
సాక్షి, విశాఖపట్నం: స్టైరీన్ గ్యాస్ బాధిత ప్రజలకు సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కురసాల కన్నబాబుకు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ స్థానికంగా అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రెండు రోజుల పాటు విశాఖలోనే ఉండాలని సూచించారు.
డిప్యూటీ సీఎం సమీక్ష
ఎల్‌జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి కలెక్టరేట్‌లో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాసరావు(నాని), మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్షించారు. విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈని అడిగి తెలుసుకున్నారు. కేజీహెచ్‌తో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంత మంది చికిత్స పొందుతున్నారో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్‌చంద్, అగ్నిమాపక శాఖ డీజీ ఎ.ఆర్.అనురాధ, విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన, జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి, డీఆర్‌వో ఎం.శ్రీదేవి, ఆర్‌డీవో పెంచల కిషోర్, ఇండస్ట్రీస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment