రవితేజ 'ఎవడో ఒకడు' | Raviteja next movie title yevado okadu | Sakshi
Sakshi News home page

రవితేజ 'ఎవడో ఒకడు'

Published Sun, Oct 18 2015 11:17 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM

రవితేజ 'ఎవడో ఒకడు'

రవితేజ 'ఎవడో ఒకడు'

హిట్ ఫ్లాప్లతో సంబందం లేకుండా టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో మాస్ మహరాజ్ రవితేజ. ప్రస్తుతం యంగ్ హీరోల నుంచి గట్టి పోటి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా వరుస సినిమాలతో హవా చూపిస్తున్నాడు రవితేజ. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు.

రవితేజ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తున్నాడు. 'కిక్ 2' ఫెయిల్యూర్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా సక్సెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. సంపత్ నంది కూడా పవన్ సినిమా నుంచి బయటి రావాల్సి రావటంతో ఈ సినిమాతో బిగ్ హిట్ సాదించి తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేశాడు రవితేజ. దిల్రాజు నిర్మాతగా 'ఓ మై ఫ్రెండ్' ఫేం వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు 'ఎవడో ఒకడు' అనే టైటిల్ను ఫైనల్ చేశారు. విజయ దశమి సందర్భంగా లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ సినిమా 'బెంగాల్ టైగర్' రిలీజ్ తరువాత రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement