dilraju
-
కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం ‘K ర్యాంప్’ ప్రారంభం (ఫొటోలు)
-
ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు గురువారం ముగిశాయి. మూడురోజుల పాటు సాగిన తనిఖీల్లో భాగంగా.. పన్నుల చెల్లింపులు, బ్యాంకు లావాదేవీల వివరాలు, చిత్ర నిర్మాణంలో పలురకాల చెల్లింపులు, సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం..ఇలా అనేక అంశాలపై అధికారులు ఆరా తీశారు. భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఐటీ చెల్లింపుల్లో అవకతవకలను ఈ సందర్భంగా గుర్తించినట్లు తెలిసింది. పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్‌్కలు, ఆడిట్ రిపోర్టులు స్వా«దీనం చేసుకున్న అధికారులు.. వీటి ఆధారంగా పలువురి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్టు సమాచారం. భారీ చిత్రాల నిర్మాతలు, ఫైనాన్షియర్లే లక్ష్యంగా.. ఇటీవల విడుదలైన భారీ తెలుగు చిత్రాలను నిర్మించిన సంస్థలు, వాటి నిర్మాతలు, ఫైనాన్షియర్లే లక్ష్యంగా పలు బృందాలు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి దాడులు ప్రారంభం కాగా.. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మైత్రీ మూవీస్ సీఈఓ చెర్రీ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థ, భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మొదటి రోజు సోదాల్లో దిల్‌రాజు ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేక ర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో స్వా«దీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఆధారంగా..బుధవారం ఉద యం నుంచి పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ సహా మరికొంత మంది డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేపట్టారు. గురువారం సైతం సుకుమార్‌తో పాటు మరో బడా నిర్మాత నెక్కంటి శ్రీధర్ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒకపక్క సోదా లు సాగుతుండగానే దిల్‌రాజు తల్లి అస్వస్థతకు గురికావడంతో ఐటీ అధికారుల వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. -
దిల్ రాజుకు కీలక పదవి..
-
దేవర విషయంలో అలా జరిగితేనే.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
-
సంక్రాంతి సినిమాల పంచాయతీ సెటిలైందా ?
-
దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అల్లుడు అర్చిత్ రెడ్డికి చెందిన రూ. 1.7 కోట్ల విలువైన పోర్షే కారును దొంగలించారు. దీంతో వెంటనే ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గంటలోనే కారును గుర్తించి.. దొంగలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అర్చిత్‌రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు తన పోర్షే కారులో వెళ్లారు. అక్కడ తన కారును బయటే పార్కింగ్ చేసి వెళ్లిన అర్చిత్ రెడ్డి సుమారు 30 నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు. ఆ సమయంలో తన కారు అక్కడ కనిపించలేదు. దీంతో వెంటనే ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే సీఐ వీరశేఖర్, ఎస్సై రాజశేఖర్‌లు రంగంలోకి దిగారు. తమ సిబ్బందిని అలెర్ట్ చేసి నగరంలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పలు సీసీ కెమెరాలను పరిశీలించగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను వారు అప్రమత్తం చేయడంతో కారు దొంగలించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పట్టుబడిన వ్యక్తి చెప్తున్న వివారలను తెలుసుకున్న పోలీసులు కంగుతిన్నారు. (ఇదీ చదవండి: అభిమాని అలాంటి ప్రశ్న అడగడంతో ఫైర్ అయిన తమన్నా..) పట్టుబడిన వ్యక్తి తాను ఆకాశ్ అంబానీ వ్యక్తిగత సహాయకుడినని, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కారును తీసుకెళ్లాలని సూచించడంతో దీనిని తీసుకెళ్తున్నట్లు చెప్పి పోలీసులను టెన్షన్ పెట్టాడు. అంతే కాకుండా తాను తన సహాయకుడు హృతిక్ రోషన్‌తో కలిసి కారులో అత్యవసరంగా అకాశ్ అంబానీని కలవడానికి వెళ్లాల్సి ఉందని, వదిలేయాలని పోలీసులతో చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక తలలుపట్టుకున్నారు. కొంత సమయం తర్వాత అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా మతిస్థిమితం లేదని, కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్‌లోని బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స పొందినట్లు పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడు మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) -
డీజే టిల్లు కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన అల్లు అరవింద్
‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. బాపినీడు.బి సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న 37వ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రాడ్యూసర్ ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘భాస్కర్ దర్శకత్వంలో సిద్ధుతో మా బ్యానర్లో సినిమా చేయటం ఎంతో సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా మూవీ ఉంటుంది. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈప్రారంభోత్సవంలో నిర్మాతలు వై.రవిశంకర్, వంశీ, దామోదర్ ప్రసాద్, రాధా మోహన్ , మిర్యాల రవీందర్ రెడ్డి, రచయిత కోన వెంకట్, డైరెక్టర్ నందినీ రెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్. -
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ గెలుపు
-
'నాతో నేను' ట్రైలర్ లాంచ్ చేసిన దిల్‌రాజు
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి ('జబర్దస్త్' ఫేమ్) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం 'నాతో నేను'. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు శ్రోతలను అలరిస్తున్నారు. ఈ నెల 21న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. (ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'సలార్' మరో రికార్డ్) ట్రైలర్ రిలీజ్ తర్వాత మాట్లాడిన దిల్‌రాజు.. ''నాతో నేను' ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్లో ట్రయాంగిల్ ఎమోషన్స్ చూపించారు. చాలా బావుంది. సాయికుమార్ నటన గురించి అందరికీ తెలిసిందే. ఆయనతోపాటు ఆర్టిస్టులు అద్భుతంగా నటించారు. టీమ్‌కి ఆల్ ద బెస్ట్' అని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ 'జబర్దస్త్ కమెడియన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. ప్రేమ, భావోద్వేగం అన్ని ఉన్న చిత్రమిది' అని అన్నారు. (ఇదీ చదవండి: 'బేబీ' సినిమా.. ఆ దర్శకుడి రియల్ ప్రేమకథేనా?) -
వారసుడు సినిమా వివాదంపై స్పందించిన అల్లు అరవింద్
-
రౌడీ బాయ్స్ డేట్ నైట్ సాంగ్ రిలీజ్ చేసిన బన్నీ
-
దిల్‌రాజుకు షాకిచ్చిన వరుణ్, వెంకీ..!
కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ మళ్లీ షూరు అవుతున్నాయి. లాక్‌డౌన్‌తో ఎక్కడిక్కకడ మూతబడ్డ కెమెరాలు క్లిక్క్మనిపించేందుకు సిద్ధమయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది. కొత్త కథలు, కొత్త సినిమాల కబుర్లలతో ఇండస్ట్రీలో మునుపటి వాతావరణం కనిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో ఇంట్లో కూర్చుని కథలు సిద్ధం చేసుకున్న దర్శకులు వాటిని పట్టాలెక్కించేందుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక హీరోలు సైతం కొత్త కథలపై దృష్టిసారించారు. సుదీర్ఘ విరామం అనంతరం రానున్న సినిమాలు కావడంతో ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. ఇక అసలు విషయాని కొస్తే టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలపై మరింత దూకుడు పెంచాడు. కెరీర్లో ప్రారంభంలో వడివడిగా అడుగులేసిన యంగ్ హీరో.. ఫిదా, గద్దలకొండ గణేష్, ఎఫ్2 విజయాలతో ఓ రేంజ్‌లోకి వెళ్లిపోయాడు. వరుస సినిమాల విజయంతో రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా పెంచేశాడు. స్టార్ హీరోలతో పోల్చుకుంటే తానేమీ తక్కవ కాదంటూ నిర్మాతల ముందు భారీ మొత్తాన్నే డిమాండ్ చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 35 కోట్లతో దిల్ రాజు నిర్మించిన ఈ కామెడీ మూవీ దాదాపు 85 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే ఎఫ్2 ఇచ్చిన విజయంతో దిల్‌కుష్‌గా ఉన్న దర్శక, నిర్మాతలు ఎఫ్3 మూవీని పట్టాలెక్కించాలని నిర్ణయించారు. ఈ మేరకు దర్శకుడు అనిల్ రావిపూడి కథను కూడా సిద్ధం చేశారు. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. ఎఫ్3కి తనకు పారితోషికతం మరింత పెంచాలని హీరో వరుణ్ తేజ్ నిర్మాతకు ముడిపెట్టాడు. దాదాపు 12 కోట్లు వరకు ఇవ్వాలని పట్టుపట్టినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మరోవైపు వెంకటేష్ సైతం తనకు 13 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు వరుస హిట్స్‌తో స్టార్ దర్శకుల సరసన చేరిన అనిల్ సైతం భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే భారీ బడ్జెట్‌తో ఎఫ్3ని తెరక్కించాలనుకున్న దిల్‌రాజ్‌కు ఇప్పుడు ఇద్దరు హీరోలు ఊహించని పారితోషికం డిమాండ్ చేయడం తలనొప్పిగా మారింది. దర్శకుడు ఇప్పటికే కథ సిద్ధం చేయడం. చిత్రీకరణకు కూడా ముహూర్తం ఖరారు కావడంతో ఇక చేసేదేమీ లేక వారి డిమాండ్స్‌కు నిర్మాత ఒప్పుకున్నట్లు సమాచారం. -
పోలీసులే రియల్ హీరోలు
గోల్కొండ: ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన రోజు నుంచి నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులే రియల్ హీరోలని ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన మెహిదీపట్నం రైతుబజార్, ఆసిఫ్‌నగర్ డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు అందించారు. ఆయన వెంబడి పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ కే.సునిల్ తదితరులున్నారు. -
డీల్ ఓకే
తెలుగులో అగ్రనిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. హిందీలో బోనీ కపూర్‌కి ఆ పేరు ఉంది. ఈ ఇద్దరూ కలిసి తెలుగు ‘ఎఫ్ 2’ని హిందీలో నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో íసినిమా నిర్మించడానికి డీల్ ఓకే చేశారు. గత ఏడాది హిందీలో విడుదలైన ‘బదాయి హో’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఈ సినిమా దక్షిణాది హక్కులను బోనీ కపూర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ తెలుగు రీమేక్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని తాజా సమచారం. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజుతో కలిసి నిర్మిస్తారు బోనీ. ఈ సినిమాలో హీరో పాత్రకోసం సంప్రదింపులు మొదలుపెట్టిందట టీమ్. నాగచైతన్యను హీరోగా అనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి,దిల్‌రాజు
-
దిల్ రాజును సన్మానించిన సాయి ధరమ్ తేజ్
-
నాని చేతికి మాస్ మహారాజ్ మూవీ
బెంగాల్ టైగర్ సినిమాతో మంచి విజయం సాధించిన రవితేజ. ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టలేదు. ఒకటి రెండు సినిమాలు సెట్స్ మీదకు వచ్చినట్టుగానే అనిపించినా చివరి నిమిషంలో ఆగిపోయాయి. ముఖ్యంగా దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఎవడో ఒకడు సినిమా ఎనౌన్స్మెంట్ కూడా అయ్యాక ఆగిపోయింది. కారణం ఏంటన్నది బయటికి రాకపోయినా ఈ ప్రాజెక్ట్ రవితేజతో కాకుండా వేరే హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యాడు దిల్ రాజు. రవితేజ తరువాత ఈ కథను సీనియర్ హీరో నాగార్జునకు వినిపించాడు. కథ బాగుందన్న కింగ్ తనకు సూట్ అవ్వదేమో అన్న ఆలోచనతో పక్కన పెట్టేశాడు. దీంతో మరోసారి హీరో కోసం వేట కొనసాగిస్తున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం నాని హీరోగా నేను లోకల్ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు, అదే హీరోతో ఎవడో ఒకడు సినిమాను చేయాలని భావిస్తున్నాడట. అయితే ఈ సినిమా తరువాత మరో మూడు సినిమాలను లైన్లో పెట్టిన నాని, ఎవడో ఒకడు సినిమా చేయాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. మరి అప్పటి వరకు దిల్ రాజు వెయిట్ చేస్తాడా..? లేక వేరే హీరోతో పట్టాలెక్కిస్తాడా చూడాలి. -
నాని సినిమాలో విలన్‌గా యంగ్ హీరో
ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న నానీ, దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమాకు అంగీకరించాడు. ఈ సినిమాకు సినిమా చూపిస్త మామ ఫేం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించనున్నారు. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్‌ను సెట్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు ఓ యంగ్ హీరోను తీసుకోవాలని భావిస్తున్నారు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. సక్సెస్ఫుల్ స్టార్ అనిపించుకోలేకపోయాడు. తరువాత కూడా వరుస సినిమాలు చేస్తున్నా.. ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రావటం లేదు. లుక్ పరంగా మ్యాన్లీగా కనిపించే నవీన్ చంద్రను నాని సినిమాలో ప్రతినాయక పాత్రకు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నరట. మరీ నవీన్ కెరీర్‌కు నాని సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. -
నందమూరి హీరోతో దిల్‌రాజు
ఒకప్పుడు వరుస సూపర్ హిట్లతో మంచి ఫాంలో కనిపించి దిల్‌రాజు ఇటీవల కాలం ఆ స్ధాయిలో సక్సెస్‌లు సాధించలేకపోతున్నాడు. ఇటీవల దిల్‌రాజు బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలేవి ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, దిల్‌రాజు మాత్రం తన రూట్ మార్చటం లేదు. గతంలో తన బ్యానర్లో ఫెయిల్ అయిన దర్శకులకు కూడా మరో అవకాశం ఇచ్చిన దిల్‌రాజు ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో చాలా కాలం తరువాత మంచి సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు ఏయస్ రవికుమార్ చౌదరి. అయితే ఆ తరువాత రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేసిన సౌఖ్యం సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో చాలా రోజులుగా ఖాళీగా ఉంటున్న రవికుమార్ చౌదరికి మరో ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు దిల్‌రాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమా కోసం రెడీ అవుతున్న కళ్యాణ్ రామ్, ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. వెంటనే దిల్‌రాజు బ్యానర్లో తెరకెక్కనున్న సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు కళ్యాణ్. మరి దిల్‌రాజు సినిమాతో రవికుమార్ చౌదరి, కళ్యాణ్ రామ్‌ల కెరీర్లు గాడిలో పడతాయేమో చూడాలి. -
సుప్రీమ్ రిలీజ్‌పై డైలమా
పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల తరువాత మంచి ఫాంలో ఉన్న సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సుప్రీమ్. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని భావించినా, భారీ సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేయక తప్పలేదు. అంతేకాదు వరుసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సుప్రీమ్ రిలీజ్‌పై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మార్చి 25న ఊపిరి సినిమాతో టాలీవుడ్ స్క్రీన్ మీద సమ్మర్ సినిమా సందడి ప్రారంభమవుతోంది. తరువాత వరుసగా సర్దార్ గబ్బర్‌సింగ్, సరైనోడు, బ్రహ్మోత్సవం, కబాలి చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అన్నీ భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు కావటంతో ఒక్కో సినిమాకు రెండు వారాల గ్యాప్ కంపల్సరీ. దీంతో సుప్రీం రిలీజ్‌కు సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇటీవల కృష్ణాష్టమి సినిమా విషయంలో కూడా బాగా ఆలస్యం చేసి ఇబ్బందులు పడ్డ దిల్ రాజు, ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఏప్రిల్ 10న పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆడియోను రిలీజ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ తరువాత సరైన గ్యాప్ చూసుకొని సినిమా రిలీజ్‌కు డేట్స్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. -
'కృష్ణాష్టమి' మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణాష్టమి జానర్ : రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తారాగణం : సునీల్, డింపుల్ చొపడే, నిక్కి గల్రాని, ముఖేష్ రుషి, అశుతోష్ రాణా సంగీతం : దినేష్ కనకరత్నం దర్శకత్వం : వాసువర్మ నిర్మాత : దిల్ రాజు రెండేళ్ల విరామం తరువాత వెండితెర మీద మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కృష్ణాష్టమి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సునీల్. సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించగా, జోష్ ఫేం వాసువర్మ తొలి సినిమా తరువాత ఏడేళ్లకు ఈ సినిమాతో మరోసారి సక్సెస్ కోసం ప్రయత్నించాడు. కమెడియన్ నుంచి హీరోగా మారిన తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సునీల్ కెరీర్‌కు ఈ చిత్రం సక్సెస్ కీలకంగా మారింది. మరి కృష్ణాష్టమి సునీల్ కెరీర్‌కి బూస్ట్ ఇచ్చిందా..? ఈ సినిమాతో అయినా వాసువర్మ దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడా..? కథ : చిన్నప్పుడే అమ్మానాన్నను పోగొట్టుకున్న కృష్ణవర ప్రసాద్ ( సునీల్ )ను పెదనాన్న రామచంద్ర ప్రసాద్ ఫారిన్లో చదివిస్తుంటాడు. అక్కడే పెరిగి పెద్దవాడైన కృష్ణవర ప్రసాద్ వీడియో గేమ్ డిజైనర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. 18 ఏళ్లుగా తన వాళ్లకు దూరంగా ఉన్న కృష్ణ ఎలాగైన ఇండియా రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ పెదనాన్న మాత్రం కృష్ణ ఇండియాకు రాకుండా అడ్డు పడుతుంటాడు. అంతేకాదు అక్కడే సెటిల్ అయిన ఓ ఎన్నారై అమ్మాయితో కృష్ణకు పెళ్లి కూడా కుదురుస్తాడు. దీంతో ఎలాగైనా ఇండియా రావాలనుకున్న కృష్ణ పెదనాన్నకు తెలియకుండా ఫ్రెండ్ గిరి (సప్తగిరి)తో కలిసి ఇండియా ఫ్లైట్ ఎక్కేస్తాడు. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం యూరోప్‌లో దిగిన కృష్ణ, అక్కడ పల్లవి(నిక్కి గల్రానీ)ని తొలి చూపులోనే ప్రేమించి, తిరిగి ఫ్లైట్ ఎక్కేలోపు తనని కూడా ప్రేమలో పడేస్తాడు. ఇక కృష్ణ వరప్రసాద్ ఇండియాలో దిగాక అసలు కథ మొదలవుతుంది. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో కృష్ణకు పరిచయం అయిన డాక్టర్ అజయ్ కుమార్(అజయ్) ఎయిర్ పోర్ట్‌లో ఓ హత్య చూసి భయపడిపోతాడు. దాంతో అతనిని ఇంటికి చేర్చే బాధ్యత కృష్ణ తీసుకుంటాడు. కృష్ణ, అజయ్‌లు ఇంటికి వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్‌లో హత్య చేసిన వాళ్లే వీరి మీద మరోసారి దాడి చేస్తారు. ఈ దాడిలో అజయ్ గాయపడతాడు. ఈ విషయాన్ని అజయ్ కుటుంబానికి తెలియజేయడానికి వెళ్లిన కృష్ణ, అక్కడి పరిస్థితుల కారణంగా నిజం చెప్పలేక తానే అజయ్‌గా ఉండిపోవాల్సి వస్తుంది. ఇంతలో ఆ ఇంటి పెద్ద తన కూతురి(డింపుల్ చోపడే)ని అజయ్‌కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడని తెలుసుకున్న కృష్ణ, అజయ్‌గా తాను చెపుతున్న అబద్దానికి ముగింపు పలకాలనుకుంటాడు. ఉత్తరం రాసిపెట్టి ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో కొంతమంది మళ్లీ కృష్ణను చంపడానికి ప్రయత్నిస్తారు. అసలు కృష్ణను చంపాలనుకుంటుంది ఎవరు..? అజయ్ కుటుంబానికి కృష్ణకు ఉన్న సంబందం ఏంటి..? కృష్ణను అతడి పెదనాన్న ఇండియా రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు..? ఈ సమస్య లన్నింటికి కృష్ణ ఎలా ముగింపు పలికాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారిన సునీల్ ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లు, బిల్డప్ షాట్లతో మాస్ హీరో ఇమేజ్ కోసం బాగానే కష్టపడ్డాడు. చాలా వరకు బాగానే అనిపించినా సునీల్ ఇమేజ్ కారణంగా కొన్ని చోట్ల అంతగా వర్క్ అవుట్ కాలేదు. తన మార్క్ కామెడీ, డ్యాన్స్‌లతో మాత్రం మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక పేరుకు ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఎవరికీ నటన పరంగా పెద్దగా అవకాశం లేదు. అయితే ఉన్నంతలో గ్లామర్ షోతో మాత్రం బాగానే ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో పల్లవిజం కాన్సెప్ట్‌తో నిక్కి గల్రానీ నవ్వించే ప్రయత్నం చేసినా అది బాద్షా సినిమాలో కాజల్ పాత్రకు స్పూఫ్‌లా అనిపించింది. ఎప్పుడు నెగెటివ్ పాత్రలో కనిపించే ముఖేష్ రుషి, పాజిటివ్ పాత్రలోనూ మెప్పించాడు. అషుతోష్ రాణా విలన్‌గా ఆకట్టుకున్నాడు. సప్తగిరి, పోసాని కృష్ణమురళిల కామెడీ బాగానే వర్క్ అవుట్ అయింది. సెల్పీ పిచ్చి ఉన్న క్యారెక్టర్లో కనిపించిన బ్రహ్మనందం మరోసారి నిరాశపరిచాడు. సాంకేతిక నిపుణులు : జోష్ సినిమాతో ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయినా దర్శకుడు వాసు వర్మ మీద ఎంతో నమ్మకంతో దిల్ రాజు మరో అవకాశం ఇచ్చాడు. అయితే రెండో అవకాశాన్ని కూడా వాసు వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నట్టుగా కనిపించలేదు. హీరో విలన్ ఇంట్లో ఉండి వాళ్లను మార్చటం అనే రొటీన్ కాన్సెప్ట్నే మరోసారి ఎంచుకున్న వాసువర్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త సోలోగా నడించినా సెకండాఫ్‌లో మాత్రం వేగంగా కథ నడిపించాడు. ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరో(అల్లు అర్జున్) కోసం రాసుకున్న కథను కామెడీ ఇమేజ్ ఉన్న హీరోతో తెరకెక్కించడం అంతగా వర్క్ అవుట్ అయినట్టుగా లేదు. ఇక సినిమాటోగ్రాఫీ చాలా బాగుంది. యూరప్ అందాలతో పాటు ఇండియాలోని లోకేషన్స్‌ను కూడా చాలా బాగా చూపించారు. దినేష్ కనకరత్నం సంగీతం పరవాలేదనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సాంగ్స్, ఫైట్స్, ఫారిన్ లొకేషన్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : కామెడీ సినిమాటోగ్రఫి సినిమా నిడివి మైనస్ పాయింట్స్ : రొటీన్ కథ ఫస్ట్ హాఫ్ పాటలు ఓవరాల్‌గా కృష్ణాష్టమి, రొటీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ -
దిల్‌రాజు బ్యానర్లో నాగ్..?
సంక్రాంతి బరిలో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కింగ్ నాగార్జున. వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఈ సక్సెస్ తరువాత కొంత గ్యాప్ తీసుకోవాలని భావించిన వరుస ఆఫర్లు వస్తుండటంతో గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేయడానికే రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓ చారిత్రక చిత్రానికి రెడీ అవుతున్న నాగ్ మరో కమర్షియల్ ఎంటర్టైనర్ మీద కూడా దృష్టి పెట్టాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు రవితేజ హీరోగా ఓ సినిమాను ప్రారంభిచాడు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వేణు శ్రీరాం ఈ సినిమాకు దర్శకుడు. లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా, తరువాత కథ విషయంలో దిల్‌రాజు, రవితేజలకు అభిప్రాయ బేధం రావటంతో ఆగిపోయింది. దీంతో ఇప్పుడు అదే సినిమాను కొద్ది పాటి మార్పులతో నాగార్జున హీరోగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు దిల్‌రాజు. మరి రవితేజ కాదన్న కథను నాగ్ అంగీకరిస్తాడో లేదో చూడాలి. -
టాలీవుడ్ 'రాబిన్‌హుడ్'
-
టాలీవుడ్ 'రాబిన్‌హుడ్'
బెంగాల్ టైగర్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన రవితేజ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ అనే కొత్త దర్శకుడితో 'ఎవడో ఒకడు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇంకా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. ఎవడో ఒకడు సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు రవితేజ. తన మార్క్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. కిక్ 2 సినిమాలో రవితేజ క్యారెక్టర్ పేరు రాబిన్ హుడ్. ఇప్పుడు ఇదే పేరును తన నెక్ట్స్ సినిమాకు టైటిల్‌గా ఫైనల్ చేశాడు రవితేజ. చక్రి అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్న ఈ సినిమాను ఎవడో ఒకడు పూర్తి కాగానే సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమాతో కలెక్షన్లపరంగా పరవాలేదనిపించిన మాస్ మహరాజ్, తరువాత చేయబోయే సినిమాలతో అయినా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. -
రవితేజ 'ఎవడో ఒకడు'
హిట్ ఫ్లాప్‌లతో సంబందం లేకుండా టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో మాస్ మహరాజ్ రవితేజ. ప్రస్తుతం యంగ్ హీరోల నుంచి గట్టి పోటి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా వరుస సినిమాలతో హవా చూపిస్తున్నాడు రవితేజ. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. రవితేజ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తున్నాడు. 'కిక్ 2' ఫెయిల్యూర్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా సక్సెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. సంపత్ నంది కూడా పవన్ సినిమా నుంచి బయటి రావాల్సి రావటంతో ఈ సినిమాతో బిగ్ హిట్ సాదించి తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేశాడు రవితేజ. దిల్‌రాజు నిర్మాతగా 'ఓ మై ఫ్రెండ్' ఫేం వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు 'ఎవడో ఒకడు' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. విజయ దశమి సందర్భంగా లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ సినిమా 'బెంగాల్ టైగర్' రిలీజ్ తరువాత రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. -
'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు
-
'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు
ఎన్నో వాయిదాల తరువాత అక్టోబర్ 9న రిలీజ్‌కు రెడీ అవుతన్న ప్రతిష్టాత్మక చిత్రం 'రుద్రమదేవి'కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అందుతోంది. ఓరుగల్లు వీరనారి రుద్రమదేవి కథగా తెరకెక్కిన ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్ తో పాటు, నిర్మాత దిల్ రాజు గురువారం కేసీఆర్ ను కలిసిన నేపథ్యంలో ఈ మేరకు హామి ఇచ్చారు. గుణశేఖర్, రుద్రమదేవి సినిమా చూడాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు. కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. తన సొంత నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించారు.