
భారత మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ అల్ట్రా ప్రీమియం బ్రాండ్ ఫినో టెకీలాను ప్రారంభించారు. దాంతో లగ్జరీ స్పిరిట్స్ మార్కెట్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. 2025 ఏప్రిల్ మధ్య నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఫినో టెకీలా
ఫినో టెకీలా బ్రాండ్ ఉత్పత్తులను మెక్సికోలోని జాలిస్కోలో తయారు చేస్తున్నట్లు చెప్పారు. చికాగోలో బ్రాండ్ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫినో టెకీలా ప్రపంచంలోని అత్యుత్తమ టెకీలాలను ఉత్పత్తి చేస్తుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేశారు. యువరాజ్ సింగ్ కెరీర్ వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘ఫెయిల్యూర్ ఈజ్ నాట్ యాన్ ఆప్షన్’ అనే క్యాప్షన్‌తో బ్రాండ్ ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఖనిజాలు అధికంగా ఉండే మట్టిలోని 100% ‘బ్లూ అగావ్(టెకీలా ముడి పదార్థం)’ నుంచి ఫినో టెకీలా తయారవుతుందని చెప్పారు. ఫినోలోని నాయకత్వ బృందంలో చీఫ్ ప్రొడక్ట్ ఎక్సలెన్స్ ఆఫీసర్‌గా జానా అయ్యర్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్‌గా సోనాలి పటేల్ ఉన్నారు. హెల్త్‌కేర్, వ్యాపార రంగంలో తమ నైపుణ్యాలతో బ్రాండ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తారని కంపెనీ అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: భానుడి ప్రతాపం.. జనవరి 2025లో రికార్డు ఉష్ణోగ్రతలు
యూఎస్‌లో బ్రాండ్ ఉత్పత్తులను విజయవంతంగా లాంచ్ చేయడంతోపాటు ఫినో టెకీలా ప్రత్యేక అవుట్ లెట్ల ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రీమియం స్పిరిట్‌లను కోరుకునే వినియోగదారులకు కంపెనీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారు. అయితే భారత్‌లో ఏప్రిల్ 2025 నాటికి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. కానీ దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment