
నటి షకీలా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘షకీలా’. 2021లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీ, ఎస్తర్ నోరన్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మలని కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజీత్ లంకేశ్ దర్శకత్వంలో ప్రకాష్ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్ హిందీలో ‘షకీలా’ చిత్రాన్ని నిర్మించి, అన్ని భాషల్లో అనువదించారు. హిందీ, తమిళ,తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు.
షకీలా సినిమా థియేటర్స్‌లో రిలీజైన ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా తెలుగు వర్షన్ కోసం ఎక్స్ పేజీలలో పోస్టులు పెడుతున్నారు. షకీలాకు ఉన్న క్రేజ్ వల్ల ఈ మూవీ విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. ఏకంగా యూట్యూబ్‌లలో కూడా ఈ చిత్రాన్ని చాలామంది షేర్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు కూడా భారీగా నష్టపోయారు. అయితే, తెలుగు వర్షన్ కూడా మరో రెండురోజుల్లో స్ట్రీమింగ్‌కు రావచ్చని తెలుస్తోంది.

ఈ సినిమాతో షకీలా ప్రయాణం చాలామందిని ఆలోచింప చేస్తుంది. ఇండస్ట్రీలో నటిగా పేరు తెచ్చుకోవాలనుకున్న షకీలా.. శృంగార తారగా ఎలా మారింది అనేది చెప్పడంలో దర్శకుడు కాస్త తడబడటంతో ఈ మూవీకి పెద్ద మైనస్ అయింది. ఆపై ఇందులో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉండటంతో కూడా ఇబ్బందిగా మారింది. షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను చూపించారు. బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించినప్పటికీ, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో సెన్సార్ బోర్డు కమిటీ ప్రశంసించింది.
Comments
Please login to add a commentAdd a comment