Amazon Prime Video
-
OTT: హిట్లర్’ రివ్యూ.. ఇదో లవ్ క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘హిట్లర్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాంనెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు... ఈ సినిమా పేరుకి, సినిమాకి అస్సలు సంబంధముండదు. కాని సినిమా మాత్రం ఓ అద్భుతమైన థ్రిల్లర్ అని చెప్పవచ్చు. హిట్లర్ సినిమా ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యం. ధనశేఖరన్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ తమిళ హీరో విజయ్ యాంటోని, హీరోయిన్ రియాసుమన్ ప్రధాన పాత్రలలో నటించగా ప్రముఖ దర్శకులు, నటులు అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అంతే కాదు నాటి విలన్ చరణరాజ్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఇక హిట్లర్ కథ విషయానికొస్తే ఇదో వినూత్నమైన కథ. హీరో సెల్వకు చెన్నైలోని ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం వస్తుంది. దాని కోసంగా కరుక్కవేల్ అనే స్నేహితుడి రూమ్ కి వస్తాడు సెల్వ. కరుక్కవేల్ తన కాలేజ్ స్నేహితుడని గుర్తు చేస్తాడు సెల్వ. కాని కరుక్కవేల్ తాను సెల్వని ఇప్పుడే చూస్తున్నానని చెప్తాడు. ఇంతలో సారా సెల్వకి ఓ రైల్వే స్టేషన్ లో అనుకోకుండా పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మరో పక్క నగరంలో పేరు మోసిన రౌడీ షీటర్లను ఎవరో బైక్ లో వచ్చి ఓ రేర్ పిస్టల్ తో చంపుతుంటారు. దానిని శక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఆ విచారణలో భాగంగా ఎన్నికలలో పోటీ చేయబోతున్న రాజకీయవేత్త రాజవేలు బ్లాక్ మనీ దాదాపు 500 కోట్లు పోయిందని తెలుస్తుంది. ఓ పక్క సెల్వ సారా లవ్ ట్రాక్, మరో పక్క రౌడీ షీటర్ హత్యలు, ఆ పైన డబ్బు పోవడం. ఈ మూడూ పేర్లల్ గా నడుపుతూ కథను అనూహ్యమైన మలుపులతో ఈ సినిమా స్క్రీన్ ప్లే చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఊహించని ట్విస్టులే ఈ సినిమాకి ప్రాణం. ఈ వీకెండ్ చూడదగ్గ సినిమా ఈ హిట్లర్. కాకపోతే పిల్లలకు ఈ సినిమాని దూరంగా ఉంచాలి. పేరుకే ఈ సినిమా హిట్లర్ కాని సినిమా మాత్రం సూపర్ హిట్టు. -
మీరు అమెజాన్ ప్రైమ్ యూజర్లా.. కొత్త రూల్స్ చూసారా?
భారతదేశంలో ఎక్కువ మంది ఉపయోగించే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఒకటి. ఇప్పటి వరకు ఒక అకౌంట్ తీసుకుని చాలామంది దీనికి సంబంధించిన సేవలను వినియోగించుకునే వారు. కానీ 2025 జనవరి నుంచి కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి.జనవరి నుంచే డివైజ్‌ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను విధించనుంది. అంటే కొత్త రూల్స్ ప్రకారం.. ఐదు డివైజ్‌లలో.. ఏ డివైజ్ అన్నదానితో సంబంధం లేకుండా.. ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు. అయితే సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్‌లను సెట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: రూ.399 కడితే.. ₹10 లక్షల బీమా: ఇదిగో ఫుల్ డీటెయిల్స్అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్లు & ధరలుఅమెజాన్ ఇండియా వివిధ అవసరాలు, బడ్జెట్లకు అనుగుణంగా ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్లను అందిస్తుంది. ఇందులో నెలవారీ ప్లాన్ ధర రూ. 299, త్రైమాసిక ప్లాన్ రూ. 599, ఏడాది ప్లాన్ రూ. 1499 వద్ద ఉన్నాయి. ఎంచుకునే ప్లాన్‌ను బట్టి యూజర్లు ప్రయోజనాలను పొందవచ్చు. -
అనన్య నాగళ్ల పొట్టేల్ మూవీ.. ఓటీటీల్లో సడన్ ఎంట్రీ!
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్. ఈ ఏడాది అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు నెలలైనా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. దీంతో ఇంకెప్పుడొస్తుందా అని ఆడియన్స్ ఎదురు చూశారు.అయితే ఈ చిత్రం ఇవాళ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే పొట్టేల్ మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఎనిమిది వారాల తర్వాత డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టింది.(ఇది చదవండి: Pottel Review: ‘పొట్టేల్’ మూవీ రివ్యూ)పొట్టేల్ సినిమాను తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1980ల కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో ఇందులో చూపించారు. తన కూతురిని చదివించాలని తపన పడే ఓ తండ్రి, బలి ఇవ్వాలనుకున్న గొర్రె తప్పిపోవడం లాంటి కథనంతో రూపొందించారు. ఈ చిత్రంలో అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియాంక శర్మ, తనస్వి, చత్రపతి శేఖర్ కీలకపాత్రలు పోషించారు. -
'గర్ల్స్ విల్ బి గర్ల్స్' ప్రీమీయర్ షోలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ
మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన 'ముర' చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువగా మలయాళ సినిమాలు చూస్తుండటంతో అవన్నీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 8న విడుదలైన 'ముర' భారీ విజయాన్ని అందుకుంది. 50రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.ముహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన 'ముర' చిత్రంలో హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి,కన్నన్ నాయర్ వంటి వారు నటించారు. క్రిస్టమస్ సందర్భంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'అమెజాన్ ప్రైమ్'లో విడుదల కానుంది. డిసెంబర్ 20వ తేదీ నుంచి మలయాళంతో పాటు తెలుగు,తమిళ్,కన్నడలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ డేట్‌కు ఈ చిత్రం ఓటీటీలో రాకుంటే డిసెంబర్ 25న తప్పకుండా విడుదల అవుతుంది.కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుంది. నలుగురు యువకులు ఉద్యోగం లేకపోవడంతో ఓ దోపిడీ కోసం ప్రయత్నిస్తారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో దర్శకుడు చాలా ఆసక్తిగా చూపించాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి 'ముర' ఎంత మాత్రం నిరాశపరచదు. -
పిల్లలు పుడితే ఆ పని చేస్తా..: నాగచైతన్య
నాగచైతన్య- శోభిత ధూళిపాళ తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో పదిలపర్చుకున్నారు. ఇన్నాళ్లు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇకమీదట భార్యాభర్తలుగా జీవితప్రయాణం చేయనున్నారు. డిసెంబర్ 4న రాత్రి అక్కినేని స్టూడియోలో వీరి వివాహం ఘనంగా జరిగింది.ఇద్దరు పిల్లలైనా ఓకే..పెళ్లి తర్వాత ఇద్దరూ జంటగా గుడికి వెళ్లి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇకపోతే నాగచైతన్య.. దగ్గుబాటి రానా టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే! ఈ టాక్ షోలో అతడు ఎన్నో విషయాలు పంచుకున్నాడు. చై మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉండాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలైనా ఓకే. వారిని కార్ రేసింగ్‌కు తీసుకెళ్తా.. వాళ్లతో ఉంటూ మళ్లీ నా బాల్యంలోకి వెళ్లిపోతా.. అని చెప్పాడు.నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వే..ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్రెండ్స్ ఎందుకు లేరన్న ప్రశ్నకు.. నువ్వు ఉన్నావ్ కదా అని రానాకు బదులిచ్చాడు. ఎక్కడేం జరిగినా అన్నీ చెప్తుంటావ్.. నేను ఏ టాక్ షోకు వెళ్లినా కూడా నా ఫ్రెండ్ ఎవరంటే నీ పేరే చెప్తాను. వాళ్లేమో ఆయన నీ బంధువు కదా? అని అడుగుతుంటారు. నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వేనని సమాధానమిస్తుంటాను అని చై తెలిపాడు.వింతకల నిజం చేస్తానన్న చచైఈ సందర్భంగా రానా తనకు వచ్చిన ఓ వింతకల బయటపెట్టాడు. ఓ పార్టీలో చై చొక్కా విప్పేసి బార్లో డ్యాన్స్ చేస్తున్నట్లు కల వచ్చిందన్నాడు. అది విని నవ్విన చై త్వరలోనే దాన్ని నిజం చేస్తానన్నాడు. ఈ చిట్‌చాట్‌కు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో శనివారం (డిసెంబర్ 6) అందుబాటులోకి రానుంది.చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్! -
ఓటీటీలో కంగువా.. అనుకున్న తేదీకంటే ముందే స్ట్రీమింగ్
ఓటీటీలో కంగువా విడుదల ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంలో కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆపై నిర్మాతలకు కూడా ఎక్కువ నష్టాలనే మిగిల్చిన చిత్రంగా కోలీవుడ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే, తాజాగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది.కంగువ సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఇప్పటకే చాలా తేదీలు వైరల్ అయ్యాయి. అయితే, అవన్నీ తప్పు అంటూ ఆ తేదీలకంటే ముందే కంగువ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. డిసెంబర్ 8న ఓటీటీలో కంగువ విడుదల కానుందని అమెజాన్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్,మలయాళం,కన్నడలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.కథేంటి అంటే?కంగువ కథ 1070 - 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్‌గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్‌ను వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకు చేరుకున్న జీటాని ఫ్రాన్సిస్ అదుపులోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు. ఈ హత్యను జీటా చూస్తాడు. అంతేకాదు ఫ్రాన్సిస్‌ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు.ఇదే క్రమంలో జీటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది వస్తారు. వారినుంచి జీటానీ కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ 1070లోకి వెళ్తుతుంది. అసలు జీటా ఎవరు..? అతనిపై చేసిన ప్రయోగం ఏంటి..? ఫ్రాన్సిస్, జీటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? 1070కి చెందిన కంగువా(సూర్య) ఎవరు..? కపాల కోన నాయకుడు రుధిర ( బాబీ డియోల్)తో కంగువకి ఉన్న వైరం ఏంటి..? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారత దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం వేసిన ప్లాన్ ఏంటి..? ప్రణవాది కోన ప్రజలను కాపాడుకోవడం కోసం కంగువ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఇన్నాళ్లకు బయటకొచ్చిన చై-శోభిత డేటింగ్ పిక్స్
తారలు ప్రేమలో పడితే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. జంటగా విహారయాత్రలకు వెళ్లినా, విందుకు వెళ్లినా, ఏం చేసినా సోషల్ మీడియాలో లీకైపోతుంటుంది. మరికొద్ది గంటల్లో భార్యాభర్తలు కాబోతున్న శోభిత ధూళిపాళ- నాగచైతన్య కూడా డేటింగ్ చేసుకునేటప్పుడు ఎంచక్కా ట్రిప్పులకు వెళ్లారు. డిన్నర్ డేట్స్‌కు వెళ్లారు. చై-శోభిత డేటింగ్ పిక్స్ కానీ ఎక్కడా తమ ఫోటోలు రిలీజ్ కాకుండా వీలైనంతవరకు జాగ్రత్తపడ్డారు. మీడియా గుచ్చిగుచ్చి అడిగినా మౌనం వహించారే తప్ప తమ ప్రేమ కహానీని బయటపెట్టలేదు. ఇన్నాళ్లకు నాగచైతన్య-శోభితల డేటింగ్ పిక్స్ బయటకు వచ్చాయి. అదెలాగంటే.. హీరో రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ద రానా దగ్గుబాటి షోకి చై అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెనయ్యాడు.లైఫ్ అలా ఉందన్న చైలైఫ్ ఎలా ఉందన్న ప్రశ్నకు చై.. శుభ్రంగా, బాగానే ఉందన్నాడు. పనిలోపనిగా ఈ ప్రేమజంట కలిసున్న కొన్ని ఫోటోలను ప్రోమోలో చూపించారు. అందులో ఒకదాంట్లో చై.. శోభిత బ్యాగు పట్టుకుని నిల్చున్నాడు. మరో ఫోటోలో శోభిత.. ప్రియుడి భుజంపై చేయేసి దర్జాగా నిలుచుంది. ఇక ఈ వినోదాత్మక ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ శనివారం (డిసెంబర్ 7న) అందుబాటులోకి రానుంది. View this post on Instagram A post shared by Rana Daggubati (@ranadaggubati) చదవండి: నేడు హీరో నాగచైతన్య-శోభితల వివాహం -
థియేటర్లలో పుష్పరాజ్ జాతర.. ఓటీటీల్లో ఏకంగా 23 సినిమాల సందడి !
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. డిసెంబర్ నెల ఫస్ట్ వీక్‌లోనే రిలీజవుతోన్న పుష్ప-2 కోసమే అంతా వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి. దీంతో ఈ వారమంతా పుష్ప మానియా కొనసాగనుంది. పుష్ప-2 రిలీజ్ అవుతున్నందున బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు విడుదల కావడం లేదు.అయితే ఓటీటీల్లో ఈ వారంలో సందడి చేసేందుకు చిత్రాలు సిద్ధమయ్యాయి. దీపావళికి రిలీజైన బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన అమరన్ ఓటీటీకి రానుంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా వరుణ్ తేజ్ మట్కా సైతం ఈ వారంలోనే ఓటీటీలో సందడి చేయనుంది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. వీటితో పాటు పలు బాలీవుడ్ సినిమాలు సైతం ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ అమరన్(తమిళ మూవీ)- డిసెంబర్ 05 చర్చిల్ ఎట్ వార్ (డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబరు 04 దట్ క్రిస్మస్ (యానిమేషన్ చిత్రం)- డిసెంబరు 04 ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా (డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబరు 04 ది అల్టిమేటమ్ (వెబ్‌సిరీస్)- డిసెంబరు 04 బ్లాక్ డవ్జ్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 05 విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ సినిమా)- డిసెంబరు 06 ఎ నాన్సెన్స్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 06 బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 06 జిగ్రా (హిందీ సినిమా)- డిసెంబరు 06 మేరీ (హాలీవుడ్ చిత్రం)- డిసెంబరు 06అమెజాన్ ప్రైమ్ మట్కా(తెలుగు సినిమా)- డిసెంబర్ 05 జాక్ ఇన్‌టైమ్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 03 పాప్ కల్చర్ జెప్పడీ (వెబ్‌సిరీస్) -డిసెంబరు 04 అగ్ని (హిందీ సినిమా)- డిసెంబరు 06 ది స్టిక్కీ (హాలీవుడ్ చిత్రం)- డిసెంబరు 06 జియో సినిమా క్రియేట్ కమాండోస్ (యానిమేషన్ మూవీ)- డిసెంబరు 06 లాంగింగ్ (హాలీవుడ్)- డిసెంబరు 07డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ది ఒరిజినల్ (కొరియన్ సిరీస్) -డిసెంబరు 03 లైట్ షాప్ (కొరియన్)- డిసెంబరు 04జీ5 మైరీ (హిందీ సినిమా)- డిసెంబరు 06సోనీలివ్ తానవ్2 (హిందీ/తెలుగు) -డిసెంబరు 06 బుక్ మై షో స్మైల్-2 (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 04 -
OTT: హాలీవుడ్ మూవీ ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ రివ్యూ
ప్రతి మనిషికీ ఆలోచనలుంటాయి. కాని కొంతమందికి ప్రత్యేక ఆలోచనలొస్తాయి. మరీ ముఖ్యంగా హాలివుడ్ దర్శకులకు విపరీతధోరణితో ఆలోచనలొస్తాయి. మనమెప్పుడూ ఊహించని కనీ వినీ ఎరుగని విపత్తులు ఈ హాలివుడ్ దర్శకులకు ఆలోచనల రూపంలో కనిపిస్తాయి. అవి వాళ్ళు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుంచుతారు. ఆ నేపధ్యంలో వచ్చిన సినిమానే ఎ క్వైట్ ప్లేస్ డే వన్. ఈ సినిమా సీరిస్ లో మూడవది. ఇప్పటిదాకా ఈ సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. ఇప్పుడు వచ్చిన ఎ క్వైట్ ప్లేస్ డే వన్ నెల రోజుల క్రితమే ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా పెయిడ్ ఫార్మెట్ లో విడుదలవగా ఈ వారమది అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాదాపు ముప్ఫై ఏడేళ్ళ క్రితం ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారు పుష్పకవిమానం అనే ప్రత్యేకమైన సినిమా తీశారు. సినిమాలో ఒక్క డైలాగ్ లేకుండా చక్కటి కామెడీతో చూడముచ్చటగా ఉంటుందా చిత్రం. కాని దాదాపు అలాంటి కోవకే చెందిన ఇంగ్లీష్ చిత్రమైన ఎ క్వైట్ ప్లేస్ డే వన్ మాత్రం చూసేవాళ్ళకు చమటలు పట్టించడం ఖాయం. సినిమాలో కథ ప్రకారం మాటలు తక్కువున్నా ప్రేక్షకులకు దడపుట్టిస్తుందీ సినిమా. జాన్ క్రసింస్కీ ఈ సిరీస్ లో వచ్చిన చిత్రాలన్నిటికీ రచయిత. మొదటి రెండు చిత్రాలకు తాను దర్శకత్వం వహించగా తాజా చిత్రానికి మాత్రం మైఖేల్ సర్నోస్కీ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కథ ప్రకారం న్యూయార్క్ లో హాస్ స్పైస్ అనే ఫెసిలిటీలో క్యాన్సర్ పేషంట్ కా వున్న సామ్ తన కుక్క పిల్లతో వాలంటీర్ రూబెన్ తో కలిసి ఓ ప్లే చూడడానికి సిటీలోకి వెళ్తుంది. సామ్ కి సంగీతం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి వింటూనే వుంటుంది.అప్పుడే మాన్ హాట్టన్ నగరంపై ఏలియన్స్ దాడి జరుగుతుంది. ఈ ఏలియన్స్ ఎక్కడైనా శబ్దం వస్తే చాలు కనిపించిన మనుషులను దారుణంగా దాడి చేస్తూవుంటాయి. ఈ దశలో నగరమంతా వాటి దాడి వల్ల క్షణాల్లో నిర్మాణుష్యమైపోతుంది. అక్కడక్కడా శబ్దం చేయకుండా బ్రతికున్న వాళ్ళు ఏలియన్స్ నుండి తప్పించుకుంటూ వుంటారు. అసలే క్యాన్సర్ బారిన పడిన సామ్ తనను తాను కూడా ఈ ఏలియన్స్ దాడిని ఎలా ఎదుర్కుంటుందనే మిగతా కథ. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమాలో నిశ్శబ్దం ఎంత భయంకరంగా వుంటుందో మీకు సినిమా చూశాక తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వీకెండ్ చూసెయ్యండి. - ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో 'కంగువా' స్ట్రీమింగ్ అప్డేట్
కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. దీంతో సూర్య కెరీర్లో దారుణమైన నష్టాలను ఈ చిత్ర నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు ఎదుర్కోనున్నారు. కంగువా సినిమా ఓటీటీ రైట్స్‌ను అత్యధిక ధరకు అమెజాన్ దక్కించుకుంది. దీంతో ఒక రకంగా చిత్ర నిర్మాతలను ఈ ఓటీటీ సంస్థే కాపాడినట్లు అయింది.కంగువా ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు గతంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. సినిమా విడుదలైన నాలుగు వారాలకు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. డిసెంబర్ 13న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 130 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. అయితే, అమెజాన్ ప్రైమ్ మాత్రం రూ. 100 కోట్లకు కంగువా రైట్స్ దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఉంది.కంగువా సినిమా ప్రారంభంలో 30 నిమిషాల పాటు చాలా బోరింగ్‌గా ఉందని ప్రచారం రావడంతో మూవీ నుంచి 12 నిమిషాల పాటు కొన్ని సీన్లు తొలగించారు. జ్యోతిక కూడా సినిమాపై ఇదే విమర్శ చేసింది. సూర్య,బాబీ డియోల్,దిశా పటాని నటించిన ఈ చిత్రాన్ని శివ దర్శకత్వం వహించారు. -
OTT: తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సట్టమ్ ఎన్ కైయిల్’ రివ్యూ
చట్టమనేది ఎవ్వరి చుట్టమూ కాదు. అదే చట్టాన్ని వ్యక్తిగతంగా ఎవ్వరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు. కాని దీనికి విరుద్ధంగా ఓ తమిళ సినిమా పేరు వచ్చింది. అదే సట్టమ్ ఎన్ కైయిల్. అంటే చట్టం నా చేతుల్లో అని అర్ధం. సెన్సార్ వాళ్ళు ఈ పేరును ఎలా ఓకే చేశారో కాని సినిమా మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమాకి చాచి దర్శకుడు. సినిమా ప్రధాన పాత్రైన గౌతమ్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు సతీష్ నటించడం విశేషం. మామూలుగా హాస్య పాత్రలతో ఇప్పటిదాకా అలరించిన సతీష్ ఈ సినిమాలో సీరియస్ పాత్రతో ప్రేక్షకులను అలరించాడనే చెప్పాలి.ఇక సట్టమ్ ఎన్ కైయిల్ కథాంశానికొస్తే తమిళనాడు లోని మారుమూల ప్రాంతమైన ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ కి తన బిడ్డ మృతికి కారణమైన హాస్పిటల్ సిబ్బంది మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఓ వ్యక్తి రావడంతో సినిమా ప్రారంభమవుతుంది. నిజానికి ఈ సన్నివేశం ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్సపెక్టర్ బాషా అవినీతిని చూపించడం కోసం రూపొందించారు. దాని తరువాత గౌతమ్ తన కారులో ప్రయాణిస్తూ ఓ వ్యక్తిని ఢీ కొడతాడు. ఈ యాక్సిడెంట్ లో తాను ఢీ కొట్టిన వ్యక్తి చనిపోవడంతో తన కారు డిక్కీలో ఆ వ్యక్తి బాడీని పెట్టుకుని తిరిగి ప్రయాణిస్తుంటాడు. ఇంతలో పోలీస్ చెక్ పోస్టులో అనూహ్యంగా పోలీసులకు కారుతో సహా చిక్కి ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటాడు గౌతమ్. తన పై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి స్టేషన్ కి తీసుకువస్తారు. కాని తన కారులో ఉన్న శవం గురించి పోలీసులకు తెలియదు. ఇక అక్కడినుండి కథ అనేక అనూహ్య మలుపులు తిరిగి ఉత్కంఠభరితంగా నడుస్తుంది సినిమా. ముఖ్యంగా ఆఖరి సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్. క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఎలాగూ నచ్చుతుంది, అలాగే మామూలు వాళ్ళకి కూడా ఒక్కసారి కథలోకి లీనమైతే సినిమాలో వచ్చే ట్విస్టులకు వీస్తూ పోతూ కుర్చీలకు అతుక్కుపోతారు. సట్టమ్ ఎన్ కైయిల్ మాత్రం రొటీన్ థ్రిల్లర్ అయితే కాదు. వర్త్ టు వాచిట్. (ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది)-ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో డార్క్ కామెడీ సినిమా
కోలీవుడ్‌లో దాదా, స్టార్ వంటి సినిమాలతో పాపులర్ అయిన కవిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బ్లడీ బెగ్గర్. దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన చిత్రం దీపావళి సందర్భంగా తమిళ్లో విడుదలైంది. అక్కడ మంచి విజయం సాధించడంతో నవంబన్ 7న తెలుగులో కూడా విడుదలైంది. దాదా సినిమాతో టాలీవుడ్లో కూడా కాస్త గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ చిత్రాన్ని ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది.బ్లడీ బెగ్గర్ సినిమా కోసం నిర్మాత నెల్సన్ దిలీప్‌కుమార్ రూ. 5 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. అయితే, ఈ సినిమా కేవలం తమిళ్లోనే సుమారు రూ. 20 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ హక్కుల్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా కాస్త ఎక్కువ ధరకే కొనుగోలు చేసింది. ఈ చిత్రాన్ని నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్కి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగులో కూడా అదే రోజు అందుబాటులో ఉండనుంది. డార్క్ కామెడీ మూవీని చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొంది.కథేంటి?కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు.. అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). వచ్చిన డబ్బులతో లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఓ రోజు దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్లతో పాటు ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా దొంగచాటుగా బంగ్లాలోకి వెళ్తాడు. కాసేపటివరకు బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బంగ్లా యజమానులు బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ? -
మనుషులను తినే వైరస్.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
టైటిల్: అపోకాలిప్స్ జెడ్: ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్డైరెక్టర్: కార్లెస్ టోరెన్స్విడుదల తే:దీ 05 అక్టోబర్ 2024ఓటీటీ: అమెజాన్ ప్రైమ్నిడివి: 119 నిమిషాలుఇప్పుడంతా ఓటీటీల హవానే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తెరెకెక్కించిన చిత్రాలు సైతం మన ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నాం. ఈ డిజిటల్ యుగంలో మనకు నచ్చిన సినిమాను వీలైన టైమ్‌లో చూసే అవకాశం ఉంది. కంటెంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసేస్తున్నారు. ఓటీటీలో అన్ని రకాల జోనర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన భయపెట్టే జాంబీ యాక్షన్ థ్రిల్లర్ అపోకలిప్స్ జెడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. స్పానిష్‌లో తెరకెక్కించిన మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.స్పానిష్ ప్రజలు ఓ మహమ్మారి వైరస్ బారిన పడతారు. ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. దీంతో ప్రజలంతా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లను, నగరాలను వదిలిపారిపోతారు. ఇంతకీ ఆ వైరస్ ఏంటి? అలా తప్పిపోయిన తన ఫ్యామిలీని కలుసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసమే అసలు కథ.ఇలాంటి జాంబీ యాక్షన్ చిత్రాలు గతంలోనూ చాలా వచ్చాయి. కాకపోతే ఈ మూవీ కాస్తా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా కథనం సాగుతుంది. అంతుచిక్కని వైరస్ బారిన పడినవారు.. కనపడిన ప్రతి ఒక్కరిని తినేస్తుంటారు. దీంతో ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీ సైతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి హెచ్చరికలు జారీచేస్తుంది. అలా వాటిని పట్టించుకోకుండా బయటికెళ్లిన వ్యక్తి వారి నుంచి తప్పించుకోవడానికి చేసే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇందులో అతనితో పాటు పిల్లి కూడా ఉంటుంది. ఇందులో ఆ వ్యక్తి ప్రాణాలు దక్కించుకోవడానికి చేసే యాక్షన్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అయితే కథ నెమ్మదిగా సాగడం కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. హారర్, యాక్షన్ జోనర్ ఇష్టపడేవాళ్లు ఈ మూవీ ట్రై చేయొచ్చు. కాకపోతే కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్‌తో చూసేయాల్సిందే. -
రానాతో టాక్ షో.. పెళ్లి, పిల్లల గురించి నాగచైతన్య ఏం చెప్పారంటే..?
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా ఒక టాక్ షో రానుంది. 'ది రానా దగ్గుబాటి షో' పేరుతో తాజాగా ఒక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టాక్ షో కార్యక్రమంలో సౌత్ ఇండియా సెలబ్రిటీలు పాల్గొన్నారు. ట్రైలర్లో మొదట నాగచైతన్య, శ్రీలీల కనిపిస్తే.. రాజమౌళి, నానిలతో రానా ముచ్చట్లు రన్ అవుతాయి. ప్రియాంక మోహన్, దుల్కర్ సల్మాన్, తేజ సజ్జా, రిషభ్ శెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ పాటు రానా సతీమణి మిహికా బజాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 23 నుంచి ప్రతి శనివారం ఒక అతిథితో రానా ప్రేక్షకుల ముందుకు వస్తాడు. సుమారు 10కి పైగా ఎపిసోడ్స్ ఈ కార్యక్రమంలో ఉండనున్నాయి. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ షో చిత్రీకరించారు. ఫస్ట్ ఎపిసోడ్ నాగచైతన్యకు సంబంధించినది ఉండొచ్చని తెలుస్తోంది.రానాతో చాలా సరదా విషయాలు వారందరూ పంచుకున్నారు. అయితే, 'నీ కుటుంబం ఎలా ఉండాలని అనుకుంటున్నావు..?' అని చైతూను రానా ప్రశ్నిస్తే.. 'సంతోషంగా పెళ్లి చేసుకుని.. కొంతమంది పిల్లలు'తో అని నవ్వుతూ బదులిచ్చారు. తాజాగా విడుదలైన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. -
సూర్య భారీ యాక్షన్ మూవీ.. కంగువా ఏ ఓటీటీకి రానుందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్లో నటించిన అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం కంగువా. ఈ మూవీని పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా శివ డైరెక్షన్లో తెరకెక్కించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి షో నుంచే కంగువాకు పాజిటివ్ టాక్ వస్తోంది.అయితే భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. కంగువా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.100 కోట్లకు ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. మామూలుగా సినిమా విడుదలైన తర్వాత నెల రోజులకు ఓటీటీ వచ్చేస్తున్నాయి.కానీ కంగువా లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు మరింత సమయం పడుతుంది. తాజా ఒప్పందం ప్రకారం విడుదలైన ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని సమాచారం. అంటే ఈ ఏడాది డిసెంబర్ చివర్లో ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో దిశాపటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. కంగువా రెమ్యునరేషన్..కంగువా కోసం సూర్య ఏకంగా రూ.39 కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. దాదాపు సినిమా బడ్జెట్లో పది శాతానికిపైగా సూర్య రెమ్యునరేషన్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. విలన్ పాత్ర కోసం బాబీ డియోల్ రూ.5 కోట్లు, దిశా పటానీ రూ.3 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. -
మరోసారి హోస్ట్‌గా టాలీవుడ్ హీరో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నటుడు, హీరో రానా దగ్గుబాటి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఇటీవల ఐఫా వేడుకల్లో సందడి చేసిన రానా సరికొత్త షోలో హోస్ట్‌గా కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సరికొత్త 'ది రానా దగ్గుబాటి షో'తో అభిమానులను అలరించనున్నారు.ది రానా దగ్గుబాటి షో పేరుతో నవంబర్ 23 నుంచి ఈ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. గతంలో ఆయన నెం.1యారి అనే టాక్ షోకు హోస్ట్‌గా చేశారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బుల్లితెర ప్రియులను ఎంటర్టైన్ చేయనున్నారు. దీంతో రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. The stars you know, the stories you don’t✨🤭Get ready to get real on #TheRanaDaggubatiShowOnPrime, New Series, Nov 23@PrimeVideoIN @SpiritMediaIN pic.twitter.com/295MUNP30Z— Rana Daggubati (@RanaDaggubati) November 13, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. నాన్న సెంటిమెంట్ స్టోరీతో తీసిన ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ దానికి రెండు రోజుల ముందే మరో ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. ఇంతకీ ఇదే మూవీ? ఎందులో అందుబాటులో ఉందనేది చూద్దాం.సుధీర్ బాబు నటించిన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. దసరాకు థియేటర్లలో రిలీజైంది. కాకపోతే అదే టైంలో నాలుగైదు సినిమాలు రిలీజ్ కావడం, ఇది స్లోగా సాగే ఎమోషనల్ కావడంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు నెలరోజులు పూర్తయ్యాయో లేదో ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)తొలుత జీ5 ఓటీటీలో నవంబర్ 15న స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి సైలెంట్‌గా వచ్చేసింది. సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.'మా నాన్న సూపర్ హీరో' స్టోరీ గురించి మాట్లాడుకుంటే.. రోజుల వయసులోనే తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), అనుకోని కారణాల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతాడు. ఓరోజు ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ జాని వల్ల దురదృష్టమే అని ఎప్పుడూ ఈసడించుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఇతడు జైలుకి వెళ్తాడు. సవతి తండ్రిని విడిచిపించాలంటే జానికి కోటి రూపాయలు అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే మిగతా కథ.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు మిథున్ చక్రవర్తి పర్స్ కొట్టేసిన దొంగలు) -
ఓటీటీలోకి వచ్చేసిన చిన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా 'దేవర', 'వేట్టయన్' సినిమాలతో పాటు సమంత 'సిటాడెల్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. వీటికోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇవి కాదన్నట్లు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇవి అలా ఉండగానే సైలెంట్‌గా ఓ తమిళ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు)ప్రముఖ కమెడియన్ యోగిబాబు, యువ నటి బ్రిగిడ తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా 'కొళిపన్నై చెల్లదురై'. సెప్టెంబరు 20న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి పర్లేదనిపించే టాక్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ పాస్ కావాలంటే ఈ మూవీపై ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: షోలో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య) -
ఓటీటీలో వేట్టయాన్.. దీపావళి కానుక ప్రకటించిన మేకర్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.వేట్టైయన్ నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్‌ను పంచుకుంది. అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను రూ. 90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు.ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో 'విశ్వం'.. అప్పుడే స్ట్రీమింగ్కు రానుందా..?
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం 'విశ్వం'. బాక్సాఫీస్ వద్ద కాస్త పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న చాలా సినిమాలు థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి. దీంతో విశ్వం చిత్రాన్ని దాదాపు అన్ని స్క్రీన్స్ నుంచి తొలగించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారట. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.దసరా సందర్భంగా అక్టోబర్ 11న విడుదలైన 'విశ్వం' పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు నష్టాలు తప్పలేదని సమాచారం. ఇప్పుడు కాస్త త్వరగా ఓటీటీలో అయినా విడుదల చేస్తే కొంతైనా సేఫ్ కావచ్చని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా నవంబర్ 1న 'విశ్వం' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయునున్నట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంది. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కథ పెద్దగా ఆకట్టుకోకపోయినా కామెడీతో ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని చెప్పవచ్చు. -
ఓటీటీలో తమిళ్ థ్రిల్లర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కోలీవుడ్‌లో నటుడు సతీష్ కమెడియన్‌గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే 'నాయ్ శేఖర్' సినిమాతో హీరోగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. అయితే, తాజాగా 'సట్టం ఎన్ కైయిల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని చాచి దర్శకత్వం వహించారు. ఇందులో సతీష్‌తో పాటు మైమ్‌గోపి, అజయ్ రాజ్ పలు పాత్రలలో నటించారు. 'సట్టం ఎన్ కైయిల్' సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. IMDb రేటింగ్‌లో కూడా ఈ మూవీ 9.3 సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే, ఈ చిత్రం నవంబర్ 8న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం తప్పకుండా మెప్పిస్తుందని చెప్పవచ్చు. -
ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో
థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే మలయాళ దర్శకుల తర్వాత ఎవరైనా చెప్పొచ్చు. చాలా సింపుల్ బడ్జెట్‌తో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ తీస్తుంటారు. అలా ఈ ఏడాది రిలీజైన ఓ సినిమానే 'గోళం'. కొన్నాళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. కాకపోతే అప్పుడు కేవలం మలయాళంలో మాత్రం స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు మాత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)సినిమా అంతా దాదాపు ఒకే బిల్డింగ్‌లో తీసినా సరే స్క్రీన్ ప్లే, ట్విస్టులు బాగా పకడ్బందీగా రాసుకున్నారు. దీంతో ప్రేక్షకులకు మెస్మరైజ్ కావడం గ్యారంటీ. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలంటే ఆసక్తి ఉంటే దీన్ని అస్సలు మిస్సవకండి.'గోళం' విషయానికొస్తే.. ఓ కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు చూస్తుండగానే, జాన్ అనే వ్యక్తిని చంపేస్తారు. పొలిటికల్‌గా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సంచలనమవుతుంది. ఈ కేసుని కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరిన సందీప్ కృష్టకు అప్పజెబుతారు. అయితే ఆఫీసులో పనిచేసే వాళ్లలో ఒకరే ఈ హత్య చేసుంటారని సందీప్ అనుమానం. మరి కిల్లర్‌ని పట్టుకొన్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు) -
రజినీకాంత్ వేట్టయాన్.. ఓటీటీకి అంత త్వరగానా?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన రోజు నుంచి ఇప్పటి వరకు రూ.134 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది.తాజాగా వేట్టయాన్ మూవీ ఓటీటీ విడుదలపై అప్పుడే టాక్ మొదలైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీకి రానుందని నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వేట్టయాన్ బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఈ మూవీ నవంబర్ 7న లేదా 9న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!)కాగా.. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోకి దక్కించుకుంది. దసరా సందర్భంగా అక్టోబరు 10న వెట్టయాన్ తెరపైకి వచ్చింది. నాలుగు వారాల తర్వాత అంటే ఈ దీపావళి తర్వాత ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
రానా డైరెక్షన్ లో RGVతో రాజమౌళి షూటింగ్