సాక్షి, విశాఖపట్నం: టీమిండియా- ఇంగ్లండ్ రెండో టెస్టుకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 26) నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టికెట్ల విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 6 వరకు పీఎం పాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం, ఫిబ్రవరి 1 వరకు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లు విక్రయించనున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టికెట్లు విక్రయించేలా ఏర్పాట్లు చేశామన్నారు.
తొలి రోజు టీమిండియాదే
కాగా.. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(జనవరి 25) తొలి టెస్టు ఆరంభమైంది.
స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ను 246 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడటంతో మొదటి రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. మొత్తానికి తొలి రోజు పర్యాటక స్టోక్స్ బృందంపై రోహిత్ సేన పైచేయి సాధించింది.
ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న టికెట్ల ధరల వివరాలు..
►రోజుకు రూ.100+సీజన్‌కు రూ.400
►రోజుకు రూ.200+సీజన్‌కు రూ.800
►రోజుకు రూ.300+సీజన్‌కు రూ.1,000
►రోజుకు రూ.500+సీజన్‌కు రూ.1,500
రోజుకు 2,850 మంది క్లబ్ క్రీడాకారులకు ఉచిత ఎంట్రీ..
రాష్ట్రంలో రోజుకు 2,850 మంది క్రికెట్ క్లబ్ క్రీడాకారులన చొప్పున ఐదు రోజులకు 14,250 మందికి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.
రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ..
రోజుకు 2 వేల మంది చొప్పున ఐదు రోజులకు 10,000 మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీకి ఏర్పాట్లు చేశారు. అయితే విద్యార్థులు ఐడీ కార్డులు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తక్కువ ధరలు..
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా లోయర్ పెవిలియన్ సీజన్ టికెట్లను విశాఖపట్నంలో కేవలం రూ. 1500లకు అందుబాటులో ఉంచినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
చదవండి: INDA& U19 WC: టెస్టులో అన్న.. వరల్డ్‌కప్‌లో తమ్ముడి సెంచరీలు
Comments
Please login to add a commentAdd a comment