
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రానుంది. భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ నిర్మించనున్న ఈ బయోపిక్‌ను మంగళవారం ప్రకటించారు. భారత క్రికెట్‌లో పదిహేడేళ్ల సుదీర్ఘమైన సక్సెస్‌ఫుల్ కెరీర్, ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం, క్యాన్సర్ మహమ్మారితో పోరాడటం, 2007లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత టీమ్‌లో రాణించడం, ధోనీతో విభేదాలు అనే వార్త, ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమ అనే గాసిప్... ఇలా యువరాజ్ లైఫ్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
ఈ అంశాలను ఈ సినిమాలో ఎంత మేరకు చూపించాలనుకుంటున్నారని తెలియాల్సి ఉంది. అలాగే యువరాజ్ సింగ్‌గా ఎవరు నటించనున్నారు? దర్శకత్వం వహించేది ఎవరు? అనే విషయాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ఫ్యాన్స్ కోసం నా బయోపిక్ తెరకెక్కనున్నందుకు హ్యాపీగా ఉంది. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ వారి కలలను నెరవేర్చుకునేలా నా బయోపిక్ స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు యువరాజ్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment