టాలీవుడ్ సినిమా పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతోంది. ఆర్ఆర్ఆర్, బాహుబలి తర్వాత తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ దాకా ఎదిగింది. తాజాగా రష్యాలోని మాస్కోలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో ఆర్ఆర్ఆర్, కల్కి చిత్రాలను ప్రదర్శించారు. రష్యాలోనూ ఇండియన్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఆర్ఆర్ఆర్‌ను ఆ దేశ భాషలోనూ విడుదల చేశారు.
రష్యన్ భాషలో రిలీజ్
తాజాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాను రష్యన్ భాషలోనూ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్వప్నదత్, ప్రియాంక దత్‌లు వెల్లడించారు. కల్కి సినిమాను రష్యా భాషలోకి డబ్ చేయనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్‌లోనే రష్యా థియేటర్లలో కల్కి సందడి చేయనుంది. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో టాలీవుడ్ సినిమాల ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆగస్టు 23న ప్రారంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నేటితో ముగియనుంది.
బాక్సాఫీస్ షేక్ చేసిన కల్కి
కాగా.. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో కీర్తి సురేశ్ వాయిస్‌తో ఉన్న బుజ్జికారు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Celebrating Indian Cinema globally! ✨ #Kalki2898AD proudly represents India at the Moscow International Film Week during Indian Cinema Day 🇮🇳@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/yDmlcAurm8
— Kalki 2898 AD (@Kalki2898AD) August 27, 2024
Comments
Please login to add a commentAdd a comment