ప్రభాస్ కల్కి సీక్వెల్‌.. షూటింగ్‌ ఎప్పటినుంచంటే? | Kalki 2898 AD Movie Producers Reveals When Prabhas Sequel Shoot Starts, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌.. షూటింగ్ ప్రారంభయ్యేది అప్పుడే!

Published Fri, Aug 30 2024 11:08 AM | Last Updated on Fri, Aug 30 2024 1:09 PM

Kalki 2898 AD producers reveals when Prabhas sequel Shoot Starts

ప్రభాస్- నాగ్‌ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ భైరవ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ‍అశ్వినీదత్‌ నిర్మించారు. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందన ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

తాజాగా కల్కి సీక్వెల్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఇటీవల రష్యాలోని మాస్కోలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ వీక్‌లో నిర్మాతలు స్వప్నదత్‌, ప్రియాంకదత్‌లు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో కల్కి-2 షూటింగ్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూట్‌ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాగా.. కల్కి మూవీని త్వరలోనే రష్యన్‌ భాషలోనూ రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రంలో కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్‌ నటించారు. అంతేకాకుండా రాజమౌళి, రాంగోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌ లాంటి ప్రముఖులు అతిథి పాత్రల్లో మెరిశారు. ఈ మూవీలోని బుజ్జి కారుకు కీర్తి సురేశ్‌ వాయిస్‌ అందించారు. అయితేస పార్ట్-2లో కమల్ హాసన్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే నాగ్ అశ్విన్‌ హింట్ ఇచ్చారు. దీంతో పార్ట్‌-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement