yuvraj singh
-
భారత జట్టు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మళ్లీ ఎంపికయ్యాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) రెండో ఎడిషన్ కోసం ఇండియా ఛాంపియన్స్ మేనేజ్మెంట్ యువీని కెప్టెన్‌గా నియమించింది. యువీ సారథ్యంలో ఇండియా ఛాంపియన్స్ డబ్ల్యూసీఎల్ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. రెండో ఎడిషన్ డబ్ల్యూసీఎల్ ఈ ఏడాది జులైలో (18 నుంచి) యునైటెడ్ కింగ్డమ్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.డబ్ల్యూసీఎల్ మొదటి సీజన్లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు పాల్గొనగా.. ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. తొలి సీజన్లో భారత్ తరఫున యువీతో పాటు సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ మెరుపులు మెరిపించారు.ఈ సీజన్లో భారత జట్టులో మరో స్టార్ కూడా చేరనున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ సీజన్లో ఇండియా ఛాంపియన్స్‌తో జతకట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేశాడు. డబ్ల్యూసీఎల్లో ఇండియా ఛాంపియన్స్‌కు సుమంత్ బల్, సల్మాన్ అహ్మద్, జస్పాల్ బహ్రా ఓనర్లు వ్యవహరిస్తున్నారు. డబ్ల్యూసీఎల్ టోర్నీలో అంతర్జాతీయ వేదికపై మెరిసిన చాలా మంది స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నీ ప్రైవేటు యాజమాన్యం అండర్లో జరుగుతుంది.కాగా, డబ్ల్యూసీఎల్ రెండో సీజన్లో పాకిస్తాన్‌కు కొత్త సారధి వచ్చాడు. ఈ సీజన్ కోసం పాక్ ఛాంపియన్స్ మేనేజ్మెంట్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ వెటరన్ వికెట్ కీపర్ 2023 నుంచి కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. సర్ఫరాజ్ చేరిక పాకిస్తాన్ ఛాంపియన్స్‌కు బూస్టప్ ఇస్తుంది. గత సీజన్ పాక్‌కు యూనిస్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్, అబ్దుల్ రజాక్, కమ్రాన్ అక్మల్, వాహబ్ రియాజ్, సోహైల్ తన్వీర్, సయీద్ అజ్మల్ లాంటి స్టార్లు ప్రాతినిథ్యం వహించారు.గత సీజన్లో పాల్గొన్న భారత ఛాంపియన్స్ జట్టు..అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, సౌరభ్ తివారి, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, రాబిన్ ఉతప్ప, నమన్ ఓఝా, అనురీత్ సింగ్, ధవల్ కులకర్ణి, హర్భజన్ సింగ్, రాహుల్ శుక్లా, రాహుల్ శర్మ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్ -
వయసు పెరుగుతున్నా అదే టెంపర్.. విండీస్ ఆటగాడితో కయ్యానికి కాలు దువ్విన యువరాజ్ సింగ్
వయసు పెరుగుతున్నా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్‌లో టెంపర్ ఏమాత్రం తగ్గలేదు. ఆటగాడిగా ఉన్న రోజుల్లో ఎలా దూకుడుగా ఉండే వాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్న టోర్నీ) ఫైనల్లో యువీ తన పాత రోజులను గుర్తు చేశాడు. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్‌పై తనదైన పంధాలో విరుచుకుపడ్డాడు. pic.twitter.com/y2iHtEPyCr— Cricket Heroics (@CricHeroics786) March 16, 2025అసలేం జరిగిందంటే.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ ఫైనల్లో భారత మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజేతగా నిలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బౌలింగ్‌లో వినయ్ కుమార్ (3-0-26-3), షాబాజ్ నదీం (4-1-12-2).. ఆతర్వాత బ్యాటింగ్‌లో అంబటి రాయుడు (50 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి భారత్‌ను గెలిపించారు.అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్, భారత స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గొడవ పడ్డారు. విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత మాస్టర్స్ ఛేదిస్తుండగా (14వ ఓవర్ తొలి బంతి తర్వాత).. యువీ టీనో బెస్ట్‌పై తన సహజ శైలిలో వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. బెస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా యువీకి తిరుగు సమాధానం చెప్పాడు. దీంతో గొడవ పెద్దదైంది. ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. అంపైర్ బిల్లీ బౌడెన్, క్రీజ్‌లో ఉన్న అంబటి రాయుడు, విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా సర్ది చెప్పడంతో ఇద్దరూ వెనక్కు తగ్గారు. ఆతర్వాత ఆట సజావుగా సాగి భారత్ విజేతగా నిలిచింది. యువీ-బెస్ట్ గొడవకు ముందు రాయుడు ఆష్లే నర్స్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. అంతకుముందు బెస్ట్ వేసిన ఓవర్లో రాయుడు, యువీ కలిసి 12 పరుగులు పిండుకున్నారు. రాయుడు సిక్సర్ కొట్టిన అనందంలో యువీ బెస్ట్‌ను కవ్వించగా.. అతను కూడా తగ్గేదేలేదంటూ సమాధానం చెప్పాడు. యువీకి ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు. ఆటగాడి ఉన్న రోజుల్లో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో జరిగిన ఫైట్ భారత క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుంటుంది. మొత్తానికి మాస్టర్స్ లీగ్ ఫైనల్లో యువీ చర్యను కొందరు సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. దిగ్గజాల కోసం నిర్వహించిన టోర్నీలో హుందాగా ఉండాల్సింది పోయి, గొడవలు పడటమేంటని చురకలంటిస్తున్నారు. యువీనే తొలుత బెస్ట్‌ను కవ్వించాడని మ్యాచ్‌ను చూసిన వాళ్లు అంటున్నారు. ఏది ఏమైనా సప్పగా సాగుతున్న మాస్టర్స్ లీగ్.. ఫైనల్లో యువీ చర్య వల్ల రక్తి కట్టింది. ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయిన (ఆస్ట్రేలియా చేతిలో) భారత్.. ఫైనల్లో విండీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో భారత్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో అద్భుత విజయాలు సాధించింది. భారత మాస్టర్స్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు పూర్వపు రోజులు గుర్తు చేశారు. లజెండ్స్ లీగ్ పోటీలు చాలా జరుగుతుండటంతో ఈ టోర్నీ ఫెయిల్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే భారత్, విండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజాలు అద్భుత ప్రదర్శనలు చేసి ఈ టోర్నీని సక్సెస్ చేశారు. ఈ టోర్నీలో ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ ఏకంగా మూడు సెంచరీలు చేయడం హైలైట్. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. భారత్ మరో 17 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ స్మిత్ (45), లెండిల్ సిమన్స్ (57) మాత్రమే రాణించగా.. దిగ్గజం లారా (6) నిరాశపరిచాడు. -
హోలీ వేళ క్రికెట్ గాడ్ సచిన్ హంగామా.. వైరల్ వీడియో
హోలీ పండుగ వేళ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ సంబురాలు అంబరాన్నంటాయి. సందర్భం ఏదైనా రిజర్వ్డ్గా కనిపించే సచిన్.. ఈసారి హోలీ ఉత్సవాల్లో చెలరేగిపోయాడు. చిన్నపిల్లాడిలా మారి సహచరులను రంగులతో ముంచెత్తాడు. సచిన్.. సహచర క్రికెటర్లు యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, ఇర్ఫాన్ పఠాన్‌ను రంగులతో ముంచెత్తిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో సచిన్ రంగులతో నింపిన వాటర్ గన్‌తో యువీ, రాయుడు, ఇర్ఫాన్‌లపై దాడి చేశాడు.Sachin Tendulkar, Yuvraj Singh and Yusuf Pathan celebrating Holi. 😂👌 pic.twitter.com/PYEaMoNbHV— Mufaddal Vohra (@mufaddal_vohra) March 14, 2025కాగా, సచిన్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో బిజీగా ఉన్నాడు. యువరాజ్, ఇర్ఫాన్, రాయుడు కూడా ఈ టోర్నీలో భారత మాస్టర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ టోర్నీలో భారత జట్టుకు సచిన్ సారథ్యం వహిస్తున్నాడు. తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరింది. నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను 94 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సచిన్ (42), యువరాజ్ (59), స్టువర్ట్ బిన్నీ (36) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్‌లో చివర్లో పఠాన్ సోదరులు కూడా చెలరేగిపోయారు. ఇర్ఫాన్ 10 బంతుల్లో 23, యూసఫ్ 7 బంతుల్లో 19 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో సచిన్‌కు జతగా ఓపెనర్‌గా వచ్చిన అంబటి రాయుడు 5, పవన్ నేగి 14, గురుకీరత్ సింగ్ 1 పరుగు చేశారు. ఆసీస్ బౌలర్లలో డేనియల్ క్రిస్టియన్, దోహర్తి చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హిల్ఫెన్హాస్, స్టీవ్ ఓకీఫీ, కౌల్టర్ నైల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. భారత బౌలర్ షాబాజ్ నదీమ్ (4-1-15-4) విజృంభించడంతో 18.1 ఓవర్లలో 126 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో షాబాజ్‌తో పాటు వినయ్ కుమార్ (2-0-10-2), ఇర్ఫాన్ పఠాన్ (3.1-0-31-2), స్టువర్ట్ బిన్నీ (3-0-20-1), పవన్ నేగి (3-0-13-1) కూడా రాణించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బెన్ కట్టింగ్ (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. షాన్ మార్ష్ (21), బెన్ డంక్ (21), నాథన్ రియర్డాన్ (21), దోహర్తి (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ టోర్నీలో మూడు సెంచరీలు చేసి భీకర ఫామ్‌లో ఉన్న ఆసీస్ కెప్టెన్ షేన్ వాట్సన్ (5) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. డేనియల్ క్రిస్టియన్ 2, కౌల్టర్ నైల్ 0, హిల్ఫెన్హాస్ 2, ఓకీఫీ 0, మెక్‌గెయిన్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ (మార్చి 14) జరిగే రెండో సెమీఫైనల్లో విజేతతో భారత్ ఫైనల్లో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 16న జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు పాల్గొనగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. -
IND vs AUS: యువీ మెరుపు ఇన్నింగ్స్.. చెలరేగిన షాబాజ్! ఫైనల్లో భారత్
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్-2025 (International Masters League T20) సెమీస్‌లో భారత జట్టు అదరగొట్టింది. ఆస్ట్రేలియా మాస్టర్స్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. రాయ్‌పూర్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ కంగారూలపై ఏకంగా 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్పిన్నర్ షాబాజ్ నదీమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.ఆరు జట్లు ఆటకు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ ఈ ఏడాది మొదలైంది. టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్, సౌతాఫ్రికా మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్ రూపంలో ఆరుజట్లు పాల్గొంటున్నాయి.భారత్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించగా.. ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో గురువారం షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తొలి సెమీ ఫైనల్లో ఇండియా- ఆసీస్ తలపడ్డాయి.సచిన్, యువీ, పఠాన్ సోదరుల మెరుపులుటాస్ గెలిచిన ఆస్ట్రేలియా మాస్టర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 220 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అంబటి రాయుడు(5) విఫలం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 30 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 42 పరుగులు సాధించాడు.మిగతా వాళ్లలో యువరాజ్ సింగ్ 30 బంతుల్లోనే 59 పరుగులతో దుమ్ములేపగా.. స్టువర్ట్ బిన్నీ (Stuart Binny) 21 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. యూసఫ్ పఠాన్ 10 బంతులు ఎదుర్కొని 23 రన్స్ చేయగా.. అతడి సోదరుడు ఇర్ఫాన్ పఠాన్(7 బంతుల్లో 19 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.ఇక ఇండియా మాస్టర్స్ విధించిన 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మాస్టర్స్ 126 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్, ఓపెనర్ షేన్ వాట్సన్(5) పూర్తిగా నిరాశపరచగా.. షాన్ మార్ష్, బెన్ డంక్ చెరో 21 పరుగులు చేశారు. మిగతా వాళ్లలో నాథన్ రీర్డాన్(21), బెన్ కట్టింగ్(39) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.షాబాజ్ నదీమ్‌కు నాలుగు వికెట్లుభారత బౌలర్లలో స్పిన్నర్ షాబాజ్ నదీమ్ ఏకంగా నాలుగు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. కేవలం 15 పరుగులే ఇచ్చాడు. మిగతా వారిలో పేసర్లు వినయ్ కుమార్(2/10), ఇర్ఫాన్ పఠాన్(2/31) రెండేసి వికెట్లు దక్కించుకోగా.. బిన్నీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్ బౌలర్ పవన్ నేగి మూడు ఓవర్ల కోటాలో 13 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు.ఇక ఇండియా మాస్టర్స్ బౌలర్ల విజృంభణ కారణంగా ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 126 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 94 పరుగులతో ఘన విజయం సాధించిన ఇండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక శుక్రవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో శ్రీలంక- వెస్టిండీస్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు ఆదివారం టైటిల్ పోరులో ఇండియా మాస్టర్స్‌ను ఢీకొట్టనుంది. చదవండి: CT 2025: కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు దక్కని చోటు.. కెప్టెన్‌గా అతడు! View this post on Instagram A post shared by INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) -
IND Vs AUS: ఆసీస్‌తో సెమీస్.. యువరాజ్, సచిన్ విధ్వంసం! వీడియో వైరల్
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్‌లో రాయపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు.యువీ కేవలం 30 బంతుల్లో 1 ఫోర్లు 7 సిక్స్‌లతో 59 పరుగులు చేయగా.. సచిన్ 30 బంతుల్లో 7 ఫోర్లతో 42 రన్స్ చేశాడు. వీరిద్దరితో పాటు బిన్నీ(36), యూసుఫ్ పఠాన్(23), ఇర్ఫాన్ పఠాన్(19) దూకుడుగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో దోహర్టీ, క్రిస్టియన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. స్టీవ్ ఓకేఫీ, కౌల్టర్ నైల్ తలా వికెట్ సాధించారు.తుది జట్లుభారత్: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), అంబటి రాయుడు (వికెట్ కీపర్), గురుకీరత్ సింగ్ మాన్, యూసుఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, షాబాజ్ నదీమ్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్ఆస్ట్రేలియా: షాన్ మార్ష్, డేనియల్ క్రిస్టియన్, బెన్ డంక్ (వికెట్ కీపర్), నాథన్ రియర్డన్, బెన్ కటింగ్, షేన్ వాట్సన్ (కెప్టెన్), స్టీవ్ ఓకీఫ్, నాథన్ కౌల్టర్-నైల్, జేవియర్ డోహెర్టీ, బ్రైస్ మెక్‌గెయిన్, బెన్ హిల్ఫెన్హాస్ THE YUVRAJ SINGH SIXES. 😍💥pic.twitter.com/oMVx3FCnpi— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2025 -
All Time India ODI XI: రోహిత్, కోహ్లిలకు చోటు.. కెప్టెన్‌గా ఎవరంటే?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) విజేతగా నిలవడంతో టీమిండియా ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. భారత్ తొలిసారి 1983లో ప్రపంచకప్‌ను ముద్దాడింది. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ సేన ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. పటిష్ట వెస్టిండీస్ జట్టును ఓడించి వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది.ఫలితంగా టీమిండియాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా కపిల్ దేవ్(Kapil Dev).. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును అజరామరం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టుకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా దక్కలేదు. అయితే, మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఆ లోటును తీర్చేశాడు.ధోని ఖాతాలో ముచ్చటగా మూడుఅంతర్జాతీయ క్రికెట్ మండలి 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించాడు. అనంతరం 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గానూ ధోని నిలిచాడు. అంతేనా.. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపి.. అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన భారత కెప్టెన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.రోహిత్ ‘డబుల్’ హ్యాపీఇక తాజాగా రోహిత్ శర్మ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన హిట్‌మ్యాన్.. తాజా ఈ వన్డే టోర్నమెంట్లోనూ జట్టును అజేయంగా ముందుకు నడిపి ట్రోఫీని ముద్దాడాడు. తద్వారా ధోని తర్వాత అత్యధిక సార్లు టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా నిలిచాడు ఈ వన్డే ‘ట్రిపుల్’ డబుల్ సెంచరీల వీరుడు.మరి కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ.. కెప్టెన్లుగా ఈ ఘనతలు సాధించారంటే అందుకు అప్పటి జట్లలో ఉన్న ఆటగాళ్లది కూడా కీలక పాత్ర. 1983లో ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్నాథ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.ఇక 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలు కూడా అద్భుతంగా ఆడారు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తమ వంతు పాత్ర పోషించగా.. తాజా చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ కూడా రాణించారు.బుమ్రాకు దక్కని చోటుఈ నేపథ్యంలో తన ఆల్‌టైమ్ వన్డే తుదిజట్లులో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ వీరందరికి చోటివ్వడం గమనార్హం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత చిన్నపిల్లాడిలా గంతులేసిన ఈ మాజీ సారథి... తాజాగా తన వన్డే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను పంచుకున్నాడు. ఈ జట్టులో క్రికెట్ దేవుడ్, వంద శతకాల వీరుడు సచిన్ టెండుల్కర్‌కు ఓపెనర్‌గా గావస్కర్ చోటిచ్చాడు. అయితే, ఈ జట్టుకు టీమిండియా ప్రధాన పేసర్, ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మాత్రం గావ స్కర్ ఎంపిక చేయలేదు.సునిల్ గావస్కర్ ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్:సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మొహిందర్ అమర్నాథ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, మహ్మద్ షమీ, జహీర్ ఖాన్. భారత్ గెలిచిన ఐసీసీ టైటిళ్లు ఇవే1983- వన్డే వరల్డ్‌కప్2002- చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2007- టీ20 ప్రపంచకప్2011- వన్డే వరల్డ్‌కప్2013- చాంపియన్స్ ట్రోఫీ2024- టీ20 ప్రపంచకప్2025- చాంపియన్స్ ట్రోఫీ.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు -
యువరాజ్, రాయుడు విధ్వంసం..సెమీస్‌కు చేరిన టీమిండియా
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ టీ20-2025 టోర్నీలో ఇండియన్ మాస్టర్స్ టీమ్ మరో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాయ్‌పూర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో సౌరబ్ తివారీ(37 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్‌లతో 60), అంబటి రాయుడు(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో మెరవగా.. ఆఖరిలో కెప్టెన్ యువరాజ్ సింగ్ విధ్వంసం సృష్టించాడు.విండీస్ బౌలర్లను యువీ ఉతికారేశాడు. కేవలం 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసి ఆజేయగా నిలిచాడు. వీరితో పాటు గుర్క్రీత్ సింగ్ మానన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో బెన, కార్టర్, టేలర్ తలా వికెట్ సాధించారు.అనంతరం భారీ లక్ష్య చేధనలో విండీస్ ఆఖరి వరకు పోరాడింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్లు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డ్వైన్ స్మిత్(34 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 79), విలియమ్ పెర్కిన్స్(52) హాఫ్ సెంచరీలు సాధించాడు.లెండల్ సిమిన్స్( 13 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్‌లతో 38) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో వెస్టిండీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ మూడు వికెట్లు పడగొట్టగా.. పవన్ నేగి రెండు, ఇర్ఫాన్ పఠాన్ ఒక్క వికెట్ సాధించారు.చదవండి: Champions Trophy final: 'అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే' -
పాకిస్తాన్ కోచ్‌గా వెళ్లేందుకు నేను సిద్దం: యువరాజ్ తండ్రి
పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా మూడో ఐసీసీ టోర్నమెంట్లోనూ నిరాశపరిచింది. వన్డే ప్రపంచకప్-2023, టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీల్లో గ్రూపు స్టేజిలో ఇంటి ముఖం పట్టిన పాకిస్తాన్.. ఇప్పుడు తమ సొంత గడ్డపై జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే తీరును కనబరిచింది. న్యూజిలాండ్, భారత్ చేతుల్లో వరుస ఓటములను చవిచూసిన పాకిస్తాన్.. లీగ్ స్టేజిలోనే తమ ప్రయాణాన్ని ముగించింది.పాకిస్తాన్‌కు ఎంత మంది కోచ్‌లు మారుతున్నా, ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. రోజురోజుకు పాక్ క్రికెట్ పరిస్థితి మరింత అద్వానంగా తాయారుఅవుతోంది. ఆఖరికి వారి దేశ మాజీ క్రికెటర్లు సైతం పాక్ జట్టుకు అండగ నిలవడం లేదు. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్ వంటి పాక్ దిగ్గజాలు తమ జట్టుపై విరుచుకుపడుతున్నారు. బాబర్ ఆజం ఒక మోస గాడని అక్తర్ విమర్శించగా.. పాక్ క్రికెటర్లకు ఆట కంటే తిండే ఎక్కువ అని అక్రమ్ హేళన చేశాడు.అయితే సొంత దేశ ఆటగాళ్లే సపోర్ట్‌గా నిలవని పాక్ జట్టుకు.. భారత మాజీ క్రికెటర్, లెజెండరీ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. పాక్ జట్టును ఉద్దేశించి ఆ దేశ మాజీ క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యలపై యోగరాజ్ మండిపడ్డాడు. విమర్శలు చేసే బదులుగా ఒక మంచి జట్టును తాయారు చేయవచ్చుగా అంటూ పాక్ మాజీ క్రికెటర్లకు యోగరాజ్ చురకలు అంటించాడు."వసీం అక్రమ్ లాంటి దిగ్గజాలు ఏమి చేస్తున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. క్రికెట్ కామెంట్రీ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. మీ దేశానికి తిరిగి వెళ్లి క్రికెట్ శిబిరాలను నిర్వహించి, మంచి టీమ్‌ను తాయారు చేయవచ్చుగా. మీ జట్టుపై మీరే విమర్శలు చేసుకుంటే ఏమి వస్తుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగుతుంది. మీలో ఎవరు పాకిస్తాన్ ప్రపంచ కప్ గెలవడానికి కృషి చేస్తారో చూడాలనుకుంటున్నాను. లేకుంటే నేనే పాకిస్తాన్‌కు వెళ్లి ఓ మంచి జట్టును తాయారు చేస్తాను" అని యోగరాజ్ పేర్కొన్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా యోగరాజ్ సింగ్ సొంతంగా క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నారు. ఆయన అర్జున్ టెండూల్కర్ వంటి ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. 1980లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యోగరాజ్.. భారత్ తరఫున ఒక టెస్టు, 6 వన్డేలు ఆడాడు.చదవండి: 'ఇంత చెత్తగా ఆడుతారని ఊహించలేదు.. నన్ను క్షమించండి' -
సచిన్, యువీ మెరుపులు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో ఇండియా మాస్టర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఇంగ్లండ్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది.ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మాడీ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టి అంబ్రోస్(23), స్కోఫీల్డ్(18), ట్రిమ్‌లెట్(16) రాణించారు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మెర్గాన్‌తో సహా మిగితా ప్లేయర్లందరూ విఫలమయ్యారు.భారత బౌలర్లలో ధవన్ కులకర్ణి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కులకర్ణి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు అభిమన్యు మిథున్, నేగి తలా రెండు వికెట్లు సాధించారు.గుర్క్రీత్, సచిన్ విధ్వంసం..అనంతరం 133 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.4 ఓవర్లలోనే ఊదిపడేసింది.భారత బ్యాటర్లలో గుర్క్రీత్ సింగ్ మానన్(35 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 63 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే భారత కెప్టెన్ సచిన్ టెండూల్కర్ సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.సచిన్ క్రీజులో ఉన్నంత సేపు తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న లిటిల్ మాస్టర్.. 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అదేవిధంగా ఆఖరిలో వచ్చిన యువరాజ్ సింగ్ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పాడు.యువీ కేవలం 14 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్కోఫీల్డ్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లందరూ చేతులేత్తాశారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 1న సౌతాఫ్రికాతో తలపడనుంది. Inject this shot into my veins and my neurological problems will go away#SachinTendulkar pic.twitter.com/rJayaBoCbN— AT10 (@Loyalsachfan10) February 25, 2025 pic.twitter.com/rUKfoqsq8z— kuchnahi123@12345678 (@kuchnahi1269083) February 25, 2025 -
టెకీలా తయారీ కంపెనీ స్థాపించిన యువరాజ్ సింగ్
భారత మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ అల్ట్రా ప్రీమియం బ్రాండ్ ఫినో టెకీలాను ప్రారంభించారు. దాంతో లగ్జరీ స్పిరిట్స్ మార్కెట్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. 2025 ఏప్రిల్ మధ్య నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.ఫినో టెకీలాఫినో టెకీలా బ్రాండ్ ఉత్పత్తులను మెక్సికోలోని జాలిస్కోలో తయారు చేస్తున్నట్లు చెప్పారు. చికాగోలో బ్రాండ్ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫినో టెకీలా ప్రపంచంలోని అత్యుత్తమ టెకీలాలను ఉత్పత్తి చేస్తుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేశారు. యువరాజ్ సింగ్ కెరీర్ వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘ఫెయిల్యూర్ ఈజ్ నాట్ యాన్ ఆప్షన్’ అనే క్యాప్షన్‌తో బ్రాండ్ ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఖనిజాలు అధికంగా ఉండే మట్టిలోని 100% ‘బ్లూ అగావ్(టెకీలా ముడి పదార్థం)’ నుంచి ఫినో టెకీలా తయారవుతుందని చెప్పారు. ఫినోలోని నాయకత్వ బృందంలో చీఫ్ ప్రొడక్ట్ ఎక్సలెన్స్ ఆఫీసర్‌గా జానా అయ్యర్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్‌గా సోనాలి పటేల్ ఉన్నారు. హెల్త్‌కేర్, వ్యాపార రంగంలో తమ నైపుణ్యాలతో బ్రాండ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తారని కంపెనీ అధికారులు చెప్పారు.ఇదీ చదవండి: భానుడి ప్రతాపం.. జనవరి 2025లో రికార్డు ఉష్ణోగ్రతలుయూఎస్లో బ్రాండ్ ఉత్పత్తులను విజయవంతంగా లాంచ్ చేయడంతోపాటు ఫినో టెకీలా ప్రత్యేక అవుట్ లెట్ల ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రీమియం స్పిరిట్లను కోరుకునే వినియోగదారులకు కంపెనీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారు. అయితే భారత్‌లో ఏప్రిల్ 2025 నాటికి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. కానీ దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
World Cancer Day: క్యాన్సర్‌ను జయించిన క్రికెట్ యోధులు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) (ఫిబ్రవరి 4) నాడు ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడి గెలిచిన ఐదురుగు స్టార్ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. క్రికెటర్లకు సంబంధించి క్యాన్సర్ (Cancer) పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు యువరాజ్ సింగ్(Yuvraj SIngh). ఈ టీమిండియా మాజీ క్రికెటర్ 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో క్యాన్సర్‌తో బాధ పడ్డాడు.ఆ సమయంలో యువరాజ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో బరిలోకి దిగి భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. ఆ టోర్నీలో యువీ 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు.ప్రపంచ కప్ గెలిచిన వెంటనే యువరాజ్‌కు ఊపిరితిత్తులలో అరుదైన జెర్మ్ సెల్ కణితి (క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతను అమెరికాలో కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆ సమయంలో యువీ నెలల తరబడి తీవ్రమైన నొప్పి మరియు మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నాడు. 2012లో అతను క్యాన్సర్‌ను జయించి యోధుడిలా తిరిగి భారత జట్టులో చేరాడు. యువీ ప్రయాణం క్రికెట్ యొక్క గొప్ప పునరాగమన కథలలో ఒకటిగా మిగిలిపోయింది.మైఖేల్ క్లార్క్: 43 ఏళ్ల ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ చర్మ క్యాన్సర్‌పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా గొప్ప కెప్టెన్లలో ఒకరైన క్లార్క్‌కు 2006లో క్యాన్సర్ బయటపడింది. వైద్యులు అతని ముఖం, ఛాతీ, నుదిటిపై క్యాన్సర్ మచ్చలను గుర్తించారు. వీటిని తొలగించేందుకు క్లార్క్ అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. క్లార్క్ కెరీర్ ఆరంభంలోనే క్యాన్సర్‌పై విజయం సాధించి విజయవంతంగా తన కెరీర్‌ను కొనసాగించాడు. క్లార్క్ ఆసీస్ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడి 17000 పైచిలుకు పరుగులు చేశాడు.మార్టిన్ క్రో: ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ యుక్త వయసులో ఉండగానే క్యాన్సర్‌తో పోరాడాడు. అతనికి లింఫోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. క్యాన్సర్ నుంచి బయట్ట పడ్డాక క్రో తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చాడు. అయితే అతనికి రెండోసారి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు కూడా అతను ప్రాణాంతక వ్యాధితో పోరాడే ప్రయత్నం చేశాడు. అయితే 2016లో అతను విషాదకర రీతిలో మరణించాడు. మార్టిన్ క్రోకు క్లాసికల్ బ్యాటర్‌గా గుర్తింపు ఉంది. క్రో 1982-95 మధ్యలో న్యూజిలాండ్ తరఫున 77 టెస్ట్‌లు, 143 వన్డేలు ఆడి 10000 పైచిలుకు పరుగులు చేశాడు.గ్రేమ్ పొల్లాక్: ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్‌కు ఆ దేశ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాటర్‌గా పేరుంది. గ్రేమ్ పొల్లాక్ 1963-70 మధ్యలో ప్రపంచంలోనే మేటి బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున 23 టెస్ట్‌లు ఆడిన పొల్లాక్ 7 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 2256 పరుగులు చేశాడు. 2013లో పొల్లాక్కు కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ సమయంలో అతను క్యాన్సర్‌తో పోరాడి గెలిచాడు. ప్రస్తుతం పొల్లాక్ 80 ఏళ్ల వయసులో జీవనం కొనసాగిస్తున్నాడు.జెఫ్రీ బాయ్‌కాట్: ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనర్.. 1990, 2000 దశకాల్లో ప్రముఖ వ్యాఖ్యాత అయిన జెఫ్రీ బాయ్‌కాట్ గొంతు క్యాన్సర్‌పై విజయం సాధించాడు. అతను 35 కఠినమైన రేడియోథెరపీ సెషన్లు చేయించుకున్నాడు. రేడియోథెరపీ సమయంలో బాయ్‌కాట్ తీవ్రమైన నొప్పిని ఎదుర్కొన్నాడు. క్యాన్సర్‌ను జయించాక బాయ్‌కాట్ తిరిగి వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. ప్రస్తుతం బాయ్‌కాట్ వయసు 84 ఏళ్లు. -
ఎప్పటినుంచో కలలు కంటున్నా.. గర్వంగా ఉంది అభిషేక్: యువీ
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీమిండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగిన అభిషేక్.. అనంతరం బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో సత్తాచాటాడు.అభిషేక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. వాంఖడే స్టేడియంలో సిక్సర్ల వర్షం కుర్పించాడు. అతడి ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే తన రెండో టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా అభి నిలిచాడు. ఓవరాల్‌గా 54 బంతులు ఎదుర్కొన్న శర్మ.. 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135 పరుగులు చేశాడు. తద్వారా టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మపై తన మెంటార్, భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్(Yuvraj Singh) ప్రశంసల వర్షం కుర్పించాడు. "బాగా ఆడావు అభిషేక్ శర్మ! నిన్ను ఈ స్ధాయిలో చూడాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాను! ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉందంటూ" యువీ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.యువీ మెంటార్‌గా..కాగా అభిషేక్ శర్మ కెరీర్ ఎదుగుదలలో యువరాజ్‌ది కీలక పాత్ర. అతడి గైడెన్స్‌లోనే అభిషేక్ ఇంతలా రాటు దేలాడు. ఈ పంజాబీ బ్యాటర్‌కు యువీ దగ్గరుండి మరి మెళకువలు నేర్పాడు. కొవిడ్-19 సమయంలో యువరాజ్.. అభిషేక్‌తో ఇతర పంజాబ్ యువ క్రికెటర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్‌లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. అప్పటి నుంచి యువీతో అభిషేక్ నిరంతరం టచ్‌లో ఉంటున్నాడు. అభిషేక్ తన నెట్ ప్రాక్టీస్ వీడియోలను ఎప్పటికప్పుడు యువీకి షేర్ చేస్తూ ఉంటాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో ఏదైనా సమస్య ఉంటే గుర్తించి యువరాజ్ వెంటనే సరిదిద్దుకునేలా సలహాలు ఇస్తాడు. ఈ విషయాన్ని అభిషేక్ చాలా సందర్బాల్లో స్వయంగా వెల్లడించాడు.అయితే, బాగా ఆడినప్పుడు ప్రశంసించడమే కాదు.. అనవసర తప్పిదాలు చేసినపుడు కాస్త ఘాటుగానే యువీ విమర్శస్తుంటాడు. కాగా 'ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్' అభిషేక్ శర్మ తన మెరుపు సెంచరీపై మ్యాచ్ అనంతరం స్పందించాడు. తన ఇన్నింగ్స్‌తో మెంటార్ యువరాజ్ సింగ్ సంతోషించంటాడని అభి చెప్పుకొచ్చాడు.వారిద్దిరి కోరిక ఇదే: అభిషేక్"ఈ సెంచరీ నాకు చాలా ప్రత్యేకమైనది. దేశం కోసం ఈ తరహా ప్రదర్శన చేయడం ఎప్పుడు గొప్ప అనుభూతిని ఇస్తుంది. నాదైనా రోజున తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. మా కోచ్, కెప్టెన్ నాకు తొలి రోజు నుంచే ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. వారు ఎప్పుడూ నా నుంచి ఇటువంటి ప్రదర్శనే ఆశిస్తుంటారు. ప్రత్యర్థి బౌలర్లు 140-150కి.మీ కన్నా వేగంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు, వాటిని ఆడేందుకు వాళ్ల కన్నా ఒక్క సెకెన్ ముందే సిద్ధంగా ఉండాలి. బంతిని సరిగ్గా అంచనా వేసి షాట్లు ఆడాను. వరల్డ్‌క్లాస్ బౌలర్ అర్చర్ బౌలింగ్‌లో కవర్స్ మీదగా కొట్టిన షాట్ నాకెంతో ప్రత్యేకం. అలాగే రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టడం కూడా బాగుంది. రషీద్ బౌలింగ్‌లో కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్.. యువీ పాజీ నుంచి నేర్చుకున్నాను.కాబట్టి యువీ ఈ రోజు సంతోషంగా ఉంటాడనుకుంటున్నా. అతను ఎప్పుడూ నేను 15 నుంచి 20 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాలని కోరుకునేవాడు. ఈ రోజు యువీ పాజీ కోరిక నేరవేర్చాను. గౌతీ భాయ్ కూడా ఇదే కోరుకునేవాడు. ఈ మ్యాచ్‌లో దానిని అమలు చేసి చూపించా అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో అభిషేక్ పేర్కొన్నాడు.చదవండి: వరల్డ్ రికార్డు.. వికెట్ కోల్పోకుండానే 376 కొట్టేశారు Abhishek Sharma all the shots from his spectacular innings! 🔥 pic.twitter.com/VflLAHiTRA— Keh Ke Peheno (@coolfunnytshirt) February 3, 2025 -
చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్(Teamindia) ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) అద్భుతమైన నాక్ ఆడాడు. 133 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను శర్మ ఊచకోత కోశాడు. అతడిని ఆపడం ఇంగ్లండ్ బౌలర్ల తరం కాలేదు.ఈ క్రమంలో అభిషేక్ కేవలం 20 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 34 బంతుల్లు ఎదుర్కొన్న ఈ పంజాబీ బ్యాటర్ 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..👉భారత గడ్డపై టీ20 మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్ (70+ పరుగులు) ఆడిన ప్లేయర్‌గా అభిషేక్ రికార్డు సృష్టించాడు. ఇంతకముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది. 2022లో గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మిల్లర్ 225.53 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 106 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో 232.35 స్ట్రైక్ రేట్‌తో 79 పరుగులు చేసిన అభిషేక్.. మిల్లర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉రన్-ఛేజ్ సమయంలో టీ20 మ్యాచ్‌లో అత్యంత వేగంగా(70+ రన్స్) పరుగులు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కూడా యువరాజ్ పేరిట ఉండేది. 2013లో ఆస్ట్రేలియాపై యువరాజ్ సింగ్ 35 బంతుల్లో 77 పరుగులు (220.00 స్ట్రైక్ రేట్) చేయగా.. తాజా మ్యాచ్‌లో అభిషేక్ 34 బంతుల్లో 79 (232.35 స్ట్రైక్ రేట్) పరుగులు చేశాడు. దీంతో యువీ ఆల్‌టైమ్ రికార్డు బద్దులు అయింది.👉ఇంగ్లండ్ జట్టుపై టీ20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత్ బ్యాటర్ గా అభిషేక్ రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువీ 7 సిక్సర్ల బాదాడు. తాజా మ్యాచ్‌తో తన మెంటార్ యువరాజ్ ఆల్‌టైమ్ రికార్డును శర్మ బ్రేక్ చేశాడు. కాగా యువీ గైడెన్స్‌లోనే అభిషేక్ మరింత రాటుదేలాడు.👉టీ20ల్లో ఇంగ్లండ్‌పై భారత తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ రికార్డును శర్మ బ్రేక్ చేశాడు. 2018లో మాంచెస్టర్‌లో జరిగిన టీ20లో ఇంగ్లండ్‌పై రాహుల్ 27 బంతుల్లోనే అర్ధ శతకం సాధించగా.. తాజా మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో యువరాజ్ సింగ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువీ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో మెరిశాడు.ఊది పడేసిన భారత్..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్(26), తిలక్ వర్మ(19 నాటౌట్) దూకుడుగా ఆడారు.చదవండి: ENG vs IND: ఆరంభం అదిరింది.. తొలి టీ20లో ఇంగ్లండ్ చిత్తు -
సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే!
సంజూ శాంసన్(Sanju Samson)కు తాను పెద్ద అభిమానినైపోయానని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) అన్నాడు. గతంలో బ్యాటింగ్ బాగా చేసినా.. పరుగులు రాబట్టలేక ఇబ్బంది పడేవాడని.. ఇప్పుడు మాత్రం దుమ్ములేపుతున్నాడని ప్రశంసించాడు. సంజూ ఆట తీరుకు తాను ఫిదా అయ్యానంటూ కితాబులిచ్చాడు. రానున్న కాలంలో ఈ కేరళ బ్యాటర్ అద్భుతాలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అద్భుత నైపుణ్యాలున్నా.. నిలకడలేమి ఆట తీరుకు మారుపేరని అపవాదు ఉంది. అయితే, ఇటీవల అంతర్జాతీయ టీ20లలో అతడి ఆట తీరు అభిమానులతో పాటు విమర్శకులనూ మెప్పించింది. తొలుత స్వదేశంలో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డ సంజూ.. సౌతాఫ్రికా గడ్డ మీద కూడా రెండు సెంచరీలతో రాణించాడు.బంగ్లాదేశ్‌పై 47 బంతుల్లోనే 111 పరుగులు సాధించిన సంజూ శాంసన్.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో 107, 109 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై ఇంగ్లండ్(India Vs England)తో టీ20 సిరీస్ ఆడనున్న భారత జట్టులో అతడికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. సంజూ అలాంటి వాడేఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్టార్ స్పోర్ట్స్ షో లో మాట్లాడుతూ.. ‘‘ఆత్మవిశ్వాసం.. పరిణతితో కూడిన బ్యాటింగ్.. వికెట్‌కు విలువ ఇచ్చే విధానం.. సంజూలోని ఈ గుణాలు నన్ను ఆకట్టుకున్నాయి. అతడు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేడని, నిలకడలేని ఆటగాడని విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు. కొంతమంది ఆలస్యంగా పేరు తెచ్చుకుంటారు. సంజూ అలాంటి వాడే. నేనిప్పుడు అతడికి వీరాభిమానిని. గతంలో అతడు బ్యాటింగ్ మాత్రమే బాగా చేస్తాడు.. పరుగులు చేయడని అంతా అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు రెండూ బాగానే చేస్తున్నాడు’’ అని ప్రశంసలు కురిపించాడు.ఇక ఇదే షోలో మరో మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సైతం సంజూ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలో బాగా ఆడితే.. బ్యాటర్‌పై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా అతడు మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతాడు.సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే!టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడం అతడికి సానుకూలాంశం. వికెట్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని ఉండదు. అంతేకాదు.. సంజూ సిక్స్ హిట్టర్. ఎంతో ఈజ్‌తో సిక్సర్లు బాదుతాడు. యువరాజ్ సింగ్ తర్వాత.. అదే స్టైల్లో సిక్స్‌లు కొట్టగల మరో బ్యాటర్ సంజూ శాంసనే. అతడు పరుగుల వరద పారిస్తుంటే చూడటానికి చక్కగా ఉంటుంది’’ అని సంజయ్ బంగర్ కొనియాడాడు.కాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ ద్వారా 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంజూ శాంసన్.. ఆ తర్వాత ఆరేళ్లకు వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 37 టీ20లు, 16 వన్డేలు ఆడాడు. వన్డేల్లో ఓ శతకం సాయంతో 510 పరుగులు చేయగా.. టీ20లలో మూడు సెంచరీల సహాయంతో 810 రన్స్ సాధించాడు. ఇదిలా ఉంటే.. జనవరి 22 నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ మొదలుపెట్టనుంది.చదవండి: IND Vs IRE 1st ODI: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌గా.. -
'కోహ్లి వల్లే యువీ రిటైర్మెంట్'.. ఉతప్ప సంచలన వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట కోహ్లి(Virat Kohli)పై మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తన అంతర్జాతీయ కెరీర్‌ను ముందుగానే ముగించడానికి విరాట్ కోహ్లినే కారణమని ఉతప్ప ఆరోపించాడు.అదేవిధంగా యువరాజ్ క్యాన్సర్‌తో పోరాడి తిరిగి ఎలా కమ్‌బ్యాక్ ఇచ్చాడో ఓ ఇంటర్వ్యూలో రాబిన్ వివరించాడు. కానీ రీ ఎంట్రీలో యువీకి అప్పటి కెప్టెన్‌గా ఉన్న కోహ్లి నుంచి ఎటువంటి సపోర్ట్ లభించలేదని ఈ కర్ణాటక మాజీ క్రికెటర్ వెల్లడించాడు."యువరాజ్ భాయ్ జర్నీ ఎంతో మంది యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకం. అతడు ఏకంగా క్యాన్సర్‌ను జయించి, తిరిగి అంతర్జాతీయ క్రికెట్ వైపు రావడానికి ప్రయత్నించాడు. భారత్‌కు ఒంటి చేత్తో వరల్డ్‌కప్ అందించిన వ్యక్తి. అంతేకాకుండా తన కెరీర్లో రెండు ప్రపంచకప్‌లను సొంతం చేసుకున్నాడు. అటువంటి ఆటగాడికి మనం చాలా గౌరవం ఇవ్వాలి. కానీ విరాట్ కోహ్లి నుంచి మాత్రం అతడికి ఎటువంటి మద్దతు లభించలేదు.కెప్టెన్ అయ్యాక కోహ్లి మారిపోయాడు. యువీ ఎలాంటి గడ్డు పరిస్థితుల నుంచి కోలుకున్నాడో దగ్గరుండి చూసిన వ్యక్తులలో కోహ్లి ఒకడు. అలాంటిది ఫిట్నెస్ లేదని యువీని పక్కన పెట్టడం సరికాదు. నాకు ఈ విషయాలు ఎవరూ చెప్పలేదు. నేను అన్ని విషయాలను గమనించాను. కెప్టెన్‌గా ఫిట్నెస్ లెవల్స్‌ను పరిగణలోకి తీసుకోవడాన్ని నేను తప్పుబట్టడం లేదు.కానీ ప్రతీ రూల్‌కు కొన్ని మినహాయింపులు ఉంటాయి. తను సాధించిన విజయాలకు కాదు, క్యాన్సర్‌ను ఓడించినందుకైనా యువీని జట్టులో కొనసాగించాల్సింది. ఆ సమయంలో అతడు నిజంగా కష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా యువీ ఫిట్నెస్ టెస్టులో రెండు పాయింట్లు తనకు తగ్గించమని కూడా అభ్యర్ధించాడు. అందుకు కూడా జట్టు మేనెజ్మెంట్ సానుకూలంగా స్పందించలేదు. దీంతో అతడు ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యాడు. ఫిట్నెస్ పరీక్షలో విఫలమకావడంతో జట్టులోకి తీసుకోలేదు. ఆ తర్వాత ఏదో విధంగా ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేసి జట్టులోకి వచ్చాడు. కానీ పేలవ ఫామ్‌ను కలిగి ఉన్నాడని పూర్తిగా పక్కన పెట్టేశారు. కనీసం ఆ తర్వాత అయినా అతడికి ఛాన్స్ ఇవ్వలేదు. విరాట్ కోహ్లి సైతం యువీని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నించలేదు. దీంతో అతడు తన కెరీర్‌ను ముగించాడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా 2000లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువరాజ్.. తన కెరీర్లో మొత్తంగా 402 మ్యాచ్‌లు ఆడాడు. 402 మ్యాచ్‌ల్లో ఈ పంజాబ్ ఆటగాడు 11,778 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. 2007, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ సొంతం చేసుకోవడంలో యువీది కీలక పాత్ర.చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్ -
Ind vs Pak: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త!.. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship Of Legends T20 League) రెండో సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ షెడ్యూల్‌ను నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు. కాగా భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ తదితర ఆరు జట్లు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(WCL)లో భాగమవుతున్న విషయం తెలిసిందే.యువీ కె ప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లో ఆయా దేశాలకు ప్రాతినిథ్యం వహించిన టాప్ క్రికెటర్లు ఈ టీ20 లీగ్‌తో మరోసారి వినోదాన్ని పంచుతున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రవేశపెట్టిన WCLలో ఇండియా చాంపియన్స్ జట్టు ఫైనల్లో.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చాంపియన్స్ టీమ్‌పై గెలుపొందింది. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో.. దాయాదిని ఐదు వికెట్ల తేడాతో ఓడించి WCLలో మొట్టమొదటి చాంపియన్‌గా నిలిచింది.పాక్‌ను ఓడించి టైటిల్ కైవసంపాక్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక వచ్చే ఏడాది లీగ్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మధ్య జూలై 20న తొలి మ్యాచ్ జరుగనుంది. కాగా ఇంగ్లండ్ వేదికగా WCL టోర్నీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 షెడ్యూల్👉జూలై 18- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 19- వెస్టిండీస్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 19- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 20- ఇండియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 22- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 22- ఇండియా చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 23- ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 24- సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్👉జూలై 25- పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 26- ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 27- సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 27- ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్👉జూలై 29- ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 29- ఇండియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 31- సెమీ ఫైనల్ 1(ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హాం)👉జూలై 31- సెమీ ఫైనల్ 2(ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హాం)👉ఆగష్టు 2- ఫైనల్(ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హాం).చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!? -
దేశం కోసం క్యాన్సర్‌ను లెక్కచేయని యోధుడు.. హ్యాపీ బర్త్‌డే యువీ (ఫోటోలు)
-
ఎనిమిదేళ్ల ప్రేమ, సంతోషాలు, జ్ఞాపకాలు.. హ్యాపీ యానివర్సరీ బేబీ: యువీ (ఫొటోలు)
-
యువరాజా ఇదేం అవేర్నెస్ క్యాంపెయిన్..? ఏంటీ తీరు..?
‘సున్నితమైన విషయాలలో ఎలా స్పందించాలో, ఆరోగ్య సమస్యలపై ఎలా అవగాహన కలిగించాలో కొందరికి కనీస స్పృహ లేకుండా పోతోంది. ఒక దేశం బ్రెస్ట్ కేన్సర్‌పై ప్రజలలో అవగాహన ఎలా పెంచుతుంది?! రొమ్ము కేన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్లలో ‘మీ ఆరెంజ్‌లను చెక్ చేసుకోండి’ అంటూ తెలియజేసే ప్రకటన పోస్టర్‌ను ఢిల్లీ మెట్రోలో చూశాను. నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూశాను. ఈ ప్రచారాలు ఎవరు చేస్తారు, వీటిని ఎవరు ఆమోదిస్తారు? ఈ పోస్టర్‌ను పబ్లిక్‌లోకి తీసుకు రాగలిగేటంత మూర్ఖులు మనల్ని పరిపాలిస్తున్నారా?!’ అంటూ ఒక మహిళ తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా దుయ్యబట్టారు. కేన్సర్ సర్వైవర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్వచ్ఛంద సంస్థ ‘యువికాన్’ ఈ ప్రచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.దీని వెనుక ఉద్దేశం రొమ్ము కేన్సర్ పట్ల సామాన్యులలో అవగాహన కల్పించడమే. కానీ, ఇలాంటి ప్రచారాలు కొన్నిసార్లు అసౌకర్యంగానూ, పనికిమాలినవిగానూ కనిపిస్తాయి. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ యూజర్లు కామెంట్ల రూపంలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ‘ఇది క్రికెటర్ యువరాజ్‌సింగ్ క్యాంపెయిన్ అని తెలుసుకున్నాను. వీరి ఉద్దేశ్యం సరైనదే కావచ్చు. కానీ, ఇది నిజంగా అసహ్యకరమైనది. ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలనుకుంటున్నాను’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘భారతదేశంలో బ్రెస్ట్ కేన్సర్ పట్ల ఒక శాతం మందికి కూడా సరైన అవగాహన లేదు. తలాతోకా లేని ఇలాంటి ప్రకటన ద్వారా ప్రజలకు విషయం ఎలా చేరుతుంది అనుకుంటున్నారు? స్త్రీలను కించపరిచేలా ఉన్న ఈ ప్రకటన సరైనది కాదు’ అని ఇంకొకరు, ‘సమస్యను ఎంత బాగా అర్థమయ్యేలా తెలియజేయాలో ఆ ఫౌండేషన్ వాళ్లకే అర్థం కాలేదు’ అని మరొకరు ‘ప్రకటనదారులు సున్నితమైన విషయాలను పట్టించుకోరు, ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తారు’ అని ఒకరు ‘ఇది గ్రామీణ జనాభా కోసం కాదు. కేవలం ఇంగ్లిషు మాట్లాడే మహిళల కోసమే’ అంటూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. (చదవండి: చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా చదవకుండా ఉండలేను..? ) -
Ind vs Ban మెదడు సరిగ్గా వాడితేనే: యువీ ఘాటు విమర్శలు
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి ‘చురకలు’ అంటించాడు. బ్యాటింగ్ చేసేటపుడు మెదడును కాస్త అదుపులో పెట్టుకుంటేనే రాణించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయమేమిటంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ద్వితీయ శ్రేణి జట్టులో అభిషేక్ తొలిసారి చోటు దక్కించుకున్నాడు.మరోసారి టీమిండియా సెలక్టర్ల పిలుపుఈ క్రమంలో ఆతిథ్య జట్టుతో జరిగిన టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ పంజాబీ బ్యాటర్.. డకౌట్ అయ్యాడు. అయితే, మరుసటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి తనను తాను నిరూపించుకున్నాడు. ఈ సిరీస్ ముగిసిన దాదాపు రెండు నెలల తర్వాత అభిషేక్ శర్మ మరోసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.రనౌట్‌గా వెనుదిరిగిస్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌తో కలిసి అభిషేక్ శర్మ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, దూకుడుగా ఆడుతున్న క్రమంలో అనూహ్య రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు.టీమిండియా ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ వేసిన టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి సంజూ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడాడు. ఈ క్రమంలో సింగిల్‌కు ఆస్కారం ఉందని భావించిన సంజూ, అభిషేక్ పరుగుకు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే ప్రమాదాన్ని గ్రహించిన సంజూ.. అభిషేక్‌ను వెనక్కి వెళ్లమని సూచించాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.బంతిని అందుకున్న బంగ్లాదేశ్ ఫీల్డర్ తౌహీద్ హృదోయ్..నేరుగా స్టంప్స్ వైపునకు విసిరాడు. దీంతో.. నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ముందుకు వెళ్లిపోయిన అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16 పరుగులు) పెవిలియన్‌కు చేరకతప్పలేదు. అయితే, మిగతా బ్యాటర్లు రాణించడంతో మ్యాచ్ ఫలితంపై ప్రతికూల ప్రభావం పడలేదు. సంజూ శాంసన్(29), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(29), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో టీమిండియా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ప్రతీ పరుగు, ప్రతీ బంతి.. జట్టు కోసమే! ఈ నేపథ్యంలో విజయానంతరం అభిషేక్ శర్మ ఇన్‌స్టాలో టీమిండియా ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ప్రతీ పరుగు, ప్రతీ బంతి.. జట్టు కోసమే! సిరీస్‌లో మాకు శుభారంభం’’ అని క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు బదులుగా ఓ నెటిజన్.. అభిషేక్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. అయితే, ఆ కామెంట్‌కు యువీ.. ‘‘కేవలం మెదడు ఉపయోగిస్తే మాత్రమే అది సాధ్యం’’ అన్న అర్థంలో జవాబు ఇచ్చాడు.కాగా అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఎదుగుదలలో యువీది కీలక పాత్ర. ఈ విషయాన్ని అభిషేక్ చాలా సందర్బాల్లో స్వయంగా వెల్లడించాడు. అయితే, బాగా ఆడినపుడు ప్రశంసించడమే కాదు.. అనవసర తప్పిదాలు చేసినపుడు కాస్త ఘాటుగానే విమర్శించడం యువీకి అలవాటు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదారాబాద్ తరఫున అభి వీరబాదుడు బాది.. నిర్లక్ష్యపు షాట్‌కు అవుటైనపుడు.. ‘నీ కోసం స్లిప్పర్ ఎదురు చూస్తోంది’ అంటూ యువీ చొరవగా ట్వీట్ చేశాడు. చదవండి: Pak vs Eng: ‘హైవే రోడ్డు మీద కూడా బ్యాటింగ్ చేయలేవు’ -
అప్పట్లో ఆమెతో డేటింగ్.. ఆరోజు తన కారణంగా: యువీ
అద్బుత ప్రదర్శనలతో భారత్‌కు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఘనత అతడది. అంతర్జాతీయ టీ20ల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన తొలి క్రికెటర్ అతడు. 17 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలు అందించిన ధీరుడు. క్యాన్సర్‌తో పోరాడి మరి గెలిచిన యోదుడు. జట్టు కష్టాల్లో ఉందంటే అందరికి గుర్తు వచ్చే సేవియర్. అటు బ్యాట్‌తోనూ ఇటు బంతితోనూ మాయ చేసే మేజిషేయన్. ఇప్పటకే మీకు ఆర్ధమై పోయింటుంది ఇదింతా ఎవరి కోసమో. అవును మీరు అనుకుంటుంది నిజమే. అతడే టీమిండియా దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్.సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను బయట ఎక్కువగా మాట్లాడని యువీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. గతంలో ఓ సినీ నటితో డేటింగ్ చేసినట్లు యువీ చెప్పుకొచ్చాడు. 2007-08లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆసీస్‌కు వెళ్లగా తనకు ఎదురైన అనుభవాలను ఈ పంజాబీ దిగ్గజం గుర్తుచేసుకున్నాడు."2007-08లో టెస్టు సిరీస్ కోసం ఆసీస్ పర్యటనకు వెళ్లాం. ఆ సమయంలో నేను ఒక నటితో డేటింగ్లో ఉన్నాను. నేను ఆమె పేరు చెప్పాలనుకోవడం లేదు. ఆ సమయంలో ఆమె టాప్ హీరోయిన్లో ఒకరిగా ఉంది. ఆమె కూడా షూటింగ్ పనిమీద అడిలైడ్‌కు వచ్చింది. మేము అప్పడు కాన్బెర్రాలో ఉన్నాం. కానీ నేను ఆమెతో ఫోన్లో ఒక మాట చెప్పాను. ఆసీస్ టూర్లో ఉన్నందున ఆటపై దృష్టి పెట్టాలనకుంటున్నాను, మనం ఎక్కువగా కలవద్దని ఆమెతో అన్నాను.కానీ ఆమె మాత్రం నా మాట వినకుండా కాన్‌బెర్రాకు వచ్చేసింది. నేను అప్పటికే తొలి రెండు టెస్టుల్లో పెద్దగా రాణించలేకపోయాను. కాబట్టి మూడో మ్యాచ్‌లో ఎలాగైనా మెరుగ్గా రాణించాలన్న పట్టుదలతో ఉన్నాను. ఆ సమయంలో ఆమెను కాన్బెర్రాలో చూసి ఆశ్చర్యపోయాను. ఇక్కడ ఏమి చేస్తున్నావు అని ప్రశ్నించాను. నేను మీతో సమయం గడపాలనుకుంటున్నాను ఆమె చెప్పింది. ఆ రోజు రాత్రి ఆమెను నేను కలిశాను. ఆమెతో చాలా విషయాలు మాట్లాడాను. నీవు నీ కెరీర్‌పై దృష్టి పెట్టు, నా కెరీర్‌పై కూడా నేను ఫోకస్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే నేను ఆసీస్ పర్యటనలో ఉన్నాను. మాకు ఆ సిరీస్ చాలా ముఖ్యం. ఆ తర్వాత కాన్బెర్రా నుండి అడిలైడ్‌కి బయలు దేరుతున్నాము. ఆమె నా సూట్‌కేస్‌ను ప్యాక్ చేసింది. పొద్దున్న లేచే సరికి నా బూట్లు కన్పించలేదు. వెంటనే ఆమెను నా షూ ఎక్కడ ఉన్నాయి? అని అడిగాను, వాటిని కూడా ప్యాక్ చేసేశాను ఆమె చెప్పింది. మరి నేను బస్సులో ఎలా వెళ్లాలి అని ఆమెను ప్రశ్నించాను. నా స్లిప్పర్స్ ధరించండి అని ఆమె సలహా ఇచ్చింది. ఆమె మాటలు విన్న నేను ఓమైగాడ్ అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె దగ్గర ఉన్న పింక్ స్లిప్పర్లు వేసుకుని బస్సు దగ్గరకు వెళ్లాను.నా లగేజీ బ్యాగ్‌ను అడ్డుపెట్టుకుని కనిపించకుండా బస్ ఎక్కాను. కానీ సహచరుల్లో కొందరు చూసేశారు. నన్ను చప్పట్లు కొడుతూ ఆట పట్టించారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో వేరే చెప్పులను కొనుకున్నాను. మా హోటల్ నుంచి విమానాశ్రయానికి పింక్ స్లిప్పర్స్‌ను ధరించవలిసి వచ్చింది" అని క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్లో యువీ పేర్కొన్నాడు. -
మిడిలార్డర్లో కపిల్ దేవ్.. గంభీర్, దాదాకు దక్కని చోటు
భారత క్రికెట్లో పాతతరం నుంచి నేటివరకు తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా.. చెప్పుకొంటూ పోతే జాబితా పెరుగుతూనే ఉంటుంది.పీయూశ్ చావ్లా ఏమన్నాడంటేఇంతమంది ఆటగాళ్లలో అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలంటే కష్టమే మరి! అయితే, భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా మాత్రం తనకు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 2006 నుంచి 2012 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. కెరీర్లో మొత్తంగా 6 టెస్టుల్లో 7, 25 వన్డేల్లో 32, ఏడు టీ20లలో 4 వికెట్లు పడగొట్టాడు.స్వల్ప కాలమే టీమిండియాకు ఆడినా పీయూశ్ చావ్లా ఖాతాలో రెండు ప్రపంచకప్ ట్రోఫీలు ఉండటం విశేషం. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో పీయూశ్ సభ్యుడు. గత పన్నెండేళ్లుగా ఐపీఎల్‌కే పరిమితమైన ఈ వెటరన్ స్పిన్నర్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. కెప్టెన్‌గా ధోని.. నాలుగోస్థానంలో కోహ్లిఈ క్రమంలో శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీయూశ్ తన ఆల్‌టైమ్ ఇండియా వన్డే ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించాడు. తన జట్టుకు ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్న పీయూశ్.. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మలకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వీరేంద్ర సెహ్వాగ్‌కు మూడు, విరాట్ కోహ్లికి నాలుగో స్థానం ఇచ్చాడు. మిడిలార్డర్లో ఆల్‌రౌండర్లు యువరాజ్ సింగ్, కపిల్ దేవ్లను ఎంపిక చేసుకున్న పీయూశ్.. ఆ తర్వాత ధోనిని నిలిపాడు. స్పిన్ విభాగంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌లకు చోటిచ్చిన అతడు.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్‌లను ఎంపిక చేసుకున్నాడు.దాదా, గంభీర్‌కు చోటు లేదుఅయితే, వరల్డ్‌కప్(2007, 2011) హీరో గౌతం గంభీర్, స్టార్ కెప్టెన్ సౌరవ్ గంగూలీలకు పీయూశ్ తన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాదు.. నంబర్ 3లో హిట్టయిన కోహ్లిని నాలుగో స్థానానికి ఎంచుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల పీయూశ్ చావ్లా ఐపీఎల్ రికార్డు మాత్రం ఘనంగా ఉంది. ఇప్పటి వరకు 192 మ్యాచ్‌లు ఆడి 192 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహించాడు.పీయూశ్ చావ్లా ఆల్‌టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.చదవండి: పాకిస్తాన్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
మా నాన్నకు ఆ సమస్య ఉంది: యువీ కామెంట్స్ వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనిలపై మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కపిల్ వల్ల తన కెరీర్ సజావుగా సాగలేదన్న యోగ్రాజ్.. తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్‌ను ధోని నాశనం చేశాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో యువీ గతంలో తన తండ్రి యోగ్రాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.‘‘మా నాన్నకు మానసిక సమస్యలు ఉన్నాయి. కానీ ఆయన ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అదే ఆయనకున్న అతి పెద్ద సమస్య. ఇది ఆయనకు తెలిసినా మారేందుకు సిద్ధంగా లేరు’’ అంటూ యువరాజ్ సింగ్ గతేడాది నవంబరులో రణ్వీర్ అల్హాబ్దియా పాడ్‌కాస్ట్‌లో యోగ్రాజ్ గురించి చెప్పుకొచ్చాడు.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా.. ధోని అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ధోని వంటి టాప్ క్రికెటర్‌ను టార్గెట్ చేయడం ద్వారా యోగ్రాజ్ వార్తల్లో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నాడని.. అయితే, ఇప్పుడు ఇలాంటి చవకబారు మాటలను ఎవరూ పట్టించుకోరని కామెంట్లు చేస్తున్నారు. యువీ తన తండ్రి గురించి చెప్పింది వందకు వంద శాతం నిజమని పేర్కొంటున్నారు. యోగ్రాజ్ ఇలాగే మాట్లాడితే యువరాజ్‌కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని.. ఇకనైనా ఆయన తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.కాగా టీమిండియా తరఫున 1980-81 మధ్య కాలంలో ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు యోగ్రాజ్. అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ వల్లే తనకు అవకాశాలు కరువయ్యాయని గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్న అతడు.. తన కుమారుడిని విజయవంతమైన క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని భావించాడు. తండ్రి ఆశయాలకు తగ్గట్లుగానే మేటి ఆల్‌రౌండర్‌గా ఎదిగిన యువీ.. క్యాన్సర్‌ను జయించి మరీ ఆటను కొనసాగించాడు.అయితే, 2015 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యువీకి ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లాయి. ఫలితంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే నాడు ధోని కెప్టెన్‌గా ఉండటం గమనార్హం. అంతేకాదు.. యువీ-ధోని అండర్-19 క్రికెట్లోనూ సమకాలీకులే. ఇద్దరు ప్రతిభావంతులే అయినా ధోని తన అసాధారణ నైపుణ్యాలతో కెప్టెన్‌గా ఎదిగాడు.ఈ నేపథ్యంలో ధోని గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘నేను ధోనిని ఎన్నటికీ క్షమించను. ఒకసారి అతడు అద్దంలో తన ముఖం చూసుకోవాలి. అతడొక పెద్ద క్రికెటరే కావొచ్చు. కానీ నా కుమారుడి విషయంలో అతడేం చేశాడు? నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడు. అతడు కనీసం మరో నాలుగేళ్లపాటు ఆడేవాడు.కానీ ధోని వల్లే ఇదంతా జరిగింది. యువరాజ్ వంటి కొడుకును ప్రతి ఒక్కరు కనాలి’’ అని యోగ్రాజ్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా కపిల్ దేవ్ గురించి ప్రస్తావిస్తూ.. కపిల్ కంటే తన కొడుకు యువీనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని చెప్పుకొచ్చాడు. అయితే, యువీ ఇంత వరకు తన తండ్రి వ్యాఖ్యలపై స్పందించలేదు. My Father has mental issues : Yuvraj #MSDhoni pic.twitter.com/KpSSd4vDzA— Chakri Dhoni (@ChakriDhonii) September 2, 2024 -
'నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడు.. ధోనిని ఎప్పటికీ క్షమించను'
ఎంస్ ధోని.. భారత క్రికెట్ రూపరేఖలను మార్చేసిన నాయకుడు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన ఏకైక కెప్టెన్. తన అద్బుత కెప్టెన్సీతో, ఆటతీరుతో టీమిండియాను నెం1 జట్టుగా నిలిపిన ఘనత మిస్టర్ కూల్ది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఎంఎస్‌డి సొంతం చేసుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు నాలుగేళ్లు అవుతున్నప్పటకి అతడిపై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న ధోనిని మైదానంలో చూసేందుకు ఫ్యాన్స్ ప్రతీ ఏటా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అంతలా ఆరాధించే ధోనిపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి విమర్శల వర్షం కురిపించాడు. ధోని వల్లే యువరాజ్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిందని యోగరాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఎప్పటికీ క్షమించను..యువరాజ్ సింగ్ కెరీర్‌ను ఎంఎస్ ధోని నాశనం చేశాడు. అతడిని నేను ఎప్పటకి క్షమించను. తనను తను అద్దంలో చూసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ధోని చాలా పెద్ద క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడు నా కొడుకు పట్ల పక్షపాతంగా వ్యవహరించాడు.ప్రతీ విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. నేను ఎవరైనా తప్పు చేశారని భావిస్తే వారిని జీవితంలో క్షమించను. అది నా కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. యువరాజ్ ఇంకా నాలుగైదేళ్లు ఈజీగా ఆడేవాడు. కానీ ధోని మాత్రం నా కుమారుడికి సపోర్ట్ చేయలేదు.అందుకే తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. క్యాన్సర్‌తో బాధపడుతూనే దేశం కోసం ఆడి.. ప్రపంచకప్ గెలిచినందుకు భారత ప్రభుత్వం యువరాజ్‌ను భారతరత్నతో సత్కరించాలని జీస్వీచ్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.యువీది చెరగని ముద్ర..కాగా యువరాజ్ కూడా భారత క్రికెట్లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ సొంతం చేసుకోవడం యువీ కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు తరపున 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్.. 11,178 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 17 సెంచరీలు,71 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. Yograj Singh's latest explosive interview on MS Dhoni.😨Also, demands Bharat Ratna for his son Yuvraj Singh for his outstanding and selfless contribution to Cricket. pic.twitter.com/JDoJrLMeIW— Abhishek (@vicharabhio) August 31, 2024 -
గుజరాత్ కాదు.. ఆ జట్టు హెడ్ కోచ్‌గా యవరాజ్!?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఆటగాళ్లతో పాటు తమ కోచింగ్ స్టాప్‌లో కూడా మార్పులు దిశగా ఆయా ఫ్రాంచైజీలు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌పై వేటు వేయగా.. గుజరాత్ టైటాన్స్ సైతం తమ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రాను తప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం.మరోవైపు రాజస్తాన్ రాయల్స్ కూడా తమ హెడ్‌కోచ్‌గా ఉన్న కుమార సంగర్కరను తప్పించి రాహుల్ ద్రవిడ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ద్రవిడ్‌తో రాజస్తాన్ ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు వినికిడి.ఢిల్లీ హెడ్‌కోచ్‌గా యువరాజ్ సింగ్..?కాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ బాధ్యతలు చేపట్టున్నట్లు తెలుస్తోంది. రికీ పాంటింగ్ స్ధానంలో యువరాజ్‌ను నియమించాలని ఢిల్లీ యాజమాన్యం యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యువీతో ఢిల్లీ క్యాపిటల్స్ చర్చలు మొదలు పెట్టినట్లు స్పోర్ట్‌స్టార్ తమ కథనంలో పేర్కొంది. అయితే యువీ నుంచి కానీ, ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు. మొదటిలో గుజరాత్ టైటాన్స్‌గా ప్రధాన కోచ్‌గా యువరాజ్ సింగ్ వెళ్లనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ కూడా అతడిని తమ హెడ్‌కోచ్‌గా నియమించుకునేందుకు ఆసక్తిగా ఉందంట.కాగా యువీ ఇప్పటివరకు హెడ్‌కోచ్‌గా పనిచేయనప్పటకి.. చాలా మంది పంజాబ్ యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో యువరాజ్‌ది కీలకపాత్ర. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు యువరాజ్ గైడన్స్‌లో రాటుదేలిన వారే. -
తెరపైకి యువరాజ్ సింగ్ జీవితం
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రానుంది. భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ నిర్మించనున్న ఈ బయోపిక్‌ను మంగళవారం ప్రకటించారు. భారత క్రికెట్లో పదిహేడేళ్ల సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్, ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం, క్యాన్సర్ మహమ్మారితో పోరాడటం, 2007లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత టీమ్‌లో రాణించడం, ధోనీతో విభేదాలు అనే వార్త, ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమ అనే గాసిప్... ఇలా యువరాజ్ లైఫ్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.ఈ అంశాలను ఈ సినిమాలో ఎంత మేరకు చూపించాలనుకుంటున్నారని తెలియాల్సి ఉంది. అలాగే యువరాజ్ సింగ్‌గా ఎవరు నటించనున్నారు? దర్శకత్వం వహించేది ఎవరు? అనే విషయాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ఫ్యాన్స్ కోసం నా బయోపిక్ తెరకెక్కనున్నందుకు హ్యాపీగా ఉంది. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ వారి కలలను నెరవేర్చుకునేలా నా బయోపిక్ స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు యువరాజ్ సింగ్. -
యువరాజ్ సింగ్ బయోపిక్‌పై అధికారిక ప్రకటన
యువరాజ్‌సింగ్ పేరు చెబితే వెంటనే గుర్తుకొచ్చేది ఆరు సిక్స్‌లు.. ఇప్పుడా సీన్‌ను వెండితెరపై మళ్లీ చూసే అవకాశం రానుంది. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్ సందర్భంగా 2007 సెప్టెంబర్ 19న ఇంగ్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో యవరాజ్‌సింగ్ వీర బాదుడుకి ఇంగ్లాడ్ చేతులెత్తేసింది. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్లో మన యూవీ 6 సిక్సర్లు బాదేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. 2011 వరల్డ్ కప్ విజయంలో యూవీ పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. గ్రౌండ్లో వీరోచితంగా పోరాడే ఈ వీరుడి బయోగ్రఫీ వెండితెరపైకి రానుంది.ఇప్పటికే సచిన్, ధోనీ వంటి క్రికెటర్ల బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. తాజాగా యువరాజ్ సింగ్ బయోపిక్‌ను నిర్మిస్తున్నట్లు నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ ప్రకటించారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్ భాగస్వామ్యంతో ఈ చిత్రం రానుంది. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామని వారు చెప్పారు. అయితే, ఇందులో యువరాజ్‌సింగ్ పాత్రలో ఎవరు కనిపిస్తారా..? అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే యువరాజ్‌సింగ్ జీవితంలో చాలా వీరోచిత పోరాటాలు ఉన్నాయి. ఫిట్నెస్ కోల్పోయినప్పుడు ఇక యూవీ గుడ్‌బై చెబుతాడని అందరూ భావించన సమయంలో తను సత్తా చాటి మళ్లీ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. క్యాన్సర్‌ను జయించి చాలామందిలో ధైర్యాన్ని నింపాడు. అలా ప్రతీది యూవీ జీవితం ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. -
పంజాబ్ జట్టుకు టీమిండియా క్రికెటర్ గుడ్‌బై
టీమిండియా వెటరన్ క్రికెటర్ మన్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశాడు. పంజాబ్ జట్టుతో తన పద్నాలుగేళ్ల బంధం ముగిసిందని తెలిపాడు. ఇకపై తాను దేశవాళీ క్రికెట్లో త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు వెల్లడించాడు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.పరుగుల వరదపంజాబ్లోని జలంధర్‌లో 1991లో జన్మించిన మన్దీప్ సింగ్‌కు చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ. ఈ క్రమంలో బ్యాటర్‌గా ఎదిగిన అతడు.. 2010 అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే ఏడాది.. పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసిన మన్దీప్ సింగ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 14 వేలకు పైగా పరుగులు సాధించాడు.ఇందులో 19 సెంచరీలు, 81 అర్ధ శతకాలు ఉండటం విశేషం. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రమంలో 2016లో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మన్దీప్ సింగ్.. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పంజాబ్‌కు టైటిల్ అందించిన కెప్టెన్టీమిండియా తరఫున మూడు టీ20 మ్యాచ్‌లు ఆడి 87 పరుగులు చేశాడు. అదే ఏడాది చివరిసారిగా భారత్‌కు ఆడిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. పంజాబ్ కెప్టెన్‌గానూ పనిచేశాడు. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో పంజాబ్‌కు టైటిల్ అందించిన 32 ఏళ్ల మన్దీప్ సింగ్.. తన కెరీర్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లు శనివారం ప్రకటించాడు. అందుకే జట్టును వీడుతున్నా కాగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలని భావిస్తోందని.. అందుకే జట్టుకు తన సేవలు ఇక అవసరం లేదని మన్దీప్ అన్నాడు. ఈ ఏడాది త్రిపుర జట్టుతో జతకట్టేందుకు సిద్దమైనట్లు తెలిపాడు. కాగా మరో పంజాబీ బ్యాటర్ జీవన్‌జ్యోత్ సింగ్ కూడా ఈసారి త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. -
IPL 2025: గుజరాత్ హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి చాలా సమయం ఉన్నప్పటికీ అన్ని ఫ్రాంచైజీలు ప్రక్షాళన బాట పట్టాయి. కొన్ని ఫ్రాంచైజీలేమో ఆటగాళ్లను వదిలించుకోవాలని భావిస్తుంటే.. మరికొన్ని కోచింగ్ స్టాఫ్, మెంటార్లను మార్చే పనిలో పడ్డాయి. తాజాగా గుజరాత్ ఫ్రాంచైజీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా గుజరాత్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అతనితో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి కూడా తప్పుకోనున్నట్లు సమాచారం. వీరిద్దరి పర్యవేక్షణలో గుజరాత్ తమ తొలి రెండు సీజన్లలో ఫైనల్స్‌కు చేరింది. 2022లో ఛాంపియన్‌గా, 2023లో రన్నరప్‌గా నిలిచింది. ఇంతటి విజయవంతమైన జోడీ ప్రస్తుతం గుజరాత్‌ను వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లో (2024) వైఫల్యాల కారణంగా ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం వీరిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మేనేజ్మెంట్ తప్పించాలని నిర్ణయం తీసుకునే లోపే తామే స్వచ్చందంగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని వీరు భావిస్తుండవచ్చు. గుజరాత్ ఫ్రాంచైజీకి సంబంధించి ఈ టాపిక్ నడుస్తుండగానే మరో వార్త సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. నెహ్రా గుజరాత్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటే టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. యువరాజ్‌తో గుజరాత్ యాజమాన్యం సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యువీకి గతంలో ఏ జట్టుకు కోచింగ్ ఇచ్చిన అనుభవం లేదు. ఒకవేళ అతన్ని గుజరాత్ టైటాన్స్ పంచన చేర్చుకుంటే ఇదే అతనికి తొలి కోచింగ్ పదవి అవుతుంది. గుజరాత్ ఆఫర్‌పై యువీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా, గుజరాత్ గత సీజన్లో ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. హార్దిక్ ఎగ్జిట్‌తో శుభ్‌మన్ గిల్ గుజరాత్ నూతన కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్ నేతృత్వంలో గుజరాత్ గత సీజన్లో 14 మ్యాచ్‌ల్లో ఐదింట మాత్రమే విజయాలు సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించింది. -
ఇంత చెత్తగా వ్యవహరిస్తారా? యువీ, భజ్జీపై విమర్శలు
భారత ‘దిగ్గజ’ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా తీరుపై పారాలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లెజెండ్స్ నుంచి ఇలాంటి అమానుషమైన, చెత్త ప్రవర్తనను ఊహించలేదంటూ ఘాటుగా విమర్శించింది.క్రికెట్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథాన్ని వ్యాప్తి చేయాల్సింది పోయి.. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. అనుచితంగా వ్యవహరించిన కారణంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ విజేతగా భారత్విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఇండియా చాంపియన్స్ జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనా తదితరులు సభ్యులుగా ఉన్నారు.ఇక ఈ టీ20 టోర్నీలో భారత్- పాకిస్తాన్ చాంపియన్స్ ఫైనల్‌కు చేరగా.. యువీ సేన గెలుపొందింది. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 అరంగేట్ర టైటిల్ కైవసం చేసుకుంది.ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో యువీ, భజ్జీ, రైనా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘‘లెజెండ్స్ క్రికెట్లో పదిహేను రోజుల పాటు ఒళ్లు హూనమైంది. శరీరంలోని ప్రతీ అవయవం నొప్పితో విలవిల్లాడుతోంది’’ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ పాట తౌబ.. తౌబకు తమ స్టెప్పులు ఇలాగే ఉంటాయంటూ కుంటుతూ నడుస్తున్నట్లుగా అభినయించారు.అనుచిత ప్రవర్తనఈ వీడియో వైరల్‌కాగా పారాలింపిక్ ఇండియా కమిటీ తీవ్రంగా స్పందించింది. ‘‘ఏమాత్రం సున్నితత్వం లేని అనుచిత ప్రవర్తన ఇది. క్రికెట్ స్టార్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా మీ ప్రవర్తన ఉండాలి.కానీ ఇతరుల వైకల్యాన్ని ఎత్తిచూపేలా ఇలా గంతులు వేయడం బాధ్యతారాహిత్యం. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? దివ్యాంగుల పట్ల వివక్ష చూపడమే ఇది. ఇలాంటి చర్యలకు పాల్పడ్డందుకు వెంటనే క్షమాపణలు చెప్పండి’’ అని పారాలింపిక్ ఇండియా కమిటీ చురకలు అంటించింది.ప్రముఖ పారా అథ్లెట్, బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషీ సైతం యువరాజ్, భజ్జీ, రైనా తీరును తప్పుబట్టారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరూ కూడా తమపై వస్తున్న విమర్శలకు ఇంతవరకు స్పందించలేదు. అయితే, విమర్శల నేపథ్యంలో యువీ ఈ వీడియోను డిలీట్ చేయడం గమనార్హం.చదవండి: T20I Captain: టీమిండియా టీ20 కెప్టెన్‌గా వాళ్లిద్దరి మధ్యే పోటీ View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
Yuvraj Singhs all-time playing XI: యువరాజ్ బెస్ట్ టీమ్ ఇదే.. ధోనికి నో ఛాన్స్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 అరంగేట్ర ఎడిషన్ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు.. ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను ఓడించింది. ఈ టోర్నీలో కెప్టెన్ యువరాజ్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.నాయకుడుగా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా ఆటగాడిగా యువీ రాణించాడు. కీలక సెమీస్‌లో సత్తాచాటి ఇండియాను ఫైనల్‌కు చేర్చాడు. అదేవిధంగా ఫైనల్లో కూడా 12 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ ఫైనల్లో విజయనంతరం యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు.తన అత్యుత్తుమ ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు మాత్రమే యువీ ఛాన్స్ ఇచ్చాడు. అయితే భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి యువరాజ్ చోటు ఇవ్వకపోవడం అందరని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక యువ ఎంచుకున్న జట్టులో కోహ్లి, రోహిత్, సచిన్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌లకు చోటు దక్కింది.యువరాజ్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్. pic.twitter.com/Fim1k9uvBL— Out Of Context Cricket (@GemsOfCricket) July 13, 2024 -
IND VS PAK: రాయుడు, యూసఫ్ విధ్వంసం.. పాక్ చిత్తు! టోర్నీ విజేతగా భారత్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్‌ను ముద్దాడింది.ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అతడితో పాటు కమ్రాన్ ఆక్మల్(24), మసూద్(21) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. వినయ్ కుమార్, నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలా వికెట్ సాధించారు.రాయుడు ఫిప్టీ.. యూసఫ్ విధ్వంసంఅనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఓపెనర్ అంబటి రాయుడు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు.30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు చేసి 50 పరుగులు చేసి రాయుడు ఔటయ్యాడు. ఆఖరిలో యూసఫ్ పఠాన్(16 బంతుల్లో 30 పరుగులు, 1 ఫోర్, 3 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో యమీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. షోయబ్ మాలిక్,అఫ్రిది, రియాజ్ తలా వికెట్ సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అంబటి రాయుడు నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు యూసఫ్ పఠాన్‌కు వరించింది. -
బౌలర్లను ఉతికారేసిన యువరాజ్.. సిక్సర్ల వర్షం! వీడియో
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్లను ఇండియా ఛాంపియన్స్ 86 పరుగుల తేడాతో చిత్తు చేసింది. నార్తాంప్టన్ వేదికగా జరిగిన ఈ సెమీస్ పోరులో ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఆసీస్ బౌలర్లను యువీ ఊచకోత కోశాడు. యువరాజ్ కేవలం 28 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సింగ్ ఈజ్ కింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆసీస్ అంటే అంత కసి ఎందుకన్న అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. గతంలో కూడా ఐసీసీ నాకౌట్స్ మ్యాచ్‌ల్లో ఆసీస్‌పై యువీ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2000లో ఆసీస్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో 84 పరుగులు చేసిన యువీ.. 2007 టీ20 వరల్డ్‌కప్ సెమీపైనల్లో కంగరూలపై హాఫ్ సెంచరీతో విరుచుకు పడ్డాడు. 2011 క్వార్టర్ ఫైనల్, 2014 టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఈ సిక్సర్ల వీరుడు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. 2000, 2007, 2011 and now 2024 🚀Yuvi keeps his date with the Aussies in the Knockouts! 👊🏽#WCLonFanCode @YUVSTRONG12 pic.twitter.com/tjqtJJhnH4— FanCode (@FanCode) July 12, 2024 -
క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఫైనల్లో భారత్-పాకిస్తాన్ ఢీ
భారత్-పాక్ క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. తమ ఆరాధ్య జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయాని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ తలపడనున్నాయి.జూలై 13(శనివారం) నార్తాంప్టన్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో చిరకాల ప్రత్యర్ధులైన భారత్- పాక్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో 86 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి భారత్ ఫైనల్‌కు రాగా.. తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌ను ఓడించి పాక్ తుది పోరుకు ఆర్హత సాధించింది. ఈ ఫైనల్ పోరులో గెలిచి లీగ్ స్టేజ్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. గ్రూపు స్టేజిలో పాక్ చేతిలో భారత్ 68 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. అయితే పాక్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. పాక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.ఈ టోర్నీలో పాక్ ఇప్పటివరకు ఆజేయంగా నిలిచింది. కానీ ఆసీస్‌తో సెమీస్‌లో ఆడినట్లు భారత బ్యాటర్లు చెలరేగితే పాక్ కచ్చితంగా తలవంచాల్సిందే. భారత బ్యాటర్లలో ఉతప్ప, యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. -
యువరాజ్ మెరుపులు.. పఠాన్ బ్రదర్స్ ఊచకోత! ఫైనల్‌కు చేరిన భారత్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్ అడుగుపెట్టింది. శుక్రవారం నార్తాంప్టన్ వేదికగా జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌ను 86 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.ఈ సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప( 35 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ యువరాజ్ సింగ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58 పరుగులు), యూసఫ్ పఠాన్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 పరుగులు), ఇర్ఫాన్ పఠాన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.ఆసీస్ బౌలర్లలో సిడిల్ 4 వికెట్లు పడగొట్టగా.. కౌల్టర్‌నైల్, దోహర్టీ తలా వికెట్ సాధించారు. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లలో టిమ్ పైన్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో కులకర్ణి, పవన్ నేగి తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హార్భజన్, ఇర్ఫాన్, శుక్లా తలా వికెట్ సాధించారు. ఇక శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. -
యువరాజ్ మళ్లీ ఫెయిల్.. సెమీఫైనల్లో టీమిండియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. బుధవారం నార్తాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఇండియా ఓటమి పాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. యూసఫ్ పఠాన్(44 బంతుల్లో54, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇర్ఫాన్(21 బంతుల్లో 35, 4 ఫోర్లు, ఒక సిక్స్) పోరాడనప్పటకి అప్పటికే మ్యాచ్ భారత్ చేదాటిపోయింది. కెప్టెన్ యువరాజ్ సింగ్(5) మరోసారి ఫెయిల్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలిండర్ రెండు వికెట్లు పడగొట్టగా.. చార్ల్ లాంగెవెల్డ్ట్, తహీర్,స్నైమెన్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో స్నైమెన్(73) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లివీ(25 బంతుల్లో 60, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కులకర్ణి, వినయ్‌కుమార్, యూసఫ్ తలా వికెట్ సాధించారు.సెమీస్‌లో భారత్..ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి సెమీఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. పాయింట్ల పట్టకలో నాలుగో స్ధానంలో భారత్ నిలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ టోర్నీలో చెరో రెండు విజయాలు సాధించిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు పాయింట్ల పరంగా సమంగా నిలిచాయి. అయితే దక్షిణాఫ్రికా(-1.340) రన్‌రేట్ కంటే భారత్(-1.267)రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో సెమీస్‌కు యువీ సేన ఆర్హత సాధించింది. జూలై 12న నార్తాంప్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్ భారత్ తలపడనుంది. -
‘నేను డకౌట్ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’
‘‘మొదటి మ్యాచ్ తర్వాత కూడా నేను ఆయనతో మాట్లాడాను. నేను డకౌట్ అయినా సరే ఆయన ఎందుకో చాలా సంతోషంగా కనిపించాడు. ‘మరేం పర్లేదు.. ఇది శుభారంభమే’ అని నాతో అన్నాడు. అయితే, ఇప్పుడు ఆయన నన్ను చూసి ఎంతగానో గర్విస్తున్నాడు.నా కుటుంబం ఎంతటి సంతోషంలో ఉందో పాజీ కూడా అంతే ఆనందపడుతున్నాడు. ఇదంతా కేవలం ఆయన చలవ వల్లే సాధ్యమైంది. నా కోసం ఎన్నో ఏళ్లుగా ఆయన కూడా కఠిన శ్రమకోరుస్తున్నాడు.నన్ను తీర్చిదిద్దడం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. కేవలం క్రికెట్ పాఠాలు నేర్పించడమే కాదు.. మైదానం వెలుపలా నాకు ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తున్నారు’’ అని టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.డకౌట్.. వెను వెంటనే సెంచరీభారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్-2024లో అదరగొట్టిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ ఈ లెఫ్టాండర్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు అభిషేక్ శర్మను ఎంపిక చేశారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలోనే అతడు డకౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు.కానీ ఇరవై నాలుగు గంటల్లోనే తిరిగి అద్భుతం చేశాడు. వైఫల్యాన్ని మరిపిస్తూ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో ఆదివారం నాటి రెండో టీ20లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వంద పరుగులు సాధించాడు.తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. డకౌట్ అయిన చోటే శతకంతో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నాడు.గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావుఈ క్రమంలో అభిషేక్ శర్మ తన మెంటార్ యువరాజ్ సింగ్‌కు కాల్ చేయగా.. ‘‘గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావు. ఈ ప్రశంసలకు నువ్వు అర్హుడవు. ఇలాంటివి ఇంకెన్నో సాధించాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అని సంతోషం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం అతడు వరల్డ్ చాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ అభిషేక్ ఫోన్‌కు స్పందించి ఈ మేరకు అభినందించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ యువీ గొప్పతనాన్ని, తన కెరీర్లో అతడి పాత్ర గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.చదవండి: బాబర్ ఆజంపై వేటు?.. పీసీబీ కీలక నిర్ణయం!Two extremely special phone 📱 calls, one memorable bat-story 👌 & a first 💯 in international cricket! 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!A Hundred Special, ft. Abhishek Sharma 👏 👏 - By @ameyatilak WATCH 🎥 🔽 #TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/0tfBXgfru9— BCCI (@BCCI) July 8, 2024 View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
WCL 2024: రైనా హాఫ్ సెంచరీ వృథా.. పాకిస్తాన్‌పై భారత్ ఓటమి
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ విధ్వంసం సృష్టించింది. పాకిస్తాన్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో కమ్రాన్ ఆక్మల్(40 బంతుల్లో 77), షర్జీల్ ఖాన్(72), మసూద్(51) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో పవన్ నేగి, అనురీత్ సింగ్, ఆర్పీ సింగ్, కులకర్ణి తలా వికెట్ సాధించారు.రైనా హాఫ్ సెంచరీ వృథా..అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో సురేష్ రైనా(52) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు అంబటి రాయడు(39) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో షోయబ్ మాలిక్, రియాజ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. తన్వీర్, షోహిల్ ఖాన్ తలా వికెట్ సాధించారు. -
WCL 2024: భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు సర్వం సిద్దం.. సీట్లన్నీ ఫుల్
వరల్డ్ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ రెండు జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో మరోసారి అభిమానులను అలరించేందుకు చిరకాల ప్రత్యర్ధిలు సిద్దమయ్యారు.అయితే ఈసారి ఇరు దేశాల మాజీ క్రికెటర్ల వంతు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా జూలై 6 (శనివారం) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న ఇరు జట్లు ఎడ్జ్‌బాస్టన్‌లో ఆదివారం తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి.సీట్లు ఫుల్..ఇక దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన మొత్తం టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడు పోయాయి. మొత్తం 23000 సీట్లు అమ్ముడు పోయినట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఈ టోర్నీలో జరిగిన ఏ మ్యాచ్ టిక్కట్లకు అంత డిమాండ్ లేదు. కానీ భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్లు మాత్రం హాట్‌కేకుల్లా సేల్ అయిపోయాయి.చాలా సంతోషంగా ఉంది: యూనిస్ ఖాన్ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాక్ ఛాంపియన్స్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు. "ఈ టోర్నీలో భారత్‌తో తలపడేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము.అంతేకాకుండా మళ్లీ ఛానళ్ల తర్వాత భారత్‌తో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం మేము అన్ని విధాలగా సిద్దమయ్యాము. ఎందుకంటే ఇది ఒక గేమ్ మాత్రమే కాదు.. మా దేశానికి సంబంధించిన గౌరవమని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌కు దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యం వహిస్తున్నాడు. -
చెలరేగిన ఉతప్ప.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఇండియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ శుభారంభం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. ఇండియా బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప(32 బంతుల్లో 50 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుర్క్రీత్ సింగ్(33), నమన్ ఓజా(25) పరుగులతో రాణించారు. కాగా కెప్టెన్ యువరాజ్ సింగ్ మాత్రం నిరాశపరిచాడు. బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి 14 పరుగులిచ్చిన యువీ.. బ్యాటింగ్‌లోనూ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలోక్రిస్ స్కోఫీల్డ్ 4 వికెట్లు పడగొట్టగా.. రవి బపోరా రెండు వికెట్లు సాధించాడు.అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఇయాన్ బెల్(59), సమిత్ పటేల్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హార్భజన్ సింగ్ రెండు, కులకర్ణి, ఆర్పీ సింగ్ తలా వికెట్ పడగొట్టారు. -
నేటి నుంచి (జులై 3) మరో క్రికెట్ పండుగ.. జులై 6న భారత్-పాక్ మ్యాచ్
టీ20 వరల్డ్‌కప్ ముగిసి వారం రోజులు కూడా గడవక ముందే మరో క్రికెట్ పండుగ మొదలైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీ ఇంగ్లండ్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 3) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు (ఇండియా ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటున్నాయి. లెజెండ్స్ క్రికెట్‌కు సంబంధించి ఈ టోర్నీని వరల్డ్‌కప్‌గా పరిగణించవచ్చు. ఈ టోర్నీలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, కెవిన్ పీటర్సన్, డేల్ స్టెయిన్, హెర్షల్ గిబ్స్, షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్, బ్రెట్ లీ లాంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. సింగిల్ రౌండ్ ఫార్మాట్లో జరిగే (ప్రతి జట్టు మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది) ఈ టోర్నీ జులై 13న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. సింగిల్ రౌండ్ తర్వాత టాప్-4లో ఉండే జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జులై 6న జరుగనుంది.జట్ల వివరాలు..భారత్ ఛాంపియన్స్: యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, పవన్ నేగిఆస్ట్రేలియా ఛాంపియన్స్: బ్రెట్ లీ, టిమ్ పైన్, షాన్ మార్ష్, బెన్ కట్టింగ్, బెన్ డంక్, డిర్క్ నాన్స్, డాన్ క్రిస్టియన్, బెన్ లాఫ్లిన్, ఆరోన్ ఫించ్, బ్రాడ్ హాడిన్, కల్లమ్ ఫెర్గూసన్, పీటర్ సిడిల్, జేవియర్ డోహెర్టీ, నాథన్ కౌల్టర్ నైల్, జాన్ హేస్టింగ్స్ఇంగ్లండ్ ఛాంపియన్స్: కెవిన్ పీటర్సన్, రవి బొపారా, ఇయాన్ బెల్, సమిత్ పటేల్, ఒవైస్ షా, ఫిలిప్ మస్టర్డ్, క్రిస్ స్కోఫీల్డ్, సాజిద్ మహమూద్, అజ్మల్ షాజాద్, ఉస్మాన్ అఫ్జల్, ర్యాన్ సైడ్‌బాటమ్, స్టీఫెన్ ప్యారీ, స్టువర్ట్ మీకర్, కెవిన్ ఓ'బ్రియన్వెస్టిండీస్ ఛాంపియన్స్: డారెన్ సామీ, క్రిస్ గేల్, శామ్యూల్ బద్రీ, రవి రాంపాల్, కేస్రిక్ విలియమ్స్, జాసన్ మహమ్మద్, నవిన్ స్టీవర్ట్, డ్వేన్ స్మిత్, యాష్లే నర్స్, సులీమాన్ బెన్, చాడ్విక్ వాల్టన్, జెరోమ్ టేలర్, ఫిడేల్ ఎడ్వర్డ్స్, కిర్క్ ఎడ్వర్డ్స్, జోనాథన్ కార్టర్దక్షిణాఫ్రికా ఛాంపియన్స్: జాక్వెస్ కల్లిస్, హెర్షెల్ గిబ్స్, ఇమ్రాన్ తాహిర్, మఖాయా ంటిని, డేల్ స్టెయిన్, అష్వెల్ ప్రిన్స్, నీల్ మెక్కెంజీ, ర్యాన్ మెక్లారెన్, జస్టిన్ ఒంటాంగ్, రోరీ క్లీన్‌వెల్ట్, జెపి డుమిని, రిచర్డ్ లెవి, డేన్ విలాస్, వెర్నాన్ ఫిలాండర్,పాకిస్తాన్ ఛాంపియన్స్: యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, అబ్దుల్ రజాక్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సోహైల్ తన్వీర్, సోహైల్ ఖాన్, తన్వీర్ అహ్మద్, ముహమ్మద్ హఫీజ్, అమీర్ యామిన్, షోయబ్ మాలిక్, సోహైబ్ మక్సూద్, ఉమర్జెల్ ఖాన్ అక్మల్,షెడ్యూల్..బుధవారం, జూలై 03ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్గురువారం, జూలై 04సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్శుక్రవారం, జూలై 05ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇండియా వర్సెస్ వెస్టిండీస్శనివారం, జూలై 06ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియాఇండియా వర్సెస్ పాకిస్థాన్ఆదివారం, జూలై 07సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్సోమవారం, జూలై 08ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియామంగళవారం, జూలై 09వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్బుధవారం, జూలై 10వెస్టిండీస్ వర్సెస్ఆస్ట్రేలియా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాబుధవారం, జూలై 12మొదటి సెమీ ఫైనల్- TBA vs TBAరెండవ సెమీ ఫైనల్- TBA vs TBAశనివారం, జూలై 13ఫైనల్ మ్యాచ్ - TBA vs TBA -
అప్పుడు యువరాజ్.. ఇప్పడు హార్దిక్! సేమ్ టూ సేమ్: శ్రీశాంత్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్.. ఇప్పుడు తనపై ఉన్న అపవాదును చెరిపేసుకున్నాడు. ఈ పొట్టి ప్రపంచకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటుతున్నాడు.ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ 116 పరుగులతో పాటు 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్‌పై భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ అద్భుతమైన ఆల్‌రౌండర్‌ని, భారత్‌ను ఛాంపియన్స్‌గా నిలబెడతాడని శ్రీశాంత్ కొనియాడాడు."హార్దిక్ పాండ్యాకు అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. భారత జట్టులో అతడు కీలకమైన ఆటగాడు. ఇదే విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పలుమార్లు చెప్పాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్ ఏ విధమైన ప్రదర్శన చేశాడో మనకు ఇప్పటికి బాగా గుర్తుంది.బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సత్తాచాటి భారత్‌కు టైటిల్‌ను అందించాడు. ఇప్పుడు హార్దిక్ కూడా నాకౌట్స్‌లో యువీ లాంటి ప్రదర్శనే చేస్తాడని నేను భావిస్తున్నాను. భారత్ కచ్చితంగా ఛాంపియన్స్‌గా నిలుస్తుందని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ పేర్కొన్నాడు. కాగా భారత్ రెండో సెమీఫైనల్లో గురువారం గయానా వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. -
T20 World Cup 2024: బట్లర్ విశ్వరూపం.. సిక్సర్ల సునామీ.. యువీ తర్వాత..!
యూఎస్ఏతో జరిగిన వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విశ్వరూపం ప్రదర్శించాడు. సెమీస్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. హర్మీత్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాది, యువరాజ్ సింగ్ (2007 ప్రపంచకప్‌లో యువీ.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు) తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.హర్మీత్ ఓవర్లో ఐదు సిక్సర్లు సహా 32 పిండుకున్న బట్లర్.. మ్యాచ్ మొత్తంలో ఏడు సిక్సర్లు బాదాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అలెక్స్ హేల్స్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 6 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో యూఎస్ఏ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఊదేసింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్-2 నుంచి సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. బట్లర్ సహచర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (25)తో కలిసి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.అంతకుముందు క్రిస్ జోర్డన్ (2.5-0-10-4) హ్యాట్రిక్ వికెట్లతో, ఆదిల్ రషీద్ (4-0-13-2) అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగడంతో యూఎస్ఏ 18.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఈ టీమిండియా స్టార్ల సక్సెస్ వెనుక హీరోలు తండ్రులే..!
ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి హీరో, మొదటి గురువు నాన్నే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాలంటే అందులో కీలకపాత్ర తండ్రిదే. నాన్న పిల్లల చేయి పట్టుకుని ప్రపంచానికి పరిచయం చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. పిల్లల ఉన్నతి కోసం అహర్నిశలూ శ్రమించి సర్వస్వం ధారపోస్తాడు.తాను పడ్డ కష్టాలు, తాను చేసిన త్యాగాలకు ఏనాడూ ప్రతిఫలం ఆశించని నిస్వార్థ వ్యక్తి నాన్న. అలాంటి త్యాగమూర్తికి 'ఫాదర్స్ డే'ను (జూన్ 16) పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేద్దాం.ప్రతి మనిషి సక్సెస్ వెనుక నిజమైన హీరో తండ్రే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాడంటే దాని వెనుక తండ్రిదే ప్రధానపాత్ర. ఫాదర్స్ డే సందర్భంగా క్రీడారంగానికి (క్రికెట్) సంబంధించి బిడ్డల కోసం త్యాగాలు చేసిన తండ్రులపై ఓ ప్రత్యేక కథనం.శుభ్‌మన్ గిల్-లఖ్విందర్ సింగ్: భారత క్రికెట్ జట్టు ప్రిన్స్‌గా పిలువబడే శుభ్‌మన్ గిల్ తండ్రి పేరు లఖ్విందర్ సింగ్. లఖ్విందర్ సింగ్ తన కొడుకు క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. గిల్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో రాణిస్తున్నాడంటే అది తండ్రి లఖ్విందర్ చలువే. గిల్ కెరీర్ కోసం లఖ్విందర్ ఎన్నో త్యాగాలు చేశాడు. ఇండియా-పాకిస్తాన్ బోర్డర్లోని ఫాజిల్కా అనే కుగ్రామానికి చెందిన లఖ్విందర్.. కొడుకు కెరీర్లో కోసం 300 కిమీ దూరంలో ఉన్న మొహాలీ నగరానికి మకాం మార్చాడు. గిల్‌ను క్రికెటర్ చేసేందుకు లఖ్విందర్ 15 సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్నాడు. తిండి పెట్టే వ్యవసాయాన్ని సైతం వదిలి పెట్టి నగరవాసం చేశాడు.గిల్ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో లఖ్విందర్ తన గ్రామంలో జరిగే ఏ శుభకార్యానికి హాజరుకాలేదు. తాను ఫంక్షన్లకు వెళితే కొడుకు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఏవో కారణాలు చెప్పి హాజరయ్యేవాడు కాదు. గిల్‌కు ఆటపై ఉన్న ఆసక్తిని గమనించిన లఖ్విందర్ ఊరిలో ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు. తానే కోచ్‌గా మారి గిల్‌ను ప్రతి రోజు 500-700 బంతులు ఆడేలా చేసేవాడు. బ్యాట్‌తో ఆడేప్పుడు మిడిల్ చేసేందుకు తోడ్పడుతుందని వికెట్‌తో ప్రాక్టీస్ చేయించేవాడు. గిల్ ప్రస్తుత తరం క్రికెటర్లలో అగ్రగణ్యుడిగా ఉన్నాడంటే దాని వెనుక తండ్రి లఖ్విందర్ చేసిన ఇలాంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి.యువరాజ్ సింగ్-యోగ్రాజ్ సింగ్: టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్, టు టైమ్ వరల్డ్‌కప్ విన్నర్ యువరాజ్ సింగ్ తండ్రి పేరు యోగ్రాజ్ సింగ్. స్వతాహాగా క్రికెటర్ అయిన యోగ్రాజ్ సింగ్.. యువరాజ్ క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. భారత్ తరఫున ఆరు వన్డేలు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడిన యోగ్రాజ్.. క్రికెట్లో తాను సాధించలేని ఉన్నతిని తన కొడుకు ద్వారా సాకారం చేసుకోవాలని కోరుకున్నాడు. ఇందుకోసం తన కొడుకు చాలా కష్టపెట్టాడు. యువరాజ్‌కు చిన్నతనంలో క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. యువరాజ్ స్కేటింగ్‌లో రాణించాలని అనుకున్నాడు. ఇందులో ఓ గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. తన కొడుకు క్రికెటర్‌గానే రాణించాలని భీష్మించుకు కూర్చున్న యోగ్రాజ్.. యువరాజ్ సాధించిన గోల్డ్ మెడల్‌ను విసిరికొట్టి, క్రికెట్‌పై ఏకగ్రాత సాధించేలా చేశాడు. తొలుత అయిష్టంగానే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన యువరాజ్ నెమ్మదిగా ఆటపై పట్టు సాధించి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కించుకున్నాడు. యువరాజ్ తండ్రి మాట పెడచెవిన పెట్టి ఉంటే భారత్ క్రికెట్ ఓ గొప్ప యోధుడి సేవలను కోల్పోయి ఉండేది. యువరాజ్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టైటిళ్లను సొంతం చేసుకుంది.సర్ఫరాజ్ ఖాన్-నౌషద్ ఖాన్: టీమిండియా యంగ్ తరంగ్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి పేరు నౌషద్ ఖాన్. సర్ఫరాజ్ అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో (టెస్ట్‌ల్లో) అడుగుపెట్టిన తొలినాళ్లలోనే గుర్తింపు తెచ్చుకున్నాడంటే దాని వెనుక అతని తండ్రి ఊహకందని త్యాగం, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉన్నాయి. చిన్నతనం నుంచి సర్ఫరాజ్‌ను క్రికెటర్ చేయాలని పరితపించిన నౌషద్ ఖాన్ తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన కొడుకు ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించాడు. ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు నౌషద్ తన కొడుకును ఎంతో కష్టపెట్టాడు, బాధించాడు. సర్ఫరాజ్‌కు తండ్రే కోచ్‌గా, మెంటార్ వ్యవహరించాడు. సర్ఫరాజ్‌కు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నౌషద్ బిడ్డతో పాటు శ్రమించి తాననుకున్న లక్ష్యాన్ని నేరవేర్చుకున్నాడు. సర్ఫరాజ్ టీమిండియా అరంగేట్రం ప్రతి క్రికెట్ అభిమానిని భావోద్వేగానికి గురి చేసింది. సర్ఫరాజ్ తొలి టెస్ట్‌కు ముందు నౌషద్ మైదానంలో కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రతి భారతీయుడి మనసును హత్తుకున్నాయి. -
Ind vs Pak: పాక్ గెలుస్తుందని చెప్పాను.. కానీ: యువీ
టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోటీ చూడటానికి ఇరు దేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందనడం అతిశయోక్తి కాదు.అయితే, ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్‌పై టీమిండియాదే పైచేయి. తాజాగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతమైంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియంలో జరిగిన దాయాదుల పోరులో భారత్ పాక్‌పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.ఛేదించదగ్గ లక్ష్యానికి పాకిస్తాన్ చేరువవుతున్న వేళ టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. దాయాది ఆశలను ఆవిరి చేశాడు. అద్భుత స్పెల్(3/14)తో భారత జట్టుకు విజయం అందించాడు.ఇక భారత్- పాక్ మ్యాచ్ అంటే కేవలం గణాంకాలే కాదు భావోద్వేగాల సమాహారం అన్న విషయం తెలిసిందే. ఇక గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో పాక్ ఓడిపోవడాన్ని ఆ దేశ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోయారు.ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది- టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ తెరమీదకు వచ్చింది. పాక్ ఓటమి నేపథ్యంలో ఆఫ్రిది ఉద్వేగానికి లోనుకాగా.. యువీ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.యువీ- ఆఫ్రిది మధ్య సంభాషణ ఇలా..యువీ: లాలా.. ఏమైంది? ఎందుకంత బాధగా ఉన్నావు?ఆఫ్రిది: నేనిలా ఉండటం తప్పా? ఒప్పా? నువ్వే చెప్పు. అసలు ఈ మ్యాచ్ మేము ఓడిపోవాల్సిన మ్యాచ్కానే కాదు కదా!విజయానికి మేము 40 పరుగుల దూరంలో ఉన్నపుడు.. యువరాజ్ నా దగ్గరకు వచ్చి ‘లాలా.. కంగ్రాట్స్! ఇక నేను మ్యాచ్ చూడను. వెళ్లిపోతున్నా’ అని చెప్పాడు.వెంటనే నేను అతడికి బదులిస్తూ.. ‘‘ఈ పిచ్‌పై 40 పరుగుల అంటే అంత తేలికేమీ కాదు. ఇంత ముందుగానే కంగ్రాట్స్ చెప్పకు’’ అని యువీతో అన్నాను.యువీ: పాకిస్తాన్ గెలుస్తుందని నేను చెప్పినప్పటికీ.. టీమిండియా విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే ఉన్నాను. అయినా ఆటలో గెలుపోటములు సహజం. ఏదేమైనా మన మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుంది కదా!కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి యువరాజ్ సింగ్‌తో పాటు షాహిద్ ఆఫ్రిది అంబాసిడర్లుగా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: అనుకున్నది సాధించలేకపోయాం.. కారణం అదే: బాబర్ ఆజంChit Chat of Shahid Afridi with Yuvraj Singh Regarding #PakvsInd Match pic.twitter.com/tMCfZdCt0Z— TEAM AFRIDI (@TEAM_AFRIDI) June 11, 2024 View this post on Instagram A post shared by ICC (@icc) -
అభిషేక్ శర్మ ఊచకోత.. 26 బంతుల్లో శతకం.. 14 సిక్సర్లతో విధ్వంసం
ఐపీఎల్ 2024 సెన్సేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. గురుగ్రామ్‌లో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో అభిషేక్ 26 బంతుల్లో శతక్కొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. స్థానికంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అభిషేక్ పంటర్స్ అనే క్లబ్‌కు ప్రాతనిథ్యం వహిస్తూ.. ప్రత్యర్థి మారియో క్రికెట్ క్లబ్‌ను షేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 26 బంతులు ఎదుర్కొని 14 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో అతని జట్టు పంటర్స్.. ప్రత్యర్థిపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లో జరిగిన ఫ్రెండ్షిప్ సిరీస్‌లో నిన్న పంటర్స్-మారియో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మారియో టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కృనాల్ సింగ్ (21 బంతుల్లో 60), నదీమ్ ఖాన్ (32 బంతుల్లో 74) చెలరేగడంతో మారియో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 249 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓ ఓవర్ బౌల్ చేసిన అభిషేక్ 13 పరుగులు సమర్పించుకున్నాడు.అనంతరం 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అభిషేక్ టీమ్ (పంటర్స్) 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన అభిషేక్.. మారియో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా సిక్సర్లు బాది మారియో టీమ్ బౌలర్ల భరతం పట్టాడు. ఫలితంగా పంటర్స్ టీమ్ మరో 11 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. పంటర్స్ తరఫున అభిషేక్‌తో పాటు పునీత్ (21 బంతుల్లో 52), లక్షయ్ (29 బంతుల్లో 44 నాటౌట్) రాణించారు.కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. యూవీ మెంటార్షిప్లో అభిషేక్ గత ఐపీఎల్ సీజన్లో అద్భుతాలు చేశాడు. గత సీజన్లో అభిషేక్ 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేసి సన్‌రైజర్స్‌ను ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. -
టీమిండియా చాంపియన్స్ కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
ఈ ఏడాది మరో సరికొత్త టీ20 లీగ్ పురుడు పోసుకోనుంది. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ పేరిట టోర్నీ మొదలుకానుంది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ, సంగీత సంస్థ ఇంగ్లండ్ క్రికెట్‌బోర్డు సాయంతో ఈ టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టింది.రిటైర్డ్ ప్లేయర్లు, నాన్- కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఈ లీగ్‌లో భాగం కానున్నారు. టీమిండియా చాంపియన్స్ సహా ఆరు జట్లు ఇందులో పాల్గొననున్నాయి. జూలై 3 నుంచి 13 వరకు యూకేలో ఈ టీ20 టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.కెప్టెన్‌గా యువరాజ్ సింగ్ఈ క్రమంలో టీమిండియా చాంపియన్స్ తమ జట్టును ప్రకటించింది. సిక్సర్ల కింగ్, 2007(టీ20), 2011(వన్డే) వరల్డ్‌కప్స్ విజేత యువరాజ్ సింగ్ ఈ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సురేశ్ రైనా, పఠాన్ బ్రదర్స్, ఆర్పీ సింగ్ తదితరులు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.కాగా టీమిండియాతో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో ఆస్ట్రేలియా చాంపియన్స్, ఇంగ్లండ్ చాంపియన్స్, సౌతాఫ్రికా చాంపియన్స్, పాకిస్తాన్ చాంపియన్స్, వెస్టిండీస్ చాంపియన్స్ ఆడనున్నాయి.టీమిండియా చాంపియన్స్ జట్టు: యువరాజ్ సింగ్ (కెప్టెన్), సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, గురుక్రీత్ మాన్, హర్భజన్ సింగ్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి.టీమిండియా చాంపియన్స్ షెడ్యూల్జూలై 2న ఇంగ్లండ్, జూలై 5న వెస్టిండీస్, జూలై 6న పాకిస్తాన్, జూలై 8న ఆస్ట్రేలియా, జూలై 10న సౌతాఫ్రికా చాంపియన్స్‌తో టీమిండియా చాంపియన్స్ తలపడనుంది. జూలై 12న సెమీస్ జరుగనుండగా.. జూలై 13న ఫైనల్‌కు ముహూర్తం ఖరారైంది.చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్‌తో కలిసి -
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
#Abhishek Sharma: లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. గత కొన్ని రోజులుగా భారీ స్కోర్లు నమోదు చేయలేక చతికిల పడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఉప్పల్‌లో మాత్రం శివాలెత్తిపోయాడు.మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 28 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు అభిషేక్ శర్మ.హెడ్‌తో కలిసి అజేయంగా నిలిచి 9.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ టార్గెట్ పూర్తి చేసి ఉప్పల్ స్టేడియాన్నిహోరెత్తించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.That's Sunrisers Hyderabad for you 💥#IPLonJioCinema #SRHvLSG #TATAIPL pic.twitter.com/xFiuuafuXa— JioCinema (@JioCinema) May 8, 2024యువీ పాజీకి థాంక్స్ఇక మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆరంభానికి ముందు నేను చేసిన హార్డ్‌వర్క్ ఫలితాన్నిస్తోంది. యువీ పాజీ(యువరాజ్ సింగ్), బ్రియన్ లారా, నా తండ్రికి ధన్యవాదాలు. మా నాన్నే నా మొదటి కోచ్’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు 23 ఏళ్ల అభిషేక్.కాస్త ఓపికగా పట్టుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘అద్భుతంగా ఆడావు అభిషేక్ శర్మ. ఇలాగే నిలకడగా ఆడు. కాస్త ఓపికగా ఉండు! త్వరలోనే నీకూ టైమ్ వస్తుంది’’ అంటూ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలని ఆకాంక్షించాడు.అదే విధంగా ట్రావిస్ హెడ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు ఏ గ్రహం నుంచి వచ్చావు ఫ్రెండ్? అస్సలు నమ్మలేకున్నాం’’ అని యువీ అతడిని ఆకాశానికెత్తాడు. కాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పంజాబ్ యువ సంచలనం అభిషేక్ శర్మకు మెంటార్!!సూపర్ అభికాగా ఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 32(19), 63(23), 29(20), 37(12), 16(11), 34(22), 46(12), 31(13), 15(9), 12(10), 11(16), 75*(28). మొత్తం 195 బంతుల్లో 35 సిక్సర్ల సాయంతో 401 పరుగులు.సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్లు👉వేదిక: ఉప్పల్ స్టేడియం.. హైదరాబాద్👉టాస్: లక్నో.. బ్యాటింగ్👉లక్నో స్కోరు: 165/4 (20)👉సన్‌రైజర్స్ స్కోరు: 167/0 (9.4)👉ఫలితం: 10 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసిన సన్‌రైజర్స్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 89 రన్స్- నాటౌట్). -
రోహిత్‌కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో రోహిత్ ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేకపోయేవాడని.. దాంతో సరదాగా అతడిని తాము ఏడిపించేవాళ్లమని పేర్కొన్నాడు.అయితే, రోహిత్‌కు మాత్రం అందరితో కలిసి ఉండటం ఇష్టమని.. అతడు గొప్ప మనసున్న వ్యక్తి అంటూ యువీ కొనియాడాడు. ఈసారి రోహిత్ శర్మ కచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఇంత వరకూ నో ఐసీసీ టైటిల్స్!టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా సారథిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఒక్క ఐసీసీ టోర్నీలోనూ టైటిల్ అందించలేకపోయాడు. అతడి కెప్టెన్సీలో 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన భారత్.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ చేతులెత్తేసింది.ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లోనూ బోల్తాపడి తృటిలో ట్రోఫీని చేజార్చుకుంది. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా వన్డే కప్-2023 మినహా ఒక్క మెగా ఈవెంట్లోనూ రోహిత్ సేన ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది.రోహిత్‌కు ఇంగ్లిష్ రాదుఈ క్రమంలో ప్రస్తుతం అందరి కళ్లు టీ20 ప్రపంచకప్-2024 మీదే ఉన్నాయి. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఈసారైనా టైటిల్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలుకానున్న ఈ ఐసీసీ టోర్నీకి యువరాజ్ సింగ్ అంబాసిడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడుతూ యువీ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడికి అసలు ఇంగ్లిష్ రాదు. ముంబైలోని బోరివలీ వీధుల నుంచి వచ్చిన వాడు. చాలా సరదాగా ఉంటాడు.ఇంగ్లిష్ విషయంలో మాత్రం అతడిని మేము ఏడిపించేవాళ్లం. భాష సంగతి పక్కనపెడితే అతడి మనసు మాత్రం వెన్న. ఎంత ఎదిగినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. రోహిత్ శర్మలో గొప్ప గుణం అదే.నా బెస్ట్ ఫ్రెండ్ తాను సరదాగా ఉండటంతో పాటు చుట్టూ ఉన్న వాళ్లకు కూడా వినోదం పంచుతాడు. గొప్ప నాయకుడు. క్రికెట్ రంగంలో నాకున్న అత్యంత సన్నిహితుల్లో రోహిత్ కూడా ఒకడు.ఈసారి రోహిత్ శర్మ వరల్డ్‌కప్ ట్రోఫీ ఎత్తాలని.. వరల్డ్‌కప్ మెడల్ మెడలో వేసుకుంటే చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఇందుకు వందకు వంద శాతం అర్హుడు’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.అతడే సరైన కెప్టెన్ ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉన్న రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఉండటం బీసీసీఐ తీసుకున్న సరైన నిర్ణయమని ఈ సందర్భంగా యువీ అన్నాడు. ఐపీఎల్లో ఐదు ట్రోఫీలు గెలిచిన రోహిత్ లాంటి వ్యక్తి టీ20 వరల్డ్‌కప్-2024లోనూ భారత్‌ను ముందుకు నడిపించడం సానుకూలాంశమని పేర్కొన్నాడు.చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే! -
వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024కు మరో ఐదు వారాల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇటీవలే మియామీ గ్రాండ్ ప్రిక్స్‌లో సందడి చేసిన యువరాజ్.. వరల్డ్‌కప్ ట్రోఫితో ఫోటోలకు ఫోజులిచ్చాడు. రేసింగ్ ట్రాక్‌పై వరల్డ్‌కప్ ట్రోఫితో యువీ ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను యువరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన యువీ.. టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలోనే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదాడు. ఇప్పటికి టీ20 వరల్డ్‌కప్ అంటే యువరాజ్ సింగ్ కోసం ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యువీని ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. యువీ.. ఉసెన్ బోల్ట్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్‌కప్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. -
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 30). హిట్‌మ్యాన్ మంగళవారం నాడు 37వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.బీసీసీఐ కార్యదర్శి జై షా సహా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, వసీం జాఫర్ తదితరులు రోహిత్ శర్మకు విషెస్ తెలిపారు. ఇక హిట్‌మ్యాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ ముంబై ఇండియన్స్ అతడి బర్త్‌డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్ కోసం ప్రత్యేక వీడియోను షేర్ చేసింది.మా జట్టు గుండె చప్పుడు‘‘భారత క్రికెట్లో ఉత్తుంగతరంగంలా దూసుకుపోతున్న మా కెప్టెన్ రోహిత్ శర్మకు హ్యాపీ బర్త్‌డే! నీ నాయకత్వ పటిమ, నైపుణ్యం అమోఘం. మా జట్టు గుండె చప్పుడు నువ్వు.బౌండరీలు బాదుతూ.. మరో వసంతంలోకి! చరిత్ర పుటల్లోకెక్కిన హిట్‌మ్యాన్.. నువ్వు మరింత ప్రకాశవంతంగా వెలిగిపోవాలి’’ అని జై షా ఆకాంక్షించాడు.సోదర సమానుడు‘‘ఆయురారోగ్యాలు, సంతోషాలతో నువ్వెప్పుడూ విలసిల్లాలి రోహిత్’’ అంటూ గంభీర్ విష్ చేశాడు. ఇక యువీ.. ‘‘సోదర సమానుడు రోహిత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు జాలువారాలి’’ అని విషెస్ తెలిపాడు.కాగా ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్న ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ భార్య రితికాతో కలిసి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇందులో సూర్యకుమార్ యాదవ్, అతడి భార్య దేవిషా శెట్టి కూడా కనిపిస్తున్నారు. కాగా ముంబై మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. HBD Rohit Sharma: హిట్‌మ్యాన్ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే! -
T20 WC: డీకే అవసరమా?.. వాళ్లిద్దరు బెస్ట్!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో జట్ల ప్రకటనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మే 1ని డెడ్‌లైన్‌గా విధించింది. ఆలోపు మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టు ఎంపికపై చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్.. మెగా టోర్నీలో ఆడాల్సిన భారత వికెట్ కీపర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.పోటీలో ఆ నలుగురు!కాగా ప్రపంచకప్ జట్టులో బెర్తు కోసం రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో డీకే ఐపీఎల్-2024లో ఆర్సీబీకి ఆడుతూ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 195.52 స్ట్రైక్‌రేటుతో 262 పరుగులు చేశాడు. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దాదాపు 14 నెలల విరామం తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టినా.. ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు.ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 342 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా రాణిస్తూ.. వికెట్ కీపర్ బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఇప్పటి దాకా 385 రన్స్‌తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.డీకే అవసరమా?ఈ లిస్టులో సంజూ తర్వాత కేఎల్ రాహుల్ 378 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువీ ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘డీకే ప్రస్తుతం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ గతసారి(2022) టీ20 వరల్డ్‌కప్‌లో అతడు రాణించలేకపోయాడు.కాబట్టి ఈసారి జట్టుకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. నిజానికి రిషభ్ పంత్, సంజూ శాంసన్ రూపంలో ఇద్దరు యువ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. -
రోహిత్, స్కై కాదు!.. వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టేది ఇతడే!
2007.. అంతర్జాతీయ క్రికెట్ మండలి మొట్టమొదటి సారి నిర్వహించిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో నాటి టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ సృష్టించిన పరుగుల విధ్వంసాన్ని అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు.ఒకే ఓవర్లో ఏకంగా ఆరు సిక్సర్లు బాది యువీ అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి ఏకంగా 36 పరుగులు పిండుకుని.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.‘న భూతో న భవిష్యతి’ అన్న రీతిలో తాను సాధించిన ఘనత గురించి ఎదురైన ప్రశ్నకు యువరాజ్ సింగ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫీట్‌ను పునరావృతం చేయగలడని భావిస్తున్నట్లు తెలిపాడు.జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ఐసీసీ టోర్నీ కోసం మే 1 లోపు జట్లను ప్రకటించేందుకు ఇరవై దేశాల బోర్డులు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.అతడికి కూడా ఛాన్స్ ఇవ్వాలిఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న పేస్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యాకు ఈ జట్టులో చోటు దక్కడం కష్టమేనని భావిస్తున్నారు. అతడికి బదులు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివం దూబేకు ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన సందర్భంగా.. ‘‘ఈసారి వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగల సత్తా ఎవరికి ఉంది?’’ అని యువరాజ్ సింగ్‌కు ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనైతే హార్దిక్ పాండ్యానే సాధిస్తాడనుకుంటున్నా’’ అని యువీ పేర్కొన్నాడు. అదే సమయంలో ప్రపంచకప్ జట్టులో శివం దూబేకు కూడా చోటు ఇవ్వాలని యువీ అభిప్రాయపడ్డాడు. ‘‘టీమిండియాలో అతడికి సుస్థిర స్థానం ఉండటం లేదు. కానీ ఐపీఎల్లో మాత్రం బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు.కాబట్టి అతడిని జట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్-2024లో జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.ఇక తొట్టతొలి పొట్టి ప్రపంచకప్-2007ను ధోని సేన గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ టీ20 ఫార్మాట్లో టీమిండియా టైటిల్ గెలవలేదు.చదవండి: సహనం కోల్పోయిన గంభీర్... అంపైర్‌తో గొడవ! ఆఖరికి.. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC 2024: యువరాజ్ సింగ్‌కు కీలక బాధ్యతలు
టీమిండియా మాజీ ఆటగాడు, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్‌కు ఐసీసీ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. త్వరలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ 2024కు రాయబారిగా నియమించింది. యువరాజ్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఎనిమిది సార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ఉసేన్ బోల్ట్‌తో కలిసి పొట్టి ప్రపంచకప్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడని ఐసీసీ ప్రకటించింది. Who will make it to India’s squad for the ICC Men’s #T20WorldCup 2024? 🤔Event Ambassador @Yuvstrong12 has some exciting prospects on his list 👀https://t.co/YlDetOGdYs— T20 World Cup (@T20WorldCup) April 26, 2024 మెగా టోర్నీలో భాగంగా జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో సహా యుఎస్ఏలో జరిగే మొత్తం మ్యాచ్‌ల ప్రమోషన్ బాధ్యతలను యువరాజ్‌కు అప్పజెప్పింది. టీ20 వరల్డ్‌కప్‌కు ఐసీసీ రాయబారిగా ఎంపిక కావడంపై యువరాజ్ స్పందిస్తూ.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం వంటి మరుపురాని జ్ఞాపకాలు పొట్టి ప్రపంచకప్‌తో ముడిపడి ఉన్నాయి.ఇలాంటి మెగా ఈవెంట్లో మరోసారి భాగం కావడం నా అదృష్టం. వరల్డ్‌కప్ రాయబారిగా నా బాధ్యతలు నిర్వర్తించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని అన్నాడు. భారత్-పాక్ మ్యాచ్‌పై యువీ స్పందిస్తూ.. ఈ ఏడాది ప్రపంచంలో జరుగబోయే అతిపెద్ద క్రీడా సంగ్రామమంగా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్‌తో పాటు కెనడా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరం (భారత్-పాక్ మ్యాచ్) జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. -
బర్త్‌డే స్పెషల్.. చిన్నారులతో ఫుట్ బాల్ ఆడిన సచిన్! వీడియో వైరల్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం (ఏప్రిల్ 24) తన 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఓజా వంటి మాజీ క్రికెటర్లు సచిన్‌కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఐసీసీ, బీసీసీఐ కూడా సచిన్‌కు ఎక్స్ వేదిగా స్పెషల్ విషెస్ తెలియజేసింది. కాగా సచిన్ తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను సతీమణి అంజలితో కలిసి ‘సచిన్ టెండ్కూల్కర్ ఫౌండేషన్’లో జరపునకున్నాడు. చాలా సమయం పాటు అక్కడ ఉన్న చిన్నారులతో సచిన్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన విషయాలను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు."ఈసారి నా బర్త్‌డే సెలబ్రేషన్స్ భిన్నంగా చేసుకోవడం చాల సంతోషంగా ఉంది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సాయంతో ఎదుగుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. వారితో ఫుట్‌బాల్ ఆడటం, నా స్టోరీలను పంచుకోవడం ఎంతో అనుభూతిని ఇచ్చింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వీరే ఫస్ట్ అనుకుంటాను. ఈ మూమెంట్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని" తన బర్త్‌డే వేడుకల సంబంధించిన వీడియో క్లిప్‌ను సచిన్ ఎక్స్‌లో షేర్ చేశాడు. Happy birthday paaji! 🎉 From smashing bowlers on the field to smashing life goals, you're the reason I learned to aim higher in life (and sometimes on the field too 🤪) Here's wishing you loads of love, good health and happiness always 🤗❤️@sachin_rt #HappyBirthdaySachin pic.twitter.com/t6qFKgKJmZ— Yuvraj Singh (@YUVSTRONG12) April 24, 2024 -
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అశుతోష్.. యువరాజ్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృస్టించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అశుతోష్ సుడిగాలి ఇన్నింగ్స్ విరుచుకుపడినప్పటికీ పంజాబ్‌కు పరాభవం తప్పలేదు. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యానికి పంజాబ్ 10 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. కాగా, అశుతోష్ పేరిట టీ20ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఉన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. సరిగ్గా ఆరు నెలల కిందట సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో అశుతోష్ 11 బంతుల్లో ఫిఫ్టి కొట్టాడు. ఆ టోర్నీలో రైల్వేస్‌కు ఆడిన అశుతోష్.. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో 11 బంతుల్లో బౌండరీ, ఎనిమిది సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తర్వాత అశుతోష్.. యువరాజ్ సింగ్ పేరిట ఉండిన సెకెండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో యువరాజ్ ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దాదాపు 16 ఏళ్ల పాటు టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా కొనసాగింది. అయితే అశుతోష్ 11 బంతులు హాఫ్ సెంచరీ చేయడానికి నెల ముందు ఈ రికార్డుకు బీటలు పడ్డాయి. 2023 ఏషియన్ గేమ్స్‌లో నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్.. మంగోలియాపై కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇదిలా ఉంటే, 25 ఏళ్ల అశుతోష్ తన తొలి ఐపీఎల్ సీజన్లో (2024) చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో అశుతోష్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 205.3 స్ట్రయిక్‌రేట్‌తో 52 సగటున 156 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అశుతోష్ ఇప్పటివరకు 13 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. ఐపీఎల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అశుతోష్ స్కోర్లు ఇలా ఉన్నాయి. - 31(17). - 33*(15). - 31(26). - 61(28). -
6 బంతుల్లో ఆరు సిక్స్‌లు .. నేపాల్ బ్యాటర్ వరల్డ్ రికార్డు! వీడియో వైరల్
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో నేపాల్ స్టార్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో రెండు సార్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా దీపేంద్ర సింగ్ రికార్డులకెక్కాడు. ఏసీసీ ప్రీమియర్ కప్ -2024లో భాగంగా ఒమెన్ వేదికగా ఖతార్‌తో మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. నేపాల్ ఇన్నింగ్స్ 20 ఓవర్ వేసిన ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో ఐరీ వరుసగా ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొన్న దీపేంద్ర సింగ్ 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు ఏషియన్ గేమ్స్-2023లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఐరీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. తద్వారా ఈ వరల్డ్ రికార్డును ఐరీ పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు వరల్డ్‌క్రికెట్‌లో ఎవరూ రెండు సార్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదలేదు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో ఐరీ కంటే ముందు యువరాజ్ సింగ్, కీరాన్ పొలార్డ్ 6 బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదారు. 𝗨𝗡𝗥𝗘𝗔𝗟 😵💫#NEPvQAT #ACCMensPremierCup #ACC pic.twitter.com/72Itd5INE1 — AsianCricketCouncil (@ACCMedia1) April 13, 2024 -
IPL 2024: నీకు ‘బడిత పూజ’ తప్పదు.. యువీ ‘ఫైర్’!
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి ‘కోపం’ ప్రదర్శించాడు. గతంలో అభిషేక్‌కు చెప్పు చూపి బెదిరించిన యువీ.. ఈసారి నీకు బడిత పూజ తప్పదన్నట్లుగా ఓ మీమ్ షేర్ చేశాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 166 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు ఈ లెఫ్టాండ్ ఓపెనర్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. సీఎస్కే బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ కేవలం 12 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లతో పాటు ఏకంగా నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్ రేటు ఏకంగా 308.33. అయితే, అతడి అభిషేక్ బ్యాటింగ్ మెరుపులు ఇంకాసేపు చూడాలని భావించిన అభిమానుల ఆశలపై దీపక్ చహర్- రవీంద్ర జడేజా నీళ్లు చల్లారు. I’m right behind you boy …well played again - but bad shot to get out on 🤨@IamAbhiSharma4 #CSKvsSRH pic.twitter.com/IF8qLZ5S9Z — Yuvraj Singh (@YUVSTRONG12) April 5, 2024 రైజర్స్ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్లో చహర్ వేసిన నాలుగో బంతి అవుట్ ఆఫ్ దిశగా వైడ్ వెళ్తుండగా.. అభిషేక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా బంతిని కొట్టగా.. ఫీల్డర్ జడ్డూ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా అభిషేక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 ఏదేమైనా ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించిన అభిషేక్ శర్మను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ క్రమంలో అతడిపై ప్రశంసలు కురిపిస్తూనే చిరుకోపం ప్రదర్శించాడు యువీ. ‘‘నేను ఎల్లప్పుడూ నీకు మద్దతుగానే ఉంటాను బాబూ.. మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడావు. అయితే, ఈసారి కూడా చెత్త షాట్ సెలక్షన్‌కు అవుటయ్యావు’’ అంటూ ఓ వ్యక్తి కర్ర లాంటి వస్తువుతో మరో వ్యక్తిని తరుముతున్నట్లుగా ఉన్న హిలేరియస్ మీమ్ ఒకటి షేర్ చేశాడు. యువీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ యువీకి వీరాభిమాని. ఇక అభిషేక్‌కు యువరాజ్ మెంటార్‌గా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ.. ‘‘యువీ పాజీ.. ధన్యవాదాలు’’ అంటూ కృతజ్ఞత చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. ఐపీఎల్-2024 ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే ►టాస్- ఎస్ఆర్హెచ్- బౌలింగ్ ►సీఎస్కే స్కోరు: 165/5 (20) ►ఎస్ఆర్హెచ్: 166/4 (18.1). ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై సన్‌రైజర్స్ విజయం. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WC 2011: ఊహించని షాకులు.. ఆ మధుర జ్ఞాపకాలు మరువగలమా?!
‘‘2011.. మేము ప్రపంచకప్ ఎత్తిన రోజు. ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అద్భుతమైన జట్టుతో మరుపురాని జ్ఞాపకాలు’’.. ‘‘ఆ అద్భుత క్షణంలోకి మరొక్కసారి’’.. టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యులైన సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ భావోద్వేగం.సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఇదే రోజున.. ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు జగజ్జేతగా అవతరించింది. సొంత గడ్డపై ప్రఖ్యాత వాంఖడే మైదానంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ధోని సేన.క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ చిరకాల కలను నెరవేర్చి.. అపూర్వ విజయాన్ని అతడికి బహుమతిగా అందించింది. నాడు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ బాదగానే కోట్లాది మంది భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి.వాంఖడేలో ఉన్న దాదాపు 33 వేల మంది మా తుజే సలాం అంటూ జట్టును ఉత్సాహపరిచారు. మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు యావత్ భారతావని ఆనందంతో పులకించిపోయింది. ఆ అపురూప క్షణాన్ని చెరగని జ్ఞాపకంగా గుండెల్లో పదిలపరచుకున్నారు అభిమానులు. వారిలో మీరూ ఒకరా?!.. మరి ఆనాటి మ్యాచ్ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందామా?శుభారంభం లభించినాముంబైలోని వాంఖడే స్టేడియం.. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుమార్ సంగక్కర తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత పేసర్ జహీర్ ఖాన్ ఆరంభంలోనే ఓపెనర్ ఉపుల్ తరంగ(2)ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం హర్భజన్ సింగ్ మరో ఓపెనర్ తిలకరత్రె దిల్షాన్(33)ను అవుట్ చేయగా.. యువరాజ్ సింగ్.. కెప్టెన్ కుమార్ సంగక్కర(48) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.వరుస వికెట్లు తీసిన టీమిండియా ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. నాలుగో నంబర్ బ్యాటర్ మహేళ జయవర్ధనే అజేయ శతకం(103)తో విరుచుకుపడ్డాడు. అయితే, మిగతా వాళ్లలో మళ్లీ ఒక్కరు కూడా కనీసం 35 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.ఊహించని షాకులుఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఊహించని షాకిచ్చాడు లసిత్ మలింగ. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(0)ను డకౌట్ చేశాడు. మైదానమంతా నిశ్శబ్దం. ఆ తర్వాత కాసేపటికే సచిన్ టెండుల్కర్(18) కూడా అవుట్!ఊపిరులూదిన గంభీర్ఆ సమయంలో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత శిబిరంతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నింపాడు వన్‌డౌన్ బ్యాటర్ గౌతం గంభీర్. 122 బంతులు ఎదుర్కొని 97 పరుగులు సాధించాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. అంతకంటే విలువైన ఇన్నింగ్సే ఆడాడు.ధనాధన్ ధోనిమిగిలిన వాళ్లలో విరాట్ కోహ్లి 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు కెప్టెన్ ధోని. యువరాజ్ సింగ్(21 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. ఆ క్షణాన్ని మర్చిపోగలమా?ఇక నలభై తొమ్మిదవ ఓవర్ రెండో బంతికి అతడు కొట్టిన విన్నింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్షణంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 79 బంతులు ఎదుర్కొన్న ధోని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించిన భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో వాంఖడేతో పాటు దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి.Probably the greatest ever night for any Indian fan which came under MS Dhoni's captaincy. The atmosphere and feeling were unmatched. pic.twitter.com/bzrIKRbsts— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2022చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగాReliving this feeling ❤️🇮🇳🏆#CWC2011 pic.twitter.com/zT9C0FSusg— Yuvraj Singh (@YUVSTRONG12) April 2, 2024 -
WC 2011: ఊహించని షాకులు.. ఆ మధుర జ్ఞాపకాలు మరువగలమా?!
‘‘2011.. మేము ప్రపంచకప్ ఎత్తిన రోజు. ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అద్భుతమైన జట్టుతో మరుపురాని జ్ఞాపకాలు’’.. ‘‘ఆ అద్భుత క్షణంలోకి మరొక్కసారి’’.. టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యులైన సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ భావోద్వేగం. సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఇదే రోజున.. ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు జగజ్జేతగా అవతరించింది. సొంత గడ్డపై ప్రఖ్యాత వాంఖడే మైదానంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ధోని సేన. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ చిరకాల కలను నెరవేర్చి.. అపూర్వ విజయాన్ని అతడికి బహుమతిగా అందించింది. నాడు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ బాదగానే కోట్లాది మంది భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. వాంఖడేలో ఉన్న దాదాపు 33 వేల మంది మా తుజే సలాం అంటూ జట్టును ఉత్సాహపరిచారు. మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు యావత్ భారతావని ఆనందంతో పులకించిపోయింది. ఆ అపురూప క్షణాన్ని చెరగని జ్ఞాపకంగా గుండెల్లో పదిలపరచుకున్నారు అభిమానులు. వారిలో మీరూ ఒకరా?!.. మరి ఆనాటి మ్యాచ్ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందామా? శుభారంభం లభించినా ముంబైలోని వాంఖడే స్టేడియం.. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుమార్ సంగక్కర తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత పేసర్ జహీర్ ఖాన్ ఆరంభంలోనే ఓపెనర్ ఉపుల్ తరంగ(2)ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం హర్భజన్ సింగ్ మరో ఓపెనర్ తిలకరత్రె దిల్షాన్(33)ను అవుట్ చేయగా.. యువరాజ్ సింగ్.. కెప్టెన్ కుమార్ సంగక్కర(48) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస వికెట్లు తీసిన టీమిండియా ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. నాలుగో నంబర్ బ్యాటర్ మహేళ జయవర్ధనే అజేయ శతకం(103)తో విరుచుకుపడ్డాడు. అయితే, మిగతా వాళ్లలో మళ్లీ ఒక్కరు కూడా కనీసం 35 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. ఊహించని షాకులు ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఊహించని షాకిచ్చాడు లసిత్ మలింగ. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(0)ను డకౌట్ చేశాడు. మైదానమంతా నిశ్శబ్దం. ఆ తర్వాత కాసేపటికే సచిన్ టెండుల్కర్(18) కూడా అవుట్! ఊపిరులూదిన గంభీర్ ఆ సమయంలో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత శిబిరంతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నింపాడు వన్‌డౌన్ బ్యాటర్ గౌతం గంభీర్. 122 బంతులు ఎదుర్కొని 97 పరుగులు సాధించాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. అంతకంటే విలువైన ఇన్నింగ్సే ఆడాడు. ధనాధన్ ధోని మిగిలిన వాళ్లలో విరాట్ కోహ్లి 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు కెప్టెన్ ధోని. యువరాజ్ సింగ్(21 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. ఆ క్షణాన్ని మర్చిపోగలమా? ఇక నలభై తొమ్మిదవ ఓవర్ రెండో బంతికి అతడు కొట్టిన విన్నింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్షణంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 79 బంతులు ఎదుర్కొన్న ధోని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించిన భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో వాంఖడేతో పాటు దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి. Probably the greatest ever night for any Indian fan which came under MS Dhoni's captaincy. The atmosphere and feeling were unmatched. pic.twitter.com/bzrIKRbsts — Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2022 చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా Reliving this feeling ❤️🇮🇳🏆#CWC2011 pic.twitter.com/zT9C0FSusg — Yuvraj Singh (@YUVSTRONG12) April 2, 2024 -
చెప్తే అర్థం కాదా?.. సన్‌రైజర్స్ స్టార్‌కు చెప్పు చూపించిన యువీ!
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో ‘‘నీకోసం.. ప్రత్యేకంగా ఓ చెప్పు ఎదురుచూస్తోంది’’ అంటూ ఊహించని షాకిచ్చాడు. ఇంతకీ విషయమేమిటంటే.. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(277) నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ శర్మ వీర విహారం చేశాడు. కేవలం 23 బంతుల్లోనే 63 పరుగులతో అదరగొట్టాడు. 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో పరుగుల సునామీ సృష్టించి.. సన్‌రైజర్స్ తరఫున వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేశాడు. Abhishek Sharma's scintillating knock comes to an end but he's put @SunRisers on 🔝 with his astonishing strokes 🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/OoHgAK6yge — IndianPremierLeague (@IPL) March 27, 2024 అయితే, ముంబై బౌలర్ పీయూష్ చావ్లా సంధించిన షార్ట్‌బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేక నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘సూపర్ సర్.. వారెవ్వా అభిషేక్.. గొప్ప ఇన్నింగ్స్. కానీ ఇలాంటి షాట్‌కు అవుటవుతావా? నీకు మంచిగా చెబితే అర్థం కాదు కదా? అందుకే ఇప్పుడు నీ కోసం ప్రత్యేకంగా ఓ స్లిప్పర్ ఎదురుచూస్తోంది. వచ్చెయ్’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. అదే విధంగా.. హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ఇన్నింగ్స్‌ను కూడా కొనియాడాడు. కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్‌కు యువీ ఆరాధ్య క్రికెటర్. అంతేకాకుండా.. అతడికి మెంటార్ కూడా! Waah sir Abhishek waah 👏🏻 great innings but what a splendid shot to get out on! Laaton ke bhoot baaton se nahi maante! Special 🩴 waiting for you now @IamAbhiSharma4 Great knock by Klassy #Klaasen! #SRHvMI #IPL2024 — Yuvraj Singh (@YUVSTRONG12) March 27, 2024 అందుకే యువరాజ్ ఈ మేరకు అభిషేక్ ఆట తీరును విశ్లేషిస్తూ.. చొరవగా ఇలా ట్వీట్ చేశాడు. కాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు ట్రవిస్ హెడ్(24 బంతుల్లో 62), మార్క్రమ్(28 బంతుల్లో 42 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్(34 బంతుల్లో 80 నాటౌట్) దుమ్ములేపారు. ఫలితంగా 277 పరుగులు స్కోరు చేసిన సన్‌రైజర్స్.. ముంబైని 246 పరుగులకు కట్టడి చేసి 31 పరుగుల తేడాతో గెలిచింది. చదవండి: #SRHvsMI: ఎగిరి గంతేసిన కావ్య.. తలపట్టుకున్న నీతా అంబానీ! వైరల్ The moment when @SunRisers created HISTORY! Final over flourish ft. Heinrich Klaasen 🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/QVERNlftkb — IndianPremierLeague (@IPL) March 27, 2024 WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 -
యువరాజ్ సింగ్ పోరాటం వృధా.. లెజెండ్స్ టైటిల్ నెగ్గిన ఉతప్ప జట్టు
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న తొలి లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీని రాజస్థాన్ కింగ్స్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో రాబిన్ ఉతప్ప సారధ్యం వహిస్తున్న రాజస్థాన్.. యువరాజ్ సింగ్ నాయకత్వంలోని న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రయికర్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూయార్క్‌ను గెలిపించేందకు యువరాజ్ సింగ్ చివరివరకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. ఆష్లే నర్స్ (41 బంతుల్లో 97), హ్యామిల్టన్ మసకద్జ (30 బంతుల్లో 56) చెలరేగడంతో నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూయార్క్ బౌలర్లలో జేరోమ్ టేలర్ 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ ప్రదీప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూయార్క్.. యువరాజ్ సింగ్ మెరుపు అర్దశతకంతో (22 బంతుల్లో 54) మెరిసినప్పటికీ ఓటమిపాలైంది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో కపుగెదెర (30), గుణరత్నే (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో పర్విందర్ అవానా, జకాతి, బిపుల్ శర్మ, చతురంగ డిసిల్వ, ఆష్లే నర్స్ తలో వికెట్ పడగొట్టారు. -
అతడు టీమిండియా కెప్టెన్.. వేటు వేస్తారా?: యువీ
ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు అంశంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యాకు హడావుడిగా కెప్టెన్సీ అప్పగించి.. రోహిత్ శర్మపై వేటు వేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ తమకు కొత్త కెప్టెన్ వచ్చినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఐదుసార్లు జట్టుకు టైటిల్ అందించిన రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకున్న పాండ్యాను తమ నాయకుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులతో పాటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్‌మ్యాన్‌కు ఇది అవమానమేనంటూ సోషల్ మీడియా వేదికగా ఎంఐ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తూర్పారబట్టారు. అయితే, ఫ్రాంఛైజీ మాత్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కెప్టెన్ మార్పు చేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా యువరాజ్ సింగ్ ఈ అంశంపై స్పందించాడు. ‘‘కెప్టెన్‌గా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మది. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడం అనేది సాహసోపేత నిర్ణయం. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం వెనుక వాళ్ల కారణాలు వాళ్లకు ఉండి ఉంటాయని అర్థం చేసుకోగలను. కానీ.. నా అభిప్రాయం ప్రకారం.. కనీసం ఈ ఒక్క సీజన్‌కైనా కెప్టెన్‌గా రోహిత్‌ను కొనసాగించాల్సింది. పాండ్యాను అతడికి డిప్యూటీగా నియమించి పరిశీలించమని చెప్పాల్సింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. నిజమే.. కానీ రోహిత్ ఇప్పటికీ అద్భుతంగా ఆడుతున్నాడు. టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. అలాంటపుడు అతడిని తప్పించడం ఎంత వరకు ఆమోదయోగ్యం?’’ అని యువరాజ్ సింగ్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. అదే విధంగా.. హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అవును.. అతడు అద్భుతమైన నైపుణ్యాలున్న ఆటగాడే. అయితే, గుజరాత్ టైటాన్స్‌ను ముందుకు నడిపించడానికి.. ముంబై కెప్టెన్‌గా వ్యవహరించడానికి చాలా తేడా ఉంటుంది. ముంబై ఏ రకంగా చూసినా పెద్ద జట్టు. అందుకు తగ్గట్లుగానే అంచనాలు కూడా భారీగానే ఉంటాయి’’ అని యువీ హెచ్చరించాడు. కాగా మార్చి 22న ఐపీఎల్-2024 ఆరంభం కానుండగా.. మార్చి 24న ముంబై-తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. -
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ?.. స్పందించిన యువరాజ్ సింగ్
తన రాజకీయ రంగ ప్రవేశం గురించి వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలు ఒక్కటే మార్గం కాదని.. తన ఫౌండేషన్ ద్వారా వీలైనన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని యువీ పేర్కొన్నాడు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా బీజేపీ తరఫున యువరాజ్ సింగ్ ఎన్నికల బరిలో దిగుతాడని వార్తలు వినిపించాయి. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి యువీ లోక్‌సభకు పోటీ చేయనున్నాడంటూ ప్రచారం జరిగింది. సాయం చేయడం అంటే ఇష్టం సిట్టింగ్ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ స్థానంలో అతడికి బీజేపీ టికెట్ ఇస్తోందంటూ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో యువీ దిగిన ఫొటో నెట్టింట వైరల్ అయింది. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లేనని యువరాజ్ సింగ్ కొట్టిపారేశాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. నేను గురుదాస్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయడం, వారికి మద్దతుగా నిలవడం నాకు ఇష్టం. అందుకోసం నా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను. ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాను. గొప్ప మార్పు తెచ్చేందుకు నా వంతు ప్రయత్నంలో మీరూ భాగం కండి’’ అని యువీ తన అభిమానులకు పిలుపునిచ్చాడు. దిగ్గజ ఆల్‌రౌండర్‌గా కాగా భారత క్రికెట్లో దిగ్గజ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరొందిన యువరాజ్ సింగ్.. 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తీరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అదే విధంగా టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంలోనూ యువీది కీలక పాత్ర. ఆల్‌రౌండర్ ప్రతిభతో అదరగొట్టి నాటి ఐసీసీ ఈవెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో క్యాన్సర్ బారిన పడ్డ యువీ కోలుకున్న తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇక 2019లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ ప్రస్తుతం తన ఫౌండేషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. భార్య హాజిల్ కీచ్, కుమారుడు ఓరియాన్, కుమార్తె ఆరాతో కలిసి సమయం గడుపుతున్నాడు. Contrary to media reports, I'm not contesting elections from Gurdaspur. My passion lies in supporting and helping people in various capacities, and I will continue to do so through my foundation @YOUWECAN. Let's continue making a difference together to the best of our abilities❤️ — Yuvraj Singh (@YUVSTRONG12) March 1, 2024 చదవండి: Gautam Gambhir: గంభీర్ సంచలన ప్రకటన.. బీజేపీకి గుడ్‌బై! -
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న యువరాజ్ సింగ్..?
టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయనున్నాడని భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. యువీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్దిగా బరిలో నిలుస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. తాజాగా యువీ.. తల్లి షబ్నమ్తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడంతో ఈ ప్రచారం నిజమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై యువీ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం గురుదాస్‌పూర్ ఎంపీగా సినీ నటుడు సన్నీ డియోల్ ఉన్నాడు. ఇతను 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దిగా భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో మరో సినీ నటుడు కూడా ఎంపీగా గెలిచాడు. మునుపటి తరం బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్దిగా పలుమార్లు గెలిచాడు. 1998, 1999, 2004, 2014లో వినోద్ ఖన్నా గురుదాస్‌పూర్ ఎంపీగా గెలిచాడు. ఈ నియోజకవర్గం భారత్-పాకిస్తాన్ బోర్డర్‌ను ఆనుకుని ఉంటుంది. కాగా, భారత క్రికెటర్లు రాజకీయాల్లో రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. కొందరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుతం టర్బనేటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎంపీగా (ఆమ్ ఆద్మీ పార్టీ) కొనసాగుతున్నాడు. లోక్‌సభ విషయానికొస్తే.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇతను 2019లో బీజేపీ అభ్యర్దిగా గెలుపొందాడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతున్న యువరాజ్ సింగ్.. ప్రస్తుత ఎంపీలు గంభీర్, హర్బజన్ సింగ్ సమకాలీకులే కావడం విశేషం. -
యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ, ఇపుడు ఎందుకు వైరల్?!
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తల్లి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. పంచకులలోని మానసా దేవి కాంప్లెక్స్‌లోని తమ ఇంట్లో నగదు, నగలు మాయమైనట్లు యువరాజ్ తల్లి షబ్మాన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంచకుల ఇంటి నుంచి సుమారు 70వేల విలువైన నగదు, నగలు చోరీకి గురయ్యాయని, తన ఫిర్యాదులో వెల్లడించారు. ఈ ఘటన ఆరు నెలల క్రితమే జరిగినప్పటికీ, ఇప్పుడు ఇంటర్నెట్లో ఇదే వార్త హల్చల్ చేస్తోంది. యువరాజ్ తల్లి, షబ్నమ్ సింగ్ ఇప్పటికే పోలీసులలో కేసు నమోదు చేశారు. హౌస్ కీపింగ్ సిబ్బంది, సాకేత్డికి చెందిన లలితా దేవి,బీహార్‌కు చెందిన వంట మనిషి సిల్దార్ పాల్‌పై అనుమానాలు లేవనెత్తారు.దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ ఘటన మళ్లీ వైరల్ అవుతోంది. ఫోన్లో వ్యక్తిగత సమాచారం ఉందని, దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యువరాజ్ సింగ్ తల్లి ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్ ఈ చోరీ జరిగింది. తమ సిబ్బందిలోఇద్దరు ఇంటి నుంచి వెళ్లిన ఆరు నెలలకే దొంగతనం జరిగిందని ఆమె పేర్కొన్నారు. గురుగ్రామ్‌లో ఉంటున్న సమయంలో నిందితులు తమ ఇంటిని విడిచిపెట్టినట్లు ఫిర్యాదులో తెలిపారు. కాగా యువరాజ్ సింగ్ మాజీ నటి , మోడల్ అయిన హాజెల్ కీచ్‌ను 2016, నవంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమారుడు ఓరియన్, కుమార్తె ఆరా ఉన్నారు. -
ఆ జట్టు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్..
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలోనే మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2024లో భాగం కానున్నాడు. న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రైకర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ స్ట్రైకర్స్ బుధవారం కీలక ప్రకటన చేసింది. యువీని తమ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. యువరాజ్ సింగ్ తమ జట్టుకు ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఫ్రాంఛైజీ.. అతడికి సాదర స్వాగతం పలుకుతున్నామని పేర్కొంది. తొలి సీజన్ విజేతలుగా ఆ జట్లు కాగా గతేడాది ప్రారంభమైన లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ టోర్నీలో ఆరు జట్లు చండీగఢ్ చాంప్స్, నాగ్‌పూర్ నింజాస్, పట్నా వారియర్స్, వైజాగ్ టైటాన్స్, ఇండోర్ నైట్స్, గువాహటి అవెంజర్స్ పాల్గొన్నాయి. మార్చి 22 నుంచి 30 వరకు ఘజియాబాద్‌లో టోర్నీ జరిగింది. ఇక మాజీ క్రికెటర్లు పాల్గొన్న ఈ టీ20 లీగ్‌లో సురేశ్ రైనా సారథ్యంలోని ఇండోర్ నైట్స్, యూసఫ్ పఠాన్ కెప్టెన్సీలోని గువాహటి అవెంజర్స్ సంయుక్త విజేతలుగా నిలిచాయి. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దైన నేపథ్యంలో ఈ రెండు జట్లను చాంపియన్స్‌గా ప్రకటించారు. అయితే, ఈసారి ఈ లీగ్‌లో న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రైకర్స్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజా ప్రకటన ద్వారా తేలింది. కండిషన్స్ ఇవే ఇక లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ ఈసారి మార్చి 7 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. శ్రీలంకలోని కాండీ వేదికగా ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. అదే విధంగా.. ఈసారి 90 బాల్ ఫార్మాట్లో టోర్నీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఓ జట్టు ఐదుగురు బౌలర్లను బరిలోకి ఇదింపి ఒక్కొక్కరిచే మూడు ఓవర్లు వేయించాలి. అయితే, కెప్టెన్ నిర్ణయానుసారం ఒక్కరిచే మాత్రం నాలుగు ఓవర్లు వేయించవచ్చు. అయితే, 60వ బంతి పడకముందే బౌలింగ్ జట్టు కెప్టెన్ తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది. Delighted to announce the legendary Yuvraj Singh joining our team! Get ready for some electrifying moments on and off the field. Welcome aboard, Yuvi! 💥 @YUVSTRONG12 📸 - @BCCI #NewYorkStrikers #NYSSquad #NY #YuvrajSingh pic.twitter.com/Kc2RWwpiMP — New York Strikers (@NewYorkStrikers) February 14, 2024 -
సచిన్, యువరాజ్ మెరుపులు.. సిక్సర్‌తో గెలిపించిన ఇర్ఫాన్ పఠాన్
సచిన్ టెండూల్కర్‌తో పాటు భారత్, ఇతర దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు మరోసారి బరిలోకి దిగారు. మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ' కప్‌లో వీరంతా రెండు టీమ్‌లుగా విడిపోయి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ ద్వారా సేకరించబడే డబ్బును మధుసూదన్ సాయి గ్లోబల్ మిషన్ వారు నిరుపేదల కోసం వినియోగిస్తారు. Sachin Ramesh Tendulkar is Back Guys 🔥🐐pic.twitter.com/170aFmQQ9Q — Arun Vijay (@AVinthehousee) January 18, 2024 ఐక్యత యొక్క శక్తిని, మానవత్వం యొక్క బలాన్ని, సామాజిక బాధ్యత యొక్క భావాన్ని వెదజల్లడానికి ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. Sachin Tendulkar rolling his arms after a long time and got a wicket.pic.twitter.com/4WiqVlCsZu— Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ కెప్టెన్సీలోని వన్ వరల్డ్, యువరాజ్ సింగ్ నాయకత్వంలోని వన్ ఫ్యామిలీ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వన్ ఫ్యామిలీ.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. Watching Sachin Tendulkar play live for the first time and he has taken a wicket in his 2nd over. 🐐 - 50 years old, he still got it. #OWOFCup pic.twitter.com/MWSglJHdqO — Johns. (@CricCrazyJohns) January 18, 2024 ఇంగ్లండ్ ఆటగాడు డారెన్ మ్యాడీ (51) అర్ధసెంచరీతో రాణించగా.. లంక మాజీ వికెట్‌కీపర్ కలువితరణ 22, టీమిండియా మాజీ ఆటగాళ్లు యూసఫ్ పఠాన్ 38, యువరాజ్ సింగ్ 23 పరుగులు చేశారు. వన్ వరల్డ్ బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. సచిన్, ఆర్పీ సింగ్, అశోక్ దిండా, మాంటీ పనేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అన్న బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి గెలిపించిన ఇర్ఫాన్ పఠాన్ 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వన్ వరల్డ్.. అల్విరో పీటర్సన్ (74), సచిన్ టెండూల్కర్ (27), నమన్ ఓఝా (25), ఉపుల్ తరంగ (29) రాణించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. యూసఫ్ పఠాన్ బౌలింగ్‌లో అతని సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు. One World needed 3 in 2 balls: Irfan Pathan smashed a six against Yusuf Pathan, after that Irfan hugged Yusuf. pic.twitter.com/1QPPfcVkNG — Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2024 వన్ ఫ్యామిలీ బౌలర్లలో చమింద వాస్ 3 వికెట్లు పడగొట్టగా.. ముత్తయ్య మురళీథరన్, యువరాజ్ సింగ్, జేసన్ క్రేజా తలో వికెట్ దక్కించుకున్నారు. చాలాకాలం తర్వాత క్రికెట్ దిగ్గజాలు బరిలోకి దిగడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పోస్ట్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. Sachin's Team Won the match 💙💥 pic.twitter.com/T4cRvUmMsO — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) January 18, 2024 -
అశ్విన్‌కు జట్టులో ఉండే అర్హతే లేదు: యువీ సంచలన వ్యాఖ్యలు
Ravichandran Ashwin Doesn't Deserve Place: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఉద్దేశించి భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చెన్నై బౌలర్‌కు పరిమిత ఓవర్ల జట్టులో స్థానం పొందే అర్హతే లేదన్నాడు. ఆధునికతరం భారత మేటి స్పిన్నర్లలో ఒకడిగా తనదైన ముద్ర వేస్తున్నాడు అశ్విన్. టెస్టుల్లో బంతి, బ్యాట్‌తో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 500 వికెట్ల మైలురాయికి చేరువగా ముఖ్యంగా సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుందంటే అశూ జట్టులో ఉండాల్సిందే. ఇప్పటికే సంప్రదాయ క్రికెట్లో 490 వికెట్లు తీసిన అశూ.. ఇంగ్లండ్‌తో జనవరి 25 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్లో చేరే దిశగా పయనిస్తున్నాడు. 5 శతకాలతో సత్తా చాటి బ్యాటర్‌గానూ ఇప్పటిదాకా 95 టెస్టుల్లో అశూ 3193 పరుగులు సాధించాడు. ఇందులో 5 శతకాలు, 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇలా ఆల్‌రౌండర్‌గా భారత టెస్టు జట్టులో పాతుకుపోయిన అశూకు.. వన్డే, టీ20 జట్టులో మాత్రం ఉండే అర్హత లేదంటున్నాడు యువీ. అశూకు ఆ అర్హత లేదు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో భాగంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో అశ్విన్ గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘అశ్విన్ గొప్ప బౌలరే... కానీ వన్డే, టీ20 జట్టులో ఉండే అర్హత అతడికి లేదు. టెస్టుల్లో ఆల్‌రౌండర్‌గా అతడు బెస్ట్.. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా తను ఏం చేయగలడు? అందుకే టెస్టుల్లో తను కచ్చితంగా ఉండాలి. కానీ వైట్‌బాల్ క్రికెట్ జట్టులో అతడికి చోటు అవసరం లేదు’’ అని కుండబద్దలు కొట్టాడు. 37 ఏళ్ల అశూ వైట్‌బాల్ జట్టులో అనవసరం! కాగా ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో అశ్విన్ 116 వన్డేల్లో 156.. అదే విధంగా 65 టీ20లలో 72 వికెట్లు తీశాడు. అయితే, వన్డే, టీ20లలో యువ బౌలర్లు ప్రతిభ నిరూపించుకుంటున్నప్పటికీ 2011 మొదలు తాజాగా ముగిసిన 2023 వరల్డ్‌కప్ జట్లలో 37 ఏళ్ల అశూకు స్థానం లభించింది. ఈ నేపథ్యంలోనే యువరాజ్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్! భరత్ ఫిఫ్టీ.. -
T20 WC: పాక్ ప్రమాదకర జట్టు.. యువీ వ్యాఖ్యలకు గంభీర్ రిప్లై ఇదే
రానున్న ఆరు నెలల్లో మరో క్రికెట్ మెగా టోర్నీకి తెరలేవనుంది. వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ టోర్నమెంట్ సందర్భంగానైనా టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న కల తీరాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పదేళ్లుగా భారత జట్టు ఒక్క మెగా టైటిల్ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా ఆ కరువు తీరుతుందనుకుంటే ఆఖరి మెట్టుపై రోహిత్ సేన బోల్తా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకుంది. అయితే, ఆరు నెలల వ్యవధిలోనే టీ20 వరల్డ్‌కప్ రూపంలో టీమిండియాకు మరో అవకాశం దక్కనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచకప్-2024లో టీమిండియాకు గట్టి పోటీనిచ్చే జట్ల గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అక్కడి పిచ్‌లపై అఫ్గనిస్తాన్ మరింత ప్రమాదకారిగా మారుతుంది. ఆస్ట్రేలియా కూడా సవాల్ విసురుతుంది. ఆ జట్టులో ఎంతో మంది ఇంపాక్ట్ ప్లేయర్లు ఉన్నారు. ప్రత్యర్థి జట్టు విజయావకాశాలను ఒంటి చేత్తో మార్చగల సత్తా ఉన్న వాళ్లు ఉన్నారు. ఇక ఇంగ్లండ్ కూడా టీ20 క్రికెట్లో కచ్చితంగా బలమైన ప్రత్యర్థే’’ అని గంభీర్ పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. ‘‘ఈసారి సౌతాఫ్రికా ప్రపంచకప్ గెలుస్తుందనుకుంటున్నాను. వరల్డ్‌కప్-2023 సందర్భంగా.. ఆ జట్టు పురోగతిని చూసిన తర్వాత నాకు ఈ అభిప్రాయం ఏర్పడింది. పాకిస్తాన్ కూడా డేంజరస్ జట్టు’’ అని యువీ పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన గంభీర్.. ‘‘50 ఓవర్ల ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎలా ఉందో చూశాం కదా! అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చెత్తగా ఫీల్డింగ్ చేయడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా. ఇక టీ20 ఫార్మాట్లో పోటీ పడాలంటే అలా చెత్తగా ఆడితే మాత్రం వారికి అసలు అవకాశాలు ఉండవు. గత ఐదారేళ్లలో టీమిండియా ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరు చూశాం. ఈసారి భారత్ ఆ అవరోధాన్ని దాటుతుందనుకుంటున్నా’’ అని కుండబద్దలు కొట్టాడు. ఓ క్రీడా చర్చలో పాల్గొన్న గౌతీ- యువీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. View this post on Instagram A post shared by Thums Up (@thumsupofficial) -
రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్‌కు యువీ వార్నింగ్!
How Ritika Related To Yuvraj Singh: ‘‘నా జీవితంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఎన్నో మార్పులు తీసుకొచ్చాడీ అబ్బాయి. నా ప్రాణ స్నేహితుడు.. నన్ను నవ్వించే నా కమెడియన్.. అన్నింటికీ మించి ఓ మంచి మనిషి. నాకు సర్వస్వమైన వ్యక్తి.. నీతో జీవితం ఇంద్రజాలం కంటే తక్కువేమీ కాదు. లవ్ యూ’’ అంటూ ఆమె.. ‘‘నాకు దొరికిన అత్యుత్తమ జీవిత భాగస్వామి’’ అంటూ అతడు పరస్పరం పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇంతకీ ఆ జంట ఎవరంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- రితిక సజ్దే. తమ వివాహ బంధానికి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా ఇలా ఒకరికొరి పట్ల ఒకరు ప్రేమను చాటుకుంటూ సోషల్ మీడియా వేదికగా అందమైన ఫొటోలు పంచుకున్నారు. అన్యోన్య దాంపత్యంతో కపుల్ గోల్స్ సెట్ చేస్తున్న రోహిత్- రితికల లవ్‌స్టోరీపై ఓ లుక్కేద్దామా?! యాడ్ షూట్లో పరిచయం టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ 2008లో ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్లో పాల్గొన్నారు. ఆ యాడ్ షూట్‌కు మేనేజర్ రితిక. అప్పటికే రితికతో యువీకి ప్రత్యేక అనుబంధం ఉంది. రితికను తన సొంత చెల్లిలా భావిస్తాడు యువరాజ్ సింగ్. అందుకే.. రోహిత్ శర్మ షూటింగ్‌కు రాగానే ముందుగానే ఓ హెచ్చరిక జారీ చేసేశాడు. ఆమెకు దూరంగా ఉండు రితికా సజ్దేను చూపిస్తూ.. తను స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్.. ఆమెకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది అని హిట్‌మ్యాన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోవడం రోహిత్ వంతైంది. అయినా.. నాకు ఆమెతో ఏం పని? నేనిక్కడకు వచ్చింది షూటింగ్లో పాల్గొనడానికి కదా! అని తానూ గట్టిగానే బదులిచ్చాడు. ఆ తర్వాత మరో షూట్లో కలిశారు రోహిత్- రితిక. మొదటిసారి రితికను చూసినపుడు పెద్దగా పట్టించుకోని రోహిత్.. రెండోసారి కలిసినపుడు ఆమె వ్యవహరించిన తీరుకు ఫిదా అయ్యాడు. రెండోసారి కలిసినపుడు ఫిదా మైక్రోఫోన్‌తో కలిగిన అసౌకర్యం వల్ల ఇబ్బంది పడిన తన పట్ల ఎంతో హృద్యంగా.. హుందాగా స్పందించిన రితిక వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. స్నేహం పెరిగింది. రోహిత్‌కు స్పోర్ట్స్ మేనేజర్‌గా పనిచేయడం మొదలుపెట్టింది రితిక. స్పెషల్ ప్లేస్‌లో లవ్ ప్రపోజల్ అలా అలా ప్రొఫెషనల్‌గా దగ్గరైన రోహిత్- రితిక.. కాలక్రమంలో ప్రాణ స్నేహితులుగా మారారు. ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితుడైన రోహిత్.. బోరివలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు రితికను తీసుకువెళ్లి.. లవ్ యూ అంటూ తన మనసులోని మాటను బయటకు చెప్పాడు. డిసెంబరు మొత్తం రోహిత్ కుటుంబానికి ప్రత్యేకం ఆమె కూడా సరేనంది. అలా ఆరేళ్ల పరిచయం తర్వాత.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలను ఒప్పించి.. 2015, జూన్ 3న రితిక వేలికి ఉంగరం తొడిగి ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు రోహిత్. పదకొండేళ్ల వయసులో తను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన అదే బోరివలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎంగేజ్మెంట్ చేసుకుని కెరీర్, లైఫ్నకు సంబంధించిన కీలక ఘట్టాలను మధుర జ్ఞాపకాలుగా మార్చుకున్నాడు. ఇక డిసెంబరు 13, 2015లో ముంబైలోని తాజ్ ల్యాండ్స్ హోటళ్లో రోహిత్- రితిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత.. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమానులు అంబానీ కుటుంబం తమ కెప్టెన్ రోహిత్ శర్మ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా జరిపించింది. యువీకి రాఖీ సిస్టర్ ఈ జంటకు డిసెంబరు 30, 2018లో కుమార్తె సమైరా జన్మించింది. రోహిత్- రితిక జీవితాల్లో ప్రత్యేక ఘట్టాలన్నీ డిసెంబరుతో ముడిపడటం విశేషం. అన్నట్లు తమ పరిచయానికి కారణమైన యువరాజ్ సింగ్‌కు రితిక రక్షా బంధన్ కడుతున్న దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆమె యువీకి తోబుట్టువేమో అని అని నెటిజన్లు భావించారు. నిజానికి రితిక.. యువరాజ్‌కు రాఖీ సిస్టర్!!.. అదే విధంగా టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి దగ్గర కూడా స్పోర్ట్స్ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. చదవండి: U19 WC 2024: క్రికెట్ వరల్డ్‌కప్ జట్టులో పోత్గల్ కుర్రాడు.. కేటీఆర్ హర్షం! పోస్ట్ వైరల్ -
సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
రింకూ సింగ్ అరుదైన రికార్డు.. యువరాజ్ సింగ్, హార్దిక్ సరసన
రింకూ సింగ్.. ఈ పేరు ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో మారుమ్రోగిపోతుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగుతున్న టీ20 సిరీస్‌లో రింకూ సింగ్ తన ఆటతీరుతో అందరిని అకట్టుకున్నాడు. ఐపీఎల్లో కనబరిచిన దూకుడునే అంతర్జాతీయ క్రికెట్లోనూ కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో 22 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ.. రెండో టీ20లో కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులు చేసి దుమ్మురేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో అతడిని టీమిండియా నయా ఫినిషర్ అని, మరో ధోని దొరికాడని సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. రింకూ అరుదైన రికార్డు.. కాగా రెండో టీ20లో దుమ్మురేపిన రింకూ సింగ్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లొ ఒకే మ్యాచ్‌లో అత్యధిక స్ట్రైక్-రేట్(25 కంటే ఎక్కువ పరుగులు)తో బ్యాటింగ్ చేసిన నాలుగో భారత ఆటగాడిగా రింకూ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రింకూ 344.44 స్ట్రైక్-రేట్‌తో 31 పరుగులు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై 362.50 స్ట్రైక్-రేట్‌తో కేవలం 16 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. యువీ తర్వాతి స్ధానాల్లో దినేష్ కార్తీక్(362.50) ఉన్నాడు. 2018 నిదాదాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై ఫైనల్లో కార్తీక్ కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. మూడో స్ధానంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(355.55) ఉన్నాడు. చదవండి: సచిన్‌కే అన్నేళ్లు పట్టింది.. టీ20 వరల్డ్‌కప్ టీమిండియాదే: రవిశాస్త్రి Rinku Singh providing the finishing touch once again 😎 25 runs off the penultimate over as 200 comes 🆙 for #TeamIndia 👌👌#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/hA92F2zy3W — BCCI (@BCCI) November 26, 2023 -
అదొక్కటి తప్ప టీమిండియాను అడ్డుకునే శక్తి లేదు: యువీ
CWC 2023 Final India Vs Australia: ఆస్ట్రేలియాతో టీమిండియా వరల్డ్‌కప్ ఫైనల్ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వయం తప్పిదాలు తప్ప రోహిత్ సేనను ఈసారి ట్రోఫీ గెలవనీయకుండా అడ్డుపడే శక్తి వేరే ఏదీ లేదన్నాడు. అయితే, ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని.. తమదైన రోజు వాళ్లు చెలరేగడం ఖాయమని పేర్కొన్నాడు. ఆత్మవిశ్వాసం మెండుగా ఇప్పటికే ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన కంగారూలకు ఇలాంటి హైవోల్టేజీ మ్యాచ్‌లలో ఒత్తిడి జయించడం వెన్నతో పెట్టిన విద్య అని యువీ పేర్కొన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని టీమిండియాకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు.. ‘‘ఈ వరల్డ్‌కప్ టోర్నీలో వాళ్ల ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఫైనల్లోనూ బాగానే ఆడతారనుకుంటున్నా. కేవలం తమంతట తాము తప్పు చేస్తే తప్ప ఈసారి టీమిండియా ఓడిపోయే అవకాశాలు లేవు. అయితే, పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నందున కచ్చితంగా గెలిచి తీరతారనే అనిపిస్తోంది. 2003 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఆద్యంతం ఆధిపత్యం కొనసాగించింది. సారి టోర్నీ మొత్తంలో టీమిండియా డామినేషన్ సాగింది. కాబట్టి ఈసారి ఆసీస్ సాధారణ ప్రదర్శనతో గట్టెక్కే పరిస్థితి లేదు. అత్యుత్తమంగా రాణించకపోతే టీమిండియాను నిలువరించడం వారికి సాధ్యం కాదు. ఒత్తిడిని ఎలా జయించాలో వాళ్లకు తెలుసు అయితే, ఐసీసీ వంటి మేజర్ టోర్నీల్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలో ఆస్ట్రేలియన్లకు బాగా తెలుసు. ఇప్పటికే వాళ్లు చాలాసార్లు టైటిల్ గెలిచారు. సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో స్పెషలిస్టు బ్యాటర్లు అవుటైన వేళ.. బౌలర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ బ్యాట్‌తో పట్టుదలగా నిలబడిన తీరు అద్భుతం. ఫైనల్ వంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో వాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరచగలరో అంచనా వేయొచ్చు. అందుకే రోహిత్ సేన మరింత జాగరూకతతో ఉండాలి’’ అని యువీ హెచ్చరించాడు. స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం(నవంబరు 19) వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. చదవండి: CWC 2023: ఆ ఇద్దరూ టీమిండియా పాలిట వరం.. అంచనాలకు మించి! View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 Cricket: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 11 బంతుల్లోనే.. తొలి భారత బ్యాటర్‌గా!
SMAT 2023- Ashutosh Sharma breaks Yuvraj Singh's record: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)-2023 సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు బద్దలైంది. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఓవరాల్ భారత బ్యాటర్ల జాబితాలో యువీని వెనక్కి నెట్టి అశుతోశ్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అశుతోష్ సంచలన ఇన్నింగ్స్ దేశవాళీ టీ20 టోర్నీ SMAT సోమవారం(అక్టోబరు 16) ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు షెడ్యూల్లో భాగంగా రాంచి వేదికగా అరుణాచల్ ప్రదేశ్- రైల్వేస్ జట్లు మంగళవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రైల్వేస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ఉపేంద్ర యాదవ్(103) అజేయ సెంచరీతో మెరవగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అశుతోష్ శర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే కేవలం 11 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా మధ్యప్రదేశ్ ఆటగాడు అశుతోష్ యువీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. 53 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసిన రైల్వేస్.. అరుణాచల్ ప్రదేశ్‌ను 119 పరుగులకే ఆలౌట్ చేసింది. తద్వారా 127 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువీ నాటి టీ20 వరల్డ్‌కప్‌లో టీ20 వరల్డ్‌కప్-2007లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా యువరాజ్ సింగ్ సిక్సర్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. స్టువర్ట్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యువీ రికార్డు బ్రేక్ చేసిన నేపాల్ బ్యాటర్ అయితే, ఇటీవలే యువీ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలైన విషయం తెలిసిందే. చైనాలో ఆసియా క్రీడలు-2023 సందర్భంగా నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ మంగోలియాపై 9 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో యువీ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేసి తన పేరు చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. చదవండి: మెకానికల్ ఇంజనీర్! పాక్‌ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి! ఒకే ఒక్కసారి కెప్టెన్‌గా.. -
WC: క్యాన్సర్‌తో పోరాడుతూ వరల్డ్‌కప్ ఆడాను.. డెంగ్యూ వల్ల గిల్..: యువీ
ICC WC 2023- Ind Vs Pak- Yuvraj Singh- Shubman Gill: క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో తొలిసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబరు 14(శనివారం) దాయాదుల పోరుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి కూడా! అహ్మదాబాద్‌లో ఆడితే చూడాలని ఇక ఈ హైవోల్టేజీ మ్యాచ్‌తో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తనకిష్టమైన అహ్మదాబాద్ పిచ్‌పై పాకిస్తాన్ బౌలింగ్‌లో గిల్ పరుగుల వరద పారిస్తే చూడాలని కోరుకుంటున్నారు. అయితే, ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ మ్యాచ్ నాటికి అందుబాటులో ఉంటాడో లేదో భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్యాన్సర్‌తో పోరాడుతూ వరల్డ్‌కప్ ఆడాను ‘‘ధైర్యంగా ఉండాలని శుబ్‌మన్ గిల్‌కు చెప్పాను. క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో నేను వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడానని చెప్పాను. వ్యాధితో పోరాడుతూనే ధైర్యం కూడదీసుకుని జట్టులోకి వచ్చానని తనతో అన్నాను. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నాటికి గిల్ సిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నా. నిజమే.. డెంగ్యూ బారిన పడి తీవ్రమైన జ్వరంతో ఉన్నపుడు క్రికెట్ ఆడటం కష్టం. గిల్ తప్పక ఆడతాడనే నమ్మకం ఇలాంటివి నాకు అనుభవమే. అయితే, గిల్ కోలుకుని ఫిట్‌గా ఉంటే మాత్రం తప్పక మ్యాచ్ ఆడతాడు’’ అని యువీ వార్తాసంస్థ ఏఎన్ఐతో వ్యాఖ్యానించాడు. కాగా 2011 ప్రపంచకప్ సమయంలో యువరాజ్ క్యాన్సర్ బారిన పడిన విషయం వెల్లడైన సంగతి తెలిసిందే. కాగా అద్భుత ఆట తీరుతో సొంతగడ్డపై భారత్ జగజ్జేతగా అవతరించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. 2011 వరల్డ్‌కప్ హీరో.. గిల్ మెంటార్ యువీ.. 2011 నాటి ఎడిషన్‌లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లలో 362 పరుగులు సాధించడంతో పాటు.. 15 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విజేతగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. డెంగ్యూ ఫీవర్ కారణంగా శుబ్‌మన్ గిల్ వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కాగా పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు యువీ మెంటార్. అంతర్జాతీయ క్రికెటర్‌గా గిల్ ఎదగడంలో ఈ మాజీ ఆల్‌రౌండర్ పాత్ర ఉంది. చదవండి: కంగారెత్తించే కంగారులకు ఏమైంది? తిరిగి గాడిలో పడేనా? We are here in Ahmedabad! 👋#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/dVuOaynYRN — BCCI (@BCCI) October 12, 2023 -
నువ్వెందుకు ఉన్నట్లు? అయినా రాహుల్‌ను ఎందుకు ఆడించట్లేదు: యువీ
ICC WC 2023- Ind vs Aus- Shreyas Iyer Failure: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు ఒత్తిడిలో కూరుకుపోయిన వేళ నాలుగో స్థానంలో వచ్చి.. నువ్వేం చేశావంటూ మండిపడ్డాడు. బ్యాటింగ్ ఆర్డర్ నంబర్ 4లో కేఎల్ రాహుల్‌ను కాదని అయ్యర్‌ను ఎందుకు ఆడిస్తున్నారో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా భారత జట్టు తమ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడింది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. 199 పరుగులకే ఆసీస్ కుప్పకూలినా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడో ఓవర్లోనే వికెట్ తీసి శుభారంభం అందించాడు. ఇక స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై రవీంద్ర జడేజా అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్‌కు రెండు, రవిచంద్రన్ అశ్విన్‌కు ఒక వికెట్ దక్కాయి. పేసర్లలో బుమ్రాకు రెండు, సిరాజ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో ఆస్ట్రేలియా 199 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, స్వల్ప లక్ష్యమే కదా అని సంబరపడుతున్న తరుణంలో ఆదిలోనే టీమిండియాకు భారీ షాకులు తగిలాయి. ఓపెనర్లలో ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ కాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సున్నాకే అవుటయ్యాడు. అయ్యర్ అనవసరంగా.. ఇలాంటి తరుణంలో వన్‌డౌన్‌లో ఉన్న విరాట్ కోహ్లికి జతైన శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడాల్సింది పోయి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. కోహ్లి, రాహుల్ పట్టుదలగా నిలబడి టీమిండియా స్కోరు 2/3 ఉన్న వేళ.. కోహ్లి 85 పరుగులతో అదరగొట్టగా.. కేఎల్ రాహుల్ 97 పరుగులతో దుమ్ములేపాడు. ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ కర్ణాటక బ్యాటర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయ్యర్ తొందరపాటుపై యువీ అసహనం ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ అవుటైన తీరుపై స్పందించిన మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. ‘‘నంబర్ 4 బ్యాటర్ బాధ్యతగా ఆడాలి. ఒత్తిడిని తను స్వీకరించాలి!! జట్టు కష్టాల్లో కూరుకుపోయి ఇన్నింగ్స్ పునర్నిర్మించే క్రమంలో శ్రేయస్ అయ్యర్ ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. రాహుల్‌ను ఎందుకు ఆడించడం లేదు అయినా ఇప్పటికీ కేఎల్ రాహుల్‌ను నంబర్ 4లో ఎందుకు బ్యాటింగ్‌కు పంపడం లేదో అర్థం కావడం లేదు! పాకిస్తాన్ మీద 100 సాధించాడు! ఇప్పుడిలా!’’ అంటూ అయ్యర్‌ను విమర్శిస్తూ.. రాహుల్‌ను ప్రశంసించాడు. కాగా బ్యాటింగ్ ఆర్డర్లో కీలక స్థానమైన నాలుగో స్థానంలో ఆడి యవరాజ్ సింగ్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించిన విషయం తెలిసిందే. యువీ వారసుడు అతడే అయితే, ఇంతవరకు ఆ స్థానంలో యువీ స్థాయిలో రాణించగల ఆటగాడు లేడనే చెప్పాలి. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కేఎల్ రాహుల్.. యువీకి సరైన వారసుడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కింగ్ క్యాచ్ వదిలేస్తే అంతే మరి! ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను మిచెల్ మార్ష్ వదిలేయడాన్ని యువీ ప్రస్తావిస్తూ.. ‘‘భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కింగ్ క్యాచ్ విడిచిపెడితే.. అతడు మీ నుంచి గేమ్‌ను లాగేసుకుంటాడు కదా! అంటూ కోహ్లిపై యువీ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: ODI WC 2023 Ind Vs Afg: ఇంకా చెన్నైలోనే.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌కు అతడు దూరం: బీసీసీఐ ప్రకటన View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్
ICC ODI World Cup 2023: గత పదిహేనేళ్లలో టీమిండియా గెలిచిన రెండు ప్రపంచకప్ టోర్నీల్లో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. పొట్టి ఫార్మాట్లో ప్రవేశపెట్టిన తొలి వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో యువీ సభ్యుడు. 2007 నాటి ఆ ఈవెంట్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు.. యువీ సృష్టించిన ఈ అరుదైన రికార్డు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఇక వన్డే వరల్డ్‌కప్-2011లో యువరాజ్ సింగ్ అద్భుతమైన ఆట తీరుతో టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. నాడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ నాటి టోర్నీలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మొత్తంగా 362 పరుగులు సాధించడంతో పాటు.. 15 వికెట్లు పడగొట్టాడు. గేమ్ ఛేంజర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక మరోసారి భారత్ వేదికగా 50 ఓవర్ల ఫార్మాట్లో ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో యువరాజ్ సింగ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గేమ్ ఛేంజర్ అతడే ఈసారి టీమిండియా యువ సంచలనం శుబ్‌మన్ గిల్ గేమ్ ఛేంజర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు ఇప్పటికే స్టార్ బ్యాటర్‌గా ఎదిగాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి తనే గేమ్ ఛేంజర్ అవుతాడని నా నమ్మకం. అన్ని అవరోధాలను తప్పక అధిగమిస్తాడు. ఎవరైతే దూకుడుగా ఆడుతూ మంచి ఫామ్‌లో ఉంటారో అలాంటి ఆటగాడు తప్పక టీమిండియాకు విజయాలు అందిస్తాడు. గిల్ నుంచి నేను ఆశిస్తున్నది ఇదే’’ అని టైమ్స్ నౌతో యువీ వ్యాఖ్యానించాడు. చదవండి: సచిన్, కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: డేల్ స్టెయిన్ -
పరుగుల సునామీ.. ఏకంగా 8 సిక్సర్లు.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. యువీ రికార్డు బ్రేక్
Dipendra Singh Fastest T20I 50: నేపాల్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఆరీ పరుగుల సునామీ సృష్టించాడు. మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట(ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో) ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఆసియా క్రీడలు -2023లో భాగంగా మెన్స్ క్రికెట్ ఈవెంట్లో నేపాల్- మంగోలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. చైనాలోని హోంగ్జూలో జరిగిన ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఈ మేర సుడిగాలి అర్ధ శతకంతో మెరిశాడు. ఐదోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఈ ఆల్‌రౌండర్ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. రెండు ఫార్మాట్లలో అద్భుత సెంచరీలు కాగా 23 ఏళ్ల దీపేంద్ర సింగ్ ఆరీ 2018లో నేపాల్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 52 వన్డేలు, 38 టీ20లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 889, 991 పరుగులు సాధించాడు. అదే విధంగా ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ ఖాతాలో వన్డేల్లో 36, టీ20లలో 21 వికెట్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ వన్డేల్లో ఈ రైట్ హ్యాండ్‌బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 105, టీ20లలో 110 కావడం విశేషం. సంచలనాలు సృష్టించిన నేపాల్ జట్టు ఇక టీ20 చరిత్రలో బుధవారం(సెప్టెంబరు 27) సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆసియా క్రీడలు- 2023 మెన్స్ క్రికెట్ ఈవెంట్లో మంగోలియాతో మ్యాచ్‌లో నేపాల్ పలు అరుదైన ఘనతలు సాధించి చరిత్రకెక్కింది. టీ20 ఫార్మాట్లో 314 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. అంతేకాదు మంగోలియాను 41 పరుగులకే ఆలౌట్ చేసి 273 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. చదవండి: 34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ రికార్డు బద్దలు -
చరిత్ర మరచిపోలేని రికార్డుకు 16 ఏళ్లు..!
క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 19కి ఓ ప్రత్యేకత ఉంది. 2007లో ఈ రోజున టీమిండియా డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో యువీ చేసిన 12 బంతుల హాఫ్ సెంచరీ నేటికీ పొట్టి క్రికెట్లో ఫాస్టెప్ట్ హాఫ్ సెంచరీగా కొనసాగుతుంది. సౌతాఫ్రికాలో జరిగిన తొట్టతొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను ఉతికి 'ఆరే'శాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశాడు. యువీ సిక్సర్ల సునామీకి ముందు ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ అతనితో అనవసర గొడవకు దిగాడు. దీని ప్రభావం బ్రాడ్‌పై పడింది. ఫ్లింటాఫ్‌పై కోపాన్ని యువీ బ్రాడ్‌పై చూపించాడు. యువీ.. బ్రాడ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, నేటికీ చెక్కుచెదరని టీ20 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. Look out in the crowd! On this day in 2007, @YUVSTRONG12 made #T20WorldCup history, belting six sixes in an over 💥 pic.twitter.com/Bgo9FxFBq6 — ICC (@ICC) September 19, 2021 ఆ ఇన్నింగ్స్‌లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న యువరాజ్ కేవలం 14 నిమిషాలు క్రీజ్‌లో ఉండి 7 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి, ఫ్లింటాఫ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. యువీకి ముందు గంభీర్ (58), సెహ్వాగ్ (68) సైతం అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్పీ సింగ్ 2, హర్భజన్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇదే మ్యాచ్ ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20ల్లో తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్.. పాక్‌ను మట్టికరిపించి తొట్టతొలి టీ20 ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. -
Asia Cup: వారెవ్వా! ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్- హార్దిక్
Asia Cup 2023 Ind Vs Pak- Ishan Kishan and Hardik Pandya Record: పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఇషాన్ కిషన్- హార్దిక్ పాండ్యా ద్వయం సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆసియా కప్ చరిత్రలో ఇప్పటిదాకా రాహుల్ ద్రవిడ్- యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. కాగా శ్రీలంక వేదికగా ఆసియా కప్-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ మధ్య శనివారం మ్యాచ్ జరుగుతోంది. పాక్ పేసర్ల జోరు.. టీమిండియా టాపార్డర్ బేజారు ఈ వన్డే టోర్నీ తాజా ఎడిషన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, నసీం షా ధాటికి టీమిండియా టాపార్డర్ కకావికలమైంది. ఈ నేపథ్యంలో ఇషాన్, పాండ్యా అర్ధ శతకాలతో రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించారు. ఆదుకున్న ఇషాన్- హార్దిక్.. వీరిద్దరి విజృంభణతో భారత జట్టు 48.5 ఓవర్లలో 266 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. టీమిండియా పరువు కాపాడిన ఇషాన్ కిషన్(82)- హార్దిక్ పాండ్యా(87) ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆసియా కప్ ఈవెంట్లో ఐదో వికెట్‌కు టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు. ద్రవిడ్- యువీ రికార్డు బద్దలు ఈ క్రమంలోనే ఇషాన్- పాండ్యా 19 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు. కాగా 2004లో ద్రవిడ్(82)- యువీ(47) శ్రీలంకతో మ్యాచ్‌లో ఐదో వికెట్‌కు 133 పరుగులు జోడించారు. పాక్‌తో మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ రికార్డును అధిగమించారు. ఆ రికార్డు కూడా బ్రేక్ అంతేకాదు.. వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఐదో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన జోడీగా రాహుల్ ద్రవిడ్- మహ్మద్ కైఫ్‌ల రికార్డు(135)ను బద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే.. పాక్‌తో సెప్టెంబరు 2 నాటి మ్యాచ్‌లో టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో ఆఫ్రిదికి నాలుగు, రవూఫ్, నసీం షాలకు చెరో మూడు వికెట్లు దక్కాయి. ఆసియా కప్ చరిత్రలో ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన టాప్-4 జోడీలు ►ఇషాన్ కిషన్- హార్దిక్ పాండ్యా- 2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 138 పరుగులు ►రాహుల్ ద్రవిడ్- యువరాజ్ సింగ్- 2004లో శ్రీలంకతో మ్యాచ్‌లో 133 పరుగులు ►ధోని- రోహిత్ శర్మ- 2008లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 112 పరుగులు ►ధోని- రోహిత్ శర్మ- 2010లో శ్రీలంకతో మ్యాచ్‌లో 79 పరుగులు. చదవండి: IND VS PAK: షమీని కాదని శార్దూల్‌ను తీసుకుంది ఇందుకేనా..? -
ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్
బెంగళూరు: నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ హవా సాగింది. ఈ టోర్నీలో 5 సెంచరీలతో 648 పరుగులు సాధించి అతను అగ్రస్థానంలో నిలిచాడు. ఆ సమయంలో తాను మానసికంగా ఎంతో ప్రశాంత స్థితిలో ఉన్నానని, ఇప్పుడు కూడా అదే తరహాలో ఉండాలని కోరుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు. గత టోర్నీతో పోలిస్తే ఈసారి అతను కెప్టెన్ హోదాలో బరిలోకి దిగబోతున్నాడు. ‘సానుకూలమైనా, ప్రతికూలమైనా ఎలాంటి బయటి అంశాలు నాపై ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడుతున్నా. ఏమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండటం ఎంతో ముఖ్యం. సరిగ్గా చెప్పాలంటే 2019 ప్రపంచకప్‌కు ముందు ఎలా ఉన్నానో అలాంటి మానసిక దృక్పథం ఇప్పుడు కావాలి. ఆటగాడిగా, వ్యక్తిగతంగా కూడా అప్పటి నా పరిస్థితిని గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. అలాగే ఉండాలని భావిస్తున్నా. అప్పుడు అన్నీ చక్కగా కుదిరాయి. అంతా కలిసిరావడంతో ఎంతో బాగా సన్నద్ధమయ్యా’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్‌పై తన ముద్ర ఏమిటనేది తాను చెప్పనని, అది అభిమానులు నిర్ణయిస్తారన్న రోహిత్... జట్టు సెలక్షన్ విషయంలో మాత్రం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అన్నాడు. ‘వరల్డ్ కప్ టీమ్‌లో స్థానం దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు బాగా తెలుసు. 2011లో చోటు కోల్పోయినప్పుడు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చి ఏం పర్లేదు, భవిష్యత్తు బాగుంటుందని భరోసా ఇచ్చాడు. నిజంగానే ఆ తర్వాత నేను గొప్పగా రాణించాను. ఇప్పుడు కూడా ఎవరినైనా తప్పిస్తే అందుకు బలమైన కారణం ఉంటుందే తప్ప వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ఉండవు’ అని రోహిత్ స్పష్టం చేశాడు. -
నిద్రలేని రాత్రులు కూడా సంతోషాన్నిస్తాయి.. గుడ్‌న్యూస్ చెప్పిన యువీ!
Yuvraj Singh Hazel Keech Second Baby: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తమ కుటుంబంలో కొత్త సభ్యురాలి ఆగమనం గురించి తెలియజేస్తూ అందమైన ఫొటోను షేర్ చేశాడు. తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్న విషయాన్ని శ్రావణ శుక్రవార వేళ ఫ్యాన్స్‌కు తెలియజేశాడు. మా యువరాణి వచ్చేసింది ఈ మేరకు.. ‘‘మా యువరాణి ఆరా రాక కారణంగా నిద్రలేని రాత్రులను కూడా సరదాగా గడిపేస్తున్నాం. తన రాకతో మా కుటుంబం పరిపూర్ణమైంది’’ అని యువీ ఇన్‌స్టాలో ఫొటో షేర్ చేశాడు. ఇందులో.. యువీ భార్య హాజిల్ కీచ్ ఒడిలో కొడుకు ఓరియోన్ ఉండగా.. ఈ సిక్సర్ల కింగ్ చిన్నారి కూతురిని తన ఒడిలో పడుకోబెట్టుకుని పాలు పట్టిస్తున్నాడు. సిక్సర్ల కింగ్ ఆమె చూపులకు బౌల్డ్ మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్న ఈ దృశ్యం ఎంతో అందంగా ఉందంటూ అభిమానులు యువీ కుటుంబానికి సంబంధించిన అపురూప ఫొటోను వైరల్ చేస్తున్నారు. కాగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కిన యువరాజ్ సింగ్.. బాలీవుడ్ నటి హాజిల్ కీచ్ చూపులకు మాత్రం బౌల్డ్ అయిపోయాడు. నాలుగేళ్లపాటు ఆమె ప్రేమకై నిరీక్షించిన యువీ.. 2016, నవంబరు 30న పెళ్లి బంధంతో ఆమెను శాశ్వతంగా తన మనిషిగా మార్చేసుకున్నాడు. ఈ జంటకు జనవరి 25, 2022లో బాబు ఓరియోన్ జన్మించాడు. తాజాగా ఆరా రూపంలో కూతురు కూడా రావడంతో వీరిది కంప్లీట్ ఫ్యామిలీ అయింది. చదవండి: Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
ధోని, యువరాజ్ తర్వాత అలాంటి వాళ్లు రాలేదు.. ఇప్పుడు ఇతడు!
Rinku Singh can emulate Yuvraj Singh & MS Dhoni as finisher: టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్‌పై మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో రాణించగల సత్తా అతడికి ఉందని.. బెస్ట్ ఫినిషర్‌గా ఎదుగుతాడని అంచనా వేశాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా ఫీల్డింగ్‌లోనూ రింకూ అద్భుతమని కొనియాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ సింగ్ తాజా ఎడిషన్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన సందర్భాల్లో తానున్నానంటూ ఆదుకున్నాడు. ఫినిషర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. సిక్సర్ల రింకూగా.. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూ ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడం పదహారో ఎడిషన్ హైలైట్లలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన రింకూ సింగ్.. ఐర్లాండ్‌లో పర్యటించే భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. డబ్లిన్‌లో ది విలేజ్ మైదానం వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. ధోని, యువీ తర్వాత రింకూనే! ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరే స్పందిస్తూ.. మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్ తర్వాత మళ్లీ రింకూ వాళ్లంతటి వాడు కాగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘ రింకూ ఎప్పుడెప్పుడు టీమిండియాలో అరంగేట్రం చేస్తాడా అని ఎదురుచూశాను. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదు లేదంటే ఆరో స్థానంలో రింకూ రాణించగలడు. అద్భుతమైన ఫినిషర్‌గా పేరు తెచ్చుకోగలడు. మనం ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్‌లను చూశాం. వాళ్లిద్దరి తర్వాత మళ్లీ అలాంటి ప్లేయర్ రాలేదు. అద్భుతమైన ఫీల్డర్ ఇప్పుడు రింకూ రూపంలో మంచి ఆప్షన్ దొరికింది. అతడు అద్భుతమైన ఫీల్డర్ కూడా! దేశవాళీ క్రికెట్లో ఆడేటపుడు తనని దగ్గరగా గమనించాను. ప్రస్తుతం తన ఆట మరింత మెరుగైంది’’ అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ రింకూ. ఐరిష్ జట్టుపై అరంగేట్రం చేసిన అతడికి.. వర్షం ఆటంకం కలిగించిన కారణంగా తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక డబ్లిన్ టీ20లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. టీమిండియా ఐర్లాండ్‌పై 2 పరుగుల తేడాతో గెలుపొంది 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: కోహ్లిపై షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన గంగూలీ! ఏమన్నాడంటే? ఐర్లాండ్‌తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్ -
రోహిత్ మంచి కెప్టెన్.. కానీ అలా అయితే వరల్డ్‌కప్‌లో కష్టమే: యువరాజ్
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు సమయం దగ్గరపడుతోంది. ఆక్టోబర్ 5న చెన్నై వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య జరగనునున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఆయా జట్లు తమ సన్నహాకాలు కూడా ప్రారంభించాయి. ఆస్ట్రేలియా అయితే ఒక అడుగు ముందుకు వేసి ఈ మెగా ఈవెంట్ కోసం తమ ప్రిలిమినరీ జట్టును కూడా ప్రకటించింది. టీమిండియా విషయానికి వస్తే.. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆసియా వన్డే కప్, ఆస్ట్రేలియాతో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి కోలుకుని మైదానంలో అగుడుపెట్టేందుకు సిద్దం కాగా.. కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ ఇంకా సందిగ్ధం గానే ఉంది. ఈ క్రమంలో ప్రపంచకప్‌కు భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందో అని అందరూ అతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రపంచకప్‌లో భాగమయ్యే జట్లు తమ 15 మంది సభ్యుల వివరాలను సెప్టెంబర్5 లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ ఆగస్టు ఆఖరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టును ఉద్దేశించి టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ కీలక వాఖ్యలు చేశాడు. జట్టుకు మంచి కెప్టెన్ ఉంటే సరిపోదని, కీలక ఆటగాళ్లు కూడా ఉండాలని యువీ అన్నాడు. "రోహిత్ శర్మ మంచి కెప్టెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముంబై ఇండియన్స్‌కు చాలా సీజన్ల నుంచి సారధిగా వ్యవహరిస్తున్నాడు. అతడు ముంబై జట్టుకు ఐదు టైటిల్స్‌ను అందించాడు. రోహిత్ గొప్ప లీడర్‌గా మారాడు. అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ఒత్తిడిలో కూడా చాలా తెలివిగా రోహిత్ వ్యవహరిస్తాడు. అయితే ఐసీసీ టైటిల్ నెగ్గాలంటే మంచి కెప్టెన్ ఉంటే పోదు, అత్యుత్తమ జట్టు కూడా ఉండాలి. అందులో అనుభవం ఉన్న ఆటగాళ్లు భాగం కావాలి. ఆ బాధ్యత సెలక్టర్లు తీసుకోవాలి. భారత్‌కు రెండు టైటిల్స్‌ను అందించిన ధోని కూడా అత్యుత్తమ కెప్టెన్. కానీ ధోనికి అనుభవం ఉన్న ఆటగాళ్లు సపోర్ట్ కూడా ఉండేది. అయితే ఈ సారి సరైన జట్టుతో బరిలోకి దిగకపోతే విజయం సాధించడం కష్టమే" అని ఇంద్రనీల్ బసుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు. కాగా 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ సొంతంచేసుకోవడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. చదవండి: IND Vs WI 3rd T20I: వెస్టిండీస్‌తో మూడో టీ20.. కిషన్‌పై వేటు! యువ సంచలనం ఎంట్రీ! అతడికి ఆఖరి ఛాన్స్ -
ఒకే ఓవర్లో 6 సిక్సర్లు! రియల్ లెజెండ్ అంటూ బ్రాడ్‌పై యువీ ట్వీట్.. వైరల్
Yuvraj Singh Tweet On Stuart Broad Retirement: ‘‘టేక్ ఏ బో.. స్టువర్ట్ బ్రాడ్! టెస్టుల్లో అసాధారణ రీతిలో సాగింది నీ ప్రయాణం. అందుకు నా అభినందనలు. రెడ్ బాల్ క్రికెట్లో బ్యాటర్లను భయపెట్టే అత్యద్భుతమైన బౌలర్లలో ఒకడివి నువ్వు. నువ్వు.. రియల్ లెజెండ్. నీ సుదీర్ఘ ప్రయాణం సాఫీగా సాగడానికి ఆట పట్ల నీకున్న అంకితభావమే కారణం. సూపర్ ఇన్స్పైరింగ్. నీ జీవితంలోని తదుపరి దశకు గుడ్‌లక్ బ్రాడీ!!’’ అంటూ టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడికి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా అతడితో ఉన్న అరుదైన ఫొటోను యువీ అభిమానులతో పంచుకున్నాడు. కాగా 17 ఏళ్ల కెరీర్‌కు స్వస్తి పలుకుతూ స్టువర్డ్ బ్రాడ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పీడకలను మిగిల్చిన యువీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్టు తనకు చివరిదని పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టెస్టుల్లో 600 దాకా వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్ 2016లోనే వన్డేలకు దూరమయ్యాడు. ఇక 2014లో ఇంగ్లండ్ తరఫున చివరి టీ20 ఆడిన బ్రాడ్‌కు.. యువరాజ్ సింగ్ ఓ పీడకలను మిగిల్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అంతర్జాతీయ టీ20లలో 2006లో అడుగుపెట్టిన బ్రాడ్.. 2007లో పొట్టిఫార్మాట్లో జరిగిన మొట్టమొదటి ప్రపంచకప్ ఈవెంట్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్ అతడికి కోలుకోలేని షాకిచ్చింది. బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సాధించి అతడికి కాళరాత్రిని మిగిల్చాడు. అందుకే వైరల్‌గా యువీ ట్వీట్ ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్.. 37 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్‌ను ఉద్దేశించి ఈ మేరకు లెజెండ్ అంటూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో బ్రాడ్ మూడు ఫార్మాట్లలో కలిపి 850 వికెట్ల దాకా పడగొట్టాడు. ఇంగ్లండ్ మేటి పేసర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. చదవండి: పిచ్చి ప్రయోగాలకు చెక్.. జట్టులోకి జట్టులోకి వారిద్దరూ! 9 ఏళ్ల తర్వాత Take a bow @StuartBroad8 🙇🏻♂️ Congratulations on an incredible Test career 🏏👏 one of the finest and most feared red ball bowlers, and a real legend! Your journey and determination have been super inspiring. Good luck for the next leg Broady! 🙌🏻 pic.twitter.com/d5GRlAVFa3 — Yuvraj Singh (@YUVSTRONG12) July 30, 2023 -
అంతా సంపన్నులే! అత్యంత ఖరీదైన ఇల్లు ఎవరిదంటే! ధోని, సచిన్‌ది కాదు..
ప్రపంచంలోని సంపన్న క్రికెటర్లలో టీమిండియా ఆటగాళ్లు ముందు వరుసలో ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. తదితరులు తమ బ్రాండ్ వాల్యూతో వందల కోట్ల ఆస్తులు సంపాదించారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరి ఇలాంటి ధనిక క్రికెటర్లందరిలో అత్యంత ఖరీదైన ఇంటిలో నివాసం ఉంటున్న ఆటగాడెవరో తెలుసా? 100 కోట్ల విలువ?! టీమిండియా మాజీ సారథి ధోనికి తన స్వస్థలం రాంచిలో విశాలమైన ఫామ్‌హౌజ్ ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న భూమిలో విలాసవంతమైన భవనం ఉంది. రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఈ స్థలంలో స్విమ్మింగ్‌పూల్, జిమ్, ఇండోర్ క్రికెట్ పిచ్, ఆటోమొబైల్ గ్యారేజీ ఉన్నాయి. అయితే, ఈ మొత్తం ప్రాపర్టీ విలువ 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కానీ, ఇందులో ధోని నిర్మించిన ఇంటి విలువ మాత్రం దాదాపు ఆరు కోట్ల వరకే ఉంటుందట. (చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..) క్రికెట్ గాడ్ సచిన్, గంగూలీ ఇలా.. ఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ముంబైలో ప్రస్తుతం తను ఉన్న ఇంటిని 35 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోల్‌కతాలో ఈ ఏడాది ఆరంభంలో రూ. 40 కోట్లతో విలాసవంతమైన బంగ్లా కొన్నట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్ 30 కోట్లతో! మరోవైపు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2015లో ముంబైలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో 29వ ఫ్లోర్లో అపార్ట్మెంట్ కొన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అరేబియా సముద్ర అందాలను వీక్షించే విధంగా నాలుగు బెడ్రూమ్లతో కూడి ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌ను రూ. 30 కోట్లకు హిట్‌మ్యాన్ కొనుగోలు చేశాడట. యువీ విలాసవంతమైన భవనం ఇక సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ముంబైలో రూ. 64 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్ కలిగి ఉన్నాడట. ఇక్కడ కూడా కోహ్లి నంబర్ 1 విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి గురుగ్రామ్‌లో ఓ విలాసవంతమైన భవనం కొనుగోలు చేశాడు. దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా విలువ 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో అధునాతన స్విమ్మింగ్‌పూల్, జిమ్మాజియం వంటి సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. ఈ మేరకు DNA రిపోర్టు.. అత్యంత ఖరీదైన ఇల్లు.. రికార్డులు రారాజు కింగ్ కోహ్లిదే అని చెబుతోంది!! ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కింగ్ కోహ్లి తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసి.. మరిన్ని మధురానుభూతులు మూటగట్టుకునే పనిలో ఉన్నాడు. చదవండి: Ashes 5th Test: మొండిగా వెళ్తున్న టీమ్ ఇంగ్లండ్.. కీలక ప్రకటన -
బ్యాట్ పట్టనున్న టీమిండియా మాజీ స్టార్స్.. ఫ్యాన్స్‌కు పండగే
టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ సహా మరికొంత మంది స్టార్స్ మళ్లీ బ్యాట్ పట్టనున్నారు. యూఎస్ మాస్టర్స్ టి10 లీగ్‌లో ఆడనున్నారు. ఈ లీగ్‌లో భారత్‌తో పాటు మరిన్ని దేశాల మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఆగస్టు 18వ తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. అట్లాంటా ఫైర్, కాలిఫోర్నియా నైట్స్, మారిస్విల్లే యూనిటీ, న్యూజెర్సీ లెజెండ్స్, న్యూయార్క్ వారియర్స్, టెక్సాస్ చార్జర్స్ ఉన్నాయి. కాగా నార్త్ కాలిఫోర్నియాలో తాజాగా ఈ టోర్నీ ప్లేయర్స్ డ్రాఫ్ట్ వెల్లడైంది. న్యూజెర్సీ లెజెండ్స్: న్యూజెర్సీ లెజెండ్స్ టీమ్‌లో భారత మాజీ స్టార్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, యుసూఫ్ పఠాన్ ఉన్నారు. వీరితో పాటు స్టువర్ట్ బిన్నీ, ఆర్పీ సింగ్, బిపుల్ శర్మ, లియామ్ ప్లంకెట్, అల్బీ మార్కెల్, నమన్ ఓజా, జెర్రీ రైడర్, క్రిస్ బ్రాన్వెల్, క్రెగ్ మెక్మిలాన్, టిమ్ ఆంబ్రోస్, అభిమన్యు మిథున్, మోంటీ పనేసర్ ఈ జట్టులో ఆడనున్నారు. కాలిఫోర్నియా నైట్స్: కాలిఫోర్నియా నైట్స్ జట్టు తరఫున టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్ కైఫ్ ఆడనున్నారు. ఆరోన్ ఫించ్, పీటర్ సిడిల్, జాక్వెస్ కలీస్ సహా మరికొందరు ఈ జట్టులో ఉన్నారు. అంట్లాట ఫైర్: అంట్లాట ఫైర్ జట్టులో రాబిన్ ఊతప్ప ఉన్నాడు. ఆసీస్ మాజీ స్టార్ డేవిడ్ హస్సీ కూడా ఈ జట్టు తరఫున ఆడనున్నాడు. శ్రీశాంత్, లెండిల్ సిమండ్స్, డ్వేన్ స్మిత్ సహా మరికొందరు స్టార్ల్ ఉన్నారు. మోరిస్విల్లే యునిటీ: యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, భారత మాజీ దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో మోరిస్విల్లే యునిటీ టీమ్ తరఫున బరిలోకి దిగనున్నారు. పార్థివ్ పటేల్, కెవిన్ ఓబ్రెయిన్, కోరీ ఆండర్సన్, రాహుల్ శర్మ, కెల్విన్ సావేజ్.. మరికొంత మంది ప్లేయర్లు ఈ జట్టులో ఆడనున్నారు. న్యూయార్క్ వారియర్స్: న్యూయార్క్ వారియర్స్ టీమ్‌లో భారత మాజీలు మురళీ విజయ్, మునాఫ్ పటేల్ ఉన్నారు. పాకిస్థాన్ మాజీలు షాహిద్ ఆఫ్రిదీ, మిస్బా ఉల్ హక్, కమ్రాన్ అక్మల్ ఈ జట్టులోనే ఆడనున్నారు. జోహాన్ బోతా, టీఎం దిల్షాన్ సహా మరికొందరు ఉన్నారు. టెక్సాస్ చార్జర్: టెక్సాస్ చార్జర్ టీమ్‌లో ప్రజ్ఞాన్ ఓజా, ప్రవీణ్ కుమార్ ఉన్నారు. బెన్ డక్, హమ్మద్ హఫీజ్, రాస్ టేలర్, ఇసురు ఉదానా, తిషారా పెరీరా, నీల్ బ్రూమ్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, ఉపుల్ తరంగ, జీవన్ మెండిస్ సహా మరికొందరు ప్లేయర్లు ఈ జట్టు తరఫున యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో బరిలోకి దిగనున్నారు. చదవండి: Kohli-Ishan Kishan Viral Video: కోహ్లిని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్ R Ashwin Record In Test Cricket: తండ్రీ కొడుకులిద్దరిని ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా -
నువ్వేం తండ్రివి? యువీ చితకబాదినపుడు ఎక్కడున్నావు? నీ స్థాయి మరచి..
The Ashes, 2023: ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తండ్రి, ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. వయసు పెరగగానే సరిపోదు.. కాస్త బుద్ధి కూడా ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రిఫరీగా వ్యవహరిస్తూ ఓ ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 సీజన్లో ఇంగ్లండ్‌పై ఇప్పటికే రెండు విజయాలతో ఆస్ట్రేలియా పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా గురువారం మూడో టెస్టు ఆరంభమైంది. తమకు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పదిహేడో సారి ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అద్భుత సెంచరీ(118) కారణంగా మెరుగైన స్కోరు నమోదు చేయగలిగింది. 263 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(4) స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో పదహారోసారి అవుటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో(1)నూ అతడికే వికెట్ సమర్పించుకున్నాడు. కాగా టెస్టుల్లో బ్రాడ్ బౌలింగ్‌లో వార్నర్ అవుట్ కావడం ఇది పదిహేడోసారి. దీంతో వార్నర్‌ను ట్రోల్ చేస్తూ ఇంగ్లండ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్‌తో రెచ్చిపోయారు. మీమ్‌ను రీషేర్ చేసిన క్రిస్ బ్రాడ్ ఇందులో భాగంగా ఓ నెటిజన్.. అమెరికన్ యానిమేటెడ్ సిట్కామ్ సిరీస్ ది సింప్సన్స్‌లోని బార్ట్ అనే క్యారెక్టర్‌ను వార్నర్ ముఖంతో మార్ఫింగ్ చేసి పెట్టాడు. స్టువర్ట్ బ్రాడ్ మళ్లీ నన్ను అవుట్ చేశాడు అని వార్నర్ బోర్డు మీద రాస్తున్నట్లుగా మీమ్ క్రియేట్ చేశాడు. ఒకే ఓవర్లో 6 సిక్సర్లను గుర్తుచేస్తూ ఈ మీమ్‌ను స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ రీషేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘కొడుకు ప్రతిభ చూసి సంతోషపడటంలో తప్పులేదు. కానీ ఐసీసీ మ్యాచ్ రిఫరీ అయి ఉండి ఇలా దిగజారిపోవడం ఏమీ బాగాలేదు. వార్నర్‌ను మరీ అంతగా తీసిపారేయాల్సిన అవసరం లేదు. మీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’’ అని క్రిస్‌కు చురకలు అంటిస్తున్నారు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2007లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు బాదిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ‘‘యువీ బ్రాడ్ బౌలింగ్‌లో చితక్కొట్టినపుడు ఇలాంటి ట్వీట్లు చేయలేదు ఎందుకు?’’ అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: సినిమాను తలపించే ట్విస్టులు! కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్‌గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి Ind vs WI: కోహ్లి, రోహిత్ వాళ్లిద్దరి బౌలింగ్‌లో! వీడియో వైరల్ What a start! 🤩 Broad gets Warner for the... *Checks notes* ...Sixteenth time! 🤯 #EnglandCricket | #Ashes pic.twitter.com/WfSoa5XY1G — England Cricket (@englandcricket) July 6, 2023 Couldn’t have found a better partner to watch this together with after 15 years 👶 🏏 #15YearsOfSixSixes #ThisDayThatYear #Throwback #MotivationalMonday #GetUpAndDoItAgain #SixSixes #OnThisDay pic.twitter.com/jlU3RR0TmQ — Yuvraj Singh (@YUVSTRONG12) September 19, 2022 pic.twitter.com/76dG8lgOkv — Chris Broad (@ChrisBroad3) July 7, 2023 -
ODI WC 2023: 2011లో యువరాజ్ ఏం చేశాడో ఈ ఆటగాడు అదే చేస్తాడు..!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై భారత మాజీ ఓపెనర్, డాషింగ్ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత విజయాల్లో జడ్డూ కీలకపాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2011 వరల్డ్‌కప్‌లో యువరాజ్ సింగ్ ఏం చేశాడో (362 పరగులు, 15 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్), 2023 వరల్డ్‌కప్‌లో జడేజా కూడా అదే చేస్తాడని జోస్యం చెప్పాడు. జడ్డూతో పాటు మరో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడ సత్తా చాటే అవకాశముందని తెలిపాడు. ఫార్మాట్లకతీతంగా జడేజా ఇటీవలికాలంలో తాను ప్రాతినిధ్యం వహించిన జట్లను గెలిపించిన వైనాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. భారత్ చివరిసారిగా గెలిచిన ఐసీసీ ట్రోఫీలోనూ (ఛాంపియన్స్ ట్రోఫీ 2013) జడేజా పాత్రనే కీలకమని గర్తు చేశాడు. ప్రముఖ దినపత్రిక ఇండియాటుడేతో మాట్లాడుతూ.. శ్రీకాంత్ ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు. కాగా, జడేజా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (25 బంతుల్లో 33 నాటౌట్, 2/24) అదరగొట్టి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో జడ్డూ హైయ్యెస్ట్ వికెట్టేకర్గానూ (12 వికెట్లు) నిలిచాడు. ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో రవీంద్ర జడేజా భీకర ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అతను.. ఐపీఎల్-2023లో సీఎస్కేను గెలిపించడంతో పాటు టీమిండియా విజయాల్లోనూ ప్రధానపాత్ర పోషించాడు. గాయం నుంచి కోలుకుని గతేడాది క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అన్ని ఫార్మాట్లలో జడేజా జోరు కొనసాగుతుంది. కెరీర్లో ఇప్పటివరకు 174 వవ్డేలు ఆడిన జడ్డూ.. 13 అర్ధశతకాల సాయంతో 32.80 సగటున 2526 పరుగులు చేశాడు. అలాగే 37.39 యావరేజ్‌తో 191 వికెట్లు పడగొట్టాడు. -
కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ
Yuvraj Singh: టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. అండర్-19 వరల్డ్‌కప్ మొదలు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 టోర్నీల్లో భారత్ గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2007లో ఒకే ఓవర్లో యువీ ఆరు సిక్సర్లు బాదిన ఫీట్‌ను క్రికెట్ అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్లోనూ యువీ తన అద్భుత ఆట తీరుతో అభిమానులకు వినోదం పంచాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో క్యాన్సర్ రూపంలో యువీ కెరీర్‌కు బ్రేక్ పడింది. మహమ్మారి బారిన పడినప్పటికీ ఆత్మవిశ్వాసం సడలనివ్వని యువరాజ్.. క్రమక్రమంగా కోలుకున్నాడు. అంతేకాదు 2017లో టీమిండియా తరఫున రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. 2019 వరల్డ్‌కప్‌లో ఆడాలని యువీ భావించినప్పటికీ సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది జూన్ 10న యువరాజ్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాల గురించి గతంలో న్యూస్18 ఇంటర్వ్యూలో మాట్లాడిన యువీ పంచుకున్న ఆసక్తికర విషయాలను నెటిజన్లు తాజాగా తెరమీదకు తెచ్చారు. నాటి విషయాలు యువీ పంచుకుంటూ.. పునరాగమనంలో కోహ్లి తనకు పూర్తి మద్దతుగా నిలిచాడని.. అదే విధంగా మహేంద్ర సింగ్ ధోనితో తన అనుబంధం ఎలా ఉండేదో వివరించాడు. ఈ మేరకు.. ‘‘నేను తిరిగి జట్టులోకి వచ్చినపుడు విరాట్ కోహ్లి నాకు అండగా నిలబడ్డాడు. ఒకవేళ తన సహకారమే గనుక లేకుండా నేనసలు జట్టులోకి వచ్చేవాడినే కాదు. అదే సమయంలో ధోని నాకు వాస్తవాలేమిటో కళ్లకు కట్టినట్లు చూపాడు. 2019 ప్రపంచకప్ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు నా పేరును పరిశీలించడం లేదన్న నిజాన్ని ధోని నాకు చెప్పాడు’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. నువ్వే నా ప్రధాన ప్లేయర్‌వి.. గుర్తుపెట్టుకో 2011 ప్రపంచకప్ టోర్నీ నాటి పరిస్థితుల గురించి చెబుతూ.. ‘‘ధోనికి నాపై నమ్మకం ఎక్కువ. ప్రతిసారి.. ‘‘నువ్వే నా ప్రధాన ప్లేయర్‌వి.. గుర్తుపెట్టుకో’’ అని చెప్పేవాడు. కానీ 2015 ప్రపంచకప్ నాటికి పరిస్థితులు మారిపోయాయి. కానీ అప్పుడు మాత్రం నేను ఎవరినీ వేలెత్తిచూపాలని అనుకోవడం లేదు. కెప్టెన్‌గా ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. సారథిగా ఉన్నపుడు జట్టు ప్రదర్శన మొత్తానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిసారి తమను తాము సమర్థించుకునే అవకాశం ఉండదు’’ అని యువీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా ధోని వల్లే తన కుమారుడి కెరీర్ నాశనమైందంటూ యువీ తండ్రి యోగ్రాజ్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాను ధోని ఆటకు అభిమానినే అయినా.. తన కుమారుడి విషయంలో అతడు చేసిన పని ఆమోదయోగ్యనీయం కాదంటూ మండిపడ్డాడు. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! -
స్వాతంత్య్రం వచ్చాక టీమిండియా తొలి కెప్టెన్‌గా.. ఆయన కొడుకులు సైతం!
భారత క్రికెట్ తొలితరం క్రీడాకారుల్లో లాలా అమర్నాథ్ భరద్వాజ్ అగ్రగణ్యుడు. టెస్ట్ క్రికెట్లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా 1933లోనే ఆయన చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో భారత్ అధికారికంగా ఎలాంటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లలోనూ పాల్గొనలేదు. అదేకాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సహా వివిధ జట్లతో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో ఆడిన లాలా అమర్నాథ్ ఆ మూడేళ్ల వ్యవధిలోనే ముప్పయి సెంచరీలు సహా పదివేల పరుగుల మైలురాయిని అధిగమించారు. స్వాతంత్య్రం వచ్చాక భారత క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్‌గా సారథ్యం వహించారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా బౌలర్‌గానూ అద్భుతంగా రాణించారు. అప్పటి ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మాన్‌ను తన బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా ఔట్‌చేసిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. క్రీడారంగంలో వారసులు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటిది లాలా అమర్నాథ్ కొడుకులు– సురీందర్ అమర్నాథ్, మోహీందర్ అమర్నాథ్ తండ్రి అడుగుజాడల్లోనే క్రికెట్ క్రీడాకారులుగా అంతర్జాతీయంగా రాణించారు. మొహీందర్ అమర్నాథ్ 1983 ప్రపంచకప్ సాధించిన జట్టు వైస్‌కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించాడు. లాలా అమర్నాథ్ చిన్న కొడుకు రాజీందర్ అమర్నాథ్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా రాణించాడు. రాజీందర్ తన తండ్రి జీవిత చరిత్రను ‘లాలా అమర్నాథ్: లైఫ్ అండ్ టైమ్స్– ది మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో రాశాడు. తండ్రి స్ఫూర్తితోనే తమ సోదరులు ముగ్గురమూ క్రికెట్లోకి అడుగు పెట్టామని రాజీందర్ చెబుతాడు. భారత క్రికెట్లో తండ్రీకొడుకులు ►వినోద్ మన్కడ్- అశోక్ మన్కడ్ ►నయన్ మోంగియా- మోహిత్ మోంగియా ►యోగ్రాజ్ సింగ్- యువరాజ్ సింగ్ ►రోజర్ బిన్నీ- స్టువర్ట్ బిన్నీ ►సునిల్ గావస్కర్- రోహన్ గావస్కర్ ►హేమంత్ కనిత్కర్- హ్రిషికేశ్ కనిత్కర్ ►విజయ్ మంజ్రేకర్- సంజయ్ మంజ్రేకర్ ►పంకజ్ రాయ్- ప్రణబ్ రాయ్ చదవండి: ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్ కిందకు విసిరి! వీడియో వైరల్ ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు -
బాలయ్యకు టీమిండియా స్టార్ క్రికెటర్ బర్త్ డే విషెస్.. ట్వీట్ వైరల్!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ముందువరుసలో ఉంటారు. ఇవాళ ఆయన 63వ జన్మదినం జరుపుకుంటున్నారు. నందమూరి ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రముఖులు బాలయ్యకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా బాలయ్యకు టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బర్త్ డే విషెష్ తెలిపారు. ఆయనతో ఉన్న ఫోటోను పంచుకుంటూ యువరాజ్ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?) యువరాజ్ సింగ్ ట్వీట్లో రాస్తూ..' నందమూరి బాలకృష్ణ సార్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ డెడికేషన్ సోసైటీపై ఎంతో ప్రభావం చూపుతుంది. అనేక ఇతర కార్యక్రమాలతోపాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజ సేవలో మీరు చూపే అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకం. ఇక ముందు మరిన్నీ పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. యూవీ చేసిన ట్వీట్‌పై అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Warmest birthday greetings #NandamuriBalakrishna sir. Your dedication to making a positive impact in society through your Cancer Hospital & Research Centre among many other initiatives is an inspiration for all. Have a great year ahead! #HappyBirthdayNBK @basavatarakam pic.twitter.com/DcWxAtYR0x — Yuvraj Singh (@YUVSTRONG12) June 10, 2023 -
అమ్మో మన ధోని, కోహ్లి, రిషభ్ ఇలా ఉంటారా?
-
క్రికెట్ దిగ్గజాలతో రోడ్ ట్రిప్
సాక్షి, చెన్నై: క్రికెట్ దిగ్గజాలు సచిన్, అనిల్ కుంబ్లే, యువరాజ్‌తో గో ఫర్ రోడ్ ట్రిప్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని స్పిన్నీ వ్యవస్థాపకుడు నీరజ్ సింగ్ తెలిపారు. బుధవారం స్థానికంగా ఈ కార్యక్రమం గురించి ఆయన వివరించారు. ఐపీఎల్– 2023 సీజన్లో భాగంగా మే 28వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లలో అభిమానులు తమ జట్లను ప్రోత్సహించే విధంగా చేసే వినూత్న అంశాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. గో ఫార్ ఫర్ యువర్ స్క్వాడ్ అన్నది స్పిన్నీ ఎస్యూవీ ద్వారా రోడ్ ట్రిప్‌లో క్రికెట్ అభిమానులను భాగస్వామ్యం చేస్తామన్నారు. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా అభిమానులు భాగస్వాములు కావచ్చునని పిలుపు నిచ్చారు. -
ధోని, యువరాజ్లకు అరుదైన గౌరవం
భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలతో పాటు భారత మహిళా క్రికెట్ దిగ్గజాలు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వీరికి లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఇచ్చి సత్కరించింది. వీరితో పాటు మరో 14 మంది పురుష, మహిళా క్రికెట్ దిగ్గజాలకు కూడా ఎంసీసీ జీవితకాల సభ్యత్వాన్ని అందించి గౌరవించుకుంది. భారత క్రికెట్ దిగ్గజాలతో పాటు వెస్టిండీస్‌కు చెందిన మెరిస్సా అగ్యూలైరా, ఇంగ్లండ్‌కు చెందిన జెన్నీ గన్, లారా మార్ష్, ఇయాన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్, అన్యా శ్రుబ్సోల్, పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ హఫీజ్, ఆస్ట్రేలియాకు చెందిన రేచల్ హేన్స్, బంగ్లాదేశ్‌కు చెందిన ముష్రఫే మోర్తాజా, న్యూజిలాండ్‌కు చెందిన రాస్ టేలర్, ఆమీ సాటరెత్‌వైట్, సౌతాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్‌లను ఎంసీసీ లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఇచ్చి గౌరవించింది. ఈ వివరాలను ఎంసీసీ సీఈఓ, సెక్రెటరీ గుయ్ లావెండర్ ఇవాళ (ఏప్రిల్ 5) అధికారికంగా ప్రకటించారు. కాగా, ఎంసీసీ లైఫ్ టైమ్ మెంబర్షిప్ అందుకున్న ధోని, యువరాజ్, రైనా భారత్ 2011 వన్డే వరల్డ్‌కప్ సాధించిన జట్టులో సభ్యులు కాగా.. మిథాలీ రాజ్ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు (7805) సాధించిన బ్యాటర్‌గా, ఝులన్ గోస్వామి వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా బౌలర్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఎంసీసీ చివరిసారిగా లైఫ్ టైమ్ మెంబర్‌షిప్‌లను 2021 అక్టోబర్‌లో ప్రకటించింది. నాడు ఇంగ్లండ్‌కు చెందిన అలిస్టర్ కుక్, సౌతాఫ్రికాకు చెందిన జాక్ కల్లిస్, భారత్‌కు చెందిన హర్భజన్ సింగ్‌లతో పాటు మరో 15 మందికి ఈ గౌరవం దక్కింది. -
ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు! పంత్‌ను కలిసిన యువీ.. ఫొటో వైరల్
Yuvraj Singh- Rishabh Pant: ‘‘ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టాడు!!! ఈ చాంపియన్ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు’’ అంటూ భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్‌తో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ఎల్లవేళలా సానుకూల దృక్పథంతో ముందడుగు వేసే పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. కాగా గతేడాది డిసెంబరులో రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం విదితమే. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనేందుకు స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న పంత్ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. కోలుకుని తిరిగి రావాలి అనేక చికిత్సల అనంతరం ఇప్పుడిప్పుడే నడవడం మొదలుపెట్టాడు. ఇటీవలే ఓ వీడియోతో తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చాడు. ఈ క్రమంలో పంత్‌ను కలిసిన యువీ అతడితో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రిషభ్ ఎల్లప్పుడూ సరదాగా ఉంటాడని, ప్రతికూల ఆలోచనలు దరిచేరనీయడంటూ ప్రశంసించాడు. పూర్తిగా కోలుకుని తిరిగి మునపటి పంత్‌లా మారాలని ఆకాంక్షించాడు. కాగా అభిమానులను ఆకర్షిస్తున్న యువీ- పంత్ ఫొటో వైరల్‌గా మారింది. ఇక గాయాల కారణంగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ప్రతిష్టాత్మక సిరీస్‌లతో పాటు ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పంత్ స్థానంలో ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో అతడి స్థానంలో టీమిండియా తరఫున ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ అరంగేట్రం చేశాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్.. పంత్ స్థానంలో ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను సారథిగా నియమించింది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023కి కూడా పంత్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. చదవండి: Ind Vs Aus: అప్పటి మ్యాచ్‌లో విజయం వాళ్లదే! కానీ ఈసారి.. పిచ్ ఎలా ఉందంటే! ICC WC Qualifier: డక్‌వర్త్ రూపంలో అదృష్టం.. ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌కు అర్హత View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) -
'ఈ సమస్య మన వల్లే'.. ఆలోచింపజేసిన యువీ ట్వీట్
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ అనగానే మొదటగా వచ్చే పేరు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా. పురుషులు క్రికెట్ ఆధిపత్యంలో మహిళల క్రికెట్ కెప్టెన్ సంగతి మరిచిపోతున్నాం. టీమిండియా వుమెన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ సూపర్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం మహిళల టి20 ప్రపంచకప్‌లో బిజీగా ఉన్న టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23న జరగనున్న తొలి సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది భారత మహిళల జట్టు. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. 150 టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా హర్మన్ చరిత్ర సృష్టించింది. అయితే టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టిన వేళ మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ హర్మన్‌ప్రీత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''గూగుల్‌కు వెళ్లి ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఎవరు అని వెతికితే హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కనిపించడం లేదు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల పేర్లు మాత్రమే కనిపించాయి. ఈ సమస్యను మనమే సృష్టిస్తే.. దానిని పరిష్కరించడానికి ఒక మార్గం ఉంది. మహిళల క్రికెట్ కోసం అది చేద్దాం.#IndianCricketTeamCaptainHarmanpreetKaur on #Twitter #Quora #LinkedIn and #Reddit ఈ పదాలను అన్నింటిలో షేర్ చేసి చక్కదిద్దుకుందాం.'' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం యువరాజ్ చేసిన ట్వీట్ ఆలోచింపజేసేలా ఉంది. నిజమే టీమిండియా మహిళల క్రికెట్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఈసారి మహిళల జట్టు టి20 వరల్డ్‌కప్ కొట్టాలని కోరుకుందాం. యువీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మరో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా యువరాజ్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ సేమ్ వీడియోను షేర్ చేశాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు వెళ్లిన భారత మహిళల జట్టు లీగ్ దశలో ఇంగ్లండ్ చేతిలో మినహా మిగతా అన్నింటిలోనూ విజయాలు సాధించింది. సోమవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో గెలిచి టీమిండియా సెమీస్‌కు ఎంటరైంది. If we’ve created this problem, we also have the power to fix it. Let’s do it for women’s cricket! 🏏💪🏻 Use this hashtag: #IndianCricketTeamCaptainHarmanpreetKaur on #Twitter #Quora #LinkedIn and #Reddit to spread the word and make a difference! 🇮🇳 pic.twitter.com/JMn5Cw7Cel — Yuvraj Singh (@YUVSTRONG12) February 21, 2023 -
యువీ కెరీర్‌ను మలుపు తిప్పిన ఐదు బెస్ట్ ఇన్నింగ్స్‌లు
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(డిసెంబర్ 12న) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. యువీ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు(2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై). పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న యువరాజ్ దాదాపు రెండు దశాబ్దాల పాటు టీమిండియా క్రికెట్లో కీలకపాత్ర పోషించాడు. ఈ రెండు దశాబ్దాల్లో ఐసీసీ మేజర్ టోర్నీలైన 2007 టి20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌లు అతని ఖాతాలో ఉన్నాయి. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన యువీలో మంచి బౌలర్ కూడా ఉన్నాడు. 2000 అక్టోబర్ నెలలో కెన్యాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు సాధించాడు. అయితే ఎన్నో ఘనతలు, రికార్డులు అందుకున్నప్పటికి ఇప్పుడు చెప్పుకోబోయే ఐదు ఇన్నింగ్స్‌లు మాత్రం అతని కెరీర్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. 69 పరుగులు వర్సెస్ ఇంగ్లండ్(నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్) నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్లో నెంబర్‌వన్ స్థానంలో ఉంటుంది. యువరాజ్ కెరీర్‌నే కాదు టీమిండియా గతినే మార్చేసింది.. ఈ మ్యాచ్. 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు గంగూలీ(60), సెహ్వాగ్(45) తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించి పటిష్టమైన స్థితిలో నిలిపారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడం.. ఆ తర్వాత 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చాడు యువరాజ్ సింగ్. మరో ఎండ్‌లో మహ్మద్ కైఫ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు మంచి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను ముంఉదకు తీసుకెళ్లారు. ఆరో వికెట్‌కు ఇద్దరు కలిసి 221 పరుగులు రికార్డు భాగస్వామ్యంతో టీమిండియాను గెలుపు దిశగా నడిపించారు. అయితే విజయాన్ని 59 పరుగులు అవసరమైన దశలో యువీ ఔటైనప్పటికి.. అతని ఇన్నింగ్స్‌కు ముచ్చటపడిన కైఫ్ ఆ బాధ్యతలను తాను తీసుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలబడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీ నుంచి కెప్టెన్ గంగూలీ తన షర్ట్‌ను విప్పి సెలబ్రేట్ చేయడం అప్పట్లో బాగా వైరల్ అయింది. యువీ కెరీర్లో మొదటి టర్నింగ్ పాయింట్ ఇదే. 139 వర్సెస్ ఆస్ట్రేలియా, 2004 2004లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిడ్నీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న యువరాజ్ సెంచరీ సాధించాడు. 122 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 139 పరుగులు చేసిన యువీ కెరీర్లో ఇది రెండో బెస్ట్ అని చెప్పొచ్చు. అతని ధాటికి టీమిండియా 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. 58 వర్సెస్ ఇంగ్లండ్, 2007 టి20 ప్రపంచకప్ యువీ కెరీర్లో మూడో టర్నింగ్ పాయింట్.. 2007 టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌తో మ్యాచ్. ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో గొడవ యువరాజ్‌లోని విధ్వంసాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. అంతేకాదు 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న యువరాజ్ టి20 క్రికెట్లో అత్యంత వేగంగా అర్థసెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికి ఆ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. యువీ జోరుతో టీమిండియా తొలిసారి టోర్నీలో 200 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 57 వర్సెస్ ఆస్ట్రేలియా(2011 వన్డే వరల్డ్‌కప్) 2011 వన్డే వరల్డ్‌కప్‌లో యువరాజ్ ఆల్‌రౌండర్‌గా కీలకపాత్ర పోషించాడు. జట్టులో ఒక ఆల్‌రౌండర్ ఉంటే ఎంత బలమో యువీ చేసి చూపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 143 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టపడుతోంది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో క్రీజులోకి వచ్చిన యువీ తనలోని క్లాస్ ఆటను చూపించాడు. సురేశ్ రైనా సహకారంతో ఓపికగా ఆడని యువీ టీమిండియాకు 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో 67 బంతుల్లో 57 పరుగులతో యువరాజ్ నాటౌట్‌గా నిలిచాడు. 150 వర్సెస్ ఇంగ్లండ్, 2017 కెరీర్ చివరి దశలో యువరాజ్ ఆడిన ఆఖరి బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో యువరాజ్.. ఎంఎస్ ధోనితో కలిసి మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో కదం తొక్కిన యువరాజ్ 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. యువీ తన వన్డే కెరీర్లో అత్యధిక స్కోరును అందుకున్నాడు. యువీతో పాటు ధోని కూడా సెంచరీతో రాణించడంతో టీమిండియా 381 పరుగులు భారీ స్కోరు చేసింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం చెందింది. యువీ కెరీర్లో ఇదే ఆఖరి బెస్ట్ ఇన్నింగ్స్. ఆ తర్వాత క్రమంగా ఫామ్ కోల్పోయిన యువరాజ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. To celebrate Yuvraj Singh's birthday, tell us your favourite memory of his ✨ pic.twitter.com/bCcSuqQbHq — ICC (@ICC) December 12, 2020 చదవండి: 'ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు' Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు -
అతడు అద్భుతమైన ఆటగాడు.. వన్డే ప్రపంచకప్‌కు భారత ఓపెనర్‌గా!
భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా గిల్ అకట్టుకున్నాడు. అయితే బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు తిరిగి రావడంతో గిల్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. ఇక ఇది ఇలా ఉండగా.. వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు భారత జట్టులో శుబ్‌మన్ గిల్‌కు కచ్చితంగా చోటు దక్కుతుంది అని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. "శుబ్‌మన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గిల్ తన ఫామ్‌ను కొనసాగిస్తాడని భావిస్తున్నాను. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓపెనర్ల రేసులో గిల్ కచ్చితంగా ఉంటాడు. జట్టులో చోటు కోసం గిల్ చాలా కష్టపడుతున్నాడు. రాబోయే రోజుల్లో భారత జట్టుకు కీలక ఆటగాడిగా గిల్ మారుతాడు" అని పీటీఐతో యువరాజ్ పేర్కొన్నాడు. అదే విధంగా భారత్‌లో క్రీడల అభివృద్దికి తన వంతు కృషిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని యువీ అన్నాడు. ఇక ఇప్పటి వరకు 15 వన్డేలు ఆడిన గిల్.. 687 పరుగులు పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Hrishikesh Kanitkar: భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్ -
'ఐదో సిక్సర్ కొట్టగానే యువరాజ్ గుర్తుకువచ్చాడు'
దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హాజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఉత్తర్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఏడు బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లే కష్టసాధ్యమనుకుంటే.. రుతురాజ్ మాత్రం ఏకంగా ఏడు బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రుతురాజ్ ధాటికి శివ సింగ్ ఏకంగా ఒకే ఓవర్లో 43 పరుగులిచ్చుకోవాల్సి వచ్చింది. ఇక రుతురాజ్ తాను ఏడు సిక్సర్లు కొట్టిన సందర్భంలో యువరాజ్ సింగ్ గుర్తుకు వచ్చాడంటూ పేర్కొన్నాడు. ''వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత నాకు ఒక వ్యక్తి గుర్తుకువచ్చాడు. అతనే టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వరల్డ్‌కప్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం దగ్గరి నుంచి చూశా.నేను కూడా అలా దిగ్గజం సరసన చేరాలని భావించా. అందుకోసమే ఆరో సిక్స్ కొట్టాను. కానీ ఇలా ఒకే ఓవర్లో ఎక్కువ సిక్సర్లు కొడుతానని కలలో కూడా ఊహించలేదు'' అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఉత్తర్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 220 పరుగులు సాధించాడు. తాజాగా అస్సాంతో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో 126 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్.. 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 168 పరుగులు స్కోర్ చేశాడు. ఈ శతకంతో రుతురాజ్ ప్రస్తుత టోర్నీలో 4 మ్యాచ్‌ల్లో 3 శతకాలు (552 పరుగులు) తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీలో (2021, 2022) రుతరాజ్ గత 9 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 7 శతకాలు (168, 220 నాటౌట్, 40, 124 నాటౌట్, 168, 21, 124, 154 నాటౌట్, 136) బాది లిస్ట్-ఏ క్రికెట్లో మరో రికార్డు నెలకొల్పాడు. ఇక అస్సాంపై విజయం అందుకున్న మహారాష్ట్ర ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక డిసెంబర్ 2న జరగనున్న ఫైనల్లో సౌరాష్ట్ర, మహారాష్ట్రలు అమితుమీ తేల్చుకోనున్నాయి. 6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣ Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥 Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES — BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022 చదవండి: మరోసారి విధ్వంసం సృష్టించిన రుతురాజ్.. ఈసారి భారీ శతకంతో..! సచిన్, డివిలియర్స్ వంటి దిగ్గజాల సరసన రుతురాజ్.. రోహిత్‌తో పాటుగా -
రుతురాజ్ది ప్రపంచ రికార్డే! కానీ.. అతడు ఒకే ఓవర్లో ఏకంగా 8 సిక్స్‌లు కొట్టాడు!
Cricketers Who Hits 6 Sixes In An Over- Entire List: అంతర్జాతీయ వన్డేల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టారు. అంతర్జాతీయ టి20ల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లతో చెలరేగారు. దేశవాళీ వన్డేల్లో ఒక ఆటగాడు ఓవర్లో 6 సిక్సర్లతో సత్తా చాటాడు. దేశవాళీ టి20ల్లో ముగ్గురు బ్యాటర్లు ఓవర్లో 6 సిక్సర్లతో దూకుడు ప్రదర్శించారు. వీరంతా ఓవర్లో ఆరేసి సిక్సర్లతో పండగ చేసుకున్నారు. ఇదంతా ఇప్పటి వరకు రికార్డు... కానీ ఇప్పుడు దీన్ని దాటి ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో కొత్త ఘనత నమోదైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ నోబాల్ సహా 7 బంతుల్లో సిక్సర్లు బాది లిస్ట్–ఎ (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే, స్ట్క్లాస్ క్రికెట్లో (టెస్టులు, మూడు, నాలుగు రోజుల మ్యాచ్‌లు) మాత్రం రికార్డు లీ జెర్మన్ (8 సిక్స్‌లు) పేరిట ఉంది. లీ జెర్మన్ కొట్టిన మ్యాచ్‌లో... న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ లీ జెర్మన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 8 సిక్సర్లు కొట్టడం అధికారికంగానే నమోదై ఉంది. అయితే ఆ మ్యాచ్ జరిగిన తీరు పూర్తిగా భిన్నమైంది. వెల్లింగ్టన్ కెప్టెన్ మెక్ స్వీనీ ‘ప్రత్యేక వ్యూహం’లో భాగంగా ఇదంతా జరిగింది. 59 ఓవర్లలో 291 పరుగులు ఛేదించే క్రమంలో కాంటర్బరీ 108/8 వద్ద నిలిచింది. అయితే ఆ జట్టును అంత సులువుగా ఓడించరాదని, సులభంగా పరుగులు ఇచ్చి కాస్త ఆడిద్దామని వెల్లింగ్టన్ భావించింది. ఒకదశలో స్కోరు 196/8కు చేరింది. మరో 2 ఓవర్లు మిగలగా.. అసలు బౌలింగ్ రాని వాన్స్ చేతికి బంతి ఇచ్చారు. అతను ఓవర్లో ఏకంగా 17 నోబాల్స్ సహా 22 బంతులు వేశాడు. అంటే 5 బంతులే! ఇందులోనే లీ జెర్మన్ 8 సిక్స్‌లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 77 పరుగులు (0,4,4,4,6,6,4,6,1,4,1,0,6,6,6,6,6,0,0,4,0,1) వచ్చాయి. ఇప్పటికీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే. చివరకు మ్యాచ్ ‘డ్రా’ అయింది. మరిన్ని రికార్డులు ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు సమమైంది. 2018లో న్యూజిలాండ్‌లో ఫోర్డ్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్స్తో జరిగిన మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్స్ నమోదు చేసింది. అయితే ఇందులో బ్రెట్ హామ్టన్ 23 పరుగులు, జో కార్టర్ 18 పరుగులు రాబట్టారు. భారత్ తరఫున రోహిత్ శర్మ (3 సార్లు), సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, పృథ్వీ షా, శిఖర్ ధావన్, సమర్థ్ వ్యాస్, కరణ్ కౌశల్ తర్వాత లిస్ట్–ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన పదో భారత ఆటగాడిగా రుతురాజ్ నిలిచాడు. ఓవర్లో 6 సిక్సర్ల వీరులు అంతర్జాతీయ వన్డేలు ►హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా)- బౌలర్: డాన్ వాన్ బంగ్ (నెదర్లాండ్స్; 2007లో) ►జస్కరన్ మల్హోత్రా (అమెరికా)- బౌలర్: గౌడీ టోకా (పాపువా న్యూగినియా; 2021లో) అంతర్జాతీయ టి20లు ►యువరాజ్ (భారత్) బౌలర్- స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్; 2007లో) ►కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్) బౌలర్- అఖిల ధనంజయ (శ్రీలంక; 2021లో) ఫస్ట్ క్లాస్ క్రికెట్ ►సోబర్స్ (నాటింగమ్‌షైర్ కౌంటీ)- బౌలర్: నాష్ (గ్లామోర్గాన్; 1968లో) ►రవిశాస్త్రి (ముంబై)- బౌలర్: తిలక్ రాజ్ (బరోడా; 1984లో) ►లీ జెర్మన్ (కాంటర్ బరీ)- బౌలర్: వాన్స్ (వెల్లింగ్టన్; 1990లో) దేశవాళీ వన్డేలు ►తిసారా పెరీరా (శ్రీలంక; శ్రీలంక ఆర్మీ స్పోర్ట్స్ క్లబ్)- బౌలర్: దిల్హాన్ కూరే (బ్లూమ్‌ఫీల్డ్; 2021లో) ►రుతురాజ్ గైక్వాడ్ (భారత్; మహారాష్ట్ర)- బౌలర్: శివ సింగ్ (ఉత్తరప్రదేశ్; 2022లో) దేశవాళీ టి20లు ►రోజ్ వైట్లీ (వొర్స్‌టర్‌షైర్) - బౌలర్: కార్ల్ కార్వర్ (యార్క్‌షైర్; 2017లో) ►లియో కార్టర్ (కాంటర్బరీ) - బౌలర్: ఆంటన్ డెవ్‌సిచ్ (నార్తర్న్ డిస్ట్రిక్ట్స్; 2020లో) ►హజ్రతుల్లా జజాయ్ (కాబూల్ జ్వానన్)- బౌలర్: అబ్దుల్లా మజారి (బాల్క్ లెజెండ్స్; 2018లో) చదవండి: Christiano Ronaldo: రొనాల్డోకు బంపరాఫర్ .. ఏడాదికి రూ.612 కోట్లు! Indian Captain: హార్దిక్‌తో పాటు టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ యువ ప్లేయర్ కూడా! జట్టులో చోటుకే దిక్కులేదు! 6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣ Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥 Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES — BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022 -
చిక్కుల్లో క్రికెటర్ యువరాజ్ సింగ్..
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. గోవా ప్రభుత్వం యువరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. విషయంలోకి వెళితే.. గోవాలోని మోర్జిమ్ ప్రాంతంలో యువీకి 'కాసా సింగ్' పేరిట ఒక విల్లా ఉంది. గత సెప్టెంబర్‌లో ఈ విల్లాను అద్దెకు ఇస్తానంటూ యువీ తన ట్విటర్ వేదికగా ప్రకటన చేశాడు. గోవా రూల్స ప్రకారం ఇది ఒక విధంగా పేయింగ్ గెస్ట్ విధానం కిందకు వస్తుంది. దీనికి గోవా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. పేయింగ్ గెస్ట్ విధానం కింద విల్లాను అద్దెకు ఇవ్వాలంటే గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ యూవీ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే అద్దె ఇవ్వడం అతనికి చిక్కులు తెచ్చిపెట్టింది. దీనిని గోవా అధికారులు తప్పుబడుతూ రూ.లక్ష జరిమానా విధించారు. అంతేకాదు డిసెంబర్ 8న తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేశారు. పర్యాటక శాఖ చట్టాన్ని ఉల్లంఘించిన క్రమంలో ఎందుకు రూ. లక్ష జరిమానా విధించకూడదో చెప్పాలని నోటీసుల్లో ప్రశ్నించారు. ఎవరైనా సరే గోవాలో హోటల్/గెస్ట్ హౌస్ కార్యకలాపాలు నిర్వహించాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర టూరిజం శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. I’ll be hosting an exclusive stay at my Goa home for a group of 6, only on @Airbnb. This is where I spend time with my loved ones & the home is filled with memories from my years on the pitch. Bookings open Sep 28, 1pm IST at https://t.co/5Zqi9eoMhc 🏖️#AirbnbPartner @Airbnb_in pic.twitter.com/C7Qo32ifuE — Yuvraj Singh (@YUVSTRONG12) September 21, 2022 చదవండి: 'నెంబర్ వన్ స్థానం నావల్లే.. వాడుకొని వదిలేశారు' బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు -
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బాదిన భారత క్రికెటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన రోహిత్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ఓవరాల్‌గా 34 సిక్సర్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్(34) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో యువీ రికార్డును హిట్ మ్యాన్ బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రిస్ గేల్(63) ఉన్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ మరో రికార్డును సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్ 903 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే 1016 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ.. 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 53 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. అగ్ర స్థానంలోకి ప్రోటీస్ -
కోహ్లి ఫ్యాన్స్‌కు కనువిందు.. రోహిత్ ఒక్కడే కాదు.. యువీ, భజ్జీ కూడా..!
విరాట్ వీరోచిత పోరాటం కారణంగా నిన్న (అక్టోబర్ 23) పాక్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పొట్టి క్రికెట్ చరిత్రలో మరపురానిదిగా మిగిలిపోయే ఈ సమరంలో ఎన్నో మలుపులు, మరెన్నో రికార్డులు నమోదవ్వడంతో పాటు అంతకుమించిన ఆసక్తికర దృశ్యాలు క్రికెట్ ప్రేమికులకు మధురానుభూతులను మిగిల్చాయి. మ్యాచ్ అనంతరం కోహ్లి కళ్లు చెమర్చడం, రోహిత్.. విరాట్‌ను భుజంపైకి ఎత్తుకుని విజయ గర్వంతో గర్జించడం, భావోద్వేగంతో హార్ధిక్ కంటతడి పెట్టడం, సునీల్ గవాస్కర్ డ్యాన్స్ చేయడం.. ఇలా చాలా సన్నివేశాలు భారత క్రికెట్ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. https://t.co/23cs2byVka pic.twitter.com/itACHggGiX — Chaitanya (@chaitu_20_) October 23, 2022 వీటిలో హిట్‌మ్యాన్.. కోహ్లిని భుజంపై ఎత్తుకున్న సన్నివేశం ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. ఈ సన్నివేశాన్ని చూసిన రోహిత్, విరాట్ ఫ్యాన్స్ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. టీమిండియా కృష్ణార్జునులు, ట్రిపుల్ ఆర్ రామ్-భీమ్ అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. రోహిత్-విరాట్‌ను ఎత్తుకున్న సన్నివేశం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో రెండు పాత వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే.. పాక్‌పై విక్టరీ అనంతరం రోహిత్.. కోహ్లిని ఎలా ఎత్తుకున్నాడో అచ్చం అలానే గతంలో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లు కోహ్లిని ఎత్తుకున్నారు. 2014లో సౌతాఫ్రికాపై కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (72 నాటౌట్) అనంతరం యువీ.. కోహ్లిని మైదానం మొత్తం ఎత్తుకుని తిరిగాడు. మొహాలీ వేదికగా 2016లో కోహ్లి ఆడిన చారిత్రక ఇన్నింగ్స్ (82 నాటౌట్)కు ఫిదా అయిన భజ్జీ కూడా కోహ్లిని రెండు చేతులతో ఎత్తుకుని అభినందించాడు. పై మూడు సందర్భాలకు సంబంధించిన సన్నివేశాలను ఓ నెటిజన్ ఎడిట్ చేసి ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. కోహ్లి ధమాకా ఇన్నింగ్స్ నుంచి ఇంకా తేరుకోని ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు. చదవండి: ద్రవిడ్‌ను వెనక్కు నెట్టిన కోహ్లి.. ఇక మిగిలింది ఐదుగురే..! -
Blind T20 World Cup 2022: భారత జట్టు కెప్టెన్‌గా అజయ్
స్వదేశంలో ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి 17 వరకు జరిగే అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 17 మంది సభ్యులుగల టీమిండియాకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన వెంకటేశ్వర రావును వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ మెగా ఈవెంట్‌కు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. గతంలో భారత జట్టు రెండుసార్లు (2012, 2017) ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. భారత జట్టు: అజయ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), వెంకటేశ్వర రావు (వైస్ కెప్టెన్), దుర్గా రావు, ఎ.రవి (ఆంధ్రప్రదేశ్), లలిత్ మీనా (రాజస్తాన్), ప్రవీణ్, దీపక్ (హరియాణా), సుజీత్ (జార్ఖండ్), నీలేశ్ యాదవ్, , ఇర్ఫాన్ (ఢిల్లీ), సోనూ (మధ్యప్రదేశ్), సొవేందు (బెంగాల్), నకులా (ఒడిశా), లోకేశ, సునీల్, ప్రకాశ్ (కర్ణాటక), దినగర్ (పాండిచ్చేరి). -
T20 WC: టీ20 వరల్డ్‌కప్-2022.. రోహిత్ శర్మను ఊరిస్తున్న ఐదు అరుదైన రికార్డులు
T20 World Cup 2022- Rohit Sharma: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం (అక్టోబరు 16) నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే టీమిండియా సభ్యుడిగా పలుసార్లు ఈ మెగా టోర్నీ ఆడిన రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్‌గా కొత్త హోదాలో బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో అద్భుత రికార్డు ఉన్న హిట్‌మ్యాన్‌ను ఊరిస్తున్న ఐదు రికార్డులను ఓసారి పరిశీలిద్దాం. 1.కెప్టెన్‌గా అరుదైన రికార్డు సాధించే అవకాశం యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ హిట్టర్ క్రిస్‌గేల్ 2010 ప్రపంచకప్‌లో తమ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ సందర్భంగా టీమిండియాతో మ్యాచ్‌లో 66 బంతులు ఎదుర్కొన్న అతడు 98 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఒక కెప్టెన్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఇప్పుడు రోహిత్ శర్మకు ఈ అరుదైన రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశం ముందుంది. టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగనున్న హిట్‌మ్యాన్ 99 లేదంటే ఏకంగా సెంచరీ సాధించాడంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా నిలుస్తాడు. 2. నాలుగో స్థానం నుంచి.. టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్దనేకు అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డు ఉంది. మొత్తంగా ఐదుసార్లు ఈ ఐసీసీ ఈవెంట్ ఆడిన జయవర్ధనే 1016 పరుగులు సాధించాడు. విండీస్ హిట్టర్ క్రిస్‌గేల్ 965, తిలకరత్నె దిల్షాన్ 897 పరుగులతో అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాన్ని రోహిత్ శర్మ ఆక్రమించాడు. ఇప్పటి వరకు 847 పరుగులు సాధించాడు. ఈసారి ప్రపంచకప్‌లో అతడు మొత్తంగా 169 పరుగులు సాధిస్తే అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. 3. ఈ రికార్డు లాంఛనమే! హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 2007లో టీమిండియా తరఫున తొలిసారి టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడిన అతడు.. మరో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలుస్తాడు. ధోని, గేల్, ముష్షికర్ రహీంలను దాటుకుని.. శ్రీలంక ఆటగాడు తిలకరత్నె దిల్షాన్(35 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతాడు. ఎలాంటి ఆటంకాలు, గాయాల బెడద వంటివి లేకుండా రోహిత్ బరిలోకి దిగితే ఈ రికార్డు సాధించడం లాంఛనమే! ఇప్పటి వరకు టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు ►తిలకరత్నె దిల్షాన్-35 ►డ్వేన్ బ్రావో- 34 ►షోయబ్ మాలిక్- 34 ►ఎంఎస్ ధోని- 33 ►క్రిస్ గేల్-33 ►ముష్ఫికర్ రహీం- 33 ►రోహిత్ శర్మ- 33 4. బ్రెండన్ మెకల్లమ్ రికార్డు అధిగమించే అవకాశం న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఇంగ్లండ్ ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. 2012లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 58 బంతుల్లో 123 పరుగులు సాధించి.. అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. ఇక మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 65 బంతుల్లో 79 పరుగులు. 2010లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ఈ స్కోరు సాధించాడు. ఇక పొట్టి క్రికెట్లో ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్లో 4 సెంచరీలు నమోదు చేసిన హిట్‌మ్యాన్ .. మరో శతకం బాదడం సహా అదనంగా మరో 24 పరుగులు సాధిస్తే మెకల్లమ్‌ను అధిగమించే అవకాశం ఉంది. 5. ఇంకో మూడు సిక్స్‌లు కొడితే టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ శర్మ కచ్చితంగా బద్దలు కొట్టగల మరో రికార్డు ఇది. ఇప్పటి వరకు ఈ ఐసీసీ టోర్నీలో 31 సిక్సర్లు కొట్టిన హిట్‌మ్యాన్.. మరో మూడు సిక్స్‌లు బాదితే చాలు. ఈ మేజర్ ఈవెంట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. తద్వారా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డు(33 సిక్స్‌లు) బద్దలు కొడతాడు. అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ ఈ ఫీట్ నమోదు చేయాలని ఆశిస్తూ హిట్‌మ్యాన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుదాం!! -సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: Ind Vs WA XI: రాహుల్ ఇన్నింగ్స్ వృథా.. కుప్పకూలిన మిడిలార్డర్.. టీమిండియాకు తప్పని ఓటమి -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. కోహ్లి శుభాకాంక్షలు, యువీని ఉతికి ఆరేసిన నెటిజన్లు
Cristiano Ronaldo 700th Goal: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్, ఆల్‌టైమ్ గ్రేట్ (GOAT) క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నిన్న (అక్టోబర్ 9) ఎవర్టన్తో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా.. ఫుట్‌బాల్ చరిత్రలో 700 గోల్స్ (క్లబ్ గేమ్స్‌లో) సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ అత్యధిక గోల్స్ (117) సాధించిన ఫుట్‌బాలర్‌గా కొనసాగుతున్న రొనాల్డో.. ఫుట్‌బాల్ సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు. ఇప్పటివరకు ఓవరాల్‌గా (క్లబ్ గోల్స్+అంతర్జాతీయ గోల్స్) 817 గోల్స్ సాధించిన రొనాల్డో.. భవిష్యత్తు తరాల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఓవరాల్‌గా అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో తర్వాతి స్థానంలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఉన్నాడు. మెస్సీ ఇప్పటివరకు క్లబ్స్ స్థాయిలో 691 గోల్స్, 90 అంతర్జాతీయ గోల్స్ కొట్టాడు. ఓవరాల్‌గా చూస్తే.. మెస్సీ రొనాల్డో కంటే 36 గోల్స్ వెనుకబడి ఉన్నాడు. Virat Kohli commented on Cristiano Ronaldo's Instagram post: "THE GOAT. #700" pic.twitter.com/OqTq8ocqsP — CRISTIANO ADDICTION (@craddiction) October 10, 2022 రొనాల్డో సాధించిన ఘనతకు యావత్ క్రీడా ప్రపంచం శుభాకాంక్షలు తెలుపుతుండగా.. భారత స్టార్ క్రికెటర్లు కూడా మేము సైతం అంటూ సోషల్‌మీడియా వేదికగా GOATకు విషెస్ తెలుపుతున్నారు. రొనాల్డోకు వీరాభిమాని అయిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఇన్‌స్టా వేదికగా "THE GOAT. #700" అని విష్ చేయగా.. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విటర్లో రొనాల్డోకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే, యువీ తాను చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల నెట్టింట దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. King 👑 is back ! Form is temporary class is forever !!! @Cristiano welcome to 700 club ! No7 #GOAT𓃵 #legend siiiiiiiiiiii !!!!! @ManUtd — Yuvraj Singh (@YUVSTRONG12) October 9, 2022 ఎందుకంటే.. క్లబ్ స్థాయి ఫుట్‌బాల్‌లో రొనాల్డో 700 గోల్స్ చేసిన తొలి ఆటగాడు అయితే.. యువీ 700 గోల్స్ క్లబ్‌లోకి స్వాగతం అంటూ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఇలా ట్వీట్ చేయడంలో యువీ ఉద్దేశం ఏదైనా.. మిస్టేక్ స్పష్టంగా కనిపిస్తుండటంతో ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. -
సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 40 పరుగులతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 15 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (20 బంతుల్లో 40 పరుగులు, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో యువరాజ్ సింగ్(15 బంతుల్లో 31 పరుగులు నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ 11 బంతుల్లో 27 పరుగులతో అలరించారు. ఇంగ్లండ్ లెజెండ్స్ బౌలింగ్‌లో ఎస్ పారీ మూడు వికెట్లు తీయగా.. స్కోఫీల్డ్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ లెజెండ్స్ 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్ కీపర్ ఫిల్ మస్టర్డ్ 29 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. క్రిస్ ట్రెమ్లెట్ 24 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఇండియా లెజెండ్స్ బౌలర్లలో రాజేశ్ పవార్ 3, స్టువర్ట్ బిన్నీ, ప్రగ్యాన్ ఓజా, మన్‌ప్రీత్ గోనీ తలా ఒక వికెట్ తీశారు. 40 పరుగులతో మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన సచిన్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. చదవండి: గోల్డ్ మెడల్‌తో సర్ప్రైజ్ చేసిన హాలీవుడ్ హీరో 'బ్యాట్‌తోనే సమాధామిచ్చాడు.. పిచ్చి రాతలు మానుకోండి' -
మ్యాచ్‌కు హాజరైన యువరాజ్.. కోహ్లితో మాటామంతీ
మొహలీ వేదికగా మంగళవారం టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టి20కి భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లు హాజరయ్యారు. క్రికెట్లో వారు చేసిన సేవకు గానూ పంజాబ్‌లోని పీసీఏ మొహలీ స్టేడియంలోని రెండు స్టాండ్స్‌కు వీరిద్దరి పేర్లను పెట్టిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ప్రారంభానికి ముందు యువరాజ్ సింగ్, హర్భజన్లను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ ప్రారంభమయ్యాకా టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లిని కలుసుకున్న యువరాజ్ సింగ్ ఏదో విషయమై సీరియస్‌గా మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య చాలాసేపు సీరియస్ చర్చ నడిచినట్లు తెలుస్తోంది. బహుశా టీమిండియా ఇన్నింగ్స్ సాగుతున్న తీరుపై.. జట్టు ఎంపికపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు అభిమానులు పేర్కొన్నారు. ఏది ఏమైనా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్, విరాట్ కోహ్లిలను ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడడం మాత్రం అభిమానులకు కనువిందుగా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) చదవండి: 'పాకిస్తాన్ కూడా ఓడిపోయింది'.. ఇంగ్లండ్ ఘన విజయం -
యువరాజ్ సింగ్ సరికొత్త అవతారం.. న్యూయార్క్ స్ట్రైకర్స్ మెంటార్‌గా!
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరికొత్త అవతరమెత్తనున్నాడు. అబుదాబి టీ10 లీగ్-2022 సీజన్‌కు గానూ న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టు మెంటార్‌గా యువరాజ్ సింగ్ ఎంపికయ్యాడు. కాగా యువరాజ్ అబుదాబి టీ10 లీగ్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. 2019 ఈ టోర్నీ సీజన్లో మరాఠా అరేబియన్స్‌కు యువీ ప్రాతినిథ్యం వహించాడు. ఇక 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న యువీ.. బీసీసీఐ అనుమతితో కొన్ని గ్లోబల్ ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో ఆడాడు. అదే విధంగా లీజెండ్స్ లీగ్ క్రికెట్, రోడ్ సెప్టీ వంటి లీగ్‌ల్లో కూడా యువరాజ్ భాగంగా ఉన్నాడు. అబుదాబి టీ10 లీగ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో న్యూయార్క్ స్ట్రైకర్స్ ఒప్పందం కుదర్చుకుంది. చదవండి: ICC T20I Rankings: దుమ్ము రేపిన మంధాన.. నెంబర్ 1 స్థానానికి చేరువలో! -
యువీ సిక్స్ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. స్పెషల్ పార్ట్నర్తో కలిసి! వైరల్
Yuvraj Singh Celebrates Six 6s- Video Viral: టీ20 ప్రపంచకప్-2007లో నాటి టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ఘటన ప్రతి అభిమాని మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందడనంలో సందేహం లేదు. ఇంగ్లండ్‌తో సెప్టెంబరు 19 నాటి మ్యాచ్‌లో యువీ పూనకం వచ్చినట్టుగా ఊగిపోయాడు. మ్యాచ్ 19వ ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్స్‌లు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 16 బంతులు ఎదుర్కొన్న యువీ.. 7 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు సాధించాడు. తద్వారా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 218 పరుగుల భారీ స్కోరు చేయడం సహా 18 పరుగుల తేడాతో మ్యాచ్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా పదిహేనేళ్లు. ముద్దుల కొడుకుతో కలిసి.. ఈ సందర్భంగా క్రికెట్ ప్రేమికులు, యువీ అభిమానులు ఈ అద్భుత ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే, యువరాజ్ మాత్రం ఓ స్పెషల్ పార్ట్నర్తో కలిసి తన చిరస్మరణీయ ఇన్నింగ్స్ తాలుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. బుడ్డోడు సైతం కన్నార్పకుండా.. ఆ పార్ట్నర్ మరెవరో కాదు యువీ ముద్దుల తనయుడు ఓరియన్ కీచ్ సింగ్. కుమారుడితో కలిసి ప్రపంచకప్‌లో తన సిక్సర్ల విధ్వంసం వీక్షిస్తున్న వీడియోను యువరాజ్ అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో కొడుకును ఒళ్లో కూర్చోబెట్టుకుని యువీ ఎంజాయ్ చేస్తుండగా.. బుడ్డోడు సైతం కన్నార్పకుండా తండ్రి ఆటను చూస్తూ ఉండిపోవడం విశేషం. ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. 2007లో స్కాట్లాండ్తో మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తన కెరీర్లో మొత్తంగా 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్ధ శతకాలు ఉన్నాయి. మొత్తంగా 28 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఆల్‌రౌండర్. ఇక అన్ని ఫార్మాట్లలో తనదైన ముద్ర వేసిన యువరాజ్ సింగ్‌ను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సముచిత రీతిలో గౌరవించింది. మొహాలీలో స్టేడియంలోని ఓ స్టాండ్‌కు యువీ పేరును పెట్టగా.. ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్ ఆరంభం కానున్న సందర్భంగా మంగళవారం దీనిని ఆవిష్కరించనున్నారు. కాగా యువరాజ్ సింగ్.. నటి హజెల్ కీచ్‌ను 2016లో వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు ఈ ఏడాది జనవరిలో కుమారుడు జన్మించాడు. అతడికి ఓరియన్ కీచ్ సింగ్‌గా నామకరణం చేశారు. చదవండి: T20 WC: యువ పేసర్‌పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా! Couldn’t have found a better partner to watch this together with after 15 years 👶 🏏 #15YearsOfSixSixes #ThisDayThatYear #Throwback #MotivationalMonday #GetUpAndDoItAgain #SixSixes #OnThisDay pic.twitter.com/jlU3RR0TmQ — Yuvraj Singh (@YUVSTRONG12) September 19, 2022 -
Ind Vs Aus: యువీ, భజ్జీకి సముచిత గౌరవం.. ఆసీస్‌తో తొలి టీ20కి ముందు..
Ind Vs Aus 1st T20- మొహాలి: భారత క్రికెట్లో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. మొహాలి స్టేడియంలో రెండు స్టాండ్లకు ఈ ఇద్దరు ఆటగాళ్ల పేర్లు పెడుతున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం తొలి టి20 మ్యాచ్‌కు ముందు ఈ స్టాండ్స్‌ను ఆవిష్కరిస్తారు. యువరాజ్ భారత్ తరఫున 40 టెస్టుల్లో 1,900, 304 వన్డేల్లో 8,701, 58 టి20ల్లో 1,117 పరుగులు చేయడంతో పాటు 148 వికెట్లు కూడా పడగొట్టాడు. హర్భజన్ 103 టెస్టుల్లో 417... 236 వన్డేల్లో 269... 28 టి20ల్లో 25 వికెట్లు పడగొట్టడంతో పాటు మూడు ఫార్మాట్లలో కలిపి 3,569 పరుగులు సాధించాడు. చదవండి: కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్: రోహిత్ శర్మ -
'మ్యాచ్‌లో సిక్సర్లు లేవు.. పార్టీలో మాత్రం ఇరగదీశాడు'
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ కోసం టీమిండియా దిగ్గజాలంతా ఒకే చోట చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరల్డ్ సిరీస్‌లో మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా ఉన్న ఈ క్రికెటర్లంతా మరోసారి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంపై అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ , ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా సహా మరికొంత మంది రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడుతున్నారు. కాగా సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా లెజెండ్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పార్టీ మూడ్ లోకి వచ్చిన డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. మ్యాచ్‌లో సిక్సర్లు కొట్టడంలో విఫలమైన యువరాజ్ పార్టీలో మాత్రం తనదైన డ్యాన్స్‌తో హైలైట్‌గా మారాడు. పాత పాటలు వింటూ పలు డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించాడు. కాగా యువీ డ్యాన్స్‌పై ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ''యువరాజ్ సింగ్‌లో మాకు అత్యంత ఖరీదైన చీర్లీడర్ కనిపిస్తున్నాడు. నిజంగా ఇది అద్భుతమైన రాత్రి. సూపర్‌గా ఎంజాయ్ చేశాం. చాలాకాలం తర్వాత ఒక సిరీస్ కోసం మేమంతా కలవడం సంతోషంగా అనిపిస్తోంది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయ భేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. Having fun with two legendary singers 🎤 @IrfanPathan @ImRaina 🎶 and of course the legend of legends @sachin_rt 👑 @munafpa99881129 @ManpreetGony @pragyanojha #roadsafetyworldseries #indialegends pic.twitter.com/wjP31UcYVZ — Yuvraj Singh (@YUVSTRONG12) September 12, 2022 చదవండి: Mohammed Siraj: తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. వీడియో వైరల్ -
శుభ్ మన్ గిల్ సెంచరీ వెనుక యువరాజ్ సింగ్
-
Ind Vs Zim: అరుదైన ఘనత.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన శుబ్‌మన్
India Vs Zimbabwe 3rd ODI 2022- Shubman Gill: జింబాబ్వే పర్యటనలో ఆద్యంతం అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్. మొదటి వన్డేలో ఓపెనర్‌గా వచ్చి అజేయంగా నిలిచి 82 పరుగులు(72 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో).. రెండో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి 34 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. ఇక.. ఆతిథ్య జింబాబ్వేతో మూడో వన్డేలో తన విశ్వరూపం ప్రదర్శించాడు శుబ్‌మన్. ఎట్టకేలకు సెంచరీ గండాన్ని గట్టెక్కాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 22 ఏళ్ల ఈ కుడిచేతి వాటం గల బ్యాటర్ 97 బంతుల్లో 130 పరుగులు(15 ఫోర్లు, ఒక సిక్స్) చేశాడు. తద్వారా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు కొట్టడంతో పాటు మరో అరుదైన ఘనత సాధించాడు. (క్లిక్: IND vs ZIM: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. సచిన్ 24 ఏళ్ల రికార్డు బద్దలు!) రోహిత్ రికార్డు బద్దలు సోమవారం (ఆగష్టు 22)మూడో వన్డేలో శతకం బాదడం ద్వారా అత్యంత పిన్న వయసులో జింబాబ్వే గడ్డ మీద ఈ ఫీట్ నమోదు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 22 ఏళ్ల 348 రోజుల వయసులో గిల్ ఈ ఘనత సాధించాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. హిట్‌మ్యాన్ 23 ఏళ్ల 28 రోజుల వయసులో జింబాబ్వే మీద సెంచరీ సాధించాడు. యువీ, కోహ్లితో పాటు.. అదే విధంగా విదేశీ గడ్డ మీద వన్డేల్లో చిన్న వయసులో సెంచరీ సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు గిల్. యువరాజ్ సింగ్( 22 ఏళ్ల 41 రోజులు), విరాట్ కోహ్లి(22 ఏళ్ల 315 రోజులు) తర్వాతి స్థానం ఆక్రమించాడు. ఇలా ఈ మ్యాచ్‌లో గిల్ తన అంతర్జాతీయ కెరీర్లో మొదటి సెంచరీ సాధించడం ద్వారా జట్టును గెలిపించడంతో పాటుగా.. పలు వ్యక్తిగత రికార్డులు సృష్టించాడు. వెల్డన్ గిల్.. ఈ నేపథ్యంలో గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్.. ‘‘పిన్న వయసులో 100.. వెల్డన్ శుబ్‌మన్ గిల్’’ అని ట్విటర్ వేదికగా కొనియాడాడు. ఇక విండీస్ మాజీ ప్లేయర్, కామెంటేటర్ ఇయాన్ బిషప్ సైతం గిల్‌ను అభినందించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో గెలుపొందిన కేఎల్ రాహుల్ సేన 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అద్బుత శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శుబ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదే విధంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా నిలిచాడు. చదవండి: Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ! ద్రవిడ్ దూరం?! Shumban Gill-Sikandar Raza: సెంచరీ వీరుడి సంచలన క్యాచ్.. మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ First of many 💯 for this youngster @ShubmanGill well done 👏 — Irfan Pathan (@IrfanPathan) August 22, 2022 First of many 💯 for this youngster @ShubmanGill well done 👏 — Irfan Pathan (@IrfanPathan) August 22, 2022 -
చెమటోడుస్తున్న యువీ.. ఇదంతా ఆ మ్యాచ్ కోసమేనా?
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నెట్స్‌లో త్రీవంగా చెమటోడుస్తున్నాడు. యువీ బ్యాటింగ్‌లో శ్రమిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి యువరాజ్ ఇంతకు దేనికోసం ఇంత ప్రాక్టీస్ చేస్తున్నట్లు.. అనే డౌట్ వచ్చిందా. అక్కడికే వస్తున్నాం.భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ ఒక స్పెషల్ మ్యాచ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ జట్టుకు గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, యూసఫ్ పఠాన్ సహా మరికొంత మంది ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. అయితే, యువీ పేరు ఇటీవల ప్రకటించిన జట్టులో లేనప్పటికీ ఈ మేరకు ఈ మాజీ డాషింగ్ ఆల్కరౌండర్ నెట్స్‌లో శ్రమించడం విశేషం. దీంతో ఆఖరి నిమిషంలోనైనా యువీ ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు. కాగా యువరాజ్ ప్రాక్టీస్‌కు ముందు ఒక అభిమాని.. ''మీ కార్లో క్రికెట్ కిట్ ఏం చేస్తోంది'' అని అడిగాడు. యువీ స్పందిస్తూ.. నాకు కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఏదైనా మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి ప్రాక్టీస్ చేయడం అవసరం. పేర్కొన్నాడు. ఆ తర్వాత యువరాజ్ తన కిట్ ఓపెన్ చేసి తన ప్యాడ్లను చూపిస్తూ ''వారియర్ ఈజ్ బ్యాక్''.. రానున్న జరగబోయే మ్యాచ్‌కోసం నేను మంచి ఉత్సాహంతో ఉన్నా.. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్తున్నా అంటూ తెలిపాడు. ఇక ప్రాక్టీస్ ముగిసిన అనంతరం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి బాగా అలసిపోయా.. కొద్దిసేపు నాకు ఊపిరి తీసుకోవడం కష్టమయింది. ఆల్ ది బెస్ట్.. ఇండియన్ మహరాజాస్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక యువరాజ్ టీమిండియా తరపున గ్రేటెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 19 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్ 10, 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 19 ఏళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేశాడు. Didn’t do too bad, did I? 🤪 Super excited for what’s coming up! pic.twitter.com/MztAU5nyZJ — Yuvraj Singh (@YUVSTRONG12) August 16, 2022 Are you as excited about the special India@75 match between India @IndMaharajasLLC and World @WorldGiantsLLC? Announcing the full squads of #Legends in the next tweet! #LegendsLeagueCricket #AzadiKaAmritMahotsav@Souravganguly @Eoin16 @AmritMahotsav @cabcricket @DasSanjay1812 pic.twitter.com/oUZZQaOUFv — Legends League Cricket (@llct20) August 12, 2022 ఇండియా మహరాజాస్: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఎస్ బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా, అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ సింగ్ జడేజా,ఆర్ పీ సింగ్ , జోగిందర్ శర్మ వరల్డ్ జెయింట్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండిల్ సిమన్స్, హెర్షెల్ గిబ్స్, జాక్వెస్ కల్లిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్, నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హామిల్టన్ మసకద్జా, మష్రాఫ్ మోర్టాజా, అస్గ్హర్ మోర్టాజా, అస్గ్హర్ట్జాన్ అఫ్ట్సన్, , కెవిన్ ఓ'బ్రియన్, దినేష్ రామ్‌దిన్ చదవండి: ఇండియా మహరాజాస్ కెప్టెన్‌గా గంగూలీ.. పోటీకి సన్నద్ధం! LLC 2022: ఇండియా మహరాజాస్‌తో మ్యాచ్.. సనత్ జయసూర్య అవుట్! షేన్ వాట్సన్ ఇన్ -
కొత్త వేషంలో టీమిండియా దిగ్గజం.. టీజ్ చేసిన యువీ
టీమిండియా దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొత్త అవతారంలో కనిపించాడు. తన సోదరుడు నితిన్ టెండూల్కర్ కూతురు పెళ్లి సందర్భంగా సచిన్ సంప్రదాయ దుస్తులో మెరిశాడు. గోదుమ కలర్ షేర్వాణీ ధరించిన సచిన్.. ఎర్ర తలపాగాతో(ఫేటా) రాజవంశీయుడిగా కనిపించాడు. ఇదే విషయాన్ని సచిన్ స్వయంగా తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. వెడ్డింగ్.. షాదీ సెలబ్రేషన్ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. నా అన్న నితిన్ కూతురు పెళ్లి.. అందుకే ఈ సంప్రదాయ డ్రెస్సుతో పాటు ఫేటాను ధరించాను. అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్బంగా ఫేటాను పెట్టుకుంటున్న వీడియోనూ షేర్ చేశాడు. ఇక సచిన్ పెట్టిన పోస్ట్‌పై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరదాగా స్పందించాడు. సచిన్‌ను టీజ్ చేస్తూ.. ''ఓయ్ సచిన్ కుమార్.. హే'' అంటూ పేర్కొన్నాడు. ఇక సచిన్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అని యువీ చాలాసార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు టైటిల్ అందించిన యువరాజ్ తన గెలుపును సచిన్‌కు అంకితమిచ్చి.. ''ఇదంతా సచిన్ కోసమే'' అంటూ పేర్కొనడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇక మంగళవారం కన్నుమూసిన దిగ్గజ అంపైర్ రూడీ కోర్ట్జెన్ను సంతాపం తెలిపిన వీరిద్దరు అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. View this post on Instagram A post shared by Sachin Tendulkar (@sachintendulkar) చదవండి: Meg Lanning: ఆస్ట్రేలియా కెప్టెన్ అనూహ్య నిర్ణయం.. గౌరవించిన సీఏ -
'ఎవరీ బుడ్డోడు'.. కన్న కొడుకును గుర్తుపట్టలేకపోయిన యువీ!
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కన్న కొడుకునే గుర్తుపట్టలేకపోయాడు. అదేంటి అని ఆశ్యర్యపోకండి. కేవలం సరదా కోసం మాత్రమే అలా చెప్పాం. విషయంలోకి వెళితే యువరాజ్, హాజెల్ కీచ్ 2016 నవంబర్ 30న పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ దంపతుల ఇంట్లోకి పండంటి మగబిడ్డ అడుగుపెట్టాడు. తన కుమారుడికి ఆరు నెలలు పూర్తవ్వడంతో యువీ భార్య హాజెల్‌కీచ్ కొడుకు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. View this post on Instagram A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) ''అప్పుడే నా బంగారానికి ఆరు నెలలు వచ్చేశాయి. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. నీ చేత అమ్మగా పిలిపించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. హ్యాపీ సిక్స్ మంత్స్ ఓరియెన్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. హాజెల్‌కీచ్ షేర్ చేసిన ఫోటోపై చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు. సానియా మీర్జా మొదలు నీతి మోహన్, యాక్టర్లు సత్యజిత్ దూబే, సాగరికా గాత్కే, క్రికెటర్ బెన్ కటింగ్ భార్య ఎరిన్ హాలండ్‌లు ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. అయితే యువరాజ్ మాత్రం ''ఎవరీ బుడ్డోడు.. ఎవరి కొడుకు ఇతను ''అంటూ ఫన్నీగా కాప్షన్ పెట్టాడు. ఇక యువరాజ్ టీమిండియా తరపున గ్రేటెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 15 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్ 10, 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: PAK vs SL: లంక క్రికెటర్‌తో పవాద్ ఆలం వైరం.. ఇలా కూడా గొడవ పడొచ్చా! -
Ind Vs Eng: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. యువీ తర్వాత..
India Vs England 1st T20- Hardik Pandya: పడిలేచిన కెరటంలా దూసుకువచ్చిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్-2021, టీ20 ప్రపంచకప్-2021 సమయంలో తీవ్ర విమర్శల పాలైన హార్దిక్.. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ సారథిగా విజయవంతమయ్యాడు. తన జట్టును విజేతగా నిలిపి సత్తా చాటాడు. ఇదే జోష్‌లో భారత జట్టులో పునరాగమనం చేసి కెప్టెన్‌గా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ గెలిచాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చి విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. యువీ తర్వాత హార్దిక్ పాండ్యానే! కాగా ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించిన హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు.ఒక టీ20 మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటుగా మూడు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తర్వాత హార్దిక్ ఈ ఘనత సాధించాడు. కాగా 2009-10లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యువీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక ఇంగ్లండ్‌తో తొలి టీ20లో హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు. అదే విధంగా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 50 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. చదవండి: Ind Vs Eng 1st T20: టీమిండియా.. మరీ ఇంత చెత్తగానా.. ఇదేం బాలేదు! Hold the pose. Scorecard & Videos: https://t.co/r1PBlLhqeP 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/HzRgXbIYQ8 — England Cricket (@englandcricket) July 7, 2022 -
ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. టీ10 చరిత్రలో అరుదైన ఫీట్.. తొలి ఆటగాడిగా..!
క్రికెట్ చరిత్రలో మరో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌ల రికార్డు నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న పాండిచ్చేరి టీ10 లీగ్‌లో పేట్రియాట్స్ యువ ఆటగాడు కృష్ణ పాండే ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది ఈ అరుదైన రికార్డు సాధించాడు. శనివారం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కృష్ణ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పేట్రియాట్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన నితీష్ ఠాకూర్ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది పాండే విధ్వంసం సృష్టించాడు. పాండే కేవలం 19 బంతుల్లోనే 12 సిక్స్‌లు, 2 ఫోర్లతో 83 పరుగులు సాధించాడు. అయితే ఆనూహ్యంగా పేట్రియాట్స్ ఈ మ్యాచ్‌లో 4పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పేట్రియాట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేయగల్గింది. ఇక టీ20ల్లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటిసారిగా ఈ ఫీట్‌ను సాధించాడు. అదే విధంగా శ్రీలంకతో జరగిన టీ20లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ కూడా ఈ అరుదైన ఫీట్ సాధించాడు. అయితే టీ10 క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా పాండే నిలిచాడు. చదవండి: Attack On Cricketer Mondli Khumalo: కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్.. 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣ He has done the unthinkable! #KrishnaPandey shows what's possible with his heart-stirring hits! Watch the Pondicherry T10 Highlights, exclusively on #FanCode 👉 https://t.co/GMKvSZqfrR pic.twitter.com/jfafcU8qRW — FanCode (@FanCode) June 4, 2022 -
మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిన వ్యక్తితో ఫోటో అవసరమా.. యువీకి చురకలు
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నాడు. వర్జీనియా వేదికగా జరగనున్న యునిటీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా పాల్గొనే యువ క్రికెటర్లకు యువీ తన సలహాలు అందించనున్నాడు. ఇదే టోర్నీకి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ కూడా వచ్చాడు. చాలాకాలం తర్వాత ఈ ఇద్దరు ఎదురుపడడంతో ఒకరినొకరు పలకరించుకొని ఫోటోకు ఫోజిచ్చారు. కాగా ఈ ఫోటోను మహ్మద్ ఆసిఫ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ''స్నేహానికి ఎలాంటి హద్దులు ఉండవు'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఆసిఫ్ షేర్ చేసిన ఫోటో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. అయితే యువరాజ్ ఆసిఫ్‌తో ఫోటో దిగడంపై క్రికెట్ ఫ్యాన్స్ రెండుగా చీలిపోయారు. చిరకాల ప్రత్యర్థులుగా కనిపించే రెండు దేశాల నుంచి ఇద్దరు క్రికెటర్లు ఒకేచోట కలిసి ఫోటో దిగడం ఆనందంగా అనిపించిదని కొందరు కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డ ఒక ఆటగాడితో ఎలా ఫోటో దిగుతావు అంటూ మరికొందరు యువరాజ్‌ను తప్పుబట్టారు. అయితే యువరాజ్ తనంతట తానుగా ఈ ఫోటోను ట్విటర్లో షేర్ చేయలేదని.. పాక్ క్రికెటర్ ఆసిఫ్ మాత్రమే షేర్ చేసుకున్నాడని.. ఇందులో యువరాజ్ తప్పేమి లేదని పేర్కొన్నారు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం పక్కనబెడితే మహ్మద్ ఆసిఫ్ స్వతహాగా సూపర్ బౌలర్. ఫాస్ట్ బౌలింగ్‌కు పెట్టింది పేరైన ఆసిఫ్ మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టేవాడు. పాకిస్తాన్ తరపున 72 మ్యాచ్‌లాడిన ఆసిఫ్ 168 వికెట్లు తీశాడు. అయితే 2005లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఆసిఫ్ ఆది నుంచి వివాదాలే చుట్టుముట్టాయి. నిషేధిత డ్రగ్స్ వాడి ఒకసారి సస్పెండ్ అయిన ఆసిఫ్.. 2010లో ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా ప్రీ ప్లాన్‌గా ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ వేశాడు. ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో మహ్మద్ ఆసిఫ్‌పై ఐసీసీ ఏడేళ్ల నిషేధం విధించింది. ఆసిఫ్‌తో పాటు సల్మాన్ భట్, మహ్మద్ ఆమిర్‌లపై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అయితే 2015లో ఐసీసీ ఆసిఫ్‌పై విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకొని అన్ని ఫార్మాట్లలో ఆడొచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆసిఫ్ కొద్దిరోజులకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: Chris Lynn: ఆ బ్యాటర్ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు Friendship have no limits. #YuvrajSingh #ICC #USA #dc #unitycup2022 pic.twitter.com/VJ0u5U7z3Z — Muhammad Asif (@MuhammadAsif_26) May 30, 2022 -
కొందరు పగబట్టారు.. అందుకే టీమిండియా కెప్టెన్ కాలేకపోయా!
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ డాషింగ్ ఆల్‌రౌండర్‌గా అందరికి సుపరిచితమే. టీమిండియా సాధించిన రెండు మేజర్ వరల్డ్‌కప్స్(2007 టి20, 2011 వన్డే) జట్టులో యువీ సభ్యుడిగా ఉన్నాడు. దీంతోపాటు మరెన్నో ఘనతలు సాధించిన యువరాజ్ టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా పనిచేయలేదు. మధ్యలో కొన్నిరోజులు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా మాత్రమే ఉన్నాడు. తాజాగా కెప్టెన్‌గా అవకాశం రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొందరు తనపై పగబట్టారని.. అందుకే టీమిండియాకు కెప్టెన్ కాలేకపోయానని యువీ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ''గ్రెగ్ చాపెల్ ఉదంతం నన్ను టీమిండియా కెప్టెన్సీ నుంచి దూరం చేసింది. చాపెల్ 2005 నుంచి 2007 మధ్య కాలంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. ఈ సమయంలో అతను తీసుకున్న కొన్న నిర్ణయాలపై జట్టులో అప్పటికే సీనియర్లు అయిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తప్పుబట్టారు. ముఖ్యంగా 2007 వరల్డ్‌కప్‌కు ముందు బ్యాటింగ్ ఆర్డ్ర్ను మార్చేయడం జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది. ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ అయిన సచిన్‌ను మిడిలార్డర్లో ఆడించడం.. గంగూలీతో చాపెల్‌కు పొసగకపోవడం.. దాదా రిటైర్ అవ్వడానికి.. 2007 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం వెనుక చాపెల్ పాత్ర చాలా ఉందని సచిన్: బిలియన్ డ్రీమ్స పుస్తకంలో రాసి ఉంటుంది. ఇదే చాపెల్ ఉదంతం నన్ను కెప్టెన్సీకి దూరం చేసింది. 2007లో ఇంగ్లండ్ టూర్‌కు సెహ్వాగ్ అందుబాటులో లేడు. దీంతో ద్రవిడ్ కెప్టెన్‌గా.. నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాం. ఆ తర్వాత జట్టులోని సీనియర్లకు, చాపెల్‌కు విబేధాలు రావడం.. నేను మా టీమ్‌ను సపోర్ట్ చేయడం కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. ఒక దశలో నేను తప్ప ఎవరు కెప్టెన్‌గా ఉన్నా మాకు అభ్యంతరం లేదని కొందరు అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికి పరోక్షంగా కొందరు నాపై పగబట్టారు.. అందుకే కెప్టెన్ కాలేకపోయా. వాస్తవానికి 2007 టి20 ప్రపంచకప్‌కు నేను కెప్టెన్ అవ్వాల్సింది. అయితే మేనేజ్మెంట్ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల మహీ భాయ్ కెప్టెన్ కావడం.. తొలిసారే టైటిల్ గెలవడం జరిగిపోయాయి. ఇందులో ధోని భయ్యాను నేను తప్పుబట్టలేను. మేనేజ్మెంట్ నిర్ణయం ప్రకారం ధోని కెప్టెన్ అయ్యాడు.. మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.. టీమిండియాకు మూడు మేజర్ ట్రోపీలను అందించాడు. అతని కెప్టెన్సీలో ఆడడం నేను చేసుకున్న అదృష్టం'' అని చెప్పుకొచ్చాడు. ఇక యువరాజ్ తన 17 ఏళ్ల కెరీర్లో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8,701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు సాధించాడు. వన్డేల్లో 14 సెంచరీలు అందుకున్న యువరాజ్ టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించాడు. చదవండి: Chris Gayle: 'సరైన గౌరవం దక్కలేదు'.. యునివర్సల్ బాస్ సంచలన వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'టెస్టు క్రికెట్ చనిపోయే దశకు వచ్చింది'
టెస్టు క్రికెట్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటితరం క్రికెటర్లు టి20 క్రికెట్ ఆడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారని.. దీనివల్ల టెస్టు క్రికెట్ చనిపోయే దశలో ఉందంటూ పేర్కొన్నాడు. హోమ్ ఆఫ్ హీరోస్ షోలో యువరాజ్ సింగ్ పాల్గొన్నాడు. ''టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది. ప్రజలు టి20 క్రికెట్ ఎక్కువగా చూడాలనుకుంటున్నారు, టి20 ఫార్మాట్లో ఆడటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో ఆటగాళ్లు వన్డేల కంటే టి20లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఒక్కరోజు టి20 ఆడితే రూ.50 లక్షలు వస్తున్నప్పుడు.. ఐదు రోజుల క్రికెట్ ఆడి రూ. 5 లక్షల ఎందుకు తీసుకోవాలనుకుంటారు. అన్క్యాప్డ్ ప్లేయర్లు సైతం ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఒక్క సీజన్ కోసం రూ.7 నుంచి రూ.10 కోట్ల వరకు అందుకుంటున్నారు. దీంతో వన్డేలకు కూడా ఆదరణ తగ్గుతోంది. టి20 ఫార్మాట్‌కు అలవాటు పడ్డాకా 50 ఓవర్ల మ్యాచ్ కూడా టెస్ట్ మ్యాచ్‌లాగే అనిపిస్తోంది. అందుకే టీ20లదే క్రికెట్ భవిష్యత్తు అని చెప్పొచ్చు. ఇక ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో టీమిండియా విఫలం కావడానికి మిడిలార్డర్ ప్రధాన కారణం. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ఆ వరల్డ్‌కప్‌కు జట్టును సరిగ్గా ప్లాన్ చేయలేదు. కేవలం 5,6 వన్డేలు ఆడిన విజయ్ శంకర్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. విజయ్ శంకర్ గాయపడడంతో అతని స్థానాన్ని రిషబ్ పంత్‌తో భర్తీ చేశారు. అప్పటికే మంచి అనుభవం ఉన్న రాయుడుకు మాత్రం అవకాశం కల్పించలేదు. 2003ప్రపంచకప్ జట్టులో నేను ఆడినప్పుడు.. నాతో పాటు మహమ్మద్ కైఫ్, దినేష్ మోంగియా అప్పటికే 50 వన్డేలు ఆడి కొంత అనుభవాన్ని గడించాము. టీమిండియా 2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు, అప్పటి జట్టులో మేమందరం ఒక ఫిక్స్డ్ బ్యాటింగ్ పొజిషన్ కలిగి ఉన్నాం. అందుకే 28 సంవత్సరాల తర్వాత కప్‌ను గెలిచాం.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: Wriddhiman Saha: సాహాను బెదిరించిన జర్నలిస్టుకు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. ఇకపై.. -
రోహిత్ శర్మ కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేసిన యువీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు వదులుకున్న తర్వాత ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పజెప్పడం భావోద్వేగ నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. ఫిట్నెస్ అంశాన్ని పరిగణలోకి తీసుకుని రోహిత్ శర్మను టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా చేశారని, అలా చేయడం అనాలోచిత నిర్ణయమని వ్యాఖ్యానించాడు. 34 ఏళ్ల రోహిత్ గత రెండేళ్లుగా గాయాల బారిన పడుతున్నాడని, టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అతని ఫిట్‌నెస్‌పై మరింత ఒత్తిడి పెంచుతాయని అన్నాడు. రోహిత్ టెస్టుల్లో పూర్తి స్థాయి ఓపెనర్‌గా మారి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యిందని, టెస్ట్ బ్యాటర్‌గా అతను ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాడని, ఇలాంటి సమయంలో బ్యాటింగ్‌పై పూర్తి స్థాయి దృష్టి సారించడం అతనికి, టీమిండియాకు ఎంతో అనసరమని తెలిపాడు. మొత్తంగా టెస్ట్ కెప్టెన్సీ రోహిత్ బ్యాటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై కూడా ప్రభావం చూపుందని కంక్లూడ్ చేశాడు. ఇదే సందర్భంగా రోహిత్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీపై స్పందిస్తూ.. వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా చాలాకాలం క్రితమే నియమించబడాల్సిందని, అయితే విరాట్ కోహ్లి టీమిండియాను అద్భుతంగా ముందుండి నడిపిస్తుండటంతో అది సాధ్యపడలేదని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అద్భుతమైన నాయకుడని, ఈ విషయాన్ని తాను ఐపీఎల్లో అతని సారధ్యంలో ఆడుతుండగా గ్రహించానని తెలిపాడు. రోహిత్ అద్భుతమైన నాయకుడని, అతను చాలా మంచి ఆలోచనాపరుడని, వైట్‌బాల్ క్రికెట్లో టీమిండియా కెప్టెన్‌గా తన ఓటు రోహిత్కేనని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు స్పోర్ట్స్ 18 ఛానల్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో యువీ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. చదవండి: 'అతడు ఫామ్‌లో లేడు.. 15 కోట్ల ఆటగాడిని పక్కన పెట్టండి' -
టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి అతడే సరైనోడు..!
టీమిండియా భవిష్యత్తు టెస్ట్ కెప్టెన్ ఎవరనే అంశంపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ స్థానానికి రిషబ్ పంత్ సరైనోడని అభిప్రాయపడ్డాడు. వయసు పైబడిన రిత్యా రోహిత్ శర్మ ఎక్కువ కాలం టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగలేడని, అందుకే ఇప్పటి నుంచే పంత్‌కు టెస్ట్ జట్టు ఉప సారధ్య బాధ్యతలు అప్పజెప్పి తీర్చిదిద్దాలని భారత సెలక్టర్లకు సూచించాడు. కొత్తగా ప్రారంభించిన ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ ఈమేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వికెట్‌కీపర్ కావడం, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను అద్భుతంగా ముందుండి నడిపించడం వంటి పలు అర్హతలను కొలమానంగా తీసుకుని పంత్‌ను భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేయాలని యువీ కోరాడు. వికెట్కీపర్లు వికెట్ల వెనకాల ఉన్నా జట్టును అద్భుతంగా ముందుండి నడిపించగలరని, మైదానంలో ఉత్తమ వీక్షకులు వారేనని, ఇందుకు ధోని సరైన ఉదాహరణ అని, పంత్‌లో కూడా ధోని లక్షణాలు చాలానే ఉన్నాయని పంత్‌ను ఆకాశానకెత్తాడు. అయితే, పంత్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పిన వెంటనే అద్భుతాలు ఆశించకూడదని, అతనికి ఓ ఏడాది పాటు సమయం ఇవ్వాలని, ఈ విషయంలో బీసీసీఐ పంత్‌కు అండగా ఉండాలని సూచించాడు. టీమిండియా కెప్టెన్సీ చేపట్టేంత పరిపక్వత పంత్‌కు ఉందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. క్రికెట్ చరిత్రలో సక్సెస్ఫుల్ కెప్టెన్లంతా ఆరంభంలో ఇబ్బంది పడ్డవారేనని, పంత్ కూడా కాలంతో పాటే పరిణితి చెందుతాడని వత్తాసు పలికాడు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో విరాట్ కోహ్లి టీమిండియా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తదనంతర పరిణామాల్లో రోహిత్ శర్మ భారత జట్టు ఫుల్ టైమ్ సారధిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న కిర్‌స్టన్..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
యువరాజ్.. మెచ్చుకోవడం సరే; తిట్టింది ఎవరిని?
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చాలా రోజుల తర్వాత ట్విటర్లో దర్శనమిచ్చాడు. ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో జాస్ బట్లర్ ప్రదర్శించిన క్రీడాస్పూర్తిని మెచ్చుకుంటూ యువరాజ్ ట్వీట్ చేశాడు. అదే సమయంలో బట్లర్‌ను చూసి నేర్చుకోవాలని రాజస్తాన్ జట్టులోని ఒక సీనియర్ ఆటగాడికి హితోపదేశం చేశాడు. ప్రస్తుతం యువీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలే జరిగిందంటే.. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ జిమ్మీ నీషమ్ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని హార్దిక్ పాండ్యా లాంగాన్ దిశగా ఆడాడు. అయితే బట్లర్ వేగంగా పరిగెత్తుకొచ్చి బంతిని అందుకున్నాడు. నాలుగు పరుగులు సేవ్ చేశాడని భావించేలోపే బట్లర్ తన చేత్తో ఫోర్ సిగ్నల్ ఇచ్చి అంపైర్‌ను క్రాస్ చెక్ చేయాలని కోరాడు. అంపైర్ పరిశీలనలో బట్లర్ బంతిని అందుకున్నప్పటికి.. తన కాలు బౌండరీ రోప్‌కు తగిలినట్లు అప్పర్ యాంగిల్లో కనిపించింది. దీంతో అంపైర్ ఫోర్‌గా ప్రకటించాడు. ఇది జరిగిన కాసేపటికే యువీ తన ట్విటర్ వేదికగా బట్లర్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ''క్రికెట్ గేమ్‌లో మనకింకా జెంటిల్మెన్ మిగిలే ఉన్నాడు. బట్లర్ ప్రదర్శించిన క్రీడాస్పూర్తి నాకు నచ్చింది. బట్లర్‌ను చూసి మిగతావాళ్లు నేర్చుకోవాలి.. ముఖ్యంగా అదే జట్టులోని ఒక సీనియర్ ఆటగాడు కూడా'' అంటూ పేర్కొన్నాడు. మిగతావాళ్లు కూడా బట్లర్‌ను పొగిడినప్పటికి.. యువరాజ్ చెప్పిన ఆఖరి లైన్ ఎక్కువగా హైలైట్ అయింది. మరి రాజస్తాన్ రాయల్స్‌లో ఆ సీనియర్ ఆటగాడు ఎవరు.? ఫ్యాన్స్ మాత్రం అది కచ్చితంగా అశ్విన్ అని సమాధానం ఇచ్చారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అశ్విన్ ఉన్నప్పుడు యువరాజ్ అదే జట్టుకు ఆడాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయి. అది మనసులో పెట్టుకొనే యువరాజ్ అశ్విన్‌కు పరోక్షంగా చురకలు అంటించాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనా మెచ్చుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికి.. యువరాజ్ ఎవరిని తిట్టాడనేది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో దీనికి సమాధానం దొరుకుతుందేమో చూడాలి. చదవండి: IPL 2022: పాండ్యా చేయి పడితే అంతే.. వికెట్ అయినా విరిగిపోవాల్సిందే Vijay Shankar: 'జట్టు మారినా ఆటతీరు మారలేదు.. తీసి పారేయండి!' We still have gentleman in the game of cricket !!! @josbuttler 👏🏽 other players should learn from him specially team mates !!! #IPL2022 #RRvGT — Yuvraj Singh (@YUVSTRONG12) April 14, 2022 -
శివమ్ దూబే.. మరో యువరాజ్ దొరికేసినట్లే!
శివమ్ దూబే.. ఐపీఎల్ 2022లో సంచలనం. సీఎస్కే తరపున ఆడుతున్న దూబే ఒక్క మ్యాచ్‌తో అభిమానులందరిని తనవైపు తిప్పుకున్నాడు. వాస్తవానికి దూబే ఈ సీజన్ ఆరంభం నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐదు మ్యాచ్‌లు కలిపి 207 పరుగులు చేసిన దూబే ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే ఆర్సీబీపై ఆడిన 96 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ దూబేను ఇవాళ ప్రత్యేకంగా నిలిపింది. అతని ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్.. మరో యువరాజ్ సింగ్ దొరికేశాడని అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా గమనిస్తే.. దూబే కొట్టిన చాలా సిక్సర్లు డాషింగ్ ఆల్‌రౌండర్ షాట్లను గుర్తుచేశాయి. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ''ఆర్సీబీతో మ్యాచ్‌లో శివమ్ దూబే ఆడిన ఇన్నింగ్స్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అతను ఆడిన షాట్లు యువీని గుర్తుకుతెచ్చేలా ఉన్నాయి. రెండు షాట్లు మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి. హాజిల్‌వుడ్ వేసిన ఫుల్‌టాస్ బంతిని దూబే క్రీజులోనే ఉండి సిక్సర్ బాదాడు. ఇది మ్యాచ్‌కు హైలైట్ అని చెప్పొచ్చు. ఇలాంటి షాట్ చూసి చాన్నాళ్లయింది. గతంలో యువరాజ్ మాత్రమే ఇలాంటి షాట్స్ ఎక్కువగా ఆడేవాడు. ఆ తర్వాత వనిందు హసరంగా బౌలింగ్‌లో షార్ట్‌పిచ్ బంతిని బ్యాక్‌ఫుట్ తీసుకొని బౌండరీ తరలించాడు. ఈ రెండు షాట్లు చాలు.. అతను కేవలం హిట్టర్ మాత్రమే కాదు.. బాధ్యతతో ఆడగల బ్యాట్స్‌మన్ దాగున్నాడని చెప్పడానికి... ఇకపై దూబే ఇలాగే ఆడితే మాత్రం కచ్చితంగా మరో యువరాజ్ దొరికేసినట్లే'' అని చెప్పుకొచ్చాడు. ఎవరీ శివమ్ దూబే..? శివమ్ దూబే.. 1993 జూన్ 26న ముంబైలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. కానీ 14 ఏళ్ల వయసులో దూబే అనూహ్యంగా క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అధిక బరువు, ఫిట్‌నెస్‌పై శ్రద్ద పెట్టకపోవడం.. ఆర్థిక సమస్యల కారణంగా క్రికెట్‌కు కొన్నాళ్ల పాటు దూరమయ్యాడు. ఆ తర్వాత 19 ఏళ్ల వయసులో రీ ఎంట్రీ ఇచ్చిన దూబే అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే ఏడాది వెస్టిండీస్ సిరీస్ ద్వారా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో దూబే ఒక ఓవర్లో 34 పరుగులిచ్చి.. టి20 క్రికెట్ చరిత్రలో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున 13 టి20లు, ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. ఇక 29 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 606 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: రోహిత్ కెప్టెన్సీ వదిలేస్తాడనుకున్నా..! Shivam Dube: 11 ఏళ్ల రికార్డు సమం చేసిన శివమ్ దూబే View this post on Instagram A post shared by @11g.ub -
IPL 2022: వేలంలో అమ్ముడుపోలేదు.. కానీ ఇప్పటికీ అమిత్ పేరిట చెక్కు చెదరని రికార్డు
Hat trick in IPL: అమిత్ మిశ్రా.. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్. క్యాష్ రిచ్ లీగ్‌లో 154 మ్యాచ్‌లు ఆడిన అతడు 7.35 ఎకానమీతో 166 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక తన కెరీర్లో ఎక్కువ కాలం పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ టీమిండియా వెటరన్ ఆటగాడికి మెగా వేలం-2022లో చుక్కెదురైన విషయం తెలిసిందే. రూ. 1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అమిత్ పట్ల ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇలా అమిత్ మిశ్రాకు ఈ ఏడాది చేదు అనుభవం మిగిల్చింది. అయితే, లీగ్ చరిత్రలో తన పేరిట ఉన్న చెక్కు చెదరని రికార్డును గుర్తుచేసుకుంటూ అభిమానులు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఐపీఎల్లో అత్యధిక హ్యాట్రిక్‌లు సాదించిన ఆటగాడిగా అమిత్ మిశ్రా రికార్డులకెక్కాడు. అతడి పేరిట మూడు హ్యాట్రిక్‌లు ఉన్నాయి. ఆ తర్వాత యువరాజ్ సింగ్(2), మఖయా ఎంతిని(1), అజిత్ చండీలా(1), సామ్యూల్ బద్రీ(1) టాప్-5లో ఉన్నారు. ఇక ఎక్కువ కాలం పాటు తమతో ప్రయాణం సాగించిన ఈ టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్‌ను వదిలేయడం పట్ల.. ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ జిందాల్ భావోద్వేగ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జట్టు ఎప్పటికీ నీదే.. నీ సేవలు ఉపయోగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ఇందుకు స్పందించిన అమిత్.. ఢిల్లీకి ఎప్పుడు తన సేవలు అవసరమైనా సరే.. అందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానంటూ బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో అమిత్ రానున్న కాలంలో ఢిల్లీ సిబ్బందిలో చేరే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్రాక్టీసు మొదలెట్టేసింది. చదవండి: IPL 2022: అందరూ ధోని కెప్టెన్సీలో ఆడాలని కోరుకుంటారు.. కానీ నేను మాత్రం: రషీద్ ఖాన్ First Speech of #IPL2022 and we're already battling limitless emotions & infinite goosebumps 🥺@RickyPonting addresses the DC Squad with his first Training Speech ahead of #TATAIPL 💪#YehHaiNayiDilli #IPL2022 pic.twitter.com/ltVNhCsRUJ — Delhi Capitals (@DelhiCapitals) March 21, 2022 -
హ్యాపీ బర్త్‌డే మై డార్లింగ్: యువరాజ్ సింగ్
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన భార్య హాజెల్ కీచ్‌కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ''హ్యాపీ బర్త్‌డే మామా బేర్.. కేక్‌లు ఎక్కువగా తినకు.. హ్యాపీ డే ఫర్ యూ..'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో యువీ రాసుకొచ్చాడు. కాగా యువరాజ్‌తో పాటు మరికొంతమంది హాజెల్ కీచ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. అందులో ప్రధానంగా హాజెల్‌కు మంచి స్నేహితురాలైన సాగరికా ఘోష్ విషెస్ చెప్పింది. ''హ్యాపీ బర్త్‌డే హాజెల్.. మెనీ మెనీ కంగ్రాట్స్.. టేక్ కేర్'' అంటూ పేర్కొంది. కాగా సాగరికా ఘోష్ టీమిండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ భార్య అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా యువరాజ్, హాజెల్ కీచ్ 2016 నవంబర్ 30న పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ దంపతుల ఇంట్లోకి పండంటి మగబిడ్డ అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని యువరాజ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ఇక యువరాజ్ టీమిండియా తరపున గ్రేటెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 15 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్ 10, 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: ఒక వైపు కూతురు పోయిన బాధ..ఇప్పుడు తండ్రి మరణం.. శభాష్ సోలంకి! దయనీయ స్థితిలో టీమిండియా మాజీ క్రికెటర్.. భరోసా కల్పించిన హెచ్‌సీఏ View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
Virat Kohli: ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న కోహ్లి.. భావోద్వేగ పోస్టు
Virat Kohli Post About Yuvraj Singh Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన పట్ల చూపిన అభిమానానికి మురిసిపోతున్నాడు. తనకు ప్రత్యేక బహుమతి పంపినందుకు అతడికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఓ ప్రముఖ బ్రాండ్‌కు సంబంధించిన గోల్డెన్ బూట్స్‌ను కోహ్లికి పంపిన యువీ.. భావోద్వేగ లేఖను రాసిన సంగతి తెలిసిందే. ప్రపంచానికి కింగ్ కోహ్లివి అయినా తనకు మాత్రం ఎల్లప్పుడూ చీకూవే అంటూ ప్రేమను కురిపించాడు. ఇందుకు స్పందించిన విరాట్ కోహ్లి ఇన్‌స్టా వేదికగా యువీకి ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు యువీ పాజీ పట్ల తన మనసులో ఉన్న భావాలకు అక్షర రూపం ఇచ్చాడు. ‘‘నా పట్ల ఇంతటి ఆదరణ చూపిన యువీ పా.. మీకు ధన్యవాదాలు. నా కెరీర్ మొదలైన తొలి రోజు నుంచి మిమ్మల్ని చూస్తున్నా.. మీ జీవితం.. కాన్సర్ నుంచి కోలుకుని ముందుకు సాగుతున్న తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శం. మీ చుట్టూ ఉన్న మనుషుల పట్ల ఎంతటి దయ, ఆదరాభిమానాలు కలిగి ఉంటారో నాకు తెలుసు. మీరు అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నారు.. ఉంటారు. ఇప్పుడు మనం తండ్రులం అయ్యాం కదా! ఈ సరికొత్త ప్రయాణంలో మీకు ఆ దేవుడి ఆశీసులు అందాలని, అందమైన జ్ఞాపకాలు, అంతులేని సంతోషాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా’’ అంటూ కోహ్లి.. యువీ పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకున్నాడు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా టీమిండియా తరఫున కలిసి ఆడిన యువరాజ్ సింగ్, కోహ్లి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే కోహ్లి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహమాడగా.. వీరికి కుమార్తె వామిక జన్మించింది. యువరాజ్- నటి హాజిల్కీచ్ దంపతులకు ఇటీవలే కుమారుడు జన్మించాడు. చదవండి: Rohit-Ritika Sajdeh: రోహిత్ నన్ను పట్టించుకో.. ప్లీజ్ ఒకసారి ఫోన్ చేయ్: రితికా శర్మ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
Virat Kohli: నువ్వు ప్రపంచానికి కింగ్ కోహ్లివి కావొచ్చు.. కానీ నాకు మాత్రం..
Yuvraj Singh Emotional Note For Virat Kohli:- ‘‘విరాట్... ఓ క్రికెటర్‌గా... వ్యక్తిగా నువ్వు ఎదిగిన తీరును నేను కళ్లారా చూశాను. నెట్స్‌లో టీమిండియా దిగ్గజాలతో కలిసి భుజం భుజం రాసుకు తిరిగిన ఆ యువకుడు.. ఇప్పుడు నవతరానికి స్పూర్తిదాతగా.. లెజెండ్‌గా ఎదిగాడు. నీ క్రమశిక్షణ, ఆట పట్ల అంకితభావం, నిబద్ధత.. దేశంలోని ప్రతి యువ ఆటగాడికి స్పూర్తిదాయకం. నిన్ను, నీ ప్రయాణాన్ని చూస్తే ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడతామన్న నమ్మకం వారికి కలుగుతుంది. ఏటికేడు నీ ఆట తీరు మెరుగుపడిన విధానం అమోఘం. ఇప్పటికే ఎన్నో అద్భుత విజయాలు సాధించావు. ఇంకెన్నో సాధించాల్సి ఉంది. నువ్వు లెజెండరీ కెప్టెన్‌వి. గొప్ప నాయకుడివి. నీ నుంచి మరెన్నో గొప్ప ఇన్నింగ్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. సహచర ఆటగాడిగా, స్నేహితుడిగా నీతో ఉన్న బంధం గురించి మాటల్లో వర్ణించలేను. కలిసి పరుగులు సాధించడం, డైట్ విషయంలో చీటింగ్.. పంజాబీ పాటలు వినడం, కప్ గెలవడం... వీటన్నింటిలో మనం కలిసే ఉన్నాం. నువ్వు ప్రపంచానికి కింగ్ కోహ్లివి కావొచ్చు.. కానీ నాకు మాత్రం ఎప్పటికీ ‘చీకూ’(కోహ్లి ముద్దుపేరు)వే! నీలోని పట్టుదల, గెలవాలన్న కసి ఎప్పుడూ అలాగే ఉండాలి. నువ్వొక సూపర్స్టార్వి’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. భారత మాజీ సారథి విరాట్ కోహ్లిని ఉద్దేశించి భావోద్వేగ లేఖ రాశాడు. తన కోసం గోల్డెన్ బూట్స్ కానుకగా పంపాడు. ఎప్పటిలాగానే కోహ్లి దేశాన్ని మరింత గర్వపడేలా చేయాలని ఆకాంక్షించాడు. కాగా యువీ, కోహ్లి మధ్య ప్రత్యేక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి టీమిండియా తరఫున ఆడారు. అంతేగాక ప్రముఖ బ్రాండ్‌కు కలిసి ఎండార్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు కంపెనీకి చెందిన షూస్‌ను కోహ్లికి కానుకగా పంపిన యువీ... ఈ మేరకు లేఖ రాశాడు. ఇక టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత అనూహ్య పరిస్థితుల్లో వన్డే కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లి.. దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత టెస్టు కెప్టెన్సీ తప్పుకొన్నాడు. కోహ్లి స్థానంలో రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: రూ. 6.5 కోట్లే దండగ.. మళ్లీ వైస్ కెప్టెన్సీనా!? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గరం View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
Yuvraj Singh: అంగద్‌కు యువీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా!
యువరాజ్ సింగ్.. క్రికెట్ స్కిల్స్‌కే కాదు ప్రేమ కథలకూ ఫేమస్సే! ఆ కథల్లోని ఓ నాయికే హాజెల్ కీష్. బ్రిటిష్ మోడల్.. బాలీవుడ్ యాక్ట్రెస్! సినిమా స్టోరీకి తక్కువకాని ఫక్కీలో లవ్ మొదలైంది.. పెళ్లితో శుభమస్తు పలికింది! హాజెల్.. యువరాజ్‌కి పరిచయమయ్యేనాటికే ‘బాడీగార్డ్’ సినిమాతో పాపులర్ అయింది. ఉమ్మడి మిత్రుడి బర్త్‌డే పార్టీలో కలుసుకున్నారు ఈ ఇద్దరూ. చెరగని చిరునవ్వుతో.. అందరితో సరదాగా మాట్లాడుతున్న హాజెల్.. యువరాజ్‌ను ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె నవ్వు. ఫిదా అయిపోయాడు. తనతో మాట కలుపుదామని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆమె అతణ్ణి పట్టించుకోలేదు. పార్టీ అయిపోయి వీడ్కోలు తీసుకుంటున్న సమయానికి యువరాజ్‌ను గమనించింది. ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆమెను పలకరించాడు. నవ్వింది. మనసంతా నింపుకున్నాడు. ‘బాడీగార్డ్’లో బాచేశావ్’ ప్రశంసించాడు. మళ్లీ నవ్వింది.. ఆ కితాబును స్వీకరిస్తున్నట్టుగా. అంతే యువరాజ్ గాల్లో తేలిపోయాడు. చాలా సందర్భాలను ఉపయోగించుకొని ఆమెతో స్నేహాన్ని కొనసాగించాలని విఫలయత్నం చేశాడు. ఓ ఏడెనిమిదిసార్లు ‘కాఫీ డేట్’కి రమ్మని విన్నవించుకున్నాడు కూడా. ప్చ్.. పెద్దగా ఆసక్తి కనబర్చలేదు హాజెల్. యువరాజ్ డేట్ మాటెత్తినప్పుడల్లా మాట మార్చేసేదట. ‘అన్నిసార్లు అడిగినా మాట దాటవేసే సరికి ఆమె ఇంకెవరితోనైనా ప్రేమలో ఉందేమో అనుకున్నా’ అని చెప్పాడు యువరాజ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఇది 2011లో జరిగింది. అప్పుడే.. యువరాజ్ సింగ్‌కు క్యాన్సర్‌కు అని తేలింది. దాన్ని ఎదుర్కొనేందుకు మానసిక శక్తిని కూడగట్టుకునే పనిలో పడ్డాడు అతను. అలా ఓ మూడేళ్లు గడచిపోయాయి. హాజెల్ను మరచిపోలేకపోయాడు యువరాజ్. యథాలాపంగా ఫేస్బుక్ చూసుకుంటుంటే తన ఫ్రెండ్, క్రికెటర్, బాలీవుడ్ యాక్టర్ అంగద్ బేడీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో హాజెల్ కనిపించింది. వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ముందటిలాగే పట్టించుకోలేదు ఆమె. ఆశ్చర్యపోయాడు .. సందేహపడ్డాడు కూడా. ఆ అనుమానంతోనే స్నేహితుడికి చెప్పాడు ‘హాజెల్ను ఇష్టపడుతున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కూడా. ఆ అమ్మాయి పట్ల నీకు ఇంకే ఆలోచన ఉన్నా మానుకో’ అని. ‘ఛ..ఛ.. ఆ అమ్మాయి పట్ల నాకెలాంటి ఆలోచనలూ లేవు. ఆమె నాకో మంచి ఫ్రెండ్..అంతే’ అని బదులిచ్చాడు అంగద్. ఓ మూడు నెలల తర్వాత.. యువరాజ్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది హాజెల్. మళ్లీ డేట్‌కి రమ్మని రిక్వెస్ట్ చేశాడు. ఓకే అంది. ఉప్పొంగిపోయాడు. ఆమె అంటే తనకెంత ఇష్టమో చెప్పాడు. నవ్వుతూ విన్నది హాజెల్. ఆ ప్రేమ అలా కొనసాగింది నాలుగేళ్లపాటు. ఒకసారి బాలీ వెళ్లిందీ జంట. అక్కడ ఆ సముద్రతీరంలో హాజెల్ను అడిగాడు యువరాజ్ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సంభ్రమాశ్చర్యం హాజెల్‌కు. నవ్వింది.. ఆమె కళ్లు కూడా నవ్వాయి.. ఆనందం, ఉద్వేగపు తడిని చిప్పిల్లుతూ. అప్పుడు .. అక్కడే.. నిశ్చితార్థపు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు యువరాజ్. ‘తనను పెళ్లికి ప్రపోజ్ చేసేప్పుడు నెర్వస్ ఫీలయ్యా చాలా. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. టీన్స్‌లో అయితే అది సాధ్యమేమో కానీ.. కొంత వయసొచ్చాక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిది ఉంటుంది అని నేనైతే అనుకోను’ అంటాడు యువరాజ్ సింగ్. హాజెల్ కోసం నిశ్చితార్థపు ఉంగరాన్ని ఎంపిక చేయడానికి కొన్ని గంటల సమయాన్ని వెచ్చించారట యువరాజ్ సింగ్, వాళ్లమ్మ షబ్నమ్ సింగ్. 2016, నవంబర్ 30న చండీగఢ్‌లో ఈ జంటకు పెళ్లయింది. ఆ సందర్భంగా షబ్నమ్ సింగ్! ‘మొత్తానికి మా వాడికి సరైన అమ్మాయే దొరికింది’ అంటూ తన సంతోషాన్ని ప్రకటించింది. యువరాజ్ సింగ్ జీవితం ఊహించని మలుపులమయం. క్రికెటర్‌గా సక్సెస్ఫుల్.. క్యాన్సర్‌నీ జయించాడు. ప్రియుడిగా ఓడిపోయిన అతణ్ణి తన ప్రేమతో గెలిపించి.. చక్కటి భర్తగా నిలబెట్టింది హాజెలే. ఇటీవలే వీరికి బాబు జన్మించాడు. -ఎస్సార్ చదవండి: Lara Dutta Love Story: ఇద్దరితో తెగతెంపులు, ఆల్రెడీ పెళ్లైన టెన్నిస్ స్టార్‌తో నటి వివాహం -
అండర్ 19 వరల్డ్‌కప్ హీరో రాజ్ బవాకి యువరాజ్ సింగ్‌తో ఉన్న లింక్ ఏంటి..?
అండర్ 19 ప్రపంచకప్ 2022 ఫైనల్లో 5 వికెట్ల ప్రదర్శన(5/31)తో చెలరేగి, అనంతరం బ్యాట్(54 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్)తో కూడా రాణించి.. టీమిండియా ఐదో ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన డాషింగ్ యంగ్ ఆల్‌రౌండర్ రాజ్ అంగద్ బవాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అతను ఎవరు, అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అని భారత క్రికెట్ అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టగా, ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. రాజ్ బవా తండ్రి సుఖ్విందర్ బవా.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్‌కు కోచ్‌గా వ్యవహరించాడన్న విషయం తెలిసింది. సుఖ్విందర్ పర్యవేక్షణలో యువరాజ్ అండర్ 19 ప్రపంచకప్ 2000లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇక్కడ మరో విశేషమేమింటంటే.. రాజ్‌బవా తాత సర్దార్ తర్లోచన్ సింగ్ బవా కూడా భారత క్రీడారంగంతో సంబంధం ఉంది. తర్లోచన్ సింగ్ బవా, 1948 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. యాదృచ్చికంగా ఆ ఒలింపిక్స్‌లో తర్లోచన్ సింగ్ ప్రాతినిధ్యం వహించిన భారత హాకీ జట్టు ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ను ఓడించి స్వర్ణం నెగ్గగా.. తాజాగా మనవడు రాజ్ బవా కూడా ఫైనల్లో ఇంగ్లండ్‌పైనే చెలరేగి టీమిండియాకు అండర్-19 వరల్డ్‌కప్ అందించాడు. కాగా, రాజ్ బవా.. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లోనే కాకుండా టోర్నీ ఆధ్యాంతం మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 6 వన్డేల్లో 9 వికెట్లతో పాటు 252 పరుగులు చేసి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఇందులో బవా ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు సౌతాఫ్రికాపై (4/47) నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. అలాగే ఉగాండా(108 బంతుల్లో 162 నాటౌట్; 14 ఫోర్లు, 8 సిక్సర్లు)తో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించి 42 పరుగులు చేశాడు. చదవండి: తన ఆరాధ్య గాయనికి కన్నీటి నివాళులర్పించిన క్రికెట్ గాడ్ -
తండ్రైన యువరాజ్ సింగ్..
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రయ్యాడు. తన భార్య హజెల్ కీచ్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువరాజ్ తన ట్విటర్లో స్వయంగా వెల్లడించాడు."నా అభిమానులకు, స్నేహితులకు, కుటుంబసభ్యులకు ఒక శుభవార్త. మాకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇంత ఆనందాన్ని ఇచ్చిన దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మా గోప్యతకు భంగం కలిగించకూడదని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: యువరాజ్ సింగ్ గురించి మనకు తెలియని విశేషాలు కాగా 2016లో యువరాజ్ సింగ్, హజెల్ కీచ్‌ల వివాహమైన సంగతి తెలిసిందే. ఇక 19 ఏళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేసిన యువీ బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ టీమిండియా గెలవడంలో యువీ పాత్ర మరువలేనిది. చదవండి: Legends League Cricket 2022: వరుసగా రెండో ఓటమి.. వసీం జాఫర్ మాత్రం తగ్గేదే లే ❤️ @hazelkeech pic.twitter.com/IK6BnOgfBe — Yuvraj Singh (@YUVSTRONG12) January 25, 2022 -
కోహ్లి రిటైర్మెంట్... పంత్‌కు మద్దతుగా నిలిచిన యువీ
కీలకమైన టెస్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి అనూహ్య నిష్క్రమణతో టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంకేముంది టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగిస్తారు కదా! అనే సందేహం రావొచ్చు. అయితే, కొన్ని కారణాల వల్ల అలా జరిగే అవకాశం కనిపించడం లేదు. వయసురిత్యా, ఫిట్నెస్ పరంగా, ముఖ్యంగా గాయాలతో సతమతమవుతున్న రోహిత్ వైపునకు సెలెక్టర్లు మొగ్గు చూపకపోవచ్చని కొందరి క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో కొందరు యువ ఆటగాళ్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. (చదవండి: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆ యువ ఆటగాడే.. ఎందుకంటే) అందులో ఎవరు కోహ్లి నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపడుతారో ఖచ్చితంగా చెప్పలేం కానీ, రిషభ్ పంత్ అయితే బాగుంటుందని కొందరు దిగ్గజ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. సునీల్ గావస్కర్ పంత్‌కే ఓటేయగా తాజాగా యువరాజ్ సింగ్ సైతం ఈ యువ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌కు మద్దతుగా నిలిచాడు. వికెట్ల వెనక నుంచి పంత్ ఆట మొత్తాన్ని లోతుగా అధ్యయనం చేసి మెరుగ్గా జట్టును నడిపిస్తాడని అన్నాడు. ‘అబ్‌సొల్యుట్లీ! రీడ్స్ ద గేమ్ వెల్ బిహైండ్ ద స్టంప్స్’ అంటూ గావస్కర్ కామెంట్‌కు యువీ ఈ మేరకు ట్విటర్లో స్పందించాడు. కాగా, కేప్‌టౌన్ టెస్టులో కీలక బ్యాటర్లు విఫలమైన చోట పంత్ సెంచరీతో (100 నాటౌట్) మెరిసిన సంగతి తెలిసిందే. (చదవండి: రాజీనామా విషయాన్ని ముందుగా ఆయనతో చర్చించిన తర్వాతే.. కోహ్లి ప్రకటన!) Sunil Gavaskar feels @RishabhPant17 can be the next Test captain. Feels the added responsibility will make him an even better player @NikhilNaz — Vikrant Gupta (@vikrantgupta73) January 15, 2022 -
మరోసారి కలిసి బరిలోకి దిగనున్న సెహ్వాగ్, యువీ, భజ్జీ..
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్లు, డాషింగ్ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ తదితరులు మరోసారి కలిసి బరిలోకి దిగబోతున్నారు. జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టుకు వీరంతా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ టోర్నీలో ఇండియా మహరాజాస్‌తో పాటు ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ జట్లు పొల్గొంటున్నాయి. ఆసియా లయన్స్ తరఫున ఆసియా క్రికెటర్లు( ఆఫ్రిది, జయసూర్య, అక్తర్, మురళీధరన్ తదితరులు), వరల్డ్ జెయింట్స్ తరఫున ఆసియా ఏతర క్రికెటర్లు( జాంటీ రోడ్స్,షేన్ వార్న్, షాన్ పొలాక్, లారా తదితరులు) రంగంలోకి దిగనున్నారు. ఈ లీగ్‌కు బిగ్ బీ అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: IPL 2022: అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్..! -
ఒకే జట్టులో సచిన్, ధోని,యువరాజ్.. కోహ్లి, రోహిత్‌కు నోఛాన్స్!
పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. తన జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు. కాగా తన జట్టులో ఓపెనర్లుగా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు గోర్డాన్ గ్రీనిడ్జ్‌ని ఎంచుకున్నాడు. పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్‌కి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో చోటు కల్పించాడు. ఐదో స్ధానంలో భారత మాజీ కెప్టెన్ ధోనికి అవకాశం ఇచ్చాడు. ఆరో స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్‌కి చోటు దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో కపిల్‌దేవ్, యువరాజ్ సింగ్‌ను అక్తర్ ఎంపిక చేశాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా షేన్ వార్న్‌ను ఎంచుకున్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఇక బౌలర్ల కోటాలో వసీం అక్రమ్, వకార్ యూనిస్‌కు చోటు దక్కింది. కాగా అక్తర్ ప్రకటించిన జట్టులో భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు. షోయబ్ అక్తర్ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: సచిన్ టెండూల్కర్, గోర్డాన్ గ్రీనిడ్జ్, ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్, మహేంద్ర సింగ్ ధోనీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, యువరాజ్ సింగ్, షేన్ వార్న్ (కెప్టెన్), వసీం అక్రమ్, కపిల్ దేవ్, వకార్ యూనిస్ చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
అంతరిక్షంలోకి యువరాజ్‌సింగ్ బ్యాట్..! తొలి వ్యక్తిగా యువీ రికార్డు..!
Yuvraj Singh Bat Flies To Space Becomes First Minted NFT Ever To Be Sent In Orbit: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యువరాజ్ సింగ్ తన వ్యక్తిగత నాన్-ఫంజిబుల్ టోకెన్లను (ఎన్ఎఫ్టీ) డిజిటల్ కలెక్టబుల్స్ వెబ్సైట్ కొలెక్షన్ భాగస్వామ్యంతో ప్రారంభించాడు.ఈ ఎన్ఎఫ్టీ టోకెన్ల ద్వారా తన కెరీర్లో కొన్ని అత్యుత్తమ క్షణాలను అభిమానులతో పంచుకోనున్నాడు యువీ. అంతరిక్షంలోకి యువీ బ్యాట్..! తొలి వ్యక్తిగా.. 2003 ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ తన మొట్టమొదటి సెంచరీని నమోదు చేసిన ఐకానిక్ బ్యాట్‌ను హాట్ ఎయిర్ బెలూన్ సహయంతో అంతరిక్షంలోకి పంపారు.అందుకు సంబంధించిన వీడియో అభిమానులకు ఎన్ఎఫ్టీ రూపంలో అందుబాటులో ఉండనుంది. అయితే అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ఎన్ఎఫ్టీ కలెక్షన్గా యువీ బ్యాట్ నిలవనుంది. ఈ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. కొలెక్షన్ అధికారిక అధికారిక వెబ్సైట్లో ఎన్ఎఫ్టీ వీడియో రూపంలో అందుబాటులో ఉండనుంది. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ...“నా మొదటి ఎన్ఎఫ్టీ కలెక్షన్లను కొలెక్షన్ భాగస్వామ్యంతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కొత్త ప్లాట్‌ఫారమ్‌లో నా అభిమానులతో మరింత దగ్గరగా ఉంటాను. నా క్రికెట్ ప్రయాణంలో అమూల్యమైన కొన్ని క్షణాలను ఎన్ఎఫ్టీ రూపంలో తీసుకురావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. కొలెక్షన్ వ్యవస్థాపకుడు అభయ్ మాట్లాడుతూ... యువరాజ్ 3డీ స్టాచ్యూతో పాటు ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్‌ను విడుదల చేయనున్నాము. అతని ఎన్ఎఫ్టీ కలెక్షన్లను సొంతం చేసుకునేందుకు అభిమానులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించనున్నామని అన్నారు. భారత్‌లో ఊపందుకున్న ఎన్ఎఫ్టీలు..! భారత్‌లో ఎన్ఎఫ్టీలపై భారీ ఆదరణను పొందుతుంది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్‌స్టార్స్ అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్, సల్మాన్ ఖాన్ లాంటి ప్రముఖ నటులు ఎన్‌ఎఫ్‌టీపై కన్నేశారు. తమ ఎన్ఎఫ్టీ కలెక్షన్లను అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటుగా ఎన్ఎఫ్టీ విషయంలో టీమిండియా క్రికెటర్లు కూడా సై అంటున్నారు. దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌తో పాటుగా ఎన్ఎఫ్టీ కలెక్షన్స్‌లోకి యువీ కూడా జాయిన్ అయ్యారు. చదవండి: మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైన రిషబ్ పంత్..! దినేష్ కార్తీక్ సరసన...! -
యువరాజ్ సింగ్‌కి కోహ్లి స్పెషల్ బర్త్‌డే విషెస్..
భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కి టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఆదివారం(డిసెంబర్12) 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న యువరాజ్‌కి అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెప్తూ.. పాత ఫొటోలు, వీడియోల్ని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో సందేశం ద్వారా విషెస్ చెప్పాడు. "నేను అండర్-19 ప్రపంచకప్ తర్వాత భారత్ జట్టులోకి వచ్చాను. నాకు యువీ ఘనంగా స్వాగతం పలికాడు. నాతో సరదాగా మాట్లాడటం, ఉండడం చేసేవాడు. మేము ఒకే రకమైన ఫుడ్‌ను ఇష్టపడతాము, అదే విధంగా మా ఇద్దరికీ పంజాబీ సంగీతం అంటే ఇష్టం" అని కోహ్లి పేర్కొన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు. ఇక యువరాజ్ తన 19 ఏళ్ల కెరీర్లో టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేసిన యువీ బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు. ఇక 2007, 2011 వన్డే ప్రపంచకప్‌లు భారత్ గెలవడంలో యువరాజ్ కీలకపాత్ర పోషించాడు. చదవండి: Happy Birthday Yuvraj Singh: యువరాజ్ సింగ్ గురించి మనకు తెలియని విశేషాలు Birthday wish to @YUVSTRONG12 from @imVkohli 🍰❤ pic.twitter.com/aVccJ2NbMM — Barsha Vkohli 🇮🇳 (@barshaVkohli18) December 12, 2021 402 international matches 👍 11,778 international runs & 148 wickets 👌 2007 World T20 & 2011 World Cup-winner 🏆 🏆 Here's wishing @YUVSTRONG12 a very happy birthday. 🎂 👏 #TeamIndia Let's relive his batting masterclass against England 🎥 🔽 — BCCI (@BCCI) December 12, 2021 -
యువరాజ్ సింగ్ గురించి మనకు తెలియని విశేషాలు
''జీవితంలో ఎలా పోరాడాలనేది క్రికెట్ నాకు నేర్పింది.. అందుకే లైఫ్‌లో ఎప్పుడు విశ్వాసం కోల్పోలేదు.. క్రికెట్టే జీవితంలో పోరాడడం.. పడడం.. లేవడం.. ముందుకు సాగడం లాంటివి నేర్పించింది.. నా శ్వాస ఉన్నంతవరకు ఆటకు ఏదో రూపంలో సాయం అందిస్తూనే ఉంటాను''.. భారత మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సందర్భంగా భావోద్వేగంతో పలికిన మాటలు ఇవి. -సాక్షి, వెబ్‌డెస్క్ డిసెంబర్ 12.. ఈ డాషింగ్ ఆల్‌రౌండర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ అతని జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలను తెలుసుకుందాం. 19 ఏళ్ల కెరీర్ ప్రస్థానంలో పోరాటాలే ఎక్కువగా చూసిన యువరాజ్ సింగ్ జీవితం అందరికి ఆదర్శ ప్రాయం. ఈ తరానికి యువరాజ్ అంటే గుర్తుకు వచ్చేది.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. డేరింగ్ అండ్ డాషింగ్ క్రికెటర్.. మంచి ఆల్‌రౌండర్‌గా అని మాత్రమే. ఇదంతా యువరాజ్ జీవితంలో ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే యువీ జీవితంలో మనకు తెలియని సంఘటనలు చాలానే ఉన్నాయి. తాను చిన్నతనం నుంచి అనుభవించిన మానసిక సంఘర్షణ.. తండ్రి బలవంతంతో తనకు ఇష్టమైన ఆటను వదిలేయడం.. అస్సలు ఇష్టం లేని క్రికెట్లో అద్భుతాలు చేయడం.. ఆ తర్వాత క్యాన్సర్ మహమ్మరిన పడడం.. దానితో పోరాడి జీవితంలో మళ్లీ ఎదగడం లాంటివి కనిపిస్తాయి. క్రికెట్ అంటే అస్సలు ఇష్టం లేదు యువరాజ్ సింగ్ జన్మించింది క్రికెట్ కుటుంబంలోనే. తన తండ్రి యోగ్రాజ్ సింగ్ అప్పటికే టీమిండియాలో ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. యువీ చిన్నతనంలోనే తల్లిదండ్రులకు విబేధాలు వచ్చి విడిపోయారు. దీంతో తండ్రికి దూరంగా.. తల్లి షబ్నం సింగ్ నీడలో ఎంతో గారబంగా పెరిగాడు. అప్పుడే టెన్నిస్, స్కేటింగ్ మీద యువరాజ్ ఇష్టం పెంచుకున్నాడు. ముఖ్యంగా స్కేటింగ్‌లో అండర్ 14 విభాగంలో నేషనల్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ అందుకున్నాడు. పదేళ్ల వయసు వరకు యువరాజ్ చదువుతో పాటు టెన్నిస్, స్కేటింగ్తోనే ఎక్కువ కాలం గడిపాడు. అయితే తల్లి షబ్నంకు, తండ్రి యోగరాజ్‌కు విబేధాలు సమసిపోవడంతో యువీ జీవితం మలుపు తిరిగింది. తాను క్రికెటర్‌గా ఉన్నప్పుడు కొడుకు టెన్నిస్, స్కేటింగ్ లాంటి గేమ్ ఎలా ఆడతాడని.. యువరాజ్‌ను కూడా క్రికెట్లోకి తీసుకురావాలని యోగ్రాజ్ భావించాడు. అప్పటికి యువీకి క్రికెట్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఒకరోజు యువీని దగ్గరికి పిలిచిన తండ్రి యోగరాజ్.. స్కేటింగ్‌లో అతను సాధించిన మెడల్‌ను కిందపడేసి ఇకమీదట స్కేటింగ్ ఆడేందుకు వీలు లేదని ఖరాఖండీగా చెప్పాడు. దీంతో తండ్రి మాటను కాదనలేక బలవంతంగానే క్రికెట్లో అడుగుపెట్టాడు. మొదట్లో యువరాజ్‌ను బౌలర్‌గా చూద్దామని భావించిన యోగ్రాజ్ ఉదయాన్నే తనతో పాటు గ్రౌండ్‌కు తీసుకెళ్లి బౌలింగ్ ప్రాక్టీస్ చేయించేవాడు. కానీ యువరాజ్ మాత్రం బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఫీల్డింగ్, బౌలింగ్‌తో వికెట్లను విరగొట్టడం నేర్చుకొని ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. తన బలవంతం మీద క్రికెట్లోకి వచ్చాడని అర్థం చేసుకున్న యోగరాజ్ ఆ దిశగానే ప్రోత్సహించాడు. అంతే అక్కడినుంచి యువరాజ్ క్రికెట్ కెరీర్ మరో మలుపు తీసుకుంది. 13 ఏళ్ల 11 నెలల సమయంలో అండర్-16 విభాగంలో పంజాబ్ తరపున ఆడాడు. ఆ తర్వాత అ1996లో పంజాబ్ తరపున అండర్-19కి సెలక్టయ్యాడు. ఇక్కడే యువరాజ్ తొలిసారి సెంచరీ సాధించి పెద్ద ప్లేయర్ల దృష్టిలో పడ్డాడు. రంజీల్లో ఎదురులేకుండా దూసుకెళ్లిన యువరాజ్‌కు 2000 అండర్ 19 ప్రపంచకప్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో టీమిండియా తరపున బరిలోకి దిగిన యువీ మెరుపులు మెరిపించాడు. ఇక్కడే తొలిసారి సెలక్టర్ల దృష్టిలో పడిన యువరాజ్ 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అలా మొదలైన యువీ ప్రస్థానం 19 ఏళ్ల పాటు సాగింది. 19 ఏళ్ల కెరీర్ ప్రస్థానం తన 19 ఏళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేసిన యువీ బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు. ఇక 2003, 2007, 2011 వన్డే ప్రపంచకప్‌లు ఆడిన యువరాజ్‌సింగ్ ఆల్‌రౌండర్‌గా అత్యధిక ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా నిలిచాడు. తన కెరీర్లో ఆరు ఇంటర్నేషనల్ ఫైనల్స్(2002 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2003 వన్డే వరల్డ్‌కప్, 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2014 టి20 ప్రపంచకప్, 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్) ఆడాడు. ఇందులో టీమిండియా మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో యువరాజ్ సభ్యుడిగా ఉన్నాడు. దీనిలో మొదటిది 2000 అండర్-19 ప్రపంచకప్.. ఇక మిగతా రెండు 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు ఇక 2007 టి20 ప్రపంచకప్ టీమిండియా గెలవడం ఒక ఎత్తు అయితే.. యువరాజ్ ఇంగ్లండ్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం మరొక ఎత్తు. నిజానికి కోపానికి కేరాఫ్ అడ్రస్‌గా కనిపించే యువరాజ్‌ను గెలికితే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కవ్వింపు చర్యలతో ఆగ్రహంతో ఊగిపోయిన యువరాజ్ తన కోపాన్ని స్టువర్ట్ బ్రాడ్‌పై చూపించాడు. పూనకం వచ్చిందా అన్నట్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది కేవలం 12 బంతుల్లోఏ హాఫ్ సెంచరీ సాధించిన యువీ ఓవరాల్‌గా 14 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. క్రికెట్ బతికున్నంతకాలం యువరాజ్ అంటే గుర్తుకువచ్చేది మొదట ఈ ఆరు సిక్సర్లే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2011 వన్డే వరల్డ్‌కప్.. గోల్డెన్ డేస్ 2011 వన్డే ప్రపంచకప్ యువరాజ్ కెరీర్లో గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. 28 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రపంచకప్ గెలవడంలో యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. ఆ ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా యువరాజ్ దుమ్మురేపాడు. ఆ టోర్నీలో బ్యాటింగ్‌లో 362 పరుగులు.. బౌలింగ్‌లోనూ 15 వికెట్లు తీసి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కొల్లగొట్టాడు. అంతేకాదు ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో హాఫ్ సెంచరీ కొట్టిన ఆటగాడిగానూ.. ఆల్‌రౌండర్‌గానూ యువీ రికార్డులకెక్కాడు. క్యాన్సర్ మహమ్మారి.. గడ్డురోజులు ఇక గోల్డెన్ డేస్ చూసే ప్రతీ ఆటగాడికి గడ్డురోజులు రావడం సహజమే. అలాంటి పరిస్థితిని యువరాజ్ 2011 వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే చూడాల్సి వచ్చింది. నిజానికి వన్డే ప్రపంచకప్ జరుగుతున్న సమయంలోనే యువరాజ్ క్యాన్సర్ మహమ్మారికి గురయ్యాడు. ఒక మ్యాచ్‌లో గ్రౌండ్లోనూ రక్తం కక్కుకోవడం సగటు అభిమానిని ఆందోళనకు గురిచేసింది. అయినప్పటికి బాధను ఓర్చుకొని టీమిండియా 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రపంచకప్ ముగిసిన నాలుగు నెలల్లోనే ఒక రష్యన్ డాక్టర్ యువరాజ్ ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అమెరికా వెళ్లిన యువీ అక్కడ మూడు దశల్లో కీమోథెరపీ చేయించుకున్నాడు. 2012 మార్చిలో కోలుకున్న యువరాజ్ భారత్‌కు తిరిగొచ్చాడు. మళ్లీ భారత జట్టులోకి అడుగుపెట్టాలనే దృడ సంకల్పంతో ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాడు. 2012 ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో శ్రీలంకతో మ్యాచ్ ద్వారా కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అయితే అప్పటినుంచే యువీ బ్యాటింగ్‌లో ముందున్న పదును క్రమంగా తగ్గడం ప్రారంభమయింది. ఇక అప్పటినుంచి యువరాజ్ కెరీర్ ఒడిదుడుకులకు లోనైంది. వయసు కూడా పెరుగుతుండడం.. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు వస్తుండడంతో క్రమక్రమంగా జట్టుకు దూరమయ్యాడు. అడపా దడపా మెరుపులు మెరిపించినప్పటికి యువరాజ్ గాడిన పడలేకపోయాడు. ఇక టీమిండియా తరపున యువరాజ్ చివరి మ్యాచ్‌ను 2017 జూన్ 30న ఆడాడు. అప్పటినుంచి రెండు సంవత్సరాల పాటు ఆటకు దూరంగా ఉన్న యువరాజ్ జూన్ 10, 2019న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక చావును జయించిన తన ప్రయత్నాలను.. తిరిగి క్రికెట్లో అడుగుపెట్టడానికి తాను చేసిన పోరాటాన్ని.. జీవితంలోని తన అనుభవాలన్నింటిని ఒక దగ్గర చేరుస్తూ ''ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్'' పేరుతో పుస్తకాన్ని రాశాడు. ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర తన హిట్టింగ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యువరాజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోనూ తనదైన ముద్ర చూపించాడు. 2014లో రాయల్ చాలెంజర్స్ జట్టు యువీని రూ.14 కోట్లు పెట్టి కొనడం ఒక సంచలనం. ఆ తర్వాత 2015 ఐపీఎల్లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర(రూ.16 కోట్లు) సొంతం చేసుకోవడం యువరాజ్కున్న విలువేంటో చూపించింది. అయితే ఇటీవలే యువరాజ్ తాను మళ్లీ క్రికెట్లోకి అడుగుపెడుతున్నానంటూ తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పాడు. వచ్చే ఫిబ్రవరి నుంచి తాను బరిలోకి దిగనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఈ విషయం విన్నప్పటి నుంచి యువరాజ్ అభిమానులే కాదు.. సగటు క్రికెట్ అభిమాని కూడా అతని రాకకోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. It's that time of the year. Are you ready? Do you have what it takes? Have a big surprise for all you guys! Stay tuned! pic.twitter.com/xR0Zch1HtU — Yuvraj Singh (@YUVSTRONG12) December 7, 2021 -
'యువీ నువ్వుంటే బాగుండేది'': కోహ్లి.. అనుష్క రియాక్షన్ వైరల్
టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్ సేవలు ఎప్పటికి మరిచిపోము. తొలి టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం ఎప్పుడు మరిచిపోలేము. అంతేకాదు టీమిండియా తొలి టి20 ప్రపంచకప్‌ను ఎగురేసుకుపోవడంలో యువీ పాత్ర మరువలేనిది. వీటితో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్ సాధించడంలోనూ యువరాజ్ ముఖ్యపాత్ర పోషించాడు. ఆ తర్వాత క్యాన్సర్ బారీన పడి కోలుకున్న అతను క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: T20 WC 2021: కోహ్లి.. టాస్ కోసం ఏమైనా టిప్స్ ఇస్తావా: కేన్ విలియమ్సన్ తాజాగా టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియా సూపర్ 12 దశలో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత అభిమాని ఒకరు.. యువరాజ్ ఉంటే బాగుండేదని..టీమిండియా మరోసారి ఫైనల్ కు వెళ్లేదని.. కోహ్లి యువీ కోసం ఆలోచిస్తున్నట్లుగా ఒక ఫోటోను షేర్ చేశాడు. దీనిని యువరాజ్ తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. కోహ్లి యువరాజ్ గురించి ఆలోచిస్తుంటే.. పక్కనే ఉన్న అనుష్క కోహ్లి కచ్చితంగా నన్ను కాదని వేరే అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నాడనుకొని ఊహిస్తుంది.. ఇదే సమయంలో కోహ్లి మాత్రం.. అరె యార్.. యువీ ఈ సమయంలో నువ్వు ఉంటే మిడిలార్డర్ మరింత స్ట్రాంగ్‌గా ఉండేది. యువీ నిన్ను చాలా మిస్సవుతున్నాం అంటూ ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. తాజాగా యువీ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక యువీ తన 17 ఏళ్ల కెరీర్లో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు చేశాడు. వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్ సెంచరీలు, టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 హాఫ్ సెంచరీలు, టి20ల్లో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: T20 Wc 2021: హమ్మయ్య.. మొత్తానికి గంభీర్ కల నెరవేరింది -
India Highest Totals: అప్పుడైతే ఏకంగా 218.. ఆ మ్యాచ్‌లో 186.. రైనా ఒక్కడే సెంచరీతో..
Highest totals for India in T20 World Cup: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా మొదటి విజయాన్ని నమోదు చేసిన విషయం విదితమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి సేన నిర్ణీత 20 ఓవర్లలో 2 కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్... 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసి 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇది ఇలా ఉంటే... వరుస పరాజయాల తర్వాత టీమిండియాకు భారీ విజయం దక్కడంతో పాటు.. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ అత్యధిక స్కోర్లు నమోదు చేసిన సందర్భాలను పరిశీలిద్దాం. అప్పుడు ఏకంగా 218.. మొట్టమొదటి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ 2007లో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌తో డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ధోని సేన 18 పరుగులతో విజయం సాధించింది. ఇక 2007 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఫ్గనిస్తాన్‌తో ఇప్పుడు నవంబరు 3, 2021లో అబుదాబిలో జరిగిన అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి సేన 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో గెలుపొందింది. వెస్టిండీస్‌పై... టీ20 ప్రపంచకప్-2016 సెమీ ఫైనల్లో టీమిండియా వెస్టిండీస్‌తో తలపడింది. ఈ క్రమంలో 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అయితే, పొలార్డ్ బృందం చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో భారత్‌కు ఓటమి తప్పలేదు. లెండిల్ సిమన్స్ 82 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్‌ను గెలుపు బాట పట్టించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీ20 వరల్డ్‌కప్-2007లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ధోని సేన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సెమీ ఫైనల్లో ఆసీస్‌తో తలపడిన టీమిండియా... యువరాజ్ సింగ్ చెలరేగడంతో 15 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 30 బంతుల్లో 70 పరుగులు చేసిన యువీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ విజయంతో ఫైనల్ చేరిన ధోని బృందం...పాకిస్తాన్‌ను మట్టి కరిపించి మొదటి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. 2010లో దక్షిణాఫ్రికాపై ప్రపంచకప్ టోర్నీ-2010లో భాగంగా సెయింట్ లూసియానాలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో టీమిండియా 180 పరుగుల పైచిలుకు స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి... 186 పరుగులు చేసింది. బౌలర్లు రాణించడంతో 172 పరుగులకే ప్రొటిస్‌ను కట్టడి చేసి.. 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో వంద పరుగులు సురేశ్ రైనానే సాధించడం విశేషం. 60 బంతుల్లో 101 పరుగులు చేసి అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న రైనాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక టీ20 వరల్డ్‌కప్-2021లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్కోర్లను పరిశీలిస్తే.. ►ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్...అబుదాబి- టీమిండియా- 210/2. ►అఫ్గనిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్... షార్జా- అఫ్గనిస్తాన్-190/4. ►పాకిస్తాన్ వర్సెస్ నమీబియా.. అబుదాబి... పాకిస్తాన్- 189/2. ►బంగ్లాదేశ్ వర్సెస్ పపువా న్యూగినియా... ఏఐ అమెరట్- బంగ్లాదేశ్- 181/7. -సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం. చదవండి: IND Vs AFG: టీమిండియా విజయం.. ఐదు ఆసక్తికర విషయాలు -
Yuvraj Singh: అదిరిపోయే శుభవార్త చెప్పిన యువీ!
Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఫ్యాన్స్ కోరిక మేరకు... త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని పేర్కొన్నాడు. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రికెట్ ఫీల్డ్‌లో తనను చూసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు తన వన్డే కెరీర్లో చివరిసారిగా, ఇంగ్లండ్‌పై సాధించిన సెంచరీ(150)కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న యువీ.. భావోద్వేగ క్యాప్షన్ జతచేశాడు. ‘‘ఆ దేవుడే నీ గమ్యాన్ని నిర్దేశిస్తాడు!! పబ్లిక్ డిమాండ్ మేరకు ఫిబ్రవరిలో మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇంతకు మించిన గొప్ప అనుభూతి ఇంకోటి ఉండదు! మీ ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞుడిని! మీ మద్దతు ఇలాగే కొనసాగాలి. నిజమైన అభిమాని... కఠిన సమయాల్లో మనకు మద్దతుగా ఉంటారు’’ అని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు... ‘‘పా.. జీ.. నీ రాక కోసం ఎదురుచూస్తున్నాం. మళ్లీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొడితే చూడాలని ఉంది’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా క్యాన్సర్ బారిన పడి కోలుకున్న.. యువరాజ్ సింగ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కాగా ఫిబ్రవరిలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ జరుగనున్న నేపథ్యంలో ఆ టోర్నీ గురించే యువీ పోస్టు చేశాడని అభిమానులు అంటున్నారు. అయితే.. మరికొంత మంది మాత్రం ఇప్పటికే తను ఈ టోర్నీలో ఆడాడని.. అలాంటప్పుడు మళ్లీ కొత్తగా చెప్పడానికి ఏముందని.. ఇంకేదో విశేషం ఉండే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడేమోనని అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఏడాది ఇండియా లెజెండ్స్ తరఫున యువీ మైదానంలో దిగిన సంగతి తెలిసిందే. చదవండి: Rohit Sharma: వన్డే, టి20 కెప్టెన్‌గా రోహిత్.. కోహ్లి టెస్టులకే పరిమితం..?! View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్..
Cricketer Yuvraj Singh Arrested: టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను హర్యానా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఆ వెంటనే అతన్ని బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలుస్తోంది. గతేడాది జూన్‌లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్లో పాల్గొన్న యువరాజ్.. తోటి క్రికెటర్ చహల్‌ను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ సమయంలో చహల్ సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ.. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై స్పందించిన యువరాజ్.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లో ట్వీట్ చేశారు. అయితే, యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని ఆరోపిస్తూ ఓ న్యాయవాది హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై ఈ ఏడాది లాక్డౌన్ అనంతరం విచారణ జరిపిన హిస్సార్ పోలీసులు.. యువరాజ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసారు. చదవండి: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తుల ఆహ్వానం -
టీ20 వరల్డ్‌కప్: ఫాస్టెస్ట్ సెంచరీ.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిందో లేదో మరో టీ20 సమరానికి తెరలేచింది. అది కూడా వరల్డ్‌కప్ రూపంలో ప్రేక్షకుల్ని కనువిందు చేయడానికి వచ్చేసింది. బ్యాట్‌కి బాల్కి జరిగే ఈ మెగా టోర్నీలో మరొకసారి సంచలన ప్రదర్శనలు చేయడానికి క్రికెట్ జట్లు సిద్దమైపోగా వీక్షించడానికి ప్రేక్షకులు రెట్టించిన ఉత్సాహం ఎదురుచూస్తున్నారు. నేటి(ఆదివారం, అక్టోబర్ 17) నుంచి క్వాలిఫయింగ్ పోటీలతో టీ20 వరల్డ్‌కప్ సమరం ఆరంభం అయ్యింది. దీనిలో భాగంగా ఓవరాల్‌గా ఈ టోర్నీకి సంబంధించి కొన్ని విశేషాలను చూద్దాం. ఫాస్టెస్ట్ సెంచరీ.. టీ20 క్రికెట్లో హార్డ్ హిట్టర్‌గా పేరుగాంచిన వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ రెండు సందర్భాల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశాడు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సఫారీలపైనే బ్యాట్ ఝుళిపించాడు గేల్. 50 బంతుల్లోనేసెంచరీ బాదేసి రికార్డు నెలకొల్పాడు. అటు తర్వాత ఆ రికార్డును తనే బ్రేక్ చేశాడు గేల్. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ 48 బంతుల్లో శతకం బాదేశాడు. 11 సిక్స్‌లు, 5 ఫోర్ల సాయంతో సెంచరీ కొట్టేశాడు. తద్వారా 9 ఏళ్ల తర్వాత తన రికార్డును తానే సవరించుకున్నాడు గేల్. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ టీ20 క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని తన పేరిట లిఖించుకున్నాడు. అది కూడా ఆరంభపు టీ20 వరల్డ్‌కప్‌లో కావడం విశేషం. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ విశ్వరూపం ప్రదర్శించాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం మరొక విశేషం. అత్యధిక పరుగులు టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్థనే పేరిట ఉంది. 2007 నుంచి 2014 వరకూ 31 టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడిన జయవర్థనే 1016 పరుగులు సాధించాడు. నేటికీ ఇదే అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. ఈ జాబితాలో గేల్(920-28 మ్యాచ్‌లు), దిల్షాన్(897-35 మ్యాచ్‌లు),కోహ్లి(777- 16 మ్యాచ్‌లు) వరుస స్థానాల్లో ఉన్నారు. అత్యధిక వికెట్లు టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ముందు వరుసలో ఉన్నాడు. తన టీ20 వరల్డ్‌కప్ కెరీర్లో 34 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్రిది 39 వికెట్లు సాధించి ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో లసిత్ మలింగా 31 మ్యాచ్‌ల్లో 38 వికెట్లతో ఉండగా, సయిద్ అజ్మల్ 23 మ్యాచ్‌ల్లో 36 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అత్యధిక డిస్మిసల్స్ భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుని ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా నిలిచిన ధోని.. టీ20 వరల్డ్‌కప్‌లో కూడా పలు రికార్డులను సాధించాడు. తొలి టీ20 వరల్డ్‌కప్‌ను సాధించడమే కాకుండా, ఈ మెగా టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్ చేసిన రికార్డును కూడా నమోదు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ధోని 32 డిస్మిసల్స్తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక 2007 నుంచి 2017 వరకూ టీమిండియాకు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని.. ప్రతీ టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఒక జట్టుకు కెప్టెన్‌గా చేసిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. -
బాలీవుడ్లో మరో స్టార్ క్రికెటర్ బయోపిక్.. డైరెక్ట్ చేయనున్న కరణ్ జోహార్..?
Karan Johar To Direct Yuvraj Singh Biopic: ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. అందులోనూ క్రీడాకారుల బయోపిక్‌లకు ఎనలేని ఆదరణ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన భారత క్రికెటర్ల బయోపిక్స్ మాత్రం తెరకెక్కింది మూడు మాత్రమే. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ల నిజ జీవితాల ఆధారంగా ఈ చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా మరో మాజీ క్రికెటర్ బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నట్లు బీటౌన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దంగా ఉన్నాడని, ఈ మేరకు యువరాజ్‌తో సంప్రదింపులు కూడా జరిపాడని తెలుస్తోంది. కరణ్ ప్రతిపాదనకు యువీ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని బీటౌన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే యువీ ప్రతిపాదించిన ఇద్దరు స్టార్ హీరోలను కాదని కరణ్.. కొత్త ముఖం వైపు మొగ్గు చూపుతున్నాడని సమాచారం. యువీ గతంలో హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్‌లలో ఎవరో ఒకరు తన బయోపిక్‌లో నటిస్తే బాగుంటుందని చెప్పినప్పటికీ.. కరణ్ కొత్త కుర్రాడు సిద్ధార్థ్ చతుర్వేదిని పరిచయం చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. సిద్ధార్థ్.. యువీతో దగ్గరి పోలికలు కలిగి ఉంటాడని, అందుకే యువీని ఒప్పించి మరీ అతన్ని ఎంపిక చేశాడని టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేసి.. గంగూలీ బయోపిక్ కంటే ముందే రిలీజ్ చేయాలని కరణ్ ప్లాన్ చేస్తున్నాడట. చదవండి: ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం..! -
'లైగర్'తో యువ్‌రాజ్ సింగ్ పోటీ.. గెలుపెవరిది..?
Yuvraj Singh Takes On A Liger In Tug Of War: టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్.. లైగర్‌తో పోటీ పడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో యువీ, అతని స్నేహితులు కలిసి లైగర్‌తో టగ్ ఆఫ్ వార్ పోటీలో పాల్గొంటారు. దుబాయ్‌లోని ఫేమ్ పార్క్‌లో జరిగిన ఈ సరదా పోటీకి సంబంధించిన వీడియోను యువీ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. Tiger vs Liger అనే క్యాప్షన్ జోడించి, తుది ఫలితం ఏంటో మీకు తెలిసే ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) 4 నిమిషాల 28 సెకెన్ల పాటు సాగే ఈ వీడియోలో.. యువీ, ఫేమ్ పార్క్‌లోని జంతువులతో సరదాగా గడుపుతూ కనిపించాడు. ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకుని.. ఎలుగుబంటి, చింపాంజీలకు ఆహారాన్ని అందించాడు. ఫేమ్ పార్క్‌ను సందర్శించడం ద్వారా జంతువుల పట్ల తనకున్న భయాన్ని అధిగమించగలిగానని, మూగ జీవాలతో దగ్గరగా మెలగడం గొప్ప అనుభూతిని కలిగించిందని యూవీ తెలిపాడు. ఫేమ్ పార్క్ జంతువులకు సురక్షితమైన ప్రదేశమని, ఈ వీడియో తీసే సమయంలో ఏ జంతువుకూ హాని కలిగించలేదని ఆయన పేర్కొన్నాడు. చదవండి: ఇంగ్లండ్ బ్యాటర్ ఊచకోత.. 31 బంతుల్లోనే శతకం -
ఆరు సిక్సర్లు గుర్తున్నాయా?.. రీక్రియేట్ చేసేశాడు
Yuvraj Singh Six Balls 6 Sixes Recreation.. టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అంటే మొదటగా గుర్తుకువచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు. 2007 టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ ఈ ఫీట్‌ను సాధించాడు. అంతకముందు ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని బ్రాడ్‌కు చుక్కలు చూపించాడు. బ్రాడ్ వేసిన 19 ఓవర్లో యువీ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. నేటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా యువీ పేరిటే ఉంది. కాగా ఈ సెప్టెంబర్ 19తో యువీ ఇన్నింగ్స్ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చదవండి: యువీ సిక్సర్ల సునామీ.. ఆ విధ్వంసం జరిగి నేటికి 14 ఏళ్లు టి20 ప్రపంచకప్ 2007లో యువీ ఆరు బంతులు ఆరు సిక్సర్లు తాజాగా యువరాజ్ దానిని మరోసారి గుర్తుచేస్తూ తన యూట్యూబ్ చానెల్లో రిక్రియేట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. వీడియో ఓపెన్ చేయగానే.. బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్న యువీని చూస్తాం. ఇంట్లో కాబట్టి తలకు బండి హెల్మెట్ పెట్టుకొని కనిపిస్తాడు. బ్యాట్ తీసుకొని గ్రౌండ్లోకి ఎంటరవబోతుంటే ఒక వ్యక్తి అడ్డుపడుతాడు. ఏంటి అని అడిగితే.. మీరు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టింది ఈ బ్యాట్‌తోనే అంటూ యువీ ఆ ఇన్నింగ్స్ గుర్తుగా దాచుకున్న హీరోహోండా బ్యాట్‌ను చూపించాడు. ఇప్పడు అంత టైం లేదని చెప్పాడు. చదవండి: INDW VS AUSW: తొలి వన్డేలో టీమిండియా చిత్తు.. ఆసీస్ రికార్డు విజయం కట్‌చేస్తే తన ఇంటి ఆవరణలోని మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో గొడవ పడుతున్నట్లు చూపించాడు. ఆ తర్వాత స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ వస్తున్నట్లు తనే కామెంటరీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఫ్లింటాఫ్‌తో జరిగిన గొడవను గుర్తు చేస్తూ తాను కొట్టిన ఒక్కో సిక్సర్‌ను చూపించాడు. అలా వీడియో మొత్తంలో ఆరు సిక్సర్లు కొట్టిన విధానాన్ని యాక్టింగ్ చేసి చూపించాడు. ఇక చివర్లో ''నా యాక్టింగ్ గురించి మీరేమనుకుంటున్నారు.. బాలీవుడ్ లెవల్లో ఉందా.. ప్లీజ్ కామెంట్ చేయండి..'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: Viral Video: ఔటయ్యాననే కోపంతో బ్యాట్ విసిరాడు.. అది కాస్తా.. -
యువీ సిక్సర్ల సునామీ.. నేటికి ఆ పెను విధ్వంసానికి 14 ఏళ్లు
Yuvraj Singh 6 Sixes In T20 World Cup 2007: సరిగ్గా 14 ఏళ్ల క్రితం పొట్టి ఫార్మాట్లో పెను విధ్వంసం చోటు చేసుకుంది. 2007 సెప్టెంబర్ 19న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది పొట్టి క్రికెట్లో ప్రకంపనలు సృష్టించాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19 ఓవర్లో యువీ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈక్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. నేటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా యువీ పేరిటే ఉంది. ఆ ఇన్నింగ్స్‌లో 16 బంతులు ఎదుర్కొన్న యువరాజ్.. 7 భారీ సిక్సర్లు సహా 3 ఫోర్లు బాది 58 పరుగులు చేశాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌లో టీమిండియా 218 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా ఛేదనలో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. యువీకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: ఆ మూడు బాదితే రోహిత్ ఖాతాలో మరో రికార్డు..