raviteja
-
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పులు
-
బాబీ నెక్స్ట్ సినిమా ఏ హీరోతో..?
-
రవితేజ వారసుడి చిత్రం.. ఆ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "మిస్టర్ ఇడియట్". ఈ మూవీలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను జేజేఆర్ ఎంటర్టైన్మెంట్, ఎల్ఎల్పీ బ్యానర్లపై యలమంచి రాణి సమర్పణలో జె జే ఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో హిట్ అందుకున్న గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ నుంచి 'కావాలయ్యా..'అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా ద్వారా పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతమందించగా.. భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌ను సింగర్ మంగ్లీ ఆలపించారు. -
కొండా సురేఖ చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మహేశ్ బాబు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ భగ్గుమంటుంది. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి, అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్ ట్యాగ్‌తో కొండా సురేఖపై నటీనటులు భారీగానే విరుచుకుపడుతున్నారు.మహేశ్ బాబు'మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా మీ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఒక మహిళా మంత్రిగా మీరు మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, మీ భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను. ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. మీరు చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్లో ఉన్న అందరినీ అభ్యర్థిస్తున్నాను. మన దేశంలోని మహిళలను, మన సినీ సోదరులను గౌరవంగా చూడాలి.' అని మహేశ్ కోరారు.రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ ఓ మహిళా మంత్రి పైశాచిక వ్యూహాలను అవలంబించడం నన్ను భయాందోళనకు గురిచేస్తోంది. ఇది అవమానానికి మించినది. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను ఎవరూ లాగకూడదు. నాయకులు సమాజానికి ఉదాహరణగా నిలువాలి. అందరిలోనూ సామాజిక విలువలను పెంచాలి. వాటిని తగ్గించకూడదు.- రవితేజమంత్రి కొండా సురేఖ గారి నుంచి ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు వినడం చాలా బాధాకరం. అధికారంలో ఉన్న మహిళగా, మహిళలు విజయం సాధించడం ఎంత సవాలుతో కూడుకున్నదో మీకు తెలిసే ఉంటుంది. రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలపై స్త్రీ ద్వేషంతో తప్పుడు ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదు. మీ మాటలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రాహుల్ గాంధీని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. మీ పార్టీలోని నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలి. భవిష్యత్ తరాలకు మనం సరైన ఉదాహరణగా ఉండాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను. ఈ వ్యక్తిగత దూషణలు చిత్ర పరిశ్రమ ఏకతాటిపైకి తెస్తోంది. అని భావిస్తున్నాను. - మంచు మనోజ్రాజకీయాల కోసం సినీ, టీవీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాన్ని తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయడం సరికాదు. చిత్ర పరిశ్రమలోని మేమందరమూ కూడా కుటుంబ సమేతంగా కలిసి నిరసన తెలియజేస్తున్నాం. వ్యూస్ కోసం తప్పుడు థంబ్నెయిల్లతో అవే వీడియోలను పోస్ట్ చేయవద్దని యూట్యూబర్స్ణు అభ్యర్థిస్తున్నాను. ఇతర వృత్తిలాగే మమ్మల్ని కూడా గౌరవించండి. - సుమ కనకాలసినీ ప్రముఖులపై రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇది వ్యక్తిగత జీవితాలను దోపిడీ చేయడం .దయచేసి మాట్లాడే ముందు ఆలోచించండి. ఈ రకమైన నీచమైన వ్యాఖ్యలు, మాటల దూషణలకు వ్యతిరేకంగా మేము ఐక్యంగా ఉన్నాము. - కిరణ్ అబ్బవరంశ్రీమతి కొండా సురేఖ.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా అసహ్యంగా మాట్లాడటం మమ్మల్ని చాలా బాధపెట్టింది.ఇలాంటి నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం అంత మంచి నిర్ణయం కాదు. మీ రాజకీయం కోసం సినీ పరిశ్రమ సభ్యుల వ్యక్తిగత జీవితాలను లాగితేప సహించం. - రాజశేఖర్మీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కానివి. చాలా అసహ్యంగా ఉంది. ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా ఇంత నీచంగా దిగజారి, మీడియా ముందు అవమానకరమైన వ్యాఖ్యలను ఎలా చేయగలరు..? సెలబ్రిటీల పేర్లను, వారి వ్యక్తిగత జీవితాన్ని లాగడం, వారిపై నిరాధార ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు. హద్దులు దాటి ఒక వ్యక్తి గుర్తింపును అగౌరవపరచడం సహించలేని చర్య. ఇలాంటి వాటిని సమాజం తిరస్కరిస్తుంది. ప్రతి ఒక్కరిని గౌరవించండి. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ.. సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తున్నాం. మహిళా మంత్రినే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం.' అని చెప్పుకొచ్చింది. - సంయుక్త మేనన్నేటి రాజకీయ నాయకుల ప్రవర్తనపై నా ఆలోచనలు, భావాలను మంచి భాషలో వ్యక్తీకరించడానికి ఇబ్బంది పడుతున్నా. ప్రజలకు మంచి జరగడానికి మేము ఓటు వేస్తామని చాలా మంది రాజకీయ నాయకులకు గుర్తు చేయాలనుకుంటున్నాము. ప్రజలుగా మేము దీన్ని అనుమతించలేము, అంగీకరించలేము. రాజకీయాలు ఏ మాత్రం దిగజారకూడదు. మీరుండేది ప్రజల బాగోగులూ చూసుకునేందకని గుర్తుపెట్టుకోండి. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల, విద్య గురించి మాట్లాడండి. ఉద్యోగాలు కల్పించి వారి శ్రేయస్సు కోసం కష్టపడండి. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాలను దిగజార్చకండి.' అంటూ కొండా సురేఖపై కామెంట్ చేశారు. - విజయ్ దేవరకొండ సమంత గారిపై, అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్క చేసిన వ్యాఖ్యలు బాధాకరం. గతంలో చైల్డ్ అబ్యూస్ కేసులో ముందుగా స్పందించిన మీరే.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధనిపిస్తుంది. మీ రాజకీయ విమర్శల కోసం ఏ మాత్రం సంబంధం లేని నటీనటుల పేర్లు తీసుకురావడం.. ఆపై వాళ్ల వ్యక్తిగత జీవితంపై దిగజారుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మీరే ఇలా మాట్లాడడం సమాజానికి శ్రేయస్కరం కాదు. మావి చాలా సున్నితమైన మనసులు. వాటిని గాయం చేసి మీ రాజకీయం కోసం వాడుకోవడం తగదు. గతంలో మా కుటుంబాన్ని కూడా ఎన్నిసార్లు లక్ష్యంగా చేసుకుని దారుణమైన వ్యాఖ్యలు చేసినా మేము స్పందించలేదు. మేమెప్పుడూ ఏమీ అనమని సాఫ్ట్ టార్గెట్ చేయవద్దు. దయచేసి ఇకపై నటులను మాత్రమే కాదు.. ఎవరి వ్యక్తిగత విషయాలపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయకూడదని కోరుకుంటున్నాను. - సాయి ధరమ్‌తేజ్ -
రవితేజస్ మిస్టర్ బచ్చన్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రవితేజ మిస్టర్ బచ్చన్ సక్సెస్ ప్రెస్ మీట్
-
రవితేజ 'మిస్టర్ బచ్చన్' టీజర్ రిలీజ్ ఎలా ఉందంటే?
రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఫెర్ఫెక్ట్ కమర్షియల్ అంశాలతో సినిమాని తీసినట్లు టీజర్ చూస్తే క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)ఓ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.. ఓ పేరుమోసిన గుండాకి ఇంటికి రైడ్‌కి వెళ్తాడు. చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీలా అనిపిస్తుంది. దీనికి అదనంగా హీరోయిన్, పాటల్లాంటి హంగులు ఉన్నాయి. ప్రస్తుతం కాకుండా 90ల్లో జరిగిన కథలా విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. టీజర్ చూస్తే బాగానే ఉందనిపిస్తోంది. మరి ప్రేక్షకులు ఏ మేరకు దీన్ని రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాలి. బాలీవుడ్ హిట్ సినిమా 'రైడ్'కి దీన్ని రీమేక్‌గా తెరకెక్కించారు. కాకపోతే అధికారికంగా ఏం ప్రకటించలేదు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో చాలా సమస్యలు ఉన్నాయి.. సి.కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?
ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీస్తున్న ఛార్మీ.. హీరో రవితేజతో పాటు డైరెక్టర్ హరీశ్ శంకర్‌ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. అయితే స్నేహితులుగా ఉన్న వీళ్ల మధ్య అసలేం జరిగింది? ఛార్మీ ఎందుకిలా చేశారు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు పూరీతో పాటు ఛార్మీ నిర్మాతలు. ఇకపోతే ఇదే తేదీన రవితేజ-హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' కూడా రిలీజ్ చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు.పూరీ జగన్నాథ్ శిష్యుడు హరీశ్ శంకర్. అలానే పూరీతో రవితేజకు మంచి బాండింగ్ ఉంది. వీళ్ల కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి. ఛార్మీ కూడా పూరీతో గత కొన్నేళ్ల నుంచి ట్రావెల్ అవుతోంది. ఇకపోతే వీళ్లంతా స్నేహితులే. అలాంటిది ఇప్పుడు ఛార్మీ.. రవితేజతో పాటు హరీశ్ శంకర్‌ని అన్ ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి. బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకుని, సయోధ్య కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చాయా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఛార్మీ క్లారిటీ ఇస్తే తప్ప అసలు నిజం ఏంటనేది బయటకురాదు.(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?) -
జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా
-
జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా
-
రవితేజ మిస్టర్ బచ్చన్.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్ తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ చిత్రంలో హీరోయిన్గా భాగ్యశ్రీ కనిపించనుంది. హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'సితార్' అనే లిరికల్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు.మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ డైరెక్షన్లో మరోసారి రవితేజ నటిస్తున్నారు. దీంతో మిస్టర్ బచ్చన్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన సాంగ్‌కు సాహితీ లిరిక్స్ అందించారు. సాకేత్ కొముండూరి, సమీర భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. కాగా.. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
'మిస్టర్ బచ్చన్' నుంచి రవితేజ షో రీల్ విడుదల
టాలీవుడ్ మాస్‌మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు రాబోయే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.బాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న 'రైడ్' చిత్రానికి రీమేక్‌గా 'మిస్టర్ బచ్చన్' తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి షో రీల్ విడుదలైంది. రవితేజ ఎనర్జిటిక్‌గా ఈ చిత్రంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలోనూ ఆయన అమితాబ్ ఫ్యాన్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. షూటింగ్ కార్యక్రమం ఇప్పటికే పూర్తి కావడంతో త్వరలో ప్రచార కార్యక్రమాలను మేకర్స్ ప్రారంభించనున్నారు.ఈ సినిమా విడుదలకు ముందే రవితేజ తన 75వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాతో రచయిత భాను భోగవరపును దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీలీల మరోసారి రవితేజతో జోడీగా కనిపించనుంది. షూటింగ్ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
హీరోయిన్ శ్రీలీల ఇంతలా మారిపోయిందేంటి?
శ్రీలీల ఈ పేరు చెప్పగానే అదిరిపోయే డ్యాన్సులే గుర్తొస్తాయి. ఎందుకంటే 'ధమాకా', 'గుంటూరు కారం' చిత్రాల్లో ఈమె అలా దుమ్ముదులిపేసింది మరి. గతేడాది నుంచి ఈ ఏడాది సంక్రాంతి వరకు వరస సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. అలాంటిది ఈమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడంతో బ్రేక్ తీసుకుందేమోనని అనుకున్నారు. కానీ ఇప్పుడు రవితేజ కొత్త మూవీ లాంచ్‌లో పాల్గొని షాకిచ్చింది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్ రిలీజ్)ఎందుకంటే 'గుంటూరు కారం' వరకు సన్నగా చిన్న పిల్లలా కనిపించిన శ్రీలీల కాస్త ఇప్పుడు కాస్త బొద్దుగా, చబ్బీ లుక్‌లో కనిపించింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొన్నిరోజులు షూటింగ్స్ లేకపోతే ఇలా కాస్త బొద్దుగా మారడం హీరోయిన్లకు అలవాటే. రెండు రోజులు ఎక్సర్సైజ్ చేస్తే మళ్లీ నార్మల్ అయిపోతారు. అదేమంత పెద్దగా మేటర్ కాదు.కానీ శ్రీలీల లేటెస్ట్ లుక్ మాత్రం భలే ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే తెలుగులో ఇప్పటికే 'సర్దార్ భగత్ సింగ్' ఒప్పుకొంది. కానీ ఈ మూవీ షూటింగ్ లేటవుతోంది. ప్రస్తుతానికైతే తెలుగులో రవితేజది మాత్రమే చేస్తోంది. తమిళ, హిందీలోనూ త్వరలో నటిస్తుందని అంటున్నార. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్) -
రవితేజ మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి
మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ రూట్లో మాస్ మహారాజ రవితేజ అడుగులు వేశారు. ఏషియన్ గ్రూప్స్ వారితో థియేటర్ బిజినెస్‌లోకి ఆయన ఎంట్రీ ఇచ్చేశారు. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోల లిస్ట్‌లో రవితేజ పేర్ టాప్‌లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలో దూసుకుపోతున్న రవితేజ హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఆయన పేరుతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఏషియన్ రవితేజ (ART)పేరుతో భారీ మల్టీఫ్లెక్స్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. తాజాగా ఆ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పూజ కార్యక్రమం జరిగింది. అందులో రవితేజ కుమార్తె మోక్షద పాల్గొన్నారు. ART సినిమాస్ పూజా కార్యక్రమంలో మోక్షద ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ అభిమాన హీరో కుమార్తెను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ కూడా పాల్గొనడం విశేషం. మొత్తం ఆరు స్క్రీన్స్‌తో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ త్వరలో గ్రాండ్‌గా ఓపెన్ కాబోతుంది. ఇప్పటికే మహేష్ బాబు (AMB), అల్లు అర్జున్ (AAA), విజయ్ దేవరకొండ (AVD) వంటి స్టార్స్‌తో సంయుక్తంగా ఏషియన్ గ్రూప్స్ భారీ మల్టీఫ్లెక్స్‌లను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రవితేజ (ART) చేరిపోయాడు. -
ఒక రోజు ముందుగానే ఓటీటీకి రవితేజ ఈగల్..స్ట్రీమింగ్ ఎక్కడంటే!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఈగల్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ రవితేజ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కేవలం రూ.35 కోట్లకు పైగా వసూళ్లను మాత్రమే సాధించింది.ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించగా.. అనుపమ పరమేశ్వరన్ కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ మార్చి 1 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే ముందుగా ఈ సినిమా మార్చి 2వ తేదీ నుంచి ఓటీటీకి రానున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పటికే ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన అయితే ఈగల్ థియేటర్లో రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా కావ్య థాపర్ నటించగా.. జర్నలిస్టు పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చేశారు. నవ్‌దీప్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధూ, శ్రీనివాస రెడ్డి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
15 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అయిన రవితేజ సినిమా రీరిలీజ్
మాస్మహారాజా రవితేజ కెరియర్లో కిక్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రవితేజ, బ్రహ్మానందం ట్రాక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. హల్వారాజ్ పాత్రలో బ్రహ్మానందం పండించిన కామెడీ సూపర్ హిట్ అని చెప్పవచ్చు. ఆ సినిమాలోని కామెడీ సీన్స్ ఇప్పుడు ఎక్కువగా మీమ్స్ రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కిక్ సినిమా రీరిలీజ్ కానుంది. సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 1న రీరిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో రవితేజకు జోడీగా ఇలియానా నటించింది. కోలీవుడ్ నటుడు శామ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అదిరిపోతుంది. కిక్ సినిమాతో థమన్, సురేందర్‌రెడ్డి,రవితేజలకు విపరీతమైన స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా కిక్ 2 కూడా వచ్చింది. కానీ అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటికే ఈగల్తో థియేటర్లో సందడి చేస్తున్న రవితేజ.. మార్చి 1న కిక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రీరిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరిలో రవితేజ అభిమానుల కోసం ఒక ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. -
బాక్సాఫీస్ వద్ద ఈగల్ దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఈగల్'. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య ఈనెల 9న థియేటర్లలోకి వచ్చింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు తర్వాత నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది. మూవీ రిలీజైన మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.11.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు సైతం బాక్సాఫీస్ వద్ద ఈగల్ అదే జోరు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.20.90 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.6.2 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈగల్.. రెండో రోజు అదే జోరులో రూ. 5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో రెండు రోజుల్లోనే రూ.11.2 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈగల్ బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో 32.84 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. కాగా.. ఈగల్ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతమందించారు. ఈ మూవీలో అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని అడ్డుకునే పాత్రలో మాస్ మహారాజా నటించారు. కాగా.. ఈ చిత్రాన్ని హిందీలో సహదేవ్ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
Eagle Review: ‘ఈగల్’ రివ్యూ
టైటిల్: ఈగల్నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, విజయ్ రాయ్, మధుబాల, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేనిసంగీతం: డేవ్ జాంద్విడుదల తేది: ఫిబ్రవరి 9, 2024ఢిల్లీలో జర్నలిస్టుగా పని చేస్తున్న నళిని(అనుపమ పరమేశ్వరన్)కి ఓ రోజు మార్కెట్లో స్పెషల్ కాటన్ క్లాత్ కనిపిస్తుంది. అది ఎక్కడ తయారు చేశారని ఆరా తీయగా.. ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ క్లాత్కి వాడిన పత్తిని ఆంధ్రప్రదేశ్‌లోని తలకోన ప్రాంతంలోని పండించారని, దానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిన సహదేవ్ వర్మ(రవితేజ)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయాడని తెలుసుకుంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి ఆచూకీ తెలిస్తే సమాజానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఆ విషయాన్ని పేపర్లో ప్రచురిస్తుంది. చివరి పేజీలో చిన్న ఆర్టికల్‌గా వచ్చిన ఆ న్యూస్‌ని చూసి.. సీబీఐ రంగంలోకి దిగుతుంది. ఆ పత్రికా సంస్థపై దాడి చేసి.. ఆ సమాచారం ఎలా లీకైందని విచారణ చేపడుతుంది.ఒక్క చిన్న వార్తకు అంతలా రియాక్ట్ అయ్యారంటే.. దీని వెనుకాల ఏదో సీక్రెట్ ఉందని, అది ఏంటో తెలుసుకోవాలని నళిని తలకోన గ్రామానికి వెళ్తుంది. అక్కడ సహదేవ్ వర్మ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అసలు సహదేవ్ వర్మ ఎవరు? అతన్ని మట్టుబెట్టడానికి కేంద్ర ప్రభుత్వ బలగాలు.. పాకిస్తాన్‌కి చెందిన టెర్రరిస్టులతో పాటు నక్సల్స్ ఎందుకు ప్రయత్నిస్తున్నారు. యూరప్‌లో కాంట్రాక్ట్ కిల్లర్ అయిన ఈగల్(రవితేజ)కి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి? సహాదేవ్ ఎలా మిస్ అయ్యాడు? సహదేవ్, రచన(కావ్య థాపర్)ల ప్రేమ కథ ఏంటి? సహదేవ్ అనుచరుడైన జై(నవదీప్) ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? తలకోన కొండను దక్కించుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త(నితిన్ మెహతా), లోకల్ ఎమ్మెల్యే చిల్లర సోమేశ్వరరెడ్డి(అజయ్ ఘోష్) ఎందుకు ప్రయత్నించారు? వారిని ఈగల్ ఎలా అడ్డుకున్నాడు? అసలు సహదేవ్ బతికే ఉన్నాడా? ఈ కథలో మధుబాల, శ్రీనివాస్ అవసరాల,విజయ్ రాయ్ పోషించిన పాత్రలు ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘కేజీయఫ్’ తర్వాత యాక్షన్ సినిమాల ప్రజంటేషన్లో మార్పు వచ్చింది. కథ కంటే యాక్షన్, ఎలివేషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మేకర్స్. ప్రేక్షకులు కూడా అలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. ‘ఈగల్’ కూడా ఆ తరహా చిత్రమే. కేజీయఫ్, విక్రమ్, జైలర్ తరహాలోనే ఇందులో కూడా భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు హీరోకి కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చారు. కానీ కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.యాక్షన్, ఎలివేషన్లనే నమ్ముకొని కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభం నుంచే హీరోకి భారీ ఎలివేషన్స్ ఇచ్చారు. ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్లుగానే తీర్చిదిద్దారు. మణిబాబు రాసిన సంభాషణలు హీరోని ఓ రేంజ్లో కూర్చోబెట్టేలా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల వచ్చే డైలాగులకు.. అక్కడ జరిగే సన్నివేశానికి ఎలాంటి సంబంధం ఉండకపోవడమే కాకుండా అతిగా అనిపిస్తుంది. ఇక హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కొన్ని చోట్ల చిరాకు పుట్టిస్తుంది. యాక్షన్స్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కథ ఢిల్లీలో ప్రారంభమై.. ఏపీలోని తలకోన ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. జర్నలిస్టు నళిని వార్త ప్రచురించడం.. సీబీఐ రంగంలోకి దిగి పత్రికా సంస్థపై దాడి చేయడంతో కథపై ఆసక్తి కలుగుతుంది. హీరో ఎంట్రీకి ఇచ్చే ఎలివేషన్ సీన్ ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ అంతా ఎలివేషన్లతోనే ముగుస్తుంది. హీరో క్యారెక్టర్ గురించి తెలియజేయకుండా ఎలివేషన్స్ ఇవ్వడంతో కొన్ని చోట్ల అంత బిల్డప్ అవసరమా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో హీరో ఫ్లాష్‌బ్యాక్ తెలుస్తుంది. సహదేవ్, రచనల లవ్ స్టోరీ అంతగా ఆకట్టుకోదు. కానీ కథకు అది ముఖ్యమైనదే! ఫస్టాఫ్‌తో ఎలివేషన్ల కారణంగా యాక్షన్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేవు కానీ.. ద్వితీయార్థంలో వచ్చే పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. పబ్లీ నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్ అదిరిపోతుంది. అలాగేప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ కూడా బాగుంటుంది. సినిమాలో మంచి సందేశం ఉన్నా.. దాన్ని ఓ చిన్న సన్నివేశంతో ముగించారు. ఎవరెలా చేశారంటే.. రవితేజకు యాక్షన్ కొత్త కాదు..ఎలివేషన్లు అంతకంటే కొత్తకాదు. ఈ రెండు ఉన్న ‘ఈగల్’లో రెచ్చిపోయి నటించాడు. సహదేవ్, ఈగల్ ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో చక్కగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా అనుపమ తనదైన నటనతో ఆకట్టుకుంది. సహదేవ్ అనుచరుడు జైగా నవదీప్ తన పాత్ర పరిధిమేర నటించాడు. వినయ్ రాయ్ పాత్ర చిన్నదైనా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. అవసరాల శ్రీనివాస్, మధుబాల, మిర్చి కిరణ్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, అమృతం అప్పాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. దేవ్ జాండ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. మణి బాబు రాసిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలను డామినేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. హై రిచ్ కంటెంట్ డెలీవరి చేయడంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి సత్తా చాటింది. -
రవిశంకర్ రాజు టూ మాస్ మహారాజా: ఇరగదీశాడు భయ్యా!
#EagleRavitejarapsongintelugu టాలీవుడ్ హీరో రవితేజ్ గా వస్తున్న మూవీ ఈగల్. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో తెలుగు కుర్రోడు దుమ్ము రేపాడు. తెలుగులో ర్యాప్ మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవిశంకర్ రాజు నుండి మాస్ మహారాజా రవితేజ వరకు సాగిన ప్రయాణాన్ని ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఉర్రూత లూగించింది. అంతేకాదు అద్భుతమైన RAP పాటకు రవితేజ కూడా ఫిదా అయిపోయాడు. ఉత్సాహంగా ఊగిపోయాడు. అదేంటో మీరు కూడా ఒకసారి చూసేయండి. కాగా మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ్ నటిస్తున్న మూవీ ఈగల్. ధమాకా తర్వాత మరో మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలొ అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. -
తేజ సజ్జతో రవితేజ స్పెషల్ ఇంటర్వ్యూ
-
రవితేజ వల్ల మాలాంటి వారికి ఇబ్బందులు: తేజ సజ్జా కామెంట్స్ వైరల్!
ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్తో సూపర్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. పెద్ద సినిమాలతో పోటీపడి మరీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఈ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. మహేశ్‌బాబు- గుంటూరు కారం, వెంకటేష్- సైంధవ్, నాగార్జున- నా సామిరంగా చిత్రాలతో పోటీపడి నిలిచింది. అయితే ప్రస్తుతం ఈగల్ సినిమాతో ప్రేక్షకులను పలరించేందుకు వస్తోన్న మాస్ మహారాజా రవితేజ.. తేజ సజ్జాతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా హనుమాన్ హీరో తేజ సజ్జా ఆయనకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఓ ఫన్నీ సమస్యను గురించి ప్రస్తావించారు. రవితేజ వల్ల ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోలు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పి షాకిచ్చాడు తేజ సజ్జా. (ఇది చదవండి: దేవర భామకు బిగ్ ఛాన్స్.. ఏకంగా రూ.500 కోట్ల సినిమాలో!) మీరు చేసే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు ఉంటున్నారు? అంటూ రవితేజను తేజ సజ్జా ప్రశ్నించారు. టైగర్, రావణాసుర సినిమాల్లో అలాగే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అందువల్ల మాలాంటి యంగ్ హీరోలకు చాలా ప్రాబ్లమ్ అవుతోంది. మీరు చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. మీరు ఏడాదికి మూడు చిత్రాలు చేస్తున్నారు. దాదాపు 12మందిని ఆడిషన్స్ చేస్తారు. దీంతో ఎవరినీ అడిగినా.. మేం రవితేజతో సినిమా చేస్తున్నాం. ఆ తర్వాతనే చేస్తామని చెబుతున్నారు. మీరు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌ను తీసుకోవడం వల్ల మాలాంటి యువ హీరోలు ఇబ్బందులు పడుతున్నారు' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు తేజ సజ్జా. కాగా.. రవితేజ నటించిన ఈగల్ కావ్య తాపర్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా.. పోటీ పెరగడంతో పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఫిబ్రవరి 9న విడుదలవుతోన్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. -
‘ధమాకా’ 1 ఇయర్ మరియు ‘ఈగిల్’ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఈగల్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
-
రవితేజ ఈగల్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. వేట మొదలైంది
మాస్ మహారాజ రవితేజ 'ఈగల్'గా సంక్రాంతి రేసులో దిగుతున్నాడు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా.. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్‌లు కనిపించనున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రాకకు కౌంట్‌డౌన్ మొదలైందని మేకర్స్ తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. సంక్రాంతి అంటే తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగ.. ఈ ఆనంద సమయంలో కుటుంబం మొత్తం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంది. అందుకే ఇండస్ట్రీలో చాలా సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకుని వస్తాయి. రవితేజ ఈగల్ కూడా జనవరి 13న విడుదల కానుంది. మరో 50 రోజుల్లో ఈగల్ వచ్చేస్తుందని కౌంట్‌డౌన్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. అందులో రవితేజ డెస్క్‌పై చాలా ఆయుధాలతో కనిపించారు. రవితేజ కెరియర్లోనే ఇదొక వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథగా రూపొందుతోందని గతంలో మేకర్స్ ప్రకటించారు. ఇందులో రవితేజ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈగల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. -
రవితేజ సినిమాకు ఇలాంటి కష్టాలా.. నో ఛాన్స్
డాన్ శీను, బలుపు, క్రాక్ ఈ హిట్ సినిమాలన్నీ రవితేజ - గోపీచంద్ మలినేని కలయికలో వచ్చినవే... ఇంతటి క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఆగుతారా..? అందుకే ఈ కాంబోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు రవితేజ ఫ్యాన్స్.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్‌తోపాటు ఇందుజ రవిచంద్రన్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారని కూడా మేకర్స్ ప్రకటించారు. కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకు గౌరవ దర్శకత్వం వహిస్తే... ఆ సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నిచ్చారు. ఇలా ఎంతో క్రేజీగా ప్రారంభం అయిన ఈ ప్రాజెక్ట్‌పై పలు రూమర్స్ వస్తున్నాయి. బడ్జెట్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని.. ఈ విషయంలో మేకర్స్ మరోసారి లెక్కలు వేస్తున్నారట. మార్కెట్ లెక్కలకి, సినిమాకి అనుకున్న బడ్జట్‌కు మధ్య చాలా డిఫరెన్స్ ఉండడంతో ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా ఆపేయాలని చూస్తున్నారట. సమాజంలో జరిగిన నిజ జీవితాల సంఘటనలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ అవుతుందని టాక్. దీంతో రిస్క్ చేయడం ఎదుకని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. రవితేజ ఇప్పటికే వరుసగా రెండు చిత్రాలు రూ. 100 కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ లాంటి బిగ్ ప్రొడక్షన్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ సినిమాకు మార్కెట్,బడ్జెట్ కష్టాలు అనేవి ఉండకపోవచ్చు. -
'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?
మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రాన్ని స్టూవర్ట్‌పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీశారు. మొదటినుంచి ఈ చిత్రం ఎలా ఉంటుందా అని ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి చూపించారు. కానీ మొత్తం రివర్స్‌లో జరిగింది. దీంతో మూవీ టీమ్ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో పోలిక.. రూ.3 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు!) సినిమా అనేది ఎంటర్ టైన్మెంట్. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు సినిమా కరెక్ట్ లెంగ్త్‌లో ఉంటే పర్లేదు. ఏ మాత్రం వేరుగా ఉన్నా మొదటికే మోసం వచ్చే ఛాన్సు ఉంటుంది. 'టైగర్ నాగేశ్వరరావు' విషయంలో అదే జరిగినట్లు కనిపిస్తుంది. తొలుత ప్రకటించినప్పుడు 3 గంటల నిమిషం 39 సెకన్ల నిడివితో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇంత నిడివి ఓకేనా? అని పలువురు అనుకున్నారు. తీరా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ నిడివి ఇప్పుడు సమస్యగా మారింది. సెకండాఫ్‌లో ల్యాగ్ అవ్వడానికి ఇదే కారణమని ఒక్కరోజులోనే చిత్రబృందం గుర్తించింది. దీంతో దాదాపు 24 నిమిషాల సీన్లని కట్ చేసి పడేశారు. ఇకపై 2 గంటల 37 నిమిషాల నిడివితో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు తొలిరోజు రివ్యూలు అంతంత మాత్రంగానే వచ్చాయి. మరి నిడివిలో మార్పు ఏమైనా ఫలితాన్ని మారుస్తుందా అనేది చూడాలి? అయితే ఈ పని ముందే చేసుంటే బాగుండేదని సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా) #TigerNageswaraRao - a racy tale of India's Biggest Thief with a cinematic experience of 2 Hours 37 Minutes 💥💥 Enjoy the ROARING DASARA WINNER in cinemas near you ❤️🔥 BOOK YOUR TICKETS NOW 🐅 - https://t.co/yOg5E0c9LP@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl… pic.twitter.com/GOHZOSAAnA — Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 21, 2023 -
మీ అబ్బాయిని హీరో చేయండి.. రేణు దేశాయ్‌కు రిక్వెస్ట్!
మాస్ మహారాజా రవితేజ, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. దసరా కానుకగా ఈ మూవీ ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవితేజతో పాటు రేణుదేశాయ్‌పై ప్రశంసలు కురిపించారు. (ఇది చదవండి: ఇంద్రజ హీరోయిన్గా కొత్త సినిమా.. ఆసక్తిగా టైటిల్!) విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ' టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూశా. మణిరత్నం తీసిన నాయకన్ సినిమా తెలుగులో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశా. ఆ కోరిక పుష్ప చిత్రంతో తీరిపోయింది. టైగర్ నాగశ్వరరావు మూవీలో ఒక్కొక్క ఫ్రేమ్‌ను అద్బుతంగా తీశారు. ఈ చిత్ర డైరెక్టర్‌కు చాలా మంచి భవిష్యత్తు ఉంది. దర్శకుడు వంశీ ఫోన్ నంబరు తీసుకుని ఆయనతో మాట్లాడేంత వరకు నా మనసు ఆగలేదు. రవితేజ చేసిన విక్రమార్కుడు సినిమా కన్నడ, తమిళం, హిందీలో చేశారు. నీకున్న టాలెంట్‌ను ఎవరూ అందుకోలేరు. మన తెలుగు కీర్తిని దేశమంతట విస్తరింపచేయండి. నాకు అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు.'అని అన్నారు. అనంతరం రేణు దేశాయ్ గురించి చెబుతూ.. ' మీరు సినిమా ఫీల్డ్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. మాకు ఎప్పటికీ దగ్గరే. మీ అబ్బాయిని త్వరలోనే హీరోను చేయాలి. అందులో మీరే తల్లిగా నటించాలి' అంటూ నవ్వుతూ మాట్లాడారు. ఆయన మాటలు విన్నా రేణు దేశాయ్ చాలా సంతోషంగా కనిపించింది. రేణు దేశాయ్ ఆనందం చూస్తుంటే తప్పకుండా చేస్తానంటూ చెబుతున్నట్లే కనిపించింది. కాగా.. పవన్ కల్యాణ్‌తో రేణు దేశాయ్‌కి పెళ్లి కాగా.. అకీరా నందన్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాలాంటి బాధ ఎవరికీ రాకూడదని కోరుకున్నా: నయని పావని) -
రవితేజ సినిమాకు ఇంత అన్యాయమా అంటూ ఫ్యాన్స్ ఫైర్
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' విడుదలకు రెడీగా ఉంది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా రన్‌టైమ్ 3.02 గంటలు ఉంది. నిడివి ఎక్కువగా ఉన్నా ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) 1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత నటి రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాలతో విడుదల అవుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి థియేటర్ కష్టాలు ఏర్పడ్డాయి. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కేవలం 30 లోపు థియేటర్లే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు అక్టోబర్ 19న విజయ్ 'లియో' థియేటర్లలోకి వస్తోంది. దీంతో తమిళనాడులోని అన్ని థియేటర్లు విజయ్ సినిమాకే ప్రథమ ప్రయారిటీ ఇచ్చాయి. దీంతో తమిళనాడులో రవితేజ చిత్రానికి కేవలం 30లోపు థియేటర్లు మాత్రమే మిగిలాయట. అవి కూడా అంత చెప్పుకోతగిన థియేటర్లు కాదని సమాచారం. ఇకపోతే కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తెలుగులోనూ రవితేజకు ఎదురుదెబ్బే... 'లియో' సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ సినిమా సుమారు రూ.22 కోట్లకు థియేట్రికల్ రైట్స్ విక్రయించారని టాక్ ఉంది. ఒక రకంగా విజయ్ కెరీర్లో ఇదే అత్యధిక తెలుగు బిజినెస్ అని సమాచారం. దీంతో తెలుగులో కూడా ‘లియో’కి అత్యధిక థియేటర్లు కేటాయింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 'లియో' సినిమా వల్ల బాలకృష్ణ 'భగవంత్ కేసరి' థియేటర్లు తగ్గించమని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గతంలో చెప్పారు. కానీ ఈ రెండు సినిమాలు విడుదలైన ఒక్కరోజు తర్వాత వస్తోన్న 'టైగర్ నాగేశ్వరరావు'కు మాత్రం భారీ దెబ్బే తగలబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ సినిమా కన్నా 'లియో'కే తెలుగులో ఎక్కువ థియేటర్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. తమిళనాడులో తెలుగు సినిమాకు థియేటర్లే ఇవ్వనప్పుడు అక్కడి సినిమాలకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లు కేటాయించడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రశ్నించాలని రవితేజ ఫ్యాన్స్ కోరుతున్నారు. -
హీరో రవితేజపై విరుచుకుపడ్డ 'కేజీఎఫ్' యష్ ఫ్యాన్స్!
తెలుగు హీరో రవితేజపై 'కేజీఎఫ్' ఫేమ్ యష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తమ హీరోనే అలా అంటావా అని రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? రవితేజ కామెంట్స్ మాస్ మహారాజా రవితేజ అద్భుతమైన యాక్టర్. హిట్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో ఈ దసరాకు థియేటర్లలోకి రాబోతున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రం. దీంతో దేశమంతటా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా బాలీవుడ్ ఇంటర్వ్యూలో సౌత్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) యష్-'కేజీఎఫ్'పై కామెంట్స్ రామ్ చరణ్ డ్యాన్స్ అంటే ఇష్టమని, ప్రభాస్ డార్లింగ్ అని, రాజమౌళిలో విజన్ అంటే ఇష్టమని రవితేజ చెప్పాడు. కన్నడ హీరో యశ్ గురించి అడిగితే.. అతడు యాక్ట్ చేసిన 'కేజీఎఫ్' మాత్రమే చూశాను. ఆ సినిమా చేయడం అతడికి చాలా లక్కీ' అని అన్నాడు. దీన్ని తీసుకోలేకపోతున్న యష్ ఫ్యాన్స్.. రవితేజపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. 'కేజీఎఫ్' తప్పితే యష్ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. రవితేజ కూడా అదే ఉద్దేశంతో ఇలా అన్నాడు. యష్ అభిమానులు మాత్రం దీన్ని అపార్థం చేసుకుని గొడవ గొడవ చేస్తున్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్‌లో నిజమెంత?) -
వరల్డ్‌కప్ మ్యాచ్ కోసం హీరో రవితేజ.. సరికొత్త రికార్డ్
మాస్ మహారాజ్ రవితేజ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం కామెంట్రీ చేసిన ఇతడు.. సినిమా విశేషాలతో పాటు మ్యాచ్ గురించి మాట్లాడాడు. అలానే టీమిండియాలో కోహ్లీతో మరో క్రికెటర్ అంటే ఇష్టమని చెప్పాడు. ఈ క్రమంలోనే ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఫీట్ సాధించాడు. ఇంతకీ ఏంటి సంగతి? వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో మ్యాచ్ జరిగింది. అయితే తెలుగు కామెంటరీ బాక్సులో కనిపించిన రవితేజ.. తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. కోహ్లీ, సిరాజ్ అంటే ఇష్టమని చెప్పాడు. ఇకపోతే కోహ్లీ యాటిట్యూడ్, అగ్రెషన్, లుక్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. అలానే ఈ మ్యాచ్‌లో క్యాచ్ పట్టిన స్టైల్ నచ్చిందని కామెంట్రీ చెప్పాడు. (ఇదీ చదవండి: ఫారెన్ టూర్లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?) అయితే గతంలో ఐపీఎల్ సందర్భంగా విజయ్ దేవరకొండ ఇలా కామెంటరీ బాక్సులో కాదు గానీ స్టేడియంలో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు రవితేజ మాత్రం ఏకంగా వరల్డ్‌కప్ మ్యాచ్ కోసం కామెంటరీ చేశాడు. అయితే ఓ తెలుగు హీరో ఇలా ప్రపంచకప్ మ్యాచ్‌కి కామెంటరీ చేయడం ఇదే తొలిసారి. ఇలా ఎవరికీ సాధ్యపడని ఘనత సాధించాడు. స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. అక్టోబరు 20న పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) Men In Blue slaying on the field and Mass Maharaja @RaviTeja_offl slaying it with a mic in hand 🔥🔥#INDvAUS the TIGER's way ❤🔥#TigerNageswaraRao in Cinemas Oct 20th 🥷@DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai @Jisshusengupta @gvprakash… pic.twitter.com/zK12hPtbCe — Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 8, 2023 -
రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రవితేజ ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించారు. ఇటీవలే ముంబయిలో ఈవెంట్‌కు రవితేజ హాజరయ్యారు. అయితే ఈవెంట్లో అనుపమ్ ఖేర్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: బిగ్‌బాస్ 7: మళ్లీ గ్రాండ్ లాంచ్.. హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు.. కానీ..) ఈవెంట్‌కు హాజరైన అనుపమ్.. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకసారి చిన్న వయసులో రవితేజ తన స్టూడియోకి వచ్చి నాతో ఫోటో దిగాలని అడిగాడు. కానీ నేను కుదరదని చెప్పా.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సినిమాలోనే నటిస్తున్నా.. ఆ రోజు అలా అన్నందుకు రవితేజకు నవ్వుతూ సారీ అన్నారు. దీంతో వెంటనే రవితేజ.. సార్ అంటూ దండం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గా యత్రి భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: 'సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా లియో ట్రైలర్!) 1988 :- #AnupamKher rejected to click a photo with #RaviTeja 😢💔 2023 :- #AnupamKher is doing a key role in Mass Maharaja @RaviTeja_offl most anticipated Project #TigerNageswaraRao 🥵🔥 True definition of Success 💥💯 pic.twitter.com/z3GY4rPEc7 — Neeraj Kumar (@73forever_) October 4, 2023 -
రవితేజ పాన్ ఇండియా హీరో అవుతాడా?
-
రవితేజ, విజయ్ దేవరకొండ ఎవరైతే ఏంటి.. శ్రీలీల పరిస్థితి ఇదీ!
పెళ్లి సందD సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ అందం శ్రీలీల జోరు మామూలుగా లేదు. టాప్ హీరోలు నటిస్తున్న పలు చిత్రాల్లో ఆమే కథానాయికగా ఉంది. ఇప్పటికే ఆమె ఓకే చేసిన చాలా చిత్రాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఇందులో భాగంగా రామ్ పోతినేనితో ఆమె నటించిన స్కంద చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. (ఇదీ చదవండి: నా జీవితంలో ఆ ముగ్గుర్నీ ఎప్పుడూ మర్చిపోను: రాఘవ లారెన్స్) రవితేజ ‘ధమాకా’ తర్వాత ఏక కాలంలో దాదాపు పదికి పైగా చిత్రాలను ఓకే చేసిన ఈ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 కోసం ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతలా బిజీగా ఉన్న శ్రీలీల గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రంలో శ్రీలీలను హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఈ మూవీ ఇప్పటికే సెట్స్‌పై ఉంది. కానీ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీలో ఉన్న శ్రీలీల ఈ సినిమా షూట్లో జాయిన్ కాలేకపోతుందట. దీంతో ఆమె స్వయంగా రౌడీ సినిమా నుంచి బయటికొచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు రవితేజ కూడా శ్రీలీలతో 'ధమాకా' సూపర్ హిట్ ఇచ్చాడు. మళ్లీ ఇదే జోష్‌లో మరో ప్రాజెక్ట్ చేయాలని రవితేజ అనుకున్నారట. అందుకు శ్రీలీల వద్ద ఇప్పట్లో డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టమని చెప్పిందట. స్టార్ హీరోలతో బంగారం లాంటి అవకాశాలు వచ్చినా చేయలేకపోయానే అని బాధపడుతుందట ఈ బ్యూటీ. దీనంతటికి ప్రధాన కారణం తన ఎంబీబీఎస్ చదువుకు సంబంధించిన పరీక్షలు డిసెంబర్ నెలలో ఉండటమే అని తెలుస్తోంది. పరీక్షల కోసం ఆమె సినిమాలకు రెండు నెలలపాటు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణం వల్లే ఆ రెండు చిత్రాలు చేయలేనని శ్రీలీల చెప్పిందట. దీనికి వారు కూడా సానుకూలంగానే స్పందించారట. -
పలు గెటప్స్‌లలో కనిపించనున్న టాప్ హీరోలు
అభిమాన హీరోలు వెండితెరపై ఒక గెటప్‌లో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. అలాంటిది ఆ స్టార్ హీరో పలు రకాల గెటప్స్‌లో కనిపిస్తే ఆ ఖుషీ డబుల్ అవుతుంది. అలా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించే కథలు కొందరు స్టార్స్‌కి సెట్ అయ్యాయి. ఒక్కో హీరో మినిమమ్ నాలుగు, ఇంకా ఎక్కువ గెటప్స్‌లో కనిపించనున్నారు. గెట్.. సెట్.. గెటప్స్ అంటూ ఆ స్టార్స్ చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. విభిన్న భారతీయుడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించడం కమల్‌హాసన్‌కు కొత్తేం కాదు. ‘దశావతారం’లో కమల్ పది పాత్రల్లో పది గెటప్స్ చేసి ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచారు. అన్ని పాత్రల్లో కాదు కానీ ‘ఇండియన్ 2’లో కమల్‌హాసన్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ వీరి కాంబినేషన్లోనే రూపొందుతోంది. 1920 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఇందులో కమల్‌హాసన్ నాలుగుకి మించి గెటప్స్‌లో కనిపిస్తారని కోలీవుడ్ టాక్. వీటిలో లేడీ గెటప్ ఒకటనే టాక్ తెరపైకి వచ్చింది. మహిళగా, 90 ఏళ్ల వృద్ధుడిగా, యువకుడిగా.. ఇలా విభిన్నంగా కనిపించడానికి కమల్‌కి ప్రోస్థటిక్ మేకప్ వేసుకోవడానికి, తీయడానికి మూడు గంటలకు పైగా పడుతోందని యూనిట్ అంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. పెయింటరా? సైంటిస్టా? పెయింటరా? రైతా? సైంటిస్టా? అసలు ‘ఈగిల్’ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఏంటి? అనే సందేహం తీరాలంటే ఈ సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘ఈగిల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ఓ లీడ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ఐదారు గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రొఫెషనల్ స్నైపర్ గెటప్ ఒకటి అని భోగట్టా. ఇంకా రవితేజ లుక్ విడుదల కాలేదు. పదికి మించి.. ప్రయోగాత్మక పాత్రలకు సూర్య ముందుంటారు. ‘సుందరాంగుడు’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’, ‘బ్రదర్స్’... ఇలా సూర్య కెరీర్లో వైవిధ్యమైన చిత్రాల జాబితా ఎక్కువే. ఈ కోవలోనే సూర్య నటించిన మరో చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య పదమూడు గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. 17వ శతాబ్దంలో మొదలై 2023కి కనెక్ట్ అయ్యేలా ‘కంగువా’ కథను రెడీ చేశారట శివ. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్.. రాజకీయ నాయకుడు కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ పార్టీ కార్యకర్త... ఇలా ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్‌చరణ్ ఏడు గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు మధ్య నెలకొని ఉండే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 2 దశాబ్దాలు.. 4 గెటప్స్ ‘తొలిప్రేమ’ (2018)లో వరుణ్ తేజ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. కాలేజీ కుర్రాడిలా, ఉద్యోగం చేసే వ్యక్తిగా కనిపిస్తారు. ఇదే తరహాలో వరుణ్ తేజ్ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ‘మట్కా’. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. వైజాగ్ నేపథ్యంలో 1958 నుంచి 1982 టైమ్ పీరియడ్‌లో ‘మట్కా’ కథనం ఉంటుంది. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారు. పలు అవతారాల్లో స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తున్నారట కార్తీ. అది కూడా గోల్డ్ స్మగ్లింగ్. ఇందులో భాగంగా అధికారులను బోల్తా కొట్టించేందుకు తన గెటప్ మార్చుతుంటారట. ఇదంతా ‘జపాన్’ సినిమా కోసం. రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో కార్తీ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
'టైగర్ నాగేశ్వరరావు' రియల్ స్టోరీ.. ఇంతకీ అతడెవరో తెలుసా?
'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని పేరు. మహా అయితే స్టువర్టుపురం గజదొంగ అని తెలిసి ఉంటుందేమో! ఇతడి జీవితం ఆధారంగా తెలుగులో ఓ సినిమా తీశారు. రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు' పేరుతోనే దీన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. ఇంతకీ 'టైగర్ నాగేశ్వరరావు' ఎవరు? ఆయన మంచోడా? చెడ్డోడా? ఎవరీ నాగేశ్వరరావు? విజయవాడ-చెన్నై రూట్లో బాపట్లకు దగ్గర్లో స్టువర్టుపురం అనే ఊరు ఉంటుంది. అప్పట్లో అంటే 1874 టైంలో దొంగల్ని, ఇతర నేరాలు చేసే వాళ్లపై నిఘా పెట్టేందుకు.. వాళ్లందరినీ తీసుకొచ్చి ఈ ఊరిలో నివాసం కల్పించారు. అలా దొంగతనాలు చేసుకునే కుటుంబంలో 1953-56 మధ్యలో నాగేశ్వరరావు పుట్టాడు. ఇతడికి ఇద్దరు అన్నలు ప్రసాద్, ప్రభాకర్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ప్రసాద్, ప్రభాకర్ దొంగతనాలు చేసేవారు. (ఇదీ చదవండి: టైగర్ నాగేశ్వరరావు టీజర్‌పై హైకోర్టు అసహనం) అలా దొంగగా మారి అయితే ఓ సారి ప్రభాకర్ ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమైన పోలీసులు.. నాగేశ్వరరావుని స్టేషన్‌కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. చేయని నేరానికి చిత్రవధ అనుభవించిన ఇతడు.. తండ్రి, అన్నల బాటలో అది కూడా 15 ఏళ్లకే దొంగగా మారాడు. 1970లో తమిళనాడుకు వెళ్లిపోయి మారుపేర్లతో దొంగతనాలు చేశాడు. అన్న ప్రభాకర్ జైలు నుంచి బయటకొచ్చాక, అతడి గ్యాంగ్‌లో చేరిపోయాడు. చెప్పి మరీ దొంగతనాలు ఓసారి ఈ అన్నదమ్ముల్ని తమిళనాడులో తిరువళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తనని చిత్రహింసలు పెడితే రెండు రోజుల్లో జైలు నుంచి పారిపోతానని.. నాగేశ్వరరావు సవాలు విసిరాడు. అన్న చెప్పినా సరే వినకుండా అలానే రెండు రోజుల తర్వాత జైలులో పోలీసులని కొట్టి మరీ పరారయ్యాడు. 'వచ్చే నెల మద్రాసులో దొంగతనం చేస్తాను, దమ్ముంటే పట్టుకోండి' అని సవాలు విసిరి మరీ దొంగతనాలు చేశాడు. దీంతో నాగేశ్వరరావు కాస్త టైగర్ నాగేశ్వరరావుగా మార్మోగిపోయాడు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు) 15 ఏళ్లపాటు దొంగతనాలు పోలీసుల తీరు వల్ల దొంగగా మారిన టైగర్ నాగేశ్వరరావు.. దాదాపు 15 ఏళ్లపాటు ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటకలో దొంగతనాలు, దోపీడీలకు పాల్పడ్డాడు. పోలీసులని ముప్పతిప్పలు పెట్టాడు. 1974లో బనగానపల్లె బ్యాంకు దోపీడీ అయితే వేరే లెవల్. పోలీసు స్టేషన్ దగ్గరే ఉన్న ఆ బ్యాంక్‌ని నాగేశ్వరరావు ముఠా కొల్లగొట్టింది. మత్తు మందు ఇచ్చి అయితే నాగేశ్వరరావు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ పోలీసులు.. అతడిని ఎలా అయినాసరే మట్టుబెట్టాలని ఓ మహిళతో కలిసి అతడిని చంపడానికి ప్లాన్ చేశారు. అలా 1980 మార్చి 24న తెల్లవారుజామున.. ఆ మహిళ ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు మత్తుమందు కలిపిన పాలు తాగాడు. అలా నిద్రపోతుండగా పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తర్వాత దాన్ని ఎన్‌కౌంటర్‌గా మార్చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి రాఖీ సెలబ్రేషన్స్) దొంగనే కానీ మంచోడు అయితే స్టువర్టుపురం గజదొంగగా పేరు మోసిన టైగర్ నాగేశ్వరరావు.. పెద్దోళ్ల దోచుకున్నదంతా పేదలకు పంచిపెట్టేవాడు. చదువు, పెళ్లి, వైద్యం లాంటిది ఏదైనా సరే అవసరానికి మించిన సహాయం చేసేవాడు. అయితే ఎన్ని దొంగతనాలు, దోపీడీలు చేసినా సరే మహిళల పట్ల ఏనాడు అసభ్యంగా ప్రవర్తించలేదు. ఈ విషయాన్ని స్వయంగా అతడి అన్నయ్య ప్రభాకర్.. ఓ సందర్భంలో చెప్పాడు. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు) -
'టైగర్ నాగేశ్వరరావు' టీజర్.. రవితేజ అలాంటి లుక్‌లో
మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమా చేస్తున్నాడు. 1970ల్లో మన దేశంలోనే పెద్ద దొంగగా అందరినీ భయపెట్టిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఈ మూవీ. దసరా సందర్భంగా అక్టోబరు 20న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేశారు. అలానే టైగర్ దండయాత్ర పేరుతో గురువారం ఓ టీజర్ ని రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!) టీజర్ ఎలా ఉంది? 1970ల వాతావరణాన్ని ప్రతిబింబించేలా టీజర్‌లోని ప్రతి షాట్ కనిపిస్తుంది. స్టువర్ట్పురం దొంగగా రవితేజ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. అనుపమ్ ఖేర్, మురళీశర్మ.. పాత్రల్ని కూడా టీజర్ లో చూపించారు. 'పులి, సింహం కూడా ఓ వయసు వచ్చేదాక పాలే తాగుతాయి సర్. కానీ వీడు ఎనిమిదేళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు' లాంటి డైలాగ్స్ ఆసక్తి రేపుతున్నాయి. కథేంటి? హైదరాబాద్, బాంబే, ఢిల్లీతో పాటు అనేక నగరాల్లో దారుణమైన దోపిడీలు చేసిన స్టువర్ట్పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు.. మద్రాసు సెంట్రల్ జైలులో ఉంటాడు. ఓ రోజు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అతడిని పట్టుకునే బాధ్యతని డీసీపీ మురళీశర్మకు అప్పగిస్తారు. ఈ క్రమంలోనే చివరకు ఏమైంది? అనేది స్టోరీ అని తెలుస్తోంది. మొన్నటివరకు ఈ సినిమా డైరెక్టర్ పేరు చెప్పకుండా సస్పెన్స్ మెంటైన్ చేశారు కానీ ఇప్పుడు వంశీ దర్శకుడు అని టీజర్లో చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: పెళ్లిపై హీరో వరుణ్‌తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!) -
అతనికి మొహం చూపించలేకపోయా.. రవితేజకు స్పెషల్ థ్యాంక్స్: నిర్మాత
శివకార్తికేయన్, అదితిశంకర్ జంటగా నటించిన చిత్రం మావీరన్( మహావీరుడు). నటి సరిత, దర్శకుడు మిష్కిన్, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. గత 14న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ దర్శకుడు మడోన్ అశ్విన్ రైటింగ్, కన్వెన్షన్, క్లారిటి ఈ చిత్ర విజయానికి ముఖ్యకారణం అని నిర్మాత పేర్కొన్నారు. చిత్ర బాధ్యతంతా తన భుజాలపైనే మోశారు. తాను ఇంతకుముందు ప్రిన్స్ చిత్రానికి తాను సహ నిర్మాతగా వ్యవహరించానని, ఆమె చిత్రం సరిగ్గా ఆడలేదంది. దీంతో శివకార్తికేయన్ ఆ నష్టాన్ని భర్తీ చేశారన్నారు. ఆ తరువాత ఆయన్ని కలవడానికి తనకు ముఖం చెల్లలేదన్నారు. అలాంటి సమయంలో శివకార్తికేయనే ఫోన్ చేసి మావీరన్ చిత్రం చేద్దామని చెప్పి అన్నీ తానై ఈ చిత్రాన్ని చేశారన్నారు. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పడానికి అంగీకరించిన విజయ్‌సేతుపతికి, అదేవిధంగా తెలుగు వెర్షన్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చిన రవితేజకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానన్నారు. చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని, గురువారంతో బ్రేక్ ఈవెంట్ అవుతుందన్నారు. ఇకపై వచ్చేదంతా లాభమేనని నిర్మాత చెప్పారు. శివకార్తికేయన్ మాట్లాడుతూ మావీరన్ విజయం తనకు చాలా ప్రత్యేకం అన్నారు. తనకు మంచి యాక్టర్ అనిపించుకోవడం కంటే ఎంటర్టైనర్ అనిపించుకోవాలని కోరుకుంటానని, అది ఈ చిత్రంతో నెరవేరిందని అన్నారు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మళ్లీ నటించడానికి తాను సిద్ధం అని చెప్పారు. జయాపజయాలు మామూలే అని అయితే అభిమానుల సంతోషం కోసం ప్రేమిస్తూనే ఉంటానని శివకార్తికేయన్ పేర్కొన్నారు. #MaaveeranThanksMeet happening now…😇💪🏼 #VeerameJeyam #Maaveeran #MaaveeranBlockBuster pic.twitter.com/5cYwLjs56c — Shanthi Talkies (@ShanthiTalkies) July 20, 2023 -
టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో యశస్వి జైస్వాల్..!
టీమిండియా యువ సంచలనం ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరితో అదరగొట్టాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన యువకెరటం ఏకంగా టీమిండియా తలుపుతట్టాడు. వెస్టిండీస్ పర్యటనకు ఒపెనర్‌గా ఎంపికయ్యాడు. ఇంకేముంది అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టి ఔరా అనిపించాడు. అతనే టీమిండియా యువకెరటం యశస్వి జైశ్వాల్. అయితే తాజాగా యశస్వి జైస్వాల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ యంగ్ ఒపెనర్ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించారంటూ మీమ్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. (ఇది చదవండి: స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని చంబల్ ప్రాంతంలో జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ఓ సీన్లో అచ్చం యశస్వి జైస్వాల్ లాగే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించాడు. అది కూడా క్రికెట్ ఆడుతున్న సీన్ కావడంతో అందరూ చిన్నప్పుడు ఆ సీన్లో ఉన్నది యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విక్రమార్కుడు చిత్రంలోని చైల్డ్ ఆర్టిస్ట్‌కు, అతనికి పోలికలు ఉండటంతో నెటిజన్స్ మీమ్స్ చేస్తున్నారు. 'ఏ సత్తి బాల్ లోపలికి వచ్చిందా?' అనే డైలాగ్ చెప్పిన పిల్లాడు ఇప్పుడు టీమిండియా ఒపెనర్కు దగ్గర పోలికలు ఉండడంతోనే అలా పోలుస్తున్నారు. అంతేకానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశస్వి జైస్వాల్ టాలీవుడ్లోనే ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం అతను టీమిండియాలో చోటు దక్కించుకోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. (ఇది చదవండి: మీరు ఇంత దారుణంగా ఉన్నారేంట్రా?.. అనసూయ ట్వీట్ వైరల్) Vikramarkudu lo vunnadhi @ybj_19 e antara #IPL2023 #IPL pic.twitter.com/nqJ8OiCHD4 — Prasad (@PrasadAGVR) May 13, 2023 -
రవితేజని ఫాలో అయిపోతున్న తమ్ముడి కొడుకు
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి 'Mr.ఇడియట్' టైటిల్ ఖరారు చేశారు. సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'పెళ్లి సందD' చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్, ప్రీ లుక్‌ని మాస్ మహారాజా రవితేజ ఆవిష్కరించారు. నా కెరీర్లో 'ఇడియట్' సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మా రఘు కొడుకు మాధవ్ 'Mr ఇడియట్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాలాగే తనకు కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవాలని కోరుకుంటున్నాను' అని చిత్రబృందానికి రవితేజ విషెస్ చెప్పారు. ట్వీట్ కూడా చేశారు. Happy to unveil the Title Poster of #MrIdiot & Introduce my boy @maadhav_9999 🤗 Wishing your first step bring you success and love & May you have a amazing journey with cinema. Wishing the Entire team All the best 👍#JJREntertainments #GowriRonanki #simransharma @raamdop… pic.twitter.com/DL40FoeXbL — Ravi Teja (@RaviTeja_offl) July 9, 2023 (ఇదీ చదవండి: తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ.. హీరోయిన్ ఇలియానా ఇబ్బందులు!) -
రవితేజ తో మళ్ళీ రొమాన్స్
-
మహేష్ బాబు ప్రభాస్ స్థానాల్లో రవితేజ విజయ్ దేవరకొండ
-
'ధమాకా' జోడీ రిపీట్.. ఈసారి మాత్రం!
మాస్ మహారాజ రవితేజ 'ధమాకా' మూవీ పేరు చెప్పగానే అందరికీ హీరోయిన్ శ్రీలీలనే గుర్తొస్తుంది. ఇందులో వేరే లెవల్ ఎనర్జీతో డ్యాన్సులేసింది. సినిమాలో కొన్నిచోట్ల హీరోని డామినేట్ కూడా చేసింది. స్టోరీ పరంగా ఈ సినిమాలో కొత్తగా ఏం లేకపోయినా శ్రీలీల వల్ల ఓ ఫ్రెష్ నెస్ వచ్చి, హిట్ అయిందని కూడా చెప్పొచ్చు. అలాంటిది రవితేజతో శ్రీలీల మరోసారి కలిసి రచ్చ చేసేందుకు సిద్ధమైపోయిందట. తెలుగులో ఈ మధ్య కాలంలో శ్రీలీలకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి రాలేదు. ఎందుకంటే ఈ బ్యూటీ చేతిలో ఏకంగా తొమ్మిది వరకు కొత్త మూవీస్ ఉన్నాయి. గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్ సింగ్, ఆదికేశవ.. ఇలా బోలెడన్నీ సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో కొత్త చిత్రం వచ్చినట్లు తెలుస్తోంది. అదే రవితేజ-గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్. 'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న రవితేజ-గోపీచంద్ మలినేని.. ఇప్పుడు మరో సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నారు. 'వీరసింహారెడ్డి' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న గోపీచంద్.. రవితేజకు ఓ కథ చెప్పి ఒప్పించారట. ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అనే చర్చ వచ్చినప్పుడు శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. దాదాపు కన్ఫర్మ్ కూడా అయిపోయిందట. అధికారిక ప్రకటన ఇంకా మిగిలుందట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) -
రవితేజ రెమ్యూనరేషన్ అంతా
-
విక్రమార్కుడులో మెప్పించిన చిన్నారి.. ఇప్పుడెలా ఉందో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. వారిలో కొందరు స్టార్స్‌గా మారితే.. మరికొందరేమో కొన్ని సినిమాలతోనే సరి పెట్టుకున్నారు. కొద్ది మంది ఒక్క సినిమాలో కనిపించి కనుమరుగైన పోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఓ సూపర్ హిట్ చిత్రంలో మెప్పించిన ఓ చిన్నారి ఇప్పుడెలా ఉందో ఓ లుక్కేద్దాం. రవితేజ డబుల్ రోల్లో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'విక్రమార్కుడు'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లోని చంబల్ ప్రాంతంలో జరిగిన కథను సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన చిన్నారి మీకు గుర్తుందా? 'అమ్మ పాట వింటే నిద్ర వచ్చేస్తుంది నాన్న' అంటూ అమాయకంగా పలికిన ఆ చిన్నారి ఇప్పుడేం చేస్తోందో తెలుసా? ఆ వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం. విక్రమార్కడులో చైల్డ్ ఆర్టిస్ట్ నేహా చాలా సినిమాల్లో నటించింది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురిగా.. అమాయకమైన పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఈ సినిమాలో నటనకు ఆ చిన్నారిని మెచ్చుకున్నారు. అనసూయ, రాముడు, ఆది విష్ణు, రక్ష, సర్కార్ చిత్రాల్లో కూడా కనిపించింది. కాగా.. అమెరికాలోని ఫ్లోరిడాలో నేహా జన్మించింది. అయితే చిన్నప్పుడే ఆ పాప తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె తల్లిదండ్రులు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందినవారు. నేహా దాదాపు పదేళ్లకు పైగా సినిమాల్లో నటించడం లేదు. అయితే ఆమె ప్రస్తుతం సినిమాల కంటే కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవలే ఎంబీఏ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. -
మాస్ రాజా ఫిల్మ్ ఫెస్టివల్
-
బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న మాస్ మహారాజ రవితేజ
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తుంటే, మన హీరోలు బాలీవుడ్ బాట పడుతున్నారు. సౌత్ సినిమాలు పాన్ఇండియా స్థాయిలో సత్తాచాటుతుండటంతో బాలీవుడ్ మేకర్స్ దృష్టి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై పడింది. దీంతో తమ సినిమాల్లో సౌత్ స్టార్స్ ఉండేలా మేకింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లో వెంకటేశ్, వార్-2లో హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లో మాస్ మహారాజ రవితేజ కూడా వచ్చి చేరినట్లు తెలుస్తుంది. బీటౌన్ టాక్ ప్రకారం.. యంగ్ హీరో వరుణ్ ధావణ్‌తో కలిసి రవితేజ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను రానా, కరణ్ జోహార్, ఏషియన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ రానుందట. -
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మాస్ మహారాజ
-
మాస్ మహరాజ్ అరాచకం..
-
ఆ ట్విస్టులు ఏంటిరా బాబోయ్
-
Ravanasura OTT: రవితేజ 'రావణాసుర' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా సహా ఐదుగురు హీరోయిన్స్ నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా విడుదలైన తొలిరోజే ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వివరాలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రావణాసుర ఓటీటీ పార్ట్నర్కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకుంది. అయితే థియేటర్స్‌లో విడుదలైన 50రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. -
ఒక్కొక్క సీన్‌కి నరాలు తెగిపోతున్నాయి..రావణాసుర మూవీ రివ్వూ
-
రావణాసురుడి ముద్దుగుమ్మలు క్యూట్ ముచ్చట్లు
-
రవితేజ 'రావణాసుర' నుంచి థీమ్ సాంగ్ విడుదల
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దక్షా నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజితా పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రేపు(శుక్రవారం)ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు.రావణా రావణా..రావణా దశగ్రీవ .. రావణా అంటూ ఈ పాట సాగుతుంది. హర్షవర్ధన్ రామేశ్వరన్ సంగీతం అందించగా అరుణ్ కౌండిన్య ఆలపించారు. -
రవితేజ తో నా అసలు గొడవ ..! చిరంజీవి భోళాశంకర్ లో నా రోల్
-
రవితేజని ఏది మార్చలేదు.. నా లాంగ్ హెయిర్ సీక్రెట్ అదే
-
హీరోగా కొడుకు ఎంట్రీపై రవితేజ షాకింగ్ కామెంట్స్
-
తనయుడి టాలీవుడ్ ఎంట్రీ.. రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మాస్ మహారాజా రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే స్టార్ హీరోగా ఎదిగారు. ఈ ఏడాదిలో వచ్చిన ధమాకా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రావణాసుర. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా.. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 7 న థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు రవితేజ. ఇందులో భాగంగా రవి తేజ, సుశాంత్‌తో కలిసి డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూ చేశారు. తాజాగా రవితేజ తన కుమారుడి మహాధన్ టాలీవుడ్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మహాధన్ నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పుడు రవితేజగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. రవితేజ మాట్లాడుతూ..' ఆ విషయం నాకు తెలియదు.. అస్సలు ఇప్పటివరకు అలాంటి ఐడియా కూడా రాలేదు. ఈ విషయంలో నాకేలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి ఇంట్రెస్ట్ ఉంది.. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ వస్తానంటే వెళ్లు అని చెప్తా. ఒక్క సలహా కూడా ఇవ్వను. వాడికి ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చేశాను. కెరీర్ పట్ల ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. వాడి గురించి నేను చెప్పడం కాదు. తెలుసుకోవాలి.' అని అన్నారు. దీంతో మహాధన్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'టైగర్ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. నుపుర్ సనన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. 1970-80ల కాలంలో స్టువర్టుపురంలోని గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించననున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వదిలారు. సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో రవితేజ ఈ చిత్రంలో కనిపించనున్నారు. నుపూర్ సనన్‌తో పాటు గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్గా నటించనుంది. -
'నన్ను ఆపగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే'.. ఆసక్తిగా రావణాసుర ట్రైలర్
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రావణాసుర'. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఫుల్ యాక్షన్ ఫైట్‌తో ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే ఈ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ చివర్లో 'ఈ భూమ్మీద నన్ను ఆపగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే' అనే డైలాగ్ మాస్ ఆడియన్స్‌కు మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ సారి మాస్ మహా రాజా ఫ్యాన్స్‌కు మరోసారి ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. We’re all bad in someone's story! Presenting you all the #RavanasuraTrailer 🔥 - https://t.co/zfsnw1anr3 Taking over theatres from APRIL 7th :)) #RavanasuraOnApril7 pic.twitter.com/DfpEyJVI28 — Ravi Teja (@RaviTeja_offl) March 28, 2023 -
అవకాశాలు ఇస్తామని నన్ను డ్రైవర్‌గా వాడుకున్నారు: నాని
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా చిత్రం దసరాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా హీరో రవితేజతో చేసిన చిట్‌చాట్‌లో తన కెరీర్, జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల గురించి వెల్లడించారు. నాని మాట్లాడుతూ.. 'నా ఫోటో ఆల్భమ్ పట్టుకొని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిను. ఎక్కడా కనీసం నన్ను లోపలి కూడా రానివ్వలేదు. చిన్న చిన్న పాత్రలు చేద్దామన్నా ఛాన్సులు రాలేదు. ఆ ప్రయత్నంలో ఉండగానే ఒకరిదిద్దరు కో డైరెక్టర్స్ నన్ను డ్రైవర్ లాగా కూడా వాడుకున్నారు. రకరకాల పనులు చేయించుకున్నారు. చివరకి నా ఎటీఎమ్‌లో పండగలకు బట్టలు కొనుక్కోకుండా దాచుకున్న డబ్బులను కూడా కొట్టేశారు. ఈ స్కాములన్నీ చూశాక ఇంక యాక్టింగ్ మళ్లీ మళ్లీ మోసపోవడం వల్ల కాదని, నటుడిగా ప్రయత్నాలు ఆపేసి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాను' అని నాని చెప్పుకొచ్చాడు. అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారిన నాని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాడు. -
రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రావణాసుర ట్రైలర్ ఆరోజే
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రావణాసుర'. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈనెల 28న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. పోస్టర్ చూస్తే రవితేజ సీరియస్ లుక్‌లో కనిపించారు. ఈ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. The fireworks will begin in advance for you all 🤗#RavanasuraTrailer on 28th March at 4:05 PM 😎#Ravanasura#RavanasuraOnApril7 pic.twitter.com/lE0DFISvUD — Ravi Teja (@RaviTeja_offl) March 25, 2023 -
రవితేజ ఫ్యామిలీ నుంచి హీరోగా వారసుడి ఎంట్రీ
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. తాజాగా రవితేజ కుటుంబం నుంచి కూడా ఓ వారసుడు సినీరంగ ప్రవేశం చేశాడు. మాస్ మహారాజ రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా టాలీవుడ్‌కు డెబ్యూ ఇవ్వనున్నారు. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాణి సమర్పణలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'పెళ్లి సందడి' డైరెక్టర్ గౌరీ రోణంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైన ఈ సినిమా పూజా కార్యక్రమంలో కే రాఘవేంద్రరావు,సురేష్ బాబు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరులు హాజరయ్యారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. Wishing my boy #Maadhav all the very best for his debut :)))) May you all bless and shower him with all your love 🤗 #GowriRonanki #YalamanchiRani #JJREntertainmentsLLP pic.twitter.com/FBNvUsitiG — Ravi Teja (@RaviTeja_offl) March 23, 2023 -
రిలీజ్‌కు రెడీ అవుతున్న రవితేజ 'రావణాసుర'
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రావరణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే షరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. #Ravanasura shooting has wrapped up, and all set to release in theatres on April 7th. Get ready for an unforgettable cinematic experience! 🤘🏻🤘🏻@RaviTeja_offl @iamSushanthA @sudheerkvarma @RTTeamWorks @fariaabdullah2 @rameemusic @pujita_ponnada @SrikanthVissa @itswetha14 pic.twitter.com/Ct7arrnGQQ — ABHISHEK PICTURES (@AbhishekPicture) February 26, 2023 -
మహాశివరాత్రి: టాలీవుడ్ కొత్త అప్డేట్స్ ఇవే!
మహా శివరాత్రి సందర్భంగా టాలీవుడ్ జోరుగా హుషారుగా మహా అప్డేట్స్ ఇచ్చింది. ఆ విశేషాలు తెలుసుకుందాం... వెండితెర బోళా శంకరుడిగా దుష్టులపై శివతాండవం చేస్తున్నారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘బోళా శంకర్’. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా, ఆయనకు చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘బోళా శంకర్’లోని చిరంజీవి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతదర్శకుడు. ఏప్రిల్ 14న ‘బోళా శంకర్’ని విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు పండగ రోజున ‘నేను ప్యార్‌లోన పాగలే..’ అంటూ ‘రావణాసుర’ చిత్రం కోసం పాట పాడారు రవితేజ. పబ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, స్వయంగా రవితేజ పాడటం విశేషం. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా, హీరో సుశాంత్ కీ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇక సంక్రాంతికి థియేటర్స్‌లోకి వస్తానన్న విషయాన్ని శివరాత్రి రోజున వెల్లడించారు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలి సిందే. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీ రోల్స్ చేస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. అలాగే శివరాత్రి రోజునే ‘రామబాణం’ ఫస్ట్ లుక్‌ను వదిలారు గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత మూడోసారి హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రామబాణం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, ఖుష్బూ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో రిలీజ్ కానుంది. ఇక త్వరలోనే మ్యూజిక్ బ్లాస్ట్ ఉంటుందంటున్నారు ‘ఏజెంట్’. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఏజెంట్’. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ప్రముఖ హీరో మమ్ముట్టి ఓ కీ రోల్ చేస్తున్నారు. కాగా ‘ఏజెంట్’ ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు మేకర్స్. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఇవే కాదు.. అల్లరి నరేశ్ ‘ఉగ్రం’, సాయిధరమ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’తో పాటు మరికొన్ని చిత్రబృందాలు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. -
గర్‌ఫ్రెండ్ వదిలేసింది.. పిచ్చోడినయ్యాను : హీరో
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇందులో సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన మూవీ టీం తాజాగా ఒక సాంగ్ ప్రోమోను వదిలారు.'నేను ప్యార్ లోన పాగలే .. లోకల్ బాబా సెహగలే అంటూ పాట సాగుతుంది. ఈనెల 18న పూర్తి సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ధమాకా, వాల్తేరు వీరయ్య విజయాలతో దూసుకుపోతున్న రవితేజ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రవితేజ నెగిటివ్ షేడ్స్‌తో కనిపించనుండటం మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇందులో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్,దక్ష నగార్కర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. -
రవితేజ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. మరో క్రేజీ అప్డేట్
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ను రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకి విడదుల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఆ అప్డేట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. కాగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో అదరగొడుతున్న రవితేజ వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత వస్తున్న చిత్రమిది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. #Ravanasura Update Tomorrow 10.08 a.m stay tuned ❤️❤️❤️ — ABHISHEK PICTURES (@AbhishekPicture) February 12, 2023 -
'ధమాకా' నుంచి దండకడియాల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందించారు.కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్‌హిట్‌గా నిలిచాయి. తాజగా ఈ చిత్రం నుంచి 'దండకడియాల్ .. దస్తి రుమాల్' సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైంది. రవితేజ, శ్రీలీల మాస్ స్టెప్పులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. గత నెల22న ఓటీటీలోకి వచ్చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. -
రవితేజ, నాని, విశ్వక్ చెయ్యి పడితే అంతే మరి
-
చాలా అందమైన సినిమా: రష్మిక ప్రశంసల వర్షం
విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాన్. యూట్యూబ్ యాక్టర్‌గా కెరీర్‌ని ఆరంభించి.. కలర్ ఫోటోతో హీరో అయ్యాడు. ఈ తర్వాత ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ లో మెప్పించాడు. ఇక ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన సుహాస్ మూవీని పలువురు సినీతారలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరిపోయింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని ట్వీట్ చేసింది పుష్ప భామ. రష్మిక తన ట్విటర్లో రాస్తూ.. ' మీరు చాలా అందమైన సినిమా తీశారు. మీ చిత్రబృందాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న మీకు ప్రత్యేక అభినందనలు. ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి వెళ్లి ఈ చిత్రాన్ని చూస్తారని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. మహిళల కోసం ప్రత్యేకంగా ఈనెల 8న ఉచిత షోలు ఏర్పాటు చేసినట్లు రైటర్ పద్మభూషణ్ చిత్రబృందం ప్రకటించింది. మాస్ మహారాజా రవితేజ సైతం రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని కొనియాడారు. సుహాస్ నటన అద్భుతంగా ఉందని.. ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశానని తెలిపారు. క్లైమాక్స్ హృదయానికి హత్తుకునేలా ఉందని ప్రశంసించారు రవితేజ. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరో హీరో నవీన్ పోలిశెట్టి సైతం రైటర్ పద్మభూషణ్ చిత్రబృందాన్ని అభిందిస్తూ ట్వీట్ చేశారు. You guys have made such a beautiful film..@SharathWhat @anuragmayreddy and @ActorSuhas Dear comrade to now- so so proud! ❤️Congratulations on this huge success you guys🤗🤗❤️ I hope all of you go give it a watch.. highly recommended for u my beautiful ladies❤️ and guess what.👇🏻 pic.twitter.com/t7NtOdO7ls — Rashmika Mandanna (@iamRashmika) February 7, 2023 What a performance by @ActorSuhas.Thoroughly enjoyed watching #WriterPadmabhushan. The climax is heart of the film❤️ Absolutely loved it. A must watch for all. Kudos to @anuragmayreddy @SharathWhat, director @prasanthshanmuk & young team for pulling off such a refreshing film — Ravi Teja (@RaviTeja_offl) February 7, 2023 So happy to see the response to #WriterPadmabhushan . The team deserves all the love. Go watch the film with your families if you haven’t yet. Congrats Agent Bobby @ActorSuhas . And super happy for my brothers @SharathWhat @anuragmayreddy ❤️ — Naveen Polishetty (@NaveenPolishety) February 7, 2023 -
అఫీషియల్: వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్ డేట్ అవుట్
మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అసలు కథేంటంటే.. వైజాగ్‌లోని జాలరిపేటకు చెందిన వీరయ్య(చిరంజీవి) పోర్ట్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు. సముద్రంలో అణువణువు తెలిసిన అతను.. అవసరం అయినప్పుడు నేవీ అధికారులకు సైతం సహాయం చేస్తుంటాడు. వీరయ్య వీరత్వం గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్‌కు కారణమైన డ్రగ్ డీలర్ సాల్మన్ సీజర్( బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరతాడు. దీని కోసం రూ.25 లక్షలతో డీల్ కూడా కుదుర్చుకుంటాడు. అలా మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్‌ని అట్టి పెట్టుకొని అతని అనయ్య మైఖేల్ సీజర్ అలియాస్ కాలా(ప్రకాశ్ రాజ్)కు ఎర వేస్తాడు. అసలు మైఖేల్ సీజర్కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచమైన అదితి(శ్రుతిహాసన్) ఎవరు? వీరయ్య సవతి సోదరుడైన ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) గతమేంటి? డ్రగ్స్ కేసుకు వీరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు మైఖేల్‌ను ఇండియాకు తీసుకొచ్చి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) In front there is Mega Force festival! Waltair Veerayya is coming to Netflix on 27th Feb and we can't keep calm🔥🔥🔥 pic.twitter.com/MD0FDSREtB — Netflix India South (@Netflix_INSouth) February 7, 2023 -
పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరంటే!
మాస్ మహారాజ రవితేజ ‘నేనింతే’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ముంబై బ్యూటీ శియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. అయితే హీరోయిన్గా మాత్రం ఎక్కువ కాలం రాణించలేకపోయింది. నేనింతే తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆమెకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. చదవండి: ఓర్వలేక నా బిజినెస్‌పై కుట్ర చేస్తున్నారు.. ఇది పెయిడ్ బ్యాచ్ పనే: కిరాక్ ఆర్పీ వేదం చిత్రంలో మనోజ్ భాజ్‌పాయి భార్యగా నటించిన ఆమె ఆ తర్వాత తెలుగులో కనిపించనే లేదు. ఆ తర్వాత కన్నడ మూవీ డబుల్ డెక్కర్‌లో నటించిన ఆమె హిందీలో రణ్‌బీర కపూర్ సంజూ సినిమాతో అదృష్టం పరీక్షించుకుంది. అయినా అక్కడ కూడా ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. సంజూ మూవీ మంచి హిట్ అయినప్పటికీ శియాకు మాత్రం అవకాశాలు రాలేదు. దీంతో నటనకు కాస్తా బ్రేక్ ఇచ్చిన ఆమె ఇటీవల వచ్చిన గోపిచంద్ పక్కా కమర్షియల్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. చదవండి: వచ్చే వారం ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తున్న శియ తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. తన హల్దీ, సింగీత్, పెళ్లి వేడుకులకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఆమెకు సినీ సెలబ్రెటీలు, ఫాలోవర్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. శియ భర్త పేరు నిఖిల్ పాల్కేవాలా. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఇక శియా పెళ్లి వేడుకలో నటి ప్రియమణి తన భర్తతో కలిసి హాజరైంది. ప్రియమణితో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు శియా పెళ్లిలో సందడి చేశారు. View this post on Instagram A post shared by Karan Sampat (@karansampat87) -
మాస్ మహారాజ రవితేజ ఇల్లు ఎన్ని కోట్లో తెలుసా?
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంశక్తితో ఎదిగిన హీరోల్లో రవితేజ ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. తాజాగా రవితేజ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నటుడు కమల్. 'సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో నేను హీరోగా మారా. అప్పటికి రవితేజ ఇంకా హీరో అవలేదు. ఇప్పుడెంత ఎనర్జీగా ఉండేవాడో అప్పుడు కూడా అంతే ఎనర్జీతో ఉండేవాడు. కాకపోతే కొద్దిగా లావుగా ఉండేవాడు. కానీ రవితేజ ఎంతో కష్టపడి తనను తాను మలుచుకుని ఇప్పుడున్న యంగ్ హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. 365 రోజులూ ఆయన ఎక్సర్సైజ్ చేస్తాడు. ఈ మధ్యే ఆయన్ని కలిశాను. హైదరాబాద్‌లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలనుకుని వచ్చాను. ఆ తర్వాత వచ్చిందంతా బోనస్ అని నాతో చెప్పాడు. అలాంటి రవితేజ ఈరోజు రూ.12 కోట్లు ఖరీదు చేసే ఇంట్లో ఉంటున్నాడు' అని చెప్పాడు. కృష్ణవంశీ గారి డైరెక్షన్లో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాకు రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్. ఆ సినిమాలో హీరోయిన్ను ఏడిపించే చిన్న సీన్లో రవితేజ నటించాడు. ఈ రోజు మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్నాడు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు అంటూ తన స్నేహితుడిపై ప్రశంసలు కురిపించాడు కమల్. చదవండి: వసూళ్ల వర్షం కురిపిస్తున్న పఠాన్ జమున చాలా పొగరుబోతు, ఇంట్లోకి కూడా రానివ్వదు -
మాస్ మహారాజా బర్త్‌డే సర్ప్రైజ్.. రావణాసుర ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది
మాస్ మహారాజ రవితేజ పుట్టిన నేడు. జనవరి 26 ఆయన బర్త్‌డే సందర్భంగా మాస్ మాహారాజా తదుపరి చిత్రం రావణాసుర నుంచి ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ వదిలారు మేకర్స్. రవితేజ నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలు మంచి విజయం సాధించాయి. అదే జోష్‌లో తన తదుపరి చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు సుధీర్ వర్మతో రావణాసుర మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. రవితేజ బర్త్‌డే కానుకగా ఈ రోజు రావణాసుర మూవీ తాజా పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. వీడియో చూస్తుంటే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. చదవండి: కాబోయే భార్యను పరిచయం చేసిన శర్వానంద్.. ఫోటోలు వైరల్ ఓ భవంతిలో యువతిని చంపగా.. బ్లాక్ సూట్ ధరించిన రవితేజ లోపలి నుంచి బయటకు వచ్చి సిగార్ వెలిగించి వీడియో ఆసక్తికరంగా ఉంది. సుశాంత్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ నటిస్తున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
చిరంజీవి-రవితేజల బాండింగ్.. దేవుణ్ని అదే కోరుకుంటానంటూ చిరు ట్వీట్
మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది అభిమానులున్నారు. ఆయనను స్ఫూర్తిగానే తీసుకొనే ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో రవితేజ కూడా ఒకరు. చిరులాగే స్వయంకృషితో పైకి వచ్చిన రవితేజ కెరీర్లో ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ చూశారు. అయినా సరే, సరికొత్త కంటెంట్‌తో దూసుకుపోతున్నారు. ధమాకాతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ రీసెంట్గా వాల్తేరు వీరయ్యతోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక తెరపైనే కాకుండా ఆఫ్ స్క్రీన్లూ చిరంజీవి, రవితేజకు మంచి బాండింగ్ ఉంది. ఇటీవలె వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లోనూ ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా కనిపించారు. నేడు(జనవరి26)న రవితేజ బర్త్‌డే సందర్భంగా చిరు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. 'నా తమ్ముడు రవితేజకి జన్మదిన శుభాకాంక్షలు. హాయిగా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా దీవించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను' అంటూ చిరు ట్వీట్ చేశారు. నా తమ్ముడు రవితేజ @RaviTeja_offl కి జన్మదిన శుభాకాంక్షలు. హాయిగా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా దీవించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. pic.twitter.com/QmH0cAwg12 — Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2023 -
కోట్లాది మంది ప్రేక్షకుల ఆకాంక్షలు ఫలించాలి: మెగాస్టార్
టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌కు నామినేట్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. టాలీవుడ్ సినిమా వైభవాన్ని చాటేందుకు ఇక ఒక అడుగు దూరమే ఉన్నామని అన్నారు. కోట్లాది మంది ప్రేక్షకుల ఆకాంక్ష, ప్రార్థనలు మార్చి 12న ఫలించాలని మెగాస్టా చిరంజీవి ఆకాంక్షించారు. ONE STEP AWAY FROM THE PINNACLE OF CINEMATIC GLORY !!! 🎉🔥🎉👏👏 Heartiest Congrats on THE Oscar Nomination for Best Original Song @mmkeeravaani garu & the visionary @ssrajamouli and the Entire Team behind #NaatuNaatu & @RRRMovie — Chiranjeevi Konidela (@KChiruTweets) January 24, 2023 గర్వంగా ఉంది: ఎన్టీఆర్ అంతే కాకుండా చిత్రబృంద సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. నాటు నాటు పాట మరో ఘనత సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకులు కీరవాణి, రచయిత చంద్రబోస్ లకు నా అభినందనలు తెలిపారు. Congratulations @MMKeeravaani Garu and @boselyricist Garu on achieving another well-deserved and monumental feat... This song will forever hold a special place in my heart.@ssrajamouli @alwaysramcharan #RRRMovie #NaatuNaatu #Oscars95 pic.twitter.com/YYmtD0kVou — Jr NTR (@tarak9999) January 24, 2023 గౌరవంగా భావిస్తున్నా: రామ్ చరణ్ నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ కావడం పట్ల నిజంగా గౌరవంగా భావిస్తున్నానని మెగా హీరో రామ్ చరణ్ అన్నారు. మన దేశానికి ఇది గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీరవాణి, ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. What brilliant news! Truly an honour to see “Naatu Naatu” nominated for the Oscars. Another very proud moment for us & India. Well deserved @MMKeeravaani Garu, @SSRajamouli Garu, my brother @tarak9999 and the entire team of #RRR🙏 All love ❤️ — Ram Charan (@AlwaysRamCharan) January 24, 2023 చిత్ర బృందానికి అభినందనలు: కీరవాణి నాటునాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై సంగీత దర్శకుడు కీరవాణి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. Congratulations to my team !! Big hugs to all 🤗 pic.twitter.com/S8g6v1Ubyv — mmkeeravaani (@mmkeeravaani) January 24, 2023 ఆనందంగా ఉంది: ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నాటు నాటు పాట ఆస్కార అర్హత సాధించడం ఆనందంగా ఉందని ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా వల్లే నా పాట ఆస్కార్ వరకు చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. దర్శకులు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాలబైరవకు కృతజ్ఞతలు తెలిపారు. నాటు నాటును ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటునాటు పాటకు డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. ఇదొక అద్భుతం: వెంకటేశ్ నాటునాటు ఆస్కార్‌కు నామినేట్ కావడం అద్భుతమని హీరో వెంకటేశ్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా సిగలో మరో కలికితురాయి చేరిందన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి నా అభినందనలు తెలిపారు. చిత్రబృందానికి అభినందనలు: బాలకృష్ణ నాటు నాటు ఆస్కార్‌కు నామినేట్ కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్‌కు ఎంపిక కావడం పట్ల ఆర్ఆర్ఆర్, ఆల్ దట్ బ్రీత్స్, ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్ర బృందాలకు కూడా అభినందనలు తెలిపారు. భారతీయ సినిమా ప్రకాశిస్తోంది: రక్షిత్ శెట్టి భారతీయ సినిమా గర్వించదగిన క్షణామని బాలీవుడ్ నటుడు రక్షిత్ శెట్టి అన్నారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా ప్రకాశిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు తెలిపారు. నాటు దెబ్బ డైరెక్ట్‌గా ఆస్కార్కేః రవితేజ కీరవాణి గారు స్క్రీన్ మీద తారక్, చరణ్‌తోపాటు ప్రపంచం మొత్తాన్ని నాటునాటు డ్యాన్స్ వేసేలా చేశారని రవితేజ వేపించారు. నాటునాటు పాటలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. -
ధమాకాలో దుమ్మురేపిన పల్సర్ బైక్ సాంగ్ వచ్చేసింది..
మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటించింది. పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్మరేపింది. ఇక ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అందులో పల్సర్ బైక్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రవితేజ, శ్రీలీల మాస్ డ్యాన్స్‌తో ఇరగదీశారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. -
రవితేజ 'రావణాసుర' గ్లింప్స్ రిలీజ్‌కు రెడీ.. ఎప్పుడంటే
మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్స్‌తో జోరు మీదున్న రవితేజ తర్వాతి ప్రాజెక్ట్‌ల అప్డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో జనవరి26న ఆయన బర్త్‌డే సందర్భంగా రావణాసుర గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్ష నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ మెయిన్ లీడ్స్‌లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానుంది. Get ready for a special treat on MASS MAHARAJA @RaviTeja_offl birthday😎 A Glimpse of #Ravanasura On JAN 26th 2023 🔥 Stay Tuned ❤️🔥@iamSushanthA @sudheerkvarma @RTTeamWorks @SrikanthVissa @rameemusic #BheemsCeciroleo @RavanasuraMovie @AbhishekPicture pic.twitter.com/fWD6gBhOHX — RT Team Works (@RTTeamWorks) January 24, 2023 -
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ 'ధమాకా'
మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. విడుదలైన కొద్ది రోజుల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రవితేజ ఎనర్జీ, శ్రీలీల డ్యాన్స్ ప్రేక్షకులకు కట్టి పడేశాయి. తాజాగా ఈ చిత్రం ఇవాల్టి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. కాగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిటిటల్ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈరోజు నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో థియేటర్లలో చూడడం మిస్సయినా వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
ఖాకీ డ్రెస్ వేస్తే చాలు.. రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే!
మాస్ రాజా ఎన్ని క్యారెక్టర్స్ లో కనిపించినా రాని కిక్, ఒక్క పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తే ఇట్టే వచ్చేస్తుంది.రవితేజ ఎప్పుడు ఖాకీలో కనిపించినా సరే.. టాలీవుడ్ ఒక బ్లాక్ బస్టర్‌ను అందుకుంటోంది. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీలో అదే క్యారెక్టర్ రిపీటైనా రిజల్ట్ మాత్రం మారలేదు. వాల్తేరు వీరయ్యలో ఏసీపీ విక్రమ్ సాగర్ క్యారెక్టర్‌ను టెర్రిఫిక్‌గా చేశాడు మాస్ రాజా. అలా పోలీస్ క్యారెక్టర్ పవర్ చూపించాడు. బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య పేరు మాత్రమే వినిపించడం లేదు, ఇదే సినిమాలో విక్రమ్ సాగర్ పాత్ర చేసిన వీరయ్య తమ్ముడి పేరు కూడా బాగా వినిపిస్తోంది. సెకండాఫ్‌లో వచ్చే ఈ క్యారెక్టర్‌ను చిరు ఎంత ప్రేమించాడో థియేటర్స్‌లో ఆడియెన్స్ కూడా అంతే ప్రేమిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా అంతా ఒక ఎత్తు.. చిరు, రవితేజ బాండింగ్ మరో ఎత్తు. అందుకే ఈ సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. మెగాస్టార్, మాస్ రాజా బాండింగ్‌తో పాటు, రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. విక్రమార్కుడులో రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ మాస్ రాజా ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. నాటి నుంచి నేటి వరకు రవితేజ ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ రోల్ చేసినా అదే యాంగర్ మెయింటైన్ చేస్తున్నాడు. పోలీస్ క్యారెక్టర్లో తనదైన పవర్ చూపిస్తున్నాడు.రెండేళ్ల క్రితం ఇదే సంక్రాంతి సీజన్లో క్రాక్‌లో రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ కరోనా టైమ్‌లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. రవితేజను పోలీస్ లుక్‌లో చూస్తే అభిమానులు కూడా అస్సలు ఆగలేరు. చదవండి: ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది: దిల్ రాజు -
Waltair Veeraya: మూడు రోజుల్లో వందకోట్లు, రికార్డులు లోడింగ్..
బాస్ వచ్చాడు.. బాక్సాఫీస్ బద్ధలు కొడుతున్నాడు. పూనకాలు లోడింగ్ కాదు.. రికార్డులు హంటిగ్ అన్నట్లుగా కలెక్షన్ల వేట మొదలుపెట్టాడు. ముచ్చటగా మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేశాడు మెగాస్టార్ చిరంజీవి. రికార్డుల్లో నా పేరుండటం కాదు, నా పేరు మీదే రికార్డులు ఉంటాయన్న మాటను అక్షరాలా నిజం చేస్తున్నాడు. చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. టైటిల్‌కు తగ్గట్టుగా మాస్ కంటెంట్‌తో అభిమానులను తెగ అలరిస్తోంది. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించడంతో సినిమా మరింత సూపర్ హిట్టయింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైన వాల్తేరు వీరయ్య ఇతర స్టార్ హీరోల సినిమాలకు గట్టి పోటీనిస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్లు రాబట్టిందీ చిత్రం. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. #WaltairVeerayya takes over the Box Office like BOSS 😎🔥 108 Crores Gross in 3 days for MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya 🔥💥 - https://t.co/KjX8J7HFFi MEGA⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP #ArthurAWilson @SonyMusicSouth pic.twitter.com/n8PszOFt5u — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2023 చదవండి: వారం కాకముందే సెంచరీ కొట్టిన వారిసు మరో అవార్డు దక్కించుకున్న నాటు నాటు, ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్