
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ అలిస్టర్ కుక్.. ఏడేళ్ల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో ఇంగ్లండ్ తరపున కుక్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ ఛాంపియన్స్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ ధ్రువీకరించాడు.
"అలిస్టర్ తిరిగి జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మేము అతడితో మరిన్ని కొత్త జ్ఞాపకాలను సృష్టించబోతున్నాము" అని మోర్గాన్ పేర్కొన్నాడు. అదేవిధంగా కుక్ మాట్లాడుతూ.. "నా దేశం తరపున తిరిగి ఆడే అవకాశం చాలా ఆనందంగా ఉంది. ఇయోన్ మెర్గాన్, ఇతర ఇంగ్లీష్ క్రికెటర్లతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
2018లో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన కుక్.. తన పేరును ఇంగ్లండ్ క్రికెట్‌లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తన ఆడిన చివరి ఇన్నింగ్స్‌లో కూడా కుక్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుక్ తన కెరీర్‌ను ముగించాడు.
అలిస్టర్ కుక్ ఇంగ్లండ్ తరఫున 161 టెస్టులు ఆడాడు. అందులో 33 సెంచరీలతో సహా 12,472 పరుగులు చేశాడు. కుక్ తన అద్భుతమైన క్రికెట్ కెరీర్‌లో.. అతను 92 వన్డేలు 4 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా కుక్ 2023 వరకు ఎసెక్స్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత్ డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనుంది. అయితే ఇండియా ఛాంపియన్స్ మేనేజ్‌మెంట్ కెప్టెన్‌గా యువీని ఎంపిక చేసినప్పటికి.. జట్టును ఇంకా ఖారారు చేయలేదు.
గత సీజన్‌లో పాల్గొన్న భారత ఛాంపియన్స్ జట్టు..
అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, సౌరభ్ తివారి, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, రాబిన్ ఉతప్ప, నమన్ ఓఝా, అనురీత్ సింగ్, ధవల్ కులకర్ణి, హర్భజన్ సింగ్, రాహుల్ శుక్లా, రాహుల్ శర్మ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్
చదవండి: IPL 2025: రాసిపెట్టుకోండి.. ఐపీఎల్‌లో 300 ప్లస్ రన్స్ కొట్టేది ఆజట్టే! ఎప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment