నువ్వే నా ఫేవరెట్‌ ప్లేయర్‌: స్టోక్స్‌ | Ben Stokes Calls Alastair Cook His Favourite Player | Sakshi
Sakshi News home page

నువ్వే నా ఫేవరెట్‌ ప్లేయర్‌: స్టోక్స్‌

Published Thu, Dec 28 2017 4:36 PM | Last Updated on Thu, Dec 28 2017 4:36 PM

Ben Stokes Calls Alastair Cook His Favourite Player - Sakshi

మెల్‌బోర్న్‌:యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ అలెస్టర్‌ కుక్‌ డబుల్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కుక్‌ ఆటపై సహచర ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ స్పందించాడు. 'నువ్వే నా ఫేవరేట్‌ ప్లేయర్‌'  అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు.  ఒక వ్యక్తిపై దాడి కేసులో విచారణ కారణంగా యాషెస్‌కు దూరమైన స్టోక్స్‌.. యాషెస్‌ నాల్గో టెస్టులో ఇంగ్లండ్‌ ప్రదర్శనను కొనియాడాడు. ప్రధానంగా కుక్‌ ఆటను కొనియాడిన స్టోక్స్‌.. అతనే తన ఫేవరేట్‌ ఆటగాడని మనసులో మాటను వెల్లడించాడు.


104 ఓవర్‌ నైట్‌ వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కుక్‌ మరో వంద పరుగులు సాధించి తన కెరీర్‌లో ఐదో ద్విశతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 491 పరుగులు చేసింది. ఆట ముగిసేసమయానికి కుక్‌(244 బ్యాటింగ్‌;409 బంతుల్లో 27 ఫోర్లు), అండర్సన్‌(0 బ్యాటింగ్‌) క్రీజలో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 164 పరుగుల ఆధిక్యంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement