vishakhapatnam
-
Paris Olympics: భారత తొలి అథ్లెట్‌గా యర్రాజి జ్యోతి ఘనత
సాక్షి, విశాఖపట్నం: విశ్వక్రీడల్లో గర్జించేందుకు విశాఖ అథ్లెట్ యర్రాజి జ్యోతి సిద్ధమైంది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఒలింపిక్స్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. నగరానికి చెందిన జ్యోతి గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో నిలకడమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఆమె ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించింది. జ్యోతి ఖాతాలో రెండు కామన్వెల్త్ పతకాలు కూడా ఉన్నాయి.అదే విధంగా.. ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించిన ఘనత యర్రాజి జ్యోతి సొంతం. ఇక వరల్డ్ ర్యాంకింగ్స్ కోటాలో ప్యారిస్ బెర్త్ దక్కించుకున్న యర్రాజి జ్యోతి..100 మీటర్ల హర్డిల్స్‌లో బరిలోకి దిగనుంది. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడనున్న మొదటి భారత అథ్లెట్‌గా ఆమె రికార్డులకెక్కనుంది.కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి యర్రాజి జ్యోతితో పాటు దండి జ్యోతికశ్రీ(అథ్లెట్), రంకిరెడ్డి సాత్విక్‌సాయిరాజ్(బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్(ఆర్చరీ), షేక్ అర్షద్(పారా సైక్లింగ్ చాంపియన్), కె.నారాయణ(పారా రోవర్) ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు.ఇక ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన పీవీ సింధు అందరిలోకెల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో క్రీడా ప్రమాణాలు పెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన ప్రపంచ స్థాయి క్రీడాకారులను 2019 నుంచి 2024 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సన్మానించి ప్రోత్సాహకాలు అందించి అండగా నిలిచారు. -
IPL 2024- SRH: నితీశ్ రెడ్డి.. పక్కా లోకల్! త్వరలోనే టీమిండియాలో..
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్. హైదరాబాద్‌కు చెందిన యువ బ్యాటర్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆల్‌టైమ్ స్పిన్ దిగ్గజాల్లో ఒకడైన అశ్విన్ వేసిన బంతి ఆఫ్‌స్టంప్‌పై పడింది. బలంగా బాదితే వైడ్ లాంగాన్ దిశగా సిక్సర్! ఆ తర్వాత లెగ్‌స్పిన్నర్ చహల్ వచ్చాడు. టి20 క్రికెట్ స్టార్లలో ఒకడిగా, 350 వికెట్లు తీసిన అనుభవం అతనిది. వరుసగా ఫోర్, సిక్సర్! అంతటితో ఆగిపోలేదు. మరో రెండు బంతుల విరామం తర్వాత అదే ఓవర్లో వరుసగా మళ్లీ సిక్స్, ఫోర్.. కొద్ది సేపటికి అశ్విన్ తిరిగొచ్చాక వరుస బంతుల్లో మళ్లీ రెండు భారీ సిక్సర్లు! ఎక్కడా ఎలాంటి తడబాటు లేదు. పొరపాటున బ్యాట్ చివర తగిలి బంతి స్టాండ్స్‌లోకి వెళ్లింది కాదు. పూర్తిగా సాధికారికంగా, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఆడిన షాట్లతో అతను ఆయా బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఎంతో అనుభవం ఉన్న సీనియర్ తరహాలో అతను ఆడిన తీరు, అగ్రశ్రేణి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న శైలి.. మాజీ ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు అతని గురించి మాట్లాడుకునేలా చేసింది. భవిష్యత్తులో భారత జట్టుకు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్‌గా అతనిపై ప్రశంసల జల్లు కురిసింది. ఆ కుర్రాడే కె. నితీశ్ కుమార్ రెడ్డి. విశాఖపట్నానికి చెందిన 21 ఏళ్ల నితీశ్ తాజా ఐపీఎల్లో తన ఆటతో అందరినీ ఆకర్షించాడు. అటు బ్యాటింగ్‌లో చెలరేగుతూ, ఇటు బౌలింగ్‌లో కీలక సమయాల్లో వికెట్లు తీయడమే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా చురుకైన ప్రదర్శనతో సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆరేళ్ల క్రితమే జూనియర్ స్థాయి క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించి తన రాకను ఘనంగా చాటిన నితీశ్ ఇప్పుడు సీనియర్ ఇండియా క్రికెట్లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఐపీఎల్లో ఒక అచ్చమైన తెలుగబ్బాయి ఆటను చూసి ఎంత కాలమైంది! హైదరాబాద్ టీమ్ దక్కన్ చార్జర్స్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి సన్‌రైజర్స్ వరకూ మనవాళ్ల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అటు ఆంధ్ర నుంచి గానీ, ఇటు హైదరాబాద్ నుంచి గానీ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా చాలా సందర్భాల్లో బయటి ఆటగాళ్లతోనే లోకల్ టీమ్‌ను ఫ్రాంచైజీ నడిపిస్తూనే ఉంది. ఏ సగటు క్రికెట్ అభిమానిని అడిగినా ఇదే చెబుతాడు. టీమ్‌లోకి తీసుకున్నా తుది జట్టులో ఆడించకుండా, ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వకుండా సాగిన రోజులే ఎక్కువ. అక్కడక్కడా ఎవరైనా బరిలోకి దిగినా.. వాహ్ అనిపించే గుర్తుంచుకోదగ్గ ప్రదర్శనలూ తక్కువే. ఇలాంటి స్థితిలో నితీశ్‌ను అందరూ రెండు రాష్ట్రాల ప్రతినిధిగా, తమవాడిగా అభిమానిస్తున్నారు. అతను కూడా తన అద్భుత ఆటతో అందరి నమ్మకాన్ని నిలబెడుతూ కొత్త సంచలనంలా మారాడు. అలా మొదలై..నితీశ్లోని సహజ ప్రతిభే అతడిని బ్యాటింగ్‌లో రాటుదేలేలా చేసింది. చాలా మందిలాగే నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి కూడా అబ్బాయి అల్లరిని భరించలేక ఆరేళ్ల వయసులో వేసవి శిక్షణ శిబిరంలో చేర్పించడంతో మైదానంలో అతని ఆట మొదలైంది. ఆపై అబ్బాయి ఆసక్తి, నేర్చుకోవాలనే పట్టుదల వెరసి పూర్తి స్థాయిలో తండ్రి అతడిని క్రికెట్ శిక్షణ వైపు మళ్లించేలా చేసింది. కోచ్‌ల పర్యవేక్షణలో రాటుదేలిన నితీశ్ చిన్న వయసులోనే తనలోని అపార ప్రతిభను ప్రదర్శిస్తూ వచ్చాడు. అండర్–12 స్థాయికి వచ్చేసరికి గమ్యం స్పష్టమైపోయింది. అప్పటికే అతని బ్యాటింగ్‌లో స్ట్రోక్ మేకింగ్, పట్టుదల చూసినవారికి భవిష్యత్తులో ఉత్తమ క్రికెటర్ కావాల్సిన లక్షణాలున్నాయని అర్థమైంది. ఈ క్రమంలోనే అప్పటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్, భారత మాజీ ఆటగాడు ఎమ్మెస్కే ప్రసాద్ దృష్టి కూడా నితీశ్‌పై పడింది. ట్రయల్స్‌లో అతని ప్రతిభను చూసిన ఎమ్మెస్కే కడపలోని ఏసీఏ అండర్–14 అకాడమీలో చేరే అవకాశం కల్పించారు. అక్కడి నుంచి నితీశ్‌కు 24 గంటలూ క్రికెట్టే జీవితంగా మారిపోయింది. తన ఆటను మరింత సానబెట్టుకునే అవకాశం దక్కిన చోట కష్టపడిన అతను మరింత రాటుదేలాడు. మరో వైపు వైజాగ్ జింక్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా ఉన్న తండ్రి ముత్యాల రెడ్డికి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు ట్రాన్స్ఫర్ అయింది. తాను అక్కడికి వెళితే బిడ్డ భవిష్యత్తుకు ఇబ్బంది రావచ్చని భావించిన ఆయన ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా ఇచ్చేశారు. పూర్తి స్థాయిలో కొడుకుకు అండగా ఉండి సరైన మార్గనిర్దేశనంలో నడిపించారు. పరుగుల వరద పారించి..నితీశ్ కెరీర్లో 2017–18 దేశవాళీ సీజన్ హైలైట్‌గా నిలిచింది. 14 ఏళ్ల నితీశ్ అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్లపై చెలరేగిన 8 ఇన్నింగ్స్‌లలోనే ఏకంగా 176.71 సగటుతో రికార్డు స్థాయిలో 1237 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఇందులో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. అన్నింటికి మించి నాగాలాండ్‌తో జరిగిన పోరులో అతను సాధించిన క్వాడ్రూపల్ సెంచరీ హైలైట్‌గా నిలిచింది. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నితీశ్ 366 బంతులు ఎదుర్కొని 60 ఫోర్లు, 7 సిక్సర్లతో 441 పరుగులు సాధించడం విశేషం. ఇదే జోరును కొనసాగిస్తూ అండర్–19 టోర్నీ వినూ మన్కడ్ ట్రోఫీలో కూడా ఆకట్టుకున్న అతను బీసీసీఐ చాలెంజర్ టోర్నీలోనూ అవకాశం దక్కించుకున్నాడు. అదే జోరులో 17 ఏళ్ల వయసులో ఆంధ్ర తరఫున తొలి సీనియర్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఒంగోలులో జరిగిన కేరళతో జరిగిన మ్యాచ్‌లో రంజీ ట్రోఫీలో అతను అరంగేట్రం చేశాడు. తర్వాతి సీజన్లో విజయ్‌హజారే వన్డే టోర్నీలో అడుగు పెట్టిన నితీశ్‌కు కొన్నాళ్ల తర్వాత ముస్తాక్ అలీ టి20 టోర్నీలోనూ ఆంధ్రకు ఆడే అవకాశం దక్కింది. ప్రతికూల పరిస్థితులను దాటి..అండర్–19 స్థాయిలో ఆకట్టుకున్నా.. అక్కడి నుంచి సీనియర్ స్థాయికి చేరే క్రమంలో యువ క్రికెటర్లంతా ఒక రకమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. రెండింటి మధ్య ఉండే అంతరం కారణంగా అంచనాలను అందుకోలేక వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుంది. దాదాపు అందరు ఆటగాళ్లు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. నితీశ్‌కు కూడా ఇలాగే జరిగింది. జూనియర్ స్థాయి మెరుపుల తర్వాత కొంత కాలం పాటు అతను ఇదే స్థితిని అనుభవించాడు. రంజీ అరంగేట్రం తర్వాత ఆశించిన ప్రదర్శన లేకపోవడంతో పాటు కోవిడ్ వల్ల వచ్చిన విరామం, ఇతర వేర్వేరు కారణాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. ఈ దశలో అతను తన ఆటకు మరో రూపంలో పదును పెట్టాడు. అప్పటి వరకు వేర్వేరు వయో విభాగాల్లో ఓపెనర్‌గా భారీగా పరుగులు సాధించి అప్పుడప్పుడు మీడియం పేస్ బౌలింగ్ చేసిన నితీశ్ ఇప్పుడు తన బౌలింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టాడు. అది 2022–23 రంజీ సీజన్లో బ్రహ్మండంగా పని చేసింది. 8 మ్యాచ్‌లలో 25 వికెట్లు పడగొట్టి సత్తా చాటడంతో ఆంధ్ర టీమ్‌లో ఆల్‌రౌండర్‌గా అతనికి గుర్తింపు దక్కింది. ఇదే క్రమంలో 2023–24 సీజన్లో పూర్తి స్థాయి ప్రదర్శనతో రెగ్యులర్‌గా టీమ్‌లో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ ఏడాది కూడా అతను మళ్లీ 25 వికెట్లతో చెలరేగడంతో పాటు గతంలోలాగా బ్యాటింగ్‌లో కూడా తన పదును చూపించడం విశేషం. ఐపీఎల్లో అదరగొట్టి..‘నితీశ్‌కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటికి నాకు మరో 25 ఏళ్ల సర్వీస్ ఉంది. ఆ సమయంలో నేను అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అందరూ హతాశులయ్యారు. సహజంగానే ఆ తర్వాత ఎన్నో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మేమందరం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే వాటి ప్రభావం అబ్బాయిపై పడరాదని భావించాం. అతడి ఆటకు మాత్రం ఇబ్బంది రాకుండా అన్నీ చూసుకున్నాం. అసలు ఆటల గురించి ఏమాత్రం అవగాహన లేని నా భార్య మానస కూడా కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేసి శ్రమించింది. ఇప్పుడు అతడిని ఐపీఎల్లో చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది’ భావోద్వేగంతో ముత్యాల రెడ్డి నాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు.నితీశ్ గత ఏడాదే సన్‌రైజర్స్ టీమ్‌తో పాటు ఉన్నాడు. కానీ ఆడిన రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్ అవకాశమే రాకపోగా, బౌలింగ్‌లోనూ వికెట్లు దక్కలేదు. అప్పుడు కొంత నిరాశకు గురైనా.. ఈసారి దక్కిన అవకాశాన్ని అతను అద్భుతంగా వాడుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లో చెలరేగుతూ రైజర్స్ టీమ్‌లో కీలకంగా మారాడు.‘చిన్నప్పుడే నితీశ్‌లో ప్రతిభను గుర్తించాం. ఆపై సరైన అవకాశాలు అతడిని వెతుక్కుంటూ వచ్చాయి. ఐపీఎల్లో అతని ఆట చూస్తే సంతోషం కలుగుతోంది. ఒత్తిడిలోనూ ఎక్కడా తడబాటుకు, ఆందోళనకు గురికాని అతని ఆత్మవిశ్వాసం నాకు నచ్చుతుంది. ఇప్పుడు అతను కెరీర్ కీలక దశలో ఉన్నాడు. బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. బౌలింగ్‌లో స్టోక్స్, పాండ్యా తరహాలో మీడియం పేస్‌తోనే వేరియేషన్లు ప్రదర్శించడం, బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయడం వంటివి మెరుగుపరచుకుంటే మంచి ఆల్‌రౌండర్‌గా త్వరలోనే టీమిండియాకు ఆడగలడు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనలాగే సగటు తెలుగు క్రికెట్ అభిమానులదీ అదే కోరిక. త్వరలోనే నెరవేరుతుందని ఆశిద్దాం.-మొహమ్మద్ అబ్దుల్ హాది -
నేనేమైనా తక్కువా?.. ఒకే ఓవర్లో రింకూ సిక్సర్ల వర్షం
ఐపీఎల్-2024.. విశాఖ సాగర తీరాన.. బుధవారం రాత్రి.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం.. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ల పరుగుల వరదతో తడిసి ముద్దైంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా కేకేఆర్ ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఓపెనర్ సునిల్ నరైన్ మరోసారి వీర బాదుడు బాదాడు. 35 ఏళ్ల ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. కేవలం 39 బంతుల్లోనే 85 పరుగులు(7 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించి నరైన్ సత్తా చాటాడు. ఇక తన తొలి ఐపీఎల్ ఇన్నింగ్స్‌లోనే వన్‌డౌన్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ(27 బంతుల్లో 54) సైతం ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. Raghuvanshi Ji ke ang ang mein talent hai 🤌#DCvKKR #TATAIPL #IPLonJioCinema #TATAIPLinBhojpuri pic.twitter.com/YKUIw577kD — JioCinema (@JioCinema) April 3, 2024 ఇక నాలుగో స్థానంలో వచ్చిన పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ సరేసరి. 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 41 రన్స్ చేశాడు. మరి ఈ ముగ్గురు పరుగుల విధ్వంసం సృష్టిస్తుంటే.. తానేమీ తక్కువ కాదన్నట్లు చెలరేగిపోయాడు సిక్సర్ల కింగ్ రింకూ సింగ్. Yeh toh Rinku ke daayein haath ka khel hai 😅#IPLonJioCinema #TATAIPL #DCvKKR #TATAIPLinBengali pic.twitter.com/AIDYeZNbpk — JioCinema (@JioCinema) April 3, 2024 ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ యూపీ సంచలనం.. ఈ పరుగుల విధ్వంసంలో తనదైన ముద్ర వేశాడు. కేవలం 8 బంతులు ఎదుర్కొని 26(ఒక ఫోర్, 3 సిక్సర్లు) పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లోని మూడు సిక్సర్లను అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లోనే బాదడం విశేషం. పందొమ్మిదో ఓవర్లో సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ నోర్జే వేసిన తొలి రెండు బంతులను సిక్సర్‌గా మలిచిన రింకూ సింగ్.. మధ్యలో బాల్‌కు గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగో బంతికి మరో భారీ షాట్‌తో ఆరు పరుగులు పిండుకున్నాడు. ఇక ఆ మరుసటి బంతిని బౌండరీకి తరలించాడు. అయితే, అదే ఓవర్లో ఆఖరి బంతి(లో ఫుల్ టాస్)కి మరోసారి షాట్‌కు యత్నించిన రింకూ.. వార్నర్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఉన్నది కాసేపే అయినా.. విశాఖ స్టేడియంలోని ప్రేక్షకులకు తన వంతు వినోదం అందించాడు రింకూ!! ఢిల్లీకి నాలుగో ఓటమి ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ క్యాపిటల్స్ చతికిలపడిన విషయం తెలిసిందే. తమకు రెండో హోం గ్రౌండ్ అయిన విశాఖలో ఏకంగా 106 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్-2024లో నాలుగో పరాజయాన్ని నమోదు చేసింది. ఇక అంతకు ముందు ఇదే వేదికపై పంత్ సేన చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచిన విషయం తెలిసిందే. అలా ఢిల్లీకి ఇప్పటి వరకు ఒక్క విజయం దక్కింది. చదవండి: తొలి ఇన్నింగ్స్‌లోనే పరుగుల విధ్వంసం.. ఎవరీ అంగ్క్రిష్ రఘువంశీ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Shah Rukh Khan offered the blank check to Gautam Gambhir and results are visible. KKR wins three out of three matches of the season. You need special efforts to beat this special team. Lord Rinku Singh is on a mission.pic.twitter.com/5KsVkhD9lN — Sujeet Suman (@sujeetsuman1991) April 3, 2024 -
వాళ్లకు రిషభ్ పంత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై
కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర పరాజయంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. సమిష్టి వైఫల్యం కారణంగా భారీ మూల్యం చెల్లించామని పేర్కొన్నాడు. ఒక్కోసారి బౌలర్లకు ఏదీ కలిసిరాదని.. తమ జట్టు విషయంలో ఈరోజు(బుధవారం) ఇలా జరిగిందని పంత్ విచారం వ్యక్తం చేశాడు. ఇక కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నామని.. అయితే, ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయామని రిషభ్ పంత్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ నాలుగో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడింది. కేకేఆర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన ఢిల్లీకి కేకేఆర్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సునిల్ నరైన్(39 బంతుల్లో 85), అంగ్క్రిష్ రఘువంశీ(27 బంతుల్లో 54), ఆండ్రీ రసెల్(19 బంతుల్లో 41) పరుగుల వరద పారించారు. ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న ఢిల్లీ బౌలర్లు వీరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో రెండో భారీ స్కోరు నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జే 3 వికెట్లు తీసినా.. ఏకంగా 59 పరుగులు సమర్పించుకున్నాడు. ఇషాంత్ శర్మ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 43 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగలిగాడు. చేతులెత్తేసిన టాపార్డర్ మిగతా వాళ్లలో ఖలీల్ అహ్మద్(1/43), మిచెల్ మార్ష్(1/37) ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఢిల్లీ తడబడింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(18), పృథ్వీ షా(10) పూర్తిగా నిరాశపరిచారు. మిచెల్ మార్ష్, అభిషేక్ పోరెల్ కనీసం పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. ఈ క్రమంలో పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్(25 బంతుల్లో 55)తో చెలరేగగా.. ట్రిస్టన్ స్టబ్స్(32 బంతుల్లో 54) మెరుపులు మెరిపించాడు. No look Pant 🫨#IPLonJioCinema #TATAIPL #DCvKKR pic.twitter.com/OLhLl28aAn — JioCinema (@JioCinema) April 3, 2024 అయితే, మిగతా బ్యాటర్ల నుంచి వీరికి సహకారం అందకపోవడంతో 17.2వ ఓవర్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. 166 పరుగుల వద్ద ఆలౌట్ అయి పంత్ సేన ఏకంగా 106 పరుగుల భారీ తేడాతో పరాజయం చవిచూసింది. సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడో ఓటమి నమోదు చేసింది. An excellent diving catch by Varun Chakaravarthy 👌 Early trouble for #DC in the chase They have lost 4 wickets now Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvKKR | @KKRiders pic.twitter.com/SzzvnzRm3F — IndianPremierLeague (@IPL) April 3, 2024 ఆటగాళ్లకు పంత్ వార్నింగ్ ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ మాట్లాడుతూ.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో స్పిన్నర్లతో బౌలింగ్ చేయొద్దని భావించామని.. అయితే, పేసర్లు భారీగా పరుగులు ఇవ్వడం ప్రతికూల ప్రభావం చూపిందన్నాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి ఇది వర్తిస్తుందంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు కెప్టెన్ సాబ్. ఇక తాను ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నానన్న రిషభ్ పంత్.. ఆటను ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు. సవాళ్లు తనకేమీ కొత్త కాదని.. విజయవంతంగా వాటిని దాటుకుని ముందుకు వెళ్తానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి ఆదివారం ముంబై ఇండియన్స్‌తో వాంఖడేలో తలపడనుంది. చదవండి: IPL 2024: పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా.. ఈసారి జట్టుకు కూడా తొలి ఇన్నింగ్స్‌లోనే పరుగుల విధ్వంసం.. ఎవరీ అంగ్క్రిష్ రఘువంశీ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వచ్చీరాగానే ఇరగదీశాడు.. ఎవరీ అంగ్క్రిష్ రఘువంశీ?
IPL 2024: Who Is Angkrish Raghuvanshi?: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మరో ప్రతిభావంతుడైన క్రికెటర్ వెలుగులోకి వచ్చాడు. ఇప్పటికే ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అభిషేక్ పోరెల్ సత్తా చాటగా.. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మయాంక్ యాదవ్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. తన స్పీడ్ పవర్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు ఈ 21 ఏళ్ల రైటార్మ్ పేసర్. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని.. టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ మయాంక్. ఇక తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్- కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో మరో యువ సంచలనం తెర మీదకు వచ్చాడు. విశాఖ సాగర తీరాన పరుగుల సునామీ విశాఖ సాగర తీరాన పరుగుల సునామీ సృష్టించి తన ఆగమాన్ని ఘనంగా చాటాడు. అతడే అంగ్క్రిష్ రఘువంశీ. జూన్ 5, 2005లో.. ఢిల్లీలో జన్మించాడు ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. అండర్ 19 వరల్డ్‌కప్-2023 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. Raghuvanshi Ji ke ang ang mein talent hai 🤌#DCvKKR #TATAIPL #IPLonJioCinema #TATAIPLinBhojpuri pic.twitter.com/YKUIw577kD — JioCinema (@JioCinema) April 3, 2024 యశ్ ధుల్ సారథ్యంలో యంగ్ ఇండియాకు ఆడి ఆ ఏడాది ప్రపంచకప్ టోర్నీలో 278 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన అంగ్క్రిష్ రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చి దుమ్ములేపాడు ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్-2024 వేలంలో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా అంగ్క్రిష్ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టాడు. అయితే, ఆర్సీబీతో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడికి అవకాశం వచ్చింది. ఇక డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ చేసే దక్కించుకున్న అంగ్క్రిష్.. వన్‌డౌన్‌లో వచ్చి ఇరగదీశాడు. నరైన్ ఊచకోత.. అంగ్క్రిష్ విధ్వంసం ఓవైపు సునిల్ నరైన్(39 బంతుల్లో 85) ఢిల్లీ బౌలింగ్‌ను ఊచకోత కోస్తుంటే.. అతడికి తోడుగా మరోవైపు అంగ్క్రిష్ కూడా దుమ్ములేపే ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 54 పరుగులు రాబట్టాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అతి పిన్న వయసులో అర్ధ శతకం సాధించిన ఏడో ఆటగాడిగా నిలిచాడు. 18 ఏళ్ల 303 రోజుల వయసులో అంగ్క్రిష్ ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే యాభై కంటే ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో 23వ స్థానం సంపాదించాడు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి ఆడుతూ.. ఢిల్లీకి చెందిన అంగ్క్రిష్ రఘువంశీ పదకొండేళ్ల వయసులో ముంబైకి వచ్చాడు. చిన్ననాటి కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ సాయంతో అంచెలంచెలుగా ఎదిగి ముంబై జట్టుకు ఆడే స్థాయికి చేరాడు. 2023లో ముంబై తరఫున లిస్ట్ ఏ, టీ20లలో అరంగేట్రం చేశాడు. సీకే నాయుడు ట్రోఫీ(ఫస్ట్ క్లాస్ క్రికెట్)లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 765 పరుగులతో సత్తా చాటాడు. ఇక కేకేఆర్ తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన అంగ్క్రిష్ రఘువంశీ ఇదే జోరు కొనసాగిస్తే సహచర ఆటగాడు రింకూ మాదిరి.. త్వరలోనే టీమిండియాలోనూ అడుగుపెట్టే అవకాశం దక్కించుకోగలడు. ఆల్ ది బెస్ట్ అంగ్క్రిష్ రఘువంశీ!! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Innovative! Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨ Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd — IndianPremierLeague (@IPL) April 3, 2024 -
IPL 2024: రిషభ్ పంత్‌కు భారీ జరిమానా.. రిపీట్ అయితే!
గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో క్యాపిటల్స్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు భారీగా ఫైన్ వేశారు. కాగా విశాఖపట్నంలో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంత్ సేన 191 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(43), డేవిడ్ వార్నర్(52) మెరుపులకు తోడు పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దాదాపు పదిహేను నెలల విరామం తర్వాత తొలి అర్ధ శతకం(32 బంతుల్లో 51) నమోదు చేశాడు. That iconic one-handed six is back 🥹#DCvCSK #JioCinemaSports #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/N01gOlTLRM — JioCinema (@JioCinema) March 31, 2024 అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ 171 పరుగులకే పరిమితం చేసింది. తద్వారా 20 పరుగుల తేడాతో గెలుపొంది.. తాజా సీజన్లో తొలి విజయం అందుకుంది. Season’s 1️⃣st Win 🙌@DelhiCapitals get off the mark in #TATAIPL 2024 with a collective team effort in Visakhapatnam 🙌 Scorecard ▶️ https://t.co/8ZttBSkfE8#DCvCSK pic.twitter.com/PB9tLAD13i — IndianPremierLeague (@IPL) March 31, 2024 ఇక ఢిల్లీ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఖలీల్ అహ్మద్ అద్భుతమైన స్పెల్(2/21)తో రాణించగా.. ముకేశ్ కుమార్ మూడు వికెట్లతో చెలరేగాడు. అక్షర్ పటేల్ సైతం ఒక వికెట్ దక్కించుకున్నాడు. అయితే, స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేయడంతో ఢిల్లీ సారథి పంత్‌కు ఫైన్ పడింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన తొలి తప్పిదం కావున రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. ఇదే గనుక మరోసారి పునరావృతమైతే కెప్టెన్ రూ. 24 లక్షలు ఫైన్ వేస్తారు. అదే విధంగా.. జట్టులోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఆరు లక్షల మేర కోత విధిస్తారు. కాగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో ఫైన్ బారిన పడ్డ రెండో కెప్టెన్ రిషభ్ పంత్. ఇంతకు ముందు సీఎస్కేతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా గుజరాత్ టైటాన్స్ సారథి శుబ్‌మన్ గిల్‌కు జరిమానా విధించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024 - Vizag: మార్చి 12 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మరోసారి ఐపీఎల్ సందడి నెలకొననుంది. మార్చి 31, ఏప్రిల్ 3న నిర్వహించనున్న మ్యాచ్‌లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి విడత షెడ్యూల్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం హోం గ్రౌండ్‌గా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా అనుమతులు, పారిశుధ్యం, టిక్కెట్ల విక్రయం, పార్కింగ్ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. అదే విధంగా.. మార్చి 12 నుంచి 19 వరకు వైఎస్సార్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సభ్యులు ప్రాక్టీసు చేయనున్న నేపథ్యంలో.. ఆ మేరకు స్టేడియంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ ట్రెజరర్ ఏ.వి.చలం, సీఈవో ఎం.వి.శివారెడ్డి, సీఎఫ్ఓ ఎం.నవీన్ కుమార్, జనరల్ మేనేజర్లు ఎం.ఎస్.కుమార్, ఎస్.ఎం.ఎన్.రోహిత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి 31: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఏప్రిల్ 3: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ -
Adudam Andhra: ఈనెల 13న ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం జగన్
విశాఖ స్పోర్ట్స్: మహా క్రీడా సంబరానికి విశాఖ సర్వం సిద్ధమైంది. గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’తుది ఘట్టానికి చేరుకుంది. నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా.. జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుంది. విశాఖ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. ఇక 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. కాగా చైన్నె సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ జట్లకు శిక్షణాపరమైన సహకారం అందించిన నిపుణులు ఈ పోటీలను వీక్షించేందుకు రానుండటం విశేషం. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఎంపిక చేసి, వీరితో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. 40 బస్సులు సిద్ధం జిల్లా స్థాయిలో విజయం సాధించిన జట్లు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి. ప్రతీ జిల్లా నుంచి 134 మంది చొప్పున మెన్, వుమెన్ పోటీలకు హాజరవుతున్నారు. రైళ్లలో కొందరు, బస్సుల్లో మరికొందరు విశాఖలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకున్నారు. రైళ్లలో వచ్చిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో బస వద్దకు చేర్చారు. ఐదు రోజుల పాటు క్రీడాకారులను బస ప్రాంతం నుంచి మైదానాల వద్దకు తరలించేందుకు 40 బస్సులను సిద్ధం చేశారు. జేసీపీ పర్యవేక్షణలో భద్రత మెన్ జట్లకు దబ్బంద, వుమెన్ జట్లకు సుద్దగెడ్డ, కొమ్మాదిలోని టిడ్కో గృహాల్లో వసతి సౌకర్యం కల్పించారు. మహిళలకు ఏర్పాటు చేసిన బస వద్ద జాయింట్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో భద్రత ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం ప్రారంభ వేడుక జరగనుండగా.. మధ్యాహ్నం నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం వసతి కల్పించిన చోటే అందిస్తారు. మధ్యాహ్న భోజనం క్రీడా ప్రాంగణాల వద్ద అందజేయనున్నారు. పోటీలు జరిగే సమయంలో క్రీడాకారులకు స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వసతి ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. మొబైల్ టాయిలెట్లు సిద్ధం చేశారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు ఇవే.. జిల్లా స్థాయిలో మెన్ విభాగం క్రికెట్ పోటీల్లో నక్కవానిపాలెం, బ్యాడ్మింటన్‌లో సుసర్ల కాలనీ–1 జట్టు, వాలీబాల్‌లో ప్రశాంతినగర్, కబడ్డీలో ఓల్డ్ అయ్యన్నపాలెం, ఖోఖోలో సాకేత్‌పురం–1 జట్లు విజేతలుగా నిలిచాయి. మహిళా విభాగం క్రికెట్లో వాంబే కాలనీ–6, బ్యాట్మింటన్‌లో పెదవాల్తేర్–2, వాలీబాల్‌లో రజకవీధి–1, కబడ్డీలో లాసన్స్‌బే కాలనీ, ఖోఖోలో లంకెలపాలెం జట్లు విజేతలుగా నిలిచి.. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాయి. మైదానాలు ఇవే.. రాష్ట్ర స్థాయిలో పోటీ పడేందుకు 1,482 మందిపురుషులు,1,482 మంది మహిళలు విశాఖ తరలివచ్చారు. పోటీలకు నగరంలోని మైదానాలను సిద్ధం చేశారు. ►వుమెన్ క్రికెట్ వైఎస్సార్ బీ గ్రౌండ్ ►మెన్ క్రికెట్ రైల్వే స్టేడియం, ఏఎంసీ మైదానం ►కొమ్మాది కె.వి.కె స్టేడియం ►కబడ్డీ, ఖోఖో ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానం ►వాలీబాల్ ఏయూ సిల్వర్ జూబ్లీ మైదానం ►బ్యాడ్మింటన్ జీవీఎంసీ ఇండోర్ స్టేడియం రాష్ట స్థాయి విజేతలకు బహుమతులు ఇలా.. క్రీడ- ప్రథమ - ద్వితీయ -తృతీయ ►క్రికెట్- రూ.5లక్షలు -రూ.3లక్షలు -రూ.2లక్షలు ►వాలీబాల్- రూ.5లక్షలు -రూ.3లక్షలు -రూ.2 లక్షలు ►కబడ్డీ - రూ.5లక్షలు -రూ.3లక్షలు -రూ.2లక్షలు ►ఖోఖో - రూ.5లక్షలు -రూ.3లక్షలు -రూ.2 లక్షలు ►బ్యాడ్మింటన్- రూ.2లక్షలు -రూ.లక్ష -రూ.50వేలు -
మీ మీద అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ అసహనం
India vs England Test Series 2024: ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో ఓటమి వల్ల విమర్శల పాలైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్‌లో జట్టును గెలిపించి సత్తా చాటాడు. విశాఖపట్నం టెస్టులో బ్యాటర్‌గా విఫలమైనా సారథిగా రోహిత్‌కు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా.. ఎప్పుటికప్పుడు ఫీల్డర్లను అలర్ట్ చేస్తూ.. పరిస్థితులకు తగ్గట్లుగా ఫీల్డ్ సెట్ చేస్తూ హిట్‌మ్యాన్ వ్యవహరించిన తీరు అభిమానులను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ.. సహచర ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. 106 పరుగుల తేడాతో ఘన విజయం హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. విశాఖలో 106 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నాలుగో రోజు దాకా సాగిన ఆటలో ఆఖరికి పైచేయి సాధించి ఈ మేరకు గెలుపు బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా కొందరు ఫీల్డర్లు బద్దకంగా కదలడంతో రోహిత్ కాస్త గట్టిగానే వారిపై అరిచాడు. సోమవారం నాలుగో రోజు ఆట సందర్భంగా.. ఇంగ్లండ్ 157/4 వద్ద ఉన్న సమయంలో రోహిత్ మాట్లాడిన మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. అరిచీ.. అరిచీ నా గొంతు పోతోంది ఇందులో.. ‘‘మీ మీద అరిచీ.. అరిచీ నా గొంతు పోతోంది’’ అంటూ సహచర ఆటగాళ్లను ఉద్దేశించి రోహిత్ అన్నట్లుగా వినిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విశాఖలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విధించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లండ్ భారీ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ.. బుమ్రాను చాంపియన్ ప్లేయర్ అంటూ ప్రశంసించాడు. సమిష్టి ప్రదర్శనతో తమకు విజయం సాధ్యమైందని పేర్కొన్నాడు. చదవండి: Ind vs Eng: ఛాన్స్ ఇస్తే ఇలాగేనా ఆడేది?.. ఎందుకంత తొందర? View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) Rohit sharma :- Mera gale ka watt lag gya hai chilla chilla ke tum sab ko eee6 #INDvENG @RVCJ_Sports @RVCJ_FB @CricCrazyJohns @mufaddal_vohra pic.twitter.com/IPnZ3YUwQ3 — Ashish Gupta (@ashishbomu) February 6, 2024 Rohit Sharma 🗣️-mere gale ka vaaat lag Gaya tum logo ko chilla chilaa ke Struggle of captain 😭😂#INDvsENGTest #RohitSharma pic.twitter.com/63nIFZYBgX — Pranav 🚩 (@Pranavtweet18) February 6, 2024 -
Ind vs Eng: ఛాన్స్ ఇస్తే ఇలాగేనా ఆడేది?.. వేటు తప్పదు!
Ind vs Eng Test series 2024: ఇంగ్లండ్‌తో టెస్టుల్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆట తీరును భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ విమర్శించాడు. వరుసగా అవకాశాలు ఇచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొందరపాటు చర్యలతో అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడని జహీర్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రంజీ ట్రోఫీ-2024లో ఆడిన ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. హైదరాబాద్‌లో కేవలం 48 పరుగులకే పరిమితమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... విశాఖపట్నంలోనూ వైఫల్యాన్ని కొనసాగించాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ రెండు సందర్భాల్లోనూ ఒక్కసారి కూడా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్.. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ తీరును విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగే సత్తా ఉండి కూడా అనసరపు షాట్లకు పోయి విశాఖలో వికెట్ సమర్పించుకున్నాడంటూ పెదవి విరిచాడు. ఎందుకంత తొందర? ‘‘జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు మనం ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇవేమీ పట్టనట్టు కనిపించాడు. ఆండర్సన్ అప్పటికే తన స్పెల్ పూర్తి చేశాడు. ప్రత్యర్థి జట్టులో ఒక్క ఫాస్ట్ బౌలర్ మాత్రమే ఉన్నాడు. అతడి తర్వాత స్పిన్నర్లు అటాకింగ్‌కు వస్తారని తెలుసు. నిజానికి అయ్యర్ స్పిన్ ఆడటంలో టాప్ క్లాస్ బ్యాటర్. అయినా కూడా.. తొందరపడ్డాడు. స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించాలనే తొందరలో తనకు మేనేజ్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోలేకపోయాడు’’ అని జహీర్ ఖాన్ అయ్యర్‌కు చురకలు అంటించాడు. వేటు తప్పదు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి తిరిగి వస్తే ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టుల్లో సెలక్టర్లు శ్రేయస్‌కు ఉద్వాసన పలకడం ఖాయమని జహీర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది కాలంగా టెస్టుల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు. వరుస అవకాశాలు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇక విశాఖపట్నం మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభమే అందుకున్నా ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లీ బౌలింగ్‌లో తొందరపడి వికెట్ పారేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా- ఇంగ్లండ్ ప్రస్తుతం చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: SAT20 League 2024: సన్‌రైజర్స్ పేసర్ సంచలనం.. ఫైనల్ చేరిన డిఫెండింగ్ చాంపియన్ -
Ashwin: క్రికెట్ ఐన్‌స్టీన్.. ఏ బౌలర్ కూడా అతడి దరిదాపుల్లో లేడు!
‘మైదానంలో కొత్త తరహాలో ఇలా ఆలోచించాలంటే అశ్విన్ బుర్ర వాడాల్సిందే’... సూపర్ ఓవర్ సమయంలో భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంస. ఆ మ్యాచ్‌లో అశ్విన్ ఆడటమే లేదు. అయినా అతని ప్రస్తావన రావడం అంటే ఆ బుర్ర విలువేమిటో అర్థమవుతుంది. ‘మన్కడింగ్’తో వివాదాస్పదరీతిలో ప్రత్యర్థి బ్యాటర్‌ను అవుట్ చేసి కూడా తాను చేసింది సరైందని ఒప్పించగల సామర్థ్యం అశ్విన్‌ది.. ఇది అతని గురించిన మరో ప్రశంస. గ్రౌండ్లో క్రికెటర్ అంటే తన ఆట మాత్రమే బాగా ఆడుకొని వెళ్లిపోవడం కాదు.. ఎవరి అంచనాలకూ అందని వ్యూహాలతో అవతలి జట్టు ఆటగాళ్లను పడగొట్టడం కూడా! అది ఒక కళ. అందులో ఆరితేరినవాడు రవిచంద్రన్ అశ్విన్.. కెప్టెన్ కాకపోయినా సారథిగా బాధ్యతను భుజానికెత్తుకోగలడు.. కోచ్ కాకపోయినా కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేయగలడు.. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తున్న చదరంగపు ఆటగాడు. క్రికెట్ నిబంధనలకే పాఠాలు చెప్పగల జీనియస్.. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకొని పలు ఘనతలను తన పేరిట రాసుకున్న అశ్విన్ ప్రస్థానం ఎంతో ప్రత్యేకం. క్రికెటర్‌గా అశ్విన్ గొప్పతనం ఏమిటో అతని గణాంకాలు చెబుతాయి. వంద టెస్టులు కూడా ఆడకముందే, 500 వికెట్లకు చేరువైన తరుణం, లెక్కలేనన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ పురస్కారాలు.. ఆధునిక క్రికెట్లో ఏ బౌలర్ కూడా అతని దరిదాపుల్లో లేడు. అయితే అంతకు మించి అశ్విన్‌లోని సృజనాత్మక ఆలోచనలు అతడిని అందరికంటే భిన్నంగా నిలబెట్టాయి. సాధారణంగా వేర్వేరు కారణాలతో అంతర్జాతీయ ఆటగాళ్లు చదువుపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టలేక ఆటకే అంకితం అవుతూ ఉంటారు. కానీ మద్రాసులో ఇంజినీరింగ్ చదివిన అశ్విన్ దానిని అక్కడితో వదిలి పెట్టలేదు. ఆ టెక్నిక్స్‌ను క్రికెట్ మైదానంలో వాడాడు. అప్పటి వరకు జట్టు ఏదైనా వ్యూహం అనుసరిస్తోంటే దానికి భిన్నమైన కొత్త ఆలోచన కోసం టీమ్ అంతా తన వైపు చూసేలా చేశాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయడం మొదలు బ్యాటర్లు ఊహించని రీతిలో బౌలింగ్‌తో మానసికంగా దెబ్బ కొట్టడం వరకు అంతా అశ్విన్‌కే చెల్లింది. సమయోచిత వ్యూహాలతో.. స్పిన్ బౌలర్‌గా అశ్విన్ ఎన్నో రికార్డులు సాధించాడు. కానీ బ్యాటర్‌గా కూడా అతను విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించాడు. 2022.. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అత్యంత కీలక స్థితిలో అశ్విన్ ఆడిన తీరు దీనికి ఉదాహరణ. మరో బ్యాటర్ గనుక ఉంటే చివరి బంతిని ముందూ వెనకా ఆలోచించకుండా ఆడి అవుటైపోయేవాడేమో. కానీ బౌలర్ బంతిని వదులుతున్న తీరును బట్టే అది వైడ్ అవుతుందని అంచనా వేసి దానిని వదిలేయడమే కాదు.. తర్వాతి బంతిని కూడా సరైన అంచనాతో మిడాఫ్ మీదుగా ఆడటం అతనిలోని ‘థింకర్’ను చూపించింది. క్రికెట్ అనేది ఒక సైన్స్ అయితే అశ్విన్ ఒక ఐన్‌స్టీన్ వంటివాడు అనే మాటను అతను అక్షరాలా రుజువు చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించిన కోహ్లీ కూడా అశ్విన్‌ను ప్రశంసించేందుకు ప్రత్యేక పదాలు వెతుక్కోవాల్సి వచ్చింది. ‘అశ్విన్ తన మెదడుకు అదనంగా మరో మెదడును వాడినట్లున్నాడు’ అంటూ మ్యాచ్ తర్వాత కోహ్లీ వ్యాఖ్యానించాడు. 2021 సిడ్నీ టెస్టులో వెన్నునొప్పితో బాధపడుతూనే 38 పరుగులతో జట్టును ఆదుకున్న ఇన్నింగ్స్.. బంగ్లాదేశ్‌తో టెస్టులో భారత్ 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా వెళుతున్నప్పుడు ఆపద్బాంధవుడిగా నిలిచి.. గెలిపించిన తీరు ఎలాంటి లెక్కల ప్రకారం అశ్విన్ ఆడతాడనేది చూపిస్తుంది. అపార ప్రతిభతో ఆకట్టుకొని.. కోచ్ చంద్రశేఖర్ చిన్నతనంలోనే అశ్విన్‌లోని ప్రతిభను గుర్తించాడు. అందుకే 12 ఏళ్ల వయసులోనే మైదానంలో అతనికి ఫీల్డింగ్‌ను ఎంచుకునే అవకాశం కల్పించాడు. ఆరంభంలో పేస్ బౌలింగ్‌తో మొదలుపెట్టిన అతను ఆ తర్వాత ఆఫ్స్పిన్కు మారాడు. అయితే ఇది అంత సులువుకాలేదు. చాలా కష్టపడ్డాడు. ఒక వైపు ఆటకు పదును పెడుతూనే మరో వైపు చదువులో కూడా ఎక్కడా తగ్గకుండా సాగాడు. ఎస్సెసెన్ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే రంజీ ట్రోఫీకి ఎంపికైన అశ్విన్ ఆ తర్వాత కొన్నాళ్లకే అటు ఇంజినీరింగ్ పూర్తి చేసుకోవడంతో పాటు ఇటు భారత జట్టులోకి కూడా ఎంపికయ్యాడు. ఆ తర్వాత మరో కోచ్ సుబ్రహ్మణ్యం వద్ద చేరడంతో అతని ఆటే మారిపోయింది. ఆటతో పాటు దృక్పథమూ మారింది. ‘నేను మొదటిసారి అతన్ని కలిసినప్పుడు అంతా ప్రశ్నలు, ప్రశ్నలే. అందులోనే అతడి ఉత్సాహాన్ని, తెలివితేటలను నేను గమనించాడు. అశ్విన్ కచ్చితంగా గొప్పవాడు అవుతాడని భావించి శిక్షణనిచ్చి ప్రోత్సహించాను’ అని కోచ్ గుర్తు చేసుకున్నాడు. అయితే అద్భుతమైన క్రికెటింగ్ బ్రెయిన్ అంటూ పొగడ్తలు అందుకున్నా.. భారత జట్టు కెప్టెన్ పదవి కోసం బీసీసీఐ అతన్నెప్పుడూ పరిశీలనలోకి తీసుకోలేదు. దిగ్గజాల సరసన.. ప్రపంచవ్యాప్తంగా 3 వేలకు పైగా పరుగులు చేసి 400కు పైగా వికెట్లు తీసిన అరుదైన జాబితాలో ఆరుగురు క్రికెటర్లు ఉన్నారు. వారిలో అశ్విన్ ఒకరు. భారత ఆల్రౌండర్లలో.. దిగ్గజం కపిల్‌దేవ్ తర్వాతి స్థానం అతనిదే. ముందుగా ఐపీఎల్‌తో అశ్విన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతనికి భారత జట్టులో స్థానం దక్కింది. వన్డేల్లో వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన భారత జట్లలో అతను భాగంగా ఉన్నాడు. అనిల్ కుంబ్లే రిటైర్ అయిపోవడంతో పాటు హర్భజన్ తన కెరీర్ చివరి దశలో వరుసగా విఫలమవుతున్న సమయంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు. భారత్‌కు సంబంధించి కూడా అది ఒక కీలక దశ. నాణ్యమైన అగ్రశ్రేణి స్పిన్నర్ కోసం టీమ్ ఎదురు చూస్తుండగా అశ్విన్ రూపంలో ఒక ఆణిముత్యం లభించింది. తన తొలి టెస్టులోనే 9 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన అశ్విన్ ఈ ఘనారంభాన్ని ఆ తర్వాతా కొనసాగించాడు. తన తొలి 16 టెస్టుల్లోనే 9 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడంటే అశ్విన్ జోరు ఏమిటో తెలుస్తుంది. ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఏడాదికి కనీసం 50 వికెట్ల ఘనతను అతను నాలుగుసార్లు నమోదు చేయడం విశేషం. 2016–17లోనైతే అశ్విన్ బౌలింగ్ శిఖరానికి చేరింది. ఐదు సెంచరీలు చేశాడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై కలిపి 13 టెస్టుల్లోనే అతను ఏకంగా 82 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో సాధించిన ఐదు సెంచరీలు కూడా అశ్విన్ బలాన్ని చూపిస్తున్నాయి. ఒకే టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టడంతో పాటు అర్ధసెంచరీ కూడా చేసిన ఫీట్‌ను మూడుసార్లు నమోదు చేసిన ఏకైక ఆటగాడు అతనే కావడం విశేషం. ఐసీసీ మెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌తో పాటు ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులన్నీ అతని ఖాతాలో ఉన్నాయి. వ్యక్తిగతంగా చూస్తే తమిళ సినిమాలను ఇష్టపడే అతను రజినీకాంత్‌కు వీరాభిమాని. 2011లో ప్రీతిని వివాహమాడిన అశ్విన్‌కు ఇద్దరు అమ్మాయిలు. కుట్టి స్టోరీస్ పేరుతో క్రికెట్‌ను అద్భుతంగా విశ్లేషిస్తూ యూట్యూబ్‌లో అతను చేసే వీడియోలు సూపర్‌హిట్ అయ్యాయి. కెరీర్ చివర్లో ఉన్న అశ్విన్ ఎప్పుడు రిటైరైనా అద్భుతమైన కామెంటేటర్ కాగలడు. అయితే ఆటగాడిగా అతని శైలి మాత్రం ప్రత్యేకంగా ఉండిపోతుంది. అశ్విన్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
జైస్వాల్‌ను హీరో చేయకండి: గంభీర్ ఘాటు విమర్శలు
India vs England, 2nd Test: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వైజాగ్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ డబుల్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. తద్వారా టెస్టుల్లో టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన మూడో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు జైస్వాల్. 22 ఏళ్ల 37 రోజుల వయసులో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు యశస్వి జైస్వాల్ ప్రతిభను కొనియాడుతున్నారు. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అయితే సర్ బ్రాడ్‌మన్ కంటే ఎక్కువంటూ ఆకాశానికెత్తాడు. ఇక అభిమానులేమో.. యశస్వి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. #WATCH | Uttar Pradesh | People burst crackers and distributed sweets in Bhadohi - the hometown of cricketer Yashasvi Jaiswal as he hit a double-century today in the second test match against England. pic.twitter.com/kwB68wxQcc — ANI (@ANI) February 3, 2024 అదే విధంగా సోషల్ మీడియా వేదికగా అతడి పేరును ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓవర్‌హైప్ క్రియేట్ చేసి అతడిపై ఒత్తిడి పెంచవద్దని అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి చేశాడు. మనకు ఓ అలవాటు ఉంది ఈ మేరకు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘చిన్న వయసులోనే అరుదైన రికార్డులు సాధిస్తున్న యశస్వికి శుభాకాంక్షలు. అతడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తనను స్వేచ్ఛగా ఆడనివ్వండి. భారత్‌లో అందరికీ ఓ పాత అలవాటు ఉంది. హీరోలను చేసి ఒత్తిడి పెంచుతారు ముఖ్యంగా మీడియా.. ఆటగాళ్ల విజయాలను అతి చేసి చూపించి.. వారికి ఏదో ఒక ట్యాగ్ అంటగట్టి... హీరోలను చేస్తుంది. ఇలాంటి ప్రచారం వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగిపోతుంది. కాలక్రమంలో వాళ్లు సహజమైన, తమదైన ఆటను మర్చిపోతారు. అంచనాలు తట్టుకోలేక ఒత్తిడిలో కూరుకుపోతారు’’ అని గౌతం గంభీర్ ఈ సందర్భంగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా వైజాగ్‌లో టెస్టులో జైస్వాల్ డబుల్ సెంచరీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన కారణంగా రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఆధిపత్యం సంపాదించింది. ఇంగ్లండ్ కంటే 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: Ind vs Eng: అఫీషియల్.. అందుకే కోహ్లి టెస్టులకు దూరం -
నిన్న యశస్వి.. నేడు బుమ్రా.. ఆధిక్యంలో టీమిండియా
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం చాటుకుంది. వైజాగ్‌లో శనివారం నాటి ఆట ముగిసే సరికి 171 పరుగుల ఆధిక్యం సంపాదించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో రోజు డబుల్ సెంచరీగా మలిచి ఈ క్రమంలో తొలి రోజు భారీ సెంచరీ చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్.. రెండో రోజు దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. ఇక 209 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యశస్వి అవుట్ కాగా.. టీమిండియా 396 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. శనివారం 336/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండు రోజు ఆటను ఆరంభించిన భారత్.. అదనంగా 60 పరుగులు జత చేయగలిగింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగగా ఓపెనర్ బెన్ డకెట్(21) కుల్దీప్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ జాక్ క్రాలే(76) పట్టుదలగా నిలబడ్డాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ అద్భుత అర్ధ శతకంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వికెట్ల వేట మొదలుపెట్టి.. ఘనంగా ముగించి అయితే, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బంతిని తప్పుగా అంచనా వేసి షాట్ ఆడాలని క్రాలే భావించగా.. శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్‌తో అతడికి సెండాఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన వికెట్ల వేట మొదలుపెట్టాడు. హైదరాబాద్ టెస్టు హీరో ఒలీ పోప్(23), జో రూట్(5), బెయిర్ స్టో(25), కెప్టెన్ బెన్‌స్టోక్స్(47) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేసిన బుమ్రా.. అంతర్జాతీయ టెస్టుల్లో 150 వికెట్ల క్లబ్లో చేరాడు. ఇక టామ్ హార్లీ వికెట్‌తో ఈ మ్యాచ్‌లో ఫైఫర్ సాధించిన ఈ రైటార్మ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్(6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఆఖరి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రాకు ఆరు, కుల్దీప్ యాదవ్‌కు మూడు, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కాయి. 171 పరుగుల ఆధిక్యంలో భారత్ ఈ నేపథ్యంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓవరాల్‌గా 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 13, యశస్వి జైస్వాల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో గెలిచి 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ Memorable Performance ✅ Special Celebration 🙌 Well bowled, Jasprit Bumrah! 🔥 🔥 Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/bRYTf68zMN — BCCI (@BCCI) February 3, 2024 -
#Bumrah: బుమ్రా సరికొత్త చరిత్ర.. భారత తొలి బౌలర్‌గా!
India vs England, 2nd Test- #Bumrah: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వైజాగ్ మ్యాచ్‌లో శనివారం నాటి ఆటలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ ఫాస్ట్‌బౌలర్.. అంతర్జాతీయ టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు.. అతి తక్కువ బంతుల్లోనే ఈ ఘనత సాధించిన భారత తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(47)ను అవుట్ చేసి బుమ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు. 𝘚𝘵𝘰𝘬𝘦𝘴' 𝘳𝘦𝘢𝘤𝘵𝘪𝘰𝘯 𝘴𝘢𝘺𝘴 𝘪𝘵 𝘢𝘭𝘭 😱 1⃣5⃣0⃣ Test wickets for the Wrecker-in-chief! 🤌#Bumrah #INDvENG #BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports pic.twitter.com/cWG7HfKqir — JioCinema (@JioCinema) February 3, 2024 ఇక ఈ మ్యాచ్‌లో తన అద్భుత నైపుణ్యాలతో ఆకట్టుకున్న పేస్ గుర్రం బుమ్రా.. మొత్తంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రెండో రోజు ఆటలో భాగంగా జో రూట్‌తో వికెట్ల వేట మొదలుపెట్టిన బుమ్రా.. తర్వాత ఒలీ పోప్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, టామ్ హార్లీలను కూడా అవుట్ చేసి.. జేమ్స్ ఆండర్సన్‌తో ముగించాడు. ఇతర బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా.. ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 15, రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక అంతకుముందు టీమిండియా 396 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించిన విషయం తెలిసిందే. Memorable Performance ✅ Special Celebration 🙌 Well bowled, Jasprit Bumrah! 🔥 🔥 Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/bRYTf68zMN — BCCI (@BCCI) February 3, 2024 అంతర్జాతీయ టెస్టుల్లో... తక్కువ బంతుల్లోనే 150 వికెట్ల క్లబ్లో చేరిన భారత బౌలర్లు 6781 బాల్స్- జస్ప్రీత్ బుమ్రా 7661 బాల్స్- ఉమేశ్ యాదవ్ 7755 బాల్స్- మహ్మద్ షమీ 8378 బాల్స్- కపిల్ దేవ్ 8380 బాల్స్- రవిచంద్రన్ అశ్విన్ చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ -
తుదిజట్టులో నో ఛాన్స్!.. సర్ఫరాజ్ ఖాన్ వ్యాఖ్యలు వైరల్
India vs England, 2nd Test- Sarfraz Khan: ‘‘టెస్టు క్రికెట్ ఆడాలంటే ఎంతో ఓపికగా ఉండాలి. జీవితంలో కొన్నిసార్లు మనం తొందరపాటులో పనులు చేసేస్తూ ఉంటాం. నేను కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టీమిండియాలో అడుగుపెట్టాలని ఎదురుచూసేవాడిని. ఒక్కోసారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యేవాడిని. అలాంటపుడు మా నాన్న నన్ను ఓదార్చేవారు. హార్డ్‌వర్క్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడో ఓసారి ఫలితం అదే వస్తుంది. అప్పుడు నిన్నెవరూ ఆపలేరని చెబుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం, ఓపిక కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని నేను తెలుసుకున్నా. ఇప్పుడు మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. కోట్లాది మంది జనాభా ఉన్న ఈ దేశంలో టీమిండియాలో భాగమయ్యే అవకాశం రావడం పట్ల నాకు గర్వంగా ఉంది’’.. ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో టెస్టు ఆరంభానికి ముందు యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్న మాటలివి. అలా తొలిసారి టీమిండియాకు ఎంపిక దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతూ.. భారత్-ఏ తరఫున కూడా అదరగొడుతున్న ఈ ముంబై బ్యాటర్‌కు వైజాగ్ టెస్టు సందర్భంగా బీసీసీఐ సెలక్టర్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్‌లతో పాటు సర్ఫరాజ్‌కు కూడా ప్రధాన జట్టులో చోటిచ్చింది. అయితే, అంతకంటే ముందే మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో చోటు కోసం పాటిదార్‌తో పోటీపడ్డ సర్ఫరాజ్‌కు నిరాశే మిగిలింది. తుదిజట్టులో పాటిదార్‌కు స్థానం ఇచ్చారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా.. బీసీసీఐకి అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ తెరమీదకు వచ్చింది. ఓపికగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమంటూ 26 ఏళ్ల సర్ఫరాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) సిరాజ్ స్థానంలో అతడు కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను పరాజయంతో ప్రారంభించింది టీమిండియా. హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. రజత్ పాటిదార్ టెస్టు క్యాప్ అందుకోగా.. మహ్మద్ సిరాజ్ స్థానంలో ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. చదవండి: SA20 2024: టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 462 పరుగులు -
Ind vs Eng: ‘ఇంత అన్యాయమా.. ఇంకెలా ఆడితే ఛాన్స్ ఇస్తారు?’
India vs England, 2nd Test- No Place For Sarfaraz Khan: టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణ కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయమని అభిమానులతో పాటు భారత మాజీ క్రికెటర్లు కూడా భావించారు. కానీ మేనేజ్మెంట్ మాత్రం అతడికి మరోసారి మొండిచేయి చూపింది. తుదిజట్టులో చోటు కోసం మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో పాటిదార్ వైపే మొగ్గుచూపింది. ఇప్పటికే టీమిండియా తరఫున వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన పాటిదార్‌కే టెస్టు క్యాప్ కూడా అందించింది. దీంతో సర్ఫరాజ్‌కు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘పాపం.. సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి అన్యాయం జరిగింది. ఇన్నాళ్లు జట్టుకు ఎంపికే చేయలేదు. ఈసారి ఛాన్స్ ఇచ్చారనుకుంటే తుదిజట్టులో ఆడించడం లేదు. అసలు అతడిని ఎందుకు పక్కనపెట్టారో కాస్త వివరించగలరా? మీ నిర్ణయాలు మాకైతే అంతుపట్టడం లేదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్-ఏ జట్టుపై భారత్- ఏ తరఫున సెంచరీ బాది ఫామ్‌లో ఉన్నా కూడా సర్ఫరాజ్ ఖాన్ ఆట తీరుపై మీకు నమ్మకం కుదరలేదా? ఇంకెన్నాళ్లు అతడు ఎదురుచూడాలి?’’ అంటూ సెలక్టర్లపై ఫైర్ అవుతున్నారు. No Sarfaraz..?? What..??? Please explain. Unbelievable...#INDvsENGTest #INDvsENG #INDvENG #IndianCricket #SarfarazKhan — Raghav Srinivasan (@RaghavSrinivas7) February 2, 2024 I hope India’s more main players get injured so that Sarfaraz ko chance mile https://t.co/vXVrS2n6ND — Akshayyyy (@AkshayyMahadik) February 2, 2024 కాగా తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు.. మొదటి టెస్టు తర్వాత రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో వారి స్థానాల్లో సౌరభ్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్‌లకు రెండో టెస్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఇక కేఎస్ భరత్‌కు సొంతమైదానంలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో.. ఇలాంటి అవకాశం రావడం తనకు గర్వకారణమంటూ భరత్ సంతోషం వ్యక్తం చేశాడు. 🗣️🗣️ It's a proud moment to be playing in front of your home crowd. Proud and focused @KonaBharat is geared up for the 2nd #INDvENG Test in Visakhapatnam 🙌#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/2eUkG5vDSN — BCCI (@BCCI) February 1, 2024 తుది జట్లు: టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్. చదవండి: IND VS ENG 2nd Test: సర్ఫరాజ్ ఎంట్రీ గ్యారెంటీ..? ఎందుకంత స్పెషల్ -
Sarfaraz Khan: చిన్న జట్ల మీద ఆడితే సరిపోతుందా?
Ex India Star's Blunt Take After Sarfaraz Khan's Test Selection: భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటర్ దీప్‌దాస్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు అతడిని ఎంపిక చేసిన విధానం సబబుకాదేమోనని అభిప్రాయపడ్డాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడి బ్యాటింగ్ గణాంకాలు మెరుగ్గానే కనిపిస్తున్నా.. కేవలం వాటి ప్రాతిపదికన సర్ఫరాజ్ గొప్ప ఆటగాడని చెప్పలేమన్నాడు. చిన్న జట్లను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదన్న దీప్‌దాస్ గుప్తా.. అలాంటి జట్లపై సాధించిన పరుగులను ఎంత వరకు లెక్కలోకి తీసుకవచ్చో ఆలోచించాలన్నాడు. తానేమీ సర్ఫరాజ్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్న ఈ బెంగాలీ క్రికెటర్.. ఓ బ్యాటర్ ఎన్ని పరుగులు తీశాడన్న దానికన్నా.. పటిష్ట ప్రత్యర్థిపై ఎలా ఆడాడన్న విషయాన్నే పరిగణనలోకి తీసుకోవాలన్నాడు. రెండో టెస్టుకు సర్ఫరాజ్‌ను ఎంపిక చేసినంత మాత్రాన అతడి ఆడిస్తారనే నమ్మకం లేదని దీప్‌దాస్ గుప్తా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తుదిజట్టులో పదకొండు మంది ఆటగాళ్లకే చోటు ఉంటుందని.. అలాంటపుడు కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటే మేనేజ్మెంట్ ఆచితూచి వ్యవహరిస్తుందన్నాడు. ఉదాహరణకు.. శుబ్‌మన్ గిల్ లేదంటే సర్ఫరాజ్.. ఇద్దరిలో ఒకరినే ఎంచుకోవాలంటే కచ్చితంగా కెప్టెన్ రోహిత్ శర్మ.. గిల్‌వైపే మొగ్గు చూపుతాడని దీప్‌దాస్ అభిప్రాయపడ్డాడు. ఆ జట్లను తక్కువ చేయాలని కాదు.. కానీ ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఫస్ట్‌క్లాస్ క్రికెట్ గురించి మాట్లాడతారు. అక్కడ 37 జట్లు ఉంటాయి. అందులో కొంతమంది యావరేజ్ జట్ల మీద పరుగుల వరద పారిస్తారు. అలా అని నేను చిన్నజట్లను అగౌరవపరచడం లేదు. అయితే, ఓ బ్యాటర్ ఎంపిక గురించి మాట్లాడేటపుడు క్వాలిటీ ఆఫ్ రన్స్ గురించి కూడా మాట్లాడాలి. నేను ఇదంతా సర్ఫరాజ్‌కు వ్యతిరేకంగా చెప్పడం లేదు. కానీ సెలక్షన్ సమయంలో మేనేజ్మెంట్ ఇవన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్లకు ఎవరిపై ఎక్కువ నమ్మకం ఉంటే వాళ్లకే అవకాశం ఇస్తుంది’’ అని దీప్‌దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా తరఫున దీప్‌దాస్ 8 టెస్టులాడి కేవలం 100 పరుగులు చేశాడు. ఆ ముగ్గురికి ఛాన్స్ ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరం కాగా.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు తొలిసారి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారత్, సహా పాకిస్తాన్ క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. దీప్‌దాస్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 2న మొదలుకానున్న రెండో టెస్టుకు సర్ఫరాజ్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ కూడా ఎంపికయ్యారు. చదవండి: సర్ఫరాజ్ ఎంట్రీ గ్యారెంటీ..? అతడు ఎందుకు స్పెషల్? -
Ind vs Eng: రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
Ind vs Eng 2nd Test Vizag: టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. శుక్రవారం మొదలుకానున్న ఈ మ్యాచ్‌లో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ అరంగేట్రం చేయనున్నట్లు వెల్లడించింది. జాక్ లీచ్ స్థానంలో అతడిని ఎంపిక చేసినట్లు తెలిపింది. అదే విధంగా మార్క్‌వుడ్‌ని తప్పించి.. అతడి స్థానంలో దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను జట్టులోకి తీసుకువచ్చింది మేనేజ్మెంట్. ఈ మ్యాచ్‌లో తాము ఈ మేరకు రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. కాగా తొలి టెస్టులో మార్క్‌వుడ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు.. హైదరాబాద్ టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జాక్ లీచ్ మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జరిగిన ట్రెయినింగ్ సెషన్లో అతడు పాల్గొనలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడికి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు బషీర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. విశాఖలో గెలిచేందుకు కాగా విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరుగనుంది. ఫిబ్రవరి 2న ఆరంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు.. మంగళవారమే నగరానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ టీమిండియా మీద 28 పరుగుల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో విశాఖలో విజయం సాధించి 1-1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటికే జట్టుకు దూరం కాగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాల వల్ల విశాఖ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులో చేర్చింది బీసీసీఐ. టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్. చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్! సిరాజ్‌కు నో ప్లేస్? -
సర్ఫరాజ్‌ను ఆడిస్తారా? లేదంటే.. టీమిండియా కోచ్ స్పందన
India vs England, 2nd Test- Sarfaraz vs Patidar: ‘‘ఎట్టకేలకు టీమిండియా సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది.. దేశవాళీ క్రికెట్లో, భారత్-ఏ తరఫున సత్తా చాటుతున్న ఈ ముంబై బ్యాటర్‌ను ఇన్నాళ్లకు బీసీసీఐ కరుణించింది.. ఇక భారత్ తరఫున అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడమే తరువాయి. ఇంతకీ రెండో టెస్టు తుదిజట్టులో అతడికి చోటు దక్కుతుందా?’’.. యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించి క్రీడా వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఎట్టకేలకు పిలుపు రంజీల్లో పరుగుల వరద పారించినా.. నోటి దురుసు కారణంగా సెలక్షన్ కమిటీ అతడి పేరును పరిశీలనలోకి తీసుకోలేదనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఎట్టకేలకు అతడి ప్రతిభ వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ఛాన్స్ అయితే ఇచ్చారు. అంతకంటే ముందుగానే పాటిదార్ అయితే, అంతకంటే ముందే విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్‌కు జట్టులో చోటిచ్చారు. హైదరాబాద్ టెస్టు తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాల కారణంగా దూరం కాగా.. సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు సర్ఫరాజ్‌కు తలుపులు తెరిచారు. కానీ విశాఖపట్నం టెస్టులో తుది జట్టులో అతడికి చోటిస్తారా లేదంటే పాటిదార్‌ను ఆడిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఈ అంశం గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారు? ‘‘వాళ్లిద్దరూ సూపర్ ప్లేయర్లు. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కష్టంతో కూడుకున్న నిర్ణయం. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఎప్పుటికపుడు వారి ప్రదర్శనలు మేము గమనిస్తూనే ఉన్నాం. ఇక స్వదేశీ పిచ్‌ల మీద జట్టు ఆడేపుడు వాళ్లిద్దరి చేరిక మాకు అదనపు ప్రయోజనంగా మారుతుందనడంలో సందేహం లేదు. వాళ్ల నిర్ణయాన్ని బట్టే ముందు చెప్పినట్లుగానే ఇద్దరిలో ఒకరినే తీసుకోవాల్సి రావడం వల్ల కఠిన నిర్ణయం తీసుకోకతప్పదు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ నిర్ణయాలకు అనుగుణంగానే తుదిజట్టు ప్రకటన ఉంటుంది’’ అని విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశాడు. తొలి టెస్టులో ఓటమితో తామేమీ కుంగిపోలేదని.. రెండో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు కచ్చితంగా తిరిగి పుంజుకుంటారని ఈ సందర్భంగా రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఫిబ్రవరి 2 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నంలో రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు(అప్డేటెడ్): రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్. చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే సర్ఫరాజ్! తాడోపేడో తేల్చుకో.. -
Ind vs Eng 2nd Test: విశాఖపట్నం చేరుకున్న టీమిండియా
సాక్షి, విశాఖపట్నం: రెండో టెస్టు కోసం టీమిండియా- ఇంగ్లండ్ జట్లు మంగళవారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఈ క్రమంలో క్రికెటర్లను నేరుగా చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తమ అభిమాన ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. దూరం నుంచే వారిని పలకరిస్తూ మురిసిపోయారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రోహిత్ సేన- స్టోక్స్ బృందం మధ్య తొలి టెస్టుకు హైదరాబాద్ వేదికైంది. హైదరాబాద్‌లో ఓటమిపాలై ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఇంగ్లండ్ 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. విశాఖలోని డాక్టర్ వైస్ రాజశేఖర్‌రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. విశాఖలో విజయమే లక్ష్యంగా ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించనుంది. అదే విధంగా.. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఏసీఏ ఉచిత ప్రవేశం కల్పించనుంది. అంతేగాకుండా.. రాష్ట్రంలో ఉన్న క్లబ్ క్రీడాకారులు కూడా.. రోజుకు 2,850 మంది చొప్పున.. 5 రోజులకు 14,250 మంది ఫ్రీగా మ్యాచ్ చూసే అవకాశం ఇవ్వనుంది. ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ అమ్మమ్మగారి ఊరైన వైజాగ్‌లో గెలుపే లక్ష్యంగా టీమిండియా సన్నద్ధమవుతోంది. సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కావడం ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి: Ind vs Eng: రోహిత్ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్ అవసరమా? -
Ind vs Eng: అతడు జడేజా కాదు కదా.. టీమిండియాకు కష్టమే
India vs England 2nd Test: ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ జడ్డూ అని.. అతడు లేని లోటును ప్రస్తుత జట్టులోని ఏ ఆటగాడూ తీర్చలేడని పేర్కొన్నాడు. కాగా స్టోక్స్ బృందంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో రోహిత్ సేన 28 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత మ్యాచ్ టీమిండియా చేతిలో ఉందనిపించినప్పటికీ.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఇంగ్లండ్ గెలిచి సత్తా చాటింది. మొదటి టెస్టులో అదరగొట్టాడు అయితే, ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్లలో స్పిన్ ఆల్‌రౌండర్ జడేజా పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఉప్పల్ టెస్టులో మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 89 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో జడ్డూ వైజాగ్‌లో జరుగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్ కూడా గాయం బారిన పడటంతో వీరి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్‌లకు పిలుపునిచ్చారు బీసీసీఐ సెలక్టర్లు. టీమిండియాకు కష్టమే ఈ విషయంపై స్పందించిన మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. ‘‘జడ్డూ ఉంటేనే టీమిండియాకు బలం. బ్యాటర్‌గా.. బౌలర్‌గా.. గన్ ఫీల్డర్‌గా అతడి సేవలను జట్టు కచ్చితంగా మిస్సవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో అతడే నంబర్ వన్ టెస్టు ఆల్‌రౌండర్ అనడంలో సందేహం లేదు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యంలో నిలిచిందంటే అందుకు కారణం జడేజానే. అతడు ఉన్నా.. మరో జడ్డూ కాలేడు కదా జట్టులో ఉంటే అతడు కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీయడం కూడా గ్యారెంటీ. జడ్డూ స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగల బ్యాటర్‌ను తీసుకోవాలని మేనేజ్మెంట్ భావించడం సహజం. కాబట్టి వాషింగ్టన్ సుందర్‌కే ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అతడు పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేయగలడేమో గానీ వికెట్లు మాత్రం తీయలేడు. బ్యాటింగ్ పరంగా అతడు మెరుగైన ఆటగాడే. అయితే, వాషీ జడ్డూ మాత్రం కాలేడు కదా’’ అని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులో ఆడించినా జడ్డూ లేని లోటును మాత్రం పూడ్చలేడని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా - ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Rishabh Pant: చచ్చిపోయానేమో అనుకున్నా.. -
Ind vs Eng: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ
సాక్షి, విశాఖపట్నం: టీమిండియా – ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు నగరంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఫిబ్రవరి 2- 6 వరకు నిర్వహించనున్న ఈ మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. ఇరు జట్ల ఆటగాళ్లు జనవరి 30న విశాఖపట్నానికి చేరుకుంటారని తెలిపారు. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 3.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారని గోపినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆటగాళ్ల వెంట మ్యాచ్ అధికారులు, ఇతర సిబ్బంది రానున్నట్లు వెల్లడించారు. పనులన్నీ పూర్తి చేయాలి ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణలో భాగంగా స్థానిక స్టేడియంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఏసీఏ ట్రెజరర్ ఎ.వి.చలంతో కలిసి గోపినాథ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. స్టేడియం లోపల, బయట చేపడుతున్న పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ అదే విధంగా... వాహనాల పార్కింగ్ వద్ద తగిన సిబ్బందిని నియమించి ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గోపీనాథ్‌రెడ్డి ఆదేశించారు. రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్న దృష్ట్యా వారి ఐడీ కార్డులను పరిశీలించి స్టేడియంలోకి పంపాలన్నారు. ఇక విద్యార్థులతో పాటు.. రోజుకు 2,850 మంది చొప్పున.. 5 రోజులకు 14,250 మంది రాష్ట్రంలో ఉన్న క్లబ్ క్రీడా కారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఉప్పల్ మ్యాచ్‌లో రోహిత్ సేన స్టోక్స్ బృందం చేతిలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టులో 0-1తో వెనుకబడింది. చదవండి: శతక్కొట్టిన బెంగాల్ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు -
భారత సిబ్బందితో ఉన్న నౌకపై దాడి.. రంగంలోకి ఐఎన్ఎస్ విశాఖ
ఎర్రసముద్రంలో నౌకలపై యెమెన్ దేశానికి చెందిన తిరుబాటుదారులు హౌతీ రెబల్స్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో సముద్రంలో ప్రయాణిస్తున్న బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌పై హౌతీ రెబల్స్ మిస్సైల్ దాడికి తెగపడ్డారు. దాడికి గురైన బ్రిటిష్ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ ఉద్యోగి ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ సహాయక చర్యలకోసం ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బందిని పంపించినట్లు శనివారం వెల్లడించింది. దాడి జరిగిన వెంటనే ఎంవీ మార్లిన్ లువాండా అనే బ్రిటిష్ నౌక నుంచి ఓ అత్యవసర సందేశం ఇండియాన్ నేవీ వచ్చింది. #IndianNavy's Guided missile destroyer, #INSVisakhapatnam, deployed in the #GulfofAden responded to a distress call from MV #MarlinLuanda on the night of #26Jan 24. The fire fighting efforts onboard the distressed Merchant Vessel is being augmented by the NBCD team along with… pic.twitter.com/meocASF2Lo — SpokespersonNavy (@indiannavy) January 27, 2024 ‘ఎంవీ మార్లిన్ లువాండా నుంచి వచ్చిన అత్యవసర సందేశంతో అప్రమత్తమైన సమీపంలోని ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది రంగంలో దిగారు. నౌకల భద్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నాం’ ఇండియాన్ నేవి ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా పేర్కొంది. -
Ind vs Eng- Vizag: రేపటి నుంచి ఆఫ్‌లైన్ టికెట్లు.. ధరలు ఇలా
సాక్షి, విశాఖపట్నం: టీమిండియా- ఇంగ్లండ్ రెండో టెస్టుకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 26) నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టికెట్ల విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 6 వరకు పీఎం పాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం, ఫిబ్రవరి 1 వరకు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లు విక్రయించనున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టికెట్లు విక్రయించేలా ఏర్పాట్లు చేశామన్నారు. తొలి రోజు టీమిండియాదే కాగా.. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(జనవరి 25) తొలి టెస్టు ఆరంభమైంది. స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ను 246 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడటంతో మొదటి రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. మొత్తానికి తొలి రోజు పర్యాటక స్టోక్స్ బృందంపై రోహిత్ సేన పైచేయి సాధించింది. ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న టికెట్ల ధరల వివరాలు.. ►రోజుకు రూ.100+సీజన్‌కు రూ.400 ►రోజుకు రూ.200+సీజన్‌కు రూ.800 ►రోజుకు రూ.300+సీజన్‌కు రూ.1,000 ►రోజుకు రూ.500+సీజన్‌కు రూ.1,500 రోజుకు 2,850 మంది క్లబ్ క్రీడాకారులకు ఉచిత ఎంట్రీ.. రాష్ట్రంలో రోజుకు 2,850 మంది క్రికెట్ క్లబ్ క్రీడాకారులన చొప్పున ఐదు రోజులకు 14,250 మందికి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ.. రోజుకు 2 వేల మంది చొప్పున ఐదు రోజులకు 10,000 మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీకి ఏర్పాట్లు చేశారు. అయితే విద్యార్థులు ఐడీ కార్డులు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తక్కువ ధరలు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా లోయర్ పెవిలియన్ సీజన్ టికెట్లను విశాఖపట్నంలో కేవలం రూ. 1500లకు అందుబాటులో ఉంచినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: INDA& U19 WC: టెస్టులో అన్న.. వరల్డ్‌కప్‌లో తమ్ముడి సెంచరీలు -
APL 2023: ధరణీకుమార్ మెరుపులు.. గోదావరి టైటాన్స్‌కు తప్పని ఓటమి
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్–2 సీజన్లో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ 35 పరుగుల తేడాతో గోదావరి టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ ఓపెనర్ ప్రణీత్ 15 పరుగులు చేసి మాధవ్ బౌలింగ్‌లో ఇస్మాయిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రైడర్స్ కెప్టెన్ రషీద్ 7 పరుగులే చేసినా ఓపెనర్ ధరణీకుమార్(32 బంతుల్లో 59, 8x4, 3x6)తో కలిసి రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. హర్షవర్ధన్ (నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో 22 బంతుల్లో 35)తో కలిసి లేఖజ్ రెడ్డి(12) ఇన్నింగ్స్ సరిదిద్దే ప్రయత్నం చేశాడు. 101 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన రైడర్స్.. మరో 63 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా తొమ్మిది వికెట్లకు 173 పరుగులు చేసింది. సత్యనారాయణ రాజు, సమన్విత్ మూడేసి వికెట్లు తీయగా మాధవ్ రెండు, విజయ్ ఒక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన గోదావరి టైటాన్స్ ఓపెనర్లు వంశీకృష్ణ(4) 10 పరుగుల వద్ద, కెప్టెన్ జానేశ్వర్ (14) 28 పరుగుల వద్ద వెనుదిరిగారు. హేమంత్‌రెడ్డి ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 49 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ధీరజ్‌కుమార్(10), పాండురంగరాజు(14) వికెట్లను 94 పరుగుల స్కోర్ వద్ద కోల్పోయింది. ఇస్మాయిల్ ఎనిమిది బంతుల్లో 19 పరుగులతో చివర్లో కాస్త మెరుపులు మెరిపించినా 18.1 ఓవర్లలోనే 138 పరుగులకు గోదావరి టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. అబ్దుల్లా మూడు, సుదర్శన్, చిరంజీవి, స్టీఫెన్ రెండేసి వికెట్లు తీశారు. ఆశిష్ ఓ వికెట్ పడగొట్టాడు. చదవండి: అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్