Ravi Teja wraps up Ravanasura shoot, film to release on this date - Sakshi
Sakshi News home page

Raviteja : రిలీజ్‌కు రెడీ అవుతున్న రవితేజ 'రావణాసుర'

Published Mon, Feb 27 2023 2:55 PM | Last Updated on Mon, Feb 27 2023 3:41 PM

Raviteja Wraps Up Ravanasura Shoot Film To Release This Date - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రావరణాసుర. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హీరో సుశాంత్‌ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ నెగిటివ్‌ షేడ్స్‌లో కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే షరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ తాజాగా పూర్తయ్యింది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌7న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement