
'కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాలనుకున్నా'
లండన్:తాను ప్రస్తుతం టెస్టు కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నా, ఆ బాధ్యత నుంచి చాలా సార్లు వైదొలుగుదామని భావించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ అలెస్టర్ కుక్ స్పష్టం చేశాడు. కొన్ని ప్రధాన టోర్నీల్లో ఇంగ్లండ్ జట్టు వైఫల్యం చెందడంతో కెప్టెన్సీ అనేది తనకు భారంగా మారడమే ఇందుకు కారణమన్నాడు. తన మనసుకు కెప్టెన్సీ నుంచి వైదొలుదామని అనిపించినప్పుడల్లా భార్య అలైస్కు చెప్పేవాడినన్నాడు. కాగా, కొన్ని బలమైన కారణాలతో కెప్టెన్సీ నుంచి బయటకు రాలేకపోయానన్నాడు.
2012లో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్గా కుక్ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆ తరువాత 2013-14లో జరిగిన యాషెస్ సిరీస్లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ వైట్ వాష్ అయ్యింది. ఆ సిరీస్ అనంతరం కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని తొలిసారి అనుకున్నట్లు కుక్ తెలిపాడు. ఆపై 2015లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా కూడా కెప్టెన్సీ అనేది భారంగా అనిపించిదన్నాడు. ఇక అదే ఏడాది యాషెస్ సిరీస్కు ముందు కెప్టెన్సీ గా బరిలోకి దిగకూడదని అనుకున్నాన్నాడు. అయితే ఆ యాషెస్ సిరీస్ను 3-2తో గెలవడంతో కుక్ తన మనసును మార్చుకున్నాడు. ఇటీవల టెస్టుల్లో 10 వేల పరుగులు మార్కును చేరుకుని ఆ ఘనతను సాధించిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా కుక్ నిలిచిన సంగతి తెలిసిందే.