responsible
-
కాంగ్రెస్ ఓటమికి కమల్‌నాథ్ కారణం.. సంజయ్ రౌత్
Madhya Pradesh Elections results: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కారణమని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కొన్ని సీట్లను ‘ఇండియా’ (INDIA) కూటమిలోని భాగస్వామ్యులతో పంచుకుని ఉంటే మరోలా ఉండేదన్నారు. మిత్రపక్షాల పట్ల పాత పార్టీ తన వైఖరిని పునరాలోచించాలని కూడా ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీతో సీట్లు పంచుకోవాలనే ఆలోచనను కమల్‌నాథ్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వంటి నేతలు చురుగ్గా ప్రచారం చేసినప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఓటమికి కమల్‌నాథ్ కారణమని, విపక్ష కూటమితో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. అఖిలేష్ పార్టీకి (సమాజ్‌వాదీ పార్టీ) కొన్ని ప్రాంతాలలో మంచి మద్దతు ఉందని, ఆ పార్టీకి కంచుకోటలుగా పేరుగాంచిన 10-12 స్థానాలు ఉన్నాయన్నారు. కానీ దీనిని కమల్‌నాథ్ వ్యతిరేకించారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు విలువైన గుణపాఠం చెబుతాయని, రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి సమిష్టిగా పాల్గొనాలని రౌత్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ తన వ్యూహాన్ని పునరాలోచించాలని, మిత్రపక్షాల వైపు దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాహుల్ గాంధీ “పనౌటీ” వ్యాఖ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలను దెబ్బతీసిందనే ఆరోపణలను రౌత్ తోసిపుచ్చారు. “అలా అయితే, ఆ వ్యాఖ్య తెలంగాణలో ఎందుకు దెబ్బతీయలేదని ప్రశ్నించారు. కాగా డిసెంబరు 6న ఇండియా బ్లాక్ సమావేశానికి పిలుపునిచ్చామని, ఈ సమావేశంలో పలు విషయాలు చర్చిస్తామని రౌత్ తెలిపారు. -
IPL 2022: ‘ప్రపంచకప్ అందుకోవడమే లక్ష్యం’
అహ్మదాబాద్: ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా నాలుగుసార్లు ఐపీఎల్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఐదోసారి ట్రోఫీని అందుకున్న అతనికి ఇది మరింత ప్రత్యేకం. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా నాయకుడిగా మరో మెట్టెక్కాడు. కెప్టెన్ కావడం తన బాధ్యతను పెంచిందని, నాయకత్వాన్ని ప్రతీ క్షణం ఆస్వాదించానని అతను వ్యాఖ్యానించాడు. ‘అదనపు బాధ్యత తీసుకునేందుకు నేనెప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎప్పుడు అవకాశం లభించినా మిగతా వారిలో స్ఫూర్తి నింపేలా జట్టును ముందుండి నడిపించాలని భావించేవాడిని. నా జట్టు సహచరుల నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నానో వారికంటే ముందు నేను చేసి చూపించాలి. అలా చేస్తేనే దాని ప్రభావం ఉంటుంది. ఐపీఎల్లో నేను అలాగే చేశానని నమ్ముతున్నా’ అని పాండ్యా అన్నాడు. కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే సాధించిన ఐపీఎల్ ట్రోఫీకి తన దృష్టిలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని అతను చెప్పాడు. ‘గతంలో నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో ఉన్నాను. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ఈసారి నా కెప్టెన్సీలో టైటిల్ గెలిచాం కాబట్టి సహజంగానే ఇది మరింతగా ఇష్టం. ఈ గెలుపు రాబోయే రోజుల్లో ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. ఫైనల్‌కు వెళ్లిన ఐదుసార్లూ కప్‌ను అందుకోగలిగిన నేను చాలా అదృష్టవంతుడిని. ఈ రోజు నాది. పైగా లక్షకు పైగా అభిమానులు మాకు అండగా నిలిచారు. మా కష్టానికి దక్కిన ప్రతిఫలమిది’ అని ఈ ఆల్‌రౌండర్ విశ్లేషించాడు. టి20లు బ్యాటర్ల ఆట మాత్రమే అని చాలా మంది అనుకుంటారని, అయితే ఈ ఫార్మాట్లో బౌలర్లే మ్యాచ్ గెలిపించగలరని హార్దిక్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌లో తగినంత స్కోరు లేని సమయంలోనూ మంచి బౌలర్లు ఉంటే మ్యాచ్‌ను మలుపు తిప్పగలరని అతను అన్నాడు. హార్దిక్ పాండ్యా తన తదుపరి లక్ష్యం ప్రపంచకప్ గెలుచుకోవడమే అని ప్రకటించాడు. టీమిండియా తరఫున మూడు ఐసీసీ టోర్నీలలో భాగంగా ఉన్నా... ఒక్కసారి కూడా అతనికి విజయానందం దక్కలేదు. ‘ఎవరికైనా భారత జట్టు తరఫున ఆడటమనేది ఒక కల. నేను ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి మనోళ్ల అభిమానాన్ని చూరగలిగాను. ఇక టీమిండియా సభ్యుడిగా వరల్డ్‌కప్ గెలుపులో భాగం కావడమనేదే నా లక్ష్యం. అందుకోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. నేను ఏ రకంగా జట్టుకు ఉపయోగపడినా చాలు’ అని హార్దిక్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ వేదికలకు నజరానా ఈ ఐపీఎల్ సీజన్లో జరిగిన 74 మ్యాచ్‌లను సమర్థంగా నిర్వహించడంతో పాటు చక్కటి పిచ్‌లను రూపొందించిన ఆరు వేదికలకు బీసీసీఐ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ముంబైలోని వాంఖెడే, బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాలతో పాటు పుణేలోని ఎంసీఏ మైదానంలో లీగ్ దశ మ్యాచ్‌లు జరగగా... కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాలు ప్లే ఆఫ్స్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. లీగ్ మ్యాచ్‌లు జరిగిన స్టేడియాలు ఒక్కో దానికి రూ.25 లక్షలు, ప్లే ఆఫ్స్ నిర్వహించిన మైదానాలకు ఒక్కోదానికి రూ. 12.5 లక్షల చొప్పున బహుమతిని బోర్డు ప్రకటించింది. -
ఇకపై నిర్ణయించేది మేమే!
మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఈ ఆధునిక యుగంలో కూడా ఈ స్థాయిలో ఉందా? అపర్ణ ఏర్పాటు చేసిన రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గురించి తెలిసినప్పుడు ఎదురయ్యే సహజమైన సందేహం ఇది. అయితే మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఆధునిక యుగంలోనే ఎక్కువగా ఉందంటోంది అపర్ణా అచరేకర్. ఇరవై ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఆమెకు నేర్పిన వాస్తవం ఇది. మహిళ పట్ల అణచివేత భౌతికంగా తగ్గినట్లు అనిపిస్తుందేమో కానీ మానసికంగా ఎక్కువైందంటోందామె. తమకంటూ ఒక గుర్తింపు, స్వాతంత్య్రం, తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోగలిగిన సమాజం కోసం ఆమె సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అనే కొత్త పాత్రలోకి ఒదిగిపోయారు. ‘ఈవ్ వరల్డ్’ అనే సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని మహిళలను కలుపుతున్నారు అపర్ణ అచరేకర్. ముంబయికి చెందిన అపర్ణా అచరేకర్ మహిళల కోసం పని చేయాలనే సంకల్పం కలిగిన వెంటనే గత ఏడాది అక్టోబర్ నెలలో ఆచరణలోకి దిగింది. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలిగిన వేదిక అది. ఒకరు మరొకరిని ప్రభావితం చేసుకోగలిగిన అవకాశం ఈ వేదిక ద్వారా లభిస్తోంది. ‘‘ఐడెంటిటీ, ఇండిపెండెన్స్, ఇన్‌క్లూజన్’ అనే మూడు అంశాల ఆధారంగా నిర్మితమైన ఈ వేదిక ద్వారా మహిళలు తాము కోరుకుంటున్న గుర్తింపుతో పరిచయమవుతారు, ఆ స్థానంలో నిలబడడం కోసం పరస్పర సహకరించుకుంటారు, తమ జీవితాలకు అవసరమైన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటారు. అలాగే మగవాళ్లు నిర్దేశించిన నియమావళిని రూపుమాపడానికి కృషి చేస్తారు. కొత్త నియమావళిని మహిళలే నిర్ణయిస్తారు. మొత్తానికి మహిళలు తమకంటూ ఒక స్పేస్‌ని ఈ వేదిక ద్వారా క్రియేట్ చేసుకోగలుగుతారు’’ అని చెప్తోంది అపర్ణ. అందం కొలతల్లో ఉండదు! ‘‘మన భారతీయ సమాజం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మహిళ విషయంలో ఒకేలా వ్యవహరిస్తుంది. ‘ఆడవాళ్లు ఎలా ఉండాలి...’ అనే నియమాలను మగవాళ్లే రూపొందిస్తుంటారు. ఆడవాళ్లు ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర. అలాగే మెంటల్ హెల్త్ నుంచి మెన్స్ట్రువల్ టాబూ వరకు మహిళల స్వేచ్ఛను నిరోధించే శక్తిగా ఉంటోంది మగవాళ్ల భావజాలం. వీటికి భిన్నంగా మహిళలు వ్యవహరిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడడానికి ఏ మాత్రం సందేహించరు. ‘ఆడవాళ్ల విషయంలో తీర్పులివ్వడానికి మనం ఎవరు?’ అనే ప్రశ్న తమను తాము వేసుకునే మగవాళ్లు ఎందరు? వీటన్నింటికీ చరమగీతం పాడుతూ మహిళలు కొత్త నియమావళిని రూపొందిస్తారు’’ అని ఆశాభావం వ్యక్తం చేసింది అపర్ణ. సోషల్ మీడియా వేదికగా రకరకాల వేధింపులు, సైబర్ బుల్లీయింగ్‌కు గురవుతున్న మహిళలకు తమ భావవ్యక్తీకరణకు ఇది ఒక సురక్షితమైన వేదిక అవుతుంది. ఆడవాళ్లు ఎలా ఉండాలి... ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర. -
బిడ్డ చదువు బాధ్యత తండ్రిదే
న్యూఢిల్లీ: కుమారుడికి 18 ఏళ్ల వయసు నిండింది, మేజర్ అయ్యాడు కదా అని తండ్రి తన బాధ్యతల నుంచి పారిపోలేడని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. బిడ్డకు చదువులు చెప్పించాలి్సన బాధ్యత ఎప్పటికీ తండ్రిదేనని, ఆ ఆర్థిక భారాన్ని తల్లిపై వేయకూడదని పేర్కొంది. ఢిల్లీకి చెందిన ఒక జంట విడాకులు తీసుకున్నాక కుమారుడి చదువు కోసం తండ్రి నెలకి రూ.15 వేలు చెల్లించాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని పునఃసమీక్షించాలంటూ ఆ భర్త మళ్లీ కోర్టుకెక్కాడు. తన కుమారుడికి 18 ఏళ్ల వయసు వచ్చేవరకు, లేదంటే అతడి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు మాత్రమే చదువు కోసం తాను డబ్బులు ఇస్తానని, ఆ తర్వాత ఇవ్వలేనంటూ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ విచారణ చేపట్టారు. తండ్రి తన కుమారుడి చదువు బాధ్యతల నుంచి తప్పించుకోలేరంటూ పిటిషన్‌ను కొట్టేశారు. ‘‘పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడేవరకు, సమాజంలో ఒక గుర్తింపు వచ్చేలా ఎదిగేవరకు వారి బాధ్యతను తండ్రి స్వీకరించాలి. కొడుక్కి 18 ఏళ్లు నిండాయని అతని చదువులకయ్యే ఆర్థిక భారాన్ని తల్లిపై వేయకూడదు. కుమారుడు మేజర్ అయినంత మాత్రాన అతను ఆర్థికంగా స్వతంత్రుడు కావాలన్న నిబంధన లేదు. కుమారుడు ఆర్థికంగా తల్లికి అంది వచ్చేవరకూ అతని బాధ్యత తప్పనిసరిగా తండ్రిదే. అతను ఆ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు’’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. 1997లో వివాహమైన ఢిల్లీకి చెందిన జంటకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2011లో మనస్పర్థలతో వారు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు కుమారుడికి 20 ఏళ్లు, కుమార్తెకి 18 ఏళ్లు వచ్చాయి. విడాకుల సమయంలో ఫ్యామిలీ కోర్టు కొడుక్కి 18 ఏళ్లు వచ్చేవరకు, కూతురుకి ఉద్యోగం లేదా పెళ్లి జరిగేవరకు పోషణ భారం తండ్రిదేనని తీర్పు చెప్పింది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్కుగా ఉన్న ఆ తల్లి తాను తన జీతంతో కొడుక్కి చదువు చెప్పించలేనంటూ హైకోర్టుకెక్కితే చదువు నిమిత్తం తండ్రి నెలకి రూ.15 వేలు ఇవ్వాలంటూ తీర్పు చెప్పింది. బాధ్యతల నుంచి పారిపోవద్దంటూ ఆ తండ్రిని కోర్టు హెచ్చరించింది. -
నిజాయితీగా పన్ను చెల్లించేవారికి గుర్తింపు
న్యూఢిల్లీ: జాతి నిర్మాణం కోసం బాధ్యతాయుతంగా తమ వంతు వాటా మేర పన్నులను చెల్లిస్తున్న నిజాయితీపరులకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సవాళ్లు, ఆటంకాలతో కూడిన పరిస్థితుల్లోనూ నిబంధనలను పాటిస్తున్నందుకు పన్ను చెల్లింపుదారులను ప్రశంసించారు. ఎన్నో సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తున్న ఆదాయపన్ను శాఖను ఆమె అభినందించారు. ఆదాయపన్ను శాఖ 161వ వార్షికోత్సవం సందర్భంగా మంత్రి సందేశం ఇచ్చారు. ఆదాయపన్ను శాఖ విధానాలు, ప్రక్రియలను సులభతరంగా మార్చడంలోను, పారదర్శకంగా, సౌకర్యవంతమైన అనుభవాన్ని పన్ను చెల్లింపుదారులకు కల్పించే విషయంలో ఆదాయపన్ను శాఖ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆదాయపన్ను శాఖకు సంబంధించి చాలా వరకు ప్రక్రియలు, నిబంధనల అమలు ఆన్లైన్ వేదికలపైకి తీసుకురావడం వల్ల.. పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను శాఖలకు ప్రత్య క్షంగా రావాల్సిన అవసరం లేకుండా పోయినట్టు లేదా చాలా వరకు పరిమితమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. పన్ను ల వసూళ్లలో ఆరోగ్యకరమైన వృద్ధి నెలకొనడం పట్ల ఆదాయపన్ను శాఖ కృషిని రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్‌బజాజ్ కూడా అభినందించారు. -
వ్యాక్సిన్ కొరత ఎవరి బాధ్యత?
సెకండ్ వేవ్‌లో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులతో తలపడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన తరుణంలో.. టీకాల ఉత్పత్తికి పెట్టుబడి విస్తరణ అవసరాన్ని తీర్చడంలో కేంద్రప్రభుత్వం నత్తనడక సాగిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీ, సరఫరాపై నిర్ణయాధికారం ప్రధానంగా కొద్దిమంది ఉన్నతాధికారులకు కట్టబెట్టడంలోనే అసలు సమస్య దాగి ఉంది. మరోవైపు ప్రధాని మోదీ బిజినెస్ చేయడం బ్యూరోక్రాట్ల పని కాదని ధర్మపన్నాలు పలుకుతున్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ల సేకరణ, పంపిణీ బిజినెస్‌ను పూర్తిగా కేంద్రీకరించేశారు. వ్యాక్సిన్ ప్లానింగ్ విషయంలో కేంద్రం స్పష్టంగా వైఫల్యం చెందిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా కోవిడ్–19 నిరోధక వ్యాక్సిన్ కొరత సంక్షోభం అలుముకుంటోందని వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కొరత లేనేలేదని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చుతోంది. పైగా అందుబాటులో ఉన్న టీకాల నిల్వను రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా నిర్వహించడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. కానీ వాస్తవం ఏమిటంటే, అన్ని వ్యాక్సిన్ల కొనుగోలు, సరఫరాపై గుత్తాధిపత్యం వహిస్తున్న కేంద్రప్రభుత్వం.. 45 ఏళ్లకు పైబడిన వారికి అధిక సంఖ్యలో వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియలో విఫలమైంది. ప్రస్తుతం దేశంలో తయారవుతున్న కోవి షీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల మొత్తం ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 24 లక్షలు మాత్రమే. కానీ, ఇప్పుడు రోజువారీ డిమాండ్ 37 లక్షలకు చేరుకుంది. అంటే రోజువారీ వేయాల్సిన వ్యాక్సిన్ టీకాల కొరత ఇప్పటికే చాలా ఎక్కువగా కనబడుతోంది. మార్చి నెలలో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు వెనుకాడటం, కొత్త ఇన్ఫెక్షన్ రేట్లు నియంత్రణలో ఉండటం కారణంగా వ్యాక్సిన్ సరఫరాలకు మించి డిమాండ్ ఏర్పడలేదు. కానీ ఏప్రిల్ 1 నుంచి వైరస్ వ్యాప్తి ఉన్నట్లుండి పెరిగిపోవడం, వ్యాక్సిన్ అర్హుల వయస్సును 45 ఏళ్లకు కుదించడంతో డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల సంభవించి ఉండాలి. కానీ దాని ప్లానింగ్ విషయంలో కేంద్రం స్పష్టంగా వైఫల్యం చెందింది. వ్యాక్సిన్ నిల్వలు తరిగిపోయిన తర్వాత రోజువారీ డిమాండ్–సప్లయ్ అంతరం రోజుకు 15 నుంచి 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని మోదీ టీకా ఉత్సవ్ గురించి మాట్లాడటం అధివాస్తవికమే అనిపిస్తోంది. విచిత్రమైన విషయం ఏమిటంటే చాలా రాష్ట్రాల వద్ద రెండు లేక మూడు రోజుల పాటు మాత్రమే వ్యాక్సిన్ సరఫరాలు ఉంటూండటమే. రాజకీయ కారణాల వల్ల మహారాష్ట్రలో వ్యాక్సిన్ కొరతపై తుపాను చెలరేగి ఉండవచ్చు కానీ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా తమ వద్ద వ్యాక్సిన్ నిల్వలు హరించుకుపోతున్నాయని చెప్పాయి. ఏపీ, తెలంగాణల్లో జిల్లా స్థాయిలో ఇప్పటికే వ్యాక్సిన్ కొరత ఉంటోందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సహ యజమాని సంగీతా రెడ్డి చెప్పారు. కాగా సెకండ్ వేవ్ సమయంలో వైరస్ విపరీతంగా పెరుగుతున్న 2 టయర్, 3 టయర్ పట్టణాల్లోని ఆసుపత్రుల్లో, ఇతర గుర్తింపు పొందిన వైద్య కేంద్రాల్లో పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. అంటే ఏప్రిల్ చివరి నాటికి దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వ్యాక్సిన్ కోటాను 50 శాతం మేరకు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత వైరస్ వ్యాప్తి మే నెల మధ్య వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతుండటంతో వ్యాక్సిన్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. పెరుగుతున్న డిమాండును ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న రెండు సంస్థల ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం సరిపోతుందా అనేది ప్రధాన ప్రశ్న. సీరమ్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ను ఎంత వేగంగా తయారు చేస్తారన్నదానిపైనే ప్రధాని ఆశిస్తున్న టీకా ఉత్సవ్ కార్యక్రమం ఆధారపడి ఉంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం వ్యాక్సిన్ సరఫరాలో కోవిషీల్డ్ 90 శాతంగా ఉంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒక నెలలో 6 కోట్ల టీకాల సామర్థ్యం కలిగి ఉంది. నెలకు పది కోట్ల టీకాలను తయారు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ధనసహాయం చేయాలని సీరమ్ సంస్థ ప్రమోటర్ అదార్ పూనవాలా స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే సీరమ్ సంస్థ నెలవారీగా తయారు చేస్తున్న ఆరు కోట్ల టీకాల తయారీ కూడా చేయడం సాధ్యం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక కోవాగ్జిన్ టీకాను తయారు చేస్తున్న భారత్ బయోటిక్ సంస్థ నెలకు కోటి డోసుల కంటే తక్కువ తయారీ సామర్థ్యంతో ఉంది. తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలంటూ ఫిబ్రవరి నెలలోనే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఆ అదనపు పెట్టుబడి అవసరాన్ని తీర్చేందుకు మన బడా బాబులు యథాప్రకారమే జాగు చేశారు. వాస్తవమేమిటంటే పెరుగుతున్న కరోనా కేసులతో తలపడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన తరుణంలో టీకాల ఉత్పత్తికి పెట్టుబడి విస్తరణ అవసరాన్ని తీర్చడంలో కేంద్రప్రభుత్వం నత్తనడక సాగిస్తోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీ, సరఫరాపై నిర్ణయాధికారం తీసుకునే అధికారాన్ని ప్రధానంగా కొద్దిమంది ఉన్నతాధికారులకు కట్టబెట్టడంలోనే అసలు సమస్య దాగి ఉంది. మరోవైపు ప్రధాని మోదీ బిజినెస్ చేయడం బ్యూరోక్రాట్ల పని కాదని ధర్మపన్నాలు పలుకుతున్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ల సేకరణ, పంపిణీ బిజినెస్‌ను ప్రధానంగా పూర్తిగా కేంద్రీకరించేశారు. ప్రభుత్వమే వ్యాక్సిన్ల ఏకైక కొనుగోలుదారు కాబట్టి సామర్థ్య విస్తరణపై నిర్ణయాలను అది ప్రభావితం చేస్తోంది. దీన్ని ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టి దానికి ధర విధించి, పేదలకు సబ్సిడీ కింద అందించి ఉంటే పరిణామాలు మరొక రకంగా ఉండేవి. ప్రస్తుతం పరిణామాలు విషమిస్తున్నప్పుడు మాత్రం పంపిణీ సమస్యలను రాష్ట్రాలపైకి నెట్టేస్తోంది. పైగా కేంద్రం వ్యాక్సిన్లను సేకరిస్తుంది తప్ప జిల్లా స్థాయిలో పంపిణీ బాధ్యత రాష్ట్రాలదే అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతులెత్తేశారు. ప్రత్యేకించి ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై మంత్రి నిందమోపుతున్నారు. మరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకూడా వ్యాక్సిన్ కొరత అంత తీవ్రంగా ఉంటున్నం దుకు బాధ్యులెవరో మంత్రిగారే చెప్పాలి మరి. కేంద్రం వ్యాక్సిన్ కొనుగోలుపై గుత్తాధిపత్యం వహిస్తున్నందున అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రాలు కానీ ఎప్పటికీ వ్యాక్సిన్ సేకర్తలుగానూ, పంపిణీ దారులుగానూ సమర్థంగా వ్యవహరించలేవు. ఫైజర్, జాన్సన్–జాన్సన్, స్పుత్నిక్ వంటి బహుళ వ్యాక్సిన్ తయారీ సంస్థలకు అవకాశమిచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు, వికేంద్రీకృత ప్రైవేట్ పంపిణీదారుల మధ్య పోటీ నెలకొల్పిన పక్షంలో మాత్రమే వ్యాక్సిన్ సరఫరా సజావుగా సాగడానికి వీలవుతుంది. పైగా కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ క్రీడను నిరోధించవచ్చు కూడా. ప్రస్తుతం అభిలషణీమైన వ్యవస్థపై వస్తున్న నిందలకు పరి ష్కారం ప్రధాని తలుపు ముందే ఉంది. లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానంలో భాగంగా ఒకవైపు వ్యాక్సిన్ సామర్థ్యంలో కొరత, మరోవైపు మార్కెట్లో మరికొన్ని తయారీ సంస్థలు అందుబాటులో లేకపోవడం నేపథ్యంలో కూడా టీకా ఉత్సవ్ గురించి ప్రధాని మాట్లాడటమే కపట ధోరణిగా భావించాల్సి ఉంటుంది. ఫైజర్ సంస్థ గత డిసెంబర్లోనే భారత్‌లో వ్యాక్సిన్ తయారీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ మన బ్యూరోక్రాట్లు ప్రశ్నల వర్షంతో విసిగించడంతో తన దరఖాస్తును ఫైజర్ సంస్థ వెనక్కు తీసుకుంది. అదేవిధంగా స్పుత్నిక్, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలు కూడా దేశంలో కరోనా టీకా పంపిణీకి ఆమోదించాల్సిందిగా మన అధికారులకు ఉత్తరం రాశారు. మార్కెట్లో ప్రవేశించాలని ఇతర సమర్థ సంస్థలు కోరుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఒకదాని తర్పాత ఒకటిగా సంధిస్తూ వచ్చారు. తాము మాత్రమే వాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ బిజి నెస్ చేయగలమని మన సర్కారీ బాబులు ఆలోచిస్తున్నట్లయితే మనం కుప్పగూలిపోవడం తథ్యం. ఎందుకంటే కోట్లాది మనుషుల ప్రాణాలు వారి జీవితాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి వ్యాక్సిన్‌పై ఈ గుత్తాధిపత్యాన్ని మనం ఏమాత్రం భరించలేం. మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని కరోనా వ్యాక్సిన్లనూ ప్రయోగించి యుద్ధాన్ని గెలవలేకపోతే, ప్రభుత్వం తన్ను తాను నిందించుకోవలసి ఉంటుంది. ఎం.కె. వేణు వ్యాసకర్త రచయిత, ది వైర్ వ్యవస్థాపకులు (ది వైర్ సౌజన్యంతో) -
మంత్రి కన్నబాబుకు పర్యవేక్షణ బాధ్యత
సాక్షి, విశాఖపట్నం: స్టైరీన్ గ్యాస్ బాధిత ప్రజలకు సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కురసాల కన్నబాబుకు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ స్థానికంగా అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రెండు రోజుల పాటు విశాఖలోనే ఉండాలని సూచించారు. డిప్యూటీ సీఎం సమీక్ష ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాసరావు(నాని), మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్షించారు. విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈని అడిగి తెలుసుకున్నారు. కేజీహెచ్‌తో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంత మంది చికిత్స పొందుతున్నారో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్‌చంద్, అగ్నిమాపక శాఖ డీజీ ఎ.ఆర్.అనురాధ, విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన, జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి, డీఆర్వో ఎం.శ్రీదేవి, ఆర్డీవో పెంచల కిషోర్, ఇండస్ట్రీస్ అధికారులు పాల్గొన్నారు. -
'ఈ- ఆక్షన్' ...మీ కోసమే!!
సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం:శ్రీకృష్ణ, నీలిమ అందినంత రుణం దొరుకుతోంది కదా అని తాహతుకు మించి అప్పు చేసి ఇల్లు కొన్నారు. కానీ తరవాత పరిస్థితులు తిరగబడి ఆ ఇంటి రుణానికి ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితిలో పడిపోయారు!!. రామరాజుకు సొంత కంపెనీ ఉంది. ఆదాయం బాగా వస్తున్నపుడు కంపెనీ విస్తరణ కోసం రుణాలు తీసుకున్నాడు. తను అప్పటికే కొనుగోలు చేసిన నాలుగైదు ఫ్లాట్లను కూడా సెక్యూరిటీగా తనఖా పెట్టాడు. కాకపోతే ఆ వ్యాపారంలో పోటీ పెరిగి లాభాలు పడిపోయాయి. ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితిలో పడ్డాడు!!. ఇలా... కారణాలు ఏవైనా కావచ్చు. వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఈ మధ్య రుణాలు తీసుకున్న వారు డిఫాల్ట్ అవుతున్న సందర్భాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పైపెచ్చు బ్యాంకులు ఇంతకుముందు చూసీ చూడనట్లు వ్యవహరించేవి. ఏడాది రెండేళ్లపాటు రుణాల వాయిదాలు చెల్లించకపోయినా పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ మారిన నిబంధనలు, పెరిగిన నిఘా, ప్రభుత్వ చర్యల నేపథ్యంలో ఇపుడవి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వాయిదాలు చెల్లించటంలో విఫలమైన డిఫాల్టర్లకు నోటీసులిస్తూ... వారు తనఖా పెట్టిన ఇళ్లను, ఇతర ఆస్తులను వేలానికి పెడుతున్నాయి. ఈ మధ్య పత్రికల్లో ఇలాంటి వేలాలకు సంబంధించిన ప్రకటనలు కూడా పెరిగాయి. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు వేలానికి పెడుతున్న ఆస్తుల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణాలు ఏమైనా... కాస్త తక్కువలో ఇళ్లు కొనుక్కుని సెటిల్ అవుదామనుకునే ఈ డిస్ట్రెస్డ్ సేల్ ఒక మంచి అవకాశమనే చెప్పాలి. ఈ వేలానికి సంబంధించిన ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే పూర్తవుతోంది. ఔత్సాహిక కొనుగోలుదారులకు ఇది మరింత కలసివచ్చే అంశం. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి ఇళ్లను కొనొచ్చా? కొంటే లాభమా... నష్టమా? కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... అన్ని రకాల ఆస్తుల వేలం బ్యాంకులు వేలం వేసే వాటిలో అన్ని రకాల ఆస్తులూ ఉంటున్నాయి. ఎస్బీఐ ఇటీవలే అతిపెద్ద ఎలక్ట్రానిక్(ఈ) వేలాన్ని నిర్వహించింది. ఇందులో ఒకేసారి 1,000 ఆస్తులను వేలానికి పెట్టింది. ఇందులో ఇళ్లు, వాణిజ్య భవనాలు (ఆఫీసులు, షాపులు) ఫ్యాక్టరీ బిల్డింగులు ఉన్నాయి. వేలం వేసింది ఏ ప్రాంతం, ఎంత విస్తీర్ణంలో ఉన్నది తదితర అంశాలను బట్టి ధర ఉంటుంది. ఉదాహరణకు ముంబై శాంతాక్రజ్ ఈస్ట్‌లో రెండు పడకగదుల ఇళ్లను రూ.2 కోట్ల రిజర్వ్ ధరకు వేలానికి పెట్టింది. నవీ ముంబైలో ఫ్లాట్ లేదా షాపు ధర రూ.8.5 కోట్లు. పాతవి, తక్కువ విస్తీర్ణంతో ఉన్న ఫ్లాట్లు లేదా షాపులు, చిన్న పట్టణాల్లో ఆస్తులు రూ.50 లక్షల్లోపే ఉంటున్నాయి. ధరలూ ఆకర్షణీయమే! కొన్ని సందర్భాల్లో వేలంలోకి వచ్చేవి ఆకర్షణీయ ధరల్లోనే ఉంటున్నాయి. ఎందుకంటే తమకున్న బకాయిలను వసూలు చేసుకుంటే చాలనుకుని బ్యాంకులు ధర తగ్గించి అమ్మకానికి పెడుతుంటాయి. వేలానికి ఉంచే అన్ని ఆస్తులపై బ్యాంకులు లాభాలను ఆశించలేని పరిస్థితి ఉంటుంది. పైగా ఇది బ్యాంకు, కొనుగోలుదారుల మధ్య నేరుగా జరిగే లావాదేవీ. మధ్యలో బ్రోకర్లు ఉండరు. తమ వద్ద నమోదైన వ్యాల్యూయర్ల సిఫారసుల మేరకు బ్యాంకులు వేలం ధరను ఖరారు చేస్తుంటాయి. సాధారణంగా మార్కెట్ ధర కంటే 10–15 శాతం తక్కువే ఉంటుంది. ఇందులో రిజర్వ్ ధర ఉంటుంది. బ్యాంకులు ఇంత కంటే తక్కువ ధరకు విక్రయించవని అర్థం. ఆ ధరకు అదనంగా కొంత కోట్ చేస్తూ వేలంలో పాల్గొనవచ్చు. చివరికి ఎక్కువ కోట్ చేసినవారు విజేతగా నిలుస్తారు. బిడ్డింగ్ ప్రక్రియ ఎలా...? వేలం ప్రక్రియలో పాల్గొని బిడ్డింగ్ వేయడం చాలా సులభం. ఆక్షన్ సైట్లు, స్థానిక వార్తా పత్రికల ద్వారా ఈ–వేలం గురించి తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఈ ఆక్షన్స్, ఫోర్క్లోజర్ ఇండియా, ఈఆక్షన్.ఎన్పాసోర్స్ తదితర పోర్టల్స్ పలు బ్యాంకుల తరఫున వేలం ప్రక్రియను నిర్వహిస్తుంటాయి. కెనరా బ్యాంకు అయితే ‘కెనరాబ్యాంకు. ఆక్షన్టైగర్.నెట్’లో వేలం వేస్తుంటుంది. ప్రతి ప్రాపర్టీ సమాచారం అక్కడే అందుబాటులో ఉంటుంది. బిడ్డింగ్‌ను కూడా అక్కడే సమర్పించొచ్చు. బిడ్ డాక్యుమెంట్‌లోనే ప్రాపర్టీకి సంబంధించి రుణ బకాయిలు తదితర సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్స్‌లో తమ పేరు, ఇతర కేవైసీ వివరాలతో నమోదు చేసుకున్న తర్వాతే బిడ్‌కు అర్హత లభిస్తుంది. పైగా వేలంలో పాల్గొని బిడ్ వేసే వారు ప్రాపర్టీ రిజర్వ్ ధరలో 10% చెల్లించాల్సి ఉంటుంది. ఏ తేదీన, ఏ సమయంలో ఆస్తిని వేలం వేస్తున్నదీ బ్యాంకు తెలియజేస్తుంది. అలాగే, ప్రత్యక్షంగా ఆ ప్రాపర్టీని చూసుకునేందుకూ ఒక తేదీని నిర్ణయిస్తుంది. ఆ రోజున వెళ్లి ప్రాపర్టీని చూసుకోవచ్చు. వేలం గెలుచుకున్న వారు విక్రయ ధరలో 25 శాతాన్ని అదే రోజు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని తదుపరి 15 రోజుల్లో చెల్లించేయాలి. దీనికి కావాలనుకుంటే రుణం తీసుకోవచ్చు. దీంతో ఆస్తిపై హక్కులను కొనుగోలుదారులకు బ్యాంకులు బదలాయిస్తాయి. సొసైటీ నిరంభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ) కూడా అందిస్తాయి. పరిశీలించాల్సినవి ఇవీ... బ్యాంకుల ఈ వేలంలో పాల్గొని ఆస్తిని సొంతం చేసుకునే వారు ఓ న్యాయవాది సహకారం తీసుకోవడం ద్వారా టైటిల్ పరంగా సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్తపడొచ్చు. ఆ ఆస్తిపై ఏవైనా పెండింగ్‌లో వివాదాలున్నాయా అన్నది తెలుసుకోవచ్చు. ఇక కొనుగోలు చేస్తున్న ఆస్తికి సంబంధించి నీటి పన్ను, ఆస్తి పన్ను బకాయిలు ఏవైనా ఉన్నదీ తెలుసుకోవాలి. బ్యాంకులు పేర్కొన్న నిర్ణీత గడువులోపే చెల్లింపులన్నీ జరిగేలా చూసుకోవాలి. ఇక వేలాన్ని రద్దు చేసే సందర్భాలు కూడా ఉంటాయి. నోటీసు ఇచ్చిన తేదీ నుంచి 30 రోజుల తర్వాత బ్యాంకులు వేలం వేస్తాయి. ఈలోపు బకాయిదారుడు తాను తీసుకున్న రుణాన్ని చెల్లించేస్తే బ్యాంకులు రద్దు నిర్ణయం తీసుకుంటాయి. కొన్ని సొసైటీలు అయితే తొలి తిరస్కరణ హక్కు కింద తామే ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ప్రతికూలతలూ ఉంటాయి! ఆస్తిని ‘ఉన్నది ఉన్నట్టుగా’ అనే స్థితిలో బ్యాంకు అమ్మకానికి పెడుతుంది. అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ విషయంలోనూ, ఇతరత్రా న్యాయపరమైన వివాదాలు ఏమైనా ఉంటే వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. పైపెచ్చు సదరు ఆస్తికి సంబంధించి పన్నులు, ఇతరత్రా అంశాల్లో స్థానిక సొసైటీలకు, మున్సిపాలిటీలకు ఏవైనా బకాయిలున్నా సరే వాటిని బ్యాంకు చెల్లించదు. వేలానికి పెట్టే ఇళ్లు కొత్తవి కావు కనక మరమ్మతులు వంటివేవైనా చేయించాల్సి ఉంటే వాటిని కొనుగోలుదారే చేయించుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఆ ఇంటికి సంబంధించి వివాదాలు, మరమ్మతులు, బకాయిల వంటి అన్నిటికీ కొనుగోలు చేసిన వారే బాధ్యులవుతారు. వారే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. -
పెట్రో ధరల బాధ్యత కేంద్రానిదే -యనమల
సాక్షి, అమరావతి: అడ్డూ అదుపులేకుండా పెరిగిపోతున్న చమురు ధరలపై ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. అంతర్జాతీయంగా చమురు ధరల హెచ్చు తగ్గుల సందర్భంగా కేంద్రం తీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. పెరిగినపుడు పెంచడమే తప్ప, ధరలు తగ్గినపుడు దేశీయంగా ఎందుకు తగ్గించడం లేదని మండిపడ్డారు. పెరుగుతున్న ధరల ప్రభావం మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగా పడుతోందన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో కేంద్రప్రభుత్వం కూడా ధరలు పెంచటం వల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని యనమల వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల మీద ఎక్కువ భారం పడుతోందన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర తగ్గినప్పుడు కేంద ప్రభుత్వం తగ్గించడంలేదనీ, పెరిగినపుడు మాత్రం సదరు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచాలని ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం సరైనది పద్దతి కాదని యనమల పేర్కొన్నారు. మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగినపుడు ప్రజలు మీద భారం పడకుండా చేసే భాద్యత కేంద్ర ప్రభుత్వమే వహించాలన్నారు. తద్వారా ప్రజల మీద భారం తగ్గించాలని ఆయన కోరారు. -
బాలీవుడ్‌పై మేనక సంచలన వ్యాఖ్యలు: దుమారం
ముంబై: కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలపై ఈవ్ టీజింగ్ కు బాలీవుడ్ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. దీంతో దుమారం రేగింది. శుక్రవారం గోవా ఫెస్ట్‌కు హాజరైన ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై నేరాల పెరుగుదలకు సినిమాలే కారణమన్నారు. దాదాపు ప్రతి సినిమాలోనూ ప్రేమ ఈవ్ టీజింగ్ తో మొదలుతుందని పేర్కొన్నారు. బాలీవుడ్ అయినా, ప్రాంతీయ భాషా చిత్రంలోనైనా దీనికి అతీతం కాదన్నారు. అమ్మాయి చుట్టూ కొంతమంది చేరి గుమిగూడి, అసభ్యంగా ప్రవర్తించడం, తాకడం, వేధించడం ఆ తర్వాత ప్రేమలో పడుతూ ఉండటం చూపిస్తున్నారని విమర్శించారు. తద్వారా మహిళలపై హింసకు, వేధింపులకు పాల్పడవచ్చనే భావన పురుషుల్లోపెరుగుతోందన్నారు. అలా కాకుండా మహిళల ప్రాత చిత్రణ గౌరవప్రదంగా ఉండేలా చూడాలని బాలీవుడ్‌ని కోరారు. చేతకానిపురుషులే మహిళలపై హింసకి దారితీస్తుందనీ, పనిలో వైఫ్యల్యంతో పురుషులు మహిళలపై అసహనం ప్రదర్శిస్తారని,అరుస్తారని పేర్కొన్నారు. దీంతో బాలీవుడ్ తీవ్రంగా స్పందిస్తోంది. సినిమా పరిశ్రమ శక్తిని తక్కువగా చిత్రనిర్మాత అశోక్ పండిట్ చూడొద్దని కోరారు సినీ పరిశ్రమపై విమర్శలకు దిగడం ఫ్యాషన్‌గా మారిపోయిందని విమర్శించారు. శ్యాంబెనగల్ నుంచిమొందలు మాధుర భండార్కర్ దాకా చాలా అగ్రదర్శకులు విమెన్ ఓరియెంటెడ్ సినిమాలను తీశారని గుర్తుచేశారు. -
నగరవాసుల సమస్యలకు సర్కార్‌దే బాధ్యత
-
బాధ్యులెవరో తేల్చండి
– కొండచరియల ప్రమాదంపై ఈవోకు ఎస్పీ లేఖ సాక్షి ప్రతినిధి, కర్నూలు: పాతాళగంగ ఘాట్‌కు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగి పడిన ఘటనపై బాధ్యులు ఎవరో తేలనున్నారా? వారిపై చర్యలు తీసుకోనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే మిగులుతోంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనపై బాధ్యులెవరో తేల్చి ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్వయంగా ఎస్పీ ఆకె రవికష్ణ..శ్రీశైలం ఈవో భరత్‌గుప్తకు లేఖ రాసినట్టు తెలిసింది. వాస్తవానికి ఘాట్‌కు రోడ్డు మార్గం వేసే సమయంలోనే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని స్వయంగా ఎస్పీ రవికృష్ణ...మే నెలలోనే లేఖ రాశారు. అయితే.. సంబంధిత అధికారులు దీనిపై కనీస చర్యలు తీసుకోలేదు. పది రోజుల క్రితం రాత్రి సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ విజయవాడ నుంచి నేరుగా శ్రీశైలం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇదే నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తలు చెప్పినప్పటికీ పట్టించుకోని నేపథ్యంలో ఘటన జరిగేందుకు బాధ్యులు ఎవరనే విషయంలో విచారణ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీ..ఈవోకు లేఖ రాసినట్టు తెలిసింది. ఈ పరిస్థితులల్లో విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో ఎవరిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారనే విషయంలో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సంబంధిత కాంట్రాక్టు సంస్థతో పాటు నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా చర్యలు తప్పవని తెలుస్తోంది. అగ్గిరాజేసిన వ్యవహారం... వాస్తవానికి కొండచరియలు విరిగిపడిన వ్యవహారం.. జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య అగ్గిరాజేసింది. తాను సూచనలు చేసినప్పటికీ ముందస్తుగా మేల్కోలేదని ఎస్పీ వాపోయారు. ఇదే విషయంపై పుష్కరాల సమీక్ష సమావేశాల్లో ఐదారుసార్లు లేవనెత్తినప్పటికీ పట్టించుకోలేదని ఎస్పీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన ఉన్నతాధికారుల దష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లోనే డీఐజీ కూడా ఎస్పీ సూచన పాటించి ఉంటే ఈ ఘటన జరిగిఉండేది కాదని పేర్కొన్నారు. అయితే, దీనిపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారనే విధంగా మరో ఉన్నతాధికారి బాహాటంగానే అధికారుల సమావేశంలో విరుచుపడినంత పనిచేశారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఘటనపై విచారణ చేసి బాధ్యులని తేలిన వారిపై ఎస్పీ లేఖ రాసిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతోందననే చర్చ సాగుతోంది. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
పాతాళగంగ (మన్ననూర్) : కృష్ణా పుష్కరాల్లో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పుష్కరాల నిర్వహణ ప్రత్యేక అధికారులు మధుసూదన్‌నాయక్, డాక్టర్ వెంకటయ్య ఆదేశించారు. శుక్రవారం పాతాళగంగ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సిబ్బందితో వారు మాట్లాడారు. 12రోజులపాటు నిర్వహించే పుష్కరాల్లో క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కృష్ణవేణి, వనమయూరి, మన్ననూర్లోని వనమాలికలో వీఐపీల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశామన్నారు. మీడియా పాయింట్ వద్ద రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోని, ఉపసర్పంచ్ ప్రసాద్, నాగర్‌కర్నూల్ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, అచ్చంపేట ఆర్టీసీ డీఎం నారాయణ, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ రఘునందన్, సీఐ శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. -
లీకేజీకి ప్రభుత్వానిదే బాధ్యత: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీకి రాష్ర్ట ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. లీకేజీలో అధికారుల హస్తమున్నట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో తేలినా, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న పెద్దలకు కూడా దీనిలో భాగముందనే అనుమానాలు బలంగా ఉన్నాయన్నారు. -
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత
రాజాపేట : మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని హరితహారం ప్రత్యేక అధికారి, అడిషినల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ మోహన్‌చంద్ ఫర్గెయిన్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో ఇప్పటివరకు నాటిన మొక్కలు, వాటి పరిస్థితి, సంరక్షణ తదితర వివరాల గురించి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. హరితహారం క్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో నిర్వహిస్తుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 కోట్ల 29 లక్షల మొక్కలు నాటగా జిల్లాలో కోటి 41లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన మొక్కలు స్థానంలో వెంటనే కొత్త మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ కొమ్మగల్ల యాదగిరి, ఏపీఓ రాములు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం బాధ్యత వహించాలి
-
అందమైన కుటుంబానికి ఏడు నియమాలు
నియమం 1- ఎవరూ సమానం కాదు: నాన్న ఆఫీసుకు వెళతాడు. అమ్మ ఇంట్లో ఉంటుంది. నాన్న డబ్బు తెస్తాడు. అమ్మ ఖర్చు పెడుతుంది. నాన్నకు అమ్మ గౌరవం ఇస్తుంది. అమ్మకు నాన్న విలువ ఇస్తాడు. ఇద్దరూ వయసులో సమానం కాదు. పనిలో సమానం కాదు. బాధ్యతల్లో సమానం కాదు. పిల్లలకు చనువులో సమానం కాదు. కోపతాపాల్లో ఇష్టాయిష్టాల్లో సమానం కాదు. కాని- కుటుంబం అంతిమంగా సాధించాల్సిన ఫలవంతమైన పురోగతిలో- ఆ బాధ్యతను నెరవేర్చడంలో మాత్రం సమానం. నాన్నకు కోపం వచ్చినప్పుడు అమ్మకు తక్కువ కోపం అంటే నాన్నకు సమాన ం కాని సామాన్య కోపం రావాలి. అమ్మకు చికాకు ఎక్కువైనప్పుడు నాన్నకు అతి తక్కువ చికాకు రావాలి. ఏదైనా కోరిక తీరడానికి అమ్మ తొందర చేస్తుంటే నాన్న అందుకు సమానం కాలేకపోతున్నందుకు కారణం చెప్పగలగాలి. నాన్న ఏ విషయంలోనైనా దూకుడుగా ఉంటే అమ్మ అతి మందగమనంతో దానిని ఎందుకు నిలవరిస్తుందో నాన్నకు చెప్పగలగాలి. అమ్మ మూతి ముడిస్తే నాన్న నవ్వాలి. నాన్న భృకుటి ముడిపడితే అమ్మ మోము అతి ప్రశాంతం కావాలి. కనుక ఇంట్లో అమ్మా నాన్న సమానంగా ఉండకూడదు. ఏ ఇల్లైనా సంతోషంగా ఉండాలంటే ఆ ఇంటి రాజ్యాంగంలో రాసుకోవాల్సిన మొదటి రూలు. నియమం 2: స్వేచ్ఛ అంత సులువు కాదు: అబ్బాయి మోటరు సైకిల్ అడుగుతాడు. ఇవ్వాలి. కాని కొంతకాలం పాటు ఒంటరిగా నడిపే స్వేచ్ఛ ఇవ్వకూడదు. నాన్నో అన్నయ్యో వెనుక కూచోవాలి. జాగ్రత్తగా నడిపే అనుభవం వచ్చేవరకూ బంధనాలు వేయాలి. ఫలానా చదువు చదువుతానని అనవచ్చు. చదవనివ్వాలి. కాని చదువును ఫలవంతం చేసుకునే వరకూ పర్యవేక్షణ ఉండాలి. అమ్మాయికి స్నేహితులు అవసరం. కాని ఆ స్నేహితులందరితో పరిచయం అమ్మకూ నాన్నకూ కూడా ఉండాలి. ఫోన్లు అడిగితే ఇవ్వాలి. ఫేస్‌బుక్‌లలో ఉంటానంటే ఉండనివ్వాలి. వాట్సప్‌లు వాడతానంటే వాడనివ్వాలి. కాని ఏది ఎంతవరకు ఎలా ఏ పరిణితితో వాడుతున్నారన్న విషయంలో సూచనప్రాయంగానైనా సలహా ఉండాలి. హక్కును సాధించుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. ధిక్కరించగలిగే స్వేచ్ఛను నిరోధించాలి. స్వేచ్ఛకు ఒక బాధ్యత ఉంటుందని బాధ్యతకు ఒక పరిమితి ఉంటుందని తెలియచేయాలి. పిల్లలు పర్సనల్రూములు అడుగుతారు. ఇవ్వగలిగితే ఇవ్వాలి. కాని తలుపు మూసుకునే స్వేచ్ఛకూ గడియ వేసుకునే స్వేచ్ఛకూ మధ్య ఉన్న అంతరాన్ని సున్నితంగా హెచ్చరించాలి. ఇల్లు పిల్లలతో పాటు సంతోషంగా ఉండాలంటే స్వేచ్ఛ అంత సులువుగా దక్కదన్న నియమాన్ని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాలి. నియమం 3 - ఎక్స్‌ప్లాయిట్ చేయాలి: అమ్మ అలసిపోతోంది. నాన్న- అబ్బాయిని పిలిచి ఫలానా పని నువ్వు భలే చేస్తావురా అనాలి. అమ్మాయిని పిలిచి మనిద్దరం కలిసి వంట చేస్తే ఆ రుచే వేరు అని ఊరించాలి. నాన్నకు పొదుపు తెలియకపోతే వెచ్చాల లెక్క ఎక్కువ చూపించి మిగిలిన మూడు వేలతో చిట్టీ కట్టాలి. అమ్మకు చీరల పిచ్చి ఎక్కువగా ఉంటే అప్పులున్నాయని చెప్పి పాలసీకి పడేస్తూ ఉండాలి. పిల్లలు బ్రాండెడ్ బట్టలు అడిగితే ఫ్యాక్టరీ ఔట్లెట్లో బోలెడంత వెరైటీ ఉంటుందని పట్టుకుపోవాలి. నిస్సాన్ అడిగితే నానోకు కూడా నాలుగు చక్రాలే ఉంటాయని చెప్పగలగాలి. పుస్తకాల్లోనే కూరుకుపోతూ ఉంటే గనక డబ్బులిచ్చి ఫ్రెండ్స్‌తో కెఎఫ్సికి పంపాలి. సినిమాలూ షికార్లు ఎక్కువైతే గనక పిచ్చాపాటికని చెప్పి తెలిసిన మాస్టారితో కబుర్లలోనే కర్తవ్యం బోధించాలి. బంధువుల ఊరు భలే బాగుంటుందని చెప్పి బంధాలను బలపరచాలి. కలాం పేపర్‌బాయ్‌గా చేయడం వల్ల అంతవాడయ్యాడని స్వీయ సంపాదన నేర్పించాలి. ఒన్ గ్రామ్ గోల్డయినా అమ్మకు బాగుంటుందని చెప్పాలి. షటిల్ సూపర్‌గా ఆడతావంటూ నాన్నను క్లబ్బు ముఖం చూడకుండా చేయాలి. చిన్న చిన్న సంతోషాలు కావాలంటే చిన్నపాటి ఎక్స్ప్లాయిటేషన్లు చేయాలని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాల్సిన మరో రూలు. నియమం 4: అసహనం ఉండాలి: నానమ్మ ఫలానా పని మనిషిని ఫలానా కులమని పనిలో వద్దంటుంది. అప్పుడు అసహనం చూపాలి. తాతయ్య ఫలానా స్నేహితుడు ఫలానా మతమని కనుక స్నేహం వద్దని అంటాడు. అప్పుడు అసహనం చూపాలి. అబ్బాయి ఫలానా మతం వారితో తిరుగుతూ ఫలానా మతం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటాడు. అప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేయాలి. అమ్మాయి ఫలానా ప్రాంతం వారంటే ద్వేషం పెంచుకుంటుంది. అసహనంతో చెలరేగిపోవాలి. కోవెల, మస్జీద్, చర్చ్... ఇవి వేరువేరనే అసహనం ప్రదర్శించే వారి పట్ల అసహనం ప్రదర్శించాలనే సంస్కారం ఇంట్లో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. కనుక మంచి కోసం కొంత అసహనం ఉండాలి. మనుషులను విడదీయాలనే అసహనం పట్ల అసహనం ఉండాలి. కుటుంబం చైతన్యంతో ఉండాలంటే ఇలాంటి అసహనం తప్పనిసరి అని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాల్సిన మరో రూలు. నియమం 5: సంస్కృతిని నిరోధించాలి: మనదంతా వెనుకబాటుదనం... సంస్కృతి అంటే పాశ్చాత్య దేశాలదే అనుకునే సంస్కృతిని నిరోధించాలి. మనదే గొప్ప... అవతలివారిదంతా అథమం అనే సంస్కృతిని కూడా నిరోధించాలి. ఫలానావారి భాష గొప్పది కాదని, ఫలానావారి మాట గొప్పది కాదని, ఫలానావారి యాస గొప్పదికాదని, ఫలానావారి ఆచారం గొప్పది కాదని, ఫలానావారి ఉత్సవం గొప్పది కాదని, ఫలానావారి రీతి గొప్పది కాదని అమ్మో, నాన్నో, అమ్మాయో, అమ్మాయో అంటూ ఉంటే గనక అలాంటి సంస్కృతి ఇంట్లో అడుగు పెట్టకుండా నిరోధించాలి. ఎవరికైనా ఆత్మీయంగా ఆకు పరిచే, ఏ సంస్కృతి ప్రవేశానికైనా వాకిలి తీసే విధంగా ఇల్లు ఉండాలని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాల్సిన ముఖ్యమైన రూలు. నియమం 6: మరణాన్ని స్వాగతించాలి: పనివాళ్ల పిల్లలు పనివాళ్లే అనే నియమపు మరణాన్ని స్వాగతించాలి. పేదవాళ్ల వారసులు పేదవాళ్లే అనే పరంపర మరణాన్ని స్వాగతించాలి. రైతుల ఖర్మ రైతుదే అనే నిర్లిప్తత మరణాన్ని స్వాగతించాలి. వ్యవస్థ దుర్గతి వ్యవస్థదే అనే నిరాశ మరణాన్ని స్వాగతించాలి. దేశం ఇలా నాశనం అవ్వాల్సిందే అనే నిస్సహాయత మరణాన్ని స్వాగతించాలి. అమ్మా నాన్నా అమ్మాయి అబ్బాయి కుటుంబ సభ్యుల హోదా నుంచి బాధ్యత కలిగిన పౌరుల హోదాకు ఎదిగినప్పుడు ఈ మరణాలన్నింటి కోసం కృషి చేసి జీవానికి జీవితానికి జీవం పోయాలి. అలాంటి చైతన్యం కలిగి ఉండాలని ప్రతి కుటుంబం తన రాజ్యాంగంలో తప్పనిసరిగా రాసుకోవాలి. స్వార్థం మరణించేలా చేసి సంఘ ప్రయోజనం నిలబెట్టేలా చేయగలగాలి. నియమం 7: సమాచారం ఉండరాదు: అమ్మాయి పెళ్లి అమ్మాయితో సంప్రదించకుండా నాన్న ఖరారు చేస్తాడు అనే సమాచారం అమ్మాయికి ఉండరాదు. అబ్బాయి చదువు అబ్బాయికి సంబంధం లేకుండా నాన్న ఫీజు కడతాడు అనే సమాచారం అబ్బాయికి ఉండరాదు. అమ్మా నాన్నలు ఏ నిర్ణయమైనా తీసుకోగలరు అనే సమాచారం పిల్లలకు ఉండరాదు. పిల్లలు ఏ ఉల్లంఘన అయినా చేయగలరు అనే సమాచారం తల్లిదండ్రులకు ఉండరాదు. చెప్పాలంటే అక్కర్లేని సమాచారం ఎవరి దగ్గరా ఉండరాదు. అవసరమైన సమాచారం ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలి. నాలుగు విడివిడి సెల్‌ఫోన్ సంభాషణల సమాచారం ఉండరాదు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ మాట్లాడుకునే సమాచారం ఉండాలి. మాట్లాడుకోవాలనే నియమం... పంచుకోవాలనే నియమం... దాచుకోకూడదనే నియమం ఆఖరు నియమంగా ప్రతి ఇంటి రాజ్యాంగంలో తప్పనిసరిగా ఉండాలి. ఈ నియమాలను పాటించడం వల్ల ఏ కుటుంబమైనా చిర్రుబుర్రులు లేకుండా పదికాలాలపాటు సుఖసంతోషాలతో మనగలుగుతుంది. -
పుష్కరాల ఘోరానికి ఇంకా తేలని బాధ్యులు
-
రైతు ఆత్మహత్యలకు బాధ్యత బాబుదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు సీఎం చంద్రబాబునాయుడే పూర్తి నైతిక బాధ్యత వహించాలని వైఎస్సార్సీఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు 2014 ఎన్నికలకు ఏడాదిన్నర ముందునుంచే అణాపైసలతోసహా రైతుల రుణాలన్నింటినీ రద్దు చేస్తానని ఇచ్చిన హామీని నమ్మిన రైతులు మోసపోయారని, అప్పులు పుట్టక.. వ్యవసాయం చేసుకోలేక సర్వస్వం కోల్పోయి, సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. వీరి ఆత్మహత్యలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబే కారణమన్నారు. రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జోక్యం చేసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘‘రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో సీఎం దృష్టికి తెస్తే లేదని తొలుత బుకాయించారు. జగన్ అనంతపురంజిల్లాలో రైతు భరోసాయాత్ర చేపడుతున్నారని తెలిశాక రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. తాజాగా రైతు కుటుంబాలకు రూ.ఒకటిన్నర లక్షలే ఇవ్వాలని జీవో విడుదల చేశారు’’ అని నెహ్రూ మండిపడ్డారు. అందుకే ఇది కత్తిరింపుల ప్రభుత్వమని తాము చెబుతున్నామన్నారు. హామీలపై సమీక్షించుకోండి.. చంద్రబాబు సీఎం అయ్యాక ఇప్పటిదాకా జరిగిన మూడు అసెంబ్లీ సమావేశాల్లో కొనసాగిన చర్చల ఫలితంగా సర్కారు కొన్ని హామీలిచ్చిందని, వాటిని ఏమేరకు నెరవేర్చారో సమీక్షించుకుని పూర్తిచేయాలని నెహ్రూ సూచించారు. రెండు విడతలుగా రుణమాఫీ చేశామని, మూడోవిడత మాఫీకి సంబంధించిన రుణాలమొత్తాన్ని విడుదల చేసినట్లు ప్రభుత్వం చెబుతోందని, కానీ ఆచరణలో అలాంటి పరిస్థితి లేదని స్పష్టంచేశారు. బ్యాంకులకెళ్లి ఆరాతీస్తే రైతులు బాకీఉన్న రుణాలకు, ప్రభుత్వంనుంచి విడుదలైన మొత్తానికి పొంతనే లేదన్నారు. ఇక సామాజిక పింఛన్లలో ఏకంగా పది లక్షలమందికి ఎగనామం పెట్టారన్నారు. వైఎస్ చిత్రపటం తొలగించడం సరికాదు.. శాసనసభ లాంజ్నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని తొలగించడం సరికాదని జ్యోతుల విమర్శించారు. పదవిలో ఉంటూ మృతిచెందిన ముఖ్యమంత్రి వైఎస్ ఒక్కరే కనుక ఆయన చిత్రపటాన్ని పెడుతున్నట్లు అప్పట్లో స్పీకర్ ప్రకటించారని, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటి స్పీకర్ చేయడం సరికాదని సూచించారు. రిషితేశ్వరి మరణంపై వాస్తవాలను తెలుసుకోవడానికి ఆగస్టు 6న తమపార్టీ ఎమ్మెల్యేలు నాగార్జున యూనివర్సిటీకి వెళుతున్నారని ఆయన తెలిపారు. -
వక్ఫ్ ఆస్తుల బాధ్యత ప్రభుత్వానిదే: పల్లె
హైదరాబాద్: 'వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏ ఒక్కరికో చెందినవి కావు. ఇవన్నీ ముస్లిం కమ్యూనిటీవి. వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే౮ అని మైనార్టీ, వక్ఫ్ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. గురువారం వక్ఫ్ శాఖాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేల కోట్లు విలువ చేసే వక్ఫ్ బోర్డ్ భూములను లీజుకి ఇవ్వడంతో పాటు, కమ్యూనిటీ కాంప్లెక్స్‌లను నిర్మించి తద్వారా వచ్చే ఆదాయాన్ని మైనార్టీల సంక్షేమానికి వినియోగిస్తామన్నారు. -
కార్యకర్తల్ని బాధ్యులను చేస్తే ఎలా?
విజయవాడ: పార్టీ నాయకత్వం చేసిన తప్పులకు కార్యకర్తలను ఎలా బాధ్యుల్ని చేస్తారని సీపీఐ జిల్లాల నేతలు ధ్వజమెత్తారు. ఇక్కడ జరుగుతున్న సీపీఐ ఏపీ 25వ రాష్ట్ర మహాసభల్లో గురువారం కార్యదర్శి నివేదికపై చర్చ కొనసాగింది. వివిధ ప్రజాసంఘాల, జిల్లాల ప్రతిని దులు చర్చలో పాల్గొంటూ.. పార్టీ నాయకత్వం ఏ కార్యక్రమమిస్తే దాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించడానికి కార్యకర్తలు ప్రయత్నించారేతప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేదన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో, ఎన్నికల ఎత్తుగడలు వేయడంలో తప్పంటూ జరిగితే అది నాయకత్వానిదే అవుతుందని తేల్చిచెప్పారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చారా? డబ్బులున్నోళ్లకు, విరాళాలు తెచ్చేవాళ్లకుతప్ప కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోతోందని కోస్తాంధ్ర జిల్లాల నేతలు వాపోయారు. చందాలు తేవడమే అర్హతైతే కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కు తేడా ఏముందని ప్రశ్నించారు. ఏ పనిచేసినా పార్టీకోసమే: నారాయణ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడాలన్నది తన నిర్ణయం కాదని, పార్టీ నాయకత్వ సమష్టి నిర్ణయాన్నే అమలు చేశానని కేంద్రకమిటీ సభ్యుడు కె.నారాయణ సుదీర్ఘవివరణ ఇచ్చుకున్నారు. ఆంధ్రాకు అన్యాయం చేసి తెలంగాణకు న్యాయం చేయాలని తనకు ఎందుకుంటుందన్నారు. క్లిష్ట సమయంలో తాను నాయకత్వ స్థానంలో ఉన్నానని, టీవీ చానల్ కోసం అప్పులు చేసినా, పత్రికకోసం భవనాన్ని నిర్మించినా పార్టీకోసమే చేశాను తప్ప వ్యక్తిగతానికి కాదని, ఈ విషయాన్ని విస్మరించి తనపై విమర్శలు గుప్పించడంలో హేతుబద్ధత లేదన్నారు. -
విద్యార్థి ఫెయిలైతే.. బాధ్యత హెచ్‌ఎందే!
‘పది’ కసరత్తులో భాగంగా డీఈవో స్పష్టీకరణ డివిజన్ల వారీగా సమావేశాల నిర్వహణ గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో వెనుకబడ్డ జిల్లా దిద్దుబాటు చర్యలో జిల్లా విద్యాశాఖ వ్యక్తిత్వ వికాస నిపుణులతో సదస్సులు పరీక్షలకు హాజరుకానున్న 54 వేల మంది విద్యార్థులు వచ్చే ఏడాది మార్చి 26 నుంచి పరీక్షలు ‘పదోతరగతి విద్యార్థి పరీక్షల్లో ఫెయిలైతే దానికి ప్రధానోపాధ్యాయులే బాధ్యులు..’ ఇవీ గుడివాడలో బుధవారం జరిగిన డివిజన్ స్థాయి ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.నాగేశ్వరరావు చెప్పిన మాటలు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలపై దృష్టిపెట్టిన జిల్లా విద్యాశాఖ ఇందుకోసం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఆయన విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ : జిల్లా విద్యాశాఖ పదోతరగతి పరీక్షల కసరత్తు మొదలైంది. ఇటు విద్యార్థులతో పాటు అటు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఈ పరీక్షలు సవాలుగా మారాయి. ఈ క్రమంలో ప్రణాళికాబద్ధంగా విద్యాబోధనతో పాటు ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ప్రత్యేక సదస్సులు, పలు కార్యక్రమాలతో జిల్లా విద్యాశాఖ షెడ్యూల్ సిద్ధం చేసి కసరత్తు మొదలుపెట్టింది. ఫలితాల్లో వెనుకబాటు... చదువుల రాజధానిగా పేరొందిన జిల్లా పదోతరగతి పరీక్షా ఫలితాల్లో వెనుకబడింది. వరుసగా గత మూడేళ్లూ రాష్ట్రంలో మొదటి మూడు స్థానాలకు దూరంగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరగడంతో జిల్లాలోని విజయవాడ నగరం రాష్ట్ర రాజధాని అయింది. దీంతో పదోతరగతి పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదటి మూడు స్థానాల్లో నిలవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. విద్యాశాఖ కమిషనర్ కూడా పదో తరగతి పరీక్షలపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం విద్యాశాఖ మొత్తం పదోతరగతి పైనే దృష్టి నిలిపింది. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు 54 వేల మంది ఉన్నారు. వీరు కాకుండా ప్రైవేట్‌గా పరీక్షలు రాసే విద్యార్థులు ఆరువేల మంది ఉన్నారు. 54 వేల మంది విద్యార్థుల్లో 20 వేల మంది ప్రెవేట్ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 850 పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది పదోతరగతి పరీక్షల్లో జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐదేళ్ల కిత్రం వరకు జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖ నాలుగు నెలలకు ముందే కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల ఒకటి నుంచి ప్రత్యేక తరగతులు... పదోతరగతి పరీక్షలకు మరో నాలుగు నెలల సమయం ఉన్న క్రమంలో విద్యాశాఖ ఈనెల ఒకటి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు 45 నిమిషాల పాటు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు పూర్తయిన సిలబస్‌పై రివిజన్తో పాటు సబ్జెక్ట్‌ల వారీగా పరీక్షలకు సిద్ధమయ్యేలా తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికిగాను రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో 25 పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. డివిజన్ల వారీగా సమావేశాలు... మరోవైపు టీచర్లను కూడా పరీక్షలకు సమాయత్తం చేసేందుకు జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డివిజన్ల వారీగా మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత టీచర్లతో కూడా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు మచిలీపట్నం, నూజివీడు, గుడివాడలో సమావేశాలు నిర్వహించారు. బుధవారం నందిగామలో మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి నూరుశాతం ఫలితాలు సాధించే దిశగా అందరూ సమష్టిగా కష్టపడాలని సూచించారు. మరో వారం వ్యవధిలో విజయవాడ డివిజన్లో సమావేశం నిర్వహించి ఆ తర్వాత టీచర్లతో సమావేశాలు, పదోతరగతి విద్యార్థులకు బోధించే టీచర్లకు ఒరియంటేషన్ తరగతులు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. మార్చి 26 నుంచి పరీక్షలు... వచ్చే ఏడాది మార్చి 26 నుంచి పదోతరగతి పరీక్షలు మొదలవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం షెడ్యూల్ ప్రకటించారు. 26న మొదలై ఏప్రిల్ 11 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ క్రమంలో జనవరిలో అర్థసంవత్సర పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయం మరికొంత పెంచే అవకాశం ఉంది. ఈ విద్యాసంవత్సంలో నూరు శాతం ఫలితాలు రాబట్టి జిల్లాను మొదటి మూడు స్థానాల్లో ఉంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని డీఈవో నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. -
కమిటీలు లేని కాంగ్రెస్
‘పొన్నాల’ సొంత జిల్లాలోనే దుస్థితి కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం పాతవారి పెత్తనంలో అసంతృప్తులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కార్యవర్గాలు లేని దుస్థితి నెలకొంది. ఆరు నెలలుగా కార్యవర్గం, బాధ్యులు లేకపోవడంతో పార్టీ గందరగోళంగా మారింది. జిల్లా అధ్యక్షుడు ఒక్కరే ఉన్నారు. జిల్లా కార్యవర్గం ఏర్పాటు కోసం పీసీసీకి పంపిన ప్రతిపాదనలకు మోక్షం దొరకడం లేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ ప్రతిపాదనలు కనీసం పరిశీలించిన దాఖలాలు కనిపించడం లేదు. పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలోనే కాంగ్రెస్ జిల్లా కమిటీ లేకపోవడంపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కమిటీలు లేకపోవడం పార్టీ ప్రతిష్టకు ఇబ్బం దిగా ఉందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. జిల్లా కమిటీ లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై స్పందించే బాధ్యతను నిర్వర్తించే విషయంలో ఎవరూ చొరవ తీసుకోవడం లేదని వాపోతున్నారు. కరెంటు కోతలు, రైతుల సమస్యలు, సామాజిక పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో సానుకూలత సంపాదించుకునేందు ఎవరు చొరవ తీసుకోవాలనే విషయంలో అయోమయం నెలకొందని చెబుతున్నారు. పీసీసీ స్థాయిలో రోజుకు ఒకరికి పదవులు ఖరారు చేస్తున్న పొన్నాల లక్ష్మయ్యకు జిల్లాలో మాత్రం పార్టీని పట్టించుకునే తీరిక ఉండడం లేదని జిల్లా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నిర్వేదం సాధారణ ఎన్నికల సమయంలో దొంతి మాధవరెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ ముందుగా మా ధవరెడ్డికి ఖరారు చేసి తర్వాత తొలగించారు. దీనికి నిరసనగా ఆయన పార్టీకి, పదవికి రాజీ నామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నర్సంపేట నుంచి పోటీ చేశారు. ఆయన రాజీనామాతో కాంగ్రెస్ జిల్లా కార్యవర్గం రద్దయింది. ఎన్నికల ముందు కీలక సమయంలో నాయిని రాజేందర్‌రెడ్డికి పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. ఎన్నికల సమయం కావడంతో అసంతృప్తులు వ్యక్తమవుతాయని భా వించి వెంటనే జిల్లా కమిటీలను కొత్తగా ఏర్పా టు చేయలేదు. పాత కార్యవర్గంలోని వారు అదే పదవుల్లో ఉన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చా రు. సాధారణ, జెడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్ నా యకులు పరాజయం పొందారు. దీనికి బాధ్యులను చేస్తూ పార్టీ నుంచి పలువురు ముఖ్యనాయకులను సస్పెండ్ చేశారు. ఇలా వరుస దెబ్బలతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బాగా నష్టపోయింది. ఇలాంటి దుస్థితిని నుంచి బటయపడేందుకు కాంగ్రెస్‌ను మళ్లీ పటిష్ట పరచాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీ కోసం కష్టపడే తత్వం ఉన్న నాయకులను గుర్తించి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంది. కాంగ్రెస్‌లో జిల్లా పార్టీ కార్యవర్గం ఏర్పాటు కోసం పీసీసీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. రెండు నెలల క్రితమే వరంగల్ జిల్లా పార్టీ కార్యవర్గం ఏర్పాటు కో సం పీసీసీకి ప్రతిపాదనలు వెళ్లాయి. పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా అయినా ఈ ప్రతిపాదనలకు ఆమోదం రావడం లేదు. తెలంగాణలో రెండు పెద్ద నగరంగా ఉన్న వరంగల్ నగరపాలక సంస్థ త్వరలో నిర్వహించాల్సి ఉంది. కాంగ్రెస్ నగర కమిటీ, జిల్లా కమిటీ సమన్వయంతో ఈ ఎన్నికలను ఎదుర్కొని బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ జిల్లా కమిటీ లేకపోవడం కాంగ్రెస్ శ్రేణులను నిర్వేదానికి గురి చేస్తోంది. పాతవారి పెత్తనం కాంగ్రెస్‌లో జిల్లా కమిటీ లేకపోవడంతో సీనియర్ నేతలుగా చెప్పుకునేవారే అంతా తామనే విధంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజల్లో వ్యతిరేకతతో ఓటమిపాలైన నేతలో ఇప్పుడు మేము అంటూ వ్యవహరిస్తుండడం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడడంలేదు. ‘అధికారంలో ఉన్నన్ని రోజులు కార్యకర్తలను పట్టించుకోని వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజలు తిరస్కరించిన వీరు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. ఇది మా పార్టీకి లాభం కంటే నష్టమే చేస్తోంది. ఇప్పుడైనా కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది’ అని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయడుతున్నారు. -
పెళ్లయ్యాక ప్రేమలో పడ్డాం...
‘‘పెళ్లయ్యాకే నేను ప్రేమలో పడ్డా’’ అంటున్నారు నటుడు అలీ. ఆయనే కాదు, ఆయన భార్య కూడా అదే మాట చెబుతున్నారు. జుబేదా బేగంతో ఆయన పెళ్లయి ఇప్పటికి ఇరవయ్యేళ్లు. ఇన్నేళ్ల సంసార జీవితంలో చిన్ని చిన్ని అలకలు, చిరు కోపాలు సర్వసాధారణమంటున్నారు జుబేదా. అవి ఉంటేనే మజా అని అలీ చెప్పారు. మొత్తానికి ‘మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటున్నారు ఈ ఇద్దరూ. ‘‘మేమిద్దరం.. మాకు ముగ్గురు’’ అంటూ, తమ దాంపత్య జీవితపు ముచ్చట్లను ఈ భార్యాభర్తలు ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేకంగా పంచుకున్నారు. పెళ్లి రోజే ఆమెను చూశా! అమ్మా నాన్నలు చూసిన అమ్మాయినే మనువాడాలన్నది అలీ ఆశయం. తమ మాట కాదనడనే నమ్మకంతోనే అలీ అమ్మా, నాన్న తమకు నచ్చిన ఓ అమ్మాయిని కోడలిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ఆ పిల్ల గురించి కొడుక్కి చెప్పారు. ‘‘అప్పట్లో నేను మద్రాసులో బిజీ ఆర్టిస్ట్‌ని. సినిమా తారలుగా మమ్మల్ని ఇష్టపడేవాళ్లు, పెళ్లాడతామనే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ నేను అమ్మా నాన్న చూసిన అమ్మాయినే పెళ్లాడాలనుకున్నా. అలాగే ఒక అమ్మాయిని వాళ్లు చూశారు. ఆమే జుబేదా బేగం. ‘ఈ అమ్మాయి చాలా బాగుంది. నాకూ, నాన్నకు నచ్చింది’ అని ఫోన్లో చెప్పింది అమ్మ. నేను అమ్మాయిని చూడకుండానే, ‘ఓకే’ అన్నా. పెళ్లి నాడే నా భార్యను చూశాను’’ అని భార్య కళ్లల్లోకి కొంటెగా చూస్తూ అలీ ఆ సంగతులు చెప్పుకొచ్చారు. అలీతో పెళ్ళికి కారణం ఆయనే! పెళ్లి నాటి విశేషాలను జుబేదా గుర్తు చేసుకుంటూ, ‘‘నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. ఎందుకంటే మా పెదనాన్న ఇర్షాద్గారు అప్పట్లో పెద్ద పెద్ద సినిమాలకు కాస్ట్యూమర్‌గా పని చేసేవారు. షూటింగ్‌లు చూడడం కోసం ఆయనతో పాటు అప్పుడప్పుడూ నేను వెళ్లేదాన్ని. అక్కడ ఏ ఆర్టిస్ట్ కనిపించినా ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడంతో పాటు, ఫొటోలు కూడా దిగేదాన్ని. కానీ, ఓ సినిమా ఆర్టిస్ట్‌తో పెళ్లవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఈ సంబంధం రావడానికి కారణం కూడా మా పెదనాన్నగారే. ‘నేనా కుర్రాణ్ణి చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. చాలా మంచోడు’ అని ఆయనే మా అమ్మా నాన్నలతో చెప్పారు. ఆ విధంగా అలీ నా జీవితంలోకొచ్చారు. లెజెండ్ లాంటి ఆర్టిస్ట్ నాకు భర్తగా దొరికేలా చేసిన మా పెదనాన్నగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను’’ అన్నారు. మా పెళ్లైన కొత్తలోనే ఆవిడ ఆ మాట చెప్పింది! పెళ్లయ్యే నాటికే అలీ ఫుల్ బిజీ. ఎంత బిజీ అంటే కొత్తగా పెళ్లయ్యిందని మర్చిపోయేంత! ఇంటిని పట్టించుకునే తీరిక కూడా ఉండేది కాదు. భార్య సహకారం ఉండబట్టే, వృత్తిపై వంద శాతం దృష్టి పెట్టగలిగానంటారు అలీ. ‘‘జుబేదా అంటే నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ. మా పెళ్లయిన కొత్తలో ‘ఇంటి బాధ్యతను నేను పూర్తిగా నిర్వర్తిస్తా. మీ పని మీరు హాయిగా చేసుకోండి’ అని మా ఆవిడ చెప్పింది. ఆ రోజు నుంచీ ఈ రోజు వరకూ ఆమె ఉదయం 5 గంటలకు లేచి, ఎవరికి ఏం కావాలో స్వయంగా చూసుకుంటుంది. నా వరకూ నేను షూటింగ్ ఉంటే ఆ పని చూసుకుంటాను. లేదంటే... ఉదయం ఎనిమిది గంటల వరకు నిద్రపోతాను. ఇంటి పనులేవీ పట్టించుకోను. అంటే... ఆమె ఎంత బాగా చూసుకుంటోందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు అలీ. ఆ రోజు నుంచే అలీతో ప్రేమలో పడ్డా! అప్పటివరకూ సామాన్య జీవితం గడిపిన జుబేదా సెలబ్రిటీ భార్యగా మారిన తర్వాత కొత్త జీవితం చూడటం మొదలుపెట్టారు. పెళ్లయిన తర్వాతే విమానం ఎక్కానని ఆమె చెప్పారు. ‘‘పెళ్లయిన మొదటి రోజే మావారితో నేను ప్రేమలో పడ్డాను. ఎలా అంటే... నాకు చిన్నప్పట్నుంచీ విమానం అంటే ఇష్టం. విమానం వెళుతుంటే చూడటం తప్ప, ఎక్కే అవకాశం ఎప్పుడూ రాలేదు. మా పెళ్లయిన మరుసటి రోజే విమానం ఎక్కే అవకాశం దక్కింది. అప్పుడు కె. రాఘవేంద్రరావుగారి ‘ముద్దుల ప్రియుడు’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రాఘవేంద్రరావుగారు మా ఇద్దరికీ ఫ్లైట్ టికెట్లు పంపి, మమ్మల్ని హైదరాబాద్ పిలిపించుకున్నారు. ‘ముద్దుల ప్రియుడు’ షూటింగ్ లొకేషన్లో ఆర్టిస్టులందరి మధ్యలో మాతో కేక్ కట్ చేయించారు. మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించారు. నాకెప్పటికీ ఆ రోజు అలా గుర్తుండిపోతుంది’’ అన్నారు జుబేదా. ఆమెలో నాకు నచ్చిన లక్షణం అది! కొంతమంది అమ్మాయిలు పెళ్లయిన తర్వాత అత్తింటిని కూడా పుట్టింటిలా భావిస్తారు. జుబేదా అలాంటి అమ్మాయే అంటారు అలీ. ‘‘నాకు నలుగురు అక్కలు, ఒక తమ్ముడు. అందర్నీ ప్రేమగా చూసుకుంటుంది జుబేదా. ఎవరెవరికి ఏమేం కావాలో తెలుసుకుంటుంది. ఒక్కోసారి వాళ్ల కోసం తనే ఆలోచిస్తుంది. ఆమెలో నాకు బాగా నచ్చే లక్షణం అది’’ అని అలీ అన్నారు. ఆయనలో నచ్చిన లక్షణం అది! వెండితెరపై కామెడీ పండిస్తూ, అందర్నీ నవ్వించే అలీ విడిగా కూడా అలానే ఉంటారట. అలాగే, ఒక విషయాన్ని సరిగ్గా అంచనా వేసే విషయంలో కూడా ఆయన దిట్ట అంటారు జుబేదా. ‘‘ఎలాంటి పరిస్థితులనైనా అలీ కరెక్ట్‌గా జడ్జ్ చేస్తారు. ఎంత కరెక్ట్ అంటే కొన్నేళ్ల తర్వాత కూడా, ‘ఓ... అప్పుడు అలీ చేసింది అందుకా!’ అని అనిపించేంత. ఎలాంటి పరిస్థితిలోనూ టెన్షన్ పడరు. ఎవర్నీ తొందరపడి ఒక్క మాట అనరు. ఆయనలో నచ్చిన లక్షణం అది. చిన్నప్పటి నుంచి అలీ ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించారు. తను పడ్డ కష్టాలు పిల్లలకు రాకూడదని నిరంతరం ఆయన శ్రమిస్తూనే ఉంటారు. వాళ్లను దగ్గర కూర్చోబెట్టుకుని మంచీ చెడు చెబుతారు. మా పిల్లలకు ఎండ విలువ, కష్టం విలువ తెలుసంటే దానికి కారణం అలీ. పిల్లలకేం కావాలో అది ఇస్తారు కానీ, అతి గారాబం చేయరు. ఆయనలో ఇంకో మంచి గుణం ఏంటంటే... పెళ్లయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఒక పెద్ద ఆర్టిస్ట్ అన్నట్టు ఎక్కడా ప్రవర్తించలేదు. ఉదయం లేచి ఆఫీసుకు వెళ్లినట్టు వెళతారు. అలానే వచ్చేస్తారు. ఎవరన్నా పక్కింటి వాళ్లు ఈ రోజు మీ ఆయన ఏ షూటింగ్‌కు వెళ్లారు అన్నప్పుడు మాత్రమే, ఈయన ఆర్టిస్ట్ కదా అని గుర్తొస్తుంది. అలాగే ఆహారపుటలవాట్లు కూడా. ముస్లిమ్ కాబట్టి ఆయనెప్పుడూ నాన్-వెజ్ తింటారనుకుంటే పొరపాటే. ఆయన రోజూ తీసుకెళ్లే లంచ్‌లో నాన్-వెజ్ ఉండదు. వారానికి ఒకసారి మాత్రమే తింటారు’’ అని వివరించారు. చేసే పనికి ఆమె అడ్డుపడడం ఇష్టముండదు! ఎదుటి వ్యక్తిని ఎంత ప్రేమించినా, వాళ్లలో నచ్చని విషయాలు కొన్ని ఉంటాయి. మరి, ఈ అనురాగ దాంపత్యంలోనూ అలాంటివి ఉన్నాయా? భార్యలో తనకు నచ్చని విషయం గురించి అలీ చెబుతూ - ‘‘నేను చేసే పనికి అడ్డుపడి, ‘ఇది వద్దు, అలా చెయ్యాలి..’ అంటే నాకిష్టం ఉండదు. దాని గురించి వివరంగా చెప్పి, ‘ఇది మంచి, ఇది చెడు’ అంటే అప్పుడు వింటాను. నాకు సంబంధించిన ఏ పనిలోనైనా వేలు పెట్టడం నాకిష్టం ఉండదు. అది మా ఆవిడకు తెలుసు’’ అన్నారు. ఆయనలో నాకు నచ్చనివి అవే! భర్తలో తనకు నచ్చని విషయాలూ కొన్ని ఉన్నాయని జుబేదా చెబుతూ - ‘‘అలీ ఎవరినైనా వెంటనే నమ్మేస్తారు. వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే చాలు కరిగిపోతారు. వాళ్లు వంద రూపాయలు అడిగితే ఈయన నాలుగు వందలిస్తారు. నాకు అది నచ్చదు. ఎందుకంటే... వాళ్లు చెబుతుంది నిజమో కాదో, వాళ్లు అడిగే డబ్బు మంచికో, కాదో కనుక్కొని సహాయం చేస్తే బావుంటుంది కదా అంటాను. నా మాట వినరు. ఆయన నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో లాంటి కారెక్టర్స్ నచ్చవు. అలాగే, ఆయనకు ఎంత కష్టం వచ్చినా తనలో తానే బాధపడతారు తప్ప, ఇంకొకరికి తెలియనివ్వరు.. అదే నాకు నచ్చదు. అమ్మ వైపు మాట్లాడను! అలాగని, మా ఆవిణ్ణి వెనకేసుకు రాను! ఎంత అన్యోన్యమైన కుటుంబం అయినా అత్తా కోడళ్ళ మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. మరి, అలీ ఇంట్లో పరిస్థితి ఏమిటి? ‘‘మా ఇంట్లోనూ వస్తాయి. కాకపోతే, అలాంటివి వచ్చినప్పుడు నేను ఏ ఒక్కరి వైపూ వకాల్తా తీసుకొని మాట్లాడను. ఎందుకంటే అమ్మ వైపు మాట్లాడితే మా ఆవిడ బాధపడొచ్చు. అదే మా ఆవిడను వెనకేసుకొస్తే... చిన్నప్పట్నుంచీ ఎన్నో కష్టాలకోర్చి పెద్ద చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన పెళ్లాం వైపు మాట్లాడుతున్నాడని అమ్మ అనుకోవడం సహజం. అందుకని నేనెవ్వరి వైపూ ఎప్పుడూ మాట్లాడను. రెండ్రోజుల తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. అత్తాకోడళ్ళు తమకు తామే జోకులేసుకుంటూ మామూలు అయిపోతారు’’ అని వివరించారు అలీ. మాకు చదువు విలువ తెలుసు! చిన్నప్పుడే సినిమాల్లోకి రావడంవల్ల అలీకి పెద్దగా చదువుకునే వీలు చిక్కలేదు. జుబేదా కూడా పెద్దగా చదువుకోలేదు. అందుకే, తమ బిడ్డలను బాగా చదివించాలని పెళ్లయిన తొలినాళ్లల్లోనే నిర్ణయించుకున్నారు. దీని గురించి అలీ చెబుతూ -‘‘చిన్నప్పుడే ఆర్టిస్టుగా సెటిలయ్యాను. అలాగే, మా ఆర్థిక పరిస్థితి వల్ల పెద్దగా చదువుకోలేదు. కానీ జీవితాన్ని చదివాను. మాకు చదువు విలువ తెలుసు కాబట్టి పిల్లలను బాగా చదివించాలనుకుంటున్నాను. మా పెద్దమ్మాయి ఫాతిమాకు ఇప్పుడు 15 ఏళ్లు నిండాయి. కానీ మా అబ్బాయికి 5 ఏళ్లు. చిన్న పాపకు 3 ఏళ్లు. పిల్లల వయస్సులో ఇంత తేడా ఎందుకంటే... కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఆ గ్యాప్ కావాలని డాక్టర్ చెప్పారు’’ అన్నారు. తాను పదో తరగతి వరకే చదివానని, ఆ తర్వాత పెళ్లి కావడంతో ఇక చదువు గురించి ఆలోచించలేదనీ జుబేదా చెప్పారు. అల్లా దయ వల్ల అందరం హ్యాపీ... అలీకి దైవభక్తి మెండు. ‘‘ఒక ముస్లింగా రంజాన్ మాసంలో రోజుకి అయిదు సార్లు ఖురాన్ చదువుతాను. జుబేదా కూడా ఖురాన్ చదవడం పూర్తి చేసింది. మా పెదపాప కూడా కోర్స్ పూర్తి చేస్తోంది. అందరం అల్లాను నమ్ముతాం. వేరే రోజుల్లో ఎలా ఉన్నా, తప్పనిసరిగా శుక్రవారం రోజు మాత్రం షూటింగ్ గ్యాప్లోనైనా సరే అయిదుసార్లు నమాజ్ చేస్తాను. అల్లా దయవల్ల మేం హ్యాపీగా ఉన్నాం. అందరూ హ్యాపీగా ఉండాలి’’ అన్నారు అలీ. అలీ లాంటి భర్త దొరికితే ఆనందమే! ఏ అమ్మాయికైనా మంచి భర్త దొరికితే అంత కన్నా ఆనందం మరోటి ఉండదని జుబేదా చెబుతూ- ‘‘నేను మాత్రం అల్లా సాక్షిగా చెబుతున్నాను... ప్రతి ఆడపిల్లకూ అలీ లాంటి భర్త దొరకాలి. అప్పుడు ఏ ఆడపిల్ల అయినా ఆనందంగా ఉంటుంది’’ అన్నారు. - సంభాషణ, ఫొటోలు: శివ మల్లాల -
వేదిక మారింది
ఫాతిమా హైస్కూల్లో రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ 22 నుంచి 24వ తేదీ వరకు కార్యక్రమం నేడు 22 కమిటీల సభ్యులతో సమావేశం డీఈఓ విజయకుమార్ విద్యారణ్యపురి : వర్ధన్నపేట మండలం పున్నేలులోని ఏకశిల హైస్కూల్లో నిర్వహించాలనుకున్న తెలంగాణ రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ కార్యక్రమం వేదిక మారింది. కాజీపేటలోని ఫాతిమా బాలికల హైస్కూల్లో రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శనను నిర్వహించనున్నట్టు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ వెల్లడించారు. పలు కారణాలతో వేదికను మార్చినట్టు ఆయన తెలిపారు. 22,23,24 తేదీల్లో ఫాతిమా హైస్కూల్లో నిర్వహించనున్న ‘ఇన్స్పైర్’ కోసం ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. ఇన్స్పైర్ నిర్వహణ కోసం 22 కమిటీలను నియమించామని, అయితే నిర్వహణ వేదిక మారడంతో తక్కువ సమయంలోనే అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున శుక్రవారం 19న ఉదయం పది గంటలకు ఫాతిమా గర్ల్స్ హైస్కూల్లో కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించనున్నామన్నారు. బాధ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు. ఏర్పాట్లపై డీఈఓ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మొత్తం వెయ్యి సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నట్టు తెలిపారు. పది జిల్లాల విద్యార్థులు తమ గైడ్ టీచర్లతో కలిసి ఇక్కడికి రానున్నట్టు చెప్పారు. వీరంతా 21వ తేదీనే వచ్చి తమ పేర్లతోపాటు ఎగ్జిబిట్లకు సంబంధించిన అంశాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోనూ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే బిషప్ బెరట్టా, సెయింట్ గేబ్రియల్ స్కూళ్లను కూడా ఉపయోగించుకుంటామన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రదర్శించిన ఎగ్జిబిట్లలో ఐదుశాతం ఎగ్జిబిట్లను త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపికచేస్తామన్నారు. -
నిగ్గు తేల్చే పరీక్ష
సందేశం హిందూ మతం ఔన్నత్యాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడానికి స్వామి వివేకానంద తొలిసారిగా విదేశీయానానికి బయలుదేరినప్పటి సంగతి ఇది. చేపట్టిన ఆ బృహత్ కార్యానికి స్వామి వివేకానంద అన్ని విధాలా సరిపోయినవాడా, కాదా అన్నది తెలుసుకోవాలని ఆయన తల్లి భువనేశ్వరీ దేవి భావించింది. ఆ సంగతి తెలుసుకొనేందుకు ఆయనను రాత్రి విందుకు పిలిచింది. గుండెలోని ప్రేమను రంగరించి మరీ తల్లి చేసిన వంటకాలను స్వామీజీ తృప్తిగా తిన్నారు. భోజనం పూర్తి అయిన తరువాత ఓ గిన్నె నిండా పండ్లు పెట్టి, వాటిని కోసుకొని తినేందుకు ఓ చాకు ఇచ్చిందా తల్లి. వివేకానంద ఓ పండును కోసుకొని, తినసాగారు. అప్పుడు ఆమె, ‘‘నాయనా... నాకు కొద్దిగా పని ఉంది. ఆ కత్తి ఇస్తావా?’’ అని అడిగింది. వివేకానంద వెంటనే ఆ చాకును తల్లికి ఇచ్చారు. వెంటనే ఆమె మరోమాట లేకుండా, ‘‘నాయనా... నువ్వు నా పరీక్షలో నెగ్గావు. దిగ్విజయంగా విదేశీయాత్ర జరుపుకొని రా... ఇవే నా ఆశీస్సులు’’ అంది. దాంతో వివేకానంద ఆశ్చర్యంతో ‘‘అమ్మా.. నన్నెలా పరీక్షించావు? నాకు అర్థం కాలేదు’’ అన్నారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది... ‘‘నాయనా... కత్తి ఇవ్వమని అడిగినప్పుడు నువ్వు ఆ కత్తి మొనను పుచ్చుకొని, చెక్క పిడి ఉన్న వైపును నాకు అందించావు. అలా కత్తిని పట్టుకొనేటప్పుడు నాకు హాని కలగకుండా, దెబ్బ తగలకుండా ఉండేలా జాగ్రత్తపడ్డావు. అలా నా సంరక్షణ బాధ్యత తీసుకున్నావు. ఎవరైతే తమ స్వార్థం గురించి ఆలోచించుకోకుండా, ఇలా ఇతరుల సంక్షేమం గురించి తపిస్తారో వారే ప్రపంచానికి బోధలు చేయడానికి అర్హులు. ఆ హక్కు వారికే ఉంటుంది. అదే నేను నీకు పెట్టిన పరీక్ష. నువ్వు నా పరీక్షలో నెగ్గావు. నీకు నా ఆశీస్సులు. దిగ్విజయోస్తు.’’ స్వార్థం మానుకొని, పొరుగువారి సంక్షేమానికి తోడ్పడాలన్న ఈ కీలకమైన సందేశాన్ని ఆ తరువాత స్వామి వివేకానంద తన జీవితకాలంలో కలిసిన లక్షల మంది హృదయాల్లో నాటుకొనేలా చేశారు. ఓ మామూలు మనిషికీ, అసాధారణ వ్యక్తికీ లక్షణాల్లో ఉండే ప్రధానమైన తేడా ఈ సంక్షేమ భావనే. నిత్యజీవితంలో కూడా ఇతరుల ఆనందం గురించి ఆలోచించేవాడే అసలు సిసలు గొప్పవాడు. - రెంటాల జయదేవ -
దైవం ఇచ్చిన బహుమానం
సువార్త బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. - సామెతలు 22:6 ఈ ప్రపంచంలో కల్మషం లేనిది ఏదైనా ఉంది అంటే... అది పసివాళ్ల మనసే అని చెప్పాలి. కానీ ఆ నిష్కల్మషత్వం ఎప్పటి వరకు ఉంటుంది! ఈ లోకం గురించి తెలుసుకునే వరకూ ఉంటుంది. లోకాశలకు లోబడే వయసు రానంతవరకే ఉంటుంది. ఆ తర్వాత వారి బాట వేరవుతుంది. దేవుడి నుంచి దూరమవుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వారిలో మంచి అనేది చిన్నతనంలోనే పెరగాలి. అలా పెరిగేలా తల్లిదండ్రులు చూడాలి. అందుకే పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులకు ఎన్నో విషయాలు చెప్పాడు ప్రభువు. వారిని సరైన దారిలో పెంచాల్సిన బాధ్యత మీదే అని పదే పదే హెచ్చరించాడు. పైన చెప్పుకున్న వాక్యమే అందుకు నిదర్శనం. అంతేకాక... ‘‘తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, ప్రభువు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి’’ అన్నాడు ప్రభువు ఎఫెసీ 6:4లో. ఈ ఒక్క మాట చాలు పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోవడానికి. కోపం మనిషికి శత్రువు. అది మనిషిని విచక్షణా రహితుణ్ని చేస్తుంది. తప్పులు చేయిస్తుంది. అందుకే కోపానికి దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉండటం అన్నది చిన్ననాటి నుంచే జరగాలి. కోపమనే విత్తును పిల్లల మనసుల్లో నాటకుండా ఉండాలి. దేవుడి బోధలను, ప్రవచనాలు వివరించి... వాటిని అనుసరించి నడచుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలి. నిజానికి పిల్లలు ఎలా ఉండాలి అన్నదానికి అత్యంత గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తే. తన తండ్రియైన యెహోవా దేవుని ఆజ్ఞ మేరకు క్రీస్తు ఈ లోకంలో మనిషిగా జన్మించాడు. తన తండ్రి రాజ్యాన్ని ఈ నేలమీద స్థాపించాడు. తన తండ్రి ఆదేశించిన విధంగా శిలువ మరణం పొందాడు. ఓ గొప్ప కొడుక్కి అసలు సిసలు ఉదాహరణ క్రీస్తు. మరి మనకొద్దా అలాంటి గొప్ప బిడ్డలు! గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం (కీర్తనలు 127:3). ఆయన ఇచ్చిన బహుమానాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని ఆయన ఘనతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి పిల్లల నడవడికను కనిపెట్టాలి. నడవాల్సిన తోవను చూపించాలి. చేరాల్సిన గమ్యాన్ని నిర్దేశించాలి. - జాయ్స్ మేయర్ -
పక్కా వ్యూహంతో లాభాల గోల్స్
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను నెల రోజుల పాటు అలరించిన ప్రపంచ కప్ తుది దశకి చేరుకుంది. ఈ నెల రోజుల్లోనూ దాదాపు ప్రతి జట్టూ పోటీలో నిల్చేందుకు.. కప్ దక్కించుకునేందుకు హోరాహోరీగా పోరాడినా కొన్ని సార్లు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రారంభంలోనే డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ నిష్ర్కమించగా.. వరల్డ్ కప్‌కి ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్‌పై సెమీ ఫైన ల్స్‌లో జర్మనీ ఘనంగా గెలిచింది. ఇలాంటి పరిణామాలకు ఆయా టీమ్స్ వ్యూహాలే కారణం. ఎందుకంటే.. మ్యాచ్ జరిగే గంటన్నర సమయంలో సత్తా చాటాలి. గోల్స్ చేయాలి. ప్రత్యర్థిపై గెలుపొందాలి. పటిష్టమైన వ్యూహాలతోనే ఇదంతా సాధ్యపడుతుంది. అలాగే పొదుపు.. పెట్టుబడులైనా పక్కా ప్రణాళిక ఉంటేనే, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ దూసుకెడితేనే లక్ష్యాలను (గోల్స్) సాధించగలిగేది. ఇందుకోసం ఫుట్‌బాల్ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అలాంటివే కొన్ని... ఫుట్‌బాల్ టీమ్‌లో ఉండే 11 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క పాత్ర పోషిస్తుంటారు. ప్రత్యర్థి గోల్పోస్ట్పైకి దూసుకెళ్లే బాధ్యత కొందరిదైతే.. వారికి సహాయం అందించే బాధ్యత మరికొందరిది. గోల్‌పోస్ట్‌ను కాపాడుకునే బాధ్యత గోల్కీపర్ది. విజయ సాధనలో వీరందరూ కీలకమే. ఇలా ప్రత్యేకమైన కూర్పుతో.. ప్రత్యర్థి జట్టుపై గెలుపు సాధించేందుకు ఒక్కొక్క టీమ్ ఒక్కొక్క వ్యూహం ప్రకారం ముందుకెడుతుంది. కొన్నిసార్లు దూకుడుగాను.. మరికొన్ని సార్లు రక్షణాత్మకంగాను ఆడుతూ పరిస్థితికి తగ్గట్లు వ్యూహం మార్చుకుంటూ ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక సాధన కూడా ఇలాంటిదే. ఫుట్‌బాల్ టీమ్‌లో రకరకాల ప్లేయర్స్ ఉన్నట్లుగానే మన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో కూర్పులో కూడా వైవిధ్యం ఉండాలి. పెట్టుబడులకు సంబంధించి ఫిక్సిడ్ డిపాజిట్లనీ, షేర్లనీ, రియల్ ఎస్టేట్ అనీ వివిధ రకాల సాధనాలు ఉన్నాయి. వీటిలో ఎఫ్డీల్లాంటివి రక్షణాత్మకమైనవి కాగా షేర్లులాంటివి కాస్త రిస్కీ సాధనాలు. లక్ష్యాలను సాధించడంలో ఇవన్నీ కూడా కీలకపాత్ర పోషిస్తాయి. దేనికదే ప్రత్యేకం. అలాగని పోర్ట్‌ఫోలియోను మరీ షేర్లతో నింపేసినా.. లేదా పూర్తిగా ఎఫ్‌డీలపైనే ఆధారపడినా ఆశించిన ఫలితాలను దక్కించుకోలేం. కాబట్టి..ఫుట్‌బాల్ టీమ్లాగానే పోర్ట్‌ఫోలియో కూర్పు ముఖ్యం. ఎంత మేర రిస్కు భరించగలం అన్నదాని ఆధారంగా ఏయే సాధనాల్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేయడం అన్నది ఆధారపడి ఉంటుంది. సమయం కీలకం.. ఫుట్‌బాల్ మ్యాచ్ గంటన్నరలో అయిపోతుంది. ఆ గంటన్నరలో ఫలితం తేలకపోతే.. మరికాస్త సమయం మాత్రమే ఉంటుంది. మొత్తం వరల్డ్ కప్ టోర్నమెంటు ఒక నెలరోజుల్లో ముగిసిపోతుంది. కానీ, ఈ టోర్నమెంటు కోసం టీమ్స్ ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తాయి. ఎన్నెన్నో వ్యూహాలు రూపొందించుకుంటాయి. పెట్టుబడుల తీరు కూడా ఇలాంటిదే. ఉన్న కాస్త సమయంలోనూ రిటైర్మెంట్ వంటి అవసరాలకు కావాల్సిన డబ్బు సమకూర్చుకోవాలంటే దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. ధరల పెరుగుదలను మించి సంపదను వృద్ధి చేసే పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలి. ఇందుకోసం పోర్ట్‌ఫోలియోలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటికి కొంతైనా చోటు కల్పించాలన్నది నిపుణుల సూచన. అయితే, ఎవరో చెప్పారని గుడ్డిగా పోకుండా వాటి గురించి క్షుణ్నంగా తెలుసుకునేందుకు కాస్తంత కసరత్తు చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. అనుకోని పరిస్థితులకు సంసిద్ధంగా.. ఎంత కసరత్తు చేసి, ఎంతగా సిద్ధం అయినా.. కొన్ని సార్లు ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటికి తగ ్గట్లుగా అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. కోస్టారికా జట్టుతో జరిగిన పోటీలో నెదర్లాండ్స్ కోచ్ చేసినదిదే. నిర్ణీత సమయంలో ఫలితం రాకపోవడంతో పెనాల్టీ షూటవుట్ తప్పనిసరైంది. ప్రత్యర్థి దాడుల నుంచి గోల్‌పోస్ట్‌ను రక్షించుకునే క్రమంలో ప్రధాన గోల్‌కీపర్‌ని పక్కనపెట్టి రెండో గోల్‌కీపర్ క్రూల్‌ను రంగంలోకి దింపాడు నెదర్లాండ్స్ కోచ్. ప్రధాన గోల్‌కీపర్ కన్నా క్రూల్ ఎత్తు రెండంగుళాలు ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం. ఇదే మ్యాచ్‌లో టర్నింగ్‌పాయింట్ అయింది. ఏకంగా 2 గోల్స్‌ని ఆపి నెదర్లాండ్స్‌ను సెమీఫైనల్స్‌కి చేర్చడంలో క్రూల్ కీలకపాత్ర పోషించాడు. పెట్టుబడుల తీరూ అప్పుడప్పుడు ఇలాగే ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన చేతిలో లేని అంశాల కారణంగా కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు. కాబట్టి, ఎప్పుడైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అప్పటిదాకా అమలు చేసిన ప్రణాళికను సవరించుకుని, కొత్త వ్యూహం అమలు చేయగలిగేలా సంసిద్ధంగా ఉండాలి. పోర్ట్‌ఫోలియోలు ఇలా.. ఫుట్‌బాల్ టీమ్‌లో స్ట్రైకర్స్, మిడ్ఫీల్డర్స్, డిఫెండర్స్ అని ప్లేయర్స్ ఉంటారు. టీమ్‌లు ఎటాకింగ్ అనీ డిఫెండింగ్ అనీ రకరకాల వ్యూహాలు పాటిస్తుంటాయి. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోకి దీన్ని అన్వయించుకుంటే.. యుక్తవయస్సులో వారికి ఒకలాగా .. మధ్యవయస్కులకు ఒకలాగా .. రిటైర్మెంట్కి దగ్గర్లో ఉన్న వారికి ఒకలాగా ఉంటుంది. వయస్సు, ఎంత రిస్కు తీసుకోగలం అన్న దాన్ని బట్టి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఆధారపడి ఉంటుంది. యుక్తవయస్సులో ఉన్న వారు కాస్తంత ఎక్కువ రిస్కు తీసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా నష్టం వచ్చినా, మళ్లీ తేరుకుని నిలదొక్కుకునేందుకు వారికి సమయం ఉంటుంది. కాబట్టి యుక్తవయస్సులో ఉన్నవారు.. ఎటాకింగ్ ధోరణిలో తమ పోర్ట్‌ఫోలియోలో సింహభాగం షేర్లు, ఫండ్స్ లాంటి వాటికి కేటాయించవచ్చు. వాటికి ఊతంగా ఉండేందుకు కొంత మొత్తాన్ని సురక్షితమైన సాధనాలకు కేటాయించవచ్చు. అదే మధ్యవయస్కులూ.. మరీ ఎక్కువ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడని వారూ పోర్ట్‌ఫోలియో సమతూకంగా ఉండేలా చూసుకోవచ్చు. షేర్లూ, బాండ్లూ, ప్రావిడెంట్ ఫండ్ లాంటివాటికి తలా కాస్త నిధులు కేటాయించవచ్చు. ఇక రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వారు, రిస్కును అస్సలు ఇష్టపడని వారు సురక్షితమైన సాధనాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకోవచ్చు. దీని వల్ల పెట్టుబడులకు పెద్దగా నష్టం ఉండదు. అలాగని భారీ రాబడులూ ఉండవు. -
టీఆర్ఎస్ నేతలు బాధ్యతగా మాట్లాడాలి: పవన్
సాక్షి, నెట్వర్క్: బంగారు తెలంగాణ సాధన కోసం ఎన్ని మాటలైనా పడతానని, టీఆర్ఎస్ నాయకులు బాధ్యతగా మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బాధ్యత గల నేతలు అధికారంలోకి రావాలనే ఎన్డీఏకు మద్దతు పలికానన్నారు. ఆయన ఆదివారం రంగారెడ్డి జిల్లా కందుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సరికొత్త తెలంగాణ కోసం పోరాడతానని, అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనన్నారు. సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు దేవేందర్‌గౌడ్, పెద్దిరెడ్డి, చేవెళ్ల టీడీపీ ఎంపీ అభ్యర్థి వీరేందర్‌గౌడ్, మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్లో ప్రచారం: పవన్ కల్యాణ్ ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్, సనత్‌నగర్, ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో పర్యటించి బీజేపీ-టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. నరేంద్ర మోడీని ఒక్క మాట అన్నా సహించనని టీఆర్ఎస్, కాంగ్రెస్‌లను హెచ్చరించారు. -
స్కాలర్షిప్ అర్హత పరీక్ష కేంద్రాలివే
కడప కల్చరల్, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ టెస్ట్-2014ను ఈనెల 20న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు జకాత్ ట్రస్టు జిల్లా బాధ్యు లు అబ్దుల్ వాహిద్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సంస్థ ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీలో ప్రవేశం కోరే విద్యార్థుల కోసం హైదరాబాదు జకాత్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కడప నగరంలో కో ఆపరేటివ్ కాలనీలోగల అల్ హబీబా మహిళా డిగ్రీ కళాశాల, రాయచోటి జెడ్పీ ఉర్దూ హైస్కూల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నామని తెలిపారు. ఎస్ఎస్సీ-2014కు పరీక్షలకు హాజరై నెల కు రూ. 8 వేలులోపు ఆదాయం గల మైనార్టీ అభ్యర్థులు ఈ సంస్థలో ప్రవే శం పొందడానికి అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఎస్ఎస్సీ హాల్ టిక్కెట్ రెండు జిరాక్స్ కాపీలతో ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రం వద్దకు హాజరు కా వాలని కోరారు. ఈ నెల 18లోగా తమ పేర్లను 97041 11082, 98665 56854 అనే నెంబర్లలో నమోదు చేసుకోవాలని కోరారు. -
విద్యార్థుల భద్రత బాధ్యత ప్రిన్సిపాల్‌దే
సాక్షి, ముంబై: స్కూల్ బస్సుల్లో పాఠశాలకు వచ్చే విద్యార్థుల భద్రత బాధ్యత ప్రిన్సిపాళ్లపైనే ఉంటుంది. ఈ మేరకు విద్యా శాఖ ఆదేశాలు జారీచేసింది. ఇటీవలికాలంలో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నగరంతో పాటు, శివారు ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా అనేకమంది గాయపడ్డారు. ఈ ప్రమాదాలను తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ.... కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విద్యార్థులు పాఠశాలకు రావడం మొదలుకుని తిరిగి ఇంటికి చేరుకునే వరకూ వారి బాధ్యతలు ప్రిన్సిపాళ్లపైనే ఉంటుంది. అందుకు ప్రధానోపాధ్యాయులు ఒప్పందం కుదుర్చుకున్న స్కూల్ బస్సులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులను ఆటో లేదా ట్యాక్సీలలో పాఠశాలకు తీసుకురావడాన్ని విద్యా శాఖ పూర్తిగా నిషేధించింది. ఇక మీదట విద్యార్థులు కాలినడకన రావాలి లేదా ప్రత్యామ్నాయ మార్గంగా బెస్ట్ బస్సు, లోకల్ ైరె ళ్లను వినియోగించుకోవాలి. చాలా చోట్ల పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన స్కూల్ బస్సులనే విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. వికలాంగులు, అనారోగ్యం తదితర కారణాలతో సొంత కార్లు, ఇతర వాహనాల్లో వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి మెడికల్ సర్టిఫికెట్ కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. విద్యాశాఖ జారీచేసిన ఆదేశాల్లో ముఖ్యాంశాలు పాఠశాలలే సొంతంగా బస్సు సేవలు ప్రారంభించుకోవాలి. లేదా కాంట్రాక్టు పద్దతి ఏర్పాటు చేసుకోవాలి. బస్ డ్రైవర్, సహయకులు ప్రత్యేకంగా యూనిఫారం, గుర్తింపు కార్డు జారీచేయాలి. బస్ డ్రైవర్ల కోసం సంవత్సరానికి రెండుసార్లు ప్రథమ చికిత్స బాక్స్‌ను, అగ్నిమాపక యంత్రాలను రీఫిలింగ్ చేసుకోవాలి. మంటలను ఆర్పే ఐదు కేజీల సిలిండర్‌ను అందుబాటులో ఉంచాలి. దృష్టి దోషం లేదని ఎంబీబీఎస్ డాక్టర్లు జారీచేసిన ధ్రువీకరణ పత్రం పాఠశాల యాజమాన్యానికి అందజేయాలి. సమయ పాలనను కచ్చితంగా పాటించాలి. బస్సులో ఎఫ్ఎం రేడియో లేదా టేప్ రికార్డర్ పెట్టరాదు. పొగతాగడం, మద్యపానం అలవాట్లు ఉండరాదు. బస్సు సిబ్బంది పిల్లలకు ఎలాంటి తినుబండారాలు, పానీయాలు ఇవ్వరాదు. బస్సు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నా లేదా ఏదైనా ప్రమాదానికి గురైన వెంటనే పాఠశాల యాజమాన్యానికి తెలియజేయాలి. 15 సంవత్సరాలకు దాటిన పాత బస్సులను విద్యార్థులను తరలించడానికి వాడరాదు. వేగాన్ని నియంత్రణ పరికరాలు తప్పకుండా బిగించాలి. బాలికల బస్సులో మహిళా సహాయకురాలిని కచ్చితంగా నియమించాలి. స్కూల్ బస్సుల నిర్వహణపై గతంలోనూ ఆర్టీఓ అనేక నియమ, నిబంధనలు విధించింది. అయితే నిబంధనలు ఆచరణలో అమలు చేయడం సాధ్యం కాదని బస్సుల యజమానులు ఆందోళనకు దిగారు. ఫలితంగా రవాణా శాఖ కొన్ని నియమాలను ఉపసంహరించుకుంది. -
బస్సు ఇబ్బందులపై కండక్టర్‌దే బాధ్యత!
సాక్షి, ముంబై: వర్షాకాలంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై విధి నిర్వహణలో ఉన్న కండక్టరే స్వయంగా డిపోలో ఫిర్యాదు చేయాలని బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రయాణికులకు బస్సులో ఎదురయ్యే లీకేజీ, మూసుకోని, తెరుచుకోని కిటికీలు తదితర ఇబ్బందుల నుంచి త్వరలో విముక్తి లభించనుంది. వర్షాకాలం వచ్చిందంటే అనేక బస్సుల్లో టాప్ నుంచి లీకేజీ సమస్యలు ఎదురవుతాయి. గత్యంతరం లేక ప్రయాణికులు తడుస్తూ అలాగే ప్రయాణించాల్సి వస్తోంది. కిటికీల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుంది. కిటికీలు బిగుసుకుపోవడంతో అవి సరిగా పనిచేయవు. వాటిని మూయాలన్నా, తెరవాలన్నా పెద్ద ప్రహసనమే. ఇలాంటి పరిస్థితులు దాదాపు అన్ని బస్సుల్లోనూ దర్శనమిస్తున్నాయి. బస్సు డిపోలోకి రాగానే వీటిపై సంబంధిత సిబ్బందికి ఫిర్యాదు చేయాలని వర్షాకాలం ప్రారంభంలోనే కండక్టర్లందరికీ బెస్ట్ పరిపాలన విభాగం ఆదేశించింది. కాని కండక్టర్లు దాన్ని పట్టించుకోవడం లేదు. డ్యూటీ పూర్తికాగానే కండక్టరు, డ్రైవర్ బస్సును డిపోలో నిలిపి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీన్ని సీరియస్‌గా పరిగణించిన బెస్ట్ అధికారులు ఇక నుంచి ఇలాంటి ఫిర్యాదులు తప్పకుండా చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందుకు కండక్టర్‌కు ఒక మార్కర్ కూడా ఇచ్చారు. లీకేజీ జరుగుతున్న చోట గుండ్రంగా మార్కింగ్ చేయాలని సూచించింది. పనిచేయని కిటికీలను గుర్తించి అక్కడ కూడా ఒక గుర్తు పెట్టాలని సూచించారు. బస్సు డిపోలోకి రాగానే సంబంధిత సిబ్బందికి ఫిర్యాదుచేస్తే వారు వెంటనే స్పందించి మరమ్మతులు చేస్తారు. అయితే బస్సుల తయారీలో ఎలాంటి లోపం లేదని బెస్ట్ అధికారి ఒకరు చెప్పారు. కాగా బస్సులు బెస్ట్ అధీనంలోకి వచ్చిన తర్వాత డిపోల్లో ప్లాజ్మా టీవీలు, సీసీ కెమెరాలు, స్పీకర్లు బిగించే పనులు జరుగుతాయి. అందుకు అవసరమైన వైరింగ్ పనులకు డ్రిల్లింగ్ చేయాల్సి వస్తుంది. దీంతో టాప్ లేదా బస్సు బాడీకి కొంతమేర హాని జరుగుతుంది. దీంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే వర్క్ షాపులో బస్సు బాడీ తయారుచేసే సమయంలోనే వీటిని అమర్చేలా చర్యలు తీసుకుంటే ఈ ఇబ్బందులు ఉండవని మరో అధికారి అభిప్రాయపడ్డారు.