‘‘కల్కి 2898 ఏడీ’ని సూపర్ హిట్ చేసినందుకు మా టీమ్, వైజయంతీ మూవీస్ తరఫున ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ విజయం మొత్తం ఇండస్ట్రీదిగా భావిస్తున్నాను. ఎన్నో ప్రోడక్షన్స్, యాక్టర్స్, రైటర్స్, అప్ కమింగ్ డైరెక్టర్స్‌కి ఒక డోర్ ఓపెన్ అయ్యింది. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కథలు రాసుకునే వారికి ‘కల్కి’ రిఫరెన్స్ పాయింట్‌లా ఉంటుంది’’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం రూపొందించిన సెట్స్‌లో శుక్రవారం డైరెక్టర్ నాగ్ అశ్విన్ విలేకరులతో పంచుకున్న విశేషాలు.
⇒ తెలుగు సినిమా అనగానే చాలామందికి ‘మాయా బజార్’ గుర్తొస్తుంది. అది ఓ రకంగా మహాభారతం ఆధారంగా రూపొందిందే. ‘మాయా బజార్’ మూవీ స్ఫూర్తితోనే ‘కల్కి 2898 ఏడీ’ తీశాను. ఈ కథను ముందుగా చిరంజీవిగారికి చెప్పాననడంలో నిజం లేదు. ప్రభాస్‌గారు కథని నమ్మి చాలా సపోర్ట్ చేశారు. ముందు ఒకే భాగంగా తీయాలనుకున్నాం. కొన్ని షెడ్యూల్స్ తర్వాత ఇంత పెద్ద కథని ఒక భాగంలో చెప్పడం సవాల్‌గా అనిపించింది. అందుకే రెండు భాగాలుగా చూపించాలనుకున్నాను.
⇒ ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్ చేసిన భైరవ పాత్ర సీరియస్‌గా కాకుండా సరదాగా ఉండాలనే ఉద్దేశంతోనే అలా క్రియేట్ చేశాను. మొదటి భాగంలో ప్రభాస్ పాత్ర నిడివి తక్కువగా ఉందంటున్నారు. రెండో భాగంలో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక వంటి స్టార్స్‌ని వ్యాపార కోణంలో ఆలోచించి తీసుకోలేదు. ఆయా పాత్రలకు వారు న్యాయం చేయగలరనే ఉద్దేశంతోనే తీసుకున్నా. ఒకవేళ కథలో బలం లేకపోతే ఆ నటుల ఎంపిక మాకు నెగెటివ్ అయ్యేది. కానీ వారి క్యారెక్టర్స్‌కి అనూహ్య స్పందన వస్తోంది. కమల్ సార్ చేసిన యాస్కిన్ పాత్రను పార్ట్ 2లోనే ఎక్కువ రివీల్ చేస్తాం.
⇒ వైజయంతీ మూవీస్ 50 ఏళ్ల జర్నీలోనే కాదు... తెలుగు సినిమా హిస్టరీలో ఉన్న అత్యధిక భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. ఈ సినిమా గొప్ప విజయం సాధించి మా పెట్టుబడి పూర్తిగా రావడంతో చాలా హ్యాపీగా ఉంది. రామ్‌గోపాల్ వర్మ, రాజమౌళిగార్లు ఈ మూవీలో కనిపించడం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్. విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్‌లతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తీశాను. నా ఫస్ట్ మూవీ నటులు కాబట్టి వారు ప్రత్యేకం. నాకు లక్కీ ఛార్మ్. అందుకే వాళ్లని నా ప్రతి చిత్రంలో తీసుకుంటాను. నానీ, నవీన్ ΄÷లిశెట్టిలను రెండో భాగంలో ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టేస్తా (నవ్వుతూ).
⇒ ‘కల్కి...’లో కృష్ణుడి పాత్రలో మహేశ్‌బాబు నటించి ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ మూవీలో ఆ చాన్స్ లేదు. కానీ ఆయన ఏ సినిమాలో అయినా కృష్ణుడిగా నటిస్తే చాలా బాగుంటుంది. ‘కల్కి’ రెండో భాగానికి సంబంధించి 20 రోజులు షూటింగ్ జరిపాం. రెండో భాగంలో కల్కి పాత్రలో ఏ హీరో కనిపిస్తార న్నది సస్పెన్స్. రెండో భాగాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది ఇప్పుడే చెప్పలేం.
Comments
Please login to add a commentAdd a comment