
వైఎస్సార్,సాక్షి: కూటమి కుట్రలో భాగంగా అరెస్టయిన ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా బెయిల్‌పై విడుదలయ్యారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది. మరో కేసులో పోలీసులు వేసిన పీటీ వారెంట్ డిస్మిస్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది.
గతంలో ఓ వివాదంలో కడప తాలూకా స్టేషన్‌లో అహ్మద్ భాషపై కేసు నమోదైంది. ఆ సమయంలోనే అహ్మద్ బాషా రాజీ పడ్డారు. అయితే, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజీ కుదుర్చుకున్న కేసులు తిరగదోడింది. కక్షపూరితంగా అహ్మద్ భాషాపై పలు సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసింది.లుక్ అవుట్ నోటీసులిచ్చి ముంబై ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్ చేసింది. అయితే,కేసుపై బుధవారం విచారణ చేపట్టిన కడప కోర్టు అహ్మద్‌బాషాకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.
కోర్టు తీర్పుతో కడప సెంట్రల్ జైలు నుంచి అహ్మద్ భాషా విడుదలయ్యారు. సెంట్రల్ జైలు వద్ద అహ్మద్ భాషాకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష,పార్టీ నాయకులు,కార్యకర్తలు స్వాగతం పలికారు.