Kadapa
-
మన నగరాల్లో కాలుష్యం తక్కువే
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం తక్కువగా ఉన్న 50 నగరాలను ఎంపిక చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఐదు ఉన్నాయి. అవి కడప–52 ఎంజీ (మిల్లీగ్రాములు/క్యూబిక్ మీటర్), అమరావతి 56 ఎంజీ, తిరుపతి 57 ఎంజీ, విజయవాడ 61 ఎంజీ, రాజమహేంద్రవరం 61 ఎంజీలుగా ఉన్నాయి. 2024 సంవత్సరానికి గాను సీఆర్ఈఏ (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్) సంస్థ అధ్యయనంలో ఈ విషయం తేలింది. అలాగే, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా కర్ణాటకలోని కొడగు జిల్లాలోని మడికేరి నగరం చోటు సంపాదించింది. ఇక్కడ వార్షిక సగటు కాలుష్యం కేవలం 32 ఎంజీ మాత్రమే. తమిళనాడులోని పాలలైపెరూర్, కర్ణాటకలోని కొప్పల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యంత క్లీనెస్ట్ జాబితాలో ఇంఫాల్, షిల్లాంగ్, అరియాలూర్, రామనగర, విజయపుర, రామనాథపురం ఉన్నాయి. ఇక అత్యంత కలుషిత నగరాల జాబితాలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వార్షిక సగటు 236 ఎంజీగా నమోదైంది. 226 ఎంజీతో నోయిడా, 211తో ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా 50 అత్యంత కలుషిత నగరాల్లో 15 నగరాలు రాజస్థాన్‌వే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, బిహార్‌లో ఏడు ఉన్నాయి. ఇందులో ఏపీలోని ఏ నగరం కూడా లేనప్పటికీ విశాఖలో మాత్రం 108 ఎంజీగా నమోదైంది. గత ఏడాది గాలి నాణ్యతా ప్రమాణాల లెక్క వేసినప్పుడు విశాఖపట్నంలో 30 రోజుల వ్యవధిలో ఇలా ఆరుసార్లు కనిపించింది. గత ఏడాది సెప్టెంబరులో విజయవాడలో కూడా ఎక్కువగానే నమోదైంది. కానీ, ఆ తర్వాత గాలి నాణ్యత ప్రమాణాల్లో కాస్త మెరుగుపడింది.నిధుల వినియోగంలో ఏపీ వెరీపూర్..ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా కాలుష్య కారకాలను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్సీఏపీ (నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం) కింద నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను వినియోగించుకోవడంలో ఏపీ చాలా వెనుకబడినట్లు సీఆర్ఈఏ అధ్యయనంలో వెల్లడైంది. కేటాయించిన నిధుల్లో 35 శాతం మాత్రమే వినియోగించారు. అదే మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు 90 శాతం నిధులను వినియోగించాయి. -
వైభవంగా కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
విద్యుత్ కాంతులతో కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం (ఫొటోలు)
-
కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న 'రాచరికం' సినిమా టీం సభ్యులు...
-
‘సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే.. ప్రభుత్వానికి నష్టం’
వైఎస్సార్ జిల్లా: కడప ఎమ్మెల్యే ామాధవిరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ీసీఎం రిలీఫ్ పండ్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యానించారు. కడపంలో పరిశుభ్రత లేక ప్రజల్లో కిడ్నీ, శ్వాసకోస వ్యాధుల ెపెరిగిపోతున్నాయని సంచలనవ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆస్పత్రి ఖర్చులకు రోగులు సీఎం రిలీఫ్ ఫండ్ఆశ్రయించక తప్పడం లేదన్నారు. అయితే ఇలా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం ావాటిల్లుతోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కడపలో వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర.. ఆకట్టుకున్న విద్యార్థుల విన్యాసాలు (ఫొటోలు)
-
శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి
-
కడపలో భూచోళ్లు!
కడప నగరంలో భూచోళ్లు పడ్డారు. భూ దాహంతో ‘సైకిల్ చక్రాలు’ కట్టుకుని మరీ ఊరంతా తిరుగుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నోరు తెరుస్తున్నారు. పట్టపగలే ప్రభుత్వ స్థలాలను చదును చేస్తూ కబ్జా చర్యలకు పదును పెడుతున్నారు. అధికారులకు మామూళ్ల మకిలీ అంటగట్టి.. ఆపై ఏంచక్కా నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలను హాంఫట్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి కడప: కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నేతలు భూ ఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలాలు కన్పిస్తే కబ్జాకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా కడప నగరంలో ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, ఆపై రెవెన్యూ డిపార్టుమెంటును మేనేజ్ చేయడంలో తల మునకలయ్యారు. ఇలా పక్కా స్కెచ్ తో కోట్లాది రూపాయల విలువజేసే స్థలాలను కొట్టేస్తున్నారు. తాజాగా కడప నగరంలోని ద్వారకానగర్‌లో రూ.12 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని చదును చేశారు. ఈ ప్రాంతంలో ఇది ప్రభుత్వ భూమి అని హె చ్చరిక బోర్డును సైతం కబ్జాదారులు లెక్కచేయకుండా చదును చేసి ఆక్రమించే ప్రయత్నాలు సాగిస్తున్నారు.కడప నగరం ద్వారకానగర్‌లో రైతు బజార్ సమీపంలో నాగరాజుపల్లె పొలం సర్వే నెంబరు 71/1లో 2.52 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో రైతు బజార్ ఏర్పాటు చేయగా మరో 40 సెంట్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉండిపోయింది. ఈ స్థలం బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్‌కు ఆనుకునే ఉంది. ఆన్లైన్లో రికార్డులల్లో అనుభవదారు పేరు ‘వాగు’అని ఇప్పటికీ వస్తోంది. కాగా ఆ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. జిల్లా టీడీపీ ముఖ్యనేత సన్నిహితులు స్వాహాకు ప్రణాళిక రచించారు. ప్రతిరోజు ముఖ్యనేత చుట్టు ఉండే తెలుగుతమ్ముళ్లు ఈకబ్జా వ్యవహారంలో క్రియాశీలక ప్రాత పోషించినట్లు ఆరోపణలున్నాయి.హెచ్చరిక బోర్డును లెక్కచేయని అక్రమార్కులురెవెన్యూ అధికారులు ఈ స్థలం ప్రభుత్వ భూమి...దీనిని ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇవేవి తెలుగుతమ్ముళ్లు లెక్కచేయలేదు. కాగా ఈ స్థలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. ఈవ్యవహారం వెలుగులోకి రావడంతో సదరు నేతలు తేలుకుట్టిన దొంగలా ఉండిపోయారు. రూ.12కోట్ల విలువజేసే స్థలాన్ని కొట్టేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించి ఇది తమదేనని చదును చేసేశారు. విషయం తెలుసుకున్న ద్వారకానగర్æకాలనీ డెవెలప్మెంట్ కమిటీ వారు రెవిన్యూ, కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. దాంతో వ్యవహారం బహిర్గతం కావడంతో అధికారులు సైతం కాస్తా అప్రమత్తమయ్యారు. కోట్లు విలువైన భూమి కాజేసేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు సైతం సృష్టించినట్లు సమాచారం. ఆమేరకు ఓ రెవెన్యూ అధికారితో సైతం సంప్రదించి సహాకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఓ నేతకు పీఏగా ఉన్న వ్యక్తి తలదూర్చడంతోనే సాధ్యమైందనే ఆరోపణలు లేకపోలేదు.ఇలాంటి చర్యలను ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం భూ కబ్జాలను అరికట్టేడంలో చేతులెత్తేస్తోందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కడప నగరంలో వార్డు సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు నిత్యం ఇక్కడే ఉంటారు. అలాంటి నగరంలోనే ప్రభుత్వ భూమిని పక్కాగా స్వాహా చేసేందుకు స్కెచ్ వేయడం గమనార్హం. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల మత్తు వీడి ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
కడపలో భోగి సందడి.. వేకువజామునే ఆట, పాటలతో చిందులు (ఫోటోలు)
-
టీడీపీ కార్యాలయానికి రూ.50 కోట్ల భూమి ధారాదత్తం
సాక్షి, అమరావతి: కడపలో రూ.50 కోట్ల విలువైన రెండెకరాల ఆర్ అండ్ బీ శాఖ భూమిని కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి కేటాయించుకుంది. ఈ భూమి వివాదం కోర్టులో ఉన్నా లెక్క చేయకుండా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు మీద పార్టీ కార్యాలయం కోసం ఇస్తూ మంగళవారం ఉత్తర్వులిచి్చంది. కడప మండలం అక్కయ్యపల్లె గ్రామంలోని సర్వే నెంబర్ 37/4లోని ఈ భూమిపై టీడీపీ 2014లోనే కన్నేసింది. మున్సిపల్ కార్పొరేషన్‌కి తెలియకుండా, స్థానికంగా ఉన్న అభ్యంతరాలు ఖాతరు చేయకుండా 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ భూమిని పార్టీ కార్యాలయానికి 33 సంవత్సరాల లీజుకి కేటాయించింది. అయితే, పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టలేదు. కొందరు టీడీపీ నాయకులు దాన్ని అన్యాక్రాంతం చేసే ఉద్దేశంతోనే నిర్మాణాలు చేపట్టలేదనే అనుమానాలున్నాయి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆ భూమిపై స్థానికంగా అభ్యంతరాలు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపు జరిగినట్లు తేలడంతో కేటాయింపు రద్దు చేసింది. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ భూమికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో కోర్టులో ఉన్న భూమిని మళ్లీ టీడీపీ కార్యాలయానికి కేటాయించింది. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే భర్త అయిన శ్రీనివాసరెడ్డి కోరిక మేరకు సీఎం చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా ఈ భూమిని పార్టీ కార్యాలయం కోసం కేటాయించారు. అధికారంలో ఉన్నప్పుడు పలు ప్రాంతాల్లో విలువైన భూములను చేజిక్కించుకుని పార్టీ కార్యాలయాలు నిరి్మంచడం టీడీపీకి అలవాటేనని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం కూడా నిబంధనలకు విరుద్ధంగా కేటాయించుకుని నిరి్మంచిందే. విశాఖపట్నం కార్యాలయం కూడా అక్రమంగా కేటాయించుకుని కట్టుకున్నదే. ఇప్పుడు ఏకంగా కోర్టు పరిధిలో ఉన్న భూమిని మంత్రివర్గం ఆమోదంతో పార్టీ కార్యాలయం కోసం రెండోసారి కేటాయించుకోవడం వివాదాస్పదంగా మారింది. -
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్
-
కడప ముఖ్యనేతలు, కార్పొరేటర్లతో వైఎస్ జగన్ భేటీ
-
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే... కడప కార్పొరేటర్లు, ముఖ్యనేతల సమావేశంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ
-
కడప కార్పొరేషన్ లో TDP ఎమ్మెల్యే మాధవి రెడ్డి దౌర్జన్యం
-
కుర్చీ కోసమే మాధవీరెడ్డి పంతం: మేయర్ సురేష్‌బాబు
సాక్షి,వైఎస్ఆర్జిల్లా:ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా,నియంతలా వ్యవహరిస్తున్నారని కడప మేయర్ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం(డిసెంబర్23) కడప మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే చేసిన గలాటాపై సురేష్‌బాబు సాక్షి టీవీతో మాట్లాడారు.‘తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే రెండు సార్లు సమావేశాన్ని అడ్డుకున్నారు.దౌర్జన్యానికి దిగి సమావేశ ఎజెండా పేపర్లను చించివేశారు. ఇలా చేస్తున్న ఆమెకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడుంది?మిగిలిన కార్పొరేషన్లలో మీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఎక్కడ కూర్చుంటున్నారు..?మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారని గౌరవిస్తే మా ఇంటిపైనే చెత్త వేయించింది.కార్పొరేటర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. వందలాది మంది కార్యకర్తలతో కార్పొరేషన్పైకి దండెత్తారు. ఇదెక్కడి సభ్యత?ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా..?ఎమ్మెల్యే,పిరాయింపు సభ్యులను సస్పెండ్ చేసినా బయటకు వెళ్ళలేదు.ఎజెండా పేపర్లను చింపి సభను అడ్డుకున్నారు.వాళ్ళని బయటకు పంపడంలో అధికారులు వైఫల్యం చెందారు.పార్టీలకు అతీతంగా మేము గౌరవం ఇచ్చినా ఆమె నిలబెట్టుకోలేదు.ప్రజాసమస్యలు చర్చించడానికి యుద్ధానికి వచ్చినట్లు వస్తారా?ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరును ఎవరూ హర్షించడం లేదు.ఫిరాయింపు సభ్యులు మా పార్టీ సభ్యులపై దాడికి దిగారు.ఇది ప్రజాస్వామ్యంలో సరైన చర్య అని ఎవరైనా అంటారా? మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఆమె తన హక్కులు ఏంటో ముందు తెలుసుకోవాలి.ఆమె ప్రజాసమస్యల కంటే తన పంతం ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.15 అర్థికసంఘం పనులు ఆమోదించి పంపాలి..కానీ ఆమె సమావేశం జరగనివ్వడం లేదు.బాధ్యతాయుతమైన ఒక ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరిస్తే ఎలా’అని సురేష్‌బాబు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. కార్పొరేషన్ సమావేశపు ఎజెండాను కడప కార్పొరేషన్ ఏకపక్షంగా ఆమోదించింది. ఎజెండా మొత్తాన్ని ముక్తకంఠంతో ఆమోదిస్తున్నట్లు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చేతులెత్తారు. ఇదే సమయంలో పలు అభివృద్ధి పనులకు కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. సస్పెండ్ చేసినా అజెండా ఆమోదాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రయత్నించారు. అయితే, మెజార్టీ సభ్యుల మద్దతుతో ఎజెండాలోని అంశాలకు ఆమోదం దక్కింది. ఇదీ చదవండి: కుర్చీ కోసం ఎమ్మెల్యే దౌర్జన్యం -
కుర్చీ కోసం కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి దౌర్జన్యం
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: కడపలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి మళ్లీ దౌర్జన్యానికి దిగారు. సోమవారం(డిసెంబర్23) జరుగుతున్న కడప మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు. మేయర్‌తో పాటు తనకూ కుర్చీ వేయాలని మళ్లీ హంగామా చేశారు. దీంతో ఎమ్మెల్యే,మేయర్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది.టీడీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే మాధవీరెడ్డి సమావేశ మందిరంలో గొడవకు దిగారు. ఇందుకు ప్రతిగా మేయర్‌కు మద్దతుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆయన సీటు ముందే బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ, టీడీపీ కార్పొరేటర్లకు మధ్య తోపులాట జరిగింది. దీంతో సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారంటూ మేయర్ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఏడుగురు కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశానికి సభ్యులు మినహా ఎవరికీ అనుమతి లేదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎమ్మెల్యే ఖాతరు చేయలేదు. డబ్బులిచ్చి మరీ మహిళలను నగరపాలక సంస్థ సమావేశానికి తీసుకువచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.గతంలోనూ నగరపాలక సంస్థ సమావేశంలో మాధవీరెడ్డి కుర్చీ కోసం హంగామా చేశారు.ప్రజా సమస్యలపై చర్చించండన్నా వినకుండా గొడవ చేశారు. దీంతో ప్రస్తుతం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సమావేశానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కార్యాలయం సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ గుమికూడవద్దని,ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇదీ చదవండి: గుంటూరులో టీడీపీ నేత దాష్టీకం -
YS అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ మూక దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి బృందంపై శుక్రవారం టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. వేముల తాశీల్డార్ కార్యాలయం వద్ద నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై 50 మంది టీడీపీ మూకలు విచక్షణా రహితంగా రాళ్ళు, కర్రలతో దాడి చేశాయి. దాడిలో సాక్షి రిపోర్టర్లు శ్రీనివాస్, రాజారెడ్డి, కెమెరామెన్ రాములకు గాయాలయ్యాయి. కెమెరా ధ్వంసమైంది. జర్నలిస్టులపై దాడి దుర్మార్గంపులివెందుల నియోజకవర్గం, వేముల మండల కేంద్రం లో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులు, వీడియో జర్నలిస్తుల పై దాడి చేయడం దుర్మార్గమని, దాడికి పాల్పడిన వారిపై హత్యా యత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ డైమండ్ చేశారు.కవరేజీకి వెళ్లిన సాక్షి టివి కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము , సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వారు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గం అన్నారు. అంతేకాక కెమెరాలను, సెల్ ఫోన్లను కూడా పగులగొట్టారన్నారు. అనంతరం జర్నలిస్టులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడిచేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, అలాగే వారిని సురక్షితంగా ఇంటికి పంపాలని పోలీసులను కోరారు.కూటమి ఆగడాలపై ఫిర్యాదుఇప్పటికే జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి కూటమి ఆగడాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా జరగకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. నీటి సంఘాల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గురువారం సాయంత్రం ఆయన ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ, డీఎస్పీ వెంకటేశ్వరరావును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నోడ్యూస్ సర్టిఫికెట్ వీఆర్ఓలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారన్నారు.పెద్దముడియం, మైలవరం, జమ్మలమడుగు మండలాలకు సంబంధించి వీఆర్ఓలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. కొంతమంది వీఆర్ఓలను సస్పెండ్ చేయిస్తామంటూ బెదిరించారన్నారు. ప్రస్తుతం చాలామంది అభ్యర్థులు ఉన్నారని వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కోరారు. దీనిపై ఆర్డీఓ మాట్లాడుతూ శుక్రవారం అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.సాగునీటి సంఘాల ఎన్నికలపై హైకోర్టు కాలువలకు సాగు నీరు ఎప్పుడు కావాలి? ఎంత కావాలి అనేది రైతులకు పూర్తి అవగాహన ఉంటుంది. నీటి సంఘాల్లో వీరిని భాగస్వామ్యుల్ని చేసేలా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరగని సందర్భాల్లో చేతులెత్తి ఎన్నుకునే విధానాన్ని అనుసరిస్తే ఓటర్లు ఎవరికి ఓటు వేశారో అభ్యర్థులకు తెలిసిపోతుంది. అందువల్ల వారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ (ఎన్నికల నిర్వహణ) రూల్స్, 118 ప్రకారం చేతులెత్తే పద్ధతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. అందువల్ల ఏకాభిప్రాయం కుదరని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకుంటామనే రైతులను.. అందుకు అనుమతించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు దిగివచ్చిన కూటమి ప్రభుత్వం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది.👉చదవండి : ప్రశాంతంగా నీటి సంఘాల ఎన్నికలు -
వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులకు చుక్కెదురు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులపై కడప కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 రోజులు కస్టడీ కోరితే రెండు రోజులు మాత్రమే కోర్టు సమయం ఇచ్చింది. దీంతో రెండు రోజులు చాలవంటూ, తీర్పు మార్చాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. పోలీసులపై సీరియస్ అయిన జడ్జి.. తీర్పు మార్చేది లేదన్నారు. కావాలంటే హైకోర్టుకు వెళ్లండంటూ సీరియస్ అయ్యారు. కాగా.. రేపు, ఎల్లుండి మాత్రమే పోలీసులకు సమయం ఉంది. వర్రాను విశాఖ జైలు నుంచి తీసుకువచ్చి, తిరిగి దింపేందుకే రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం. వైఎస్సార్సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి.. ఆయన కుటుంబాన్ని సైతం నడిరోడ్డుకు లాగింది. అదుపులోకి తీసుకోవడం దగ్గరి నుంచి జడ్జి ముందు హాజరపర్చడం దాకా అంతా గోప్యత, హైడ్రామాను నడిపించారు పోలీసులు. గత నెలలో అర్ధరాత్రి దాటాక వర్రా రవీంద్రారెడ్డిని కడప 2వ ఏడీజేఏం ఎదుట హాజరుపరిచిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్రా పేర్కొన్నారు. -
కడపలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం
-
కడపలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫోటోలు)
-
కడప : పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ (ఫొటోలు)
-
కడపలో ఘనంగా పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ ప్రారంభం (ఫొటోలు)
-
కడప : ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోఉత్సవం (ఫొటోలు)
-
కడప నగరం లో ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజా (ఫొటోలు)