
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్నా ఒకటి, రెండు రోజుల్లో కోస్తాలోని కొన్ని ప్రాంతల్లో వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో రేపు ఎల్లుండి మరీంత బలపడనున్న అల్పపీడనం.
కోస్తా ప్రాంతల్లో ఈ రోజు నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. విశాఖతీరం వెంబడి గంటకు 45 నుంచి, 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుగాలులు బలంగా విచే అవకాశం ఉందని దీంతో మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లకూడదని విశాఖ వాతావరణ కేంద్ర తూఫాను హెచ్చరికలు జారీ చేసింది.