Alastair Cook
-
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూ డేవిడ్
దుబాయ్: భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూకు చోటు లభించింది. మాజీ ఆటగాళ్లు అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)లతో పాటు నీతూకు కూడా ఈ జాబితాలో చోటు కల్పిస్తున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. డయానా ఎడుల్జీ తర్వాత భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం దక్కించుకున్న రెండో మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్ కావడం విశేషం. ‘ఇలాంటి గౌరవం దక్కడం పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ తరఫున ఆడినందుకు నాకు లభించిన జీవితకాలపు గుర్తింపుగా దీనిని భావిస్తున్నా. నా క్రికెట్ ప్రయాణంలో ఇది ప్రత్యేక క్షణంగా నిలిచిపోతుంది. నాకు అన్ని విధాలా అండగా నిలిచిన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, బీసీసీఐతో పాటు నన్ను గుర్తించిన ఐసీసీకి కృతజ్ఞతలు’ అని నీతూ డేవిడ్ స్పందించింది. పలు ఘనతలు... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన నీతూ డేవిడ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా భారత్ తరఫున 10 టెస్టులు, 97 వన్డేలు (1995–2008 మధ్య) ఆడింది. వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ఆమె ఓవరాల్‌గా వన్డేల్లో కేవలం 16.34 సగటుతో 141 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మహిళల టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (8/53) నీతూ పేరిటే ఉంది. 1995లో ఇంగ్లండ్‌పై జంషెడ్‌పూర్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. 3 వన్డే వరల్డ్ కప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నీతూ 2005 టోరీ్నలో 20 వికెట్లు తీసి భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. ఆట నుంచి రిటైర్ అయ్యాక నీతూ డేవిడ్ ప్రస్తుతం భారత మహిళల జట్టు చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తోంది. టెస్టుల్లో పరుగుల వరద...ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ అలిస్టర్ కుక్ ఆ జట్టు అత్యుత్తమ టెస్టు విజయాల్లో ఓపెనర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇటీవల రూట్ అధిగమించే వరకు ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగుల ఘనత అతని పేరిటే ఉంది. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆ్రస్టేలియా గడ్డపై యాషెస్ గెలిచేందుకు దోహదం చేసిన అతను కెపె్టన్‌గా రెండు సార్లు స్వదేశంలో యాషెస్ సిరీస్‌ను గెలిపించాడు. 2012లో భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడంలో కూడా అతనిదే ప్రధాన పాత్ర. కుక్ 161 టెస్టుల్లో 45.35 సగటుతో 33 సెంచరీలు సహా 12,472 పరుగులు సాధించాడు. విధ్వంసానికి మారుపేరు... ఈతరం క్రికెట్ అభిమానులకు అత్యుత్తమ వినోదం అందించిన ఆటగాళ్లలో డివిలియర్స్ అగ్రభాగాన ఉంటాడు. క్రీజ్‌లోకి దిగితే చాలు తనకే సాధ్యమైన వైవిధ్యభరిత షాట్లతో మైదానం అంతా పరుగుల విధ్వంసం సృష్టించడంలో ఏబీ దిట్ట. వన్డేల్లో వేగవంతమైన 50 (16 బంతుల్లో), 100 (31 బంతుల్లో), 150 (64 బంతుల్లో) అతని పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేసిన డివిలియర్స్... 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు సాధించాడు. 78 టి20ల్లో అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు
ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు చేర్చింది. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ అలిస్టర్ కుక్, సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్, భారత దిగ్గజ స్పిన్నర్ నీతూ డేవిడ్ ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమర్లుగా ఎంపికయ్యారు.అలిస్టర్ కుక్ (2006-18) ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాటర్లలో ఒకరు. కుక్ తన టెస్ట్ కెరీర్లో 161 టెస్ట్‌లు ఆడి 45.35 సగటున 12,472 పరుగులు చేశాడు. అలాగే 92 వన్డేల్లో 36.40 సగటున 3204 పరగులు చేశాడు. నాలుగు టీ20ల్లో 15.25 సగటున 61 పరుగులు చేశాడు.నీతూ డేవిడ్ (1995-2008).. భారత్ తరఫున ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలో చేరిన రెండో మహిళా క్రికెటర్. 2023లో డయానా ఎడుల్జి భారత్ తరఫున హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. నీతూ డేవిడ్ భారత్ తరఫున 10 టెస్ట్‌లు, 97 వన్డేలు ఆడి 182 వికెట్లు పడగొట్టింది. భారత్ తరఫున వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్ నీతూనే.ICC VIDEO FOR THE HALL OF FAMER - AB DE VILLIERS. 🐐pic.twitter.com/PzUh1MDPHR— Mufaddal Vohra (@mufaddal_vohra) October 16, 2024ఏబీ డివిలియర్స్ (2004-2018) విషయానికొస్తే.. ఏబీడీ సౌతాఫ్రికా తరఫున 114 టెస్ట్‌లు, 228 వన్డేలు, 78 టీ20 ఆడి 20014 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో ఏబీడీ సగటు 50కి పైగానే ఉంది. మైదానం నలుమూలలా షాట్లు ఆడగల ఏబీడీకి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్‌గా పేరుంది.చదవండి: IND vs NZ 1st Test: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. తొలి రోజు ఆట రద్దు -
22 ఏళ్లకే ఇంత టాలెంటా? జైశ్వాల్‌ను ఆపకపోతే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై భారీ శతకంతో చెలరేగాడు. మొదటి రోజు ముగిసే సమయానికి 179 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. తన తొలి డబుల్ సెంచరీకి మరో 21 పరుగుల దూరంలో జైశ్వాల్ నిలిచాడు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట జైశ్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ తన వయసుకు మించిన పరిణతి చూపించాడని కుక్ కొనియాడాడు. "జైశ్వాల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే ఆసాధరమైన ప్రతిభనను కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లతో జైశ్వాల్‌ది ఒకటి. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై జైశ్వాల్ మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. మిగితా బ్యాటర్లు అంతా కలిసి కేవలం 158 పరుగులు మాత్రమే చేశారు. జైశ్వాల్ ఇన్నింగ్స్‌ను మినహాయిస్తే ఇప్పటికి భారత బ్యాటింగ్ లైనప్ పేలవంగానే కన్పిస్తోంది. ఇంగ్లండ్ బౌలర్లు కూడా జైశ్వాల్‌కు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేదు. అతడిని ఇప్పటికైనా ఆపకపోతే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు అని కుక్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుక్ పేర్కొన్నాడు. -
ఆరంభం.. ముగింపు టీమిండియాతోనే! ఆటకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ వీడ్కోలు
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం ప్రకటన చేశాడు. కాగా 2018లో టీమిండియాతో ఓవల్ మ్యాచ్ తర్వాత కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. భారత జట్టుతో నాటి మ్యాచ్‌లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లో 71, 147 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌కు పరిమితమయ్యాడు. కౌంటీల్లో ఎసెక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి.. 2019నాటి చాంపియన్‌షిప్‌లో టీమ్‌ను విజేతగా నిలిపాడు. అప్పుడు చాంపియన్.. కానీ ఈసారి తాజా చాంపియన్‌షిప్‌లో 14 మ్యాచ్‌లు ఆడి.. ఒక సెంచరీ, ఆరు అర్ధ శతకాల సాయంతో 836 పరుగులు సాధించిన కుక్.. ఎసెక్స్కు మరోసారి టైటిల్ అందించలేకపోయాడు. ఈసారి సర్రే టీమ్ విజేతగా నిలవగా.. ఎసెక్స్ రెండోస్థానానికి పరిమితమైంది. ఈ క్రమంలో ఎసెక్స్ సోషల్ మీడియా వేదికగా అలిస్టర్ కుక్ తన నిర్ణయాన్ని అభిమానులకు తెలియజేశాడు. ‘వీడ్కోలు పలకడం అంత సులభం కాదు. క్రికెట్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నేనెన్నడూ ఊహించని ప్రదేశాలకు వెళ్లడం సహా.. అక్కడి వాళ్లతో అనుబంధాలు పెంపొందించుకోవడం ఆట వల్లే సాధ్యమైంది. కలలో కూడా ఊహించని ఎన్నో విషయాలను నేను సాధించగలిగాను. ఎనిమిదేళ్ల వయసులో అండర్-11 జట్టులో ఆడిన నాటి నుంచి.. ఇప్పటి దాకా.. ఒకింత గర్వం.. అంతకు మించిన బాధతో.. కుక్ భావోద్వేగం భిన్న భావోద్వేగాల సమాహారంతో ఆటకు వీడ్కోలు చెబుతున్నా. అయితే, జీవితాంతం గుర్తుపెట్టుకునే జ్ఞాపకాలను ఆట నాకు మిగిల్చింది.. నేనిప్పుడు సంతోషంగా ఉన్నాను’’ అంటూ 38 ఏళ్ల అలిస్టర్ భారమైన హృదయంతో బ్యాటర్‌గా శాశ్వతంగా ఆటకు దూరమయ్యాడు. కాగా ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికిన కుక్‌ను ఉద్దేశించి.. ‘‘ఒక శకం ముగిసిపోయింది..’’ అంటూ అతడికి ధన్యవాదాలు తెలిపింది ఎసెక్స్ యాజమాన్యం. ఆరంభం.. ముగింపు టీమిండియాతోనే కాగా ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్లలో ఒకడిగా అలిస్టర్ కుక్ పేరొందాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో 12400 పరుగులు సాధించి.. ఆల్‌టైమ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కుక్ చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 352 మ్యాచ్‌లలో 26,643 పరుగులు చేశాడు. ఇందులో 74 సెంచరీలు ఉన్నాయి. ఇక 2006లో భారత్ వేదికగా టీమిండియాతో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కుక్.. సొంతగడ్డపై టీమిండియాతోనే తన చివరి మ్యాచ్ ఆడటం విశేషం. చదవండి: పాకిస్తాన్‌తో మ్యాచ్.. గుడ్‌న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ! ఇషాన్ అవుట్.. కానీ! -
15 ఏళ్ల కుర్రాడి ముందు 12 ఏళ్ల అనుభవం పనికిరాలేదు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్... ఆల్‌టైమ్ టెస్టు గ్రేట్‌స్ట్ బ్యాటర్ అలిస్టర్ కుక్ 15 ఏళ్ల కుర్రాడి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అదేంటి ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నాం. 12 ఏళ్ల కెరీర్లో అలిస్టర్ కుక్ ఇంగ్లండ్ తరపున 161 టెస్టులు ఆడాడు. అందులో 291 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 35సార్లు మాత్రమే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కుక్ ఎంత మంచి బ్యాటర్ అనేది. మరి 12 ఏళ్ల అనుభవం ఉన్న కుక్‌ను 15 ఏళ్ల కుర్రాడు క్లీన్‌బౌల్డ్ చేస్తే అది విశేషమే కదా. ఈ ఘటన 12 ఓవర్ గేమ్‌లో భాగంగా యంగ్ ఫార్మర్స్, పొట్టొన్ టౌన్ మధ్య మ్యాచ్‌లో చోటు చేసుకుంది. యంగ్ ఫార్మర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అలిస్టర్ కుక్ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. కాగా పొట్టొన్టౌన్ బౌలర్ కైరన్ షాకిల్టన్ లెగ్‌సైడ్ దిశగా బంతిని వేశాడు. షాట్ ఆడే ప్రయత్నంలో కుక్ విఫలమయ్యాడు.. వెంటనే బంతి నేరుగా మిడిల్‌స్టంప్‌ను గిరాటేసింది. దీంతో 15 ఏల్ల కైరన్ షాకిల్టన్కు పట్టరాని సంతోషమేసింది. 12 ఏళ్ల అనుభవం ఉన్న ఒక మాజీ క్రికెటర్ తన బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవడం సంతోషంగా అనిపించిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత కైరన్ 37 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పొట్టొన్ 3 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన యంగ్ ఫార్మర్ 7 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమై 26 పరుగులతో పరాజయం పాలైంది. ఇక ఇంగ్లండ్ ఆల్‌టైమ్ టెస్టు క్రికెటర్లలో అలిస్టర్ కుక్ ఒకడిగా ఉన్నాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆండ్రూ స్ట్రాస్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కుక్ విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ తరపున 161 టెస్టుల్లో 12,472 పరుగులు సాధించిన కుక్ ఖాతాలో 33 టెస్టు సెంచరీలు ఉన్నాయి. 92 వన్డేల్లో 3204 పరుగులు సాధించాడు. ఇక టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆల్‌టైమ్ జాబితాలో కుక్ రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: 'కోచ్‌గా ఉండుంటే కేఎల్ రాహుల్‌ను కచ్చితంగా తిట్టేవాడిని' IND Vs IRE: టీమిండియా టి20 తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ The moment cricket legend Sir Alastair Cook was bowled by 15 year old local lad Kyran, in Potton this evening. @PottonTownCC pic.twitter.com/PXR9ME5ptu — Adam Zerny (@adamzerny) May 23, 2022 -
'కుక్.. సాధించా.. ఇక నుంచి ఆ మాట అనవేమో'
ఢిల్లీ: ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ సూపర్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. 64 బంతులెదుర్కొని 124 పరుగులు చేసిన బట్లర్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు.. 8 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్లో సాధించిన శతకం బట్లర్ కెరీర్లో తొలి టీ20 శతకం కావడం విశేషం. ఇంగ్లండ్ తరపున బట్లర్ ఆరంభం నుంచి ఎక్కువగా మిడిల్ ఆర్డర్లో ఆడడంతో అతనికి ఎప్పుడు టీ20ల్లో సెంచరీలు చేసే అవకాశం రాలేదు. కాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ విజయం అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలచిన బట్లర్ స్పందించాడు. ' నా కెరీర్ ఆరంభంలో ఇంగ్లండ్ తరపున ఎక్కువగా మిడిల్ ఆర్డర్లో వచ్చేవాడిని. ఆ స్థానంలో వస్తే సెంచరీలు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది... అందునా టీ20ల్లో. అయితే 2017-18 నుంచి మాత్రం ఇంగ్లండ్ తరపున టీ20ల్లో రెగ్యులర్ ఓపెనర్‌గా వస్తున్నా శతకం సాధించలేకపోయా. కానీ ఐపీఎల్లో ఇవాళ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఆ కోరిక నెరవేరింది. అంతేగాక ఈ సందర్భంగా నా మిత్రుడు.. సీనియర్ క్రికెటర్ అలిస్టర్ కుక్కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఈరోజు సెంచరీ సాధించా.. టీ20ల్లో సెంచరీ సాధించలేకపోయావు అని కుక్ నోటి నుంచి ఇక నేను విననేమో.. అతను ఆ మాట అనడం ఆపేస్తాడేమో.. అంటూ 'నవ్వుతూ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ తరపున అన్న ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాడిగా కుక్ పేరు పొందాడు. తన కెరీర్లో ఎక్కువగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన కుక్ 32 టీ20లు మాత్రమే ఆడాడు. అయితే 2009 టీ20 ప్రపంచకప్‌లో కుక్ 57 బంతుల్లోనే శతకం సాధించి ఔరా అనిపించాడు. ఇక బట్లర్ ఇప్పటివరకు ఇంగ్లండ్ సహా అన్ని లీగ్‌లు కలిపి 282 టీ20 మ్యాచ్‌లాడి 47 హాప్ సెంచరీలు చేశాడు తప్ప ఇంతవరకు ఒక్క సెంచరీ సాధించలేదు. తాజగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అది సాధించడంతో తన కోరికను నెరవేర్చకున్నాడు. ఇక ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. చదవండి: Jos Buttler: ఆ ముగ్గురి సరసన బట్లర్ -
'కోహ్లి మాటలు నాకు కోపం తెప్పించాయి'
అహ్మదాబాద్: మొటేరా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో విజయం వెనుక పిచ్ కీలకపాత్ర పోషించిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. పిచ్ పరిస్థితి దారుణంగా ఉందని.. అసలు ఆడుతుంది టెస్టు మ్యాచ్ లేక టీ20 మ్యాచ్ అన్న అనుమానం కలిగిందంటూ పేర్కొన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురువారం మ్యాచ్ విజయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ''పిచ్‌లో ఏం తప్పు లేదు.. బ్యాట్స్‌మెన్ వైఫల్యం వల్లే మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసింది. నిజాయితీగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటింగ్ నాణ్యతలో లోపం ఉంది. మొదటి రోజు 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసి ఆటను ముగించాం. కానీ రెండో రోజు దానికి మరో 46 పరుగులు మాత్రమే జత చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయాం. ఇదే విషయం ఇంగ్లండ్ బ్యాటింగ్‌లోనూ నిజమైంది. వాస్తవానికి తొలి ఇన్నింగ్స్ సమయంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి కోల్పోయిన 30 వికెట్లలో 21 వికెట్లు నేరుగా విసిరిన బంతులకే పడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మన డిఫెన్స్‌పై నమ్మకం పెట్టుకోకకుండా పిచ్‌ను నిందించడం సరికాదు. టెస్టు క్రికెట్లో నెమ్మైదన ఆట ఆడడం ప్రధానం. అలా ఆడకపోవడం.. పరుగులు చేయలేకపోవడం వల్లే మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసింది'' అని తెలిపాడు. తాజాగా కోహ్లి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''కోహ్లి వ్యాఖ్యలు నాకు కోపం తెప్పించాయి. పింక్ బాల్ టెస్టులో పిచ్ తప్పు ఏం లేదని.. బ్యాట్స్‌మెన్ వైఫల్యం ప్రధాన కారణమని అంటున్నాడు. ఇది తప్పు.. స్పిన్ బాగా ఆడగలడని పేరున్న కోహ్లి, జో రూట్లు కూడా మూడో టెస్టులో ఆత్మరక్షణ ధోరణిలో పడ్డారు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ ఢిఫెన్స్ మోడ్‌కు ఇద్దరు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. నిజానికి మొటేరా పిచ్ బ్యాటింగ్ చేయడానికి ఏ మాత్రం అనువుగా లేదు. బంతులన్ని వికెట్ల మీదకు వస్తుంటే ఏ బ్యాట్స్‌మెన్ అయినా ఎలా ఆడగలుగుతాడు.. ఈ విషయం తెలిసి కూడా కోహ్లి బ్యాట్స్‌మెన్ వైఫల్యం అనడం నచ్చలేదు.'' అంటూ చురకలంటించాడు. చదవండి: స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్ -
అరుదైన ఫీట్.. ఒకే రోజు
లండన్: ప్రపంచ క్రికెట్లో రికీ పాంటింగ్, అలెస్టర్ కుక్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా పాంటింగ్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందిస్తే, ఇంగ్లండ్ సారథిగా అలెస్టర్ కుక్ అనేక గెలుపులను చూశాడు. వీరిద్దరూ బ్యాటింగ్‌లో కూడా ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకుని దిగ్గజ క్రికెటర్లుగా నిలిచారు.. అందులో 10వేల టెస్టు పరుగుల మార్కు ఒకటి. అయితే ఈ ఫీట్‌ను 2008లో పాంటింగ్ సాధిస్తే, 2016లో కుక్ నమోదు చేశాడు. కాగా, ఈ సేమ్ ఫీట్‌ను వీరిద్దరూ ఒకే రోజు(మే 30)నే నమోదు చేయడం ఇక్కడ విశేషం. ఈ అరుదైన ఘనతను సాధించడానికి వీరిద్దర మధ్య కాల వ్యవధి ఎనిమిదేళ్లు. 10వేల పరుగుల మార్కును చేరిన 7వ బ్యాట్స్‌మన్‌గా పాంటింగ్ కాగా, కుక్ 12వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కాగా, ఈ ఘనతను సాధించిన పిన్న వయస్కుడిగా కుక్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2008లో పాంటింగ్ ఇలా.. ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో పాంటింగ్ 10 వేల మార్కును చేరాడు. విండీస్‌తో మ్యాచ్‌లో భాగంగా తొలి రోజు 61 పరుగులు సాధించడం ద్వారా పాంటింగ్ అరుదైన జాబితాలో చేరిపోయాడు. అప్పటివరకూ ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రమే 10 వేల పరుగుల రికార్డును చేరగా మూడో ఆసీస్ క్రికెటర్‌గా పాంటింగ్ నిలిచాడు.ఆసీస్ కెప్టెన్లుగా చేసిన అలెన్ బోర్డర్, స్టీవ్ వాల సరసన పాంటింగ్ చేరాడు. విండీస్ టెస్టు మ్యాచ్‌లో ఈ రికార్డును చేరిన కాసేపటికే పాంటింగ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి పాంటింగ్ పెవిలియన్ చేరాడు. సచిన్ రికార్డు బద్ధలైన వేళ.. 2016లో చెస్టర్ లీ స్ట్రీట్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కుక్ 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అప్పుడు లంకేయులతో జరిగిన రెండో టెస్టులో కుక్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. అదే సమయంలో 10 వేల పరుగుల రికార్డును పిన్న వయసులో అందుకున్న క్రికెటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. 31 ఏళ్ల ఐదు నెలల 7 రోజుల వయసులో కుక్ ఈ రికార్డు సాధించగా, సచిన్ 31 ఏళ్ల 10 నెలల 20 రోజుల వయసులో దీన్ని నమోదు చేశాడు. 2005లో కోల్‌కతాలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో సచిన్ 10 వేల మార్కును చేరుకున్నాడు. కాగా, 11 ఏళ్ల తర్వాత ఆ రికార్డును కుక్ బ్రేక్ చేసి నయా రికార్డు లిఖించాడు. -
సచిన్ తర్వాత స్థానంలో రూట్
లండన్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ అరుదైన క్లబ్లో చేరిపోయాడు. టెస్టు ఫార్మాట్లో పిన్న వయసులో ఏడువేల పరుగుల మైలురాయిని దాటిన మూడో ఆటగాడిగా రూట్ నిలిచాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రూట్(57) హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా టెస్టుల్లో 7వేల మార్కును అందుకున్న క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. అదే సమయంలో పిన్న వయసులో ఈ ఘనత సాధించిన సచిన్ టెండూల్కర్, అలెస్టర్ కుక్ల సరసని రూట్ చోటు సంపాదించాడు. ఈ ఫీట్‌ను కుక్ 27 ఏళ్ల 346 రోజుల వయసులో సాధిస్తే, సచిన్ 28 ఏళ్ల 193 రోజుల వయసులో సాధించాడు. రూట్ 28 ఏళ్ల 256 రోజుల వయసులో ఏడు వేల టెస్టు పరుగుల్ని సాధించాడు. ఇక ఆల్ టైమ్ టెస్టు పరుగుల జాబితాలో ఆసీస్ దిగ్గజ ఆటగాడు సర్ బ్రాడమన్‌ను రూట్ అధిగమించాడు. తన కెరీర్లో బ్రాడమన్ 6,996 పరుగులు సాధిస్తే, దాన్ని రూట్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్(15,921) తొలి స్థానంలో ఉన్నాడు. మరొకవైపు 86వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న రూట్.. వేగవంతంగా అత్యధిక టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన నాల్గో ఇంగ్లండ్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఇది రూట్ 158 టెస్టు ఇన్నింగ్స్ కాగా, తన టెస్టు కెరీర్లో 45వ హాఫ్ సెంచరీ సాధించాడు. -
కానుకగా 33 బీర్ బాటిళ్లు..
లండన్: టీమిండియాతో ఆఖరి టెస్టు మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్‌కు క్రికెటర్ అలెస్టర్ కుక్ బీర్ బాటిళ్లను కానుకగా అందుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు కెరీర్లో 33 శతకాలు సాధించిన కుక్కు 33 బీర్ బాటిళ్లను మీడియా ప్రతినిధులు కానుకగా అందజేశారు. అంతేకాదు ఒక్కో బాటిల్‌పై ఒక్కో మెసేజ్‌ను రాసి కుక్కు అందించారు. అనంతరం కుక్ వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఐదో టెస్టులో భాగంగా సోమవారం నాలుగో రోజు ఆటలో కుక్ శతకం సాధించిన తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు కుక్ జవాబులిచ్చే క్రమంలో ఒక వ్యక్తి కుక్ వద్దకు పెట్టె పట్టుకుని వెళ్లి సదరు కానుకను అందజేశాడు. గత కొన్నేళ్లుగా కెప్టెన్‌గా, ఆటగాడిగా ఇంగ్లండ్‌కు చేసిన సేవలకు గాను కుక్కు బీర్ బాటిళ్లను అందజేశారు. ‘రిటైర్మెంట్ ప్రకటించిన మీకు మా అందరి తరఫు నుంచి చిన్న కానుక. గతంలో మీరు ఒకసారి మాట్లాడుతూ ‘నేను వైన్ డ్రింకర్‌ను కాదు బీర్ మ్యాన్’ అని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకునే మీకు 33 బీర్ బాటిళ్లను కానుకగా అందజేస్తున్నాం. ఒక్కో బాటిల్‌పై ఒక్కో మీడియాకు చెందిన ప్రతినిధి మీ కోసం ప్రత్యేకమైన మెసేజ్ రాశారు’ అని అతను తెలిపాడు. -
టీమిండియాపై అరుదైన ఫీట్!
లండన్ : భారత్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ అరుదైన గణంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌తో ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌పైనే అరంగేట్రం చేసిన కుక్ చివరి మ్యాచ్ కూడా అదే జట్టుతో ఆడటం విశేషం. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన కుక్.. చివరి మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. తద్వారా అరంగేట్ర, కెరీర్ చివరి టెస్టులోనూ సెంచరీ చేసిన ఐదో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో రెగీ డఫ్ (ఆస్ట్రేలియా), పోన్స్ఫర్డ్ (ఆస్ట్రేలియా), గ్రెగ్ చాపెల్ (ఆస్ట్రేలియా), అజహరుద్దీన్ (భారత్) ఈ ఘనతను సాధించారు. రెగీ డఫ్ 1902లో ఇంగ్లండ్‌పై అరంగేట్ర మ్యాచ్‌లో (32,104) పరుగులు చేశాడు. చివరి మ్యాచ్ అదే ఇంగ్లండ్‌పై 1905లో (146, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు) చేశాడు. బిల్ పోన్స్ఫర్డ్ 1924లో ఇంగ్లండ్‌పై అరంగేట్ర మ్యాచ్‌లో (110,27).. చివరి మ్యాచ్(1934)లో అదే ఇంగ్లండ్‌పై (266,22) పరుగులు సాధించాడు. గ్రెగ్ చాపెల్ ఇంగ్లండ్‌పై (1970) అరంగేట్ర మ్యాచ్‌లో (108 పరుగులు, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయలేదు).. చివరి మ్యాచ్(1984)లో పాకిస్తాన్‌పై (182, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు) పరుగులు చేశాడు. అజహరుద్దీన్ ఇంగ్లండ్‌పై అరంగేట్ర మ్యాచ్ (1984)లో (110, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయలేదు).. లాస్ట్ మ్యాచ్(2000)లో దక్షిణాఫ్రికాపై (9,102) పరుగులు సాధించాడు. ఇక 2006లో భారత్‌పై నాగ్‌పూర్‌లో తన తొలి టెస్ట్ ఆడిన కుక్ అందులోనూ (60,104 నాటౌట్), అర్ధశతకం, శతకం సాధించాడు. ఇప్పుడు చివరి మ్యాచ్‌లోనూ(71,147)లతో అదే గణంకాలను పునరావృతం చేశాడు. ఇలాంటి అరుదైన ఫీట్ నమోదు చేసిన ఏకైక క్రికెటర్ కుక్ ఒక్కడే కావడం గమనార్హం. టాప్-5లో కుక్.. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కుక్ (12,472) పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌గా కుక్ రికార్డు నెలకొల్పాడు. సంగక్కర (శ్రీలంక–12,400) పేరిట ఉన్న రికార్డును అతను తిరగరాశాడు. అత్యధిక పరుగుల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 15921 తొలి స్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్ (13378), జాక్వస్ కల్లీస్(13289), రాహుల్ ద్రవిడ్ (13288)లు కుక్ కన్నా ముందున్నారు. ‘‘గడిచిన ఈ నాలుగు రోజులు నిజమా.. కలనా అనిపిస్తోంది. ఇక్కడున్న నా స్నేహితులు కొంత మంది గత నాలుగురోజులుగా నన్ను ట్రీట్ చేసిన విధానం అత్యద్భుతం. ఇక నా బ్యాటింగ్ చివరి ఓవర్స్‌లో నా అభిమానుల పాటలు చాలా ప్రత్యేకం’’ - అలిస్టర్ కుక్ చదవండి: ఓటమి అంచున కోహ్లి సేన -
కుమ్మెసిన కుక్.. భారత్ ముందు భారీ టార్గెట్
లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్సింగ్స్‌లో 423 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్‌కు 464 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. 114/2 తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మొదటి నుంచి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కుక్ తన చివరి ఇన్సింగ్స్ లో 147 పరుగులతో వీరోచిత సెంచరీతో చెలరేగాడు. మరో ఆటగాడు జో రూట్ తనదైన శైలిలో రెచ్చిపోయి 125 పరుగులు సాధించాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన వీరిద్దరిని ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి వరుస బంతుల్లో అవుడ్ చేశాడు. చివర్లో బేయిర్‌స్టో 37 పరుగులతో రాణించాడు. దీంతో రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్లు నష్టానికి 423 పరుగుల సాధించి డిక్లేర్ చేసింది. మొదటి ఇన్సింగ్స్‌లోని 40 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్ ముందు 464 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. భారత బౌలర్లలో విహారి, జడేజా మూడేసి వికెట్లతో రాణించారు. రేపు చివరి రోజు కావడంతో భారమంతా బ్యాట్స్‌మెన్‌పైనే ఉంది. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కుని రేపంతా నిలడబితే టెస్ట్‌ను డ్రాగా ముగించే అవకాశం ఉంటుంది. -
అఖరి ఇన్సింగ్స్‌లో కుక్ సెంచరీ
లండన్ : భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు అలెస్టర్ కుక్ అద్భుత శతకంతో చెలరేగాడు. చివరి టెస్ట్ మ్యాచ్‌లో కుక్ శతకం సాధించి తన కెరీర్లో 33వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ సందర్భంగా కుక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. విహారి వేసిన ఇన్సింగ్స్ 70వ ఓవర్లో సింగిల్ ద్వారా కుక్ 100 పరుగుల మార్కును అందుకున్నాడు. అతని సెంచరీ పూర్తి చేయగానే స్టేడియం చప్పట్లతో హోరెత్తింది. 2006లో నాగపూర్ టెస్ట్ ద్వారా భారత్‌పై తన అరంగ్రేటం మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన కుక్.. తన చివరి మ్యాచ్‌లో కూడా భారత్‌పై సెంచరీతో చెలరేగిపోయాడు. 2006లో నాగపూర్‌లో జరిగిన టెస్ట్‌లో కుక్ 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 114/2 తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మొదటి నుంచి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కుక్-రూట్ జోడి క్రీజ్‌లో పాతుకుపోయి ఎడాపెడా బౌండరీలతో చెలరేగిపోయారు. మరో ఆటగాడు రూట్ కూడా సెంచరీ దిశగా వెళ్తున్నాడు. లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ 243/2తో పటిష్టమైన స్థితిలో నిలిచింది. క్రీజ్‌లో కుక్ (103), రూట్ (93) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 283 పరుగుల ఆధిక్యంతో ఉంది. -
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు : తొలి రోజు ఆట
-
చివరి టెస్ట్: కుక్కు ఘనస్వాగతం
లండన్ : భారత్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ఓపెనర్ అలిస్టర్ కుక్కు ఘనస్వాగతం లభించింది. కుక్ ఈ మ్యాచ్‌తో అతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రేక్షకుల కరతాల ధ్వనుల మధ్య.. అలిస్టర్ కుక్ మైదానంలోకి రాగా.. సముచిత గౌరవం కల్పిస్తూ టీమిండియా క్రికెటర్లు ఓ వరుసలో నిలబడి ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేయగా.. యావత్ క్రీడా అభిమానులు కుక్‌ను కొనియాడుతున్నారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆరో స్థానం, సెంచరీల్లో టాప్–10లో చోటు, నిర్విరామంగా 159 టెస్టులు ఆడిన క్రమశిక్షణ కుక్కే సొంతం. ఇప్పటికే సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్ నెగ్గి కుక్‌ను విజయంతో సాగనంపాలని ఉవ్విళ్లురుతోంది. మరోవైపు సిరీస్ చేజారిన కోహ్లి సేన ఎలాగైనా మ్యాచ్ నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. చదవండి: అలిస్టర్ కుక్ అల్విదా -
కుక్చివరి టెస్ట్: మైదానంలో ఘనస్వాగతం
-
కుక్ ఆల్‌టైం జట్టులో మనోళ్లు లేరు!
సౌతాంప్టన్ : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్‌పై భారత అభిమానుల ఆగ్రహంగా ఉన్నారు. కోహ్లి సేనతో జరిగే చివరి టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించిన ఈ ఇంగ్లీష్ ఆటగాడు.. 11 మంది సభ్యులతో కూడిన తన ఆల్‌టైమ్ టెస్ట్ జట్టును ప్రకటించాడు. తనతో కలిసి ఆడిన ఆటగాళ్లు, ప్రత్యర్థి ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ జట్టు ఎంపిక చేసినట్లు తెలిపాడు. తన జట్టులో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు మిస్సయ్యారని, వారందరికీ క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ రిలీజ్ చేసింది. ఈ జట్టులో భారత క్రికెటర్ ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఇదే భారత అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తన ఆల్‌టైమ్ టీమ్ కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రహమ్ గూచ్ను సూచించిన కుక్.. అతనికి ఓపెనింగ్ జంటగా ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ను ఎంపిక చేశాడు. ఇక బ్యాట్స్‌మన్‌గా దిగ్గజ ఆటగాళ్లు బ్రియన్ లారా(వెస్టిండీస్), రికీ పాంటింగ్(ఆసీస్), ఏబీ డివిలియర్స్, జాక్వస్ కల్లీస్ (దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర(శ్రీలంక)లను పేర్కొన్నాడు. బౌలర్స్‌గా ఇద్దరు స్పిన్నర్లు ముత్తయ్య మురళిదరణ్(శ్రీలంక), షేన్ వాట్సన్(ఆసీస్)లతో పేసర్స్ జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్), గ్లేన్ మెక్‌గ్రాత్ (ఆసీస్)లను ఎంపిక చేశాడు. ఇక ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో 32 సెంచరీలతో అత్యధిక పరుగులు 12,254 చేసిన తొలి ఆటగాడిగా కుక్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లిసేన 5 టెస్టుల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కోల్పోయిన విషయం తెలిసిందే. చివరి టెస్ట్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. -
కుక్ తీసిన ఏకైక వికెట్ అదే
లండన్: ఇంగ్లండ్ మాజీ సారథి, స్టార్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్ తన కెరీర్ చివరి మ్యాచ్‌కు ముహూర్తం ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియాతో జరిగే ఏ ఇతర ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యంకాని ఎన్నో రికార్డులు, మరెన్నో అవార్డులు అతని సొంతం. క్రీజులో నిలదొక్కుకుంటే చాలు బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. స్కోర్ బోర్డు పరిగెత్తించేవాడు. ఇక ఫీల్డింగ్‌లో కూడా చురుగ్గా ఉంటూ స్లిప్‌లో ఎన్నో మరుపురాని క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ లెఫ్టాండ్ బ్యాట్స్‌మన్ బౌలింగ్ చేయడం చాలా అరుదు. అతను ఆడిన 160 టెస్టుల్లో 26,086 బంతులను ఎదుర్కొని 12254 పరుగుల చేయగా.. కేవలం 18 బంతులే బౌలింగ్ చేసి ఒక్క వికెట్ సాధించాడు. ఆ ఔట్ చేసింది కూడా టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మనే కావడం విశేషం. 2014లో ఎంఎస్ ధోని నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు కుక్ తన తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా లోయార్డర్ బ్యాట్స్‌మెన్ భువనేశ్వర్-ఇషాంత్ శర్మలు ప్రత్యర్థి బౌలర్లకు కొరకరానికొయ్యలా తయారయ్యారు. దీంతో ఈ జోడిని విడదీయడానికి అప్పటి కెప్టెన్ అలిస్టర్ కుక్ రంగంలోకి దిగాడు. విభిన్నమైన శైలితో బౌలింగ్ చేసిన కుక్.. ఊరించే బంతులేసి చివరకు ఇషాంత్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అతని బౌలింగ్ విధానంతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ నవ్వులు పూయించాడు. కుక్ టెస్టు కెరీర్ టెస్టులు 160 ఇన్నింగ్స్ 289 పరుగులు 12,254 అత్యధిక స్కోరు 294 సగటు 44.88 శతకాలు 32 ద్విశతకాలు 5 అర్ధసెంచరీలు 56 క్యాచ్‌లు 173 -
కుక్ తీసిన ఏకైక వికెట్ అదే
-
‘మాస్టర్ చెఫ్’...
సాక్షి క్రీడావిభాగం : టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆరో స్థానం, సెంచరీల్లో టాప్–10లో చోటు, విరామం లేకుండా వరుసగా 158 టెస్టులు ఆడిన క్రమశిక్షణ, భారత గడ్డపై, ఆస్ట్రేలియాలో కూడా ఒకే సిరీస్‌లో మూడేసి సెంచరీలు చేసిన అరుదైన ప్రదర్శన, ఎంతో మంది గొప్ప సారథులకు సాధ్యం కాని రీతిలో భారత్‌లో చారిత్రాత్మక సిరీస్ విజయం... తన ప్రొఫైల్‌లో ఇలాంటి ఘనతలు ఎన్నో ఉన్నా అలిస్టర్ కుక్కు ‘స్టార్ క్రికెటర్’గా గుర్తింపు మాత్రం దక్కలేదు. చిన్న విషయాలకే హోరెత్తిపోయే ఇంగ్లండ్ మీడియా అతను ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గూచ్ను అధిగమించినప్పుడు కూడా పెద్దగా సందడి చేయలేదు. గంటలకొద్దీ ఏకాగ్రతతో క్రీజ్‌లో పాతుకుపోవడం, అలసట అనేదే కనిపించకుండా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడుతూ పోవడం తప్ప ఏ దశలోనూ పెద్దగా మెరుపులు కనిపించని ‘చెఫ్’ పాతతరం బ్యాటింగ్ ఆధునిక యుగంలో రికార్డులు అందించిందే తప్ప అలరించలేకపోవడం కూడా ఒక కారణం. వ్యక్తిగతంగా కూడా అందరినీ ఆకర్షించే తత్వం లేకపోవడంతో పాటు మాటకారి కాకపోవడం కూడా పరుగుల వరద పారించిన తర్వాత కుక్‌ను వెనకే ఉండిపోయేలా చేశాయి. అయితే ఇలాంటి వాటికంటే కేవలం తన ఆట, పట్టుదలతోనే అతను గొప్ప క్రికెటర్‌గా ఎదగడం విశేషం. టెస్టుల్లో కుక్ అరంగేట్రం అనూహ్యంగా జరిగింది. 2006లో భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన ట్రెస్కోథిక్ వ్యక్తిగత కారణాలతో చివరి నిమిషంలో తప్పుకోవడంతో కుక్కు ఓపెనర్‌గా పిలుపు వచ్చింది. ఆ సమయంలో ఎక్కడో వెస్టిండీస్‌లో ఉన్న అతను సుదూర ప్రయాణం చేసి తొలి టెస్టు బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో 60, 104 పరుగులతో తన రాకను ఘనంగా చాటాడు. ఆ తర్వాత ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు కుక్ బ్యాట్ నుంచి జాలువారాయి. ఏడాదికి వేయి చొప్పున 12 ఏళ్ల కెరీర్లో 12 వేలకు పైగా పరుగులతో అతను ఇంగ్లండ్ క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచాడు. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి కోల్‌కతాలో భారత్‌పై చేసిన 190, సిడ్నీలో ఆస్ట్రేలియాపై 189, లార్డ్స్‌లో న్యూజిలాండ్‌పై 162, గాలేలో శ్రీలంకపై 118, డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై చేసిన 118 పరుగులు కుక్ కెరీర్లో ఆణిముత్యాలు. ఏకంగా 766 పరుగులు సాధించి 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్ (2010–11)ను గెలిపించడం బ్యాట్స్‌మన్‌గా కుక్ కెరీర్లో మధుర ఘట్టం. కెప్టెన్‌గా 2012లో భారత గడ్డపై 2–1తో సిరీస్‌ను సాధించడం కుక్ నాయకత్వంలో అత్యుత్తమ క్షణం కాగా... 2013–14 యాషెస్‌లో 0–5తో చిత్తుగా ఓడటం చేదు జ్ఞాపకం. సరిగ్గా 2015 వన్డే వరల్డ్ కప్‌కు ముందు ఇంగ్లండ్ సెలక్టర్లు కుక్‌ను కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా కూడా తప్పించి అతని పరిమితులను గుర్తు చేయగా... 2016లో భారత్‌లో సిరీస్ కోల్పోవడంతో కుక్ టెస్టు కెప్టెన్సీ పోయింది. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌లోనే విఫలమై ఆటకు కూడా అతను దూరమవుతున్నా డు. గత డిసెంబర్లో యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్లో అజేయంగా 244 పరుగులు చేసిన అనంతరం ఫామ్ కోల్పోయిన ‘కుకీ’ మరో 9 టెస్టులకే రిటైర్ కావాల్సి రావడం దురదృష్టకరం. ఓపెనర్‌గానే 10 వేలకు పైగా పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా క్రికెట్ ప్రపంచం కుక్‌ను చిరకాలం గుర్తుంచుకుంటుంది. -
అలిస్టర్ కుక్ అల్విదా
లండన్: టెస్టు క్రికెట్లో అసాధారణ ఘనతలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. భారత్‌తో శుక్రవారం నుంచి ఓవల్ మైదానంలో జరిగే టెస్టు తర్వాత రిటైర్ అవుతున్నట్లు అతను ప్రకటించాడు. గత కొంత కాలంగా ఘోరంగా విఫలమవుతూ తీవ్ర విమర్శల పాలైన కుక్ ఇక ఆడలేనంటూ తప్పుకున్నాడు. వయసు 33 ఏళ్లే అయినా, అతని తాజా ఫామ్ చూస్తే రిటైర్మెంట్ ప్రకటన ఆశ్చర్యం కలిగించలేదు. కెరీర్ మొత్తంగా చూస్తే అద్భుత రికార్డు ఉన్న కుక్ బ్యాటింగ్ 2018లో పేలవంగా సాగింది. 9 టెస్టుల్లో 16 ఇన్నింగ్స్‌లు ఆడిన కుక్ కేవలం 18.62 సగటుతో 298 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత ఎనిమిదేళ్ల కాలంలో తొలిసారి అతని సగటు 45కంటే తక్కువగా పడిపోగా... ఆటలో ప్రాథమిక స్థాయి బలహీనతలు కూడా ఇటీవల తరచుగా కనిపించాయి. ఇవన్నీ కుక్ రిటైర్మెంట్కు కారణమయ్యాయి. టెస్టుల నుంచి రిటైర్ అయినా కౌంటీల్లో ఎసెక్స్ తరఫున దేశవాళీ క్రికెట్‌ను కొనసాగిస్తానని అతను చెప్పాడు. పుష్కర కాలపు కెరీర్లో ఇంగ్లండ్ తరఫున పలు చిరస్మరణీయ టెస్టు విజయాలతో పాటు అనేక పరాభవాల్లో కూడా భాగంగా ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఘనత వహించిన కుక్, ఓవరాల్ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. దాదాపు రెండేళ్ల క్రితం భవిష్యత్‌లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును కూడా అధిగమించగలడని కుక్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వరుస వైఫల్యాలతో ఆ స్వప్నానికి కుక్ సుదూరంగా నిలిచిపోయాడు. టెస్టులకంటే ముందే వన్డేల్లో అరంగేట్రం చేసినా... మారుతున్న శైలిని అందుకోలేక విఫలమైన కుక్ వన్డే కెరీర్ 2014 డిసెంబర్లోనే ముగిసింది. 92 వన్డేల్లో అతను 36.40 సగటుతో 3204 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతను 4 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు కూడా ఆడటం విశేషం. గత కొద్ది నెలలుగా దీని గురించి తీవ్రంగా ఆలోచించి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నా. నాకు ఇది బాధాకరమైన రోజే అయినా నా శక్తి మేరా జట్టుకు ఉపయోగపడ్డానని, ఇక నాలో సత్తా కరిగిపోయిందని తెలుసు కాబట్టి సంతోషంగానే ఉన్నాను. నేను ఊహించినదానికంటే చాలా ఎక్కువగా సాధించాను. దేశం తరఫున ఇన్నేళ్లు ఆడగలగడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రిటైర్ అయ్యేందుకు ఇది సరైన సమయం. నా కెరీర్లో ఎంతో మంది అండగా నిలచినా... నన్ను ఈ స్థాయికి చేరేలా తీర్చిదిద్దిన గ్రాహం గూచ్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. –అలిస్టర్ కుక్ కుక్ టెస్టు కెరీర్ టెస్టులు 160 ఇన్నింగ్స్ 289 పరుగులు 12,254 అత్యధిక స్కోరు 294 సగటు 44.88 సెంచరీలు 32 అర్ధసెంచరీలు 56 క్యాచ్‌లు 173 -
అంతర్జాతీయ క్రికెట్‌కు కుక్ వీడ్కోలు
సౌతాంప్టన్ : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమిండియాతో జరుగనున్న ఐదో టెస్టు అనంతరం రిటైర్మెంట్ తీసుకోన్నుట్లు ప్రకటించాడు. దీంతో శుక్రవారం ఓవల్‌లో జరిగే టెస్టు మ్యాచ్ అతడికి చివరిది కానుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్నప్పటికీ ఎసెక్స్ కంట్రీ క్రికెట్ క్లబ్ తరపున ఆడతానని కుక్ స్పష్టం చేశాడు. 2006లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచుతో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్... 12, 252 టెస్టు పరుగులను(160) తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 32 శతకాలు ఉన్నాయి. వీటిలో ఓపెనర్‌గా బరిలోకి దిగి సాధించినవి11,627 పరుగులు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా.. ఇంగ్లండ్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన 33 ఏళ్ల అలెస్టర్.. గతేడాది ఫిబ్రవరిలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. 2014లో వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కుక్.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ఇదే సరైన సమయం.. ‘చిన్ననాటి నుంచే క్రికెట్‌ను ప్రేమిస్తున్నాను. ఇంగ్లండ్ జెర్సీ ఒంటిపై ధరించడం నాకొక ప్రత్యేక అనుభూతి. నాలాగే నా తరువాతి తరం కూడా ఈ అనుభూతిని ఆస్వాదించే అవకాశం రావాలి. నేను ఊహించిన దానికన్నా ఎక్కువే సాధించాను. దిగ్గజాలతో కలిసి ఇన్నాళ్లు ప్రయాణం కొనసాగించాను. ఇక సాధించాల్సిందేమీ లేదని భావిస్తున్నాను. అందుకే ఈ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించడం సరైనదిగా భావిస్తున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు తోడుగా, మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’ అని కుక్ వ్యాఖ్యానించాడు. -
దిగ్గజాల సరసన అలెస్టర్ కుక్
సిడ్నీ:ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ తన టెస్టు కెరీర్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. 12వేల టెస్టు పరుగులు సాధించిన క్లబ్లో కుక్ తాజాగా చేరిపోయాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కుక్ 10 పరుగుల్ని చేయడం ద్వారా పన్నెండు వేల టెస్టు పరుగుల్ని సాధించాడు. తద్వారా 12 వేలు, అంతకుపైగా పరుగులు సాధించిన దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్(15,921), రికీ పాంటింగ్(13,378), జాక్వస్ కల్లిస్(13,289), కుమార సంగక్కార(12,400)ల సరసన కుక్ స్థానం సంపాదించాడు. యాషెస్ సిరీస్ నాల్గో టెస్టులో కుక్ అజేయంగా 244 పరుగులు సాధించాడు. దాంతో ఒక టెస్టు మ్యాచ్ లో ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించి కడవరకూ అజేయంగా నిలవడమే కాకుండా అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. తద్వారా 45 ఏళ్ల రికార్డును కుక్ బ్రేక్ చేశాడు. అంతకుముందు 1972లో న్యూజిలాండ్ ఓపెనర్ గ్లెన్ టర్నర్స్(223 నాటౌట్) ఓపెనర్ గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయగా, ఆపై దాన్ని కుక్ సవరించాడు. ఇదిలా ఉంచితే, చివరిటెస్టు తొలి ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా 649/7 వద్ద డిక్లేర్ చేసింది. అటు తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 93పరుగులు చేసింది. జోరూట్(42;124 బంతుల్లో), బెయిర్ స్టో(17 బ్యాటింగ్; 45 బంతుల్లో 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంకా ఇంగ్లండ్ 210 పరుగులు వెనుకబడి ఉంది. దాంతో సోమవారం ఆఖరి రోజు ఆటను ఇంగ్లండ్ పూర్తిగా ఆడితేనే ఓటమి నుంచి తప్పించుకుంటుంది. -
అలెస్టర్ కుక్ వరల్డ్ రికార్డు
మెల్బోర్న్: ఇంగ్లండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు మ్యాచ్ లో ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించి కడవరకూ అజేయంగా నిలవడమే కాకుండా అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్ బోర్న్ లో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుక్(244 నాటౌట్; 409 బంతుల్లో 27 ఫోర్లు) ద్విశతకం సాధించి అజేయంగా నిలిచాడు. తద్వారా 45 ఏళ్ల రికార్డును కుక్ బ్రేక్ చేశాడు. అంతకుముందు 1972లో న్యూజిలాండ్ ఓపెనర్ గ్లెన్ టర్నర్స్(223 నాటౌట్) ఓపెనర్ గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయగా, దాన్ని కుక్ బద్ధలు కొట్టి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. మరొకవైపు ఇంగ్లండ్ తరపున ఓపెనర్ గా వచ్చి అజేయంగా నిలవడం 20 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. 1997లో న్యూజిలాండ్ జరిగిన టెస్టు మ్యాచ్ లో మైక్ అథర్టన్(94 నాటౌట్) ఈ ఘనత సాధించాడు. ఆ తరువాత ఇంతకాలానికి అథర్టన్ సరసన కుక్ నిలిచాడు. తాజా టెస్టు మ్యాచ్ లో కుక్ డబుల్ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 491 పరుగులు చేసింది. ఆపై రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. వార్నర్(40 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్ (25 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. -
కుక్ సూపర్ ‘డబుల్’
మెల్బోర్న్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అద్భుతమైన ఆటతో యాషెస్ సిరీస్‌లో తమ జట్టును మొదటిసారి ముందంజలో నిలిపాడు. పలు రికార్డులు తిరగరాస్తూ మూడో రోజు మొత్తం క్రీజ్‌లో నిలిచిన కుక్ (409 బంతుల్లో 244 బ్యాటింగ్; 27 ఫోర్లు) భారీ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఫలితంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే 164 పరుగుల ఆధిక్యం సాధించింది. గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 491 పరుగులు చేసింది. కుక్‌తో పాటు అండర్సన్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్, లయన్, కమిన్స్ తలా 3 వికెట్లు తీశారు. ఓవర్‌నైట్ స్కోరు 192/2తో ఇంగ్లండ్ బ్యాటింగ్ కొనసాగించిన అనంతరం కొద్ది సేపటికే కెప్టెన్ రూట్ (61) అవుటయ్యాడు. అయితే ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్ తలా కొద్ది సేపు కుక్కు అండగా నిలవడంతో అతను డబుల్ సెంచరీ వైపు దూసుకుపోయాడు. 153 పరుగుల వద్ద స్క్వేర్‌లెగ్‌లో కష్టసాధ్యమైన క్యాచ్‌ను స్మిత్ వదిలేయడం కూడా కుక్కు కలిసొచ్చింది. ఎట్టకేలకు బర్డ్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ బౌండరీ బాది 360వ బంతికి కుక్ టెస్టుల్లో ఐదో డబుల్ సెంచరీని అందుకున్నాడు. మరో వైపు స్టువర్ట్ బ్రాడ్ (63 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) తమ మాజీ కెప్టెన్‌కు చక్కటి సహకారం అందించాడు. దూకుడుగా ఆడిన బ్రాడ్...పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 26 ఏళ్ల తర్వాత అర్ధసెంచరీ సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించారు. ►6 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుక్ (11,956) ఆరో స్థానానికి చేరుకున్నాడు. మూడో రోజు ఆటలో అతను చందర్‌పాల్ (11,867), బ్రియాన్ లారా (11,953)లను అధిగమించాడు. -
నువ్వే నా ఫేవరెట్ ప్లేయర్: స్టోక్స్
మెల్బోర్న్:యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కుక్ ఆటపై సహచర ఆటగాడు బెన్ స్టోక్స్ స్పందించాడు. 'నువ్వే నా ఫేవరేట్ ప్లేయర్' అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. ఒక వ్యక్తిపై దాడి కేసులో విచారణ కారణంగా యాషెస్‌కు దూరమైన స్టోక్స్.. యాషెస్ నాల్గో టెస్టులో ఇంగ్లండ్ ప్రదర్శనను కొనియాడాడు. ప్రధానంగా కుక్ ఆటను కొనియాడిన స్టోక్స్.. అతనే తన ఫేవరేట్ ఆటగాడని మనసులో మాటను వెల్లడించాడు. 104 ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కుక్ మరో వంద పరుగులు సాధించి తన కెరీర్లో ఐదో ద్విశతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 491 పరుగులు చేసింది. ఆట ముగిసేసమయానికి కుక్(244 బ్యాటింగ్;409 బంతుల్లో 27 ఫోర్లు), అండర్సన్(0 బ్యాటింగ్) క్రీజలో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 164 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
ఐదో డబుల్ సెంచరీ..!
మెల్బోర్న్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీతో సత్తాచాటాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఆసీస్‌తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుక్ ద్విశతకం నమోదు చేశాడు. ఫలితంగా తన టెస్టు కెరీర్లో ఐదో డబుల్ సెంచరీ సాధించి ద్రావిడ్, గ్రేమ్ స్మిత్‌ల సరసన నిలిచాడు. 361 బంతుల్లో 23 ఫోర్లతో కుక్ డబుల్ సెంచరీ మార్కును చేరాడు. 104 వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు గురువారం ఆటను ప్రారంభించిన కుక్ కుదురుగా బ్యాటింగ్ చేశాడు. ఒకవైపు ఇంగ్లండ్ వికెట్లు పడుతున్నప్పటికీ కుక్ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడాడు. ఫోర్ కొట్టి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్న కుక్ తన జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కుక్ డబుల్ సెంచరీ సాధించిన తరువాత అత్యధిక సార్లు ఈ ఫీట్‌ను సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్, ద్రావిడ్‌ల సరసన కుక్ నిలిచాడు. ఇదిలా ఉంచితే, అత్యధిక టెస్టు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో బ్రాడ్‌మన్(12సార్లు), తొలి స్థానంలో ఉండగా, సంగక్కరా(11సార్లు) రెండో స్థానంలో , బ్రియాన్ లారా(9) మూడో స్థానంలో, జయవర్థనే (7) నాల్గో స్థానంలో ఉన్నారు. -
సచిన్, లారాల సరసన కుక్
మెల్బోర్న్: గత పది ఇన్నింగ్స్‌ల్లో అర్థ శతకం కూడా నమోదు చేయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో కుక్ భారీ శతకం సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కుక్ 150 వ్యక్తిగత పరుగుల మార్కును చేరిన తరువాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాల సరసన నిలిచాడు. ఒక పర్యాటక ఆటగాడిగా 150కి పైగా పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన జాబితాలో సచిన్, లారా, జాక్ హోబ్స్ల చెంతన కుక్ స్థానం సంపాదించాడు. ఈ జాబితాలో సచిన్, లారాలు మూడేసి సార్లు ఆ ఘనత సాధించి రెండో స్థానంలో ఉండగా, ఇప్పుడు వారి సరసన కుక్ చేరిపోయాడు. ఇక్కడ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు వాల్టర్ హమ్మాండ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఒక పర్యాటక ఆటగాడిగా వాల్టర్ అత్యధికంగా నాలుగు సార్లు 150కి పైగా పరుగుల్ని నమోదు చేశాడు. మరొకవైపు టెస్టు కెరీర్లో 32వ సెంచరీని ఖాతాలో వేసుకున్న కుక్.. అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా సరసన నిలిచాడు. -
ఇంగ్లండ్ దీటైన జవాబు
మెల్బోర్న్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు తొలిసారి మెరుగైన ప్రదర్శన చేసింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ నాలుగో టెస్టు రెండో రోజు సమష్టిగా రాణించింది. తొలుత బౌలర్లు రాణించి ఆస్ట్రేలియాను 327 పరుగులకు కట్టడి చేయగా... అనంతరం సీనియర్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్ (166 బంతుల్లో 104 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 192 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. గత పది ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయని కుక్ ఈ టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. టెస్టు కెరీర్లో అతనికిది 32వ సెంచరీ. స్టోన్‌మన్ (15), విన్స్ (17)లు తక్కువ స్కోరుకే అవుటవడంతో 80 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను కెప్టెన్ రూట్ (49 బ్యాటింగ్)తో కలిసి కుక్ ఆదుకున్నాడు. సాధికారికంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ అభేద్యమైన మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 135 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 244/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు బెంబేలెత్తించారు. పేసర్లు బ్రాడ్ (4/51), అండర్సన్ (3/61)ల ధాటికి ఆ జట్టు 67 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయి 327 పరుగులకు పరిమితమైంది. స్మిత్ (76; 8 ఫోర్లు)తో పాటు షాన్ మార్‡్ష (61; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో సాధించాడు. ►7 అత్యధిక సెంచరీల జాబితాలో స్టీవ్ వా (32)తో సమంగా అలిస్టర్ కుక్ ఏడో స్థానంలో నిలిచాడు. ►8 అత్యధిక పరుగుల జాబితాలో మహేల జయవర్ధనే (11814)ను దాటి కుక్ (11816) ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. -
సచిన్ సరసన అలెస్టర్ కుక్
పెర్త్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకూ జరిగిన మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు అలెస్టర్ కుక్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీని కూడా నమోదు చేయని కుక్.. ఇంగ్లండ్ దారుణమైన పరాజయాలు చెందడంలో భాగమయ్యాడు. కాగా, పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చెందడంతో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల్లో అత్యధిక పరాజయాలు చవి చూసిన ఆటగాళ్ల జాబితాలో కుక్ చేరిపోయాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద కుక్కు ఇది 14వ ఓటమి. తద్వారా సచిన్ రికార్డును కుక్ సమం చేశాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ఆస్ట్రేలియాలో అత్యధికంగా 14 పరాజయాల్లో భాగమయ్యాడు. అంతకుముందు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జాక్ హోబ్స్లు ఆస్ట్రేలియాలో 14 టెస్టు ఓటములు చవిచూసిన ఆటగాడు. తాజాగా కుక్ వారిద్దరి సరసన చేరిపోయాడు. ఒకప్పుడు సచిన్ అత్యధిక టెస్టు రికార్డుల్ని బ్రేక్ చేసేలా కనిపించిన కుక్ తర్వాత వెనుకబడి పడిపోయాడు. తొలి వంద టెస్టుల్లో 25 సెంచరీలు చేసిన కుక్. ఆపై తర్వాత ఆడిన 50 టెస్టుల్లో కేవలం 6 శతకాలు మాత్రమే సాధించాడు. ఈ యాషెస్‌లో కుక్ సగటు 14 మాత్రమే. ఏ సిరీస్ పరంగా చూసినా అతడికి ఇదే అత్యల్పం కావడం గమనార్హం. మరొకవైపు పెర్త్‌లో జరిగిన మ్యాచ్ కుక్ కు 150వ టెస్టు మ్యాచ్. యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ 0-3తేడాతో ఆసీస్‌కు సమర్పించుకుంది. వరుసగా మూడు టెస్టుల్లో ఓడి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది. -
అక్కడ అలెస్టర్ కుక్ లేకపోతే..!
లండన్: అలెస్టర్ కుక్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇంగ్లండ్ క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు అతని సొంతం.ప్రత్యేకంగా స్లిప్ క్యాచ్‌లను అందుకోవడంలో కుక్ దిట్టనే చెప్పొచ్చు. అయితే తాజాగా అలెస్టర్ కుక్ మరోసారి తన మెరుగు ఫీల్డింగ్ తో తానేమిటో నిరూపించుకున్నాడు. నమ్మశక్యం కాని రీతిలో కుక్ పట్టిన క్యాచ్ అతని పాత రోజుల్ని గుర్తు చేసింది. అది కూడా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తుండగా రయ్ మంటూ దూసుకొచ్చిన బంతిని కుక్ అద్భుతంగా అందుకోవడం ఇక్కడ విశేషం. ఇటీవల కౌంటీ క్రికెట్ లో భాగంగా ఇంగ్లండ్‌లోని ఒక స్థానిక గ్రౌండ్లో ఎసెక్స్ బ్యాట్స్‌మన్ అయిన కుక్ ను ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అదే సమయంలో పక్కనే ప్రాక్టీస్ చేస్తున్న యువకుడు బంతిని హిట్ చేశాడు. ఆ బంతి ఇంటర్య్వూ చేస్తున్న వ్యక్తిపై దూసుకొచ్చింది. దీనికి అంతే వేగంగా స్పందించిన కుక్..ఆ బంతిని చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నాడు. బంతిని హిట్ చేసిన వ్యక్తి అరవడంతో కుక్ వేగంగా స్పందించి క్యాచ్ ను అందుకున్నాడు. ఒకవేళ అక్కడ కుక్ లేకపోయి ఉంటే ఇంటర్య్వూ చేసే వ్యక్తికి ఆ బంతి బలంగా తాకేది. ఈ ఘటనకు సంబంధించి కుక్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతని ప్రాణాన్ని కుక్ కాపాడంటూ పలువురు నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. -
అక్కడ అలెస్టర్ కుక్ లేకపోతే..!
-
కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించా.. కానీ!
లండన్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తొలిసారిగా అలిస్టెర్ కుక్ ఆసక్తికర విషయాలపై నోరువిప్పాడు. తన నాయకత్వ లక్షణాలపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మేనేజ్మెంట్ సందేహాలు వ్యక్తం చేయడంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఈ ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్‌తో ఘనంగా కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని భావించాడు కుక్. 59 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ 32 ఏళ్ల వెటరన్ మాట్లాడుతూ.. '2016లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను డ్రా చేసుకోవడంతో నా నాయకత్వంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆపై బంగ్లాదేశ్ చేతిలో తొలిసారిగా ఇంగ్లండ్ జట్టు ఓటమి పాలవడం, ఆ వెంటనే ఐదు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0తో దారుణ మూటకట్టుకోవడం నన్ను అసహనానికి గురిచేశాయి' అని పేర్కొన్నాడు. 'సొంతగడ్డపై 2013, 2015లలో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను అందించాను. ఆపై అదే జోరుతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో ఘనవిజయాలు సాధించినా ప్రస్తుతం బోర్డు నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. గతేడాది పాక్‌తో సిరీస్ డ్రా చేసుకోవడం ఎంతగానో బాధించింది. జట్టు సమష్టిగా వైఫల్యం చెందినా ఫలితం నేను అనుభవించాల్సి వచ్చింది. రెండు యాషెస్ సిరీస్‌లు అందించాను. మరో సిరీస్ వరకు కెప్టెన్ విజయాన్ని అందించాలని భావించాను. ఈసీబీ తనపై నమ్మకం కోల్పోవడంతో కీలక నిర్ణయాన్ని తీసుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. 2012 ఆగస్టులో పగ్గాలు చేపట్టిన కుక్ వరుస పరాభవాలతో ఈ ఫిబ్రవరిలో అవమానాల మధ్య కెప్టెన్సీని వదులుకున్నాడు. ఇటీవలి టెస్టు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని కుక్ చెన్నైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే కెప్టెన్‌గా కుక్కు భారత్ సిరీసే చివరిదిగి నిలిచిపోయింది. 2010-14 మధ్య కాలంలో 69 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు కుక్. కుక్ వైదొలిగాక మిడిలార్డర్ ప్లేయర్ జో రూట్ కెప్టెన్ అయ్యాడు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
అలెస్టర్ కుక్ సెంచరీ
టాంటాన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తరువాత ఆడిన తొలి మ్యాచ్ లో అలెస్టర్ కుక్ మెరిశాడు. కౌంటీ మ్యాచ్ ల్లో భాగంగా ఎసెక్స్ తరపున బరిలోకి దిగిన కుక్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సోమర్సెట్ తో ఆదివారం ముగిసిన మ్యాచ్ లో కుక్ శతకం నమోదు చేశాడు. ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్ లో అర్ధ శతకం సాధించిన కుక్.. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. సోమర్ సెట్ విసిరిన 255 పరుగుల లక్ష్యాన్ని ఎసెక్స్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుక్ (110;214 బంతుల్లో 16 ఫోర్లు),బ్రౌనీ(39; 113 బంతుల్లో 4 ఫోర్లు), వెస్ట్లీ(86 నాటౌట్;146 బంతుల్లో 15 ఫోర్లు,1సిక్స్) లు జట్టు విజయంలో పాలుపంచుకున్నారు. -
కెప్టెన్సీకి కుక్ బైబై
లండన్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ అలిస్టెర్ కుక్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రికార్డు స్థాయిలో ఇంగ్లండ్ జట్టుకు 59 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ 32 ఏళ్ల వెటరన్ స్టార్ మాట్లాడుతూ ‘ఇది నాకు బాధకలిగించే రోజే కానీ... జట్టుకోసం సరైన నిర్ణయమే తీసుకున్నాను’ అని వెల్లడించాడు. సారథ్యానికి రాజీనామా చేసినా... ఆటగాడిగా కెరీర్‌ను కొనసాగిస్తానన్నాడు. తన రాజీనామాను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్‌కు ఆదివారమే అందజేశాడు. ‘ఇంగ్లండ్‌కు సారథ్యం వహించడం నాకు లభించిన గొప్ప గౌరవం. ఐదేళ్లపాటు కెప్టెన్‌గా కొనసాగాను. ఇపుడు బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం కఠినమైనప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం సరైన సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని కుక్ అన్నాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుక్ రికార్డులకెక్కాడు. 140 మ్యాచ్‌లాడిన కుక్ 11,057 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 53 అర్ధసెంచరీలున్నాయి. కుక్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. సొంతగడ్డపై 2013, 2015లలో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదేజోరుతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో ఘనవిజయం సాధించింది. 2012లో ‘విజ్డెన్ క్రికెట్ అఫ్ ద ఇయర్’గా ఎంపికైన అతను ఆ మరుసటి ఏడాదే (2013) ఐసీసీ ప్రపంచ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. -
ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం
క్రికెటర్ అలిస్టర్ కుక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టుగానే ఇంగ్లండ్ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి ఆయన బుధవారం వైదొలిగాడు. టెస్టు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం నేపథ్యంలో కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు కుక్ భారత్ పర్యటనలో ఉండగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కుక్ 59 టెస్టులకు నాయకత్వం వహించాడు. 2012లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా నియామకమైన కుక్.. ఆ జట్టుకు అత్యధిక టెస్టుల్లో నాయకత్వం వహించిన సారథిగా రికార్డు నెలకొల్పాడు. తన సారథ్యంలో 2013లో, 2015లో ఆస్ట్రేలియాపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను గెలుపొందాడు. ఇండియా, దక్షిణాఫ్రికాలోనూ ఇంగ్లండ్‌కు సిరీస్ విజయాలు అందించాడు. 2010-2014 మధ్యకాలంలో 69 వన్డేలకు కూడా కుక్ సారథిగా వ్యవహరించాడు. (చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు) ఇటీవలి టెస్టు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని కుక్ చెన్నైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే కెప్టెన్‌గా కుక్కు భారత్ సిరీసే చివరిదిగి నిలిచిపోయింది. -
ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
కెప్టెన్‌గా కొనసాగబోనంటూ సంకేతాలు తమ బౌలర్ల కన్నా అశ్విన్, జడేజా బాగా ఆడారని కితాబు టెస్టు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం ఎదురుకావడంతో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ ఒకింత నిర్వేదంగా స్పందించాడు. ఈ ఘోర ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ఐదో టెస్టులో 88 ఓవర్లలో కేవలం 207 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టు పేకమేడలా కుప్పకూలిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 400కుపైగా పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 103 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా నిలకడగా ఆడింది. కానీ రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్‌తో 48 పరుగులకు ఏడు వికెట్లు తీసుకోవడంతో ఇంగ్లండ్ సైకిల్ స్టాండ్‌లా కుప్పకూలింది. భారత పర్యటనలో ఇంగ్లండ్‌కు ఇది వరుసగా రెండో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి. ఈ ఓటమితో కంగుతిన్న కెప్టెన్ కుక్.. తాను ఇంటికి వెళ్లి కొంత సమయం తీసుకొని కెప్టెన్‌గా కొనసాగేది లేనిది నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు. అదే సమయంలో భారత బౌలర్లు అశ్విన్, జడేజాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్ బౌలర్ల కన్నా వారు అద్భుతంగా రాణించారని కితాబిచ్చాడు. అయితే, తమ జట్టు బౌలర్లు మొయిన్, ఆదిల్, జఫర్లను కించపరిచే ఉద్దేశం తన వ్యాఖ్యల వెనుక లేదని వివరణ ఇచ్చాడు. -
అలెస్టర్ కుక్ మరో రికార్డు
చెన్నై: ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా భారత్‌తో ఇక్కడ జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో కుక్ 11వేల పరుగుల మార్కును చేరాడు. తద్వారా ఈ ఫార్మాట్లో తక్కువ సమయంలో పదకొండు వేలు పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ పరుగుల్ని కుక్ 10 సంవత్సరాల 290 రోజుల్లోనే సాధించి రికార్డు సృష్టించాడు. అంతకుముందు టెస్టు ఫార్మాట్లో పదకొండు వేల పరుగుల మైలురాయిని ఇంత తక్కువ సమయంలో చేరుకున్న ఆటగాడు లేడు. ఈ మ్యాచ్ కు ముందు 10,998 పరుగులతో ఉన్న కుక్.. ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు పరుగులు చేయడం ద్వారా పదకొండ వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. అయితే ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 10 పరుగులు చేసి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. కుక్ 140 మ్యాచ్‌ల్లో 252 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనతను సాధించాడు. ఇందులో 30 శతకాలు, 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది మేలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫాస్టెస్ట్ పదివేల పరుగుల రికార్డును కుక్ అధిగమించిన సంగతి తెలిసిందే. పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు కాగా, కుక్ 31 ఏళ్ల 4 నెలల వయసులోనే ఆ మార్కును చేరాడు. కాగా, పదకొండ వేల పరుగులను చేరుకునే క్రమంలో సచిన్ కు 223 ఇన్నింగ్స్ లు మాత్రమే అవసరమయ్యాయి. కాకపోతే సచిన్ ఈ మార్కును చేరడానికి దాదాపు 18 ఏళ్లు పట్టింది. -
కెప్టెన్‌గా జో రూట్?
ముంబై:ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ క్రికెట్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఘనతను సొంతం చేసుకున్న అలెస్టర్ కుక్.. తాను సారథిగా ఉండేది ఇక అతి తక్కువ మ్యాచ్‌లనే సంకేతాలిచ్చాడు. భారత్ తో జరిగిన నాల్గో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైన తరువాత కుక్ తన మనసులోని మాటను మరోసారి వెల్లడించాడు. దాదాపు భారత్ తో చెన్నైలో జరిగే ఐదో టెస్టు మ్యాచే తనకు కెప్టెన్‌గా చివరదనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. దానిలో భాగంగానే సహచర స్టార్ ఆటగాడు జో రూట్‌ను కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలంటూ పేర్కొన్నాడు. తమ భవిష్య కెప్టెన్ రూట్ అంటూ కుక్ పేర్కొన్నాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన రూట్.. ప్రతీ ఒక్కరికీ అత్యంత గౌరవం ఇచ్చే ఆటగాడని కొనియాడాడు. తాను మ్యాచ్ గెలిచినా, ఓడినా ముందుగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడతానన్నాడు. అయితే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ తో చర్చించిన తరువాత తుది నిర్ణయాన్ని తెలుపుతానన్నాడు. 2012లో ఇంగ్లండ్ జట్టుకు కుక్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అదే ఏడాది భారత్ తో జరిగిన టెస్టు సిరీస్ ను ఇంగ్లండ్ 2-1 తో గెలుచుకుంది. ఇప్పటివరకూ కుక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 24 టెస్టులను గెలిచింది. అదే క్రమంలో రెండు యాషెస్ సిరీస్‌లను కూడా ఇంగ్లండ్ జట్టు కుక్ సారథ్యంలో సొంతం చేసుకుంది. 2006లో భారత్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ టెస్టు కెరీర్‌ను ఆరంభించిన కుక్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ 135 టెస్టులు ఆడిన కుక్.. 10, 688 పరుగులను సాధించి ఈ ఫార్మాట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. దాంతో పాటు అత్యంత వేగంగా ఎనిమిది వేల టెస్టు పరుగులను, పది వేల పరుగులను నమోదు చేసిన ఘనతను కుక్ సొంతం చేసుకున్నాడు. తద్వారా భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కుక్ అధిగమించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల ద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (135) ఆడిన ఆటగాడిగా అలెక్ స్టివార్ట్ (133 మ్యాచ్‌లు) రికార్డును కుక్ అధిగమించాడు. -
అలెస్టర్ కుక్ అరుదైన ఘనత
ముంబై:భారత్‌తో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్‌పై టెస్టుల్లో రెండువేల పరుగులకు పైగా సాధించిన విదేశీ క్రికెటర్ల జాబితాలో కుక్ స్థానం సంపాదించాడు. ఇప్పటివరకూ ఐదుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే భారత్‌పై రెండు వేలు, అంతకు పైగా పరుగులు సాధించగా, కుక్ ఆరో స్థానంలో నిలిచాడు. అయితే టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(2555)తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కుక్(46) కొద్దిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇదిలా ఉండగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది. కీనట్ జెన్నింగ్స్ హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో అరంగేట్రం మ్యాచ్‌లోనే తొలి హాఫ్ సాధించి ఇంగ్లండ్ సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. మరొకవైపు తాజా మ్యాచ్‌తో ఈ ఏడాది ఆరుగురు ఓపెనింగ్ జంటలను ఇంగ్లండ్ పరీక్షించింది. ఇలా చేయడం 1995 తరువాత ఇంగ్లండ్‌కు ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా, 2015లో ఐదుగురు ఓపెనింగ్ జంటలను ఇంగ్లండ్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. -
నన్ను క్రికెట్ కెప్టెన్‌గా చేసినా..
ముంబై:భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ తరువాత ఇంగ్లండ్ కెప్టెన్ బాధ్యతల నుంచి అలెస్టర్ కుక్ తప్పుకుంటాడంటూ వస్తున్న రూమర్లను సహచర ఆటగాడు జో రూట్ ఖండించాడు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తాజాగా స్పష్టం చేశాడు. ఇంకా చాలాకాలం వరకూ కుక్ తమ సారథిగా ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇంగ్లండ్ జట్టులో కుక్కు ప్రత్యేక స్థానం ఉందనే విషయాన్ని గ్రహించాలని హితవు పలికాడు.తమ జట్టు కెప్టెన్‌గా కొనసాగే అన్ని అర్హతలూ అతనొక్కడికే సొంతమని ప్రశంసల వర్షం కురిపించాడు. 'అతనొక అద్భుతమైన నాయకుడు. అతని సారథ్యంలో ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తాను. మీరేమో కుక్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు నాకు ఇస్తాన్నారంటూ రూమర్లు పుట్టిస్తున్నారు. నన్ను బలవంతంగా మీరు కెప్టెన్ ను చేసినా, కుక్ కు వచ్చే ఇబ్బందేమీ లేదు. నాయకుడు అనే అదనపు భారం అతనిపై తగ్గి మరింత స్వేచ్ఛగా ఆడే వీలును కుక్కు కల్పించిన వారవుతారు' అని రూట్ చమత్కరించాడు. తాను ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ కావడానికి చాలా సమయం ఉన్నదనే వాస్తవాన్ని గ్రహించాలన్నాడు. ప్రస్తుత తన బాధ్యతతో చాలా సంతృప్తిగా ఉన్నానని రూట్ తెలిపాడు. నిజాయితీగా చెప్పాలంటే తమకు సరైన నాయకుడు కుక్ అంటూ పొగడ్తలు కురిపించాడు. అనవసరంగా కుక్ ప్రతిభను తక్కువ చేసి చూపొద్దంటూ మీడియాకు సూచించాడు. -
జయహో జయంత్
రెండు టెస్టుల్లో సత్తా చాటిన ఆల్‌రౌండర్ దేశవాళీలోనూ ఘనమైన రికార్డు జట్టులో రెగ్యులర్‌గా మారే అవకాశం సరిగ్గా నాలుగేళ్ల క్రితం తన ఫస్ట్‌క్లాస్ కెరీర్ ఐదో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎలెవన్‌తో తలపడి అలిస్టర్ కుక్ వికెట్ తీసినప్పుడు అతనికి తెలీదు... నాలుగేళ్ల తర్వాత అదే కుక్ సారథ్యంలోని జట్టును తన స్పిన్‌తో దెబ్బ తీస్తానని. మూడేళ్ల క్రితం ప్రత్యేక శిక్షణలో భాగంగా చెన్నైకి వెళ్లి అశ్విన్ ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంటూ రెండు వారాల ట్రైనింగ్ సెషన్లో ప్రాక్టీస్ చేసినప్పుడు అతనికి తెలీదు... మూడేళ్ల తర్వాత అదే అశ్విన్‌తో కలిసి తాను అద్భుతం చేస్తానని. అనూహ్యంగా లభించిన అవకాశాన్ని రెండు చేతులా అంది పుచ్చుకున్న 26 ఏళ్ల జయంత్ యాదవ్ ఇప్పుడు జట్టులోంచి తనను తప్పించలేని పరిస్థితిని సృష్టించాడు. విశాఖపట్నంలో ఆడిన తొలి టెస్టులో 4 వికెట్లు తీయడంతో పాటు జయంత్ చేసిన 35, 27 నాటౌట్ స్కోర్లు అతనికి బ్యాటింగ్ వచ్చనే అభిప్రాయాన్ని జట్టు మేనేజ్మెంట్లో కలిగిస్తే, మొహాలీలో మరో 4 వికెట్లతో పాటు కీలక సమయంలో చేసిన అర్ధసెంచరీ ఆ నమ్మకాన్ని పెంచింది. ముఖ్యంగా ఈ రెండు టెస్టులలో కీలక సమయాల్లో స్టోక్స్, రూట్, బెరుుర్స్టోలాంటి బ్యాట్స్‌మెన్ వికెట్లు తీయడంతో అతను మన వరుస విజయాల నంబర్‌వన్ టీమ్‌లో ప్రధాన భాగంగా మారిపోయాడు. మొహాలీ టెస్టులో అచ్చమైన టెస్టు బ్యాట్స్‌మన్‌లా ఒక్కో బంతిని సమర్థంగా ఎదుర్కొంటూ సాధికారికంగా ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అందుకే కాబోలు తొలి టెస్టు తర్వాత విరాట్ ‘అమూల్యమైన’ ఆటగా జయంత్ ప్రదర్శనను ప్రస్తుతించాడు. లెగ్‌స్పిన్ నుంచి ఆఫ్‌స్పిన్ వైపు విశాఖపట్నంలో జయంత్ తన తొలి వన్డే ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఆటగాళ్లంతా తమ తల్లుల పేర్లను జెర్సీలపై ధరించారు. అతడికి ఇచ్చిన జెర్సీపై తల్లి పేరు లక్ష్మీ అని రాసి ఉంది. నిజానికి అతని తల్లి 17 ఏళ్ల క్రితమే చనిపోరుుంది. తనను ఈ స్థారుుకి తీసుకు వచ్చింది తన ‘రెండో అమ్మ’ జ్యోతి యాదవ్ అని చెప్పుకున్న జయంత్... పొరపాటున ఆమె పేరు రాయలేదని, కానీ తన గుండెల్లో ఉంటావంటూ కెమెరా ముందు మాట్లాడిన తీరు అందరినీ కదిలించింది. సాధారణ నేపథ్యం ఉన్న చాలా మంది కుర్రాళ్లలాగే జయంత్ కూడా చిన్నప్పుడు గల్లీల్లోనే క్రికెట్‌ను ఆరంభించాడు. అక్కడ అతను లెగ్‌స్పిన్ వేసేవాడు. అరుుతే అతనికంటే పెద్దవారైన ఇద్దరు కజిన్స కూడా లెగ్ స్పిన్నర్లే. దాంతో వారు అతడిని పిలిచి ఇలా కాదు, ఒకే ఇంట్లో ముగ్గురు లెగ్‌స్పిన్నర్లు కుదరదు, నువ్వు మారాల్సిందే అంటూ తేల్చేశారు. దాంతో తాను అప్పుడు ఆఫ్‌స్పిన్‌ను ఎంచుకున్నట్లు జయంత్ చెప్పాడు. హరియాణా జట్టు తరఫున వివిధ వయో విభాగాల స్థారుులో రాణిస్తూ నెమ్మదిగా అతను పైకి ఎదిగాడు. ఇదే క్రమంలో తన బ్యాటింగ్‌ను కూడా మెరుగుపర్చుకుంటూ వచ్చాడు. రంజీల్లో నిలకడ 21 ఏళ్ల వయసులో గుజరాత్‌పై తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన జయంత్ ఆరు వికెట్లు తీసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అరుుతే ఆ తర్వాత మిగిలిన సీజన్ మొత్తం విఫలమయ్యాడు. కానీ తర్వాతి ఏడాది జయంత్ బ్యాటింగ్ పదును క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ (211)తో చెలరేగిన అతను... అమిత్ మిశ్రాతో కలిసి ఎనిమిదో వికెట్‌కు రికార్డు స్థారుులో 392 పరుగులు జోడించాడు. 2014-15 సీజన్లో 33 వికెట్లతో ఆకట్టుకున్న అతను తర్వాతి ఏడాది ఒక మ్యాచ్‌లో సౌరాష్ట్రపై 13 వికెట్లు తీయడంతో భారత ‘ఎ’ జట్టులో స్థానం లభించింది. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ఎంపికై నా పెద్దగా మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. కానీ దేశవాళీ క్రికెట్లో గత ఏడాది కూడా అద్భుత ప్రదర్శనతో జయంత్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆకట్టుకునే ఆరంభం జయంత్ ముందుగా జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ లెగ్‌స్పిన్నర్ చహల్‌పై కెప్టెన్ ధోని నమ్మకం ఉంచడంతో అతనికి మ్యాచ్ అవకాశం దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ‘ఎ’తో రెండు మ్యాచ్‌లలో 7 వికెట్లు తీయడం, ఇరానీ కప్ మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టడంతో కివీస్‌తో టెస్టు సిరీస్ కోసం చోటు దక్కింది. చివరకు విశాఖలో వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జయంత్, ఆ తర్వాత రెండు టెస్టుల్లోనూ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. తన హరియాణా సీనియర్ అమిత్ మిశ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన జయంత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటంలో సఫలమయ్యాడు. అతను స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న తీరు, పేసర్లు వేసిన షార్ట్ పిచ్ బంతులను చక్కగా అంచనా వేసిన విధానం బ్యాట్స్‌మన్‌గా అతనికి మంచి మార్కులు వేశారుు. అశ్విన్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు జోడించడం జట్టుకు కలిసొచ్చింది. ‘అతని ఆట చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. సానుకూల దృక్పథంతో జయంత్ బ్యాటింగ్ చేశాడు. దాంతో మా భాగస్వామ్యం మరింత బాగా కొనసాగింది’ అని అశ్విన్ ఆ ఇన్నింగ్స గురించి వ్యాఖ్యానించాడు. మొరుున్ అలీని తొలి వికెట్‌గా సాధించడంలో డీఆర్ఎస్ను కచ్చితత్వంతో వినియోగించిన తీరు, హమీద్ రనౌట్ కూడా జయంత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టారుు. ఇక మూడో టెస్టులోనైతే అతని బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ టెస్టులో రూట్, బెరుుర్స్టోల వికెట్లు తీసిన బంతులు జయంత్ ప్రతిభకు మచ్చుతునకలు. జోరు కొనసాగిస్తాడా..? రాజ్‌కోట్‌లో డ్రా తర్వాత వైజాగ్‌లో మిశ్రాను కాదని కోహ్లి... జయంత్‌ను ఎంచుకోవడంపై విమర్శలు వచ్చారుు. అందరినీ ఈ నిర్ణయం ఆశ్చర్యపరచింది. ప్రత్యర్థి జట్టులో ఏడుగురు ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్ ఉండటంతో రెండో ఆఫ్‌స్పిన్నర్‌ను కోహ్లి ఎంచుకున్నాడు. అక్కడి ప్రదర్శన అతనికి మరో అవకాశం ఇప్పించింది. ప్రతీసారి ఇదీ సాధ్యమేనా అంటే సందేహమే అనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ అశ్విన్ జట్టులో ఉన్నాడు. అతను ఉండగా సాధారణంగా మరో ఆఫ్స్పిన్నర్కు అవకాశమే ఉండదు. ఇటీవల అశ్విన్ పూర్తి స్థారుు బ్యాట్స్‌మన్‌గా కనిపిస్తున్నాడు. అన్నింటికి మించి జయంత్ శైలి అచ్చుగుద్దినట్లు అశ్విన్‌నే పోలి ఉంటుంది. కాబట్టి మున్ముందు జయంత్‌ను ఈ సమీకరణం ఇబ్బంది పెట్టవచ్చు. ఆడిన ఒకే ఒక వన్డేలో అతని పూర్తి సామర్థ్యం బయటపడలేదు. కాబట్టి తాజా ప్రదర్శన ఒక్కటే జయంత్‌కు భవిష్యత్తుపై భరోసా ఇవ్వలేదు. అరుుతే ఏ ఆటగాడైనా తనకు దక్కిన అవకాశాలను పూర్తి స్థారుులో సద్వినియోగం చేసుకోవడమే అతని చేతుల్లో ఉంటుంది. ఈ విషయంలో మాత్రం జయంత్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. కాబట్టి అతను ఇక ముందు తన సత్తాను చాటాలని, మరింత పట్టుదలతో రాణించాలని ఆశిద్దాం. -సాక్షి క్రీడా విభాగం -
కొత్త వ్యూహంతో బరిలోకి దిగుతాం: కుక్
మొహాలి: తొలి టెస్టులో సాధారణ ప్రదర్శనతో వెనుకంజ వేసినట్లు కనిపించిన టీమిండియా రెండో టెస్టు, మూడో టెస్టులో మాత్రం ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్‌లోనూ రాణించి 8 వికెట్ల తేడాతో మూడో టెస్టులో విరాట్ కోహ్లీ సేన విజయాన్ని సాధించింది. ఈ టెస్ట్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ స్పందించాడు. తమ బ్యాట్స్‌మన్ పిచ్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని చెప్పాడు. తమ ఓటమికి ఇది కూడా ఓ కారణమని అభిప్రాయపడ్డాడు. తర్వాతి టెస్టులో భారత్‌కు ముకుతాడు వేయాలంటే ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగుతామన్నాడు. సీనియర్ స్పిన్నర్ గరెత్ బ్యాటీ వికెట్లు తీయకపోవడంతో పాటు అసలు భారత బ్యాట్స్మన్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదని కుక్ చెప్పాడు. ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌తో బెన్ స్టోక్స్ రాణించడం ఒక్కటే తమకు ప్లస్ పాయింట్ అన్నాడు. లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఈ టెస్టులో ఐదు వికెట్లతో రాణించాడు. ఇదే స్టేడియంలో గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 20 వికెట్లకుగానూ 19 వికెట్లు స్పిన్నర్లే తీసి భారత విజయంలో కీలక పోషించారని అలెస్టర్ కుక్ గుర్తుచేశాడు. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల వ్యూహంతో ఇప్పటివరకూ ఆడాం.. కానీ వచ్చే మ్యాచ్‌లో మరో స్పిన్నర్‌కు అవకాశం కల్పించి టీమిండియాను త్వరగా ఆలౌట్ చేస్తే తమకు విజయావకాశాలు ఉంటాయని మ్యాచ్ అనంతంరం ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ వివరించాడు. -
కూతుర్ని తనివితీరా చూడకుండానే...
విశాఖపట్నం: తన రెండో కుమార్తెతో అదృష్టం కలిసొచ్చిందని ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ భావిస్తున్నాడు. ఇటీవల జన్మించిన తన కుమార్తెను చూసి మురిసిపోయేందుకు సమయం చిక్కడం లేదని వాపోయాడు. తన కూతుర్ని చూసేందుకు అక్టోబర్ లో బంగ్లాదేశ్ టూర్ నుంచి కుక్ స్వదేశం చేరుకున్నాడు. అయితే 18 గంటలు మాత్రమే అతడు కుటుంబంతో గడిపాడు. తన ముద్దుల కూతుర్ని తనివితీరా చూడకముందే భారత్ కు పయనమయ్యాడు. టీమిండియాతో రాజ్ కోట్ లో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. దీంతో భారత్ లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టెస్టుల్లో 30 సెంచరీలు చేసి తన రికార్డు మెరుగుపరుచుకున్నాడు. ‘కేవలం 18 గంటల పాటు నా కుమార్తెను చూడడానికి సమయం చిక్కింది. ముద్దులొలికే పాపాయిని వదిలిరావడానికి చాలా కష్టపడ్డా. ఆమె పుట్టగానే అదృష్టం కలిసివచ్చి మరిన్ని పరుగులు సాధించాన’ని కుక్ చెప్పాడు. అయితే తనను బ్రాడ్‌మన్ తో పోల్చవద్దని కోరాడు. విశాఖపట్నంలో గురువారం నుంచి టీమిండియాతో జరగనున్న రెండో టెస్టులోనూ రాణించేందుకు కుక్ సన్నద్దమవుతున్నాడు. -
అలెస్టర్ కుక్ 'సెంచరీ'ల రికార్డు!
రాజ్‌కోట్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. భారత్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కుక్ శతకం సాధించడం ద్వారా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. 194 బంతుల్లో 10 ఫోర్లు సాయంతో సెంచరీ మార్కును చేరిన కుక్.. భారత్ లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. కుక్ కు ఇది భారత్ లో ఐదో టెస్టు సెంచరీ. ఇంతవరకూ ఏ విదేశీ ఆటగాడు భారత్ లో నాలుగు శతకాలు మించి చేయలేదు. అంతకుముందు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్, దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లాలు భారత్ లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాళ్లు. ఇదిలా ఉండగా, 114/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ కు అలెస్టర్ కుక్-హమీద్‌లు అత్యంత నిలకడగా ఆడాడు. అయితే ఈ జోడీ 180 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం సాధించిన తరువాత హమీద్(82) వెనుదిరిగాడు. అమిత్ మిశ్రా బౌలింగ్ లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి హమీద్ అవుటయ్యాడు. ఆ తరువాత కాసేపటికి జో రూట్(4) రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.కాగా, క్రీజ్ లో కుదురుకున్న కుక్ మాత్రం అతని టెస్టు కెరీర్ లో 30 శతకం సాధించాడు. -
కెప్టెన్‌గా ఇదే చివరి సిరీసా?
రాజ్‌కోట్:భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌తో ఇంగ్లండ్ టెస్టు జట్టుకు అత్యధిక మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించిన ఘనతను సొంతం చేసుకోబోతున్న అలెస్టర్ కుక్..ఈ సిరీస్ తరువాత ఇంగ్లండ్ కెప్టెన్సీ పగ్గాలను వదిలి పెట్టబోతున్నాడా? అంటే అవుననే వినిపిస్తోంది. ఈ మేరకు అలెస్టర్ కుక్ తాజాగా చేసిన వ్యాఖ్యలే అందుకు బలాన్నిస్తున్నాయి. భారత్‌తో సిరీస్ తరువాత తాను కేవలం ఓపెనర్‌గానే జట్టులో కొనసాగుతాననే సంకేతాలను ఇచ్చాడు. తాను టెస్టు కెరీర్‌ను యాథావిధిగా కొనసాగించాలనుకుంటున్నానని, అదే సమయంలో ఓపెనర్‌గా తన ఆటను కొనసాగిస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ తన కెప్టెన్సీకి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలను కుక్ చేయలేదు. దాంతో భారత్ తో సిరీస్ అతనికి కెప్టెన్ గా చివరి సిరీస్ కావొచ్చని భావిస్తున్నారు. 2012లో ఇంగ్లండ్ జట్టుకు కుక్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అదే ఏడాది భారత్ తో జరిగిన టెస్టు సిరీస్ ను ఇంగ్లండ్ 2-1 తో గెలుచుకుంది. ఇప్పటివరకూ కుక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 24 టెస్టులను గెలిచింది. అదే క్రమంలో రెండు యాషెస్ సిరీస్‌లను కూడా ఇంగ్లండ్ జట్టు కుక్ సారథ్యంలో సొంతం చేసుకుంది. 2006లో భారత్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ టెస్టు కెరీర్‌ను ఆరంభించిన కుక్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ 135 టెస్టులు ఆడిన కుక్.. 10, 688 పరుగులను సాధించి ఈ ఫార్మాట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. -
ఇంగ్లండ్ కెప్టెన్‌పై జోక్ పేల్చిన మోదీ!
ప్రధాని నరేంద్రమోదీ మంచి వక్త మాత్రమే కాదు.. సందర్భానుసారంగా చలోక్తులు విసరడంలోనూ ఆయన దిట్ట అని మరోసారి నిరూపించుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. బ్రిటన్ ప్రధాని థెరిసా మే సమక్షంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌కోట్ టెస్టులో అత్యుత్తమంగా రాణించిన క్రికెట్ జట్టే విజయం సాధిస్తుందని మోదీ అన్నారు. అయితే వీరి సంభాషణలో ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ అలిస్టర్ కుక్ విషయం ప్రస్తావనకు వచ్చిందని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. బ్రిటన్ ప్రధాని థెరిసాకు విందు ఇచ్చిన అనంతరం ఆమెను వంటలు ఎలా ఉన్నాయని మోదీ అడిగారట. బహుశా భోజనం మీకు ఆనందాన్ని ఇచ్చిందనుకుంటా అని మోదీ అనగానే.. అవును.. భోజనం చాలా బాగుందని థెరిసా జవాబిచ్చారు. 'మంచి రుచికరమైన భోజనం చేసే కుక్ మా వద్ద ఉన్నాడు. కానీ అసలైన కుక్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో పాటే భారత పర్యటనకు వచ్చాడుగా' అంటూ థెరిసాతో చర్చ సందర్భంగా మోదీ చమతర్కించారని వికాస్ స్వరూప్ మీడియాకు తెలిపారు. ఈ విధంగా ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ పై మోదీ జోక్ పేల్చగానే అక్కడ సందడి వాతావరణం ఏర్పడింది. -
ఇంగ్లండ్‌కు మూలస్తంభం
పదేళ్ల క్రితం.... నాగ్‌పూర్‌లోని సివిల్ లైన్సలో పాత వీసీఏ స్టేడియం... 21 ఏళ్ల యువ క్రికెటర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఎదురుగా కుంబ్లే, హర్భజన్ లాంటి దిగ్గజాలు. స్పిన్‌కు అనుకూలించే పిచ్. మహా మహా దిగ్గజాలు అనుకున్న ఇంగ్లండ్ క్రికెటర్లు వెనుదిరుగుతున్నారు. కానీ ఆ కుర్రాడు మాత్రం గోడలా నిలబడ్డాడు. తొలి ఇన్నింగ్సలో అర్ధసెంచరీ, రెండో ఇన్నింగ్సలో అజేయ సెంచరీ... మ్యాచ్ డ్రా అరుుంది. భారత్ గెలుపును అడ్డుకున్న ఆ క్రికెటర్ పేరు అలిస్టర్ కుక్. కట్ చేస్తే... ఇప్పుడు భారత్‌లో పర్యటించే ఇంగ్లండ్ జట్టు సారథి కుక్. ఇంగ్లండ్ తరఫున టెస్టులకు సంబంధించి అన్ని రికార్డులూ తనవే. అత్యధిక మ్యాచ్‌లు, పరుగులు, సెంచరీలు... ఇలా టెస్టు క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే దేశం తరఫున అతనో సూపర్ స్టార్. ఈ పదేళ్లలో ఎంతోమంది జట్టులోకి వచ్చారు. వెళ్లారు. కానీ కుక్ మాత్రం మూలస్తంభంలా నిలబడ్డాడు. బంగ్లాదేశ్‌తో తాజాగా జరిగిన రెండు టెస్టుల ద్వారా ఇంగ్లండ్ తరఫున బ్యాటింగ్‌లో ఉన్న టెస్టు రికార్డులన్నీ దాదాపుగా కుక్ వశమై పోయారుు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (135) ఆడిన ఆటగాడిగా అలెక్ స్టివార్ట్ (133 మ్యాచ్‌లు) రికార్డును ఆ పర్యటనలో అధిగమించాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో గూచ్, అథర్టన్, ్ట్రాస్ ఇలా ఎంతో మంది దిగ్గజ ఓపెనర్లు ఉన్నారు. వారందరి రికార్డులను అధిగమించాడు కుక్. ఫ్లింటాఫ్, పీటర్సన్, బోథమ్... ఇలా ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఆ జట్టుకు ఆడినా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లండ్ నుంచి వచ్చిన అత్యుత్తమ క్రికెటర్ కుక్ అని ఇప్పటికే కితాబు అందుకున్నాడు. సంగీతంతో మొదలై... చిన్నప్పుడు కుక్కు సంగీతం అంటే పిచ్చి. స్కూల్లో ప్రతి కార్యక్రమంలోనూ తనే. కేవలం ఎండాకాలం సెలవుల్లో మాత్రమే క్రికెట్ ఆడేవాడు. అందుకే తను స్కూల్ తుది జట్టులో కూడా లేడు. ఒకసారి ఎంసీసీకి చెందిన స్కూల్ జట్టు కుక్ స్కూల్‌కి వచ్చింది. ఎంసీసీ జట్టులో ఒక పిల్లాడు రాకపోతే... ప్రత్యర్థి తుది జట్టులో అవకాశం లేని కుక్‌ను తీసుకున్నారు. ఆ మ్యాచ్‌లో తను సెంచరీ చేశాడు. అప్పుడు తన వయసు 11 ఏళ్లు. అంతే ఆ ఒక్క మ్యాచ్‌తో తన రాత మారిపోరుుంది. నిపుణులైన కోచ్‌ల పర్యవేక్షణలోకి వచ్చాడు. స్కూల్ స్థారుులో సంచలన ఆటతీరుతో క్రమంగా కౌంటీలకు ఆడాడు. అక్కడి నుంచి జాతీయ జట్టుకు వచ్చాడు. నిజానికి భారత్ పర్యటనకు వచ్చే ఇంగ్లండ్ జట్టు కొత్త వాళ్లని తీసుకురావడం అరుదు. కానీ 2006లో సీనియర్ ఓపెనర్లు అందుబాటులో లేకపోవడంతో కుక్‌ను తీసుకొచ్చారు. అరంగేట్రంలోనే అదరగొట్టి సత్తా చాటిన కుక్ అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏనాడూ జట్టుకు దూరం కాలేదు. ఈ పదేళ్ల కాలంలో కుక్కు జోడీగా దాదాపు 20 మంది క్రికెటర్లు వచ్చారు. కానీ తను మాత్రం ఒక ఎండ్‌లో కుదురుగా అలా ఉండిపోయాడు. 2010 నుంచి అత్యుత్తమం కెరీర్ ప్రారంభమైన తొలి నాలుగు సంవత్సరాలు కుక్ అందరిలో ఒకడిగానే కనిపించాడు. అడపా దడపా ఓ సెంచరీతో తన స్థానాన్ని కాపాడుకోవడానికే పరిమితమయ్యాడు. 2010లో తన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో తను చెలరేగిపోయాడు. ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలతో ఏకంగా 766 పరుగులు చేసి ఒంటిచేత్తో సిరీస్‌ను గెలిపించాడు. 24 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ విజయం సాధించలేకపోరుున ఇంగ్లండ్... కుక్ పుణ్యమా అని నెగ్గింది. దీంతో దేశం మొత్తం సంబరాలు జరిగారుు. కుక్కు లండన్‌లో ‘ఫ్రీడమ్ ఆఫ్ సిటీ’ గౌరవం ఇచ్చారు. ఆ తర్వాత ఏడాది భారత్‌పై 294 పరుగులు చేసి కెరీర్లో అత్యత్తమ స్కోరు సాధించాడు. ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లో నంబర్‌వన్ కావడంలో కుక్‌దే కీలక పాత్ర. 2012లో ఆండ్రూ ్ట్రాస్ రిటైర్ అరుున తర్వాత పూర్తి స్థారుులో ఇంగ్లండ్ పగ్గాలు కుక్కు అప్పగించారు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో భారత్‌ను భారత్‌లో ఓడించి సంచలనం సృష్టించాడు. 1984 తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత్‌లో సిరీస్ గెలవడం అదే తొలిసారి. 2013లో స్వదేశంలో జరిగిన యాషెస్‌లోనూ జట్టును విజయపథంలో నడిపించాడు. కానీ ఆ తర్వాతి ఏడాది ఆస్ట్రేలియాలో సిరీస్‌ను 1-4తో ఓడిపోయారు. అరుుతే జట్టులోని సీనియర్ క్రికెటర్లు చాలామంది రిటైరైన సమయం అది. యువ క్రికెటర్లతో ఫలితాలను తేవడానికి సమయం పడుతుందంటూ ఈసీబీ కుక్కు వెన్నంటి నిలిచింది. 2014 వరకు కుక్ ఇంగ్లండ్‌కు వన్డేల్లోనూ కెప్టెన్‌గా కొనసాగినా... వన్డేల్లో సాధారణ ఆటతీరు కారణంగా తనపై వేటు పడింది. 2015లో తిరిగి స్వదేశంలో యాషెస్ సిరీస్ గెలిపించాడు. దిగ్గజాల సరసన చోటు ఇంగ్లండ్ ప్రజల పండుగ క్రిస్మస్ రోజు జన్మించిన కుక్ ఆ దేశ క్రికెట్ దిగ్గజాల సరసన ఇప్పటికే చేరాడు. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వరల్డ్ ఎలెవన్ కెప్టెన్ ఇలా కుక్ అనేక ఘనతలు సాధించాడు. క్రికెట్‌కు తను అందించిన సేవలు, సాధించిన ఘనతల పట్ల సంతోషించిన బ్రిటన్ రాణి కుక్‌ను ‘ఆర్డర్ ఆఫ్ ద అంపైర్’ గా గౌరవించారు. తను సాధించిన ఘనతల పట్ల కుక్ చాలా గర్వపడ్డాడు. ‘ఇంగ్లండ్ తరఫున దశాబ్దకాలం పైగా క్రికెట్ ఆడే అవకాశం లభించడం నా అదృష్టం. నా కెరీర్లో జట్టు విజయానికి ఉపయోగపడిన ప్రతిసారీ గర్వంగా భావించేవాడిని. నా దృష్టిలో ఇంగ్లండ్ జాతీయ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం కంటే గొప్ప గౌరవం లేదు. దీనిని కాపాడుకుంటాను. నాలో శక్తి ఉన్నంతవరకూ ఆడుతూ ఇంగ్లండ్ క్రికెట్లో కొత్త ఆటగాళ్లకు మార్గదర్శనం చేస్తాను’ అని కుక్ చెబుతున్నాడు. సచిన్ రికార్డులే లక్ష్యం ప్రస్తుత తరంలో ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో కుక్ ఒకడు. తన వయసు 31 సంవత్సరాలు. మరో పదేళ్ల పాటు తను క్రికెట్ ఆడగలడని అంచనా. ప్రస్తుతం మిస్బావుల్ హక్ 40 ఏళ్ల వయసులోనూ నిలకడగా ఆడుతున్నాడు. దీనికి తోడు కుక్ కేవలం టెస్టులకే పరిమితం. కాబట్టి మరో పదేళ్లు ఆడటం కష్టం కాకపోవచ్చు. సచిన్ కెరీర్లో 200 మ్యాచ్‌లలో 51 సెంచరీలతో 15,921 పరుగులు చేశాడు. కుక్ ఇప్పటికి 135 మ్యాచ్‌లలో 29 సెంచరీలతో 10,688 పరుగులు చేశాడు. ప్రస్తుతం కుక్ సగటున ప్రతి 29 రోజులకు ఒక టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. అంటే సుమారుగా ఏడాదికి 12 టెస్టులు. అంటే సచిన్ మ్యాచ్‌లను చేరడానికి తనకు సుమారు ఆరేళ్లు పడుతుంది. ఆరేళ్ల పాటు ఇంతే నిలకడగా ఆడితే సచిన్ పరుగుల రికార్డును చేరుకోవచ్చు. కానీ సెంచరీలను అందుకోవడం కొద్దిగా కష్టమే. ఏమైనా సచిన్ రికార్డులను కుక్ అందుకోవాలనే ఆశ అతనొక్కడిదే కాదు... టెస్టు క్రికెట్ అంటే ప్రాణమిచ్చే ఆ దేశానిది కూడా. మరి ప్రాక్టికల్‌గా ఇది సాధ్యమవుతుందో లేదో తెలుసుకోవాలంటే మరో ఐదారేళ్లు ఆగాల్సిందే. -సాక్షి క్రీడావిభాగం -
భారత్‌కు గట్టి పోటీనిస్తాం: కుక్
ముంబై: ప్రపంచ నంబర్‌వన్ భారత క్రికెట్ జట్టుతో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో తమను అండర్డాగ్స్ గా పరిగణించినా ఎలాంటి ఇబ్బంది లేదని ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ స్పష్టం చేశాడు. నిజానికి తమను అలా భావిస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్న ఇంగ్లండ్ ఈనెల 9 నుంచి రాజ్‌కోట్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టు ద్వారా భారత పర్యటనను ఆరంభించనుంది. 2012లో కుక్ బృందం 2-1తో నెగ్గిన అనంతరం భారత జట్టు స్వదేశంలో టెస్టు సిరీస్ ఓడిపోరుుంది లేదు. ‘నంబర్ వన్ జట్టుతో ఆడడం ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే. అదీకాకుండా వారి సొంత గడ్డపై ఆడటమంటే మాకు కఠిన పరీక్షగానే భావించాలి. అలాగే మా జట్టులో చాలామందికి ఇక్కడ ఆడిన అనుభవం లేదు. అరుునా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ జట్టుకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పెద్ద జట్లతో మేం కూడా మంచి సిరీస్‌లే ఆడాం. గతేడాది నంబర్‌వన్‌గా ఉన్న దక్షిణాఫ్రికాపై సిరీస్ నెగ్గాం. భారత్ నుంచి ఎదురయ్యే సవాల్‌ను స్వీకరించేందుకు మా ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారు’ అని ఉపఖండంలో 60కి పైగా సగటు కలిగిన కుక్ ధీమా వ్యక్తం చేశాడు. నాలుగేళ్ల క్రితం గ్రేమ్ స్వాన్, మోంటీ పనేసర్లతో కూడిన స్పిన్ విభాగం పటిష్టంగా ఉందని, ప్రస్తుతం తాము అలాంటి స్థితిలో లేమని అంగీకరించాడు. ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకు అనువైన పరిస్థితులు జట్టులో ఉన్నట్టు తెలిపాడు. ‘అండర్సన్ రాక మాకు సానుకూలం’ గాయంతో బాధపడుతున్న పేసర్ జేమ్స్ అండర్సన్ మంగళవారం జట్టుతో చేరనున్నట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. అరుుతే ఫిట్నెస్ను నిరూపించుకున్నప్పటికీ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని కెప్టెన్ కుక్ తెలిపాడు. అండర్సన్ రాక జట్టు బలాన్ని పెంచుతుందని, విశాఖలో జరిగే రెండో టెస్టుకు తను ఆడే అవకాశాలున్నట్టు చెప్పాడు. -
ఆ మాత్రం 'గొడవ' లేకపోతే ఎలా: కుక్
మిర్పూర్:బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో తమ ఆటగాడు బెన్ స్టోక్స్‌కు జరిమానా విధించడంపై ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ షబ్బిర్ రెహ్మాన్‌తో మాటల యుద్ధానికి దిగడంతో స్టోక్స్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడాన్ని కుక్ తప్పుబట్టాడు. ఆటలో సర్వసాధారణంగా వాగ్వాదాలు చోటు చేసుకుంటాయని స్టోక్స్ ప్రవర్తనను సమర్ధించాడు. అసలు ఆటలో ఆ మాత్రం మజా ఉండకపోతే ఎలా అని కుక్ ప్రశ్నిస్తున్నాడు. 'ఆ ఇద్దరు కాంపిటేటివ్ క్రికెటర్లు. నా వరకూ అయితే ఆ మాత్రం వాగ్వాదాన్ని ప్రజలు కూడా ఆహ్వానిస్తారు. క్రికెట్ అభిమానులకు ఆటలో పసందు ఉండాలి కదా. ఏది ఏమైనా స్టోక్స్‌కు జరిమానా వేయడం నన్ను కాస్త నిరాశకు గురి చేసింది'అని కుక్ తెలిపాడు. రెండో టెస్టులో భాగంగా ఆదివారం ఉదయం ఆటలో షబ్బిర్ ను పదే పదే రెచ్చగొడుతూ స్టోక్స్ ప్రవర్తించాడు. అతని మీదుకు దూసుకువస్తూ దురుసగా వ్యవహరించాడు. దీనిపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు పలుమార్లు స్టోక్స్‌ను మందలించినా వారి మాటలను పెడచెవిన పెట్టాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా కావడంతో స్టోక్స్‌కు జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. -
రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ కెప్టెన్
చిట్టగాంగ్: ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ మరో ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టులాడిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. బంగ్లాదేశ్ తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచులో బరిలోకి దిగి అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. 133 టెస్టులాడిన అలెక్ స్టివార్ట్ రికార్డును అతడు అధిగమించాడు. కుక్ 31 ఏళ్లకే ఈ రికార్డు సాధించడం విశేషం. ఇంగ్లాండ్ తరఫున టెస్టు క్రికెట్ లో 10 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడు కూడా అతడే. 47.31 సగటుతో అతడు ఇప్పటివరకు 10,603 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 51 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 294. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 200 టెస్టులు ఆడి అందరికంటే ముందున్నాడు. రికీ పాంటింగ్, స్టీవా(168) తర్వాతి స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్ల జాబితాలో కుక్ 11వ స్థానంలో ఉన్నాడు. కాగా, చిట్టగాంగ్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో కుక్ కేవలం 4 పరుగులు చేసి అవుటయ్యాడు. -
బ్రాడ్‌మన్ తో నన్ను పోల్చవద్దు...
► టెస్టుల్లో 29వ సెంచరీ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ మాంచెస్టర్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ టెస్టు క్రికెట్ లో మరో మైలురాయిని చేరుకున్నాడు. ఆసీస్ మాజీ దిగ్గజం బ్రాడ్ మన్ రికార్డు సెంచరీలను సమం చేశాడు. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించింది. జో రూట్ (246 బంతుల్లో 141 బ్యాటింగ్; 18 ఫోర్లు)తో పాటు కెప్టెన్ అలిస్టర్ కుక్ (172 బంతుల్లో 105; 15 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ టెస్టుల్లో 29వ శతకాన్ని నమోదుచేశాడు. ఈ సెంచరీతో క్రికెట్ ఆల్ టైమ్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును కుక్ సమంచేశాడు. అయితే బ్రాడ్‌మన్ తో పోల్చి చూసేంత గొప్ప ఆటగాడిని కాదని కుక్ పేర్కొన్నాడు. ఆయనకు ఈ ఘనత సాధించేందుకు 52 టెస్టులే అవసరం కాగా, తాను మాత్రం ఈ రికార్డును అందుకోవడానికి 131 టెస్టులు ఆడానని చెప్పాడు. ఈ సెంచరీ చేయడానికి కుక్ 20 ఇన్నింగ్స్ లు ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు ఆమిర్, రాహత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. -
'కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాలనుకున్నా'
లండన్:తాను ప్రస్తుతం టెస్టు కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నా, ఆ బాధ్యత నుంచి చాలా సార్లు వైదొలుగుదామని భావించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ అలెస్టర్ కుక్ స్పష్టం చేశాడు. కొన్ని ప్రధాన టోర్నీల్లో ఇంగ్లండ్ జట్టు వైఫల్యం చెందడంతో కెప్టెన్సీ అనేది తనకు భారంగా మారడమే ఇందుకు కారణమన్నాడు. తన మనసుకు కెప్టెన్సీ నుంచి వైదొలుదామని అనిపించినప్పుడల్లా భార్య అలైస్కు చెప్పేవాడినన్నాడు. కాగా, కొన్ని బలమైన కారణాలతో కెప్టెన్సీ నుంచి బయటకు రాలేకపోయానన్నాడు. 2012లో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా కుక్ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆ తరువాత 2013-14లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ వైట్ వాష్ అయ్యింది. ఆ సిరీస్ అనంతరం కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని తొలిసారి అనుకున్నట్లు కుక్ తెలిపాడు. ఆపై 2015లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా కూడా కెప్టెన్సీ అనేది భారంగా అనిపించిదన్నాడు. ఇక అదే ఏడాది యాషెస్ సిరీస్‌కు ముందు కెప్టెన్సీ గా బరిలోకి దిగకూడదని అనుకున్నాన్నాడు. అయితే ఆ యాషెస్ సిరీస్‌ను 3-2తో గెలవడంతో కుక్ తన మనసును మార్చుకున్నాడు. ఇటీవల టెస్టుల్లో 10 వేల పరుగులు మార్కును చేరుకుని ఆ ఘనతను సాధించిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా కుక్ నిలిచిన సంగతి తెలిసిందే. -
'పాకిస్తాన్‌తో పోరుకు సిద్ధం'
లండన్: త్వరలో పాకిస్తాన్‌తో ఆరంభమయ్యే క్రికెట్ సిరీస్‌లకు సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ స్పష్టం చేశాడు. ఇటీవల శ్రీలంక జట్టుతో సాధించిన విజయ పరంపరనే పాక్ తో సిరీస్‌లో కూడా కొనసాగిస్తామన్నాడు. 'పాకిస్తాన్ జట్టుకు మంచి బౌలింగ్ ఎటాక్ ఉంది. కానీ ఆ బౌలింగ్ ను సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో మంచి స్కోర్లు సాధించాం. అదొక ఉత్తమమైన సిరీస్. గత కొంత కాలం నుంచి మా జట్టు సమతూకంగా ఉంది. పాకిస్తాన్ పోరుకు సిద్ధంగా ఉన్నాం' అని కుక్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా అలెక్స్ హేల్స్ పై కుక్ ప్రశంసల వర్షం కురిపించాడు. తమ జట్టులో హేల్స్ కీలక ఆటగాడని కొనియాడాడు. పాక్ తో సిరీస్ లో హేల్స్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నాడు. -
కుక్కు అరుదైన గౌరవం
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ అలెస్టర్ కుక్ కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్ సత్కారంలో భాగమైన కమాండర్స్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్(సీబీఈ) పురస్కారానికి కుక్ ఎంపికయ్యాడు. బ్రిటీష్ రాణి ఎలిజబెత్ 2 తొంభైవ జన్మదినం కానుకగా ఇవ్వనున్న పురస్కారాల జాబితాలో కుక్ పేరును ఎంపిక చేశారు. దాంతో పాటు ఇంగ్లండ్ మాజీ ఫుట్ బాల్ కెప్టెన్ అలెన్ షీరర్, 2005 జూలై ఏడవ తేదీన లండన్ లో జరిగిన బాంబు దాడుల్లో తన కాళ్లు కోల్పోయిన వాలీబాల్ క్రీడాకారిణి మార్టిన్ విల్ట్ షైర్ కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. క్రీడల్లో చేసిన సేవలకు గాను ఈ ముగ్గురి పేర్లను సీబీఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అంతకుముందు 2011లో కుక్ కు మెంబర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్(ఎంబీఈ) పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. 2010-11వ సీజన్లో ఆస్ట్రేలియాపై యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కుక్ తొలిసారి బ్రిటీష్ సత్కారాన్ని అందుకున్నాడు. ఇటీవల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పిన్న వయసులో టెస్టుల్లో నెలకొల్పిన పదివేల పరుగుల రికార్డును కుక్ అధిగమించిన సంగతి తెలిసిందే. గత నెల్లో శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా కుక్ ఈ ఫీట్ ను సాధించాడు. -
ఎవర్నీ ఉపేక్షించకూడదు: కుక్
లండన్: క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ స్పష్టం చేశాడు. ఏ స్థాయి క్రికెటరైనా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే జీవిత కాలం నిషేధం ఒక్కటే తగిన పరిష్కారమని సూచించాడు. ఎవరైనా ఫిక్సింగ్ చేస్తూ పట్టుబడినట్లైతే ఆ క్రికెటర్‌కు వేసే శిక్ష చాలా కఠినంగా ఉండాలనేది తన అభిప్రాయంగా కుక్ తెలిపాడు. ఆ రకంగా చేసినప్పుడు క్రికెటర్లు నిజాయితీతో గేమ్‌ను ఆస్వాదిస్తారన్నాడు. అయితే ఫిక్సింగ్ పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న తరువాత తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు రాబోతున్న మొహ్మద్ ఆమిర్ కు, తాను మాట్లాడే దానికి ఎటువంటి సంబంధం లేదన్నాడు. అప్పటి నిబంధనలు భిన్నంగా ఉన్న నేపథ్యంలో ఆమిర్ పునరాగమనం గురించి మాట్లాడటం సబబు కాదని కుక్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తాము ఆమిర్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కుక్ తెలిపాడు. అతనితో ఆడటానికి ఇంగ్లండ్ జట్టుకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నాడు. ఇక నుంచి ఎవరైనా మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లైతే జీవిత కాల నిషేధం ఒక్కటే సరైన మార్గమన్నాడు. -
'సచిన్ అంత గొప్పవాడ్ని కాదు'
న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గ్రేట్ ప్లేయర్ అని, తాను సచిన్ అంత గొప్పవాడిని కాదని ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అంటున్నాడు. టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ పేరిట ఉన్న అత్యధిక టెస్టు పరుగుల రికార్డును కుక్ బ్రేక్ చేస్తాడని ఇటీవల సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. మరో 6-8 ఏళ్లు టెస్టు క్రికెట్ ఆడితే సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించవచ్చని చెప్పాడు. శ్రీలంకతో గురువారం మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో కుక్ మీడియాతో కాసేపు ముచ్చటించాడు. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న కుక్ సేన లార్డ్స్ లో మూడో టెస్ట్ ఆడనుంది. అయితే తనపై ఎన్నో అంచనాలు ఉన్నాయని, వాటిని సాధించేందుకు చాలా సమయం పడుతుందని కుక్ చెప్పాడు. టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా, ఈ రికార్డు నెలకొల్పిన అతి పిన్న వయస్కుడిగానూ కుక్ ఇటీవల రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ 31 ఏళ్ల 10 నెలల వయసులో ఈ రికార్డు నెలకొల్పగా, కుక్ 31 ఏళ్ల 5 నెలల వయసులోనే ఈ ఫీట్ సాధించి సచిన్ రికార్డు తిరగరాశాడు. కుక్ 128 టెస్టుల్లో 47 సగటుతో 10,042 పరుగులు చేయగా, సచిన్ మొత్తం 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 54 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ కు మరింత కాలం ఆడాలని ఉందని, అలా చేసినప్పుడే సచిన్ రికార్డును మరోసారి బ్రేక్ చేయగలనని అభిప్రాయపడ్డాడు. తాను జీనియస్ అయినా సచిన్ తనకంటే గొప్ప ఆటగాడని ప్రశంసించాడు. అత్యధిక పరుగుల రికార్డు తిరగరాయాలంటే దాదాపు 6వేల పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరికి మాత్రమే అలాంటి విజయాలు, రికార్డులు సాధ్యమవుతాయని చెప్పాడు. వ్యక్తిగతంగా చూసుకుంటే తనకు చాలా లక్ష్యాలు ఉన్నాయని, ఇంగ్లండ్ టీమ్ కు మరిన్ని విజయాలు సాధించి పెట్టడంపైనే దృష్టిసారిస్తున్నట్లు అలెస్టర్ కుక్ వివరించాడు. -
అతను సచిన్ రికార్డును బ్రేక్ చేయగలడు
న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్లో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ పరుగుల రికార్డును ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ బ్రేక్ చేసే అవకాశముందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కుక్ వయసు 32 ఏళ్లలోపేనని, ఫిట్నెస్తో ఉన్నాడు కాబట్టి మరో 6-8 ఏళ్లు టెస్టు క్రికెట్ ఆడితే సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించవచ్చని చెప్పాడు. ఇంగ్లండ్ ఏడాదికి సరాసరి 12 టెస్టులు ఆడుతోందని, కుక్ టెస్టుకు సగటున 50 పరుగులు చేసినా అరుదైన ఘనత సాధించవచ్చని విశదీకరించాడు. టెస్టుల్లో కుక్ 10 వేల పరుగుల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా, ఈ ఫీట్ నమోదు చేసిన అతి పిన్న వయస్కుడిగా కుక్ మరో రికార్డు నెలకొల్పాడు. సచిన్ 31 ఏళ్ల 10 నెలల వయసులో ఈ రికార్డు నెలకొల్పగా, కుక్ 31 ఏళ్ల 5 నెలల వయసులో ఈ ఫీట్ సాధించాడు. సచిన్ మొత్తం 15921 పరుగులు చేశాడు. -
సచిన్ రికార్డును అధిగమించాడు!
చెస్టర్ లీ స్ట్రీట్: మాస్టర్ బ్లాస్టర్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పిన్న వయసులో టెస్టుల్లో నెలకొల్పిన పదివేల పరుగుల రికార్డును ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అధిగమించాడు. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్ లో కుక్ ఈ ఫీట్ ను సాధించాడు. శ్రీలంకతో తొలి టెస్టు ప్రారంభం అయ్యేనాటికి పదివేల పరుగుల రికార్డును అందుకోవడానికి 36 పరుగుల దూరంలో ఉన్న కుక్ .. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కుక్ 16, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 15 పరగులు చేసి నిరాశపరిచాడు. అయితే ఈ రికార్డును కుక్ రెండో ఇన్నింగ్స్ లో సవరించాడు. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు సాధించి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అయితే పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు. కాగా, కుక్ వయసు ప్రస్తుతం 31 ఏళ్ల 4 నెలలు. దీంతో పాటు పదివేల పరుగుల మార్కును చేరుకున్న 12వ ఆటగాడిగా కుక్ నిలిచాడు. ఇదిలా ఉండగా, ఇంగ్లండ్ తరపున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ కుక్ కావడం మరో విశేషం. 1987లో భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పది వేల పరుగుల మార్కును చేరుకున్న తొలి క్రికెటర్ గా గుర్తింపు సాధించగా, ఆపై ఆరు సంవత్సరాల తరువాత ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు అలెన్ బోర్డర్ ఆ ఘనతను చేరాడు. టెస్టుల్లో పదివేల పరుగులు చేసిన వారిలో స్టీవ్ వా, బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రికీ పాంటింగ్, జాక్వస్ కల్లిస్, మహేలా జయవర్ధనే, శివనారాయణ్ చందర్ పాల్, కుమార సంగక్కారాలు ఉన్నారు. -
సచిన్ రికార్డును మళ్లీ మిస్సయ్యాడు!
చెస్టర్ లీ స్ట్రీట్: మాస్టర్ బ్లాస్టర్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో నెలకొల్పిన పదివేల పరుగుల రికార్డును ఈజీగా బద్దలు కొడతానన్న ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ కు నిరీక్షణ తప్పడం లేదు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో తొలి టెస్టు ప్రారంభం అయ్యేనాటికి పదివేల పరుగుల రికార్డును అందుకోవడానికి 36 పరుగుల దూరంలో ఉన్న కుక్ .. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 15 పరగులు చేసి నిరాశపరిచాడు. దీంతో పదివేల పరుగులను పూర్తి చేయడానికి కుక్ ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కుక్ 16 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం సాధించడంతో కుక్ కు రెండో ఇన్నింగ్స్ లో ఆడే అవకాశం రాలేదు. అయితే రెండో టెస్టు తొలి రోజే సచిన్ రికార్డును కుక్ అధిగమిస్తాడని అంతా భావించినా అది సాధ్యం కాలేదు. మరి సచిన్ రికార్డను తదుపరి ఇన్నింగ్స్ లో కుక్ అధిగమిస్తాడా?లేదా అనేది చూడాల్సిందే. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు సాధించి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అయితే పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు. కాగా, కుక్ వయసు ప్రస్తుతం 31 ఏళ్ల 4 నెలలు. ఇప్పటివరకూ 11 మంది ఆటగాళ్లు మాత్రమే పది వేల మార్కును చేరితే, ఇంగ్లండ్ తరపున ఒక్క ఆటగాడు కూడా ఆ మార్కును చేరలేదు. దీంతో కుక్ ఒకేసారి రెండు అరుదైన రికార్డులను నమోదు చేయడానికి కొద్ది దూరంలో నిలిచాడు. -
సచిన్ రికార్డు ఈజీగా బద్దలుకొడతా..
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ లో సంచలనం అలిస్టర్ కుక్. అతి తక్కువ వయసులో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్ కుక్. ప్రపంచానికే క్రికెట్ నేర్పించిన దేశమైనప్పటికీ ఇప్పటివరకూ ఏ ఒక్క ఇంగ్లీష్ ఆటగాడికి టెస్టుల్లో పదివేల పరుగుల ఫీట్ సాధ్యపడలేదు. దశాబ్దాలుగా తమ జట్టు ఆటగాళ్లకు సాధ్యంకాని అరుదైన ఫీట్ అందుకోవడానికి ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ కేవలం 36 పరుగుల దూరంలో ఉన్నాడు. అతడు పగ్గాలు అందుకున్న తర్వాత జట్టులో ఎన్నో మార్పులు, మళ్లీ వారిలో జోష్ పెంచాడు. పదివేల పరుగుల క్లబ్ లో చేరిన 12వ ఆటగాడిగా, తొలి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ గానూ డబుల్ రికార్డులు సొంతం చేసుకోనున్నాడు. క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొడితే వచ్చే మజానే వేరు అని డాషింగ్ బాట్స్ మెన్ అంటున్నాడు. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు. కాగా, కుక్ వయసు ప్రస్తుతం 31 ఏళ్ల 4 నెలలు. దీంతో క్రికెట్ దేవుడు సచిన్ రికార్డుపై కన్నేసినట్లు చెప్పకనే చెబుతున్నాడు. కుక్ 126 టెస్టుల్లో 9,964 పరుగులు చేశాడు. ఇంగ్లండ్, శ్రీలంక సిరీస్ ఈ నెలలో జరుగుతున్నందున మరికొన్ని రన్స్ జోడించి సచిన్ రికార్డును తిరగరాయడం తనకు అసాధ్యమేం కాదని పేర్కొన్నాడు. -
సచిన్ 'రికార్డు' కు కొద్ది దూరంలో..
లండన్:మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. పిన్న వయసులోనే టెస్టు క్రికెట్ ఆడిన క్రికెటర్ గా చరిత్రకెక్కడమే కాకుండా, అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ సాధించిన ఘనతల్లో ఒకటైన టెస్టుల్లో పదివేల పరుగుల రికార్డు త్వరలోనే తెరమరగయ్యే అవకాశం ఉంది. టెస్టుల్లో సచిన్ పదివేల పరుగులను సాధించే నాటికి అతని వయసు 31సంవత్సరాల 10 నెలలు. వయసు పరంగా ఆ ఘనత ఇప్పటివరకూ సచిన్ పేరిటే పదిలంగానే ఉన్నా. ఆ రికార్డు మరికొన్ని రోజుల్లో కుక్ ఖాతాలో చేరనుంది. ప్రస్తుతం పదివేల పరుగులు చేయడానికి కుక్ ఇంకా 36 పరుగుల మాత్రమే అవసరం. ప్రస్తుతం 32 ఒడిలో ఉన్న కుక్.. మరో రెండు వారాల్లో శ్రీలంక-ఇంగ్లండ్ ల మధ్య టెస్టు సిరీస్‌లో సచిన్ రికార్డును సవరించే అవకాశం ఉంది. ఇది కూడా తొలి టెస్టు ద్వారానే కుక్ ఆ రికార్డును సాధిస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా. 2006లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కుక్.. తన మొదటి టెస్టులోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. భారత్ తో నాగ్ పూర్ లో జరిగిన టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో కుక్ అజేయంగా 104 పరుగులు సాధించి తనదైన ముద్రవేశాడు. ఇప్పటివరకూ 126 టెస్టు మ్యాచ్‌లాడిన కుక్ 46.56 సగటుతో 9, 964 పరుగులను సాధించాడు.ఇందులో 28 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇప్పటివరకూ 11 మంది ఆటగాళ్లు మాత్రమే పది వేల మార్కును చేరితే, ఇంగ్లండ్ తరపున ఒక్క ఆటగాడు కూడా ఆ మార్కును చేరలేదు. దీంతో కుక్ ఒకేసారి రెండు రికార్డులను నమోదు చేయడానికి అతి కొద్ది దూరంలో ఉన్నాడనేది కాదనలేని వాస్తవం. ఇదిలా ఉండగా, గతేడాది అక్టోబర్ లో పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో కుక్ సుదీర్ఘంగా క్రీజ్ లో ఉండి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ టెస్టులో డబుల్ సెంచరీతో విశేషంగా రాణించిన కుక్ (528 బంతుల్లో 263; 18 ఫోర్లు) ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఈ స్కోరును చేసే క్రమంలో కుక్ సుదీర్ఘంగా 836 నిమిషాల పాటు క్రీజ్ లో ఉన్నాడు. దీంతో అత్యధిక సమయం క్రీజ్ లో ఉన్న మూడో క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. -
'ఓపెనర్లలో అతనే బెస్ట్'
లండన్: గతవారం పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీ చేయడంపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ గ్రాహం గూచ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోనే కుక్ అత్యుత్తమ ఓపెనర్ అని కొనియాడాడు. పాకిస్థాన్ తో తొలి టెస్టు సందర్భంగా కుక్ 263 పరుగులు చేశాడు. సుదీర్ఘంగా 836 నిమిషాల పాటు క్రీజ్ లో ఉండి జట్టుకు కీలక ఇన్నింగ్స్ సాధించిపెట్టాడు. దీంతో అత్యధిక నిమిషాలు క్రీజ్ లో ఉన్న మూడో క్రికెటర్ గా కుక్ గుర్తింపు పొందాడు. కాగా, ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఎక్కువ సమయం క్రీజ్ లో నిలిచిన తొలి ఆటగాడిగా కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 'గొప్ప ఇన్నింగ్స్ లలో అదొక అత్యుత్తమ ఇన్నింగ్స్. కుక్ ఎప్పుడూ మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు. యుక్త వయసు నుంచి అతనికి ఆటపై ఏకాగ్రత అమోఘం. చాలా కాలం వరకూ ప్రపంచంలోనే ఒక బెస్ట్ ఓపెనర్ గా కుక్ కొనసాగుతాడు' అని గూచ్ అభిప్రాయపడ్డాడు. -
మూడో 'అతిపెద్ద' ఇన్నింగ్స్!
అబుదాబి: టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్ తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీతో విశేషంగా రాణించిన కుక్ మరో ఘనతను కూడా సాధించాడు. కుక్ (528 బంతుల్లో 263; 18 ఫోర్లు) ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఈ స్కోరును చేసే క్రమంలో కుక్ సుదీర్ఘంగా 836 నిమిషాల పాటు క్రీజ్ లో ఉన్నాడు. దాదాపు 14 గంటల పాటు క్రీజ్ ను అంటిపెట్టుకుని ఇంగ్లండ్ కు కీలక ఇన్నింగ్స్ సాధించిపెట్టాడు. అంతకుముందు ఈ ఘనతను సాధించిన వారిలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు హానిఫ్ మహ్మద్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిరెస్టన్ లు ఉన్నారు. 1958 లో బ్రిడ్జిటౌన్ లో వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో 970 నిమిషాల పాటు క్రీజ్ లో ఉండి 337 పరుగులు సాధించిన హనీఫ్ అగ్రస్థానంలో ఉండగా, 1999లో డర్బన్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 878 నిమిషాలు క్రీజ్ లో ఉండి 275 పరుగులను సాధించిన గ్యారీ కిరెస్టన్ రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా కుక్ ఆడిన ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో అతిపెద్ద ఇన్నింగ్స్ గా రికార్డులకెక్కింది. -
కుక్ డబుల్ సెంచరీ
అబుదాబి: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ అలిస్టర్ కుక్ (528 బంతుల్లో 263; 18 ఫోర్లు) డబుల్ సెంచరీ చేయడంతో శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 196.3 ఓవర్లలో 8 వికెట్లకు 569 పరుగులు చేసింది. రషీద్ (6 బ్యాటింగ్), బ్రాడ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కుక్‌సేన 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 290/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన కుక్, రూట్ (143 బంతుల్లో 85; 7 ఫోర్లు) నిలకడగా ఆడారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కుక్ 395 బంతుల్లో ద్విశతకం పూర్తి చేశాడు. తర్వాత బెయిర్‌స్టో (8) విఫలమైనా... స్టోక్స్ (87 బంతుల్లో 57; 7 ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ కుక్కు చక్కని సహకారం అందించాడు. ఈ జోడి ఆరో వికెట్‌కు 91 పరుగులు సమకూర్చడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు ఖాయమైంది. బట్లర్ (23) మోస్తరుగా ఆడాడు. పాక్ బౌలర్లలో రియాజ్ 3, షోయబ్ 2 వికెట్లు తీశారు. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశముంది. -
మిచెల్ జాన్సన్ కు కుక్ సవాల్
కార్డిఫ్: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ క్రికెట్ జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ కు ఒకరోజు ముందు మాటల యుద్ధానికి తెరలేచింది. బుధవారం ఇరు జట్లు కార్డిఫ్ లో తొలి టెస్ట్ కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ కు ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ సవాల్ విసిరాడు. 2013-14 లో మిచెల్ జాన్సన్ చూపించిన హీరోయిజాన్ని మరోసారి చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడా?అంటూ సవాల్ విసిరాడు. ఆ సిరీస్ లో ఇంగ్లండ్ ను వైట్ వాష్ చేయడంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్న మిచెల్.. అందుకు మరోసారి సన్నద్ధమైయ్యాడా? అంటూ కుక్ ఛాలెంజ్ చేశాడు. ఆ సిరీస్ ను పునరావృతం చేయడానికి ఆసీస్ సర్వశక్తులు పెట్టి పోరాడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని.. 2010-11 యాషెస్ సిరీస్ లో ఏమైందో ఒకసారి గుర్తుకు తెచ్చకోవాలంటూ కుక్ ఎద్దేవా చేశాడు. గత సిరీస్ లో మిచెల్ జాన్సన్ 37 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. -
కుక్, స్టోక్స్ శతకాలు
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 429/6 లార్డ్స్: ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. కెప్టెన్ అలిస్టర్ కుక్ (327 బంతుల్లో 153 బ్యాటింగ్; 15 ఫోర్లు), బెన్ స్టోక్స్ (92 బంతుల్లో 101; 15 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీల మోత మోగించడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 118 ఓవర్లలో ఆరు వికెట్లకు 429 పరుగులు చేసింది. ప్రస్తుతం జట్టు 295 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు నేడు (సోమవారం) చివరి రోజు. క్రీజులో కుక్‌తో పాటు మొయిన్ అలీ (54 బంతుల్లో 19 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నాడు. -
ఇంగ్లండ్ వన్డే కెప్టెన్‌గా మోర్గాన్
లండన్: ప్రపంచకప్‌లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలిస్టర్ కుక్ స్థానంలో అతన్ని ఎంపిక చేసినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శనివారం వెల్లడించింది. టెస్టు జట్టు కెప్టెన్‌గా మాత్రం కుక్‌నే కొనసాగించనున్నారు.గత 22 వన్డేల్లో ఒకే ఒక్క అర్ధసెంచరీ చేసిన కుక్... ఇటీవల లంకతో జరిగిన సిరీస్‌ను 2-5తో కోల్పోవడంతో అతని కెప్టెన్సీపై ఈసీబీ వేటు వేసింది. వన్డే కెప్టెన్సీ కోల్పోయిన కుక్... ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడం కాస్త నిరాశ కలిగించిందని కుక్ అన్నాడు. -
వన్డే కెప్టెన్సీ వదలను: కుక్
బర్మింగ్‌హామ్: ఇంగ్లీషు గడ్డపై ధోనిసేన వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఇంగ్లండ్ కెప్టెన్ ఆలియస్టర్ కుక్ పై ఒత్తిడి పెరుగుతోంది. వరుసగా మూడు వన్డేలు ఓడిపోవడంతో అతడు విపరీత ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అయితే తాను వన్డే కెప్టెన్ గా కొనసాగుతానని కుక్ స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో నాయకత్వాన్ని వదులుకునే ప్రసక్తే లేదని వెల్లడించాడు. బోర్డు తనను కొనసాగిస్తే వన్డే ప్రపంచకప్ వరకు కెప్టెన్ గా కొనసాగుతానని కుక్ తెలిపాడు. మూడున్నరేళ్లుగా కెప్టెన్ గాకొనసాగుతున్నానని, ఆస్ట్రేలియాలో వన్డే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని చెప్పాడు. భారత్ తో జరిగిన వన్డే సిరీస్ ను ఇంగ్లండ్ మరో వన్డే మిగిలుండగానే చేజార్చుకుంది. -
స్పిన్‌ను ఎలా ఆడాలో నేర్చుకోండి
కుక్ సేనకు గంగూలీ సలహా లండన్: భారత స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే ఇంగ్లండ్ ఆటగాళ్లు మరింత రాటుదేలాల్సిన అవసరం ఉందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత వన్డే సిరీస్‌లో వారు నిలవాలంటే తక్షణం స్పిన్‌పై దృష్టి సారించాలని చెప్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కుక్ సేన 0-2తో వెనుకబడిన సంగతి తెలిసిందే. ‘ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు రెండు తప్పులు చేసిందని అనుకుంటున్నాను. 300 పరుగులు చేయడం చాలా కష్టమనే భావనలో ఉన్నారు. ముందుగా ఆ ఆలోచనాధోరణి నుంచి ఇంగ్లండ్ జట్టు బయటపడాలి. ఇక రెండోది వారు స్పిన్‌ను ఎదుర్కొనే తీరు. ఏ పిచ్‌పైనైనా స్పిన్‌ను ఆడాల్సి ఉంటుంది. అయితే తమకు తామే ఆడలేమని అనుకుంటూ ఇబ్బంది పడుతున్నారు’ అని గంగూలీ అన్నాడు. -
'అప్పుడే అతడి మొహంలో నవ్వు చూశా'
సౌంఫ్టన్: పరుగులు చేయడానికి ఇటీవల కాలంలో ఇబ్బందులు పడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ ఆలియస్టర్ కుక్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. టెస్టులో మెరుగైన రికార్డు ఉన్న కుక్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. భారత్ తో ఆదివారం ప్రారంభమైన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో అతడు 95 పరుగులు చేశాడు. 5 పరుగులతో తేడాతో టెస్టుల్లో 26వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఫామ్ కోల్పోయిన తంటాలు పడుతున్న ఈ ఇంగ్లీషు కెప్టెన్ ఈ ఇన్నింగ్స్ గొప్ప ఊరటనిచ్చింది. ఐదు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోవడం బాధనిపించిందని కుక్ పేర్కొన్నాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తానిచ్చిన క్యాచ్ వదిలేసిన భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కుక్ పరోక్షంగా థాంక్స్ చెప్పాడు. అదృష్టవశాత్తు అలా జరిగిందన్నాడు. చివరికి జడేజా బౌలింగ్ లో తాను అవుటైన తర్వాతే అతడి మొహంలో నవ్వు చూశానని కుక్ వివరించాడు. -
కుక్ కోసమే తీసేశాం
పీటర్సన్ వేటుపై ఈసీబీ లండన్: డాషింగ్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్‌ను జట్టు నుంచి తప్పించడంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పందించింది. కెప్టెన్ అలిస్టర్ కుక్‌తో సరైన సంబంధాలు లేని కారణంగానే అతడిని పక్కన పెట్టాల్సి వచ్చిందని తేల్చి చెప్పింది. జట్టు ఆటగాళ్లంతా ఇప్పుడు కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, కెప్టెన్ కు సంపూర్ణ మద్దతు అవసరమని ఈసీబీ అభిప్రాయపడింది. ఆసీస్ పర్యటనలో ఇంగ్లండ్ జట్టు అన్ని ఫార్మాట్లలోనూ దారుణ పరాజయాలు ఎదుర్కొన్న సంగతి విదితమే. ఈ దశలో జట్టు వాతావరణాన్ని మార్చేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. ‘ఇంగ్లండ్ జట్టుకు పీటర్సన్ అందించిన సేవలు మరిచిపోలేం. ఆసీస్‌లో వైట్‌వాష్ అనంతరం జట్టును పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. దీంట్లో భాగంగా ఇప్పుడు కెప్టెన్ కుక్కు మద్దతుగా నిలిచే ఆటగాళ్లు కావాలి. ఈ కారణాలతోనే పీటర్సన్ లేకుండానే ముందుకెళ్లాలని భావించాం’ అని ఈసీబీ స్పష్టం చేసింది. -
మళ్లీ అదే తడబాటు
పెర్త్: వరుసగా రెండు పరాజయాలతో కుదేలైన ఇంగ్లండ్ జట్టు మూడో టెస్టులోనూ ఇబ్బందిని ఎదుర్కొంటోంది. సిరీస్‌లో ఇప్పటిదాకా రాణించని కెప్టెన్ కుక్ (153 బంతుల్లో 72; 10 ఫోర్లు) రాణించినా... పెద్దగా ఫలితం కనిపించడం లేదు. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 68 ఓవర్లలో నాలుగు వికెట్లకు 180 పరుగులు చేసింది. ఓపెనర్ కార్బెర్రీ (76 బంతుల్లో 43; 8 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే ఆకట్టుకున్నాడు. పదునైన బంతులతో గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో పర్యాటక జట్టును బెంబేలెత్తించిన పేసర్ మిచెల్ జాన్సన్‌కు వికెట్లేమీ దక్కకపోయినా... హారిస్, వాట్సన్, సిడిల్, లియోన్ తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో బెల్ (9 బ్యాటింగ్), స్టోక్స్ (43 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలో కుక్, కార్బెర్రీ నిలకడగా ఆడడంతో తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు కట్టడి చేయడంతో 146 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్‌కన్నా ఇంగ్లండ్ 205 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 326/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ మరో 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. స్మిత్ 111 పరుగులు చేశాడు. మరోసారి డీఆర్ఎస్ గొడవ అంపైర్ నిర్ణయ పునస్సమీక్షా పద్దతి (డీఆర్ఎస్) మరోసారి వివాదాస్పదమైంది. రెండో రోజు ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షేన్ వాట్సన్ బౌలింగ్‌లో కీపర్ హాడిన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీన్ని అంపైర్ మరైస్ ఎరాస్మస్ అవుట్‌గా ప్రకటించారు. అయితే రూట్ మాత్రం బంతి తన బ్యాట్‌కు తగల్లేదనే కారణంతో రివ్యూకు వెళ్లాడు. మూడో అంపైర్ టోనీ హిల్ పలు పర్యాయాలు వీడియో క్లిప్స్ పరిశీలించినా స్పష్టత ఏర్పడలేదు. అటు హాట్స్పాట్లోనూ బ్యాట్‌కు బంతి తగిలినట్టు కనిపించలేదు. ఆడియో ఫుటేజిలో బ్యాట్ పక్క నుంచి బంతి వెళ్లిన అనంతరం శబ్దం వినిపించింది. దీంతో ఏదీ సరైన రీతిలో తేలకపోవడంతో థర్డ్ అంపైర్ హిల్ కూడా రూట్ అవుట్‌ను ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే వదిలేశారు.