Rajendra Prasad
-
ఓటీటీలో 'తండ్రీకూతురు' సినిమా స్ట్రీమింగ్
సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం 'లగ్గం'. తెలంగాణ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్ల తంతును చూపిస్తూ.. రమేష్ చెప్పాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని వేణుగోపాల్ రెడ్డి నిర్మాతగా తక్కువ బడ్జెట్లో ఉన్నతంగా నిర్మించారు. అక్టోబర్ 25న ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.'లగ్గం' సినిమాలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్‌తో పాటు రోహిణి, చమ్మక్ చంద్ర వంటి వారు నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు 'ఆహా' ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల సమయంలో భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో మూవీ మెప్పించలేదు.కథ ఏంటంటే?సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్)ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్వేర్ లైఫ్ చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.ప్రతి ఆడపిల్ల కథ ఇంతేనేమో..'ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో.. ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా..' అనే పాటను చరణ్ అర్జున్ చాలా అద్భుతంగా రచిస్తే.. సింగర్ చిత్ర అందరి గుండెల్ని పిండేసేలా ఆలపించారు. లగ్గం చిత్రంలోని ఈ పాటకు యూట్యూబ్‌లో కూడా మంచి వ్యూస్ వచ్చాయి. -
తెలుగులో సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. సరికొత్త కంటెంట్ ఉన్న సిరీస్‌లు, సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగులో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హరికథ.. సంభవామి యుగేయుగే. పీరియాడికల్ బ్యాప్‌డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్, పూజిత పొన్నాడ, అర్జున్ అంబటి, బిగ్‌బాస్ దివి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సరికొత్త వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ వెల్లడించింది. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో తొలిఅడుగు వేయనుంది. దసరా సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసింది సంగతి తెలిసిందే.త్వరలోనే హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushotstartelugu) -
రాజ్ పాకాల ఇంట్లో పార్టీపై పోలీసుల దాడి
శంకర్పల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఇంట్లో నిర్వహించిన పార్టీ పై ఎక్సైజ్, ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. అను మతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించారని, డ్యూ టీ ఫ్రీ విదేశీ మద్యం వినియోగించారని గుర్తించా రు. పార్టీలో పాల్గొన్నవారిలో ఒకరు కొకైన్ వినియో గించి ఉన్నట్టుగా తేల్చారు. ఈ మేరకు రాజ్ పాకాల, మద్దూరి విజయ్‌పై మోకిలాా పోలీసులు, రాజ్ పాకాలపై శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మోకిలా ఠాణాలో నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం.. ‘‘రాజ్ పా కాల నానక్‌రామ్‌గూడలో ఈటీజీ పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. అందులో సీఈఓగా పనిచేస్తున్న జూబ్లీహిల్స్ వాసి మద్దూరి విజయ్‌కు ఫ్యూజన్ యాక్స్ పేరుతో మరో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. రాజ్ పాకాల హైదరాబాద్ శివార్లలోని జన్వాడలో ఉన్న షీర్మాథే ప్రాపర్టీస్‌లో కొన్నాళ్ల క్రితం ఓ ఇంటిని నిర్మించారు. అందులో తరచుగా వీకెండ్ పార్టీలు ఇస్తూ.. స్నేహితులు, తమ సంస్థల్లోని ఉద్యోగులతో కలిసి పేకాట ఆడుతున్నారు. ఐదేళ్లుగా తనతో సన్నిహితంగా ఉన్న విజయ్ను శనివారం రాత్రి తన ఇంట్లో నిర్వహిస్తున్న దీపావళి పార్టీకి రావాలంటూ రాజ్ పాకాల ఆహ్వానించారు. ఈ పార్టీలో వీరిద్దరితో సహా 38 మంది పాల్గొన్నారు.’’ అని పోలీసులు పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారంతో దాడి.. ‘‘రాజ్ పాకాల ఇంట్లో పార్టీపై మోకిలా పోలీసులకు శనివారం రాత్రి సమాచారం అందింది. ఠాణాలోని జనరల్ డైరీలో ఎంట్రీ నమోదు చేసిన అధికారులు.. నార్సింగి ఏసీపీ నుంచి సెర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకున్నారు. ఆపై ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్), ఎక్సైజ్ పోలీసులతో కలసి శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రాజ్ పాకాల ఇంటిపై దాడి చేశారు. ఎలాంటి ఈవెంట్ పరి్మషన్ లేకుండా పార్టీలో స్థానిక లిక్కర్‌ను, డ్యూటీ ఫ్రీ విదేశీ మద్యాన్ని వినియోగిస్తున్నట్టు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన పురుషులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా మద్దూరి విజయ్ కొకైన్ తీసుకున్నట్టు తేలింది.మహిళా పోలీసుల సాయంతో ఆ ఇంట్లో ఉన్న మహిళలకు డ్రగ్స్ పరీక్షలు చేయడానికి పోలీసులు ప్రయతి్నంచగా.. వారి నుంచి విముఖత ఎదురైంది. ఇక ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు విదేశీ మద్యం, పేకాటకు సంబంధించిన వస్తువులు, పేక ముక్కలను స్వా«దీనం చేసుకున్నారు. 16 మంది మహిళలు సహా 38 మందిని అదుపులోకి తీసుకున్నారు.’’ అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పేకాట నిర్వహణ, ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంపై మోకిలా పోలీసులు కేసు నమోదు చేసి, అందులో రాజ్ పాకాల, విజయ్‌లను నిందితులుగా చేర్చారు. ఇక అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహణ, విదేశీ మద్యం వినియోగంపై శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు రాజ్ పాకాలపై కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల, ఆయన సోదరుడి నివాసాల్లో సోదాలుగచ్చిబౌలి, బంజారాహిల్స్ (హైదరాబాద్): జన్వాడలోని రాజ్ పాకాల ఇంట్లో పారీ్టపై శనివారం రాత్రి దాడి చేసిన పోలీసులు.. ఆదివారం రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ఉన్న రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర నివాసాల్లో సోదాలు చేపట్టారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ, తమ సిబ్బందితో, భారీ పోలీసు బందోబస్తుతో ఈ తనిఖీలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శైలేంద్ర నివాసంలో సోదాలు చేశారు. షో కేస్లు తాళాలు వేసి ఉండటం, తాళంచెవులు లేకపోవడంతో వాటిని పగలగొట్టి తనిఖీ చేశారు. రాత్రి 7 గంటల నుంచి రాజ్ పాకాల విల్లాలో సోదాలు చేశారు. రాత్రి 9 గంటల నుంచి రాజ్ పాకాల బంధువులకు మరో విల్లాలో తనిఖీలు చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల నిరసన సోదాల విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఒరియన్ విల్లాస్ వద్దకు చేరుకున్నారు. అధికారులను అడ్డుకునేందుకు ప్రయతి్నంచారు. ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకుంటే ఇళ్లలో సోదాలు చేయడం ఏమిటని నిలదీశారు. అయితే అక్కడే ఉన్న రాయదుర్గం పోలీ సులు కల్పించుకుని సోదాలకు సహకరించాలని కోరారు. ఈ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీనితో పోలీసులు ఎమ్మెల్యేలు వివేకానంద, మాగంటి గోపీనాథ్, డాక్టర్ సంజయ్‌కుమార్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మన్నె క్రిశాంక్, జయసింహ తదితరులను అదుపులోకి తీసుకుని, పోలీస్స్టేషన్లకు తరలించారు. కేటీఆర్ నివాసం వద్ద హడావుడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్లోనూ సోదాలు జరపబోతున్నారన్న ప్రచారం జరగడంతో ఆదివారం.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు బంజారాహిల్స్ లోని కేటీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. వారి ని కేటీఆర్ ఇంట్లోకి అనుమతించలేదు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. ముమ్మరంగా దర్యాప్తు.. రాజ్ పాకాల ఇంట్లో జరిగిన పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన మద్దూరి విజయ్ను విచారిస్తున్నారు. ఆ డ్రగ్‌ను తనకు రాజ్ పాకాల ఇచ్చారని విజయ్ చెప్పారని.. ఈ క్రమంలో రాజ్ పాకాలకు కొకైన్ ఎలా వచి్చంది? ఎవరు విక్రయించారు? ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. విజయ్ను పార్టీ జరిగిన ప్రాంతంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రాజ్ పాకాలను ఆదివారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్.. మధ్యాహ్నం 2 గంటలకు మోకిలాా పోలీస్‌స్టేషన్‌కు విచారణ కోసం రావాలని ఆదేశించారు. కానీ రాజ్ పాకాల ఈ విచారణలకు హాజరుకాలేదు. ఆయన మొబైల్ స్విచాఫ్ వస్తోందని, గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఈ 'పెళ్లి పుస్తకం' మనోరంజకం
సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవన ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని, కుటుంబ విలువల్ని చాటి చెప్పే మనోరంజకమైన సకుటుంబ కథాచిత్రం 'పెళ్లి పుస్తకం'. రాజేంద్రప్రసాద్ హీరోగా దివ్యవాణి హీరోయిన్గా ప్రముఖ దర్శకులు బాపు తీర్చిదిద్దిన ఓ కుటుంబ కావ్యం. బాపు గీత గీసి, ముళ్లపూడి వెంకటరమణ రాత రాసి, శ్రీకారం చుట్టిన 'పెళ్లి పుస్తకం' 1991 ఏప్రిల్ 1న విడుదలై చరిత్ర సృష్టించింది. కొత్తగా పెళ్లి చేసుకున్న కృష్ణమూర్తి అంటే రాజేంద్రప్రసాద్ ముంబైలోని ఓ సంస్థలో కళా దర్శకుడుగా పని చేస్తుంటాడు. ఇతని భార్య సత్యభామ అంటే దివ్యవాణి కేరళలో స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తుంటుంది. అయితే... తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వీరిద్దరూ కలిసి ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంటారు. అలా ఓ పెద్ద సంస్థలో చేరడం కోసం తాము అవివాహితులమని ఆ సంస్థ యజమాని గుమ్మడికి అబద్ధం చెబుతారు. అక్కడ చేరిన తర్వాత వీరు ఎదుర్కొనే సమస్యలే ఈ చిత్రంలోని ప్రధానాంశం.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) కడుపుబ్బా నవ్వించిన రచనకంపెనీ యజమానిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నేనూ... అంటూ మాటమాటని కట్ చేసి వెరైటీ స్లాంగ్‌తో మాట్లాడుతుంటే... గుమ్మడి సంస్థలో పని చేసే ఉద్యోగుల చేత బాబాయిగా పిలిపించుకుంటూ... ఈ సినిమాకు కథను అందించిన రావి కొండలరావు బధిర వార్తలు చదువుతున్నట్లు సైగలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. ఇక గిరి పాత్రలో నటించిన శుభలేఖ సుధాకర్ విషయానికొస్తే... గుమ్మడి బావమరిదిగా.. దివ్యవాణిపై మనసు పడి ఆ తర్వాత అక్కతో తన్నులు తినే సన్నివేశాలు లోలోన నవ్వు పుట్టిస్తాయి.చప్పట్లు కొట్టించిన మాటలుసెకండ్ హీరోయిన్గా వచ్చిన గుమ్మడి కుమార్తె వసుంధర పాత్రలో నటించిన సింధుజా కూడా హీరో రాజేంద్రప్రసాద్ వెంట పడి అతని భార్య దివ్యవాణి అసూయకు కారణమవుతుంది. కానీ సింధుజాది అంతా నటన అని చివరకు తెలుసుకుంటుంది. అలాగే చిత్రంలోని బ్రహ్మచారి గదులకు భామలే అందం, పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం, నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు... ఏడుపుచ్చినప్పుడు నవ్వేవాడే హీరో, అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటర్, నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతులాగే వినిపిస్తుంది... లాంటి డైలాగులు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)ఏ పెళ్లిలోనైనా ఆ పాటేపాటలైతే చెప్పనక్కరలేదు.. ఆరుద్ర చేతి నుంచి జాలు వారిన 'శ్రీరస్తూ శుభమస్తూ' పాట... అప్పటి వరకు తెలుగు లోగిళ్లలో ఎక్కడ పెళ్లి బాజా మోగినా వినిపించే 'సీతారాముల కళ్యాణం చూతమురా రండి' అంటూ సాగే పాటనే పక్కకు నెట్టేసింది. ఇప్పటికీ తెలుగువారి పెళ్లిళ్లలో ఈ పాటే వినిపిస్తుండడం విశేషం. మామ కేవీ మహాదేవన్ సంగీత దర్శకత్వంలో ట్యూన్ కట్టిన ‘అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనస్సులాయో...’, ‘కృష్ణం కలయ సఖి సుందరం...’, ‘పప్పు దప్పళం అన్నం నెయ్యి...’, ‘హాయి హాయి శ్రీరంగ సాయి...’, ‘సరికొత్త చీర ఊహించినాను...’ వంటి పాటలు ప్రేక్షక మహాశయులనే కాదు... సంగీత ప్రియులను కూడా ఓలలాడించాయి. పెళ్లికి అర్థాన్నీ, పరమార్థాన్నీ సున్నితంగా, హృద్యంగా అందంగా, రొమాంటిక్‌గా, అన్నింటినీ మించి హాస్యరసభరితంగా చెప్పిన చిత్రం ఈ ‘పెళ్లి పుస్తకం’.– ఇంటూరు హరికృష్ణ -
రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేయడం మా నాన్నతో యాక్ట్ చేసినట్టే ఉంది...
-
రెండు కుటుంబాలు కాదు రెండు మనస్సులు కలిస్తేనే లగ్గం..
-
‘జనక అయితే గనక’మూవీ రివ్యూ
టైటిల్: జనక అయితే గనకనటీనటులు: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెక కిశోర్, మురళీ శర్మ తదితరులునిర్మాణ సంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత్ రెడ్డిదర్శకత్వం: సందీప్‌రెడ్డి బండ్లసంగీతం: విజయ్ బుల్గానిక్సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్విడుదల తేది: అక్టోబర్ 12, 2024ఈ మధ్యే ‘గొర్రె పురాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుహాస్.. ఇప్పుడు ‘జనక అయితే గనక’ అనే సినిమాతో మరోసారి థియేటర్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు(అక్టోబర్ 12) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? సుహాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ప్రసాద్ (సుహాస్) కి పిల్లలు కనడం అస్సలు ఇష్టం లేదు. ఈ రోజుల్లో పిల్లలను పోషించాలంటే లక్షల్లో డబ్బులు అవసరమని, అంత డబ్బు తన వద్ద లేదని పిల్లలే వద్దనుకుంటాడు. భార్య(సంగీత విపిన్) కూడా అతని మనసును అర్థం చేసుకుంటుంది. కుటుంబ నియంత్ర కోసం కండోమ్ వాడుతారు. అయినప్పటికీ ప్రసాద్ భార్య గర్భం దాల్చుతుంది. దీంతో కండోమ్ సరిగ్గా పని చేయలేదని వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తాడు ప్రసాద్. తాను వాడిన కండోమ్ సరిగా పనిచేయలేకపోవడంతో తన భార్య గర్భం దాల్చిందని, నష్టపరిహారంగా రూపాయలు కోటి ఇవ్వాలని ఆ కంపెనీపై కేసు వేస్తాడు. ఈ కేసు ప్రసాద్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? అసలు ప్రసాద్ భార్య గర్భం ఎలా దాల్చింది? చివరకు ఈ కేసులో ప్రసాద్ గెలిచాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..మానవ జీవితంలో వస్తు వినియోగం తప్పని సరి. ఏదైనా ఒక వస్తువు కొని ఆ వస్తువు నకిలీ లేదా నాసిరకం అయితే అమ్మిన వ్యాపారిపై లేదా ఉత్పత్తిదారులపై కేసు వేయొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. వినియోగదారుల చట్టం పై జనాలకు అవగాహన లేదు. ఈ పాయింట్ తో తెరకెక్కిన చిత్రమే జనగా అయితే గనక. ప్రస్తుతం సమాజం ఫేస్ చేస్తున్న ఓ సీరియస్ ఇష్యూ ని కామెడీ వేలో చూపిస్తూ చివరకు ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. కండోమ్ మీద కేసు పెట్టడమనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. కానీ అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడు.వినోదాత్మకంగా చూపించాలనే ఉద్దేశంతో చాలా చోట్ల లాజిక్ లెస్ సన్నివేశాలను జోడించాడు. ముఖ్యంగా కీలకమైన కోర్టు సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి . వెన్నెల కిషోర్ చేసే కామెడీ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. కోర్టు డ్రామా మొదలవగానే సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.ఇంటర్వెల్ ముందు వరకు అసలు కథను ప్రారంభించకుండా కథనాన్ని నడిపించాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించేందుకు ప్రసాద్ పాత్ర చుట్టు అల్లిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. ఈ రోజుల్లో పిల్లలను కనాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రాక్టికల్‌గా చూపించే సీన్ నవ్వులు పూయించడంతో పాటు ఆలోచింపచేస్తుంది. ఫస్టాఫ్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించి, సెకండ్ హాఫ్ లో వారి ఎమోషన్స్ తో కొందరు చేస్తున్న మోసపూరిత వ్యాపారాల చూపించారు. వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న దందా, నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న మోసాన్ని వినోదాత్మకంగా చూపించారు. అయితే ముందుగా చెప్పినట్లుగా కోర్డు డ్రామాలో బలం లేదు. కొన్ని చోట్ల ప్రసాద్ పాత్ర చేసే ఆర్గ్యుమెంట్స్‌కి అర్థం ఉండదు. ఇక చివర్లో వచ్చే చిన్న ట్విస్ట్ అయితే అదిరిపోతుంది.ఎవరెలా చేశారంటే..సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు . మిడిల్ క్లాస్ యువకుడు ప్రకాష్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కోటి సీన్లలో అతను చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి. హీరోయిన్ పాత్రనిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా కథంతా చుట్టే తిరుగుతుంది. లాయర్ కిషోర్ గా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. జడ్జి ధర్మారావుగా రాజేంద్రప్రసాద్ కొన్నిచోట్ల నవ్విస్తాడు. లాయర్ గా మురళి శర్మ, హీరో తండ్రిగా గోపరాజు, బామ్మ పాత్రను పోషించిన నటితోపాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మీద చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పరవాలేదు. సంగీతం బావుంది. పాటలు కథలో భాగంగానే వస్తాయి. అయితే ఒక పాట మినహా మిగిలినవేవి గుర్తుండవు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ధైర్యంగా ఉండు బాబాయ్.. రాజేంద్ర ప్రసాద్‌ను ఓదార్చిన ప్రభాస్
-
రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన రెబల్ స్టార్.. గాయత్రికి నివాళి
సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. కూకట్‌పల్లిలోని ఇందు విల్లాస్లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రభాస్ కూతురి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గాయత్రి చిత్రపటానికి ప్రభాస్ నివాళులర్పించారు.కాగా.. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో రాజేంద్రప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు. కూతురిపై ప్రేమతో తానే స్వయంగా రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించి ఇచ్చారాయన. -
ముగిసిన నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి అంత్యక్రియలు
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. శనివారం అర్ధరాత్రి ఆమె మరణించారు. అయితే, కొంత సమయం క్రితం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. గాయత్రికి మొదట ఛాతీ వద్ద నొప్పి రావడంతో వెంటనే ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆమె మరణించారు.కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్ వద్ద ఇందూ విల్లాస్‌లో ఉంటున్న రాజేంద్రప్రసాద్ నివాసంలో గాయత్రి భౌతికకాయాన్ని ఉంచారు. ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలిపిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం గాయత్రి అంత్యక్రియలు జరిగాయి. కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ కైలాస వాసంలో కుటుంబ సభ్యుల మధ్య గాయత్రి అంత్యక్రియలు ముగిశాయి. అక్కడ కూతురు భౌతికకాయాన్ని చూసి రాజేంద్రప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. -
రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత.. సెలబ్రిటీల సంతాపం (ఫోటోలు)
-
రాజేంద్ర ప్రసాద్ కూతురు కన్నుమూత
-
రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి గుండె వద్ద నొప్పిగా ఉందని ఆమె చెప్పడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. అర్దరాత్రి సుమారు 1గంటకు ఆమె మరణించారు. గుండెపోటు వల్లే గాయత్రి మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తెతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కూతురిలో అమ్మను చూసుకున్న: రాజేంద్రప్రసాద్ రాజేంద్రప్రసాద్ గతంలో తన కూతురు గాయత్రి గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన తన కూతురు గురించి చెబుతూ ఇలా ఎమోషనల్ అయ్యారు. అమ్మ లేని వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడని ఒక సినిమా వేదిక మీద పంచుకున్నారు. 'నా పదేళ్ల వయసులో మా అమ్మ గారు చనిపోయారు. ఆ బాధ ఎప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అయితే, నాకు కూతురు (గాయత్రి ) పుట్టిన తర్వాత మా అమ్మను తనలోనే చూసుకుంటున్నా. కానీ, ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో తనతో మాటలు లేవు. అయినప్పటికీ.. బేవార్స్ అనే సినిమాలోని 'తల్లీ.. తల్లీ.. నా చిట్టి తల్లి' అనే పాటను గాయత్రికి వినిపించాలని ఇంటికి తీసుకొచ్చాను. ఈ పాటను ఆమెకు నాలుగుసార్లు వినిపించాను.' అని ఆయన అన్నారు. ఆమె ప్రేమ వివాహం చేసుకున్న కొద్దిరోజుల తర్వాత తన కూతురిని రాజేంద్రప్రసాద్ స్వాగతించిన విషయం తెలిసిందే. -
నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ బర్త్‌డే స్పెషల్.. రేర్ ఫొటోలు
-
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
'ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు' అన్నారు పెద్దలు. 'ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి' అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో 'లగ్గం' మూవీని మొదలుపెట్టి శరవేగంగా తాజాగా 'లగ్గం' టాకీ పార్ట్ పూర్తయింది.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)రాజేంద్ర ప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, రోహిణి, రఘు బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు సంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను తీసినట్లు తెలుస్తోంది. చరణ్ అర్జున్ సంగీతమందించారు. 'బేబి' ఫేమ్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ గురించి చెబుతారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
కుటుంబ కథాచిత్రం
రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ‘శుభలేఖ’ సుధాకర్ కీలక పాత్రల్లో రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. హెచ్ఎన్జీ సినిమాస్‌పై హెచ్ మహాదేవ గౌడ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఉదయ్ శర్మ మాట్లాడుతూ–‘‘రేషన్ కార్డులాగా ఉన్న ఫస్ట్ లుక్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. మా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. ఎంతో మంది సీనియర్స్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మగారి మ్యూజిక్ హైలెట్’’ అన్నారు. ‘‘సఃకుటుంబానాం’ మంచి క్రియేటివిటీతో కూడిన కుటుంబ కథా చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మహాదేవ గౌడ్. ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి. -
తెలంగాణ పెళ్లి బ్యాక్‌డ్రాప్‌తో సినిమా.. శరవేగంగా షూటింగ్
సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'లగ్గం'. 'భీమదేవరపల్లి బ్రాంచి' మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ చిత్రాన్ని తీస్తున్నారు. తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా చూపించబోతున్నానని ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారని ఈ దర్శకుడు ధీమాగా చెబుతున్నాడు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది) కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్గా నటించారు. రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. "ఇది వరకు తెలుగు సాంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్ తో చాలా చిత్రాలు వచ్చాయి. అందుకు భిన్నంగా లగ్గం సినిమా ఉండబోతోందని నటుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. (ఇదీ చదవండి: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్) -
కొత్త పాయింట్‌తో తీశారనిపిస్తోంది
విశ్వ కార్తికేయ, ఆయూషీ పటేల్ జంటగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో..’. రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కలియుగం పట్టణంలో..’ టైటిల్ కొత్తగా ఉంది. కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. నా ‘ఆ నలుగురు’ సినిమాలో అప్పడాలు అమ్మి పెట్టడంలో నా గురువుగా ఆరేళ్ల వయసులోనే విశ్వ కార్తికేయ నాతో పాటు నటించాడు. ఇప్పుడు హీరోగా నటించాడు. ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలి. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఓ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘మదర్ సెంటిమెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి ఈ సినిమా తీశారు. చిత్రా శుక్లా ఓ స్పెషల్ రోల్ చేశారు’’ అన్నారు విశ్వ కార్తీకేయ. ‘‘మా చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రమాకాంత్ రెడ్డి. ‘‘మా టీజర్, ట్రైలర్‌ను చూసి కథను అంచనా వేయలేరు. సినిమా అంత కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణను కడపలోనే చేశాం’’ అన్నారు కందుల చంద్ర ఓబుల్ రెడ్డి. ‘‘సినిమా అంతా కడపలోనే తీయడం ఇదే తొలిసారి. కడప నుంచి ఓ మంచి నిర్మాత రాబోతున్నాడు’’ అన్నారు దర్శకుడు నీలకంఠ. -
కల్కి ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ సీనియర్ నటుడు.. ప్రభాస్‌తో తొలి సినిమా
ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే టాప్ నటీనటులు భాగమయ్యారు. కల్కిలో టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయనే ఓ కార్యక్రమంలో ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి టాప్ యాక్టర్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చుంటారనే వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో పరకాయప్రవేశం చేయగల సత్తా ఆయనలో ఉంది. అలాంటి నటుడ్ని నాగ్ అశ్విన్ ఎలా ఉపయోగించుకుంటారో తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రభాస్‌తో కూడా రాజేంద్ర ప్రసాద్ తొలిసారి నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపకా పదుకొణె, దిశా పటానీ, గౌరవ్ చోప్రా వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టామని నాగ్ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
ఈ ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం
‘ఈ ప్రపంచం మన ప్రేమని తిరస్కరిస్తే.. ఈ ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘అందరూ నన్ను ఏడిపించినవాళ్లే.. కానీ, నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు ‘లవ్ @65’ మూవీ ట్రైలర్లో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లవ్ @65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ రాజు, స్పందన పల్లి ముఖ్య పాత్రలు పోషించగా, సునీల్, అజయ్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంగా శుక్రవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘రాత్రి ఇక్కడి నుంచి ఇద్దరు మిస్ అయిపోయారు సార్’, ‘ఎవరు’, ‘మా కావేరి సార్.. మా ఆది సార్’, ‘ఎలా మిస్సయ్యారు’, ‘వాళ్లు లేచిపోయారు సార్’, ‘ఇద్దరూ మేజర్లా’, ‘కాదు సార్.. ఆయనకి డెబ్బై నిండాయి.. ఆవిడకి ఓ అరవైఐదు దాక ఉంటాయి’.. వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ తుమ్మలపల్లి, సంగీతం: అనూప్ రూబెన్స్. -
ఆ సినిమా తరువాత అంత గొప్ప పాత్ర ఇదే: రాజేంద్ర ప్రసాద్
సాయి రోనక్, గనవి లక్ష్మణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'లగ్గం'. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నచెప్పాల రమేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సుభిశి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ...'లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర చేస్తున్నా. నా కెరీర్లో పెళ్లి పుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం మరో విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారందరికీ ఈ కథనాలు కనెక్ట్ అవుతాయి. మొత్తంగా లగ్గం విందు భోజనం లాంటి సినిమా' అని అన్నారు. దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ.. "పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు. రెండు మనసులు కలవడం అంటూ గట్టి దావత్ ఇవ్వబోతున్నాం అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ.. "ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాం. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్ ప్రతి ఒక్కరికి వాళ్ల లగ్గాన్ని గుర్తు చేస్తుంది. పెళ్లి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది." అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, సత్తన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. -
ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి
ఎస్వీ కృష్ణారెడ్ఢి.. పోస్టర్‌పై ఈ పేరు కనిపిస్తే చాలు... ఇంటిల్లిపాదీ కలిసి సినిమాకి వెళ్లేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతారు. స్వచ్ఛమైన వినోదంతో పాటు మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలకి పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు. ఆయన చిత్రాల్లో యమలీల ఓ సంచలనం అయితే మాయలోడు చిత్రం కూడా ఒక సెన్సేషనల్ హిట్.. అలా ఆయన నుంచి ఎన్నో హిట్ చిత్రాలు వెండితెరపై మెరిశాయి. ఒక్కపాటతో 365 రోజులు ఆడిన సినిమా 'మాయలోడు' సినిమాలో 'చినుకు చినుకు సాంగ్' అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ పాటలో బాబూమోహన్- సౌందర్య కలిసి వేసిన స్టెప్పులు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. సుమారు 30 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సాంగ్ వింటూనే ఉన్నాం. ఆ ఒక్క పాట కోసం ఏకంగా 365 రోజులు సినిమా ఆడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాబుమోహన్ చెప్పారు. ప్రేక్షకులు సినిమాకు రావడం ఆ పాట పూర్తికాగానే థియేటర్ నుంచి వెళ్లిపోయేవారని ఆయన చెప్పారు. ఇదే పాటను శుభలగ్నం చిత్రంలో ఆలీ,సౌందర్యతో కూడా మళ్లీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్.. కానీ ఒక కమెడియన్‌తో సాంగ్ తీయడం ఏంటి..? అనే సందేహం చాలామందిలో ఉండేది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఎస్వీ కృష్ణారెడ్ఢి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మాయలోడు సినిమాలో హీరోగా ఉన్న రాజేంద్రప్రసాద్ సరైన సహకారం ఇవ్వకపోవడం వల్లే ఆ పాటను బాబూ మోహన్‌తో తెరకెక్కించినట్లు ఆయన ఇలా చెప్పారు. 'మాయలోడు సినిమా పూర్తి కానున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఇబ్బంది పెట్టారు. 'నువ్వూ డ్యాన్సులు చేస్తావట కదా.. నువ్వూ స్టెప్పులు వేస్తావట కదా..' అంటూ నాపట్ల రాజేంద్రప్రసాద్ వెటకారంగా మాట్లాడారు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. సినిమా పూర్తి అవుతుందని అనుకున్న సమయంలో రాజేంద్రప్రసాద్ డేట్స్ తక్కవ కావడంతో అదనపు డేట్స్ కోసం అడిగేతే కనీసం కూడా సహకరించలేదు. ఎలాగైనా పాట చిత్రీకరణ చేయాలని ఆయన్ను బతిమాలుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఎలా చేస్తావో చూస్తా అన్నారు ఫైనల్‌గా రాజేంద్ర ప్రసాద్‌తో మిగిలిన డేట్స్ తో డబ్బింగ్ పూర్తి చేయించాను. అది కూడా సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను తన మేనేజర్ చూసిన తర్వాతే డబ్బింగ్ చెప్పాడు. ఒక రోజులో ఎలాగూ డబ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుందని ఆయన అనుకున్నారు. సినిమా మొత్తం 1200 అడుగుల రీల్ వస్తే, ఎడిటర్‌ను రిక్వెస్ట్ చేసి, మొత్తం ఒకే రీల్‌గా మార్చాను. ఆ విషయం రాజేంద్రప్రసాద్‌కు తెలియదు. దీంతో మధ్యాహ్నం 1గంటకే డబ్బింగ్ పూర్తి చేయడంతో ఆశ్చర్యపోయారు. ‘ఇంకా పాట చేయాలి కదా. ఎలా చేస్తావో చూస్తా’ అన్నారు. ఆ తర్వాత పాట షూటింగ్‌కు రమ్మని పిలిస్తే, ‘నాకు కుదరదయ్యా.. సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావు కదా చేసుకో పో’ అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతటితో రాజేంద్రప్రసాద్ నిష్క్రమించగా.. ఇక ఆయన్ను బతిమాలాల్సిన అవసరం లేదని భావించానని కృష్ణారెడ్ఢి తెలిపారు. ఆపై వెంటనే బాబూమోహన్‌తో సాంగ్ తీయాలని నిర్ణయించుకుని బాబూమోహన్‌తో మాట్లాడి ఒప్పించినట్లు తెలిపాడు. బాబుమోహన్, సౌందర్యతో పాట తీస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత కొందరి మధ్యవర్తులను తన వద్దకు పంపినట్లు చెప్పాడు. సాంగ్ తీసేందుకు రాజేంద్రప్రసాద్ రెడీగా ఉన్నారని వారు చెప్పారు. అయితే ఇక నాకు ఆ అవసరం లేదని, ఇప్పటికే బాబూమోహన్‌కు మాట ఇచ్చేశానని చెప్పడంతో వారు వెళ్లి పోయారు. కావాలాంటే రాజేంద్రప్రసాద్ షూటింగ్ స్పాట్ వద్దకు రావొచ్చని, చూసి వెళ్లొచ్చని చెప్పాను. అని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. చిత్రపరిశ్రమలో తాను దర్శకుడిగా ఎదగడానికి ప్రధాన కారణం రాజేంద్ర ప్రసాద్ అని ఎస్వీ కృష్ణారెడ్ఢి చెప్పారు. తన సినీ జర్నీలో రాజేంద్ర ప్రసాద్ సహకారం ఎంతో ఉందని కూడా ఇదే సందర్భంలో అన్నారు. కానీ మాయలోడు సినిమా విషయంలో మాత్రం తనను రాజేంద్రప్రసాద్ తీవ్రంగా బాధపెట్టారని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. గతేడాది 'ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు' అనే చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్ఢి దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. -
చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి సీటు విషయంలో జనసేన, తెలుగుదేశం మధ్య చిచ్చు రాజుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బుధవారం గుంటూరులో నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మండల, పట్టణ పార్టీ, అన్ని అనుబంధ విభాగాల నేతల నేతలతో రాజా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తెనాలి సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించకపోతే ఈ నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలిసింది. తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీంతో కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న రాజా తర్వాత మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి చర్చలు జరపడం, కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. నాదెండ్ల మనోహర్‌ను రాజ్యసభకు పంపించి ఈ సీటు రాజాకు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇటీవల చెప్పారు. దీంతో రాజా ప్రజా పాదయాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. రాజ్యసభకు వెళ్లడానికి మనోహర్ ఇష్టపడలేదు. తెనాలిలోనే ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. తెనాలిలోనే ఉంటూ టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కలుస్తూ సీటు తనదేనని చెబుతున్నారు. తనకు సహకరించాలని కోరుతున్నారు. దీంతో తెనాలి సీటు దక్కదన్న అభిప్రాయానికి వచి్చన ఆలపాటి రాజా గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం ఇష్టపడటంలేదు. దీంతో రాజా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ మంగళవారం తన ఇంటికి పిలిపించుకుని, వారితో చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా సీటును జనసేన పార్టీకి ఇస్తే సహించబోమని ఈ సమావేశం అనంతరం నేతలు మీడియాకు తెలిపారు. పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఖుద్దూస్, మాజీ ఎంపీపీలు కేశన కోటేశ్వరరావు, సూర్యదేవర వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ శాఖమూరి చిన్నా, వైకుంఠపురం మాజీ చైర్మన్ జొన్నాదుల మహేష్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ సోమవరపు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు ఆడుసుమిల్లి వెంకటేశ్వరరావు, దేసు యుగంధర్, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, ఇతర టీడీపీ నాయకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, రావి చిన్ని, రావి సూర్యకిరణ్ తేజ, లాయర్ మద్ది మల్లికార్జునరావు తదితరులతో రాజా ఈ సమావేశం నిర్వహించారు. బుధవారం గుంటూరులో జరిగే సమావేశంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. -
'ఆటా' గ్రాండ్ ఫినాలే.. రాజేంద్రప్రసాద్‌కు ప్రత్యేక ఆహ్వానం
'ఆటా' గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈనెల 30న రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు రాజేంద్రప్రసాద్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఇంట్లో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కాశీ కొత్త, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణారామా మా ఇంట్లో పుట్టిన కథే – దర్శకుడు రాజ్ మదిరాజు
‘‘ప్రస్తుతం చాలా మంది తమ తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తున్నారు. దీంతో ఒంటరి తనంగా భావించిన తల్లిదండ్రులు తమ మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. మా తల్లి దండ్రులు కూడా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఫేస్ బుక్‌లోకి వచ్చారు. ఒక విధంగా ‘#కృష్ణారామా’ కథ మా ఇంట్లో పుట్టిందే’’ అని దర్శకుడు రాజ్ మదిరాజు అన్నారు. రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో అనన్య శర్మ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘‘#కృష్ణారామా’. అద్వితీయ మూవీస్‌పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ సినిమా ఆదివారం నుంచి ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మదిరాజు మాట్లాడుతూ– ‘‘మన తల్లిదండ్రులు రిటైర్ అయిపోతే వాళ్ల జీవితమే అయిపోయిందనే భావనలోకి వెళ్లిపోతున్నాం. కానీ, వారి అనుభవం సమాజానికి ఎంతో అవసరం అని మా సినిమా ద్వారా చెబుతున్నాం. ఒక డైరెక్టర్‌గా నా పనిని నేను ఇష్టపడతాను. నటుడిగా నా పరిధిలోనే ఉంటాను.. డైరెక్టర్స్‌కి సలహాలు, సూచనలు ఇవ్వను. ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. డైరెక్టర్‌గా రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు.