Ravanasura
-
రామాయణం కోసం 'యష్' దిమ్మతిరిగే రెమ్యూనరేషన్
-
అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?
సమ్మర్ పేరు చెప్పగానే పిల్లలకు సెలవులు గుర్తొస్తాయి. వయసైన పెద్దోళ్లకు టూర్స్ గుర్తొస్తాయి. అదే మూవీ లవర్స్‌కు మాత్రం కొత్త సినిమాలే గుర్తొస్తాయి. ఏ వారం ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా? దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ ఎదురుచూసేవాళ్లు. గత కొన్నేళ్లుగా వేసవికి తెలుగు బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. ఈసారి మాత్రం సందడి, హడావుడి ఏం లేకుండానే గడిచిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకనిర్మాతలు.. సంక్రాంతి, సమ్మర్, దసరా పండగ లాంటి వాటిని టార్గెట్ చేసుకుని మూవీస్ తీస్తుంటారు. ఈసారి సంక్రాంతికి చిరు-బాలయ్య హిట్స్ కొట్టేశారు. మార్చి చివర్లో నాని కూడా హిట్ కొట్టేశాడు. పాన్ ఇండియా చిత్రాలతో పెద్ద హీరోలందరూ బిజీ అయిపోవడంతో వాళ్లెవరివీ ఈసారి సమ్మర్ కు రిలీజ్ కాలేదు. ఇది మీడియం రేంజ్ హీరోలకు వరమైంది. కానీ దాన్ని వాళ్లు సరిగా వినియోగించుకోలేకపోయారు. (ఇదీ చదవండి: ఒక్క యాడ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌కు అన్ని కోట్లా?) ఏప్రిల్ నెలని తీసుకుంటే.. తొలివారంలో రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' మూవీతో థియేటర్లలోకి వచ్చారు. ఈ రెండు కూడా తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని, ప్రేక్షకుల డిసప్పాయింట్ చేశాయి. రెండోవారం సమంత 'శాకుంతలం' వచ్చింది. ట్రైలర్ కాస్త అటుఇటుగా ఉండటంతో అందరూ డౌట్ పడ్డారు. కరెక్ట్ గా అదే జరిగింది. ప్రీమియర్ షోలకే అసలు విషయం తెలిసిపోయింది. సామ్ కెరీర్ లోనే ఘోరమైన ఫ్లాప్ గా ఇది నిలిచింది. మూడో వారం వచ్చిన 'విరూపాక్ష'.. ఎవరూ కనీసం ఎక్స్ పెక్ట్ చేయనంత హిట్ అయిపోయింది. పూర్తిస్థాయి హారర్ కాన్సెప్ట్ కావడం 'విరూపాక్ష'కు చాలా ప్లస్ అయింది. స్టోరీకి సుకుమార్ తనదైన శైలిలో టచ్ ఇచ్చేసరికి.. ఈ సినిమా జనాలకు తెగ నచ్చేసింది. లాంగ్ రన్ లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. చివరి వారంలో వచ్చిన అఖిల్ 'ఏజెంట్'పై రిలీజ్ కి ముందు కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మార్నింగ్ షోకే రిజల్ట్ తేలిపోయింది. బొమ్మ ఫట్ అయిపోయింది. ఇలా ఏప్రిల్ మొత్తమ్మీద టాలీవుడ్ కి ఒక్కటంటే ఒక్కటే హిట్ దక్కింది. (ఇదీ చదవండి: టిఫిన్ సెంటర్‌కు స్టార్ హీరోయిన్.. ఎవరూ గుర్తుపట్టలేదు!) మే నెలని తీసుకుంటే.. తొలివారం గోపీచంద్ 'రామబాణం', అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమాలతో వచ్చారు. వీటిలో 'రామబాణం' ఫట్ మని బుడగలా పేలిపోయింది. 'ఉగ్రం' పర్వాలేదనిపించింది. కానీ పెద్దగా జనాలు తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. రెండో వారం వచ్చిన 'కస్టడీ'పై అక్కినేని ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ చైతూ వాళ్లని పూర్తిగా నిరాశపరిచాడు. నీరసమైన స్టోరీ లైన్ వల్ల చూసిన ప్రతిఒక్కరూ డిసప్పాయింట్ అయ్యారు. ఈ మూవీని ఫ్లాప్ గా డిక్లేర్ చేశారు. మూడో వారంలో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' చాలా అంటే చాలా నిరాశపరిచింది. మే చివరి వారంలో వచ్చిన 'మేమ్ ఫేమస్'కి కూడా సేమ్ రిజల్ట్. ఇలా ఎంతో సందడిగా ఉంటుందనుకున్న సమ్మర్.. ఎప్పుడూ లేనంత నీరసంగా సాగింది. 'బిచ్చగాడు 2' , 2018 లాంటి ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు.. ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశాయి గానీ మూవీ లవర్స్ ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' పైనే ఉన్నాయి. మరి రామయణం ఆధారంగా తీసిన ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో ఏమో? (ఇదీ చదవండి: సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు: పంచ్ ప్రసాద్) -
రావణ చరిత్ర కోసం చిరంజీవిని కలుస్తాం: భరద్వాజ
సౌద అరుణ స్టూడియోస్ పతాకంపై డ్రవిడ భూమి యొక్క ఆత్మ గౌరవ నినాదంతో 'కోడ్ రామాయణ' రానుంది. పాపులర్ రైటర్ సౌద అరుణ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బౌద్ధ బిక్షువు బంతె షీల్ రక్షిత్, ప్రముఖ రచయిత్రి లలిత చేతుల మీదుగా పోస్టర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. (ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్ చివరి సినిమా ఇదేనా?) దూర్వాసుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ.. కోడ్ రామాయణ ద్వారా దాని అంతరార్థం మాత్రం తెలుస్తుందన్నారు. దీని తరువాత వచ్చే రెండవ భాగం 'రావణచరిత్ర' మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుంది. దాంట్లో రావణ పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఆ తరువాత మూడవ భాగం 'ఉత్తర రామాయణం' ఉంటుంది. ఇలా మూడు భాగాలుగా చెపుతూ.. డ్రవిడ భూమి ఆత్మ గౌరవం గురించి ఈ సినిమాలు తెలుపుతాయి. డ్రవిడ భూమి ఏ కారణాల చేత గుర్తింపు లేకుండా పోయిందో తెలపడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని భరద్వాజ అన్నారు. ప్రముఖ దర్శకుడు సౌద రచించిన ఈ పౌరాణిక అధ్యయనాన్ని ఇప్పుడు దృశ్య రూపకంగా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ సినిమా రిలీజ్ కాగానే మెగాస్టార్ చిరంజీవికి చూపించి... రెండోవ భాగంలో వచ్చే 'రావణచరిత్ర'లోని రావణాసుర పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తామని భరద్వాజ తెలిపారు. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర, ఎక్కడంటే?
మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా కథానాయికలుగా నటించారు. అక్కినేని సుశాంత్ ముఖ్య పాత్రలో నటించాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, రవితేజ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్‌లో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మొదట ఈ మూవీ మే మొదటివారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపించింది. కానీ తాజాగా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. సినిమా రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి రావడంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఏదేమైనా మరోసారి రావణాసుర చూసే ఛాన్స్ దొరికిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు హర్షవర్దన్ రామేవ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. #Ravanasura Now Streaming On #AmazonPrimeVideo #RavanasuraOnPrime@RaviTeja_offl @iamSushanthA@sudheerkvarma @AbhishekPicture @RTTeamWorks #RaviTeja #AnuEmmanuel #MeghaAkash #FariaAbdullah #dakshanagarkar pic.twitter.com/bQknxOF5wC — Telugu Television News (@TeluguTvExpress) April 28, 2023 చదవండి: ఫిలింఫేర్ అవార్డ్స్: ఆ సినిమాకు ఏకంగా 10 అవార్డులు -
ఓటీటీకి రవితేజ 'రావణాసుర'.. వారం రోజులు ముందుగానే!
మాస్ మాహారాజా రవితేజ నటించిన రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా సహా ఐదుగురు హీరోయిన్స్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడుతున్నప్పటికీ.. మూవీకి మాత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చింది. మాస్ ఫ్యాన్స్ ఊహించినంతగా రావణాసుర మెప్పించలేదు. అయితే రావణాసుర చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. కానీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించకపోవడంతో అనుకున్న సమయం కంటే ముందుగానే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మే నెల మొదటివారంలోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రవితేజ ధమాకా సక్సెస్ తర్వాత ఈ సినిమా కూడా ఆ స్థాయిలో ఉంటుందని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. థియేటర్లలో చూడనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
మాస్ మహరాజ్ అరాచకం..
-
Ravanasura OTT: రవితేజ 'రావణాసుర' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా సహా ఐదుగురు హీరోయిన్స్ నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా విడుదలైన తొలిరోజే ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వివరాలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రావణాసుర ఓటీటీ పార్ట్నర్కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకుంది. అయితే థియేటర్స్‌లో విడుదలైన 50రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. -
ఒక్కొక్క సీన్‌కి నరాలు తెగిపోతున్నాయి..రావణాసుర మూవీ రివ్వూ
-
రావణాసుర మూవీ పబ్లిక్ టాక్
-
Ravanasura Review: ‘రావణాసుర’ మూవీ రివ్యూ
టైటిల్: రావణాసుర నటీనటులు: రవితేజ, సుశాంత్, జయరామ్, శ్రీరామ్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాశ్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేశ్, సంపత్ రాజ్ తదితరులు నిర్మాణ సంస్థ:అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ నిర్మాతలు : అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా దర్శకత్వం: సుధీర్ వర్మ సంగీతం: హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తిక్ కన్నన్ ఎడిటర్ : శ్రీకాంత్ విడుదల తేది: ఏప్రిల్ 7, 2023 మాస్ మహారాజా రవితేజ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ‘ధమాకా’తో సాలీడ్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా రవితేజను ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేర్చింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే చిరంజీవితో కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’తో ఓ భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘రావణాసుర’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘రావణాసుర’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రవీంద్ర అలియాస్ రవి(రవితేజ) ఓ జూనియర్ లాయర్. క్రిమినల్ లాయర్ కనకమహాలక్ష్మీ(ఫరియా అబ్దుల్లా)దగ్గర పనిచేస్తుంటాడు. ఓ పెద్ద ఫార్మా కంపెనీ సీఈఓ హారిక(మేఘ ఆకాశ్) తన తండ్రి విజయ్ తల్వార్(సంపత్‌రాజ్) ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడని, ఆ కేసుని టేకాప్ చేయమని కనకమహాలక్ష్మీ దగ్గరకు వస్తుంది. రవీంద్ర బలవంతం చేయడంతో కనకమహాలక్ష్మీ ఆ కేసును టేకాప్ చేస్తుంది. అయితే ఆ మర్డన్ తాను చేయలేదని విజయ్ తల్వార్ చెబుతాడు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే.. నగరంలో అదే తరహా హత్యలు జరుగుతుంటాయి. చనిపోయినవారంతా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కావడంతో.. ఏసీపీ హన్మంతరావు(జయరామ్) ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారిస్తాడు. ఈ క్రమంలో సాకేత్(సుశాంత్) గురించి తెలుస్తుంది. అలాగే ఈ హత్యలకు క్రిమినల్ లాయర్ రవీంద్రకు సంబంధం ఉందని గుర్తిస్తారు. అసలు సాకేత్ ఎవరు? వరుస హత్యల వెనుక ఉన్నదెవరు? ఈ హత్యలకు క్రిమినల్ లాయర్ రవీంద్రకు ఉన్న సంబంధం ఏంటి? హోంమంత్రి ముదిరెడ్డి(రావు రమేశ్)ని హత్య చేయాలని కుట్ర చేసిందెవరు? ఏ ప్రయోజనాల కోసం ఈ హత్యలు జరిగాయి? తనపై వచ్చిన ఆరోపణల నుంచి రవీంద్ర ఎలా తప్పించుకున్నాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 'వాడు క్రిమినల్ లాయర్ కాదు... లా చదివిన క్రిమినల్’ ఓ సందర్భంలో హీరో గురించి పోలీసు అధికారి చెప్పే డైలాగ్ ఇది. ఈ ఒక్క డైలాగ్ చాలు ‘రావణాసుర’ కథ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వరుస హత్యలు.. దాని వెనక హీరో ఉన్నాడని గుర్తించడం..‘లా’లోని లాజిక్కులను వాడుకొని ఆ హీరో ఎస్కేప్ అయ్యేలా ప్లాన్ చేయడం.. ఇదే రావణాసుర కథ. అయితే ఆ హత్యలు ఎందుకు చేస్తున్నారు? అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ క్యూరియాసిటీని ఫస్టాఫ్ మొత్తం కొనసాగించాడు డైరెక్టర్. కానీ సెకండాఫ్‌లో రీజన్ ఏంటో తెలిశాక..ఇప్పటికే ఈ తరహా కథలను చాలా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో థ్రిల్లింగ్స్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్నప్పటికీ కథనం ఆసక్తిగా సాగదు. హైపర్ ఆదితో రవితేజ వేసే పంచ్‌లు, లవ్‌ట్రాక్ అన్ని రొటీన్‌గా అనిపిస్తాయి. సుశాంత్ పాత్ర ఎంట్రీ తర్వాత క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. అయితే రవితేజ అద్భుతమైన నటన కారణంగా ఫస్టాఫ్ బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెంకడాఫ్‌లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. స్క్రీన్‌ప్లే కూడా రొటీన్‌గా ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ చాలానే తీసుకున్నారు. ఊహకందేలా కథనం సాగడం.. ట్వీస్టులు కూడా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ‘రావణాసుర’కి పెద్ద మైనస్. అయితే థ్రిల్లర్ సినిమాలు అంతగా చూడలి వారికి మాత్రం ఆ ట్విస్టులు అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే.. మాస్ మహారాజా ఎనర్జీ గురించి అందరికి తెలిసిందే. కామెడీ అయినా.. యాక్షన్ అయినా ఇరగదీస్తాడు. ఇందులో కొత్తగా తనలోని విలనిజాన్ని చూపించాడు. రెండు విభిన్నమైన కోణాలు ఉన్న రవీంద్ర పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్ సీన్ అయితే అదుర్స్. ఫస్టాఫ్‌లో తనదైన కామెడీతో నవ్వించాడు. సినిమాకు ప్రధాన బలం ఆయన నటన అనే చెప్పొచ్చు. ఇక ఇందులో ఫరియా, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాశ్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించినా.. ఏ ఒక్కరికి సరైన ప్రాధాన్యత లేదు. ఉన్నంతలో ఫరియా, మేఘ ఆకాశ్ పాత్రలు మెప్పిస్తాయి. ఇక అను ఇమ్మాన్యుయేల్ పాత్ర నిడివి అయితే మరీ తక్కువ. ఏసీపీ హన్మంతరావుగా జయరాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హైపర్ ఆది తనదైన పంచ్ డైలాగ్స్‌తో కామెడీ పండించాడు. హోంమంత్రిగా రావు రమేశ్ కేవలం రెండు, మూడు సీన్లకే పరిమితమయ్యారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. హర్షవర్దన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం బాగుంది. భీమ్స్ మ్యూజిక్ అందించిన 'డిక్కా డిష్యూం' పాట బాగుంది. రీమేక్ సాంగ్‌తో సహా మిగతా పాటలేవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ పని తీరు బాగుంది. నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా న్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Ravanasura Movie: ‘రావణాసుర’ట్విటర్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’.సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్ హీరోయిన్స్‌గా నటించారు. యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాలతో నేడు(ఏప్రిల్ 7) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రావణాసుర’ కథేంటి? ఎలా ఉంది? రవితేజ ఖాతాలో మరో హిట్ పడిందా? తదితర విషయాలను ట్విటర్లో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. Final review :-#Ravanasura is a full mass masala thriller movie. It's a treat for #RaviTeja fans and general audience who want to see @RaviTeja_offl in a never before role...💥💥 Positives:- Story, Interval ,BGM 🔥 Rating 4/5 👍👍 — MSD 🚁 (@Cskhearts) April 7, 2023 ‘రావణాసుర’ఫుల్ మసాల థ్రిల్లర్ మూవీ. రవితేజ ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్‌కి కూడా అలరిస్తుంది. రవితేజను గతంలో ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో చూస్తాం. స్టోరీ, ఇంటర్వెల్ సీన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ ఓ నెటిజన్ 4 స్టార్స్ ఇచ్చారు. Second half lo manchi twist lu 🔥 Climax BGM💥💥💥💥 As usual story ending avtundi Lawyer criminal aite ela untundo mana mass maharaj chupichadu Over all ga movie hit 🔥🔥🔥#Ravanasura #RaviTeja pic.twitter.com/If8CGZL9Cs — #MaheshBabu𓃵 (@pandugadu_01) April 6, 2023 సెకండాఫ్‌లో మంచి ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్, బీజీఎం బాగుంది. లాయర్ క్రిమినల్ అయితే ఎలా ఉంటుందో మన మాస్ మహారాజా చూపించాడు. ఓవరాల్‌గా సినిమా హిట్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. Whistles Won't Stop Still On the Trance .... @RaviTeja_offl carrer best performance Before Ravanasura After Ravanasura ❤️🔥Climax RAMP 💫Don't Believe Any Rumours Any Reviews. Just Waste Of Tym .. Mark My words. 3.75/5 🫰🫰🫰🫰 #Ravanasura pic.twitter.com/XqPofrr1Uk — 🔥MASS🔥CARD HERE... (@ERESHAM1) April 7, 2023 Ravansura movie Final review First half decent Interval block mind blowing Second half kcpd 🔥 Heroines role not impress But ravanna acting 🔥 Overall blockbuster movie ⭐ ⭐ ⭐/1/2 USA premiers rating#Ravanasura#RavanasuraOnApril7#RavanasuraReview#blockbusterRavanasura pic.twitter.com/jnKYIRTh2d — Raghavendra_official (@vallepuraghav) April 6, 2023 ఫస్ట్ హాఫ్ డీసెంట్. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ సూపర్. హీరోయిన్స్ రోల్స్ ఇంప్రెసివ్ గా లేవు. కానీ రవన్న(రవితేజ) యాక్టింగ్ అదిరిపోయింది. ఓవరాల్‌గా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ మూడున్నర స్టార్ ఇచ్చాడు ఓ నెటిజన్. #Ravanasura Ravi anna please ilanti mali cheyiodhu nippu, khiladi feels. Khiladi better anna. Neek failure ravali ani evaru anukoru nuvu matram disasters thisthavu😭 #Raviteja #RavanasuraReview pic.twitter.com/y1GskN6UoZ — Kranthi Kumar (@Kranthi87605525) April 7, 2023 రవితేజ అన్న ప్లీజ్ ఇలాంటి సినిమాలు చేయకు. నిప్పు, ఖిలాడీ చూసిన ఫీలింగ్ కలుగుతోంది. దీని కంటే ఖిలాడీ బెటర్. నీకు ఫెయిల్యూర్ రావాలని ఎవరూ అనుకోరు. కానీ నువ్వు మాత్రం డిజాస్టర్స్ తీస్తున్నావు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. #Ravanasura Below Average 1st Half! First half follows a regular template with boring screenplay until the pre-interval point in which the storyline starts to get interesting. Need a big 2nd half! — Venky Reviews (@venkyreviews) April 7, 2023 If you just want to kill time, it’s a onetime watch. Another good plotline wasted. Could have been a good to very good film, if it had few cuts in first 40 mins and taken care of few scenes in second half. #Ravansura #RavanasuraReview — Hello Mawa (@HelloMawa123) April 7, 2023 Decent first half 🔥🔥...Followed by mind blowing Interval Block 💥💥...Second half total fire in #Ravanasura character 🔥🔥🔥 Another blockbuster for Mass Maharaja @RaviTeja_offl 👏👏 — Mahesh (@Urkrishh) April 7, 2023 -
ప్రేక్షకులు థ్రిల్ అవుతారు
‘‘రావణాసుర’ మూవీలో నాది చాలా కీలకమైన పాత్ర. కామెడీ, ఇంటెన్స్.. ఇలా వేరియేషన్స్ ఉంటాయి. ఆ పాత్ర చేయడం సవాల్‌గా అనిపించింది’’ అని మేఘా ఆకాష్ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా నటించిన మేఘా ఆకాష్ మాట్లాడుతూ–‘‘రావణాసుర’లో నేను రిచ్, క్లాసీ అమ్మాయిగా కనిపిస్తాను. ఈ మూవీలో చాలా మలుపులు, ట్విస్ట్‌లు, సర్ప్రైజ్లు ఉన్నాయి. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. సుధీర్ వర్మగారు ఒక యాక్టర్‌కి చాలా కంఫర్ట్ జోన్ ఇస్తారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీతో ఒక సినిమా, మా అమ్మగారి సమర్పణలో ఓ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. -
రావణాసుర నుంచి లీకైన వీడియో, రవితేజ నోట అభ్యంతరకర డైలాగ్!
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో దక్షా నగార్కర్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు. రేపు(ఏప్రిల్ 7న) ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రావణాసుర నుంచి ఓ డైలాగ్ వీడియో లీకైంది. ఇందులో రవితేజ.. కంచం ముందుకి, మంచం మీదకి ఆడపిల్లలు పిలవంగనే రావాలి.. లేకపోతే నాకు మండుద్ది అని రాక్షసంగా డైలాగ్ చెప్పాడు. ఈ డైలాగ్ అభ్యంతరకరంగా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. రవితేజ ఫ్యాన్స్ మాత్రం.. రావణాసుర అంటే ఆ మాత్రం ఉంటుంది. నెగెటివ్ షేడ్‌కు తగ్గట్లు డైలాగ్ లేకపోతే ఎలా? అని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ డైలాగ్ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. -
రావణాసురుడి ముద్దుగుమ్మలు క్యూట్ ముచ్చట్లు
-
రవితేజ 'రావణాసుర' నుంచి థీమ్ సాంగ్ విడుదల
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దక్షా నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజితా పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రేపు(శుక్రవారం)ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు.రావణా రావణా..రావణా దశగ్రీవ .. రావణా అంటూ ఈ పాట సాగుతుంది. హర్షవర్ధన్ రామేశ్వరన్ సంగీతం అందించగా అరుణ్ కౌండిన్య ఆలపించారు. -
‘రావణాసుర’లో రవితేజను చూసి షాకవుతారు: అభిషేక్ నామా
‘ధ్రిల్లర్ జోనర్స్ లో షాకింగ్, వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ముందే ఆడియన్స్‌కి తెలిస్తే.. ఆ కిక్కు రాదు. ‘రావణాసుర’ థ్రిల్లర్ మూవీ. అందుకే ఆ సినిమా కథ గురించి బయటకు చెప్పడం లేదు. థియేటర్స్‌లో రవితేజ నటనను చూసి షాకవుతారు’ అని నిర్మాత అభిషేక్ నామా అన్నారు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అభిషేక్ నామా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఇంతవరకూ రవితేజ ‘రావణాసుర’లాంటి సినిమా చేయలేదు. ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ ఇలా కూడా చేయగలుగుతారా ? అని ప్రేక్షకులు షాక్ అవుతారు. కొత్త కాన్సెప్ట్ . ఇది వర్కౌట్ అయితే హీరోలు ఇలాంటి మరిన్ని కథలు ప్రయత్నిస్తారు. ►రావణాసుర కథ నచ్చి, దానిపై నమ్మకంతోనే డబ్బుపెట్టాం. నమ్మకం ఉన్నపుడు వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ? మేము నమ్మిన సినిమా మేమే విడుదల చేస్తున్నాం. ►అనుకున్న బడ్జెట్ లోనే ఈ సినిమా పూర్తి చేశాం. సుధీర్ వర్మ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్ కి పూర్తి చేశారు. ►ఈ చిత్రంలో రవితేజను చూసి ప్రేక్షకులు థ్రిల్ అయిపోయి షాక్ లో ఉంటారు. రవితేజ గారిని ఇంత కొత్త కోణంలో చూసే సరికి అదిరిపోయింది కదా అనే ఫ్యాక్టర్ వస్తుంది. ఇంటర్వెల్ అదిరిపోతుంది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ విడుదలైన తర్వాత ఇదే సబ్జెక్ట్ తో పాన్ ఇండియా ప్లాన్ చేయాలనే ఆలోచన ఉంది. ►సుధీర్ వర్మతో ‘కేశవ’ సినిమా చేశాను. అది కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. అయితే బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది. రావణాసురతో బ్లాక్ బస్టర్ వంద శాతం కొడతాం. ►మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ కుటుంబం అంతా సంగీతకారులు. తనకి చాలా ప్రతిభ ఉంది. మొదట ‘సాక్ష్యం’ సినిమా ఇచ్చాను. తర్వాత రవితేజ గారికి చెప్పాను. రావణాసురతో తన ప్రతిభని మరోసారి నిరూపించుకున్నాడు. ►ప్రస్తుతం నేను నిర్మిస్తున్న డెవిల్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు మూడు నెలల్లో ఏదైనా మంచి డేట్ చూసి విడుదల చేస్తాం. డెవిల్ 2 కూడా ఉంది. 2024లో దాదాపుగా ఏడు సినిమాలు లాంచ్ చేస్తాం. -
‘రావణాసుర’ లాంటి కథ తెలుగులో రాలేదు : సుధీర్ వర్మ
‘‘రవితేజగారితో ఫలానా జానర్ సినిమా చేయాలని ముందుగా అనుకోలేదు. రైటర్ శ్రీకాంత్ చెప్పిన కథ రవితేజగారికి నచ్చ డంతో దర్శకునిగా నేనైతే బావుంటుందని నా వద్దకు పంపించారు. థ్రిల్లర్ జానర్లో ‘రావణాసుర’ వంద శాతం కొత్త మూవీ. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు’’ అని డైరెక్టర్ సుధీర్ వర్మ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ వర్మ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’లో థ్రిల్స్, షాకింగ్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అందులో ఏది ముందు చెప్పినా సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు ఆ థ్రిల్ ఉండదు.. వారికి ఆ అనుభూతిని ఇవ్వడానికే కథ గురించి చెప్పడం లేదు. అయితే సినిమా చూసిన తర్వాత మన భావోద్వేగాలు మిస్సయిన ఫీలింగ్ ఆడియన్స్‌కి రాదని నా నమ్మకం. ‘రావణాసుర’ పూర్తిగా రవితేజగారి సినిమా. నటన పరంగా ఆయన సినిమాల్లో టాప్ త్రీలో ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతోనే రవితేజగారు ఓ నిర్మాతగా వ్యవహరించారు. అభిషేక్గారితో నేను చేసిన రెండో సినిమా ‘రావణాసుర’. నాపై నమ్మకంతో ఆయన సెట్స్‌కే రారు. ‘సుధీర్ ఏం అడిగితే అది ఇచ్చేయండి’ అని యూనిట్‌కి చెబుతారు. ‘అంతం’ మూవీలో నాగార్జునగారి, ‘సత్య’లో జేడీ చక్రవర్తిగారి పాత్రల్లో గ్రే షేడ్స్ ఉంటాయి. అయితే హీరోలని గ్రే షేడ్స్‌లో చూపించడం ఈ మధ్య ఎక్కువ అయింది. మణిరత్నంగారి ‘రావణ్’ సినిమాకి, మా ‘రావణాసుర’కి ఎలాంటి సంబంధం లేదు. ‘రావణాసుర’ని హిందీ, తమిళ్లో విడుదల చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. తెలుగులో విడుదలైన రెండో వారం నుంచి హిందీలో ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారి కథతో పవన్ కల్యాణ్‌గారితో నేను ఓ సినిమా చేసే అవకాశం ఉంది’’ అన్నారు. -
అదీ సుమక్క లెక్క
-
రవితేజని ఏది మార్చలేదు.. నా లాంగ్ హెయిర్ సీక్రెట్ అదే
-
అందుకే వెంటనే ఓకే చెప్పాను
‘‘రావణాసుర’ వైవిధ్యమైన చిత్రం. ఇలాంటి కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ రాలేదు. అందుకే కథ వినగానే నటించేందుకు ఓకే చెప్పాను’’ అని సుశాంత్ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన సుశాంత్ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’ టైటిల్ రోల్‌ని రవితేజగారు చేశారు. నేను రామ్ పాత్ర చేశా. మా ఇద్దర్నీ సుధీర్‌గారు సరికొత్తగా చూపించారు. నా పాత్రని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎగ్జయిట్మెంట్ ఉంది. ‘రావణాసుర’ కంప్లీట్ థ్రిల్లర్. వెర్సటైల్ యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా ఆలోచన. ఈ సినిమాలో ఆ కొత్తదనం కనిపిస్తుంది. ‘రావణాసుర’లో నన్ను తీసుకోవాలనే ఆలోచన అభిషేక్గారిదే. ఇందుకు ఆయనకు థ్యాంక్స్. ‘అల వైకుంఠపురములో’ చిత్రం నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఉత్తరాదిలో కూడా ఫేమ్ తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చినా నన్ను ఎగ్జయిట్ చేసిన ‘రావణాసుర, భోళా శంకర్..’ లాంటి సినిమాలు మాత్రమే ఒప్పుకున్నాను. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి రావడం నా లక్. నేను మొదటి నుంచి కూడా నాకు వస్తున్న అవకాశాలతోనే ముందుకువెళ్లాను. కొన్ని సినిమాల షూటింగ్ ఆలస్యం కావడం, అనుకున్న టైమ్‌కి విడుదల కాకపోవడం వల్ల గ్యాప్ వస్తోంది. ‘చిలసౌ’ తర్వాత ఇక గ్యాప్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అయితే కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది. కానీ ఆరు నెలలుగా బిజీగా ఉన్నాను. ‘భోళా శంకర్’లో కీ రోల్ చేస్తున్నాను. అలాగే సోలో హీరోగా ఒక కథ ఓకే చేశాను’’ అన్నారు. -
ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!
ఇప్పుడిప్పుడే థియేటర్లలో వేసవి సందడి కనిపిస్తోంది. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే మక్కువ చూపుతున్నారు. విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా మిమ్మల్ని అలరించేందుకు ఏకంగా 21 సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. అయితే ఈవారంలో థియేటర్లలో టాలీవుడ్ చిత్రాలు మాస్ హీరో రవితేజ నటించిన రావణాసుర, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సిద్ధమయ్యాయి. వాటితో పాటు ఈ వారంలో విడుదలయ్యే బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలేవో తెలుసుకుందాం. రవితేజ రావణాసుర మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'రావణాసుర'. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ నటింటారు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్ 'మీటర్' హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యంగ్ హీరోయిన్ అతుల్య రవి ఇందులో నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ‘ఆగస్టు 16, 1947’ ప్రముఖ దర్శకుడు ఆర్.మురుగదాస్ నిర్మించిన చిత్రం ‘ఆగస్టు 16, 1947’. ఎన్.ఎస్ పొన్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం రాగా, ఆ మరుసటి రోజు ఏం జరిగింది? అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. గౌతమ్ కార్తిక్, రిచర్డ్ ఆస్టన్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే నెట్‌ఫ్లిక్స్ బీఫ్ (వెబ్‌సిరీస్) -ఏప్రిల్ 6 ఇన్ రియల్ లవ్ -(టీవీ షో) ఏప్రిల్ 6 చుపా (హాలీవుడ్)- ఏప్రిల్ 7 హంగర్ (హాలీవుడ్)- ఏప్రిల్8 జీ5 అయోథి (తమిళం) -ఏప్రిల్ 7 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ది క్రాసోవర్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 4 బుక్ మై షో బ్యాట్‌మ్యాన్ (హాలీవుడ్) ఏప్రిల్ 5 కాస్మోస్ (హాలీవుడ్) ఏప్రిల్ 7 -
మహేష్ బాబు థియేటర్ లో టికెట్లు అమ్ముతున్న రావణాసుర టీం
-
రవితేజ ‘రావణాసుర’ ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
రావణాసుర విజయంపై నమ్మకం ఉంది
‘‘రావణాసుర’ చిత్రం నన్నెంతో అలరించింది. కచ్చితంగా ప్రేక్షకులందర్నీ కూడా అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు రవితేజ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’ టైటిల్, ఆ టైటిల్ డిజైన్ క్రెడిట్ నిర్మాత అభిషేక్‌కు దక్కుతుంది. అతను మల్టీటాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలుగా మాకు మంచి పేరు రావాలని, భవిష్యత్‌లో మేమిద్దరం కలిసి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హిట్‌తో సుధీర్ వర్మ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాలి. ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యాక్‌బోన్స్ అయిన శేత, నమ్రత, వింధ్యా రెడ్డిగార్లకు థ్యాంక్స్. నా ఉత్సాహం, నా ప్రోత్సాహం నా అభిమానులే’’ అని అన్నారు. ‘‘రవితేజగారి నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకు కష్టపడాలని చెప్పారు. సుధీర్‌వర్మ అద్భుతమైన దర్శకుడు. ఆయన నన్ను కొత్తగా చూపించారనే అనుకుంటున్నాను’’ అన్నారు సుశాంత్. ‘‘రావణాసుర’ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘రవితేజగారి ‘ఆంజనేయులు’ సినిమాకు దర్శకత్వ విభాగంలో వర్క్ చేశాను. దర్శకుడిగా ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్నాను. ‘రావణాసుర’ వంటి మంచి స్టోరీకి డైరెక్టర్‌గా నన్ను సెలక్ట్ చేసుకున్న రవితేజగారికి ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ హండ్రెండ్ పర్సెంట్ థ్రిల్ అవుతారు’’ అన్నారు సుధీర్‌వర్మ. మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ. మ్యూజిక్ డైరెక్టర్స్ హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, రైటర్ శ్రీకాంత్ విస్సా తదితరులు పాల్గొన్నారు. -
‘రావణాసుర’ నన్ను మరో మెట్టు ఎక్కిస్తుంది: హర్షవర్ధన్
‘‘రావణాసుర’ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. సుధీర్ వర్మగారు సౌండింగ్ కొత్తగా ఉండాలనుకుంటారు. సాంగ్స్, నేపథ్య సంగీతం కొత్తగా చేశాం. ఈ సినిమాకి పని చేయడం సవాలుగా అనిపించింది’’ అని సంగీతదర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజవుతోంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’కి థీమ్ సాంగ్ కావాలని అభిషేక్, సుధీర్ వర్మ గార్లు అడగటంతో ట్యూన్ ఇచ్చాను. అది విని ‘రావణాసుర’కి నువ్వే మ్యూజిక్ చేస్తున్నావ్’ అనడంతో సర్ర్పైజ్గా అనిపించింది. రవితేజగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సినిమాకి పని చేయడంతో నా కల నెరవేరింది. ‘రావణాసుర’కి నేను నాలుగు పాటలు, నేపథ్య సంగీతం అందించాను. భీమ్స్‌గారు ఓ ప్రత్యేక పాట చేశారు. సందర్భానుసారమే ఇళయరాజాగారి ‘వెయ్యిన్నొక్క జిల్లాల..’ పాటని రీమిక్స్ చేశాం. ‘అర్జున్ రెడ్డి, జార్జ్ రెడ్డి’ తర్వాత ‘రావణాసుర’ నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను. ప్రస్తుతం ‘డెవిల్’, ‘యానిమల్’ (హిందీ) సినిమాలకి సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు.