richa chadda
-
దివాళీ బాష్‌లో మెరిసిన బాలీవుడ్ సినీతారలు.. ఫోటోలు
-
Ashok Shrivastav: ‘అతడి ఇంట్లోని మహిళల మీద జాలి కలుగుతోంది’
‘ఫైండ్ ఎ బెడ్’ అనే యూఎన్ కోవిడ్ సహాయ కార్యక్రమానికి ఇండియా నుంచి బాలీవుడ్ నటీమణులు రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్ అంబాసిడర్లుగా ఉన్నారు. అయితే.. అందుకు వారు తగినవారు కాదు అని దూరదర్శన్ టీవీ జర్నలిస్ట్ అశోక్ శ్రీవాత్సవ్ ట్వీట్ చేయడం వివాదం అయింది. ‘తగని’ ఆ ముగ్గురూ శ్రీవాత్సవ్ కు తగిన సమాధానమే ఇవ్వబోతున్నారు. రిచా అయితే ఇప్పటికే టిట్ ఫర్ ట్వీట్ ఇచ్చేశారు. రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్.. ఈ ముగ్గురూ.. ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ అని ఒక ఇమేజ్ ఉంది. కేవలం వాళ్లు నటించిన సినిమాల వల్ల మాత్రమే వచ్చిన ఇమేజ్ కాదు అది. విలక్షణమైన వాళ్ల వ్యక్తిత్వం కూడా ఆ ఇమేజ్‌కి కొంత కారణం. 34 ఏళ్ల రిచా సామాజిక కార్యకర్త. విద్యార్థి ఉద్యమాలకు మద్దతు ఇస్తుంటారు. అందువల్ల తనకు సినిమా ఛాన్స్‌లు పోతాయనేం భయపడరు. ఇక నాలుగు పదుల సన్నీ లియోన్. ఒకప్పుడు ఆమె పోర్న్ స్టార్. తర్వాత హాలీవుడ్‌కి, అక్కణ్ణుంచి బాలీవుడ్‌కి వచ్చారు. రాజకీయ స్పృహ, చైతన్యం రెండూ ఎక్కువే. మూగజీవుల సంరక్షణ సంస్థ ‘పెటా’కు బ్రాండ్ అంబాసిడర్ కూడా పని చేశారు. 33 ఏళ్ళ స్వరా భాస్కర్ డేర్ అండ్ డెవిలిష్! ప్రజావ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలపై జరిగే ప్రదర్శనలకు తన గళాన్ని ఇస్తుంటారు. సినిమాల్లో, ఓటీటీల్లో ఆమె వేసే పాత్రలు కూడా ఆమెకు దీటైనవే. అంటే దాపరికాలు ఉండనివి. ఈ ముగ్గురూ ప్రస్తుతం ‘ఫైండ్ ఎ బెడ్’ అనే ప్రచారోద్యమానికి మద్దతిస్తున్నారు. అయితే.. ‘ఫైండ్ ఎ బెడ్‌కు వీరు తగని వ్యక్తులు’ అని అశోక్ శ్రీవాత్సవ్ అనే జర్నలిస్టు విమర్శించడంతో రిచా, సన్నీ, స్వరా స్పందించవలసి వచ్చింది. బాధ్యత గల ఉద్యోగంలో ఉండి మహిళల్ని కించపరిచేలా రిచా, సన్నీ, స్వరాలను అంత మాట అన్న శ్రీవాత్సవ్ గురించి తర్వాత తెలుసుకోవచ్చు. ముందైతే ‘ఫైండ్ ఎ బెడ్’ ఏమిటో చూద్దాం. ఇదొక యూత్ ప్రోగ్రామ్. కోవిడ్ ఉద్ధృతితో ఆసుపత్రులలో బెడ్లు దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో ముంబైలోని ‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూమెంట్ టు యునైటెడ్ నేషన్స్’ (ఐఐఎంయుఎన్) అనే సంస్థ తాజాగా ‘ఫైండ్ ఎ బెడ్’ అనే కార్యాచరణను భుజానికెత్తుకుంది. దేశంలోని 160 నగరాలను కలుపుతూ 26 వేల మంది విద్యార్థులతో ఒక వ్యవస్థను నిర్మించి, వారి ద్వారా అవసరమైన వారికి కోవిడ్ ఆసుపత్రులలో బెడ్లను సమకూర్చేందుకు చక్కటి ప్రణాళికను సిద్ధం చేసింది. ఏయే ఆసుపత్రులలో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని ఈ యువ సైన్యం ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన వారికి ఆ ప్రాంతంలో బెడ్ దొరికేలా ‘ఫైండ్ ఎ బెడ్’ ఏర్పాట్లు చేస్తుంది. యువతరంలో బాలీవుడ్ నటీనటులకు, అందులోనూ సామాజిక కార్యక్రమాల్లో కాస్త చురుగ్గా ఉండేవాళ్లకు క్రేజ్ ఉంటుంది కాబట్టి ఐ.ఐ.ఎం.యు.ఎన్. రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్లను తమ ప్రచారోద్యమ గౌరవ సార థులుగా నియమించుకుంది. అది చూసే మన శ్రీవాత్సవ్ భ్రుకుటి ముడివేసి, ‘తగని వ్యక్తులు’ అని వీళ్ల మీద ఒక ట్వీట్ ముద్ర వేశారు. ∙∙ అశోక్ శ్రీవాత్సవ్ దూరదర్శన్‌లో సీనియర్ కన్సల్టింగ్ ఎడిటర్. అంతటి మనిషి ఇప్పుడిలా ఈ ముగ్గురిపై నోరు పారేసుకుని డీడీ ప్రతిష్టకే భంగం కలిగేలా చేశారని విమర్శలు వస్తున్నాయి. ‘ఫౌండ్ ఎ బెడ్’కు తమని తగని వ్యక్తులుగా పేర్కొంటూ ఆ ముగ్గురి ఫొటోలు పెట్టి ట్విట్టర్లో కామెంట్‌ను పోస్ట్ చేసిన శ్రీవాత్సవ్‌కు ఏ మాత్రం కనికరం లభించే అవకాశం కనిపించడం లేదు. గతంలో ఇలాంటివే కొన్ని అనవసర వ్యాఖ్యల్ని చేసిన చరిత్ర అతడికి ఉంది. ఇప్పుడిక భవిష్యత్తునూ లేకుండా చేసుకునేలా ఉన్నారు. ‘‘అతడి ట్వీట్‌ను చూసి షాక్ తిన్నాను. దూరదర్శన్ ఇలాంటి స్త్రీ ద్వేషినీ, దుష్ట మానవుడినా ఉద్యోగంలోకి తీసుకుంది!’’ అని రిచా ట్వీట్ చేశారు. ఆపత్సమయాలలో ప్రతి ఒక్కరూ అండగా నిలుస్తారు. ఇతడు సహాయం చేయకపోగా, ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు’’ అని అన్నారు. వెంటనే నటి పన్ను తాప్సీ.. రిచాకు మద్దతుగా స్పందించారు. ‘‘అతడు నా గురించి కూడా గతంలా ఇలాగే కామెంట్ చేశాడు. ముఖ్యమైన ట్వీట్లకు సమాధానం ఇవ్వవలసిన తొందరలో ఉండి అతడిని వదిలేశాను. తన అధికారాన్ని ఆ వ్యక్తి ఇలా వాడుకుంటున్నాడు’’ అని తాప్సీ అన్నారు. ‘‘ఇలాంటి వాళ్లను ఊరికే వదలిపెట్టకూడదు’’ అని తాప్సీ ట్వీట్‌కి రిచా రిప్లయ్ ఇచ్చారు. ముగ్గురిలో మిగతా ఇద్దరు.. సన్నీ లియోన్, స్వరా భాస్కర్ వెంటనే ఏమీ స్పందించలేదు. శ్రీవాత్సవ్‌పై వారు దూరదర్శన్‌కు ఫిర్యాదు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. రిచా అయితే నేటికీ ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతున్నారు! ‘‘ఇలాంటి ఒక వ్యక్తి జాతీయ మీడియాలో ఎలా పని చేస్తున్నట్లు!! అతడి ఇంట్లోని, ఆఫీసులోని మహిళల మీద జాలి కలుగుతోంది’’ అని అంటున్నారు. -
'మేడం చీఫ్ మినిస్టర్' మూవీ రివ్యూ
‘ఎలా కనిపిస్తున్నాను? ఏక్దమ్ పటాఖా కదూ? ఎలా ఉన్నా నేను మీ ఇంటి అమ్మాయిని!’ అంటుంది తారా వేల మంది హాజరైన ఒక బహిరంగ సభలో. ఆ సాహసం వెనక చాలా పోరాటమే ఉంటుంది.. లింగ, కుల వివక్షను జయించి.. తన ఉనికిని చాటుకునే పోరాటం! ఆ కథే ‘మేడం చీఫ్ మినిస్టర్’. ఇందులోని ఉత్తరప్రదేశ్ రాజకీయాలు, ఒక దళిత మహిళ ముఖ్యమంత్రి కావడం వంటివి కొంత మాయావతి రాజకీయ జీవితాన్ని గుర్తుకు తెస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న ఈ సినిమాకు దర్శకుడు సుభాష్ కపూర్. ఫస్గయేరే ఒబామా, జానీ ఎల్ఎల్బీ చిత్రాలు తీసిందీ అతనే. సినిమా ఎక్కడ మొదలవుతుందంటే.. 1980లు.. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతం.. ఒక దళిత యువకుడి పెళ్లి ఊరేగింపు ఉన్నత కులస్తులు ఉండే వీధిగుండా వెళుతూ ఉంటుంది. ఉన్నత కులస్తుల వీధిలోకి అంత ఆర్భాటంగా దళితుల పెళ్లి ఊరేగింపు వెళ్లడం అగ్రవర్ణాల వాళ్ల అహాన్ని దెబ్బతీస్తే, ఆ ఊరేగింపు వల్ల నిద్రాభంగం కలగడం ఇంకో తప్పుగా వాళ్లకు తోచి వాదనకు దిగుతారు. రెండు వర్గాల మధ్య ఆ వివాదం పెద్దదై కాల్పులకు దారితీస్తుంది. దళిత వర్గానికి చెందిన ఒక వ్యక్తి మరణిస్తాడు. ఆ క్షణానే ఆ మరణించిన వ్యక్తి భార్య ఆడపిల్లను కంటుంది. అయిదో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టిందన్న కోపంతో అత్తగారు ఆ పిల్లను పురిట్లోనే చంపే ప్రయత్నం చేయబోతుంది. ఈలోపే కొడుకు శవమై ఇంటికి చేరేసరికి దానిక్కారణమూ పసిబిడ్డనే చేసి పుట్టిన క్షణమే తండ్రిని మింగిన ఆ పిశాచి బతకడానికి ఏ మాత్రం వీల్లేదని తీర్మానిస్తుంది. కాని తల్లి అక్కడి నుంచి పారిపోయి బిడ్డను కాపాడుకుంటుంది. ఆమెని పెంచి పెద్ద చేస్తుంది. ఆ అమ్మాయే తార (రీచా ఛద్దా).. మేడం చీఫ్ మినిస్టర్. ఆ ప్రయాణానికి ముందు.. బాయ్స్ కాలేజ్‌లో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తుంటుంది తార. అగ్రవర్ణానికి చెందిన వాడు, ఆ కాలేజి విద్యార్థి నాయకుడు.. ఇంద్రమణి త్రిపాఠీ (అక్షయ్ ఒబేరాయ్) తో ప్రేమలో పడుతుంది. అతని వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది. అంతకుముందులాగే అబార్షన్ చేయించుకోమంటాడు ఇంద్రమణి. ‘కుదరదు.. పెళ్లి చేసేసుకుందాం’ అంటుంది తార. కంగుతింటాడు ఇంద్రమణి. అది మాటల్లో వినిపించనివ్వకుండా రాజకీయ నేతగా ఎదగాలనే తన లక్ష్యం గురించి చెప్తాడు. పెళ్లి చేసుకుని కూడా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు కదా అని సముదాయిస్తుంది తార. అప్పుడు మనసులోని మాట బయటపెడ్తాడు ఇంద్రమణి.. ఆమె కులాన్ని గుర్తు చేస్తూ. ఈసారి తార విస్తుపోతుంది. ‘నేను అంటే నీకంత ఇష్టమైతే జీవితాంతం నీ బాగోగులు చూస్తాను కాని పెళ్లి, పిల్లలు అనే ఆశను వదిలేసుకో’ అని హెచ్చరిస్తాడు. తార ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఇంద్రమణి ఇంటికి వెళ్లి.. తన గర్భవతినని చెప్తుంది ఇంద్రమణి తండ్రితో. ఆమె వెళ్లిపోయాక కొడుకుకి చెప్తాడు.. ‘రాజకీయంగా ఎదగాలంటే ఇలాంటి అవాంతరాలను తొలగించుకోవాలి’ అని. ఆ రాత్రే తన అనుచరులను తార మీద దాడికి పంపిస్తాడు ఇంద్రమణి. దళితులకు రాజకీయాధికారం రావాలని పార్టీ పెట్టి.. తపన పడుతున్న నేత సూరజ్భాన్ (సౌరభ్ శుక్లా) ఆమెను రక్షిస్తాడు. అతని గురించి తెలుసుకున్న తార.. అతని అనుచరిగా మారుతుంది. దళితుల్లో చైతన్యం కలిగించేందుకు పల్లెపల్లెకు వెళ్తున్న సూరజ్‌ను మోటార్ సైకిల్ మీద డ్రైవ్ చేస్తుంది. ఆ పాఠాలను తనూ గ్రహిస్తూ రాజకీయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటుంది. ఈలోపే ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు వస్తాయి. సూరజ్ భాన్ పార్టీ ప్రభావం తెలుసున్న ప్రత్యర్థి పార్టీ నేత అరవింద్ సింగ్ (శుభ్రజ్యోతి భరత్) .. ఆ దళిత నేతతో పొత్తు పెట్టుకుంటాడు. అయితే ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి పదవి తమ పార్టీ అభ్యర్థికే ఇవ్వాలని సూరజ్ భాన్ షరతు పెడ్తాడు. ఆ రాజకీయ వ్యవహారం, రాయబారాన్ని తారే నిర్వహిస్తుంది. ఆమె సామర్థ్యం అర్థమైన సూరజ్ భాను సిట్టింగ్ ముఖ్యమంత్రికి ప్రత్యర్థిగా, తమ పార్టీ అభ్యర్థిగా తారను నిలబెడ్తాడు. పైన చెప్పుకున్న నినాదం ‘ఎలా కనిపిస్తున్నాను.. ఏక్దమ్ పటాఖా లాగా కదూ’ అంటూ ప్రజలను ఆకట్టుకుంటుంది.. వాళ్ల మనిషనే భావనను కల్పిస్తుంది. బంపర్ మెజారిటీతో గెలుస్తుంది. తనకు ముఖ్యమంత్రి పదవి ఇమ్మని అడుగుతుంది తన రాజకీయ గురువు సూరజ్ భానును. పొత్తు పెట్టుకున్న పార్టీ వాళ్లే కాదు సొంత పార్టీ అభ్యర్థులూ తారను వ్యతిరేకించినా, సూరజ్‌భాను తారనే ముఖ్యమంత్రి అభ్యర్థిని చేస్తాడు. అప్పుడు వస్తాడు తార రాజకీయ జీవితంలోకి ఇంద్రమణి.. అరవింద్ సింగ్ సిఫారసు ద్వారా. తారను ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటాం.. అయితే ఇంద్రమణికి మంత్రి పదవి ఇవ్వాలని సూరజ్ భానుతో తారకు చెప్పిస్తాడు. తార ఒప్పుకోదు. తన ఆఫీస్ కు వచ్చిన ఇంద్రమణిని అవమానించి పంపిస్తుంది. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాల్లో తారకు అండగా ఉంటాడు ఓఎస్డీగా నియమితుడైన డానిష్ ఖాన్ (మానవ్ కౌల్). వెన్నుపోటు మహిళ, అందునా దళిత మహిళను ముఖ్యమంత్రిగా జీర్ణించుకోలేకపోతారు ప్రత్యర్థి పార్టీ నేతలే కాదు సొంత పార్టీ నేతలు కూడా. ఇంకా చెప్పాలంటే సూరజ్ భానుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి కూడా. అతణ్ణి పావుగా వాడుకొని సూరజ్‌ను చంపిస్తాడు ఇంద్రమణి. సూరజ్ చనిపోయాక ఆ పార్టీకి మద్దతు విరమించుకుంటాడు అరవింద్. మూడురోజుల్లో బలపరీక్ష ఉందనగా డానిష్ రెహమాన్ సలహా మేరకు అరవింద్ సింగ్ పార్టీ, తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ కిడ్నాప్ చేసి ఓ హోటల్లో పెడ్తుంది తార. హోటల్ మీద రైడ్ చేసి బందీలను తీసుకెళ్లిపోవాలని వస్తారు అరవింద్ సింగ్, ఇంద్రమణి. పోలీసులు రంగ ప్రవేశం చేసి కాల్పులు జరుపుతారు. అరవింద్ సింగ్, ఇంద్రమణి తప్పించుకుని వెళ్లిపోతుండగా హోటల్ పై అంతస్తు బయట పైప్‌లైన్‌ను ఆనుకొని గోడ మీద నిలబడి ఉన్న తార, డానిష్ ఖాన్లు కనపడ్తారు. తారకు తుపాకి గురిపెడ్తాడు ఇంద్రమణి. ఆమెను రక్షించే ప్రయత్నంలో జారి కిందపడ్తాడు డానిష్. భయపడి పారిపోతారు అరవింద్, ఇంద్రమణి. కాచుకుని ఉన్న తార మనుషులు ఇంద్రమణిని కాల్చి చంపుతారు. తర్వాత జరిగిన బలపరీక్షలో తార నెగ్గుతుంది. డానిష్ కూడా ప్రమాదం నుంచి కోలుకొని ఆరోగ్యవంతుడవుతాడు. అన్నిట్లో తనకు అండదండగా ఉండడమే కాక తన ప్రాణాలకు అతని ప్రాణాలను అడ్డుపెట్టిన డానిష్‌ను పెళ్లి చేసుకుంటుంది తార. పాలనాపరంగా కూడా దూసుకెళుతూంటుంది. దళితులకు ఆలయ ప్రవేశం, వాళ్లకు మెరుగైన ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల మీద శ్రద్ధ పెట్టి సామాన్యుల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటుంది తార. ప్రత్యర్థులకిది కంటగింపుగా ఉంటుంది. ఆమెను ఎలాగైనా పదవీచ్యుతురాలి గా చేయాలని చూస్తుంటారు. డానిష్‌ను ఎరగా వాడుకోవాలని చూస్తారు. డానిష్ లొంగడు. అయితే అతని ప్లాన్లు అతను వేస్తూంటాడు. తారకు స్లో పాయిజన్ ఇప్పిస్తూంటాడు ఆహారం ద్వారా. ఆరోగ్యం దెబ్బతినడంతో తెలిసిన డాక్టర్ తో పరీక్ష చేయించుకుంటుంది. ఆహారంలో విషం కలుస్తోందని అర్థమవుతుంది. ఆ విషం ద్వారా తారను అచేతనం చేసి.. తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు డానిష్. ఈ నిజాన్ని తెలుసుకున్న తార అది భరించలేకపోతుంది. అదే స్లో పాయిజన్‌తో డానిష్‌ను చక్రాల కుర్చీకి అంకితం చేయిస్తుంది. ప్రతర్థి పార్టీ తన భర్తను చంపించే కుట్ర పన్నారని చక్రాల కుర్చీలో సగం తెలివితో కూలబడిపోయిన భర్తను చూపించి తర్వాత ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తుంది. ఆ సానుభూతితో ఓట్లను కొల్లగొట్టి సంపూర్ణ మెజారిటీతో సీఎం అవుతుంది తార. స్త్రీలు, దళితులు, దళిత స్త్రీల పోరాటాన్ని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒకేసారి చాలా సమస్యల్ని చర్చించాలనే తాపత్రయంలో దేనిమీదా సరైన ఫోకస్ లేకుండా పోయింది. ‘‘ఇక్కడ మెట్రో లు కట్టే అభ్యర్థులు ఓడిపోతారు.. మందిర్లు కట్టే అభ్యర్థులు గెలుస్తారు’’ వంటి డైలాగులు ఆలోచింప చేస్తాయి. –ఎస్సార్ -
చిన్న గ్రామం నుంచి ముఖ్యమంత్రిగా రిచా చద్దా..
ముంబై: బాలీవుడ్ నటి రిచా చద్దా రాబోయే చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఇందులో రిచా వెనుకబడిన వర్గాల ప్రజల కోసం పోరాడే పవర్ఫుల్ మహిళ నాయకురాలిగా కనిపించనున్నారు. ఈ ట్రైలర్.. ఓ చిన్న గ్రామానికి చెందిన ఒక యువతి కుల వ్యవస్థను, పితృస్వామ్య వ్యవస్థకు బ్రేక్ చేస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ తర్వాత ఏలా అధికారాన్ని చేపట్టారో చూడోచ్చు. వెనుకబడిన వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం పాటుపడే క్రమంలో ఆగ్ర వర్ణాలు, ప్రతిపక్షాలు వేసే అడ్డంకులను అధిగమించి ఆమె ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగానేది ట్రైలర్ వివరిస్తుంది. అయితే ఇందులో రిచా చిన్న జట్టుతో కొత్త లుక్‌లో కనిపించారు. డైరెక్టర్ సుభాష్ కపూర్ రూపోందిస్తున్న ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, నరేన్ కుమార్, డింపుల్ ఖర్బందాలు కలిసి నిర్మిస్తున్నారు. రిచాతో పాటు ఈ చిత్రంలో సౌరభ్ శుక్లా, మానవ్ కౌల్, అక్షయ్ ఒబెరాయ్‌లు కీలక పాత్రలో కనిపించనున్నారు. -
మేడమ్ చీఫ్ మినిస్టర్
ఇటీవల విడుదలైన ‘షకీలా’ బయోపిక్‌లో గ్లామరస్‌గా కనిపించిన రిచా చద్దా ఇప్పుడు అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఆమె ముఖ్య పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియంటడ్ చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. ఇందులో టైటిల్ రోల్లో రిచా కనిపిస్తారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. సుభాష్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రిచా నటించారు. ఇదో సీరియస్ పొలిటికల్ డ్రామా. జనవరి 22న సినిమా రిలీజ్ కానుంది. -
షకీలా కష్టాలతో...
నటి షకీలా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘షకీలా’. రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీ, ఎస్తర్ నోరన్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మలని కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజీత్ లంకేశ్ దర్శకత్వంలో ప్రకాష్ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్ హిందీలో ‘షకీలా’ చిత్రాన్ని నిర్మించి, అన్ని భాషల్లో అనువదించారు. హిందీ, తమిళ, కన్నడ భాషల్లో శుక్రవారం ఈ సినిమాని విడుదల చేయగా, జనవరి 1న యుఎఫ్ఓ మూవీస్ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘షకీలా’ తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల చేశారు. షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను ట్రైలర్లో చూపించారు. ‘‘బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించినప్పటికీ, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో సెన్సార్ బోర్డు కమిటీ ప్రశంసించింది. సినిమా థీమ్, మంచి సందేశానికి వారి నుండి ప్రశంసలు లభించాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత: సదీప్ మలాని, కెమెరా: సంతోష్ రాయ్ పతజే. -
‘షకీలా’ తెలుగు ట్రైలర్
1990లో ఖాళీగా ఉన్న సినిమా థియేటర్లు హౌజ్‌ఫుల్ కావాలంటే డిస్ట్రిబ్యూటర్లకు ఒకేఒక పేరు వినిపించేది. ఆ పేరే షకీలా. అప్పట్లో ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కానీ రాను రాను ఆమె క్రేజీ తగ్గిపోయింది. ఆమె సినిమాలు కనుమరుగైపోయాయి. కొంతమంది ఆమె సక్సెస్‌ను చూడలేక తొక్కేశారని కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘షకీలా’ సినిమాను తెరకెక్కించాడు ప్రముఖ దర్శకుడు ఇంద్రజీత్ లంఖేష్. బాలీవుడ్ నటి రిచా చద్దా లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో షకీలా శృంగార నాయికగా ఎలాంటి పాపులారిటీ సంపాదించుకుంది వంటి కీలక అంశాలతోపాటు ఆమె జీవితంలోని మరిన్ని కోణాలను చూపించారు. తెర వెనుక షకీలా జీవితం ఎలా ఉందనే అంశాలను చూపించినట్లు సినిమా చూస్తే తెలుస్తోంది. ఇక నూతన సంవత్సరం కానుకగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 1న తెలుగు,తమిళం,హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. -
ఉర్దూ పాఠాలు
కొత్త పాత్ర కోసం ఉర్దూ పాఠాలు నేర్చుకుంటున్నారు బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా. ఉర్దూను సరిగ్గా పలకడం కోసం ఓ కోచ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారట. కునాల్ కోహ్లీ దర్శకత్వంలో రిచా చద్దా ముఖ్య తారగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాహోర్ కాన్స్పిరసీ’. ఇందులో రిచా రహస్య గూడచారి పాత్రలో నటిస్తున్నారు. ఒకే షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. ‘‘ఒక పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడం యాక్టర్ లక్షణం అయ్యుండాలని నమ్ముతాను. అందుకే ఈ సినిమాలోని పాత్ర కోసం ఉర్దూ నేర్చుకుంటున్నాను. కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకునే అవకాశం సినిమా ఎప్పుడూ కల్పిస్తూనే ఉంటుంది’’ అన్నారు రిచా. -
రిచా దావా: కేఆర్కే న్యాయవాది వివరణ
ముంబై: లైంగిక ఆరోపణలు నేపథ్యంలో నటి రిచా చద్ధాపై వివాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నటి పాయల్ ఘోష్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. ముంబై హైకోర్టు పాయల్ క్షమాపణ అంగీకరించి ఇకపై రిచాకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వును జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులు ఏబీఎన్‌కు, వివాదాస్పద నటుడు కమల్ రషిద్ ఖాన్ అలియాస్ కేఆర్కేను ఉద్దేశిస్తూ జారీ చేసింది. అంతేగాక దీనిపై ఏబీఎన్, కమల్ రషీద్‌లు వివరణ ఇవ్వాలని నాలుగు వారాల గుడువు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం కమల్ తరపు న్యాయవాది బుధవారం స్పందించారు. ‘రిచాపై పరువు నష్టం కలిగించేలా బహిరంగంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయరని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయన దీనిపై బహిరంగ ప్రకటన కూడా చేయనున్నట్లు వెల్లండించారు. (చదవండి: రిచాను క్షమాపణలు కోరిన పాయల్) దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగికంగా ఇబ్బందులకు గురి చేశాడంటూ నటి పాయల్ ఘోష్ గత నెలలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోపణల నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రిచా చద్ధాతో పాటు మరో ఇద్దరూ నటీనటులపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. దీంతో చద్ధా, పాయల్‌పై పరువు నష్టం దావా వేస్తూ నోటీసుల జారీ చేశారు. దీంతో గత వారం పాయల్ ముంబై కోర్టులో బహిరంగంగా తను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, బేషరతుగా రిచాను క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. పాయల్ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసిందంటూ చద్ధా బుధవారం ట్వీట్ చేశారు. (చదవండి: నా పేరెందుకు వాడారు?: నటి) -
ఏప్రిల్‌లో పెళ్లి
నాలుగేళ్ల ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి బాలీవుడ్ నటుడు అలీ ఫజల్, నటి రిచా చద్దా రెడీ అయిపోయారు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుకలు చేసుకుంటారట. అందుకని రిజిస్ట్రేషన్ కోసం ముంబై కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నారని సమాచారం. ఏప్రిల్ చివరి వారంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని ఇద్దరి సన్నిహితులు పేర్కొన్నారు. 2017లో ‘ఫక్రీ రిటర్న్స్’లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రిచా పంజాబీ అమ్మాయి. అలీది ఉత్తర్‌ప్రదేశ్. పెద్దల అంగీకారంతోనే వీరి పెళ్లి జరగనుంది. -
షకీలా.. బోల్డ్ ఫస్ట్ లుక్
సౌత్‌లో శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన నటి షకీలా. మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సైతం గట్టి పోటి ఇచ్చిన షకీలా జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ‘షకీలా నాట్ ఏ పోర్న్ స్టార్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రిచా చడ్డా టైటిల్ రోల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ఉన్న రిచా ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, ఎస్తర్ నొరొహ, రాజీవ్ పిల్లైలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
షకీలా బయోపిక్‌పై ఇంట్రేస్టింగ్ న్యూస్
సెన్సేషనల్ స్టార్ షకీలా పేరు మీద బయోపిక్ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షకీలా పాత్రను బాలీవుడ్ బ్యూటీ రిచా చడ్డా పోషిస్తున్నారు. ఈ సినిమాలో షకీలా వ్యక్తిగత జీవితం, సినీరంగం ప్రవేశం, కెరీర్‌లోని కష్టాలను వెండితెర మీద ఆవిష్కరించనున్నారు దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్. షకీలా అడల్ట్ స్టార్ గా మారడానికి కారణాలు తెరపై చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయట. కాగా ఈ మూవీలో అతిథి పాత్రలో నటించవలసిందిగా షకీలాను దర్శకుడు ఇటీవల కోరినట్లు సమాచారం. దీనికి షకీలా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో శృంగార తారగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటి షకీలా. 90వ దశకంలో ఆమె సినిమాలకు యమ క్రేజ్ ఉండేది. ఒకానొక దశలో ఆమె సినిమా కలెక్షన్ల ముందు బడా స్లార్ల మూవీల కలెక్షన్లు కూడా వెలవెలబోయేవి. షకీలా మూవీ రీలీజ్ అవుతుందంటే చాలు.. వారం రోజుల పాటు బడా హీరోల సినిమాలు వాయిదా పడేవి. ప్రస్తుతం షకీలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. -
నా లైఫ్‌లో జరిగినదంతా చెప్పాను: షకీలా
‘నిజాలు దాచి బయోపిక్ తీసి ఉపయోగమేంటి?’ అంటున్నారు నటి షకీలా. ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఓ బయోపిక్ రూపొందిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటి రీచా చద్దా పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్ కోసం షకీలాను కలుసుకున్నారు రీచా. ఈ బయోపిక్ గురించి షకీల మాట్లాడుతూ – ‘‘రీచాకు, నాకు మధ్యలో ఒక కామన్ పాయింట్ కనిపించింది. ఫిజికల్ సిమిలారిటీ గురించి కాదు, మా ఇద్దరి ఆలోచనా విధానం గురించి అంటున్నాను. రీచా కూడా నాలానే ధైర్యవంతురాలు, ఫ్రీగా ఆలోచించే మనిషి. స్క్రిప్ట్స్‌లో ఉన్న లేయర్స్‌ని కూడా అర్థం చేసుకోగల నటి. ఈ సినిమాకు సంబంధించి నేను ఎటువంటి నిబంధనలు పెట్టడం లేదు. నా లైఫ్‌లో జరిగినదంతా చెప్పాను. నిజాలు దాచాలనుకున్నప్పుడు బయోపిక్ తీసి ఉపయోగమేముంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా ఆగస్ట్‌లో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. -
షకీల షూటింగ్ షురూ
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ ఇటీవలే రిలీజైంది. సెన్సేషనల్ స్టార్ సన్నీ లియోన్ బయోపిక్ ‘కరణ్‌జిత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ను వెబ్‌సిరీస్‌గా రూపొందించారు. ఈ రోజు నుంచి టీవీలో ప్రసారం కానుంది. ఇప్పుడు మరో సెన్సేషనల్ స్టార్ షకీల బయోపిక్ కూడా షూటింగ్‌కు సిద్ధమైంది. షకీల జీవితం ఆధారంగా దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. షకీల బయోపిక్‌లో టైటిల్ రోల్‌ను బాలీవుడ్ భామ రీచా చద్దా చేయనున్నారు. ఈ బయోపిక్‌లో షకీలా సినిమా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి అడల్ట్ స్టార్‌గా ఎలా ఎదిగారనే విషయాలను ప్రస్తావించనున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. -
త్వరలో సెట్స్ మీదకు షకీలా బయోపిక్
నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికర బయోపిక్ వెండితెర సందడి చేసేందుకు రెడీ అవుతోంది. సౌత్ ఇండస్ట్రీలో శృంగార తార తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న షకీలా జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో షకీలా పాత్రలో నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ రిచా చడ్డా అంగీకరించింది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో షకీలా వ్యక్తిగత జీవితం, సినీరంగం ప్రవేశం, కెరీర్‌లోని కష్టాలను వెండితెర మీద ఆవిష్కరించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. 16 ఏళ్ల వయసులోనే సినీ రంగం ప్రవేశం చేసిన షకీలా ఒక దశలో స్టార్ హీరోలకు కూడా గట్టిపోటినిచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో టాప్ స్టార్లు కూడా ఆమె సినిమాలో పోటి పడాలంటే వెనకడుగువేసేవారు. ప్రస్తుతం షకీలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. -
బాలీవుడ్లో మైకేల్ జాక్సాన్ కూతురు
ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హాలీవుడ్ నటులు కనిపించారు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్లో బాలీవుడ్ సినిమాలో నటించనుంది. ఇప్పటికే పారిస్‌ను సంప్రదించిన మూవీ టీం ఆమె అంగీకారం పొందారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలీవుడ్ బ్యూటి రిచా ఛడ్డా, పాకిస్తానీ నటుడు అలీ ఫజల్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమాలో పారిస్ జాక్సన్ కీలక పాత్రలో నటించనుంది. ప్రధానంగా ఇంగ్లీష్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారతీయ సినిమాగానే తెరకెక్కిస్తున్నారు. పారిస్ జాక్సన్‌కు జంటగా ఓ హాలీవుడ్ నటుణ్ని సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
స్మోకింగ్ దెబ్బకు హీరోయిన్ దిమ్మతిరిగిందట!
ముంబై: ఇటీవల కాలంలో బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో పాటు వారి పాత్రే కీలకంగా ఉన్న కథలు తెరకెక్కుతున్నాయి. 'ఫ్యాషన్'లో కంగనారనౌత్, 'మేరీ కోమ్'లో ప్రియాంకచోప్రా హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించడంతో పాటు తమ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఆ మూవీస్ కోసం వారు కొద్దిపాటి సాహసం చేశారని చెప్పవచ్చు. మరో హీరోయిన్ కూడా వారి బాటలోనే నడుస్తోంది. ఆమె మరెవరో కాదు.. 'ఓయ్ లక్కీ ఓయ్'తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ రిచా ఛద్దా. ప్రస్తుతం 'సరబ్జిత్', 'క్యాబరే' మూవీ షూటింగ్ లతో బిజిబిజీగా ఉంది. ఆమె నటించిన 'ఔర్ దేవదాస్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగతున్నాయి. భారీ అంచనాలతో పూజాభట్ నిర్మిస్తున్న క్యాబరే చిత్రంలో రిచా ఛద్దా కాస్త సాహసోపేత నిర్ణయం తీసుకుంది. మూవీలో తన పాత్ర డిమాండ్ చేస్తుండటంతో ఓ సీన్లో భాగంగా ఆమె కొన్ని సిగరెట్లు కాల్చేసింది. సీన్ సరిగ్గా రాకపోవడంతో కాస్త స్మోకింగ్ మోతాదు పెరిగిపోయింది. దీంతో ఆనారోగ్యానికి గురై కాస్త విరామం తీసుకుంది. సినిమా యూనిట్ షూటింగ్‌కు తాత్కాలికంగా ప్యాకప్ చెప్పేశారట. హీరోయిన్ పాత్రకు రిచానే న్యాయం చేయగలదని భావించి అవకాశం ఇచ్చిన పూజాభట్ నమ్మకాన్ని నిలబెట్టడానికి సాహసమే చేసిందని ఇండస్ట్రీలో టాక్. టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ ఈ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండటం గమనార్హం. 'క్యాబరే'లో దీపక్ తిజోరి, ముకుల్ దేవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
‘క్యాబరే’ హీరోయిన్గా రిచా ఛద్దా
భారీ అంచనాలతో పూజాభట్ నిర్మిస్తున్న ‘క్యాబరే’ చిత్రంలో రిచా ఛద్దా హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. కౌస్తభ్నారాయణ్ నియోగి దర్శకత్వంలో రూపొందించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు రిచానే న్యాయం చేయగలదని భావించిన పూజాభట్, ఆమెకు ఇందులో అవకాశం ఇచ్చింది. ఇందులో దీపక్ తిజోరి, ముకుల్ దేవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ‘క్యాబరే’ షూటింగ్ ప్రారంభం కానుంది. -
'ఇక వయసుకు తగిన పాత్రలు'
‘ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్!’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, ‘గోలియోంకీ రాస్లీలా-రామ్‌లీలా’ వంటి చిత్రాల్లో బరువైన పాత్రలు పోషించిన రిచా ఛద్దా, ఇకపై వయసుకు తగిన పాత్రలు పోషించాలనుకుంటున్నట్లు చెబుతోంది. సాధారణంగా హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో తేలికపాటి పాత్రలను ఎంచుకుంటారని, తనకు మాత్రం కెరీర్ ప్రారంభంలోనే సీరియస్ పాత్రలు లభించాయని వాపోతోంది. శిక్షణ పొందిన డ్యాన్సర్ కూడా అయిన రిచా, ఇకపై అవకాశం దొరికితే స్టెప్పులేసే పాత్రల్లో యువతను ఉర్రూతలూగించాలని ఉవ్విళ్లూరుతోంది. -
బెంగాలీ చిత్రంలో సుస్మిత
జాతీయ అవార్డు గ్రహీత సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న బెంగాలీ చిత్రం ‘నిర్బాక్’లో మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ నటించనుంది. ఈ చిత్రం షూటింగ్ కోసం నాలుగు రోజుల్లో కోల్‌కతా బయలుదేరనున్నట్లు ఆమె చెప్పింది. బెంగాలీ భామ అయిన సుస్మితకు మాతృభాషలో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. తమిళ, తెలుగు వంటి ఏ ఇతర భాషా చిత్రాల్లోనైనా బెరుకు లేకుండా నటించిన తనకు బెంగాలీ చిత్రాలంటే ఇదివరకు కాస్త బెరుకు ఉండేదని, ఇప్పుడు దాన్ని అధిగమించానని సుస్మితా చెబుతుండటం విశేషం. -
పౌడర్ తెచ్చిన తంటా..
బాలీవుడ్ నటి రిచా చద్దాకు ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనభవం ఎదురైంది. ఇటీవల ఆమె ముంబై వెళ్లేందుకు ఢిల్లీలో విమానాశ్రయానికి రాగా, బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని సెక్యూరిటీ అధికారులు ఆపేశారు. రెండు గంటలపాటు విచారణ జరిపిన తర్వాత గాని విడిచిపెట్టలేదు. ఇంతకీ ఆమె వద్ద వివాదాస్పదంగా ఉన్న వస్తువు ఏంటో తెలుసా.. ‘పౌడర్’.. అవునండీ.. మీరు చదివింది నిజమే.. రిచా బ్యాగ్‌లో ఉన్న పౌడర్‌పై విమానాశ్రయ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవానికి అది ఆయుర్వేద పద్ధతిలో తయారుచేసిన అందాన్ని సంరక్షించే పౌడరు. రిచా గత ఆరు నెలలుగా తన సౌందర్య రక్షణ కోసం ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రత్యేకంగా తయారుచేసిన ఆయుర్వేద పౌడర్‌ను ప్రయాణ సమయంలో ఆమె నిత్యం తన వెంట తీసుకువెళతారు. అయితే ఈ సారి ప్రయాణంలో ఆ పౌడర్ ఈ అందాల బాలీవుడ్ నటికి తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని రిచా ధ్రువీకరించింది.. ‘అవును.. నాకు ఆయుర్వేదంలో విపరీతమైన నమ్మకం. నా వెంట ఎప్పుడూ ఆయుర్వేద ఉత్పత్తులు ఉంటాయి. అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆయుర్వేద పౌడర్‌ను చూసి అనుమానించిన అధికారులకు దాని గురించి పూర్తిగా వివరించాను. రెండు గంటలపాటు వారి అనుమానాలను నివృత్తి చేశాను. వారిపై నాకు ఎటువంటి కోపం లేదు.. వారి పనిని వారు సక్రమంగా నిర్వర్తించారు.. అందుకే వారికి పూర్తిగా సహకరించాను. అయితే అదృష్టం కొద్దీ నా విమానం మిస్ కాలేదు..’ అని ఆమె ముక్తాయించారు.