Ben Stokes
-
స్టోక్స్... మూడు నెలలు ఆటకు దూరం
లండన్: ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మూడు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో మూడో టెస్టు సందర్భంగా గాయపడ్డ స్టోక్స్... వచ్చే నెలలో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. దీంతో మరో మూడు నెలల పాటు అతడు మైదానంలోకి దిగబోడని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి స్టోక్స్ దూరం కానున్నాడు. ఇప్పటికే ఆ టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు జట్టును ప్రకటించగా... అందులో 33 ఏళ్ల స్టోక్స్‌కు చోటు కల్పించలేదు. గతంలోనూ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డ స్టోక్స్... శ్రీలంక, పాకిస్తాన్‌తో సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు మరోసారి అదే గాయం తిరగబెట్టడంతో శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. -
ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే కీలకమైన వైట్‌బాల్ సిరీస్‌లకు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్థార్ ఆటగాడు, టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా పై రెండు ఈవెంట్లకు దూరమయ్యాడు. 33 ఏళ్ల స్టోక్స్ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరికి గురయ్యాడు. భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్, యాషెస్ సిరీస్ 2025-26 దృష్ట్యా స్టోక్స్‌కు విశ్రాంతి కల్పించారని తెలుస్తుంది.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే వైట్‌బాల్ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 22) ప్రకటించారు. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. టెస్ట్ జట్టు కీలక సభ్యుడు జో రూట్, 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత తొలి సారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. వికెట్కీపర్లు జేమీ స్మిత్, ఫిల్ సాల్ట్.. రైజింగ్ స్టార్ జేకబ్ బేతెల్ కూడా రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.భారత్‌తో సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వ్యవహరిస్తాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్‌గా మెక్‌కల్లమ్‌కు ఇవే తొలి అసైన్మెంట్స్ అవుతాయి. ఇప్పటివరకు మెక్కల్లమ్ కేవలం టెస్ట్ జట్టుకు మాత్రమే హెడ్ కోచ్‌గా ఉన్నాడు.భారత్‌తో జరిగే వన్డే సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీల కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్తో జరిగే టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్లో ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ వివరాలు..జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. టోర్నీకి సంబంధించిన మ్యాచ్ తేదీలను, వేదికలను ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగనున్నాయి. -
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 16 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం
న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య కివీస్‌ను 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.కాగా న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం 16 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 583 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ 259 పరుగులకు ఆలౌటైంది.న్యూజిలాండ్ బ్యాటర్లలో టామ్ బ్లండెల్(115) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు.హ్యారీ బ్రూక్ సూపర్ సెంచరీ.. అంతకుముందు ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(106) సూపర్ సెంచరీతో చెలరేగాడు. అదే విధంగా బెన్ డకెట్(92), జాకెబ్ బెతల్(96) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు.మ్యాచ్ స్కోర్లు..ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 280/10న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 125/10ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 424/6 డిక్లేర్కివీస్ రెండో ఇన్నింగ్స్: 259/10ఫలితం: 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయంప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్: హ్యారీ బ్రూక్ -
WTC: ఇవేం లెక్కలు.. ఇవేం శిక్షలు: ఐసీసీపై బెన్ స్టోక్స్ ఆగ్రహం
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీరుపై ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ విమర్శలు గుప్పించాడు. ఓవర్ రేటు విషయంలో తమకు అన్యాయం జరిగిందనే అర్థం స్ఫురించేలా సోషల్ మీడియా వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య కివీస్ జట్టుపై గెలుపుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ ఆతిథ్య కివీస్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.పెనాల్టీ వేసిన ఐసీసీఅయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదైందన్న కారణంగా ఐసీసీ ఇంగ్లండ్- న్యూజిలాండ్‌లకు పెనాల్టీ వేసింది. డబ్ల్యూటీసీ పాయింట్లలో మూడు పాయింట్ల మేర కోత పెట్టింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ స్పందిస్తూ.. ‘చాలా మంచిది ఐసీసీ... మరో పది గంటల ఆట మిగిలి ఉండగానే టెస్టు ముగిసింది’... అని సెటైర్ వేశాడు.స్టోక్స్‌కు ఆగ్రహానికి కారణం?ఇదిలా ఉంటే.. 2021–23 డబ్ల్యూటీసీ ఎడిషన్‌లోనూ ఇంగ్లండ్ ఇదే కారణంగా ఏకంగా 22 పాయింట్లు కోల్పోయింది. గత ఏడాది యాషెస్ సిరీస్ ఫలితం తర్వాత ఇంగ్లండ్ ఖాతాలో 28 పాయింట్లు చేరగా... పెనాల్టీ రూపంలోనే 19 పాయింట్లు పోయాయి! సహజంగానే ఇది స్టోక్స్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు ఓవర్ రేట్ శిక్షలు అనేవే అత్యంత గందరగోళంగా ఉన్నాయని అతడు అన్నాడు.గతంలోనూ తాను ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని స్టోక్స్ గుర్తు చేశాడు. టెస్టు మ్యాచ్ నిర్ణీత సమయంకంటే చాలా ముందే ముగిసిపోయినా... ఓవర్ రేట్ శిక్షలు వేయడం ఏమిటని అతను ప్రశ్నించాడు. ‘రెండు జట్ల కోణంలో ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే టెస్టు మ్యాచ్ చాలా ముందుగానే ముగిసింది. మ్యాచ్‌లో ఫలితం కూడా వచ్చింది. అసలు ఏమాత్రం అవగాహన లేకుండా వేస్తున్న పెనాల్టీలు తీవ్ర అసహనం కలిగిస్తున్నాయి.ఉపఖండంలో ఇలాంటి సమస్య రాదుప్రపంచంలో మనం ఎక్కడ క్రికెట్ ఆడుతున్నామనేది కూడా ముఖ్యం. ఉపఖండంలో జరిగే మ్యాచ్‌లలో ఎప్పుడూ ఈ సమస్య రాదు. ఎందుకంటే అక్కడ స్పిన్నర్లు ఎక్కువ ఓవర్లు బౌల్ చేస్తారు. మైదానంలో బౌలర్‌తో మళ్లీ మళ్లీ మాట్లాడటంతో పాటు ఓవర్ల తర్వాత ఫీల్డింగ్ మార్పులు, వ్యూహాల్లో మార్పులు వంటి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.ఒక కెప్టెన్‌గా నేను ఇదే పని చేస్తాను. ఇవన్నీ పట్టించుకోకుండా తొందరపెడితే ఎలా?.. మేం అక్కడ ఉన్నది మ్యాచ్ ఆడటానికి అనే విషయం మరచిపోవద్దు. చాలా మంది ఆటగాళ్లది ఇదే అభిప్రాయం. ఐసీసీ ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది. ఐసీసీ నుంచి స్పందన రాలేదుఏడాది క్రితం కూడా నేను దీనిపై మాట్లాడాను. కానీ ఐసీసీ నుంచి స్పందన రాలేదు. అందుకే అప్పటి నుంచి ఓవర్ రేట్ పెనాల్టీ షీట్లపై సంతకం పెట్టలేదు. కానీ ఐసీసీ జరిమానా విధించి పాయింట్లతో కోత ఎలాగూ విధిస్తుంది’ అని స్టోక్స్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించాడు. చదవండి: ‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’ -
అందుకే ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాను: స్టోక్స్
క్రైస్ట్‌చర్చ్: జాతీయ జట్టు తరఫున సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడాలని తాను కోరుకుంటున్నానని... ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లాంటి ఇతర టోర్నీలకు దూరంగా ఉంటున్నానని ఇంగ్లండ్ టెస్టు కెపె్టన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలం కోసం తన పేరును నమోదు చేసుకోకుండా స్టోక్స్ ముందే తప్పుకున్నాడు. గతంలో పుణే, చెన్నై, రాజస్తాన్ జట్ల తరఫున ఆడిన స్టోక్స్‌కు లీగ్‌లో మంచి విలువే పలికింది. అయితే ప్రస్తుత స్థితిలో ఇంగ్లండ్ జట్టు తరఫున కెరీర్‌ను పొడిగించుకోవడమే తన ప్రథమ ప్రాధాన్యత అని అతను స్పష్టం చేశాడు. ఐపీఎల్ తాజా నిబంధన ప్రకారం 2026 వరకు కూడా అతని లీగ్‌లో ఆడే అవకాశం లేదు. ‘నా కెరీర్లో ఇప్పుడు చివరి దశకు చేరుకుంటున్నాననేది వాస్తవం. సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడేందుకు నేను ప్రయత్నిస్తా. నా ఫిట్నెస్ను చూసుకోవడం కూడా చాలా కీలకం. ఈ దశలో ఎప్పుడు ఆడాలనే అంశంపై నా ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కెరీర్ పొడిగించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. వేర్వేరు చోట్ల వరుసగా క్రికెట్ సాగుతున్న ప్రస్తుత దశలో ఇంగ్లండ్ తరఫున ఎక్కువ కాలం ఆడాలనేది నా కోరిక. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకున్నా’ అని స్టోక్స్ వెల్లడించాడు. సుదీర్ఘ మోకాలి గాయం నుంచి ఇటీవలే కోలుకొని మళ్లీ బరిలోకి దిగిన స్టోక్స్‌కు అక్టోబర్ 2026 వరకు ఇంగ్లండ్ బోర్డు కాంట్రాక్ట్ ఉంది. నేటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహిస్తున్న స్టోక్స్‌కు వచ్చే ఏడాది స్వదేశంలో భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్, ఆపై యాషెస్ సిరీస్ కీలకం కానున్నాయి. గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు దూరంగా ఉంటున్న స్టోక్స్ త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ వన్డేలు ఆడే అవకాశం ఉంది. -
ఐపీఎల్-2025కు స్టార్ ప్లేయర్ దూరం.. కారణమిదేనా?
ఐపీఎల్-2025 సీజన్‌కు ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో తన పేరును నమోదు చేయకూడదని స్టోక్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది బిజీ టెస్టు షెడ్యూల్ కారణంగా స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది. టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం.. వచ్చే ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ సీజన్ వేలానికి స్టోక్స్‌తో పాటు మరికొంతమంది ఇంగ్లీష్ ఆటగాళ్లు సైతం దూరంగా ఉండనున్నట్లు సమాచారం. కాగా స్టోక్సీ చివరగా ఐపీఎల్-2023 సీజన్లో ఆడాడు. సీఎస్కే అతడిని రూ.16.25 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసింది. కానీ తన ధరకు తగ్గ న్యాయం స్టోక్స్ చేయలేకపోయాడు. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన స్టోక్స్ గాయం కారణంగా మిగిలిన సీజన్ మొత్తానికి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు స్టోక్సీను చెన్నై ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. ఐపీఎల్-2024 వేలంలోనూ ఈ ఇంగ్లీష్ క్రికెటర్ వ్యక్తిగత కారణాలతో పాల్గోలేదు. ఇప్పుడు ఐపీఎల్-2025 మెగా వేలం కూడా దూరం కానున్నాడు.రేపే లాస్ట్.. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు గడువు ఆదివారం(నవంబర్ 3)తో ముగియనుంది. అయితే వచ్చే ఏడాది సీజన్ వేలానికి ముందు బీసీసీఐ రూల్స్‌ను మరింత కఠినం చేసిన సంగతి తెలిసిందే. ఒక్కసారి వేలంలో ఏదైనా జట్టు ఆటగాడిని తీసుకుంటే కనీసం మూడేళ్లపాటు ఉండాల్సిందేనని షరతు విధించింది. దీంతో చాలా మంది ఆటగాళ్లు విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాల వద్ద అన్న సందిగ్ధంలో పడ్డారు. కాగా మెగా వేలం నవంబర్ ఆఖరిలో సౌథీ అరేబియా వేదికగా జరిగే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి -
స్టోక్స్ పాక్ పర్యటనలో ఉన్నవేళ.. కుటుంబానికి భయానక అనుభవం
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పలు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. స్టోక్స్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ సారథి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.ముసుగు దొంగలు తన ఇంట్లో ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారని స్టోక్స్ తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారని.. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి హానీ జరగలేదన్నాడు. ఈ పని ఎవరు చేశారో తెలియాల్సి ఉందని.. త్వరగా దొంగలను పట్టుకోవడంలో తమకు సహకరించాలని కోరాడు. పాక్ పర్యటనలో ఉన్న సమయంలోఏదేమైనా కష్ట సమయంలో తన కుటుంబానికి పోలీసులు అండగా ఉన్నారని.. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘అక్టోబరు 17, గురువారం.. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు నార్త్ ఈస్ట్‌లో గల కాసిల్ ఈడెన్ ఏరియాలో ఉన్న మా ఇంట్లోకి చొరబడ్డారు. నా భార్యా పిల్లలకు భయానక అనుభవంర్యా నగలు, విలువైన వస్తువులు ఎత్తుకుపోయారు. అందులో మా కుటుంబానికి అతి ముఖ్యమైన వస్తువులు కూడా ఉన్నాయి. దొంగలను పట్టుకునేందుకు దయచేసి నాకు సహాయం చేయండి. నిజానికి ఈ దుర్ఘటన జరిగినపుడు నా భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అయితే, వారిపై దొంగలు ఎలాంటి భౌతిక దాడికి పాల్పడలేదు. కానీ.. ఆ సమయంలో వారి మనఃస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందో.. దాని ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అందుకే ఫొటోలు షేర్ చేస్తున్నానా ఇంట్లో చోరీకి గురైన వస్తువుల ఫొటోలు విడుదల చేస్తున్నాను. వాటిని ఎవరైనా సులువుగా గుర్తించవచ్చు. తద్వారా దొంగలను పట్టుకునే వీలు కలుగుతుంది. మాకెంతో ముఖ్యమైన వస్తువులు పోయినప్పటికీ.. కేవలం వాటిని రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పోస్టు పెట్టడం లేదు.ఈ పని చేసిన దుండగులు ఎవరో కనిపెట్టడం కోసమే వాటి ఫొటోలు షేర్ చేస్తున్నా. విపత్కరకాలంలో మా కుటుంబానికి స్థానిక పోలీసులు అండగా నిలిచారు. వారి మేలు మర్చిపోలేనిది. ఆ దొంగలను పట్టుకునేందుకు మేమంతా తీవ్రం శ్రమిస్తున్నాం’’ అని స్టోక్స్ ఎక్స్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.పాక్ చేతిలో ఘోర ఓటమికాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు స్టోక్స్ ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా తొలి మ్యాచ్‌కు అతడు దూరంగా ఉన్నాడు. అయితే, ఆ తర్వాత అతడు తిరిగి వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆఖరి రెండు టెస్టుల్లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. తద్వారా సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలంpic.twitter.com/1nEmNcrnjQ— Ben Stokes (@benstokes38) October 30, 2024 -
Eng vs NZ: ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రకటన.. ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ ఎంట్రీ
పాకిస్తాన్లో చేదు అనుభవం చవిచూసిన ఇంగ్లండ్ తదుపరి మరో పర్యటనకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం తమ జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ ఈ టూర్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో జాకోబ్ బెతెల్ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.కాగా బెన్ స్టోక్స్ బృందం ఇటీవల పాకిస్తాన్లో మూడు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. పాక్ గడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్.. రెండు, మూడో టెస్టుల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది. ‘బజ్‌బాల్’కు కళ్లెం వేసిన పాక్ స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో 1-2తో ఇంగ్లండ్ పాకిస్తాన్‌కు సిరీస్‌ను కోల్పోయింది.కివీస్‌తో మూడు టెస్టులుఈ క్రమంలో నవంబరు 28 నుంచి ఇంగ్లండ్ న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆరంభం కానున్న ఈ సిరీస్‌కు ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన జేమీ స్మిత్ దూరమయ్యాడు. అతడు పెటర్నిటీ సెలవులో వెళ్లిన కారణంగా.. జోర్డాన్ కాక్స్ వికెట్ కీపర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.మరోవైపు.. ఇటీవల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించిన ఆల్‌రౌండర్ జాకోబ్ బెతెల్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 20 మ్యాచ్‌లు ఆడిన జాకోబ్ 738 పరుగులు చేశాడు. అదే విధంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అతడు ఏడు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈసారి అరంగేట్రం పక్కామరోవైపు.. కాక్స్ 53 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 3194 పరుగులతో రాణించాడు. దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారించినప్పటికీ అతడు ఇంతవరకు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. శ్రీలంక సిరీస్ నుంచి జట్టుతోనే ఉన్నా ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఈసారి మాత్రం ఈ వికెట్ కీపర్ బ్యాటర్ టెస్టు క్యాప్ అందుకునే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక కివీస్‌తో సిరీస్ ఆడే జట్టులో ముగ్గురు స్పిన్నర్లు జాక్ లీచ్, షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్‌లకు కూడా చోటిచ్చారు సెలక్టర్లు. కాగా 2008 తర్వాత ఇంగ్లండ్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవకపోవడం గమనార్హం. ఇక కివీస్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది.న్యూజిలాండ్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్(కెప్టెన్), రేహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకోబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జాక్ లీచ్, ఒలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: Mumbai Pitch: కివీస్‌తో మూడో టెస్టు.. తొలిరోజు వారికే అనుకూలం!? -
పాక్‌తో మూడో టెస్ట్.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. రెండు మార్పులు
రావల్పిండి వేదికగా అక్టోబర్ 24 నుంచి పాకిస్తాన్‌తో జరుగబోయే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (అక్టోబర్ 22) ప్రకటించారు. ఈ జట్టులో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లకు చోటు దక్కింది. రావల్పిండి పిచ్ స్లో బౌలర్లకు అనుకూలించనుందన్న అంచనాతో ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రెండో టెస్ట్ ఆడిన జట్టులో ఇద్దరు పేసర్లను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్ స్థానాల్లో రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్ తుది జట్టులోకి వచ్చారు. జాక్ లీచ్.. షోయబ్ బషీర్‌తో కలిసి మూడో స్పిన్నర్‌గా కొనసాగుతాడు. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ వరుస స్థానాల్లో కొనసాగనున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో బెన్ స్టోక్స్, వికెట్‌కీపర్‌గా జేమీ స్మిత్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.పాకిస్తాన్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, జాక్ లీచ్, షోయబ్ బషీర్కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో పాక్ 152 పరుగుల తేడాతో గెలుపొందింది. చదవండి: వారెవ్వా బదోని.. వాటే క్యాచ్! మైండ్ బ్లోయింగ్(వీడియో) -
పాక్‌తో రెండో టెస్ట్.. ఇంగ్లండ్ కెప్టెన్ రీఎంట్రీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ రేపటి నుంచి (అక్టోబర్ 15) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. స్టోక్స్ గాయం కారణంగా ఇంగ్లండ్ ఆడిన గత నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ జట్టుకు ఓలీ పోప్ నాయకత్వం వహించాడు. పోప్ నాయకత్వంలో ఇంగ్లండ్ నాలుగింట మూడు మ్యాచ్‌లు గెలిచింది. తాజాగా స్టోక్స్ చేరికతో ఇంగ్లండ్ జట్టు బలం మరింత పెరిగినట్లైంది. స్టోక్స్‌ను తుది జట్టులోకి తీసుకున్న క్రమంలో క్రిస్ వోక్స్‌కు తప్పించించి ఇంగ్లండ్ మేనేజ్మెంట్. ఈ మార్పుతో పాటు ఇంగ్లండ్ మేనేజ్మెంట్ మరో మార్పు కూడా చేసింది. తొలి టెస్ట్‌లో ఆడిన గస్ అట్కిన్సన్ స్థానంలో మాథ్యూ పాట్స్‌ను తుది జట్టులోకి తీసుకుంది. స్టోక్స్ జట్టులో చేరిన క్రమంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి స్టోక్స్‌కే అప్పజెప్పాడు.మరోవైపు రెండో టెస్ట్‌కు ముందు పాకిస్తాన్ జట్టు కూడా భారీ మార్పులు చేసింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలను పక్కకు పెట్టింది. ఇంగ్లండ్‌తో తదుపరి ఆడే రెండు టెస్ట్‌లకు వీరు దూరంగా ఉంటారు. వీరితో పాటు డెంగ్యూతో బాధపడుతున్న అబ్రార్ అహ్మద్ కూడా రెండో టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.పాక్‌తో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, షోయబ్ బషీర్కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్ -
పాక్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! కెప్టెన్ దూరం
పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లీష్ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఆక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఫస్ట్ టెస్టుకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ క్రికెట్ ప్రకటించింది.ముల్తాన్ టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న స్టోక్స్.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరికొంత సమయం పట్టనుంది. దీంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఓలీ పోప్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సే ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు. మరోవైపు ఈ సిరీస్‌తో స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత అతడు ఇంగ్లండ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకపై బ్యాట్, బాల్‌తో సత్తాచాటిన గుస్ అట్కిన్సన్కు కూడా ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ తొలి టెస్టుకు చోటు కల్పించింది.పాక్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే..జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే , జాక్ లీచ్, షోయబ్ బషీర్చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా? -
Pak vs Eng: పాకిస్తాన్‌తో తొలి టెస్టు.. బెన్ స్టోక్స్ దూరం!
పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆల్‌రౌండర్ ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని సమాచారం. దీంతో ఒలీ పోప్ మరోసారి స్టోక్స్ స్థానంలో జట్టును ముందుకు నడిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ది హండ్రెడ్ లీగ్ 2024 సందర్భంగా బెన్ స్టోక్స్ గాయపడిన విషయం తెలిసిందే. నార్తర్న్ సూపర్చార్జెర్స్కు ప్రాతినిథ్యం వహించిన అతడు తొడకండరాల నొప్పితో జట్టుకు దూరమయ్యాడు. దీంతో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ కూడా ఆడలేకపోయాడు.ఈ క్రమంలో ఒలీ పోప్ సారథ్య బాధ్యతలు చేపట్టగా.. ఇంగ్లండ్ శ్రీలంకపై మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, కెప్టెన్సీ పోప్ వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపగా.. అతడు విమర్శల పాలయ్యాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 7 నుంచి పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది.ముల్తాన్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టుఇందుకోసం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ముల్తాన్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే మాట్లాడుతూ.. స్టోక్స్ గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. ‘‘ఇంకో రెండు మూడు వైద్య పరీక్షల తర్వాత అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడో లేదో తెలుస్తుంది. పూర్తిగా కోలుకున్నాడనే అనుకుంటున్నాం.రిస్క్ తీసుకోవడం అనవసరంమ్యాచ్ ఆడేందుకు తను సిద్ధంగా ఉన్నాడు. అయితే, రిస్క్ తీసుకోవడం అనవసరం. మా జట్టు పటిష్టంగా ఉంది. ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్రౌండర్లుగా రాణించగల సమర్థులు ఉన్నారు. అందుకే.. అతడిపై మేనేజ్మెంట్ ఒత్తిడి పెట్టదలచుకోలేదు’’ అని జాక్ క్రాలే మీడియాతో పేర్కొన్నాడు. కాగా క్రాలే సైతం చేతి వేలికి గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతడు శ్రీలంకతో టెస్టులు మిస్సయ్యాడు. అతడి స్థానంలో డాన్ లారెన్స్ ఓపెనింగ్ చేశాడు. పాక్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జోష్ హల్, జాక్ లీచ్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, రెహాన్ అహ్మద్, జో రూట్, షోయబ్ బషీర్, జేమీ స్మిత్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: ఇషాన్ కిషన్ ఆశలపై నీళ్లు చల్లిన టీమిండియా స్టార్ -
Pak vs Eng Tests: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ
పాకిస్తాన్ పర్యటనకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. యువ బౌలర్ జోష్ హల్(Josh Hull).. పాక్‌తో టెస్టు సిరీస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్దారించింది. తొడ కండరాల నొప్పి కారణంగా.. పాకిస్తాన్ టూర్‌కు జోష్ దూరమయ్యాడని తెలిపింది. అతడు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించింది.అరంగేట్రంలో రాణించికాగా లీసస్టర్ఫైర్కు చెందిన లెఫ్టార్మ్ పేసర్ జోష్ హల్ ఇటీవలే ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. సొంతగడ్డపై శ్రీలంకతో ఓవల్ టెస్టు(సెప్టెంబరు 6, 2024) సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసి 53 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.గాయం కారణంగాఅయితే, ఈ మ్యాచ్ తర్వాత జోష్ తొడ కండరాల నొప్పి కారణంగా ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ నాటికి అతడు ఫిట్నెస్ సాధిస్తాడని భావించిన సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేశారు. కానీ.. జోష్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ 16 మంది సభ్యుల జట్టుతోనే పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆరు ఫీట్ల ఏడు అంగుళాల ఎత్తు ఉండే జోష్ హల్కు ఇంగ్లండ్ బోర్డు ప్రత్యామ్నాయ బౌలర్‌ను ప్రకటించకపోవడం ఇందుకు కారణం.వుడ్ కూడా లేడుకాగా దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ పేస్ దళంలో క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. అయితే, మార్క్ వుడ్ శ్రీలంకతో సిరీస్ తర్వాత ఈ ఏడాది తదుపరి సిరీస్లన్నింటికి దూరం కాగా.. ఇప్పుడు జోష్ కూడా అందుబాటులో లేకపోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక అక్టోబరు 7 నుంచి 28 వరకు పాకిస్తాన్- ఇంగ్లండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్న విషయం తెలిసిందే. ముల్తాన్, రావల్పిండి ఇందుకు వేదికలు.పాకిస్తాన్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జాక్ లీచ్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: టీ10 క్రికెట్లో సంచలనం.. స్కాట్లాండ్ క్రికెటర్ సుడిగాలి శతకం -
మరోసారి 'యూ టర్న్' తీసుకోనున్న బెన్ స్టోక్స్..!
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సారధి బెన్ స్టోక్స్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 2023 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని బరిలోకి దిగాడు. వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఘోర పరాభవం నేపథ్యంలో స్టోక్స్ అప్పటి నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు దూరంగా ఉన్నాడు. తాజాగా స్టోక్స్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లోని మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని క్లూ ఇచ్చాడు. ఈ విషయమై జట్టు కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ తనను సంప్రదిస్తే తాను రెడీ అంటూ సంకేతాలు పంపాడు.రిటైర్మెంట్ విషయమై ఆటగాళ్లు మనసు మార్చుకోవడం ఇటీవలికాలంలో పరిపాటిగా మారింది. చాలా మంది క్రికెటర్లు స్టోక్స్ లాగే తొలుత రిటైర్మెంట్ ప్రకటిస్తారు.. ఆతర్వాత ఆ కారణం.. ఈ కారణం చెప్పి తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారు. ఈ విషయాన్ని ఇటీవలే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తావించాడు. రిటైర్మెంట్పై యూ టర్న్ తీసుకోవడం ఆటగాళ్లకు ఫ్యాషన్‌గా మారిపోయిందని హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించాడు.స్టోక్స్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ టెస్ట్ సారధి వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఐసీసీ మెగా టోర్నీ కావడంతో స్టోక్స్ ఈ టోర్నీలో పాల్గొనాలని భావిస్తుండవచ్చు. మళ్లీ ఈ టోర్నీ అయిపోయిన వెంటనే స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్యర్యపోనక్కర్లేదు. 33 ఏళ్ల స్టోక్స్ ఫిట్నెస్ పరంగానూ పెద్దగా పర్ఫెక్ట్గా లేడు. టెస్ట్‌ల్లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు. బౌలింగ్ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో అతను తిరిగి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో బరిలోకి దిగినా పెద్దగా ప్రయోజనం ఉండదు. టెస్ట్‌ల్లో మాత్రం అతన్ని మ్యాచ్ విన్నర్‌గా తీసిపారేయడానికి వీళ్లేదు. జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సామర్థ్యం అతనికి ఇంకా ఉంది.స్టోక్స్ ఇంగ్లండ్ తరఫున 105 టెస్ట్‌లు, 114, 43 టీ20లు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను గత కొంతకాలం యాక్టివ్‌గా లేడు. మెక్కల్లమ్ ఇంగ్లండ్ ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత స్టోక్స్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. చదవండి: మెరుగుపడిన యశస్వి, గిల్ ర్యాంక్‌లు.. తలో ఐదు స్థానాలు కోల్పోయిన రోహిత్, విరాట్ -
నేను వాళ్లలా కాదు.. నాకు క్లారిటీ ఉంది: రోహిత్ విమర్శలు
రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకునే ఆటగాళ్లపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విమర్శలు గుప్పించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మళ్లీ తిరిగి రావడంలో అర్థం లేదన్నాడు. విదేశీ ఆటగాళ్లలో చాలా మంది ఇలా రిటైర్మెంట్ను ఓ జోక్‌లా మార్చేశారని.. అయితే, భారత్‌లో మాత్రం ఇలాంటివి జరగవని అభిప్రాయపడ్డాడు.టీమిండియాను చాంపియన్‌గా నిలిపితాను ఎట్టిపరిస్థితుల్లోనూ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయబోనని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. కాగా 2007లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన హిట్‌మ్యాన్.. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఆడాడు. తాజా.. తొమ్మిదో పొట్టి వరల్డ్‌కప్ టోర్నమెంట్లో కెప్టెన్ హోదాలో బరిలోకి దిగి టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్బైఅనంతరం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, రోహిత్ శర్మ టీమిండియా తరఫున పొట్టి క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అతడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుల్లో రిటైర్మెంట్ పెద్ద జోక్‌లా తయారైంది. చాలా మంది క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. నేను గుడ్‌బై చెప్పాను.. నా నిర్ణయంలో మార్పు లేదుఆ వెంటనే మళ్లీ తిరిగి వస్తున్నారు. అయితే, ఇండియాలో అలా జరుగదు. ఇతర దేశాల ఆటగాళ్లను నేను గమనిస్తున్నాను. వారిలో చాలా మంది రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంటున్నారు. కాబట్టి ఓ ఆటగాడు రిటైర్ అయ్యాడో లేదనన్న అంశంపై మనకు స్పష్టత ఉండదు. అయితే, నా విషయంలో అలా జరుగదు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు నేను గుడ్‌బై చెప్పాను. నా ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గతంలో వన్డేలకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.గతంలో చాలా మంది ఇలాగేఅయితే, వన్డే ప్రపంచకప్-2023కి ముందు తాను యూటర్న్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో అతడు పాల్గొన్నాడు. ఇక పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ సైతం కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. మేనేజ్మెంట్ అతడిని వెనక్కి రప్పించింది. ఇటీవలి టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆమిర్ ఆడాడు. అదే విధంగా గతంలో షాహిద్ ఆఫ్రిది కూడా పలుమార్లు రిటైర్మెంట్ ప్రకటించి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గురువారం(సెప్టెంబరు 19) నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌తో బిజీ కానున్నాడు. చదవండి: వరల్డ్ నంబర్ వన్‌గా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు.. ఏకంగా.. -
ఇదొక అద్భుత నిర్ణయం.. నిజంగా నమ్మలేకపోతున్నాను: బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ పురుషుల జట్టు పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెస్టుల్లో ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా ఉన్న మెకల్లమ్‌కు ఆదేశ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రమోషన్ ఇచ్చింది. ఇకపై మూడు ఫార్మాట్లలో ఇంగ్లీష్ జట్టు హెడ్‌కోచ్‌గా మెకల్లమ్ వ్యవహరించనున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌తో వైట్‌బాల్ కోచ్‌గా మెకల్లమ్ తన ప్రయణాన్ని ప్రారంభించనున్నాడు.టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం తర్వాత ఇంగ్లండ్ హెడ్‌కోచ్ పదవి నుంచి మాథ్యూ మోట్ తప్పుకోవడంతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది. ఇక వైట్‌బాల్ కోచ్ మెకల్లమ్ ఎంపికపై ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తాజాగా స్పందించాడు. ఇదొక సంచలన నిర్ణయమని స్టోక్స్ అన్నాడు."మెకల్లమ్ మా జట్టు వైట్ బాల్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. తొలుత ఈ వార్త విని చాలా ఆశ్చర్యపోయాను. అన్ని ఫార్మాట్లలో మెకల్లమ్ కోచ్‌గా ఎంపిక అవ్వడం ఇంగ్లండ్ క్రికెట్ ప్రపంచంలో తిరిగిలేని శక్తిగా అవతరిస్తుంది.ఇదొక అద్భుతమైన నిర్ణయం. అతడు ఇప్పటికే కోచ్‌గా టెస్టుల్లో ఏమి సాధించాడో మనం చూశాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా బాజ్(మెకల్లమ్)తో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అతడికి వైట్‌బాల్ క్రికెట్లో చాలా అనుభవం ఉంది.అదే విధంగా బట్లర్ కూడా మెకల్లమ్‌తో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నడాని నేను భావిస్తున్నాను. చాలా మంది కొత్త ఆటగాళ్లు కూడా మెకల్లమ్ గైడన్స్‌లో ఆడేందుకు సముఖత చూపుతారు. ఇది యువ ఆటగాళ్లకు మంచి అవకాశమని" ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోక్సీ పేర్కొన్నాడు. -
ముంబై ఇండియన్స్‌లోకి బెన్ స్టోక్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 ఎడిషన్ కోసం ఎంపిక చేసిన ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ జట్టుకు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. స్టోక్స్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ను కూడా ఎంపిక చేసుకుంది ఎంఐ కేప్‌టౌన్ యాజమాన్యం. ఈ జట్టులో రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, రస్సీ వాన్ వర్ డస్సెన్, డెవాల్డ్ బ్రెవిస్, నువాన్ తషార లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్నారు. 14 మంది సభ్యుల జట్టును ఎంఐ కేప్‌టౌన్ యాజమాన్యం ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించింది. కాగా, బెన్ స్టోక్స్ తాజాగా హండ్రెడ్ లీగ్ ఆడుతూ గాయపడిన విషయం తెలిసిందే. తొడ కండరాలు పట్టేయడంతో స్టోక్స్ శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.ఇదిలా ఉంటే, ఆరు ఫ్రాంచైజీలు పాల్గొనే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇప్పటివరకు రెండు ఎడిషన్లు జరిగాయి. రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఫ్రాంచైజీనే విజేతగా నిలిచింది. ఎస్ఏ20 2025 సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న మొదలై ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ఎంఐ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు పాల్గొంటాయి.ఎస్ఏ20 2025 ఎడిషన్ కోసం ఎంఐ కేప్‌టౌన్ జట్టు..బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నువాన్ తుషార, క్రిస్ బెంజమిన్, కగిసో రబాడ, డెవాల్డ్ బ్రెవిస్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, డెలానో పాట్గెయిటర్, థామస్ కేబర్, కానర్ ఎస్టర్‌హ్యుజెన్ -
ఊహించిందే జరిగింది.. ఇంగ్లండ్ కెప్టెన్‌గా స్టార్ క్రికెటర్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. ది హండ్రడ్ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టోక్స్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. పేసర్ ఆలీ రాబిన్సన్ బౌలింగ్ లో స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో స్టోక్స్ తొడ కండరాలు పట్టేశాయి. ఈ క్రమంలో పరిగెత్తలేక గ్రౌండ్ లోనే పడిపోయి వైద్య సహాయాన్ని కోరాడు. దీంతో ఫిజియోలు వెంటనే పరిగెత్తుకొచ్చి అతనికి చికిత్స అందించారు.అనంతరం అస్పత్రికి తీసుకువెళ్లి స్కాన్ చేయగా అతడి గాయం తీవ్రమైనదిగా తేలింది. ఈ క్రమంలోనే శ్రీలంకతో టెస్టు సిరీస్‌తో పాటు ఈ వేసవిలో మిగిలిన మ్యాచ్‌లన్నింటికి ఈ దిగ్గజ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ దూరమయ్యాడు.ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్..ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్‌గా మిడిలార్డర్ స్టార్ బ్యాటర్ ఓలీ పోప్ ఎంపికయ్యాడు. స్టోక్సీ డిప్యూటీగా ఉన్న పోప్‌కు మరోసారి కెప్టెన్సీ చేసే అవకాశం లభించింది. అయితే పోప్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ఇంకా స్టోక్స్ స్ధానాన్ని మాత్రం భర్తీ చేయలేదు. ఇక ఇంగ్లండ్-శ్రీలంక మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. స్టోక్స్ తిరిగి మళ్లీ పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో వచ్చే అవకాశముంది.శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..ఓలీ పోప్ (కెప్టెన్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జోర్డన్ కాక్స్, బెన్ డకెట్, డాన్ లారెన్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ -
ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. ఆ సిరీస్‌కు కెప్టెన్ దూరం
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయకారణంగా లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ది హాండ్రడ్ లీగ్‌లో నార్తర్న్ సూపర్ఛార్జర్స్కు బెన్ స్టోక్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం(ఆగస్టు 11) ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో సింగిల్ కోసం వేగంగా పరిగెత్తడంతో స్టోక్సీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో తీవ్రమైన నొప్పితో అతడు విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి అతడి నొప్పి మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఫిజియో సాయంతో స్టోక్స్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయంపై నార్తర్న్ సూపర్ఛార్జర్స్ కెప్టెన్, సహచరుడు హ్యారీ బ్రూక్ అప్డేట్ ఇచ్చాడు."ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ స్టోక్సీ గాయపడ్డాడు. అతడిని సోమవారం(ఆగస్టు 12) స్కానింగ్‌కు తీసుకువెళ్లనున్నాము. ఆ తర్వాత స్టోక్స్ గాయంపై ఓ అంచనా వస్తుంది. అయితే అతడు మాత్రం తీవ్రమైన నొప్పితో బాధపడతున్నాడు. నిజంగా మాకు గట్టి ఎదురు దెబ్బ" అని బ్రూక్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్లో భాగంగా జరగనున్న ఈ సిరీస్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌కు ఇప్పటికే స్టార్ ఓపెన్ జాక్ క్రాలీ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు కెప్టెన్ స్టోక్స్ కూడా గాయపడటం ఇంగ్లండ్ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది -
లంకతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
ఈ నెల (ఆగస్ట్) 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 4) ప్రకటించారు. ఈ జట్టుకు బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. జోర్డన్ కాక్స్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్ కొత్తగా ఎంపికయ్యారు. లంకతో సిరీస్‌లో తొలి టెస్ట్ ఆగస్ట్ 21న (ఓల్డ్ ట్రాఫోర్డ్).. రెండో టెస్ట్ ఆగస్ట్ 29న (లార్డ్స్).. మూడో టెస్ట్ సెప్టంబర్ 6న (కెన్నింగ్స్టన్ ఓవల్) మొదలుకానున్నాయి. ఇంగ్లండ్ ఇటీవలే స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జోర్డన్ కాక్స్, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ -
బెన్ స్టోక్స్ ఊచకోత.. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (జులై 28) ముగిసిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పర్యాటక జట్టును చిత్తుగా ఓడించింది. మార్క్ వుడ్ (14-1-40-5) సెకెండ్ ఇన్నింగ్స్‌లో విండీస్‌ను కకావికలం (175 ఆలౌట్) చేశాడు. అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 7.2 ఓవర్లలో ఛేదించింది. బెన్ స్టోక్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగి విండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు చేశాడు. గతంలో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు ఇయాన్ బోథమ్ (28 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు పాక్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ (21) పేరిట ఉంది. BEN STOKES - Fastest fifty in England Test history. 🔥🥶 pic.twitter.com/Lphj1mAap5— Johns. (@CricCrazyJohns) July 28, 2024మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప లక్ష్య ఛేదనలో స్టోక్స్‌కు జతగా బెన్ డకెట్ (16 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) కూడా చెలరేగాడు. ఓవర్‌నైట్ స్కోర్ 33/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్.. మరో 142 పరుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది (175 పరుగులకు ఆలౌట్). మార్క్ వుడ్ ఐదేసి విండీస్‌ను కుప్పకూల్చాడు. అట్కిన్సన్ 2, వోక్స్, షోయబ్ బషీర్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ బ్యాటర్లలో మికైల్ లూయిస్ (57), కవెమ్ హాడ్జ్ (55) హాఫ్ సెంచరీలు చేశాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. -
టెస్ట్ మ్యాచ్ అనుకున్నావా.. టీ20 అనుకున్నావా.. ఇంతలా బాదితే ఎలా..?
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (జులై 28) ముగిసిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటిన ఇంగ్లండ్ కేవలం రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఆట మూడో రోజు విండీస్‌ను 175 పరుగులకే ఆలౌట్ (సెకెండ్ ఇన్నింగ్స్) చేసిన ఇంగ్లండ్.. 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 7.2 ఓవర్లలోనే ఛేదించింది. ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్టోక్స్.. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. స్టోక్స్ వీరబాదుడు ధాటికి విండీస్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యం కళ్లు మూసుకుని తెరిచే లోగా హాం ఫట్ అయ్యింది. స్టోక్స్‌కు జతగా బరిలోకి దిగిన బెన్ డకెట్ (16 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) సైతం మరో ఎండ్‌లో చెలరేగాడు. స్టోక్స్ బజ్‌బాల్ గేమ్‌ను చూసిన వారు "టెస్ట్ మ్యాచ్ అనుకున్నావా లేక టీ20 అనుకున్నావా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓవర్‌నైట్ స్కోర్ 33/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్.. మరో 142 పరుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మార్క్ వుడ్ (5/40) ఐదేసి విండీస్‌ను కుప్పకూల్చాడు. అట్కిన్సన్ 2, వోక్స్, షోయబ్ బషీర్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ బ్యాటర్లలో మికైల్ లూయిస్ (57), కవెమ్ హాడ్జ్ (55) హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు. -
రాణించిన రూట్, స్టోక్స్.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న స్మిత్
బర్మింగ్హమ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టెయిలెండర్లు సత్తా చాటారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 3, మార్క్ వుడ్ 0, ఓలీ పోప్ 10, హ్యారీ బ్రూక్ 2 నిరాశపర్చగా.. పదో నంబర్ ఆటగాడు గస్ అట్కిన్సన్ 21 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఆలౌటైన అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (0), కిర్క్ మెక్కెంజీ (8) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (18), అలిక్ అథనాజ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించి, సిరీస్‌ను ఇదివరకే కైవసం చేసుకుంది. -
బెన్ స్టోక్స్ డూప్.. వైరల్ వీడియో
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను పోలిన ఓ వ్యక్తి స్టాండ్స్‌లో తారసపడ్డాడు. సదరు వ్యక్తిని చూసి బెన్ స్టోక్స్ ఆశ్చర్యపోయాడు. గడ్డం, హెయిర్ స్టయిల్, ముఖ ఆకృతి తనలాగే ఉండటంతో స్టోక్స్ కళ్లప్పగించి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.TWO BEN STOKES IN THE TEST MATCH....!!!! 🤯 pic.twitter.com/qU3kQm9Zyy— Johns. (@CricCrazyJohns) July 21, 2024ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457, రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఓలీ పోప్ (121), హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122).. విండీస్ ఆటగాడు కవెమ్ హాడ్జ్ (120) సెంచరీలు చేశారు. సిరీస్‌లో నామమాత్రపు మూడో టెస్ట్ జులై 26న మొదలవుతుంది. -
ముంబై ఇండియన్స్‌లోకి బెన్ స్టోక్స్.. వామ్మో ఇన్ని కోట్లా?
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భాగం కానున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ తరపున స్టోక్స్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీతో రూ. 8.5 కోట్ల భారీ ధరకు స్టోక్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. స్టోక్సీ ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బీజీబీజీగా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులగా స్టోక్స్ పొట్టి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టిసారించేందుకు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు కూడా దూరమయ్యాడు. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన స్టోక్స్.. ఈ ఏడాది మినీ వేలానికి ముందు తన నిర్ణయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీకి తెలియజేశాడు. దీంతో అతడిని సీఎస్కే రిటైన్ చేసుకోలేదు. ఒకవేళ ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీతో స్టోక్స్ చేరితో ఆ జట్టు మరింత పటిష్టంగా మారనుంది. ఇప్పటికే ఆ జట్టులో కిరాన్ పొలార్డ్, రషీద్‌ఖాన్, రబాడ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. అయినప్పటకి గత రెండు సీజన్లలో కేప్‌టౌన్ జట్టు చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. స్టోక్సీ రాకతోనైనా ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ తలరాత మారుతుందో లేదో వేచి చూడాలి. అదేవిధంగా ఈ ఏడాది ది హాండ్రడ్ లీగ్‌లో కూడా స్టోక్స్ ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జో రూట్‌తో సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంచైజీ పార్ల్ రాయల్స్ ఒప్పందం కుదర్చుకుంది. -
చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. అరుదైన రికార్డు
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ ఇంగ్లిష్ ఆటగాడికీ సాధ్యం కాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్ ప్రస్తుతం వెస్టిండీస్‌తో సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది.తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకేఆతిథ్య జట్టు ఆది నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూ ఇన్నింగ్స్ విజయంపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే వెస్టిండీస్‌ను ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. 371 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్ జట్టుకు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్, అరంగేట్ర బౌలర్ గుస్ అట్కిన్సన్, కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేసి వికెట్లు కూల్చారు.ఇన్నింగ్స్ ఓటమి దిశగా విండీస్ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికే వెస్టిండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 79 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా.. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే వెస్టిండీస్ మరో 171 పరుగులు చేయాలి. అయితే, ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.ఇదిలా ఉంటే.. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ ఓపెనర్ మిక్లే లూయీస్(14), వన్‌డౌన్ బ్యాటర్ కిర్క్ మెకాంజీ(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్‌లోనూ మిక్లే లూయీస్(27) స్టోక్సే అవుట్ చేయడం విశేషం.చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. అరుదైన రికార్డుఈ క్రమంలో స్టోక్స్ టెస్టుల్లో అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్ తరఫున ఆరు వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు రెండు వందలకు పైగా వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు.ఓవరాల్‌గా.. వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్, సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు.కాగా 103 టెస్టుల్లో స్టోక్స్ ఇప్పటి వరకు 6320 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 258. ఇక టెస్టుల్లో తీసిన వికెట్లు 201.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో పేస్ ఆల్‌రౌండర్ స్టోక్స్ బంతితో రాణించినా.. బ్యాట్‌తో మ్యాజిక్ చేయలేకపోయాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు పరుగులే చేసి గుడకేశ్ మోటీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. చదవండి: KKR: ద్రవిడ్ కాదు.. కోల్‌కతా కొత్త మెంటార్‌గా దిగ్గజ బ్యాటర్?Kallis. Sobers. Stokes. Legends only, please. #EnglandCricket | #ENGvWI pic.twitter.com/zQADWlbOnJ— England Cricket (@englandcricket) July 11, 2024 -
Viral Video: మోటీ మాయాజాలం.. స్టోక్స్‌కు ఫ్యూజులు ఔట్
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌటై, 250 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు (క్రాలే (76), పోప్ (57), రూట్ (68), బ్రూక్ (50), జేమీ స్మిత్ (70)) అర్ద సెంచరీలు సాధించారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, జేసన్ హోల్డర్, గుడకేశ్ మోటీ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ అరంగేట్రం బౌలర్ గస్ అట్కిన్సన్ (7/45) విండీస్ పతనాన్ని శాశించాడు. ఆండర్సన్, వోక్స్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో మిఖైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.AN ABSOLUTE CHERRY FROM MOTIE. - The reaction of Ben Stokes says all. 😲pic.twitter.com/NTnSvRQXhJ— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024మోటీ మాయాజాలంఈ మ్యాచ్‌లో విండీస్ బౌలర్ గుడకేశ్ మోటీ రెండు వికెట్లే తీసినా రెండూ హైలైట్‌గా నిలిచాయి. మోటీ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు స్టోక్స్, రూట్లను బోల్తా కొట్టించాడు. ఈ ఇద్దరిని మోటీ అద్భుతమైన బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ముఖ్యంగా స్టోక్స్ బౌల్డ్ అయిన బంతి నమ్మశక్యంకాని రితీలో టర్నై మిడిల్ స్టంప్‌ను గాల్లోకి లేపింది. ఈ బంతికి స్టోక్స్ వద్ద సమాధానం లేక నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. -
పెద్ద పొరపాటు చేశాం.. అలా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచింది!
వన్డే వరల్డ్‌కప్-2019 ఫైనల్లో తమ తప్పిదం వల్లే న్యూజిలాండ్ మూల్యం చెల్లించిందన్న విషయాన్ని దిగ్గజ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంగీకరించాడు. ఆరోజు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.సహచర అంపైర్ కుమార్ ధర్మసేన చెప్పే వరకు తమ తప్పిదాన్ని గుర్తించలేకపోయానని ఎరాస్మస్ తెలిపాడు. కాగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ పోటీపడిన విషయం తెలిసిందే.ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, ఫైనల్‌కు సంబంధించి నాటి అంపైర్లు ఎరాస్మస్, ధర్మసేన తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైన సంగతి తెలిసిందే.న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్ ఆఖరిదాకా అద్బుతంగా పోరాడింది. తొలి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ కూడా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని బెన్ స్టోక్స్ షాట్ ఆడాడు.మరో ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్ పరుగుకు వచ్చాడు. ఒక రన్ పూర్తి చేసి రెండో రన్ కోసం పరుగు తీశారు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ మార్టిన్ గఫ్టిల్ దానిని స్ట్రైకర్ ఎండ్‌కు త్రో చేశాడు. అయితే, అది స్టోక్స్ బ్యాట్‌ను తాకుతూ బౌండరీకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు(2+4) వచ్చినట్లు అంపైర్లు ప్రకటించారు.నిజానికి పరుగు పూర్తి చేసే క్రమంలో స్టోక్స్ పూర్తిగా క్రీజులోకి రాకముందే బంతి ఓవర్ త్రో అయింది. కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు పరుగులే(1+4) ఇవ్వాలి. కానీ ఈ విషయాన్ని సరిగ్గా గమనించలేకపోయిన అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో రెండు పరుగులు సాధించడంతో మ్యాచ్ టై(241 రన్స్) అయింది.అనంతరం సూపర్ ఓవర్లో గెలిచిన ఇంగ్లండ్ టైటిల్ గెలిచింది. ఈ విషయం గురించి తాజాగా స్పందించిన ఎరాస్మస్.. ‘‘ఫైనల్ జరిగిన మరుసటి రోజు.. నా హోటల్ గది తలుపు తెరిచి బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్తున్నా.అంతలోనే కుమార్ కూడా తన రూం నుంచి బయటకు వచ్చాడు. ‘మనం ఒక పెద్ద పొరపాటు చేశాం చూశావా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు గానీ మా నిర్ణయం వల్ల ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను.ఇద్దరం అప్పుడు సిక్స్.. సిక్స్.. సిక్స్ అనే అనుకున్నాం. కానీ వాళ్లు లైన్ క్రాస్ చేయని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాం’’ అని టెలిగ్రాఫ్ క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా గతంలో కుమార్ ధర్మసేన కూడా ఈవిషయం గురించి మాట్లాడుతూ తమ పొరపాటును అంగీకరించాడు. అయితే, అప్పట్లో సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందలేని పేర్కొన్నాడు. కానీ.. తన నిర్ణయం వల్ల పశ్చాత్తాపపడటం లేదని తెలిపాడు. -
టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్లో పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా సేవలందించడం కోసం వరల్డ్‌కప్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్‌కే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశాడు. కాగా, ఇంగ్లండ్ ఈ ఏడాది మొత్తం 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ టెస్ట్‌ల షెడ్యూల్ బిజీగా ఉండటంతో పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా సేవలందించడం కోసం స్టోక్స్ ఐపీఎల్, టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పుకున్నాడు. జులైలో వెస్టిండీస్‌తో సిరీస్ నుంచి ఇంగ్లండ్ టెస్ట్ ప్రయాణం మొదలవుతుంది. అనంతరం ఈ జట్టు స్వదేశంలో భారత్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. దీని తర్వాత ఆసీస్‌లో యాషెస్ సిరీస్.. ఇలా ఈ వార్షిక సంవత్సరంలో ఇంగ్లండ్ 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మోకాలి శస్త్ర చికిత్స కారణంగా స్టోక్స్ బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. భారత్‌తో తాజాగా జరిగిన సిరీస్‌లో స్టోక్స్ చాలాకాలం తర్వాత బంతి పట్టాడు. ఇదిలా ఉంటే యుఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్ జూన్ 4న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. బార్బడోస్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను స్కాట్లాండ్ ఢీకొంటుంది. -
‘బజ్‌బాల్’ బెడిసికొట్టి.. అవమానభారంతో ఇలా!..
భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలిచి తమ 12 ఏళ్ల నీరిక్షణకు తెరదించాలని భావించిన ఇంగ్లండ్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్ విజయమే లక్ష్యంగా భారత గడ్డపై అడుగు పెట్టిన ఇంగ్లండ్ కనీస పోటీ ఇవ్వకుండా టీమిండియా ముందు మోకారిళ్లింది. బజ్‌బాల్ అంటూ వరల్డ్ క్లాస్ జట్లను గడగడలాంచిన ఇంగ్లండ్.. భారత్ దెబ్బకు పసికూనలా వణకిపోయింది. అసలైన టెస్టు క్రికెట్ మజా ఎలా ఉంటుందో ఇంగ్లండ్ జట్టుకు రోహిత్ సేన చూపించింది. ఘన విజయంతో భారత్ టూర్‌ను ముగించాలని భావించిన స్టోక్స్ సేన.. ఆఖరికి ఘోర పరాభావంతో తమ దేశానికి తిరుగు పయనమైంది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. భారత గడ్డపై ఇంగ్లండ్ ఘోర ఓటమికి గల ఐదు కారణాలను పరిశీలిద్దాం. బెడిసి కొట్టిన బజ్ బాల్.. ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణం వారి బ్యాటింగ్ వైఫల్యమే. వారు అవలంభిస్తున్న బజ్‌బాల్ విధానమే వారి కొంపముంచింది. సాధరణంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ బ్యాటరైనా ఆచతూచి ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇంగ్లండ్ జట్టుది మాత్రం వేరే లెక్క. వచ్చామా ఫోరో, సిక్స్ కొట్టి ఔటయ్యామా అన్నట్లు ఇంగ్లండ్ బ్యాటర్ల ఆట కొనసాగింది. ఆఖరి వరల్డ్ క్లాస్ బ్యాటర్ జో రూట్ సైతం అదే తీరును కనబరిచాడు. పరుగులు వేగంగా సాధించాలనే ఉద్దేశ్యంతో తనకు రాని షాట్లను ఆడి పెవిలియన్‌కు చేరిన సందర్భాలు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థి బౌలర్లపై దాడికి ప్రయత్నించి వికెట్లను కోల్పవడం సంప్రదాయ క్రికెట్ ఉద్దేశ్యం కాదు కద. ఈ సిరీస్‌లో భారత 9వ నెంబర్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ ఎదుర్కొన్న బంతులు కూడా ఏ ఇంగ్లండ్ ఆటగాడు ఎదుర్కోలేకపోయాడు. టెస్టు క్రికెట్ అంటే కనీస ఓపికతో బ్యాటింగ్ చేయాలనే కామన్ సెన్స్ ఇంగ్లండ్ బ్యాటర్లలో కొరవడింది. బజ్‌బాల్ అంటూ టెస్టు క్రికెట్ రూపు రేఖలను మార్చేసిన ఇంగ్లండ్‌కు భారత్ మాత్రం సరైన గుణపాఠం చెప్పిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంగ్లండ్ ఘోర పరభావానికి మరో కారణం ఓవర్ కాన్ఫిడెన్స్. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్.. ఇక తమకు తిరుగులేదని, ఏకంగా సిరీస్ వైట్ వాష్ చేసినట్లు బిల్డప్ ఇచ్చింది. కానీ అక్కడ ప్రత్యర్ధి భారత్ అన్న విషయం బహుశా ఇంగ్లండ్ మార్చిపోయిందేమో. ఆ తర్వాత వైజాగ్ టెస్టులో దెబ్బతిన్న సింహంలా భారత్ పంజా విసిరింది. ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అప్పటికి ఇంగ్లండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఏమాత్రం పోలేదు. ఇంకా మూడు టెస్టులు ఉన్నాయి కదా చూసుకోవచ్చులా అన్నట్లు ఇంగ్లండ్ థీమా వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వైజాగ్ టెస్టు అనంతరం భారత్ నుంచి దుబాయ్ వేకేషన్‌కు ఇంగ్లండ్ జట్టు వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన ఇంగ్లండ్ ఆటను మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ దాదాపు వారం రోజులు గడిపింది. ఆ తర్వాత రాజ్‌కోట్‌కు చేరుకున్న ఇంగ్లండ్ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మూడో టెస్టులో బరిలోకి దిగింది. రాజ్‌కోట్‌లో కూడా ఇంగ్లండ్ తీరు ఏ మాత్రం మారలేదు. మరోసారి ఇంగ్లండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. అయితే అప్పటికి ఇంగ్లండ్ మాత్రం సిరీస్ తామే గెలుస్తామన్న థీమాగా కన్పించింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్సీ, కోచ్ మెకల్లమ్ ఆఖరి రెండు టెస్టుల్లో భారత్‌ను చిత్తు చేస్తామని గొప్పలు పలికారు. కానీ భారత్ ముందు ఇంగ్లండ్ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఆఖరి రెండు టెస్టుల్లోనూ భారత్ విజయ భేరి మ్రోగించింది. బౌలింగ్ వైఫల్యం. స్పిన్నర్లు కాస్తో కూస్త అకట్టుకున్నప్పటికి ఫాస్ట్ బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. జేమ్స్ ఆండర్సన్, వుడ్ వంటి వరల్డ్ క్లాస్ పేసర్లు సైతం భారత బ్యాటర్లు ముందు దాసోహం అయ్యారు. ఆండర్సన్‌ను అయితే భారత యువ ఓపెనర్ జైశ్వాల్ ఊచకోత కోశాడు. స్పిన్నర్ల ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఇంగ్లండ్ బౌలింగ్‌లో ఎటాక్‌లో స్పష్టంగా అనుభవం లేమి కన్పించింది. జాక్ లీచ్ వంటి స్టార్ స్పిన్నర్ తొలి టెస్టు తర్వాత జట్టు నుంచి తప్పుకోవడం ఇంగ్లండ్‌ను బాగా దెబ్బతీసింది. టామ్ హార్లీ, బషీర్ వంటి యువ స్పిన్నర్లు ఆడపదడప వికెట్లు తీసినప్పటికి పరుగులు మాత్రం భారీ సమర్పించుకున్నారు. స్టోక్సీ మిస్ ఫైర్.. తన కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న బెన్ స్టోక్స్.. భారత్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఈ సిరీస్‌లో బెన్ స్టోక్స్ దారుణంగా విఫలమయ్యాడు. అస్సలు ఈ సిరీస్‌లో అతడి వ్యూహం ఎవరికీ అర్ధం కాలేదు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లో కూడా నిరాశపరిచాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో కూడా స్టోక్సీ ఫెయిల్ అయ్యాడు. సిరీస్ మొత్తంగా 5 టెస్టుల్లో 199 పరుగులు స్టోక్స్ చేశాడు. ఇది కూడా ఇంగ్లండ్ ఓటమికి ఓ కారణం. కుర్రాళ్లు కొట్టిపాడేశారు..? కోహ్లి, రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరం కావడంతో జట్టులోకి వచ్చిన యువ క్రికెటర్లను ఇంగ్లండ్ తక్కువగా అంచనా వేసింది. వారికి పెద్దగా అనుభవం లేనందన తమ బౌలర్లు పై చేయి సాధిస్తారని ఇంగ్లండ్ మేనెజ్మెంట్ భావించింది. కోహ్లిని ఎలా ఔట్ చేయాలి? రాహుల్‌ను ఎలా ఔట్ చేయాలని ప్రణాళికలు రచించిన ఇంగ్లండ్.. యువ ఆటగాళ్లు విషయంలో మాత్రం ఎటువంటి ఆలోచన చేయలేదు. అదే వారి కొంపముంచింది. జైశ్వాల్, సర్ఫరాజ్, ధ్రవ్ జురల్ యువ సంచలనాలు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జైశ్వాల్ అయితే ఏకంగా రెండు డబుల్ సెంచరీలు బాదేశాడు. 𝐑𝐨𝐡𝐢𝐭 & 𝐂𝐨. conquered the series with ease💪#IDFCFirstBankTestSeries #INDvENG #JioCinemaSports #BazBowled pic.twitter.com/a6HsT0Ikbe — JioCinema (@JioCinema) March 9, 2024 -
టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ సొంతం
India vs England 5th Test Day 3: ఇంగ్లండ్‌తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉపఖండ పిచ్‌లపై ‘బజ్‌బాల్’ ఆటలు చెల్లవంటూ మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు.. బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుబ్‌మన్ గిల్(110) అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ విజయం సాధ్యమైంది. ఫలితంగా సొంతగడ్డపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్రధాన బ్యాటర్లు లేకుండానే యువ క్రికెటర్లతో కూడిన జట్టుతోనే భారీ విజయం అందుకుని తమ స్థాయిని చాటుకుంది టీమిండియా. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 స్పిన్నర్ల ఆధిపత్యం ఇక ఈ మ్యాచ్‌లో అశ్విన్ కెరీర్లో వందో టెస్టు. ఇందులో అశూ మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటగా.. ఓవరాల్‌గా కుల్దీప్ యాదవ్ 7, రవీంద్ర జడేజా రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ధర్మశాలలో మ్యాచ్ సాగిందిలా గురువారం మొదలైన ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు వీరుడు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు (4/51) వికెట్లతో దుమ్ములేపాడు. రవీంద్ర జడేజా తాను సైతం అంటూ ఒక వికెట్(1/17) దక్కించుకున్నాడు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(57), రోహిత్ శర్మ శుభారంభం అందించారు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ సెంచరీ(103) పూర్తి చేసుకోగా.. వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(110) సైతం శతక్కొట్టాడు. వీరిద్దరికి తోడు అరంగేట్ర బ్యాటర్ దేవ్దవ్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 473 పరుగులు స్కోరు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో.. 473/8 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. కేవలం నాలుగు పరుగులు జతచేసి భారత్ ఆలౌట్ అయింది. 477 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి.. 259 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. టీమిండియా స్పిన్నర్ల ధాటిని తట్టుకోలేకపోయింది. 195 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ఐదుగురి అరంగేట్రం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్.. మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ అంతర్జాతీయ క్రికెట్లో అడగుపెట్టారు. వీరిలో రజత్ పాటిదార్ మినహా మిగిలిన నలుగురు తమదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) సాధించగా.. అరంగేట్రంలోనే పడిక్కల్ సైతం హాఫ్ సెంచరీ(65)తో మెరిశాడు. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు ►టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 218 ►భారత్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు: 477 (ఓవరాల్‌గా 259 పరుగుల ఆధిక్యం) ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195 ►విజేత: టీమిండియా.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు ►ఐదు మ్యాచ్‌ల సిరీస్ 4-1తో టీమిండియా కైవసం ►హైదరాబాద్‌లో తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్.. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచి.. తాజాగా ధర్మశాలలో టీమిండియా వరుస విజయాలు. పూర్తి అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
Ind vs Eng: టీమిండియా ఘన విజయం.. సిరీస్ 4-1తో సొంతం
India vs England 5th Test Day 3 Updates: టీమిండియా ఘన విజయం ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(84) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ధర్మశాలలో 473/8 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ శనివారం నాటి ఆట మొదలుపెట్టింది. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. భారత తొలి ఇన్నింగ్స్‌లో 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 45.5: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ జడేజా బౌలింగ్‌లో షోయబ్ బషీర్(13) బౌల్డ్. స్కోరు: 189/9 (45.5). ఆండర్సన్ క్రీజులోకి వచ్చాడు. రూట్ 78 పరుగులతో ఆడుతున్నాడు. రూట్ అర్ధ శతకం 36.2: బుమ్రా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జో రూట్ ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 34.4: బుమ్రా బౌలింగ్‌లో మార్క్ వుడ్(0) ఎల్బీడబ్ల్యూ. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 34.2: టామ్ హార్లే(20) రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. మార్క్వుడ్క్రీజులోకి వచ్చాడు. రూట్ 44 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 141/7 (34.3) ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 26.4: అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన బెన్ ఫోక్స్(8). ఫలితంగా ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 113/6 (26.4). టామ్ హార్లే క్రీజులోకి వచ్చాడు. రూట్ 36 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే 146 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ 26 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 113/5 భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 103/5 (22.5) జో రూట్ 34 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. అశ్విన్ తిప్పేస్తున్నాడు.. ఐదో వికెట్ డౌన్ 22.5: అశ్విన్ బౌలింగ్ స్టోక్స్(2) బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 17.4: నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టోకు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కళ్లెం వేశాడు. వికెట్ల ముందు అతడిని దొరకబుచ్చుకుని పెవిలియన్‌కు సాగనంపాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన బెయిర్ స్టో రివ్యూకు వెళ్లగా.. ఫలితం అతడికి అనుకూలంగా రాలేదు. స్కోరు: 94-4(18). బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. నిలకడగా బెయిర్ స్టో, రూట్ ఇన్నింగ్స్ 17 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 90/3. బెయిర్ స్టో, రూట్ నిలకడగా ఆడుతుండటంతో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. బెయిర్ స్టో 28 బంతుల్లో 38 పరుగులతో ‘బజ్‌బాల్’ క్రికెట్ ఆడుతున్నాడు. దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టో వందో టెస్టు వీరుడు బెయిర్ స్టో దూకుడుగా ఆడుతున్నాడు. 15వ ఓవర్ ముగిసే సరికి 21 బంతుల్లో 26 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జో రూట్ 25 బంతుల్లో 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 9.2: మూడో వికెట్ డౌన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే బెన్ డకెట్(2)ను అవుట్ చేసిన అశూ.. అనంతరం మరో ఓపెనర్ క్రాలే(1)ను కూడా వెనక్కి పంపాడు. తాజాగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(19) రూపంలో మూడో వికెట్ కూడా తానే దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. స్కోరు: 41-3(10) . రూట్ 12, బెయిర్ స్టో ఒక పరుగుతో ఆడుతున్నారు. 5.3: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అశ్విన్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన క్రాలే(1). జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 23-2(6). పోప్ 17 పరుగులతో ఆడుతున్నాడు. 1.5: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అశ్విన్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(2) బౌల్డ్. స్కోరు: 2-1. ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ క్రాలే సున్నా పరుగులతో ఉన్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) టీమిండియా ఆలౌట్ మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ కుల్దీప్ యాదవ్(30)ని వెనక్కి పంపగా.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా(20) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడో రోజు ఆటలో.. ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం నాలుగు పరుగులు మాత్రమే జత చేసి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ కంటే 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. టామ్ హార్లే రెండు వికెట్లు తీశాడు. ఇక పేసర్లు జేమ్స్ ఆండర్సన్ రెండు, కెప్టెన్ స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక గురువారం నాటి తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలుచుకుంది. 124.1: టీమిండియా ఆలౌట్ జస్ప్రీత్ బుమ్రా రూపంలో భారత్ ఆఖరి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బుమ్రా స్టంపౌట్ అయ్యాడు. ఫలితంగా 477 (124.1) స్కోరు వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ మీద 259 పరుగలు ఆధిక్యం సంపాదించింది. 123.4: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా మూడో రోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టీమిండియాకు షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్(30) వికెట్ కీపర్‌క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 477/9 (124). బుమ్రా 20, సిరాజ్ సున్నా పరుగులతో ఉన్నారు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ►ఇదిలా ఉంటే.. జేమ్స్ ఆండర్సన్‌కు ఇది 700వ టెస్టు వికెట్ కావడం విశేషం. రెండో రోజు ఆటలో హైలైట్స్ ►తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 473/8(120 ఓవర్లలో) ►రోహిత్ శర్మ(103), శుబ్‌మన్ గిల్(110) సెంచరీలు ►రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ ఆధిక్యం 255 పరుగులు ►అరంగేట్రంలో రాణించిన దేవ్‌దత్ పడిక్కల్(65) ►సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు- ధర్మశాల- తుదిజట్లు ఇండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, దేవ్‌దత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్లే, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్. -
రోహిత్ అవుటా? నిజమేనా..? ఇంగ్లండ్ బౌలర్ రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్‌తో ధర్మశాల టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. వన్‌డౌన్ బ్యాటర్, శతక వీరుడు శుబ్‌మన్ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 171 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలో.. 135/1 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. భోజన విరామ సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. మరో వికెట్ నష్టపోకుండా 264 పరుగుల వద్ద నిలిచి.. ఓవరాల్‌గా అప్పటికి 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ మైదానంలో దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. విరామం తర్వాత తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. రోహిత్ శర్మ(103)ను అనూహ్య రీతిలో బౌల్డ్ చేశాడు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ బంతి అందుకున్న పేస్ ఆల్‌రౌండర్ స్టోక్స్.. ‘మ్యాజిక్’ బాల్‌తో హిట్‌మ్యాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. స్టోక్స్ సంధించిన గుడ్‌లెంగ్త్ బాల్‌ను షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ విఫలమయ్యాడు. బ్యాట్ అంచును తాకిన బంతి అనూహ్యంగా స్టంప్స్‌ను ఎగురగొట్టింది. ఊహించని ఈ పరిణామంతో రోహిత్ అవాక్కు కాగా.. ఇంగ్లండ్ శిబిరంలోనూ ఆశ్చర్యం వ్యక్తమైంది. ఐపాడ్లో మ్యాచ్ చూస్తున్న కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నోటిపై చేతిని ఆనించి విస్మయం వ్యక్తం చేయగా.. ఫీల్డ్‌లో ఉన్న పేసర్ మార్క్ వుడ్ తలపై రెండు చేతులు పెట్టుకుని.. ‘‘ఏంటిది? నిజమేనా? నమ్మలేకపోతున్నా!’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రోహిత్ శర్మ అవుటైన మరుసటి ఓవర్(63)లోనే శుబ్‌మన్ గిల్(110) కూడా పెవిలియన్ చేరాడు. జేమ్ ఆండర్సన్ వికెట్ల ఖాతాలో 699వ వికెట్‌గా వెనుదిరిగాడు. 𝐈𝐍𝐒𝐓𝐀𝐍𝐓 𝐈𝐌𝐏𝐀𝐂𝐓 ft. skipper Stokes 🤯#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/DPHz8Bfdvl — JioCinema (@JioCinema) March 8, 2024 -
హిట్‌మ్యాన్ ఖాతాలో మరో రికార్డు.. తొలి ఆసియా క్రికెటర్‌గా..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డు (అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకున్న తొలి ప్లేయర్) నెలకొల్పిన హిట్‌మ్యాన్.. తాజాగా బ్యాటింగ్‌లో మరో రికార్డు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన రోహిత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 50 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా డబ్యూటీసీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. డబ్యూటీసీ హిస్టరీలో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ డబ్యూటీసీలో 45 మ్యాచ్‌ల్లో 78 సిక్సర్లు కొట్టాడు. స్టోక్స్ తర్వాత అత్యధికంగా హిట్‌మ్యాన్ 32 ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో స్టోక్స్, రోహిత్ తర్వాత రిషబ్ పంత్ (38), జానీ బెయిర్‌స్టో (29), జైస్వాల్ (26) ఉన్నారు. కాగా, ధర్మశాల టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
‘చీటింగ్‌కు కూడా వెనుకాడరు.. కళ్లు కనిపించడం లేదా బాబూ’
రాంచి టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస క్రీడా స్ఫూర్తి కూడా ప్రదర్శించడం చేతకాదా అని మండిపడుతున్నారు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌ను గందరగోళంలో పడేయాలనే తలంపుతో ఇంతకు దిగజారుతారా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే.. నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ 353 పరుగుల వద్ద ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(2) వికెట్ కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(38)తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో 20వ ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ ఒలీ రాబిన్సన్ వేసిన ఆరో బంతిని తప్పుగా అంచనా వేసిన జైస్వాల్.. షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతిలో పడ్డట్లుగా అనిపించింది. దీంతో జైస్వాల్ అవుటైనట్లేనంటూ ఇంగ్లండ్ ఆటగాళ్లు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, రివ్యూలో భాగంగా తొలి రీప్లేలో ఫలితం సరిగ్గా తేలకపోయినా అలాగే సంబరాలు చేసుకున్నారు. అయితే, ఫలితాన్ని సరిగ్గా అంచనా వేసేందుకు థర్డ్ అంపైర్ ఒకటికి రెండుసార్లు బాల్ ట్రాకింగ్ చేశాడు. ఈ క్రమంలో బాల్ తొలుత నేలను తాకి.. ఆ తర్వాత వికెట్ కీపర్ చేతుల్లో పడినట్లు తేలింది. దీంతో జైస్వాల్ నాటౌట్‌గా తేలగా.. ఇంగ్లండ్ ఆటగాళ్లు ముఖ్యంగా కెప్టెన్ స్టోక్స్ తల పట్టుకుంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేస్తూ అతిగా సెలబ్రేట్ చేసుకున్నారంటూ టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎలాగోలా ఒత్తిడి పెంచి జైస్వాల్‌ను అవుట్‌గా ప్రకటింపజేయడంలో భాగంగానే ఇలా ‘చీటింగ్’కు పాల్పడేందుకు కూడా వెనుకాడలేదని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. England thought they had Yashasvi Jaiswal dismissed caught behind, but replays showed the ball hit the ground, putting a halt to the celebrations.#INDvENG pic.twitter.com/RgDhy7qOF5 — CricBlog ✍ (@cric_blog) February 24, 2024 England players are so rattled by Yashasvi Jaiswal that they sacrificed all their principles regarding Spirit Of Cricket and started appealing for a grounded catch. Next, they may finally try to run someone out at the non striker's end. — Sameer Allana (@HitmanCricket) February 24, 2024 ఇదిలా ఉంటే.. ఈ ఘటన సమయానికి జైస్వాల్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. టీమిండియా స్కోరు 68-1. ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. జైస్వాల్(73) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 -
జడేజా సూపర్ డెలివరీ.. స్టోక్స్‌కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
రాంఛీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి స్టోక్స్ ఔటయ్యాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్బుతమైన బంతితో స్టోక్సీని బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేసిన జడేజా తొలి బంతిని గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్టోక్సీ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి తక్కువ ఎత్తులో బౌన్స్ అయ్యి స్టోక్స్ ఫ్రంట్ప్యాడ్ను తాకింది. వెంటనే ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ సైతం అంతే వేగంగా ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. స్టోక్స్ కనీసం రివ్యూ కూడా తీసుకోకుండానే మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లకు ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ 3 వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. pic.twitter.com/nNAMrv788e — Sitaraman (@Sitaraman112971) February 23, 2024 -
IND vs ENG 4th Test: ముగిసిన తొలి రోజు ఆట.. హైలైట్స్ ఇవే
India vs England, 4th Test Ranchi Day 1 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్ సందర్భంగా భారత్ తరఫున బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆదిలోనే చుక్కలు చూపించాడు. ఓపెనర్లు జాక్ క్రాలే(42), బెన్ డకెట్(11), ఒలీ పోప్(0)లను పెవిలియన్‌కు పంపి టాపార్డర్‌ను కుదేలు చేశాడు. ఆకాశ్ దెబ్బకు 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను జో రూట్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో గట్టెక్కించాడు. వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి అజేయ సెంచరీతో మెరిశాడు. మిగతా వాళ్లలో జానీ బెయిర్‌స్టో(38), బెన్ ఫోక్స్(47) మాత్రమే రాణించారు. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూ రూట్ 106(226 బంతుల్లో), ఓలీ రాబిన్సన్ 31(60 బంతుల్లో) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ మూడు, మహ్మద్ సిరాజ్ రెండు, అశ్విన్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. మొత్తానికి.. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆరంభంలో తడబడ్డా రూట్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. 83.6: సెంచరీ కొట్టిన జో రూట్ బజ్‌బాల్ అంటూ దూకుడుగా ఆడకుండా తనదైన సహజ శైలిలో ఆడిన జో రూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఫోర్ బాది వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్న రూట్.. ఆచితూచి నిలకడగా ఆడుతూ 219 బంతుల్లో 103 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 279-7(84) ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 245 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. టామ్ హార్ట్లీని (13) సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రూట్‌తో (82) పాటు రాబిన్సన్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 225 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి బెన్ ఫోక్స్ (47) ఔటయ్యాడు. జో రూట్ (75), టామ్ హార్ట్లీ క్రీజ్‌లో ఉన్నారు. 62.2: 200 పరుగులు పూర్తి చేసిన ఇంగ్లండ్ టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 198/5 (61) జో రూట్ 67, ఫోక్స్ 28 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు. ఇంగ్లండ్ స్కోరు: 184/5 (54) ఎట్టకేలకు రూట్ ఫిఫ్టీ 48.5: టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. నిలకడగా రూట్ ఇన్నింగ్స్ రూట్ 86 బంతుల్లో 40, ఫోక్స్ 56 బంతుల్లో 14 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు. ఇంగ్లండ్ స్కోరు: 150-5(41) ఇంగ్లండ్ స్కోరు: 137/5 (36) రూట్ 32, ఫోక్స్ 9 పరుగులతో ఆడుతున్నారు. లంచ్ తర్వాత ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. స్కోరు: 129-5. రూట్ 27, ఫోక్స్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. కష్టాల్లో ఇంగ్లండ్.. లంచ్ విరామానికి స్కోర్: 112/5 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో వికెట్ డౌన్.. జానీ బెయిర్ స్టో రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. అశ్విన్ బౌలింగ్‌లలో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చాడు. 23 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 111/4 19 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 89/3 తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో జానీ బెయిర్ స్టో(23), జో రూట్(11) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ డౌన్ 11.5: అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు వికెట్లు తీసిన ఈ బెంగాల్ బౌలర్.. జాక్ క్రాలే(42) రూపంలో మూడో వికెట్ దక్కించుకున్నాడు. తొలుత నో బాల్ కారణంగా మిస్సయిన క్రాలేను ఈసారి బౌల్డ్ చేయడంలో ఆకాశ్ ఎలాంటి పొరపాటు చేయలేదు. ఇంగ్లండ్ స్కోరు: 57-3. బెయిర్ స్టో, జో రూట్ క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో ఆకాశ్ దీప్‌నకు రెండు వికెట్లు 9.4: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ డకౌట్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 47/2 (9.4) తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 9.2: అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(11) వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లండ్ స్కోరు: 47/1 (9.2). జాక్ క్రాలే 35 పరుగులతో ఆడుతున్నాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 31/0 7 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. క్రీజులో క్రాలే(32), బెన్ డకెట్(4) పరుగులతో ఉన్నారు. 4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 9/0 4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ రాంచి వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో పేసర్ ఆకాష్ దీప్ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా స్ధానంలో ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మార్క్ వుడ్ స్ధానంలో పేసర్ ఓలీ రాబిన్సన్ తుది జట్టులోకి రాగా.. రెహాన్ ఆహ్మద్ స్ధానంలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. తుది జట్లు భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ -
ముందెన్నడూ చూడలేదు: రాంచి పిచ్‌పై స్టోక్స్ కీలక వ్యాఖ్యలు
Ind vs Eng Test series 2024: భారత గడ్డపై కూడా ‘బజ్‌బాల్’ అంటూ దూకుడు ప్రదర్శించిన ఇంగ్లండ్‌కు రెండో టెస్టులోనే తత్వం బోధపడింది. హైదరాబాద్ టెస్టులో విజయం తర్వాత అదే జోరును కొనసాగిద్దామని భావించిన స్టోక్స్ బృందానికి దిమ్మతిరిగే షాకిచ్చింది రోహిత్ సేన. విశాఖపట్నం, రాజ్‌కోట్ టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేకున్నా ఆ లోటు కనబడనివ్వకుండా వరుస విజయాలతో జోష్‌లో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి జార్ఖండ్ వేదికగా నాలుగో టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రాంచి పిచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తానెన్నడూ ఇలాంటి పిచ్ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నాలుగో టెస్టు కోసం ఎలాంటి ట్రాక్ రూపొందించారో అర్థం చేసుకోలేకపోతున్నానని.. ఆ పిచ్‌ను అంచనా వేయడం కష్టంగా ఉందని స్టోక్స్ పేర్కొన్నాడు. బీబీసీ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పిచ్ ముందెన్నడూ చూడలేదు. అసలు అక్కడ మ్యాచ్ ఎలా సాగనుందో అంచనా వేయలేకపోతున్నా. ఒకవైపు నుంచి పచ్చగా.. గ్రాసీగా కనిపిస్తోంది. మరోవైపు ఎండ్ నుంచి చూస్తే.. అదీ నిశితంగా గమనిస్తే.. చిన్న చిన్న పగుళ్లు కనిపిస్తున్నాయి. ఆ పిచ్‌పై ఎలా ఆడాలో నాకైతే అర్థం కావడం లేదు’’ అని బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. కాగా హైదరాబాద్‌లో కాస్త స్పిన్‌కు అనుకూలించిన పిచ్.. విశాఖ, రాజ్‌కోట్‌లో జరిగిన తదుపరి రెండు మ్యాచ్‌లలో స్పిన్నర్లతో పాటు పేసర్లకూ మేలు చేకూర్చింది. తొలి టెస్టులో ఇరు జట్ల స్పిన్నర్లు కలిపి 32 వికెట్లు తీస్తే.. పేసర్లకు ఆరు వికెట్లు మాత్రమే దక్కాయి. ఇక రెండో టెస్టులో స్పిన్ బౌలర్లకు 21 వికెట్లు దక్కితే.. ఫాస్ట్‌బౌలర్లు 15 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక మూడో మ్యాచ్‌లో స్పిన్నర్లు 24, పేసర్లు 11 వికెట్లు పడగొట్టారు. చదవండి: వారి శరీరాల్లో కొవ్వు పేరుకుపోయింది: బాబర్‌పై మండిపడ్డ హఫీజ్ -
ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు అదిరిపోయే న్యూస్.. అదే జరిగితే?
టీమిండియాతో తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో తమ జోరును కొనసాగించలేకపోయింది. వరుస మ్యాచ్‌ల్లో భారత చేతిలో దారుణ ఓటమి పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అయితే ఏకంగా 434 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. టీమిండియా దెబ్బకు గత 90 ఏళ్లలో ఎన్నడూ చూడని ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. అయితే ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు, అభిమానులకు ఓ గుడ్ న్యూస్. వెన్ను గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి బౌలింగ్‌కు దూరంగా ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి బంతి పట్టేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. మూడో టెస్టు అనంతరం స్టోక్సీ ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మీరు బౌలింగ్ చేయడానికి సిద్దంగా ఉన్నారా అన్న ప్రశ్న ఇంగ్లీష్ కెప్టెన్‌కు ఎదురైంది. అందుకు బదులుగా.. "నేను కచ్చితంగా బౌలింగ్ చేస్తానని చెప్పలేను. అలా అని చేయని కూడా చెప్పలేను. నేను బౌలింగ్ చేయాలా వద్దా అన్న విషయం కోసం మా వైద్య బృందంతో ఇంకా చర్చిస్తున్నాను. కానీ ప్రాక్టీస్ సెషన్స్‌లో అయితే నేను 100కు 100 శాతం బౌలింగ్ చేయగల్గుతున్నాను. ఆ సమయంలో నాకు ఎటువంటి సమస్యలేదు. త్వరలో తిరిగి మళ్లీ బౌలింగ్ చేయగలనని" ఆశిస్తున్నానని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. కాగా ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: Ranchi Test: టీమిండియాకు బిగ్ షాక్.. డబుల్ సెంచరీల వీరుడు దూరం!? -
Ind vs Eng: అతడి ఇన్నింగ్స్ అద్భుతం.. సిరీస్ గెలిచి తీరతాం!
India vs England, 3rd Test: ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ను టీమిండియా చితక్కొట్టింది. ఏకంగా 434 పరుగుల తేడాతో స్టోక్స్ బృందాన్ని ఓడించి రాజ్‌కోట్‌లో రాజసం చిందించింది. ఫలితంగా కనీవినీ ఎరుగని రీతిలో ఇంగ్లిష్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. తద్వారా.. తమ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా రెండో అతిపెద్ద పరాజయం మూటగట్టుకుంది స్టోక్స్ బృందం. అదే విధంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో వెనుకబడింది. ఈ విషయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. అతడి ఇన్నింగ్స్ అద్భుతం మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘బెన్ డకెట్ అద్భుత, అద్వితీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆసాంతం ఇలాంటి జోరే కొనసాగించాలని మేము భావించాం. టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నాం. భారత రెండో ఇన్నింగ్స్‌లో మేము ఎక్కువ సేపు బౌలింగ్ చేయాలని భావించాం. కానీ అలా జరుగలేదు. అనుకున్న దాని కంటే ముందుగానే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం సాధ్యం కాదు. ఏదేమైనా మా ఆటగాళ్లకు అండగా నిలవడం ముఖ్యం. ప్రస్తుతం మేము 1-2తో వెనుకబడి ఉన్నాం. అయితే, ఈ మ్యాచ్ నుంచి నేర్చుకున్న పాఠాలతో తిరిగి పుంజుకుంటాం. సిరీస్ గెలుస్తాం ఈ ఓటమి నుంచి తేరుకుని తదుపరి రెండు మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం. కచ్చితంగా సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం’’ అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ధనాధన్ సెంచరీ(153)తో అలరించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 4 పరుగులకే రనౌట్ అయ్యాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోగా.. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ఆరంభం కానుంది. పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు అతిపెద్ద టెస్టు ఓటములు ►562- వర్సెస్ ఆసీస్- ది ఓవల్ 1934 ►434- వర్సెస్ భారత్- రాజ్ కోట్- 2024 ►425- వర్సెస్ వెస్టిండీస్- మాంచెస్టర్ 1976 ►409- వర్సెస్ ఆసీస్- లార్డ్స్ 1948 ►405- వర్సెస్ ఆసీస్- లార్డ్స్ 2015 చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. టీమిండియాలో ఊహించని మార్పు! స్టార్ ప్లేయర్ దూరం -
ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. 90 ఏళ్ల తర్వాత!?
రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌కు ఘోర పరాభావం ఎదురైంది. భారత్ చేతిలో ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల దాటికి 122 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా దారుణంగా విఫలమైంది. కనీసం పోటీ ఇవ్వకుండానే ఇంగ్లీష్ జట్టు చేతులేత్తేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో లోయార్డర్ ఆటగాడు మార్క్ వుడ్(33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవిచూసిన ఇంగ్లండ్ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పింది. టెస్టులలో ఇంగ్లండ్ జట్టుకు పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద ఓటమి. ఇంతకుముందు ఆ జట్టు 1934లో ఆస్ట్రేలియా చేతిలో 562 రన్స్ తేడాతో ఓడింది. అయితే 21వ శతాబ్దంలో మాత్రం ఇంగ్లండ్ ఇదే అతి పెద్ద ఓటమి. మరోవైపు భారత్ మాత్రం టెస్టు క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్ కంటే ముందు 2021లో న్యూజిలాండ్‌పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం. ఇక ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: అతడొక సంచలనం.. ఎంత చెప్పుకున్నా తక్కువే: రోహిత్ శర్మ -
IND VS ENG 3rd Test Day 4: రాజ్‌కోట్ టెస్టులో భారత్ ఘన విజయం..
IND VS ENG 3rd Test Day 4 Updates And Highlights: రాజ్‌కోట్ టెస్టులో భారత్ ఘన విజయం.. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల దాటికి.. కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. ఒక్క వికెట్ దూరంలో.. రాజ్‌కోట్ టెస్టులో విజయానికి భారత్ కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. వరుస క్రమంలో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఫోక్స్ ఔట్ కాగా.. అశ్విన్ బౌలింగ్‌లో హార్ట్లీ పెవిలియన్‌కు చేరాడు. ఓటమి దిశగా ఇంగ్లండ్.. ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. రెహాన్ అహ్మద్ రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 53/7 విజయం దిశగా భారత్.. రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా విజయం వైపు అడుగులు వేస్తోంది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ విజయానికి కేవలం 4 వికెట్ల దూరంలో నిలిచింది. ఐదో వికెట్ డౌన్.. జో రూట్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రూట్.. జడేజా బౌలింగ్‌లో రూట్ ఎల్బీగా వెనుదిరిగాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 50/5. క్రీజులో బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జడేజా బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో.. నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 519 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. 20 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఓలీ పోప్.. జడేజా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 24/3 రెండో వికెట్ డౌన్.. జాక్ క్రాలే రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన క్రాలే.. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ బెన్ డకెట్(4) రనౌటయ్యాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు.7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 18/1 ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్ భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను 430/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. టీమిండియా.. ఇంగ్లండ్‌కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ 214, సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులతో అజేయంగా నిలిచారు. మరో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్.. మూడో టెస్ట్‌లో మరో డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ డబుల్‌ను యశస్వి 231 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 411/3గా ఉంది. లీడ్ 537 పరుగులుగా ఉంది. మరో హాఫ్ సెంచరీ చేసిన సర్పరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల వద్ద పొరపాటున రనౌటైన సర్ఫరాజ్ ఖాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 66 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్.. 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో డబుల్ దిశగా దూసుకుపోతున్న యశస్వి భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో డబుల్ సెంచరీ దిశగా దూసకుపోతున్నాడు. నిన్న రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి ఇవాళ తిరిగి బరిలోకి దిగిన యశస్వి.. ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం యశస్వి 182 పరుగుల వద్ద ఉన్నాడు. అతనికి జతగా సర్ఫరాజ్ ఖాన్ (33) క్రీజ్‌లో ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 359/4గా ఉంది. 440 పరుగుల ఆధిక్యంలో టీమిండియా నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా ఆధిక్యం 440 పరగులుగా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (149), సర్ఫరాజ్ ఖాన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 258 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (27) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ (115), సర్ఫరాజ్ ఖాన్ క్రీజ్‌లో ఉన్నారు. 91 పరుగుల వద్ద ఔటైన శుభ్‌మన్ గిల్ శుభ్‌మన్ గిల్ సెంచరీకి చేరువలో (91) రనౌటాయ్యడు. కుల్దీప్ తప్పిదం కారణంగా గిల్ ఔటయ్యాడు. నిన్న రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి (107) క్రీజ్‌లోకి వచ్చాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 192/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (65), కుల్దీప్ యాదవ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 322 పరుగుల లీడ్‌లో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ అద్బుతమైన సెంచరీతో (107) ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ (19), రజత్ పాటిదార్ (0) నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ సెంచరీ అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) -
Ind vs Eng 3rd Test: ముగిసిన మూడో రోజు ఆట.. 322 పరుగుల ఆధిక్యంలో భారత్
Ind vs Eng 3rd Test Day 3 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ టెస్టులో మూడో రోజు ఆట ఆరంభమైంది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టింది ఇంగ్లండ్. ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ కాగా.. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ 319 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. మూడో రోజు ముగిసిన ఆట.. మూడో రోజు ఆటలో ఇంగ్లీష్ జట్టుపై టీమిండియా పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(65), కుల్దీప్ యాదవ్(3) పరుగులతో ఉన్నారు. అదే విధంగా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(104) సెంచరీతో మెరిశాడు. అయితే వెన్ను నొప్పి కారణంగా ఆట మధ్యలోనే రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 322 పరుగుల భారీ అధిక్యంలో భారత్ కొనసాగుతోంది. కాగా అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. జైశ్వాల్ రిటైర్డ్ హార్ట్.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. వెన్ను నొప్పి కారణంగా జైశ్వాల్ మూడో రోజు ఆట ఆఖరి సెషన్లో మైదానాన్ని వీడాడు. జైశ్వాల్(104) పరుగులు చేశాడు. 47 ఓవర్లకు భారత్ స్కోర్: 190/1. టీమిండియా ప్రస్తుతం 321 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. జైశ్వాల్‌తో పాటు క్రీజులో ఉన్న మరో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ ఇప్పటివరకు 153 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్: 184/1. భారత్ ప్రస్తుతం 310 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. జైశ్వాల్ సూపర్ సెంచరీ.. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 121 బంతుల్లో జైశ్వాల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జైశ్వాల్‌కు ఇది మూడో టెస్టు సెంచరీ. జైశ్వాల్ ప్రస్తుతం 102 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు గిల్(45) పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 41 ఓవర్లకు టీమిండియా స్కోర్: 171/1. భారత్ ప్రస్తుతం 297 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. హాఫ్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 80 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్స్‌లతో జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. యశస్వీ తనదైన స్టైల్లో సిక్స్ కొట్టి అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్లకు భారత్ స్కోర్: 116/1, క్రీజులో జైశ్వాల్(65)తో పాటు శుబ్‌మన్ గిల్(26) ఉన్నారు. నిలకడగా ఆడుతున్న గిల్, జైశ్వాల్.. టీమిండియా యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్(8), యశస్వీ జైశ్వాల్(23) నిలకడగా ఆడుతున్నారు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 50/1 టీ విరామానికి భారత్ స్కోర్: 44/1 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(19), శుబ్‌మన్ గిల్(5) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 170 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్ 11.3: జో రూట్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా రోహిత్ శర్మ(19) వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. గిల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 34-1(12). జైస్వాల్ 10 పరుగులతో ఆడుతున్నాడు. బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ భారత రెండో ఇన్నింగ్స్ ఆరంభించారు. స్కోరు: 13/0 (4) ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా తమ స్కోరుకు 112 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 319 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 126 పరుగులు వెనుకబడి ఉంది. ►టీమిండియా తొలి ఇన్నింగ్స్- 445 ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 319 పదో వికెట్ డౌన్ 71.1: సిరాజ్ బౌలింగ్ ఆండర్సన్ బౌల్డ్. పదో వికెట్‌గా ఆండర్సన్ వెనుదిరగడంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు తెర పడింది. 71.1 ఓవర్లలో 319 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. మరో షాక్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 70.2: జడేజా బౌలింగ్‌లో టామ్ హార్లే(9)ను వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్టంపౌట్ చేశాడు. ఆండర్సన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 314/9 (70.2) ఎనిమిదో వికెట్ డౌన్ 69.5: సిరాజ్ బౌలింగ్‌లో రెహాన్ అహ్మద్ బౌల్డ్(6). ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. మార్క్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. హార్లే తొమ్మిది పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 314-8(70) వరుస షాకులు.. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ స్టోక్స్ అవుటైన మరుసటి బంతికే బెన్ ఫోక్స్ కూడా పెవిలియన్ చేరాడు. సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ , టామ్ హార్లే క్రీజులో ఉన్నారు. స్కోరు: 299/7 (65.3).టీమిండియా కంటే 146 పరుగులు వెనుకబడి ఉంది. భోజన విరామం తర్వాత వికెట్ బెన్ స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి స్టోక్స్ 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. నిలకడగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఇంగ్లండ్ 61వ ఓవర్ పూర్తయ్యేసరికి స్టోక్స్ 39, ఫోక్స్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 290 పరుగుల వద్ద నిలిచింది. 56వ ఓవర్ ముగిసే సరికి ఇలా ఆచితూచి ఆడుతున్న స్టోక్స్, ఫోక్స్. ఇంగ్లండ్ స్కోరు: 275/5 (56). స్టోక్స్ 28, ఫోక్స్ రెండు పరుగులతో ఆడుతున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 50.1: ఎట్టకేలకు సెంచరీ వీరుడు బెన్ డకెట్ అవుటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. 151 బంతుల్లోనే 23 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 153 పరుగులు చేసిన డకెట్.. శతకాన్ని ద్విశతకంగా మార్చాలని భావించగా.. కుల్దీప్ అతడి జోరుకు బ్రేక్ వేశాడు. బెన్ ఫోక్స్ క్రీజులోకి వచ్చాడు. స్టోక్స్ 20 పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 260-5(51) నిలకడగా ఆడుతున్న డకెట్, స్టోక్స్ 48 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 247/4 . డకెట్ 153, స్టోక్స్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 198 పరుగులు వెనుబడి ఉంది. నాలుగో వికెట్ డౌన్ ఆట మొదలెట్టిన కాసేపటికే భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. బుమ్రా రూట్‌ను అవుట్ చేయగా.. కుల్దీప్ యాదవ్ దెబ్బకు బెయిర్ స్టో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. బెయిర్ స్టో రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. డకెట్ 142 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 225-4(41) మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 207/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన కాసేపటికే ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో జో రూట్(18) జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జానీ బెయిర్ స్టో క్రీజులోకి వచ్చాడు. బెన్ డకెట్ 141 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 224-3. అశ్విన్ లేకుండానే ఇక కీలక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే భారత్ శనివారం బరిలో దిగింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. కన్కషన్ సబ్‌స్టిట్యూట్(ఆటగాడి తలకు దెబ్బతగిలినపుడు), కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రమే మ్యాచ్ మధ్యలో వైదొలిగిన ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయాలి. అది కూడా సదరు సబ్‌స్టిట్యూట్ ఫీల్డింగ్ వరకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే, అశ్విన్ తన తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యా వైదొలిగినందున అతడి స్థానంలో వేరే ప్లేయర్‌ను తీసుకునే అవకాశం లేదు. ఫలితంగా మూడో రోజు ఆటలో టీమిండియా పది మంది యాక్టివ్ ప్లేయర్లతో మైదానంలో దిగింది. రెండో రోజు హైలైట్స్ ►ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ ►తొలి ఇన్నింగ్స్‌లో 207/2 ►భారత్ 445 ఆలౌట్ ►అశ్విన్‌కు 500వ వికెట్ తుదిజట్లు: భారత్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్- అరంగేట్రం), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. -
Day 2: జురెల్ హిట్.. బుమ్రా మెరుపులు! డకెట్ సెంచరీ.. హైలైట్స్
India vs England 3rd Test Day 2 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా 445 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ 35 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. టీమిండియా కంటే 238 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్, సెంచరీ వీరుడు బెన్ డకెట్ 133, నాలుగో నంబర్ బ్యాటర్ జో రూట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు భారత ఆటగాళ్లలో ధ్రువ్ జురెల్(46), జస్ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 26 పరుగులు) బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ అత్యధికంగా నాలుగు, రెహాన్ అహ్మద్ రెండు.. అదే విధంగా జేమ్స్ ఆండర్సన్ , టామ్ హార్లే, జో రూట్ ఒక్కో వికెట్ తీశారు. రెండు వందల పరుగుల మార్కు అందుకున్న ఇంగ్లండ్ 34: డకెట్ 131, జో రూట్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 29.6: సిరాజ్ బౌలింగ్‌లో ఒలీ పోప్(39) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 182-2(30). బెన్ డకెట్ సెంచరీ 25.5: సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 148-1(26). డకెట్ 106, పోప్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 20వ ఓవర్ ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు:115/1 (20) డకెట్ 78, పోప్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 500 వికెట్ల క్లబ్లో అశ్విన్ 89 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి జాక్ క్రాలే (15) ఔటయ్యాడు. అశ్విన్‌కు ఇది 500వ టెస్ట్ వికెట్. బెన్ డకెట్‌కు (68) జతగా ఓలీ పోప్ క్రీజ్‌లోకి వచ్చాడు. Etched in history🎯5⃣0⃣0⃣*#INDvENGpic.twitter.com/vKKoMxlPDM — Chennai Super Kings (@ChennaiIPL) February 16, 2024 టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 31/0 (6) డకెట్ 19, క్రాలే 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 25-0 డకెట్ 14, క్రాలే ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ 326/5 ఓవర్‌నైట్ స్కోరుతో భారత జట్టు శుక్రవారం నాటి ఆట మొదలుపెట్టింది. ఆరంభంలోనే కుల్దీప్ యాదవ్(4), రవీంద్ర జడేజా(112) వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్(46), రవిచంద్రన్ అశ్విన్(37) ఇన్నింగ్స్‌ను మళ్లీ గాడిన పడేశారు. చివర్లో బుమ్రా 28 బంతుల్లో 26 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్) చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మార్క్ వుడ్ బౌలింగ్‌లో బుమ్రా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో టీమిండియా ఆఖరి వికెట్ కోల్పోయింది. 130.5 ఓవర్లలో 445 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్లు మార్క్ వుడ్ 4, ఆండర్సన్ ఒకటి.. స్పిన్నర్లు రెహాన్ అహ్మద్ రెండు, టామ్ హార్లే ఒకటి, జో రూట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. 💥 goes Bumrah, this time with the BAT 🤩#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSerie pic.twitter.com/zq1VB1vmZw — JioCinema (@JioCinema) February 16, 2024 తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 123.5: హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురెల్ అవుటయ్యాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 415/9 (124) ఎనిమిదో వికెట్ డౌన్ 119.6: అశ్విర్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో ఆండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి అశూ(37) నిష్క్రమించాడు. జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. జురెల్ 39 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 408-89(120). నాలుగు వందల పరుగుల మార్కు అందుకున్న టీమిండియా అశ్విన్ 36, జురెల్ 32 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. భారత్ స్కోరు 400-7(117) లంచ్ బ్రేక్ ఇంగ్లండ్‌తో మూడో టెస్టు రెండో రోజు భోజన విరామ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 388 పరుగుల వద్ద నిలిచింది. ఆల్‌రౌండర్ అశ్విన్ 25, అరంగేట్ర వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం 133 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 109 ఓవర్లలో టీమిండియా స్కోరు: 375-7 అశ్విన్ 24, జురుల్ 20 పరుగులతో ఆడుతున్నారు. 110 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి నిలకడగా ముందుకు సాగుతున్నారు. ఆచితూచి ఆడుతున్న అశ్విన్, జురెల్ రెండోరోజు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు ఆల్‌రౌండర్ అశ్విన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆచితూచి ఆడుతున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ.. అశూ 18, జురెల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 359/7 (103) ఏడో వికెట్ డౌన్ సెంచరీ వీరుడు రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. జో రూట్ బౌలింగ్‌లో 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడ్డూ బౌల్డ్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 331-7(91) ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే టీమిండియాకు షాకిచ్చాడు ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్. అతడి బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 331/6 (90) మొదటిరోజు హైలైట్స్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(110- నాటౌట్) సెంచరీలు అరంగేట్రంలోనే అర్ధ సెంచరీతో అదరగొట్టిన సర్ఫరాజ్(62) వీలుకాని పరుగుకు పిలుపునిచ్చిన జడేజా కారణంగా సర్ఫరాజ్ రనౌట్ ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్ మార్క్‌వుడ్‌కు మూడు, స్పిన్నర్ టామ్ హార్లేకు ఒక వికెట్ కుల్దీప్ యాదవ్ 1, రవీంద్ర జడేజా 110 పరుగులతో క్రీజులో ఉన్నారు. తుదిజట్లు: భారత్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్- అరంగేట్రం), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. -
Ind vs Eng 3rd Test: తొలిరోజు టీమిండియాదే.. కానీ ఆ ఒక్కటే!
India vs England 3rd Test 2024- 3rd Test Day 1 Updates: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. గురువారం నాటి ఆట పూర్తయ్యేసరికి 86 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 326 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(131), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(110- నాటౌట్) శతకాలతో మెరిశారు. అయితే, అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీతో మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాడు. కానీ దురదృష్టవశాత్తూ జడేజాతో సమన్వయలోపం కారణంగా రనౌట్ అయ్యాడు. 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్(10), శుబ్‌మన్ గిల్(0), రజత్ పాటిదార్(5) పూర్తిగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్ మార్క్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. స్పిన్నర్ టామ్ హార్లేకు ఒక వికెట్ దక్కింది. మొత్తానికి మూడో టెస్టు తొలి రోజు ఆటలో ఆరంభంలో టీమిండియా తడబడినా.. రోహిత్, జడ్డూ, సర్ఫరాజ్ ఇన్నింగ్స్ కారణంగా పుంజుకుని ఆధిపత్యం కనబరిచిందని చెప్పవచ్చు. జడ్డూ 110, కుల్దీప్ యాదవ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. 𝑹𝒂𝒋𝒌𝒐𝒕 𝒌𝒂 𝑹𝒂𝑱𝒂 👑 Jadeja slams his fourth Test 💯 to keep #TeamIndia on the front foot ⚡#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/RSHDu8MMAD — JioCinema (@JioCinema) February 15, 2024 జడేజా సెంచరీ రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియా స్కోరు: 315-5(82). కుల్దీప్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నాడు. సర్ఫరాజ్ రనౌట్.. ఐదో వికెట్ డౌన్ 81.5: జడ్డూతో సమన్వయ లోపం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. 66 బంతుల్లోనే 62 పరుగులు చేసి జోష్‌లో ఉన్న అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. కుల్దీప్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రంలో అదరగొట్టాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 45 బంతుల్లోనే 7 ఫోర్ల సాయంతో 43 పరుగులు సాధించి అర్ధ శతకానికి చేరువయ్యాడు. మరోవైపు.. జడ్డూ 95 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 291/4 (76) 66 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 242-4 జడేజా 86, సర్ఫరాజ్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ అవుట్ 63.3: సెంచరీ వీరుడు రోహిత్ శర్మ(131) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత టెస్ట్‌ల్లో సెంచరీ చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో హిట్‌మ్యాన్ 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో 11వ సెంచరీ పూర్తి చేశాడు. హిట్‌మ్యాన్‌తో పాటు జడేజా (68) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ స్కోర్ 190/3గా ఉంది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 185/3 (52) రోహిత్ శర్మ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండగా.. జడేజా 68 పరుగులతో ఆడుతున్నాడు. జడ్డూ హాఫ్ సెంచరీ గాయం కారణంగా జట్టుకు దూరమై మూడో టెస్టుతో తిరిగి వచ్చిన స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అర్ధ శతకంతో మెరిశాడు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను ఆదుకునే క్రమంలో విలువైన యాభై పరుగులు జత చేశాడు. టెస్టుల్లో అతడికి 21వ ఫిఫ్టీ. ఈ క్రమంలో తనదైన శైలిలో కత్తిసాము చేస్తున్నట్లుగా సెలబ్రేడ్ చేసుకున్నాడు జడ్డూ. రోహిత్ 79 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 150/3 (44) వందకు పైగా పరుగుల భాగస్వామ్యం 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆదుకుంటున్నారు. తొలి రోజు 41 ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ 77, జడ్డూ 47 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. నిలకడగా ఆడుతున్న రోహిత్, జడ్డూ రోహిత్ శర్మ 53, రవీంద్ర జడేజా 39 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. స్కోరు: 111/3 (32) సెంచరీ కొట్టిన టీమిండియా రోహిత్ శర్మ 52, రవీంద్ర జడేజా 31 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరి మెరుగైన భాగస్వామ్యం కారణంగా టీమిండియా వంద పరుగుల మార్కును అందుకుంది. స్కోరు: 100-3(26) లంచ్ బ్రేక్ రోహిత్ శర్మ 52, రవీంద్ర జడేజా 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: : 93/3 (25) రోహిత్ శర్మ అర్ధ శతకం 22.5: టామ్ హార్లే బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి భారత సారథి రోహిత్ శర్మ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ 51, జడ్డూ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 81-3(23). టీమిండియా హాఫ్ సెంచరీ 13.2: ఆండర్సన్ బౌలింగ్ రవీంద్ర జడేజా ఒక పరుగు తీయడంతో.. టీమిండియా 50 పరుగుల మార్కు అందుకుంది. జడ్డూ 4, రోహిత్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ డౌన్ 8.5: రజత్ పాటిదార్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లీ బౌలింగ్‌లో.. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రజత్ అవుటయ్యాడు. రోహిత్ శర్మ 17, రవీంద్ర జడేజా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 33-3(9) రెండో వికెట్ కోల్పోయిన భారత్ 5.4: ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ టీమిండియాను మరోసారి దెబ్బకొట్టాడు. భారత వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను అవుట్ చేశాడు. ఫలితంగా టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న గిల్ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 24/2 (6) తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 3.5: యశస్వి జైస్వాల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 10 బంతులు ఎదుర్కొన్న యశస్వి 10 పరుగులు చేసి మైదానం వీడాడు. శుబ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. 4 ఓవర్లలో భారత్ స్కోరు: 22-1 మొదటి ఓవర్లో భారత్ స్కోరు: 6-0 రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించారు. వాళ్లిద్దరి అరంగేట్రం టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మొదలైంది. రాజ్‌కోట్ వేదికగా గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ టెస్టు ద్వారా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. తుదిజట్లు: టీమిండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. -
IND VS ENG 3rd Test: ఆ ముగ్గురు సహా మరో ఇద్దరికి చాలా ప్రత్యేకం..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ మ్యాచ్ ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారింది. రేపటి మ్యాచ్‌లో భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ తీస్తే టెస్ట్‌ల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండగా.. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మరో ఐదు వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 700 వికెట్ల అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. రేపటి మ్యాచ్ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు 100వ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్ అతనికి చిరకాలం గుర్తిండిపోతుంది. ఈ మూడు ప్రత్యేకతలే కాకుండా రేపటి మ్యాచ్ ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు చిరస్మరణీయంగా మారే అవకాశం ఉంది. రాజ్‌కోట్ టెస్ట్‌తో యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ అహ్మద్, దృవ్ జురెల్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైపోయింది. ఆఖరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప ఈ ఇద్దరి టెస్ట్ అరంగేట్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇలా రేపటి నుంచి ప్రారంభంకాబోయే రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ ఐదుగురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారనుంది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలువగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు సమంగా ఉండటంతో రాజ్‌కోట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యతను పెంచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. టీమిండియాను సీనియర్ల గైర్హాజరీ సమస్య కలవరపెడుతున్నప్పటికీ యువ ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపిస్తూ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచారు. మరోపక్క ఇంగ్లండ్ టీమ్.. భారత్‌ను దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తూ ప్రణాళికలు రచిస్తుంది. మరి రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి. -
అతడిపై వేటు.. మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
India vs England, 3rd Test: టీమిండియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. రాజ్‌కోట్ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌పై వేటు పడగా.. రైటార్మ్ పేసర్ మార్క్ వుడ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో.. ఒకే ఒక్క ఫాస్ట్‌బౌలర్ మార్క వుడ్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. తర్వాతి మ్యాచ్‌లో దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌కు పిలుపునిచ్చింది. మార్క్‌వుడ్ స్థానాన్ని ఆండర్సన్‌తో భర్తీ చేయడంతో పాటు.. గాయపడిన సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో షోయబ్ బషీర్‌తో అరంగేట్రం చేయించింది. ఈసారి ఇద్దరు పేసర్లతో ఈ క్రమంలో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఆండర్సన్ ఐదు వికెట్లు తీయగా.. బషీర్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. కానీ ఈ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో.. రాజ్‌కోట్ వేదికగా ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లతో బరిలో దిగాలని భావించిన ఇంగ్లండ్.. బషీర్‌పై వేటు వేసి మార్క్ వుడ్‌ను మళ్లీ పిలిపించింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(ఫిబ్రవరి 15) నుంచి గుజరాత్‌లోని రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది. టీమిండియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్. చదవండి: Virat Kohli-Anushka Sharma: ఓ బ్యాడ్ న్యూస్.. ఓ ‘గుడ్’ న్యూస్! -
మార్చి 7, 8 తేదీల్లో సెంచరీలు కొట్టనున్న నలుగురు క్రికెటర్లు..!
మార్చి 7, 8 తేదీల్లో నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు సెంచరీలు కొట్టనున్నారు. ఇదేంటని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. పై పేర్కొన్న తేదీల్లో ఓ భారత ఆటగాడు, ఓ ఇంగ్లండ్ ఆటగాడు, ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లు టెస్ట్‌ల్లో వందో మ్యాచ్ ఆడనున్నారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్‌స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. ఈ తేదీల కంటే ముందు ఫిబ్రవరి 15న మరో ఆటగాడు కూడా సెంచరీ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్‌కు వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. రోజుల వ్యవధిలో ఐదుగురు ఆటగాళ్లు వంద టెస్ట్‌ల మార్కును తాకడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఆటగాళ్లతో పాటు మరికొందరు శతాధిక టెస్ట్ ప్లేయర్లు ఒకేసారి రిటైరైతే టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసినట్లవుతుంది. నేటి వరకు (ఫిబ్రవరి 13) పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి. బెన్ స్టోక్స్- 99 టెస్ట్‌ల్లో 13 సెంచరీలు, 6251 పరుగులు, 197 వికెట్లు జానీ బెయిర్‌స్టో- 97 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 5902 పరుగులు రవింద్రన్ అశ్విన్- 97 టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 3271 పరుగులు, 499 వికెట్లు కేన్ విలియమ్సన్- 98 టెస్ట్‌ల్లో 31 సెంచరీలు, 8490 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-98 టెస్ట్‌ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2059 పరుగులు, 375 వికెట్లు టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్‌ల మార్కును తాకారు. -
IND VS ENG 2nd Test: బెన్ స్టోక్స్ అసహనం.. టెక్నాలజీది తప్పంటూ..!
విశాఖ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలి టెస్ట్‌లో అన్ని విభాగాల్లో రాణించి టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఓటమిపాలైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు తేలిపోయిన వేల బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్ (209), శుభ్‌మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. ముఖ్యంగా బుమ్రా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై చెలరేగి ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. Technology got it wrong on this occasion: England skipper Ben Stokes on Zak Crawley's lbw dismissal in second innings of second Test #INDvsENGTest — Press Trust of India (@PTI_News) February 5, 2024 మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తమ వైఫల్యాలను అంగీకరించినప్పటికీ, ఓ విషయంలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాడు జాక్ క్రాలే ఎల్బీడబ్ల్యూ విషయంలో సాంకేతికతను తప్పుబడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. గేమ్‌లో సాంకేతికత స్పష్టంగా ఉంది. ఇది ఎప్పటికీ 100 శాతం కాకూడదనే అంపైర్ కాల్ అనే ఆప్షన్‌ను ఉంచారు. ఇలాంటి సందర్భంలో పూర్తిగా సాంకేతికతపై ఆధారపడి థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయమని స్టోక్స్ అన్నాడు. Review.....successful! ✅☝️ Kuldeep Yadav picks up the big wicket of Crawley to keep #TeamIndia in the driving seat 👊⚡️#BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports#INDvENG pic.twitter.com/c4hMunPVSP — JioCinema (@JioCinema) February 5, 2024 ఇంతకీ ఏం జరిగిందంటే.. జాక్ క్రాలే (73) మాంచి జోరుమీదున్న సమయంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సందేహాస్పదంగా ఉన్న డీఆర్ఎస్ అప్పీల్‌ను థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, సందర్భం సందేహాస్పదంగా ఉన్నా థర్డ్ అంపైర్ క్రాలేను ఔట్‌గా ప్రకటించడంతో వివాదం మొదలైంది. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో థర్డ్ అంపైర్ అంపైర్స్ కాల్‌తో వెళ్తారు. కానీ ఈ సందర్భంలో థర్డ్ అంపైర్ అలా చేయకుండా సాంకేతికత ఆధారంగా క్రాలేను ఔట్‌గా ప్రకటించాడు. రీప్లేలో బంతి లెగ్ సైడ్ వెళ్తున్నట్లు అనిపించినా, చివరకు లెగ్ స్టంప్‌కు తగులుతున్నట్లు డీఆర్ఎస్ చూపించింది. ఈ సాంకేతికత ఆధారంగానే థర్డ్ అంపైర్ క్రాలేను ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో క్రాలే సహా ఇంగ్లీష్ బృందం మొత్తం ఆశ్యర్యం వ్యక్తం చేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ సైతం థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. -
Ind vs Eng: దెబ్బకు దెబ్బ.. మాతో పెట్టుకుంటే..!
Ind vs Eng 2nd Test: పటిష్ట జట్ల మధ్య పోటీ అంటే క్రికెట్ అభిమానులకు ఎల్లప్పుడూ ఆసక్తే! ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా తదితర జట్లతో స్వదేశంలో అయినా.. విదేశంలో అయినా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా టీమిండియా మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోతారు వీరాభిమానులు. ప్రేక్షకుల పరిస్థితి ఇలా ఉంటే.. మైదానంలో ఆటగాళ్లు కూడా పోటీ తీవ్రమవుతున్న కొద్దీ ఒత్తిడికి లోనవడం ఎంత సహజమో.. కీలక సమయంలో ప్రత్యర్థిని దెబ్బకు దెబ్బ తీస్తే సంబరాలు చేసుకోవడం కూడా అంతే సహజం. ముఖ్యంగా తమను ట్రోల్ చేసేలా వ్యవహరించిన ప్రత్యర్థి ప్లేయర్‌కు కౌంటర్ ఇచ్చే అవకాశం వస్తే అస్సలు చేజార్చుకోరు. టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విషయంలో అదే పని చేశాడు. వైజాగ్‌లో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో.. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. టామ్ హార్లీ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను స్టోక్స్ పట్టుకున్నాడు. దీంతో మూడో రోజు ఆట(ఆదివారం)లో 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో స్టోక్స్ అయ్యర్‌కు సెండాఫ్ ఇస్తూ ఓవర్‌గా సెలబ్రేట్ చేసుకున్న తీరు అతడికి కోపం తెప్పించింది. అయితే, అందుకు బదులు తీర్చుకునే అవకాశం అయ్యర్‌కు నాలుగో రోజు ఆట సందర్భంగా వచ్చింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 52.4వ ఓవర్ వద్ద అశ్విన్ బౌలింగ్‌లో బెన్ ఫోక్స్ సింగిల్ తీశాడు. అయితే, మరో ఎండ్‌లో ఉన్న బెన్ స్టోక్స్ పరుగు తీయడంలో బద్దకం ప్రదర్శించాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న అయ్యర్ వికెట్లకు డైరెక్ట్‌గా త్రో చేయగా.. స్టోక్స్ రనౌట్ అయ్యాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ సైతం.. స్టోక్స్ తన క్యాచ్ అందుకున్నపుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో అదే తరహాలో వేలు చూపిస్తూ.. ‘‘తిరిగి చెల్లించేశాను’’ అన్నట్లు సైగ చేశాడు. వీరిద్దరి ఫొటోలను కలిపి షేర్ చేస్తున్న టీమిండియా అభిమానులు.. ‘‘మా వాళ్లతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఏదీ దాచుకోరు. తిరిగి ఇచ్చేస్తారు’’ అంటూ ఇంగ్లండ్ ప్లేయర్లపై సెటైర్లు వేస్తున్నారు. చదవండి: IND VS ENG 2nd Test: అతనో ఛాంపియన్ ప్లేయర్.. కుర్రాళ్లు అద్భుతం: రోహిత్ Ben Stokes after taking Shreyas Iyer's catch. Shreyas Iyer after running out Ben Stokes. pic.twitter.com/xpp8lF6N62 — Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2024 ఇక వైజాగ్ టెస్టులో భారత జట్టు 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. ఇంగ్లండ్‌పై ఘన విజయం
Ind vs Eng 2nd Test- India won by 106 runs: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. విశాఖపట్నం మ్యాచ్‌లో పర్యాటక జట్టును ఏకంగా 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా హైదరాబాద్ టెస్టు పరాభవానికి బదులు తీర్చుకుని... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. యశస్వి ‘డబుల్’ కారణంగా విశాఖ వేదికగా శుక్రవారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత సారథి రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(209) కారణంగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు స్కోరు చేయగలిగింది. ‘ఆరే’సిన బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఈ క్రమంలో రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. దీంతో 55.5 ఓవర్లలోనే ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. గిల్ సెంచరీ ఈ నేపథ్యంలో రెండో రోజే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. అయితే, మూడో రోజు టీమిండియాకు పెద్దగా కలిసి రాలేదు. ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(17), రోహిత్ శర్మ(13) వికెట్లు కోల్పోయింది. శుబ్‌మన్ గిల్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్(45), అశ్విన్(29) అతడికి అండగా నిలబడ్డారు. ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన ఈ క్రమంలో 255 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ముగించిన టీమిండియా.. ఇంగ్లండ్‌కు 399 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే, నాలుగో రోజు ఆట ఆరంభం నుంచే చెలరేగిన భారత బౌలర్లు 292 పరుగులకే ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. దీంతో నాలుగో రోజు ఆట కూడా పూర్తికాకుండానే.. టీమిండియా 106 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక బుమ్రా, అశ్విన్‌లకు తలా మూడు వికెట్లు దక్కగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ ఒక్కో వికెట్ తీశారు. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్‌ను రనౌట్ చేయడంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ భాగమయ్యాడు. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ►వేదిక: డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియం, విశాఖపట్నం ►టాస్: టీమిండియా... బ్యాటింగ్ ►టీమిండియా స్కోరు(మొదటి ఇన్నింగ్స్): 396-10 (112 ఓవర్లలో) ►ఇంగ్లండ్ స్కోరు(మొదటి ఇన్నింగ్స్): 253-10 (55.5 ఓవర్లలో) ►టీమిండియా స్కోరు(రెండో ఇన్నింగ్స్): 255-10 (78.3 ఓవర్లలో) ►ఇంగ్లండ్ విజయ లక్ష్యం: 399 రన్స్. ►లక్ష్యాన్ని ఛేదించలేక 292 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్ ►విజేత: టీమిండియా ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(తొమ్మిది వికెట్లు)- కెరీర్లో రెండో అత్యుత్తమ గణాంకాలు(9/91). చదవండి: ఒకే ఒక్క పరుగు.. 80 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
వారెవ్వా శ్రేయస్.. డైరెక్ట్ త్రో! స్టోక్స్ రనౌట్.. వీడియో
India vs England, 2nd Test Day 4 Vizag: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో బ్యాటింగ్‌లో విఫలమైనా తన ఫీల్డింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. వైజాగ్ మ్యాచ్‌లో ఈ మిడిలార్డర్ బ్యాటర్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 56 (27, 29) పరుగులు మాత్రమే చేశాడు. అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ జాక్ క్రాలే(76) ఇచ్చి క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు అయ్యర్. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కాలే షాట్ ఆడేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికి బంతి గాల్లోకి లేవగానే బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్.. వెనక్కి పరిగెత్తి డైవ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇలా రెండో రోజు ఆటలో... కీలక వికెట్ పడగొట్టడంలో తన వంతు పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్.. తాజాగా సోమవారం నాటి ఆటలో అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 52.4 ఓవర్ వద్ద అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ బెన్ స్టోక్స్ బద్దకంగా కదిలాడు. ఈ క్రమంలో మిడ్ వికెట్ మీదుగా వచ్చిన బంతిని ఒంటిచేత్తో అందుకున్న శ్రేయస్ అయ్యర్.. నేరుగా దానిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికి స్టోక్స్ ఇంకా క్రీజులోకి చేరుకోకపోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోగా.. టీమిండియా విజయానికి ఇంకా మూడు వికెట్ల దూరంలో నిలిచింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ►టాస్: టీమిండియా... బ్యాటింగ్ ►మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 396-10 (112 ఓవర్లలో) ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 253-10 (55.5 ఓవర్లలో) ►రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 255-10 (78.3 ఓవర్లలో) ►ఇంగ్లండ్ విజయ లక్ష్యం: 399 రన్స్. చదవండి: Ind vs Eng: 0.45 సెకన్లలో మెరుపు వేగంతో రోహిత్.. రెప్పపాటులో క్యాచ్! -
ENG vs IND: వైజాగ్ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం
India vs England, 2nd Test At Vizag Day 4 Updates: వైజాగ్ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం విశాఖ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా నిలిచింది. టామ్ హార్ట్లీని (36) బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా టీమిండియా గెలుపు ఖరారైంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా తొమ్మిది వికెట్లు (6/45, 3/46) తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో (209), సెకెండ్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో సత్తా చాటారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించి అపురూప విజయాన్ని అందించారు. స్కోర్ వివరాలు.. భారత్: 396 & 255 ఇంగ్లండ్: 253 & 292 తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 281 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి షోయబ్ బషీర్ (0) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపు ఖరారైపోయింది. ఇంగ్లండ్ లక్ష్యానికి ఇంకా 118 పరుగుల దూరంలో ఉంది. ఎనిమిదో వికెట్ డౌన్.. 275 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 36 పరుగుల చేసిన బెన్ ఫోక్స్.. బుమ్రా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. భారత్ విజయానికి ఇంకా రెండు వికెట్లు కావాలి. నిలకడగా ఆడుతున్న బెన్ ఫోక్స్.. ఇంగ్లండ్ స్కోరు: 261-7(62 ఓవర్లలో) టీమిండియా గెలుపునకు మూడు వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలవాలంటే 134 పరుగులు కావాలి. గెలుపు దిశగా టీమిండియా.. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 52.4: ఏడో వికెట్‌గా వెనుదిరిగిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(11). అశ్విన్ బౌలింగ్‌లో ఫోక్స్ సింగిల్‌కు యత్నించగా.. స్టోక్స్ బద్దకంగా పరుగుకు వచ్చాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న శ్రేయస్ అయ్యర్ డైరెక్ట్ త్రోతో స్టోక్స్‌ను రనౌట్ చేశాడు. టామ్ హార్లీ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 220-7(53). టీమిండియా విజయానికి ఇంకా మూడు వికెట్ల దూరంలో ఉంది. 49 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 210/6 49 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 189 పరుగుల దూరంలో ఉంది. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 194/6 (42.4) టీమిండియా విధించిన 399 పరుగుల లక్ష్యానికి.. ఇంగ్లండ్ ఇంకా 205 పరుగుల దూరంలో ఉంది. ఇక రోహిత్ సేన మరో నాలుగు వికెట్లు తీస్తే గెలుపు భారత్ సొంతమవుతుంది. రసవత్తరంగా మ్యాచ్.. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 42.4: జానీ బెయిర్ స్టో రూపంలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో బెయిర్ స్టో(26) లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్.. క్రాలీ ఔట్ ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 73 పరుగులు చేసిన జాక్ క్రాలే.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 205 పరుగులు కావాలి ►42 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 194/4. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 205 పరుగులు కావాలి ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్.. రూట్ అవుట్ 154 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన జో రూట్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జానీ బెయిర్ స్టో వచ్చాడు. రోహిత్ సూపర్ క్యాచ్.. ఓలీ పోప్ రూపంలో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన పోప్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రోహిత్ శర్మ అద్బుత క్యాచ్‌తో పోప్‌ను పెవిలియన్‌కు పంపాడు. క్రీజులో జాక్ క్రాలే(53), జో రూట్(4) ఉన్నారు. 29 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 143/3 జాక్ క్రాలీ ఫిప్టీ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే హాఫ్ సెంచరీ సాధించాడు. క్రాలీ ప్రస్తుతం 51 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 274 పరుగులు కావాలి. 27 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 125/2 21.5: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రెహాన్ అహ్మద్(23) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. క్రాలే 39 పరుగులతో ఆడుతున్నాడు. ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే ఫోర్ బాదాడు. ఇంగ్లండ్ స్కోరు: 99-2(22) నిలకడగా ఆడుతున్న క్రాలే, రెహాన్ అహ్మద్ 19 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 82-1 9 వికెట్ల దూరంలో టీమిండియా విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లండ్ విజయానికి 332 పరుగులు అవసరమవ్వగా.. భారత్ గెలుపొందాలంటే ఇంకా 9 వికెట్లు పడగొట్టాలి. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆట ముగిసే సరికి 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ►టాస్: టీమిండియా... బ్యాటింగ్ ►తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 396-10 (112 ఓవర్లలో) ►ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 253-10 (55.5 ఓవర్లలో) ►రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 255-10 (78.3 ఓవర్లలో) ►ఇంగ్లండ్ విజయ లక్ష్యం: 399 రన్స్. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్. ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్. -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న స్టోక్స్.. నిశ్చేష్ఠుడిగా ఉండిపోయిన అయ్యర్
వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 377 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు (సెకెండ్ ఇన్నింగ్స్) చేసింది. అశ్విన్ (8), బుమ్రా క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో కదంతొక్కాడు. అక్షర్ పటేల్ (45) పర్వాలేదనిపించాడు. రోహిత్ (13), శ్రేయస్ (29), కేఎస్ భరత్ (6) మరోసారి నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్ సెన్సేషన్, డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ 9 పరుగులకు ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 209 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బుమ్రా (6/45), కుల్దీప్ (3/71) ధాటికి 253 పరుగులకే ఆలౌటైంది. A STUNNER FROM STOKES. 🔥🫡pic.twitter.com/7Ml2YADBEE — Johns. (@CricCrazyJohns) February 4, 2024 కళ్లు చెదిరే క్యాచ్.. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. స్టోక్స్ దాదాపు 23 మీటర్లు పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. స్టోక్స్ క్యాచ్ పట్టిన తీరును చూసి బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నిశ్రేష్ఠుడిగా ఉండిపోయాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో స్టోక్స్ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. -
#Bumrah: బుమ్రా సరికొత్త చరిత్ర.. భారత తొలి బౌలర్‌గా!
India vs England, 2nd Test- #Bumrah: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వైజాగ్ మ్యాచ్‌లో శనివారం నాటి ఆటలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ ఫాస్ట్‌బౌలర్.. అంతర్జాతీయ టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు.. అతి తక్కువ బంతుల్లోనే ఈ ఘనత సాధించిన భారత తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(47)ను అవుట్ చేసి బుమ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు. 𝘚𝘵𝘰𝘬𝘦𝘴' 𝘳𝘦𝘢𝘤𝘵𝘪𝘰𝘯 𝘴𝘢𝘺𝘴 𝘪𝘵 𝘢𝘭𝘭 😱 1⃣5⃣0⃣ Test wickets for the Wrecker-in-chief! 🤌#Bumrah #INDvENG #BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports pic.twitter.com/cWG7HfKqir — JioCinema (@JioCinema) February 3, 2024 ఇక ఈ మ్యాచ్‌లో తన అద్భుత నైపుణ్యాలతో ఆకట్టుకున్న పేస్ గుర్రం బుమ్రా.. మొత్తంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రెండో రోజు ఆటలో భాగంగా జో రూట్‌తో వికెట్ల వేట మొదలుపెట్టిన బుమ్రా.. తర్వాత ఒలీ పోప్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, టామ్ హార్లీలను కూడా అవుట్ చేసి.. జేమ్స్ ఆండర్సన్‌తో ముగించాడు. ఇతర బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా.. ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 15, రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక అంతకుముందు టీమిండియా 396 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించిన విషయం తెలిసిందే. Memorable Performance ✅ Special Celebration 🙌 Well bowled, Jasprit Bumrah! 🔥 🔥 Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/bRYTf68zMN — BCCI (@BCCI) February 3, 2024 అంతర్జాతీయ టెస్టుల్లో... తక్కువ బంతుల్లోనే 150 వికెట్ల క్లబ్లో చేరిన భారత బౌలర్లు 6781 బాల్స్- జస్ప్రీత్ బుమ్రా 7661 బాల్స్- ఉమేశ్ యాదవ్ 7755 బాల్స్- మహ్మద్ షమీ 8378 బాల్స్- కపిల్ దేవ్ 8380 బాల్స్- రవిచంద్రన్ అశ్విన్ చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ -
ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా పేస్‌దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లిష్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ చుక్కలు చూపించాడు. వైజాగ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో భాగంగా.. తొలుత జో రూట్(5)ను పెవిలియన్‌కు పంపిన ఈ పేస్ గుర్రం.. ఆ తర్వాత ఒలీ పోప్(23)నకు వీడ్కోలు పలికాడు. అద్భుతమైన ఇన్‌స్వింగింగ్ యార్కర్‌తో పోప్‌ను బౌల్డ్ చేశాడు. అనంతరం.. బెయిర్ స్టో(25) రూపంలో తన ఖాతాలో మూడో వికెట్ జమచేసుకున్న బుమ్రా.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్(47)ను సంచలన రీతిలో బౌల్డ్ చేసి.. మరోసారి తన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. శనివారం నాటి ఆటలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 49.2వ ఓవర్లో నమ్మశక్యం కాని రీతిలో కట్టర్ సంధించి స్టోక్స్‌ను బోల్తా కొట్టించాడు. ఊహించని పరిణామానికి కంగుతిన్న స్టోక్స్ తన బ్యాట్ కిందపడేసి.. ‘‘ఇలాంటి బాల్ వేస్తే నేను ఎలా ఆడేది?’’ అన్నట్లుగా సైగ చేయడం విశేషం. దీంతో బుమ్రా ముఖంలో నవ్వులు పూయగా.. సహచరులంతా పరిగెత్తుకు వచ్చి బుమ్రాతో కలిసి బిగ్ వికెట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక అంతర్జాతీయ టెస్టుల్లో బుమ్రాకు స్టోక్స్ రూపంలో 150వ వికెట్ దక్కింది. స్టోక్స్ తర్వాత ఈ మ్యాచ్‌లో టామ్ హార్లీని అవుట్ చేసిన బుమ్రా తన కెరీర్లో టెస్టు కెరీర్లో పదోసారి ఫైవ్- వికెట్ హాల్ నమోదు చేశాడు. ఇక రెండో రోజు ఆటలో బుమ్రా ఆఖరిగా జేమ్స్ ఆండర్సన్ వికెట్ దక్కించుకున్నాడు. కాగా వైజాగ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా మొత్తంగా ఆరు వికెట్లతో మెరవగా.. కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు. 𝘚𝘵𝘰𝘬𝘦𝘴' 𝘳𝘦𝘢𝘤𝘵𝘪𝘰𝘯 𝘴𝘢𝘺𝘴 𝘪𝘵 𝘢𝘭𝘭 😱 1⃣5⃣0⃣ Test wickets for the Wrecker-in-chief! 🤌#Bumrah #INDvENG #BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports pic.twitter.com/cWG7HfKqir — JioCinema (@JioCinema) February 3, 2024 -
Ind vs Eng: రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
Ind vs Eng 2nd Test Vizag: టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. శుక్రవారం మొదలుకానున్న ఈ మ్యాచ్‌లో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ అరంగేట్రం చేయనున్నట్లు వెల్లడించింది. జాక్ లీచ్ స్థానంలో అతడిని ఎంపిక చేసినట్లు తెలిపింది. అదే విధంగా మార్క్‌వుడ్‌ని తప్పించి.. అతడి స్థానంలో దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను జట్టులోకి తీసుకువచ్చింది మేనేజ్మెంట్. ఈ మ్యాచ్‌లో తాము ఈ మేరకు రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. కాగా తొలి టెస్టులో మార్క్‌వుడ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు.. హైదరాబాద్ టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జాక్ లీచ్ మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జరిగిన ట్రెయినింగ్ సెషన్లో అతడు పాల్గొనలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడికి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు బషీర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. విశాఖలో గెలిచేందుకు కాగా విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరుగనుంది. ఫిబ్రవరి 2న ఆరంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు.. మంగళవారమే నగరానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ టీమిండియా మీద 28 పరుగుల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో విశాఖలో విజయం సాధించి 1-1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటికే జట్టుకు దూరం కాగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాల వల్ల విశాఖ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులో చేర్చింది బీసీసీఐ. టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్. చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్! సిరాజ్‌కు నో ప్లేస్? -
నిజంగా బాధాకరం.. అతడిని కేవలం అనుభవం కోసమే తీసుకురాలేదు: స్టోక్స్
టీమిండియాతో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా రెండు టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అధికారికంగా దృవీకరించాడు. తో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. వీసా సమస్య కారణంగా తొలి టెస్టుకు దూరమైన బషీర్.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు సిద్దమవుతోన్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన బషీర్ తన సహాచర ఆటగాళ్లతో కలిసి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జాక్ లీచ్ దురదృష్టవశాత్తూ వైజాగ్ టెస్టుకు దూరమయ్యాడు. అతడి కుడి కాలిలో వాపు వచ్చింది. జాక్ దూరం కావడం మాకు గట్టి ఎదురుదెబ్బ. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాక అతడికి ఇలా జరగడం బాధాకరమని చెప్పకొచ్చాడు. ఇక బషీర్ అరంగేట్రం కోసం స్టోక్సీ మాట్లాడుతూ.. షోయబ్ బషీర్ డెబ్యూపై మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అతడికి అవకాశం వస్తే మాత్రం దీనిని తన కెరీర్లో మరుపురాని టెస్టుగా మార్చేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఏ ఆటగాడికైనా అరంగేట్ర టెస్టు ఆడే అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది కదా. పిచ్ పరిస్థితిని అంచనా వేసి కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, వైస్ కెప్టెన్ ఓలీ పోప్‌తో చర్చించి తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటాం. బషీర్ స్క్వాడ్‌లో ఉన్నాడు. అతడిని మేము అనుభవం కోసం ఇక్కడకు తీసుకురాలేదు. అతడి అవసరం మాకుందని భావిస్తే కచ్చితంగా తుది జట్టులో ఛాన్స్ ఇస్తామని పేర్కొన్నాడు. చదవండి: Sachin Tendulkar: వరుసగా రెండుసార్లు డకౌట్.. సాకులు చెప్పా.. ఆ ఒక్క పరుగు వల్ల -
Ind vs Eng: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ
సాక్షి, విశాఖపట్నం: టీమిండియా – ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు నగరంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఫిబ్రవరి 2- 6 వరకు నిర్వహించనున్న ఈ మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. ఇరు జట్ల ఆటగాళ్లు జనవరి 30న విశాఖపట్నానికి చేరుకుంటారని తెలిపారు. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 3.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారని గోపినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆటగాళ్ల వెంట మ్యాచ్ అధికారులు, ఇతర సిబ్బంది రానున్నట్లు వెల్లడించారు. పనులన్నీ పూర్తి చేయాలి ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణలో భాగంగా స్థానిక స్టేడియంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఏసీఏ ట్రెజరర్ ఎ.వి.చలంతో కలిసి గోపినాథ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. స్టేడియం లోపల, బయట చేపడుతున్న పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ అదే విధంగా... వాహనాల పార్కింగ్ వద్ద తగిన సిబ్బందిని నియమించి ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గోపీనాథ్‌రెడ్డి ఆదేశించారు. రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్న దృష్ట్యా వారి ఐడీ కార్డులను పరిశీలించి స్టేడియంలోకి పంపాలన్నారు. ఇక విద్యార్థులతో పాటు.. రోజుకు 2,850 మంది చొప్పున.. 5 రోజులకు 14,250 మంది రాష్ట్రంలో ఉన్న క్లబ్ క్రీడా కారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఉప్పల్ మ్యాచ్‌లో రోహిత్ సేన స్టోక్స్ బృందం చేతిలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టులో 0-1తో వెనుకబడింది. చదవండి: శతక్కొట్టిన బెంగాల్ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు -
వాళ్లిద్దరు అత్యద్భుతం.. రోహిత్‌ను చూసే నేర్చుకున్నా: స్టోక్స్
India vs England, 1st Test: టీమిండియాతో తొలి టెస్టులో విజయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ హర్షం వ్యక్తం చేశాడు. భారత గడ్డపై సాధించిన ఈ గెలుపు వందకు వంద శాతం ఎంతో గొప్పదని వ్యాఖ్యానించాడు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి సాధించిన పరిపూర్ణ విజయమని పేర్కొన్నాడు. నాలుగో రోజే ముగిసిన టెస్టు అదే విధంగా.. ఉపఖండంలో తొలిసారి కెప్టెన్ హోదాలో అడుగుపెట్టానని.. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టును ఓడించడం సంతోషంగా ఉందన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ టీమిండియాను 28 పరుగుల తేడాతో ఓడించింది. ఉప్పల్‌లో తొలి రెండు రోజులు వెనుకబడ్డ స్టోక్స్ బృందం.. అనూహ్యంగా పుంజుకుని నాలుగో రోజే ఖేల్ ఖతం చేసి విజయం అందుకుంది. పరిపూర్ణ విజయం.. ఒలీ పోప్ అద్భుత శతకం(196), అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్లీ(మొత్తం తొమ్మిది వికెట్లు) కారణంగా ఊహించని రీతిలో టీమిండియాను ఓడించింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మా జట్టు విజయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఘన విజయం మరింత గొప్పగా అనిపిస్తోంది. ఇండియాలో కెప్టెన్‌గా నా తొలి ప్రయత్నంలోనే గెలుపు దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో మేము పొరపడ్డ మాట వాస్తవం. అయితే, టీమిండియా స్పిన్నర్లు ఆడుతున్న తీరు.. రోహిత్ ఫీల్డింగ్ సెట్ చేస్తున్న విధానాన్ని గమనిస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. వాటిని మా వ్యూహాలకు అనుగుణంగా అమలు చేసి ఫలితం రాబట్టడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది’’ అని ఆనందం వ్యక్తం చేశాడు. వాళ్లిద్దరు అత్యద్భుతం అదే విధంగా తమ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒలీ పోప్, టామ్ హార్లీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘భుజానికి సర్జరీ చేయించుకున్న తర్వాత ఒలీ పోప్ రీ ఎంట్రీలో ఇలా అదరగొట్టాడు. టామ్‌కు ఇదే అరంగేట్ర మ్యాచ్. అయినప్పటికీ తన మీద నమ్మకంతో వరుసగా ఓవర్లు వేయించాను. ప్రతికూల ఫలితం వచ్చినా పర్లేదని ముందే నిశ్చయించుకున్నా. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) అయితే, అతడు నా నమ్మకాన్ని నిజం చేశాడు. ఉపఖండంలో అనేక టెస్టులు ఆడిన అనుభవం నాకు ఉంది. అయితే, ఓ ఇంగ్లిష్ బ్యాటర్ ఇక్కడ ఆడిన అత్యద్భుత ఇన్నింగ్స్ ఏదంటే.. ఒలీ పోప్ పేరు చెప్పొచ్చు. నిజానికి ఒకవేళ మేము ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా నేను పెద్దగా బాధపడే వాడిని కాదు. వైఫల్యాలకు భయపడే వాడిని కానేకాను. ఆటగాళ్లను కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తూ.. ఎల్లవేళలా వాళ్లకు మద్దతుగా నిలిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని నమ్ముతాను’’ అని బెన్ స్టోక్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. చదవండి: IND Vs ENG: ఇంట్లోనే తలవంచారు... భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ పూర్తి వివరాలు -
బెన్ స్టోక్స్ బుల్లెట్ త్రో.. పాపం జడేజా! ఇదే తొలిసారి? వీడియో వైరల్
హైదరాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ స్పినర్లు భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. హార్ట్లీ 4 వికెట్లు పడగొట్టగా.. జాక్ లీచ్, రూట్ తలా వికెట్ సాధించారు. భారత విజయానికి 111 పరుగులు కావాలి. ఇంగ్లండ్ గెలుపొందాలంటే మరో 3 వికెట్లు పడగొడితే చాలు. స్టోక్సీ బుల్లెట్ త్రో.. ఇక ఇది ఉండగా.. నాలుగో రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. సంచలన త్రోతో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రనౌట్ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. భారత ఇన్నింగ్స్ 39 ఓవర్లో తొలి బంతిని జో రూట్ ఫుల్ టాస్‌గా సంధించాడు. అయితే జడేజా ఆ డెలివరీని మిడ్-ఆన్ వైపు ఆడాడు. దీంతో సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ వైపు పరిగెత్తాడు. ఈ క్రమంలో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్న స్టోక్సీ.. రివర్స్‌లో త్రో చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. జడ్డూ క్రీజులోకి రాకముందే బంతి స్టంప్స్‌ను గిరాటు వేయడంతో పెవిలియన్‌కు చేరక తప్పలేదు. కాగా స్టోక్స్ విన్యాసం చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా టెస్టు క్రికెట్లో జడేజా రనౌట్ అవ్వడం ఇదే తొలిసారి. చదవండి: AUS vs WI: 27 ఏళ్ల తర్వాత తొలి విజయం.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్ లారా! వీడియో Bro wtf was that 🤯 Benjamin Stokes - what a runout #INDvsENGTest #INDvsENG pic.twitter.com/l0IIEY3FY2 — Cheems Bond (@Cheems_Bond_007) January 28, 2024 -
Ind Vs Eng 1st Test Day 4 Live Updates: తొలి టెస్టులో టీమిండియా ఓటమి..
Ind Vs Eng 1st Test Day 4 Live Updates: తొలి టెస్టులో టీమిండియా ఓటమి.. హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో బారత్ ఓటమి పాలైంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ టామ్ హార్ట్లీ 7 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు జో రూట్, జాక్ లీచ్ తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓటమి అంచుల్లో టీమిండియా.. అశ్విన్ ఔట్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి అంచుల్లో నిలిచింది. రవి చంద్రన్ అశ్విన్(28) రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. భారత విజయానికి ఇంకా 49 పరుగులు కావాలి. ఎనిమిదో వికెట్ డౌన్.. 176 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన శ్రీకర్ భరత్‌ను.. హార్ట్లీ క్లీన్ బౌల్డ్ చేశాడు. భారత్ విజయానికి ఇంకా 54 పరుగులు కావాలి. క్రీజులో అశ్విన్, శ్రీకర్ భరత్ ఉన్నారు. నిలకడగా ఆడుతున్న అశ్విన్, శ్రీకర్.. 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రవిచంద్రన్ అశ్విన్(13), శ్రీకర్ భరత్(9) అదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 53 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 89 పరుగులు కావాలి. ఓటమి దిశగా భారత్.. ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. భారత విజయానికి ఇంకా 111 పరుగులు కావాలి. క్రీజులో ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్ ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తడబడుతోంది. 119 పరుగుల వద్ద జడేజా రూపంలో భారత్ 6 వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన జడేజా రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. భారత విజయానికి ఇంకా 112 పరుగులు కావాలి. క్రీజులో ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్ ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.... కేఎల్ రాహుల్ ఔట్ నాలుగో ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. నాలుగో వికెట్ డౌన్.. అక్షర్ పటేల్ ఔట్ 95 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. భారత విజయానికి ఇంకా 136 పరుగులు కావాలి టీ విరామానికి భారత్ స్కోర్: 95/3 నాలుగో రోజు టీ విరామానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(17), కేఎల్ రాహుల్(21) పరుగులతో ఉన్నారు. టీమిండియా విజయానికి 136 పరుగులు కావాలి. రోహిత్ శర్మ (39) ఔట్.. కష్టాల్లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. 230 పరుగుల లక్ష్య ఛేదనలో 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్‌కు జతగా అక్షర్ పటేల్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఒకే స్కోర్ వద్ద రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 42 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ ఒక్కసారిగా రెచ్చిపోయి యశస్వి జైస్వాల్ (15), శుభ్‌మన్ గిల్‌ను (0) ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న పోప్.. ఇంగ్లండ్ 420 ఆలౌట్ ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్ తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 196 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పోప్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పోప్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు 420 పరుగుల వద్ద తెర పడింది. ఆ జట్టు భారత్ ముందు 230 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 420 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో మార్క్ వుడ్ (0) ఔటయ్యాడు. పోప్ 196 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. ఎనిమితో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 419 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్.. టామ్ హార్ట్లీని (34) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ఓవర్‌నైట్ స్కోర్ 316/6తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి రెహాన్ అహ్మద్ (28) ఔటయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 352/7గా ఉంది. 162 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఓలీ పోప్ (166), టామ్ హార్ట్లీ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.భారత బౌలర్లలో అశ్విన్, జడేజా తలో 3 వికెట్లు.. అక్షర్, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసి ఆలౌటైంది. జడేజా (87), కేఎల్ రాహుల్ (86), యశస్వి జైస్వాల్ (80) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ 4, రెహాన్ అహ్మద్, హార్ట్లీ తలో 2 వికెట్లు, లీచ్ ఓ వికెట్ పడగొట్టారు. -
Ind vs Eng: అశ్విన్ దెబ్బకు స్టోక్స్ బౌల్డ్.. అరుదైన రికార్డు
India vs England, 1st Test: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఒకే బ్యాటర్‌ను అత్యధికసార్లు అవుట్ చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు. తద్వారా లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. కాగా హైదరాబాద్‌లో గురువారం మొదలైన టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా మరోసారి అద్భుత ప్రదర్శనతో మెరిశాడు అశ్విన్. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. ఓపెనర్ జాక్ క్రాలే(31)ను అవుట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. 📽️ R Ashwin to Ben Stokes What a delivery 🙌#TeamIndia | #INDvENG | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/sxBGnhmhl0 — BCCI (@BCCI) January 27, 2024 అప్పట్లో కపిల్ దేవ్ ఆ తర్వాత బెన్ స్టోక్స్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. తద్వారా తన ఖాతాలో రెండో వికెట్‌ను జమ చేసుకున్నాడు. కాగా టెస్టుల్లో అశూ.. స్టోక్స్ వికెట్ పడగొట్టడం ఇది పన్నెండోసారి. గతంలో కపిల్ దేవ్.. ముదాసర్ నాజర్‌ను 12సార్లు పెవిలియన్‌కు పంపాడు. ఇక ఈ జాబితాలో కపిల్ దేవ్(12), అశ్విన్ (12) సంయుక్తంగా అగ్ర స్థానంలో కొనసాగుతుండగా... ఇషాంత్ శర్మ అలిస్టర్ కుక్‌ను 11 సార్లు అవుట్ చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. కపిల్ దేవ్.. గూచ్ను 11 సార్లు, డేవిడ్ వార్నర్‌ను అశ్విన్ 11 సార్లు అవుట్ చేయడం విశేషం. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ హైదరాబాద్ టెస్టు తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ టామ్ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్. -
బుమ్రా బౌలింగ్ కి ఖంగుతిన్న బెన్ స్టోక్స్..
-
Day 3: భారత బౌలర్లకు 6 వికెట్లు.. పోప్ సెంచరీ.. హైలైట్స్ ఇవే
India vs England 1st Test Day 3 Updates: టీమిండియాతో తొలి టెస్టు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. హైదరాబాద్‌లో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 77 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ అద్భుత సెంచరీ కారణంగా ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. మూడో రోజు హైదరాబాద్ టెస్టు ఆసక్తికరమైన మలుపులు తిరిగింది. ఆరంభంలో టీమిండియా, ఆ తర్వాత ఇంగ్లండ్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఓ దశలో మ్యాచ్ ఇండియా వైపే మొగ్గు చూపినా.. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ పోరాడడంతో ఆ జట్టుకు 126 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. మూడో రోజు ఆట ముగిసే సరికి పోప్ 148, రెహాన్ అహ్మద్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 316/6 స్కోరు చేసిన ఇంగ్లండ్ ప్రస్తుతం భారత జట్టు కంటే 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆరో వికెట్ డౌన్.. 275 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన బెన్ ఫోక్స్‌ను.. అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి రెహాన్ ఆహ్మద్ వచ్చాడు. అతడితో పాటు ఓలీ పోప్(125) పరుగులతో ఉన్నాడు. ఒలీ పోప్ టాప్ క్లాస్ సెంచరీ 60.2: జడేజా బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి శతకం పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్. ఇంగ్లండ్ స్కోరు: 245/5 (61) 200 పరుగుల మార్కు అందుకున్న ఇంగ్లండ్ 52 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 200-5 ఆధిక్యంలోకి ఇంగ్లండ్.. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. 50 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజులో పోప్(81), బెన్ ఫోక్స్(10) పరుగులతో ఉన్నారు. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 172/5 (42) ఒలీ పోప్ 67, బెన్ ఫోక్స్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 18 పరుగులు వెనుబడి ఉంది. స్టోక్స్ అవుట్ 36.5: అశ్విన్ బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్(6). ఇంగ్లండ్ స్కోరు: 163/5 (36.5). టీమిండియా ఇంకా 27 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. స్టోక్స్ స్థానంలో బెన్ ఫోక్స్ క్రీజులోకి వచ్చాడు. పోప్ 60 పరుగులతో ఆడుతున్నాడు. 28.3: పోప్ హాఫ్ సెంచరీ నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 27.4: .జడేజా బౌలింగ్‌లో బెయిర్‌స్టో బౌల్డ్(10). బెన్‌స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 140/4 (27.4) 27 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 136/3 బెయిర్ స్టో ఆరు, పోప్ 46 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఆధిక్యం 54 పరుగులు ఇంగ్లండ్ స్కోరు: 122/3 (24).. టీమిండియాకు 68 పరుగుల ఆధిక్యం బెయిర్‌స్టో 3, ఒలీ పోప్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. దెబ్బకు దెబ్బ కొట్టిన బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో రూట్(2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బెయిర్‌స్టో క్రీజులోకి వచ్చాడు. 21 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 117-3. కాగా అంతకు ముందు రూట్ బుమ్రాను బౌల్డ్ చేసిన సంగతి తెలిసిందే. బుమ్రా మ్యాజిక్.. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 18.5: బుమ్రా బౌలింగ్‌లో బెన్ డకెట్(47) క్లీన్‌బౌల్డ్. దెబ్బకు ఎగిరిపడ్డ వికెట్. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. పోప్ 31 పరుగులతో ఆడుతున్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 113/2 (18.5). టీమిండియాకు ఇంకా 77 పరుగుల ఆధిక్యం నిలకడగా ఆడుతున్న డకెట్, పోప్ 16.3: డకెట్, పోప్ కలిసి 43 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. స్కోరు: 97-1(17). టీమిండియా ఆధిక్యం 93 రన్స్. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 89/1 (15) ఒలీ పోప్ 16, బెన్ డకెట్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 101 పరుగులు వెనుకబడి ఉంది 12 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 67/1 డకెట్ 30, పోప్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. క్రాలే దూకుడుకు బ్రేక్.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 9.2: అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటైన ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే. 33 బంతుల్లోనే 31 పరుగులతో జోరు మీదున్న క్రాలేకు అశూ అడ్డుకట్ట వేయడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 45/1 (9.2) 7 ఓవర్లలో స్కోరు: 33-0 క్రాలే 25, డకెట్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6.3: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన క్రాలే 5.5: అశ్విన్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన క్రాలే 5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 13-0 ఓపెనర్లు జాక్ క్రాలే 10, బెన్ డకెట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 177 పరుగులు వెనుకబడి ఉంది. హైలైట్స్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 246 టీమిండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 436 టీమిండియా ఆలౌట్.. ఓవరాల్‌గా 190 పరుగుల ఆధిక్యం 120.6: రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ బౌల్డ్. పదో వికెట్ కోల్పోయిన టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరు: 436 (121). మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు వికెట్లు తీయగా... రెహాన్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. వచ్చీ రాగానే బుమ్రా బౌల్డ్ 119.4: జడ్డూ స్థానంలో క్రీజులోకి వచ్చిన బుమ్రా జో రూట్ బౌలింగ్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ 44 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 436/9 (120). 190 పరుగుల ఆధిక్యంలో టీమిండియా జడ్డూ అవుట్.. ఎనిమిదో వికెట్ డౌన్ 119.3: జో రూట్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగిన రవీంద్ర జడేజా. 87 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడ్డూ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. టీమిండియా ఆధిక్యం 190 రన్స్ 118.6: ఫోర్ బాదిన అక్షర్ 179 పరుగుల ఆధిక్యంలో టీమిండియా 113: జడేజా 84, అక్షర్ పటేల్ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్- ఇంగ్లండ్ మధ్య మొదలైన మూడో రోజు ఆట రవీంద్ర జడేజా 83, అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 423-7(112). రెండో రోజు హైలైట్స్ ►శుక్రవారం నాటి ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 421/7 ►కేఎల్ రాహుల్(86), జడేజా అర్ధ సెంచరీలు ►రాణించిన కేఎస్ భరత్(41), అక్షర్ పటేల్ ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్ టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట ఆరంభమైంది. హైదరాబాద్ వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల విజృంభణతో 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేన ప్రస్తుతం 175కు పైగా పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ టామ్ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్. చదవండి: మొదటి టెస్టు మన చేతుల్లోకి... -
భారత్ ‘స్పిన్ బాల్’...ఆపై జైస్వాల్...
‘బజ్‌బాల్’... దూకుడైన ఆటకు మారుపేరు అంటూ ఇంగ్లండ్ జట్టు గత కొంత కాలంగా ప్రచారం చేసింది. అయితే భారత్‌లో ఇది సాధ్యమా అనే సందేహాలు వినిపించాయి. ఇంగ్లండ్ ఆశించినట్లుగా ఆ ధాటి పని చేసింది... అయితే అది తొలి ఎనిమిది ఓవర్ల వరకే... ఆ తర్వాత భారత ‘స్పిన్ బాల్’ దెబ్బకు లెక్క మారిపోయింది... వరుసగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివర్లో స్టోక్స్ ఆదుకోవడంతో కాస్త కోలుకుంది. అక్కడక్కడ ఇంగ్లండ్ కాస్త మెరుగైన స్థితిలోనే నిలిచినా చివరకు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆపై మన గడ్డపై ‘బజ్‌బాల్’ ఎలా ఆడాలో భారత ఓపెనర్లు చూపించారు. యశస్వి ధాటికి ఆరంభంలో స్కోరు ఆరుకు పైగా రన్‌రేట్‌తో సాగింది. తొలి రోజే ప్రత్యర్థి స్కోరులో దాదాపు సగం స్కోరును జట్టు అందుకుంది... మొత్తంగా అన్ని విధాలా మొదటి రోజు మనదిగా ముగిసింది. సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ మొదటి రోజు పైచేయిని ప్రదర్శించింది. టాస్ ఓడిపోవడం మినహా దాదాపు మిగతా రోజంతా టీమిండియాకే అనుకూలంగా సాగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (88 బంతుల్లో 70; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా... బెయిర్‌స్టో (58 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. స్పిన్నర్లు అశ్విన్ జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టగా...అక్షర్ పటేల్ ఖాతాలో 2 వికెట్లు చేరాయి. పేసర్ బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు సాధించింది. యశస్వి జైస్వాల్ (70 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... రోహిత్ శర్మ (27 బంతుల్లో 24; 3 ఫోర్లు) రాణించాడు. ప్రస్తుతం భారత్ మరో 127 పరుగులు వెనుకబడి ఉండగా... క్రీజ్‌లో యశస్వితో పాటు గిల్ (43 బంతుల్లో 14 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నాడు. నేడు రెండో రోజూ పూర్తిగా బ్యాటింగ్ చేసి టీమిండియా భారీ స్కోరు సాధిస్తే మ్యాచ్ చేతుల్లోకి వచ్చి నట్లే. ఓపెనర్ల శుభారంభం... బుమ్రా, సిరాజ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ క్రాలీ (40 బంతుల్లో 20; 3 ఫోర్లు), డకెట్ (39 బంతుల్లో 35; 7 ఫోర్లు) వేగంగా పరుగులు రాబట్టారు. 8 ఓవర్లలో వీరు 41 పరుగులు జత చేశారు. తర్వాతి ఓవర్ జడేజా మెయిడిన్‌గా వేయడంతో దూకుడుకు అడ్డుకట్ట పడింది. అశ్విన్ , జడేజా చెలరేగడంతో 5 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఈ దశలో రూట్ (60 బంతుల్లో 29; 1 ఫోర్), బెయిర్‌స్టో కలిసి 61 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే 4 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. అక్షర్ అద్భుత బంతితో బెయిర్‌స్టోను బౌల్డ్ చేయగా, రూట్ స్వయంకృతంతో వెనుదిరిగాడు. 137/6తో ఇన్నింగ్స్ ముగిసేందుకు ఇంగ్లండ్ చేరువైంది. అయితే స్టోక్స్ తన విలువను చూపించాడు. ఈ స్థితిలో స్టోక్స్ స్కోరు 8 పరుగులు మాత్రమే. కానీ టెయిలెండర్ల సహాయంతో అతను చెలరేగిపోయాడు. జట్టు సాధించిన తర్వాతి 109 పరుగుల్లో 62 అతని బ్యాట్ నుంచే రాగా... హార్లీ (24 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) తన కెప్టెన్ కు అండగా నిలిచాడు. జడేజా ఓవర్లో స్టోక్స్ వరుస బంతుల్లో కొట్టిన రెండు సిక్సర్లు, అతని ఓవర్లోనే బాదిన మూడు ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. చివరకు చక్కటి బంతితో స్టోక్స్ ఆటను బుమ్రా కట్టించాడు. తొలి రెండు సెషన్లలో వందకు పైగా పరుగులు సాధించి ఇంగ్లండ్ మెరుగ్గానే ఆడినా... చివరకు వచ్చేసరికి ఆ జట్టు ఆశించిన భారీ స్కోరు మాత్రం సాధ్యం కాలేదు. మెరుపు ఆరంభం... వుడ్స్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌తో మొదలు పెట్టిన యశస్వి, అరంగేట్ర బౌలర్ హార్లీ తొలి టెస్టు బంతిని సిక్సర్ బాది స్వాగతం పలికాడు. మరోవైపు రోహిత్ అండగా నిలవడంతో 6.3 ఓవర్లలోనే టీమిండియా స్కోరు 50 పరుగులకు చేరింది. అనంతరం 47 బంతుల్లోనే యశస్వి అర్ధసెంచరీ పూర్తయింది. అయితే జట్టుకు అంతా అనుకూలంగా ఉండి టెస్టులో ఇంకా ఎంతో సమయం మిగిలి ఉన్నా... అనవసరంగా అత్యుత్సాహానికి పోయి చెత్త షాట్ ఆడిన రోహిత్ వికెట్ పారేసుకున్నాడు. అనంతరం గిల్ బాగా జాగ్రత్త ప్రదర్శించడంతో వేగం తగ్గింది. అయినా చివరకు 5.17 రన్‌రేట్‌తో భారత్ రోజును ముగించింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 20; డకెట్ (ఎల్బీ) (బి) అశ్విన్ 35; పోప్ (సి) రోహిత్ (బి) జడేజా 1; రూట్ (సి) బుమ్రా (బి) జడేజా 29; బెయిర్‌స్టో (బి) అక్షర్ 37; స్టోక్స్ (బి) బుమ్రా 70; ఫోక్స్ (సి) భరత్ (బి) అక్షర్ 4; రేహన్ (సి) భరత్ (బి) బుమ్రా 13; హార్లీ (బి) జడేజా 23; వుడ్ (బి)అశ్విన్ 11; లీచ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (64.3 ఓవర్లలో ఆలౌట్) 246. వికెట్ల పతనం: 1–55, 2–58, 3–60, 4–121, 5–125, 6–137, 7–155, 8–193, 9–234, 10–246. బౌలింగ్: బుమ్రా 8.3–1–28–2, సిరాజ్ 4–0–28–0, జడేజా 18–4–88–3, అశ్విన్ 21–1–68–3, అక్షర్ 13–1–33–2. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (బ్యాటింగ్) 76; రోహిత్ (సి) స్టోక్స్ (బి) లీచ్ 24; గిల్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (23 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119. వికెట్ల పతనం: 1–80. బౌలింగ్: వుడ్ 2–0–9–0, హార్లీ 9–0 –63–0, లీచ్ 9–2–24–1, రేహన్ 3–0–22–0. -
Ind vs Eng- Vizag: రేపటి నుంచి ఆఫ్‌లైన్ టికెట్లు.. ధరలు ఇలా
సాక్షి, విశాఖపట్నం: టీమిండియా- ఇంగ్లండ్ రెండో టెస్టుకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 26) నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టికెట్ల విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 6 వరకు పీఎం పాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం, ఫిబ్రవరి 1 వరకు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లు విక్రయించనున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టికెట్లు విక్రయించేలా ఏర్పాట్లు చేశామన్నారు. తొలి రోజు టీమిండియాదే కాగా.. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(జనవరి 25) తొలి టెస్టు ఆరంభమైంది. స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ను 246 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడటంతో మొదటి రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. మొత్తానికి తొలి రోజు పర్యాటక స్టోక్స్ బృందంపై రోహిత్ సేన పైచేయి సాధించింది. ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న టికెట్ల ధరల వివరాలు.. ►రోజుకు రూ.100+సీజన్‌కు రూ.400 ►రోజుకు రూ.200+సీజన్‌కు రూ.800 ►రోజుకు రూ.300+సీజన్‌కు రూ.1,000 ►రోజుకు రూ.500+సీజన్‌కు రూ.1,500 రోజుకు 2,850 మంది క్లబ్ క్రీడాకారులకు ఉచిత ఎంట్రీ.. రాష్ట్రంలో రోజుకు 2,850 మంది క్రికెట్ క్లబ్ క్రీడాకారులన చొప్పున ఐదు రోజులకు 14,250 మందికి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ.. రోజుకు 2 వేల మంది చొప్పున ఐదు రోజులకు 10,000 మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీకి ఏర్పాట్లు చేశారు. అయితే విద్యార్థులు ఐడీ కార్డులు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తక్కువ ధరలు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా లోయర్ పెవిలియన్ సీజన్ టికెట్లను విశాఖపట్నంలో కేవలం రూ. 1500లకు అందుబాటులో ఉంచినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: INDA& U19 WC: టెస్టులో అన్న.. వరల్డ్‌కప్‌లో తమ్ముడి సెంచరీలు -
IND Vs ENG: అప్పుడు షమీ.. ఇప్పుడు బుమ్రా! దెబ్బకు స్టోక్స్ మతి పోయింది? వీడియో
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో మెరిశాడు. ఓ సంచలన బంతితో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఏమైందంటే.. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ స్టోక్స్ మాత్రం భారత స్పిన్నర్లను టార్గెట్ చేస్తూ బౌండరీలు వర్షం కురిపించాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రీమియర్ బౌలర్ బుమ్రాను ఎటాక్‌లోకి తీసుకు వచ్చాడు. రోహిత్ నమ్మకాన్ని జస్ప్రీత్ వమ్ము చేయలేదు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్65 ఓవర్లో బుమ్రా వేసిన మూడో బంతిని స్టోక్స్.. ఫ్రంట్ ఫుట్కు వచ్చి వికెట్లను వదిలేసి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి మాత్రం అనూహ్యంగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో బిత్తర పోయిన స్టోక్స్.. ఏమి బాల్ వేశావు బ్రో అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అంతకుముందు గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో మహ్మద్ షమీ కూడా ఈ విధంగానే స్టోక్స్‌ను ఔట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు మనదే.. ఇక తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌పై టీమిండియా పైచేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(76), శుబ్‌మన్ గిల్(14) పరుగులతో ఉన్నారు. రోహిత్ శర్మ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది.ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ 70 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, అశ్విన్ తలా 3 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. అక్షర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. What a beauty from Bumrah 😍 Ben Stokes gives his appreciation and England are all out for 246 🏏#INDvENG pic.twitter.com/cWktwuB42B — Cricket on TNT Sports (@cricketontnt) January 25, 2024 -
టాస్ ఓడిన భారత్.. కోహ్లి ప్రత్యామ్నాయ ఆటగాడికి నో ప్లేస్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 25) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
పాక్ మూలాలు ఉన్న ఇంగ్లండ్ స్పిన్నర్‌కు ఎట్టకేలకు భారత వీసా
భారత వీసా లభించకపోవడంతో తొలి టెస్టుకు దూరమైన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు ఊరట లభించింది. వీసా లేకపోవడంతో అతను జట్టుతో పాటు భారత్‌కు ప్రయాణించకుండా యూఏఈ నుంచి ఇంగ్లండ్‌కు వెనక్కి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు బషీర్‌కు వీసా మంజూరైందని గురువారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. ‘బషీర్ తన వీసా అందుకున్నాడు. ఈ వారాంతంలో భారత్‌కు వచ్చి అతను జట్టుతో కలుస్తాడు. సమస్య పరిష్కారం కావడంతో సంతోషంగా ఉంది’ అని ఈసీబీ వెల్లడించింది. ఇంగ్లండ్‌లో పుట్టినా... పాకిస్తాన్ మూలాలు ఉన్న కారణంగానే బషీర్ వీసాను భారత ప్రభుత్వం ఆలస్యం చేసిందని గత రెండు రోజులుగా విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ ప్రభుత్వ అధికారి కూడా ఒకరు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయగా... ఇప్పుడు అంతా సుఖాంతమైంది. 20 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ బషీర్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. ఒకవేళ బషీర్ జట్టుతో పాటు భారత్‌కు చేరుకుని ఉంటే ఇంగ్లండ్ తుది జట్టులో అతను ఉండేవాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. రెహన్ అహ్మద్, జాక్ లీచ్, టామ్ హర్ట్లీలతో కూడిన ఇంగ్లండ్ స్పిన్ త్రయం భారత బ్యాటర్లను ఢీ కొట్టనుంది. భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
అచ్చొచ్చిన ఉప్పల్.. ఇక్కడ టీమిండియాకు తిరుగేలేదు..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నారు. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కావడంతో హైదరాబాద్ నగర వాసులు ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్ మైదానంలో టీమిండియాకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. పరుగుల వరద...వికెట్ల జాతర.. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐదు టెస్టులు అభిమానులకు పసందైన క్రికెట్ అందించాయి. ఒకవైపు పరుగుల వరద పారడంతో పాటు వికెట్ల జాతర కూడా కనిపించింది. ఈ వేదికపై తొలిసారిగా 2010 నవంబర్ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. అయితే ఈ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 117.3 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది. టిమ్ మెకింటోష్ (102; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ నాలుగేసి వికెట్లు తీశారు. ధోని కెపె్టన్సీలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 143.4 ఓవర్లలో 472 పరుగులకు ఆలౌటైంది. హర్భజన్ సింగ్ (111 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో అదరగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 122 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టును ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ (225; 22 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో ఆదుకున్నాడు. న్యూజిలాండ్ 135 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసి భారత జట్టుకు 327 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. అశ్విన్ మాయాజాలం.. 2012 ఆగస్టు 23 నుంచి 26 వరకు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు రెండో టెస్టు ఆడింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశి్వన్ (6/31, 6/54) మ్యాచ్ మొత్తంలో 12 వికెట్లు తీసి భారతజట్టు ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (159; 19 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ చేశాడు. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఫాలోఆన్ ఆడిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 79.5 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. పుజారా ధమాకా.. 2013 మార్చి 2 నుంచి 5 వరకు భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఈ వేదికపై మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 237 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. భువనేశ్వర్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీశారు. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 154.1 ఓవర్లలో 503 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (204; 30 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ... మురళీ విజయ్ (167; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించారు. 266 పరుగులతో వెనుకబడిన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ్రస్టేలియా అశి్వన్ (5/63), రవీంద్ర జడేజా (3/33) దెబ్బకు 67 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కోహ్లి కేక.. 2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ వేదికపై నాలుగో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లి (204; 24 ఫోర్లు) డబుల్ సెంచరీ... మురళీ విజయ్ (108; 12 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (106 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 166 ఓవర్లలో 6 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 127.5 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. 299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌కు 459 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అశ్విన్ (4/73), జడేజా (4/78) బంగ్లాదేశ్‌ను దెబ్బ కొట్టారు. పది వికెట్లతో విజయం.. 2018 అక్టోబర్ 12 నుంచి 14 వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈ వేదికపై ఐదో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్లతో ఘనవిజయం నమోదు చేసింది. ముందుగా విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (92), అజింక్య రహానే (80), పృథ్వీ షా (70) అర్ధ సెంచరీలు చేశారు. 56 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 127 పరుగులకే కుప్పకూలింది. ఉమేశ్ యాదవ్ (4/45), అశి్వన్ (2/24), జడేజా (3/12) విండీస్‌ను కట్టడి చేశారు. అనంతరం విండీస్ నిర్దేశించిన 72 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ కోల్పోకుండా ఛేదించి గెలిచింది. -
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు సర్వం సిద్దం..ఇరు జట్ల ప్రాక్టీస్
భాగ్యనగరం వాకిట్లో క్రికెట్ పండుగ వచ్చేసింది. అభిమానులందరికీ ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ ఆటతీరుతో కనువిందు చేయడానికి ‘సై’ అంటున్నారు. గురువారం నుంచి ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు టెస్టు సమరానికి సిద్ధమయ్యాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఈనెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరగనుండగా..రెండో టెస్టుకు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు టెస్టుల్లో గెలుపొంది, ఒక టెస్టును ‘డ్రా’ చేసుకుంది. ఈ మైదానంలో భారత జట్టు తమ అజేయ రికార్డును కొనసాగించాలని మరో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకోవాలని ఆశిద్దాం. కోహ్లి లేడు.. వ్యక్తిగత కారణాలరీత్యా భారత స్టార్ విరాట్ కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరం కావడం తెలుగు క్రికెట్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశం. అయితే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ బ్యాట్‌తో... జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ వాడివేడి పేస్‌తో..అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో టెస్టుల్లోనూ టి20 తరహా దూకుడైన ఆటతో అదరగొడుతున్న ఇంగ్లండ్ జట్టు భారత గడ్డపై అదే జోరు కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ఇంగ్లండ్ బృందంలో బెన్ స్టోక్స్, జో రూట్, బెయిర్‌స్టో, ఒలీ పాప్, జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. లోకల్ స్టార్ సిరాజ్ రె‘ఢీ’.. ఇప్పటికే భారత్, ఇంగ్లండ్ జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. మంగళవారం రెండు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. ‘లోకల్ స్టార్’ మొహమ్మద్ సిరాజ్ సొంత మైదానంలో తొలి టెస్టు ఆడటం ఖాయమైంది. ఇప్పటి వరకు సిరాజ్ 23 టెస్టులు ఆడాడు. ఇందులో 6 టెస్టులు (చెన్నై, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, ఇండోర్) భారత గడ్డపై, మిగతా 17 టెస్టులు విదేశాల్లో ఆడాడు. వ్యూహ రచనలో జడేజా, అశ్విన్.. టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఉప్పల్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో వీరిద్దరు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లో మడతపట్టేందుకు వీరిద్దరూ కఠోరంగా సాధన చేస్తున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం.. భారత్‌ను స్వదేశంలో ఓడించాలంటే ఎంత కష్టమో ఇంగ్లండ్ ఆటగాళ్లు బాగా తెలుసు. అందుకే వారు మూడు రోజుల ముందుగానే తొలి టెస్ట్ వేదిక అయిన హైదరాబాద్‌కు చేరుకుని కఠోరంగా సాధన చేస్తున్నారు. అనుభవమే ఆయుధంగా.. భారత్‌పై ఆడిన అనుభవం ఎక్కువగా ఉన్న వెటరన్ పేసర్ ఆండర్సన్ అందరికంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తున్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియాను ఇబ్బంది పెట్టే బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఆండర్సనే అని చెప్పాలి. అతని అనుభవం ముందు టీమిండియా బ్యాటర్లు నిలబడతారో లేక ఆండర్సన్ కెరీర్‌కు చేదు అనుభవంతో ముగింపు పలుకుతారో వేచి చూడాలి. నాడు ప్లేయర్‌గా... నేడు కోచ్‌గా.. 2010లో ఉప్పల్ స్టేడియంలోనే భారత్‌తో జరిగిన టెస్టులో న్యూజిలాండ్ జట్టు తరఫున ‘డబుల్ సెంచరీ’ సాధించిన బ్రెండన్ మెకల్లమ్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా మళ్లీ హైదరాబాద్‌కు రావడం విశేషం. -
భారత్‌తో తొలి టెస్టు.. హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు! వీడియో వైరల్
భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది. హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లీష్ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్, జో రూట్ వంటి ఆటగాళ్లు కన్పించారు. హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లీష్ జట్టు సోమవారం నుంచి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని లారెన్స్‌తో ఇంగ్లండ్ క్రికెట్ భర్తీ చేసింది. మరోవైపు భారత జట్టు సోమవారం హైదరబాద్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది. భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలే (కెప్టెన్), బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్, ఓలీ పోప్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్ ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, దృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్ VIDEO | England Cricket team arrives in Hyderabad for the 5-match Test series. The first Test is scheduled to be played from January 25 at the Rajiv Gandhi International Stadium. pic.twitter.com/YzGknyrSPw — Press Trust of India (@PTI_News) January 21, 2024 -
'విరాట్ కోహ్లిని రెచ్చగొట్టాలి.. అతడి ఈగో తో ఆడుకోవాలి'
స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ హైవోల్టేజ్ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో మైండ్ గేమ్స్ ఆడాలని, అతడి ఈగోపై దెబ్బ కొట్టాలని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను పనేసర్ సూచించాడు. విరాట్‌తో మైండ్ గేమ్స్ ఆడాలి. అతడిని మానసికంగా దెబ్బతీయాలి. గత 10 ఏళ్లగా ఐసీసీ టైటిల్స్‌ను గెలవకపోయిన విషయాన్ని అతడికి పదేపదే గుర్తు చేయాలి. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కి వచ్చేసరికి మీరు ఓడిపోతారు, ఛోకర్స్ అంటూ అతడిని స్లెడ్జ్ చేయాలి. అప్పుడు విరాట్ తన ఏకగ్రాతను కోల్పోతాడు. దీంతో అతడిని అవుట్ చేయడం సులభం అవుతుందని ఇండియా.కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ సిరీస్‌లో కోహ్లికి, ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్‌కు మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని పనేసర్ అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో విరాట్‌పై పనేసర్‌కు మంచి రికార్డు ఉంది. టెస్టుల్లో కోహ్లిని అండర్సన్ ఇప్పటివరకు 7 సార్లు ఔట్ చేశాడు. చదవండి: Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్! -
టీమిండియాతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ టీమ్‌కు బ్యాడ్ న్యూస్
వచ్చే ఏడాది భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు సంబంధించి ఇంగ్లండ్ జట్టుకు ఓ చేదు వార్త తెలిసింది. ఆ జట్టు సారధి, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భారత్‌తో సిరీస్‌లో బౌలింగ్ చేయడని ఇంగ్లండ్ డైరక్టర్ ఆఫ్ క్రికెట్ రాబ్ కీ స్పష్టం చేశాడు. భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టును ప్రకటిస్తున్న సందర్భంగా కీ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. భారత్‌తో సిరీస్‌లో స్టోక్స్ చేత బౌలింగ్ చేయించడం మొదటి నుంచి తమ ప్రణాళికల్లో లేదని కీ వివరణ ఇచ్చాడు. స్టోక్స్ ఇటీవలే మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడని.. ప్రస్తుతం అతను రీహ్యాబ్‌లో ఉన్నాడని.. భారత్‌తో సిరీస్ సమయానికంతా అతను పూర్తిగా కోలుకుంటాడని కీ తెలిపాడు. భారత్‌లో స్టోక్స్ బౌలింగ్ చేయడన్న విషయం తెలిసి ఇంగ్లండ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. స్టోక్స్ బంతితో రాణిస్తే తమ విజయావకాశాలు మరింత మెరుగుపడేవని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2024 జనవరి 25 నుంచి మార్చి 11 వరకు భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిన్న (డిసెంబర్ 11) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా బెన్ స్టోక్స్‌ను ఎంపిక చేసిన ఈసీబీ.. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు (గస్ అట్కిన్సన్ (పేస్ బౌలర్), టామ్ హార్ట్లీ (ఆఫ్ స్పిన్నర్), షోయబ్ బషీర్ (ఆఫ్ స్పిన్నర్)) అవకాశం కల్పించింది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఓలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్ షెడ్యూల్.. తొలి టెస్ట్: జనవరి 25-29 (హైదరాబాద్) రెండో టెస్ట్: ఫిబ్రవరి 2-6 (వైజాగ్) మూడో టెస్ట్: ఫిబ్రవరి 15-19 (రాజ్‌కోట్) నాలుగో టెస్ట్: ఫిబ్రవరి 23-27 (రాంచీ) ఐదో టెస్ట్: మార్చి 7-11 (ధర్మశాల) -
టీమిండియాతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
వచ్చే ఏడాది (2024) జనవరి 25 నుంచి మార్చి 11 వరకు భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇవాళ (డిసెంబర్ 11) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా బెన్ స్టోక్స్‌ను ఎంపిక చేసిన ఈసీబీ.. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు (గస్ అట్కిన్సన్ (పేస్ బౌలర్), టామ్ హార్ట్లీ (ఆఫ్ స్పిన్నర్), షోయబ్ బషీర్ (ఆఫ్ స్పిన్నర్)) అవకాశం కల్పించింది. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న జాక్ లీచ్ భారత్‌తో సిరీస్‌తో టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఓలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్ షెడ్యూల్.. తొలి టెస్ట్: జనవరి 25-29 (హైదరాబాద్) రెండో టెస్ట్: ఫిబ్రవరి 2-6 (వైజాగ్) మూడో టెస్ట్: ఫిబ్రవరి 15-19 (రాజ్‌కోట్) నాలుగో టెస్ట్: ఫిబ్రవరి 23-27 (రాంచీ) ఐదో టెస్ట్: మార్చి 7-11 (ధర్మశాల) -
'భారత్‌తో టెస్టు సిరీస్‌లోనూ బజ్‌బాల్ క్రికెట్ ఆడతాం.. కానీ అక్కడ'
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి ఇరు జట్లు మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-2025లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ హైప్రొఫైల్ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ టెస్టు బ్యాటర్ ఓలీ పోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌లో కూడా 'బాజ్‌బాల్'ను కొనసాగిస్తామని పోప్ థీమా వ్యక్తం చేశాడు. కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో ఇంగ్లండ్ 'బాజ్‌బాల్(దూకుడుగా ఆడటం)' విధానాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. మేము ఇప్పటి వరకు టెస్టుల్లో ఏ విధంగా ఆడామో అదే కొనసాగిస్తాము. ప్రతీ మ్యాచ్‌లోనూ సెంచరీలు చేయాలని మాపై చాలా అంచనాలు ఉంటాయి. మేము సెంచరీలు చేయకపోతే విఫలమైనట్లు భావిస్తారు. కానీ భారత్ వంటి పరిస్ధితుల్లో అన్ని మ్యాచ్‌ల్లొ అది జరగకపోవచ్చు. కొన్ని పిచ్‌ల్లో 200 కొట్టినా మంచి స్కోరఖ్ అవ్వవచ్చు. భారత స్పిన్నర్ల నుంచి మా రైట్ హ్యాండ్ బ్యాటర్లకు గట్టి సవాలు ఎదురుకానుంది. అశ్విన్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్. అతడితో పాటు రవీంద్ర జడేజా, అక్షర్ వంటి అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. మేము పరుగులు సాధించాలంటే బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడమే ఒక్కటే మార్గం. భారత్ పరిస్థితుల్లో మ్యాచ్‌లను గెలవడం అంత సులభం కాదు. కానీ గెలిచేందుకు మేము అన్ని విధాల ప్రయత్నిస్తామని ది టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోప్ పేర్కొన్నాడు. చదవండి: IND vs SA: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్.. -
అందుకే స్టోక్స్‌ను వదిలేశారు.. సీఎస్కే తదుపరి కెప్టెన్ అతడే!
IPL 2024- MS Dhoni- CSK: చెన్నై సూపర్‌కింగ్స్ భావి కెప్టెన్ ఎవరన్న అంశంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత చెన్నై జట్టును ముందుకు నడిపించగల సత్తా రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రమే ఉందని అభిప్రాయపడ్డాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, టెస్టు సారథి బెన్‌స్టోక్స్‌కు కెప్టెన్సీ అప్పగించాలనే ఉద్దేశంతో సీఎస్కే ఫ్రాంఛైజీ భారీగా ఖర్చు పెట్టిందని.. అయితే, అనుకున్న ఫలితాలు మాత్రం రాబట్టలేకపోయిందని పేర్కొన్నాడు. అందుకే వేలానికి ముందు అతడిని వదిలేసిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ కాగా ఐపీఎల్-2024 వేలానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆటగాళ్లను రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం) చేసుకునే గడువు ఆదివారంతో ముగిసింది. ఈ క్రమంలో.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సహా డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాన్షు సేనాపతి, ఆకాశ్ సింగ్, కైలీ జెమీసన్, సిసంద మగలను చెన్నై విడుదల చేసింది. (PC: CSK/IPL) ఈ లిస్టులో ఖరీదైన ప్లేయర్ బెన్‌స్టోక్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత వేలంలో రూ. 16.25 కోట్ల భారీ మొత్తానికి అతడిని కొనుగోలు చేసిన సీఎస్కే.. ధోని తర్వాత తదుపరి కెప్టెన్ చేయాలని భావించినట్లు తెలిసింది. అయితే, గాయాల కారణంగా తుదిజట్టులో కూడా అందుబాటులో లేకుండా పోయిన స్టోక్స్ పూర్తిగా నిరాశపరిచాడు. తప్పుకొంటాననగానే వదిలేసిన సీఎస్కే ఈ క్రమంలో తాను ఐపీఎల్ నుంచి తప్పుకొంటున్నట్లు స్టోక్స్ ప్రకటించగా.. సీఎస్కే కూడా అందుకు అంగీకరించి అతడిని వదిలేసింది. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘సీఎస్కే పూర్తి చేయాలని భావిస్తున్న పనుల్లో ముఖ్యమైనది కెప్టెన్సీ. ధోని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ పగ్గాలు చేపడతాడనే భావిస్తున్నా. అంబటి రాయుడు చెప్పినట్లు రుతుకు ఆ అర్హత ఉంది. బెన్‌స్టోక్స్ విషయంలో కెప్టెన్సీ కోసం ఆలోచించిన సీఎస్కే అందుకోసం భారీగా ఖర్చుపెట్టింది. స్టోక్స్ ఉంటే మంచిదే గానీ.. నిజానికి అతడు సమర్థవంతమైన నాయకుడు. అలాంటి అనుభవజ్ఞుడు కెప్టెన్‌గా ఉంటే జట్టుకు ఉపయోగకరం. కానీ ఇప్పుడు అతడు టీమ్‌తో లేడు’’ అని పేర్కొన్నాడు. ఇక మరో ఆల్‌రౌండర్‌ను వెదికే క్రమంలో చెన్నై మరోసారి శార్దూల్ ఠాకూర్ వైపు మొగ్గు చూపడం ఖాయం అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో అశూ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్య వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో మహారాష్ట్ర జట్టు విజయవంతమైన కెప్టెన్‌గా రుతురాజ్ దూసుకుపోతున్నాడు. బ్యాటర్‌గానూ ఈ ఓపెనర్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. కోహ్లి రికార్డు సమం -
IPL 2024: ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..! (ఫొటోలు)
-
IPL 2024: అన్నంత పని చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ ముగ్గురిని వదిలించుకుంది
ఐపీఎల్ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ (నిలబెట్టుకోవడం), రిలీజ్ (వదిలించుకోవడం) ప్రక్రియకు ఇవాళ (నవంబర్ 26) ఆఖరి తేదీ కావడంతో అన్ని ఫ్రాంచైజీలు తాము నిలబెట్టుకునే ఆటగాళ్ల జాబితాను, వదిలించుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ తాము వదిలించుకోబోయే ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ముందుగా అనుకున్న ప్రకారం సీఎస్కే ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు అల్విదా చెప్పింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న బెన్ స్టోక్స్ (16.25 కోట్లు), అంబటి రాయుడు (6.75), కైల్ జేమీసన్‌ను (1 కోటి) వివిధ కారణాల చేత రిలీజ్ చేసింది. వీరితో పాటు సీఎస్కే మరో ఐదుగురికి కూడా గుడ్‌బై చెప్పింది. విదేశీ ఆటగాళ్లు డ్వేన్ ప్రిటోరియస్ (50 లక్షలు), సిసండ మగాల (50 లక్షలు)తో పాటు లోకల్ ప్లేయర్స్ ఆకాశ్ సింగ్ (20 లక్షలు), భగత్ వర్మ (20 లక్షలు), సుభ్రాన్షు సేనాపతిలను (20 లక్షలు) సీఎస్కే రిలీజ్ చేసింది. ఈ ఎనిమిది మందిని రిలీజ్ చేశాక సీఎస్కే పర్స్‌లో 32.2 కోట్లు మిగిలాయి. ప్రస్తుతం ఆ జట్టుకు ఆరుగురిని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. కెప్టెన్‌గా మళ్లీ ధోనినే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనిని రికార్డు స్థాయిలో 15వ సారి తమ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాతో పాటు తాము నిలబెట్టుకునే ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించిన సీఎస్కే ముందుగా ధోని పేరును ప్రకటించి, అతడే 2024 సీజన్‌కు కూడా మా కెప్టెన్ అని స్పష్టం చేసింది. ధోని ఐపీఎల్ మొదలైనప్పటి (2008) నుంచి (మధ్యలో 2016, 2017 సంవత్సరాలు మినహా) సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. బెన్ స్టోక్స్ (16.25 కోట్లు) అంబటి రాయుడు (6.75 కోట్లు) కైల్ జేమీసన్ (కోటి) డ్వేన్ ప్రిటోరియస్ (50 లక్షలు) సిసండ మగాల (50 లక్షలు) ఆకాశ్ సింగ్ (20 లక్షలు) భగత్ వర్మ (20 లక్షలు) సుభ్రాన్షు సేనాపతి (20 లక్షలు) సీఎస్కే రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, శివమ్ దూబే, నిషాంత్ సింధు, అజయ్ మండల్, రాజ్వర్ధన్ హంగార్గేకర్, దీపక్ చాహర్, మహీష తీక్షణ, ముకేశ్ చౌదరీ, ప్రశాంత్ సోలంకి, సిమ్రన్‌జీత్ సింగ్, తుషార్దేశ్ పాండే, మతీశ పతిరణ