
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు. ఈయన గతంలో అనిత అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు హన్షిత అనే కూతురు కూడా ఉంది. కొన్నేళ్ల క్రితం అనిత గుండెపోటుతో చనిపోయారు. అయితే తల్లి తనతో లేకపోయినా సరే ఎప్పటికీ గుర్తుండిపోయేలా విగ్రహం ఏర్పాటు చేసింది కూతురు హన్షిత.
(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్)
మదర్స్ డే సందర్భంగా తన ఇంట్లోనే తల్లి అనిత విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు హన్షిత చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా తల్లి విగ్రహాన్నిని హత్తుకుని తన ప్రేమని చూపించింది. హన్షితతో పాటు కూతురు ఇషితా, అమ్మమ్మతోనూ ఫొటోలు దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. నాలుగు తరాలు అని క్యాప్షన్ రాసుకొచ్చింది.
భార్య అనిత చనిపోయిన కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న దిల్ రాజు.. లాక్ డౌన్ టైంలో తేజస్విని (వైఘా రెడ్డి) అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ బాబు కూడా పుట్టాడు. ఇకపోతే దిల్ రాజు కూతురు హన్షిత.. ప్రస్తుతం నిర్మాతగా పలు సినిమాలు తీస్తున్నారు. 'బలగం'కి ఈమెని నిర్మాతగా వ్యవహరించడం విశేషం.
(ఇదీ చదవండి: ట్విన్స్ కి జన్మనిచ్చిన ప్రముఖ నటి.. తండ్రి ఎలన్ మస్క్?)