Ravi Teja Ravanasura Movie OTT Release Date And Streaming Details, Deets Inside - Sakshi
Sakshi News home page

Ravanasura Movie In OTT: ఆ ఓటీటీలోనే 'రావణాసుర'.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే..

Apr 7 2023 3:12 PM | Updated on Apr 7 2023 3:46 PM

Ravanasura Movie OTT Release Date and Streaming Details - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా సహా ఐదుగురు హీరోయిన్స్‌ నటించారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యింది. ఇక ఈ సినిమా విడుదలైన తొలిరోజే ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వివరాలపై ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో రావణాసుర ఓటీటీ పార్ట్‌నర్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ భారీ ధరకు దక్కించుకుంది. అయితే థియేటర్స్‌లో విడుదలైన 50రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement