web series
-
Kanchan Bamne: అందంతో అల్లాడించే 'పెళ్లివారమండి' వెబ్ సిరీస్ బ్యూటీ (ఫోటోలు)
-
ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్‌గా 'హరి కథ'.. స్ట్రీమింగ్కు రెడీ
టాలీవుడ్లో ఇప్పటి వరకు చాలా సినిమాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి మొదటిసారి ఒక వెబ్ సిరీస్ వస్తుంది. హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఒక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. డిసెంబర్ 13న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు.మిస్టరీ థ్రిల్లర్ జానర్‌గా 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్‌ను దర్శకుడు మగ్గీ తెరకెక్కించారు. 3 రోజెస్ వెబ్ సిరీస్‌తో ఆయన గుర్తింపు పొందారు. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ వంటి వారితో పాటు బిగ్‌బాస్‌తో గుర్తింపు పొందిన దివి, అంబటి అర్జున్ తదితరులు నటిస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్ 13) నుంచి 'హరికథ' వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
‘వికటకవి’కోసం ‘మాభూమి’ సినిమా చూశాను: జోశ్యుల గాయత్రి దేవి
వికటకవి సిరీస్ తెలంగాణ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది. అది కూడా పీరియాడిక్ కథాంశం కావటంతో, చాలా రీసెర్చ్ చేశాను. 1940 సమయంలో హైదరాబాద్ ఎలా ఉండిందో ముందు నేను తెలుసుకోవాలనుకుంటున్న సమయంలో మా అసోసియేట్స్ ఏం చెప్పారంటే ‘మాభూమి’ అనే తెలంగాణ మూవీని చూడమన్నారు. ఆ సినిమా ద్వారా నాటి హైదరాబాద్ ఎలా ఉండింది.. అప్పటి ప్రజల వేషధారణ, సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలిసింది. దానికి తగ్గట్టు టీమ్‌ను ప్రిపేర్ చేశాను. కథకు తగ్గట్లు ప్యాంట్, షర్ట్ ఎలా ఉండాలనే దానిపై వీడియోలను డౌన్ లోడ్ చేశాను. లుక్ టెస్టులను చేశాం. టెక్నీషియన్స్‌గా ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది’ అన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘వికటకవి’. నవంబర్ 28 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జోశ్యుల గాయత్రి దేవి మీడియాతో ముచ్చటిస్తూ.. ఈ పీరియాడిక్ డిటెక్టివ్ వెబ్ సిరీస్ అనుభవాలను పంచుకున్నారు. → రెగ్యులర్‌గా ఇతర డిజైనర్స్ వచ్చి నా దగ్గర స్టిచింగ్ చేసుకుని వెళుతుండేవారు. అలా మొదలైన ఈ ప్రయాణంతో నేను కూడా మెల్లగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. పలాస మూవీకి నేను డిజైనింగ్ మాత్రమే చేసిచ్చాను... షూట్‌కి వెళ్లలేదు. అయితే ఆహా వాళ్లు చేసిన కుడిఎడమైతే వెబ్ సిరీస్ ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్‌గా నా కెరీర్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. తర్వాత పారాహుషార్ అనే మరో సినిమాకు వర్క్ చేశాను. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత కరుణకుమార్గారు రూపొందించిన కళాపురం సినిమాకు వర్క్‌చేశాను. తర్వాత ప్రదీప్ మద్దాలిగారు డైరెక్ట్ చేసిన సర్వం శక్తిమయం సిరీస్‌కు కాస్ట్యూమ్ డిజైనింగ్ వర్క్‌చేశాను. ఈ వెబ్ సిరీస్ నాకు చాలా ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఓ ఫుల్ ఔట్‌డోర్ ప్రాజెక్ట్‌ని తక్కవు బడ్జెట్..తక్కువ మ్యాన్ పవర్‌తో ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలుసుకున్నాను.→ సర్వం శక్తి మయం సిరీస్‌కు పని చేయటం నాకు వికటకవి సిరీస్‌కు వర్క్ చేయటానికి ఎంతగానో హెల్ప్ అయ్యింది. నిజానికి సర్వం శక్తిమయం సిరీస్ తర్వాత పీపుల్ మీడియా బ్యానర్ సంస్థ నిర్మించిన సిరీస్ హరికథకు వర్క్ చేశాను. అది కూడా పీరియాడిక్ సిరీస్ 90వ దశకం కథ,కథనంతో రూపొందింది. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రీరోజెస్ ఫేమ్ మ్యాగీ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. దీంతో పాటు వికటకవి సిరీస్‌కు వర్క్ చేసే అవకాశం ఒకేసారి వచ్చింది. పీరియాడిక్ సిరీస్‌ల్లో హరికథ ముందుగా స్టార్ట్ అయ్యింది.→ ఒక సిరీస్ షూట్ ఉన్నప్పుడు మరో సిరీస్ షూట్ లేకుండా ఉండటం కూడా కాస్త కలిసొచ్చింది. అలాగే హరికథ చేసిన వర్క్ వికటకవి విషయంలో హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సిరీస్‌లకు వర్క్ చేయటం అనేది రెగ్యులర్‌గా సాధ్యంకాదు. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలంతే.→ సిరీస్‌లకు వర్క్ చేసే సమయంలో బడ్జెట్‌కు సంబంధించిన పరిమితులుంటాయి. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఔట్పుట్ ఎదురు చూస్తారు. అయితే సినిమాల విషయానికి వచ్చే సరికి బడ్జెట్ విషయంలో కాస్త వెసులుబాటు ఉంటుంది. సిరీస్‌లకు వర్క్ చేసేటప్పుడు డైరెక్టర్‌తో పాటు ఓటీటీలకు సంబంధించిన ఇన్పుట్స్ చాలానే ఉంటాయి. కానీ సినిమాల్లో మాత్రం డైరెక్టరే ఫైనల్ డిసిషన్ మేకర్.→ టెక్నిషియన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. నేను సినిమాలు చేసిన తర్వాత వెబ్ సిరీస్‌లకు వర్క్ చేయలేదు. సిరీస్‌లకు వర్క్ చేయటంతోనే కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌లకు పని చేయటం అనేది యంగ్ టాలెంట్, యంగ్ టెక్నీషియన్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్స్. అయితే వర్క్ పరంగా ఎప్పటికప్పుడు హిందీ, ఫ్రెంచ్, కొరియన్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామని అప్డేట్ కావటం మానుకోలేం.→ హీరో లుక్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అప్పటి లుక్‌లో కనిపిస్తూనే పొడవుగా కనిపించాలి.. ఇవన్నీ మాకు చాలెంజింగ్‌గా అనిపించాయి. అయితే వాటన్నింటినీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. మేఘా ఆకాష్‌గారికి ముందుగా చుడీదార్ అనుకున్నాం. కానీ కథానుగుణంగా చుడీదార్ కంటే శారీనే బాగా నప్పుతుందనిపించింది. అలాగని పట్టు శారీలను ఉపయోగించలేదు. కాటన్, లెనిన్, ఖాదీ చీరలనే ఉపయోగించాం.→ ప్రస్తుతం సతీష్ వేగేశ్నగారు దర్శకత్వంలో హాట్ స్టార్ రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ మర్మయోగి కోసం వర్క్ చేస్తున్నాను. రీసెంట్‌గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే మానసచోర అనే సినిమాకు వర్క్ చేస్తున్నాను. -
అందుకే తల్లి పాత్రను తిరస్కరించాను: మల్లికా శెరావత్
‘‘ది రాయల్స్’ సిరీస్‌లో ఇషాన్ కట్టర్ తల్లి పాత్రలో నేను నటించాల్సి ఉంది. అయితే నాకు చెప్పిన కథకి, ఫైనల్ స్క్రిప్ట్‌కి సంబంధం లేదనిపించింది... అందుకే ‘ది రాయల్స్’ అవకాశాన్ని తిరస్కరించాను’’ అని చెప్పారు బాలీవుడ్ నటి మల్లికా శెరావత్. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’. గత నెల 11న విడుదలైన ఈ సినిమాలో చందా రాణి అనే పాత్రలో తనదైన నటనతో అలరించారు మల్లికా శెరావత్.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ– ‘‘ఇషాన్ కట్టర్ లీడ్ రోల్లో ‘ది రాయల్స్’ సిరీస్‌ని రూపొందించాలని నెట్‌ఫ్లిక్స్ సంస్థ భావించింది. ఇందులో ఇషాన్ తల్లి పాత్రలో నటించమని మేకర్స్ నన్ను సంప్రదించారు. నా పాత్ర, కథ ఎంతో నచ్చడంతో చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ఫైనల్‌గా స్క్రిప్ట్ పేపర్ మీదకు వచ్చేసరికి ఎన్నో మార్పులు జరిగాయి. చెప్పిన దానికి, రాసిన దానికి సంబంధం లేదనిపించింది. దీంతో వాళ్లు నన్ను మోసం చేశారనిపించి, నేను చేయనని తిరస్కరించాను’’ అని తెలిపారు. అలాగే తన వ్యక్తిగత విషయం గురించి కూడా ఆమె స్పంది స్తూ– ‘‘గతంలో నేను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. అయితే అది బ్రేకప్ అయింది. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నాను. వివాహంపై నాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి మనసు ఉన్న వ్యక్తిని భర్తగా పొందడం కష్టమే. నా ఆరోగ్యంపట్ల నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటాను. అలాగే మంచి భోజనం తింటా, సమయానికి నిద్రపోతా’’ అని తెలిపారు మల్లికా శెరావత్. -
Vikkatakavi Review: ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: వికటకవి (ఆరు ఎపిసోడ్లు)నటీనటులు: నరేశ్అగస్త్య, మేఘా ఆకాశ్, షైజు, అమిత్ తివారీ, తారక్ పొన్నప్ప, రఘుకుంచె, నిమ్మల రవితేజ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామ్ తాళ్లూరిదర్శకత్వం: ప్రదీప్ మద్దాలిఓటీటీ: జీ5 (నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)‘వికటకవి’ కథేంటంటే..ఈ సినిమా కథ 1940-70ల మధ్యకాలంలో సాగుతుంది. రామకృష్ణ(నరేశ్ అగస్త్య) డిటెక్లివ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ.. డబ్బు కోసం డిటెక్టివ్‌గా మారతాడు. పోలీసులకు సైతం అంతుచిక్కని కొన్ని కేసులను తన తెలివితేటలతో పరిష్కరిస్తాడు. అతని గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్.. రామకృష్ణను అమరగిరి ప్రాంతానికి పంపిస్తాడు. అమరగిరిలో ఓ వింత ఘటన జరుగుతుంటుంది. రాత్రివేళలో అక్కడి దేవతల గుట్టకు వెళ్లిన జనాలు గతాన్ని మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం కారణంగానే ఇలా జరుగుతుందని ఆ ఊరి జనాలు భావిస్తారు. అందులో నిజమెంత ఉందని తెలుసుకునేందుకు రామకృష్ణ దేవతల గుట్టకు వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అందరి మాదిరే రామకృష్ణ కూడా గతాన్ని మర్చిపోయాడా? దేవతల గుట్టకు వెళ్లిన రామకృష్ణకు తెలిసిన నిజమేంటి? అతనితో పాటు అమరగిరి సంస్థాన రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్ రషీద్) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్) కూడా దేవతల గుట్టకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజా నరసింహ కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప), కోడలు గౌరీ (రమ్య దుర్గా కృష్ణన్) వల్ల అమరగిరికి వచ్చిన శాపం ఏమిటి? అమరగిరి ప్రాంతానికి రామకృష్ణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే..?డిటెక్టివ్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ మాత్రం ‘వికటకవి’ అనే చెప్పాలి. కథ 1970 నుంచి 40కి వెళ్లడం..అక్కడ నుంచి మళ్లీ 90లోకి రావడంతో ఓ డిఫరెంట్ వెబ్ సీరీస్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభమైన కాసేపటికే దేవతలగుట్ట సమస్య వెనుక ఎవరో ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. కానీ అది ఎవరు అనేది చివరి వరకు తెలియజేకుండా కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు ప్రదీప్ మద్దాలి సఫలం అయ్యాడు. కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా... ఎంగేజ్ చేసేలా కథనాన్ని నడిపించాడు. రచయిత తేజ దేశరాజ్ ఈ కథను సాధారణ డిటెక్టివ్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా అనేక క్లిష్టమైన ఉపకథలను, చారిత్రక సంఘటనలను చక్కగా మిళితం చేసి ఓ డిఫరెంట్ స్టోరీని క్రియేట్ చేశాడు. ఆ స్టోరీని అంతే డిఫరెంట్‌గా తెరపై చూపించడాడు దర్శకుడు. ఓ భారీ కథను పరిమితమైన ఓటీటీ బడ్జెట్‌తో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడు ప్రదీప్‌ను అభినందించాల్సిందే. తొలి ఎపిసోడ్‌లోనే ఒకవైపు అమరగిరి ఊరి సమస్యను పరిచయం చేసి, మరోవైపు రామకృష్ణ తెలివితేటలను చూపించి అసలు కథను ప్రారంభించాడు. ఇక హీరో అమరగిరికి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. దేవతల గుట్టపై ఉన్న అంతుచిక్కని రహస్యాన్ని చేధించేందుకు రామకృష్ణ చేసే ప్రయత్నం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోగా.. కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపులో ఈ సిరీస్‌కి కొనసాగింపుగా ‘వికటకవి 2’ ఉంటుందని ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. ‘వికటకవి 2’ చూడాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. లాజిక్స్‌ని పట్టించుకోకుండా చూస్తే ఈ సిరీస్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేశ్ అగస్త్య ఒదిగిపోయాడు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ చూస్తే..నిజమైన డిటెక్టివ్‌ని స్క్రీన్ మీద చూసినట్లే అనిపిస్తుంది. మేఘా ఆకాశ్‌కు ఓ మంచి పాత్ర లభించింది. తెరపై ఆమె చాలా హుందాగా కనిపించింది. అమిత్ తివారీ, షైజు, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సిరీస్ చాలా బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్‌కి మరో ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1940-70నాటి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'ఎలిమినేట్ అయితే చంపేస్తారు'.. స్క్విడ్ గేమ్ ట్రైలర్ చూశారా?
2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్‌కు దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి సీజన్ లాగే ఆర్థికంగా ఇబ్బందులు పడే కొంతమంది వ్యక్తులు.. డబ్బు సంపాదించడం కోసం ఈ గేమ్‌లో భాగమవుతారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.తెలుగులోనూ విడుదలైన ట్రైలర్ ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. ట్రైలర్లో సన్నివేశాలు, ప్రమాదకరమైన గేమ్స్ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్‌లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.అసలు ఈ స్క్విడ్ గేమ్ ఏంటంటే..జీవితంలో అప్పులపాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్, గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే పోటీలు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం సిక్స్ గేమ్స్ ఉంటాయి. చివరి గేమ్ పేరే స్క్విడ్ గేమ్. అయితే ఈ గేమ్స్‌లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్ పేరుతో చంపేస్తుంటారు. సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. -
‘ ఫ్రీడం ఎట్ మిడ్ నైట్’ వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్ సిరీస్ టైటిల్ : ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ సీజన్ 1 (7 ఎపిసోడ్స్)నటీనటులు: సిద్ధాంత్ గుప్తా, చిరాక్ వోరా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా, లూక్ మెక్ గిబ్నే తదితరులునిర్మాతలు : మోనీషా అద్వాని , మధు భోజ్వాని, దనిష్ ఖాన్దర్శకత్వం : నిఖిల్ అద్వానిసంగీతం : అశుతోష్ పాఠక్ఓటీటీ: సోనీలివ్(నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)⇢ వెబ్ సిరీస్ ల సీజన్ లో కాస్త కొత్తగా ప్రయోగం చేయాలనుకుంటున్న వారు చరిత్రని సబ్జెక్ట్ గా ఎంచుకుంటున్నారు. మనకు తెలియని విషయాలను చెప్పడం వేరు, తెలిసిన విషయాలనే కొత్తగా చెప్పడం వేరు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. మనకు తెలిసిన విషయంలోనే తెలియని కోణాన్ని ఆవిష్కరించడం మరో పద్ధతి. భారత స్వాతంత్ర పోరాటం గురించి మనందరికీ తెలుసు. అయితే స్వాతంత్రం సిద్ధించే దశలో, దేశ విభజన కూడా జరిగింది. ఆ విభజన గురించిన చరిత్రను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తీసిన వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్.⇢ గతంలో కూడా భారత స్వాతంత్ర పోరాటాన్ని చూపించే సినిమాలు, సీరియళ్లు, డాక్యుమెంటరీలు చాలానే వచ్చాయి. గాంధీ పాత్ర చిత్రీకరణతో చాలామంది ఆకట్టుకున్నారు. కానీ వాటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. భారత స్వాతంత్ర పోరాటం మొత్తాన్నీ ఈ వెబ్ సిరీస్ లో బంధించాలని చూడకుండా తన కథనాన్ని కేవలం 1944 - 1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు పరిమితం చేశాడు దర్శకుడు నిఖిల్ అద్వానీ. ఆయాపాత్రలకు ఎంపిక చేసుకున్న నటులు కూడా రాణించారు.⇢ కీలక పాత్రలైన గాంధీ, నెహ్రూ, పటేల్, జిన్నాల భావోద్వేగాలు ఇందులో ఇంపార్టెంట్. ఆయా పాత్రలకు ఎంచుకున్న నటులు తమ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే వారి నుంచి ఆ స్థాయిలో ఔట్ పుట్ రాబట్టారు నిఖిల్ అద్వానీ. అందరి లక్ష్యం ఒక్కటే స్వాతంత్రం. కానీ అందులో దేశ విభజన కూడా జరగాలని కోరుకునేవారు, దేశం కలిసే ఉండాలనుకునేవారు ఉండటం.. వారి మధ్య జరిగే సంఘర్షణ, చివరకు మనకు తెలిసిన ఫలితాన్నే కొత్తగా చూపించడం ఆసక్తికరంగా ఉంది.⇢ 1940-47 మధ్య జరిగే కథతో తెరకెక్కిన ఈ ఒరిజినల్ సిరీస్ లో స్క్రీన్ ప్లే ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. టైటిల్ వేయడానికి ముందు బ్యాక్ స్టోరీ (1917-1920) చెప్పడం.. టైటిల్ పడిన తర్వాత దేశ విభజన కాలం గురించి చర్చించడం ఆకట్టుకుంది. ఇందులో ఎవ్వర్నీ హీరోలుగా, విలన్లుగా చూపించే ప్రయత్నం చేయలేదు దర్శకుడు. ఎవరి వెర్షన్ ఏంటి.. ఎవరి భావజాలం ఎలా ఉందనే విషయాన్ని బలంగా చెప్పాడు. బ్రిటిషర్లు మాట్లాడే ఇంగ్లిష్ అక్కడక్కడ ఇబ్బంది పెట్టినప్పటికీ.. సబ్ టైటిల్స్ తో సిరీస్ చూసే అలవాటున్న ప్రేక్షకులకు అదేమంత పెద్ద ఇబ్బంది అనిపించదు.⇢ ఈ వెబ్ సిరీస్‌లో మహాత్మా గాంధీగా చిరాగ్ వోహ్రా, జవహర్లాల్ నెహ్రూ గా సిద్ధాంత్ గుప్తా, వల్లభాయ్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా, మహ్మద్ జిన్నాగా ఆరిఫ్ జకారియా, లూయిస్ మౌంట్ బాటన్‌గా ల్యూక్ మెక్ గిబ్నీ , లేడీ మౌంట్బాటన్కా డెర్డెలియా బుగేజా, సరోజినీ నాయుడు - మలిష్కా మెండోన్సా నటించారు.⇢ ఇలాంటి కథనాలకు నటీనటుల ఎంపికతోపాటు వారి కాస్ట్యూమ్స్, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే పరిసరాలు, భవనాలు కూడా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఆయా విభాగాలు తమ టాలెంట్ చూపించాయి. 1940ల నాటి భారత దేశాన్ని కళ్లకు కట్టాయి. వైస్రాయ్ హౌస్, కాంగ్రెస్ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలపై వెబ్ సిరీస్ టీమ్ బాగా పరిశోధన చేసిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. -
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్.. శోభిత ధూళిపాళ్లను వరిస్తుందా?
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల వేడుక మరి కొద్ది గంటల్లో జరగనుంది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల ఈవెంట్ యూఎస్‌లోని న్యూయార్క్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు తొలిసారి ఇండియన్ కమెడియన్, నటుడు వీర్ దాస్ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది అవార్డులను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందజేయనుంది. భారత కాలమానం ప్రకారం ఈ వేడుక మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఐఎమ్మీస్.టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.కాగా.. ఈ ఏడాది 21 దేశాల నుంచి 56 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. సినిమా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి పలు విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. దాదాపు 14 విభాగాల్లో ఎంపిక చేసి అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాళ్ల నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ ఉత్తమ డ్రామా సిరీస్ విభాగం- 2024 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులకు నామినేషన్స్‌లో నిలిచింది.శోభిత ధూళిపాళ్ల నటించిన ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్.. లెస్ గౌట్టెస్ డి డైయు (డ్రాప్స్ ఆఫ్ గాడ్) (ఫ్రాన్స్), ది న్యూస్ రీడర్ - సీజన్ 2 (ఆస్ట్రేలియా), ఐయోసి ఎల్ ఎస్పియా అర్రెపెంటిడో - సీజన్ 2 (అర్జెంటీనా)తో అవార్డు కోసం పోటీపడునుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
అలా పిలిస్తే నా లక్ష్యం నెరవేరినట్టే!
తెనాలి: మోక్ష... టీవీ షో, సీరియల్, వెబ్ సిరీస్‌ల ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. మూడున్నరేళ్లకే కెమెరా ముందు కనిపించింది. 13 ఏళ్లకు బాలనటిగా స్టార్‌డమ్‌ను తెచ్చుకుంది. తన అద్భుత నటనతో పద్మమోహన అవార్డు, జాతీయ ప్రతిభా పురస్కార్ సహా 19 అవార్డులను గెలుచుకుంది. ఇటీవల బాలల దినోత్సవంలో భాగంగా జరిగిన వివేక కల్చరల్ ఫెస్ట్‌లో బాల అతిథిగా తన మాట, ఆట, పాటతో సందడి చేసింది. ఈ నేపథ్యంలో పలుకరించిన ‘సాక్షి’తో బోలెడు కబుర్లు పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘ నా పూర్తి పేరు మోక్ష విజయ రామలక్ష్మి. తల్లిదండ్రులు సురేష్‌బాబు, శంకరీ రాజ్యలక్ష్మి. స్వస్థలం రాజమహేంద్రవరం. మూడున్నరేళ్ల వయసులో ఓ ఫంక్షనుకు తీసుకెళ్లారు. అక్కడే టీవీ షోకు ఆడిషను జరుగుతోంది. నన్ను చూసి బాగుందనటంతోపాటు ఆడిషనులో కూర్చోబెట్టారు. సెలెక్టు చేసుకున్నారు. అందరికీ టికెట్లు పంపి, హైదరాబాద్‌కు ఆహ్వానించారు. అలా ఊహ తెలీని వయసులో ‘పిల్లలు పిడుగులు’ టీవీ షోలో నటించాను. తర్వాత అవకాశాలు వరుసకట్టాయి. హైదరాబాద్‌కు వచ్చేశాం..నాన్నకు ఊరిలో ఉన్న అట్టల ఫ్యాక్టరీని లీజుకిచ్చి హైదరాబాద్‌కు వచ్చేశారు. అమ్మ ఇక్కడే ‘అమెజాన్’లో వర్క్ చేస్తోంది. పలు టీవీ ఛానళ్లలో ‘అయస్కాంతం’, ‘కోడలు’, ‘సూర్యకాంతం’, ‘గుండమ్మకథ’, ‘శుభస్య శీఘ్రం’, ‘నువ్వేకావాలి’ సీరియల్స్, ‘పిల్లలు పిశాచాలు’తో ఆరంభించి ‘డ్రామా జూనియర్స్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ వంటి టీవీ షోలు, ‘మ్యూజిక్ స్కూల్’, ‘హీరో’ సినిమాలు, మరికొన్ని వెబ్ సిరీస్‌లలో నటించాను. కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. విభిన్న కళల్లోనూ ప్రతిభ నటనే కాదు.. రచన, చిత్రలేఖనం, డ్యాన్స్, యాంకరింగ్ నాకిష్టం. సినీనటులు శ్రేయ, నాని, అనసూయ ఈ విషయం తెలిసి ప్రశంసించారు. ప్రముఖ యాంకర్ సుమ, ‘నా తర్వాత నువ్వే మోక్ష’ అనటం సంతోషమేసింది. రచనంటే ఇష్టమని చెప్పాకదా... నేను మూడు కథలు రాసుకున్నా. అందులో రెండు షార్ట్ ఫిలిమ్స్, మరోటి వెబ్ సిరీస్. శివుడుకి సంబంధించిన భక్తిపూర్వక కథనం. నాకొచ్చిన కలను డెవలప్ చేసి కథ, స్క్రిప్టు సిద్ధం చేశా. నా దర్శకత్వంలోనే తీయాలని ఆశ పడుతున్నా. తగిన ప్రొడ్యూసర్ ముందుకొస్తే వెబ్ సిరీస్ తీసి, అతి పిన్న దర్శకురాలు అనిపించుకోవాలని ఆశిస్తున్నా. కథానాయిక కావాలనేదే లక్ష్యంపెద్దయ్యాక హీరోయిన్గా నటించాలనేది నా మరో డ్రీమ్. హైదరాబాద్‌లోనే తొమ్మిదో తరగతి చదువుతున్నా. నెలలో రెండు వారాలు బడికి, రెండు వారాలు షూటింగులకు కేటాయించుకున్నా. ఎక్కడకు వెళ్లిన బుక్స్ వెంటే ఉంటాయి. షూటింగ్ గ్యాప్‌లో చదువుకుంటా. పరీక్షల్లో 90 శాతం పైగానే మార్కులు వస్తుంటాయి. కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నా. నా కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఎంతో త్యాగం చేశారు. చదువు, నటన, రచన... అన్నింటిలోనూ గెలిచి, నా తల్లిదండ్రులను గెలిపిస్తూ ఉండాలనేది నా ఆశయం. టాలెంట్ ఉంటే బోలెడు వేదికలుటీవీ, ఓటీటీ ప్లాట్‌ఫాంలు వచ్చాక చిన్న పిల్లల్నుంచి పెద్దల వరకు నటన, సాంకేతిక నైపుణ్యంలో ఎన్నో అవకాశాలున్నాయి. టాలెంట్ ఉన్నవాళ్లు అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాణించవచ్చు. పిల్లలు చదువుతోపాటు ఏదో ఒక కళలో నైపుణ్యం సాధించాలనేది నా భావన. అప్పుడు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని చెబుతాను. అందుకు నేనే నిదర్శనం. తెనాలి, రాజమహేంద్రవరం అంటే నాకెంతో ఇష్టం. ఎందరో కళాకారులు ఇక్కడ్నుంచి వచ్చారు. మహానటి సావిత్రి నాకు ఆదర్శం. ఆమె సినిమాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీనే కదా!’’ -
'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!
'బాహుబలి' పేరు చెప్పగానే ప్రభాస్, రాజమౌళి.. ఈ సినిమా దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో టాలీవుడ్‌కి గుర్తింపు. ఇలా చాలా గుర్తొస్తాయి. ఇప్పటికే తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే చాలామంది దీని పేరే చెబుతారు. ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'బాహుబలి' విషయంలో ఓ చేదు జ్ఞాపకం కూడా ఉంది. ఓ హిందీ నటుడు ఇప్పుడీ విషయాన్ని మరోసారి బయటపెట్టాడు.'బాహుబలి' రెండు సినిమాలు వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించడంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. ఈ కాన్సెప్ట్‌తో సిరీస్ తీయాలని ప్లాన్ చేసింది. 'బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్' పేరుతో 2018లో ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ జరగ్గా.. తొలిసారి ఓ టీమ్ పనిచేస్తే ఔట్పుట్ సరిగా రాలేదని మరో టీమ్‌తో పనిచేయించారు. అయినా సరే కంటెంట్ నచ్చకపోయేసరికి నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాన్ని పక్కనబెట్టేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా 'లక్కీ భాస్కర్')ఈ సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన నటుడు బిజయ్ ఆనంద్.. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. 'బాహుబలి' సిరీస్‌ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ మూలన పడేయడాన్ని బయటపెట్టాడు. దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేశారని, తాను కూడా దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశానని బిజయ్ చెప్పాడు. ఈ క్రమంలోనే డేట్స్ కుదరక ప్రభాస్ 'సాహో' మూవీలో ఛాన్స్ మిస్సయ్యాయని పేర్కొన్నాడు.దీనిబట్టి చూస్తే సినిమాగా హిట్ అయింది కదా అని ప్రతి దాన్ని క్యాష్ చేసుకుందామనుకుంటే కొన్నిసార్లు ఇలా ఎదురుదెబ్బలు కూడా తగులుతుంటాయి. బిజయ్ ఆనంద్ ఇప్పుడు చెప్పడంతో 'బాహుబలి' సిరీస్ మూలనపడ్డ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: డైరెక్టర్ సుకుమార్ పనిమనిషికి ప్రభు ఉద్యోగం) -
ఓటీటీలో తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
ఓటీటీలు రావడంతో డిఫరెంట్ కాన్సెప్ట్ కథలు చెప్పడం కూడా మొదలుపెట్టారు. అలా సినిమాలుగా తీయలేని కథల్ని కొన్నిసార్లు వెబ్ సిరీసులుగా తీయడం చూస్తూనే ఉన్నాయి. అలా రాజేంద్ర ప్రసాద్, దివి, శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సిరీస్ పేరే 'హరికథ'. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)మర్డర్ మిస్టరీకి మైథలాజికల్ టచ్ ఇచ్చి తీసిన ఈ సిరీస్ డిసెంబరు 13 నుంచి హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అధర్మం హద్దు మీరినప్పుడు, అన్యాయాన్ని ఎదురించాల్సిన వారు చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడు.. ఆ ధర్మాన్ని కాపాడడానికి దేవుడే వస్తాడు అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. అదే టైంలో రక్తపాతంతో భయంకరంగా అనిపించింది.పరశురాముడు, నరసింహుడు, వామనమూర్తి... ఇలా శ్రీవిష్ణు దశావాతారాల్లోని కొన్ని రూపాల్లో ఉన్న వ్యక్తి.. వరస హత్యలు చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్నది దేవుడా? మరెవరైనా అని పరిశోధించే పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ రామ్ నటించారు. రంగస్థల నాటక కళాకారునిగా రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!) -
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' సిరీస్ రివ్యూ
భారతదేశ స్వాతంత్య్రం కోసం సాగిన బహుముఖ పోరాటాన్ని వివరిస్తూ చరిత్ర, నాటకం యాక్షన్లను మిళితం చేస్తూ నిఖిల్ అద్వానీ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' అందించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ సిరీస్‌లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ (సిద్ధాంత్ గుప్తా), సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజేంద్ర చావ్లా), మహాత్మా గాంధీ (చిరాగ్ వోహ్రా), లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ (ల్యూక్ మెక్‌గిబ్నీ) పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయ కుట్రల సూక్ష్మమైన విశ్లేషణ, వ్యక్తిగత త్యాగాలు, భావోద్వేగ తిరుగుబాట్లు ఆసక్తికరంగా సాగుతాయి.నెహ్రూ, పటేల్, గాంధీల విభిన్న భావజాలంతో కూడిన సన్నివేశాలతో ఈ సిరీస్ వైవిధ్యభరిత అనుభూతిని అందిస్తుంది. స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన ఈ ముగ్గురివీ.. వేటికవే విభిన్న థృక్కోణాలైనా సమర్థనీయమైనవిగా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. దేశ నిర్మాణం ఆచరణాత్మక డిమాండ్ల మధ్య చిక్కుకున్న నాయకుడి అంతర్గత సంఘర్షణ నెహ్రూ పాత్ర చిత్రణలో తెలుస్తుంది. ముహమ్మద్ అలీ జిన్నాలోని అహం, ఆశయం, తెలివిని నటుడు ఆరిఫ్ జకారియా చక్కగా చూపించాడు. సర్దార్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా, లియాఖత్ అలీ ఖాన్‌గా రాజేష్ కుమార్, లార్డ్ లేడీ మౌంట్‌బాటన్‌గా కార్డెలియా బుగేజా మెరుస్తారు. మలిష్కా మెండోన్సా సరోజినీ నాయుడుగా కనిపిస్తారు.ఈ సిరీస్ 1940ల నాటి భారతదేశానికి అద్దం పట్టింది. పునర్నిర్మించిన వైస్రాయ్ హౌస్ లేదా కాంగ్రెస్ కార్యాలయాలు..ఇలా ప్రతి ఫ్రేమ్ సమగ్ర పరిశోధనను ప్రతిబింబిస్తుంది. కథ, కథనాలను భావోద్వేగభరితంగా అందించటంలో అద్వానీ దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుటుంది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఇతర చిత్రీకరణల మాదిరిగా కాకుండా, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ 1944 - 1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు దాని పరిధిని కుదించింది. ఇది గాంధీ–జిన్నా చర్చలు విభజనకు దారితీసిన వంటి సంఘటనలపైనే దృష్టి పెట్టింది. రాజకీయ కుతంత్రాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు, తెరవెనుక చర్చలను చక్కగా చూపించారు.చదవండి: దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్' -
తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!
దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న భారతీయ రిజర్వ్ బ్యాంకు సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించి స్టార్ ఇండియా వెబ్ సిరీస్ రూపొందించనుంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ముందుంది. దేశ ఆర్థిక వృద్ధిలో ఆర్బీఐ పాత్ర కీలకం. 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆర్బీఐ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. వీటికి సంబంధించిన అంశాలను స్టార్ ఇండియా వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించనుంది.1935లో ఏర్పాటైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ప్రస్థానాన్ని తెలియజేసేలా వెబ్ సిరీస్ రూపొందించాలని ప్రముఖ కంపెనీలకు జులైలో సెంట్రల్ బ్యాంక్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) కింద బిడ్ ఆఫర్ చేసింది. ఇందులో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ లిమిటెడ్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా వంటి సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా టెక్నికల్ ఎవాల్యుయేషన్ రౌండ్లో అర్హత సాధించలేదు. దాంతో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18 చివరి రౌండ్లోకి ప్రవేశించాయి. తాజాగా ఈ బిడ్‌ను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గెలుచుకుంది. వెబ్ సిరీస్ నిర్మించడానికి స్టార్ ఇండియాకు రూ.6.5 కోట్లు టెండర్ లభించినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలుఆర్ఎఫ్పీ పత్రం ప్రకారం, ఆర్బీఐ 90 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ జాతీయ టీవీ ఛానెళ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో ప్రసారమయ్యేలా దాదాపు 25-30 నిమిషాల నిడివితో ఐదు ఎపిసోడ్లు రూపొందించాలి. ఈ ఎపిసోడ్లు ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ కీలక పాత్రను తెలియజేసేలా ఉండాలి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ పనితీరుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా ఉండాలి. ఆర్బీఐ కార్యకలాపాలు, విధానాలపై విశ్వాసం కలిగేలా రూపొందించాలి. -
ఆర్బీఐపై వెబ్ సిరీస్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై స్టార్ ఇండియా వెబ్ సిరీస్‌ను రూపొందించనుంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బ్యాంక్ కీలక పాత్ర గురించి ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 1935లో ప్రారంభమైన ఆర్బీఐ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 వసంతాలు పూర్తి చేసుకుంది. వెస్ సిరీస్ రూపొందించేందుకు ఆర్బీఐ 2024 జూలైలో టెండర్లను పిలిచింది. స్టార్ ఇండియా, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా పోటీపడ్డాయి. స్టార్ ఇండియా రూ.6.5 కోట్ల విలువైన ఈ టెండర్‌ను దక్కించుకుంది. 25–30 నిముషాల నిడివిగల అయిదు ఎపిసోడ్స్ నిర్మిస్తారు. జాతీయ టీవీ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ఎపిసోడ్స్ ప్రసారం చేస్తారు. -
OTT: యానిమేటెడ్ సిరీస్ ‘డిస్పెకబుల్ మి 4’ రివ్యూ
మామూలు మూవీస్ లో సూపర్ కారెక్టర్స్ చెయ్యాలంటే చాలా ఖర్చు, కష్టం తో కూడుకున్న పని. కాని అదే యానిమేటడ్ కారెక్టర్స్ అయితే అంత ఖర్చు, కష్టం రెండూ ఉండవు. అంతేనా ఇప్పటి జెనరేషన్ కి బాగా నచ్చుతుంది కూడా. అందుకేనేమో రియల్ కారెక్టర్స్ కన్నా యానిమేటడ్ కారెక్టర్స్ కి డిమాండ్ & మార్కెట్ రెండూ ఎక్కువే. కాబట్టే ఒక్కో కారెక్టర్ సీరిస్ రూపేణా బోలెడన్ని పార్ట్స్ లో వస్తున్నాయి. అదే రేంజ్ లో ఇటీవల రిలీజ్ అయిన సినిమా డిస్పెకబుల్ మి 4. జియో సినిమా ఓటిటి వేదికగా తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ లభ్యమవుతోంది. డిస్పెకబుల్ సీరిస్ లో ఇది 5వ సినిమా. క్రిస్ రేనాడ్ దర్శకత్వం వహించిన సినిమా అనుకున్నట్టుగానే సూపర్ రివ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సిరీస్ ఫాలో అవుతున్నవాళ్ళకి దీనిలో కారెక్టర్స్ తో పాటు కథ కూడా సులువుగా అర్ధమవుతుంది. దీనిలో మెయిన్ కారెక్టర్ గ్రూ. ఇక గ్రూతో పాటు ఫిల్, రోన్ మరియు రఫ్ అనే మీనియన్స్. ఈ డిస్పెకబుల్ మి 4 కథాంశానికొస్తే గ్రూ కి ఒక కొత్త ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక చిన్న బాబు కూడా ఉంటాడు. కాని ఆ బాబు వాళ్ళ అమ్మ దగ్గర బానే వుంటాడు కాని గ్రూకి మాత్రం విసుగు పుట్టిస్తుంటాడు. కాని గ్రూ కి ఆ బాబంటే ఎంతో ఇష్టం. మరో పక్క తన ఎనిమీ అయిన మాక్స్ మీ లీమాల్ జైలు నుండి తప్పించుకుని గ్రూ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన గ్రూ ఫ్యామిలీ సేఫ్ హౌస్ కి వెళుతుంది. ఇక అక్కడ నుండి గ్రూ మాక్స్ మీ లీమాల్ ను ఎలా ఎదుర్కుంటుందన్నదే మిగతా సినిమా. పైన చెప్పుకున్నట్టు రియల్ కారెక్టర్స్ కన్నా యానిమేటడ్ కారెక్టర్స్ కథను మరో లెవల్ కు తీసుకువెళతాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మీనియన్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. సినిమా బ్యానర్ నేమ్ నుండే ఆ అల్లరి ప్రారంభమవుతుంది. గ్రూ చేసే సాహస విన్యాసాలు, మాక్సిమల్ క్రియేట్ చేసిన ఎక్సట్రార్డినరీ వెహికల్ సూపర్ గా ఉంటాయి. పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా ఈ వీకెండ్ కు మస్ట్ వాచ్ బుల్ మూవీ డిస్పెకబుల్ మి 4. జీయో సినిమా వేదికగా ఉంది చూసేయండి. - ఇంటూరు హరికృష్ణ. -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
సినీ ప్రియులు ఇప్పుడంతా ఓటీటీల వైపే చూస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు అభిమానులు ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగానే ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్‌ను అందిస్తున్నాయి. అలా మరో యూత్‌ఫుల్ కామెడీ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో తెరకెక్కించిన ఈ కామెడీ వెబ్‌సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్.. ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం అనేది ఉపశీర్షిక.బిగ్‌బాస్ రన్నరప్ అఖిల్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తెలుగు రియాలిటీ బిగ్‌బాస్‌లో రెండు సార్లు రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ సీజన్ 4తో పాటు బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో అతడికి టైటిల్ చేజారింది. బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ అఖిల్‌కు పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు.తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ అంటూ ఈ సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు అఖిల్. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో అఖిల్ సార్ధక్, మహేష్ విట్టాతో పాటు పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు 50కి పైగా ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.తమిళ రీమేక్‌గా వేరే లెవెల్ ఆఫీస్..తమిళంలో విజయవంతమైన వేర మారి ఆఫీస్‌కు రీమేక్‌గా ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ సీజన్- 2 ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్-1 యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితం ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించినట్లు పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. View this post on Instagram A post shared by OTT Updates (@upcoming_ott_release) -
తెలుగులో సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. సరికొత్త కంటెంట్ ఉన్న సిరీస్‌లు, సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగులో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హరికథ.. సంభవామి యుగేయుగే. పీరియాడికల్ బ్యాప్‌డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్, పూజిత పొన్నాడ, అర్జున్ అంబటి, బిగ్‌బాస్ దివి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సరికొత్త వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ వెల్లడించింది. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో తొలిఅడుగు వేయనుంది. దసరా సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసింది సంగతి తెలిసిందే.త్వరలోనే హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushotstartelugu) -
తెలుగులో సరికొత్త వెబ్ సిరీస్.. డైరెక్టర్‌గా టాలీవుడ్ కమెడియన్!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సరికొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. పౌరాణిక నేపథ్యంలో ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్‌కు చిరంజీవా అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ టాలీవుడ్ మైథలాజికల్ వెబ్ సిరీస్ డిసెంబర్లో స్ట్రీమింగ్ రానుందని ప్రకటించారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేయనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే భక్తి కోణంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ వెబ్ సిరీస్‌ను రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మించారు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు అచ్చు రాజమణి సందీతమందిస్తున్నారు. -
టాలీవుడ్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీల్లో వెబ్ సిరీసులకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ లాంటి సిరీస్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ఏ భాషలోనైనా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అయితే తెలుగులో స్ట్రైట్ వెబ్ సిరీస్‌లు చాలా తక్కువే వచ్చాయి. తాజాగా తెలుగులో తెరకెక్కించిన డిటెక్టివ్ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి రానుంది.(ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన డిటెక్టివ్ సిరీస్ 'వికటకవి'. ఈ వెబ్ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఈ సిరీస్‌ను తెరకెక్కించడం మరో విశేషం. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. The suspenseful and suspicious tale of Amaragiri and the mystery that follows it. 🫣It will see you on screens from 28th November 💥#Vikkatakavi, Amaragiri and the team wish you a Happy Diwali 🪔#VikkatakaviOnZee5@nareshagastya @akash_megha @pradeepmaddali @srtmovies pic.twitter.com/0b2G7b69Lz— ZEE5 Telugu (@ZEE5Telugu) November 1, 2024 -
మున్నా భయ్య ఈజ్ బ్యాక్.. సినిమాగా 'మీర్జాపుర్' సిరీస్
మన దేశంలో ఓటీటీల్లోనే ద బెస్ట్ వెబ్ సిరీస్‌ల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు 'మీర్జాపుర్'. తొలుత హిందీలో మాత్రమే తీశారు. కానీ ఊహించని రెస్పాన్స్ వచ్చేసరికి తెలుగు లాంటి ప్రాంతీయ భాషల్లో డబ్ చేశారు. దీంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పటికే మూడు సీజన్లు రాగా.. నాలుగో సీజన్ కూడా ఉంటుందని అన్నారు. ఇంతలోనే మూవీగా దీన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు)'మీర్జాపుర్' వెబ్ సిరీస్‌లో హీరో కంటే మున్నాభయ్య అనే విలన్ పాత్రకే బీభత్సమైన క్రేజ్ వచ్చింది. తొలి రెండు సీజన్లలో ఈ పాత్ర ఉండటంతో ఎంటర్టైనింగ్గా అనిపించింది. మూడో సీజన్లో మున్నాభయ్యా లేకపోయేసరికి చాలామందికి సిరీస్ నచ్చలేదు. ఇక నాలుగో సీజన్ అంటే సాహసమనే చెప్పాలి.సరే ఇదంతా పక్కనబెడితే 'మీర్జాపుర్' సిరీస్‌లో మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు, బూతులపై విమర్శలు వచ్చినప్పటికీ.. జనాలు వాటినే తెగ చూశారు. ఇప్పుడు 2026లో 'మీర్జాపుర్'ని సినిమాగా తీసుకొస్తామని ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ కొత్త కథ ఏం చూపిస్తారు? బూతులు, వయలెంట్ సీన్స్ లాంటివి లేకుండా ఇంటెన్సెటినీ ఎలా చూపిస్తారనేది పెద్ద క్వశ్చన్. అయితే ఇదంతా సిరీస్‌కి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలానే అనిపిస్తుంది!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
'ప్రకృతిని కట్ చేస్తే ప్రళయమే'.. ఆసక్తిగా తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్!
పవన్ సిద్ధు, తేజస్వి, అనన్య శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందించిన వెబ్ సిరీస్ 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్-2'. తెలుగులో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మరోసారి ఓటీటీ ప్రియులను అలరించేందుకు అరుణ్‌కుమార్ సీజన్ 2 వచ్చేస్తోంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. తాజాగా సీజన్-2 ట్రైలర్ రిలీజైంది. సీజన్-1లో హర్షిత్ రెడ్డి హీరోగా కనిపించగా.. ఇందులో పవన్ సిద్ధు నటించారు.ఈ వెబ్ సిరీస్‌లో కార్పొరేట్ వరల్డ్‌లో ఓ యువకుడు ఎలా రాణించాడనే కథాంశంతో తెరకెక్కించారు. ఫుల్ కామెడీతో పాటు కార్పొరేట్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. అయితే ఇందులో డైలాగ్స్, సీన్స్ ఓటీటీ ప్రియులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిిరీస్కు ఆదిత్య కేవీ దర్శకత్వం వహించారు. -
ఆ విషయంలో వాళ్లిద్దరిని వేడుకున్నా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించిన అమెరికన్ స్పై-యాక్షన్ సిరీస్ సిటాడెల్కు ఇండియన్ వర్షన్‌గా ఈ సిరీస్ రూపొందించారు.అయితే ఈ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో ఈ సిరీస్‌లో నా ప్లేస్‌లో వేరొకరిని తీసుకోవాలని దర్శకులైన రాజ్, డీకేలకు చెప్పానని సామ్ తెలిపింది. అంతేకాకుండా తన స్థానాన్ని భర్తీ చేయగల నటిని కూడా సిఫార్సు చేశానని వెల్లడించింది. కానీ తన విజ్ఞప్తిని వాళ్లిద్దరు తిరస్కరించారని సమంత పేర్కొంది. (ఇది చదవండి: నాకు వారి సపోర్ట్ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత)సమంత మాట్లాడుతూ.. 'ఈ సిరీస్ నేను చేస్తానని నిజంగా అనుకోలేదు. అందుకే నా ప్లేస్‌లో మరొకరిని తీసుకోమని వారిని వేడుకున్నా. నేను చేయలేనని నేను కచ్చితంగా చెప్పా. ఆ పాత్రకు తగిన వారి పేర్లను కూడా పంపా. కానీ వాళ్లు నా స్థానంలో వేరొకరిని తీసుకునేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లో తాను నటించినందుకు సంతోషంగా ఉంది. దర్శకులు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు' తెలిపింది.కాగా.. సమంత గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లి చికిత్స తీసుకుని కోలుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీకి థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రానా చేతుల మీదుగా ట్రైలర్
నవీన్ చంద్ర, ముత్తు కుమార్, నందా, శ్రిందా, మనోజ్ భారతీ రాజా కీలక పాత్రల్లో తెరకెక్కించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ థ్రిల్లర్ సిరీస్‌ను రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈనెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ విషయాన్ని రానా తన ట్విటర్లో షేర్ చేశారు. కాగా.. వెబ్ సిరీస్ తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు భరత్ మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా అల్కెమిస్ దర్శకత్వం వహించారు.DANGER awaits at every step.Ee Vaikuntapaali aata chudadaniki meeru siddhama?🔥Trailer Out Now: https://t.co/jpNQ20usGi#SnakesandLaddersOnPrime, New Series, Oct 18 only on @PrimeVideoIN@stonebenchers @karthiksubbaraj @kalyanshankar @kaarthekeyens @Naveenc212 @nandaa_actor…— Rana Daggubati (@RanaDaggubati) October 16, 2024 -
ఓటీటీకి తెలుగు వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన అలరించిన టాలీవుడ్ వెబ్ సిరీస్. గతేడాది జూన్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. 2016లో హిందీలో వచ్చిన 'అఫీషియల్ చుక్యాగిరి' అనే వెబ్ సిరీస్‌కు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కార్పొరేట్ వరల్డ్‌లో ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనేదే అసలు కథ. తొలి సీజన్ ఐదు ఎపిసోడ్లుగా తెరకెక్కించారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్-2 అలరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. కాగా.. ఈ సిరీస్ మొదటి సీజన్లో హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ కీలక పాత్రలు పోషించారు. అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్ బ్యానర్లపై బి.సాయికుమార్, శరణ్ సాయికుమార్ నిర్మించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
తెలుగులోకి మరో క్రేజీ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో సినిమాలు వచ్చినట్లే.. ఓటీటీలో కొత్త కొత్త వెబ్ సిరీసులు కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. తెలుగులో స్ట్రెయిట్‌గా తీయనప్పటికీ.. ఇతర భాషల్లో తీసిన సిరీస్‌లని డబ్ చేసి మరీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలా ఇప్పుడు ఓ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)'1000 బేబీస్' పేరుతో తీసిన ఈ సిరీస్‌ని సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఓ పోలీస్ టీమ్ దేనికోసమే సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు అడవి మధ్యలో ఓ ఇంట్లో ముసలావిడ. ట్రైలర్లో పెద్దగా కథని రివీల్ చేయలేదు గానీ చూస్తుంటే ఇదేదో మంచి థ్రిల్లర్‌లా అనిపిస్తుంది.మలయాళంలో తీసినప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ డబ్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అక్టోబరు 18న అంటే వచ్చే శుక్రవారం ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. మీరు ట్రైలర్‌పై ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!)