Biopic Movie
-
సిల్క్ స్మిత బయోపిక్ గ్లింప్స్ విడుదల.. అంచనాలు పెంచేసిన మేకర్స్
సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ నటిగా వెలిగిన దివంగత సిల్క్ స్మిత జీవితంపై మరో బయోపిక్ రెడీ అవుతుంది. 'సిల్క్ స్మిత - ది క్వీన్ ఆఫ్ సౌత్' పేరుతో ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది. సిల్క్ స్మిత పాత్రలో చంద్రికా రవి అనే నటి కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జయరామ్ అనే కొత్త దర్శకుడు పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఆమె వ్యక్తిత్వం సహా చాలా విషయాలను చూపిస్తామని దర్శకుడు ఇప్పటికే తెలిపాడు.1980, 1990 దశకాల్లో భారత సినీ పరిశ్రమలో సిల్క్ స్మిత పేరు మార్మోగింది. 17 ఏళ్ల పాటు పరిశ్రమలో ఉన్న ఆమె 5 భాషలలో 450కి పైగా సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేసింది. 1996 సెప్టెంబర్ 23న ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. సిల్క్ మరణం ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ప్రాంతం నుంచి వచ్చిన సిల్క్ స్మిత.. తన గ్లామర్‌తో ఎవరికి దక్కనంత రేంజ్లో అభిమానులను సొంతం చేసుకుంది. ఎవరికీ తెలియని విషయాలను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలుపుతానని దర్శకుడు చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. -
ఇళయరాజా బయోపిక్‌పై నీలినీడలు?
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరిగిన విషయం తెలిసిందే. వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని, 7 వేలకు పైగా పాటలకు బాణీలు కట్టిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఎనలేని గుర్తింపు పొందారు. ఆయన బయోపిక్ తెరకెక్కనున్న వార్త, సంగీత ప్రియుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఒక లెజెండ్.. ఆయన బయోపిక్‌లో నటుడు ధనుష్ నటించడానికి సమ్మతించడం కూడా మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. దీన్ని ఇంతకు ముందు ధనుష్ కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఓ బాలీవుడ్ సంస్థ దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా ఈ చిత్ర పరిచయ కార్యక్రమాన్ని చాలా రోజుల క్రితమే చైన్నెలో నిర్వహించారు. అందులో సంగీత దర్శకుడు ఇళయరాజా, నటుడు కమలహాసన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పటివరకు ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాలేదు. అదేవిధంగా నటుడు ధనుష్ కథానాయకుడిగా ,దర్శకుడుగా తన చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళయరాజా బయోపిక్‌పై నీలినీడలు పడుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణానికి బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ సెట్ కాదని అభిప్రాయాన్ని యూనిట్ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్ర షూటింగ్ ఆదిలోనే ఆగిపోతుందా? లేక వేరే సంస్థ దీని నిర్మాణ బాధ్యతలను చేపడుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. -
కిశోర్‌కుమార్ బయోపిక్‌లో..?
ప్రముఖ దివంగత గాయకుడు– నటుడు కిశోర్ కుమార్ బయోపిక్ కోసం హిందీ చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కిశోర్ కుమార్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై స్పష్టత రావడం లేదు. పైగా ఎప్పటికప్పుడు పేర్లు మారుతున్నాయి. తొలుత అక్షయ్ కుమార్ పేరు వినిపించింది. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ పేరు బీ టౌన్లో గట్టిగా వినిపిస్తోంది. కిశోర్ కుమార్ బయోపిక్కు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తారని, భూషణ్ కుమార్ నిర్మిస్తారని ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ గురించి ఇటీవల ఆమిర్ ఖాన్ – అనురాగ్ బసుల మధ్య చర్చలు జరిగాయని, త్వరలోనే ఈ ్ర΄ాజెక్ట్ గురించి ఓ అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని భోగట్టా. మరోవైపు ‘చార్ దిన్ కీ జిందగీ, గజిని 2, ఉజ్వల్ నికమ్ బయోపిక్, ఓ సూపర్ హీరో ఫిల్మ్ (దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో) చిత్రాలు కూడా ఆమిర్ ఖాన్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి... ఆమిర్ ఖాన్ నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ఆమిర్ నటించిన ‘సితారే జమీన్ పర్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
ఇందు రెబెక్కా వర్గీస్‌గా...
ఇందు రెబెక్కా వర్గీస్‌గా తనను తాను పరిచయం చేసుకున్నారు హీరోయిన్ సాయిపల్లవి. అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ ‘అమరన్’. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ బహు బాషా చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని హీరోయిన్ ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రను సాయిపల్లవి పోషిస్తున్నారు. శుక్రవారం సాయిపల్లవి పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్’ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా ‘అమరన్’ సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ప్రోడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ‘అమరన్’ అక్టోబరు 31న రిలీజ్ కానుంది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. -
భారతరత్నానికి విద్యా చిత్ర నీరాజనం
‘‘గాన కోకిల ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అమ్మాళ్ అంటే నాకు వల్లమాలిన ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆమె కమనీయ కంఠస్వరాన్ని వింటూ పెరిగాను. మా అమ్మ ద్వారా నాకు సుబ్బులక్ష్మి అమ్మ సుప్రభాతం వినడం అలవాటైంది. ఇప్పటికీ నా దినచర్యప్రారంభమయ్యేది ఆ అమ్మ గాంధర్వ గానం వినడంతోనే. ఆమె 108వ జయంతి సందర్భంగా ఆ భారతరత్నానికి నేను సమర్పించగల చిరు కానుక ఇదే’’ అంటూ విద్యాబాలన్ భావోద్వేగపూరితమైనపోస్ట్ పెట్టారు. ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని తలపించేలా నాలుగు రకాల చీరల్లో విద్యాబాలన్ ఫొటోషూట్ చేయించుకున్నారు. ఈ చీరల గురించి ఆమె ఆపోస్ట్‌లో... ‘‘1960–80ల మధ్య ఎమ్మెస్ అమ్మ ఈ తరహా చీరలు ధరించారు. అప్పట్లో ఈ చీరలకు చాలా ప్రాచుర్యం ఉంది.ఎమ్మెస్ అమ్మ హుందాతనానికి చీరలది సగ భాగం అయితే మిగతా సగం ఆమె నుదుటి పైన కుంకుమ, విభూది, రెండు వైపులా ముక్కు పుడకలు, కొప్పు, కొప్పు చుట్టూ మల్లెపువ్వులకు దక్కుతుంది’’ అని పేర్కొన్నారు విద్యాబాలన్. కాగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా తయారు కావడానికి ఆమె మనవరాలు, ప్రఖ్యాత ఫ్లూటిస్ట్ సిక్కీ మాలా సహాయం చేశారట. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ... ‘‘నేను మనస్ఫూర్తిగా సంకల్పించుకున్న ఈ ప్రయత్నానికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సిక్కీమాలా మేడమ్. అలాగే నా ఈ కల సాకారం కావడానికి కారణమైన అనూపార్థసారథి (కాస్ట్యూమ్ డిజైనర్)కి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా చాలదు. భారతీయ గానకోకిల, భారతరత్న డా. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి విలక్షణమైన శైలికి నివాళిగా ఈ చిత్రమాలికను విడుదల చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు విద్యాబాలన్. కాగా ఎమ్మెస్గా విద్య చక్కగా ఒదిగి΄ోయారంటూ ఈ ఫొటోషూట్‌కి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే... ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా సినిమా రూపొందించడానికి బాలీవుడ్లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ గాన కోకిలగా ఫలానా తార నటించనున్నారంటూ వచ్చిన వార్తల్లో విద్యాబాలన్ పేరు కూడా ఉంది. తాజా ఫొటోషూట్ చూస్తే ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా విద్యాబాలన్ న్యాయం చేయగలరనిపించక మానదు. మరి... వెండితెర సుబ్బులక్ష్మిగా ఎవరు కనిపిస్తారో చూడాలి. -
తెరపైకి యువరాజ్ సింగ్ జీవితం
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రానుంది. భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ నిర్మించనున్న ఈ బయోపిక్‌ను మంగళవారం ప్రకటించారు. భారత క్రికెట్లో పదిహేడేళ్ల సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్, ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం, క్యాన్సర్ మహమ్మారితో పోరాడటం, 2007లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత టీమ్‌లో రాణించడం, ధోనీతో విభేదాలు అనే వార్త, ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమ అనే గాసిప్... ఇలా యువరాజ్ లైఫ్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.ఈ అంశాలను ఈ సినిమాలో ఎంత మేరకు చూపించాలనుకుంటున్నారని తెలియాల్సి ఉంది. అలాగే యువరాజ్ సింగ్‌గా ఎవరు నటించనున్నారు? దర్శకత్వం వహించేది ఎవరు? అనే విషయాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ఫ్యాన్స్ కోసం నా బయోపిక్ తెరకెక్కనున్నందుకు హ్యాపీగా ఉంది. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ వారి కలలను నెరవేర్చుకునేలా నా బయోపిక్ స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు యువరాజ్ సింగ్. -
తెరపైకి బ్రిట్నీ జీవితం
ప్రముఖ అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం వెండితెరపైకి రానుంది. తన జీవితం ఆధారంగా బ్రిట్నీ స్పియర్స్ ‘ది ఉమెన్ ఇన్ మీ’ (మెమొర్) అనే పుస్తకం రాశారు. ఇందులో బ్రిట్నీ ప్రేమ విశేషాలు, చేదు అనుభవాలు, కుటుంబ విశేషాలు.. ఇలా చాలా అంశాలు ఉన్నాయట. ఇరవైఆరు భాషల్లో రిలీజ్ అయిన ఈ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. అంతేకాదు.. ఈ పుస్తకం ఆడియో వెర్షన్‌కు ప్రముఖ హాలీవుడ్ నటి మిచెల్ విలియమ్స్ వాయిస్ ఇచ్చారు. ఈ బుక్ హక్కులను యూనివర్సల్ పిక్చర్స్ దక్కించుకుంది. దీంతో బ్రిట్నీ బయోపిక్ ప్రస్తుతం హాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. దర్శకుడు జోన్ ఎమ్ చు ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారని, మార్క్ ప్లాట్ నిర్మించనున్నారని టాక్. ఇక ‘నా ఫేవరెట్ మూవీస్ తీసిన మార్క్ ప్లాట్‌తో ఓ సీక్రెట్ ్రపాజెక్ట్ చేస్తున్నానని నా ఫ్యాన్స్‌కు చెప్పడానికి హ్యాపీగా ఉంది’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు బ్రిట్నీ. -
ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో..?
ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో హీరోయిన్ కీర్తీ సురేష్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు. మహానటి సావిత్రి బయోపిక్‌గా రూ΄÷ందిన ‘మహానటి’ (2018)లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు కీర్తీ సురేష్. ఈ చిత్రానికిగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారామె. ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ సినిమా లతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్న కీర్తి తాజాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించనున్నారని భోగట్టా. ఈ సినిమా దర్శకుడు, నిర్మాణ సంస్థ వంటి వివరాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రని కీర్తీ సురేష్ ΄ోషించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ టాక్. తమిళనాడులోని మధురైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుబ్బలక్ష్మి ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎలా ఎదిగారు? ఆమె ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనందం, విషాద ఘటనల నేపథ్యంలో ఈ బయోపిక్ తెరకెక్కనుందట. ఈ పాత్రకి కీర్తీ సురేష్ సరైన ఎంపిక అని చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా, ఆమె పచ్చజెండా ఊపారని టాక్. కాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి 2004 డిసెంబరు 11న తుది శ్వాస విడిచారు. -
పుట్టుకతోనే బ్లైండ్..ప్రపంచానికే ఇన్స్పిరేషన్..ఇతన్ని మేధా శక్తి చూస్తే..
-
శ్రీదేవి బయోపిక్కు అనుమతి ఇవ్వను
ప్రముఖ దివంగత నటి శ్రీదేవి బయోపిక్ గురించి బాలీవుడ్లో అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కాగా శ్రీదేవి బయోపిక్ గురించి ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పందించారు. ‘‘శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె జీవితం కూడా ప్రైవేట్‌గానే ఉండాలి. అందుకే నేను బతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు అనుమతి ఇవ్వను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాతో బోనీ కపూర్ మాట్లాడినట్లుగా బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’కు బోనీ కపూర్ ఓ నిర్మాత. ఈ నెల 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీదేవి బయోపిక్ ప్రస్తావన వచ్చినప్పుడు బోనీ పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్‌లో మరణించిన సంగతి తెలిసిందే. -
ప్రజాకవి కాళోజీకి మరో అవార్డు
ప్రముఖ కవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు బయోపిక్‌గా రూపొందించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. మూలవిరాట్ (అశోక్ రెడ్డి) టైటిల్ రోల్లో నటించారు. డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో జైనీ క్రియేషన్స్‌పై విజయలక్ష్మీ జైనీ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలైంది. ఇప్పటికే పలు అవార్డులు సాధించిన ఈ మూవీ తాజాగా ఇండియన్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ 2024లో ఫీచర్ ఫిక్షన్ కేటగిరీలో స్పెషల్ జ్యురీ అవార్డు సొంతం చేసుకుంది. ఈ అవార్డును ప్రభాకర్ జైనీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘కాళోజీ నారాయణరావుగారి జీవిత విశేషాలతో ‘ప్రజాకవి కాళోజీ’ మూవీ తీసినందుకు చిత్రసీమకు చెందిన అనేక మంది ప్రముఖులు నన్ను ప్రశంసించారు. ఒక కవి మీద సినిమా తీయడం చాలా సాహసమని కొనియాడారు. మా సినిమాకి మొత్తం 8 అవార్డులు రావడం హ్యాపీ’’ అన్నారు. -
మధుభాల బయోపిక్ షురూ
‘ప్యార్ కియా తో డర్నా క్యా..’ అంటూ ‘మొఘల్ ఎ అజం’ (1960) చిత్రంలో వెండితెరపై అనార్కలిగా ప్రేమ కురిపించిన మధుబాలను నాటి తరం అంత సులువుగా మర్చిపోదు. ఈ తరం ప్రేక్షకుల కోసం ఆమె జీవితం వెండితెరకు రానుంది. ‘ఇండియన్ సినిమా సౌందర్య దేవత’గా కితాబులందుకున్న మధుబాల తన ఇరవయ్యేళ్ల కెర్ర్లో అరవైకి పైగా చిత్రాల్లో నటించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ 55, హాఫ్ టికెట్, మహల్, బాదల్’.. ఇలా పలు చిత్రాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు మధుబాల. 1933లో జన్మించిన మధుబాల అతి చిన్న వయసు (36)లోనే కన్ను మూశారు. ఈ 36 ఏళ్ల జీవితంలో మధుబాల సినీ, వ్యక్తిగత జీవితం గురించి తెలియని చాలా విషయాలను బయోపిక్‌లో చూపించనున్నారు. ప్రముఖ నటుడు దిలీప్‌కుమార్‌తో అనుబంధం, ప్రముఖ గాయకుడు, నటుడు కిశోర్‌కుమార్‌తో వివాహం వంటి విషయాలూ ఈ చిత్రంలో ఉంటాయట. ఆలియా భట్‌తో ‘డార్లింగ్స్’ చిత్రాన్ని తెరకెక్కించిన జస్మీత్ కె రీన్ మధుబాల బయోపిక్‌కి దర్శకురాలు. ఈ చిత్రాన్ని మధుబాల వెంచర్స్ పతాకంపై మధుబాల సోదరి మధుర్ బ్రిజ్ భూషణ్ నిర్మించనున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, బ్రూయింగ్ థాట్స్ ్రౖపైవేట్ లిమిటెడ్ కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉంటాయి. ‘‘ఈ చిత్రంతో ఎవరి మనోభావాలనూ దెబ్బ తీయాలనే ఆలోచన లేదు. మధుబాల జీవితం గురించి ఉన్న కొన్ని అపోహలను ఈ చిత్రం తొలగిస్తుంది. సినిమా కోసం కొంత స్వేచ్ఛ తీసుకున్నప్పటికీ నిజాయితీగానే రూపొందిస్తాం’’ అని మధుర్ పేర్కొన్నారు. ఇంకా కథానాయిక ఖరారు కాలేదు. కాగా శుక్రవారం ఈ బయోపిక్ ప్రకటన వచ్చినప్పట్నుంచి మధుబాలగా నటించే చాన్స్ ఏ కథానాయికకు దక్కుతుందనే చర్చ మొదలైంది. -
దిగ్గజ పాప్ సింగర్ బయోపిక్.. రూ.1000 కోట్ల బడ్జెట్?
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ‘మైఖేల్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ సోదరుడు జెర్మైన్ జాక్సన్ తనయుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్నారు. ‘‘జాఫర్ అచ్చం మైఖేల్ జాక్సన్‌లానే ఉన్నాడు. జాఫర్ నడక.. డ్యాన్స్... ఇలా అన్నీ మైఖేల్లానే ఉంటాయి. అందుకే మైఖేల్పాత్రకు జాఫర్ తప్ప వేరే ఎవరూ నప్పరు’’ అని ఈ చిత్రదర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా, నిర్మాత గ్రాహం కింగ్ అన్నారు. ఇప్పటికే విడుదలైన జాఫర్ లుక్ చూసి, ‘మైఖేల్ తిరిగి వచ్చాడా అన్నట్లు ఉంది’ అని అభిమానులు సైతం పేర్కొన్నారు. కాగా, మైఖేల్ జీవితంలో ఉన్న వివాదాల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకుపాల్పడ్డారన్నది ఒకటి. అయితే మైఖేల్ అమాయకుడని, చిన్నారులను వేధించలేదనే కోణంలో ‘మైఖేల్’ చిత్రాన్ని ఆంటోయిన్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకూ హాలీవుడ్లో రూపొందిన బయోపిక్స్‌లో ‘మైఖేల్’ అత్యంత భారీ బడ్జెట్ బయోపిక్ అంటోంది హాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్. రూ. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ అని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ‘మైఖేల్’ చిత్రం పెట్టిన పెట్టుబడికి రెండింతలు... అంటే రూ. రెండువేల కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. ఇక 2009 జూన్ 25న మైఖేల్ కన్ను మూసిన విషయం తెలిసిందే. -
త్వరలోనే రామదాస్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే?
సినీ, రాజకీయ సెలబ్రిటీల జీవిత చరిత్ర వెండితెరకెక్కడం పరిపాటిగా మారింది. గతంలో కామరాజర్, జయలలిత, గాంధీజీ, క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని ఇలా పలువురు ప్రముఖుల బయోపిక్‌లు చిత్రాలుగా రూపొందాయి. తాజాగా పీఎంకే నేత రామదాస్ జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు భారతి కనమ్మ, వెట్రిక్కోడి కట్టు, పాండవ భూమి, ఆటోగ్రాఫ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన చేరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది. పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లోనూ కథానాయకుడిగా నటించిన చేరన్ ఇటీవల జర్నీ అనే వెబ్ సీరీస్‌కు దర్శకత్వం వహించారు. తాజాగా దర్శకత్వం పైనే దృష్టిపెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సుదీప్ హీరోగా తమిళం, కన్నడం భాషల్లో ఒక చిత్రం చేస్తున్నారు. దీన్ని పూర్తిచేసిన తరువాత డా.రామదాస్ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో డి.రామదాస్ పాత్రలో శరత్‌కుమార్ నటించనున్నట్లు తెలుస్తోంది. రామదాస్ ఒక్కపక్క వైద్యవృత్తి నిర్వహిస్తునే మరో పక్క అణగారిన వన్నియార్ సామాజిక వర్గం న్యాయ హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడడం, అలా పాట్టాలి మక్కల్ కట్చి పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించడం వంటి అంశాలతో బయోపిక్‌ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
తెరపైకి సిల్క్ స్మిత జీవితం
అలనాటి గ్లామరస్ తార సిల్క్ స్మిత జీవితం ‘సిల్క్ స్మిత: ది అన్‌టోల్డ్ స్టోరీ’గా వెండితెరపైకి రానుంది. సిల్క్ స్మితలా చంద్రికా రవి నటించనున్నారు. వి. మహాస్త్రీ అమృతరాజ్ సమర్పణలో జయరామ్ దర్శకత్వంలో ఎస్బీ విజయ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. శనివారం (డిసెంబరు 2) సిల్క్ స్మిత జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. 1980, 1990వ దశకాల్లో గ్లామరస్ తారగా వెలుగొందారామె. స్మిత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ‘సిల్క్ స్మిత: ది అన్‌టోల్డ్ స్టోరీ’ని ప్రపంచానికి చెప్పనున్నాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
కవిత్వం చెప్పగలడు
మూల విరాట్, పద్మ, రాజ్‌కుమార్, స్వప్న ముఖ్య తారలుగా ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. ప్రముఖ కవి కాళోజీ నారాయణ బయోపిక్‌గా విజయలక్ష్మీ జైనీ నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణ మూర్తి, తెలంగాణ సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ, నిర్మాత రామసత్యనారాయణ, దర్శకులు వీయన్ ఆదిత్య, వేణు ఊడుగుల సినిమా హిట్టవ్వాలన్నారు. ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ– ‘‘ఒక రిక్షావాడు కూడా కవిత్వం చెప్పగలడని ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు. ‘‘కాళోజీగారి ఆత్మ నా ద్వారా ప్రేక్షకులకు పరిచయమవుతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు కాళోజీ పాత్రధారి మూల విరాట్. -
ఓటీటీకి స్పిన్ మాంత్రికుడి బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించి చిత్రం '800'. ఈ చిత్రంలో స్లమ్ గాడ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరేన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా.. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించారు. అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సినీ ప్రేక్షకులతో పాటు క్రికెట్ అభిమానులను అలరించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 2 నుంచి జియో సినిమాలో ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తమిళం, తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో రిలీజ్ కానుంది. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 800 కథేంటంటే.. ముత్తయ్య మురళీధరన్ అంటే 800 వికెట్లు తీసిన ఏకైన క్రికెటర్‌గానే అందరికి తెలుసు.అయితే ఈ 800 వికెట్లు తీయడానికి వెనుక ఆయన పడిన కష్టమేంటి? తమిళనాడు నుంచి వలస వెళ్లి శ్రీలంకలో సెటిల్ అయిన మురళీధరన్ ఫ్యామిలీ.. అక్కడ ఎలాంటి వివక్షకు గురైంది? వివక్షను, అవమానాలను తట్టుకొని శ్రీలంక జట్టులో చోటు సంపాదించుకున్న మురళీధరన్.. స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. తొలిసారి ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన మురళీధరన్.. జట్టు నుంచి ఎలా స్థానాన్ని కోల్పోయాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ‘చకింగ్ ’అవమానాలను ఎలా అధిగమించాడు? తన బౌలింగ్‌పై వచ్చిన ఆరోపణలు తప్పని ఎలా నిరూపించుకున్నాడు? శ్రీలంకలోని ఎల్టీటీఈ సమస్యపై ప్రభాకరన్‌తో ఎలాంటి చర్చలు జరిపాడు? ఆ ఆలోచన ఎలా వచ్చింది? 1000 వికెట్లు తీసే సామర్థ్యం ఉన్నప్పటికీ..ముందుగానే ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ‘800’ సినిమా చూడాల్సిందే. கிரிக்கெட் உலகை புரட்டி போட்ட #MuthiahMuralidaran என்னும் மாமனிதனின் உண்மை கதை. டிசம்பர் 2 முதல் #800 திரைப்படத்தை #JioCinema-வில் இலவசமாய் காணுங்கள்#800onJioCinema@Murali_800 @Mahima_Nambiar #MadhurrMittal @MovieTrainMP pic.twitter.com/as03GoaPyn — JioCinema (@JioCinema) November 14, 2023 -
ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్
సంగీత జ్ఞాని ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ఇందులో ధనుష్ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నారు. మెర్క్యూరీ గ్రూప్, కనెక్ట్ మీడియా సంస్థలు ఈ బయోపిక్‌ను నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది అక్టోబరులో ఈ చిత్రం షూటింగ్ప్రారంభించి, 2025 ఏడాది మధ్యలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా మెర్క్యూరీ గ్రూప్ సీఈవో, ఎండీ శ్రీరామ్ భక్తి శరణ్ మాట్లాడుతూ –‘ప్రాంంతీయ కథలతో సినిమాలు తీస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. అందుకే లోకల్,ప్రాంతీయ కథలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘రాబోయే రెండు దశాబ్దాల్లో భారతీయ వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ వినోద పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన మెర్క్యూరి సంస్థతో మెగా బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి వారితో చేతులు కలపడం మాకు సంతోషంగా ఉంది’’ అని కనెక్ట్ మీడియా ప్రతినిధి వరుణ్ మాథుర్ అన్నారు. -
తెలంగాణ సీఎం అభ్యర్థి బయోపిక్.. టీజర్ రిలీజ్
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఓ వైపు అన్ని పార్టీల నాయకులు, ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే టైంలో ఆయా పార్టీలు.. సినిమాలతోనూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే 'కేసీఆర్' సినిమా రానుండగా, ఇప్పుడు మరో పార్టీ తరఫున పోటీలో ఉన్న ముఖ్యమంత్రి అభర్థి బయోపిక్ విడుదలకు సిద్ధమైంది. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!) నీల మామిడాల నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా 'ప్రవీణ్ ఐపీఎస్'. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నవంబరులో ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి, ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఐపీఎస్ మాజీ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోలో.. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఎలివేషన్ ఇచ్చేలా డైలాగ్ పెట్టారు. తప్పితే క్యారెక్టర్స్‌ని పెద్దగా చూపించలేదు. అయితే ఈ సినిమాలో నందకిషోర్, రోజా హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. దుర్గా దేవ్ నాయుడు దర్శకుడు. నవంబరు చివర్లో ఎన్నికల జరగడానికి ముందే ఈ సినిమా రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
యువతకు మురళీధరన్ స్ఫూర్తి
‘‘మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. కానీ, అంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి, నిగర్వి. ఈ తరం యువతకు రోల్ మోడల్, స్ఫూర్తి. అతనిలాంటి స్నేహితుడు ఉండటం అదృష్టం. తనకు క్రికెట్టే జీవితం’’ అని క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూ΄÷ందిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్, ఆయన భార్య మది మలర్‌గా మహిమా నంబి యార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘800’ ప్రీ రిలీజ్ వేడుకకి వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ– ‘‘క్రికెట్ అంటే రికార్డులు కాదు... స్నేహితుల్ని చేసుకోవడం. లక్ష్మణ్ నాకు క్లోజ్ ఫ్రెండ్. ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీమ్ ఏర్పాటు చేయాల్సి వస్తే హీరో వెంకటేశ్‌ని కెప్టెన్ చేయాలి.. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం’’ అన్నారు. ‘‘కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘ఈ సినిమాలో మురళీధరన్ క్రికెట్ గురించి మాత్రమే కాదు. ప్రజలకు తెలియని ఆయన జీవితం ఎంతో ఉంది’’ అన్నారు మధుర్ మిట్టల్. -
నా పూర్వజన్మ సుకృతం ఇది
తెలంగాణ ప్రజా కవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జీవితం ఆధారంగా ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. కాళోజీగా మూల విరాట్ నటించారు. విజయలక్ష్మీ జైనీ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌కు వెళుతోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ– ‘‘కాళోజీలాంటి గొప్ప కవి సినిమా తీయడం సాహసమే అయినప్పటికీ నాకీ అవకాశం రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘త్వరలో విడుదల కాబోతున్న మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు విజయలక్ష్మీ జైనీ. ‘‘ఈ సినిమాలో నటించడానికే సినిమా రంగంలోకి వచ్చినట్లుగా భావిస్తున్నా. కాళోజీ ΄ాత్ర చేశాకే నా జీవితానికి సార్థకత లభించిందనే భావన కలుగుతోంది’’ అన్నారు మూల విరాట్. -
చేగువేరా బయోపిక్ నేపథ్యంలో వస్తోన్న 'చే'
క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం "చే". లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచంలో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇదే. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిత్రయూనిట్‌ను అభినందించారు. (ఇది చదవండి: యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!) ఈ సందర్భంగా హీరో , దర్శకుడు బీఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ... ' విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు ఈ చిత్రంలో చూపించాం. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ సినిమాను రూపోందించాం." అని చెప్పారు. త్వరలో సినిమా టీజర్ ,ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదిని ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. (ఇది చదవండి: ప్రేయసిని పెళ్లాడిన హీరో, ఫోటోలు వైరల్) -
వైఎస్ రాజశేఖర రెడ్డి వాయిస్‌తో .. యాత్ర-2 పోస్టర్ వచ్చేసింది
2019లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా వచ్చిన 'యాత్ర' సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి.రాఘవ్ సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇటీవలే ఆయన విడుదల చేశారు. ఆ పోస్టర్లో మహి వి.రాఘవ్ ఇలా చెప్పుకొచ్చాడు.. 'నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్. రాజశేఖరరెడ్డి కొడుకుని' అనే లైన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నేడు (జులై 8) వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా యాత్ర-2కు సంబంధించి మోషన్ పోస్టర్‌ను ఉదయం 11:35 గంటలకు దర్శకులు మహి వి.రాఘవ్ విడుదల చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాటలతో మోషన్ పోస్టర్ ప్రారంభం అవుతుంది. 'నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా నమస్తే.. నమస్తే...' అంటూ ఆ నాడు ఆయన మాట్లాడిన గొంతును డైరెక్టర్ మహి వి.రాఘవ్ నేడు మళ్లీ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 'నేను విన్నాను... నేను ఉన్నాను' అనే మాటలతో వీడియో ముగుస్తుంది. వీరిద్దరూ చెప్పిన ఈ మాటలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఎంతగానో దగ్గరకు చేరాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, వైఎస్సార్ సీపీ ఆవిర్భావం, ఆపై 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి పీఠం చేపట్టడం తదితర అంశాలను యాత్ర 2 లో ఉండనుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. -
Yatra 2 Update: ఒక్కటి గుర్తు పెట్టుకోండి!
‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అంటూ ‘యాత్ర 2’ సినిమా పోస్టర్ని విడుదల చేసింది చిత్రయూనిట్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ (2019) సినిమా మంచి విజయం అందుకుంది. ‘యాత్ర’ కి సీక్వెల్‌గా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్‌తో ‘యాత్ర 2’ ఉంటుందని మహీ వి.రాఘవ్ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ అప్డేట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వారం ముందే అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది చిత్రయూనిట్. మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో వి.సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మించనున్న ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ని విడుదల చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. ఇందులో జగన్ పాత్రలో ‘రంగం’ మూవీ ఫేమ్ జీవా నటించనున్నారు. ఆగస్టు 3 నుంచి ‘యాత్ర 2’ షూటింగ్ మొదలవుతుంది. -
ప్రత్యక్ష దైవం సాయిబాబా
షిర్డీ సాయిబాబా జీవితం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి’. సాయిబాబాగా రామలింగా రెడ్డి నటించారు. కొండవీటి సత్యం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భానుచందర్, సీత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాటల ప్రదర్శన హైదరాబాద్‌లో జరిగింది. విశ్రాంత ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ ఛీప్ కమీషనర్ నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఓం సాయి ప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘సాయిభక్తుల అనుభవాలతో సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘యువతరంలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మించారు మచ్చా రామలింగారెడ్డి’’ అన్నారు చీఫ్ కమిషనర్ నరసింహప్ప. ‘‘యం.ఆర్. రెడ్డి మంచి భక్తిరస చిత్రాన్ని నిర్మించాలనుకోవడం అభినందనీయం’’ అని ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ అన్నారు. చిత్రదర్శకుడు కొండవీటి సత్యం, నిర్మాతలు వెంకట్, వి. సుబ్బారావు, సంగీతదర్శకులు కిషన్ కవాడియా, పాటల రచయిత బిక్కి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జీవితంతో బాబూజి
భారత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘బాబూజి’. దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందు తున్న ఈ చిత్రం షూటింగ్ గుంటూరులో జరుగుతోంది. కాగా అదే నగరానికి వెళ్లిన జగ్జీవన్‌రామ్ కుమార్తె, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఈ చిత్రంలో జగ్జీవన్‌రామ్ పాత్రధారి మిలటరీ ప్రసాద్‌పై చిత్రీకరిస్తున్న సీన్‌కి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ – ‘‘మహాత్మాగాంధీ ఆహ్వానంతో స్వాతంత్య్ర ఉద్యమంలోకి వచ్చిన జగ్జీవన్‌రామ్ మరెందరినో ఆ ఉద్యమంలోకి తీసుకురావటం, జైలు శిక్ష అనుభవించడం వంటివాటిని ‘బాబూజి’లో తప్పనిసరిగా చూపించాలని మీరాకుమార్ సూచించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, 2024 జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. -
'నాకు నచ్చలేదు.. బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా'
'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' అనగానే మదిలో మెదిలే బౌలర్ పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్. ఇప్పుడు అదే 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' పేరుతో బయోపిక్ రూపొందించాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌ను ముహ్మద్ ఫర్హాజ్ ఖాసిర్ డైరక్టర్‌గా వ్యవహరించగా.. క్యూ ఫిలిం ప్రొడక్షన్ తెరకెక్కించింది. అయితే తాజాగా బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు షోబయ్ అక్తర్ శనివారం రాత్రి ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ప్రొడక్షన్ హౌస్‌తో వచ్చిన విబేధాల కారణంగానే బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు తన అనుమతి లేనిదే బయోపిక్ రూపొందిస్తే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్‌ను హెచ్చరించాడు. ''రావల్పిండి ఎక్స్‌ప్రెస్ బయోపిక్ నుంచి తప్పుకోవడం చాలా బాధాకరం. కొన్ని నెలల కింద నుంచే మేకర్స్‌తో మనస్పర్థలు వచ్చాయి. ఈ కారణంగానే బయోపిక్ రూపొందించడాన్ని విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నా. త్వరలోనే నా మేనేజ్మెంట్, లీగల్ టీమ్ మేకర్స్‌తో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుంది. నా అనుమతి లేకుండా మేకర్స్ బయోపిక్‌ను తెరకెక్కిస్తే మాత్రం లీగల్‌గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా'' అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు. ఇక పాకిస్తాన్ క్రికెటలో తన ఆటతో అక్తర్ చెరగని ముద్ర వేశాడు. 1997లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్తర్ 2011లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. వేగానికి మారుపేరైన అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టి20 మ్యాచ్‌లు ఆడాడు.అక్తర్ ఒక మ్యాచ్‌లో 161 కిమీవేగంతో విసిరిన బంతి క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిగా కొన్నేళ్ల పాటు నిలిచిపోయింది. Important announcement. pic.twitter.com/P7zTnTK1C0 — Shoaib Akhtar (@shoaib100mph) January 21, 2023 చదవండి: భారత క్రికెటర్‌కు చేదు అనుభవం.. నమ్మితే నట్టేట ముంచాడు -
వెండితెరపై మైఖేల్ జాక్సన్ బయోపిక్!
పాప్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ ఓ సంచలనం.ఆయన ఈ లోకాన్ని విడిచి ఎన్నో ఏళ్లు గడిచిపోయింది. అయినా కూడా క్రేజ్ తగ్గలేదు సరికదా, ఏ తరానికి చెందినవారికైనా మైఖెల్ వదిలి వెళ్లిన స్టెప్పులు, స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి. స్టేజ్ పై అతను కనిపించే తీరు, వీడియోస్ అతని స్టైల్, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని అభిమానుల్ని సంపాదించి పెట్టింది. తన కెరీర్ లోనే ఎన్నో కళ్లు చెదిరే స్టెప్పులు వేశాడు. వాటిల్లో మూన్ వాక్ అతనికి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే మైఖేల్ వ్యక్తిగత జీవితంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఇటు స్టార్ డమ్, అటు కాంట్రవర్సీస్ వీటన్నిటినీ ఇప్పుడు తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హాలీవుడ్ కు చెందిన లయన్స్ గేట్ ఎంటర్ టైన్ మెంట్ కార్పోరేషన్ ఇప్పుడు మైఖెల్ జాక్సన్ జీవితం పై బయోపిక్ తెరకెక్కించబోతోంది. మైఖెల్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని అమెరికన్ ఫిల్మ్ మేకర్ ఆంటోనీ తెరకెక్కించనున్నాడు. 1998 నుంచి ఇతను సినిమాలు తీస్తూ వస్తున్నాడు. 2001లో వచ్చిన ట్రైనింగ్ డే సినిమా ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు పాప్ కింగ్ లైఫ్ ను వెండితెరకెక్కించాలనుకుంటున్నాడు. మైఖెల్ జాక్సన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. -
విజయానంద్ బయోపిక్.. నేటి తరానికి స్ఫూర్తి..
కొన్ని చిత్రాలు వినోదాన్ని కలిగిస్తే మరికొన్ని చిత్రాలు సమాజానికి ప్రేరణగా నిలుస్తాయి. సూరరై పోట్రు వంటి చిత్రాలు రెండో కోవకు చెందినవే. తాజాగా విడుదలైన విజయానంద్ చిత్రం అలాంటిదే. జీవితం సంతోషంగా సాగిపోతోంది, అక్కడితో ఆగిపోకూడదు. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కనాలి. అందుకు శక్తి వంచన లేకుండా శ్రమించాలి. ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని అనుకున్నది సాధించాలి. ఈ నేపథ్యంలో రూపొందిన చిత్రమే విజయానంద్. ఈ కథ కల్పన కాదు.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి స్వయం కృషితో అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి నిజ జీవితం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త విజయ్ సంగేశ్వర్ బయోపిక్. అందుకే ఆ చిత్రాన్ని నేటి యువతకు ప్రేరణగా పేర్కొనవచ్చు. విజయ్ సంగేశ్వర్ తండ్రి మ్యాన్యువల్ ప్రింటింగ్ మిషన్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించారు. ఆయనకు చేదోడుగా ఉండే ఆయన కొడుకు డ్రీమ్ పెద్దదిగా ఉంటుంది. దీంతో ఆప్ సెట్ ప్రింటింగ్ మిషన్ కొనుగోలు చేస్తాడు. ఆ వృత్తి సాఫీగా సాగుతున్నా, కొత్త వ్యాపారం చేయాలని భావిస్తాడు. ఒక లారీని కొనాలన్న అతని నిర్ణయానికి తండ్రి అడ్డుపడ్డారు. దీంతో ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చేసి తన కలను సాకారం చేసుకోవడానికి లారీని కోనుగోలు చేస్తాడు. అలా తన స్వయం కృషితో 120 లారీలకు అధిపతి అవుతాడు. అంతటితో ఆగకుండా పత్రిక అధిపతి కూడా అవుతాడు. అందుకు అతను ఎంతగా శ్రమించాడు, ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం విజయానంద్. వీఆర్ఎల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై డా.ఆనంద్ సంగేశ్వర్ నిర్మించిన ఈ చిత్రానికి మహిళా దర్శకురాలు రిషిక శర్మ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. -
విజయానంద్‌కి మహానటి స్ఫూర్తి
‘‘రెండున్నర సంవత్సరాల క్రితం ‘విజయానంద్’ సినిమా ప్రయాణం మొదలైంది. బయోపిక్స్‌లో తెలుగులో వచ్చిన ‘మహానటి’ వంటి సినిమా మళ్లీ రాదు. ఒకవిధంగా ‘విజయానంద్’ సినిమాకు ‘మహానటి’యే ఓ స్ఫూర్తి. దర్శకులు రాజమౌళిగారికి నేను పెద్ద అభిమానిని’’ అని డైరెక్టర్ రిషికా శర్మ అన్నారు. వీఆర్ఎల్ లాజిస్టిక్స్ అధినేత విజయ్ శంకేశ్వర్ బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘విజయానంద్’. నిహాల్ రాజ్‌పుత్ హీరోగా నటించారు. రిషికా శర్మ దర్శకత్వంలో వీఆర్ఎల్ ఫిలింస్ పతాకంపై విజయ్ శంకేశ్వర్ తనయుడు డా.ఆనంద్ శంకేశ్వర్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిహాల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ–‘‘విజయ్ శంకేశ్వర్గారి పాత్ర చేయడం చాలా పెద్ద బాధ్యత. ‘విజయానంద్’అనేది మాకు సినిమా కాదు.. ఓ ఎమోషన్. ‘మహానటి’లో కీర్తీసురేష్గారి తరహా పెర్ఫార్మెన్స్ చేయాలనుకున్నాను. తెలుగు సినిమాలు చాలా బాగుంటాయి. రాజమౌళిగారికి నేను బిగ్ ఫ్యాన్’’ అన్నారు. ‘‘రెండున్నర గంటల్లో ఈ కథను అద్భుతంగా చూపించిన రిషికాగారికి, బాగా నటించిన నిహాల్‌కి థ్యాంక్స్’’ అన్నారు ఆనంద్ శంకేశ్వర్. నటీనటులు సిరి ప్రహ్లాద, భరత్, అనీష్ కురివిల్లా, యూఎఫ్ఓ లక్ష్మణ్ పాల్గొన్నారు. -
పాన్ ఇండియా చిత్రంగా ప్రముఖ వ్యాపారవేత్త బయోపిక్
తమిళ సినిమా: సినిమా ఎల్లలు దాటి చాలాకాలం అయ్యింది. అలాగే బయోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలా స్వసక్తితో ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక వ్యాపారవేత్త బయోపిక్‌తో రపొందిన చిత్రం విజయానంద్. కర్ణాటకలో ఒక మారుమూల గ్రామానికి చెందిన విజయ్ సంగేశ్వర అనే వ్యక్తి చిన్న ట్రక్కుతో తన జీవిత పయనాన్ని ప్రారంభించి 4300 వాహనాలకు అధిపతిగా దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయన జీవిత చరిత్రతో రపొందించిన చిత్రం విజయానంద్. దర్శకుడు రిషికా శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో టైటిల్ పాత్రను నటుడు నిహాల్ పోషించా రు. ఆయనతోపాటు అనంతనాగ్, రవిచంద్రన్, భారత్ బొపన్న, ప్రకాశ్ బొల్లాడి, శ్రీ ప్రహ్లాద్, వినయ ప్రసాద్, అర్చన, హనీష్ గురివిల్ల తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కీర్తన పూజారి చాయాగ్రహణం, గోపీ సుందర్ సంగీతాన్ని అందింన ఈ బారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, డిసెంబర్ 9వ తేదీన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. భావితరాల్లో నమ్మకాన్ని పెంచే గొప్ప సాధికుడి పాత్రలో మరణించడం గర్వంగా భావిస్తున్నట్లు నటుడు నిహాల్ పేర్కొన్నారు. ఎంత సాధించిన వాళ్లైనా విశ్రాంతి తీసుకుంటారని, అయితే ఆయన అవిశ్రాంతంగా శ్రమించారని పేర్కొన్నారు. ఆయన జీవితం విజయం సాధించాలనే వారందరికీ ఒక పాఠమని పేర్కొన్నారు. -
Pankaj Tripathi: వెండితెర వాజ్‌పేయి
భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ దివంగత ప్రముఖ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వాజ్‌పేయీగా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు. ‘‘అటల్ బిహారి వాజ్‌పేయి కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు...మంచి మానవతావాది, రచయిత, కవి కూడా. ఇలాంటి వ్యక్తి పాత్రలో నటిస్తున్నందుకు ఓ నటుడిగా నాకు సంతోషంగా ఉంది’’ అని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ సినిమాను అటల్ బిహారి వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
వీఆర్ఎల్ వ్యవస్థాపకుడు విజయ్ శంకేశ్వర్ బయోపిక్‌గా ‘ ‘విజయానంద్’
దేశంలోనే అతి పెద్ద లాజిస్టిక్ కంపెనీల్లో ఒకటైన వీఆర్ఎల్ వ్యవస్థాపకుడు విజయ్ శంకేశ్వర్ బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘విజయానంద్’. విజయ్ శంకేశ్వర్ పాత్రలో నిహాల్ నటించిన ఈ చిత్రానికి రిషికా శర్మ దర్శకత్వం వహించారు. ఆనంద్ శంకేశ్వర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీని డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘తన తండ్రిపై ఆధారపడకుండా విజయ్ శంకేశ్వర్ సొంత తెలివితేటలతో లారీల వ్యాపారంలోకి ఎలా ప్రవేశించారు? ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ ఓ పెద్ద లాజిస్టిక్ కంపెనీకి అధినేత ఎలా అయ్యారు? అనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: కీర్తన్. -
Biopics: మహిళలపై బయోపిక్స్.. తారల విశేషాలు
బాలీవుడ్లో కొంతకాలంగా బయోపిక్ ట్రెండ్ బాగా నడుస్తోంది. అయితే ఈ ట్రెండ్ పట్ల హీరోయిన్స్ కూడా మొగ్గు చూపుతుండటం విశేషం. ఇటీవల ‘సైనా’, ‘తలైవి’, ‘గంగూభాయి కతియావాడి’, ‘శభాష్ మిథూ’ వంటి బయోపిక్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా మరికొందరు మహిళల బయోపిక్‌లు రూపొందుతున్నాయి. అందులో నటించే తారలు, ఇతర విశేషాలపై ఓ లుక్కేద్దాం... భారతదేశ దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా బాలీవుడ్లో రూపొందుతున్న సినిమా ‘ఎమర్జెన్సీ’. ప్రధానంగా ఎమర్జెన్సీ టైమ్‌లో 1975-1977లో జరిగిన సంఘటనలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ మూవీలో ఇందిరాగాంధీ పాత్రలో నటించడంతో పాటు, డైరెక్షన్ చేస్తున్నారు కంగనా రనౌత్. అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ఘాటింగ్ మొదలైంది. అలాగే ‘దంగల్’ ఫేమ్ ఫాతిమా సనా షేక్ కూడా వెండితెరపై ఇందిరా గాంధీగా కనిపించనున్నారు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దివంగత ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితం ఆధారంగా ‘శామ్‌బహదూర్’ అనే చిత్రం రూపొందుతోంది. విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో నటిస్తుండగా, ఇందిరాగాంధీ పాత్రని ఫాతిమా చేస్తున్నారు. అదేవిధంగా భారత మాజీ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ కూడా తెరపైకి రానుంది. ఆమె పాత్రలో అనుష్క శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘చెక్దా ఎక్స్‌ప్రెస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ బెనర్జీ కథ, స్క్రీన్ ప్లే అందించారు. జులన్ గోస్వామి పాత్ర కోసం ఇంగ్లాండ్‌లో క్రికెట్‌కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు అనుష్కా శర్మ. నెట్‌ఫ్లిక్స్‌లో ‘చెక్దా ఎక్స్‌ప్రెస్’ స్ట్రీమింగ్ కానుంది. అలాగే 2018లో వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత అనుష్కా శర్మ ఓకే చెప్పిన ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. మరోవైపు రీసెంట్ టైమ్స్‌లో విభిన్నరకాలైన వంటకాలు వండారు హీరోయిన్ హ్యూమా ఖురేషీ. ఎందుకంటే ‘తర్లా’ బయోపిక్ కోసం. దివంగత చెఫ్, వంటల పుస్తకాల రచయిత, వ్యాఖ్యాత తర్లా దలాల్ జీవితం ‘తర్లా’గా రానుంది. ‘చిఛోరే’, ‘దంగల్’ లకు రచనా విభాగంలో పనిచేసిన పీయూష్ గుప్తా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హ్యూమా ఖురేషీ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. రిలీజ్‌పై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఇక బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ నీనా గుప్తా బయోపిక్ తెరపైకి రానుంది. ‘నా బయోపిక్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు’ అని రీసెంట్గా ఓ సందర్భంలో నీనా గుప్తా వెల్లడించారు. ఆమె పాత్రలో ఎవరు నటిస్తారు? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా 2000 సంవత్సరం మార్చిలో హత్య చేయబడ్డారు హీరోయిన్ ప్రియా రాజ్ వంశ్. ఆమె జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలు వెండితెరపైకి రానున్నాయి. లీడ్ రోల్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించనున్నారని సమాచారం. దివంగత దర్శక–నిర్మాత, నటుడు చేతన్ ఆనంద్, ప్రియా రాజ్ వంశ్ మధ్య నెలకొన్న సంఘటనలతో ఈ సినిమా ఉంటుందట. ప్రదీప్ సర్కార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తారు. వీరే కాదు.. ఈ తరహా బయోపిక్స్‌లో నటించేందుకు మరికొందరు హీరోయిన్స్ రెడీ అవుతున్నారని టాక్. -
సినిమా కోసం 18 కేజీల బరువు తగ్గిన హీరో, అవాక్కవుతున్న ఫ్యాన్స్
భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం వెండితెరపైకి రానుంది. ఈ బయోపిక్కు ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. నటుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ రోల్లో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా నటిస్తున్నాడు. జూన్ సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం కోసం రణ్‌దీప్ ఏకంగా 18 కేజీలు బరువు తగ్గాడట. ఇందుకు కోసం అతడు జిమ్‌లో తీవ్రంగా శ్రమించానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పాడు రణ్‌దీప్. ఇక తాజాగా అతడు బరువు తగ్గి సన్నగా మారిన ఫొటోను షేర్ చేశాడు. ఇది చూసి అతడి ఫాలోవర్స్, ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇంత తక్కువ సమయంలో అన్ని కేజీ బరువు ఎలా తగ్గారు భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ‘లైగర్’ ఫ్లాప్‌తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే.. కాగా 2016లో సరబ్జిత్ మూవీ కోసం కూడా రణ్‌దీప్ కేవలం 28 రోజుల్లోనే 18 కేజీలు బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం విధితమే. 1883 మే 28న మహారాష్ట్రలో జన్మించారు దామోదర్ సావర్కర్. ఆ తర్వాత న్యాయవిద్యను అభ్యసించడం కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడి భారతీయ విద్యార్థుల్లో స్వాతంత్య్ర కాంక్షను ప్రేరేపించారాయన. హిందూ మహాసభల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. సావర్కర్ రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ బుక్‌ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత 1910లో సావర్కర్‌ను అరెస్ట్ చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. అండమాన్ నికోబార్ దీవుల్లోని జైల్లో పది సంవత్సరాలకు పైనే బ్రిటీష్ ప్రభుత్వపు శిక్షను అనుభవించారు సావర్కర్. 1966 ఫిబ్రవరి 26న ఆయన తుదిశ్వాస విడిచారు. చదవండి: బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్, షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు
PV Sindhu About Prabhas In Latest Interview: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె అందుకున్న పతకాలు భారతదేశ ఖ్యాతిని ఉన్నంతంగా నిలబెట్టాయి. ఇటీవల కామన్వెల్త్ 2022 గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి, ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో స్వర్ణం గెలుపొందిన తొలి తెలుగు తేజంగా కీర్తి పొందింది. తాజాగా పీవీ సింధు ఓ ఇంటర్వూలో పాల్గొని తన ఫేవరేట్ హీరో, తనకు వచ్చిన ప్రేమలేఖలు వంటి తదితర ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'మెడల్ తీసుకున్నప్పుడు మన చేతిలో మన జాతీయ జెండా ఉంటుంది. అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది?' అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు ''అక్కడ విదేశాల్లో మన జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు నాకైతే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. మన దేశ పతాకం, జాతీయ గీతం విదేశాల్లోనూ హైగా వినిపించినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది'' అని సింధు తెలిపింది. అనంతరం లవ్ లెటర్స్ గురించిన అడగ్గా.. ''ఇప్పటివరకు నాకు ఎన్నో ప్రేమలేఖలు వచ్చాయి. ఆ లెటర్స్ అన్నింటిని మా ఇంట్లో వాళ్లందరం కలిసే చదివేవాళ్లం. ఓ 70 ఏళ్ల వ్యక్తి అయితే, ఇలాగే లేఖ రాశాడు. అతనికిచ్చి పెళ్లి చేయకపోతే నన్ను కిడ్నాప్ చేస్తానని అందులో రాశాడు'' అని పేర్కొంది. చదవండి: నుదుట సింధూరం, మెడలో మంగళసూత్రం.. నటికి భర్త మాత్రం లేడు! 'తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం' అని అడగ్గా ''చాలా మంది ఉన్నారు. ప్రభాస్ అంటే చాలా ఇష్టం. మేము మంచి ఫ్రెండ్స్ కూడా'' అని సింధు చెప్పడంతో 'ఎందుకు సేమ్ హైట్ కాబట్టా?' అని యాంకర్ నవ్వులు తెప్పించాడు. ఇంకా ఆ ఇంటర్వ్యూ ప్రొమోలో ''నేను ఏదైనా పోటీలో ఫెయిల్ అయితే.. ఎందుకలా ఆడుతున్నావ్? మొన్న ఆ గేమ్‌లో ఆడావు కదా అలా ఆడొచ్చు కదా అంటారు. అప్పుడు నాకు దా నువ్ వచ్చి ఆడు.. నీక్కూడా తెలుస్తుంది.'' అని చెప్పింది. 'భవిష్యత్తులో హీరోయిన్ అయ్యే అవకాశం ఉందా?' అన్న అప్రశ్నకు 'ఏమో.. నా బయోపిక్ కూడా ఉండొచ్చేమో!' అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది పీవీ సింధు. -
రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ?
The Dirty Picture Sequel In The Works But Not Featuring Vidya Balan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో విద్యా బాలన్ ఒకరు. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు, బయోపిక్‌లతో విద్యా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె నటించిన సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో ఆమె నటనకు గానూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2011లో విడుదలైన ఈ మూవీ విద్యా బాలన్‌కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తకిర అప్డేట్ చక్కర్లు కొడుతోంది. సుమారు దశాబ్దం తర్వాత 'ది డర్టీ పిక్చర్' సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నట్లు దర్శకనిర్మాతలు ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్ కోసం ఇంకా విద్యా బాలన్‌ను సంప్రదించలేదట. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కానీ ఈ సీక్వెల్‌ను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాకు విద్యా బాలన్నే తీసుకుంటారా? ఇంకా ఇతర హీరోయిన్‌కు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ కాగా మిలన్ లుత్రియా దర్శకత్వం వహించిన 'ది డర్టీ పిక్చర్' చిత్రం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 117 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో విద్యా బాలన్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, నసీరుద్ధీన్ షా, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషించగా, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు రానున్న సీక్వెల్ ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్..
Chitrangada Make Film Youngest Param Vir Chakra Awardee Yogendra Yadav: యే సాలీ జిందగీ, దేశీ బాయ్స్, ఐ, మీ ఔర్ మే, బజార్, బాబ్ బిస్వాస్ వంటి చిత్రాలతో నటిగా మంచిల గుర్తింపు తెచ్చుకుంది మోడల్, బ్యూటిఫుల్ హీరోయిన్ చిత్రాంగద సింగ్. 2018లో వచ్చిన 'సూర్మా' చిత్రంతో నిర్మాతగా కూడా మారింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాకు నిర్మాతగా మారనుంది ఈ మోడల్. కార్గిల్ యుద్ధంలో పోరాడి 19 ఏళ్ల వయసులో పరమ వీర చక్ర అవార్డు అందుకున్న సుబేదార్ యోగేంద్ర యాదవ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులు చేజిక్కించుకున్నట్లు శనివారం (జులై 30) చిత్రాంగద తెలిపింది. ''నిజమైన హీరోల గురించి, మన మధ్యలో తిరుగుతూ మరుగున పడిన గొప్ప వ్యక్తుల కథల్ని చెప్పడం నాకు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. వాళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని, జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవసరం ఎంతైనా ఉంది. నిర్మాతగా 'సూర్మా' తర్వాత ఇది నా రెండో ప్రయత్నం' అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. సీఎస్ ఫిల్మ్స్ దీపక్ సింగ్‌తో కలిసి సంయుక్తంగా ఈ బయోపిక్‌ను నిర్మించనుంది చిత్రాంగదా. -
Shabaash Mithu: సండే సినిమా ఉమన్ ఇన్ బ్లూ
‘మెన్ ఇన్ బ్లూ’ అంటే భారత క్రికెట్ జట్టు. అంటే మగ జట్టు. క్రికెట్ మగవారి ఆట. క్రికెట్ కీర్తి మగవారిది. క్రికెట్ గ్రౌండ్ మగవారిది. కాని ఈ ఆటను మార్చే అమ్మాయి వచ్చింది. ‘మెన్ ఇన్ బ్లూ’ స్థానంలో ‘ఉమెన్ ఇన్ బ్లూ’ అనిపించింది. స్త్రీలు క్రికెట్ ఆడలేరు అనే విమర్శకు తన బ్యాట్‌తో సమాధానం ఇచ్చింది. ‘మిథాలి రాజ్’ మన హైదరాబాదీ కావడం గర్వకారణం. ఆమె బయోపిక్ ‘శభాష్ మిథు’ తాజాగా విడుదలైంది. అంచనాలకు తగ్గట్టు లేకపోయినా స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. సినిమాలో ఒక ప్రెస్మీట్లో మిథాలి రాజ్ పాత్రధారి అయిన తాప్సీ పన్నును అడుగుతాడు జర్నలిస్టు– మీ ఫేవరెట్ పురుష క్రికెటర్ ఎవరు? అని. దానికి తాప్సీ ఎదురు ప్రశ్న వేస్తుంది– ఈ ప్రశ్నను మీరెప్పుడైనా పురుష క్రికెటర్లను అడిగారా... వాళ్ల అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు అని? మిథాలి రాజ్ నిజ జీవితంలో జరిగిన ఈ ఘటన సినిమాలో అంతే ప్రభావవంతంగా ఉంటుంది. ఏ ప్రశ్న ఎవరికి వేయాలో కూడా మన సమాజంలో ‘కండీషనింగ్’ ఉంటుంది. మహిళా క్రికెట్ బోర్డును బిసిసిఐలో విలీనం చేశాక (సినిమాలో) టీమ్ యూనిఫామ్స్ పంపమంటే పురుష జట్టు వాడేసిన యూనిఫామ్స్‌ను పంపుతారు. ‘మా పేర్లతో మాకు బ్లూ కలర్ యూనిఫామ్స్ కావాలి’ అని మిథాలి డిమాండ్ చేస్తుంది. దానికి బిసిసిఐ చైర్మన్ ముప్పై ఏళ్లుగా అక్కడ పని చేస్తున్న ప్యూన్‌ను పిలిచి ‘నీకు తెలిసిన మహిళా క్రికెటర్ల పేర్లు చెప్పు?’ అంటాడు. ప్యూన్ చెప్పలేకపోతాడు. ‘మీ గుర్తింపు ఇంత. మీకు ఇవి చాలు’ అంటాడు. మిథాలి ఆ మాసిన యూనిఫామ్‌ను అక్కడే పడేసి వచ్చేస్తుంది. మన దేశంలో మహిళలు చదువులోనే ఎంతో ఆలస్యంగా రావాల్సి వచ్చింది. ఇక ఆటల్లో మరింత ఆలస్యంగా ప్రవేశించారు. అసలు ఆటల్లో ఆడపిల్లలను, యువతులను ప్రోత్సహించాలన్న భావన సమాజానికి, ప్రభుత్వాలకు కలగడానికి కూడా చాలా సమయం పట్టింది. ఒకవేళ వాళ్లు ఆడుతున్నా మన ‘సంప్రదాయ ఆలోచనా విధానం’ వారికి అడుగడుగున ఆంక్షలు విధిస్తుంది. సినిమాలో/ నిజ జీవితంలో మిథాలి రాజ్ కుటుంబం మొదట కొడుకునే క్రికెట్లో చేరుస్తుంది. సినిమాలో కొంత డ్రామా మిక్స్ చేసి కూతరు కూడా క్రికెట్లో ప్రవేశించినట్టు చూపారు. నిజ జీవితంలో మిథాలి బాల్యంలో బద్దకంగా ఉంటోందని ఆమెను కూడా క్రికెట్లో చేర్చాడు తండ్రి. సోదరుడి ఆట కంటే మిథాలి ఆట బాగుందని కోచ్ చెప్పడంతో మిథాలి అసలైన శిక్షణ మొదలవుతుంది. ఆమె ఎలా ఎదిగిందనేది ఈ సినిమా చూపిస్తుంది. 1983లో భారత జట్టు ‘వరల్డ్ కప్’ సాధించాక క్రికెట్ ఆటగాళ్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. క్రికెట్లో వ్యాపారాన్ని కనిపెట్టిన బిసిసిఐ విపరీతంగా మేచ్‌లు ఆడిస్తూ ఆటగాళ్లను పాపులర్ చేసింది. టెస్ట్‌లు, వన్డేలు, టూర్లు ఇవి క్రికెట్‌ను మరపురానీకుండా చేశాయి. 1987 ‘రిలయన్స్ కప్’ నాటికి ఈ దేశంలో క్రికెట్ ఎదురు లేని క్రీడగా అవతరించింది. మహిళా క్రికెట్ జట్టు 1978 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా వరల్డ్ కప్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నా దాని గురించి ఎవరికీ తెలియదు. ఎవరూ పట్టించుకోలేదు. మిథాలి రాజ్‌కు ముందు భారత మహిళా క్రికెట్లో మంచి మంచి ప్లేయర్లు ఉన్నా మిథాలి రాజ్ తర్వాత పరిస్థితి మారింది. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఆడిన తొలి మేచ్లోనే సెంచరీ కొట్టిన అద్భుత ప్రతిభ మిథాలిది. అతి చిన్న వయసులో ఆమె కెప్టెన్ అయ్యింది. 2013, 2017 ప్రపంచ కప్‌లలో ఆమె వల్ల టీమ్ ఫైనల్స్ వరకూ వెళ్లింది. టెస్ట్‌లలో, వన్ డేలలో, టి20లో అన్నీ కలిపి దాదాపు 10 వేల పరుగులు చేసిన మిథాలి ప్రపంచంలో మరో మహిళా క్రికెటర్‌కు లేని అలాగే పురుష క్రికెటర్లకు లేని అనేక రికార్డులు సొంతం చేసుకుంది. అయితే సినిమాలో చూపినట్టు ఆమెకు సౌకర్యవంతమైన జీవన నేపథ్యం ఉంది. కాని జట్టులో ఉన్న మిగిలిన సభ్యులు భిన్న నేపథ్యాలు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారు. మిథాలీకి, ఈ సభ్యులకు మధ్య సఖ్యత కుదరడం వారందరిలో ఒక టీమ్ స్పిరిట్ రావడం... ఇదంతా ఈ సినిమాలో చూడొచ్చు. మహిళా జట్టుగా తాము ఎదుర్కొన్న తీవ్ర వివక్ష, ఆశ నిరాశలు, మరోవైపు పురుష జట్టు ఎక్కుతున్న అందలాలు... ఇవన్నీ సినిమాలో ఉన్నాయి. మిథాలి రాజ్ బయోపిక్‌గా వచ్చిన ‘శభాష్ మిథు’ బహుశా హైదరాబాద్ ఆటగాళ్ల మీద వచ్చిన మూడో బయోపిక్. దీనికి ముందు అజారుద్దీన్ మీద ‘అజార్’, సైనా నెహ్వాల్ మీద ‘సైనా’ వచ్చాయి. అవి రెండు నిరాశ పరిచాయి. ‘శభాష్ మిథు’ ఇంకా బాగా ఉండొచ్చు. దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ మిథాలి కేరెక్టర్ గ్రాఫ్‌ను పైకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు. గొప్ప ఎమోషన్ తీసుకురాలేకపోయాడు. క్లయిమాక్స్‌ను ఆట ఫుటేజ్‌తో నింపడం మరో లోపం. ఈ సినిమా మరింత బడ్జెట్‌తో మరింత పెద్ద దర్శకుడు తీయాలేమో అనిపిస్తుంది. అయినా సరే ఈ కాలపు బాలికలకు, యువ క్రీడాకారిణులకు ఈ సినిమా మంచి బలాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పొమ్మంటుంది. క్రీడల్లో సత్తా చాటుకోమంటుంది. తల్లిదండ్రులను, సమాజాన్ని ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహించమని చెబుతుంది. ఏ నిరాడంబర ఇంటిలో ఏ మిథాలి రాజ్ ఉందో ఎవరికి తెలుసు. -
అటల్ బిహారి వాజ్‌పేయిగా విలక్షణ నటుడు !
Pankaj Tripathi Lead Role In Atal Bihari Vajpayee Biopic: దివంగత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో రూపొందనుంది. ఈ బయోపిక్కు 'మై రహూ యా నా రహూ ఏ దేశ్ రెహనా చాహియే-అటల్' అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వినోద్ భన్సాలీ, సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఉల్లేక్ ఏన్‌పీ రాసిన 'ది అన్‌టోల్డ్ వాజ్‌పేయి: పొలిటీషియన్ అండ్ పారాడాక్స్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బయోపిక్ చిత్రంలో ప్రధాన పాత్రలో విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠీ నటించనున్నట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే పంకజ్ త్రిపాఠీ.. అటల్ బిహారీ వాజ్‌పేయిగా నటిస్తే కచ్చితంగా న్యాయం చేయగలరని సినీ విశ్లేషకులు చెబుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాను 2023, డిసెంబర్ల 25న అటల్ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. ‘Main Rahoon Ya Na Rahoon, Yeh Desh Rehna Chahiye – Shri Atal Bihari Vajpayee.’ Presenting #ATAL, a film on the life story of India’s most exemplary leader, renowned poet, and visionary.@thisissandeeps @directorsamkhan #KamleshBhanushali #VishalGurnani #JuhiParekhMehta pic.twitter.com/J2Db2l32iy — Vinod Bhanushali (@vinodbhanu) June 28, 2022 -
బిజినెస్మెన్ లైఫ్‌తో బాక్సాఫీస్ బిజినెస్ షురూ!
వ్యాపారం చేశారు... విజయాలు సాధించారు... కొందరు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఈ వ్యాపారవేత్తల జీవితాల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ప్రస్తుతం కొందరు విజయవంతమైన వ్యాపారవేత్తల ‘బయోపిక్’కి హిందీలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రియల్ బిజినెస్మెన్ లైఫ్‌తో బాక్సాఫీస్ బిజినెస్ షురూ చేస్తున్నారు సినీ బిజినెస్మెన్ అయిన నిర్మాతలు. ఇక ‘బయోపిక్స్’ గురించి తెలుసుకుందాం. మూడు తరాల టాటా కథ టాటా గ్రూపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశపు అతి పెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్ షెడ్జీ టాటా. జమ్ షెడ్జీ తర్వాత ఆ కుటుంబానికి చెందిన వారసులు బాధ్యతలు చేపట్టారు. వారిలో రతన్ టాటా ఒకరు. దేశంలో పేరున్న ఈ కుటుంబంపై సినిమా నిర్మించడానికి టీ సిరీస్ భూషణ్‌కుమార్ హక్కులు పొందారు. ‘ది టాటాస్’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. టాటా కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యాపారవేత్తల కథతో ఈ సినిమా ఉంటుంది. ‘ది టాటాస్, హౌ ఎ ఫ్యామిలీ బిల్ట్ ఎ బిజినెస్ అండ్ ఎ నేషన్’ నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంకా ఈ చిత్రానికి నటీనటులు, దర్శకుడి ఎంపిక జరగలేదు. కాఫీ కింగ్ కేఫ్ కాఫీ డే వ్యవస్థాకుడు వీజీ సిద్ధార్థ జీవితం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగే క్రమంలో సిద్ధార్థ ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వ్యాపారంలో విజయవంతంగా దూసుకెళుతున్న ఆయన అనూహ్యంగా నదిలో శవం అయి తేలడం వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ‘కాఫీ కింగ్: ది స్విఫ్ట్ రైజ్ అండ్ సడన్ డెత్ ఆఫ్ కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ్థ’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. హిందీలో అక్షయ్‌కుమార్ ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘సూరరై పోట్రు’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు సుధ. రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. కాగా సౌత్‌లో ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మించిన సూర్య రీమేక్‌ని కూడా నిర్మించనున్నారు. హిందీలో నిర్మాతగా సూర్యకి ఇది తొలి చిత్రం అవుతుంది. విజయాలు.. వివాదాలతో... విజయాలు, వివాదాలతో వార్తల్లో నిలిచిన సహారా సంస్థ చైర్మన్ సుబ్రతా రాయ్ బయోపిక్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు కానీ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్, రచయితగా గుల్జార్ వ్యవహరించనున్నారు. ‘దిల్ సే, గురు, యువరాజ్, స్లమ్‌డాగ్ మిలియనీర్’ వంటి చిత్రాలకు రెహమాన్, గుల్జార్ పని చేశారు. గుల్జార్ లాంటి అద్భుత రచయితతో మళ్లీ కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉందని రెహమాన్ పేర్కొన్నారు. లలిత్ లైఫ్‌తో... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ జీవిత విశేషాలతో సినిమా రూపొందనుంది. ఐపీఎల్‌తో క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన లలిత్ మోడీ జీవితంపై వచ్చిన ఓ పుస్తకం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని వార్త వచ్చింది. అయితే ఈ వార్త నిజం కాదని లలిత్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ‘‘ఏదో పుస్తకం ఆధారంగా నాపై సినిమా తీస్తున్నారని విని ఆశ్చర్యపోయాను. దానికి, నాకూ ఎలాంటి సంబంధం లేదు. నా బయోపిక్ గురించి నేను స్వయంగా ప్రకటిస్తాను’’ అని లలిత్ పేర్కొన్నారు. విజయంతో వెలుగులోకి... ప్రముఖ అంధ పారిశ్రామిక వేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవితం వెండితెరకు రానుంది. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో పుట్టిన శ్రీకాంత్ ఎన్నో ఆటంకాలను అధిగమించి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా రికార్డు సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి, 2500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. చూపు లేకపోయినా విజయంతో వెలుగులోకి వచ్చిన శ్రీకాంత్ జీవితం ఆధారంగా దర్శకురాలు తుషార్ హిద్రానీ సినిమా తెరకెక్కించనున్నారు. శ్రీకాంత్ బొల్లా పాత్రను రాజ్‌కుమార్ రావ్ పోషించనున్నారు. ఇవే కాదు.. మరికొందరు ప్రముఖ వ్యాపారవేత్తల బయోపిక్స్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. బయోపిక్స్‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. పైగా స్ఫూర్తిగా నిలిచే వ్యాపారవేత్తల జీవిత చిత్రాలంటే ఇంకా ఉంటుంది. అందుకే దర్శక–నిర్మాతలు రియల్ బిజినెస్మెన్ జీవితాలను రీల్‌పై ఆవిష్కరించడానికి రెడీ అయ్యారు. -
తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ..
Biopic On Late PM Atal Bihari Vajpayee: దివంగత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. 'మై రహూ యా నా రహూ ఏ దేశ్ రెహనా చాహియే-అటల్' అనే టైటిల్‌తో వినోద్ భన్సాలీ, సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మంగళవారం (జూన్ 28) ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఉల్లేక్ ఏన్‌పీ రాసిన 'ది అన్‌టోల్డ్ వాజ్‌పేయి: పొలిటీషియన్ అండ్ పారాడాక్స్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇంకా దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఖరారు కాలేదు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో షూటింగ్ ప్రారంభించి, క్రిస్మస్కు విడుదల చేయాలనుకుంటున్నారు. అటల్ పుట్టినరోజు డిసెంబర్ 25. వచ్చే ఏడాది 99వ జయంతి సందర్భంగా ్టల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: పాడె మోసి మాట నిలబెట్టుకున్న నటుడు.. ఎమోషనల్‌గా పోస్ట్.. ‘Main Rahoon Ya Na Rahoon, Yeh Desh Rehna Chahiye – Shri Atal Bihari Vajpayee.’ Presenting #ATAL, a film on the life story of India’s most exemplary leader, renowned poet, and visionary.@thisissandeeps @directorsamkhan #KamleshBhanushali #VishalGurnani #JuhiParekhMehta pic.twitter.com/J2Db2l32iy — Vinod Bhanushali (@vinodbhanu) June 28, 2022 @zeeshan01ahmad @shivvsharma0706 @BSL_Films @legendstudios_ @HitzMusicoff @70mmtalkies @penguinindia pic.twitter.com/0VLWPZWEU6 — Vinod Bhanushali (@vinodbhanu) June 28, 2022 -
అందుకోసం ఏడు కేజీల బరువు పెరిగాను: హీరో
‘‘రామ్‌గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’, ‘వంగవీటి’ చిత్రాలు బయోపిక్స్ క్యారెక్టర్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. ‘కొండా’ మూవీ బయోఫిక్షన్.. ఇందులో కొండా మురళి, సురేఖ జీవితంలో జరిగిన ఘటనలను తీసుకుని కల్పిత కథ రాశారు. బయోపిక్, బయోఫిక్షన్ చిత్రాల మధ్య వ్యత్యాసం ఉంది’’ అని హీరో త్రిగుణ్ అన్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించిన చిత్రం ‘కొండా’. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా త్రిగుణ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కొండా’ సినిమా కోసం దాదాపు ఏడు కేజీల బరువు పెరిగాను. అప్పటి కాలేజీ రాజకీయాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఎమోషనల్‌గా కూడా ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఇక నేను నటించిన ‘ప్రేమ దేశం’, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దేవా కట్టా శిష్యుడు సురేష్ దర్శకత్వంలో ఒక సినిమా, మిస్కిన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. రాక్‌లైన్ వారి కొత్త బ్యానర్ ‘పర్పుల్ రాక్’లో ‘లైన్‌మేన్’, ‘కిరాయి’ అనే సినిమాలు చేస్తున్నాను’’ అని త్రిగుణ్ తెలిపారు. చదవండి: దేవుడిచ్చిన లోపాన్ని కూడా సరిచేసే తల్లి కథ.. లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
ఎవరు మర్చిపోలేని ఆట ఆడి చూపిస్తా.. ఆసక్తిగా ట్రైలర్
Taapsee Pannu Starrer Shabaash Mithu Trailer Released: ప్రత్యేకమైన శైలీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది తాప్సీ పన్ను. ఇప్పటివరకు తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్, లూప్ లపేటా చిత్రాలతో అలరించింది ఈ పంజాబీ భామ. తాజగా తాప్సీ నటించిన చిత్రం 'శభాష్ మిథూ'. శ్రీజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా తెరకెక్కింది. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శభాష్ మిథూ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రెండు నిమిషాల 44 సెకన్లపాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. మిథాలీ చిన్నతనంలో కన్న కలను చెబుతూ ప్రారంభమైన ట్రైలర్ ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది. మిథాలీ ఆటను మొదలు పెట్టడం, ప్రాక్టీస్, కెప్టెన్‌గా మారడం, క్రికెట్లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత, వారికి గుర్తింపు తీసుకువచ్చేందుకు పడిన కష్టాలు తదితర అంశాలను సినిమాలో చక్కగా చూపించనున్నట్లు తెలుస్తోంది. తాప్సీ నటన అద్భుతంగా ఉంది. మన గుర్తింపును ఎవరూ మరిచిపోలేనంతలా ఆట ఆడి చూపిస్తా అని తాప్సీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. వయకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు: సీనియర్ నటుడు
సౌత్ ఇండియా సినిమాలతోపాటు హిందీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు సీనియర్ ఆర్టిస్ట్ బెనర్జీ. సుమారు 400కుపైగా సినిమాల్లో యాక్ట్ చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల 'ఆచార్య' సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి బయోపిక్‌ను తాను చేస్తానని వస్తున్న వార్తలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 'చిరంజీవి చాలా మంచి మనిషి. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక వేదికపై చిరంజీవి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన అనుమతి తీసుకుని చిరంజీవిపై బయోపిక్ తీస్తే బాగుంటుందని, చిత్రపరిశ్రమలో ఆయన పడిన కష్టాలు, విజయాలు, అవార్డులు, రివార్డులతో సినిమా తీయగలిగితే అద్భుతంగా ఉంటుంది అని అన్నాను. కానీ నేనే ఆ బయోపిక్ తీస్తానని చెప్పలేదు. సోషల్ మీడియా వాళ్లు అలా ప్రచారం చేశారు.' అని బెనర్జీ చెప్పుకొచ్చారు. చదవండి: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్ -
చిన్నతనంలోనే వేశ్యగా మారిన యువతి బయోపిక్.. త్వరలో ఓటీటీలోకి..
చెన్నై సినిమా: 'మాలై నేర మల్లిపూ' చిత్రం ఫస్ట్ లుక్ సినీ వర్గాలను ఆకట్టుకుంటోంది. 21 ఏళ్ల యువ కుడు సంజయ్ నారాయణన్ మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ఇది. కొత్త నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని యాన్ ఎవిరి.ఫేమ్ (మ్యాటర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై) విజయలక్ష్మి నారాయణన్ నిర్మించారు. హృతిక్ శక్తివేల్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ఒక ప్రము ఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోందని నిర్మాత తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఓ వ్యభిచార యువతి బయోపిక్‌గా పేర్కొన్నారు. చిన్న వయసులోనే వ్యభిచార కూపంలోకి నెట్టబడిన లక్ష్మీ అనే యువతి జీవితంలో జరిగిన ఘటనలు, ఎదుర్కొన్న సమస్యలను, చీకటి కోణాలను ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా పరిశ్రమ వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. చదవండి: నా సినిమాకు నాకే టికెట్లు దొరకలేదు: యంగ్ హీరో -
వెండితెరపై 65 ఏళ్ల మహిళ బయోపిక్.. ఆమె ఎవరంటే ?
Lata Bhagwan Kare To Be Made As Pan India Movie: భర్త భగవాన్ ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం అందించడానికి ఎస్కె మారథాన్ రేస్‌లో పాల్గొని, గెలిచిన 65ఏళ్ల లతా కారే జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘లతా భగవాన్ కారే’. నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ఎర్రబోతు కృష్ణ మరాఠీలో ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా 67వ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకొంది. మరాఠీలో ‘లతా భగవాన్ కారే’ చిత్రాన్ని రూపొందించిన తెలుగు దర్శక-నిర్మాతలు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించనున్నారు. విలేకరుల సమావేశంలో నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. ‘‘లతా భగవాన్ జీవితంలో జరిగిన కథ ఇది. ఈ సినిమా కథని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని మరాఠీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘లతా భగవాన్ కారే’ చిత్రం రీమేక్‌ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాం. అలాగే ఇంకో వినూత్నమైన సబ్జెక్టుతో మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ‘‘త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని ఎర్రబోతు కృష్ణ తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, రాజకీయ నాయకుడు డా. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయనున్న లతా కారే, సునీల్ కారే ఈ సమావేశంలో పాల్గొన్నారు. చదవండి: కమల్ హాసన్ చిత్రంలో సూర్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే Lata Bhagwan Kare | Official Teaser | 17 Jan ६५ वर्षाच्या स्त्रीची संघर्षगाथा !!#Releasing17Jan#LataBhagwanKare #TrueStory #65Years @naveendeshboina pic.twitter.com/yyD5s9HsoG — Lata Bhagwan Kare (@kare_lata) December 24, 2019 -
నాన్న బయోపిక్‌లో నేను నటించలేను: మహేశ్ బాబు
Mahesh Babu about Father Krishna Biopic: ‘‘కొన్ని సినిమాలు కొందరే చేయాలి. ‘మేజర్’లో అమరవీరుడు సందీప్‌గా శేష్ బాగా సూటయ్యాడు. సందీప్ పాత్ర నేను చేసుంటే బాగుండేదేమోనని ఆలోచించే అంత సెల్ఫిష్ కాదు నేను. నా సినిమాలు నేనే చేయాలి. మిగతా సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు హీరో, నిర్మాత మహేశ్‌బాబు. అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్లు సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల నటించారు. చదవండి: ఎఫ్ 3 ఒక మంచి ట్రీట్‌లా ఉంటుంది: వెంకటేశ్ అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సందీప్‌గా అడివి శేష్ నటించారు. జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మహేశ్‌బాబు మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ తీస్తారనే ప్రశ్న ఎదురైంది. చదవండి: సింగర్స్‌గా మారిన మంచు విష్ణు కుమార్తెలు దీనికి మహేశ్ బాబు స్పందిస్తూ.. ‘నాన్నగారి (సూపర్‌స్టార్ కృష్ణ) బయోపిక్ ఎవరైనా చేస్తే ఫస్ట్ నేనే హ్యాపీగా చూస్తాను. నేనైతే చేయలేను. ఎందుకంటే ఆయన నా దేవుడు. నాన్నగారి బయోపిక్‌కి ఎవరైనా దర్శకత్వం వహిస్తే నా బ్యానర్లో నిర్మించడానికి రెడీగా ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు. అలాగే మేజర్ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘‘బయోపిక్ తీసేటప్పుడు బాధ్యతగా ఉండాలి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ తీస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా తీయాలి. ‘మేజర్’ చూశాను. చాలా సీక్వెన్సెస్ గూస్బంప్స్ ఇచ్చాయి. చివరి 30 నిమిషాలయితే నా గొంతు ఎండిపోయింది. సినిమా చూశాక రెండు నిమిషాలు మౌనంగా ఉండి, ఆ తర్వాత శేష్‌ను హగ్ చేసుకున్నాను’ అని చెప్పారు. -
తెరపైకి ఆ పోలీస్ కమీషనర్ బయోపిక్..
Mumbai Former Police Commissioner Rakesh Maria Biopic By Rohit Shetty: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి యాక్షన్ అండ్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఇటీవల అక్షయ్ కుమార్‌తో సూర్యవంశీ తెరకెక్కించి హిట్ కొట్టాడు. అమెజాన్ ఓటీటీ కోసం ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనె వెబ్ సిరీస్‌ను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ శెట్టి మరో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అది కూడా ముంబై ఎక్స్ పోలీస్ కమీషనర్ రాకేష్ మారియా బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు రోహిత్. రాకేష్ మారియా తన కెరీర్లో సాధించిన విజయం ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు రోహిత్ శెట్టి అధికారికికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్ శెట్టి మాట్లాడుతూ 'రాకేష్ మారియా తన 36 ఏళ్ల అద్భుతమైన ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆయన 1993 ముంబైలో జరిగిన పేలుళ్ల నుంచి అండర్ వరల్డ్ ముప్పు, 2008లోని 26/11 ముంబై ఉగ్రదాడుల వరకు ఎన్నో చూశారు. నిజ జీవితంలోని ఈ సూపర్ కాప్ ధైర్య, సాహసాల ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను.' అని తెలిపారు. కాగా ఐపీఎస్ అధికారి అయిన రాకేష్ మారియా 1981వ బ్యాచ్ నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1993లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా (ట్రాఫిక్) ఉన్న రాకేష్ మారియా ముంబై వరుస పేలుళ్ల కేసును ఛేదించారు. తర్వాత ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు డీసీపీగా, ఆ తర్వాత జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అధికారిగా మారారు. 2008లో 26/11 ముంబై దాడులను పరిశోధించే బాధ్యతను కూడా మారియాకు అప్పగించారు. చదవండి: ప్రముఖ సింగర్ కన్నుమూత.. కరోనా కారణంగా చికిత్స ఆలస్యం ! అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ? -
ఆమె బయోపిక్‌లో నటించాలనుంది: మాళవిక మోహనన్
Malavika Mohanan Would Like To Act In Aishwarya Rai Biopic Movie: ఐశ్వర్య రాయ్ బయోపిక్‌లో నటించాలనుందనే కోరికను హీరోయిన్ మాళవిక మోహనన్ వ్యక్తం చేశారు. మాళవిక మోహనన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కోలీవుడ్‌లో తొలిసారిగా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'పేట' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తెలుగులో విడుద కాగా ఆ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ధనుష్‌తో జత కట్టిన 'మారన్' చిత్రం ఈ నెల 11వ తేదిన విడుదల కానుంది. ఇందులో నటించిన అనుభవాన్ని మాళవిక మీడియాతో పంచుకుంటూ తాను ఇంతకుముందు నటించిన చిత్రాలు అన్నింటికంటే పూర్తి నిడివి గల పాత్రను ఈ చిత్రంలోనే చేశానన్నారు. సోషల్ మీడియా రాతలు కష్టం కలిగిస్తున్నా, అలాంటివి మంచి అనుభవం కూడా అని పేర్కొన్నారు. ఐశ్వర్యరాయ్ బయోపిక్‌తో చిత్రాన్ని నిర్మిస్తే అందులో నటించాలను ఉందన్నారు. ఇదిలా తన గ్లామర్ ఫొటోలతో తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు మాళవిక మోహనన్. ఆ మధ్య బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌తో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు తెగ షికార్లు చేసిన సంగతి తెలిసిందే. -
41 ఏళ్లప్పుడు ఐపీఎల్లో ఎంట్రీ.. ఇప్పుడు బయోపిక్‌గా మూవీ
ఈ మధ్య కాలంలో క్రీడాకారుల జీవిత చరిత్ర నేపథ్యంలో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసపెట్టి సందడి చేస్తున్నాయి. ఇదివరకే భాగ్ మిల్కా భాగ్, ఎంఎస్ ధోని, మేరి కోమ్, 86 వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇండియన్స్‌కు అమితంగా ఇష్టమైన ఆటల్లో క్రికెట్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే దర్శకనిర్మాతలు ఎక్కువగా ఈ క్రికేట్ నేపథ్యమున్న క్రీడకారుల బయోపిక్‌లు తీసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఇప్పుడు మరో క్రికెటర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఇండియన్ క్రికెటర్ ప్రవీన్ తాంబే జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ 'ప్రవీన్ తాంబే ఎవరు?'. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడే ప్రవీన్ తాంబే. ఈ సినిమా టైటిల్ రోల్ శ్రేయాస్ తల్పడే నటిస్తున్నాడు. సుమారు 17 ఏళ్ల తర్వాత ఒక లీడ్ రోల్లో నటించడం తనకు దక్కిన అదృష్టమని శ్రేయాస్ తల్పడే తెలిపాడు. ఇలాంటి అవకాశం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుందన్నాడు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాని, నిర్మాతలు, దర్శకుడు జయప్రద్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమా గురించి ప్రవీన్ తాంబే 'నా జీవిత కథ ఎందరికో స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉంది. కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. వారి శక్తిని వారు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయొద్దు.' అని పేర్కొన్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ చిత్రం. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. pic.twitter.com/NaDvkIDdTs — Disney+ Hotstar (@DisneyPlusHS) March 7, 2022 -
Deepika Padukone దీపిక తండ్రి బయోపిక్.. పనులు మొదలుపెట్టిన కూతురు
‘‘మా నాన్న (ప్రకాశ్ పదుకోన్) జీవితం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అందుకే ఆయన బయోపిక్ తీయాలనుకుంటున్నాను’’ అన్నారు దీపికా పదుకోన్. దీపిక తండ్రి ప్రకాశ్ పేరున్న బ్యాడ్మింటన్ ప్లేయరన్న సంగతి తెలిసిందే. 1980లో వరల్డ్ నంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలవడంతో పాటు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను గెలిచి, రికార్డు సృష్టించారు ప్రకాశ్. జీవితంలో ఇంత సాధించిన తన తండ్రి బయోపిక్‌ను నిర్మించే పనులు మొదలుపెట్టినట్లు దీపిక పేర్కొన్నారు. ఈ విషయం గురించి దీపికా పదుకోన్ మాట్లాడుతూ – ‘‘భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవకముందే (1983లో క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది) మా నాన్నగారు అథ్లెట్‌గా దేశ క్రీడా ఖ్యాతిని విశ్వవేదికపైకి తీసుకుని వెళ్లారు. అథ్లెట్‌గా నాన్న సాధన చేయడానికి అప్పట్లో మెరుగైన సౌకర్యాలు కూడా లేవు. పెళ్లి మండపాల్లో సాధన చేసేవారు. తన బలహీనతలను బలాలుగా మార్చుకునేందుకు నిరంతరం కృషి చేసేవారు. ఆయన జీవితం ఓ స్ఫూర్తి’’ అన్నారు. -
పాపులర్ కమెడియన్‌పై బయోపిక్.. అతనెవరంటే ?
Kapil Sharma Biopic Funkaar Will Soon Directed By Mrighdeep Singh: సినీ చిత్రసీమలో అనేక మంది ప్రముఖులపై అనేక బయోపిక్‌లు వస్తున్నాయి. మరికొన్ని రాబోతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్లు, క్రికెట్ దిగ్గజాలు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ వంటివారిపైనై ఈ బయోపిక్‌లు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఒక కమెడియన్‌పై ఎలాంటి బయోపిక్ తీయలేదు. దీన్ని బ్రేక్ చేస్తూ ప్రముఖ కమెడియన్‌పై తాజాగా బయోపిక్ చిత్రం రానుంది. అతనెవరంటే మోస్ట్ పాపులర్ హిందీ కామెడీ టాక్ షో అయిన 'కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ' హోస్ట్ కపిల్ శర్మ. అవును కపిల్ శర్మపై బయోపిక్ త్వరలో రానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు తన ట్విటర్ ద్వారా తెలిపాడు. కపిల్ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్ చిత్రానికి 'ఫంకార్' అని టైటిల్ పెట్టారు. దీనికి మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్ సింగ్ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఈయన గతంలో ఫుక్రే సినిమాను డైరెక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సమర్పించనుంది. 'కపిల్ శర్మ కోట్లాది మంది ప్రజలకు ప్రతిరోజు నవ్వులను పంచుతాడు. అలాంటి కపిల్ శర్మ గురించి మీకు తెలియని జీవిత కథను వెండితెరపై చూపెట్టబోతున్నాం' అని మహావీర్ జైన్ తెలిపారు. BIOPIC ON KAPIL SHARMA: 'FUKREY' DIRECTOR TO DIRECT... A biopic on #KapilSharma has been announced... Titled #Funkaar... #MrighdeepSinghLamba - director of #Fukrey franchise - will direct... Produced by #MahaveerJain [#LycaProductions]... #Subaskaran presents. #KapilSharmaBiopic pic.twitter.com/7LxhfKt4r6 — taran adarsh (@taran_adarsh) January 14, 2022 ఇదీ చదవండి: దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా -
పాన్ ఇండియా మూవీగా దాసరి బయోపిక్
దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితం వెండితెరకు రానుంది. సీనియర్ దర్శకుడు ధవళ సత్యం ‘దర్శకరత్న’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. ఇమేజ్ ఫిలింస్ పతాకంపై తాడివాక రమేష్ నాయుడు నిర్మించనున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ధవళ సత్యం మాట్లాడుతూ– ‘‘రచయితగా, దర్శక–నిర్మాతగా ఎందరికో మార్గదర్శకుడైన దాసరిగారితో నాది విడదీయలేని అనుబంధం. ఆ బంధమే ‘దర్శకరత్న’ చేసేందుకు నన్ను పురిగొల్పింది’ అన్నారు. తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ– ‘‘ఓ జాతీయ స్థాయి నటుడు దాసరిగారి పాత్రను పోషిస్తారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందించనున్నాం’’ అన్నారు. డైరెక్టర్ రేలంగి నరసింహారావు, నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, డైరెక్టర్ కాశీ విశ్వనాథ్, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పి.రామకృష్ణగౌడ్, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వినాయకరావు తదితరులు దాసరితో తమ అనుబంధం గురించి మాట్లాడారు. -
బయోపిక్‌లు ‘భయో’ పిక్‌లు, కాకూడదు
ఈ మధ్యకాలంలో అనేక మంది బయోగ్రఫీని సినిమాల్లో ‘భయోపిక్’గా తెరకు ఎక్కిస్తున్నారు. ఇందులో చాలా బయోపిక్‌లలో వివాదాంశాలు ఉండడం, వివాదాలు, అల్లర్లు చెలరేగడం ఒక ఎత్తయితే, దాము బాలాజీ నిర్మించి విడుదల చేసిన ‘నయీం డైరీస్’ బయోపిక్ దారుణంగా ఉంది. ఈ వికృత ప్రయోగంలో తెలంగాణ పాటల కోయిల త్యాగశీలి బెల్లి లలిత పాత్రను వక్రీకరించి, ఆమె నయీమ్ జైళ్ళో ఉన్నప్పుడు నిత్యం వచ్చిపోతూ, అతని ప్రేమలో, నియంత్రణలో ఉన్నట్లు, నాటి నల్లగొండ మావోయిస్టు పార్టీ సెక్రటరీ ధర్మన్నను పట్టించడానికి ఒప్పుకున్నట్లు తరువాత నిరాకరించడంతోనే నయీమ్ కుటుంబ సభ్యులు బెల్లి లలితను హత్య చేసినట్లు చిత్రీకరించారు. నిత్యం సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లులో చెమటోడ్చి పిల్లలను పెంచి, కుటుంబ బాధ్యతతోపాటు తెలంగాణ ఉద్యమంలో, ప్రజా పోరాటాల్లో జీవితాన్ని కొనసాగించిన తెలంగాణ ఆడబిడ్డ ప్రేమలో పడిన రహస్యం దాము బాలాజీకి ఎవరు చెప్పారు? ఒకరిని పట్టించమని ఒత్తిడి చేస్తే, నిరాకరించినంత మాత్రాన ముక్కలు ముక్కలుగా నరకడానికి వాళ్ళ కుటుంబానికి చేతులు ఎట్లా వచ్చాయి? రాజ్యం, పోలీసుల మిలాఖత్‌ను గొప్పగా చిత్రీకరించాననుకునే రామ్‌గోపాల్ వర్మ శిష్యుడికి బెల్లి లలితను తప్పుడుగా చిత్రీకరించడంలోను రాజ్యం పాత్ర లేదని ఎందుకనుకోవాలి? ఇప్పటికే ఈ చిత్రంలో బెల్లి లలిత వ్యక్తిగత జీవితాన్ని మలినం చేసిన దాము బాలాజీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘నయీమ్ డైరీస్’ సినిమా నిలిపివేయాలని హైదరాబాద్, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేటలో సినిమా హాళ్ళ ముందు నిరసనలతో అడ్డుకోవడాలు జరిగాయి. కదిరే కృష్ణ తదితరులు హైకోర్టు నుండి సినిమా నిలిపివేయవలసిందిగా ‘స్టే’ తెచ్చారు. (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) దాము బాలాజీ ఉద్దేశం ఏదైనా సరే, తెలంగాణ సమాజమంతా కూడా బెల్లి లలిత జీవితాన్ని మలినం చేసే ఏ ప్రయత్నాన్నైనా తిప్పికొడతారు. మా చేతుల మీద ఎదిగిన ఆడపిల్ల బెల్లి లలిత. బెల్లి లలిత చెల్లెలు సరితకు ముక్క కరుణాకర్‌తో దగ్గరుండి నా చేతుల మీదిగా పెళ్ళి జరిపించాను. నయీమ్ భయానికి, కర్కశత్వానికి పదుల సంఖ్యలో గొల్ల, కుర్మ సోదరులు బలయిపోయారు. (చదవండి: ‘జై భీమ్’ సినిమాలో చూపింది సత్యమేనా?) సాంబశివుడు, రాములు అంతకు ముందు పురుషోత్తం, ఆజమ్ అలీ ఈ హత్యల పరంపర, నయీమ్ సీరియల్ కిల్లర్ కావడానికి విప్లవ పార్టీల తీరు కూడా కారణమయినట్లు అన్యాపదేశ సందేశం ఇవ్వడం దారుణం. నయీమ్ కత్తుల వేటలో బలయిన అనేక మందికి పాడె మోసినవాణ్ణి... నేనింకా బతికే ఉన్నాను. నయీమ్‌ను గ్లోరిఫై చేయలేదని చెప్పుకున్న దాము బాలాజీ మరి ఎవరిని టార్గెట్ చేసినట్లు? ‘బయోపిక్’ సరదా ‘భయోపిక్’గా మారితే సహించడానికి బెల్లి లలిత త్యాగాల చరిత్ర చిన్నది కాదు. సినిమా నుంచి ఆ అంశాలను తొలగించి, తెలంగాణ సమాజానికి దాము బహిరంగ క్షమాపణ చెప్పాలి. – డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు -
కపిల్ దేవ్ బయోపిక్కు షాక్, నిర్మాతలపై చీటింగ్ కేసు
Ranveer Singh and Deepika Padukone's Film 83 in Legal Trouble: టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మాతలు చీటింగ్ చేశారంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ ఫిర్యాదు చేసింది. అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టే ఆలోచనతో నిర్మాతలను కలిశారు. సినిమా హక్కులు ఇస్తామని చెప్పి రూ. 15.90 కోట్లు ఖర్చు చేయించారని.. తీరా చూస్తే తమను మోసం చేశారంటూ ముంబై కోర్టును ఆశ్రయించారు. చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్ 83 సినిమా నిర్మాతలపై ఐపీసీ 406, 420, 120బీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దీపికా పదుకొనె, కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ట్రైలర్ కూడా విడుదల కాదా దీనికి విశేష స్పందన వచ్చింది. చదవండి: మంచు లక్ష్మిపై ఆర్జీవీ ప్రశంసలు, మురిసిపోతున్న నటి 1983 నాటి ప్రపంచ కప్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్రంలో రణ్వీర్ సింగ్.. కపిల్ దేవ్ పాత్ర పోషిస్తుండగా ఆయన భార్య రూమీ భాటియాగా దీపికా కనిపించబోతోంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో నిర్మాతలు ఆరోపణలు ఎదుర్కొవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ సినిమాలో సునీల్ గవాస్కర్ పాత్రలో తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్‌గా జీవా, మదన్ లాల్ పాత్రలో హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్ నాథ్ పాత్రలో సకీబ్ సలీమ్ నటించారు. -
రానున్న మరొక క్రికెటర్ బయోపిక్.. లీడ్ రోల్లో అనుష్క ?
Anushka Sharma Not Doing Cricketer Jhulan Goswami Biopic: బాలీవుడ్లో పాపులర్ క్రికెటర్స్‌పై బయోపిక్ చిత్రాలు చాలా వచ్చాయి. ఎంఎస్ ధోని నుంచి ప్రస్తుతం రాబోతున్న 'శభాష్ మిథూ', '83' వరకు మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. తాజాగా మరో క్రికెటర్ బయోపిక్ రానుంది. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ 'జులన్ నిషిత్ గోస్వామి'పై సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నటి అనుష్క ప్రొడక్షన్ హౌజ్ 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' నిర్మిస్తుంది. ముందుగా ఈ చిత్రంలో జులన్ గోస్వామిగా అనుష్క శర్మ నటించాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల అనుష్క తప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు అనుష్క శర్మ నటించిన 'పరి' చిత్రం డైరెక్టర్ ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే గత సంవత్సరం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లోని క్రికెట్ గ్రౌండ్లో అనుష్క, జులన్ షూటింగ్‌కు సంబంధించిన అనేక ఫొటోలు బయటకొచ్చాయి. ఆ ఫొటోలు అనుష్క అభిమానుల సోషల్ మీడియా పేజీలలో తెగ వైరల్ అయ్యాయి. అవి అలా వైరల్ కావడంతో అనుష్క శర్మ జులన్ గోస్వామి బయోపిక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫొటోల్లో దర్శకుడు ప్రోసిత్ రాయ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం జులన్ గోస్వామిగా కొత్త నటిని తీసుకోనున్నారని సమాచారం. ఈ జులన్ గోస్వామి బయోపిక్‌ను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి నిర్మించనున్నారు. ఈ బయోపిక్‌లో జులన్ స్వస్థలం పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాలోని చక్దాహ నుంచి లార్డ్స్ వరకు ఆమె ప్రయాణంతోపాటు మహిళల ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై ఇండియా ఓటమిని చూపించనున్నారు. పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహిత, మహిళల వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జులన్ నిషిత్ గోస్వామిపై తెరకెక్కనున్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే 2007లో ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా జులన్ ఎంపికైంది. జులన్ గోస్వామి 2008-20011 మధ్య భారత మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. -
కపిల్ దేవ్ బయోపిక్: ఉత్కంఠ రేపుతున్న ‘83’ మూవీ టీజర్
Ranveer Singh 83 Movie Teaser Out:1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీపికా పదుకొనె, కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చదవండి: ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్ ఈ నేపథ్యంలో మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా 83 టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం. 1983లోని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారధ్యంలోని భారత జట్టు తొలిసారి ప్రపంచ కప్పును గెలుచుకుంది. దీని ఆధారంగా దర్శకుడు 83 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆనాడు లండన్ లార్డ్ క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ మేకర్స్ టీజర్‌ను వదిలారు. చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. ఈ టిజర్ చూస్తుంటే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక కపిల్ దేవ్‌గా రణ్వీర్ సింగ్ పూర్తిగా ట్రాన్స్‌ఫాం అయ్యాడు. స్టేడియంలో చివరి బంతిని కపిల్ క్యాచ్ పడుతున్న సీన్‌తో ఈ టీజర్ ముగిసింది. ఈ సిన్నివేశంలో చూస్తుంటే క్రికెట్ అభిమానులకు గూస్ బంప్స్ రాకతప్పదు అనేలా టీజర్‌ను ఆసక్తిగా మలిచారు మేకర్స్. కాగా ఈ మూవీలో కపిల్ దేవ్‌గా రణ్వీర్ నటిస్తుండగా.. ఆయన భార్య రొమి భాటియా పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. చదవండి: బిగ్‌బి రియాలిటీ షోలో ఒక్కసారిగా ఏడ్చేసిన స్టార్ హీరో -
మరోసారి బయోపిక్ లో నటిస్తున్న సల్మాన్
-
‘100 ఎకరాలు దానంగా ఇచ్చారు, ఆయనది గొప్ప చరిత్ర’
‘‘వెదిరె రామచంద్రా రెడ్డిగారు ఇచ్చిన మొదటి భూదానం భారతదేశానికే కొత్త అర్థం చెప్పింది. ఆయనది గొప్ప చరిత్ర. ఆయన జీవితాన్ని తెరకెక్కించే బాధ్యతను నాపై పెట్టిన చంద్రశేఖర్‌రెడ్డికి ధన్యవాదాలు’’ అని దర్శకుడు నీలకంఠ అన్నారు. పోచంపల్లికి చెందిన ప్రథమ భూదాత వెదిరె రామచంద్రా రెడ్డి జీవితం తెరపైకి రానుంది. నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. అరవింద్ రెడ్డి(రామచంద్రా రెడ్డి మనవడు) సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆచార్య వినోబా బావే 127వ జయంతి సందర్భంగా చిత్రయూనిట్ ఆయనకు నివాళులు అర్పించింది. అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘1951లో గాంధీజీ ప్రియ శిష్యుడైన ఆచార్య వినోబా భావే పిలుపు మేరకు 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు రామచంద్రా రెడ్డిగారు. ఆ చరిత్ర నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు. ‘‘వినోబా భావే ఆశయాలతో పని చేశారు రామచంద్రారెడ్డి.. అందుకే వినోబా భావే జయంతి సందర్భంగా నివాళులు అర్పించాం’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. 1951సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రథమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమికోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞం గా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యముతో ఈ సినిమా రూపకల్పనకు ప్రయత్నాలకు జరుగుతున్నాయి. -
సౌరవ్ గంగూలీపై ‘బయోపిక్’
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై సినిమా నిరి్మతం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా గంగూలీ నిర్ధారించాడు. ‘క్రికెట్ నా జీవితం. నేను గర్వంగా, తలెత్తుకునేలా చేసింది. నా ప్రయాణం బయోపిక్ రూపంలో వెండితెరపై రానుండటం పట్ల ఉద్వేగానికి లోనవుతున్నా’ అని గంగూలీ ప్రకటించాడు. లవ్ రంజన్, అంకుర్ గార్గ్ కలిసి ‘లవ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తారు. గంగూలీ పాత్ర పోషించే నటుడు, దర్శకుడు తదితర వివరాలను ఇంకా ప్రకటించలేదు. చదవండి: IND VS ENG 5th Test: టీమిండియా ఫిజియోకు కరోనా.. ఆఖరి టెస్ట్‌పై నీలినీడలు -
‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్: బెదిరింపులు కూడా వస్తున్నాయి!
సాక్షి, ఇల్లెందు: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్రపై తీస్తున్న సినిమా షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తామని దర్శకుడు పరమేశ్వర్ వెల్లడించారు. ఇటీవల కారు బోల్తా పడగా ప్రమాదం నుంచి బయటపడిన గుమ్మడి నర్సయ్యను ఆయన శుక్రవారం ఇల్లెందులో పరామర్శించారు. ఆ తర్వాత యూనిట్ సభ్యుడు కృష్ణతో కలిసి పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడారు. గుమ్మడి నర్సయ్య చిత్రం పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. అంతేకాదు బెదిరింపులు కూడా వస్తున్నాయని వెల్లడించారు. అయితే, ఎవరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా ఓ ప్రజానేత జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తామని తెలిపారు. తమ సినిమా విడుదలయ్యాకైనా నేతల్లో కొంత మార్పు వస్తుందనే ఆశ ఉందని చెప్పారు. చదవండి: మాట్లాడుతున్న గుమ్మడి నర్సయ్య చిత్ర దర్శకుడు పరమేశ్వర్ (ఎడమ) -
అల్లూరి బయోపిక్‌లో నేను కూడా ఓ పాత్ర పోషిస్తున్నా: ఎంపీ
సాక్షి, విశాఖపట్నం: వాస్తవానికి దగ్గరగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ మూవీని తీస్తున్నట్లు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. పద్మనాభం జిల్లా పరిషత్ బంగ్లా వద్ద క్లాప్ కొట్టి ఈ సినిమా షూటింగ్‌ను ఆయన ప్రారంభించారు. అల్లూరి జన్మస్థలానికి దగ్గరగా ఉన్న పద్మనాభంలో ఆయన జీవిత చరిత్రపై సినిమా తీయడం గొప్ప విషయమన్నారు. బ్రిటీష్ వారితో వీరోచితంగా పోరాడిన యుద్ధఘట్టాలను ప్రతిబింబిస్తూ ఈ చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. గతంలో సూపర్‌స్టార్ కృష్ణ అల్లూరి గురించి తీసిన చిత్రంలా కాకుండా బంధువులు తెలిపిన వివరాల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు చెప్పారు. ఈ సినిమా తీయడానికి ఆయన బంధువులు ముందుకు రావడం విశేషమన్నారు. ఈ చిత్రంలో తాను కూడా ఓ పాత్రను పోషిస్తున్నట్టు ఎంవీవీ తెలిపారు. డైరెక్టర్ వెంకట్ పంపన మాట్లాడుతూ 45 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేసి ఓటీటీ ప్లాట్ఫారంలో రిలీజ్ చేస్తామని తెలిపారు. పద్మనాభంలోని జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని పోలవరం బ్రిటీష్ కలెక్టర్ కార్యాలయంగా తీర్చిదిద్ది సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా నిర్మాతగా ఆర్.ఎస్.సత్యనారాయణరాజు వ్యవహరిస్తున్నారు.అల్లూరిగా శివవర్మ, గంటం దొరగాడి.జి.రమేష్ మల్లు దొరగా రాఘవ కీలక పాత్రలను పోషిస్తున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పి.రఘువర్మ, పి.సూర్యనారాయణరాజు(సురేష్‌బాబు), వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు కంటుబోతు రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి సుంకర గిరిబాబు, ఆర్ఎస్ దేముడుబాబు, అముజూరి అప్పారావు పాల్గొన్నారు. పద్మనాభంలో సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన విశాఖ ఎంపీ -
తెరపైకి వెదిరె రామచంద్రా రెడ్డి జీవితం
తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి జీవితాన్ని ప్రముఖ దర్శకుడు నీలకంఠ తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (హీరో అల్లు అర్జున్ మామ) నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబా భావే పేదలకు భూ పంపిణీ కోసం అడగ్గానే ప్రథమ భూదాతగా వంద ఎకరాల భూమిని వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన ఆయన జీవిత కథతో సినిమా తెరకెక్కించనున్నాం. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయాలనుకున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: తోలుపునూరి కృష్ణగౌడ్, గడ్డం రవికుమార్. -
ఆ రూమర్స్‌కి చెక్ పెట్టిన కంగనా రనౌత్
సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ నటిస్తుండగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. కథను బాహుబలి ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని విజయ్ దర్శకత్వంలో లిబ్రి మోహన్ పిక్చర్స్ కర్మ మీడి యా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు భారీ ఎత్తున నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన తలైవి టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. తమిళం, తెలుగు, హిందీ భాషలో పాన్ ఇండియా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా ఓటీటీ ఫ్లామ్ఫామ్లో విడుదల చేయనున్నారు అని వస్తోన్న వార్తలను కంగనా కొట్టిపారేసింది. ఇప్పటివరకు తలైవి రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదని, దయచేసి ఎవరూ పుకార్లను నమ్మవద్దని పేర్కొంది. దేశ వ్యాప్తంగా థియేటర్లను ఓపెన్ చేసినప్పుడే తలైవి సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చింది. ఇక జయలలిత పదహారేళ్ల వయసు నుండి 60 ఏళ్ల వయసు వరకూ మొత్తం నాలుగు దశలను తలైవి బయోపిక్లోలో చూపించనున్నారు. -
జీవజ్యోతి గుర్తుందా..? తెరపైకి ఆమె బయోపిక్..
Jeevajothi Santhakumar Biopic: జీవజ్యోతి బయోపిక్ సినిమాగా రూపొందనుంది. జీవజ్యోతి పేరు కొనేళ్ల క్రితం పత్రికల్లో మారుమోగింది. ప్రముఖ హోటల్ శరవణ భవన్ అధినేత రాజగోపాల్ తన హోటల్లో పని చేసే కార్మికురాలైన జీవజ్యోతిని వశపరచుకోవడానికి ఆమె భర్తను చంపించారు. రాజగోపాల్‌పై కార్మికురాలైన జీవజ్యోతి 18 ఏళ్లు పెద్ద పోరాటమే చేసి గెలుపు సాధించింది. ఈ సంఘటనతో జీవజ్యోతి బయోపిక్‌ను జంగిల్ పిక్చర్స్ చిత్ర నిర్మాణ సంస్థ సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో జీవజ్యోతి, రాజగోపాల్ పాత్రల్లో నటించే నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేస్తున్నారు. దీనిపై స్పందించిన జీవజ్యోతి అర్థబలం, అంగబలం కలిగిన ఒక హోటల్ అధినేతపై తన 18 ఏళ్ల పోరును జంగిల్ పిక్చర్స్ సంస్థ సినిమాగా రూపొందించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. తన జీవిత గాథను తెరపై చూసిన తర్వాత పురుషాధిక్యం కారణంగా తాను అనుభవించిన బాధ అందరికీ తెలుస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. -
తలైవి సీక్వెల్..రెండో భాగంలో అంతిమయాత్ర వరకు..
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవిత చరిత్రతో తమిళం, తెలుగు, హిందీ భాషలో పాన్ ఇండియా చిత్రంగా తలైవి సినిమా నిర్మిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా తలైవి చిత్రానికి సీక్వెల్ రూపొందించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలిసింది. మొదటి భాగంలో జయలలిత నట జీవితం, రాజకీయ రంగ ప్రవేశం, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే వరకు ఉంటుందని, రెండో భాగంలో సీఎంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు, అంతిమయాత్ర వరకు సాగుతుందని సమాచారం. దీని గురించి తలైవి చిత్రానికి మాటలు అందిస్తున్న మదన్ కార్గీ ట్విట్టర్లో పేర్కొంటూ జయలలిత గురించి రజనీకాంత్ కొన్ని విషయాలను చెప్పారని, తలైవి చిత్రానికి రెండో భాగం రూపొందిస్తే అందులో ఆయన చెప్పిన విషయాలను పొందుపరిచే అవకాశం ఉందని తెలిపారు. -
పాన్ ఇండియా మూవీగా వైఎస్ జగన్ బయోపిక్
-
పాన్ ఇండియా మూవీగా వైఎస్ జగన్ బయోపిక్, హీరో ఎవరంటే..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ హీరో మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. ‘యాత్ర’ సినిమాకి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు మహీ వి. రాఘవ్. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్‌ని రూపొందించాలనుకుంటున్నారని తెలిసింది. జగన్ జీవితంపై సినిమా అనే వార్త వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై వైఎస్ జగన్ అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో, చిత్రపరిశ్రమలో చర్చలు మొదలయ్యాయి. జగన్ పాత్రలో ఎవరు కనిపిస్తారు? అనేది మరింత ఆసక్తిగా మారింది. ‘జగన్‌గారి పాత్రలో నటించేందుకు నన్ను సంప్రదిస్తే కచ్చితంగా నటిస్తా’ అని తమిళ హీరో సూర్య ఓ ఇంటర్వ్యూలో విలేకరి అడిగితే చెప్పారు. దీంతో సూర్య నటిస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అజ్మల్ నటిస్తారనే వార్తలూ వచ్చాయి. అయితే తాజాగా జగన్ పాత్రలో బాలీవుడ్ నటుడు, ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ ఫేమ్ ప్రతీక్ గాంధీ నటించనున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. ప్రతీక్ ఆహార్యం, హావభావాలు జగన్‌కి దగ్గరగా ఉంటాయని భావించి, మహీ ఆయన్ను ఎంపిక చేశారని సమాచారం. ఈ బయోపిక్ గురించి దర్శకుడు చెప్పగానే చాలా ఎగై్జట్ అయి, నటించడానికి ప్రతీక్ అంగీకారం తెలిపారని భోగట్టా. వైఎస్ జగన్ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని ప్యాన్ ఇండియా చిత్రంగా తీయనున్నారట. జగన్ సొంతంగా పార్టీ స్థాపించడం, పాదయాత్ర, ఎదుర్కొన్న సవాళ్లు, ముఖ్యమంత్రి కావడం వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలిసింది. -
సినిమాలు తీసి నవల రాసింది
41 ఏళ్ల అశ్వినీ తివారీ అయ్యర్ మొన్న కంగనా రనౌత్‌తో ‘పంగా’ తీసింది. నిన్న లాక్డౌన్లో కూచుని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి – సుధామూర్తిల బయోపిక్ కోసం స్క్రిప్ట్ పూర్తి చేసింది. అదే సమయంలో మొదటిసారిగా ఒక నవల రాసి మార్కెట్లోకి ఆగస్టు 1న విడుదల చేస్తోంది. అందరిలానే ఆమెకూ రెండు చేతులే ఉన్నాయి. కాని స్త్రీలు ఇన్ని పనులు చేయగలరు అని సృజనాత్మకంగా ఉండగలరని చెబుతోంది. ‘ది హిడెన్ పవర్స్ ఇన్ ఎవ్రి ఉమన్’ అని నాలుగేళ్ల క్రితం బెంగళూరు టెడ్ఎక్స్ కోసం ఒక ఉపన్యాసం ఇచ్చింది అశ్వినీ తివారీ అయ్యర్. ప్రతి స్త్రీలో ఉండే అంతర్గత శక్తులను ఆ స్త్రీలు తెలుసుకోవాలని, వాటిని ఉపయోగంలోకి తేవాలని ఆమె మాట్లాడింది. ముంబైలో పుట్టి పెరిగిన అశ్వినీ తివారీ అయ్యర్ నిజానికి అడ్వర్టైజ్మెంట్ రంగంలో విశేష గుర్తింపు పొందింది. ‘లియో బర్నెట్’ వంటి అంతర్జాతీయ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్‌గా పని చేసింది. కాని ఆమె తనలో ఒక సినిమా దర్శకురాలు దాగి ఉందని గ్రహించిన మరుక్షణం 2013లో ఆ మంచి ఉద్యోగానికి రాజీనామా చేసి బాలీవుడ్లో పని చేయడం మొదలెట్టింది. ‘నీల్ బత్తి సన్నాట’, ‘బరేలీకి బర్ఫీ’, ‘పంగా’ సినిమాలకు దర్శకత్వం వహించింది. ఆమె దర్శకత్వ ప్రతిభకు అవార్డులు వచ్చాయి. ‘ఏ క్షణమూ ఖాళీగా ఉండటం నాకు నచ్చదు’ అని చెప్పే అశ్వినీ అయ్యర్ గత రెండేళ్లుగా కరోనా వల్ల పని సరిగ్గా జరక్కపోయినా సోనీ లివ్ కోసం ‘ఫాడు’ అనే ప్రేమ కథను తీసింది. ఇన్ఫోసిస్ దిగ్గజాలు సుధామూర్తి, నారాయణమూర్తి జంట జీవిత కథను అధ్యయనం చేసి వారి బయోపిక్కు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంది. అంతేనా? ఒక నవల కూడా రాసేసింది. దాని పేరు ‘మాపింగ్ లవ్’. గణితంలో మేప్‌ల ద్వారా అంచనాలను చేస్తారు. అలా ప్రేమను మేప్ చేయగలమా? అదే ఈ కథాంశం. ‘ఇది నా మొదటి నవల. లాక్డౌన్లో దొరికిన ఏకాంతంలో కూచుని రాశాను. రాయడంలో ఉండే ఆనందాన్ని అనుభవించాను’ అంటుంది అశ్వినీ అయ్యర్. ఈ నవల ఆగస్టు 1న మార్కెట్లోకి రాబోతోంది. అశ్విని తన సినిమా కథాంశాలకు గాని నవలకు గాని స్త్రీల జీవితాన్నే తీసుకుంది. ‘నీల్ బత్తి సన్నాట’లో చిన్న ఊళ్ల స్త్రీలు కనే కలలను ఆమె చూపించింది. ఇక ‘పంగా’ అయితే వైవాహిక జీవితంలో మునిగిపోయిన స్త్రీ తిరిగి తన క్రీడా సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంది. ‘స్త్రీలు ఎన్నో చేయగలరు. ఎన్నో చేయాలి’ అంటుంది అశ్వినీ. ‘దంగల్’ దర్శకుడు నితేష్ తివారి ఈమె భర్త. సుధామూర్తితో...,; కంగనా రనౌత్‌తో... -
సల్మాన్ ఖాన్ నటించనున్న తొలి బయోపిక్! వివరాలివే..
గూఢచారిగా మారనున్నారు బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్. హిందీ ‘రైడ్’ (2018)తో హిట్ అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోనే సల్మాన్ గూఢచారిగా కనిపించనున్నారని టాక్. ఆల్రెడీ సల్మాన్‌ను రాజ్‌కుమార్ గుప్తా కలిసి కథ చెప్పారట. ఈ చిత్రం భారతీయ గూఢచారి రవీంద్ర కౌశిక్ జీవితం ఆధారంగా రూపొందనుందని సమాచారం. ఇందులో రవీంద్ర కౌశిక్ పాత్రలో సల్మాన్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. రవీంద్ర కౌశిక్‌కు బ్లాక్ టైగర్‌గా కూడా పేరుంది. ప్రస్తుతం ‘టైగర్ 3’తో బిజీగా ఉన్న సల్మాన్ ఆ తర్వాత ఫర్హాద్ సామ్జీ డైరెక్షన్లో ‘భాయీజాన్’లో నటిస్తారు. ఈ చిత్రానికి ముందు ‘కభీ ఈద్ కభీ దీవాలి’ అని టైటిల్ పెట్టారు. అయితే ‘భాయీజాన్’గా మార్చారట. ఆ నెక్ట్స్ సల్మాన్‌ఖాన్, రాజ్‌కుమార్ గుప్తా కాంబినేషన్లో రవీంద్ర కౌశిక్ బయోపిక్ సెట్స్‌పైకి వెళుతుందని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే 32 ఏళ్ల కెరీర్లో సల్మాన్ నటించనున్న తొలి బయోపిక్ ఇదే కావడం విశేషం. -
సుశీలమ్మ తన కథ తీయాలన్నారు: ఏఆర్ రెహమాన్
ప్రఖ్యాత గాయకురాలు పి. సుశీల తన బయోపిక్ తీయడానికి సహాయం చేయమని తనను అడిగారని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. రెహమాన్ నిర్మించిన తొలి చిత్రం ‘99 సాంగ్స్’. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ సినిమాను చూడమని పి. సుశీలను కోరారట రెహమాన్. ఈ విషయం గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘ఇటీవల సుశీలమ్మతో మాట్లాడినప్పుడు ‘99 సాంగ్స్’ సినిమాను చూశారా? అని అడిగాను. ఒకవేళ చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉందని చెప్పాను. అక్కడే ఉన్న సుశీలమ్మ సోదరుడు నాతో మాట్లాడారు. ఆమెకు ‘99 సాంగ్స్’ తెలుగు వెర్షన్ చూపించమని ఆయనతో చెప్పాను. సినిమా చూసిన తర్వాత సుశీలమ్మ ఫోన్ చేసి, ‘సినిమా చాలా బాగుంది’ అని ప్రశంసించారు. అంతేకాదు.. ‘‘నా కథను కూడా ‘99 సాంగ్స్’ సినిమాలా బాగా తీయాలి. హెల్ప్ చేస్తారా?’’ అని అడిగారు. సుశీలమ్మ లెజండ్. వేల పాటలు పాడారు. నా ఫేవరెట్ సింగర్. అలాంటి సుశీలమ్మగారు మా సినిమాను మెచ్చుకోవడం, తన బయోపిక్ గురించి అడగడం సంతోషంగా అనిపించింది’’ అన్నారు. -
రవిశంకర్ బయోపిక్: 100 దేశాలు.. 21 భాషలు
బాలీవుడ్లో బయోపిక్‌లకు కొదవలేదు. ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్‌లు తెరపైకి వచ్చాయి. క్రికెటర్ మిథాలీ రాజ్, చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ఆధ్యాత్మిక వేత్త ఓషో వంటి వారి బయోపిక్‌లు కూడా రానున్నాయి. తాజాగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ జీవితం వెండితెరపైకి రానుంది. గురువారం (మే 13) రవిశంకర్ బర్త్ డే సందర్భంగా ఈ బయోపిక్‌ను ప్రకటించారు ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్. ఈ చిత్రానికి ‘ఫ్రీ (స్వేచ్ఛ అని అర్థం కావొచ్చు): ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్’ అని టైటిల్ పెట్టారు. ‘‘గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ జీవితం ఆధారంగా తీయనున్న ఈ సినిమా ద్వారా పాజిటివ్‌నెస్‌ని పెంపొందించాలన్నదే మా ఆలోచన. ఈ చిత్రానికి మాంటో బస్సి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని 21 భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో రిలీజ్ చేస్తాం’’ అని ట్వీట్ చేశారు కరణ్ జోహార్. -
‘నా కుమారుడి చావును క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు’
ఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపివేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సుశాంత్ మరణంపై పలు అనుమానాలు కూడా వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్లో సినీ ప్రముఖులు ప్రతిభను ప్రోత్సాహించరని.. కేవలం బంధుప్రీతి చూపిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా ప్రస్తుతం బాలీవుడ్లో సుశాంత్ సింగ్ జీవితంపై రెండు, మూడు బయోపిక్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఈ చిత్రాలను నిలిపివేయాల్సింది కోరుతూ మంగళవారం ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. అతడి వాదనలు విన్న కోర్టు సుశాంత్‌పై తెరకెక్కుతున్న చిత్రాలను నిలిపివేయాల్సిందిగా నిర్మాతలకు సమన్లు జారీ చేసింది. తన కొడుకు చావును పలు నిర్మాణ సంస్థలు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయనీ సుశాంత్ సింగ్ తండ్రి ఆరోపించారు. అంతేకాకుండా తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని తెలిపారు. కాగా, సుశాంత్ సింగ్ తండ్రి తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టులో వాదనలను వినిపించారు. సుశాంత్ సింగ్ కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని, అతనిపై వచ్చే బయోపిక్ సినిమాలు కేసుపై ప్రభావం చూపుతాయని కోర్టుకు విన్నవించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడిన కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తోందని, తీర్పు ఇంకా పెండింగ్‌లో ఉందని కోర్టుకు తెలిపారు. పిటిషన్లో ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ వాస్ లాస్ట్ అండ్ శశాంక్’ వంటి చిత్రాలను ప్రస్తావించారు. అంతేకాకుండా కుటుంబసభ్యుల సమ్మతి లేకుండా ఈ సినిమాలను తీస్తున్నారని కోర్టుకు వివరించారు. ప్రస్తుతం బాలీవుడ్ సుశాంత్ జీవితం ఆధారంగా ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వాజ్ లాస్ట్ అండ్ శశాంక్’ సినిమాలు రూపొందుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత ఇప్పటివరకు అతని జీవితంపై మూడు సినిమాలు తెరపైకి వచ్చాయి. ఒక వార్తా నివేదిక ప్రకారం, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోగ్రఫీ, సుశాంత్, రాజ్‌పుత్: ది ట్రూత్ విన్స్ , ది అన్సాల్వ్డ్ మిస్టరీ సినిమాలకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. చదవండి: సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు -
కేసీఆర్ బయోపిక్ తెలంగాణ దేవుడు
‘‘ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ బయోపిక్కు ‘తెలంగాణ దేవుడు’ పేరు కరెక్ట్‌గా సరిపోయింది. తెలంగాణ ఉద్యమం గురించి తెలియజేసే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర హోమ్‌మంత్రి మెహమూద్ అలీ అన్నారు. శ్రీకాంత్ టైటిల్ పాత్రలో జిషాన్ ఉస్మాన్, సంగీత, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. వడత్య హరీష్ దర్శకత్వంలో మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజవుతోంది.‘‘గతంలో సినీ ఇండస్ట్రీ కొందరి చేతుల్లోనే ఉండేది. వాళ్లు తీస్తేనే థియేటర్స్ ఓపెన్ అయ్యి సినిమాలు ఆడాలనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మారుతోంది. ఇంకా మార్పు తెస్తాం’’ అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ‘‘ఈ బయోపిక్ తీయడం మా అదృష్టం’’ అన్నారు నిర్మాత జాకీర్, దర్శకుడు హరీష్. ‘‘కేసీఆర్ గారి పాత్ర చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు హీరో శ్రీకాంత్. చదవండి: డాషింగ్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా, హీరోయిన్గా ‘ఉప్పెన’ బ్యూటీ -
20 ఏళ్ల తర్వాత ఆస్కార్ బరిలోకి మనదేశ సినిమా!
వాషింగ్టన్: అకాడమీ అవార్డులంటేనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులని సినీ రంగ ప్రముఖులు భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆలోచనాత్మకమైన కథలతో పాటుగా ఆకట్టుకునే పాత్రలు సైతం ఈ అవార్డుల రేస్‌లో పోటీపడుతుంటాయి. గత 2002లో లగాన్ తరువాత ఈ సంవత్సరం వైట్ టైగర్ చిత్రం ఆస్కార్ 2021లో ఇండియా నుంచి పోటీపడుతోంది. దాదాపు 20 సంవత్సరాల తరువాత ఇండియన్ మూవీ పోటీపడుతుండడంతో ఈసారి అకాడమీ పండుగ మనవారికీ ఆసక్తిగా మారింది. ఈ ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ స్టార్ మూవీస్, స్టార్ వరల్డ్ ఛానెల్స్‌లో ఈ పురస్కారాల పండుగ ప్రసారమవుతోంది. అవార్డుల వేడుకలను తిలకించడమే...అవార్డుల వేడుకకు ఇంకా కొద్ది రోజులే మిగిలిన వేళ ఈ అకాడమీ అవార్డులలో పోటీపడుతున్న చిత్రాలను ఓ సారి పరిశీలిస్తే... ►ద వైట్ టైగర్: లగాన్ తరువాత ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్ కాబడ్డ చిత్రమిది. రాజ్‌కుమార్ రావు, ప్రియాంక చోప్రా లాంటి తారాగణం ఉన్న ఈ చిత్రంలో సామాన్యుని జీవితం ఒడిసిపట్టారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, పారాసైట్ల సమ్మేళనంలా కనిపిస్తుందీ చిత్రం. ► ద పాధర్ : ఫ్లోరియన్ జెల్లర్ ప్లే లీ పీరీ ఆధారంగా తీర్చిదిద్దారు. వయసు మీద పడిన తండ్రి నెమ్మదిగా అన్నీ మరిచిపోతుండటం... ఈ నేపథ్యంలో కనిపించే భావోద్వేగాలు. ఆంథోనీ హోప్కిన్స్ ప్రదర్శనకు పరాకాష్ట అనతగ్గ రీతిలో ఉంటుందిది. ► జుడాస్ అండ్ ద బ్లాక్ మెసయ్య : చారిత్రాత్మక బయోపిక్ ఇది. దర్శకత్వం మొదలు, చిత్ర నటీనటుల ఎంపిక, నటన, స్క్రిప్ట్... ప్రతిఒక్కటీ అద్భుతమే ! ► మంక్ : డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. విశేషమేమిటంటే ఈ చిత్ర స్క్రీన్‌ప్లేను ఆయన తండ్రి జాక్ ఫించర్ తీర్చిదిద్దడం. ఇటీవలనే ఆయన మరణించారు. ► మినారీ: లీ ఇసాక్ రచనదర్శకత్వం వహించిన కొరియన్అమెరికన్ ఫ్యామిలీ చిత్రమిది. స్ఫూర్తిదాయక కుటుంబ కథా చిత్రాలలో ఒకటి. రోజువారీ సగటు అమెరికన్ జీవిత గాథను ఇది వెల్లడిస్తుంది. ►నోమడ్ల్యాండ్ః అందాన్ని ఆస్వాదించాలనుకునే వారు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమది. ఓ సంక్షోభంలో అన్నీ కోల్పోయిన 60ఏళ్ల వయసులోని మహిళ జీవిత ప్రయాణాన్ని కళ్లకు కడుతుంది. ► ప్రామిసింగ్ యంగ్ ఉమెన్: ఊహాతీత సంఘటనలతో కూడిన కథనం ఈ చిత్రబలం. ఓ అమ్మాయి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలతో సాగుంది. అద్భుతమైన అభినయం, దర్శకత్వాల కలయిక ఈ చిత్రం. ► సౌండ్ ఆఫ్ మెటల్: తన వినికిడి శక్తిని కోల్పోవడం ప్రారంభించిన ఓ హెవీ మెటల్ డ్రమ్మర్ జీవితంపై దృష్టి సారించిన చిత్రమిది. ఈ సినిమా ఆద్యంతం భావోద్వేగాలతో, వాస్తవికంగా సాగుతుంది. ఈ సినిమాలో కధానాయకుడు ఫీలయ్యే అనేక భావాలను మనమూ ఫీలయ్యేంతగా మనల్ని లీనం చేసుకుంటుంది. రిజ్ అహ్మద్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. ► ద ట్రయల్ ఆఫ్ ద చికాగో 7: కోర్ట్ రూమ్‌లో సంభవించే ఆసక్తికర అంశాలను అద్భుతంగా చిత్రీకరించిన వైనం ఆకట్టుకుంటుంది. కొన్ని దశాబ్ధాల క్రితం 1969లో నిజంగా చికాగోలో జరిగిన ఓ ఉదంతం ఆధారంగా తీసిన చిత్రమిది. -
చక్కనమ్మ బరువు పెరిగినా బ్రహ్మాండమే!
ఇప్పుడు అందరి దృష్టి బరువు ఎలా తగ్గాలి, ఎలా స్లిమ్ కావాలి అనేదానిపైనే ఉంది. అయితే బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ ‘తలైవి’ సినిమా కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 కిలోల బరువు పెరగాల్సి వచ్చిందట. ‘అయినా అందంగానే ఉంది’ అని మురిసిపోయారు అభిమానులు. వారి అభిమానానికేం గానీ పెరిగిన బరువును తగ్గించుకోవడానికి బాగానే చెమటోడాల్సి వచ్చింది కంగనా. జయలలిత బయోపిక్ అంటే మామూలు విషయం కాదు...కొన్ని సీన్లలో చాలా గ్లామర్‌గా కనిపించాలి, కొన్ని సీన్లలో ఫైర్బ్రాండై గర్జించాలి, సమూహంలో ఒంటరిగా, ఒక్కరే మహా సమూహంగా...ఇలా ఎన్నో అవతారాల్లో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవాలి. ఈ కష్టంతో పోల్చితే బరువు తగ్గడం అనేది చాలా ఈజీ అనడంలో తప్పు లేదేమో! -
గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో..
గంగుబాయి కథ ఒక సినిమాకు తక్కువ కాదు. అందుకే అది ఇప్పుడు సినిమా అయ్యింది. గుంగుబాయి కతియావాడి ముంబై కామాటిపురాకు మకుటం లేని మహారాణి. కరీం లాలా అనే మాఫియా డాన్‌కు రాఖీ కట్టడంతో అతని అండ దొరికి కామాటిపురాను ఏలింది. అయితే ఆమె జీవితాంతం వేశ్యలకు సాయం చేయడానికే చూసింది. అందుకే నేటికీ ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ జూలై 30న రిలీజవుతుందని టాక్. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన గంగుబాయి బయోపిక్ కూడా అదే డేట్‌కు రిలీజ్ కానుంది. ఆ కలెక్షన్ల క్లాష్ కంటే గుంగుబాయి చరిత్రే ఎక్కువ ఆసక్తికరం. చరిత్ర నిక్షిప్తం చేసుకున్న కథలు ఎన్నో. మనల్ని ఆశ్చర్యపరిచేవి, సంతోషపెట్టేవి, బాధ పెట్టేవి, గర్వపడేలా చేసేవి, సామాజిక పరిణామాలను తెలియ చేసేవి... ఒకప్పుడు సినిమాలంటే కల్పిత కథలు. నేడు చరిత్ర నుంచి ఏరుతున్న పుటలు. దర్శకుడు సంజయ్ లీలాబన్సాలీ అలాంటి మరొక పుటను వెతికి పట్టుకున్నాడు. దాని పేరు ‘గుంగుబాయి కతియావాడీ’. 1960లలో ముంబై రెడ్‌లైట్ ఏరియా అయిన కామాటిపురాలో చక్రం తిప్పిన మేడమ్ గంగుబాయి కతియావాడీ. ఇప్పుడు ఆమె బయోపిక్ దాదాపుగా పూర్తి కావచ్చింది. గుంగుబాయిగా ఆలియాభట్ నటించింది. ఇంటి నుంచి పారిపోయి గుంగుబాయి కథ ఆసక్తికరమైనది. ఆమెది గుజరాత్‌లోని కతియావాడీ. వాళ్లది లాయర్ల కుటుంబం అని చెబుతారు. గంగుబాయి చిన్న వయసులో సినిమాల పిచ్చిలో పడింది. అంతే కాదు వాళ్ల నాన్న దగ్గర క్లర్క్‌గా పని చేసే కుర్రాడి ప్రేమలో కూడా పడింది. ఇద్దరూ కలిసి ముంబై పారిపోయారు. వాళ్లిద్దరూ కొన్నాళ్లు కాపురం చేశారని అంటారు. కాని ముంబైలాంటి మహా నగరిలో ఆ కుర్రాడు బెంబేలెత్తాడు. గుంగుబాయిని కామాటిపురాలోని ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోయాడు. అక్కడి నుంచే గంగుబాయి జీవితం అనూహ్యమవుతూ వచ్చింది. ప్రతిఘటన... లొంగుబాటు వేశ్యావాటికలో గంగుబాయి వారాల తరబడి ఏడ్చింది. కాని తుదకు వృత్తిని అంగీకరించక తప్పలేదు. అయితే ఆమె రూపం, కొద్దో గొప్పో ఉన్న చదువు ఆమెను హైక్లాస్ క్లయింట్ల దగ్గరకు వెళ్లే వేశ్యను చేయగలిగాయి. వారి రాకపోకలు ఆమె కోసం సాగేవి. కాని సహజంగా నేరగాళ్లు కూడా చాలామంది వచ్చి పోతూ ఉండేవారు. అలా ఆమెకు ముంబై అండర్‌వరల్డ్ తెలిసింది. ఆ సమయంలోనే నాటి పెద్ద డాన్ అయిన కరీం లాలాకు చెందిన ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది ఆమెను చాలారోజుల పాటు అచేతనం చేసిందని అంటారు. తన మీద దాడి ఆమె సహించలేకపోయింది. అయితే మెల్లగా కోలుకుని తనకు న్యాయం జరగాలని ఆశించి శుక్రవారం నమాజు ముగించుకుని వస్తున్న కరీం లాలాను కలిసింది. తనకు జరిగిన అన్యాయం, తాను అనుభవిస్తున్న వేదన చెప్పుకుంది. కరీం లాలా వెంటనే ఆమెకు ఊరడింపు ఇచ్చాడు. ఆమె రాఖీ కడితే కట్టించుకుని రక్ష ఇచ్చాడు. అంతే కాదు ‘కామాటిపురాలో గుంగుబాయికి ఎటువంటి కష్టం ఎవరు కలిగించినా వారి పని చూస్తా’ అని హెచ్చరించాడు. ఇది గంగుబాయికి పెద్ద వరం అయ్యింది. ఆమె కామాటిపురాలో తానే వేశ్యాగృహాల యజమానిగా ఎదగడం మొదలెట్టింది. మహా ప్రాభవం కామాటిపురాలో గంగుబాయికి అనేక వేశ్యాగృహాలు సొంతమయ్యాయి. ఆమె కట్టే ఖరీదైన చీరలు నాడు విశేషమయ్యాయి. నిజం బంగారు అంచు ఉండే చీరలు, నిజం బంగారు గుండీలు ఉండే జాకెట్లు ఆమె కట్టుకునేది. ఆమెకు ఆరోజుల్లోనే బెంట్లి కారు ఉండేది. అండర్ వరల్డ్ కూడా ఆమె గుప్పిట్లో ఉండేది. అయితే ఆమె బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. దీనిని వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లే ఉండాలని భావించింది. ఎవరైనా ఈ కూపం నుంచి బయటపడాలనుకుంటే వారిని వెళ్లనిచ్చేది. అంతే కాదు వేశ్యల బాగోగులతోబాటు, వారికి పుట్టిన బిడ్డల బాగోగులు కూడా ఆమె చూసేది. అందువల్లే ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ఆమె ఫొటోలు నేటికి కామాటిపురాలోని వేశ్యాగృహాల్లో కనిపిస్తాయి. సినిమాలో కథ ఈ సినిమా కథను సంజయ్ లీలా బన్సాలీ పకడ్బందీగా తీస్తున్నాడని వినికిడి. ఆలియా భట్ ఈ క్యారెక్టర్‌ను చాలెంజింగ్‌గా తీసుకుని చేస్తోంది. అజయ్ దేవ్‌గణ్ ‘కరీం లాలా’ పాత్రను పోషిస్తున్నాడు. ఎన్నిసార్లు విన్నా వేశ్యల జీవితంలో విషాదమే ఉంటుంది. దీని గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. సినిమాలూ వచ్చాయి. కాని గుంగుబాయి లాంటి వ్యక్తి గురించి వస్తుండటం వల్ల దీని గురించి కుతూహలం ఏర్పడింది. సినిమా విడుదల గురించి వస్తున్న వార్తలను బట్టి జూలై 30న దీనిని విడుదల చేయనున్నారు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడా అదే రోజు కావచ్చని అంచనా. కనుక రెండు సినిమాలు కలెక్షన్ల పోటీని ఎదుర్కోవాలి. – సాక్షి ఫ్యామిలీ -
ఉక్కు మహిళగా కంగనా
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత పాత్రలో ‘తలైవి’ సినిమాను పూర్తి చేసిన కంగన ఇప్పుడు మరో పవర్ఫుల్ పాత్రలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. అది కూడా దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా (ఐరన్ లేడీ) పేరున్న ఇందిరా గాంధీ పాత్ర చేయనున్నారు. ‘‘ఈ సినిమా ఇందిరా గాంధీ జీవిత చరిత్ర కాదు... అయితే ఆమె జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టం నేపథ్యంలో ఉంటుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. భారతదేశంలో నెలకొన్న రాజకీయాలపై ఇప్పటి తరం వారికి మా సినిమా అవగాహన కల్పిస్తుంది. నా స్నేహితుడు సాయి కబీర్ (చిత్రదర్శకుడు)తో కలిసి రాజకీయ నేపథ్యం ఉన్న ఈ కథలో నటిస్తున్నందుకు హ్యాపీ. ‘మణికర్ణిక’ చిత్రబృందమే ఈ సినిమాకు కూడా పని చేస్తుంది’’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే కంగనపై ఫొటోషూట్ కూడా చేశారు. ఇందిరాగాంధీ లుక్‌లో కంగన బాగున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఓ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని కంగన పేర్కొన్నారు. ఇందులో లాల్‌బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ పాత్రలు కూడా ఉంటాయి. -
నేనంటేనే ఇవ్వరు
‘‘షకీలా సినిమా అంటేనే సెన్సార్ ఇవ్వరు. అలాంటిది నా బయోగ్రఫీ అంటే ఎంత కష్టపడి సెన్సార్ తీసుకుని ఉంటారో నాకు తెలుసు. జనవరి 1న విడుదలవుతున్న ‘షకీలా’ సినిమాని ఎంటర్టైన్మెంట్ మోటివ్లోనే చూడండి. ఈ సినిమా నా లైఫ్ గురించి అనే కాదు, కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం జరిగింది’’ అన్నారు షకీలా. నటి షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘షకీలా’. రీచా చద్దా, పంకజ్ త్రిపాఠి, ఎస్తర్లు కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజిత్ లోకేష్ రచించి, దర్శకత్వం వహించారు. ప్రకాశ్ పళని సమర్పణలో సమ్మి నన్వని, శరవణ ప్రసాద్ నిర్మించారు. ఎస్తర్ మాట్లాడుతూ– ‘‘చాలారోజుల తర్వాత ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. షకీలా లైఫ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను’’ అన్నారు. యూఎఫ్ఓ ప్రతినిధి లక్ష్మణ్, రాజీవ్ పిళ్లై, ఉపాసన తదితరులు పాల్గొన్నారు. -
షకీలా కష్టాలతో...
నటి షకీలా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘షకీలా’. రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీ, ఎస్తర్ నోరన్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మలని కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజీత్ లంకేశ్ దర్శకత్వంలో ప్రకాష్ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్ హిందీలో ‘షకీలా’ చిత్రాన్ని నిర్మించి, అన్ని భాషల్లో అనువదించారు. హిందీ, తమిళ, కన్నడ భాషల్లో శుక్రవారం ఈ సినిమాని విడుదల చేయగా, జనవరి 1న యుఎఫ్ఓ మూవీస్ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘షకీలా’ తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల చేశారు. షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను ట్రైలర్లో చూపించారు. ‘‘బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించినప్పటికీ, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో సెన్సార్ బోర్డు కమిటీ ప్రశంసించింది. సినిమా థీమ్, మంచి సందేశానికి వారి నుండి ప్రశంసలు లభించాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత: సదీప్ మలాని, కెమెరా: సంతోష్ రాయ్ పతజే. -
‘షకీలా’ తెలుగు ట్రైలర్
1990లో ఖాళీగా ఉన్న సినిమా థియేటర్లు హౌజ్‌ఫుల్ కావాలంటే డిస్ట్రిబ్యూటర్లకు ఒకేఒక పేరు వినిపించేది. ఆ పేరే షకీలా. అప్పట్లో ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కానీ రాను రాను ఆమె క్రేజీ తగ్గిపోయింది. ఆమె సినిమాలు కనుమరుగైపోయాయి. కొంతమంది ఆమె సక్సెస్‌ను చూడలేక తొక్కేశారని కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘షకీలా’ సినిమాను తెరకెక్కించాడు ప్రముఖ దర్శకుడు ఇంద్రజీత్ లంఖేష్. బాలీవుడ్ నటి రిచా చద్దా లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో షకీలా శృంగార నాయికగా ఎలాంటి పాపులారిటీ సంపాదించుకుంది వంటి కీలక అంశాలతోపాటు ఆమె జీవితంలోని మరిన్ని కోణాలను చూపించారు. తెర వెనుక షకీలా జీవితం ఎలా ఉందనే అంశాలను చూపించినట్లు సినిమా చూస్తే తెలుస్తోంది. ఇక నూతన సంవత్సరం కానుకగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 1న తెలుగు,తమిళం,హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. -
ఉన్నికృష్ణన్ ప్రయాణం
‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి విలక్షణమైన హిట్ చిత్రాల్లో నటించి, హీరోగా అడివి శేష్ చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన టైటిల్ రోల్లో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తాజా ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శేష్ బర్త్‌డే సందర్భంగా గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికష్ణన్ జర్నీని, ఆయన జీవన శైలిని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మిస్తోంది. వచ్చే సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానుంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, సయీ మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. -
మైదానంలోకి వస్తున్నారు
అజయ్ దేవగన్ హీరోగా అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’. ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆయన పాత్రలో అజయ్ కనిపిస్తారు. ప్రియమణి కథానాయిక. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. కోవిడ్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమా కోసం వేసిన ఫుట్‌బాల్ స్టేడియం సెట్‌ని లాక్ డౌన్ టైమ్‌లో తొలగించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇంతకు ముందు తీసేసిన సెట్‌నే మళ్లీ కొత్తగా వేస్తున్నారు. జనవరిలో ఈ చిత్రీకరణలో పాల్గొంటారు అజయ్. ప్రస్తుతం అజయ్, ఈ సినిమాలో నటించేవాళ్లందరూ ఫుట్‌బాల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. -
కఠిన ప్రపంచపు కరుకు అనుభవాల ఆమె కథ
తండ్రి ఆమెను చిన్నప్పుడు పట్టించుకోలేదు. తల్లి బతుకుతెరువుకు ఆమె దేహం ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించింది. సొంత అక్క ఆమె సంపాదించినది అంతా తీసేసుకుంది. మగ ప్రపంచం ఆమెను నిండా మోసం చేసింది. నెల్లూరు నుంచి వెళ్లి కేరళ సినిమా రంగంలో సంచలనం సృష్టించిన నటి షకీలా. ఆమె జీవితం ఆధారంగా తయారైన సినిమా ‘షకీలా’ ఈ క్రిస్మస్కు విడుదల కానుంది. గతంలో సిల్క్ స్మిత జీవితంపై ‘డర్టీ పిక్చర్’ వచ్చింది. ఇప్పుడు షకీలా. షకీలా జీవితానుభవాలు, సినిమాలో అవి వస్తున్న విధం గురించి కథనం. సినిమాలలో సగటు ప్రేక్షకుల వినోదం కోసం ‘క్లబ్ డాన్సర్’ల పేరుతో స్త్రీల శరీర ప్రదర్శన ఉండేది. ఇప్పటికీ ఉంది. ఇప్పుడు అలాంటి పాటలను ఐటమ్ సాంగ్స్ అంటున్నారు. వాటిని పెద్ద పెద్ద హీరోయిన్లు చేస్తున్నారు కూడా. కాని గతంలో వాటి కోసంగా వేరే తారలు ఉండేవారు. వారికి సంప్రదాయ ప్రేక్షకుల దృష్టిలో తక్కువ చూపు ఉండేది. హిందీ సినిమాలలో తొలి క్లబ్ డాన్సర్‌గా హెలెన్ చరిత్ర సృష్టించారు. హెలెన్ స్ఫూర్తితో ఆ తర్వాత సౌత్‌లో కూడా చాలామంది తారలు కేవలం క్లబ్ డాన్సర్లుగా తమ కెరీర్లు మలుచుకున్నారు. దక్షిణాది సినిమా రంగంలో జ్యోతిలక్ష్మి, జయమాలిని, విజయలలిత, అనురాధ ఆ తర్వాతి కాలంలో సిల్క్ స్మిత చాలా పేరు సంపాదించారు. అయితే ఈ రంగంలో ఉన్న తారలు, ఘర్షణాయుతమైన జీవితం మిగిలిన వారి జీవితాలకు సంబంధించి వెలికి రాలేదు. కాని సిల్క్ స్మిత హటాన్మరణం పెద్ద న్యూస్‌గా మారింది. ఆ తర్వాత ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు శృంగార నటి షకీలా జీవితం ఆధారంగా ‘షకీలా’ పేరుతో సినిమా ఈ క్రిస్మస్కు విడుదల కానుంది. కాని ఈమె డాన్సర్ కాదు. అది తేడా. నెల్లూరు నుంచి షకీలా స్వస్థలం నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో ఉండే కోట. దిగువ మధ్యతరగతి కుటుంబం. వారి బంధువులంతా టైలరింగ్ వంటి చిన్న పనులే చేసేవారు. షకీలా తండ్రి చాంద్ బాషా బతుకు తెరువు కోసం చెన్నై వెళ్లి ఆ తర్వాత కుటుంబాన్ని కూడా తీసుకెళ్లాడు. అక్కడే షకీలా జీవితం సినిమా ప్రపంచం వైపు మెల్లగా మళ్లింది. అయితే జీవితం గడవాలంటే అవసరమైన ‘రాజీ’ పడాల్సిందేనని తల్లి షకీలాను ఒప్పించి ఆమెను సినిమా పరిశ్రమలోకి పంపింది. తల్లికి గాని, షకీలాకు గాని చదువు లేదు. మిగిలిన సంతానం కూడా అంతంత మాత్రమే చదువుకున్నారు. 1995లో షకీలా తొలి శృంగార చిత్రం ‘ప్లేగర్ల్స్’ విడుదల అయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన మలయాళ సినిమా ‘కిన్నరతుంబిగల్’ విడుదలై పెద్ద హిట్ అయ్యింది. షకీలా మద్రాసులో ఉంటూ మలయాళ సినిమాలలో విస్తృతంగా నటించడం మొదలెట్టారు. 30–40 కేంద్రాలు పెద్ద హీరోల సినిమాలు భారీ ఖర్చుతో తీయాలి. అన్ని సెంటర్లలో బాగా ఆడాలి. కాని షకీలా నటించిన సినిమాలు ముప్పై నలబై కేంద్రాలలో ఓ మోస్తరు ఆడినా డబ్బు వచ్చేసేది. సాధారణంగా షూటింగ్ అయ్యాక సదరు నటీనటులు ఇళ్లకు వచ్చి స్నానాలు చేస్తారు. కాని షకీల షూటింగ్లో ప్రధానమైన సీన్ల షూటింగ్ అయ్యాక దర్శకులు ‘ఒక ఫ్యాంటసీ సీన్’ అనో, ‘ఒక స్నానం సీన్’ అనో అడిగి చివరి గంటల్లో ఆ సీన్లు తీసేవారు. వాటి కోసం షకీల ప్రత్యేకంగా నటించాల్సి వచ్చేది. 1995–2000 మధ్య కాలంలో షకీలా సినిమాలు మలయాళ రంగాన్ని ఊపేశాయి. శృంగార చిత్రాలు ఎవరు నటించినా ‘షకీలా సినిమా’ అనేంతగా ఆమెకు ఇమేజ్ వచ్చింది. ఒక్క భాషలో ఆమె నటిస్తే అన్ని భాషల్లోనూ అవి డబ్ అయ్యేవి. ఇంకా నేపాల్, శ్రీలంకలలో కూడా రిలీజ్ అయ్యేవి. ‘రోజుకు మూడు లక్షలు తీసుకున్న రోజులు ఉన్నాయి’ అని షకీలా చెప్పుకున్నారు. మలయాళ సూపర్స్టార్లు ఆమె సినిమా కలెక్షన్లు చూసి నామోషీ ఫీల్ అయ్యారని, ఆమె సినిమాలు విడుదల కాకుండా చూశారని ఒక వార్త ఉంది. 2002లో షకీల ఇక మీదట తాను అలాంటి సినిమాలలో నటించనని ప్రకటన చేసి వాటిని విరమించుకున్నారు. కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. అయితే ఆ కెరీర్ సజావుగా లేదు. ఆమె సంపాదించిన డబ్బులో ఏదీ ప్రస్తుతం ఆమె దగ్గర లేదు. ఆమె అతి సామాన్య జీవనం గడిపే స్థితికి చేరుకున్నారు. అయిన వారే ‘మా అమ్మ నన్ను బంగారు బాతులా చూసింది. నా ఆర్థిక లావాదేవీలన్ని నా పెద్దక్క చూసింది. దాదాపు రెండు కోట్ల రూపాయలు నా డబ్బు ఆమె దగ్గర ఉండిపోయింది. అది నాకు ఇవ్వలేదు. మా అమ్మ నా పేరున ఏదైనా ఆస్తి ఉంటే నేను వేరుగా వెళ్లిపోయి స్థిరపడతానని అసలు ఏ ఆస్తీ నా పేరున కొననివ్వలేదు. నా వాళ్లు నా సంపాదనతో స్థిరపడి తమ వేడుకలకు నేను వస్తే నన్ను బంధువులకు పరిచయం చేయడానికి ఇబ్బంది పడే స్థితికి వచ్చారు. అందుకని ఇప్పుడు వాళ్లందరితో తెగదెంపులు చేసుకున్నాను. నాకు ఎవరూ లేరు’ అని షకీల చెప్పుకున్నారు. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్‌ను దత్తత తీసుకున్నారు. తమిళనాడులో ఉండే ట్రాన్స్జెండర్ల సమూహం ఆమెను తమ మనిషిగా స్వీకరించింది. వారే ఇప్పుడు షకీల మంచి చెడ్డలు చూసుకుంటున్నారు. ‘నాతో రిలేషన్లో ఉన్న మగవారు కూడా నాకు దూరమైపోయారు’ అని ఆమె అన్నారు . ఆత్మకథ– సినిమా షకీలా ఆత్మకథ మలయాళంలో ‘షకీలా ఆత్మకథ’ పేరుతో విడుదలైంది. అది అక్కడ చర్చకు పాత్రమైంది. హిందీలో ఆమె కథ స్ఫూర్తిగా ప్రసిద్ధ బాలీవుడ్ నటి రీచా చద్దా ముఖ్యపాత్రలో సినిమా తయారైంది. అది ఈ సంవత్సరం మొదలులోనే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా వల్ల ఈ డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతోంది. అదీ నేరుగా థియేటర్లలో. ‘సినిమా రంగంలోకి రావాలనుకున్న యువతులు ఇక్కడ గ్లామర్, పేరుతో పాటు ఇంకా ఏమేమి ఉంటాయో కూడా తెలుసుకోవాలి. అందుకు ఈ సినిమా కథ ఉపయోగపడుతుంది’ అని దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ అన్నాడు. రిచా చద్దా ‘గాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, ‘మసాన్’ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు పొందారు. ‘షకీలా’ సినిమా కచ్చితంగా విమర్శకులు మెచ్చే స్థాయిలో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఒక పల్లెటూరు అమ్మాయి చేసిన ఒక వినూత్న ప్రయాణం ఈ కథ. ఇది సమాజంలో ఉండే నిచ్చెనలను, పాములను కూడా చూపిస్తుంది. ఇది నమ్మకాలను, నమ్మకద్రోహాలను కూడా చూపిస్తుంది. జీవితం పట్ల ఎంత అప్రమత్తతతో ఉండాలో కూడా హెచ్చరిస్తుంది. – సాక్షి ఫ్యామిలీ -
ఎన్నికల ముందే ఈ సినిమా రిలీజ్ చేస్తా: ఆర్జీవీ
సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, పవర్‌స్టార్, దిశ, నేక్డ్, క్లైమాక్స్, కరోనా వంటి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించిన ఆయన పనిలో పనిగా తన ఆత్మకథను కూడా రాము పేరుతో మూడు భాగాలుగా తీసుకొస్తున్నారు. అయితే చేసిన సినిమాలు హిట్టు కొట్టకపోయినా సరే పెద్దగా లెక్క చేయకుండా ఎప్పుడూ ఏదో ఒక బయోపిక్‌తో సందడి చేస్తూనే ఉంటారు. కానీ బయోపిక్ చిత్రాల్లో డూపులను సెలక్ట్ చేసుకోవడంలో మాత్రం వర్మను మించినవారు లేరు. ఇప్పుడు వర్మ కన్ను తమిళనాడు మీద పడింది. అవినీతి కేసులో కటకటాల వెనక్కు వెళ్లిన చిన్నమ్మ శశికళ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఈ సినిమా చేస్తున్నానని వర్మ గతేడాదిలోనే ప్రకటించారు. 'లవ్ ఈజ్ డేంజరస్లీ పొలిటికల్' అన్న క్యాప్షన్‌తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (చదవండి: శశికళ ఆశలు అడియాశలు..!) ఏమైందో ఏమో కానీ తర్వాత ఆ సినిమాను అటకెక్కించారు. తాజాగా శనివారం నాడు మరోసారి శశికళ సినిమా గురించి ప్రస్తావిస్తూ " J, S, E, P, S మధ్య ఉన్న బంధాన్ని, వారి రాజకీయ తెరంగ్రేటాన్ని చూపించబోతున్నాం. తమిళనాడు ఎన్నికల కన్నా ముందు, నాయకురాలి(జయ లలిత) బయోపిక్ (తలైవి) రిలీజ్ అయ్యే రోజునే దీన్ని కూడా విడుదల చేస్తాం" అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. ఇందులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ కూడా ఉన్నారు. 'తన సినిమాలో నిజాలు ఉంటాయని, ఫిబ్రవరిలో వాటిని తెరపై చూపిస్తా'నని వర్మ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు. మరి ఈ బయోపిక్ మీద ఎన్ని వివాదాలు ముసురుకుంటాయో చూడాలి. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో న్యాయస్థానం శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. దీంతో ఆమె 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో కాలం వెళ్లదీస్తున్నారు. (చదవండి: ఊర్మిళపై కంగన ఘాటు వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్) Making a film called SASIKALA.. it’s about what a woman S and a man E did to a Leader ..Film will release before TN elections on the same day as the biopic of the Leader “it is easiest to kill , when you are the closest” -Ancient Tamil Saying pic.twitter.com/VVH61fxLL5 — Ram Gopal Varma (@RGVzoomin) November 21, 2020 -
పరుగు ప్రారంభం
దుబాయ్‌లో పరుగు ప్రారంభించారు తాప్సీ. యాక్షన్ అనడం ఆలస్యం పరుగులు తీయడానికి సిద్ధంగా ఉంటున్నారు. తాప్సీ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘రష్మీ రాకెట్’. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ నిర్మిస్తున్నారు. ఇందులో రన్నర్‌గా నటిస్తున్నారు తాప్సీ. గుజరాత్లో ఓ మారుమూల గ్రామంలో ఉండే అమ్మాయి రష్మీ. ఆమె వేగాన్ని చూసి అందరూ రాకెట్ అంటుంటారు. మరి ఆ రాకెట్ ఎందాకా వెళ్లగలిగింది అనేది చిత్రకథాంశం. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా దుబాయ్‌లో ప్రారంభం అయింది. ‘మరో కొత్త ప్రయాణం ప్రారంభం అయింది. హసీనా (తన గత చిత్రం ‘హసీనా దిల్రుబా’లో పాత్రను ఉద్దేశించి) నుంచి రాకెట్‌గా మారిపోయాను’’ అన్నారు తాప్సీ. -
అంతకు మించి దారి లేదు!
సూర్య హీరోగా, నిర్మాతగా విలక్షణ నటుడు మోహన్ బాబు, అపర్ణా బాల మురళీ ప్రధాన పాత్రధారులుగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ (తమిళంలో ‘సూరరై పోట్రు’). ఎయిర్‌డెక్కన్ అధినేత జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నవంబర్ 12న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకానుంది. ఈ సందర్భంగా సూర్య చెప్పిన విశేషాలు. ► ఒక కామన్ మ్యాన్ కల ఈ సినిమా. తను కన్న కలను నెరవేర్చుకోవటానికి ఒక వ్యక్తి తన ప్రయాణంలో ఎదుర్కొన్న పరిస్థితుల సమాహారమే ‘ఆకాశం నీ హద్దురా’. కర్ణాటకలోని ఓ స్కూల్ టీచర్ కొడుకు ఎయిర్ డెక్కన్ అనే ఎయిర్‌లైన్ సంస్థను స్థాపించి సామాన్యులకు ఎంత దగ్గరగా తన సామ్రాజ్యాన్ని తీసుకెళ్లాడు? ఇరవైనాలుగువేల రూపాయలు ఉండే విమాన టికెట్ ధరను నాలుగువేలకు, రెండువేలకు, చివరకు 1రూపాయితో సామాన్యుడు ఎలా ప్రయాణించాడు? అనే కథతో తెరకెక్కిన చిత్రమిది. ఈ కల కన్న గోపీనాథ్‌గారు రియల్ హీరో. ► 670 పేజీలుండే ‘సింప్లీ ఫ్లై’ బుక్ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాం. అందులోని నాలుగు ముఖ్య భాగాల్ని, 120 పేజీల కథని మాత్రమే ఈ సినిమాకి వాడుకున్నాం. పుస్తకమంతా సినిమాగా తీస్తే 7 గంటలపైనే కంటెంట్ వస్తుంది. అందుకే ముఖ్మమైన భాగాల్ని తీసుకుని 120 నిమిషాల్లో సినిమాని నిర్మించాం. 38 సినిమాలు చేసిన తర్వాత కూడా ఈ సినిమా నాకు ఒక కొత్త అనుభూతినిచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ కథకు నేను ఎంతగా కనెక్ట్ అయ్యానో. ► సుధాని నేను ‘యువ’ సినిమా టైమ్‌లో కలిశాను. అప్పుడామె మణిరత్నంగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసేవారు. ఆమె దర్శకత్వంలో సినిమా చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశాను. నేనే కాదు, నాతో పాటు టీమ్‌లో ఉన్న మిగతా 250మంది సుధాతో ఎంతో స్వీట్‌గా పని చేశాం. సుధ క్రమశిక్షణ, క్రాఫ్ట్ మీద ఆమెకు ఉన్న పట్టు మా అందరితో అంత బాగా పని చేయించింది. ► మోహన్‌బాబుగారి లాంటి లెజెండ్‌తో పనిచేయటం ఆనందంగా అనిపించింది. ఈ కథ విన్న వెంటనే ‘నేను సినిమా చేస్తున్నాను’ అని చెప్పారు. గొప్పవాళ్లంతా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారనడానికి ఇదే ఉదాహరణ. ముందురోజే తన డైలాగ్‌లను నేర్చుకుని ‘ఏమ్మా ఈ డైలాగ్ ఇలానేనా చెప్పేది’ అని దర్శకురాలిని అడుగుతూ తనను తాను కరెక్ట్ చేసుకోవటం నిజంగా గ్రేట్. ► ‘ఆకాశం నీ హద్దురా’ని హిందీలో రీమేక్ చేస్తామని అడుగుతున్నారు. ఒకవేళ రీమేక్ చేస్తే ఇందులో నేను చేసిన చంద్రమహేశ్ పాత్ర చేయను. వేరే క్యారెక్టర్ చేస్తాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీలో సినిమాను విడుదల చేయటం ఉత్తమం. అంతకుమించి మరో దారి లేదు. థియేటర్, సౌండ్, ప్రేక్షకుల చప్పట్లు ఖచ్చితంగా మిస్సవుతున్నాను. నేనే కాదు.. అందరూ ఎప్పుడు సాధారణ పరిస్థితులు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. -
మురళీధరన్‌గా ధనుష్?
ప్రముఖ శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ అనుకోకుండా వివాదంలో ఇరుక్కుంది. మురళీధరన్‌గా తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తారని ప్రకటించారు. ‘800’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు యంఎస్ శ్రీపతి దర్శకుడు. ఫస్ట్ లుక్ కూడా విడుదలయింది. అయితే విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకోవాలని తమిళులు సోషల్ మీడియా ద్వారా నిరసన తెలియజేశారు. మురళీధరన్‌కి తమిళ మూలాలున్నప్పటికీ ఒక్కసారి కూడా తమిళ సమస్యలకు మద్దతుగా మాట్లాడలేదు, నిలబడలేదు అన్నదే ఆ నిరసనకు కారణం. పలువురు దర్శకులు కూడా సేతుపతిని తప్పుకోమని కోరారు. ‘నా వల్ల నువ్వు ఇబ్బందిపడొద్దు. ఈ సినిమా నుంచి తప్పుకో’ అని విజయ్ సేతుపతికి ఓపెన్ లెటర్ రాశారు మురళీధరన్. ఇప్పుడు ఆ పాత్ర ఎవరు చేస్తారనే చర్చ నడుస్తోంది. తాజాగా మురళీధరన్ పాత్రకు ధనుష్ పేరుని పరిశీలిస్తున్నారని కోలీవుడ్ టాక్. మరి ధనుష్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారా? వేచి చూడాలి. అసలు మురళీధరన్ బయోపిక్ తెరకెక్కుతుందా? అనే సందేహం కూడా పలువురిలో ఉంది. -
విజయ్ సేతుపతి కూతురికి అత్యాచార బెదిరింపు
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్న విషయం తెలిసిందే. తన బయోపిక్ విషయంలో వివాదాలు తలెత్తడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ విజయ్ సేతుపతికి మాజీ క్రికెటర్ మురళీధరన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముత్తయ్య ఓ పెద్ద లేఖ విడుదల చేశారు. విజయ్ సేతుపతి మంచి నటుడని, కేవలం తన సినిమా వల్ల ఈ కోలీవుడ్ నటుడికి ఏ ఇబ్బంది కలగకూడదని భావించి ఆయనను తప్పుకోవాలని కోరినట్లు మురళీధరన్ తెలిపారు. దీనిపై విజయ్ సేతుపతి కూడా స్పందించి ఈ సినిమా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ట్విటర్లో ‘ధన్యవాదాలు.. ఇక సెలవు’ అని ట్వీట్ చేశారు. చదవండి: తప్పుకున్న విజయ్ తుపతి ఇక ఈ ప్రాజెక్టు నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్న కొన్ని గంటలకే ఆయన చిన్న కూమార్తెపై సోషల్ మీడియాలో అత్యాచార బెదింపులకు పాల్పడుతున్నారు. విజయ్ సేతుపతి ట్వీట్‌కు సమాధానమిస్తూ.. తన కూమార్తెపై అఘాయిత్యానికి పాల్పడతామని, అలా చేస్తేనే ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో నటుడికి అర్థం అవుతుందని అని పేర్కొన్నారు. అయితే ఈ ట్రోల్‌పై అనేకమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో సదరు నెటిజన్ ప్రవర్తనను ఖండిస్తున్నారు. చదవండి: వివాదంలో 800: స్పందించిన మురళీధరన్ అంతేగాక ఇదే ట్రోల్స్‌పై సింగర్ చిన్మయి కూడా స్పందించారు. ట్రోల్ చేసిన అకౌంట్‌ను పోలీసులకు నివేదించారు. నెటిజన్ వ్యాఖ్యలపై మండిపడుతూ దానికి చెందిన స్క్రీన్ షాన్‌ను షేర్ చేశారు. ‘ఇలాంటి నీచమైన వ్యక్తులే సమాజంలో లైంగిక నేరాలకు మద్దతు పలుకుతారు, దీనిని ఎవరూ మార్చలేరు?. అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారం చేస్తానని చెప్తున్న వ్యక్తి నేరస్థుడు. ఇంత జరుగుతున్న చూస్తూ ఊరుకుంటున్నారంటే సిగ్గుచేటు’ అంటూ మండిపడ్డారు. అలాటే అడయార్ డిప్యూటీ కమిషనర్, చెన్నై పోలీసులను ట్యాగ్ చేశారు. కాగా ఇటీవల క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తెపై అత్యాచారం బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు! -
క్లియో-పాత్రగా.. వండర్ ఉమెన్
ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రగా మారబోతున్నారు హాలీవుడ్ అందాల తార గాల్ గాడోట్. క్వీన్ క్లియోపాత్ర జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా గాల్ గాడోట్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘దర్శకురాలు ప్యాటీ జెన్కిన్స్తో కలసి క్లియోపాత్ర జీవితాన్ని తెర మీద చూపించబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఆమె కథను స్త్రీ దృష్టి కోణంలో (చిత్రదర్శకురాల్ని ఉద్దేశించి) చూపించబోతున్నాం’ అని ట్వీట్ చేశారు గాల్. గతంలో ప్యాటీ జెన్కిన్స్ దర్శకత్వంలో ‘వండర్ ఉమెన్’ సిరీస్‌లో రెండు చిత్రాల్లో నటించారు గాల్. ‘వండర్ ఉమెన్’ సీక్వెల్ ‘వండర్ ఉమెన్ 1984’ క్రిస్మస్కి విడుదల కానుంది. గతంలో క్లియోపాత్ర పాత్రను ఎలిజిబెత్ టేలర్ చేశారు. 1963లో తెరకెక్కిన ఆ సినిమా 4 ఆస్కార్ అవార్డులు సాధించింది. -
తెరపైకి సౌందర్య జీవితం
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సౌందర్య. 1992 నుంచి 2004 వరకు బిజీ హీరోయిన్గా ఉన్న ఆమె తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 2004 ఏప్రిల్ 17న హెలీకాప్టర్ ప్రమాదంలో సౌందర్య మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె బయోపిక్ తెరకెక్కనుందని టాక్. మలయాళ సినిమా ఇండస్ట్రీలోని ఒక బడా నిర్మాణ సంస్థ సౌందర్య బయోపిక్‌ని సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సౌందర్య బయోపిక్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆమె పాత్రకు సాయిపల్లవిని సంప్రదించినట్లు టాక్. ఎందరో ప్రేక్షకులు ముఖ్యంగా మహిళల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సౌందర్య లాంటి మంచి నటి పాత్ర చేసే అవకాశం వస్తే సాయి పల్లవి చేయకుండా ఉంటారా? చేస్తారనే ఊహించవచ్చు. -
మోదీ బయోపిక్ మళ్లీ విడుదల
భారత ప్రధాని నరేంద్ర మోది జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీయం నరేంద్ర మోది’. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది మే 24న విడుదలయింది. అయితే మరోసారి ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. లాక్డౌన్ తర్వాత ఈ నెల 15 నుంచి థియేటర్స్ మళ్లీ ప్రారంభం కానున్నాయి అనే విషయం తెలిసిందే. దాంతో ‘పీయం నరేంద్ర మోది’ని 15న రీ–రిలీజ్ చేయనున్నారు. ‘‘కొందరి పొలిటికల్ అజెండాల వల్ల ఈ సినిమా విడుదలైనప్పుడు ఎక్కువమంది ప్రేక్షకులకు చేరలేదు. ఈ రీ–రిలీజ్లో అందరికీ ఈ సినిమా చేరువ అవుతుందనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత సందీప్ సింగ్. -
థియేటర్లలో ఫస్ట్ సినిమా అదే..
ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర నేపథ్యంలో వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘నరేంద్ర మోదీ’. ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందకు రానుంది. ఆక్టోబర్ 15న థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. కాగా కరోనా కారణంగా గత ఆరు నెలల నుంచి సినిమా థియేటర్లు అన్ని మూత పడిన విషయం తెలిసిందే. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15నే తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో థియేటర్ల పునఃప్రారంభం తరువాత థియేటర్లలో విడుదల అవతున్న మొదటి సినిమా ఇదే. ఈ విషయాన్ని సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్లో వెల్లడించారు. చదవండి: స్టార్ క్రికెటర్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి కాగా జాతీయ అవార్డు విజేత ఓముంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘నరేంద్ర మోదీ’ చిత్రం గత ఏడాది మే 24 న విడుదలైంది. విడుదలైన మొదటి రోజునే రూ .2.88 కోట్లు సంపాదించింది. మోదీ పాత్రంలో వివేక్ ఒబెరాయ్ తొమ్మిది విభిన్న లుక్‌లో కనిపించారు. ఇందులో మోదీ పేదరికంలో ఉన్న సమయంలో రైల్వే స్టేషన్లో టీ అమ్మడం నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నాయకుడిగా ఎదిగిన విధానాన్ని చూపించారరు. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, బర్ఖా బిష్ట్, రాజేంద్ర గుప్తా, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. చదవండి: కోవిడ్‌పై పోరుకు ప్రజాచైతన్య కార్యక్రమం -
స్టార్ క్రికెటర్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ బయోపిక్కు సంబంధించి అప్డేట్ను ఇచ్చింది. ముత్తయ్య మురళీధరన్ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటింస్తున్నాడని అఫిషియల్‌గా ప్రకటించింది. మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలోనే రానుంది. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించనున్నారు. టెస్ట్ క్రికెట్లో ఎనిమిది వందల వికెట్లు తీసిన ఘనత మురళీధరన్ సొంతం. వన్డేల్లో మురళీ 534 వికెట్లు తీశాడు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ బయోపిక్ చిత్రానికి ‘800’ అని పెరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి మురలీధరన్ బౌలింగ్ శైలీని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడట. మరలీధరన్ పాత్రతో విజయ్ పక్కాగా మెప్పిస్తాడని నిర్మాతలు భావిస్తున్నారు. మురళీధరన్ బయోపిక్ కోసం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. IT'S OFFICIAL... #VijaySethupathi to star in cricketer #MuthiahMuralidaran biopic... Directed by #MSSripathy... Produced by Movie Train Motion Pictures and Dar Motion Pictures. #MuralidaranBiopic pic.twitter.com/0KeCPzk6im — taran adarsh (@taran_adarsh) October 8, 2020 -
సెట్లోనే సంతోషంగా ఉంటా!
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. తలైవి అంటే నాయకురాలు అని అర్థం. టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకుడు. ఇందులో యంజీఆర్‌గా అరవింద స్వామి, కరుణానిధిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే చెన్నైలో ప్రారంభం అయింది. జయలలిత సీయంగా ఉన్న సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణలో పాల్గొంటున్న ఫొటోలను తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు కంగనా. ‘‘తలైవి’ చిత్రీకరణలో భాగంగా దర్శకుడు విజయ్‌గారితో ఓ సన్నివేశం గురించి సంభాషిస్తున్నాను. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉండొచ్చు, కానీ సినిమా సెట్లో ఉన్నంత సంతోషంగా నేనెక్కడా ఉండలేను’’ అన్నారు కంగనా. -
ఆమె అంతే!
సౌతిండియా గ్లామర్ క్వీన్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా గతంలో హిందీలో ‘డర్టీ పిక్చర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. విద్యా బాలన్ ముఖ్య పాత్రలో నటించారు. తాజాగా స్మిత జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. తమిళంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అవళ్ అప్పడిదాన్’ (ఆమె అంతే అని అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారు. కేయస్ మణికందన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని లక్ష్మణ్, హెచ్. మురళి నిర్మించనున్నారు. నవంబర్‌లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు సమాచారం. టైటిల్ రోల్లో ఎవరు నటిస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ‘సిల్క్ స్మిత గ్లామర్‌ను ఇప్పటి వరకూ ఎవ్వరూ మ్యాచ్ చేయలేకపోయారు. ఆమె పాత్రను పోషించే నటి కోసం చూస్తున్నాం’’ అన్నారు దర్శకుడు మణికందన్. -
తేడా సైకో
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘సైకో వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. నట్టి క్రాంతి హీరోగా, కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత నట్టికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి లక్ష్మి సమర్పణలో అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా నట్టి కుమార్ దర్శకత్వంలో ఇటీవల ప్రారంభమైన ‘డీఎస్‌జె (దెయ్యంతో సహజీవనం)’ సినిమా లొకేషన్లో నట్టి క్రాంతి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నట్టికుమార్ మాట్లాడుతూ– ‘‘సైకో వర్మ’ షూటింగ్ దాదాపు పూర్తయింది. సినిమా బాగా వచ్చింది. మా అబ్బాయి నట్టి క్రాంతి నేను అనుకున్న దానికంటే బాగా నటిస్తున్నాడు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఏ.ఖుద్దూస్, కెమెరా: జనార్ధననాయుడు, జనా, లైన్ ప్రొడ్యూసర్స్: కె.ప్రేమ సాగర్, ఎస్. రమణా రెడ్డి. -
సయీ.. ఆయా
బాలీవుడ్ భామలు టాలీవుడ్‌కి రావడం కొత్తే కాదు. ఇప్పుడు మరో బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఆమె ఎవరో కాదు.. పలు తెలుగు చిత్రాల్లో నటించిన నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె. తండ్రి బాటలో సయీ కూడా తెలుగుకి ఆయా (వచ్చింది) అన్నమాట. ‘మేజర్’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించనుందామె. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్–3’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సయీ అందర్నీ ఆకట్టుకున్నారు. అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో జరగనున్న ‘మేజర్’ షూటింగ్లో పాల్గొననున్నారామె. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో మృతి చెందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ అడివి నటిస్తున్నారు. ఇందులో శోభిత దూళిపాళ్ల హీరోయిన్. సయీ మంజ్రేకర్‌ది కీలక పాత్ర. జి.యం.బి ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేశ్‌బాబు, సోనీ పిక్చర్స్, ఏప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి Ô¶ శికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. -
బాలీవుడ్‌కి హాయ్
‘అర్జున్‌రెడ్డి’ విజయంతో క్రేజీ స్టార్ అయ్యారు హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడాయన బాలీవుడ్ ఎంట్రీ ఖరారయిందని సమాచారమ్. హిందీలో ‘కాయ్ పో చే’, ‘కేదార్నాథ్’ తదితర హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఓ సినిమాతో విజయ్ ఎంట్రీ ఇవ్వనున్నారట. ఈ సినిమాకు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, భూషణ్‌కుమార్ సహనిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం. గత ఏడాది భారత్–పాకిస్తాన్ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్‌కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ సైనికుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. మూడు రోజులు బంధీగా ఉంచి, పాక్ ప్రభుత్వం అభినందన్‌ని భారత ప్రభుత్వానికి అప్పగించింది. అభినందన్ జీవితం ఆధారంగా అభిషేక్ కపూర్ ఈ సినిమా రూపొందించనున్నారట. ఈ స్క్రిప్ట్‌ని విజయ్ దేవరకొండ విని, నటించడానికి అంగీకరించారని సమాచారం. అభినందన్ పాత్రనే విజయ్ చేయనున్నారట. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్‌కి విజయ్ దేవరకొండ సంతకం చేయలేదని బాలీవుడ్ టాక్. -
మోదీ మనోవిరాగి
ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘మోదీ’. తెలుగులో ఈ సినిమా ‘మనోవిరాగి’గా, తమిళంలో ‘కర్మయోగి’గా విడుదల కానుంది. ఎస్. సంజయ్ త్రిపాఠి రచించి, దర్శకత్వం వహించారు. మహావీర్ జైన్‌తో కలిసి దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత యం. సుభాస్కరన్ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. గురువారం మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమా పోస్టర్లను విడుదల చేశారు. మోదీ పాత్రలో అభయ్‌వర్మ నటించారు. మోదీ పెరిగిన గుజరాత్‌లోని వాద్నగర్, ఉత్తరాఖండ్‌లలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా యం. సుభాస్కరన్ మాట్లాడుతూ– ‘‘ప్రధాని మోదీగారి టీనేజ్ విశేషాలు, ఆయన జీవితంలోని ముఖ్యమైన మలుపుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సమర్పించటం సంతోషంగాను, మాకు దక్కిన గౌరవంగాను భావిస్తున్నాం’’ అన్నారు. -
నా కథ నేనే చెబుతా
హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేస్తారు అనే చర్చ కొన్ని రోజులుగా నడుస్తోంది. అయితే తన బయోపిక్‌ను మడోన్నాయే డైరెక్ట్ చేసుకోనున్నారట. ‘నా కథను నాకంటే ఎవరు బాగా చెప్పగలరు? ఈ సినిమా ఫోకస్ మొత్తం మ్యూజిక్ మీదే ఉంటుంది. సంగీతమే నన్ను నడిపించింది. నా జీవితంలో ఎన్నో సంఘటనలను ఈ సినిమాలో ప్రస్తావిస్తాను’ అని అన్నారు మడోన్నా. గతంలో ‘ఫిల్త్ అండ్ విస్డమ్, డబ్ల్యూ ఈ’ చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారామె. -
అసెంబ్లీలో...
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’ (నాయకి). ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. కరోనా వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. తాజాగా చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు. దీనికోసం అసెంబ్లీ సెట్‌ను నిర్మించారని సమాచారం. ఈ సెట్లో పలు కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. ఈ షెడ్యూల్లో కంగనా, ఇతర చిత్రబృందం పాల్గొంటారట. వచ్చే నెల 11 నుంచి షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో కరుణానిధిగా ప్రకాశ్ రాజ్, యంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. -
పీవీ సింధూ బయోపిక్‌లో దీపిక పదుకొనే!?
సాక్షి, హదరాబాద్: పీవీ సింధు, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్... వెండితెరపై సందడి చేయనున్నారు. అదేంటి.. వీరంతా సినిమాల్లో నటిస్తున్నారా..! అని అనుకోకండి. వీరి జీవిత కథలతో సినిమాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు అప్పుడే పట్టాలపై కూడా ఎక్కేశాయి. మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్ స్టార్స్ పి.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్‌లకు సంబంధించిన బయోపిక్‌లు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మిథాలీరాజ్ బయోపిక్కు ‘శభాష్ మిత్తూ’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా..సైనా నెహ్వాల్, పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లకు ఇంకా పేర్లు నిర్ణయించలేదు. పీవీ సింధూ బయోపిక్కు సంబంధించి ఇంకా పాత్రల ఎంపికలోనే ఉంది. గల్లీ గ్రౌండ్ నుంచి అంతర్జాతీయ గ్రౌండ్ వరకు తమ సత్తా చాటిన మన హైదరాబాదీ క్రీడాకారుల బయోపిక్‌లు వెండితెరలపై కనువిందు చేయనున్నాయి. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వారి బయోపిక్‌లకు సంబంధించిన వివరాలతో గల్లీ గ్రౌండ్ టూ బయోపిక్ ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులు మన హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం. క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ దొరై, బ్యాడ్మింటన్ స్టార్స్ పీ.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్‌ల బయోపిక్‌లు నిర్మించేందుకు బాలీవుడ్ ముందుకొచ్చింది. ఒకప్పుడు గల్లీ గ్రౌండ్లో మొదలైన వీరి ప్రస్థానం దశల వారీగా అంతర్జాతీయ గ్రౌండ్లపై తమ సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. మారోసారి వీరికి సంబంధించిన బయోపిక్‌లతో వెండితెరపై కూడా వీరి సత్తాను చూపించడానికి రెడీ అవుతున్నారు. సింధూగా దీపిక? సింధూ బయోపిక్‌లో నటించే వారి వివరాలను మాత్రం సోనూసూద్ అప్పుడే వెల్లడించట్లేదు. బయోపిక్ నిర్మిస్తున్నట్లు ప్రకటించినప్పుడు సోనుసూద్‌కు ఎంతోమంది హీరోయిన్లు కాల్స్ చేసి మరీ మేం చేస్తామంటే మేం చేస్తామంటూ పోటీ పడ్డ విషయాన్ని ఆయన వివరించారు. అయితే పీవి ముఖానికి, తన ఎత్తు, పర్సనాలిటికి సంబంధించి సెట్ అయ్యేది ఒకే ఒక్కరు బాలివుడ్ టాప్ స్టార్ దీపిక పదుకొనే. గతంలోనే ఆమెను సోనుసూద్ సంప్రదించగా అంగీకరించారు. అప్పుడు తన కాల్షీట్స్ లేని కారణంగా బయోపిక్ ఇంకా పట్టాలెక్కలేదు. అయితే.. ఇటీవల కాలంలో టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత.. సింధూగా చేస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిలో నిజం లేదని సోనుసూద్ “సాక్షి’కి తెలిపారు. అన్నీ కలిసొస్తే దీపిక నటించే అవకాశం ఉన్నట్లు హింట్ ఇచ్చారు సోనుసూద్.! మిథాలీ, సింధు, సైనాలపై బాలీవుడ్, పుల్లెలపై టాలీవుడ్ ఇటీవల కాలంలో మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్‌ల ఆటకు యావత్ భారతం ఫిదా అయ్యింది. సింధూని ప్రపంచస్థాయి పోటీల్లో నిలబెట్టిన ఘనతను కోచ్ పుల్లెల గోపిచంద్ సొంతం చేసుకున్నారు. వీరి జీవిత చరిత్రలను బయోపిక్‌గా తీసేందుకు బాలివుడ్, టాలివుడ్ ముందుకొచ్చింది. సింధూపై బయోపిక్‌ని నిర్మించేందుకు ప్రముఖ నటుడు సోనుసూద్, మిథాలీరాజ్‌పై ‘వయోకామ్–18’, సైనా నెహ్వాల్‌పై సినిమా నిర్మించేందుకు ‘టీ సిరీస్’ సంస్థలు ముందుకు రాగా..కోచ్ పుల్లెల గోపిచంద్పై నిర్మించేందుకు టాలివుడ్‌కు చెందిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ముందుకొచ్చారు. లాక్డౌన్ ఎఫెక్ట్ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల కొంత షూటింగ్ జరిగి నిలిచిపోయాయి. లాక్డౌన్ లేకపోతే ఈ ఏడాది దసరా, క్రిస్మస్ టైంకి ఈ మూడు బయోపిక్‌లు విడుదలయ్యేవి. ఇప్పుడు సినిమా షూటింగ్‌లకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లో ఈ మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. వచ్చే ఏడాది దసరా నాటికి ఈ మూడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పీ.వి.సింధూ బయోపిక్ మాత్రం వచ్చే ఏడాది ఇచివర్లో కానీ..2022 సమ్మర్లో కానీ విడుదలయ్యే అవాకాశం ఉందని సోనుసూద్ ‘సాక్షి’తో చెప్పారు. శ్రద్థా టు పరిణీతి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించేందుకు 2018లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కసరత్తులు చేసింది. తన అధికారికి ట్విట్టర్ ఖాతాలో కూడా సైనా బయోపిక్‌లో నటిస్తున్నట్లు వెల్లడించింది. సరిగ్గా ఏడాది తిరిగేలోపు ఆమె స్థానంలో పరిణీతిచోప్రా చేరి శ్రద్ధ పక్కకు తప్పుకుంది. శ్రద్ధ కపూర్ కంటే పరిణీతి చోప్రానే సైనాలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం. ప్రొఫెషన్ టూ పర్సనల్ లైఫ్ మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్‌లు చిన్నతనం నుంచి వారికి ఆయా ఆటలపై మక్కుల ఎలా వచ్చింది. ఆ సమయాల్లో వీరికి ఎవరెవరు ఏ విధమైన సాయం చేశారు, ఎవరెవరు విమర్శించారు, సంతోషాలు, విచారాలు ఇలా అన్ని అంశాలను పొందుపరుస్తూ ఈ బయోపిక్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. నగరంలోని గల్లీల్లో ఆడుకునే వీరు ప్రపంచస్థాయికి ఎదిగిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు దర్శకులు సిద్ధమవుతున్నారు. పుల్లెల గోపీచంద్ చిన్న పాటి గ్రౌండ్ నుంచి అర్జున అవార్డు స్థాయి వరకు ఎలా వచ్చాడు, సింధూను ప్రపంచ పోటీలకు ఎలా తీసికెళ్లగలిగాడు అనే ప్రతి ఒక్క అంశాన్ని బయోపిక్‌లో చూపించనున్నారు. వారి ప్రొఫెషనల్ ఆటనే కాదు పర్సనల్ లైఫ్‌ని ఎంతవరకు పక్కన పెట్టారు, చిన్నపాటి సరదాలను కూడా వదులుకున్న సందర్భాలను కూడా ప్రేక్షకులకు ఈ బయోపిక్‌ల ద్వారా తెలపనున్నారు. తాప్సీ, పరిణీతిచోప్రా, సుధీర్బాబులే యాప్ట్ ఇటీవల విడుదలైన మిథాలీ బయోపిక్ ‘శభాష్ మిత్తూ’లో హీరోయిన్ తాప్సీ పొన్ను అచ్చుగుద్దినట్లు మిథాలీరాజ్లాగానే ఉంది. సైనా నెహ్వాల్‌తో కలసి నెట్ ప్రాక్టీస్ చేసిన బాలీవుడ్ నటి పరిణీతిచోప్రా సేమ్ సైనాను దించేసింది. ఇక పుల్లెల గోపీచంద్ పాత్రలో మన టాలివుడ్ హీరో సుధీర్‌బాబు కనువిందు చేయనున్నారు. ఈ ముగ్గురి క్రీడాకారుల ముఖాలకు ఇంచుమించు మ్యాచ్ అవుతున్న తాప్సీ, పరిణీతి, సుధీర్‌బాబులను సెలెక్ట్ చేసుకోవడంలో దర్శకులు సక్సెస్ అయ్యారు. వీరికి సంబంధించిన అప్డేట్స్ ఇటీవల కాలంలో ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో రావడంతో నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. చక్కగా యాప్ట్ అయ్యే క్యారెక్టర్లను ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో పొగడ్తల వెల్లువెత్తుతున్నాయి. ఆమె చెప్పిన వన్వర్డ్ ఆన్సర్‌తో ఫిదా అయ్యా మహిళల ప్రపంచ కప్‌కు ముందు జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మీ ఫేవరెట్ మేల్ క్రికెటర్ ఎవరంటూ ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మిథాలీరాజ్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి యావత్ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది. ఇదే క్వశ్చన్‌ను మీరు మేల్ క్రికెటర్‌ను ఎందుకడగరంటూ ప్రశ్నించింది. ఆ సన్నివేశం ఇంకా నా కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఆమె డేర్, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ నాకెంతో నచ్చాయి. మిథాలీలా నటించమని నన్ను అడగ్గానే యస్ చెప్పేశా. ఆ ఒక్క ఆన్సర్‌తో ఫిదా అయ్యాను. శభాష్ మిత్తూలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – తాప్సీ పొన్ను, బాలీవుడ్ నటి తనలా చేయడం గొప్ప అనుభూతి గ్రౌండ్లో సైనా నెహ్వాల్ ఆడుతున్న ఆటకు బాగా కనెక్ట్ అవుతాను. నేను అసలు ఎప్పుడూ ఉహించలేదు సైనాపై బయోపిక్ వస్తుందని..అందులో నేనే నటిస్తానని. తనతో కలసి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ, నేర్చుకుంటూ నటించడం చాలా అనుభూతిగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా అందర్నీ మెప్పిస్తాననే ధీమా ఉంది. – పరిణీతి చోప్రా, బాలీవుడ్ నటి గోపి.. నా ఇన్స్పిరేషన్ గోపి (గోపీచంద్) నా ఇన్స్పిరేషన్.. ఒక వ్యక్తిగా నేను పరిణితి చెందడంలో గోపి పాత్ర చాలా ఉంది. అతనితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారీ గర్వంగా అనిపిస్తుంది. ఆరోజుల్లో ఇద్దరం కలసి ఆడటం, ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాం. అతని బయోపిక్ ద్వారా రాబోయే తరం గోపిని ఆదర్శంగా తీసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటే వచ్చే ఏడాది చివర్లో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. – సుధీర్‌బాబు, సినీ హీరో కలసి ఆడాం.. అతనే చెయ్యడం హ్యాపీ ఒకప్పుడు నేనూ, హీరో సుధీర్‌బాబు కలసి విజయవాడలో బ్యాడ్మింటన్ ఆడాం. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు అతనే నా బయోపిక్‌లో నటించడం ఆనందంగా ఉంది. ప్రారంభ దినాల్లో మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఈ స్థాయికి ఎలా వచ్చేమనే విషయాలు ఈనాటి యువతకు బయోపిక్‌ల ద్వారా తెలపడం ఆనందంగా ఉంది. – పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ కోచ్. చాలా హ్యాపీగా ఉన్నా నా మీద బయోపిక్ రావడం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పైగా పరిణీతి చోప్రా నాలా నటిస్తుంది. నానుంచి ఆమెకు కావల్సిన టిప్స్ అన్నీ ఇచ్చాను. షూటింగ్ అంతా పూర్తయ్యి రిలీజ్ అయితే ప్రేక్షకులతో కలసి చూడాలనిపిస్తుంది. – సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కష్టానికి గుర్తింపు బయోపిక్ చిన్నప్పటి నుంచి ప్రపంచస్థాయి వరకు నేను పడిన కష్టం, శ్రమకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, ప్రజల మన్నలను అందుకున్నాను. కానీ నేను పడిన కష్టం, ఆరోజుల్లో ఏ విధమైన వసతులు లేకుండా పట్టుబట్టి మరీ ఆటపై పట్టు సాధించడాన్ని ఇప్పుడు బయోపిక్ ద్వారా యావత్ ప్రపంచానికి చూపించే ప్రయత్నం జరగడం ఆనందంగా ఉంది. విదేశీ గడ్డపై నా గెలుపు అనంతరం మువ్వెన్నెల జెండా రెపరెపలాడిన సమయంలో ఎంత సంతోషంగా ఉందో..ఇప్పుడు బయోపిక్ ద్వారా నా జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది. – పీ.వి.సింధూ, బ్యాడ్మింటన్ ప్లేయర్ బయోపిక్ రావడం ఆదర్శమనిపిస్తుంది ఒకప్పుడు క్రికెట్ అంటే అమ్మాయిలకెందుకు అనేవాళ్లు. మేం ప్రపంచకప్ పోటీల్లో ఆడిన ఆటకు తతి ఒక్కరూ ఫిదా అయ్యారు, మమ్మల్ని మెచ్చుకున్నారు. అంతేకాకుండా తమ అమ్మాయిలను క్రికెట్ కెరీర్‌గా మలుచుకోమని పంపండం సంతోషంగా ఉంది. నా గురించి బయోపిక్ రావడం నిజంగా నేటితరం వారికి ఆదర్శమనిపిస్తుంది. – మిథాలీరాజ్ దొరై, ఇండియన్ క్రికెటర్ -
నగ్నసత్యంగా నా జీవితాన్ని చూపిస్తా: వర్మ
ఎప్పుడూ ఎవరో ఒకరి బయోపిక్‌లు, రియల్ స్టోరీలు తీస్తూ అందరికీ ముచ్చెమటలు పట్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ జీవితం సినిమాగా రాబోతోంది. ఈ చిత్రానికి దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి ఆర్జీవీ గురించి చెప్పడానికే మాటలు సరిపోవు, అలాంటిది రెండు, మూడు గంటల్లో ఆయన నిజ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం కష్టం కాబట్టి బయోపిక్‌ను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఒక్కో భాగం రెండు గంటలుంటుంది. ముందు రెండు భాగాల్లో వేరే నటులు నటించబోతుండగా చివరి భాగంలో ఆర్జీవీయే స్వయంగా నటించనున్నారు. (చదవండి: తెరకెక్కనున్న రామ్ గోపాల్ వర్మ బయోపిక్) తాజాగా ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. "నగ్నసత్యంగా నా జీవితాన్ని చూపించనున్నాను. నా లైఫ్‌లో జరిగిన సంఘటనల గురించి చిత్రయూనిట్‌కు తెలిపాను. కానీ వాళ్లు అప్పటికే నా గురించి పరిశోధన చేసి చాలావరకు తెలుసుకున్నారు. 2008 డిసెంబర్లో ముంబై పేలుళ్ల తర్వాత నేను, నటుడు రితేష్ దేశ్‌ముఖ్ తాజ్ హోటల్‌కు వెళ్లాం. అప్పుడేం జరిగిందనే వివరాలు కూడా సినిమాలో చూపిస్తాం. నిజానికి ఆ సమయంలో అక్కడికి వెళ్లడమే తప్పు కాబట్టి ఈ విషయాన్ని నేనెప్పుడూ వెల్లడించలేదు. మొదటి రెండు భాగాల కన్నా మూడో భాగంలో నా చుట్టూ అలుముకున్న వివాదాలు, శృంగార సన్నివేశాలు ఉంటాయి. నేను రంగుల జీవితాన్ని అనుభవించాను. కాబట్టి అమ్మాయిలతో పెట్టుకున్న సంబంధాలను కూడా చూపిస్తాను. సినిమాలో అదే ఎక్కువగా రక్తికడుతుందని నేను భావిస్తున్నాను" అని తెలిపారు. (చదవండి: ప్రభాస్ వర్క్ ఫ్రమ్ హోమ్!) -
గాంధీ బయోపిక్: అతిధి పాత్రలో కోదాడ వాసి
సాక్షి, కోదాడ: ‘న్యూయార్క్’ చిత్ర దర్శకుడు రామ్ అల్లాడి గాంధీజీ జీవిత ఇతివృత్తం మీద ‘మెటనోయా’ అనే చిత్రం తీర్చిదిద్ది విడుదలకు సిద్ధం చేశారు. గాంధీ జీవితంలో యదార్థ సంఘటనల ఆధారంగా.. కొన్ని కాల్పనిక అంశాలతో ఈ చిత్రం తీశారు. ఈ చిత్రం పూర్తి స్థాయిలో అమెరికాలో, హాలీవుడ్ పరిజ్ఞానంతో నిర్మించారు. గాంధీజీ బాల్యం నుంచి, 1948లో న్యూఢిల్లీలో ఆయన హఠాన్మరణం వరకు ముఖ్య ఘట్టాలను, చరిత్రకు చెందిన కాలపట్టికకు అనుగుణంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇతి వృత్తం.. మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ న్యాయవాది, వలసరాజ్య వ్యతిరేకి, జాతీయ వాది, రాజకీయ వేత్తగా తమ అహింసా శక్తితో, పౌర హక్కుల ఉద్యమంతో, భారత్‌ను బ్రిటీష్ బానిసత్యం నుంచి విముక్తి చేయడమే కాకుండా ప్రపంచానికి శాంతియుత మార్గదర్శకుడైన వైనాన్ని చిత్రీకరించారు. కాల్పనిక అంశాల సమ్మేళనంతో క్యాంట్ మెకానిజం, ఇన్సి్టయిన్ రోసన్బెర్గ్ బ్రిడ్జి, అంతరిక్షాంశాల వంటి శాస్త్రీయ విషయాలను మేళవిస్తూ గాంధీజీ జీవితాంశాలు వివరిస్తూ వారి సిద్ధాంతాలతో కూడిన సుసంపన్న జీవిత గాథను హృద్యంగా ఆవిష్కరించే విధంగా ఈ డాక్యుమెంటరీకి రూపకల్పన చేశారు. అద్భుతమైన అంతర్జాతీయ చిత్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తమ లక్ష్యం సాధించగలిగానని రామ్ అల్లాడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాంధీజీ బాల్యం, గాంధీజీపై ఉన్న మక్కువ మెటనోయాలో ఆవిష్కృతమైంది. గాంధీజీ తత్వం, కేంద్ర బిందువుగా ఎక్కువ భాగం గాంధీజీ సొంత మాటల్లోనే చిత్ర సంభాషణలు ఉంటాయని, గాంధీ ఆత్మక«థ సత్యశోధనలోని మేజిక్ స్పెల్ ఆఫ్ బుక్ అనే అధ్యాయం ఆధారంగా కొన్ని కల్పానిక అంశాలతో రూపొందించినట్లు దర్శకుడు అల్లాడి పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యూ ట్యూబ్‌లో ఇప్పటికే రిలీజ్ అయింది. అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా చూసే అవకాశం కల్పించారు. చిత్రంలో కోదాడ వాసులు... ఈ చిత్రంలో గాంధీజీ చిన్ననాటి మిత్రుడిగా కోదాడకు చెందిన అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన కొండపల్లి రాధాకృష్ణ కుమారుడు కొండపల్లి అనీష్ నటించాడు. అదేవిధంగా గాంధీజీ, ఫాదర్ ఆఫ్ లేడీతో కలిసి రైలులో ప్రయాణించిన వ్యక్తిగా అతిథి పాత్రలో కోదాడ కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన కొండపల్లి సీతారామచందర్‌రావు నటించారు. కాగా గాంధీ వివిధ వయస్సు పాత్రలను అమెరికాలో స్థిరపడిన మన తెలుగువారు శ్రీనివాసరావు సనా పతి, రాజేష్రాజ్గోపాల్, తేజ్ కొండేటి, దీపక్ భీమ్రాశెట్టి నటించారు. కాగా కస్తూర్బా గాంధీగా అమెరికాకు చెందిన లారెంజో పల్లాడినో, మమాడివ్ శిశి, సరితా నవాలీ, కామ్యరాయసం నటించారు. కాగా... అమెరికాలో స్థిరపడిన కోదాడ వాసి అయిన భరద్వాజ్ వి .కొమరగిరి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. అక్టోబర్ 2న విడుదలకు సిద్ధం.. గాంధీజీ జయంతి అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన చిత్ర సంస్థ అమెరికాతో పాటు అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకులు రామ్ అల్లాడి తెలిపారు. ఈ చిత్రానికి రామ్ దర్శకత్వం వహించడమే కాకుండా పూర్ణిమా దిగ్వీతో పాటు మరికొందరు అమెరికన్స్ సహకారంతో నిర్మించారు. కాగా దర్శకుడు వరంగల్ వాసి.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన గతంలో వరంగల్‌లోని పలు దేవాలయాలు, ఓరుగల్లు కోట తదితర చారిత్రాత్మక ఇతి వృత్తాలపై డాక్యుమెంటరీలు తీసి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను అందుకున్నారు. -
తెరపైకి ఆర్జీవీ జీవితం
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిజ జీవితం తెరపైకి రానుంది. అది కూడా ఒక్క సినిమా కాదు.. మూడు సినిమాలు కావడం విశేషం. రామ్‌గోపాల్ వర్మ ఆధ్వర్యంలో దొరసాయి తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మించనున్నారు. ఇందులో మొదటి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా బొమ్మాకు మురళి మాట్లాడుతూ– ‘‘రామ్‌గోపాల్ వర్మ నిజ జీవితాన్ని 3 భాగాలుగా నిర్మించనున్నాం. ఒక్కొక్క భాగం 2 గంటలుంటుంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తాం. మొదటి భాగంలో 20 ఏళ్ల ఆర్జీవీ పాత్రలో ఒక కొత్త నటుడు నటించబోతున్నారు. రెండో భాగంలో వేరే నటుడు నటిస్తారు. ఇక మూడో భాగంలో ఆర్జీవీ పాత్రలో స్వయంగా ఆర్జీవీయే నటించబోతుండటం విశేషం’’ అన్నారు. -
అంతరిక్షానికి ప్రయాణం
అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం కాబోతున్నారు ఫర్హాన్ అక్తర్. వ్యోమగామిగా మారి అంతరిక్షాన్ని చుట్టేయాలనుకుంటున్నారు. అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. కెమెరామేన్ మహేష్ మతై ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. త్వరలోనే రష్యాలో ఈ సినిమా షూటింగ్ ని ఆరంభించనున్నారని సమాచారం. ఈ బయోపిక్ లో రాకేష్ శర్మ పాత్రను ఎవరు పోషిస్తారు? అనే వార్తల్లో ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, సుశాంత్ సింగ్, విక్కీ కౌశల్ పేర్లు గతంలో తెర మీదకు వచ్చాయి. చివరికి ఫర్హాన్ అక్తర్ ఈ పాత్రలో నటించనున్నారు. -
కరణం మల్లీశ్వరిగా?
ఒలింపిక్స్‌లో మనకు పతకాన్ని తీసుకొచ్చిన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘రాజుగాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన సంజనా రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. ఇందులో మల్లీశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ప్రకటించలేదు. తాప్సీ కనిపిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరమీదకొచ్చింది. మల్లీశ్వరి, రకుల్ ప్రీత్‌ల బాడీలాంగ్వేజ్ చాలా భిన్నంగా ఉంటుంది. మరి రకుల్‌ని ఫైనలైజ్ చేస్తే ప్రోస్థెటిక్ మేకప్‌తో లుక్స్‌ని మ్యాచ్ చేస్తారేమో చూడాలి. -
గురుదత్ బయోపిక్
‘ప్యాసా, కాగజ్ కే ఫూల్, షాహిబ్ బీవీ అవుర్ గులామ్’ వంటి ఎన్నో అపురూపమైన హిందీ సినిమాలను అందించిన దిగ్గజ దర్శకుడు గురు దత్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఆయన తెరకెక్కించిన క్లాసిక్ చిత్రం ‘ప్యాసా’ టైటిలే ఈ బయోపిక్ కి కూడా పెట్టనున్నారు. తొలి చిత్రం ‘ధర్మ్’తో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకురాలు భావనా తల్వార్ ఈ బయోపిక్ ను డైరెక్ట్ చేయనున్నారు. షీతల్ తల్వార్ తో కలసి భావన ఈ సినిమాను నిర్మించనున్నారు కూడా. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
అందుకే ఐరన్ లేడీ చేస్తున్నా!
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా మూడు నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో నిత్యా మీనన్ నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ఒకటి. జయలలిత జీవితంతో మూడు నాలుగు సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో మీరు నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ప్రత్యేకత ఏంటి? ఒకే వ్యక్తి గురించి ఇన్ని సినిమాలు వస్తున్నా మీరు నటించడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నలు నిత్యా మీనన్ ముందుంచితే – ‘‘నిజమే... జయలలితగారి జీవితంపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయని నాకు లె లుసు. అందుకే మనం ఎందుకు చేయాలి? అనే అనుమానం నాకూ వచ్చింది. నా సందేహాన్ని ‘ఐరన్ లేడీ’ దర్శకురాలు ప్రియదర్శిని ముందుంచాను. దానికి ఆమె చెప్పిన సమాధానం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ‘జయలలితగారిపై ఎవరెన్ని సినిమాలు తీసినా తీయనివ్వండి. కానీ, మనం తీసే సినిమా ఎంత గొప్పగా ఉంటుందనేదే పాయింట్. నేను జయలలితగారిని వ్యక్తిగతంగా చాలాసార్లు కలిశాను. ఆమెను దగ్గరినుంచి గమనించాను, చాలా విషయాలు మాట్లాడాను’ అన్నారు ప్రియదర్శిని. ఆమె మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది. మనం మంచి సినిమా చేస్తున్నాం అనే నమ్మకం కలిగింది. అందుకే ధైర్యంగా ‘ఐరన్ లేడీ’లో నటిస్తున్నాను’’ అన్నారు. -
బయో పీక్
రెండేళ్లుగా వెండితెరపై బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఈ ఏడాది కూడా కొన్ని బయోపిక్‌లు థియేటర్స్‌కు రావాల్సింది కానీ కరోనా కారణంగా ఆగాయి. షూటింగ్‌లకు ఆయా ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో సెట్స్‌పైకి వెళ్లేందుకు కొన్ని బయోపిక్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మరికొన్ని బయోపిక్‌లు ముస్తాబు అవుతున్నాయి. ఇటు దక్షిణాది అటు ఉత్తరాదిన ఈ ఏడాది బయోపిక్‌ల హవా పీక్‌లో ఉంది. 20 సినిమాల వరకూ ఉండటం విశేషం. ఇక ప్రముఖుల జీవితాల ఆధారంగా రానున్న ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. విశ్వదర్శనం ‘స్వాతిముత్యం, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వయంకృషి , శృతిలయలు’.... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖ దర్శకులు, కళా తపస్వి కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ఘనవిజయాల జాబితాకు ఫుల్స్టాప్ పెట్టడం కాస్త కష్టమే. ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించారు. ఆయన గురించి ఎవరికీ తెలియని తెరవెనక దాగి ఉన్న సంగతులు, ఆయన గుండెల్లో నిలిచిపోయిన జ్ఞాపకాలు ‘విశ్వదర్శనం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విశ్వనాథ్ జీవితం ఆధారంగా ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ ‘విశ్వదర్శనం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాళన్న సాహిత్యానికి కాళోజీ నారాయణరావు చేసిన కృషి అక్షరాలతో కుదించి రాయలేనిది. తెలుగులోనే కాదు ఉర్దూ, హిందీ, కన్నడ, ఇంగ్లిష్.. ఇలా పలు భాషల్లో రచనలు చేసిన ఘనత కాళోజీది. కాళన్నగా సుపరిచితులైన కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సామాజిక కార్యక్రమల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్న కాళోజీ స్వాతంత్య్ర పోరాటంలోనూ పాలుపంచుకున్నారు. ఇన్ని గొప్ప విశేషాలు దాగి ఉన్న కాళోజీ జీవిత చరిత్ర వెండితెరకు రానుంది. ‘కాళన్న’ టైటిల్‌తో డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహిస్తున్నారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేపర్‌బాయ్ నుంచి ప్రెసిడెంట్ స్థాయి వరకూ ఎదిగిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన మన దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచారు. డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్), ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సంస్థల్లో ఆయన పోషించిన పాత్ర విశ్వానికి మనల్ని దగ్గర చేసింది. కలాంను ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారంటే ఆయన గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా స్ఫూర్తిదాయకంగా సాగిన కలాం జీవితం ఆధారంగా ‘కలాం: ది మిస్సైల్ మ్యాన్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. దర్శక ద్వయం జగదీష్ తానేటి, జానీ మార్టిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కలాం పాత్రలో అలీ నటిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ దర్శక–నిర్మాత వివేక్ అగ్నిహోత్రి కూడా కలాం బయోపిక్‌ను ప్రకటించారు. చాంపియన్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (2001)ను సాధించి, చరిత్ర సృష్టించారు పుల్లెల గోపీచంద్. ఈ ఘనత సాధించిన రెండో భారతీయ వ్యక్తి (తొలి వ్యక్తి ప్రకాష్ పదుకొనే) ఆయనే కావడం విశేషం. గోపీచంద్ జీవితం కూడా తెరకు రానుంది. ఆయన బయోపిక్‌లో సుధీర్‌బాబు నటిస్తారు. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. సినిమాల్లోకి రాకముందు సుధీర్‌బాబు బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడం విశేషం. శభాష్ మిథూ ఇల్లు వదిలి గ్రౌండ్లోకి అడుగుపెట్టి తమలో దాగి ఉన్న క్రీడా సత్తాను నిరూపించుకునేందుకు కొందరు అమ్మాయిలు ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. ఆ కష్టాలను ఆత్మవిశ్వాసంతో గ్రౌండ్ అవతలికి కొట్టారు క్రికెటర్ మిథాలీ రాజ్. భారతీయ మహిళా క్రికెట్లో తన పేరు ఎప్పటికీ నిలిచిపోయేలా కొన్ని రికార్డులను సాధించారు. భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథూ’గా తెరపైకి రానుంది. మిథాలీ రాజ్‌గా తాప్సీ నటిస్తారు. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారు. సైనా బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్‌వన్ స్థాయికి చేరుకున్న ఘనత సైనా నెహ్వాల్‌ది. అంతేకాదు.. ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన సైనా ఓ ఒలింపిక్ మెడల్‌ను కూడా సాధించారు. సైనా జీవితం ‘సైనా’ పేరుతో ఆవిష్కృతం కానుంది. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. పరిణీతీ చోప్రా టైటిల్ రోల్ చేస్తున్నారు. తలైవి తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె బయోపిక్ తలైవి (హిందీలో ‘జయ’)గా తెరకెక్కుతోంది. జయలలితగా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకుడు. జయలలిత జీవితంపై రూపొందనున్న మరో చిత్రం ‘ది ఐరన్ లేడీ’లో జయలలితగా కనిపించనున్నారు నిత్యామీనన్. దర్శకురాలు ప్రియదర్శిని డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే జయలలిత జీవితంపై రూపొందిన వెబ్‌సిరీస్ ‘క్వీన్’లో జయలలితగా నటించారు రమ్యకృష్ణ. తొలి పార్ట్ విడుదలైంది. రెండో భాగానికి రంగం సిద్ధమౌతోంది. మల్లేశ్వరి తొలి ఒలింపిక్ మెడల్ (వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో) సాధించిన కరణం మల్లేశ్వరి బయోపిక్ తెరకెక్కనుంది. ఒలిపింక్స్‌లో మెడల్ సాధించక ముందు రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు మల్లేశ్వరి. కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను దర్శకురాలు సంజన తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకట్ ఓ నిర్మాత కావడం విశేషం. ప్యాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుంది. మరికొన్ని... ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా బయోపిక్‌ను నిర్మించనున్నారు రోనీ స్క్రూవాలా. నటుడు, నిర్మాత సోనూ సూద్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ‘కలియుగ భీమ, ఇండియన్ హెర్క్యూలెస్’ కోడి రామ్మూర్తి బయోపిక్‌లో రానా నటించబోతున్నారు. ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్’గా చెప్పుకునే పీటీ ఉష బయోపిక్ గురించి గతంలో ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 26/11 ముంబై దాడుల్లో పోరాడి మరణించిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ‘మేజర్’గా తెరపైకి వస్తోంది. సందీప్ పాత్రను అడివి శేష్ చేస్తున్నారు. పుట్టుకతోనే అంధుడైనా ఉన్నత చదువులు చదివి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు మచిలీపట్నంకు చెందిన బొళ్ల శ్రీకాంత్. ఆయన బయోపిక్‌ను బాలీవుడ్ దర్శక–నిర్మాత తుషార్ హీరానందన్ రూపొందించనున్నారు. ‘ఎల్టీటీఈ’ ప్రభాకరన్ బయోపిక్ ‘సీరుమ్ పులి’గా రూపొందనుంది. జి. వెంకటేష్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా టైటిల్ రోల్ చేస్తున్నారు. భారతీయ మొదటి ఫీల్డ్ మార్షల్ శ్యాం మానెక్ షా బయోపిక్‌లో నటిస్తున్నారు విక్కీ కౌశల్. ‘రాజీ’ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకురాలు. పరమ్‌వీర చక్ర విక్రమ్ బాత్ర జీవితం ఆధారంగా విష్ణువర్ధన్ తెరకెక్కిస్తోన్న ‘షేర్షా’లో నటిస్తున్నారు సిద్దార్ధ్ మల్హోత్రా. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి విజయ్ కార్నిక్‌గా నటించారు అజయ్ దేవగన్. త్వరలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ బయోపిక్‌ను తెరకెక్కించునున్నట్లు నిఖిల్ ఆనంద్ తెలిపారు. అలాగే సుశాంత్ జీవితం ఆధారంగా ఒక సినిమాను సంజోయ్ మిశ్రా, మరో సినిమాను నిర్మాత విజయ్‌శేఖర్ గుప్తా రూపొందించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు పలువురు ప్రముఖుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో క్రికెటర్ కపిల్ దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్ (’83), ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్‌గా అజయ్ దేవగన్ (‘మైదాన్’), కింగ్ పృథ్వీరాజ్ చౌహాన్‌గా అక్షయ్ కుమార్ (‘పృథ్వీరాజ్’), పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్దామ్సింగ్గా విక్కీ కౌశల్ (‘సర్దార్ ఉద్దామ్సింగ్’) నటిస్తున్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో గాయపడిన సైనికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన భారత ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’. గుంజన్ పాత్రను జాన్వీ కపూర్ చేశారు. ఈ చిత్రం త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని బయోపిక్స్ కూడా తెరపైకి వచ్చేందుకు ముస్తాబు అవుతున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
జయలలిత బయోపిక్: థియేటర్? ఓటీటీ?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్టార్ హీరోయిన్ జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం "తలైవి". ఏఎల్ విజయ్ దర్శత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఇదిలా వుండగా లాక్డౌన్ కారణంగా థియేటర్లకు ఇంకా అనుమతులు రానందున పలు సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఈ క్రమంలో తలైవి చిత్రం కూడా ఓటీటీలో విడుదల కానుందని, ఇందుకు నిర్మాతలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో భారీ డీలింగ్ కుదుర్చుకున్నారని వార్తలు వెలువడ్డాయి. త్వరలోనే ఈ సినిమాను అరచేతిలో చూసేయవచ్చని అందరూ భావించారు అయితే ఈ చిత్రాన్ని ముందుగా ఓటీటీలో విడుదల చేసే సమస్యే లేదని చిత్ర యూనిట్ కుండలు బద్ధలు కొట్టినట్లు చెప్పింది. (నా ఇల్లు నాకో స్వర్గంలా అనిపిస్తోంది) ఓటీటీలో తలైవి ప్రీమియర్ రానుందన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. ముందుగా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని తెలిపింది. ఆ తరువాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుందని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. కాగా తొలుత జూన్ 26న సినిమా విడుదల చేయానుకున్నప్పటికీ కరోనా వైపరీత్యం వల్ల సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. దీంతో విడుదల తేదీని వాయిదా వేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ మూడు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ కలిసి నిర్మించారు. సుమారు 12 ఏళ్ల తర్వాత తలైవి ద్వారా కంగనా నేరుగా తమిళ సినిమాలో నటిస్తోంది. ఇదిలా వుంటే ఇప్పటికే జయలలిత బయోపిక్‌పై 'క్వీన్' చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించింది. (తలైవికి నష్టం!) -
జర్నలిస్ట్ షారుక్!
హీరో మాధవన్‌ను ప్రశ్నించారు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్.. ఏం ప్రశ్నించారు? వాటికి మాధవన్ సమాధానాలు ఏమిటి? అనేవి వెండితెరపైనే తెలుసుకోవాలి. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో నటించి, దర్శకత్వం వహించారు మాధవన్ . జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నారు షారుక్ ఖాన్ . నంబి నారాయణన్ని ఓ జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగే సన్నివేశంతో ‘రాకెట్రీ’ సినిమా మొదలై, ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కి వెళుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. షారుక్ నటించిన గత చిత్రం ‘జీరో’లో మాధవన్ సైంటిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే. -
మల్లేశ్వరి బయోపిక్ షురూ
ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లేశ్వరి బయోపిక్ తెరకెక్కనుంది. 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించారు మల్లేశ్వరి. ఆమె జీవితం ఆధారంగా సంజనా రెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై ఎం.వి.వి సత్యనారాయణ, కోన వెంకట్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కరణం మల్లేశ్వరి జన్మ దినం (జూన్ 1) సందర్భంగా సోమవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ బయోపిక్కు కోన వెంకట్ ఒక నిర్మాతగా ఉండటంతో పాటు రచయిత కూడా. ‘‘ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మైదానం తొలగిస్తున్నారు
అజయ్ దేవగన్ హీరోగా హిందీలో తెరకెక్కుతున్న చిత్రం ‘మైదాన్’. ఫుట్‌బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహిమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. 1950లలో ఈ చిత్రకథ జరుగుతుంది. పీరియాడికల్ చిత్రం కాబట్టి ఈ సినిమా చిత్రీకరణ కోసం ముంబైలో 16 ఎకరాల్లో సెట్స్ వేశారు. ఇందులో ఫుట్‌బాల్ స్టేడియం సెట్ కూడా ఒకటని సమాచారం. అయితే ఈ సెట్స్‌ను ఇప్పుడు తొలగిస్తున్నారు. కరోనా వల్ల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో ఇంకా స్పష్టత రాలేదు. జూన్ నెలలో వర్షాలు మొదలవుతాయి. దాంతో సెట్స్ పాడవుతాయనే ఉద్దేశంతో తొలగించాలనుకున్నారు. ఆల్రెడీ తొలగించే పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘‘ఈ సెట్స్ మళ్లీ నిర్మించాలంటే సుమారు రెండు నెలల సమయం పడుతుంది. షూటింగ్స్ మళ్లీ ప్రారంభం అయితే సెట్స్ మళ్లీ వేసి చిత్రీకరణ ప్రారంభించేసరికి నవంబర్ అవుతుంది’’ అని నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. -
బరువు పెరుగుతున్నా!
ఈ లాక్డౌన్ సమయంలో బరువు పెరిగే పనిలో బిజీగా ఉన్నారు బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్. కృష్ణ సేన్ అలియాస్ స్వీటీ సేన్ అనే ఓ అమ్మాయి అబ్బాయిగా మారి రెండుసార్లు వివాహం చేసుకుంది. ఈ విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ స్వీటీ సేన్ బయోపిక్‌లో స్వరభాస్కర్ నటించనున్నారు. ఈ చిత్రం గురించి స్వరభాస్కర్ మాట్లాడుతూ – ‘‘ఈ లాక్డౌన్ సమయంలో ఫుల్‌గా తింటూ బరువు పెరుగుతున్నాను. స్వీట్స్, కార్బొహైడ్రేట్స్ ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నాను. కొన్నిసార్లు అర్ధరాత్రి జంక్ ఫుడ్ తీసుకుంటున్నాను. ఇదంతా కృష్ణ సేన్ బయోపిక్ కోసమే. ఈ లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో, షూటింగ్స్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ కచ్చితంగా తెలియదు. లాక్డౌన్ ముగిసిన తర్వాత నా ప్రస్తుత మూవీ కమిట్మెంట్స్ని పూర్తి చేసి ఈ ఏడాది చివర్లోనే ఈ బయోపిక్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ బయోపిక్కు స్వర ఓ నిర్మాత కూడా కావడం విశేషం. -
తలైవికి నష్టం!
నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శైలేష్ ఆర్ సింగ్, విష్ణువర్థన్ ఇందూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్, చెన్నైలో రెండు భారీ సెట్స్ వేశారు. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితులు జూన్ వరకు పొడిగించబడినట్లయితే అది వర్షాకాలం కాబట్టి ఆ సెట్స్ పాడైపోతాయని ఆందోళన చెందుతున్నారు చిత్రబృందం. ‘‘హైదరాబాద్‌లో వేసిన సెట్లో మార్చిలో, చెన్నై సెట్లో ఏప్రిల్‌లో షూటింగ్ జరపాలనుకున్నాం. లాక్డౌన్ వల్ల కుదరలేదు. ఇంకా దాదాపు నలభైశాతం సినిమా చిత్రీకరించాల్సి ఉంది. లాక్డౌన్ తొందరగా ముగిసి షూటింగ్‌కు ఓ పది రోజుల సమయం దొరికినా హైదరాబాద్ సెట్‌కు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇప్పటికే ఒక్కరోజు షూటింగ్ జరపకుండానే హైదరాబాద్‌కు సెట్‌కు సంబంధించి మార్చి నెలకు సరిపడా డబ్బుని సెట్ వేసిన స్టూడియోకు చెల్లించిందట చిత్రబృందం. ఒకవేళ ఈ సెట్స్‌లో షూటింగ్ జరపడానికి కుదరకపోతే ‘తలైవి’ నిర్మాతలకు దాదాపు 5 కోట్ల నష్టం వాటిల్లుతుందని టాక్. మరోవైపు బాలీవుడ్ హీరో అజయ్‌దేవగన్ నటిస్తున్న ‘మైదాన్’ చిత్రం కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. ఫుట్‌బాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఓ స్టేడియం సెట్ వేశారు. వర్షాకాలం వచ్చేలోపు ఆ సెట్లో షూటింగ్ పూర్తి చేయకపోతే ఇబ్బంది అవుతుందనే ఆందోళనలో ఆ చిత్రబృందం ఉంది. -
‘మా అమ్మ బయోపిక్‌కి అనుమతి లేదు’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల బయోపిక్ తెరకెక్కుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె కుమారుడు, సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. విజయనిర్మల జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ‘మా అమ్మ బయోపిక్ తెరకెక్కించడానికి ఎవరికి హక్కులు ఇవ్వలేదు. ఆమె బతికున్నప్పుడే తన బయోపిక్కు సంబంధించి స్క్రిప్ట్ తయారు చేయమని నన్ను కోరింది. అంతలోనే ఆమె అనారోగ్యానికి గురైంది. బయోపిక్కు సంబంధించి స్క్రిప్ట్ తయారు చేయడానికి నాకు కనీసం ఏడాది సమయం పడుతుంది. (మరో బయోపిక్‌లో..?) మా అమ్మ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను బయోపిక్‌లో చూపించాలి. అదేవిధంగా మా కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకోవాలి. అప్పుడే విజయ నిర్మల బయోపిక్ తెరకెక్కుతుంది. ఇప్పట్లో ఈ బయోపిక్ నిర్మాణం సాధ్యం కాదు, అమ్మ అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాలి’ అని నరేష్ వెల్లడించారు. (విజయనిర్మల నా భార్య కావడం నా అదృష్టం) విజయ నిర్మల గతేడాది జూన్‌లో కన్నుమూశారు. ఇక ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. కాగా విజయ నిర్మల పాత్రలో కథానాయిక కీర్తీ సురేష్ నటించనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
నా లైఫ్‌లో మలుపులు లేవు
‘ప్రేమను పంచుదాం. కరోనాను కాదు’’ అంటోంది చిరంజీవి కుటుంబం. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలను ప్లే కార్డుల రూపంలో తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. ‘’ఇంట్లో ఉందాం.. యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు ప్రేమను పంచుతాం. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై భారత్‌ను గెలిపిస్తాం’’ అంటూ చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుష్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్∙తేజ్, శ్రీజ, కళ్యాణ్ దేవ్ ప్లే కార్డుస్ పట్టుకున్నారు. ‘‘నా జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ఆలోచన లేదు’’ అంటున్నారు చిరంజీవి. తన బయోపిక్ గురించి ఇటీవల ఓ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీలో నా ప్రయాణం చాలామంది యాక్టర్స్‌కు ప్రేరణగా నిలిచింది. ఇండస్ట్రీలో చిరంజీవిగా ఎదగాలని చాలామంది అనుకుంటుంటారు. ఇది నాకు చాలా సంతోషాన్నిస్తుంది. కానీ నా జర్నీని వెండితెరపై ఓ ఆసక్తికరమైన బయోపిక్‌గా తెరకెక్కించడానికి కావాల్సినన్ని మలుపులు నా జీవితంలో లేవని నాకనిపిస్తోంది. అయితే ప్రస్తుతం నా ఆటోబయోగ్రఫీ (పుస్తకం)కి చెందిన వర్క్ జరుగుతోంది. అలాగే నా వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఓ డాక్యుమెంటరీగా తీయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అని పేర్కొన్నారు. ఆచార్యలో రామ్‌చరణ్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రొఫెసర్‌గా మారిన మాజీ నక్సలైట్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని టాక్. చిరంజీవి శిష్యుడి పాత్రలో కనిపిస్తారట రామ్‌చరణ్. -
సరోజినీ నాయుడుగా...
స్వాతంత్య్ర సమరయోధురాలు, కవయిత్రి, స్వతంత్ర భారతదేశ తొలి మహిళా గవర్నర్, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ తెరకెక్కనుంది. సరోజినీ నాయుడు పాత్రను దీపికా చిఖలియా పోషించనున్నారు. ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి, అప్పటి తరానికి అభిమాన తారగా మిగిలిపోయారు దీపికా. అప్పట్లో ఆమెను అసలు పేరుతో కాకుండా ‘సీత’ అనే చాలామంది పిలిచేవారు. ఆ పాత్రను అంత అద్భుతంగా చేశారు దీపికా. ఆ తర్వాత నటిగా వెండితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారామె. 1991లో ఎన్టీఆర్ నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో చంద్రమతిగా నటించారు దీపిక. హిందీ, తమిళం, గుజరాత్ భాషల చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. సరోజినీ నాయుడు బయోపిక్ గురించి దీపిక మాట్లాడుతూ– ‘‘సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆన్లైన్లో సరోజినీగారి గురించి వెతికాను. నాకు కావాల్సినంత సమాచారం దొరకలేదు. రైటర్ ధీరజ్ మిశ్రా ఈ బయోపిక్ గురించి చెప్పారు. అయితే నేనింకా సైన్ చేయలేదు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత పూర్తి స్క్రిప్ట్ విని నిర్ణయం తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ధీరజ్ మిశ్రాయే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని బాలీవుడ్ టాక్. -
కరణం మల్లేశ్వరి బయోపిక్
క్రీడాకారుల జీవితాన్ని కథగా స్క్రీన్ మీద చూపించే ట్రెండ్ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో కనిపిస్తోంది. తాజాగా ఓ బయోపిక్ రెడీ అవుతోంది. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మన దేశానికి తొలి మెడల్ తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరిపై ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ నిర్మించనున్నారు. శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామం నుంచి దేశానికి తొలి ఒలింపిక్ పతాకాన్ని తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరి కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చిత్రబృందం భావించిందట. సుమారు 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో మల్లేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. -
గంగూలీ బయోపిక్?
బాలీవుడ్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్స్‌ను స్క్రీన్ మీదకు తీసుకురావడంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు దర్శక–నిర్మాతలు. గతంలో ధోనీ బయోపిక్ తీశారు. ప్రస్తుతం 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా ‘83’ తెరకెక్కింది. తాజాగా మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. కరణ్ జోహార్ ఈ బయోపిక్ నిర్మించే సన్నాహాలు చేస్తున్నారట. దీని కోసం గంగూలీతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట కరణ్. గంగూలీ పాత్ర కోసం హృతిక్ రోషన్ పేరును పరిశీలిస్తున్నారట. మైదానంలో చూపించిన దూకుడు స్వభావం, కెప్టెన్‌గా సాధించిన విజయాలు వంటి చాలా అంశాలు గంగూలీ కెరీర్లో ఉన్నాయి. అందుకే అతని కథ పక్కా కమర్షియల్ సినిమాకు సరిపడేలా ఉంటుందని గంగూలీ ఫ్యాన్స్ హర్షిస్తున్నారు. -
బయోపిక్ నం 3
దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా రెండు సినిమాలకు సంబంధించిన ప్రకటనలు ఇప్పటికే వచ్చాయి. నిర్మాత అనిల్ సుంకరతో కలసి, అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ అధినేత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత జగదీష్ దానేటి, జానీ మార్టిన్ దర్శకత్వంలో ఇండో–హాలీవుడ్ చిత్రంగా కలామ్ బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించారు. కలామ్గా అలీ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కలామ్ జీవితంపై సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు కలామ్‌పై సినిమా తీసే రైట్స్ మా దగ్గరే ఉన్నాయి మరెవ్వరూ సినిమా తీయడానికి వీల్లేదు అని అభిషేక్ ఆర్ట్స్ సంస్థ›పేర్కొంది. దాంతో ఆసక్తి ఏర్పడింది. -
బెంగాలీ బాబు శోభన్‌బాబు
దివంగత నటి, ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’లోని స్టార్ క్యాస్ట్ రోజురోజుకీ పెద్దదవుతోంది. జయలలితగా కంగనా రనౌత్, యంజీఆర్‌గా అరవింద స్వామి, శశికళ పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. కరుణానిధిగా ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారట. తాజాగా శోభన్‌బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూసేన్ గుప్తా నటిస్తారని తెలిసింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. శోభన్‌బాబు, జయలలిత కొంతకాలం ప్రేమలో ఉన్నారని అప్పట్లో టాక్. శోభన్‌బాబు పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉండబోతోందట. ఈ పాత్రను పోషించడానికి శోభన్‌బాబు పాత చిత్రాలను చూస్తున్నారట జిష్షూ సేన్. యన్టీఆర్ బయోపిక్‌లో ఎల్వీ ప్రసాద్ పాత్రలో, ‘అశ్వథ్థామ’ లో విలన్ పాత్రలో నటించారు జిష్షూ. -
అలీ @ కలామ్
భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ బయోపిక్ హాలీవుడ్లో తెరకెక్కుతోంది. కలామ్ పాత్రను నటుడు అలీ పోషిస్తున్నారు. పప్పు సువర్ణ నిర్మాణంలో జగదీష్ దానేటి, జానీ మార్టిన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆదివారం ఢిల్లీలో విడుదల చేశారు. ‘‘సినీ జీవితంలో అత్యంత సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. కలామ్గారితో ఫొటో దిగితే చాలనుకున్నాను. ఆయన బయోపిక్‌లో నటించే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు అలీ. ‘‘అలీగారికి ఇది 1,111వ చిత్రం. ఈ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయారు’’ అన్నారు జగదీష్ దానేటి. -
సానియా మీర్జా బయోపిక్.. కరీనాతో చర్చలు!
ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ,రాజకీయ ,క్రీడా రంగాలకు చెందిన లెజండ్రీల బయోపిక్‌ల నిర్మాణం వరుస కడుతున్నాయి. ఇంతకు ముందు ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ల నుంచి బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, క్రీడాకారులు ధోనీ, సచిన్, ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితల వరకూ జీవిత చరిత్రలు తెరరూపం దాల్చడం చూస్తున్నాం. జయలలిత బయోపిక్ నిర్మాణంలో ఉంది. ఇక మరో క్రికెట్ క్రీడాకారుడు కపిల్‌దేవ్ బయోపిక్ నిర్మాణం జరుపుకుంటోంది. అదే విధంగా అథ్లెటిక్ క్రీడాకారిణి మిలన్‌సింగ్, బాక్సింగ్ క్రీడాకారిణి మెరీకోమ్ల జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రాలు విడుదలై కాసుల వర్షం కురిపించాయి. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా, పీవీ సింధు, మహిళా క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ వంటి క్రీడాకారిణుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. తాజాగా టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవిత చరిత్ర తెరకెక్కనుంది. దీని గురించి సానియానే ఓ భేటీలో స్వయంగా తెలిపింది. తన జీవిత చరిత్ర తెరకెక్కనున్న విషయం నిజమేనని, దీని గురించి కథారచయితతో పలు అంశాలు షేర్ చేసుకోనున్నానని సానియా తెలిపారు. చాలా మందికి క్రీడాకారుల ప్రవర్తన, వారి కఠిన శ్రమ, తల్లిదండ్రుల త్యాగం వంటివి తెలియడం లేదని, వారిలో గ్లామర్‌ను మాత్రమే చూస్తున్నారని ఆమె అన్నారు. అందువల్లే తన బయోగ్రప్రీతో తెరకెక్కనున్న చిత్రంలో తానూ భాగం పంచుకోవాలనుకుంటున్నానని అన్నారు. అయితే ఈ చిత్రాన్ని ఎవరు దర్శకత్వం వహించనున్నారు? తన పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంపై స్పష్టతనివ్వలేదు. అయితే ఇందులో కరీనాకపుర్ను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. చదవండి: నటి ‘ప్రేమలేఖ’ నెట్టింట్లో వైరల్ మరీ ఇంత ఘాటు ముద్దా? -
వెండితెర ఎంజీఆర్
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెర కెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. (హిందీలో ‘జయ’). ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివంగత నేత కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్, దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది. ఇవాళ ఎం.జి రామచంద్రన్ జయంతి సందర్భంగా ఈ సినిమాలోని అరవింద స్వామి లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఆల్రెడీ విడుదల చేసిన కంగనా రనౌత్ ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి స్పందన లభిస్తోంది. ఎంజీఆర్ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటిస్తున్నారు అరవిందస్వామి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘తలైవి’ చిత్రం ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది. -
ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కిస్తా
చెన్నై ,పెరంబూరు: ఇళయరాజా బయోపిక్ తెరకెక్కనుంది. ఇటీవల జెండ్రీల బయోపిక్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని పీవీ.నరసింహరావు బయోపిక్‌ల నుంచి, క్రికెట్ కీడాకారులు, సినీ ప్రముఖుల బయోపిక్‌లు చిత్రాలుగా తెరకెక్కి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌తో రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. నటుడు సూర్య నటిస్తున్న సూరనై పోట్రు చిత్రం కూడా బడ్జెట్లో విమానాన్ని తయారు చేసిన జీఆర్.గోపీనాథ్ జీవిత చరిత్రే నన్నది గమనార్హం. రాజా ది జర్నీ సంగీతరంగంలో ఎంతో కీర్తి సాధించిన సంగీతజ్ఞాని ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. దీన్ని ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఒక భేటీలో స్వయంగా వెల్లడించారు. తన తండ్రి ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించాలన్న ఆలోచన ఉందని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని చెప్పారు. దీనికి దాజా ది జర్నీ అనే టైటిల్ బాగుంటుందని అన్నారు. నటుడు ధనుష్ కరెక్ట్ ఇళయరాజా పాత్రను పోషించడానికి నటుడు ధనుష్ కరెక్ట్ అని చెప్పారు. మరి ఇళయరాజా పాత్రలో నటించడానికి నటుడు ఆయన అంగీకరిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఎన్నో జాతీయ, రాష్ట్ర అవార్డులను అందుకుని సంగీతరంగంలో రారాజుగా రాణిస్తున్న ఇళయరాజా బయోపిక్ సినిమాగా తెరకెక్కనుందన్న మాట. -
ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు
‘గుంజన్ సక్సేనా’ చిత్రాన్ని ముగించి ఈ ఏడాదికి గుడ్ బై చెప్పారు జాన్వీ కపూర్. భారత వైమానిక దళంలో మొదటి మహిళా పైలైట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’. శరణ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ టైటిల్ రోల్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ – ‘‘గుంజన్ సక్సేనా’ చిత్రాన్ని పూర్తి చేశానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా అనుభవాన్ని క్లుప్తంగా మాటల్లో చెప్పేందుకు రెండు రోజులు ఆలోచించాను. కానీ నాకు ఏమీ తోచలేదు. ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. ఈ సినిమా ప్రయాణం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాను. నా స్నేహితుడు, దర్శకుడు శరణ్ శర్మకు ధన్యవాదాలు. ఈ సినిమాను ప్రేక్షకులకు చూపించాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అన్నారు. అలాగే ‘గుంజన్ సక్సేనా’ సినిమాకు సంబంధించిన మరో వర్కింగ్ స్టిల్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా ‘రుహీ అఫ్జా దోస్తానా 2, తక్త్’ సినిమాల చిత్రీకరణలతో జాన్వీ వచ్చే ఏడాది ఫుల్ బిజీ. -
తెలుగు రాష్ట్రంలో తలైవి
ప్రముఖనటి, తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’ (హిందీలో ‘జయ’ అనే టైటిల్ అనుకుంటున్నారు). ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీ¯Œ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, అరవిందస్వామి కీలకపాత్రలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల మైసూర్లో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ భాగ్యనగరంలో(హైదరాబాద్) ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్లు రెడీ చేశారు. ఇక్కడి షెడ్యూల్ దాదాపు 25 రోజులు సాగుతుందని సమాచారం. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 26న విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘తానాజీ’ నుంచి మరో ట్రైలర్ విడుదల
మరాఠా యోథుడు ఛత్రపతి శివాజీ సేనకు సైన్యాధిపతి తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం తానాజీ: ది అన్ సంగ్ వారియర్’ నుంచి రెండో ట్రైలర్ ఈరోజు విడుదలైంది. తానాజీ పాత్రలో అజయ్ దేవగణ్, ఆయన భార్య సావిత్రి పాత్రలో కాజోల్ నటిస్తున్నారు. ‘మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన మెరుపుదాడులు..’ అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్ లో యుద్ధ సన్నివేశాలు, నటీనటుల డైలాగ్స్, సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి తానాజీగా అజయ్ దేవ్‌గణ్ నటించాడు. ఆయన భార్య సావిత్రిబాయి మలుసరే పాత్రలే అజయ్ నిజ జీవిత భాగస్వామి కాజోల్ నటించడం విశేషం. సైఫ్ అలీ ఖాన్ ఉదయ్ భాన్ అనే ఔరంగజేబుకు నమ్మిన బంటుగా నటించాడు. ఇక ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్‌గా నటించిన శరత్ కేల్కర్ ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో జగపతిబాబు మరో ముఖ్యపాత్ర శెలార్ మామా పాత్రలో నటించాడు. -
ముఖాన్ని నాశనం చేశాడు... నా ఆత్మవిశ్వాసాన్ని కాదు
‘‘యాసిడ్ అమ్మడం ఆపేస్తే ఎంత బాగుంటుంది. ఈ దాడులు ఉండవు, నా ముక్కు, నా చెవులు సరిగా లేవు..ఈ జుమ్కీని నేను ఎక్కడ అలంకరించుకోవాలి, అతను నా ముఖాన్ని నాశనం చేశాడు.. నా ఆత్మవిశ్వాసాన్ని కాదు’’...మంగళవారం విడుదలైన హిందీ చిత్రం ‘చప్పాక్’ ట్రైలర్‌లోని డైలాగ్స్ ఇవి. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ‘రాజీ’ ఫేమ్ మేఘన్ గుల్జర్ ఈ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపికా పదుకోన్ నటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయాలనుకుంటున్నారు. -
శభాష్ మిథు
వెండితెరపై కొత్త ఆట ఆడటానికి రెడీ అయిపోయారు కథానాయిక తాప్సీ. ‘శభాష్ మిథు’లో క్రికెటర్‌గా కనిపించబోతున్నారామె. ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ ఇది. ఈ చిత్రానికి రాహుల్ థోలాకియా దర్శకుడు. ‘కహానీ’ (2012), ‘క్వీన్’ (2014), ‘మేరీకోమ్’ (2014), ‘పద్మావత్’ (2018) వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తీసిన వయాకామ్ 18 సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. మంగళవారం మిథాలీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించడం విశేషం. ‘‘కలలను సాకారం చేసుకోవాలనుకునే యువతులకు నా సినిమా ఓ స్ఫూర్తిగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు మిథాలీరాజ్. ‘‘మిథాలీ.. నీ పుట్టినరోజుకి ఏం బహుమతి ఇవ్వాలో అర్థం కావడం లేదు. వెండితెరపై నాలో నువ్వు ప్రతిబింబించేలా ప్రయత్నిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. కవర్ డ్రైవ్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు తాప్సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సూర్మ’ (2017)లో హాకీ ప్లేయర్‌గా, సాంద్ కీ ఆంఖ్ (2019) సినిమాలో షూటర్‌గా నటించిన తాప్సీ తాజాగా ‘రష్మీ: ద రాకెట్’లో అథ్లెట్ (రన్నింగ్)గా నటిస్తున్నారు. ఇప్పుడు ‘శభాష్ మిథు’ సినిమా కోసం ఆమె క్రికెటర్‌గా మారారు. ఇవన్నీ గమనిస్తుంటే బాలీవుడ్లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ అంటే తాప్సీనే చేయాలని దర్శక–నిర్మాతలు భావిస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. -
ఆ పాత్రకు నేనే పర్ఫెక్ట్ : నిత్యామీనన్
చెన్నై : నేనే పర్ఫెక్ట్ అంటోంది నిత్యామీనన్. తనకు అనిపించింది మాట్లాడడం ఈమె స్వభావం. ఎవరేమనుకున్నా సరే తనకు రైట్ అనిపించుకుంది చేసేస్తుంది. అలా పలు విమర్శలకు గురైతుంది కూడా. అందుకే నిత్యామీనన్‌పై పొగరబోతు అనే ముద్ర ఉంది. అయితే నటిగా మంచి పేరే సంపాదించుకుంది. అలాగని కథానాయకి పాత్రలనే చేస్తానని గిర్ర గీసుకుని కూర్చోదు. తనకు నచ్చితే అది చిన్న పాత్ర అయినా చేసేస్తుంది. తాజాగా చాలా పెద్ద బాధ్యతను తీసుకుంది. అదే దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రకు జీవం పోసే బాధ్యత. జయలలిత బయోపిక్‌తో రెండు చిత్రాలు, ఒక వెబ్ సిరీస్ తయారవుతున్న విషయం తెలిసిందే. దీ క్వీన్ పేరుతో దర్శకుడు గౌతమ్‌మీనన్ రూపొందిస్తున్న వెబ్ సిరీస్‌లో నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇక సినిమాగా తెరకెక్కుతున్న తలైవి చిత్రానికి విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జయలలితగా బాలీవుడ్ నటి కంగనారనౌత్ నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, చిన్న టీజర్‌ను చిత్ర వర్గాలు ఇటీవల విడుదల చేశారు. జయలలితగా కంగనారనౌత్ నప్పలేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా జయలలిత బయోపిక్‌తో తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్న మరో చిత్రానికి ది ఐరన్ లేడీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కేరళా బ్యూటీ నిత్యా మీనన్ నటించనుంది. దీని చిత్రీకరణ ప్రారంభం కాకపోయినా, ఫస్ట్‌లుక్ పో స్టర్‌ను ఆ మధ్య విడుదల చేశారు. అయితే అందులో జయలలిత ఫొటో నూ మార్పింగ్ చేశారనే విమర్శలు వచ్చా యి. కాగా జయలలిత పాత్రలో నటించనుండడం గురించి నటి నిత్యామీనన్ చాలాసార్లు తన అభిప్రాయాలను మీడియాతో పంచుకుంది. కాగా తలైవి చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైన తరువాత నటి నిత్యామీనన్ మరో సారి స్పందించింది. ఒక భేటీలో ఈ అమ్మ డు మాట్లాడుతూ..జయలలితగా నటించడానికి తానే పర్ఫెక్ట్ అని చెప్పింది. జయలలిత మాదిరిగానే తాను నచ్చని విషయాల గురించి ముఖం మీదే చెప్పేస్తానని అంది. ఇప్పుడు జయలలిత పాత్రలో నటించనుండడంతో ఆమె గురించి పూర్తిగా తెలుసుకుంటున్నానని అంది. ఆమెలా నటించడానికి తనను తాను తయారు చేసుకుంటున్నానని చెప్పింది. జయలలిత పాత్రకు 100 శాతం శ్రమిస్తానని నిత్యామీనన్ అంటోంది. -
నాయకురాలు
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేకౖమైన గుర్తింపు తెచ్చుకున్నారు జయలలిత. ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసి అందరి గుండెల్లో ‘పురట్చి తలైవి’ (విప్లవ నాయకి)గా మిగిలారు. ఆమె జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘తలైవి’ (నాయకురాలు) చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు కంగనా రనౌత్. శనివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను, టీజర్‌ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేసింది చిత్రబృందం. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత ఓల్డ్ గెటప్‌తో పాటు, టీజర్లో ఆమెకు సంబంధించిన రెండు గెటప్‌లను విడుదల చేశారు. ‘బ్లేడ్ రన్నర్’, ‘కెప్టెన్ మార్వెల్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన మేకప్ నిపుణులు కంగనాను జయలలితలా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో యంజీఆర్ పాత్రలో అరవింద స్వామి, కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. -
‘ఒకేసారి సినీ జీవితం ప్రారంభించాం’
ముంబై: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రస్తుతం నటిస్తున్న ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ చిత్రంపై పలువురు బాలీవుడ్ హీరోలు అభినందనలు తెలుపుతూ.. అజయ్‌తో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమా అజయ్‌కి వందో చిత్రం. తాజాగా అక్షయ్ కుమార్.. అజయ్ నటించే తన్హాజీ సినిమా పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ..‘మనం ఇద్దరం 30 ఏళ్ల కింద సినీజీవితాన్ని ఒకేసారి ప్రారంభించాము. అప్పటి నుంచి నీ సినిమాల గ్రాఫ్‌ను చూస్తున్నాను. అది ఎప్పటికప్పుడు మంచి విజయాలతో పెరుగుతూనే ఉంది. నీ వందో చిత్రం తన్హాజీకి అభినందనలు. ప్రేమ, అదృష్టం నీకు కలగాలి సోదరా..’ అని కామెంట్ చేశారు. We started our journey in this industry together...30 years ago.And I’ve seen your graph only grow from strength to strength.And as you are all set to mark your century with #TanhajiTheUnsungWarrior,I wish you nothing but lots of love and luck.Shine on my friend @ajaydevgn pic.twitter.com/HrE1DvPYFW — Akshay Kumar (@akshaykumar) November 12, 2019 దీని కంటే ముందు అజయ్ 100వ చిత్రంపై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా తన ట్విటర్ ఖాతాలో ‘తన్హాజీ’ సినిమాలోని అజయ్ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘నీ నుంచి మరో వంద సినిమాలు రావాలని ఎదరుచూస్తున్నా. మరిన్ని సినిమాల్లో నటించాలి సోదరా. నీ సినీజీవితంలో మైలురాయిగా నిలిచే వందో సినిమాకు అభినందనలు. ఒకేసారి రెండు బండ్ల మీద రైడ్ చేయటం నుంచి చాలా దూరం వచ్చావు. ఇక అలాగే స్వారీ చేస్తూ ఉండు.. తన్హాజీకి ఆల్ ది బెస్ట్.’ అంటూ కామెంట్ చేశారు. షారుఖ్ ట్విట్‌కు స్పందించిన అజయ్.. ‘మీ అభినందనలకు కృతజ్ఞతలు’ అంటూ రిట్వీట్ చేశారు. Here’s looking forward to another 100 and more films from my friend @ajaydevgn . All the best for this milestone...from striding atop two motorcycles at the same time...you’ve come a long long way....keep riding...and all the best for Tanhaji. pic.twitter.com/s1YpGpgEkQ — Shah Rukh Khan (@iamsrk) November 11, 2019 మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ సైన్యానికి నాయకత్వం వహించిన సుబేదార్ తన్హాజీ మలుసరే జీవితం ఆధారంగా ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో, కాజోల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమాను అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మిస్తున్నారు. గత నెలలో అజయ్ తన లుక్‌ని షేర్ చేసి ‘మెదడు.. కత్తికంటే కంటే చాలా పదునైనది’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. -
నటరాజ్ షాట్లో అచ్చం కపిల్..!
ముంబై: బాలీవుడ్ హీరో రన్వీర్సింగ్ తన సినిమాల్లోని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో, దర్శకుడు కబీర్ సింగ్ తెరకెక్కీస్తున్న ‘83’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన కపిల్ అల్‌టైమ్ ఫెవరెట్ నటరాజ్ షాట్‌ను ఆడుతున్నట్టు పోస్తో ఉన్న ఫోటోను రన్వీర్ తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కపిల్‌దేవ్ ‘నటరాజ్ షాట్’ పోస్ పెట్టిన రన్వీర్ తీరుపై పలువురు అభిందిస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. ఈ ఫోటోలో రన్వీర్ అచ్చంగా అలనాటి కపిల్‌దేవ్ నటరాజ్ షాట్ కొడుతున్న తీరు తన పోస్‌లో మరోసారి క్రికెట్ అభిమానుల కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నారు. రన్వీర్ నాటరాజ్లా నిలబడినతీరు, జట్టు, షాట్ కొడుతున్న వ్యక్తం చేసే ముఖకవలికలు అచ్చంగా కపిల్‌దేవ్‌లా ఉన్నాయి. దీంతో బాలీవుడ్ నటుడు ఆయూష్మాన్ ఖురానా ఈ ఫోటక్షపై స్పందిస్తూ.. ‘మరో సారి చాంపియన్’ అంటూ చప్పట్లు కొడుతున్నఎమోజీని పెట్టారు. నీనాగుప్తా, చైతన్య శర్మలు..‘నిన్ను అభినందించకుండా ఉండలేము.. వావ్..’ అంటూ.. కామెంట్ చేశారు. అదేవిధంగా కపిల్‌దేవ్ కూడా స్పందించి ‘శెభాష్ రన్వీర్’ అంటూ.. రిట్వీట్ చేశారు. రన్వీర్కు కోస్టార్‌గా నటిస్తున్న సాకిబ్ సలీం స్పందిస్తూ..‘బాంబ్’ అంటూ కామెంట్ చేశారు. ప్రముఖులతో పాటు నెటిజన్లు రన్వీర్ అచ్చం కపిల్‌లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘83’ చిత్రం కోసం రణ్వీర్ చాలా హర్డ్‌వర్క్ చేస్తున్నాడని, అచ్చం కపిల్‌దేవ్‌లా కనిపించడం కోసం రణ్వీర్ శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు దర్శకుడు కబీర్ సింగ్ ఇటీవలే ఓ ఇంటర్యూలో తెలిపాడు. కాగా రణ్వీర్ నటించిన గల్లీబాయ్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. View this post on Instagram NATRAJ SHOT 🏏 #RanveerAsKapil 🇮🇳 @therealkapildev @kabirkhankk @deepikapadukone @sarkarshibasish @mantenamadhu #SajidNadiadwala @vishnuinduri @reliance.entertainment @fuhsephantom @nadiadwalagrandson @vibrimedia @zeemusiccompany A post shared by Ranveer Singh (@ranveersingh) on Nov 10, 2019 at 7:33pm PST -
పాత్రలా మారిపోవాలని
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నైహ్వాల్ బయోపిక్ సిద్ధం అవుతోంది. సైనా పాత్రలో పరిణీతీ చోప్రా నటించనున్నారు. సైనా పాత్ర కోసం రోజుకి రెండుగంటల పాటు బ్యాడ్మింటన్ సాధన చేస్తున్నారు పరిణీతి. సైనాను కలసి ఆమె ఆలోచనలు, హావభావాలను తెలుసుకుంటున్నారు. ఇప్పుడు సైనా నెహ్వాల్ ఇంటిని సందర్శించనున్నారు పరిణీతి. ‘‘ఈ సినిమా కోసం సైనా పాత్రను కేవలం పోషించడం కాదు పూర్తిగా సైనాలా మారిపోవాలనుకుంటున్నాను. వాళ్ల ఇంటికి వెళ్లి తన రోజువారీ జీవితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. నేనొస్తున్నానని ప్రత్యేకంగా ఏం వంటలు తయారు చేయొద్దని, రోజూ వాళ్లు తినే భోజనాన్ని నాకు వడ్డించమని సైనా ఫ్యామిలీని కోరాను’’ అని పరిణీతి తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి అమోల్ గుప్తా దర్శకత్వం వహించనున్నారు. -
కత్తి కంటే పదునైనది మెదడు
‘టోటల్ ధమాల్, దేదే ప్యార్ దే’ వంటి హిట్స్ తర్వాత బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ చారిత్రాత్మక సినిమాతో రాబోతున్నారు. మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ సైన్యానికి నాయకత్వం వహించిన సుబేదార్ తన్హాజీ మలుసరే జీవితం ఆధారంగా ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో, కాజోల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమాను అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సైఫ్ అలీఖాన్ లుక్స్‌ను సోమవారం విడుదల చేశారు. అజయ్ తన లుక్‌ని షేర్ చేసి ‘‘మెదడు.. కత్తికంటే కంటే చాలా పదునైనది’ అని పేర్కొన్నారు. జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. -
22ఏళ్ల తర్వాత...
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్’ (తెలుగులో ఇద్దరు) సినిమాలో కరుణానిధి పాత్రలో కనిపించారు నటుడు ప్రకాశ్ రాజ్. 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన కరుణానిధి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్ టైటిల్‌రోల్ చేస్తున్న చిత్రం ‘తలైవి’. ఈ సినిమాలో కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటించనున్నారట. యంజీఆర్ పాత్రలో అరవింద స్వామి కనిపించనున్నారు. జయలలిత రాజకీయ ప్రస్థానంలో కరుణానిధి పాత్ర కీలకమైనది. దీపావళి తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాను శైలేష్ ఆర్. సింగ్, విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. -
జయ బయోపిక్ ఆగిపోయిందా?
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణం తరువాత ఆమె బయోపిక్‌ను తెరకెక్కించేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వచ్చారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు జయలలిత కథతో క్వీన్ పేరుతో వెబ్ సిరీస్ ప్రారంభించారు. అదే సమయంలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తలైవీ పేరుతో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు కంగనా కూడా జయ పాత్రలో ఒదిగిపోయేందుకు తమిళ్ నేర్చుకోవటంతో పాటు బరువు పెరిగేందుకు కూడా రెడీ అయ్యారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించాలని నిర్ణయించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఆర్థిక సమస్యల కారణంగానే ప్రాజెక్ట్‌ను వాయిదా వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. -
వెండితెరకు కాళోజి జీవితం
ప్రముఖ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జీవితం వెండితెరకు రానుంది.‘అమ్మా నీకు వందనం, ప్రణయ వీధుల్లో.. పోరాడే ప్రిన్స్, క్యాంపస్–అంపశయ్య’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డా. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో ‘కాళన్న’ పేరుతో కాళోజి బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. జైనీ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి జైనీ నిర్మిస్తారు. ఈ సందర్భంగా ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ– ‘‘9.9.2019 కాళోజి నారాయణరావుగారి 105వ జయంతి. ఈ సందర్భంగా కాళోజిగారి జీవిత విశేషాలను, రచనలను, స్వాతంత్య్ర పోరాట విశేషాలను నేటి యువతీయువకులకు పరిచయం చేయాలనుకున్నాం. మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి హారతి పట్టిన ఆయన జీవిత విశేషాలను దృశ్య రూపంలో నిక్షిప్తం చేయాలనే మహోన్నత ఆశయంతో ‘కాళన్న’ సినిమా చేస్తున్నాం. కాళోజికి అత్యంత సన్నిహితులైన అంపశయ్య నవీన్, వి.ఆర్. విద్యార్థి, నాగిల్ల రామశాస్త్రి, పొట్లపల్లి, అన్వర్ మొదలైన మిత్రులతో సంప్రదించి స్క్రీన్‌ప్లేకు తుది రూపం ఇచ్చి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్ నీర్ల, సంగీతం: ఘంటసాల విశ్వనాథ్, మహమ్మద్ సిరాజుద్దీన్. -
బయోపిక్ కోసం రిస్క్ చేస్తున్న హీరోయిన్!
సినిమా హీరోయిన్లు శరీరాకృతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లుక్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా అది కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది. సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరగిన అనుష్క తరువాత లుక్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా మరో బ్యూటీ అదే రిస్క్ చేయడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, జయలలిత బయోపిక్‌లో నటించేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జయలా కనిపించేందుకు ఆమె చాలా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తమిళ్ నేర్చుకుంటున్న కంగనా, అదే సమయంలో బరువు కూడా పెరుగుతున్నారట. ఒకసారి బరువు పెరిగితే తగ్గటం చాలా కష్టమని తెలిసినా.. అమ్మ పాత్రకు న్యాయం చేసేందుకు రిస్క్ చేయాలని ఫిక్స్ అయ్యారట కంగనా. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, కరుణానిధిగా ప్రకాష్ రాజ్ నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ రూపొందిస్తున్నారు. -
సింధుగా సమంత?
బ్యాడ్మింటన్ కోర్టులో సమంత అడుగుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. భారత స్టార్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నటుడు సోనూ సూద్ నిర్మిస్తారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సోనూ భావిస్తున్నారు. కానీ సింధు పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇటీవల ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సోనూ సంప్రదింపులు జరిపినప్పటికీ చర్చలు కొలిక్కి రాలేదట. దీంతో తాజాగా సౌత్‌లో వరుస సక్సెస్‌లు అందుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్న సమంతతో సంప్రదింపులు జరిపే ఆలోచనలో సోనూ ఉన్నారని టాక్. ఇక సింధు విషయానికొస్తే.. ఆల్రెడీ 2016లో ఒలిపింక్ రజతం సాధించి, ఇటీవల స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. -
మైదానంలో దిగారు
ఫుట్‌బాల్ కోచ్‌గా మైదానంలో దిగారు అజయ్ దేవగన్. తన నైపుణ్యంతో మైదానంలో మాణిక్యాలను తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా ప్రస్తుతం చేస్తున్న ‘మైదాన్’ కోసమే. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్, మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మైదాన్’. 1950 నుంచి 1963 వరకూ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్‌గా వ్యవహరించారు సయ్యద్. ఆయన పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నారు. అజయ్ భార్యగా కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తీ. సౌత్‌లో మహానటి అనిపించుకున్న కీర్తీ బాలీవుడ్ ప్రేక్షకుల దగ్గర కూడా మెప్పు పొందుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి ‘బదాయిహో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకుడు. బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, అరునవ జోయ్ గుప్తా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభం అయింది. -
ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్
సినిమా: నటుడు విజయ్‌సేతుపతి నటించడానికి అంగీకరించిన ఆ చిత్రం వ్యవహారంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇంతకీ ఆ చిత్రం ఏదనేగా మీ ఆసక్తి. శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోగ్రపిను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మురళీధరన్ పాత్రలో నటుడు విజయ్‌సేతుపతి నటించడానికి అంగీకరించారు. 800 వికెట్లను తీసిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించిన ముత్తయ్య మురళీధన్ బయోపిక్కు 800 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గురించి విజయ్‌సేతుపతి ఇంతకు ముందు మాట్లాడుతూ 800 వికెట్లను తీసి రికార్డు సృష్టించిన ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటించడం ఘనతగా పేర్కొన్నారు. అయితే ఆయన ఆ పాత్రలో నటించనుండటంపై తీవ్ర విమర్శలు వెల్లెవెత్తుతున్నాయి. వీసీకే పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు ఇటీవల ఒక ప్రకటను విడుదల చేస్తూ శ్రీలంకలోని కండిలో పుట్టిన తమిళుడు అయినా సింహళుడిగానే పెరిగారన్నారు. ఎల్టీటీఈ పోరాటంలో ఆయన శ్రీలంకకు మద్దతుగా నిలిచి ద్రోహం చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి పాత్రలో విజయ్‌సేతుపతి నటించడాన్ని శ్రీలంక తమిళులు అంగీకరించరని అన్నారు. ఇదే విధంగా సామాజిక మాధ్యమాల్లోనూ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో విజయ్‌సేతుపతి పోషించనుండటాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతే కాదు విదేశాల్లోని తమిళులు విజయ్‌సేతుపతి ఆ పాత్రలో నటించకూడదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పునరాలోచనలో పడ్డ విజయ్‌సేతుపతి ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటించరాదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఆయన ఇంకా బహిరంగంగా వెల్లడించలేదన్నది గమనార్హం. దీంతో 800 చిత్రం తెరకెక్కుతుందా? అన్న సందేహం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీని గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఈ అవార్డు మా అమ్మకు అంకితం
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా కీర్తీ సురేశ్ టైటిల్ రోల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా కీర్తీ సురేశ్, నాగ్ అశ్విన్‌తో ‘సాక్షి’ స్పెషల్ టాక్. ► హార్టీ కంగ్రాట్స్. 1990లో ‘కర్తవ్యం’ సినిమాకి విజయశాంతి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 28 ఏళ్ల తర్వాత తెలుగు నుంచి ఉత్తమ కథానాయిక అవార్డు గెలుచుకున్న నటి మీరే... కీర్తీ సురేశ్: చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ అవార్డును మా అమ్మకు అంకితం చేస్తున్నాను. అమ్మ (మలయాళ నటి మేనక) నటించిన ఓ మలయాళం సినిమా నేషనల్ అవార్డుకి నామినేట్ అయింది. కానీ అవార్డు రాలేదు. అలా అమ్మ కల నెరవేరలేదు. అప్పుడే తనకోసం ఓ అవార్డు తీసుకురావాలని అనుకున్నాను. ‘నీ కోసం జాతీయ అవార్డు తీసుకొస్తాను’ అని అమ్మతో కూడా చెప్పాను. ఇప్పుడు అది నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లవుతోంది. ఇంత త్వరగా జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. అమ్మ కల మాత్రమే కాదు.. ప్రతిష్టాత్మక అవార్డు తీసుకోవాలనే నా కల నెరవేరినట్టుంది. ఇది కేవలం మొదలే.. నా జర్నీ ఇంకా చాలా ఉంది (నవ్వుతూ). ► ఈ సందర్భంగా సావిత్రిగారి గురించి రెండు మాటలు... సావిత్రిగారి ఆశీస్సులు, సపోర్ట్ లేకపోతే ఇంత దూరం కచ్చితంగా వచ్చేవాళ్లం కాదు. సావిత్రి అమ్మ, ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి అమ్మకు చాలా చాలా థ్యాంక్స్. సినిమా చేస్తున్నప్పుడు వచ్చిన అడ్డంకులన్నీ సావిత్రమ్మ ఆశీస్సులతోనే ఎదుర్కొన్నాం. ఆవిడ ఎప్పుడూ మమ్మల్ని గైడ్ చేస్తూనే వచ్చారని నా ఫీలింగ్ ► ‘మాయాబజార్’లోని ‘అహ నా పెళ్లంట’ ఎపిసోడ్లో బాగా చేశారు. ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఆ సినిమాలో ఆ పాట అందరికి ఫేవరెట్ కూడా. ఆ సన్నివేశానికి 40– 50 టేకులు తీసుకున్నాను. షూట్ చేసే మూడు రోజుల ముందే ప్రిపరేషప్ మొదలుపెట్టాను. టేక్ చేసిన ప్రతిసారీ పర్ఫెక్ట్గా రావాలనుకునే చేశాను. ఫైనల్లీ చేయగలిగాను. చాలా బాగా చేశావని అందరూ అభినందించారు. అయితే ఇప్పుడు చూసుకుంటే నాకు చిన్నచిన్న తప్పులు కనిపిస్తాయి (నవ్వుతూ). ► ఇంత బాధ్యత ఉన్న పాత్ర చేస్తున్నాం అని నిద్రలేని రాత్రులు ఏమైనా? ‘మహానటి’ కోసం చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. పాత్రలోనుంచి బయటకు రావడం చాలా కష్టంగా ఉండేది. ఎమోషనల్ సీన్స్ చేసినా ఏం చేసినా షూటింగ్ పూర్తయిన తర్వాత చాలా కష్టంగా ఉండేది. రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను. నిద్రలేకపోతే ఆ ఎఫెక్ట్ మర్నాడు షూటింగ్ మీద పడుతుందని భయం. సావిత్ర అమ్మ పాత్ర నా మీద చాలా ప్రభావం చూపించింది. ► కాస్ట్యూమ్స్‌కి కూడా అవార్డ్ వచ్చింది. అలనాటి సావిత్రిగారు వేసుకున్న కాస్ట్యూమ్స్ పోలినవి ఈనాటి కీర్తి వేసుకున్నప్పుడు ఏమనిపించింది? కాస్ట్యూమ్ డిజైనర్లు్ల కూడా చాలా కష్టపడ్డారు. ఆవిడ ఫిట్టింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఫిట్టింగ్ దొరకడం లేదు కూడా. ఆ ఫిట్టింగ్ ఉంటే తప్ప షాట్‌కి రాను అని చెప్పేదాన్ని. ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేనంత ‘టైట్ బ్లౌజులు’ వేసుకునేవారు. కష్టం అనిపించినప్పటికీ నేనూ అదే ఫిటింగ్నే ప్రిఫర్ చేశాను. ఇక లావుగా కనపడాల్సిన సీన్స్‌లో ప్రొస్థెటిక్ మేకప్ కూడా ఉపయోగించాం. సమ్మర్లో చిత్రీకరించాం. ప్రొస్థెటిక్ మేకప్‌కి నాలుగు గంటలు పట్టేది. ► ఈ సినిమాలో మిమ్మల్ని సావిత్రి పాత్రకు ప్రకటించినప్పుడు కొందరు ‘మిస్ ఫిట్’ అన్నారు. విమర్శలు కూడా వచ్చాయి..? సావిత్రిగారు మహానటి. ఆమె పాత్రకు న్యాయం చేయగలను అనే నమ్మకంతోనే ఒప్పుకున్నారు. అయితే ముందు క్రిటిసిజమ్ వచ్చిందని నాకు తెలియదు. తర్వాత చాలామంది చెప్పారు. అలాగే సినిమా ప్రమోట్ చేస్తున్నప్పుడు తెలిసింది. అప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది. పోస్టర్, టీజర్ వచ్చినప్పుడు అందరికీ నమ్మకం కలిగింది. అందరూ అభినందించారు. మంచి రెస్పాన్స్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ► ‘మహానటి’ సినిమా గుర్తుగా ఏదైనా మీతో దాచుకున్నారా? ఈ సినిమాకు నా మనసులో స్పెషల్ ప్లేస్ ఉంది. ‘మహానటి’ చివరి రోజు చిత్రీకరణలో నేను ధరించిన చీరను గిఫ్ట్‌గా ఇచ్చారు నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్. అదే నా దగ్గరున్న మెమొరీ. పేరు చెడగొట్టకూడదనుకున్నాను – నాగ్ అశ్విన్ ‘మహానటి’ దర్శకుడు నేషనల్ లెవల్లో గుర్తింపు రావడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ‘మహానటి’కి మూడు అవార్డులు వచ్చాయి. నేషనల్ లెవల్లో గట్టి పోటీ ఇచ్చిన కీర్తీ సురేశ్ అవార్డు సాధించడం సంతోషంగా ఉంది. సావిత్రిగారి టైమ్‌లో ఆమెకు నేషనల్ అవార్డు రాలేదు. కానీ అవార్డ్‌కు తగినంత పెర్ఫార్మెన్స్లు చాలా ఇచ్చారు. ఆమె మీద తీసిన సినిమాతో నేషనల్ అవార్డు తీసుకురాగలిగాం. ఇది ఊహించలేదు. కానీ మంచి ప్రశంసలు, అభినందనలు వస్తాయని చాలా మంది చెప్పారు. సినిమా రిలీజ్ అయి కూడా చాలా రోజులైంది. మర్చిపోయాను కూడా. సినిమాలో చాలెంజ్‌లు, కష్టాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమాతో మాకు బాధ్యత ఎక్కువ ఉండేది. సావిత్రి అమ్మ మీద సినిమా తీస్తున్నాం. అవకాశాన్ని వృథా చేసుకోకూడదు అని కష్టపడ్డాం. సావిత్రిగారికి చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్లు మా సినిమా చూస్తే సంతృప్తి చెందాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం. బాక్సాఫీస్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించలేదు. రిలీజ్ అయిన తర్వాత ‘న్యాయం చేశారు, చెడగొట్టలేదు’ అంటే చాలు అనుకున్నాను. ఆమె లైఫ్ అంతా షూటింగ్ గ్యాప్‌లో జరిగిందే కదా. సమస్య అయినా ప్రేమ అయినా షూటింగ్స్ మధ్యలోనే జరిగాయి. సినిమా కూడా అలానే తీశాను. మనకు చాలా కథలున్నాయి. వాళ్లందరి గురించి కూడా సినిమాలు తీయాలి. తీసేవాళ్లు మాత్రం చాలా నిజాయితీగా వెతికి, నిజాయితీగా తీయాలి. నెక్ట్స్ కొత్త కథలు చెప్పాలనుంది. ప్రస్తుతం ఓ కథను రాస్తున్నాను. తొందర తొందరగా సినిమా తీసేయాలని లేదు. ఇప్పుడు చేయబోతున్న సినిమా మాత్రం నా గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది. -
చరిత్ర మరచిపోయిన లీడర్
‘‘జార్జిరెడ్డి ఈ తరానికి తెలియకపోవచ్చు. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి విద్యార్థికి జార్జ్ జీవితం గురించి తెలుసు. అలాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి నేటి తరం తెలుసుకునేలా ‘జార్జిరెడ్డి’ చిత్రం రూపొందించాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్లో ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి తెరకెక్కించిన సినిమా ‘జార్జిరెడ్డి’. సిల్లీ మాంక్స్, త్రీ లైన్స్ సినిమా పతాకాలపై మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘చరిత్ర మరచిపోయిన లీడర్’ అనే విషయాన్ని పోస్టర్లోనే చెప్పారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సమ సమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జిరెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్‌లోనే హత్య చేశారు. ఎందరో విద్యార్థులను కదిలించిన విద్యార్థి నేత జీవితం వెండితెరపై చూపిస్తున్నాం. మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సుధాకర్ యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి, అసోసియేట్ ప్రొడ్యూసర్లు: దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి, నేపథ్య సంగీతం: అర్జిత్ దత్తా. -
దౌడు తీయిస్తా
పురుష ప్రపంచం అని కొన్ని రంగాల్లో ఉంటుంది. ఉదాహరణకు కల్పనా చావ్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టక ముందు వరకూ ‘స్పేస్’ అనేది పురుష ప్రపంచంగా ఉండేది. అలాగే గుర్రపు స్వారీ కూడా. గుర్రాన్ని దౌడు తీయించే శక్తి, సామర్థ్యాలు మగవాళ్లకే ఉంటాయనే భావన ఉండేది. రూపా సింగ్ ఈ ఫీలింగ్‌కి ఫుల్స్టాప్ పెట్టారు. మహిళ తలచుకుంటే ఏ స్పేస్లోకైనా వెళ్లగలదని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే భారత తొలి మహిళా హార్స్ జాకీ రూపాసింగ్ జీవితం వెండితెరకు రానుంది.తాప్సీతో ‘నామ్ షబానా’ చిత్రాన్ని తెరకెక్కించిన శివమ్ నాయర్ ఈ సినిమాకి దర్శకుడు. రూపా జీవితాన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూపించడానికి హక్కులు దక్కించుకున్న శివమ్ ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ రాసే పనిమీద ఉన్నారు. రూపా సింగ్ పాత్రకు తాప్సీయే కరెక్ట్ అనిపించి, స్టోరీ లైన్ చెప్పారట కూడా. హార్స్ రైడింగ్ అనేది పూర్తిగా మగవాళ్ల ఉద్యోగం అనే పరిస్థితుల్లో రూపాసింగ్ ధైర్యంగా ఈ ఉద్యోగంలో దౌడు తీశారు. మగవాళ్లకు దీటుగా కొనసాగడానికి ఆమె చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇక తాప్సీ విషయానికి వస్తే.. ముందు గ్లామరస్ రోల్స్ చేసిన ఆమె తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ, దూసుకెళుతున్నారు. ‘తాప్సీ మంచి నటి కాదు. అందగత్తె కాదు’ అనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పింక్, నామ్ షబానా, బద్లా, గేమ్ ఓవర్ వంటి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేస్తూ, ముందుకెళుతోన్న తాప్సీ హార్స్జాకీ పాత్రకు న్యాయం చేస్తారని చెప్పొచ్చు.