
విశాఖ: కశ్మీర్ లోని పెహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన జరజాపు చంద్రమౌళి కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఈరోజు(గురువారం) చంద్రమౌళి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన వైఎస్ జగన్.. వారికి ధైర్యం చెప్పారు.
కాగా, జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి మృతదేహం బుధవారం రాత్రి విశాఖకు చేరుకుంది. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా నుంచి గురువారం సాయంత్రం నగరానికి చేరుకునే అవకాశం ఉంది.. శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి.
ఉగ్రదాడిలో మృతిచెందిన కావలి వాసి మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను సైతం వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వైఎస్ జగన్.. వారికి ధైర్యం చెప్పారు. మధుసూదన్ రావు భార్య ప్రసన్న లక్ష్మీ, బావ నరేస్‌లతో ఫోన్‌లో మాట్లాడారు వైఎస్ జగన్.