కొత్త ఏడాదిలో గుంటూరు కారంతో ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇక మహేశ్ బాబు తదుపరి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్స్ అయితే రాలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఇటీవలే బాలీవుడ్ భామ నిర్మాతగా వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పోచర్ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ వీక్షించిన మహేశ్ బాబు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఎలా ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. వారికి మానవత్వం లేదా? అలాంటి పనులు చేసేటప్పుడు వారి చేతులు వణకవా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోచర్ వెబ్ సిరీస్ చూశాక తన మైండ్‌లో ఇలాంటి ప్రశ్నలే తిరుగుతున్నాయని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇలాంటి సున్నితమైన దిగ్గజాలను రక్షించమని కోరుతూ ఈ వెబ్ సిరీస్ ద్వారా పిలుపునిచ్చారని మహేశ్ బాబు పోస్ట్ చేశారు.
కాగా.. ఎమ్మీ అవార్డు విన్నర్, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన మలయాళ ఫారెస్ట్ క్రైమ్ సిరీస్ పోచర్. ఏనుగు దంతాల స్మగ్లింగ్‌తో పాటు, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. కేరళ అడవుల్లో జరిగిన ఒక రియల్ స్టోరీని ఆధారంగా తీసుకోని ఈ చిత్రాన్ని రూపొందించారు. పోచర్‌లో నిమేషా సజయన్, రోషన్ మాథ్యూ కీలకపాత్రలు పోషించారు. కేరళ అడవుల్లో ఉన్న ఏనుగులను చంపి వాటి దంతాలతో కొందరు నేరస్థులు వ్యాపారం చేస్తుంటారు. అలాంటి నేరస్థుల ముఠాని పట్టుకోవడానికి కేరళ పోలీసులు, కొందరు ఎన్జీఓలో చేసిన ప్లానింగ్‌నే సిరీస్‌గా రూపొందించారు. ఈ సిరీస్‌కు అలియా భట్ నిర్మాతగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment