప్రముఖులు నటించిన సంగతి తెలిసిందే. అయితే చిత్రం విడుదలైనప్పటి నుంచి రణ్వీర్ సింగ్ పాత్ర నివసించిన లగ్జరీ బంగ్లా హాట్ టాపిక్‌గా నిలిచింది. ‘రాకీ రంధావా పారడైజ్’ గా సినిమాలో చూపించిన సుందరమైన 'రాకీ రాంధావా' భవనంలోని అద్బుతమైన షాట్లు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండానే ఈ భవనంలోని దృశ్యాలు మంత్రముగ్దులను చేశాయి. షెహజాదా మూవీ చిత్రీకరణ కూడా ఇక్కడే జరిగిందట. విలాసవంతమైన భవనం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిఅందమైన భవనం లండన్‌లో ఉందని కొందరు , స్విట్జర్లాండ్‌లో ఉందని సినీ ప్రియులు ఊహాగానాలు చేశారు. కానీ ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉంది. ఇంతకీ ఈ భవనం ఎవరిది, ఇందులో విశేషాలేంటి తెలుసుకుందా రండి! గౌర్ మల్బరీ మాన్షన్స్ స్వర్గధామంగా చిత్రీకరించిన ‘రాకీ రంధావా’ అసలు పేరు ది గౌర్ మల్బరీ మాన్షన్స్ ఇదిగ్రేటర్ నోయిడా సెక్టార్-1లో ఉంది. దాదాపు 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంతేకాదు ఈ ఐకానిక్, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్ భవనాన్ని కూడా పోలి ఉంటుందని కూడా అంచనా. ఫర్నీచర్, కళాఖండాలు, అలంకార వస్తువులు, ఫ్లోరింగ్, షాన్డిలియర్లు, కిటికీలు, మిర్రర్.. ఒకటేమిటి సర్వం పచ్చదనానికి మారు పేరుగా ఉన్నాయి. గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,ఎండీ మనోజ్ గౌర్ బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త, గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ సొంతంఈ గౌర్ మల్బరీ మాన్షన్స్ . రియల్ ఎస్టేట్ దిగ్గజం మనోజ్ క్రెడాయ్ నేషనల్ చైర్మన్ మరియు క్రెడాయ్ (NCR) అధ్యక్షుడు కూడా. గత 28 సంవత్సరాలుగా, గౌర్స్ గ్రూప్‌కు లీడ్ చేస్తున్న మనోజ్ అనేక ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తిచేశారు. డెలివరీ నుంచి నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్‌ల నాణ్యతతోపాటు అందుబాటులో ధరల్లో గృహాలను అందిస్తూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగం మాత్రమేకాదు మనోజ్ గౌర్ కూడా పర్యావరణ పద్ధతులను పాటించడంలోనూ దిట్ట. సోలార్ పవర్ ప్లాంట్‌లో రూ.80 కోట్లు పెట్టుబడులున్నాయి.. -
హాలీవుడ్ స్టార్స్‌కి తెలుగు నేర్పిన ఆలియా!
హాలీవుడ్ స్టార్స్ తెలుగులో మాట్లాడారు. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. 'ఆర్ఆర్ఆర్' హీరోయిన్ ఆలియా భట్ వాళ్లకు తెలుగు నేర్పించింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. అసలు ఆలియా వాళ్లకు ఎందుకు, ఏం నేర్పిందనేగా మీ డౌట్. అక్కడికే వచ్చేస్తున్నా. అలా సరదాగా ఏం మాట్లాడుకున్నారో కూడా చెప్పుకుందాం. (ఇదీ చదవండి: నటుడిగా పనికిరాడన్నారు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు!) బాలీవుడ్ హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఆలియా.. పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకుంది. రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో సీతగా నటించి ఆకట్టుకుంది. ఇక ఆలియా నటించిన హాలీవుడ్ మూవీ 'హార్ట్ ఆఫ్ స్టోన్' రిలీజ్‌కి రెడీగా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఫన్నీ ఇంటర్వ్యూ జరిగింది. ఈ వీడియోలా ఆలియా భట్ కి తోడుగా గల్ గడాట్, జెమీ డోర్నర్ పలు విషయాలు మాట్లాడారు. అదే టైంలో ఆలియా భట్ తనకు తెలిసిన రెండు తెలుగు మాటల్ని సదరు హాలీవుడ్ స్టార్స్ తోనూ చెప్పించింది. 'అందరికీ నమస్కారం', 'మీకు నా ముద్దులు' అని ఇంగ్లీష్ యాక్టర్స్ చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ అంతే ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆలియాకి వచ్చిందే రెండు ముక్కలు.. వాటినే మళ్లీ నేర్పిస్తోంది అని అంటున్నారు. 🥺Never even thought of this would happen #galgadot #aliabhatt pic.twitter.com/q8tdPyReDm — Bahubali3 (@DinuRoyalC) August 8, 2023 (ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) -
సోది సినిమా, అచ్చంగా సీరియల్.. కట్ చేస్తే రూ.200 కోట్లు
రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని.. సోది సినిమా.. అసలిది సినిమానా? అచ్చంగా సీరియలే.. అయినా ఇది ఎప్పుడో చూసిన కథే, కొత్తగా ఏముంది? ఇలా నానామాటలు అన్నారు. కొందరు మాత్రం సినిమాను ఆస్వాదించారు. లొసుగులు వెతకడం మాని సినిమాను సినిమాలా ఆదరించారు. మొదట్లో ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. నెగెటివిటీని దాటుకుని వందల కోట్లు రాబడుతోందీ చిత్రం. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ఈ సినిమా దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. 'సినిమా రిలీజ్‌కు ముందు కొంత భయపడ్డాను. ఏడేళ్లుగా డైరెక్షన్‌కు దూరంగా ఉండటం వల్లో, లేదంటే మూడేళ్లుగా ఆందోళనతో బాధపడుతున్నందుల్లో.. ఎందుకో తెలియదు కానీ నాలో ఒకరకమైన భయం, నీరసం ఆవహించింది. అసలే బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు? ఎటువంటి ఫలితాలు వస్తాయో ఊహించలేకుండా ఉన్నాం. ఏదైతేనేం.. ఒకరకమైన డోలాయమానంలో ఉన్నాను. కానీ జూలై 23 శుక్రవారం.. నాలో ఎక్కడలేని ఉత్తేజం వచ్చి చేరింది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞుడిని. ప్రేమ, ఎనర్జీతో పనిచేసిన టీమ్ అందరి కృషి వల్ల దక్కిన ఫలితమే ఈ చిత్రం. ఈ సినిమాకు రచయితలుగా పనిచేసిన శషాంక్ ఖైతన్, సుమిత్ రాయ్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా మొదటి నుంచి వాళ్లు నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. కామెడీని రెట్టింపు చేసేలా స్క్రీన్‌ప్లేలో ప్రధాన పాత్ర పోషించిన ఇషిత మైత్ర గురించి స్పెషల్‌గా చెప్పుకుని తీరాల్సిందే! సోమెన్ మిశ్ర ఈ టీమ్‌కు ఆధ్వర్యం వహించి ఉండకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు' అని రాసుకొచ్చాడు. కాగా రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన 'రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని' చిత్రం జూలై 28న విడుదలైంది. జయా బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, అంజలి ఆనంద్, చుర్నీ గంగూలి, రాయ్ చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) చదవండి: భార్య చేతిలో చెయ్యేసి ఏడ్చిన నటుడు, వీడియో వైరల్ -
'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!
ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్, రణ్వీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ సోదరిగా తనదైన నటనతో అందరినీ ఆకర్షించింది బుల్లితెర నటి అంజలి ఆనంద్. రణవీర్ సింగ్ సోదరిగా గాయత్రీ రంధవా పాత్రలో కనిపించిన ఆమె ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) బుల్లితెర నటి అంజలి ఆనంద్ తాను కూడా బాడీ షేమింగ్‌కు గురైనట్లు వెల్లడించింది. బాలీవుడ్లో కెరీర్ ప్రారంభంలో యాక్టింగ్ స్కూల్లో చేరినప్పుడు.. తనను శరీర బరువును కించపరిచేలా కొందరు మాట్లాడారని తెలిపింది. తనకు సినిమా ఛాన్స్‌లు రావనీ.. కేవలం బర్గర్లు తినే పాత్రలు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయని ఎద్దేవా చేశారని వివరించింది. తాను లావుగా ఉన్నందున కొందరు దారుణంగా కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చింది. అంతకుముందు 'ధై కిలో రెమ్','కుల్ఫీ కుమార్ బజేవాలా' వంటి హిట్ టీవీ షోలతో తనదైన ముద్ర వేసింది. "కుల్ఫీ కుమార్ బజేవాలా"లో ప్రధాన పాత్రలో ఆమె తనదైన నటనతో అభిమానులను అలరించింది. కానీ అప్పట్లో ఆ పాత్రకు ప్రశంసల కంటే.. విమర్శలే ఎక్కువ వచ్చాయని తెలిపింది. లావుగా ఉన్న అమ్మాయి లీడ్ రోల్ ఎలా చేస్తుందని.. పలువురు తన క్యారెక్టర్‌ను కించపరిచేలా సందేశాలు పంపారని వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర అభ్యంతరకరమైన పదాలు వినియోగించారని తెలిపింది. 'లావుగా ఉన్న అమ్మాయికి సెకండ్ షోలో ప్రధాన పాత్ర ఎవరు ఇచ్చారు? బహుశా ఆమె ఎవరితోనైనా కమిట్ అయినందువల్లే అయి ఉండొచ్చు' అని దారుణంగా కామెంట్స్ చేశారని అంజలి వెల్లడించింది. అయితే వీటిపై తాను అదేస్థాయిలో స్పందించినట్లు వివరించింది. మనం ఇలాంటి వారి గురించి మాట్లాడటం మూర్ఖత్వమని విమర్శించింది. (ఇది చదవండి: 'అలాంటివాళ్లు దయచేసి ఈ ఫోటోలు చూడొద్దు'.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!) కాగా.. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో అంజలి గాయత్రి పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. నటనకు కావాల్సింది టాలెంట్ అని.. శరీర బరువుతో సంబంధం లేదని అంజలి నిరూపించింది. అలా విమర్శలు చేసేవారికి తన నటనతోనే సరైన సమాధానమిచ్చింది. సినిమా ఇండస్ట్రీలో విజయమనేది అంకితభావం, కృషిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. View this post on Instagram A post shared by ✨Anjali Anand✨ (@anjalidineshanand) -
రిటైర్ అయిపోతే మంచిది
‘కరణ్ జోహార్.. ఫస్ట్ నువ్వు రిటైర్ అయిపో.. ప్రతిభ ఉన్న కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించు.. వారు అద్భుతాలు సృష్టిస్తారు’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అన్నారు. రణవీర్ సింగ్, ఆలియాభట్ జంటగా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ఈ నెల 28న విడుదలైంది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కరణ్ జోహార్‌పై మండిపడ్డారు కంగనా రనౌత్. ‘‘భారతీయ ప్రేక్షకులు మూడు గంటల సినిమాలో ఎన్నో వింతలు చూస్తున్నారు. కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే ఈ నెపోటిజం గ్యాంగ్ మాత్రం రూ.250 కోట్ల బడ్జెట్‌తో డైలీ సీరియల్స్ తీస్తున్నారు. 1990లలో తాను తీసిన చిత్రాలనే కాపీ కొట్టి రూ.250 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసినందుకు కరణ్ సిగ్గుపడాలి.. డబ్బులు ఎందుకు వృథా చేస్తున్నావ్? ప్రతిభ ఉన్న ఎంతో మంది యువత సరైన వనరులు లేక సినిమాలు తీయలేకపోతున్నారు. అలాంటి వాళ్లకి అవకాశం కల్పిస్తే కొత్త కథలతో మూవీస్ తీసి విప్లవాత్మక మార్పు తీసుకొస్తారు’’ అన్నారామె. అలాగే రణ్వీర్ సింగ్‌ని ఉద్దేశించి–‘‘డ్రెస్సింగ్ విషయంలో కరణ్‌ను ఫాలో కావొద్దు. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా వంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకో. దక్షిణాది నటులను చూసి తెలుసుకో.. వాళ్ల లుక్‌లో ఓ డిగ్నిటీ, ఇంటిగ్రిటీ ఉంటాయి’’ అన్నారు కంగనా. -
సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!
Sudha Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' (Sudha Murthy) గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రముఖ రచయిత్రిగా, మానవతామూర్తిగా ప్రసిద్ధి చెందిన ఈమె ఆధునిక కాలంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గత కొన్ని రోజులకు ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలలో తన ప్రేమ గురించి వెల్లడించింది. కాగా ఇటీవల ఒక సినిమా చూసి ఏడ్చానని చెప్పుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఎప్పుడూ సినిమాలలోని ఎమోషనల్ సీన్లు చూసి కంటతడి పెట్టుకోలేదని, 'అలియా భట్' (Alia Bhatt) నటించిన 'రాజీ' మూవీలో తన నటనకు ఏడ్చేసినట్లు చెప్పుకొచ్చింది. మొదటి సారి 1958లో సినిమా చూసినట్లు, అప్పటి నుంచి వైజయంతిమాలకు అభిమానిగా మారానని చెప్పింది. ఈ తరం వారిలో 'అలియా భట్' నటనను అభిమానిస్తానని.. ఆమె గ్రేట్ యాక్టర్ అని కొనియాడింది. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్, మ్యూజిక్ వంటి వాటని గురించి ఇంట్లో చర్చించుకుంటామని సుధామూర్తి తెలిపారు. 2018లో విడుదలైన రాజీ సినిమాలో అలియా భట్ ఇండియా కోసం గూఢచారి పాత్రలో గొప్పగా నటించింది. ఈ మూవీ ఏకంగా రూ. 190 కోట్లు వసూలు చేసింది. అంతే కాకుండా 64 వ ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో ఉత్తమ నటి పురస్కారం ఒకటి కావడం గమనార్హం. -
బీచ్‌లో రకుల్.. బ్లాక్ చీరలో ఆలియా హాట్నెస్!
బీచ్ ఒడ్డున రకుల్ ప్రీత్ రచ్చ బ్లాక్ చీరలో ఆలియా భట్ మెల్టింగ్ పోజులు జాలీ డ్రస్ లో మృణాల్ ఠాకుర్ హాట్నెస్ అందాల విందు చేసిన కేతిక శర్మ బార్బీ డాల్‌లా తయారైన ప్రగ్యా జైస్వాల్ సిల్క్ చొక్కాలో డింపుల్ హీటెక్కించే స్టిల్స్ క్యూట్‌గా చూస్తూ కవ్విస్తున్న దీపికా పదుకొణె వాష్ రూమ్‌లో రష్మిక డిఫరెంట్ పోజులు View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
అసలు ఆ డైలాగ్స్ ఏంటి.? ఆలియా భట్ మూవీపై తీవ్ర అభ్యంతరం!
బాలీవుడ్ భామ ఆలియా భట్, రణ్వీర్ సింగ్ జంటగా తెరకెక్కించిన తాజా చిత్రం 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కథ'. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 28న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. రణ్వీర్ సింగ్, ఆలియాభట్ ప్రస్తుతం ముంబయిలో బిజీ బిజీగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఈ మూవీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలోని కొన్ని పదాలు, డైలాగ్స్ తొలగించాలని ఆదేశించింది. (ఇది చదవండి: ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!) సినిమాలో ఉపయోగించిన 'కస్' పదాన్ని మార్చాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మేకర్స్‌ను ఆదేశించింది. అంతేకాకుండా లోక్‌సభ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై డైలాగ్స్ తొలగించాలని సూచించింది. దీంతో కొన్ని అభ్యంతరకర పదాలు, డైలాగ్స్ తొలగించడానికి చిత్రబృందం అంగీకరించగా.. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి అనుమతి ఇచ్చింది. ఈ సినిమాలో చాలాసార్లు ఎక్కువగా వినియోగించిన బ్రా, ఓల్డ్ మాంక్ అనే పదాలను మారుస్తామని చెప్పడంతో సెన్సార్ బోర్డ్ అనుమతించింది. లోక్ సభ డైలాగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించిన డైలాగ్స్‌ను పూర్తిగా తొలగించాలని మేకర్స్‌ను కోరింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సన్నివేశంలో అభ్యంతకర పదాన్ని తొలగించాలని ఆదేశించింది. మహిళల లోదుస్తుల షాప్ సన్నివేశాల్లో 'బ్రా' అనే పదం వినియోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పదాలు వాడితే స్త్రీలను కించపరచడమేనని చిత్రబృందంపై సెన్సార్ బోర్డ్ మండిపడింది. (ఇది చదవండి: బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!) రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వయకామ్18 స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. కాగా.. జులై 28, 2023న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. -
ముంబయిలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి (ఫొటోలు)
-
దీపికా పదుకోణె భర్తతో ఆలియా భట్ ర్యాంప్ వాక్
-
తారల మెరుపులతో మనీష్ మల్హోత్రా ఈవెంట్ (ఫొటోలు)
-
రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్?
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి.. ఇంకొన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఓ సినిమాను నిర్మించనున్నట్లుగా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు ముగిసింది. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో ఈ చిత్రం నిలిచి΄ోయిందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలని నిర్మాతలు అనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమా పనులను మరింత వేగవంతం చేశారని బాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు వంటి ప్రధాన పాత్రలకు ఆర్టిస్టులను ఎంపిక చేసి, లుక్ టెస్ట్‌ను నిర్వహించేందుకు నితీష్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడి పాత్రలో యశ్‌లు నటించనున్నారని, ముందు వీరి లుక్ టెస్ట్ జరుగుతుందని టాక్. మరి.. ఈ ‘రామాయణం’లో రియల్ లైఫ్ జంట ఆలియా, రణ్‌బీర్ సీతారాములుగా కనిపిస్తారా? ‘కేజీఎఫ్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విజృంభించిన యశ్ ఈ చిత్రంలో రావణుడిగా బీభత్సం సృష్టిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడు ఏదో ఒక కామెంట్స్ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. గతంలో బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌పై పలుసార్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసింది. పరోక్షంగా ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటను ఉద్దేశించి ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అయితే తాజాగా విజయ్ సేతుపతితో కలిసి కంగనా ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే నెట్టింట్లో వచ్చిన స్క్రీన్షాట్లను షేర్ షేర్ చేస్తూ పరోక్షంగా విమర్శలు చేసింది. (ఇది చదవండి: అడల్డ్ మూవీ 'బార్బీ'.. సెన్సార్ ఓకే.. కానీ ఓ కండీషన్ ..!) ఇన్‌స్టాలో స్టోరీస్‌లో రాస్తూ.. 'నేను ఎప్పుడైనా సినిమా ప్రకటించినప్పుడు నాతో పాటు సహానటులను కించపరిచేలా హెడ్‌లైన్స్ పెడుతున్నారు. అసహ్యమైన బల్క్ మెయిల్స్ పంపుతూ ప్రచారం చేస్తున్నారు. అన్ని పేపర్లలో ప్రతి చోటా ఒకే హెడ్లైన్ ఎలా వస్తుంది. దీన్ని బల్క్ మాస్ మెయిల్ అంటారు. నన్ను చూసి మీరు బాధపడితే.. మీకోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. భగవాన్ వారి ఆత్మకు శాంతి చేకూర్చండి. ఇలా నాపై దుష్ప్రచారం చేస్తున్న చెంగుమంగు గ్యాంగ్‌కు ఒక్కటే చెబుతున్నా. నన్ను చూస్తే మీకెందుకు అంత అసూయ కలుగుతోంది.' అంటూ రాసుకొచ్చింది. కంగనా మరో పోస్ట్‌లో రాస్తూ..' బాలీవుడ్ జంట వేరు వేరు అంతస్తులలో నివసిస్తున్నారు. కానీ బయటికి మాత్రం కలిసి ఉన్నట్లు నటిస్తారు. మింత్రా బ్రాండ్‌ను తమ సొంతం అంటూ.. నా సినిమా గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు . ఇటీవలి అతను కుటుంబసభ్యులతో కలిసి లండన్ ట్రిప్ వెళ్లిగా.. భార్య ఆలియా భట్, కుమార్తె రాహా ఇండియాలో ఉన్నారు. కానీ దాని గురించి ఎవరూ వ్రాయలేదు. కానీ ఆమె భర్త మాత్రం కలవాలని ఆమెను వేడుకుంటున్నట్లు మెసేజ్‌లు పంపుతున్నాడని' చెబుతోంది.' మరోవైపు ఇన్‌స్టాలో రాస్తూ.. 'సినిమా ప్రమోషన్స్, డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే జరుగుతుంది. అతను పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదు.. మాఫియా డాడీ ఒత్తిడితో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నందుకు ప్రతిఫలంగా సినిమాల్లో అవకాశమిస్తానని అతను హామీ ఇచ్చాడు. ఇప్పుడు తను ఈ నకిలీ వివాహం నుంచి విముక్తి పొందాలని తీవ్రంగా ట్రై చేస్తున్నాడు. కానీ పాపం ఇప్పుడు అతనికి ఎవరూ లేరు. ఇకనుంచి తన భార్య, కుమార్తెపై దృష్టి పెట్టాలి. ఇండియాలో ఒకసారి పెళ్లయితే అంతా అయిపోనట్లే.. ఆబ్ సుధార్ జావో.' అని రణ్‌బీర్‌ను ఉద్దేశించి కౌంటరిచ్చింది. (ఇది చదవండి: పెళ్లి చేసుకోవాలనుంది, నాకంటూ ఓ కుటుంబం కావాలి: కంగనా) గతంలో తనపై గూఢచర్యం చేస్తున్నారంటూ కంగనా ఆరోపించిన సంగతి తెలిసిందే. తన గురించి ఫోటోగ్రాఫర్లకు ఎలా సమాచారం అందుతుంది అని ప్రశ్నించింది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం లీకవుతోందని కూడా ఆమె ఆరోపించింది. కాగా.. కంగనా తదుపరి చిత్రం 'తేజల్లో కనిపించనుంది. అంతేకాకుండా ఆమె తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఎమర్జెన్సీ'లో నటిస్తోంది. ఈ చిత్రంలో కంగనా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. ఆ తర్వాత 'చంద్రముఖి 2'లోనూ కీలకపాత్ర పోషించనుంది. -
హీరోయిన్ తాప్సీ ప్రెగ్నెంటా? ఆమె రియాక్షన్ ఇదే!
అదేంటో కొందరు హీరోయిన్లు కావాలని కాంట్రవర్సీ చేస్తారో లేదంటే వాళ్లు మాట్లాడిన తర్వాత ఆ కామెంట్స్ వివాదాస్పద అవుతుందో అస్సలు అర్థం కాదు. కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతుంటారు. ఇప్పుడు కూడా హీరోయిన్ తాప్సీ అలానే మాట్లాడింది. తనవైపు అందరూ చూసేలా చేసింది. హీరోయిన్ తాప్సీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే 'ఝమ్మంది నాదం' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్గా మారింది. ఆ తర్వాత ఇక్కడ పలు చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బోలెడన్ని క్రేజీ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'సలార్' మరో రికార్డ్) చాలాకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న తాప్సీ.. తాజాగా ఇన్ స్టాలో నెటిజన్స్ చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా ఒకతను.. 'మీ పెళ్లి ఎప్పుడు?' అని అడిగాడు. దీనికి తిన్నగా సమాధానమివ్వొచ్చుగా కానీ తాప్సీ అలా ఇవ్వలేదు. 'నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు కాబట్టి అతి త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు' అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కామెంట్స్ బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్‌కి కౌంటర్లా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ జంట ఏప్రిల్‌లో 14న పెళ్లి చేసుకున్నారు. నవంబరు 6న ఆలియా బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ విషయమై తాప్సీ.. పరోక్షంగా కామెంట్స్ చేసినట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: 'బేబీ' సినిమా.. ఆ దర్శకుడి రియల్ ప్రేమకథేనా?) -
ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వ్యాపార విస్తరణలో దూసుకు పోతోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో భాగమైన ముఖేష్ అంబానీ, ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ బ్రాండ్స్, ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మాను కొనుగోలుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత చర్చలు జరుపుతోందని సమాచారం. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం అలియా భట్ బ్రాండ్‌ను రూ. 300 నుంచి 350 కోట్ల భారీ డీల్‌లో కొనుగోలు చేయాలని యోచిస్తోంది. పిల్లల దుస్తుల విభాగంలో తమ ఉనికిని బలోపేతానికి యోచిస్తున్న ఇషా అంబానీ, ఇప్పటికే పాపులర్ అయిన అలియా బ్రాండ్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. అలియా భట్ అక్టోబర్ 2020లో ఎడ్-ఎ-మమ్మాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2-14 సంవత్సరాల వయస్సున్న కిడ్స్‌కు పూర్తి స్వదేశీ దుస్తులను విక్రయిస్తుంది. డిజిటల్ మార్కెట్‌ప్లేస్ ఆరంభంనుంచే అలియా బ్రాండ్ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభంలో అలియా ఎడ్-ఎ-మమ్మా రూ. 150 కోట్లకు పైగా వాల్యుయేషన్‌ను సాధించిందని అంచనా. అటు రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం రూ. 918000 కోట్ల కంటే ఎక్కువ విలువను సాధించింది. అలాగే వాల్యుయేషన్ పరంగా ఇది ఇప్పటికే ఐటీసీ, హెచ్‌యూఎల్ లాంటి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలను అధిగమించింది. వరుస డీల్స్‌తో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలకు సవాల్ విసురుతోంది ఇషా. అయితే తాజా వార్తలపై అటు రిలయన్స్‌రీటైల్, ఇటు అలియా భట్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) కాగా ఆగస్ట్ 2022లో రిలయన్స్ రిటైల్ హెడ్‌గా ఇషా అంబానీని ముఖేష్ అంబానీ నియమించారు. అప్పటికి సంస్థ టర్నోవర్ రూ. 2 లక్షల కోట్టు. జిమ్మీ చూ, జార్జియో అర్మానీ, హ్యూగో బాస్, వెర్సేస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ లాంటి ఇతర ప్రపంచ బ్రాండ్లు రిలయన్స్ రిటైల్ భాగస్వామి బ్రాండ్‌గా భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. -
స్టార్ హీరోయిన్.. అయినా కూడా చెప్పులు మోసింది!
బాలీవుడ్ భామ ఆలియా భట్ పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగువారికి కూడా దగ్గరైంది. ప్రస్తుతం రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ చిత్రంలో నటిస్తోంది. గతేడాది బ్రహ్మస్త్ర సినిమా హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతే రణ్‌బీర్‌సింగ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ గతేడాది నవంబర్‌లో ఓ పాపకు జన్మనిచ్చింది. తన ముద్దుల కూతురికి రాహా అని నామకరణం కూడా చేసింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఆలియా భట్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం. (ఇది చదవండి: స్లిమ్ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!) ఓ ఈవెంట్‌కు హాజరైన ఆలియా భట్ తిరిగి వెళ్తుండగా కారు వద్ద ఆమెకు ఓ వ్యక్తి చెప్పు కనిపించింది. అయితే కారు వద్దకు వెళ్తున్న ఆలియా భట్ ఎవరిదని ఆరా తీసింది. అంతే కాకుండా స్వయంగా తానే చేతితో పట్టుకుని అతనికి అందించింది. ఇది చూసిన నెటిజన్స్ ఆలియా సింప్లిసిటీ మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీ అయినప్పటికీ ఓ సాధారణ వ్యక్తి పాదరక్షలను చేతితో పట్టుకుని ఇవ్వడం గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా ఆలియా భట్ నటిస్తోన్న 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 28న థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అత్యంత దారుణస్థితిలో నటుడు మృతి!) Alia Respect 🙌🏻 Might have seen a few celebs lifting their own footwears but Never seen someone lifting a pap's sleeper lying roadside & people troll her for her attitude#AliaBhatt pic.twitter.com/cNV6e4vTqA — Nikki Tamboli Fam 💅🏻 (@FamNikki) July 13, 2023 -
ప్రెగ్నెంట్ అని తెలిసినా..ఆ అవకాశం వదులుకోలేదు: అలియా
వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. తాజాగా ఈ బ్యూటీ హాలీవుడ్‌లోనూ తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధమైంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’మూవీతో ఈ భామ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా.. ఈ మూవీ షూటింగ్ అనుభవాలు పంచుకుంది. ‘గతేడాది ఏప్రీల్‌లో రణ్‌బీర్‌తో నా పెళ్లి అయిన వెంటనే ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ షూటింగ్ ప్రారంభమైంది. అదే ఏడాది జూన్‌లో నేను గర్భం దాల్చాను. అయినప్పటికీ షూటింగ్లో పాల్గొన్నాను. షూటింగ్ మొత్తం అయ్యాక..కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాకపోవడంతో వాటిని మళ్ళీ రీషూట్ చెయ్యాలి అన్నారు. అప్పటికే నేను ప్రెగ్నెంట్. కానీ ఈ విషయం చెప్పకుండా షూటింగ్లో పాల్గొన్నాను. (చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) అయితే కొంతమంది మాత్రం నా బేబీ బంప్‌ని గుర్తించారు. ఆ తర్వాత సులభంగా చీత్రీకరణలో పాల్గొన్నాను. షూటింగ్ సమయంలో చిత్రబృందం నాకు చాలా సౌకర్యాలు కల్పించింది. అందుకే ప్రెగ్నెంట్ అయినా సులభతరంగా షూటింగ్ పూర్తి చేశా. ఇది నా మొదటి హాలీవుడ్ మూవీ.అందుకే వదులుకోకూడదని ప్రెగ్నెంట్ అని తెలిసినా సినిమా చేశాను’అని అలియా చెప్పుకొచ్చింది. కాగా గతేడాది ఏప్రిల్‌లో స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో అలియా పెళ్లి అయింది. ఆ తర్వాత రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. అదే ఏడాది నవంబర్‌లో ఓ పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. -
హీరోయిన్లు చేసే ఈ ఉపవాసం గురించి తెలుసా?
‘సిలికాన్ వ్యాలీ ట్రెండ్’గా పేరున్న ‘డోపమైన్ ఫాస్టింగ్’ సాంకేతిక నిపుణులకే పరిమితం కాలేదు. యువతరానికి దగ్గర అవుతోంది. డిజిటల్ ప్రపంచంలో హద్దులు దాటుతున్న ‘ప్లెజర్ కెమికల్’కు నియంత్రణ విధించడానికి ‘డోపమైన్ ఫాస్టింగ్’ అనేది ఒక మార్గం అయింది... చెన్నైకి చెందిన ఇరవై రెండు సంవత్సరాల రుచిత తన ఫ్రెండ్ ద్వారా ‘డోపమైన్ ఫాస్టింగ్’ అనే మాట విన్నది. ‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అనుకుంటూ రంగంలోకి దిగింది. తల్లిదండ్రులకు చెప్పి మారుమూల ప్రాంతంలోని చుట్టాల ఇంటికి వెళ్లింది. ఆ పల్లెలో ఉరుకులు పరుగులు కనిపించవు. రణగొణ ధ్వనులు వినిపించవు. పిట్టపాటను దగ్గరగా వినే అదృష్టం దక్కుతుంది.సెల్‌ఫోన్‌కు సెలవు ఇచ్చి ఆ వారం రోజులు ఒక చెట్టు కింద కూర్చొని నచ్చిన పుస్తకాలు చదువుకుంది.పట్నాకు చెందిన తేజశ్రీకి నాన్‌స్టాప్‌గా మాట్లాడే అలవాటు ఉంది. రానూ రానూ ఆమె అంటే స్నేహితుల్లో తెలియని భయం లాంటిది ఏర్పడింది. పక్కకు తప్పుకోవడం మొదలైంది. ఇది గమనించిన తేజశ్రీ ఆలోచనల్లో పడినప్పుడు ఆమెకు కనిపించిన దారి... డోపమైన్ ఫాస్టింగ్. ఫాస్టింగ్‌లో భాగంగా ఒక వారం రోజుల పాటు అవసరమైతే తప్ప ఒక్కమాట కూడా ఎక్కువ మాట్లాడలేదు తేజశ్రీ!. ఫాస్టింగ్ తరువాత ఆ ఇద్దరి నోటినుంచి వచ్చిన మాట...‘ఇంత అద్భుతమైన ఫలితాన్ని ఊహించలేదు’ఈ ఇద్దరు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా యువతరంలో ఎంతోమంది జపిస్తున్న మంత్రం... డోపమైన్ ఫాస్టింగ్. ‘డోపమైన్ ఫాస్టింగ్’ సిలికాన్ వ్యాలీలో మారుమోగిన ట్రెండ్. సాంకేతిక నిపుణులను బాగా ఆకట్టుకుంది.‘దీనికి ఎలాంటి శాస్త్రీయ పద్దతి పదికా లేదు’ అనే మాట ‘డోపమైన్ ఫాస్టింగ్’ పాపులారిటీని యూత్‌లో తగ్గించలేకపోతోంది. టీవీ షోలు, యూట్యూబ్ వీడియోలు, పాడ్‌కాస్ట్, మ్యూజిక్ షోలు... డిజిటల్ ప్రపంచంలో వివిధ మార్గాల ద్వారా మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది. డిజిటల్ కంటెంట్ నుంచి డివైజ్‌లకు అతిగా అలవాటు పడడం వరకు ప్లెజర్ కెమికల్ అనబడే ‘డోపమైన్’ హద్దులు దాటితే అది దురలవాటుగా మారి సమస్యల్లోకి తీసుకువెళుతుంది. అధిక నిద్ర, అధిక తిండి నుంచి అదే పనిగా సోషల్ మీడియాలో తలదూర్చేవరకు... ఎన్నెన్నో అలవాట్లు డోపమైన్ ప్రతిఫలనాలే. అమెరికన్ సైకియాట్రిస్ట్ అన్నా లెంబ్కే‘డోపమైన్ నేషన్’ పేరుతో పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో ఆమె రాసిన ఒక మాట...‘మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అవసరమైన దానికంటే ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఒత్తిడి పెరుగుతోంది. సౌకర్యాలు, వస్తువులు పెరిగేకొద్దీ సంతోషం కూడా తగ్గుతుంది’‘డోపమైన్ ఫాస్టింగ్ అంటే తిండికి దూరం కావడం కాదు. ఎవరితో మాట్లాడకపోవడం కాదు. మెదడులో డోపమైన్ విడుదలయ్యేందుకు కారణమయ్యే వాటికి విరామం ఇవ్వడం’ అంటున్నారు నిపుణులు. ‘డోపమైన్ ఫాస్టింగ్’ లక్ష్యం డోపమైన్‌కు దూరం చేయడం కాదు. డోప్మైన్ లోపం వల్ల ఏ సంతోషం లేకుండా జీవితం నిస్సారంగా అనిపించడం, డిప్రెషన్లో కూరుకుపోవడం, చెడు అలవాట్లకు బానిస కావడంలాంటివి కూడా జరిగే ప్రమాదం ఉంది. అందుకే డిజిటల్ ఫాస్టింగ్ అనేది ‘డోపమైన్’ మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా సమన్వయ ధోరణిలో వెళుతుంది. అందుకే ‘డోపమైన్ ఫాస్టింగ్’ మోస్ట్ వవర్ఫుల్ బ్రేక్‌గా పేరు తెచ్చుకుంది.‘సంతోషకరమైన విషయం ఏమిటంటే యువతరం డోపమైన్ డిటాక్స్పై దృష్టి పెడుతోంది. డోపమైన్ ఫాస్టింగ్ వల్ల వచ్చిన విరామం ద్వారా తమ మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ చూపే ప్రతికూల ప్రభావాన్ని గురించి తెలుసుకోగలుగుతున్నారు’ అంటుంది అన్నా లెంబ్కే. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాలీవుడ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో బాగా పాపులర్ అయిన ట్రెండ్.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో భాగంగా 16 గంటల ఫాస్టింగ్ రూల్‌ని అనుసరిస్తూ ఆలియాభట్ బరువు తగ్గింది. వెజిటేరియన్‌గా మారింది. వ్యాయామాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే జాక్వీలైన్ ఫెర్నాండేజ్ ఇంటిర్మిటెంట్ ఫాస్టింగ్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. కమెడియన్ భారతిసింగ్ లాక్డౌన్ సమయంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను అనుసరించి పదిహేను కిలోల బరువు తగ్గింది. హీరో వరుణ్ ధావన్ రోజుకు 14-16గంటల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను అనుసరిస్తాడు. -
ఒక్క నిమిషంలో 20 చీరలు.. ఆలియా అసలు ఎలా!?
బాలీవుడ్ లో చాలామంది స్టార్స్ తో పోలిస్తే ఆలియా భట్ సమ్‌థింగ్ స్పెషల్. టీనేజ్ లోనే హీరోయిన్ అయిపోయింది. చాలా తక్కువ టైంలోనే స్టార్ డమ్ సంపాదించింది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. హాలీవుడ్ లోనూ ఈమె నటించిన తొలి మూవీ త్వరలో విడుదల కానుంది. ఇలాంటి టైంలో ఆలియా భట్.. ఓ విషయంతో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేసింది. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) ఆలియా భట్ ప్రస్తుతం హిందీలో చేస్తున్న మూవీ 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'.. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూలై 28న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా టీజర్ ని మంగళవారం రిలీజ్ చేశారు. 1:19 నిమిషాల ఈ వీడియో.. చూడటానికి ఫుల్ కలర్‌ఫుల్ గా ఉంది. మ్యూజిక్ కూడా వినసొంపుగా ఉంది. ఈ టీజర్ చూస్తుంటే.. గతంలో బాలీవుడ్ లో వచ్చిన ఫ్యామిలీ సినిమాలే గుర్తొచ్చాయి. 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా కనిపిస్తున్నప్పటికీ.. ఇందులో ఆలియాభట్ చీరలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఎందుకంటే నిమిషం టీజర్ లోనే దాదాపు 20కి పైగా చీరల్లో ఈ బ్యూటీ సందడి చేసింది. మరి మూవీ మొత్తంలో ఇంకెన్ని చీరల్లో కనిపిస్తుందోనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆలియా భట్ కట్టుకున్న చీరలన్నీ కూడా అమ్మాయిలకు తెగ నచ్చేస్తున్నాయి. (ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?) -
శారీలో రకుల్ హోయలు.. బ్రెజిల్లో ఆలియా భట్ పోజులు!
►వైట్ శారీలో రకుల్ ప్రీత్ సింగ్ హాట్ లుక్స్ ►గ్రీన్ డ్రెస్‌లో బాలీవుడ్ భామ ఆలియా భట్ పోజులు ►హెబ్బా పటేల్ లుక్స్ క్యూట్ లుక్స్ ►శోభిత రానా స్టన్నింగ్ పిక్స్ ►బ్లాక్ డ్రెస్‌లో ప్రియా భవానీ శంకర్ View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) -
అలియా హాలీవుడ్ ఎంట్రీ: ఆమె గ్రీన్ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే..!
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ఫ్యాన్ ఈవెంట్లో బాలీవుడ్ బ్యూటీ అలియా తన గ్లామర్ లుక్‌లో అందర్ని మరోసారి మెస్మరైజ్ చేసింది. బ్రెజిల్‌లోని సావో పాలోలో జరిగిన నెట్‌ఫ్లిక్స్ టుడమ్ 2023 ఈవెంట్‌కు హాజరైన అలియా రెండో రోజు అందంగా మెరిసిపోయింది. ఫుల్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్‌లో గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ డ్రెస్ ఖరీదు ఎంత అనేది చర్చకు తెర లేచింది. అలియా భట్ హై వెయిస్ట్ పెప్లమ్ గౌను ధర రూ. 1.38 లక్షలు ఎక్కడ ఏమి ధరించాలో అలియా భట్‌కి తెలుసు, అందులోనూ గ్లోబల్ ఈవెంట్, హాలీవుడ్ ఎంట్రీ.. తొలిరోజు విమర్శల నేపథ్యంలో రెండో రోజు జాగ్రత్త పడింది. హై వెయిస్ట్ పెప్లమ్ , సెంటర్-బ్యాక్ స్లిట్, బాడీ ఫిట్టింగ్ గ్రీన్ డ్రెస్‌లో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. ఈ డ్రెస్ ధర 1690 డాలర్లు అంటే రూ.1,38,525 అన్నమాట. హార్ట్ ఆఫ్ స్టోన్‌తో హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు ఈ సినిమా ట్రైలర్లాంచ్తో మరో మెట్టు ఎదిగిపోయింది. క్లాస్ మినిమల్ అవతార్‌లో హార్ట్ ఆఫ్ స్టోన్ సహ-నటులు గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో కలిసి పోజులిచ్చింది. ఈ ఫోటోలను షేర్ చేసిన అలియా "ఒబ్రిగాడో బ్రెజిల్...అందరి ప్రేమకు ధన్యవాదాలు! అంటూ గ్రీన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేయడం విశేషం. కాగా ఇదే ఈవెంట్లో తొలి రోజు డ్రెస్సింగ్‌కు సంబంధించి అలియా అద్భుతంగా కనిపించి నప్పటికీ, ఈవెంట్లో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కారణంగా విపరీతంగా ట్రోలింగ్ గురైంది. గన్ని బ్రాండ్ మ్యాచింగ్ స్కర్ట్‌తో పింక్-హ్యూడ్ గ్లోసీ జాకెట్-షేప్ టాప్‌ను ధరించింది. ఈ బ్లేజర్ ధర రూ. 39,952, మ్యాచింగ్ క్రాప్ టాప్ ధర రూ. 20,200. టోటల్‌గా పింక్-హ్యూడ్ శాటిన్ అవుట్‌ఫిట్ ధర రూ. 93,628. -
విలన్‌గా ఆలియా భట్.. ఆ హాలీవుడ్ మూవీలో ఏకంగా
బాలీవుడ్ లో చాలామంది స్టార్స్ తో పోలిస్తే ఆలియా భట్ స్పెషల్. ఎందుకంటే టీనేజ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ కొట్టింది. అందరిలానే ఈమెని కూడా నెపోటిజం కిడ్ అని ట్రోల్స్ చేశారు. కానీ అవేవీ ఈమె సక్సెస్ ని ఆపలేకపోయాయి. దీంతో ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లోనూ అదరగొట్టేందుకు రెడీ అయిపోయింది. ఆలియా హాలీవుడ్ ఎంట్రీ ఇప్పటివరకు 20కి పైగా హిందీ సినిమాల్లో నటించిన ఆలియా.. రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'లోనూ హీరోయిన్ గా నటించింది. అలా తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయమే. హాలీవుడ్ లో 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే మూవీ చేస్తోంది. అక్కడ ఆలియాకు ఇదే ఫస్ట్ మూవీ. చానాళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమాని ఆగస్టు 11న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు. (ఇదీ చదవండి: కోర్టులో లొంగిపోయిన హీరోయిన్ అమీషా పటేల్!) క్యూటెస్ట్ విలన్ గా ఆలియా! మన దగ్గర హీరోయిన్ గా అలరించిన ఆలియా.. హాలీవుడ్ ఎంట్రీ మాత్రం క్యూటెస్ట్ విలన్ గా ఇచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఈమె సీన్స్ సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉన్నాయి. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ తో వావ్ అనిపించింది. ఈ మూవీ ఆలియాకు చాలా స్పెషల్. ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉన్న టైంలోనే షూటింగ్ లో పాల్గొని, సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. 'హార్ట్ ఆఫ్ స్టోన్' స్టోరీ ఏంటి? దేశాన్ని ప్రమాదాల బారినుంచి రక్షించేందుకు 'చార్టర్' అనే ఓ సీక్రెట్ టీమ్ పనిచేస్తుంటుంది. దీనికి రాచెల్ స్టోన్(గాల్ గాటోడ్) లీడర్. దేశానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినప్పుడు ఈ టీమ్ దాన్ని సరిచేస్తుంటారు. 'ది హార్ట్' అని పిలిచే ఓ మాక్ గఫిన్ కోసం వీరు వెతుకుతూ ఉంటారు. మరో టీమ్ కూడా దీనికోసమే సెర్చ్ చేస్తూ ఉంటుంది. 'ది హార్ట్' కోసం రెండు టీమ్స్ పోటీ పడుతుంటే.. ఆలియా భట్ రోల్ కూడా ఎంట్రీ ఇస్తుంది. చివరకు ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' మూవీ.. ప్రభాస్ అందుకే సైలెంట్‌గా ఉన్నాడా?) -
వైరల్ అవుతున్న విజయ్ వర్మ పెళ్లి నాటి ఫోటో!
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో విజయ్ వర్మ పేరు ఎక్కడికెళ్లినా వినిపిస్తోంది. తను నటించిన దహాద్, డార్లింగ్స్, మీర్జాపూర్, గల్లీబాయ్, లస్ట్ స్టోరీస్-2 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తమన్నాతోనే అతనికి మరింత గుర్తింపు దక్కింది. తాజాగా విజయ్ వర్మని ఇష్టపడుతున్నట్లు తమన్నా ఓపెన్ అయింది. దీంతో అతను మరింత పాపులర్ అయ్యాడు. విజయ్ ఏ ఇంట్లో ఉంటాడో అనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. సినీ పరిశ్రమలో స్థిరపడిన అతనికి ఇప్పటికీ ముంబయిలో సొంత ఇల్లు లేదు. ప్రస్తుతం అక్కడ సముద్రానికి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. గత 10 సంవత్సరాలలో, అతను వివిధ కారణాల వల్ల 14 అద్దె ఇళ్లకు మారాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని అతని ఇంట్లో ఒక మీడియా ప్రతినిధితో పంచుకున్నాడు. (ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్.. పక్కాగా ఆ సినిమాలను దాటేస్తుంది) అలియా భట్‌తో విజయ్ వర్మ పెళ్లి ఫోటో స్టోరీ ఇదే విజయ్ వర్మ ఇంటి హాలులో కొన్ని ఫోటో ఫ్రేమ్‌లు ఉన్నాయి. వాటిలో ఒక ఫోటో ఆసక్తగా కనిపిస్తోంది. అదేమిటంటే, స్టార్ హీరోయిన్ అలియా భట్, విజయ్ వర్మ కలిసి ఒకే ఫోటోలో ఉన్నారు. అది కూడా పెళ్లి బట్టలతో.. ఇదేమిటని ప్రశ్నించగా.. 'ఇది డార్లింగ్ సినిమా కోసం ఫోటోషాప్ చేసిన ఫోటో.. అందులో అలియా నా భార్యగా నటించారు. ఆ సమయంలోనే మేకర్స్ ఈ ఫోటో తీశారు.. మా అమ్మ కూడా ఈ ఫోటోను చూసినప్పుడు, షాక్ కావడమే కాకుండా ఎప్పుడు పెళ్లి చేసుకున్నావ్'? అని అడిగిందంటూ చెప్పుకొచ్చాడు. చివరగా కిచెన్ రూమ్‌ను మాత్రం చూపించలేనని తెలిపాడు. ఎందుకంటే? 'నువ్వు ఇక్కడ వీడియో షూట్ చేయబోతున్నావు కాబట్టి నా దగ్గరకు వచ్చిన వారిని వంటింట్లో ఉంచాను' అంటూ నవ్వుతూ మరో రూమ్ వద్దకు మీడియా ప్రతినిధిని తీసుకెళ్లాడు. (ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు) -
త్వరలోనే మరో రామాయణం.. రాముడు, సీతగా వారిద్దరే!
రామాయణ ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ఆదిపురుష్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ నితేశ్ తివారీ, నిర్మాత మధు మంతెనతో కలిసి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఫోటోలు షేర్ చేసి ట్రోలర్స్‌కు గట్టిగానే రిప్లై ఇచ్చిన నటి) అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌కపూర్‌ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. సీత పాత్రకు బాలీవుడ్ భామ ఆలియా భట్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు నితేశ్ తివారీతో అలియా భట్ కనిపించడంతో ఓకే చెప్పారని సమాచారం. కానీ గతంలో సీతగా సాయిపల్లవి కనిపించనుందని వార్తలొచ్చాయి. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రకు కేజీయఫ్ హీరో యశ్‌ను ఓకే చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ..'నేను కొందరు నిర్మాతలతో కలిసి రామాయణాన్ని నిర్మిస్తున్నా. దాని కోసం నాలుగేళ్లుగా వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రయత్నం. పూర్తవ్వడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందని'. చెప్పారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ వాయిదా పడనుందనే వార్తలపై తాజాగా నిర్మాత మధు మంతెన స్పందించారు. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రారంభించనున్నాం. దయచేసి ఇలాంటివి ప్రచారాన్ని నమ్మకండి అని అన్నారు. దీంతో మరో ఆదిపురుష్ రాబోతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అతనిపై విపరీతమైన క్రష్.. కానీ నన్ను మోసం చేశాడు: హీరోయిన్) -
ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్(93) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆలియా భట్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది. 'తాతయ్యా.. నువ్వే నా హీరో 93 ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్ ఆడావు. మొన్నటివరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. నాకోసం రుచికరమైన ఆమ్లెట్ వేసిచ్చేవాడివి. నాకు బోలెడన్ని కథలు చెప్పేవాడివి.. వయోలిన్ వాయించేవాడివి. నీ ముని మనవరాలితో కూడా ఆటలాడుకున్నావు. నువ్వు క్రికెట్ ఆడే విధానం అన్నా.. నీ స్కెచ్లన్నా ఎంతో ఇష్టం. నీ చివరి క్షణం వరకు నీ కుటుంబాన్ని ప్రేమించావు. ఇప్పుడు నువ్వు లేవన్న బాధతో నా మనసంతా దుఃఖంతో నిండిపోయింది. అదే సమయంలో ఆనందంగానూ ఉంది. ఎందుకంటే మా తాతయ్య నాకు బోలెడంత సంతోషాన్ని అందించాడు. అందుకు చాలా గర్వంగా ఉంది. మనం మళ్లీ కలుసుకునేవరకు దాన్ని అలాగే భద్రంగా ఉంచుకుంటాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. దీనికి ఇటీవలి కాలంలో జరిగిన నరేంద్ర బర్త్‌డే సెలబ్రేషన్స్ వీడియోను జత చేసింది ఆలియా భట్. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) చదవండి: తమన్‌పై మళ్లీ కాపీ మరకలు -
అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!
దుబాయ్‌లో జరుగుతున్న ఐఫా-2023 అవార్డుల కార్యక్రమంలో ఆలియా భట్ మూవీ సత్తా చాటింది. ఆలియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గంగూబాయి కతియావాడి' అవార్డులు కొల్లగొట్టింది. ముంబయిలోని కామాటిపుర నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా ఐఫా అవార్డుల్లో మూడు విభాగాల్లో ఎంపికైంది. ఈ సినిమా తర్వాత కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా-2 రెండు అవార్డులు దక్కించుకుంది. (ఇది చదవండి: 15 ఏళ్లకే పెళ్లి.. నా కడుపులో బిడ్డకు తండ్రెవరని అడిగాడు: నటి) దుబాయ్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. దక్షిణాది నుంచి కమల్ హాసన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సల్మాన్‌ఖాన్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి పాల్గొన్న ఈ వేడుకలో టెక్నికల్ అవార్డులను అందజేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ.. ఇలా తొమ్మిది విభాగాల్లో ఈ అవార్డులను ఇచ్చారు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ అవార్డులను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయి కతియావాడి దక్కించుకుంది. (ఇది చదవండి: అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ) -
ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్
ఆర్టిఫిషియల్ ఇమేజెస్ హవా మామూలుగా లేదు. ఏఐ ద్వారా ఇప్పటికే సినిమా, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీల ఫోటోలను వివిధ రకాలుగా చిత్రించిన ఏఐ ఆర్టిస్ట్ తాజాగా మరికొన్నింటిని సృష్టించారు. మిడ్ జర్నీని టూల్‌తో ఏఐ ఆర్టిస్ట్ SK MD అబూ సాహిద్ అందమైన స్టార్లను వృద్ధులుగా మార్చేసారు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా తదితర విమెన్ యాక్టర్స్ సీనియర్ సిటిజెన్స్ అయితే ఎలా ఉంటారో అన్న ఊహ వీటికి ప్రాణమిచ్చింది. అంతేకాదు శ్రద్ధాకపూర్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, అలియా భట్, కృతి సనన్, అనుష్క శర్మ లాంటి ఫోటోలను కూడా మార్చివేయడంతో ఇవి వైరల్‌గా మారాయి. అవేంటో మీరూ ఒకసారి చూసేయండి . ఇదీ చదవండి: టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు ముడతలు పడిన చర్మం, నల్లటి వలయాలతో భయంకరంగా కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ గుండెలు బాదుకుంటున్నారు. "బాప్ రే కృతి సనన్ నా బామ్మగా కనిపిస్తుంది." ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా, "శారీరక సౌందర్యం తాత్కాలికం, కానీ అంతర్గత సౌందర్యం శాశ్వతమైనది" ఇలా ఒక్కో పిక్‌పై ఒక్కో రకంగా హిల్లేరియస్ కమెంట్స్‌తో యూజర్లు సందడి చేస్తున్నారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) కాగా 23 వేల ఇన్‌స్టా ఫాలోయర్లతో ఏఐఆర్టిస్ట్ సాహిద్ సోషల్ మీడియాలో ఏఐ పిక్స్‌తో బాగా పాపులర్ అవుతున్నాడు. క్రికెటర్లను ముసలివాళ్లుగా, స్థూల కాయులుగా, ఫుట్‌బాల్ క్రీడాకారులుగా, బిలియనీర్లను బిచ్చగాళ్ళుగా, షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జీలను శిశువులుగా, మెట్ గాలాలో సందడి చేసిన బిలియనీర్లు, డిస్నీ సినిమాల్లో బాలీవుడ్ నటులు ఇలా ఆయన పోస్ట్ చేసిన వెంటనే ఏఐ పిక్స్ వైరల్ కావడం కామన్‌గా మారిపోయింది. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్ సినిమా రికార్డ్ బ్రేక్!
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టిముట్టినా అవేవీ సినిమాపై పెద్దగా ప్రభావితం చూపలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. రిలీజ్ అయిన పది రోజుల్లోనే దాదాపుగా రూ.136 కోట్లు రాబట్టింది. దీంతో బాలీవుడ్లో ఆదా శర్మ టాప్ ప్లేస్ దక్కించుకుంది. (ఇది చదవండి: ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్, హీరోయిన్ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం) అంతకుముందు అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గంగుభాయి కతియావాడి పది రోజుల్లో రూ.129.1 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా ది కేరళ స్టోరీ చిత్రం ఈ రికార్డును అధిగమించింది. ఈ రికార్డుతో బాలీవుడ్ హీరోయిన్లలో ఆదా శర్మ టాప్‌లో నిలిచింది. తాజాగా ఈ చిత్ర విజయంపై నటి ఆదా శర్మ స్పందించింది. ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని తెలిపింది. ఈ విజయానికి కారణం అభిమానులేనని చెప్పుకొచ్చింది. ఆదా శర్మ మాట్లాడుతూ.. 'నేను ఇంత ఘనవిజయం సాధిస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇది నా చేతిలో ఉందో లేదో నాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ నేను చేస్తున్న పనిని కొనసాగిస్తాను. ఇలాంటి సినిమా తీస్తానని నేనెప్పుడూ ప్లానింగ్ చేయలేదు. ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది. అలాంటి అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. మిమ్మల్ని ఎవరైనా గట్టిగా నమ్మితేనే ఇలాంటి పాత్ర చేసే అవకాశం వస్తుంది.' అని అన్నారు. ది కేరళ స్టోరీ ఆదివారం ఒక్కరోజే రూ.23 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా విడుదలైన మొదటి వారంలో రూ.81.14 కోట్లు రాగా.. రెండో వారాంతంలో రూ.55.60 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ఆదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. కొంతమంది మహిళలను బలవంతంగా మతమార్పిడి చేసి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో రిక్రూట్ చేయబడ్డారన్న కథాంశంగా తెరకెక్కించారు. (ఇది చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్) ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి. Woahhh !! Audience 🙏❤️ thank u ! This is just ....... *no words' 👀😱❤️ https://t.co/6kV2j07Aq7 — Adah Sharma (@adah_sharma) May 15, 2023 -
పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే
అమ్మ.. ఆ పిలుపు కోసం తపించని వారుంటారా? ఆ స్పర్శ కోరుకోని వారుంటారా? అమ్మ అంటే వేయి ఏనుగుల బలం. అమ్మ అంటే కదిలొచ్చే దేవత. అమ్మ అంటే మమతల కోవెల. ఎంత వర్ణించినా అమ్మ గొప్పతనాన్ని మాటల్లో బందీ చేయలేము. అమ్మ కోసం ఆరాటపడేవారు కొందరైతే అమ్మగా మారాలని తపించేవాళ్లు కొందరు! పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాకే మాతృత్వపు మమకార మాధుర్యం చూడాలని కోరుకోవడం లేదు కొందరు. అలాంటివారి జాబితాలో చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. ప్రేమించినవాడితో పెళ్లి వాయిదా వేశారే కానీ సంతానాన్ని వద్దనుకోలేదు. ఫలితంగా పెళ్లి కాకముందే గర్భం దాల్చినవాళ్లు ఉన్నారు. ఏడడుగులు వేయడానికి ముందే బుడిబుడి అడుగులు వేసే పాపాయితో పందిట్లోకి అడుగుపెట్టినవాళ్లు ఉన్నారు. మదర్స్ డే సందర్భంగా ఓసారి ఆ తల్లులను గుర్తు చేసుకుందాం.. నీనా గుప్తా నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో బిడ్డను కన్నది. అయితే అతడు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో నీనా సింగిల్ పేరెంట్‌గా మసాబా గుప్తాను పెంచింది. కల్కి కొచ్లిన్ బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్.. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో మూడేళ్లు ప్రేమాయణం సాగించి 2011లో పెళ్లి చేసుకుంది. కానీ వీరి వైవాహిక బంధం సజావుగా సాగలేదు. 2013లో విడిపోగా 2015లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హర్ష్‌బెర్గ్‌తో డేటింగ్ చేయగా వీరికి కూతురు పుట్టింది. ఇప్పటికీ వీరు పెళ్లి చేసుకోలేదు. రేణు దేశాయ్.. బద్రి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ సినిమా సమయంలోనే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. అతడితో ఏడుగులు వేయడానికే ముందే అకీరా జన్మించాడు. అతడికి ఐదేళ్ల వయసొచ్చాక పెళ్లి చేసుకున్నారు. 12 ఏళ్లు కలిసి మెలిసి ఉన్నా తర్వాత విడిపోయారు. సెలీనా జైట్లీ నటి సెలీనా జైట్లీ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త పీటర్ హగ్‌తో సహజీవనం చేసిన ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చింది. దీంతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. సారిక స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లు చక్రం తిప్పిన సారిక స్టార్ నటుడు కమల్ హాసన్‌తో ప్రేమాయణం నడిపింది. కొంతకాలం వీరిద్దరూ సహజీవనం చేశారు. ఆ సమయంలో వీరికి శృతి హాసన్ జన్మించింది. తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గాబ్రియెల్లా మోడల్, నటి గాబ్రియెల్లా డెమట్రేడ్స్ నటుడు అర్జున్ రాంపాల్‌తో డేటింగ్లో ఉంది. త్వరలో ఆమె రెండోసారి తల్లి కాబోతోంది. కానీ ఇప్పటివరకు వీరు పెళ్లి చేసుకోలేదు. మహిహ చౌదరి నటి మహిమ చౌదరి పెళ్లి చేసుకునే సమయానికి ఐదు నెలల గర్భవతి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2006 మార్చిలో ఆమె బాబీ ముఖర్జీని పెళ్లాడింది. అమృత అరోరా అమృత అరోరా.. షేకలా లడక్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే గర్భం దాల్చింది. బిడ్డ పుట్టాక ప్రియుడిని పెళ్లాడింది. శ్రీదేవి దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. జాన్వీ కపూర్ కడుపులోకి వచ్చాకే ఆమె బోనీకపూర్‌ను పెళ్లాడింది. అప్పటికి ఆమె ఏడు నెలల గర్భిణి. కొంకణ్ సేన్ శర్మ నటుడు రణ్వీర్ షోరేతో ఎంతోకాలం రిలేషన్షిప్ కొనసాగించిన ఈ నటి ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే తను గర్భవతి. పెళ్లైన తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అమీ జాక్సన్ ఐ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అమీ జాక్సన్. ప్రియుడు జార్జ్‌తో ఎంగేజ్మెంట్ జరిగిన మరుక్షణమే తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది. తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కానీ ఆ ప్రేమ పెళ్లి దాకా రాకుండానే ఆగిపోయింది. నేహా ధూపియా బాలీవుడ్ నటి నేహా ధూపియా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఈ విషయాన్ని నేహా ధూపియా ఆమె ప్రియుడు అంగద్ బేడీ ఇంట్లో చెప్పి ఒప్పించాకే పెళ్లి చేసుకున్నారు. నేహాతో అంగద్ షాదీ జరిగే సమయానికి ఆమె మూడు నెలల గర్భిణి. దియా మీర్జా బాలీవుడ్ నటి దియా మీర్జా వ్యాపారవేత్త వైభవ్ రేఖీని పెళ్లాడింది. అతడిని పెళ్లాడే సమయానికే ఆమె గర్భం దాల్చింది. నటి నటాషా స్టాంకోవిచ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే గర్భం దాల్చింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కొంతకాలం పాటు రిలేషన్లో ఉన్న ఆమె ప్రెగ్నెన్సీ వచ్చాక పెళ్లి చేసుకుంది. అలియా భట్ అలియా భట్ కూడా పెళ్లికి ముందే గర్భవతి అయిందంటారు. 2022 ఏప్రిల్ 14న రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడింది. జూన్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. నవంబర్‌లో రాహాకు జన్మనిచ్చింది ఆలియా. చదవండి: మదర్స్ డే స్పెషల్...కమ్మనైన ఈ అమ్మ పాటలు విన్నారా? మదర్ సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన చిత్రాలివే -
మెట్ గాలా 2023: నిండైన శారీ గౌన్‌లో ఇషా అంబానీ.. దేవకన్యలా అలియా (ఫొటోలు)
-
మెట్ గాలా 2023: నిండైన శారీ గౌన్‌లో ఇషా అంబానీ.. దేవకన్యలా అలియా (ఫొటోలు)
మెట్ గాలా 2023: నిండైన శారీ గౌన్‌లో ఇషా అంబానీ.. దేవకన్యలా అలియా (ఫొటోలు -
బిజినెస్‌లో స్పీడ్ పెంచిన అలియా భట్!
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ నటి అలియా భట్ బిజినెస్‌లోనూ స్పీడ్ పెంచింది. ఆమె 2020లో ప్రారంభించిన కాన్షియస్ కిడ్స్ దుస్తుల బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma) విస్తరణ జోరుగా సాగుతోంది. గత ఆరు నెలల్లో ఈ బ్రాండ్ ప్రసూతి దుస్తులు, నర్సింగ్ వేర్, 11 నుంచి 17 ఏళ్ల వారి కోసం టీనేజ్ దుస్తులు, అప్పుడే పుట్టిన శిశువు నుంచి 2 ఏళ్ల లోపు చిన్నారుల కోసం ప్రత్యేక దుస్తులతో సహా నాలుగు కొత్త కేటగిరీలను ప్రారంభించింది. ఇదీ చదవండి: కొడుకు పెళ్లికి అంబానీ దంపతులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి కొత్త విషయం! తల్లులు, పిల్లల కోసం ప్రత్యేక షాపింగ్ ఆలోచనతో ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ ప్రారంభమైందని, ఇప్పుడు తాము ప్రసూతి నుంచి 17 ఏళ్ల టీనేజర్ల వరకూ వారికి కావాల్సిన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు ఎడ్-ఎ-మమ్మా సీవోవో ఇఫ్ఫాట్ జీవన్ పేర్కొన్నారు. దుస్తులకే పరిమితం కాకుండా ఇతర ఉత్పత్తులకూ విస్తరించాలని ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ యోచిస్తోంది. అందులో భాగంగా పిల్లల సాహస కథల పుస్తకాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు జీవన్ వెల్లడించారు. పుస్తకాలతో పాటు యానిమేటెడ్ సిరీస్‌లు, తల్లులు, పిల్లలకు కావాల్సిన ఇతర ఉత్పత్తలు, ఆటబొమ్మలు కూడా బ్రాండ్ ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని చూస్తోంది. త్వరలో మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాలలో ప్రారంభిస్తామని, యూఎస్‌లో అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటామని అని జీవన్ చెప్పారు. అంతేకాకుండా టైర్-2, టైర్-3 నగరాల్లో ఆఫ్‌లైన్ మోడల్‌కూ విస్తరించాలని చూస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి తమ ఎక్స్పీరియన్స్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
ఫిలింఫేర్ అవార్డుల వేడుక.. ఆలియా సినిమాకు ఏకంగా 10 అవార్డులు!
ఫిలింఫేర్ అవార్డుల్లో గంగూబాయి కథియావాడి సత్తా చాటింది. ఏకంగా 10 విభాగాల్లో అవార్డులు ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత బదాయి దో సినిమా ఆరు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకున్న కేసరియా పాట రెండు అవార్డులు సాధించింది. ఉత్తమ నటిగా ఆలియా భట్, ఉత్తమ నటుడిగా రాజ్ కుమార్ రావు నిలిచారు. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం. ముంబైలో గురువారం రాత్రి జరిగిన 68వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, మనీశ్ పాల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ వేడుకకు ఆలియా భట్, పూజా హెగ్డే, దియా మీర్జా, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జాన్వీ కపూర్, కాజోల్.. తదితరులు సెలబ్రిటీలు హాజరయ్యారు. అవార్డులు అందుకుంది వీరే.. ► ఉత్తమ చిత్రం - గంగూబాయి కథియావాడి ► ఉత్తమ దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ చిత్రం(క్రిటిక్స్) - బదాయ్ దో (హర్షవర్ధన్ కులకర్ణి) ► ఉత్తమ నటి - ఆలియా భట్ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ నటి (క్రిటిక్స్) - టబు (భూల్ భులాయా 2), భూమి పెడ్నేకర్ (బదాయి దో) ► ఉత్తమ నటుడు - రాజ్ కుమార్ రావు (బదాయి దో) ► ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - సంజయ్ మిశ్రా (వధ్) ► ఉత్తమ సహాయ నటుడు - అనిల్ కపూర్ (జుగ్ జుగ్ జియో) ► ఉత్తమ సహాయ నటి -షీబా చద్దా (బదాయి దో) ► ఉత్తమ గీత రచయిత - అమితాబ్ భట్టాచార్య (బ్రహ్మాస్త్ర 1లోని కేసరియా పాట) ► ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర 1) ► ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర 1లోని కేసరియా పాట) ► ఉత్తమ నేపథ్య గాయని - కవిత సేత్ (జుగ్‌జుగ్ జియోలోని రంగిసారి.. పాట) ► ఉత్తమ కథ - అక్షత్ గిల్డయల్, సుమన్ అధికారి (బదాయి దో) ► ఉత్తమ స్క్రీన్‌ప్లే - అక్షత్ గిల్డయల్, సుమన్ అధికారి, హర్షవర్ధన్ కులకర్ణి (బదాయి దో) ► ఉత్తమ సంభాషణలు - ప్రకాశ్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్ - సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ సినిమాటోగ్రఫీ - సుదీప్ చటర్జీ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సుబ్రత చక్రవర్తి, అమిత్ రాయ్ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - షీతల్ ఇక్బాల్ శర్మ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ సౌండ్ డిజైన్ - బిశ్వదీప్ దీపక్ చటర్జీ (బ్రహ్మాస్త్ర 1) ► ఉత్తమ ఎడిటింగ్ - నీనద్ కలంకార్ (ఎన్ యాక్షన్ హీరో) ► ఉత్తమ యాక్షన్ - పర్వేజ్ షైఖ్ (విక్రమ్ వేద) ► ఉత్తమ వీఎఫ్ఎక్స్ - డీఎన్ఈజీ, రెడిఫైన్ (బ్రహ్మాస్త్ర 1) ► ఉత్తమ కొరియోగ్రఫీ - కృతి మహేశ్ (డోలిడా- గంగూబాయ్ కథియావాడి) ► ఉత్తమ డెబ్యూ దర్శకుడు - జస్పల్ సింగ్ సంధు, రాజీవ్ బర్న్‌వల్ (వధ్) ► ఉత్తమ డెబ్యూ హీరో - అంకుశ్ గదం (ఝండ్) ► ఉత్తమ డెబ్యూ హీరోయిన్ - ఆండ్రియా కెవిచుసా (అనేక్) ► జీవిత సాఫల్య పురస్కారం - ప్రేమ్ చోప్రా ► ఆర్డీ బర్మన్ అవార్డ్ - జాన్వీ శ్రీమంకర్ (డోలిడా- గంగూబాయి కథియావాడి) చదవండి: రఫ్ఫాడిస్తున్న మెగాస్టార్ -
పెళ్లయిన,బిడ్డకు తల్లైన తగ్గేదేలే...
-
నా కూతురి విషయంలో రణ్‌బీర్ భయం అదే: ఆలియా భట్
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ల ముద్దుల కూతురే రాహా. సమయం దొరికితే చాలు ఇద్దరూ కూతురితో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. తల్లిగా ఆలియా చాలామటుకు రాహాతోనే ఉన్నప్పటికీ తండ్రి రణ్‌బీర్ మాత్రం తాను ఒప్పుకున్న సినిమాల వల్ల ఎక్కువగా ఇంట్లో ఉండలేకపోతున్నాడు. అయితే ఇలా దూరంగా ఉంటే కూతురు తనను ఎక్కడ మర్చిపోతుందోనని టెన్షన్ పడుతున్నాడట హీరో. ఈ విషయాన్ని స్వయంగా ఆలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కూతుర్ని ముద్దుగా అలా పిలుస్తాం.. 'రాహా ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఒకసారి నువ్వు నా కూతుర్ని చూసి నవ్వావంటే తను కూడా తిరిగి స్మైల్ ఇస్తుంది. రణ్‌బీర్, నేను తనని ముద్దుగా చీతా అని పిలుస్తాం. మాకెంత అలసటగా ఉన్నా, ఇబ్బందులు ఉన్నా తన ముఖం చూడగానే అవన్నీ పటాపంచలైపోతాయి. తనను దగ్గరకు తీసుకుని హత్తుకోవడం కన్నా ముఖ్యమైనది మరేదీ లేదనిపిస్తుంది. కానీ రాహా కాస్త పెద్దగా అయిందంటే మా ఒడిలో ఉండిపోవడానికి ఏమాత్రం ఇష్టపడదు. మొత్తం తిరిగేస్తానంటుంది. ఆ విషయం నాకు అర్థమైంది. రణ్‌బీర్ భయమదే.. రణ్‌బీర్ చాలా సెన్సిటివ్. రాహా పుట్టాక అతడు మరింత సెన్సిటివ్ అయ్యాడు. కూతురంటే అతడికి ఎంతో ప్రేమ, మమకారం. అతడు ఏనుగులా లేదా మరేదైనా జంతువులా మారిపోయి రాహాను ఆడిస్తుంటే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అతడున్నాడంటే రాహా నా దగ్గరకు కూడా రాదు. కూతురితో కలిసి కిటికీ పక్కన కూర్చుని టైం స్పెండ్ చేస్తుంటాడు. అతడు పని వల్ల ఎటైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు కూతురు తనను మర్చిపోతుందేమోనని చాలా భయపడుతుంటాడు. అందుకే రణ్‌బీర్ ప్లేస్‌లో నేను కిటికీ దగ్గర కూర్చుని తనకు కబుర్లు చెప్తూ తండ్రిని గుర్తు చేస్తూ ఉంటాను' అని చెప్పుకొచ్చింది ఆలియా భట్. చదవండి: సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వనేలేదు: అబ్దుల్ ఓటీటీలోకి వచ్చిన దసరా, స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
రూ. 37 కోట్లతో ఇల్లు కొన్న అలియా.. ఆ వ్యాపారం కోసమేనట!
బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. నార్త్‌లోనే కాకుండా సౌత్ అడియన్స్‌కి కూడా బాగా దగ్గరైంది. ఆర్ఆర్ఆర్లో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో అలియా ముందు వరుసలో ఉంది. అయితే ఇది రంగుల ప్రపంచం. ఇప్పుడున్న అవకాశాలు రేపు ఉంటాయో ఉండవో తెలియదు. అందుకే ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అని ఆలోచిస్తుంది అలియా. స్టార్ హీరోయిన్ ఫేమ్‌ని మరో వ్యాపారానికి వాడాలనుకుంటుంది. త్వరలోనే ఈ బ్యూటీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతుంది. దాని కోసం ఏకంగా రూ. 37 కోట్లు పెట్టి ముంబైలో ఓ ఇంటిని కొలుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తనకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ పేరిట ఆ ఇంటిని కొలుగోలు చేసిందట. ఇందుకు సంబంధించి స్టాంప్ డ్యూటీనే రూ. 2.26 కోట్లు చెల్లించిందట. (చదవండి: అందుకు పదేళ్లు పట్టింది: ప్రియాంకా చోప్రా) ఇప్పటికే అలియా పేరిట రెండు ఇల్లులు ఉన్నాయి. అందులో ఒకటి తన సోదరి షహీన్‌కి విక్రయదానం చేసింది. దాని విలువ దాదాపు రూ. 8 కోట్ల వరకు ఉంటుందట. ప్రస్తుతం తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఎనిమిది అంతస్తుల భవనంలో నివాసం ఉంటుంది. గతేడాది నవంబర్‌లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొన్నాళ్లు షూటింగ్స్‌కి గ్యాప్ ఇచ్చిన అలియా.. ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసింది. -
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు వీరే
చిత్ర పరిశ్రమలో డేటింగ్ అనేది సర్వసాధారణం. ఇద్దరు ఇష్టపడితే చాలు కలిసి సహజీవనం చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే తమ రిలేషన్‌ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. మరికొంతమంది హీరోయిన్లు అయితే పెళ్లికి ముందే డేటింగ్ చేసి గర్భం దాల్చుతున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భంగా దాల్చారు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం. ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది ఇలియానా. ఆ తర్వాత బాలీవుడ్‌కి మకాం మార్చింది. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఇలియానా ఇటీవల షాకింగ్ విషయం తెలిపింది. త్వరలోనే తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో కొన్నాళ్లు డేటింగ్లో ఉన్న ఇలియానా.. 2019లో అతనితో విడిపోయింది. అప్పటి నుంచి ఆమె సింగిల్‌గానే ఉంటుంది. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. కానీ ఇలియానా మాత్రం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు సడెన్‌గా తల్లిని కాబోతున్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది. త్వరలోనే బిడ్డకి తండ్రి ఎవరో ప్రకటించి, పెళ్లి పీటలేక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ సైతం పెళ్లికి ముందే గర్భం దాల్చింది. హీరో రణబీర్ కపూర్‌తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన అలియా.. 2022 ఏప్రిల్‌లో అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే అలియా ప్రెగ్నెంట్. కానీ వివాహం అయిన రెండు నెలల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అమీ జాక్సన్ ఎవడు, రోబో 2.O చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అమీ జాక్సాన్. నటిగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. చాలా రోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్నారు. రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం పెళ్లికి ముందే అకీరా నందన్‌కు జన్మనిచ్చింది. ‘బద్రి’ సినిమాతో ప్రేమలో పడిన ఈ జంట.. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి అకీరా పుట్టాక పెళ్లి చేసుకుంది. మరో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత విడాకులు తీసుకున్నారు. పూర్ణ మలయాళీ బ్యూటీ పూర్ణ సైతం పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ‘సీమ టపాకాయ్’, ‘అవును’చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. గతేడాది అక్టోబర్‌లో దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడింది. ఆరు నెలలు గడవకముందే ఏప్రిల్ 4న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వీరితో పాటు బాలీవుడ్ హీరోయిన్లు దియా మీర్జా కల్కి కొచ్లిన్, నేహా ధూపియా అమృత అరోరా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చారు. -
అలియా చెప్పులు మోసిన రణ్‌బీర్..నెటిజన్స్ ఫైర్
బాలీవుడ్ క్యూట్ కపుల్లో రణబీర్ కపూర్, అలియా భట్ జంట ఒకటి. ఈ జంట ఏ పని చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌ని, కామెంట్స్‌ని పట్టించుకోకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు. సినిమాల వరకే స్టార్స్‌లా ప్రవర్తిస్తారు కానీ.. నిజ జీవితంలో భార్యభర్తలుగా అందరిలాగే ఉంటారు. తాజాగా ఈ జంట, ముఖ్యంగా రణ్‌బీర్ ట్రోల్స్‌కి గురవుతున్నారు. దానికి కారణంగా రణబీర్.. అలియా చెప్పులను మోయడమే. భార్య చెప్పులను భర్త మోస్తే తప్పేంటని అనుకుంటున్నారా?... అయితే పూర్తి కథనం చదవండి. గత గురువారం (ఏప్రిల్ 21) ఫిల్మ్ మేకర్ ఆదిత్య చోప్రా తల్లి పమేలా చోప్రా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులంతా ఆదిత్య చోప్రా కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చారు. ఇక రణ్‌బీర్, అలియాభట్ జంట కూడా కాస్త ఆలస్యంగా ఆదిత్య చోప్రా ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లే క్రమంలో అలియా తన చెప్పులను గుమ్మం ముందు విడిచి వెళ్లింది. వెనకే వచ్చిన రణ్‌బీర్ ఆ చెప్పులను చేతులతో పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టాడు. (చదవండి: నగ్న వీడియో షేర్ చేసిన నిత్యా శెట్టి.. నెటిజన్స్ ఫైర్) ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ట్రోలింగ్‌కు కారణం ఏంటంటే.. రణ్‌బీర్ ఆ చెప్పులను ఇంట్లో ఉన్న చిన్న గుడి ముందు పెట్టడమే. భార్య చెప్పులు మోయడం తప్పుకాదు.. కానీ వాటిని గుడిముందు పెట్టడం ఏంటి? అలియా ఆలోచించే ఆ చెప్పులను మెట్ల ముందు వదిలింది. కానీ రణ్‌బీర్ మాత్రం తెలివితక్కువ పని చేశాడు. పైగా అతను చెప్పులతో లోపలికి వెళ్లాడు’ అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రణ్‌బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)