Pyaar Lona Paagal Song Promo Released From Ravanasura - Sakshi
Sakshi News home page

గర్‌ఫ్రెండ్‌ వదిలేసింది.. పిచ్చోడినయ్యాను : హీరో

Published Thu, Feb 16 2023 6:03 PM | Last Updated on Thu, Feb 16 2023 6:42 PM

Pyaar Lona Song Promo From Ravanasura Released - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా రావణాసుర. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇందులో సుశాంత్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్‌7న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్‌ ప్రారంభించిన మూవీ టీం తాజాగా  ఒక సాంగ్ ప్రోమోను వదిలారు.'నేను ప్యార్ లోన పాగలే .. లోకల్ బాబా సెహగలే అంటూ పాట సాగుతుంది. ఈనెల 18న పూర్తి సాంగ్‌ను విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ధమాకా, వాల్తేరు వీరయ్య విజయాలతో దూసుకుపోతున్న రవితేజ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రవితేజ నెగిటివ్‌ షేడ్స్‌తో కనిపించనుండటం మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇందులో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్,దక్ష నగార్కర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement