షకీలా.. బోల్డ్‌ ఫస్ట్‌ లుక్‌ | Adult Star Shakeela Biopic Bold First Look | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 20 2018 1:02 PM | Last Updated on Tue, Nov 20 2018 1:02 PM

Adult Star Shakeela Biopic Bold First Look - Sakshi

సౌత్‌లో శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన నటి షకీలా. మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సైతం గట్టి పోటి ఇచ్చిన షకీలా జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ‘షకీలా నాట్‌ ఏ పోర్న్‌ స్టార్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి రిచా చడ్డా టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ఉన్న రిచా ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంద్రజిత్‌ లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పంకజ్‌ త్రిపాఠి, ఎస్తర్‌ నొరొహ, రాజీవ్‌ పిల్లైలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement