
మొదట ఈ మూవీ మే మొదటివారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపించింది. కానీ తాజాగా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.
మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా కథానాయికలుగా నటించారు. అక్కినేని సుశాంత్ ముఖ్య పాత్రలో నటించాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, రవితేజ ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
థియేటర్స్‌లో మిక్స్‌డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మొదట ఈ మూవీ మే మొదటివారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపించింది. కానీ తాజాగా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.
సినిమా రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి రావడంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఏదేమైనా మరోసారి రావణాసుర చూసే ఛాన్స్ దొరికిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు హర్షవర్దన్ రామేవ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
#Ravanasura
— Telugu Television News (@TeluguTvExpress) April 28, 2023
Now Streaming On #AmazonPrimeVideo #RavanasuraOnPrime@RaviTeja_offl @iamSushanthA@sudheerkvarma @AbhishekPicture @RTTeamWorks #RaviTeja #AnuEmmanuel #MeghaAkash #FariaAbdullah #dakshanagarkar pic.twitter.com/bQknxOF5wC
చదవండి: ఫిలింఫేర్ అవార్డ్స్: ఆ సినిమాకు ఏకంగా 10 అవార్డులు