టాలీవుడ్‌లో ఇప్పటి వరకు చాలా సినిమాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి మొదటిసారి ఒక వెబ్ సిరీస్ వస్తుంది. హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఒక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. డిసెంబర్ 13న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు.
మిస్టరీ థ్రిల్లర్ జానర్‌గా 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్‌ను దర్శకుడు మగ్గీ తెరకెక్కించారు. 3 రోజెస్ వెబ్ సిరీస్‌తో ఆయన గుర్తింపు పొందారు. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ వంటి వారితో పాటు బిగ్‌బాస్‌తో గుర్తింపు పొందిన దివి, అంబటి అర్జున్ తదితరులు నటిస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్ 13) నుంచి 'హరికథ' వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment