కల్కి ప్రాజెక్ట్‌లో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు.. ప్రభాస్‌తో తొలి సినిమా | Tollywood Top Actors Enter In Kalki 2989 AD | Sakshi
Sakshi News home page

కల్కి ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు

Published Fri, Mar 1 2024 1:48 PM | Last Updated on Fri, Mar 1 2024 3:06 PM

Tollywood Top Actors Enter In Kalki 2989 AD - Sakshi

ప్రభాస్‌ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి కీలక అప్డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే టాప్‌ నటీనటులు భాగమయ్యారు. కల్కిలో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్‌ కూడా నటిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయనే ఓ కార్యక్రమంలో​ ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్‌ లాంటి టాప్‌ యాక్టర్‌ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చుంటారనే వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఏ క్యారెక్టర్‌ ఇచ్చినా సరే అందులో పరకాయప్రవేశం చేయగల సత్తా ఆయనలో ఉంది. అలాంటి నటుడ్ని నాగ్‌ అశ్విన్‌ ఎలా ఉపయోగించుకుంటారో తెలియాల్సి ఉంది.

ఇకపోతే ప్రభాస్‌తో కూడా రాజేంద్ర ప్రసాద్‌ తొలిసారి నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపకా పదుకొణె, దిశా పటానీ, గౌరవ్ చోప్రా వంటి స్టార్స్‌ ఇందులో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ నుంచి ప్రకటన వచ్చింది. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్‌ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌ పెట్టామని నాగ్‌ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement