‘‘రావణాసుర’ వైవిధ్యమైన చిత్రం. ఇలాంటి కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ రాలేదు. అందుకే కథ వినగానే నటించేందుకు ఓకే చెప్పాను’’ అని సుశాంత్ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది.
ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన సుశాంత్ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’ టైటిల్ రోల్‌ని రవితేజగారు చేశారు. నేను రామ్ పాత్ర చేశా. మా ఇద్దర్నీ సుధీర్‌గారు సరికొత్తగా చూపించారు. నా పాత్రని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎగ్జయిట్‌మెంట్ ఉంది. ‘రావణాసుర’ కంప్లీట్ థ్రిల్లర్. వెర్సటైల్ యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా ఆలోచన. ఈ సినిమాలో ఆ కొత్తదనం కనిపిస్తుంది. ‘రావణాసుర’లో నన్ను తీసుకోవాలనే ఆలోచన అభిషేక్‌గారిదే. ఇందుకు ఆయనకు థ్యాంక్స్.
‘అల వైకుంఠపురములో’ చిత్రం నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఉత్తరాదిలో కూడా ఫేమ్ తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చినా నన్ను ఎగ్జయిట్ చేసిన ‘రావణాసుర, భోళా శంకర్..’ లాంటి సినిమాలు మాత్రమే ఒప్పుకున్నాను. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి రావడం నా లక్. నేను మొదటి నుంచి కూడా నాకు వస్తున్న అవకాశాలతోనే ముందుకువెళ్లాను. కొన్ని సినిమాల షూటింగ్ ఆలస్యం కావడం, అనుకున్న టైమ్‌కి విడుదల కాకపోవడం వల్ల గ్యాప్ వస్తోంది. ‘చిలసౌ’ తర్వాత ఇక గ్యాప్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అయితే కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది. కానీ ఆరు నెలలుగా బిజీగా ఉన్నాను. ‘భోళా శంకర్’లో కీ రోల్ చేస్తున్నాను. అలాగే సోలో హీరోగా ఒక కథ ఓకే చేశాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment