స్కాలర్‌షిప్ అర్హత పరీక్ష కేంద్రాలివే | scholarship qualifiction examination centers | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్ అర్హత పరీక్ష కేంద్రాలివే

Published Tue, Apr 8 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM

scholarship qualifiction examination centers

కడప కల్చరల్, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీ టెస్ట్-2014ను ఈనెల 20న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు జకాత్ ట్రస్టు జిల్లా బాధ్యు లు అబ్దుల్ వాహిద్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సంస్థ ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీలో ప్రవేశం కోరే విద్యార్థుల కోసం హైదరాబాదు జకాత్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

 

కడప నగరంలో కో ఆపరేటివ్ కాలనీలోగల అల్ హబీబా మహిళా డిగ్రీ కళాశాల, రాయచోటి జెడ్పీ ఉర్దూ హైస్కూల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నామని తెలిపారు. ఎస్‌ఎస్‌సీ-2014కు పరీక్షలకు హాజరై నెల కు రూ. 8 వేలులోపు ఆదాయం గల మైనార్టీ అభ్యర్థులు ఈ సంస్థలో ప్రవే శం పొందడానికి అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ హాల్ టిక్కెట్ రెండు జిరాక్స్ కాపీలతో ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రం వద్దకు  హాజరు కా వాలని కోరారు. ఈ నెల 18లోగా  తమ పేర్లను 97041 11082, 98665 56854 అనే నెంబర్లలో నమోదు చేసుకోవాలని కోరారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement