'కల్కి 2898 ఏడీ'.. ఆ క్రేజీ సాంగ్‌ వచ్చేసింది! | Hope Shambala Video Song From Prabhas Kalki 2898 AD Out Now | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి .. ఆ వీడియో సాంగ్‌ వచ్చేసింది!

Published Thu, Jul 4 2024 7:50 PM | Last Updated on Thu, Jul 4 2024 8:02 PM

Tollywood Movie Kalki 2898 AD Video Song Out Now

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఏకంగా రూ.725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 13.5 మిలియన్ డాలర్స్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కల్కి 2898 ఏడీ చిత్రంలోని హోప్‌ ఆఫ్‌ శంబల అనే వీడియోసాంగ్‌ విడుదలైంది. వారణాసి, కాంప్లెక్స్‌, శంబల.. ఈ మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే కథతో ఈ మూవీని రూపొందించారు.  కాగా.. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement